హరివిల్లు

ఎన్నెన్నో వర్ణాలు-అన్నింటా అందాలు…

లిటిల్‌ ఫ్రాన్స్‌ ఆఫ్‌ ఇండియా. . పాండిచ్చేరి

లిటిల్‌ ఫ్రాన్స్‌ ఆఫ్‌ ఇండియా. . పాండిచ్చేరి
రెండు దేశాల సంస్కృతులు, వేషభాషలు మనదేశంలో ఎక్కడైనా వాడుకలో ఉన్నాయంటే.. అది గోవా తరువాత పాండిచ్చేరి మాత్రమే. ప్రస్తుతం మనదేశలంలో ‘లిటిల్‌ ఫ్రాన్స్‌’గా కొనియాడబడుతోన్న పాండిచ్చేరి స్వాతంత్య్రానికి పూర్వం ‘ఫ్రెంచి కాలనీ’ అయిన పాండిచ్చేరిలో.. ఎన్నో గతవైభవ చిహ్నాలతో పాటు.. హిందూ సంస్కృతి మూలాలను కూడా తనలో నిక్షిప్తం చేసుకుంది. అగస్త్య మహర్షి ఆశ్రయం పొందిన స్థలంగా పురాణగాథలు వెల్లడి చేస్తున్న ఈ ప్రాంతం.. దేశంలోనే ప్రముఖ పర్యాటక కేంద్రంగా వెలుగొందుతోంది.

తమిళంలో ‘పుదు – చ్చేరి’ అంటే ‘క్రొత్త – ఊరు’ అని అర్ధం. దీనికి సమీపమైన ఫ్రెంచి ఉచ్ఛారణ ప్రకారం దీనిని ఫ్రెంచివారు ‘ౌ్కఠఛీజీఛిజ్ఛిటడ‘ అని పిలిచారు. ఎప్పుడో పొరబాటున ఆంగ్లంలో ’ఠ’ బదులు ’’ అని వ్రాయడం వల్ల దీనిని ఆంగ్లంలో ‘పాండిచ్చేరి’ అని పిలువడం మొదలయ్యిం దని అంటారు. తరువాత అదే పేరు వాడుకలోకి వచ్చిందట. ప్రస్తుతం ఆంగ్లంలో అధికారికంగా ‘పుదుచ్చేరి’ అని పేరు మార్చే ప్రయత్నం జరుగుతున్నది.

ఇదీ చరిత్ర…
Auroville_puducherry పురాణకాలంలో ఇక్కడ అగస్త్యమహర్షి ఆశ్రమం ఉండేదని చెబుతారు. ఇక్కడ ఒక సంస్కృత విద్యాలయం కూడా ఉండేదని కొన్ని పురాతన ఆధారాల వల్ల తెలుస్తోంది. క్రీశ 2 వ శతాబ్దంలో వ్రాయబడిన ్క్ఛటజీఞజూఠట ౌజ ్టజ్ఛి ఉటడ్టజిట్చ్ఛ్చ ఖ్ఛ్చి లో ‘పొడుకె’ అనే వాణిజ్యకేంద్రం గురించి వ్రాయబడినది. ఇదే ప్రస్తుత పుదుచ్చేరికి 2మైళ్ళ దూరంలో ఉన్న ‘అరికమేడు’ అని ‘హంటింగ్‌ ఫోర్డ్‌’ అనే రచయిత అభిప్రాయం. అప్పటినుండి రోమ్‌ ప్రాంతంతో పుదుచ్చేరి దగ్గరి రేవులకు సముద్ర వర్తక సంబంధాలుండేవి. రోమ్‌కు చెందిన కొన్ని పాత్రలు అరికమేడులో త్రవ్వకాలలో బయటపడ్డాయి. క్రీశ 4 వ శతాబ్దానంతరం ఈ ప్రాంతం వరుసగా పల్లవ, చోళ, పాండ్య, విజయనగర రాజుల రాజ్యాలలో భాగంగా ఉంది. 1673 లో ఫ్రెంచి ఈస్టిండియా కంపెనీ వారు ఇక్కడ నెలకొలిపిన వర్తక స్థావరం క్రమంగా ఫ్రెంచివారి అధికార కేంద్రమయ్యింది. తరువాత ఫ్రెంచి, బ్రిటిష్‌, డచ్‌ వారి మధ్య అధికారం కోసం జరిగిన అనేక యద్ధాలు, ఒప్పందా ల ప్రకారం పుదుచ్చే రి పై అధికారం మారుతూ వచ్చింది. 1850 తరువాత పుదుచ్చేరి, మాహె, యానాం, కరైకాల్‌, చందేర్‌ నగర్‌లు ఫ్రెంచివారి స్థావరాలుగా ఉన్నాయి. 1954 వరకు ఇదే పరిస్థితి సాగింది.

విభిన్న సంస్కృతుల సమాహారం…
shore-temples భిన్న సంస్కృతులు కలిగిన విలక్షణ నగరం పాండిచ్చేరి. స్వాతంత్య్రానికి పూర్వం ఫ్రెంచి వారి ఏలుబడిలో ఉన్న ఈ ప్రదేశంలో ఇప్పటికీ ఆ పోకడలు మనకు గోచరిస్తాయి. ఆనాటి వైభవ చిహ్నాలు.. గత చరిత్రకు సాక్ష్యాలుగా ఎన్నెన్నో కట్టడాలు ఇప్పటికీ పర్యాటకులను విశేషంగా ఉకట్టుకుంటున్నాయి. చదువుల కాణాచిగా, ఆధ్యాత్మికవాదుల మజిలీగా, ప్రకృతి ప్రేమికులకు విహార కేంద్రంగా భూలోకపు స్వర్గాన్ని తలపిస్తున్న ఈ అద్భుత ప్రదేశంగా పేరున్న పాండిచ్చేరిని మించిన ఆధ్యాత్మిక విహారకేంద్రం మరోటి లేదంటే అతిశయోక్తి కాదేమో! దక్షిణ భారత దేశంలో ఒక కేంద్ర పాలిత ప్రాంతమైన పాండిచ్చేరి (పుదుచ్చేరి).. పుదుచ్చేరి, కరైకాల్‌, యానాం, మాహె అనే నాలుగు విడి విడి జి ల్లా ల సముదాయం. వీటి లో పాండిచ్చేరి పట్ట ణం బంగాళాఖాతం తీరాన, తమిళనాడు రాష్ట్రం అంత ర్భాగంగా 293 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్త రించి ఉంది. కరైకాల్‌ బం గాళాఖాతం తీరంలో, తమిళనాడు రాష్ట్రం అంతర్భాగంగా 160 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది.

అలాగే.. బంగాళాఖాతం తీరంలోనే, మన రాష్ట్ర అంతర్భాగంగా, కాకినాడకు సమీపంలో 30 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో యానాం విస్తరించి ఉంది. ఇక చివరిదైన మాహె.. అరేబియన్‌ సముద్ర తీరాన 9 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. పాండిచ్చేరిలోని నాలుగు జిల్లాల జనాభా మొత్తం సుమారు 10 లక్షలకు పైబడే ఉంటుంది.

ఇక్కడ చూడాల్సినవివే..
పాండిచ్చేరిలో చూడాల్సిన పర్యాటక ప్రదేశాలు అనేకం ఉన్నాయి. వాటిలో బీచ్‌, బొటానికల్‌ గార్డెన్‌, మ్యూజియం ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సెరినిటీ బీచ్‌. ఒకటిన్నర కిలోమీటర్లు పొడవుండే ఈ బీచ్‌ సౌందర్యం మాటల్లో చెప్పలేనిది. ఈ సెరినిటీ బీచ్‌లో ముఖ్యంగా రెండు చారిత్రక కట్టడాలు ఉన్నాయి. అందులో ఒకటి జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహం, మరొకటి యుద్ధ స్మారక చిహ్నం. బీచ్‌కు కొంచెం దూరంలో ఉండే లైట్‌ హౌస్‌ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే, ఇది 150 సంవత్సరాల క్రితం కట్టబడిందంటే నమ్మలేంి్ట. పాండిచ్చేరి స్పెషాలిటీ ఒక్క బీచ్‌ మాత్రమే కాదు.. అనేక చారిత్రక కట్టడాలు, వాటి వెనుక ఉన్న చరిత్ర, ఫ్రెంచ్‌ సంస్కృతి, పచ్చదనం.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి.

తరువాత చెప్పుకోవాల్సింది.. బొటానికల్‌ గార్డెన్‌. దీన్ని ‘ఐలాండ్‌ ఆఫ్‌ పీస్‌’ అని పిలుస్తారు. 22 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ బొటానికల్‌ గార్డెన్‌ ప్రశాంతతకు, పచ్చదనానికి చిహ్నమని చెప్పవచ్చు. భారతదేశంలోని పూల మొక్కలే కాకుండా, విదేశాల నుంచి తెచ్చిన ఎన్నో రకాల పూల మొక్కలను ఇక్కడ మనకు దర్శనమిస్తాయి.

ఈ బొటానికల్‌ గార్డెన్‌లో ఓ ఆక్వేరియం కూడా ఉంది. అందులోని అరుదైన ‘ఆర్నమెంటల్‌ చేపలు’ భలే అందంగా అలరిస్తుంటాయి. పాండిచ్చేరికి వెళ్లేవారు ఈ గార్డెన్‌ను దర్శించకపోతే… వారి విహారం పూర్తి కానట్టే లెఖ్ఖ. ఇక్కడ మరో చెప్పుకోదగ్గ ప్రాంతం పాండిచ్చేరి మ్యూజియం. భారతి పార్కులోగల ఈ మ్యూజియంలోని శిల్ప సంపద ఒకదాన్ని మించి మరొకటి మనల్ని కట్టిపడేస్తుంది.

ఇలా వెళ్లాలి…
పాండిచ్చేరికి ఎలా వెళ్లాలంటే.. విమానంలో అయితే పాండిచ్చేరికి 135 కిలోమీటర్ల దూరంలో చెనై్న ఎయిర్‌పోర్టు ఉంది. ఇక్కడ నుండి విల్లుపురం రైల్‌ జంక్షన్‌ మీదుగా పాండిచ్చేరి చేరుకోవచ్చు. పాండిచ్చేరికి సమీపంలో విల్లుపురం, మధురై, త్రివేండ్రం.. రైల్వే స్టేషన్‌లు ఉన్నాయి. ఈ మూడింటిలో ఎక్కడినుండైనా సులభంగా పాండిచ్చేరి చేరుకోవచ్చు.

Surya Telugu Daily .

మార్చి 29, 2011 Posted by | చూసొద్దాం | | 1 వ్యాఖ్య

హాయి హాయిగా. . హార్సిలీ కొండల్లో. .

హాయి హాయిగా. . హార్సిలీ కొండల్లో. .
ఆకాశాన్ని తాకుతున్నట్లుండే ఎతె్తైన పర్వతశ్రేణులు… కనుచూపుమేర పరుచుకున్న పచ్చదనం… అక్కడ అడుగుపెట్టగానే చల్లని పిల్లతిమ్మెరలు ఒడలికి ఒక విచిత్ర అనూభూతిని కలిగిస్తాయి… చల్లని వాతవరణం… చుట్టూ పచ్చని చెట్లు… రంగురంగుల పక్షుల కిలకిలరావాలు… ఆ అనుభూతే వేరు. రాష్ట్రంలో ఉన్న ఎకైక వేసవి విడిదికేంద్రం హర్సిలీ హిల్స్‌. సముద్రమట్టానికి 1314 మీ ఎత్తులో ఉన్న ఈ అద్భుత విహారకేంద్రం… పచ్చని అడువులు, ఔషధ గుణాలు కల చెట్లుతో అలరారుతోంది. గ్రీష్మతాపంతో తల్లడిల్లుతోన్న ప్రజలు ఆహ్లాదకర వాతావరణంలో సేదదీరడానికి, మధురానుభూతులను మిగుల్చుకోవడానికి వచ్చే జనసందడితో నేడు హార్సిలీ హిల్స్‌ కళకళ లాడుతోంది

ఆహ్లదకర వాతావరణం, ప్రకృతి సౌందర్యం హార్సిలీహిల్స్‌ ప్రత్యేకతలు. ఇక్కడికి వేళ్ళే కొండ దారి.. వంకలు తిరిగి ఎంతో అందంగా వుంటుంది. రెండువైపులా నీలగిరి వంటి అనేక జాతుల చేట్లు, కొండ చుట్టూ అడవులు, కం టికి ఇంపుగా కనిపించే సువిస్తారమైన పచ్చదనం మదిని పులకరింప చేస్తాయి.

మత్తేకించే పూల ఘమఘమలు…
h-Hillsహార్సీలీహిల్స్‌.. సువాసనలను వెదజల్లే సంపంగి పూలకు ప్రసిద్ది. సంపెంగ సువాసనలతో హర్సిలీ హిల్స్‌ ఘమఘమలు పర్యాటకులను మరో ప్రపంచం లోకి తీసుకేళ్తాయి. వీటితోపాటిగా చందనం, ఎర్రచందనం, కలప, రీటా, శీకా కాయ, ఉసిరిగ చెట్లు ఇక్కడ కోకొల్లలుగా వున్నాయి.

ఆపేరు ఎలా వచ్చిందంటే…
ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో వున్న ఈ ప్రాంతం.. ఒకప్పుడు కడప జిల్లాలో వుం డేది. కడప అసలే వేడి ప్రదేశం. బ్రిటీషు హయంలో కలెక్టర్‌గా వున్న డబ్ల్యూ.డి హర్సీలీ వేసవి తాపాన్ని తట్టుకునేందుకు ఎక్కువగా ఇక్కడికి వచ్చేవారు. ఆయ నకు విశ్రాంతి నిలయంగా వున్న ఈ ప్రాంతం కొన్నాళ్ల తరువాత మెల్లగా ఆయ నకు వేసవి నివాసంగా మారిపోయింది. అన్ని ఆధికారిక కార్యక్రమాలు అక్కడి నుంచే సాగేవి. దీంతో ఈ కొండ ప్రాంతాలకు ‘హర్సీలీహిల్స్‌’గా పేరు ముద్ర పడిపోయింది. 1863లో ఆయన వేసివి విడిదిగా ఇక్కడ ఒక ఇంటిని నిర్మిం చారు. దీనిని ఫారెస్టు బంగ్లా అంటారు. అ తరువాత కార్యలయ భవనం నిర్మిం చారు. ఈ భవనాలు ఇప్పటికీ నివాసా యోగ్యంగా వుండి వాడుకలో వుండడం విశేషం! ఫారెస్టు బంగ్లాలోని 4 గదులలో ఒక దానికి హర్సీలీ పేరు పెట్టారు.

ఆహ్లాదాన్నిచ్చే చల్లగాలులు…
చల్లని పిల్లగాలులు పర్యటకుల శరీరాన్ని తాకుతూ వేళ్తుంటే ఆ అనుభూతే వేరు. తూర్పు కనుమలలోని దక్షిణ భాగంలో విస్తరించిన కొండలే హర్సీలీ కొండలు. చలికాలంలో 3 డిగ్రీల సెంటీగ్రేడ్‌ నుంచి మండువేసవిలో 30 డిగ్రీల సెంటీగ్రేడ్‌ వరకు ఉష్ణోగ్రత వున్న ఈ ప్రాంతం, చల్లటిగాలిలో తేలుతూ వచ్చే సంపెంగల సువాసనలు పర్యాటకులను ఈ ప్రాంతానికి మళ్ళీమళ్లీ రప్పిస్తాయి. దట్టమైన చెట్లు, విస్తారమైన పచ్చిక బయళ్లు జనాన్ని అకర్షిస్తాయి. ఇలా వివిధ రకాల చెట్లు, చేమల మధ్య చెంచుజాతి కి చెందిన వారు ఈ ప్రాంతలో జీవనం సాగిస్తున్నారు. హర్సీలీకొండల వాలుపై సంపెంగ పూల మొక్కలను నాటింది ఈ చెంచులే.

చూడముచ్చటైన చెంచు జానపదం…
h-Hills1ఈ విహర స్థలానికి ఏనుగు మల్లమ్మ కొండ అనే పేరు కూడా ఉంది. జాన పదుల కథనం మేరకు పూర్వాశ్రమమంలో మల్లమ్మ అనే చిన్నారిని గజరాజు రక్షిస్తూ వుండేవాడట. కొండమీద చెంచులకు ఏ ఆపద వచ్చినా, జబ్బులు వచ్చినా చిన్నారి మల్లమ్మ అభయ హస్తం ఇచ్చి కాపాడేదట. ఉన్నట్టుండి ఒక రోజు చిన్నారి మల్లమ్మ అదృశ్యంమైంది. కొండా, కోనా, వాగు-వంకా, చెట్లు – పుట్ట వెతికి వేసారిపోయిన చెంచులు ఆమెకు కోవెల కట్టి, తమ ఇలవేల్పుగా చేసుకొని ఈ నాటికి కొలుస్తూనే వున్నారు. నేటికి కొండమీద వున్న బస్టాండ్‌ సమీపంలోని మల్లమ్మ కోవెలలో నిత్యం ధూపదీప పూజార్చనలు జరుగుతూ వుండడం చెంచుల అచంచల భక్తికి నిదర్శనం. ఏటా చెంచులందరూ… పర్యా టకులు, పరిసర గ్రామీణులతో కలిసి నేటికి ఏనుగు మల్లమ్మ జాతర అంగరం గ వైభవంగా జరుపుతారు.

అరుదైన వన్యసంపద…
h-Hills3 భూతల స్వర్గాన్ని తలపించే అందాలతో పాటు 152 సంవత్సరాల వయస్సు కల్గిన ‘కళ్యాణి’ – అనే పేరుగల యూకలిప్టస్‌ చెట్టు ఇక్కడ ప్రధాన అకర్షణలలో ఒకటి. 1859లో డబ్ల్యూ.డి.హర్సీలీ నాటిన ఈ వృక్ష రాజం ఎత్తు 40 మీటర్ల పైమాటే. దుప్పులు, అడవికోళ్ళు, నక్కలు, ఎలుగుబంట్లు, గజరాజులు, కుందే ళ్ళు, కొండ ఎలుకలు, జింకలు, చిరుతపులులు, లేళ్ళు, అడవి పిల్లు లతో కూడిన అత్యంత అకర్షణీయ మైన వన్యమృగ కేంద్రం పర్యాటకు ల మనసును కట్టిపడేస్తుంది. ఆంధ్ర ప్రదేశ్‌ పర్యాటక శాఖ ఏర్పాటు చేసి న ‘పున్నమి’ వేసవి విడిది బంగ్లా ముందు కాండాలు కలిసిపోయి రెం డుగా చీలి ఏపుగా పెరిగిన రెండు మహవృక్షాలు చూపరులను అలరి స్తాయి. మొసళ్ళు మిసమిసలాడు తూ పర్యాటకుల వైపు ఎగబాకే క్రోకడైల్‌ పూల్‌ చూపరుల ఒళ్లు జలదరింపజేస్తుంది. రంగురంగుల ఈకలతో చిటారి శబ్దాలు చేసే పక్షి కేంద్రంతో పాటు జింకల పార్కు అల రిస్తుంది. ప్రేమికులు మనసు విప్పి మదిలోని ఊసులను గుసగుసలాడడానికి హర్సీలీహిల్స్‌లో వేదికాగా మారిన ‘గాలిబండ’ పైనుంచి మంచుకురిసే వేళా సూర్యోదయం, సూర్యాస్తమయం చూసే పర్యాటకులకు గుండె ఝల్లుమన డం ఖాయం. ఇక ఏనుగు మల్లమ్మ కోవెల అందాలు చెప్పనలివి కానివి.

సాహసవీరుల ఖిల్లా…
h-Hills2 హర్సీలీహిల్స్‌ సాహసవీరులకు అరుదైన అవకాశం కల్పిస్తుంది. ట్రెక్కింగ్‌, రాక్‌క్లైంబింగ్‌, బంజీ రన్నింగ్‌, గోర్బింగ్‌, రాపెల్లింగ్‌, బర్మాబ్రిడ్జి వాకింగ్‌, బర్మాలూప్స్‌, ఎర్త్‌కేక్‌ లాంటి సాహసకృత్యాల కోసం విదేశాలకు, లేదా పక్కరాష్ట్రాలకు పరుగు తీయాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక శాఖ ఇలాంటి అవకాశాలను హర్సీలీ హిల్స్‌పై కల్పించడంతో పాటు పగలు, రాత్రివేళల్లో అక్కడే గడేపే విధంగా ప్యాకేజీలను రూపోందించింది. ఇక వసతి, భోజన సౌకర్యాలను కూడా ఆశాఖ ఏర్పాటు చేసింది. పిల్లలు ఆడుకొవడానికి వీలుగా ప్లేగ్రౌండ్‌, పెద్దలకు బార్‌, సిమ్మింగ్‌పూల్‌ మొదలు ఆర్డర్‌ ఇస్తే గంటలో వేడి వేడిగా వండివార్చే హోటల్స్‌ ఇక్కడ వున్నాయి. అంతేకాక పర్యాటకుల జిహ్వ చాపల్యానికి తగినరీతిలో… మైమరిపించే రాయలసీమ స్పెషల్‌ ‘సంగ టి-నాటుకొడి కూర’ క్షణాల్లో అందించే ప్రైవేట్‌ కుక్స్‌ కూడా ఇక్కడ ఉండడం విశేషం.

వసతి సౌకర్యాలు…
పర్యాటక శాఖ పున్నమి రిసార్ట్‌‌స, హరితా హిల్స్‌ రిసార్ట్‌‌స, గవర్నర్‌ బంగ్లా, ఫార ెస్టు బంగ్లా, చిత్తూరు సహకార సమాఖ్య అతిధి గృహం, ఎ.డి.సి క్వార్టర్స్‌ ఇలా లెక్కకు మించిన కాటేజీలు ఇక్కడ వున్నాయి. వీటితో పాటు హెల్త్‌ కబ్ల్‌, మసాజ్‌ సెంటర్‌ కాన్షరెన్సు హల్‌, స్విమ్మింగ్‌ పూల్‌ కూడా అందుబాటులో వున్నాయి. పర్యాటకులకు మరిన్ని వివరాలు అందించడానికి 09440272241, 08571 27932324 నెంబర్లుకు సిద్ధంగా ఉన్నాయి.

ఇలా చేరుకోవాలి…
విమానల ద్యాదా వచ్చే దూరప్రాంత పర్యాటకులు బెంగళూరు లేదా తిరుపతి విమానశ్రయాలకు చేరుకొని, అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్యారా మదనపల్లికి చేరుకొని హార్సీల్‌హిల్స్‌ వెళ్ళవచ్చు. రైలు మార్గం ద్వారా వచ్చే ప్రయాణీకులు మదనపల్లె రోడ్‌ రైల్వే స్టేషన్‌లో దిగి అక్కడి నుండి రోడ్డు మార్గం ద్వారా హార్సీలీ హిల్స్‌ చేరుకోవచ్చు. మదనపల్లి నుంచి దాదాపు ప్రతి అరగంటకు ఒక బస్సు వుంది. అలాగే అద్దె వాహనాల్లో కూడా కొండ మీదకు వేళ్ళవచ్చు.
– ఎస్‌.ఎం.రఫీ, మదనపల్లి

Surya Telugu Daily .

మార్చి 29, 2011 Posted by | ప్రకృతి | , | వ్యాఖ్యానించండి

కొయ్యబొమ్మలు కొనేవారేరి ?

కొయ్యబొమ్మలు కొనేవారేరి ?

koiahbommalu3 కోటనందూరుబొమ్మలంటే ముచ్చటపడనివారుండరు. చిన్నారుల నుంచి పెద్దల వరకు బొమ్మలంటే అందరికీ ఇష్టమే. ఇటువంటి బొమ్మల పేర్లు చెప్పగానే కొండపల్లి, ఏటికొప్పాక గుర్తుకు రావడం సహజం. కోటనందూరు మండలంలో ఓ మారుమూల గ్రామం కొట్టాం. దశాబ్ధాల కాలం నుంచి ఆ బొమ్మల తయారీయే వృత్తిగా జీవిస్తున్న వారి జీవితాల్లో మాత్రం ఆశించిన వెలుగులు కానరావడం లేదు. కొయ్యబొమ్మలకు రూపం కల్పించి జీవంపోసే వారి జీవనం అప్పుల ఊబిలో,కష్టాల కడలిలో సాగుతోంది. షరా మామూలుగానే ప్రభుత్వ ప్రోత్సాహం కరువవుతోంది. తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల సరిహద్దుల్లోని కోటనందూరు మండలంలో గల కొట్టాం గ్రామంలో దశాబ్ధాల కాలం నుంచి కొయ్యబొమ్మల పరిశ్రమ కుటీర పరిశ్రమగా సాగుతుంది. అయినా దీనికి అంతగా గుర్తింపు లభించడం లేదు.

koiahbommalu సుమారు 80 ఏళ్ళక్రితం కొట్టాం గ్రామానికి చెందిన శొంఠేణం రామ్మూర్తి విశాఖ జిల్లా ఏటికొప్పాక గ్రామంలోని తన బంధువుల ఇంటికి వెళ్ళారట. అక్కడ తయారవుతున్న కొయ్యబొమ్మల పట్ల ఆకర్షితులయ్యారు. స్వగ్రామమైన పాతకొట్టాం వచ్చి కొయ్యబొమ్మల తయారీకి శ్రీకారం చుట్టారని చెబుతారు. విద్యుత్‌ మోటార్లు అందుబాటు లోలేని ఆ రోజుల్లో లేత్‌ను తిప్పేందుకు కూలీలను పెట్టేవారు. పూర్తి మానవ శక్తితో తయారైన ఈ కొయ్యబొమ్మలకు సహజ సిద్ధమైన రంగులను దిద్ది వాటిని అమ్ముకుని జీవనం సాగించేవారు. నాడు కూలీలుగా పనిచేసిన కొందరు ఈ బొమ్మల తయారీలో నైపుణ్యం సంపాదించి సొంతంగా బొమ్మల తయారీ ప్రారంభించారు.కొయ్యబొమ్మల తయారీ విధానం: ఈ ప్రాంతానికి విశాఖ జిల్లా సరిహద్దుల్లో ఉన్న కొండలపై అంకుడు చెట్లు ఉంటాయి.

koiahbommalu1 చాలాకాలంపాటు వాటిని వంట చెరకుగానే ఉపయోగించేవారు. ఆ కర్రతో అందమైన బొమ్మలకు జీవం పోయవచ్చని గుర్తించారు. ఆ కర్రను కొనుగోలుచేసి కళాకారులు లేత్‌మిషన్‌పై పదునైన ఉలులతో వివిధ బొమ్మలకు ప్రాణం పోస్తున్నారు. వీటికి లక్కతో కలిపిన రసాయన రంగులు పూస్తారు.

రంగుల తయారీ విధానం
పూర్వం ఈ బొమ్మలకు రసాయన రంగులు పూసేవారు. ప్రస్తుతం వీటికి సహజ సిద్ధమైన రంగులు పూస్తున్నారు. ఈ రంగు తయారీకి జాబర్‌ గింజలను రెండురోజులు నీటిలో నానబెడతారు.
దానినుంచి కషాయం వంటిరంగు దిగుతుంది. ఈ నీటిని బాగా మరిగిస్తారు. నీరంతా ఆవిరిగా పోయిన తర్వాత ఆ రంగు పేస్టుగా మారుతుంది. దానిలో కావల్సినంత పసుపు కలిపితే నారింజరంగు వస్తుంది. దీన్ని మరుగుతున్న లక్కలో వేసి పొడవాడి కడ్డీగా తయారుచేస్తారు.

Surya Telugu Daily.

మార్చి 27, 2011 Posted by | సంస్కృతి | వ్యాఖ్యానించండి

గిరిజన సంప్రదాయం.. కొమ్ము – డోలు నృత్యం

గిరిజన సంప్రదాయం.. కొమ్ము – డోలు నృత్యం

kommudolu1 గిరిజనుల్లో ప్రత్యేకించి కోయ జాతివారు మాత్రమే ఆడతారు. తలపై గొర్రె గేదె కొమ్ములు తగిలించుకొని మెడల్లో పెద్దడోలు వేసుకుని ఆడే ఈ ఆటకు ’కొమ్ము – డోలు’ ఆట అని పేరు సార్థకమైంది. దీని పేరులో ’ఆట’ అనే శబ్దం ఉన్నా దీన్ని ఒక నృత్యంగా చెప్పవచ్చు. ఎందుచేతనంటే కోయజాతి స్ర్తీలు చిన్నాపెద్దా ముదుసలి, అనే తారతమ్యం లేకుండా ఒకరిచేతులు ఒకరు పట్టుకొని దండకట్టి ’రేల’ అనే పదంతో విన్యాసాలు చేస్తుండగా మగవారు గౌన్లు తొడిగి తలపై కొమ్ములు తగిలించుకొని అవి నిలబడేటట్లు తలపాగా చుట్టి వెనుక భాగాన తోకలా వ్రేళ్లాడేటట్లు కడతారు మెడలో తగిలించుకున్న డోలు చాలా పెద్దదిగా ఉంటుంది. డోలునకు వాడే చర్మం మేక చర్మం ఒకవైపు పుల్లతోను మరొకవైపు చేతితోను ఈ వాద్యాన్ని వాయిస్తారు. ఇలా గెంతుతూ వాయిస్తూ వుంటే ఆ వాద్యానికి అనుగుణంగా లయబద్ధంగా స్ర్తీలు నాట్యం చేస్తారు.

kommudolu విద్య కేవలం వారి వినోదం కోసమే కావడం దీనిపై వారి జీవనాధారం లేకపోవడం వల్ల వారి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడకపోవడం వలన వాటిపై అశ్రద్ధ ఎక్కువైన కారణంగా సంప్రదాయసిద్ధంగా వస్తున్న డోళ్లు మూలనబడిపోయి వాటికి చర్మం మూతలు లేక అవశేషాలుగా మిగిలిపోయాయి. వారి సంతతి విద్యావంతులు కావడం, ఈ కళను నేర్చుకోడానికి వారు ఇష్టపడకపోవడం …ప్రస్తుతం గిరిజనల ఇళ్ళల్లో సహితం జరిగే విందులు వినోదాలు శుభాశుభ కార్యాలకు సహితం ఆధునికత ఉట్టిపడే మైక్‌సెట్లు, బ్యాండ్‌మేళం ఉపయోగించడం వల్ల కూడా ఈ కళ కొద్దికాలంలో అంతరించిపోయే ప్రమాదం ఉంది.తొలిదశలో కళలు ఆటవిక జాతి నుండే ఉద్భవించాయి అని చెప్పవచ్చు. మానవుడు భాషను కూడా నేర్వని కాలంలో తన భావ ప్రకటన కోసం సంజ్ఞలతో ఆనందం వ్యక్తం చేయడానికి వేసిన గెంతులు తరువాతి కాలంలో కాలక్రమేణా భాషగా, నృత్యంగా మార్పుచెందాయి. అందువల్ల గిరిజన కళలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంది. ఆ కళల్లో ప్రసిద్ధమైనటువంటిదే ’కొమ్ము- డోలు’ ఆట.

Surya Telugu Daily .

మార్చి 27, 2011 Posted by | సంస్కృతి | 1 వ్యాఖ్య

దక్షిణాకాశి ధర్మపురి క్షేత్రం dharmapuri

దక్షిణాకాశి ధర్మపురి క్షేత్రం

dharmapuri కరీంనగర్‌ జిల్లాలోని ధర్మపురి క్షేత్రాన్ని దర్శించిన వారికి యమపురి ఉండదు అని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. ప్రాచీన పుణ్యక్షేత్రమైన ధర్మపురి క్షేత్రంలోని దక్షిణవాహిగా ప్రవహిస్తున్న గోదావరి నదిలో మూడు సార్లు మునిగి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకుంటే గత మూడు జన్మలలో చేసిన పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. అందుకే రాష్ట్రం నలుమూలల నుండి నిత్యం వేలాది మంది భక్తులు వచ్చి స్వామి వారిని దర్శించుకుంటుంటారు. ప్రముఖ రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు, మేధావులు స్వామివారిని తరచూ దర్శించుకుంటూ తమ మొక్కులు చెల్లించుకుంటారు. ప్రస్తుతం వార్షిక పండుగ ఉత్సవాల్లో లక్షలాది మంది భక్తులు స్వామి వారిని దర్శించుకునేందుకు ధర్మపురి క్షేత్రానికి తరలివచ్చారు. అశేష భర్త జనావళితో క్షేత్రం కిటకిటలాడుతోంది.

ధర్మపురి క్షేత్రంలో బ్రహ్మ విష్ణు, మహేశ్వరుడు ముగ్గురు కొలువైనందున త్రిమూర్తి క్షేత్రంగా, శ్రీ బ్రహ్మదేవుడు, విష్ణుస్వ రూపుడైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారు కొలువై ఉన్నందున నరసింహ క్షేత్రంగా ప్రసిద్ధికెక్కింది. ఈ నరసింహ క్షేత్రం ప్రాచీన పుణ్యక్షేత్రంగా, చారిత్రాత్మకంగా ప్రసిద్ధి గాంచింది. క్షేత్రంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ప్రాంగ ణంలో ప్రధాన దేవాలయంతోపాటు శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ ఉగ్ర నరసింహ స్వామి, శ్రీ ఆంజనేయ స్వామి, శ్రీ వేణుగో పాల స్వామి, యమధర్మరాజు, శ్రీ రామలింగేశ్వర స్వామి, శ్రీ వినాయక స్వామిల ఆలయాలు ఉన్నాయి. విశాలమైన బ్రహ్మ పుష్కరిణితో పాటు సత్యవతి ఆలయానికి ఇసుక స్తంభం ప్రాశ స్త్యము. క్షేత్రం గుండా ప్రవహిస్తున్న గోదావరి నదిలో బ్రహ్మ గుండం, సత్యవతి గుండం, యమ గుండం, పాల గుండం, చక్ర గుండములు కలవు.

dharmapuri1 క్షేత్ర మహాత్యం : రాష్ట్రంలోని ప్రసిద్ధి పుణ్య క్షేత్రాల్లోని నవనారసింహా క్షేత్రాల్లో ధర్మపురి శ్రీ యోగానంద లక్ష్మీనృసిం హాస్వామి వారి క్షేత్రం ఒకటిగా వెలుగొందుతోంది. ఈ క్షేత్రమును పూర్వం ‘ధర్మవర్మ’ అనే మహారాజు పరిపాలించడం వల్ల ఈ క్షేత్రానికి ధర్మపురి అనే వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్షేత్రం క్రీ.శ 850- 928 సంవత్సరం కంటే పూర్వం అయినప్పటికీ క్రీ.శ 1422-1436 కాలంలో బహుమనీ సుల్తానుల దండ యాత్రలో ధ్వంసమై తిరిగి 17వ శతాబ్దంలో ఈ ఆలయం పునరుద్ధరింప బడినట్లు క్షేత్ర చరిత్ర తెలుపుతోంది. ఈ క్షేత్రంలో ప్రధాన మూర్తి అయిన శ్రీ యోగా నంద లక్ష్మీనర సింహాస్వామి సాలగ్రామ శిలగా వెలసియున్నారు. ఈ క్షేత్రానికి ఆనుకుని పవిత్ర గోదావరి నది దక్షిణవాహినిగా ప్రవిహస్తోంది. అందుకే ఈ క్షేత్రం దక్షిణకాశీగా, తీర్థరాజముగా, హరిహర క్షేత్రముగా పిలువబడుతోంది. స్వామివారి ఆలయ ప్రాంగ ణంలో భారతదేశంలో ఎక్కడా లేని విధంగా శ్రీ యమధర్మ రాజు ఆలయం ఉంది.

dharmapuri3 స్వామి వారిని దర్శించుకునే భక్తులు అనంతరం యమధర్మరాజును కూడా దర్శించుకుంటారు. అందువల్లే ధర్మపురికి వచ్చిన వారికి యమపురి ఉండదనే నానుడి ఉంది. ధర్మపురి క్షేత్రం ఆలయాలతో పాటు వేదాలకు ప్రాచీన సంస్కృతికి, సంగీతానికి, సాహిత్యానికి, కవిత్వానికి పుట్టినిల్లుగా ప్రసిద్ధి గాంచింది. ఈ దివ్య క్షేత్రంలో శ్రీ స్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రతి ఏటా పాల్గుణ శుద్ధ ఏకాదశి నుంచి 13 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించబడుతాయి. ఈ బ్రహ్మోత్స వాల్లో పాల్గొనేందుకు రాష్ట్రంలోని నలుమూలల నుంచే కాకుండా మహా రాష్ట్ర నుంచి కూడా భక్తులు వేలాదిగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. స్వామి వారికి నిత్య కళ్యాణంతో పాటు నిత్య అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతి 12 సంవత్సరాలకో సారి వచ్చే గోదావ రి పుష్కరాలు ఘనంగా జరుగుతాయి.

క్షేత్రంలో ఏడాది పొడుగునా ఉత్సవాలు:
చైత్ర మాసం ః- ఉగాది, శ్రీరామనవమి, చిన్న హన్మాన్‌ జయంతి.
వైశాఖ మాసంః- నరసింహ నవరాత్రోత్సవాలు, పెద్ద హన్మాన్‌ జయంతి ఉత్సవం
జ్యేష్ట మాసంః- పౌర్ణమి – వటసావిత్రి పౌర్ణమి.
ఆషాఢ మాసంః- శుద్ధ ఏకాదశి, గురు పౌర్ణమి ఉత్సవాలు,
శ్రావణమాసంః- శ్రీ కృష్ణాష్ఠమి, మరుసటి రోజున ఉట్ల పండుగ, శుద్ద పౌర్ణమిన శ్రావణ జంధ్యాల పౌర్ణమి రాఖీ పౌర్ణమి, శుద్ధ పంచమిన నాగుల చవితి, రెండవ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం, పొలాల అమావాస్య ఉత్సవాలు,

dharmapuri2భాద్రపదం మాసం ః- శుద్ధ చవితిన వినాయకచవితి, శుద్ధ పంచమిన ఋషి పంచమి ఉత్సవాలు.

ఆశ్వీయుజం మాసం ః- దసరా నవ రాత్రోత్సవాలు, దుర్గాష్ఠమి, మహర్నవమి, విజయదశిమి, కోజగిరి పౌర్ణమి, పాలలో చంద్ర వీక్షణ, బహుళ త్రయోదశిన ధన త్రయోదశి, చతుర్దశిన నరక చతుర్దశి, అమవాస్య రోజున దీపావళి, కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమిన పంచసహస్ర దీపాలంకరణ.
మార్గశిర మాసంః- మార్గశిర శుద్ధ పౌర్ణమిన దత్తాత్రేయ జయంతి, పుష్యమాసంః- ఆదివారాలు- పర్వదినాలు.

మాఘమాసంః- శుద్ధపంచమిన వసంత పంచమి, శుద్ధ సప్తమిన రథసప్తమి.
ఫాల్గుణ మాసంః- శుద్ధ ఏకాదశి నుండి 13 రోజుల పాటు శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు, ఏకాదశిన అంకురార్పణ, ద్వాదశిన కల్యాణం, పౌర్ణమిన తెప్పోత్సవము, డోలోత్సవము, బహుళ పంచమిన రథోత్సవము కార్యక్రమా లు నిర్వహిస్తారు.

రవాణా సౌకర్యాలు : ధర్మపురి క్షేత్రం హైదరాబాద్‌ నగరానికి సుమారు 230 కిలోమీటర్ల దూరంలో, జిల్లా కేంద్రమైన కరీంనగ ర్‌కు 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హైదరాబాద్‌, కరీంనగర్‌ నుంచి ఈ క్షేత్రానికి బస్సు సౌకర్యం ఉంది. అలాగే ఈ క్షేత్రానికి 40 కిలోమీటర్ల దూరంలో మంచిర్యాల రైల్వే స్టేషన్‌, 130 కిలోమీటర్ల దూరంలో నిజామాబాద్‌ రైల్వే స్టేషన్‌ ఉంది. ఆయా స్టేషన్‌లకు రైళ్ల ద్వారా చేరుకుని అక్కడి నుంచి బస్సు సౌకర్యం ద్వారా ధర్మపురికి చేరుకోవచ్చు.

వెబ్‌సైట్‌లో ఆలయ వివరాలు: ధర్మపురి క్షేత్రానికి సంబంధిం చిన వివరాలను ఆలయ అధికారులు ప్రపం చానికి అందజేయాలనే ఉద్దే శంతో వెబ్‌సైట్‌లో పొందు పరిచారు. డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ.శ్రీలక్ష్మీ నర్సిం హా.ఓఆర్‌జి, డబ్ల్యూడబ్ల్యూ డ బ్ల్యూ.ధర్మపురినర్సింహస్వామి.ఓఆర్‌జి అనే వెబ్‌సైట్‌లో ఆల యానికి సంబంధించిన వివరాలు, ప్రాశస్త్యం గురించి తెలుసుకోవచ్చు.

– ధర్మపురి, మేజర్‌న్యూస్‌

Surya Telugu Daily .

మార్చి 24, 2011 Posted by | భక్తి | వ్యాఖ్యానించండి

సాగర అందాలకు అగ్రస్థానం… కన్యాకుమారి అగ్రము

సాగర అందాలకు అగ్రస్థానం… కన్యాకుమారి అగ్రము

వివేకానందుని స్ఫూర్తి క్షేత్రం… మహాత్ముని స్మారక చిహ్నం… ఇవి సముద్ర సోయగాలకు నెలవైన కన్యాకుమారి ని విహారకేంద్రగానే కాక, విజ్ఞాన ఖనిగా మార్చిన అద్భుత నిర్మాణాలు. పర్యాటక భారతావనికి చివరి మజిలీగా… త్రివేణి సంగమ పవిత్ర స్థలంగా… ఆధ్యాత్మిక క్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన ప్రకృతి అందాల మణిమకుటం కన్యాకుమారి విశేషాలు… ఈవారం మీకోసం….

Thiruvalluvar_Statueమూడు సముద్రాల అరుదైన మేలుకయిక కన్యాకుమారి ప్రధాన ఆకర్షణ. భారత దేశానికి దక్షిణ సరిహద్దుల్లోని కన్యాకుమారి పవిత్ర యాత్రాస్థలంగానే కాకుండా ప్రముఖ పర్యాటక కేంద్రంగా విలసిల్లుతోంది. సముద్ర సోయగాలకు నెలవైన కన్యాకుమారిలో ఉదయాన్నే తన నునులేత కిరణాలతో వెలుగులను ప్రసరింపజేసే సూర్యభగవానుడు, అప్పుడే సముద్ర గర్భం నుంచి ఉద్భవించి పైకి ఎగుస్తున్నాడా అన్నట్లు కనువిందు చేస్తుంటా డు. ముఖ్యంగా పౌర్ణ మి రోజు రాత్రి పూ ట ఏకకాలంలో జ రిగే సూర్యా స్తమ యం, చంద్రో దయాలను చూ సి పులకించని యాత్రికుడుండడేమో.

త్రివేణి సంగమ క్షేత్రం…
కన్యాకుమారిలో బంగాళాఖాతం, మరోవైపు అరేబియా మహాసము ద్రం, దిగువన హిందూ మహాసము ద్రం.. వీక్షకుల్ని పరవశింపజేస్తుం టాయి. సముద్రతీర ప్రకృతి రమణీ యతతో అలరారే కన్యాకుమారి సముద్ర తీరంలోని థోరియం ధాతువుతో కూడిన ఇసుక రేణు వులు పరమేశ్వరుడి అద్భుత శక్తికి ఆనవాళ్లుగా చెబుతుంటా రు. అలాగే వారణాసి పరమశివు డికి నివాస స్థలమైనట్లుగా, కన్యా కుమారి పార్వతిదేవికి నివాస స్థలమని స్థానికుల ప్రగాఢ విశ్వా సం. మూడు మహాసముద్రాల నీరు పార్వతీమాత పాదాలను కడుగుతున్నట్లుగా ఉంటుందని భక్తులు నమ్ముతుంటారు.

ప్రధాన ఆకర్షణలివే…
Triveni_Sangamamకన్యాకుమారిలో చూడదగ్గ పర్యాటక ప్రదేశాలు చాలానే ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి వివేకానంద రాక్‌, తిరువళ్లువర్‌ విగ్రహం, గాంధీజీ స్మారక మంటపం, కుమరి ఆలయం ముఖ్యమైనవి. అలాగే ఈ ప్రాంతంలో అనేక రకాల అరుదైన పుష్పాలు, వృక్షాలను కూడా చూడవచ్చు. ఇంకా పెలికాన్‌, ఫ్లెమింగ్‌, స్పూన్‌బిల్‌, అనేక రకాల బాతులు.. కన్యాకుమారికి వలస వస్తుంటాయి. ఈ విదేశీ పక్షులు కూడా పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి.

వివేకానంద రాక్‌…
కన్యాకుమారి పర్యాటనలో ముందుగా చెప్పుకోవాల్సింది వివేకానంద రాక్‌. ఇక్కడ క్రీస్తు శకం 1892లో స్వామి వివేకానంద ధ్యానం చేశారు. ఆయన ధ్యానం చేసిన ఈ ప్రదేశంలో నల్ల చలువరాతితో స్మారక కేంద్రం నిర్మించారు. ఇక్కడ 12 అడుగుల ఎత్తుతో ఉండే వివేకానందుడి కాంస్య విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. 1970వ సంవ త్సరంలో అప్పటి రాష్టప్రతి వి.వి. గిరి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ వివేకా నందుడి రాక్‌కు కొంత దూరంలో పార్వ తిదేవి పరమశివుడిని పెళ్లాడేందుకు తపస్సుచేసిన ప్రాంతం, అక్కడ శిలారూ పంలోని ఆమె పాద ముద్రిలు కూడా మనకు దర్శనమిస్తాయి.

తరువళ్లువర్‌ విగ్రహం…
Kanya-Kumari-Ammanవివేకానంద రాక్‌కు సమీపంలోని ఈ విగ్రహం 133 అడుగుల ఎత్తుతో ఉంటుంది. దీనిని 2000 సంవత్సరం లో తమిళనాడు ముఖ్యమంత్రి డాక్టర్‌ కరుణానిధి ఆవిష్కరించారు. ఈ తిరు వళ్లువర్‌ విగ్రహం బరువు ఏడువేల టన్నులు కాగా.. చాలా పొడవైన ఈ విగ్రహాన్ని దర్శించేందుకు పర్యాటకులు పడవలలో వెళ్లాల్సిందే. ఇది ఆసియా లోని ఎతె్తైన విగ్రహాలలో ఒకటిగా పేరుగాంచింది.

మహాత్ముని స్మారక చిహ్నం…
కన్యాకుమారిలో చూడదగిన మరో అద్భుత పర్యాటక క్షేత్రం మహాత్మా గాంధీ స్మారక మంటపం. గాంధీజీ అస్థికల పాత్రను ఉంచిన స్థలంలో 1954వ సంవత్సరంలో ఈ స్మారక మంటపాన్ని నిర్మించారు. మహాత్ముడి జయంతి అయిన అక్టోబర్‌ 2 మధ్యాహ్నం 12 గంటల సమయంలో సూర్య కిరణాలు ఆయన అస్థికలను స్పృశించేలా అద్భుతంగా నిర్మించడం విశేషం.

కుమరి ఆలయం…
Mahatma_Gandhi_Mandapamబాణాసురుడిని సంహరించిన అమ్మవారి కుమరి ఆలయం చూడదగ్గ మరో పర్యాటక ప్రదేశం. మూడువైపులా ఎతె్తైన గోడలున్న ఈ ఆలయంలో మూడు ప్రాకారాలు న్నాయి. ఆలయంలోని ముగ్ధ మోహనదేవి విగ్రహం భక్తులను పరవశింపజేసేలా ఉంటుంది. ఒకప్పుడు దేవి ముక్కెరలోని రత్నపు కాంతి నావికులను ఆకర్షించి నావలు రేవులోని బండరాళ్లను ఢీకొనేవని చెబుతుంటారు. బంగాళాఖాతానికి అభి ముఖంగా ఉండే ఈ ఆలయ ద్వారా న్ని ఎల్లప్పుడూ మూసే ఉంచుతారు. సంవ త్సరంలో ఓ నాలుగైదుసార్లు మాత్రమే ఉత్సవాల సందర్భంగా తెరుస్తారు.

ఆలయ చరిత్ర…
పురాణ కథనాల ప్రకారం కుమరి ఆలయంలో దేవతగా కొలువబడుతున్న కన్యాదేవి, పరమశివుడిని వివాహం చేసు కునేందుకు సిద్ధపడిం దట. అయితే ముహూర్తం సమయా నికి కూడా శివుడు రాకపోవ టంతో విందుకు సిద్ధంచేసి పెట్టుకున్న బియ్యం రాశులను, మిగిలిన వస్తువులను అలాగే ఉంచేశారట. కాలక్రమంలో అవే చిన్న చిన్న రాళ్లుగా, బండలుగా మారిపోయాయని స్థానికుల నమ్మకం. అందుకే ఇప్పటికీ కన్యాకుమారి సముద్రం ఒడ్డున బియ్యాన్ని పోలిన సన్నటి రాళ్లు కనిపిస్తుంటాయని చెబుతుంటారు.

ఇందిరాపాయింట్‌…
కన్యాకుమారి చివరి సరిహద్దును ఇందిరాపాయింట్‌ అని పిలుస్తారు. ఈ ప్రదేశాన్ని చూసేందుకు దేశం నలుమూలలనుంచే కాకుండా, విదేశాల నుంచి కూడా పర్యాటకులు తరలివస్తుంటారు. ముఖ్యంగా ఇక్కడి సూర్యోదయం, సూర్యాస్తమయాలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తాయి. అలాగే కన్యాకుమారి శివార్లలోని ఉదయగిరి కోట, విట్టకొట్టాయ్‌ కోటలు ఇక్కడ మరో ఆకర్షణ. కన్యాకుమారికి పది కిలోమీటర్ల దూరంలో ఉండే తమి ళులకు ప్రీతిపాత్రమైన స్వామితోప్‌ పతి ఆలయం భక్తులను ఆకట్టుకుంటుంది.

రొయ్యలకూ ప్రసిద్ధి…
ప్రముఖ పర్యాటక ప్రదేశంగా వెలుగొందుతున్న కన్యాకుమారి ‘రాక్‌ లాబ్‌స్టర్స్‌’ అని పిలిచే భారీ సైజు రొయ్యలకు కూడా ప్రసిద్ధి చెందినది. సగటున రెండు కేజీల బరువుండే ఈ లాబ్‌స్టర్ల ధర 5 వేల రూపాయల పైమాటే. కేంద్ర సముద్ర మత్స్య పరి శోధనా సంస్థ వాణిజ్య ప్రాతిపదికన కేజ్‌ కల్చర్‌ద్వారా ప్రత్యేకంగా పెంచ బడే ఈ లాబ్‌స్టర్లను ఎక్కువగా జపాన్‌, హాంకాంగ్‌ లాంటి ప్రాంతాలకు ఎగుమతి చేస్తుంటారు.

Vivekananda_Rockకన్యాకుమారి, మండపం, కేరళలోని విళింజం వంటి తీర ప్రాంతాల్లోనే ఈ లాబ్‌స్టర్లు ఎక్కువగా దొరుకు తుంటాయి. తీరం నుంచి 3 కిలోమీటర్ల దూరం వరకు సముద్రంలో ఉండే రాళ్ల చుట్టూనే ఉంటాయి కాబట్టి వీటికి రాక్‌ లాబ్‌స్టర్స్‌ అనే పేరు వచ్చింది. ఇవి రాళ్ల చుట్టూ ఉంటాయి కాబట్టి రొయ్యల్లా ట్రాలింగ్‌ చేసి మొత్తం ఊడ్చి పట్టేయడం సాధ్యపడదు. వేరే చేపల కోసం వేసిన వలల్లో ఇవి పడుతూ ఉంటాయి. సెప్టెంబరు-జనవరి మధ్య ఎక్కువగా లభించే వీటిని పట్టుకునేం దుకు మత్స్యకారులు కొన్ని ప్రత్యేక పద్ధతులు అవలంభిస్తుంటారు.

ఇలా వెళ్లాలి…
చెన్నై నగరానికి 743 కిలోమీటర్ల దూరంలో ఉండే కన్యాకుమారి ఎలా వెళ్లాలంటే.. విమాన మార్గంలో అయితే, మధురై నుంచి 250 కిలోమీటర్లు, తిరువనంతపురం నుంచి 90 కిలో మీటర్ల దూరం ప్రయాణించి వెళ్లవచ్చు. చెన్నై నుంచే కాకుండా దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబయి, కోల్‌కతాల నుంచి కన్యాకుమారికి నేరుగా రైలు సౌకర్యం ఉంది. తమిళనాడులోని అన్ని ప్రధాన పట్టణాలనుంచి రోడ్డు మార్గంలో ప్రయాణించి కన్యాకుమారి చేరుకోవచ్చు. ఇక వసతి విషయానికి వస్తే.. కన్యాకుమారిలో పలు చిన్న, పెద్ద హోటళ్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే తమిళనాడు రాష్ట్ర పర్యాటక శాఖవారి హోటల్‌, దేవస్థానంవారి కాటేజీలు, ట్రావెలర్స్‌ బంగళా, అతిథి గృహాలు.. పర్యాటకులకు అందుబాటు లో ఉన్నాయి.

Surya Telugu.

మార్చి 22, 2011 Posted by | చూసొద్దాం | | 1 వ్యాఖ్య

గౌతమి బుద్ధుని ఘనమైన గురుతు… గుంటుపల్లి

గౌతమి బుద్ధుని ఘనమైన గురుతు… గుంటుపల్లి

తెలుగునాట గౌతమ బుద్ధిని ఆనవాళ్లకు కొదువలేదు. అమరావతి, భట్టిప్రోలు, నాగార్జున కొండ, ఘంటసాల… ఇలా చెప్పుకుంటూ పోతే సిద్ధార్థుని అడుజాడలు ఎన్నో చోట్ల మనకు దర్శనమిస్తాయి. అలాంటి ప్రఖ్యాతిగాంచిన బౌద్ధ క్షేత్రాలలో గుంటుపల్లి ఒకటి. పశ్చిమ గోదావరి జిల్లా కామవరపు కోట మండలంలోని ఈ చారిత్రక గ్రామం… ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రంగా వెలుగొందుతోంది. మనరాష్ట్రంలోని అత్యంత ప్రాచీన బౌద్ధక్షేత్రాలలో ఒకటైన గుంటుపల్లి విశేషాలు… ఈవారం ‘విహారి’లో మీకోసం…

Guntupalli_big-boudhalayaప్రాచీన కాలంలోనే బౌద్ధమత జీవన విధానం ఆంధ్రదేశంలో నలుదిశలా ఫరిఢవిల్లింది. రాజులు, చక్రవర్తులు ఎందరో సిద్ధార్థుని అడుగుజాడల్లో నడిచి ప్రజలకు నిస్వార్ధ సేవచేశారు. ఆ క్రమంలో ఆంధ్ర దేశంలో బయల్పడిన అనేక బౌద్ధ నిర్మాణ శిథిలావశేషాలు బౌద్ధమత చరిత్రలో ఆంధ్రుల విశిష్టస్థానానికి నిద ర్శనంగా నిలుస్తున్నాయి. ఇటువంటి క్షేత్రాలలో బహు శా భట్టిప్రోలు అన్నింటికంటే ప్రాచీనమైనది. గుంటుపల్లి కూడా సుమారు అదే కాలాని కి చెందినది. క్రీపూ 3వ శ తాబ్దానికే ఇవి ముఖ్యమైన బౌ ద్ధక్షేత్రాలుగా విరాజిల్లాయి. గుంటుపల్లిని కొన్నేళ్ల క్రితం వరకు కేవలం బౌద్ధ క్షేత్రంగానే భావించారు. కానీ కొన్ని సంవత్సరాల క్రితం లభ్యమె ైన మహామేఘవాహ న సిరిసదా శాసనం ఖారవేలుని శాసనాల వల్ల ఇక్కడ జైనమతం కూడా విలసిల్లిందని నిరూపితమైంది.

చారిత్రక నేపథ్యం…
గుంటుపల్లి ఊరి కొండలపైన ఉన్న బౌద్ధారామాలు చారిత్రికంగా చాలా ముఖ్యమైనవి. ఇవి చారిత్రికమైన, పరిరక్షింపబడవలసిన పురాతన అవశేషాలు గా భారత పురావస్తు శాఖ నిర్ణయించింది. కొండమీద చైత్యగృహము, ఆరామ మంటపాలు, స్తూపాలు ఉన్నాయి. వీటిలో ఒక స్తూపంలో ధాతుకరండం దొరి కింది. ఈ తీర్ధం భక్తులను విశేషంగా ఆకర్షించేదనడానికి ఇక్కడ కనిపించే ఎన్నో ఉద్దేశిక స్తూపాలే నిదర్శనం. కొండలపైన అంచులో తొలిచిన గుహాల యం, బౌద్ధారామాలు, పైన ఉన్న ప్రార్ధనా స్తూపాలు, రాతి స్తూపం వంటి కట్టడాలు క్రీపూ 300 నుండి క్రీశ 300 మధ్యకాలంలో నిర్మించినట్లు భావిస్తున్నారు.

Guntupalli_Buddist_sitఅలంకరణలకు ప్రాముఖ్యం లేకుండా కట్టిన కట్టడాలు, బుద్ధుని ప్రతిమ వంటివి లేకపోవడం వంటి అంశాలవలన ఇవి బౌద్ధమతం ఆరంభకాలం (హీనయాన బౌద్ధం) నాటి ఆరామాలని విశ్లేషకుల అభిప్రాయం. బౌద్ధం ఆరంభకాలంలో శిల్పాలంకరణకు ఆదరణ ఉండేది కాదు. దృశ్య కళలు ఇంద్రియ వాంఛలను ప్రకోపింపచేస్తాయని బుద్ధుడు వాటిని నిషేధించాడు. సుందర కావ్య నిర్మాణాన్ని కూడా నిరసించా రు. వాటి ప్రయోజనం ధర్మానురక్తిని కల్గించడానికే పరిమి త మవ్వాలి కాని రసానుభూతి కాదు. మౌలిక బౌద్ధంలో క్రమశిక్షణ అంత కఠినంగా ఉండేది. జీలకర్రగూడెం, కంఠ మనేనివారి గూడెం గ్రామాలలో కూడా మరికొన్ని బౌద్ధా రామాలు కనుగొన్నారు.

ఇవీ.. ఇక్కడి ప్రముఖ నిర్మాణాలు…
గుహాలయం: క్రీపూ 3-2వ శతాబ్దానికి చెందిన ఈ చైత్యం అతి ప్రాచీనమైనది. గుండ్రంగా ఉన్న ఈ గుహ లోపల స్తూపం (ప్రస్తుతం ధర్మ లింగేశ్వర శివలింగంగా భావిస్తున్నది), చుట్టూరా ప్రదక్షిణామార్గం ఉన్నాయి. ఈ గుహ పైభాగంలో వాసాలు, ద్వారానికి కమానులు (చెక్క మందిరాల్లాగా) చెక్కబడి ఉన్నాయి. ఈ గుహాలయానికి బీహార్‌లోని సుధామ, లోమస్‌ఋషి గుహాలయాలతో పోలికలుండడం విశేషం.

పెద్ద బౌద్ధ విహారం:
Dharmalingeshwaraswamyఇది ఇసుకరాతి కొండ అంచులో తొలచిన గుహల సముదాయం. బౌద్ధ భిక్షువులకు నివాస స్థానం. గుహలు ఒకదానికొకటి గుండ్రని కిటికీలతో కలుపబడి ఉన్నాయి. గుహల్లోకి ఊరే నీరు, వర్షపు నీరు కాలువల ద్వారా పగులులలోనికి ప్రవహిస్తుంది.

మొక్కుబడి స్తూపాలు: కొండపైని వివిధ ఆృతులలో, ముఖ్యంగా గుండ్రంగా సుమా రు అరవై మొక్కుబడి స్తూపాలున్నా యి. ఇవి రాళ్ళతో లేదా ఇటుకలతో కట్టబడిన పీఠ ములపై నిర్మింపబడినవి. వీటిమధ్య మొక్కు బడి చైత్య గృహాలు కూడా ఉన్నాయి.

రాతి స్తూపములు: ్ర పూ 2వ శతాబ్దానికి చెందిన ఈ స్తూపం పైభాగం అంతా రాతి ఫలకాలతో కప్పబడి ఉంది. క్రీ పూ 19వ శతాబ్దం కాలంలో దీనిలో కొంత భాగం త్రవ్వకాలు జరిపారు. అంతకు మునుపే నిధులు వెదికేవారి బారినపడి ఇది నాశనమై ఉంది. దీని గుమ్మటం ఎత్తు 2.62 మీ., వ్యాసం 4.88 మీటర్లు.

శిధిల మంటపం:ఇది నాలుగు విరిగిన స్తంభాలతో ప్రస్తుతం నామమాత్రంగా ఉన్న కట్టడం. పూర్వం బౌద్ధ భిక్షువుల సమావేశ మందిరం. ఇక్కడ లభించిన శిలా స్తంభ శాసనంలో క్రీ పూ 1 నుండి క్రీ శ 5వ శతాబ్దం వరకు లభించిన దానముల గురించి వివరణ ఉంది. ఈ కట్టడం అసలు పొడవు 56 అడుగులు, వెడల్పు 34 అడుగులు.

చైత్య గృహం:
Mokkubadi_Sthupaluఇది గజపృష్టాకారంలో 17.6 మీటర్లు పొడవు, 4.42 మీటర్లు వెడల్పు కలిగి ఉంది. దీని గోడ 1.32 మీటర్లు ఎత్తువరకు లభించింది. దీని ప్రవేశ ద్వారములకు ఇరువైపుల దేవ కోష్టములలో బుద్ధుని, బోధిసత్వుని ప్రతిమలు ఉండవచ్చును. దీని అలంృత అధిష్టానము నాసిక్‌, కార్లే గుహలను పోలి ఉంది.

ఇటుకల స్తూప చైత్యం: ఇది కూడా క్రీపూ 3-2వ శతాబ్దానికి చెందిన కట్టడం. కొండ తూర్పు చివర ఎతె్తైన సమతల ప్రదేశంలో నిర్మింపబడింది. దీనిని చేరుకొనే మెట్ల వరుసను క్రీ పూ 2-1వ శతాబ్దానికి చెందిన ఒక ఉపాసిక కట్టించాడని చరిత్రకారుల అభిప్రాయం. ఈ చైత్య గృహం 11 మీటర్ల వ్యాసం కలిగి ఉన్నది. స్తూపం చుట్టూ 1.8 మీటర్ల వెడల్పు గల ప్రదక్షిణాపధం ఉన్నది.

ఇటీవల వెలుగులోకి వచ్చినవి…
డిసెంబర్‌ 4, 2007వ సంవత్సరంలో… ఈ గుహాసముదాయంలో క్రీస్తుశకారంభానికి చెందినదిగా బావిస్తున్న ఒక బ్రహ్మలిపితో ఉన్న శాసనం లభ్యమైంది. ఈ శాసనం ద్వారా పలు చారిత్రక సంఘటనలు వెలుగు చూశాయి. నాడు తెలుగులో నూతనంగా రూపొందుతున్న తెలుగు నుడికారాలు, గుణింతాల రూపాలను ఈ చలువరాతి ఫలకం ఆవిష్కరించినది. ప్రసిద్ద బౌద్దాచార్యుడైన మిడిలకుడు అనే బౌద్ద సన్యా సి ఈ ఫలకాన్ని గుంటుపల్లి గుహలలో నివసించే బౌద్ద బిక్షులకు దానం చేసిన ట్లు చెబుతున్న ఈ శిలాఫలకంలో ప్రాృత భాషలో ఉన్నది. కేంద్ర పురావస్తు శాఖ ఆంధ్ర రాష్ట్ర విభాగం ఈ శిలా శాసనాన్ని వెలుగులోకి తెచ్చింది.

Surya Telugu Daily .

మార్చి 22, 2011 Posted by | చూసొద్దాం | , , | వ్యాఖ్యానించండి

టీనేజీ స్టడీరూమ్‌

టీనేజీ స్టడీరూమ్‌

టీనేజ్‌లోకి వచ్చిన పిల్లల ప్రవర్తన మారుతుంది. శారీరకంగా వస్తున్న మార్పులు మనసుల్లో కలిగే ఆలోచనలు టీనేజర్స్‌ని తల్లిదండ్రులకు దూరంగా, స్నేహితులకు దగ్గరగా చేస్తాయి. పిల్లలు తమకు కాకుండా పోతున్నారనే అనవసరపు ఆందోళలు కూడా కలుగుతాయి. కానీ అదంతా వయసు వల్ల కలిగే మార్పులేనని గ్రహించడానికి కాస్త సమయం పడుతుంది. కాబట్టి అంత వరకు పిల్లల మనోభావాల్ని అర్థం చేసుకుంటూనే వారికి తగిన వాతావరణాన్ని కల్పించాలి. ముఖ్యంగా వారికంటూ ప్రత్యేక సౌకర్యాలను ఏర్పాటు చేయాలి.

girl-studyingపిల్లలు అందునా అమ్మాయిలు పదవ తరగతి, ఇంటర్మీడి యెట్‌ స్థాయికి చేరటం ఒక కొత్త అనుభూతి.ఆ వయసు లో వారికి సొంతంగా ఒక లోకం సృష్టించుకోవటం మొదలవు తుంది. దీనికి తగినట్లుగా పిల్లల మీద ప్రేమ, పిల్లలకు కావా ల్సిన భద్రతతోపాటు ఇంట్లో వారి కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా అవసరం అవుతాయి.అలా అని పిల్లల కోసం ప్రత్యేకంగా ఒక గదిని కేటాయించడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు.అలాంటప్పుడు ప్రత్యేక సౌక ర్యాలను కల్పించొచ్చు.

ఈ వయసులో పిల్లల చదువు చాలా ముఖ్యం. వారి భవిష్య త్తును నిర్ణయించేది ఇంటర్‌మీడియట్‌ విద్యే.కాబట్టి ముందు గా పిల్లలు చదువుకునేందుకు తగిన ఏర్పాటు చేయగలగాలి. గాలి, వెలుతురు ఉండే ప్రదేశంలో కూర్చునే అవకాశం ఇస్తే వారికి ఎంతో వీలుగా వుంటుంది. ఒక బల్ల కుర్చీ ఏర్పాటు చేస్తే పిల్లలు సంతోషిస్తారు. ఇంటర్మీడియెట్‌ స్థాయి నుండి చదువుకు పలురకాల పుస్తకా లు అవసరం అవుతాయి.గ్రూపు సబ్జెక్టుకు సంబంధించిన పుస్తకాలు ఎన్ని వీలైతే అన్ని ఎక్కువగా సేకరించి వాటిని దగ్గర పెట్టుకునేందుకు వీలుగా పుస్తకాల అల్మరా వంటివి అందుబా టులో వుండేలా చూసుకోవాలి.

girlsబల్ల మీద ప్రత్యేకంగా లైటింగ్‌ ఏర్పాటు చేస్తే మరింత సౌక ర్యంగా వుంటంది. మిగిలిన వారంతా పడుకున్నా ఒక్కరే కూ ర్చుని చదువుకోగలరు. గదిలిలో మిగిలిన లైటింగ్‌ కూడా సౌక ర్యంగా వుండేట్లు వుండాలి.పిల్లలు చదివే పుస్తకాల మీద పడ ని విధంగా లైటింగ్‌ వుంటే బాగుంటుంది. చదువుకునే గది, టీనేజ్‌ పిల్లలు పడుకునే గది ఒకటే అయితే వారు మరింత ఆనందిస్తారు.ఆ గది తమ సొంతం అనే భావం వారికి ఎంతో ఉత్సా హం ఇస్తుంది. గదికి లేత రంగు పెయింటింగ్‌ వేయించాలి. కళ్ళకు ఆనందం అనిపించే రంగులు ఎంచుకో వాలి. గోడలకు చక్కని పెయింటింగ్‌ ప్రేమ్‌లు, కిటికీల కు కర్టన్లు, తగిన రంగులవి ఎంచుకుంటే మేలు. అమ్మాయికి అయితే మరికొన్ని ఏర్పాట్లు అవసరం. కాబట్టి ఆ రూమును అమర్చుకోవడంలో పిల్లలకు పూర్తి స్వేచ్ఛనివ్వాలి. తమ అవసరాలకు తగ్గట్టుగా సర్దుకోవటం అమ్మాయిలకు బాగా తెలుసు.

తరగతులు పెరిగే కొద్ది పుస్తకాల బ్యాగ్‌ బరువు పెరు గుతుందే కానీ తగ్గదు. ఒకటి రెండు గ్రూప్‌ పుస్తకాలే అయినా అవి భారీగా ఉంటాయి. ఒక భుజం మీద వేలా డే బ్యాగ్‌ కొంచెం ఫ్యాషన్‌ అయితే రెండు భుజాల మీద వేలాడే బ్యాగ్‌ మరికొందరికి ఇష్టంగా వుంటుంది. కాబట్టి వాటి ఎంపికలో వారి సలహా తీసుకుంటే వారికి ఇస్తున్న ప్రాధాన్యతకు సంతోషపడతారు. పుస్తకాల బరువు వీపు మీద ప్రభావం చూపుతుంది. పైగా చదవాల్సిన గంటలు అధికమవుతాయి. ఎక్కువ సేపు కూ ర్చోవటం వల్ల నడుము మీద ఒత్తిడి పడుతుంది. ఇది ఈ తరం పిల్లల ఇబ్బంది.

కాబట్టి పిల్లలు పడుకునేందుకు మంచి సౌకర్యవంతమైన పరువు అవసరం. మరీ మెత్తగా ఉండకూడదు.నడుముకు మద్దతుగా నిలిచే గట్టి మంద మైన నిలిచే గట్టి మందమైన పరువులను అమర్చితే ఫలితం వుంటుంది. అటువంటి పరుపు మీద ఎలా నిద్రపోయినా పిల్ల లకు పెద్దగా ఇబ్బంది ఉండు.దుప్పటి మరీ ముదురు రంగులో భారీ ప్రింట్స్‌తో ఉండకుండా లేత రంగుల్లో వుంటే పిల్లల దృష్టిని ఆకర్షి స్తాయి.కళ్లకు కూడా హాయి గా వుంటుంది. ముడతలు ఎక్కువగా పడకుండా వుండే మెత్తని దుప్పట్లు అయితే మ రింత బాగుంటాయి.

blueచదువుకునేప్పుడు తరచుగా అవసరమయ్యే పుస్తకాలు అందుబాటులో పెట్టుకునేందుకు వీలు కల్పించాలి.అందుకోసం చిన్న బల్ల ఒక టి టేబుల్‌ పక్కనపెట్టొచ్చు.బల్ల పక్కన ఉడే బుక్‌ రాక్స్‌ లో కొన్ని 9 అంగుళాల ఎ త్తున మరికొన్ని ఏర్పాటు చేసుకోవాలి. దీని వల్ల అన్ని సైజుల పుస్తకాలకు అనుకూ లంగా ఉంటాయి. బుక్‌ రా క్స్‌ 12 అంగుళాల లోతు కలిగి ఉంటే ఏ పుస్తకం బయటకు పొడుచుకుని ఉన్న ట్లు కనిపించకుండా అందం గా వుంటుంది.

పై తరగతుల్లోకి పిల్లలకు కంప్యూటర్‌ వాడకం కూడా వచ్చేస్తుంది. గదిలో కంప్యూటర్‌ అమర్చే వీలుంటే బాగుంట ుంది. ఇంటర్నె ట్‌ అనేది అవసరాన్ని బట్టి నిర్ణయించుకోవాలి.పిల్లలు నిత్యం వాడే ప్రతి వస్తువుకు గదిలో తగిన స్థానం కల్పించాలి. వాటర్‌ బాటిల్‌ దగ్గరే ఉంచాలి. కళాశాలకు సం బంధించిన షూష్‌ ఇతరత్రా వాడే చెప్పులు పెట్టుకునేందుకు ఒక స్థలం వుంటే బాగుంటుంది. వీలైతే మినీ చెప్పుల స్టాండు గదిలో వుంటే బాగుంటుంది. కాలేజి టైమ్‌ టేబుల్‌ స్పష్టంగా కన్పించే రీతిలో ఎదురుగా ఉంచుకునేలా పిల్లలకు చెప్పాలి. ఇక ఇతరత్రా అవసరమయ్యే అలారమ్‌ పీస్‌ వంటివాటికి స్థానం కల్పించాలి.

ఈ క్లాసులో అధికంగా పెన్నులు, పెన్సిళ్లు, రఫ్‌ పేపర్స్‌ అవ సరం అవుతాయి. వివిధ పేపర్లలో వచ్చే స్టడీ మెటీరియల్‌ కూ డా లాభమే. అవన్నీ కత్తిరించి పెట్ట్జు కునేందుకు వీలైతే చిన్న కత్తెరను పెన్‌ స్టాండ్‌లో ఏర్పాటు చేసుకోవచ్చు. పెన్‌ స్టాండ్‌లో ఇరేజర్‌, షార్పనర్‌ వంటివి వుంటే వెతుక్కునే అవసరం వుండదు. ఇవన్నీ పిల్లలకు అందిస్తున్న కనీస అవసరాలేకానీ విలాసాలు కావు. ఈ సౌకర్యాలన్నీ అందించి ఒక గదిని శుభ్రంగా వుంచు కోవాల్సిన ఆవశ్యకతను కూడా వారికి తెలియజేయొచ్చు.

అ లాగే కల్పించిన సౌకర్యాలను దుర్వినియోగం చేయకుండా కష్ట పడి చదివి జీవితంలో స్థిరపడాల్సిన అవసరం కూడా పిల్లలు తెలుసుకునేలా చేయవచ్చు. ఈ సౌకర్యాలన్నీ లేకున్నా కష్టపడి చదివి అభివృద్ధిలోకి వచ్చిన వారి గురించి తెలియజేసే అంశా లను గదిలో గోడలపై ఏర్పాటు చేయోచ్చు. వారికి బాధ్యతలు కూడా తెలియజెప్పొచ్చు. ఇవన్నీ కల్పించలేకపోయినా టీనేజ్‌ పిల్లల కనీస అవసరాలను గమనిస్తూ వారికి తగిన విధంగా ఏర్పాటు చేయడం తల్లిదండ్రులుగా గుర్తించాల్సిన అంశం.

Surya Telugu Daily.

మార్చి 21, 2011 Posted by | మ౦చి మాటలు | వ్యాఖ్యానించండి

సంగీత సాహితీస్రష్ట రాళ్ళపల్లి

సంగీత సాహితీస్రష్ట రాళ్ళపల్లి

శాస్త్రీయమైన సాహిత్య విమర్శనకు కళాత్మకమైన రూపురేఖలు దిద్దిన ఆధునికాంధ్ర సాహిత్య విమర్శకులలో అగ్రగణ్యులు రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ. రాళ్ళపల్లివారు అనంతపురం జిల్లా రాళ్ళపల్లి గ్రామంలో 1893 జనవరి 23న అలివేలు మంగమ్మ, కృష్ణమాచార్యులు పుత్రులుగా జన్మించారు. సంస్కృతాంధ్రములలో పండితులైన తండ్రి వద్ద సంస్కృతాంధ్రముల నభ్యసించారు. తల్లి కీర్తనలు, జానపదగేయాలను శ్రావ్యంగా గానం చేసేవారు. తల్లి నేర్పిన పాటలను యథాతథంగా నేర్చుకొన్నారు. మేనమామ ప్రోత్సాహంతో ఫిడేలు వాయించడం నేర్చుకున్నారు.

1906లో శర్మగారు మైసూరులోని పరకాల మఠంలో శ్రీకృష్ణ బ్రహ్మతంత్ర పరకాలయతీంధ్రుల సన్నిధిలో వుంటూ శ్రీ చామరాజేంద్ర సంస్కృత కళాశాల విద్యార్ధిగా వ్యాకరణం సంస్కృత కావ్యాలను సాకల్యంగా అభ్యసించారు. 1910లో కట్టమంచి రామలింగారెడ్డిగారు మైసూరు మహారాజు కళాశాలలో చరిత్ర, తర్కం, తత్త్వశాస్త్రం, ఆంగ్ల సాహిత్యాచార్యులుగా బోధించేవారు. రెడ్డిగారితో పరిచయం వల్ల శర్మగారు ఆంధ్ర సాహిత్యంలో చక్కని పాండిత్యం గడించారు. రెడ్డి శర్మగారి ప్రతిభాపాటవాలను గుర్తించి మైసూరు మహారాజా కాలేజిలో తెలుగు పండితులుగా నియమింపచేశారు. బోధకాగ్రగణ్యులుగా పేరుగాంచిన శర్మ కాలేజీలో ముప్పది ఏళ్ళు పనిచేశారు. శర్మ, కట్టమంచి వారు సవిమర్శకంగా కవిత్రయ భారతాన్ని అధ్యయనం చేశారు. 1911లో, తారాదేవి, మీరాబాయి అనే ఖండకావ్యా లను రచించారు. 1913లో ”లీలావతి” అన్న నవలను వంగభాష నుండి కన్నడీకరించారు. కట్టమంచివారు, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఉపాధ్యక్షులుగా వుండి వేమనపై ఉపన్యాసాలను అనంతపురంలోని సీడెడ్‌ డిస్ట్రిక్స్‌ కళాశాలలో ఏర్పాటు చేశారు. 1928 నవంబరు చివరన శర్మ వేమనపై చేసిన ఉపన్యాసాలు ఎంతో విజ్ఞానదాయక మైనవి. ఆ ఉపన్యాసాలలోని కొన్ని వాక్యాలు ”ఇరు ప్రక్క లందును మరుగులేని మంచి పదనుగల చురకత్తివంటి కవితాశక్తి, దానికి మెరుగిచ్చినట్టి, సంకేత దూషితముగాని, ప్రపంచ వ్యవహారములందలి సూక్ష్మదృష్టి, గాయపు మందు కత్తికే పూసి కొట్టినట్లు తిట్టుచునే నవ్వించు హాస్యకుశలత”… ఇవన్నియు వేమన్నను సృష్టిచేయునపుడు బ్రహ్మదేవుడుపయోగించిన మూల ద్రవ్యములు” అన్నారు. వేమన ద్వారా రాళ్ళపల్లి వారు కవి జీవిత కావ్యార్థ సమన్వయ విమర్శకు బాటవేశారు. రాళ్ళపల్లివారి సారస్వతోపన్యాసాలు, వారిని తెలుగు విమర్శకులలో అగ్రగణ్యునిగా చేశాయి. పీఠికా రచనలో కూడా రాళ్ళపల్లి గొప్ప పేరు గాంచారు. 1934లో బళ్ళారిలో ధర్మవరం కృష్ణమాచార్యులు, కోలాచలం శ్రీనివాసరావుల స్మారకోత్సవంలో శర్మగారిచ్చిన ”నాటకోపన్యాసములు”లో నాటక లక్షణములను విపులంగా వివరించారు. సుందరపాండ్యుని ”ఆర్య”ను శర్మగారు తెనిగించారు. ప్రాకృత భాషలో పరిణితులైన శర్మగారి ”గాథా సప్తశతీసారము” వారి అనువాద సామర్ధ్యానికి నిదర్శనంగా వుంది. మధునాపంతులవారు రాళ్ళపల్లివారిని గురించి రాస్తూ ”సాహిత్య ప్రపంచమున కవితా విమర్శనశాఖకు వారి దర్శనము చిరంతన వసంతమన్నారు. సత్యం,శివం,సుందరం అన్ని గుణాలు వారి వ్యక్తిత్వంలో భాగాలు. వారి భాషణ మితహితం. సంభాషణ సరసచతురం. శర్మగారు రచించిన ”గానకలె”, జీవమత్తుకలె” అన్న గ్రంథాలు వారి కన్నడ భాషా వైదుష్యానికి మచ్చుతునకలు. సంగీత ప్రియులైన శర్మగారు, సంగీత విద్వాంసులైన బిడారం కృష్ణప్పగారి వద్ద నాలుగైదేళ్ళు శాస్త్రీయంగా సాధన చేశారు. 1927లో అనంతపురంలో జరిగిన ఆంధ్రగాయక మహాసభలో శ్రోతలు భోజన సమయాన్ని విస్మరించి అత్యంత ఆసక్తితో విని వారి గానలహరిలో మునకలు వేశారు. మైసూరు మహారాజావారు ఏర్పాటుచేసిన కవితాపరీక్షలో ప్రథమబహుమతి నందుకొని మహారాజావారి దర్బారులో ఘన సత్కార మందుకొన్నారు. గానకళాసింధు, గానకళాప్రపూర్ణ, సంగీత కళానిధి బిరుదములందుకొన్నారు.

మైసూరులో ఉద్యోగ విరమణ చేసిన తర్వాత తిరుపతి తిరుమల దేవస్థాన కార్య నిర్వాహణాధికారి, చెలికాని అన్నారావుగారు ‘తాళ్ళపాక కవుల కీర్తనల పరిష్కరణ కార్యం నిర్వహించమని కోరారు. శర్మగారు 1950-57 మధ్య తాళ్ళపాక కవుల సంకీర్తనలను పరిశీలించి వాటిని స్వరపరిచారు. శర్మగారిని కేంద్ర సంగీత నాటక అకాడమీ 18-10-1970న ”ఫెలోషిప్‌”నిచ్చి సత్కరించింది. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యా లయం 30-4-1974 గౌరవ ”డి.లిట్‌” పట్టాతో గౌరవించింది. రేడియోకు ”ఆకాశవాణి” అన్నపేరు పెట్టింది శర్మగారే. సంగీత, సాహిత్య రంగాలలో విశిష్ట సేవలందించిన శర్మగారిని 1979 మార్చి 11న తి.తి.దేవస్థానం వారు ఆస్థాన విద్వాంసులుగా నియమించారు. వయోభారంతో వారు తిరుపతికి వెళ్ళలేక పోయారు కార్యనిర్వాహణాధికారి పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌గారు బెంగుళూరు వెళ్ళి సాయంత్రం 4 గంటలకు శర్మగారికి బిరుదు ప్రదానంచేసి సత్కరించారు. కాని ఆ దినం రాత్రం 7-05 గంటలకు శ్రీనివాసుని ఆస్థాన విద్వాంసులైన రాళ్ళపల్లివారు స్వర్గస్థులైనారు.

-జానమద్ది హనుమచ్ఛాస్త్రి

Visalaandhra Daily .

మార్చి 13, 2011 Posted by | సంస్కృతి | వ్యాఖ్యానించండి

నాట్యకళాతృష్ణ.. నటరాజ రామకృష్ణ

నాట్యకళాతృష్ణ.. నటరాజ రామకృష్ణ
ఏ ఇతర దేశీయ నృత్య రీతులకు తీసిపోని ఔన్నత్యం కలిగిన ఆంధ్ర నాట్యాన్ని పునరుజ్జీవింప చేయాలన్నదే లక్ష్యమని, అంతకు మించి వ్యక్తిగతంగా ధన సహాయం కానీ… ఏ ఇతర మణిమాణిక్యాలతో పనిలేదని అంటారాయన…నాట్యం తన ఆరవ ప్రాణంగా కాకతీయుల కాలంలో కనుమరుగయిన పేరిణి శివతాండవ నృత్యానికి అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిన నాట్యగురువు పద్మశ్రీ నటరాజ రామకృష్ణ. దేవాలయాలు ఉన్నంత కాలం ఆంధ్ర నాట్యం జీవిస్తూనే ఉంటుందని, దాని గొప్పదనాన్ని గుర్తించి రేపటి తరానికి ఈ కళ ఔన్నత్యాన్ని చాటిచెప్పాలంటారు. లస్యంగా అయినా ఇటీవలే ఆయనకు సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్‌ లభించడం విశేషం.

NATARAJA_RAMAK2డాక్టర్‌ నటరాజ రామకృష్ణ్ణ ఆంధ్రనాట్యం, పేరిణి శివతాండవం, నవజనార్ధనం వంటి ప్రాచీన నాట్యరీతుల్ని మళ్లీ వెలుగులోకి తెచ్చిన నాట్యాచార్యుడు. ఈయన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సుప్రసిద్ధ నాట్యాచార్యులు. ఆంధ్రనాట్యము ఒక పురాతన లాస్య నర్తనం. 10వ శతాబ్దంలోని కాకతీయ సామ్రాజ్య కాలంలో, మగవారు నాట్యం చేసే పేరిణి శివతాండవం ఉండేది. ప్రబంధ నాట్య సాంప్రదాయానికి సంబంధించిన నవజనార్ధనం గత 400 ఏళ్ళుగా తూర్పుగోదావరి జిల్లా, పిఠాపురంలోని కుంతీమాధవ మందిరంలో ప్రదర్శింపబడుతోంది.

పువ్వుపుట్టగానే: నటరాజ రామకృష్ణ 21 మార్చి, 1933లో కళాకారుల వంశంలో జన్మించారు. ఆయన తనలోని కళాతృష్ణాన్వేషణలో ఎందరో గురువులను కలుసుకొని, వారి నుండి ఎన్నో నాట్యరీతుల్ని నేర్చుకున్నారు. వారిలో మీనాక్షి సుందరం పిళ్ళై, వేదాంతం లక్ష్మీనారాయణ శాస్ర్తి, శ్రీమతి నాయుడుపేట రాజమ్మ, పెండెల సత్యభామ వంటి వారు ఉన్నారు. శ్రీ వేంకటేశ్వర కల్యాణం, కుమార సంభవం, మేఘ సందేశం వంటి నాట్య ప్రదర్శనలు ఆయనకు ఎంతో పేరుతెచ్చాయి. ఉజ్జయినిలో ప్రదర్శింపబడిన కుమార సంభవానికి స్వర్ణకలశం లభించింది. నటరాజ రామకృష్ణ వ్రాసిన 40కి పైగా పుస్తకాలలో ఆరింటికి భారత ప్రభుత్వ పురస్కారం లభించింది. వాటిలో దాక్షిణాత్యుల నాట్యకళాచరిత్ర, ఆంధ్రులు – నాట్యకళారీతులు వంటివి ప్రసిద్ధ గ్రంథాలు. ఆంధ్రప్రదేశ్‌ నాటక అకాడమీకి ఒకప్పుడు చైర్మన్‌గా ఉండిన డాక్టర్‌ నటరాజ రామకృష్ణ గత యాభై ఏళ్ళుగా నాట్యకళను ముందుకు నడిపిస్తున్నారు. ఆంధ్రనాట్యానికి ప్రత్యేకమైన సాత్వికాభినయము చేయడంలో డాక్టర్‌ నటరాజ రామకృష్ణ ఉద్ధండులు.

NATARAJA_RAMAKనటరాజ రామకృష్ణ ఆంధ్రనాట్యం, పేరిణి నృత్యాల పురోగతికై, లక్షా ఏభై వేల రూపాయలతో ‘నటరాజ రామకృష్ణ ఆంధ్రనాట్యం’ సంస్థను నెలకొల్పారు. దీని ద్వారా వర్ధమాన కళాకారులకు, వృద్ధ కళాకారులకు ధన సహాయం, పింఛన్‌ అందజేస్తున్నారు. నటరాజ రామకృష్ణ లేకపోతే ఆంధ్రనాట్యం, పేరిణి శివతాండవము ఏనాడో మరుగున పడిపోయేవి. ఆ మధ్య ఆయన శిథిలమవుతున్న హైదరాబాదులోని తారామతి మందిరము, ప్రేమావతి మందిరాలను బాగు చేయించారు. ఒకప్పుడు తారామతి, ప్రేమావతులు గోల్కొండ నవాబు, కుతుబ్‌ షాహి ఆస్థాన నర్తకీమణులు.

భరతనాట్యం, కూచిపూడి ఒకరకంగా అన్ని భారతీయ నృత్య సంప్రదాయాలను ఆకళింపు చేసుకొన్న భరత కళాప్రపూర్ణుడు నటరాజ రామకృష్ణ. తెలుగువారి సంస్కృతికి దర్పణమైన ఆంధ్ర నాట్యాన్ని పునరుద్ధరించి ప్రపంచ వ్యాప్తంగా బహుళ ప్రచారం చేసిన కారణజన్ముడు అనవచ్చు. పుట్టింది తూర్పున బాలీ దీవులలో, తెలుగు సంప్రదాయ కుటుంబ వాతావరణంలో. కానీ నాడు నృత్యం అభ్యసించడమే మహాపరాధంగా భావించే ఆ రోజులలో నృత్యాభిలాషతో తల్లిదండ్రుల అనుమతి లేకుండా రామకృష్ణ మాతృదేశానికి రావటం ఆయన జీవితంలో ఒక మలుపుగా భావించవచ్చు. బాల్యమంతా మద్రాసు రామకృష్ణ మఠంలో గడిపి అనంతరం గాంధీ ఆశ్రమంలో పెద్దలు ప్రభాకర్‌.జి, ఆశాదేవి మొదలైన వారితో పరిచయాలు ఆయన జీవన విధానానికి సోపానాలైనాయి.

NATARAJA_RAMAK1 భరతనాట్యం, కూచిపూడి నాట్యంలోని అతిరథ మహారథులైన మీనాక్షి సుందరం పిళ్లె, వేదాంతం లక్ష్మీ నారాయణ శాస్ర్తి, నాయుడుపేట రాజమ్మ, ఆలయ నృత్యంలో ప్రసిద్ధురాలైన పెండ్యాల సత్యభామల శిక్షణలో విభిన్న సంప్రదాయ నృత్యరీతులను ఆకళింపు చేసుకున్నారు. తంజావూరు రాజ ఆస్థానం అతిథుల పరిచయంతో రామకృష్ణ తంజావూరు వెళ్ళటం …అక్కడే తెలుగు భాష ఔన్నత్యాన్ని సాహిత్య సంపదను, శిలాశాసనాల సమగ్ర సమాచారాన్ని తంజావూరు సరస్వతి గ్రంథాలయంలో పరిశీలించటం ఆయన నాట్య జీవితంలో మరో మలుపు. 15 ఏళ్ళ వయస్సులోనే నాట్య గ్రంథాలు రాయడం మొదలుపెట్టి, ఇప్పటివరకు తన కలం నుండి 41 నాట్య గ్రంథాలను రచించటం ఆయనను బహు గ్రంథకర్తగా పేర్కొనవచ్చు. దక్షిణ భారత నృత్య రీతుల, నర్తన బాల, డ్యాన్సింగ్‌ బెల్స్‌ పుస్తకాలకు కేంద్ర, రాష్ట్ర పురస్కారాలు కూడా లభించాయి. డ్యాన్సింగ్‌ బెల్స్‌ ఇంగ్లీష్‌ రచన స్వర్గీయ పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ ఆయన సమ్మతితో అంకితమివ్వటం మధురమైన స్మృతిగా రామకృష్ణ తెలియజేశారు.

ఆంధ్ర నాట్యం నాలుగు భాగాలను విడుదల చేయాలని సంకల్పించిన రామకృష్ణ తాను రచించిన పుస్తకాలన్నింటిని పునర్ముద్రణ, అలాగే ఇతర భారతీయ భాషల్లో అనువదింపచేస్తే నృత్య శిక్షకులకు, నృత్యప్రియులకు అందరికీ ఉపయోగంగా ఉంటాయని భావిస్తున్నానని అన్నారు. ఇవేకాక వివిధ దిన, వార పత్రికలలో కూడా అసంఖ్యాకంగా రచనలు చేసి మన నాట్య తీరుతెన్నులపై విమర్శనాత్మక వ్యాసాలతో ప్రముఖుల ప్రశంసలు అందుకున్న బహుముఖ ప్రజ్ఞావంతులు నటరాజ రామకృష్ణ. నాట్యరంగ తృష్ణ్ణతో దేశమంతా పర్యటించి మన నాట్య రంగం రీతులను, తీరుతెన్నులను కూలంకషంగా పరిశీలించిన పరిశోధక కళాతపస్వి రామకృష్ణ.. హిందీ, సంస్కృతం దక్షిణాది నాలుగు భాషలలో అనర్గళమైన పాండిత్యం కల్గినవాడు కూడా. మన రాష్ట్రంలో హైదరాబాద్‌ను స్థిరనివాసంగా ఏర్పరచుకుని నృత్య నికేతన్‌ సంస్థ ద్వారా 50 ఏళ్ళుగా వేల సంఖ్యలో నృత్య విద్యార్థులను తీర్చిదిద్దిన ఘనత రామకృష్ణకే చెందుతుంది. ఆంధ్ర నాట్య కళాకారులుగా ప్రసిద్ధులైన కళాకృష్ణ, పేరిణి రమేష్‌, వెంకటేష్‌ మరెందరో ఆయన శిష్యులు. ఒకవిధంగా ఆయన ఆంధ్ర నాట్యానికి వటవృక్షంగా పేర్కొనవచ్చు. బిరుదులు, సత్కారాలు లెక్కలేనన్ని, అందులో ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ సత్కారం ప్రముఖంగా పేర్కొనవచ్చు.

అవార్డులు, పురస్కారాలు
నటరాజ బిరుదు ఆయన 18వ ఏట, రాజా గణపతి రావు పాండ్యచే ప్రదానం చేయబడింది. భారత కళాప్రపూర్ణ బిరుదు 1968లో ఆంధ్రప్రదేశ్‌ సంగీత నాటక అకాడమీ వారిచే.

భారతకళా సవ్యసాచి బిరుదు 1979లో పశ్చిమ గోదావరి జిల్లా కళాకారుల సంఘంచే ఇవ్వబడింది. కళాప్రపూర్ణ బిరుదు 1981లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి, కళాసరస్వతి బిరుదు 1982లో హైదరాబాదులోని కళావేదిక ద్వారా ఇవ్వబడ్డాయి. దక్షిణ భారతపు ఉత్తమ నాట్యాచార్యుడుగా 1984లో కేంద్ర సంగీత నాటక అకాడమీ ద్వారా ఇవ్వబడింది. 1986 లో ఎల్‌.వి.ఆర్‌. ట్రస్ట్‌, మద్రాసు నుండి – పేరిణీ శివతాండవంపై పరిశోధనకుగాను ఉత్తమ పరిశోధకునిగా పురస్కారం అందుకున్నారు. 1980 శ్రీశైలం దేవస్థానం తరపున ఆస్థాన నాట్యాచార్యునిగా ఉన్నారు.అలాగే 1980 సంవత్సరం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి సంబంధించిన ఆస్థాన నాట్యాచార్యునిగా వ్యవహరించారు.

1985 లో ఆంధ్రప్రదేశ్‌ కళాప్రేమికులు ఆయనకు స్వర్ణకిరీటాన్ని బహూకరించారు. 1991లో శ్రీ రాజాలక్ష్మీ పురస్కారం,95లో రాజీవ్‌గాంధీ ఫౌండేషన్‌ అవార్డ్‌ మరియు భారత ప్రభుత్వంచే పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. 1999లో కళాసాగర్‌ అవార్డ్‌ అందుకున్నారు.

2000 సంవత్సరంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం తరపున విశిష్ట పురస్కారం అందుకున్నారు.

Surya Telugu Daily.

మార్చి 11, 2011 Posted by | నాట్యం | , | వ్యాఖ్యానించండి

నైతిక శక్తి

నైతిక శక్తి

Omప్రస్తుతం ప్రపంచంలో నైతిక విలువల ఆచరణ అన్ని చోట్ల చర్చనీయాంశంగా మారింది. నైతిక విలువలు లోపించినం దున ఎన్నో సమస్యలు, బాధలు ఉత్పన్నమవుతున్నాయని అర్థమవుతున్న ది. జీవితం నిర్మలంగా సద్గుణాలతో నిండుగా ఉండాలి. దివ్యమైన సమా జ స్థాపన జరగాలంటే ప్రతివారికీ నైతిక విలువల ఆచరణ అవసరమనే సందేశం నియమబద్ధం కావాలి. నైతిక శక్తి యొక్క వ్యక్తీకరణలో దివ్య గుణాలు, నైతిక విలువలున్నప్పుడే మానవ జీవితంలో నైతిక శక్తి ఏర్పడుతుంది. ఇందులో శ్రద్ధ ఎంతైనా అవసరం. జ్ఞాన యోగాల ద్వారా శక్తి లభించినట్లే ఈ నైతిక విలువల ద్వారా శక్తి వికసిస్తుంది. ఇది అనేక విధాలుగా వ్యక్తీకరింపబడుతుంది.

విషమ పరిస్థితులేర్పడినప్పుడు నైతిక శక్తి కల వ్యక్తి కంగారుపడి, నిరాశతో ఆత్మగౌరవాన్ని, సిద్ధాంతాలను వదిలి అవినీతిగా ప్రవర్తించడు. అతడు ఆ పరిస్థితుల్లో అవినీతికరమైన ఆలోచనలు, విధానాలు దాటే విషయంలో దృఢంగా ఉంటాడు. కుటుంబంలో పేదరికం, అనారోగ్యం వల్ల తనకు డబ్బు ఎంత అత్యవసరమైనా లంచగొండితనం, మోసం చేసే ఆలోచనలతో నమ్మకద్రహోం, పాపపు సంపాదన చేయడానికి ఇష్టపడడు. అతని నైతిక శక్తి అవినీతి ముందు తలవంచక ఎన్ని కష్టాలు వచ్చినా శక్తివంతంగా, తొణకకుండా ఉంటారు.

నీతి, నియమాలను పాటించే వ్యక్తి ఆత్మిక శక్తి ఉండడం వలన నిశ్చింతగా ఉంటాడు. అతడు అసత్యాన్ని ఆధారం చేసుకోక తన శ్రేష్ఠ కర్మలతో పాటు భగవంతుడే సహాయపడతాడని నమ్ముతాడు. ఈ సత్యాన్ని నమ్మిన అతనికి మనసులో సందేహముండదు. ఒకవేళ ఏ పనిలోనైనా విజయం లభించకపోయినా సద్గుణాల ప్రాప్తి అతనిలో కనిపిస్తుంది. ఆత్మ వెంట వచ్చేది ఈ అవినాశ ప్రాప్తియే. గౌరవాన్ని అమ్ముకున్న వ్యక్తి దగ్గర మిగిలే ది ఏముంది? స్వమాన్యవ, ఆత్మగౌరవాన్ని కోల్పోతే అంతరాత్మ ధిక్కరిస్తుంది. అందుచేత నైతిక విలువలను పాటించే వ్యక్తి సూక్ష్మ ప్రాప్తుల వలన సంతృప్తితో నిశ్చింతగా చక్రవర్తిలా ఉంటాడు.

నైతికంగా అస్థిరత్వం ఉన్న వ్యక్తి ముందు ఎన్నో ప్రలోభాలు ఊరిస్తుంటాయి. అతనికి అంతులేని ధనంతో పాటు, పొగడ్తలు, వెనుకా ముం దు వందిమాగధుల్లా పరుగులు తీసేవారుంటారు. అతనికి బహుమతులిస్తూ అతనికోసం ఏమైనా చేసేందుకు సిద్ధపడతారు. నైతిక విలువలతో నడిచే వ్యక్తి ఆంతరంగిక సుఖాన్ని కలిగి ఉండడం వలన వస్తువు, వైభవాలు, పొగడ్తలపై మోహాన్ని పెంచుకొని సుడిగుండం లో చిక్కుకోక అతీతంగా ఉంటాడు. గొప్ప కార్యం కోసం జనం నుండి స్వీకరిస్తాడే కాని తన దగ్గర దాచుకునేందుకు స్వీకరించాలనుకోడు.

ఈ నైతిక శక్తి కల వ్యక్తి విలువలను కేవలం తాను పాటించడమే కాక ఇతరులు వాటిని పాటించడంలో ఏవైనా సమస్యలు వస్తే వారికి సహాయం చేసి వారిని పరిపక్వం చేస్తాడు. అతడు సాక్షియై ఏ విషయంలోనూ తమా షా చూడక ప్రపంచంలో నైతికతను ప్రోత్సహిస్తూ ఆచరణలో వచ్చేలా చేస్తాడు. ఈ విధంగా నైతిక శక్తిని తన కోసమే కాక ఇతర పీడిత వ్యక్తులకు కూడా వినియోగిస్తాడు. ప్రపం చంలో ఎంతోమంది సన్యాసి వేషం లో అరాచకమైన పనులు చేసేవారున్నారు. తమను తాము గొప్పగా భా వించి నికృష్ట కర్మలు చేస్తారు.

నమ్మకమనే ముసుగులో అపనమ్మకమనే పనులు చేస్తూ ధర్మానికి ప్రతినిధులమనిపించకుంటూ కర్మకాండలు, పూజలు, ప్రార్ధనలు చేయడం తప్ప వారి పనులన్నీ అనర్ధమైనవే. లోపల ఒకరకంగా బయటకు ఒక రకంగా ఉంటూ మాటలకు, చేతలకు పొం తన లేకుండా ఉంటారు. వీరు ప్ర పంచానికి చాలా ప్రమాదకరమైన వారు. అలాంటి వారి వ్యవహారం వల్ల ధర్మానికి ఎదురు దెబ్బ తగలగటమే కాక నైతికతను నమ్ముకున్న వారు కూడా నిరాశ చెంది ధర్మమే పెద్ద మోసమంటారు.

dadi-janakiమరికొందరు భగవంతుడు కూడా వీరిని శిక్షించరా అని బాధపడుతూ ఉంటారు. ధర్మం పేరున మోసాలను చేస్తూ ధనాన్ని జమ చేస్తూ ప్రజాహిత కార్యాలకని చెప్పుకుంటారు. అలాంటి పరిస్థితుల్లో నైతిక శక్తిని పాటించే కొందరు ఇలాంటి వారిని చూసి నోటమాట రాక ఉండిపోతారు. ఆము నైతిక విలువలు పాటించినప్పటికీ కొందరు నైతిక మార్గంలో వారు ప్రయాణిస్తారు కాని అవినీతిని ఎదుర్కోలేరు. ఇలాంటి శక్తి నైతిక శక్తి అవదు. ఇది నైతికంగా ధైర్యం లోపించిన స్థితి. నైతిక శక్తి ఉన్నవారు సింహంలా ధైర్యంగా ఉండి ఎవరి పేరు చెప్పినా భయపడరు.

– దాదీ జానకి
బ్రహ్మకుమారీస్‌ అధినేత్రి

Surya Telugu Daily .

మార్చి 10, 2011 Posted by | భక్తి | | వ్యాఖ్యానించండి

పంచ నారసింహ క్షేత్రాలలో విశిష్ఠం యాదగిరి గుట్ట

పంచ నారసింహ క్షేత్రాలలో విశిష్ఠం యాదగిరి గుట్ట

temp-colorతెలంగాణలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ూదగిరిగుట్ట ఒకటి. ఇది పురాతన విష్ణు క్షేత్రం శ్రీమహావిష్ణువు ఈ క్షేత్రంలో లక్ష్మీనర్సింహ్మాస్వామి వెలసి ఉన్నాడు. స్వామి ఆవిర్భావ కాలం పురాణల నుండి గ్రహించవచ్చు. అధునిక చర్రితకారుల వూహకు అందనిది. ఈక్షేత్రం హైదారాబాద్‌ వరంగల్‌ రోడ్డులో హైదరాబాద్‌కు 60 కిలోమీటర్లదూరంలో ఉన్నది. సికింద్రబాద్‌, వరంగల్‌ రైల్వే లైన్‌ మీద ఉన్న భువనగిరికి రాయగిరి మీదుగా 6మైళ్ల రోడ్డు మార్గం కలదు. దేశంలో వందకు పైగా నర్సింహ్మా క్షేత్రాలు ఉన్నాయి. వాటిలో సింహచలం,ఆహోబిలం,మంగళగిరి, వేదాద్రి, యాదగిరిక్షేత్రాలు ప్రసిద్దమైనవి.యాదగిరిగుట్ట క్షేత్రంలో గుహాలయం, విష్ణుతుండం,గోపురచ్రం మహామహిమానిత్వలు అవడం ఈక్షేత్రానికి అత్యంత ప్రాశస్త్యాన్ని చేకూర్చింది. క్షేత్ర పాలకుడు ఆంజనేయస్వామి.

చారిత్రక ధృవీకరణ…..
ూదగిరి క్షేత్రం పురాతనమైనదే విషయాన్ని చారిత్రాక ఆధారాలు ధృవీకరిస్తున్నాయి.క్రీస్తుశకం 12వ శతాబ్దం వరకు మునులకు,యోగులకు మాత్రమే దర్శనీయమైఉన్న యాదగిరి సామాన్య మానవులకు అందుబాటులో ఉండేది కాదు. ఈక్షేత్ర మహత్యం తెలిసిన వారు కూడా తక్కువే.12వ శతాబ్ధిలో రాజమహేంద్రవరం రాజాధానిగా చేసుకొని ఆంధ్ర ప్రాంతాన్ని పశ్చిమచాళుక్యులు పరిపాలిస్తుండేవారు.1148 సంవత్సరంలో త్రిభువనమల్లుడు అనే పశ్చిమచాళుక్యరాజు రాజ్యవిస్తరణకై తెలంగాణ ప్రాంతాలో ఉన్న రాజ్యాలను జయిస్తూ ఇక్కడి భువనగిరి ప్రాంతానికి వచ్చాడు.ఈ విశాలమైన ఏకశిలను చూసి ముగ్ధుడయ్యాడు.

devuduచుట్టూ వాతావరణం కూడా అతనికి నచ్చడంతో భువనగిరి ఏకశిల మీద కోటను నిర్మించుకున్నాడు. కాని అందులో ఉంటున్న సమయంలో పృధ్వివల్లుల ఒక గుజరాతి భూవల్లభునితో వైరం ఏర్పడింది. ఇతనికి జయం సుసాధ్యమైంది. జగదేవుడు అనే మంత్రి సలహాలను పాటించి విభువనవల్లభుడు యాదగిరిక్షేత్రం దర్శించి శ్రీలక్ష్మీనర్సింహస్వామిని ఆరాధించాడు. స్వామి ప్రసన్నడై అతనికి విజయం చేకూర్చాడు. అతని పేరు మీద ఈఏకశిలకు భువనగిరి అని పేరు పెట్టారు.

ammavaruఅనంతరం దాని చుట్టూ ఏర్పడిన పట్టణానికి కూడా భువనగిరి పేరు స్థిరపడింది. విభువనమల్లుడు యాదగిరి లక్ష్మీనర్సింహ్మాస్వామిని సేవించి జయం పొందడంతో యాదగిరిక్షేత్ర మహత్యం కూడా బాహ్యప్రపంచానికి తెలిసింది. యాదగిరికి భువనగిరి పది కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇప్పటికి నాలుగు వందల సంవత్సరాలకు పూర్వం శ్రీకృష్ణదేవరాయలు ఆంధ్రదేశాన్ని లోబర్చుకొని గోలుకొండకు వచ్చాడు. సమీపంలో ఉన్న యాదగిరి నర్సింహస్వామి మహత్యంను విని సతీసమేతంగా స్వామిని దర్శనం చేసుకున్నట్లు చారిత్రక ఆధారాలు చెప్తున్నాయి.

ఆలయ ప్రాకారాల నిర్మాణం……
యాదగిరి ప్రాంతమంతా సామాన్యులు చొరబడలేని ఆరణ్యప్రాంతం కావడంతో ఇటీవల వరకు అనగా 19వ శతాబ్దం వరకు స్వామికి నిత్యధూపదీప నైవేద్యాలు జరిగే అవకా శం లేకపోయింది. శ్రీకృష్ణదేవరాయలు దర్శించుకొని వెళ్లిన తర్వాత కూడా చాలా కాలం వరకు దుర్గమమై ఉన్నందున ఈక్షేత్రాన్ని ప్రజలు మరచిపోయే వరకు వచ్చింది. కాగా సుమారు రెండు వందల సంవత్సరాల క్రిందట ఈ ప్రాంతంలో ఒక గ్రామ పెద్ద స్వామి వారు లలో కనిపించి యాదగిరిలో విష్ణుకుండం సమీపంలో ఒక గృహంలో ఉంటానని చెప్పి ఆదృశ్యమయ్యాడు.

yagnamగ్రామాధికారి ఆగమశాస్త్ర విధులను తెలిపిన వైష్ణవ పండితులను, అర్చకులను రప్పించి స్వామికి నిత్యం అభిషేకం, పూజ, దీపారాధన, నైవేద్యం తదితర ఉపచారాలు జరిపేందుకు నియమాకాలు చేశాడు. ఈ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు గుల్లపల్లి రామభట్టును నియమించాడు. వారి సంతతి వారే వంశపరపరంగా ఈక్షేత్రాన్ని అంటి పెట్టుకొని సేవలు చేస్తున్నారు.

భక్తుల రాక యేటే టా పెరగడంతో ఈక్షేత్రం తెలంగాణ తిరుపతిగా వాసికెక్కింది. ఇదిలా ఉండగా హైదరబాద్‌ వాస్తవ్యుడైన రాజామోతీలాల్‌ యాదగిరి లక్ష్మీనర్సింహ్మస్వామి వైభవం విని స్వామి వారిని దర్శించాడు. స్వామి వారికి ఆలయనిర్మాణం చేయించాడు. ప్రాకారం, గోపుర ద్వారం, ముఖమండపం నిర్మించాడు. ఆ తర్వాత భక్తులు తమ యాత్ర సందర్భాల్లో పలు సౌకర్యాలు ఏర్పరుచుతూ వచ్చారు. ప్రస్తుతం ఈక్షేత్ర యాజమాన్యం దే వాదయ శాఖ ఆధ్వర్యంలో ఉంది. మంచినీటి వసతితోపాటు ఆధునిక వసతులతో యా దగిరిలక్ష్మీనర్సింహ క్షేత్రం జనాకర్షకమై భక్తుల కొంగుబంగారమై విరాజిల్లుతున్నది.

నైజాం ప్రభువుల కృషి
temp-ayyavaruరెండవ తిరుపతిగా రాష్ట్ర ప్రజలు ఆరాధ్యదైవంగా కొలువబడుతున్న శ్రీలక్ష్మీనర్సింహ స్వామి దేవస్థానానికి మొదటి చైర్మన్‌ను నైజాం ప్రభుత్వం నియమించింది. 1937కు పూర్వం నైజాం ప్రభువు తమ తహసీల్దార్‌ రాజారిని చైర్మన్‌గా నియమించడంతో ఆల య అభివృద్ధికి కృషి ప్రారంభమైంది. అంతకు పూర్వం నుంచే శేషచార్యులు ఈ ఆల య పూజారిగా వ్యవహరించారు. ఆయనే క్షేత్రప్రచారకుడిగా ఎంతో పాటుపడ్డాడు. రాజారి తర్వాత భువనగిరికి చెందిన రామ్‌దయాల్‌, నైజాం ప్రభుత్వం సభ సభ్యుడిగా వ్యవహరించిన యాదగిరివాస్తవ్యుడు రామారావులు చైర్మన్‌గా కొనసాగారు.

రామారావు హయంలో పూజారి శేషచార్యులతో వాగ్వివాదం జరిగింది. ఇది చిలికిచిలికి గాలివానైంది. రాయగిరిలో పౌరోహిత పనిచేస్తున్న ఆనంతయ్యను ఆలయ పూజారిగా చేశా రు. ఆనంతయ్య కుమార్తె రాధాభామయ్య దేవస్థాన హక్కుదారుగా మారారు. ఆయవార్ల నుండి బ్రహ్మణులకు వశంపరపర్యహక్కు మారింది. రామారావు తర్వాత హనుమంతరావు, బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వ హయంలో మందమాల నర్సింహ్మారావు తర్వాత పన్నాలాల్‌ కొనసాగారు. రాష్ట్ర దేవాదాయ చట్టాన్ని రూపొందించాక రాధాభామయ్యను వశంపరపర్య హక్కుదారుగా గుర్తించారు.

temp-devoteeనాటి నుండి నేటి వరకు ఆమె వంశీయులే వంశపరపర్య హక్కుదారుగా కొనసాగుతున్నారు. స్వాతంత్య్రం రాకపూర్వం ఆలయ ప్రాకారం నిర్మితం కాగా సుమారు 1940వ సంవత్సరంలో నిర్మితమైన ఘాట్‌రోడ్డును అప్పటి నైజాం ప్రభుత్వం వజీర్‌యాజం హైదరీ ప్రారంభించాడు. ఆయన కుటుంబ సమేతంగా వచ్చి స్వామిని దర్శించి పూజలు జరిపించారు. ప్రైవేట్‌ సంస్థగా కొనసాగిన దేవస్థానం కొండల్‌రావు, బసవయ్యల హయంలో ఎంతో అభివృద్ధి చెందింది. 1966లో దేవాదయ, ధర్మాదయ చట్టంతో ధర్మాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో దేవాలయంగా కొనసాగుతుంది. ఏటేటా పెరుగుతున్న భక్తులతో గుట్ట వార్షిక ఆదాయం 4నుండి 6కోట్లకు చేరుకుంది.

వార్షిక బ్రహ్మోత్సవాలు…
శ్రీ యాదగిరిగుట్ట వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రతిఏటా ఫాల్గుణశుద్ధ విదియ నుంచి మొదలై ద్వాదశి వరకు పది రోజుల పాటు కన్నుల పండవగా కొనసాగుతాయి. ఈ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని విశేష అలంకారాలు, సేవలు నిర్వహిస్తారు. పది రోజుల పాటు జరిగే బ్రహ్మో త్సవాలలో ఎదుర్కోళ్ళు, కళ్యాణం, రథోత్సవం ముఖ్యమైనవి. ఈ నెల 7 నుంచి ప్రారంభమైన వార్షిక బ్రహ్మోత్సవాలు 17 వరకు కొనసాగుతాయి. బ్రహ్మాత్సవాలలో భాగంగా స్వామి జగన్మో హిని రామ, కృష్ణ, నరసింహ అవతరాలలో భక్తులకు దర్శనమిస్తారు.

devudu-godఉదయం పూట అలంకా రాలు, సాయంత్రం పూట సేవలు నిర్వహిస్తారు. బ్రహ్మాత్సవాలను పురస్కరించుకొని స్వామి వారికి కేశవాహాన సేవ, అన్నవాహాన సేవ, కల్పవృక్షం, గరుడసేవ, అశ్వవాహాన సేవలు ఘనం గా నిర్వహిస్తారు. ఈ సేవల సందర్భంగా స్వామి అమ్మవారులను పట్టుపీతాంబరాలు, వివిధ బంగారు ఆభరణాలు , పూలతో శోభాయామానంగా అలంకరించి పుర వీధులలో ఊరేగిస్తారు. ఆధ్యాత్మిక భావన వెల్లివిరిసేందుకు 75 మంది రుత్వికులతో రామాయణం, మహాభారతం, భాగ వతం, విష్ణుసహాస్రనామాలు, సుందరకాండ పారాయణాలు చేస్తారు. ఈ నెల 13 ఎదుర్కోళ్ళు, 14 కళ్యాణం, 15 రథోత్సవాల సందర్భంగా లక్షలాది భక్తులు తరలి వచ్చే అవకాశం ఉన్నందున అధికారులు భక్తులకు ఎలాంటి అసౌకర్యా లు కలుగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
– మేజర్‌న్యూస్‌ ప్రతినిధి, నల్లగొండ

Surya Telugu Daily .

మార్చి 10, 2011 Posted by | భక్తి | , | వ్యాఖ్యానించండి

ఆదిమ జాతుల్లో వింత పెళ్లిళ్లు

ఆదిమ జాతుల్లో వింత పెళ్లిళ్లు
మానవుడు ప్రకృతి ఆరాధకుడు. నాగరిక పరిణామక్రమంలో ఆయా కాలమాన పరిస్థితుల మూలంగా అనేక విధాలుగా మార్పు చెందాడు. అభివృద్ధి తొలుత నెమ్మదిగా ప్రారంభమైనప్పటికీ రాను రాను అది వేగం పుంజుకున్నాది. నేటికాలంలో అది నిమిషాలకి పరిమితమైంది.వేగంగా అభివృద్ధిని సాధిస్తున్న ఇప్పటి ప్రపంచంలో, సాంప్రదాయాలు, సంస్కృతులు, ఆచారవ్యవహారాలు, అలవాట్లు మారిపోతున్నాయి.సమాజానికి తగినట్లుగా మనిషి తన ప్రవర్తనని మార్చుకుని జీవనప్రయాణాన్ని సాగిస్తున్నాడు. అయితే ఈ అభివృద్ధికి దూరంగా ఉన్న కొన్ని ఆదిమజాతులు .. ఇప్పటికీ తమ అలవాట్లును మార్చుకోలేదు.అంతమాత్రాన వారిని ఆధునిక ప్రపంచంలో పోటీపడుతున్న మానవుడి కంటే తక్కువగా చూడలేం. జీవనగమనంలో వాళ్లు పడుతున్న ఆరాటం …. జరుపుతున్న పోరాటం అందరిలాంటిదే. ఇటువంటి కొన్ని ఆదిమ జాతుల వారిలో జరిగే పెళ్లిళ్ళు నాగరికులకు వింతగా కనిపించడం సహజమే…

African_Polygamyఆఫ్రికా దేశంలో ఉండే సాంప్రదాయాలు ప్రపంచం లోని మిగతా తెగలతో పోల్చుకుంటే విభిన్నంగా ఉంటాయి.చీకటి ఖండంగా ఒకప్పుడు ఆ ప్రాంతాన్ని పిలిచినా..నేడు అది అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోటీ పడుతోంది. ఏ సమాజానికైనా వివాహ వ్యవస్థ ఎంతో ప్రధానం.ఆఫ్రికా ఖండాల్లో జరిగే పెళ్లిళ్లు మిగ తా ప్రపంచంతో పోల్చి చూస్తే కొంచెం భిన్నంగా ఉంటాయి.అమ్మాయి లేని అబ్బాయి చెట్టులేని పువ్వుతో సమానమని ఆఫ్రికన్స్‌ నమ్ముతారు.

ఓ కుటుంబం ఏర్పడడానికి పెళ్లి ముఖ్యమని ఆఫ్రికన్‌ తెగలు నమ్ముతాయి. సమాజంలో ఓ స్థానం సంపాదిం చటానికి ఇది మార్గమని అవి భావిస్తాయి. ఆఫ్రికాలో జరిగే పెళ్లిళ్లు చాలా చిత్రంగా ఉంటాయి. అన్ని సమూహాల్లో పెళ్లికొడుకే ప్రధానపాత్రని పోషిస్తాడు. ఆ ప్రాం తాల్లో పెళ్లి జరగాలంటే వరుడు ఎన్నో ఆటంకాలని దాటిరావాలి. తగిన జోడి కోసం కొన్ని తెగల్లో యుద్ధా లు కూడా జరుగుతాయి.మరికొన్ని రోజుల్లో పెళ్లి అవు తుంది అనుకునే జంటకి తెగ పెద్ద కొన్ని మంత్రాలను చెపుతారు. అవి వాళ్ల పూర్వీకులకి సంబంధించినవిగా భావిస్తారు. అలా చేయటం వలన పెళ్లి తరవాత ఎలాం టి అవాంతరాలు లేకుండా భార్యభర్తలు హాయిగా జీవి స్తారనేది వాళ్ల నమ్మకం. కొన్ని ప్రాంతాల్లోని తెగలకు చెందిన పురుషులు పెళ్లి అయిన తరవాత వధువు ఇంటి పక్కనే ఓ ఇంటిని నిర్మించి అక్కడే సంసారాన్ని చేయా ల్సి ఉంటుంది. వీళ్ల పెళ్లిళ్లో కనిపించే మరో ప్రముఖ ఘట్టం విందు. జంతుబలి సాధారణంగా కనిపించే ఆ తెగల్లో పెళ్లి విందుని కొన్ని రోజులపాటు జరుపుతారు. పాటలు, నృత్యాలతో వివాహనంతరం ఫుల్‌ జోష్‌గా వేడుకలు చేసుకుంటారు.

marraigeఇథియోపియాలో రాజకీయంగా, ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందిన తెగ అమ్‌హరా. ఇక్కడి జనాభా 19 మిలియన్లు. అమ్‌హారిక్‌ వీరి మాతృభాష. వీళ్ల సంప్రదాయాల్లో చర్చి ప్రధాన పాత్రని పోషిస్తుంది. ఈ తెగల్లో వివా హమనేది ఒప్పందం. రెండు కుటుంబాల మధ్య గ ట్టి బంధం ఏర్పడటానికి వివాహం ముఖ్యమని వీరు భావి స్తారు. ఈ జాతిలో విడాకులు తీసుకోవడం కూడా ఉంది. ఇథియోపియాలో ఉన్న కారో తెగల్లో పెళ్లికి ముం దు వధువు పొత్తికడుపు మీద కొన్ని ముద్రలను వేస్తారు.

పుణ్యకార్యంగా…
అషెంత్‌ తెగ ఆఫ్రికాలో కనపడే ఓ విభిన్నమైన తెగ. భూమి మీద ఆధారపడి బతికే ఈ తెగవాసులు వ్యవసా యం చేయటంలో గొప్ప ప్రావీణ్యం సాధించారు. పూ ర్వ కాలం నుంచి వీళ్లు వ్యవసాయాన్ని ఆధారంగా త మ జీవనాన్ని సాగిస్తున్నారు. అంతేకాదు బంగారం, వెండితో వీళ్లు చేసే డిజైన్స్‌ అన్నీ కూడా చేతితోనే తయారవుతాయి. ఆఫ్రికా తెగల్లో త్వరగా అంతరించిపోతున్న జాతుల్లో అన్‌లో ఈవ్‌ తెగ ఒకటి. వీరిలో వివాహమనేది ప్రకృతి మధ్య జరిగే పుణ్యకార్యం. ఘనాలోని ఘనేనియన్‌ తెగ ల్లో పెళ్లి సంప్రదాయకంగా జరుగుతుంది. స్నేహితులు, బంధువులు మధ్య జరిగే ఈ వివాహంలో పెళ్లికూతురి ని పెళ్లికొడుకు తరఫువారే ముస్తాబు చేస్తారు. పెళ్లికూ తురిని ఇంటికి తీసుకొచ్చేటప్పుడు.. వరుడు తరపు వాళ్లందరూ వధువుకి మద్దతుగా ఉంటారు. అంతేకాదు వధువు కొత్త ఇంటిలో అడుగుపెట్టేటప్పుడు తలుపుని గట్టిగా కొట్టి రావాలి. ఇలా కొట్టడాన్నే అక్కడ ‘కొ కొ కు’ అంటారు.

పెళ్లంటే తిట్లే!…
కెన్యాలో జరిగే వివాహలు కొంచెం బాధాకరంగా అనిపిస్తాయి నాగరికులకు. పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లే వధువుని ఆమె తండ్రి తిడతాడు. అంతేకాదు ఆమె ము ఖం, వక్షోజాల మీద ఉమ్మును వేస్తాడు. మళ్లీ ఇక్కడకి తిరిగి వస్తే రాళ్లతో కొట్టి చంపేస్తామంటాడు. వివాహాని కి ముందు ఆమెను బాగా అలంకరించి…ఒంటి నిం డా ఆభరణాలతో పంపించేసే ఈ తెగవాళ్లు 13 ఏళ్లకే తమ పిల్లలకు వివాహాన్ని చేసేస్తారు. అక్కడ ఉన్న మ రో తెగ స్వాహలి. ఇందులో పెళ్లికి ముందు వధువుకి సుగంధస్నానం చేయిస్తారు. రకరకాల ముద్రలతో వం టినంతా అలంకరిస్తారు.

South-Africanపెదాలని కొన్ని మూలికలతో కప్పేస్తారు. ఇందులో కూడా పెళ్లివేడుకలు కొన్ని రోజు ల పాటు జరుగుతాయి. వెరైటీ ఏమిటంటే….సంబ రాలు వధువు ఇంట్లో..వరుడు ఇంట్లో వేరువేరుగా జరుగుతాయి. పెళ్లైన తరవాత జరిగే కుపంబా కూడా కెన్యా దేశంలో ఉండే తెగల్లో కనపడుతుంది. ఈ వేడు కి హాజరయ్యే వాళ్లందరూ ఆడవాళ్లే.సాంబూర్‌ జాతి లో జరిగే పెళ్లిళ్లో బహుమతులకి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. వరుడు మేక, గుర్రాన్ని , రెండు పంటల లాభాన్ని, పెళ్లికూతురు తరపు వారు అడిగినన్నీ పాల ని, ఓ గొర్రెని పెళ్లి కానుకగా వధువుకి ఇచ్చిన తరువా తే వివాహం జరుగుతుంది.నమీబియాలో ఉన్న హం బా తెగల్లో జరిగే మ్యా రేజిల్లో వధువుని పెళ్లికి ముందు దాచేస్తారు. తోలుతో ముఖాన్ని కప్పేస్తారు. శోభనం జ రిగేంత వరకు ఆ ముసుగుని అలాగే ఉంచు తారు.

పెళ్లంటే ఇద్దరు పిల్లలు..
సుడాన్‌లోని నెర్‌ ఆదివాసుల్లో జరిగే పెళ్లిళ్లు పాడి పశువుల మీద ఆధారపడి ఉంటుంది. పెళ్లికి ముందు వధువు …పెళ్లికొడుకు తరపువాళ్లు 40 పశువులను ఇ వ్వాలి. అంతే కాదు వరుడు …వధువు ఎప్పుడై తే ఇద్ద రు పిల్లలకు తల్లి అవుతుందో అప్పడే ఆమెని భార్యగా స్వీకరిస్తాడు. ఒకవేళ ఆమె ఒక బిడ్డకే జన్మనిస్తే అతను ఆమె నుంచి విడాకులు తీసుకునేందుకు పెద్దలు అను మతిస్తారు.ఆఫ్రికాలోని వివాహ పద్ధతులు చాలా ప్రాచీనమైనవి. చాలా చోట్ల జరిగే వివాహలకి అవి మార్గదర్శకాలుగా ఉన్నాయి.ప్రపంచంలో జరిగే ఇప్పటి వివాహల మూ లాలు మనకు ఆఫ్రికాలోని చాలా తెగల్లో కనపడతాయి.ఆ దేశంలో ఉండే బాకా తెగ వాళ్ల ప్రధాన వృత్తి వే ట. వ్యవసాయం కూడా వీళ్లకి తెలుసు.బాకా తెగలను పిగ్మీలని కూడా పిలుస్తారు. ఇక్కడ పెళ్లి అనాదిగా వస్తు న్న సంప్రదాయాలతోనే జరుగుతుంది.సుడాన్‌లోని అతిపెద్ద సమూహం దిన్‌కా తెగ. ఎత్తుగా, అందంగా ఉండే ఈ తెగవాళ్లు ..గోధుమరంగు కన్నులను కలిగి ఉంటారు. వీరి వివాహలు కూడా ప్రాచీన సంప్రదా యాల ప్రకారమే జరుగుతాయి.

జూలు..
girlsబంతు కుటుంబంలోని ఓ తెగ జూలు.. దక్షిణాఫ్రికా చెందిన అతి పెద్ద తెగ ఇది. ఇందులో 11 మిలియన్ల జనాభా ఉంది. సౌత్‌ఆఫ్రికాతో పాటు, జింబాబ్వే, జాంబి యా, మెజాంబిక్‌ దేశాల్లో ఈ తెగవాళ్లు నివసిస్తున్నా రు. వీరి మాతృభాష జూలు . ఈ తెగల్లోని చాలామంది జూలు భాషతో పాటూ ఇంగ్లీషు, పోర్చుగీస్‌ మాట్లాడతారు. ఆఫ్రికాలోనే కాదు..భారతదేశంలో అనేక ఆదిమ జాతులు, గిరిజన సముదాయాలున్నాయి. వీరికి ప్రత్యే క సంస్కృతి, సంప్రదాయం ఉంది.మన దేశంలో వీళ్లు ఎక్కువగా ఒరిస్సా, మధ్యప్రదేశ్‌, చత్తీస్‌ఘడ్‌, రాజస్థా న్‌, గుజరాత్‌, మహారాష్ట్ర, జార్ఖండ్‌, మిజోరం, ఆంధ్రప్రదేశ్‌, అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో ఉన్నారు. ఇక మ న రాష్ట్రంలో చూసుకుంటే చెంచులు, గోండ్లు, కొండరె డ్లు, కొలాములు, నాయకపోడ్లు, సవరలు, జాతాపులు, పరధాన్లు, తోటీలు, సుగాలీలు, లంబాడీల సంస్కృతు లు ఉన్నాయి. వీళ్లలో జరిగే వివాహాలు ఆధునిక సమా జంలోని వాటికి విభిన్నంగానే జరుగుతాయి.

Surya Telugu Daily .

మార్చి 9, 2011 Posted by | వింతలూ-విశేషాలు | | వ్యాఖ్యానించండి

పర్యావరణ పరిరక్షణలో… గో గ్రీన్‌ క్లబ్‌

పర్యావరణ పరిరక్షణలో… గో గ్రీన్‌ క్లబ్‌
కొన్నేళ్ల క్రితం రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ను సైకిల్‌ నగరంగా పిలిచేవారు. ఎందుకంటే ఏ చోట చూసినా సైకిళ్లు అధిక సంఖ్యలో ఉండేవి. కానీ కాలక్రమేణా ఇంధన వాహనాలు రావడం వల్ల సైిళ్లు కననుమరుగయ్యాయి. ఈ వాహనాల సంఖ్య పెరగడంతో హైదరాబాద్‌ నగరం కాలుష్యమయం అయిపోతోంది. పర్యావరణానికి ఇవి కలిగించే కాలుష్యంవల్ల నగరంలో నివసించే వారికి ఎన్నో వ్యాధులు సంక్రమిస్తున్నాయి. వీటన్నింటికీ పరిష్కారమార్గంగా యువతీ యువకులు కొందరు తమ మోటారు వాహనాలకు బదులు సైైకిల్‌ను వాడేందుకు ముందుకు వస్తున్నారు. అత్యవసర పరిస్థితిలో తప్ప వీటిని ఉపయోగించకూడదని నిర్ణయించుకుంటున్నారు. కొత్తగా సైకిల్‌ క్లబ్‌లను ఏర్పాటుచేస్తున్నారు.సైకిల్‌తో సావాసం చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. సైకిల్‌ క్లబ్‌లో చేరి పర్యావరణాన్ని రక్షించే బాధ్యతలో మీరూ పాలు పంచుకోండని మిగతావారికి పిలుపునిస్తున్నారు.

cycle-resingసామాన్యుల విమా నంగా ప్రసిద్ధి గాం చిన సైకిల్‌ను నేడు కొందరు కుర్రకారుకు ఇష్టమై న వాహనంగా మారింది. బైక్‌ లేకుండా కనీ సం బయటకు అడుగుపెట్టని కుర్రవాళ్ళు ఉన్న ఈ రోజుల్లో ఇలాంటి నిర్ణయం తీసుకో వడం చాలా ఆనందాన్ని కలిగిస్తోందని పెద్ద లు అంటున్నారు. పర్యావరణానికి ఎటువం టి కాలుష్యాన్ని అందించని వాహనం ఇది. సురక్షితమైన, నిరాటంకంగా సాగి పోయే సైకిల్‌, ఆరోగ్యంగా, ఆర్థికంగా ఎంతో మేలు కూడా చేస్తుంది.

రోజురోజుకీ భూమిపై పెరిగిపోతున్న కాలుష్యాన్ని తగ్గించే పాత్రలో నేడు సైకిళ్లు ఎంతో ముఖ్యపాత్ర పోషిస్తాయనడంలో ఏమాత్రం సందేహంలేదు. అందుకే పలు దేశాల ప్రజలు నేడు సైకిల్‌పై ప్రయాణం చేయాలనుకుంటున్నారు. అదే తరహాలో హైదరాబాద్‌వాసులు కూడా సైకిల్‌నే వాడాలని నిశ్చయించుకుంటు న్నారు. అలాగే తమ స్నేహితులకు కూడా సైకిల్‌వాడండని నెట్‌ ద్వారా మెసేజ్‌లు ఇస్తున్నారు. దాంతో నగరంలోని సైక్లింగ్‌ క్లబ్‌లలో సభ్యుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది.

ఆరోగ్యం కలిగిస్తుంది…
ఎంతటి మహానగరంలోనైనా పోస్ట్‌మన్‌, పాలవాడు, పేపర్‌వాడు సైకిల్‌నే తమ వాహనంగా వినియోగిస్తుంటారు. ఇరుకైన సందుల్లో వేగంగా పోవడానికి వీలుగా, మెయింటెన్స్‌కి పెద్ద ఖర్చు చేయన వసరం లేకపోవడం వంటి పలుకారణాల వల్ల వీటిని ఉ పయోగి స్తుంటారు. అయితే ఇప్పుడు కార్పొరేట్‌ ఎగ్జిక్యూటివ్స్‌ కూడా తమ కార్లకు బదులు సైకిల్‌నే ఉపయోగిస్తున్నారు. నెలకు ఐదంకెలు జీ తం కలిగిన వారు కూడా వీటివైపే మొగ్గుచూపుతున్నారు. సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పనిచేసే కిషోర్‌ ఇంటికి తను పనిచేసే ఆఫీసుకు మధ్య దూరం నాలుగు కిలోమీటర్లు. అందుకని తను కారును ప్రక్కన పె ట్టి సైకిల్‌ మీదనే ఆఫీసుకు వెళుతుంటాడు.

వారానికి ఒక్క సారిమా త్రమే తన కారును ఉపయోగిస్తాడు. ‘సైకిళ్లు పర్యావరణాన్ని కాపా డడమే కాకుండా, ఆర్యోగం కలిగిస్తాయి, ఆర్థికంగా కూడా ఆదా . వీటికోసం పెట్రోలు, డీజల్‌ వంటి ఇంధనాలేమీ కొనక్కర్లేదు, అలా గే మధ్యలో ఎక్కడైనా ఆగిపోతుందని భయమేలేదు. ఈ రోజుల్లో ప్రపంచంలోని అభివృద్ధిచెందిన ఎన్నో దేశాలు సైకిల్‌కు ప్రాము ఖ్యత ఇస్తున్నాయి. నానాటికీ పెరిగిపోతున్న కాలుష్యం వల్ల విపరీ తంగా మారిపోతున్న వాతావరణ మార్పులను అరికట్టేం దుకు ఇందన వాహనాలకు బదులుగా సైకిల్‌ను వాడు తున్నారు’ అని కిషోర్‌ అన్నారు.

సింపుల్‌ ఐడియా…
dlthgenevawithbikelమన దేశ పట్టణాల్లో , నగరాల్లో విపరీతమైన ట్రాఫిక్‌ రద్దీలకు, పెట్రోలు, డీజల్‌ రోజురోజుకూ పెరిగిపో తుండటం వల్ల ప్రత్యామ్నాయ మార్గంగా సైకిల్‌ బాగా ఉపయోగపడుతుంది.ఆఫీసుకు పోయేటప్పుడు, వచ్చేటప్పుడు ట్రాఫిక్‌లో చిక్కుకుంటే ఆ గాలికాలుష్యం వల్ల ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. వీటన్నింటికీ పరి ష్కార మార్గంగానే ప్రభాకర్‌రావ్‌ అనే అతను గోగ్రీన్‌ సైక్లింగ్‌ క్లబ్‌ను నెలకొల్పారు.‘ కారు, బైక్‌లు ఉన్నవారికి సైకిల్‌ కొనడం ఏ మంత కష్టం కాదు. ఇందువల్ల ఎంతటి రద్దీ ట్రాఫి్‌లోనైనా సుర క్షితంగా ఇంటికి చేరుకోవచ్చు. నాలుగువందల మంది తో బెంగ ళూరులో ఉన్న మా క్లబ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో కూడా నెల కొల్పాలని అనుకుంటున్నాం. సైక్లింగ్‌ వల్ల కలిగే లాభాలను అన్ని కార్పొరేట్‌ ఆఫీసులలో పనిచేసేవారికి, విద్యార్ధులకు మరోసారి తెలి యజేస్తున్నాం. చాలా మంది క్లబ్‌లో జాయిన్‌ అవుతామని ముందు కొచ్చారు.పర్యావరణానికి మేలుచేయడానికి తమ వంతు కృషిని అందిస్తామని చెబుతున్నారు’ అని ప్రభాకర్‌ అన్నారు.

తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు…
నేటి రోజుల్లో వాహన వినియోగం విపరీతంగా పెరిగిపోతోంది. దూర ప్రాంతాలకు వెహికల్స్‌ను వాడడం మంచిదేకానీ, దగ్గరగా ఉ న్న ఆఫీసులకు కూడా వీటినే ఉపయోగించడం వల్ల, ట్రాఫిక్‌ జామ్‌ లతో ఎంతో ఇంధనం వృధాగా ఖర్చు అవుతుంది. వీటిని దృష్టిలో ఉంచుకొని కొందరు యువకులు కాలేజీలకు, ఆఫీసులకు ప్రత్యా మ్నాయమార్గంగా సైకిల్‌ ఉపయోగించేందుకు ఆసక్తి కనబరుస్తు న్నారు. పర్యావరణ కాలుష్యం తగ్గించేందుతమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. ‘మా ఇంటినుంచి కాలేజీ దగ్గరే. అంటే ఒక కిలోమీట ర్‌ ఉంటుంది. ఇంతకు ముందు వరకు కాలేజీకి నా బైక్‌మీద వెళ్లే వాడిని, అయితే కాలేజీ నుంచి వచ్చేటప్పుడు ట్రాఫిక్‌జామ్‌ వల్ల చా లా ఇంధనం వృధా అవుతుండేది.

cycleదీనివల్ల పర్యావరణానికి హాని తో పాటు భవిషత్‌ తరాలకు ఇందన కొరత ఏర్పడే అవకాశాలు ఉన్నాయి.అదీ కాకుండా ఇప్పుడు ఏదేశంలో చూసినా భూమిని రక్షించుకోవాలనే తపన ఎక్కువైంది.అందువల్ల పర్యావరణాన్ని త ద్వారా భూమిని కాలుష్యం నుంచి కాపాడే చర్యలో నావంతు కృషి చేయాలనుకున్నాను. ఇ అప్పటినుంచి దూర ప్రాంతాలకు, అత్య వసర పరిస్థితిల్లో తప్పించి బైక్‌ వాడను కాలేజీకి కూడా ఇప్పుడు కొత్తగా కొన్న సైకిల్‌ మీదే వెళుతున్నాను. అలాగే సైకిల్‌ క్లబ్‌లో కూ డా చేరాలని నిశ్చయించుకున్నాను. ముందు మా ఫ్రెండ్స్‌ నవ్వు కున్నా ఎందుకు చేశానో చెప్పినప్పుడు చాలా సంతోషించారు. కాలేజీ దగ్గర ఉన్న విద్యా ర్థులంతా ఆ రోజునుంచి సైకిల్‌ మీదనే కాలేజీకి వస్తున్నారు.పర్యావరణం గురించి పూర్తిగా తెలుసుకున్నారు’ అని మున్నా అన్నాడు.

ప్రభుత్వం కూడా చొరవచూపాలి…
‘నేడు చాలామంది కుర్రకారు సైకిల్‌ను తమ వాహనాలుగా చేసు కుంటున్నారు. పర్యావరణానికి రక్షణగా వస్తున్న ఈ సైకిల్‌ ట్రెండ్‌ ను ప్రభుత్వం కూడా ప్రోత్సహించాలి. సైకిల్‌ ప్రయాణానికి అను గుణంగా రోడ్లనందు ప్రత్యేక మార్గాన్ని ప్రవేశపెట్టాలి. చొరవచూపి సైకిల్‌ వాడకాన్ని పెరిగేలా చేయాలి. అలాగే పర్యా వరణానికి ఎంత టి ముప్పు కాలుష్యంవల్ల వాటిల్లుతుందో తెలియజేయాలి. స్కూళ్లు, కాలేజీలలో పోస్టర్లు అంటించడం, విద్యార్థులతో సమావేశమై భూ మిని రక్షించుకోవాల్సిన అవసరం మనపై ఎంతుందో వారికి అర్థమ య్యేలా తెలియజేయడం ఎంతో అవసరం.

ఇలాంటివి చేయడం వల్ల విదార్థులో కాలుష్యాన్ని తగ్గించాలనే తపన పెరుగుతుంది. వీరే కాకుండా ఉద్యోగులు, వ్యా పారస్తులుకూడా వీటి గురించి ఆలో చిస్తే మంచిది. చాలా మంది పక్కనే ఉన్న షాపుకు లేదా ఆఫీసులకు బైక్‌ లేదా కారును ఉపయోగిస్తుంటారు. మరికొంతమంది తమ హోదాను తెలుపడం కోసం కార్లను ఉయోగిస్తుంటారు. వీరందరూ తమ హోదాలను మరిచి తక్కువ దూరంఉన్న చోట్లకు సైకిల్‌ను వాడడం ఎంతో మంచిది. అప్పుడే మనం మన భావితరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించిన వారమవుతాము’ అని లెక్చరర్‌ నారాయణ తెలిపారు.

Surya Telugu Daily.

మార్చి 9, 2011 Posted by | ఆరోగ్యం | | 2 వ్యాఖ్యలు

ఘనమైన ప్రకృతి అందం… గణపతిపూలే

ఘనమైన ప్రకృతి అందం… గణపతిపూలే

Ganapati_Phuleసముద్ర తీరానికి ప్రత్యేక అం దాన్నిచ్చే పర్వతాలతో కూడిన ప్రకృతి రమణీయ ప్రాంతం మహారాష్ట్ర లోని గణపతిపూలే. సముద్ర అలలు పర్వత పాదాలను తాకే అపురూప దృశ్యాలు ఇక్కడ కొత్త అందాలను సృష్టిస్తాయి. అలల తాకిడి వల్ల ఇక్కడి సముద్ర తీరాలు పసిడి, ధవళ కాంతులీనుతాయి.గణపతిపూలేలో స్వయంభు గణపతి దేవాలయం ఉంది. గౌరీ నందనుడైన గణపతి పేరునే ఈ ఊరికి గణపతిపూలే అని పేరు వచ్చింది. దేశంలోని అష్ట గణపతుల దేవాలయాల్లో గణపతిపూలే ఒకటి. గణపతిపూలేను పశ్చిమ ద్వార దేవతగా పిలుస్తారు.గణపతిని దర్శించుకోవటానికి వచ్చే భక్తులు ఆయన వెలసిన కొండ చుట్టూ ప్రదక్షిణ చేసి వస్తారు. గణపతిపూలే ప్రకృతి అందాలతో శోభిల్లుతుంది. పచ్చ దనంతో కూడిన అడవులు ఇక్కడ ఉన్నాయి. గణపతిపూలేలో మామిడి, వక్క, అరటి, కొబ్బరి వంటి వనాలు ఉన్నాయి. పశ్చిమ తీరం వెంట ఇటువంటి వనా లు ఎక్కువగా ఉంటాయి.

ఇతర దర్శనీయ ప్రాంతాలు…
మాల్గుండ్‌:మరాఠీ కవి కేశవ్‌ సూత్‌ జన్మించిన ప్రాంతం ఇది. సూత్‌ సేవలను గుర్తించుకునే విధంగా కేశవ్‌ సూత్‌ స్మారక్‌ అనే మందిరాన్ని నిర్మించారు.

పావస్‌:ప్రకృతి రమణీయతకు నెలవైన ప్రాంతం పావస్‌. ప్రముఖ ఆథ్యాత్మిక వేత్త స్వామి స్వరూపానంద్‌ ఇక్కడే జన్మించారు.

రత్నగిరి…
పశ్చిమ కోస్తా తీరంలో అందమైన ప్రాంతంతో పాటుగా జిల్లా కేంద్రం రత్న గిరి. ప్రముఖ స్వాత్రంత్య సమరయోధుడు బాల గంగాధర్‌ తిలక్‌ జన్మస్థలం ఇదే. ఆయన సేవలను గుర్తుపెట్టుకునే విధంగా తిలక్‌ స్మారక్‌ను ఇక్కడ ఏర్పా టుచేశారు. ఆంగ్లేయులకు వ్యతిరేకంగా తిలక్‌ స్వదేశీ ఉద్యమాన్ని నడిపించారు. సమీపంలో రత్నదుర్గ్‌ కోట కూడా ఉంది.

వసతి…
గణపతిపూలేలో మహారాష్ట్ర పర్యాటక సంస్థకు చెందిన హో టల్‌తో పాటుగా ఇత ర వసతి సదుపాయా లు ఉన్నాయి.
ఎలా చేరుకోవాలి?
విమానమార్గం:బెల్గాంలో (299 కిలో మీటర్లు) విమానాశ్ర యం ఉంది.
రైలు మార్గం:రత్నగిరి (45 కిమీ), భోక్‌ (35 కిమీ) సమీపంలోని రైల్వే స్టేషన్లు.
రహదారి మార్గం: ముంబయి 375 కి.మీ., పూణె (331 కి.మీ.), కొల్హాపూర్‌ (144 కి.మీ.) దూరంలో గణపతిపూలే ఉంది.

Surya Telugu Daily .

మార్చి 8, 2011 Posted by | చూసొద్దాం | | వ్యాఖ్యానించండి

ఆంధ్రభోజుని అందాల నగరం… హంపి

ఆంధ్రభోజుని అందాల నగరం… హంపి
అహో ఆంధ్రభోజా… శ్రీకృష్ణ దేవరాయా..!
ఈ శిథిలాలలో చిరంజీవివైనావయా..!!
ఈ పాట విన్నప్పుడల్లా హంపి ఎలావుంటుంది? అనుకుంటుంటాం. విజయనగర సామ్రాజ్య వైభవాన్ని నేటికీ తనలో దాచుకుంది హంపి నగరం. మేము హంపి చూడాలని ఎప్పటినుండో అనుకుంటూనే అలాగే గడిచిపోయింది.. శ్రీకృష్ణదేవరాయల 500వ పట్టాభిషేక మహోత్సవానికి కూడా వెళ్లి ఆ హంపీ వైభవం చూడాలనుకున్నాం. కాని అప్పుడూ కుదర్లేదు. ఇదిగో ఈ నెల మా ఇంట్లోని అందరం కలిసి హంపీ చూడడానికి వెళ్లాం. అక్కడికి వెళ్లాక ప్రతిశిల్పం దగ్గర ఘంటసాల మృదుమధుర గీతం మనకు అడుగడుగునా విన్పిస్తుంది.

krishna-devarayalaఅనంతపురం నుండి బళ్లారి జిల్లా హోస్పేటకు సరాసరి వెళ్లాం. అక్కడి నుండి హంపి 13 కిమీ ఒక అర్ధగంటలోపే హంపికి చేరాం. అప్పటికే అనంతపురం నుండి ఓ మిత్రుడిద్వారా వసతి ఏర్పాటు చేసుకున్నాం. ఈ వసతి ని ఏర్పాటు చేసిన కమలానగర్‌లో ఉంటున్న శ్రీనివాస్‌, హనుమంతుగార్లకు ముందుగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. మేం ఉదయం 11 గంటలకు రూముకు చేరి భోజనం అయ్యాక హంపీని చూడడానికి బయల్దేరాం.

నేడు ఈ హంపీ నగరం శిథిల నగరంగా కన్పిస్తున్నా… ఇప్పటికీ అద్భుతంగా, ఏమాత్రం ఆకర్షణ తరగని గనిలా శిల్ప సౌందర్యంతో ఉట్టి పడుతూ ఉంది. నగరం చుట్టూ గ్రానైట్‌ కొండలూ, రాళ్ల గుట్టలూ మధ్యలో పారుతున్న తుంగభద్రానది. ఈ నది ఒడ్డున పొడవుగా అందమైన దేవాలయాలు, సుంద రమైన రాజప్రాసాదాలు, శిథిలమైనా తమ అందాల్ని ఒలకబోస్తున్న శిల్పాలు. పర్యాటకులకు, కళాభిమానులకు ఈ హంపీ నగరం ఒక స్వర్గధామం. హంపీలో ఒక్కో మలుపు వైపూ ఒక్కో ఆకర్షణ. అద్భుతమైన దృశ్యకావ్యాలు. ఇప్పుడే ఇంత అందంగా ఉంటే ఆనాడు రాయల కాలంలో ఇంకెంత సొగసుగా ఉండేదో ఈ నగరం అన్పించకమానదు.

అందుకే ‘హంపీ’ కట్టడాలు యునెస్కో ప్రపంచవారసత్వ జాబితాలో చోటు సంపాదించుకున్నాయి. అయితే ఈ కట్టడాలను పరిరక్షించే విషయంలో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం చూపుతోందని ఈ ఫిబ్రవరి 15 న కర్ణాటక ప్రభుత్వానికి ఆ రాష్ట్ర హైకోర్టు అక్షింతలు వేసింది. హంపీ చారిత్రక, స్మారక చిహ్నాలను పరిరక్షించే విషయంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం చూపే నిర్లక్ష్యాన్ని తప్పుపట్టింది. ఏదేమైనా ఈ హంపీ జాతిసంపద. తప్పకుండా పరిరక్షించాల్సిందే..!!

విజయనగర సామ్రాజ్యంలో ‘హంపి’ తళుకులు…
devaraibulid మహమ్మదీయులు మనదేశం దక్షిణ ప్రాంతంలోకి రావడం వలన అంతకు ముందు వందలాది సంవత్సరాల పాటు సాగిన అనేక నిర్మాణ కార్యక్రమాలకు అంతరాయం కలిగింది. ఈలోగా మహోత్తుంగ తరంగంలా విజయనగర సామ్రాజ్యం పైకి వచ్చింది. 14 వ శతాబ్ది మధ్య కాలం నాటికి ముస్లింల రాకకు ఆనకట్టవేసింది. దక్షిణ భారతదేశ మంతా విస్తరించింది. హంపి (విజయనగర) ని రాజధానిగా చేసుకొని ఏకఛత్రాధిపత్యంగా ఏలారు విజయనగర చక్రవర్తులు.

విరివిగా ఆలయాలను నిర్మించారు. తర్వాతి కాలంలో వారి రాజధానులైన పెనుకొండ (అనంతపురం జిల్లా) చంద్రగిరి (చిత్తూరు జిల్లా), వారి సామంతరాజ్యాల రాజధానులైన వెల్లూర్‌ (ఉత్తర ఆర్కాటు) జింజి (దక్షిణ ఆర్కాటు), తంజావూర్‌, మధురై, ఇక్కెరి (షిమోగా) లలోనూ, అనంతపురం జిల్లాలోని తాడిపత్రి, లేపాక్షిలలోనూ విరివిగా ఆలయాలు నిర్మించారు. ఈ ఆలయాల్లో అపూర్వమైన గోపురాలు, అందమైన శిల్ప సముదాయాలూ, మండపాలూ ఉన్నాయి. నిజానికి విజయనగర రాజుల హయాంలో కట్టినన్ని ఆలయాలు చోళరాజుల కాలంలో కూడా కట్టలేదు.

Lowtas-Mahalవిజయనగర రాజులు కట్టించిన ఆలయాల నగరం విజయనగరానికే విద్యానగరమన్న పేరుంది. శృంగేరీ పీఠాధిపతి అయిన విద్యాశంర (విద్యా తీర్థ) స్వామివారి ప్రధాన శిష్యుడూ, విజయనగర సామ్రాజ్య స్థాపనకు కారకుడైన విద్యారణ్యస్వామిపట్ల గౌరవ సూచకంగా విద్యా నగరం అన్న పేరువచ్చింది. ఈ విద్యారణ్యుడు అప్పటి విజయనగర సామ్రాజ్యాధీశుడైన హరిహర, బుక్కరాయుల సోదరులకు గురువుగా నిలిచి విజయనగర హిందూ సామ్రాజ్యానికి నాంది పలికాడు. ఆయన ఆధ్వర్యంలో 1వ విరూపాక్షరాజు 1336 ఏప్రిల్‌ నెలలో విరూపాక్షస్వామి సమక్షంలో పట్టాభిషిక్తుడయ్యాడు. తుంగభద్ర నదికి ఆవల ‘ఆనెగొంది’ అనే గ్రామంలో చాలా ఎత్తుగా భద్రంగా పెద్ద కోటను నిర్మించారు. నదికి ఇటువైపున హంపీని రాజధానిగా ఏర్పాటు చేసుకొని బుక్కరాయ సోదరులు పరిపాలన సాగించారు.

ఇక వీరి కాలంలోనే విజయనగర సామ్రాజ్య ఉత్తర భాగంలోని నిర్మాణాలకు అంతకు పూర్వపు ఇసుక రాతిని వద్దని కఠిన శిలను ఎన్నుకోవడం చాలా ముఖ్యమైన పెద్దమార్పు. ఈ కారణంగానే ఆనాటి శిల్పులు కొత్త ముడి వస్తువుని ఎన్నుకొని కొంగ్రొత్త పోకడలుపోయి విశిష్టమైన విజయనగర శిల్పయుగాన్ని సృష్టించారు. అసంఖ్యాకంగా ఉన్న ఆలయాలకు, తుంగభద్ర నదీతీరాన పెద్దరాతి కొండ నడు మ పురాతన విరూపాక్ష ఆలయం చుట్టూ నిర్మించిన హంపి నగరపు కోటకు, వాటి గోడలకు, ద్వారాలకు అక్కడ కొండలలో లభ్యమైయ్యే గట్టి రాతిని వాడారు. విజయనగర శిల్పులు భారతీయ వాస్తుకళా వికాసంలో కొత్తపుం తలు తొక్కి తర్వాత తరాల వారికి పురాతన శిల్ప సంప్రదాయాన్ని జవసత్వాల తో నిండుగా అందించారు.

విరూపాక్ష ఆలయం…
krihsandevar-tempహంపీలోని విరూపాక్ష ఆలయం చాలా పెద్దది. ఇక్కడ ప్రధాన దైవం విరూపాక్షుడు. శివుడినే ఇక్కడ విరూపాక్షస్వామి అంటారు. ఇప్పటికీ ఇక్కడ పూజలు జరుగుతున్నాయి. హంపీ వీధికి పశ్ఛిమ దిశగా ఎతె్తైన గోపురం దేవాలయం లోపలికి స్వాగతం పలుకుతుంది. ఈ ఆలయం క్రీశ 10-12 శతాబ్దాలలో కట్టి ఉంటారనీ, చాళుక్యుల తర్వాత వచ్చిన హోయసలులు కూడా కొన్ని పునరుద్ధరణ చేశారనీ చరిత్ర కారుల అంచనా. అయితే ప్రధాన ఆల యాన్ని విజయనగర రాజులు పునరుద్ధ రించి అందంగా తీర్చిదిద్ది అభివృద్ధి చేశారు. ఈ ఆలయానికి చుట్టూ మూడు ప్రాకారాలున్నాయి.

తూర్పున ఉన్న ఎతె్తై న గోపురం దాటి లోపలికి వెళ్తే మొదటి ప్రాకారం వస్తుంది. అది దాటి వెళ్తే స్తంభాలతో కప్పబడిన వసారా వస్తుంది. ఇది దాటి వెళ్తేనే గర్భగుడి వస్తుంది. ఈ ఆలయ కప్పుమీద, స్తంభాల మీద అందమైన వర్ణచిత్రాలు చెక్కారు. శృం గేరీ పీఠాధిపతిని సకల రాజమర్యాదల తో పల్లకీలో విరూపాక్ష దేవాలయా నికి తీసుకొస్తున్నట్లుగా చాలా గొప్ప గా వర్ణసముదా యంతో చిత్రించా రు. ఈ గర్భగుడికి ఒక ప్రత్యేకత ఉంది. తుంగభద్రా నది నుండి చిన్న పాయ ఒకటి ఆలయంలోకి ప్రవేశించి గర్భగుడికి నీరు అంది స్తూ బయటి ప్రాకారం ద్వారా మళ్లీ బయటికి వెళ్లిపోతుంది. అక్కడి నుంచి యాత్రికులు కోదండ రామా లయానికి, యంత్ర ఆంజనేయ గుడికి వెళ్తారు.

Virupaksha-temple-gopఅలాగే అక్కడి నుంచి విఠలేశ్వరా లయానికి నైరుతీగా నడిచి వెళ్తుంటే దారిలో ఒక తులాభారం తూచే రాతి కట్ట డం కన్పిస్తుంది. దీనిని రెండు గ్రానైట్‌ స్తంభాలను కలుపుతూ పైన భూమికి సమాంతరంగా ఒక రాతికమ్మీ ఉంది. ఈ నిర్మాణాన్ని ‘రాజ తులాభారం’ అం టారు. కొన్ని ముఖ్యమైన రోజుల్లో ఇక్కడ రాజు తన ఎత్తు బంగారు, వజ్రవైఢూ ర్యాలను తూచి బ్రాహ్మణులకు దానం చేశేవాడట. ఇది పూర్తిగా గ్రానైట్‌రాతితో కట్టడంతో ఇప్పటికీ చెక్కు చెదరకుం డా ఉంది. ఇంకొక దేవాలయం ‘హజారా రామాలయం’. దీర్ఘచతురస్రాకారం గా ఉన్న ఈ ఆలయాన్ని అంతకు ముందు రాజవంశీయులు ఎవరో ప్రారం భించగా దీనిని శ్రీకృష్ణ దేవరాయలు పూర్తి చేశారంటారు.

అయితే ఈ ఆలయాన్ని రాజప్రతినిధుల కోసం అప్పట్లో నిర్మించారట. ఈ ఆల య బయటగోడల మీద శ్రీకృష్ణుడి లీలలు, రామాయణ కథ మొత్తం చిన్నచిన్న శిల్పాలతో చాలా అందంగా చిత్రిం చారు. ఆలయం లోపల నల్ల గ్రానైట్‌రాయి తో స్తంభాలపై అందమైన శిల్పాలను చె క్కారు. ఈ ఆలయం దగ్గరే ఆ శిల్పాలను చూస్తూ చాలా సేపు ఆగిపోతాం. ఈ ఆల యం మీద రామాయణ గాథకు సంబం ధించి శిల్పాలు లెక్కకు మించి ఉండడం తో ఈ ఆలయాన్ని సహస్ర రామాల యం… అంటే ‘హజారా రామాలయం’ అనే పేరువచ్చిందంటున్నారు.

విఠలాలయం…
హంపీలో ఎక్కువగా దాక్షిణాత్య శిల్పరీతులననుసరించి నిర్మించిన ఆలయాల లో చెప్పుకోదగ్గది విఠలాలయం. ఆనాటి అతిపెద్ద ఆలయాలలో ఇది ఒకటి. మండపాలు, గరుడ కల్యాణమండపాలు, ప్రాకారమూ, గోపురమూ అన్నీ కలసిన ఒక బ్రహ్మాండమైన సముదాయంగా నిర్మించాలనుకుని ఆ విఖ్యాత సార్వభౌముడు శ్రీకృష్ణ దేవరాయలు 1513వ సంవత్సరంలో ప్రారంభిం చాడు. కానీ 1565లో సామ్రాజ్యం విచ్ఛిన్నమైయ్యేవరకూ పూర్తికాలేదు. ఆ తర్వాత విజయ నగర సామ్రాజ్యాన్ని రాయలు అనంతపురం జిల్లా పెనుకొండ కు మార్చాడు.

Vittala-templeవిఠలాలయం సముదాయం చుట్టూ ప్రాకారం ఉంది. ఈ ప్రాకారానికి తూర్పున, దక్షిణాన, ఉత్తరాన గోపుర ద్వారాలున్నాయి. మండపాలు, ఉప మండపాలు, చుట్టూ పరివార ఆయతనాలున్నాయి. అన్నీ విజయనగర ఆలయాలలో మాదిరిగా ఇక్కడి మండపాలు, గోపురాలు చాలా పెద్దవి. దాదాపుగా అన్నీ వెయ్యి స్తంభాల మండపాలే. కుడ్య స్తంభాల మధ్య భాగాలు నాజూకుగా ఉన్నాయి. కొన్ని చోట్ల ఒకే రాతి నుంచి చెక్కిన మధ్య స్తంభమూ, చుట్టూ ఉప స్తంభాలూ లేదా జంతువులు ఉన్నాయి. ఈ స్తంభాలమీద మీటితే ‘సరిగమపదనిస’ స్వరాలు పలుకుతాయట! ఇప్పటికికూడా! అయితే వచ్చిన యాత్రికులంతా ఆ స్తంభాల మీద రాళ్లతో కొట్టి పరీక్షిస్తున్నారని ఇపుడు కర్నాటక గవర్నమెంటు గట్టి సెక్యూరిటీని ఇక్కడ ఏర్పాటు చేసింది. ఇక్కడే ‘ఏకశిలారథం’ ఒక అత్యద్భుమైన కట్టడం. ఒకేరాతిలో చెక్కిన రథం, పైన రెండు గోపురాలతో అద్భుతంగా చెక్కారు. పైన రెండు గోపురాలు నేడు శిథిలమైనా ఈ ఏకశిలారథం చక్కగా ఉంది. ఈ ఏకశిలా రథాన్ని చూడగానే మనకు ఒక పాట గుర్తుకొస్తుంది…

‘ఏకశిల రథముపై లోకేసు ఒడిలోనే… ఓర చూపుల దేవి ఊరేగిరాగా… రాతి స్తంభాలకే చేతనత్వం కలిగి సరిగమ పదనిస స్వరములే పాడగా…’ అంటున్న ఘంటశాల మన మదిలో మెదులుతాడు..
ఈ ఏక శిలాస్తంభ పరివారాలు విజయనగర రాజుల శైలి విశిష్టతలలో ఒకటి. కొన్ని పాత ఆలయాల వెలుపలి ప్రాకారాల మధ్య బ్రహ్మాండమైన గోపురాలను చేర్చారు. వీటిని ‘రాయ గోపురాలు’ అని పిలుస్తారు. ఇక సూర్యాస్తమయం అవుతుండగా మెల్లగా రూముకు తిరిగి వచ్చాం. రెండో రోజు ఉదయాన్నే టిఫిన్‌ చేసి హంపీ నగరం రెండో వైపునకు బయలు దేరాం.

Enugula-saalaఇక్కడ ఏకశిలతో కట్టిన ‘ఉగ్రపరసింహ’ మూర్తి పెద్ద శిలలో తొలిచారు. పక్కనే ‘బీదలింగ’ మనే శివలింగం ఉంది. ఆ లింగం ప్రతిమ కింద నుండి విరివిగా జల వస్తూ ఆ జల అక్కడి పంటపొలాలకు వెళ్లడం చూస్తాం. తరువాత ‘శ్రీకృష్ణాలయం’ కూడా అక్కడే ఉంది. ఇది చిన్నికృష్ణుని ఆలయం. ఇపుడు పూర్తిగా శిథిలమైపోయి ఉంది. కళింగదేశంపై రాయలు విజయానికి చిహ్నంగా కట్టించాడని ఇక్కడ శాసనం ఉంది. ఈ ఆలయం పరివార ఆలయాలతో, మండపాలతో, స్తంభఋ౎లతో, మాలికలతో, అందమైన గోపురం ఉన్న మనో జ్ఞమైన ఆలయం. అయితే ఇపుడు శిథిలమైనా తప్పక చూడాల్సిందే. గర్భగు డిలో విగ్రహంలేదు. ఈ ఆలయానికి ఎదురుగా పెద్ద వీధి ఉంది. ఈ వీధికి రువైపులా చిన్న చిన్న గదుల్లా కట్టిన రాతికట్టడాలున్నాయి. ఇవి దాదాపు వంద లాది ఉంటాయి. ఇక్కడే ఈ వీధుల్లోనే రత్నాలూ, వజ్రవైఢూర్యాలు రాశులు పోసి అమ్మేవారట!

Tungabhadra-nadi ఇంకా ఇక్కడ చూడాల్సినవి క్వీన్‌బాత్‌ కట్టడం, లోటస్‌ మహల్‌, ఏనుగుల గజ శాల, సరస్వతీ దేవాలయం, పుష్కరిణి, పురావస్తు శాఖవారి మ్యూజియం తప్పక చూడాల్సినవి. మ్యూజియం హంపీ నగరానికి దగ్గరలోని కమలాపురం లో ఉంది. ఇవన్నీ చూసుకొని ఇకరాత్రికి తిరుగు ప్రయాణం అయ్యాం.ఎలా వెళ్లాలి? దేశం నుండి బళ్లారికి విమాన, రైలు బస్‌ సౌకర్యం అన్ని ప్రాంతాలనుండి ఉన్నాయి. బళ్లారి నుండి హోస్పేటకు 60 కిమీ హోస్పేట నుండి హంపి 13 ిమీ ఇక్కడ మొత్తం హంపి నగర సందర్శనకు టూరిస్ట్‌ గైడ్లు విరివిగా ఉన్నారు. ఆటోలు, కార్లు అందుబాటులో ఉన్నాయి. అయితే కొన్ని ప్రాంతాలలోకి కారు ఆటోలు వెళ్లవు. తప్పనిసరిగా ద్విచక్ర వాహనం, సైకిళ్ల మీదనే వెళ్లాలి. వీటిని కూడా అద్దెకు ఇస్తారు ఇక్కడ. ఎక్కువగా విదేశీయులు మనకు తారసప డతారు. వాళ్లంతా సైకిల్‌, ద్విచక్రవాహనంమీద తిరుగుతారు. అలా కూడా మొత్తం చూడొచ్చు. విజయనగర రాజుల మొదటి కోట ‘ఆనెగొంది’ కోటకు వెళ్లాలంటేమాత్రం తుంగభద్ర నదిమీద చిన్న పుట్టీల (గుండ్రంగా ఉండే పడవ లాంటివి) మీద వెళ్లాల్సిందే.
– దామర్ల విజయలక్ష్మి, అనంతపురం

Surya Telugu Daily .

మార్చి 8, 2011 Posted by | చూసొద్దాం | , , | వ్యాఖ్యానించండి

మహిళలను బాధించే గర్భాశయ క్యాన్సర్‌

మహిళలను బాధించే గర్భాశయ క్యాన్సర్‌

మహిళల్లో గర్భాశయ క్యాన్సర్‌ వ్యాధిగ్రస్థుల సంఖ్య ఏటా పెరుగుతూ వస్తోంది. దీనినే ఎండోమెట్రిక్‌ క్యాన్సర్‌ అని అంటారు. ఈ వ్యాధి ఎక్కువగా డబ్బున్న కుటుంబాలలోని మహిళలకు ఎక్కువగా వస్తోంది.వారి జీవనశైలే ఈ వ్యాధి రావడానికి కారణంగా పేర్కొనవచ్చు.

Endometrial-Cancerగర్భాశయ ముఖ ద్వారం క్యాన్సర్‌ వ్యాధిగ్రస్థులతోపాటు గర్భాశయ క్యాన్స ర్‌ వచ్చే మహిళల సంఖ్య క్రమేణా పెరుగుతూ వస్తోంది. మెనోపాజ్‌, పెరి మెనోపాజ్‌ వాళ్లకి ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు పిల్లలు లేని వారిలో ఈ వ్యాధి సాధారణంగా కనిపిస్తుంది. ఒబెసిటీ, బిపి, షుగర్‌ ఉన్న మగువల్లో సైతం ఈ వ్యాధి వచ్చే అవకాశా లున్నాయి. మెనోపాజ్‌లో ఉన్న మహి ళల్లో ఈస్ట్రోజోన్‌ థెరపీ తీసుకుంటే వారిలో కూడా ఈ వ్యాధి కనిపిస్తుంది. ఎక్కువ బ్లీడింగ్‌ జరిగే స్ర్తీలకు ఈ వ్యాధి వచ్చే అవకాశాలున్నాయి. కుటుం బంలోని ఒకరికి ఈ వ్యాధి ఉంటే మరొకరికి సైతం రావచ్చు. గర్భా శయం పొరలు మందంగా ఉన్న వాళ్లలో ఈ వ్యాధి వచ్చే అవకాశాలున్నాయి.

వివిధ రకాలుగా…
ఎండోమెట్రిక్‌ క్యాన్సర్‌ గర్భా శయంలో చిన్న గడ్డల మాదిరిగా ప్రారంభమవుతుంది. ఇందులో మూడు గ్రేడులు ఉంటాయి. ఒకటవ గ్రేడ్‌ను ప్రారంభ దశగా పరిగణిస్తే రెండు, మూడు గ్రేడులను ప్రమాదకరంగా భావిస్తారు. ఈ వ్యాధిని నాలుగు స్టేజ్‌లుగా విభజిస్తారు. మొదటి స్టేజ్‌లో గర్భాశయం లోపలి పొరల్లో వస్తే, రెండవ స్టేజ్‌లో గర్భాశయం మధ్య పొరల్లో(మజిల్స్‌), మూడవ స్టేజ్‌లో గర్భాశయం బయట కూ డా వ్యాధి వస్తుంది. బాగా ముదిరిన తర్వాత వచ్చే నాలుగవ స్టేజ్‌లో గర్భాశయం పక్కన ఉండే ఊపిరితిత్తులు, బ్లాడర్‌ తదితర అవయవాలకు సైతం ఈ వ్యాధి సంక్రమిస్తుంది.

వ్యాధి లక్షణాలు…
గర్భాశయ క్యాన్సర్‌ వచ్చిన మహిళల్లో బ్లీడింగ్‌ ఎక్కువగా ఉంటుంది. పీరి యడ్స్‌ ఆగే ముందు బ్లీడింగ్‌ అవుతుంది. ఈ క్రమంలో ఎక్కువగా రక్తస్రావం అవుతుంటే స్ర్తీలు వెంటనే డాక్టర్‌ను సంప్రదించి చెకప్‌ చేయించుకోవాలి. ఈ వ్యాధి వచ్చిన వారిలో గర్భాశయానికి చీము పట్టవచ్చు. కడుపులో నొప్పిగా ఉంటుంది. జ్వరం, ఒళ్లు నొప్పులు వస్తాయి. బరువు తగ్గడం, ఆకలి లేకపో వడం, ఆయాసం రావడం జరుగుతుంది.

వ్యాధి నిర్ధారణ…
ఎండోమెటల్‌ బయాప్సి ద్వారా వ్యాధి నిర్దారణ చేస్తారు. వ్యాధిగ్రస్థులకు రక్తం, మూత్ర పరీక్షలు నిర్వహిస్తారు. అల్ట్రాసౌండ్‌ పరీక్షలు నిర్వహించి వ్యాధి నిర్దారణ చేస్తారు. ఈ పరీక్షలలో యుటెరస్‌ సైజు పెరిగిందా, గడ్డలు ఉన్నాయా అని తెలు సుకుంటారు. మిగతా ఆర్గాన్స్‌కు ఏమైనా వ్యాధి వ్యాపించిందా అని పరీక్షిస్తారు. అవసరమైతే సీటి స్కాన్‌ చేస్తారు. ఎంఆర్‌ఐ నిర్వహిస్తారు. ఇందులో వ్యాధి యుటెరస్‌కు ఎంత పాకింది. ఎముకలు, ఊపిరితిత్తులకు వ్యాధి సోకిందా అని తెలుసుకుంటారు.

నివారణ…
లావుగా ఉన్న మహిళలు, హార్మోన్ల మార్పిడి, ఈస్ట్రోజన్‌ మార్పిడి చేయించుకున్న మగువలు రెగ్యులర్‌గా డాక్టర్‌ను సంప్రదించి పరీక్షలు నిర్వహించుకోవాలి.వీరికి గర్భాశయ సమస్యలు తీవ్రమైతే యుటిరస్‌ను తీయించుకోవాల్సి ఉంటుంది.

చికిత్స…
ప్రీమా లిగ్నమెంట్‌ స్టేజ్‌లో ఉన్న వ్యాధిగ్రస్థులు రెగ్యులర్‌గా డాక్టర్‌ చేత చెకప్‌ చేయించుకోవాలి. వీరికి అవసరమైతే ప్రొజిస్ట్రీన్‌ హార్మోన్‌ సప్లిమెంట్‌ ఇస్తారు. ప్రొజిస్టరాన్‌ చికిత్స నిర్వహిస్తారు. గర్భాశయం క్యాన్సర్‌ బాగా ముదిరితే యుటిరస్‌ను తీయించుకోవాల్సి ఉంటుంది. ఒకటవ స్టేజ్‌లో ఉన్నవారు యుటిరస్‌, ఓవరీస్‌ తీసివేస్తారు. అవసరమైతే రేడియో థెరపి, కీమా థెరపి చేస్తారు. రెండవ స్టేజ్‌లో ఉన్నవారు రేడియో థెరపీతో పాటు హార్మోన్లను కూడా అందజే స్తారు. కీమో థెరపీ కూడా ఇస్తారు. పీరియడ్స్‌ ఆగిపోయిన మహిళలు రెగ్యులర్‌గా డాక్టర్‌ చేత చెకప్‌ చేయించుకోవాలి. మెనోపాజ్‌లో ఉన్నవారికి మొత్తం స్క్రీనింగ్‌ చేయించు కోవాల్సి ఉంటుంది.

padmarvati

Surya Telugu Daily .

మార్చి 7, 2011 Posted by | ఆరోగ్యం | | వ్యాఖ్యానించండి

సంతాన ప్రాప్తిరస్తు ! సంతానలేమి అంటే…

సంతాన ప్రాప్తిరస్తు ! సంతానలేమి అంటే…

స్ర్తీ సంపూర్ణత్వానికి ప్రతీకగా మాతృత్వాన్ని చెబుతారు. అలాంటి మాతృత్వాన్ని పొందలేని వారెందరో నేడు సమాజంలో ఉన్నారు. ఈ విధమైన సంతానలేమి లోపాలు మహిళల్లోనూ కాకుండా పురుషుల్లోనూ ఉండవచ్చు. లోపం ఎవరిలో ఉన్నా కూడా ఆ లోపాన్ని సరిజేసి సంతానం పొందే భాగ్యాన్ని కలిగించే ఆధునిక చికిత్సలూ నేడు అందుబాటులో ఉన్నాయి. సంతానలేమిపై అపోహలు, కారణాలు, చికిత్స విధానాలు తదితర అంశాలపై ప్రత్యేక కథనం… సంతాన ప్రాప్తిరస్తు.

సంతానలేమి అంటే…
family-planఒక ఏడాది కాలం పాటు ఎలాంటి గర్భనిరోధకాలు వాడకుండా, గర్భధారణ కు ప్రయత్నించి నప్పటి కీ ఓ జంటకు సంతా నం కలగకపోవ డా న్ని లేదా గర్భ దార ణ జరగకపో వడా న్ని సంతాన లేమి గా చెప్పవచ్చు.

సంతానలేమికి కారణాలేంటి?
మహిళలో లేదా పురుషు నిలో లేదా ఇద్ద రి లోనూ ప్రత్యుత్ప త్తి వ్యవస్థలో ఉండే సమస్యలు సంతాన లేమికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. దిగువ పేర్కొన్న అంశాలకు సంబం ధించిన సమస్యలను సంతానలేమికి ముఖ్యకారణాలుగా పేర్కొనవచ్చు.
* పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ
* మహిళ ఫాలోపియన్‌ ట్యూబ్‌లు
* మహిళ గర్భాశయం లేదా సెర్విక్స్‌
*మహిళ రుతుచక్రం
* సాధారణ పరీక్షల్లో వెల్లడి కాని కారణాలు
సంతానలేమి సమస్య అరుదా? సాధారణమా? తీవ్రత ఏ స్థాయిలో ఉంది?
ప్రతీ ఆరు జంటల్లో ఒక జంట ఏదో ఒకస్థాయిలో ఎంతో కొంత మేరకు సంతానలేమి సమస్యతో బాధపడుతూ ఉంటుంది. వీరికి వైద్యసలహా లేదా చికిత్స అవసరమవుతుంది.

సాధారణంగా ఫలదీకరణ ఎలా జరుగుతుంది?
babysపురుషవీర్యకణం అండంతో కలవడాన్ని ఫలదీకరణగా చెప్పవచ్చు. మహిళ ఫాలోపియన్‌ ట్యూబ్‌లలో ఈ ప్రక్రియ చోటు చేసుకుంటుంది. ఫలదీకరణం చెందిన అండం గర్భాశయంలోకి చేరుకుంటుంది. అక్కడి యుటెరిన్‌ లైనింగ్‌లో స్థిరపడుతుంది. గర్భధారణ జరగాలంటే, ఫలదీకరణ చెందిన అండం ఈ విధంగా గర్భాశయాన్ని చేరుకోవాలి. ప్రతీ రుతుచక్రంలోనూ ఒక్కటే అండం విడుదల అవుతుంది. ఆ సమయంలో ఆ అండం ఫలదీకరణం చెందకుండా ఉంటే తిరిగి రుతుచక్రం పూర్తయ్యే వరకూ గర్భధారణ సాధ్యపడదు.

సంతానలేమిని ఏవిధంగా నిర్ధారిస్తారు?
మొదట ఓ జంట మెడికల్‌ హిస్టరీని పరిశీలించడంతో పాటు వారికి వివిధ ఫిజికల్‌ పరీక్షలు నిర్వహించడం ద్వారా సంతాన సాఫల్యతలో ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తిస్తారు. ఈ పరీక్షలు దంపతులిద్దరికీ చేస్తారు. రక్తపరీక్ష, వీర్య విశ్లేషణ, అల్ట్రాసౌండ్‌ పరీక్షలు లేదా మహిళలకు ఎక్స్‌ప్లొరేటరీ సర్జరీ నిర్వహిస్తారు.

మహిళల్లో సంతానలేమి సమస్యను ఏవిధంగా పరిష్కరిస్తారు?
సంతానలేమి సమస్య ఉందని నిర్ధారణ అయిన తరువాత ఏ విధమైన చికిత్స ఎలా, ఎప్పుడు చేయాలన్న ప్రణాళిక రూపొందిస్తారు. కొన్ని సందర్భాల్లో ఓ చిన్న సలహా లేదా కొద్ది పాటి చికిత్సతోనే ఆశించిన ఫలితం దక్కే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో సర్జరీ అవసరం కావచ్చు.

పురుషుల్లో సంతానలేమి సమస్యను ఏవిధంగా పరిష్కరిస్తారు?
పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించిన సమస్యలను చాలా వరకు మందులతో లేదా అవసరమైతే సర్జరీతో పరిష్కరించవచ్చు.

పురుషుల్లో సంతానలేమి సమస్యకు దారి తీసే అంశాలేంటి?
పురుషుడి ఆరోగ్యం, జీవనశైలి ప్రభావం వీర్యం నాణ్యత, పరిమాణంపై ప్రభావం కనబర్చే అవకాశం ఉంది. మద్యం, ధూమపానం, మాదకద్రవ్యాలు, ఒత్తిళ్ళు, పరిసరాల్లో ఉండే విషతుల్యాలు, ఆరోగ్యసమస్యలు, కొన్ని రకాల మందులు, కెమెథెరపీ, వయస్సు లాంటివి పురుషుల్లో సంతానలేమి సమస్యను ప్రభావితం చేస్తాయి.మహిళల్లో సంతానలేమి సమస్యకు దారి తీసే అంశాలేంటి? వయస్సు, ఒత్తిళ్ళు, పోషకాహార లోపం, స్థూలకాయం, బరువు తక్కువగా ఉండడం, ధూమపానం, లైంగికంగా సంక్రమించే వ్యాధులు (ఎస్‌టీడీ), హార్మోన్ల సమస్యలు, ఇతర ఆరోగ్య సమస్యలు మహిళల్లో సంతాన లేమి సమస్యకు దారి తీసే అవకాశం ఉంది.

వయస్సు ఓ మహిళ సంతాన సాఫల్యత అవకాశాన్ని ఏవిధంగా ప్రభావితం చేస్తుంది?
party-time-for-babiesమహిళల్లో అండం నాణ్యత వయస్సు పెరుగుతున్న కొద్దీ క్షీణిస్తుంది. ఏళ్ళు పైబడుతున్న కొద్దీ అండం ఫలదీ కరణం చెందే శక్తి కూడా సన్నగిల్లుతుంటుంది. అండం విడుదలలోనూ సమస్యలు ఎదురవుతుంటాయి. రుతు చక్రంలో హార్మోన్లకు సంబంధించిన సమస్యలు ఎదురు కావచ్చు. వయస్సు పెరుగుతున్న కొద్దీ అబార్షన్‌ అయ్యే అవకాశాలు అధికం అవుతుంటాయి.

సంతానలేమి సమస్యలు వారసత్వంగా వచ్చే అవకాశం ఉందా?
సంతానలేమి సమస్యలు చాలావరకు వారసత్వా నికి సంబంధిం చినవి కావు.
సంతానలేమి చికిత్సలు ఎంత వరకు విజయవంత మవుతాయి?
చిక్సిత పొందతున్న దంపతుల్లో చాలామం ది ఔషధాలు, సర్జరీల్లో మెరుగుదల, ఏఆర్‌టీ (అసిస్టెడ్‌ రిప్రొడక్టివ్‌ టెక్నాల జీ) లాంటి వాటివల్ల గర్భధారణ పొందే అవకాశం ఉంది. ఏఆర్‌టీ కింద చికిత్స పొందే దంపతుల్లో సక్సెట్‌ రేటు బాగా వృద్ధి చెందింది. ఏఆర్‌టీలో విజయాన్ని ప్రభావితం చేసే అం శాలు ఎన్నో ఉంటాయి. ఐయూఐలో 15 -20 శా తం దాకా, ఐవీఎఫ్‌లో 40-50 శాతం దాకా విజయా వకాశాలు ఉంటాయి.

దంపతుల్లో మహిళ వయస్సు 34 ఏళ్ళ కంటే తక్కువగా ఉండి, 12 నెలల పాటు ఎలాంటి గర్భ నిరో ధక సాధనాలు ఉపయోగించనప్పటికీ, గర్భం దాల్చకుం టే సంతానలేమి సమస్య ఉన్నట్లుగా భావిస్తారు. మహిళ వయ స్సు 35ఏళ్ళు దాటిన సందర్భంలో వైద్యులను సంప్రదించేం దుకు 6 నెలల సమయానికి మించి వేచిచూడ కూడదు.(వయస్సు పెరుగుతున్న కొద్దీ అండం నాణ్యత లోపిస్తుంటుంది.)

చాలావరకు, ఎలాంటి గర్భనిరోధకాలు ఉపయోగించకుండా సజావుగా దాంపత్య సంబధాలు కలిగి ఉంటే ప్రతీ 100 జంటల్లో 84 జంటలు ఏడాదిలోగానే గర్భం దాల్చే అవకాశం ఉంటుంది. ఏడాదిలో గాకున్నా, రెండేళ్ళ లోపు గర్భం దాల్చే అవకాశం 92 జంటల్లో ఉంటుంది. 35 ఏళ్ళు దాటిన మహిళల్లో, గర్భ ధారణ కోసం ప్రయత్నిస్తున్న మూడేళ్ళలోగా గర్భం దాల్చే అవకాశం నూటికి 94 మందిలో ఉంటుంది. 38 ఏళ్ళు దాటితే మాత్రం నూటికి 77 మంది మా త్రమే గర్భం దాల్చగలుగుతారు. బ్రిటన్‌లో ఐవీఎఫ్‌ చికిత్సను ఆశ్రయించే దం పతుల్లో సగం జంటల్లో పురుషుడు సంతానలేమి సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్నట్లుగా తెలుస్తోంది. స్వీడన్‌లో కనీసం 10 శాతం దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు.

ప్రధాన కారణాలు
జన్యుకారణాలు: క్రోమోజోము ల అమరికలో మార్పులు
సాధారణ కారణాలు: డయాబెటి స్‌ మెలిటస్‌ (టైప్‌2 డయాబెటిస్‌), థైరాయిడ్‌ సంబంధితాలు, అడ్రెనల్‌ (కిడ్నీల పైభాగంలో ఉండి వివిధ హా ర్మోన్లను ఉత్పత్తి చేసే గ్రంథి)వ్యాధి

హైపొథాలమిక్‌ పిట్యుటరీ సంబంధితం: మెదడు దిగువ భాగంలో ఉండే పిట్యుటరీ గ్రంథి ఉత్పత్తి చేసే 8 రకాల హార్మోన్లలో ఏదేని ఒక దాని ఉత్పత్తి తగ్గిపోవడం,
కాల్‌మాన్‌ సిండ్రోమ్‌: సెక్స్‌ హార్మోన్లను ఉత్పత్తి చేసే గ్రంథుల పనితీరు తగ్గిపోవడం. రక్తంలో ప్రోలాక్టిన్‌ పరిమాణం అధికంగా ఉండడం.
పరిసరాల ప్రభావం: వివిధ రకాల విషతుల్యాలు, రసాయనాలకు చేరువలో ఉండడం.
ధూమపానంతో చేటు:పొగతాగని వారితో పోలిస్తే పొగ తాగే వారు 60 శాతం అధికంగా సంతానలేమి సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉందని తెలుస్తోంది. పొగతాగే వారిలో ఐవీఎఫ్‌ ద్వారా శిశు వును పొందే అవ కాశం 34 శాతం తగ్గిపోతుం ది. గర్భస్రావం అయ్యే అవకాశాలు 30 శాతం పెరుగుతాయి.
8. జన్యుఉత్పరివర్తనాలు: మానవ డీఎన్‌ఏలో చోటు చేసుకునే మ్యుటేషన్స్‌ (ఉత్పర్తివర్తనం) కూడా సంతానలేమి సమస్యలకు దారి తీయ గలదు.
మహిళల్లో సంతానలేమి: 35 ఏళ్ళు పై బడిన మహిళ ఆరునెలలు ప్రయత్నిం చి నా గర్భం దాల్చని పక్షంలో మరో ఏడాది అం టూ వేచి చూడకుండా వెంటనే వైద్యు లను సంప్రదించడం ఉత్తమం. ఆమెకు అప్పటికే గర్భాశయ సమస్యలేవైనా ఉ న్నా, భాగస్వామికి స్పెర్మ్‌కౌంట్‌ (వీర్య కణాల సంఖ్య) తక్కువ ఉందని అప్ప టికే తెలిసినా మరింత ఆలస్యం చేయ కుండా డాక్టర్‌ను సంప్రదించాలి. 40 ఏ ళ్ళు దాటిన మహిళలు మూడు నెలల పాటు ప్రయత్నించినా గర్భందాల్చని పక్షంలో వెను వెంటనే నిర్ధారణ పరీక్షలు, చికిత్స ప్రారంభించాలి.
మహిళల్లో సంతానలేమికి కారణాలు:
రుతుచక్రం, ఆరోగ్యదాయక అండాల ఉత్పత్తి: రుతుచక్రం ముగియడానికి 14 రోజులు ముందుగా అండాశయం నుంచి అండం విడుదల అవుతుంది. మహిళ గర్భం దాల్చేందుకు అనువైన సమయమిది.
అనువైన వీర్యం:వృషణాల్లో వీర్యం వృద్ధి చెంది ఉత్పత్తి అయ్యేందుకు 64 రోజులు పడుతుంది. స్ఖలనం సందర్భంగా వీర్యం వెలుపలికి వస్తుంది. ఆ వీర్యంలో 100 మిలియన్ల దాకా వీర్యకణాలుంటాయి. ఇందులో కొన్ని వందలు మాత్రమే ఫాలోపియన్‌ ట్యూబ్‌ (స్ర్తీ బీజవాహిక) లను చేరుకోగలుగుతాయి.బీజవాహికల గుండా పయనించి వీర్యకణాలను చేరుకునే శక్తి అండానికి ఉండడంసెర్విక్స్‌ ద్వారా పయనించి అండాన్ని చేరుకునే శక్తి వీర్యకణాలకు ఉండడం
అండాన్ని ఫలదీకరించే శక్తి వీర్యానికి ఉండడం: వీర్యకణాల సంఖ్య, నాణ్యతను బట్టి ఇది ఆధారపడి ఉంటుంది. వీర్యకణాల నాణ్యత అంటే ముందుకు వెళ్ళేందుకు వీర్య కణాలకు ఉండే కదలిక శక్తి, ఆకారం.ఫలదీకరణ చెందిన అండం ఆరోగ్య వంతమైన పిండం గా మారి గర్భాశ యంలో నిలదొక్కు కోగలుగుతుంది.

durga-raoSurya Telugu Daily .

మార్చి 7, 2011 Posted by | ఆరోగ్యం | 1 వ్యాఖ్య

కిడ్నీలను కాపాడుకుంటే మనం క్షేమం… మార్చి 10న వరల్డ్‌ కిడ్నీ డే

కిడ్నీలను కాపాడుకుంటే మనం క్షేమం… మార్చి 10న వరల్డ్‌ కిడ్నీ డే

మన దేశంలో కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నవారు 20లక్షల మంది వరకు ఉన్నారని ఒక అంచనా. ఏటా అదనంగా రెండు లక్షల మంది కిడ్నీ వ్యాధులకు గురవుతున్నారని, మన రాష్ట్రం విషయానికి వస్తే రాజధాని నగరంలో 30వేల మంది నుంచి 40 వేల మంది కిడ్నీ వ్యాధిగ్రస్థుకు డయాలసిస్‌ అవసరం అవుతున్నది. ఈ కిడ్నీ సమస్యలకు ప్రధానంగా మధుమేహం (40శాతం), హైబిపి (30శాతం) కారణమవుతున్నాయి. వీటిని అదుపులో ఉంచజీుకుంటే మూత్రపిండాలు చాలా వరకు కాపాడుకోవచ్చు.

Kidney-Picturనిరంతరం రక్తంలోని వ్యర్ధాలను వడకడుతూ.. మూత్ర పిండాలు మన శరీరంలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంటాయి. వీటిని జాగ్రత్తగా కాపాడుకోవడం ప్రాణావసరం. ఒకసారి మూత్రపిండం పనితీరు మందగించి అది విఫలమవటం ఆరంభమైందంటే దాన్ని పూర్తిగా నయం చేయటం కష్టం. పైగా చికిత్సకు ఎంతో ఖర్చు అవుతుంది. మూత్రపిండం పూర్తిగా విఫలమైతే కృత్రిమంగా రక్తాన్ని శుద్ధి చేసుకుంటూ ఉండక తప్పదు. ఈ ‘డయాలసిస్‌’ కోసం నెలకు సుమారు రూ.4-5వేలు ఖర్చు అవుతాయి. అంతేకాకుండా ఇతరత్రా సమస్యలు ఏర్పడతాయి. చికిత్స తీసుకున్నా కిడ్నీ తిరిగి సమర్ధంగా మారదు.

kidney_stonesగుండె జబ్బులు, అవయవాలు దెబ్బతినటం వంటివీ మొదలవుతాయి. పోనీ దెబ్బతిన్న మూత్రపిండాన్ని మార్పిడి చేయించుకోవాలంటే కిడ్నీ దాతలు దొరకటం కష్టం. ఆపరేషన్‌ పెద్ద ప్రయత్నమనుకుంటే ఇక ఆ రత్వాత జీవితాంతం వేసుకోవాల్సిన మందులకూ ఖర్చు చాలా ఎక్కువ అవుతుంది. ఎన్నో ఇబ్బందులు, దుష్ర్పభావాలు. ఇంత ఖర్చు చేసి చికిత్స తీసుకున్నా జీవనకాలమూ తగ్గవచ్చు. ఇలాంటి ప్రమాదాలన్నీ దరిచేరకుండా ఉండాలంటే ముందే మేల్కొని, అసలు కిడ్నీలు దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకోవటం మంచిది.

మన జీవనశైలి మార్పులే కిడ్నీలకు సెగ:
Kidney-Pictureమన దేశంలో మధుమేహం ఎంత విపరీతంగా విస్తరిస్తోందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2015 నాటికి వీరి సంఖ్య రెట్టింపు కావచ్చని అంచనాలు చెబుతున్నాయి. ఈ మధుమేహంతో పాటే మూత్రపిండాల వైఫల్యం కేసులు పెరుగుతున్నాయి. టైప్‌-1 మధుమేహ బాధితుల్లో 10-30శాతం, టైప్‌-2 మధుమేహుల్లో 40శాతం మంది కిడ్నీ సమస్యల బారినపడే అవకాశం ఉంది. ఒకసారి ఈ మూత్రపిండాల సమస్య మొదలైందంటే.. దాన్ని పూర్తిగా నయం చేయటం కష్టం. అందుకే సమస్యను తొలిదశలో గుర్తిస్తే దాన్ని ముదరకుండా నిలువరించే అవకాశం ఉంది. అందుకే మధుమేహులంతా కిడ్నీల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. సాధారణ ఆరోగ్యవంతులు అసలు మధుమేహం బారినపడకుండా చూసుకోవాలి.

కిడ్నీల పరిరక్షణకు తేలికైన పరీక్షలు
bobrekkalpfotomanటైప్‌-1 రకం బాధితులు మధుమేహం బారినపడిన ఐదేళ్ళ నుంచి ప్రతి ఏటా కిడ్నీ సమస్యలు వస్తున్నాయేమో పరీక్షించుకోవటం మంచిది. టైప్‌- 3 మధుమేహులైతే దాన్ని గుర్తించిన తక్షణమే కిడ్నీ పనితీరు తెలుసుకునే పరీక్షలు చేయించుకోవాలి. ఆ తర్వాత కనీసం ఏడాదికి ఒకసారైనా క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. కిడ్నీ సమస్యలేమైనా తల ఎత్తుతున్నాయా? అన్నది తేలికైన పరీక్షల ద్వారా చాలా ముందుగానే గుర్తించవచ్చు.

1. మూత్రంలో అల్బుమిన్‌:అల్బుమిన్‌ అనేది ఒక రకం ప్రోటీను. మూత్రంలో ఈ సుద్ద ఎక్కువగా పోతోందంటే కిడ్నీల వడపోత సామర్ధ్యం తగ్గిపోతున్నట్టే. అందుకే ప్రతి ఏటా తప్పనిసరిగా ఈ పరీక్ష చేయించుకోవాల్సిందే. దీని ద్వారా కిడ్నీ సమస్యను గుర్తించవచ్చు.

2. రక్తంలో సిరమ్‌ క్రియాటిన్‌:మన కిడ్నీల వడపోత సామర్ధ్యం ఎలా ఉందో చెప్పేందుకు ఈ పరీక్ష కీలకం. దీని ఆధారంగా వడపోత సామర్ధ్యాన్ని ( ఎస్టిమేటెడ్‌ గ్లోమెరూలార్‌ ఫిల్టరేషన్‌ రేట్‌-ఈజీఎఫ్‌ఆర్‌(ను లెక్కించి… కిడ్నీల సమస్య తలెత్తే అవకాశం ఎంతవరకూ ఉందన్నదనే అంచనా వేస్తారు. సాధారణంగా ఇది 110 మి.లీ. వరకూ ఉంటుంది. ఇది 60 మి.లీ.కన్నా తక్కువుంటే మూత్రపిండాల సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువ. కేవలం క్రియాటినైన్‌ పరీక్ష చేయించుకుంటే సరిపోదు. కిడ్నీ 50శాతం దెబ్బతినే వరకూ కూడా సిరమ్‌ క్రియాటినైన్‌ పెరగకపోవచ్చు. కాబట్టి ‘ఈజీఎఫ్‌ఆర్‌’ను చూసుకోవటం ముఖ్యం. సీరమ్‌ క్రియాటినైన్‌ పరీక్షించి దానితో పాటు వయసు, బరువు, ఎత్తు వంటి ప్రమాణాల ఆధారంగా ‘ఈజీఎఫ్‌ఆర్‌’ లెక్కిస్తారు.

కిడ్నీలను కాపాడుకోవాలంటే?
మధుమేహం, అధిక రక్తపోటు కచ్చితంగా నియంత్రణలో ఉంచుకోవాలి. మధుమేహులు- హెచ్‌బిఎ 1సి (గ్లైకాసిలేటెడ్‌ హిమోగ్లోబిన్‌) పరీక్ష ఫలితం 7కన్నా తక్కువ ఉండేలా కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది గత మూడు నెలల సమయంలో మధుమేహం కచ్చితంగా అదుపులో ఉందా లేదా? అని చెప్పే పరీక్ష. మధుమేహం, హైబీపీ రెండూ ఒకదానికి ఒకటి తోడై.. చివరికి కిడ్నీలను దెబ్బతీసే స్థాయికి చేరకుంటాయి. అందుకే రక్తపోటును 130/80 కంటే తక్కువే ఉండేలా చూసుకోవాలి.రక్తంలో కొలెస్ట్రాల్‌ పెరగకుండా చూసుకోవాలి. అలాగే రక్తహీనత తలెత్తకుండా చూసుకోవాలి.మూత్రంలో సుద్ద పోతుంటే వెంటనే గుర్తించి తక్షణం చికిత్స తీసుకోవాలి. అందుకే తరచూ పరీక్షలు చేయించుకోవటం ముఖ్యం.
sirdhardoc

Surya Telugu Daily .

మార్చి 7, 2011 Posted by | ఆరోగ్యం | | 2 వ్యాఖ్యలు

మెరిసే శ్వేతాభరణాలు..

మెరిసే శ్వేతాభరణాలు..
బంగారం తరువాత అతివలు ఎంతో ఇష్టపడే వాటిల్లో ముత్యాలకు మొదటి స్థానం ఉంది. బంగారం ధర అమాంతం పెరిగిపోతుండడంతో ప్రస్తుతం మగువలు పెరల్స్‌ జ్యువెలరీపై ఆసక్తి పెంచుకుంటున్నారు. మార్కెట్‌లో డిమాండ్‌ పెరుగుతుండడంతో వీటితో విభిన్న రకాలు, డిజైన్లలో అనేక ముత్యాల ఆభరణాలు మార్కెట్‌లోకి వస్తున్నాయి. కాలేజీలకు వెళ్లే వారినుంచి సామాన్యుల వరకు వీటిని కొనుగోలు చేస్తున్నారు. మెరిసిపోయే ముత్యాలను ధరించి మురిసిపోతున్నారు.

Girl-with-the-Pearlపూర్వకాలంలో ఖరీదైన సహజ ముత్యాలతోనే ఆభరాలను తయారు చేసేవారు. అందువల్ల ఇవి ధనికులు, ఉన్నత కుటుంబాల వరకే పరి మితమయ్యాయి.1900 దశకంలో కృత్రిమ పద్ధతిలో ముత్యాలు తయారు చేయడం కనిపెట్టినప్పటి నుంచి సామాన్యులకు కూడా ఇవి అందుబాటులోకి వచ్చాయి.

ముత్యాల రాజధాని…
మన హైదరాబాద్‌ నగరానికి ముత్యాల రాజధాని అనే పేరు ఎప్పటినుంచో ఉంది. పూర్వపు రోజుల్లో ము త్యాలను రాశులుగా పోసి అమ్మిన ప్రాంతం కాబట్టి ఆ పేరు వచ్చింది. క్రమేపీ నాగరి కత పెరగడంతో వీటి వాడకం తగ్గింది. అయితే ఇప్పుడు ఆధు నిక యువతీ యువకులు ము త్యాల ఆభరణాలను ధరించేం దుకు ఇష్టపడుతున్నారు. బం గారం ధర కొండెక్కి కూర్చో వడం ఒక కారణమైతే ఆర్టిఫిషి యల్‌ పెరల్స్‌తో ఎంతో అందంగా డిజైన్‌ చేసిన ఆభరణాలు, యాక్ససరీస్‌ మార్కెట్‌లోకి రావడం మరొక కారణం. ముత్యాలతో చేసిన ఆభరాణాలంటే అతివలకు ఎంతోఇష్టం. అంతేకాదు మార్కెట్లో వీటికి ఎంతో గిరాకీ కూడా ఉంది. సముద్రపు అడుగుల్లో మాత్రమే లభించే ముత్యాలను 1914 నుంచి మంచినీటి చెరువుల్లో కూడా ముత్యాలను పెంచడం నేర్చుకున్నారు రైతులు. ఇక అప్పటినుంచి ముత్యాల వాడకం పెరిగింది.

చరిత్రలో…
ప్రాచీన ఈజిప్టులో ముత్యాలకు ప్రముఖ స్థానం కల్పించినట్లుగా చరిత్ర చెబు తుంది. అతి ప్రాచీనమైన ముత్యంగా ప్రసిద్ధి గాంచిన ‘జోమాన్‌’ జపాన్‌ దేశా నికి చెందింది. దీనికి 5500 సంవత్సరాల చరిత్ర ఉంది. చైనీయులు కూడా వారి అభరణాలలో ముత్యాలు వాడినట్లుగా 4000 సంవత్సరాల చరి త్ర కలి గిన వారి గ్రంధాలు చెబుతున్నాయి. ప్రాచీన చైనీయుల సంకేత భాషలో ము త్యము స్వచ్ఛతకు, విలువలకు సంకేతంగా భావించేవారు. అప్పటి ప్రభు త్వాలు ముత్యాలను పన్ను రూపంలో చెల్లించడానికి కూడా అనుమతించేవి. ధనవంతులైన వారు చనిపోయినప్పుడు వాని నోట్లో ఒక ముత్యాన్ని ఉంచి ఖననం చేసేవారు. ఇలా అనేక రూపాల్లో పూర్వం ఈ ముత్యాలు వాడుకలో ఉండేవి.

ఉత్సాహం చూపిస్తున్నారు…
‘నేడు బంగారం ధర ఎలా పెరిగిపోతోందో మనందరికీ తెలుసు. అందువల్ల వాటిని కొనేందుకు వెనకడుగు వేస్తున్నారు. వాటికి బదులుగా వన్‌గ్రామ్‌ గో ల్డ్‌ జ్యూవెరీని, ముత్యాలతో చేసిన ఆభరణాలను కొనుగోలుకు ఆసక్తి కనబ రుస్తున్నారు. నేడు పలు రంగులలో, డిజైన్లలో పెరల్స్‌ మార్కెట్‌లో లభిస్తున్నా యి. ధరలు కూడా అందుబాటులో ఉండటం వల్ల ఈ ఆభరణాలను ఎక్కు వగా కొనుగోలుచేస్తున్నాను. మేమే కాదు మా కాలనీలోని చాలా మంది పెర ల్స్‌ జ్యువెరీనే కొనేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు’ అని కార్పొరేట్‌ కంపెనీల ప్రాజెక్ట్‌ మేనేజర్‌గా పనిచేస్తున్న సుధ అన్నారు. ఇక జ్యూయలరీ డిజైనర్లు మగువల డిమాండ్‌ మేరకు ప్రత్యేకంగా అందమైన డిజైన్లలో పెరల్స్‌ జ్యూయలరీని రూపొందిస్తున్నారు.

మూడురకాలుగా…
స్వాతి కార్తె తొలకరి చినుకు ముత్యపుచిప్పలో పడితే ముత్యంగా మారుతుం దని అందరం భావిస్తుంటాం. శాస్ర్తీయ భాషలో ‘ఆయిస్టర్‌’ అనే గుల్ల కలిగిన కవచం ఎక్కువగా సముద్రాలలో ఉంటుంది. ఈ కవచంలో నీటి బిందువు, ధూళి, ఇసుక రేణువు పడితే క్రమేనా దాని చుట్టూ గట్టిపొరలు పొరలుగా ఏర్పడుతుంది. దీన్నే మనం ముత్యంగా వ్యవహరిస్తాం. ప్రస్తుతం ఈ ము త్యాలను మూడు రకాలుగా వర్గీకరించవచ్చు. ఇవి సహజముత్యాలు (నేచు రల్‌ పెరల్స్‌), సాగుచేసిన ముత్యాలు (కల్చర్డ్‌ పెరల్స్‌), అనుకరణ ముత్యాలు (ఇమిటేషన్‌ పెరల్స్‌)గా చెప్పుకోవచ్చు.

సహజ ముత్యాలు…
పేరుకు తగ్గట్టుగానే ఇవి ఎవరిచేతనైనా పెంచబడకుండా వాటంతట అవే తయారవుతాయి. ఇప్పటికీ చాలా చోట్ల ముత్యాలు సహజంగానే ఏర్పడు తుంటాయి. కానీ వీటిని కనుగొనాలంటే ఎక్కడో సముద్రపు అడుగు భాగాన వెతకాల్సిందే. ఇప్పట్లో సహజ ముత్యాలను సంపాదించి ఓ హారాన్ని తయా రుచేయాలంటే దాదాపు అసాధ్యమైన పని. సముద్రాలలో సహజంగా తయా రైన ముత్యాలు సాధారణంగా నిర్ధిష్ట ఆకారాన్ని కలిగిఉండవు. ఇంకా ధర కూ డా చాలా ఎక్కువగా ఉంటాయి. ధనిక కుటుంబాలు కూడా ప్రస్తుతం ఆర్టి ఫిషియల్‌ పెరల్స్‌పైనే మక్కువ చూపుతున్నారు.

అందుబాటులోకి తీసుకు వచ్చారు…
ముత్యాలను ధరించాలనే ఆసక్తి ఎక్కువైన సమయంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సహజ పద్ధతికి దగ్గరగా వాణిజ్య స్థాయిలో ముత్యాల సాగు అందుబాటులోి తీసుకొచ్చారు. 1914 వ సంవత్సరం నుంచి రైతులు మం చినీటి గుంటల్లో కూడా ముత్యాలను పెంచడం ప్రారంభించారు. ఇక అప్పటి నుంచి మధ్యతరగతి, సామాన్యులకు కూడా ఇవి అందుబాటులోకి వచ్చా యి. ఇవి కల్చర్డ్‌ పెరల్స్‌. తరువాత ఫ్యారీల్లో తయారుచేసే ముత్యాలు మా ర్కెట్‌లోకి వచ్చాయి. ప్లాస్టిక్‌, ఫైబర్‌ వంటి పదార్ధాలతో తయారుచేసే అను కరణ ముత్యాలూ వచ్చాయి. ఎక్కడి నుంచి వచ్చినా ఎలా ఏర్పడినా ఇవి తయారయ్యేది మాత్రం కాల్షియం కార్బోనేట్‌ అనే పదార్థం తోనే. ఇవి గుండ్రంగా, కొన్ని ద్రవ బిందువుల ఆకారంలోనూ, కొన్ని అండాకారంలోనూ ఉంటాయి. వీటిలో గుండ్రంగా ఉన్నవి, బిందువు ఆకారంలో ఉ న్నవి ఎక్కువ ధర పలుకు తాయి.

అనేక రంగులలో…
jwellaryladyసహజంగా లభించే ముత్యాలు తెలుపు రంగులోనే ఉంటాయి. కానీ ఇప్పుడు రైతులు పసుపు, ఆకుపచ్చ, నీలం, నలుపు, గులాబీ, బ్రౌన్‌ ఇంకా పర్పుల్‌ కలర్‌లలో రూపొం దిస్తున్నారు. దాంతో ముత్యాల తో ఆభరణాలను తయారుచేసే వారికి కొత్త కొ త్త డిజైన్లతో తయారు చేసేందుకు ఎక్కువ అవకాశాలు కలిగాయి. సరికొత్త మోడల్స్‌తో నగలను రూపొందించేందుకు మార్గం సులువయ్యింది.

పలు రకాలు…
ముత్యాలతో హారాలు, ఇయర్‌్‌రింగ్స్‌ వంటి ఆభరణాలే కాకుండా బ్రేస్‌లేట్స్‌, బ్రూచ్‌, చేతి ఉంగరాలు, వాచీలు, లాకెట్‌ వంటి యాక్ససరీస్‌ను కూడా తయారుచేస్త్తున్నారు. ఇంతకు మునుపు అతివలు ధరించేం
దుకు వీలుగా ఉండేవాటినే తయారు చేసేవారు. ఇప్పుడు మగవారు కూడా ధరించేందుకు వీలైన ఆభరణాలను, డిజైన్లను కొత్తగా రూపొందిస్తున్నారు. వాచీలు, ఉంగరాలు, లాకెట్‌, బ్రేస్‌లేట్స్‌ వంటి వాడిని ఎంతో నూతనంగా డిజైన్‌ చేస్తున్నారు. చీరలు పార్టీవేర్‌ దుస్తులకు అనుగుణంగా ఇవి తయారవుతున్నాయి.

Surya Telugu Daily.

మార్చి 6, 2011 Posted by | అతివల కోసం | | 1 వ్యాఖ్య

అందమైన గవ్వలు…

అందమైన గవ్వలు…
గవ్వలు అందానికి మారుపేరు. కొన్ని గవ్వలు, ఆల్చిప్పల అందం మనల్ని కట్టిపడేస్తుంది. మరికొన్ని గవ్వలు రత్న మాణిక్యాల కన్నా ఖరీదైనవి. ఇవి మానవ జాతిని కొన్ని వేల సంవత్సరాలుగా అబ్బుర పరుస్తూనే ఉన్నాయి. వాటిలో ఉన్నది కేవలం సున్నమే (కాల్షియం) కావచ్చు. కానీ వాటి ఆకారాలు, రంగులు సృష్టిలోని అద్భుత కళాఖండాలకు ఏమాత్రం తీసిపోవు. నత్తలు తదితర రకాల జీవులు ఈ గవ్వలను ఆ రూపంలో తయారు చేస్తాయి. గవ్వలు మానవుడిని ఎప్పుడూ ఆకట్టుకుంటూనే ఉన్నాయి. పూర్వకాలం వీటిని కరెన్సీగా కూడా ఉపయోగించారు. ప్రస్తుతం అలంకరణ సామాగ్రిగా, సంగీత వాయిద్యాలుగా వీటిని ఉపయోగిస్తున్నారు. ఎంతో మందికి అందమైన గవ్వలను, ఆల్చిప్పలను సేకరిండం హాబీగా ఉంటుంది.

seashellsమనసుపెట్టి చూడాలేగానీ ప్రకృతిలో ప్రతిదీ అందంగానే ఉంటుం ది. అందులో సముద్రతీరాలలో దొరికే గవ్వలు ప్రముఖంగా చెప్పు కోవచ్చు. రకరాల ఆకృతులతో ఎంతో అందంగా, చూడముచ్చటగా ఉండే కొన్ని ప్రత్యేకమైన గవ్వలు (సీషెల్స్‌ ) బంగారం, రత్నాలకన్నా ఎంతో విలువైనవి. వీటిని గృహా లంకరణకు ఉపయోగిస్తే ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. ఈ నవీన కాలంలో కూ డా చాలా మంది ఇళ్లల్లో ఇవి కనిపిస్తుంటాయి. అనాదిగా ఇవి అందర్నీ ఆట్టు కుంటూనే ఉన్నాయి. మెక్సికో దేవాల యాల్లో, రోమన్‌ పాత్రల్లో పునర్వికాస దశ నాటి శిలా ప్రతిమల్లో వీటిని అలం కరణ సా మా గ్రిగా వినియో గించే వా రు. ఇప్పటి కీ వీటి వాడ కం పెరుగుతూనే ఉంది అనడానికి మాల్స్‌ లో ప్రత్యక్షమవుతున్న అందమైన గవ్వలే ఆధారం.

గట్టిగా ఉంటాయి…
సముద్రాలలో దొరికే గవ్వలు చాలా గట్టిగా ఉంటాయి. వెన్నముకలేని సముద్ర జీవుల బాహ్యా అస్థిపంజరమే గవ్వలేదా అల్చిప్ప. ఈ గవ్వలు మృదువైన శరీరం గల సముద్ర జీవులకు కవచాలుగా ఉంటాయి. నత్తల లాంటి శరీరం కల జీవుల నుండి ఈ గవ్వలు ఎక్కువగా తయారవుతూ ఉంటాయి. ఇవి సముద్రజలాల్లోనూ , సముద్ర తీరంలోనూ లభ్యమవుతాయి. నత్తలు, పీతల పెంకులు, పగడాలవలే గవ్వలుకూడా కాల్షియం కార్బొనేట్‌తో తయారవుతాయి. గుడ్డు పొదిగి నత్తగా ఉన్నప్పుడే వాటి చుట్టూ చిన్న పెంకు ఉంటుంది. పెంకు అంచుల్లో నత్తలు గవ్వలు తయారుకావడానికి అవసరమైన కొత్త పదార్థం తయారు చేస్తుంటాయి. నత్త పరి మాణం పెరిగే కొద్దీ ఈ పెంకు కూడా పెరుగుతూ ఉంటుంది. ఒక్కో జాతికి చెందిన జీవి ఒక్కోరకమైన గవ్వను తయారుచేస్తుంది. ఇది వాతావరణం, శీతోష్ణస్థితి, పర్యావరణం, జన్యువులు మొదలైన వాటిపై గవ్వల రూపు రేఖలు ఆధారపడి ఉంటాయి. ఒక పరాన్న జీవి లేదా మరో వస్తువు లాంటిది నత్తకు తగిలి దానిని ఆ నత్త వదిలించుకోలేక పోతే ఆ పరాన్న జీవి లేదా పదార్థం మీద కాల్షియం కార్బొ నేట్‌, మాంసకృ త్తులు ఆవరిస్తాయి. అప్పుడు ముత్యాలు తయారవుతాయి. పాత గవ్వను, ఆల్చిప్పను తెల్లని వెనిగర్‌లో ఉంచితే అది పగిలి చివరకు బొగ్గుపులుసు వాయువుగా వెలువడుతుంది. దీన్ని బట్టి అది కాల్షియం కార్బోనేట్‌ ద్వారా తయా రైందని తెలుసుకోవచ్చు.

సంగీత పరికరాలుగా…
seashells1సముద్ర గవ్వలను, శంఖువులను సంగీత వాయిద్యాలుగా కూడా ఉపయోగిస్తు న్నారు. పెద్ద పెద్ద శంఖువుల మధ్యలో కన్నం వేసి బాకాలుగా వాడతారు. ఇప్పటికీ చాలా ప్రాంతాలలో వీటిని సంగీత కచేరీలలో సంగీత వాయిద్యంగా ఉపయోగి స్తున్నారు. అంతేకాకుండా చరిత్ర పూర్వ దశ నుంచి కూడా గవ్వలను అలంకరణ సామాగ్రిగా ఉపయోగించే వారని చరిత్ర ద్వారా తెలుస్తోంది. కొన్ని సందర్భాలలో నగలుగా కూడా ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం యువత ధరించే లాకెట్‌లో చిన్న చిన్న గవ్వలను ఉపయోగించడం మనం చూస్తూనే ఉన్నాం.

మార్పిడి వస్తువుగా…
సంగీత వాయిద్యాలు, నగలగానే కాకుండా ఈ గవ్వలను డబ్బులుగా కూడా పూర్వపు రోజులలో ఉపయోగించేవారు. హిందూ మహాసముద్రం, పసిఫిక్‌ మహా సముద్రం దీవుల్లోనూ, ఉత్తర అమెరికా, ఆఫ్రికా, కరేబియన్‌లోనూ గవ్వలను మా రకంగా కూడా ఉపయోగిస్తారు. సైప్రేయియా మొనెటా, మనీకోరీ లాంటి గవ్వలు ఇలా డబ్బురూపంలో ఉపయోగించేవే. ఉత్తర అమెరికాలోని వాయువ్య ప్రాంతా ల్లో డెంటాలియం అనే గవ్వలను డబ్బురూపంలో ఉపయోగించేవారు. సైప్రేయి యా మొనెటా, సైప్రేయియా అన్సులస్‌ అనే గవ్వలను మారకంగా ఉపయోగించి హిందూ మహా సముద్ర, పసిఫిక్‌ సముద్ర తీర ప్రాంతంలోని అనేక దేశాలను వల స రాజ్యాలుగా మార్చిన డచ్‌ ఈస్ట్‌ ఇండియా కంపెనీ వారు విశిష్టమైన జంతువు లను, వజ్రాలను కొని అపార సంపత్తిని సమకూర్చుకున్నారు. ఈ వస్తువులన్నిం టికీ అప్పుడు యూరప్‌లో చాలా విలువ ఉండేది. ఈ రకం గవ్వలు మామూలు వాటికన్నా చాలా గట్టిగా ఉంటాయి.

పనిముట్లుగా…
ఈ గవ్వలు వివిధ ఆకారాల్లో , చలా గట్టిగా ఉంటాయి గనుక వాటిని పనిముట్లు గా కూడా ఉపయోగిస్తారు. కొన్నింటిని పాత్రలుగానూ, మరీ పెద్దగా ఉన్న వాటిని స్నానపు తొట్టెలుగానూ ఉపయోగిస్తారు. చాలా రకాల గవ్వలను బ్లేడ్‌లుగా, గీకే వస్తువులుగా, కత్తులుగా కూడా ఉపయోగిస్తారు. వాటి ఆకారాలను బట్టి పని ముట్లుగా మలచుకుంటారు. కొన్నింటిని దీపపు ప్రమిదలుగా కూడా వాడు తుం టారు. వాటి మధ్యలో ఉండే కాలువ లాంటి దానిలో వత్తి వేసి ప్రమిదగా వినియో గిస్తారు. వీటిలో కాల్షియం కార్బొనేట్‌ అధికంగా ఉంటుంది. దీంతో ఉద్యానవనా ల్లో అల్చిప్పలను భూసారాన్ని పెంపొందించడానికి కూడా ఉపయోగిస్తారు. ఆల్చిప్ప లను పొడిచేసి వాడితే భూసారం పెరుగుతుంది. తీరప్రాంతాలకు చెందిన వారు తప్ప మిగతావారు ప్రస్తుతం ఉపయోగించడం లేదనే చెప్పాలి.

అలంకరణ వస్తువులుగా…
వీటి ఆకారం అందంగా ఉంటుంది. కనక కళాకృతులు, పెయింటిం గ్‌లు, శిల్పాలు మొదలైన వాటిలో ఎక్కువగా వినియోగిస్తారు. రంగు రంగులుగా, బహువర్ణ ప్రకాశకంగా ఉండే గవ్వలను, ఆల్చిప్పలను గోడలను, ఫర్నీచర్‌ను, పెట్టెలను అలంకరించడానికి కూడా వాడ తా రు. అద్దాల ఫ్రేములకు, ఫర్నీచర్స్‌కు అలంకరించడానికి ఇవి ఉపకరిస్తాయి. భా రత్‌లో గవ్వలకు సంప్రదాయకంగా మతాచార వ్యవహారాల్లో ప్రాధాన్యత ఉంది.

హాబీగా…
కొంతమందికి సముద్రపు ఒడ్డున దొరికే అందమైన గవ్వలను సేకరించడం హాబీ గా ఉంటుంది. రకరకాల ఆకృతులు కలిగిన వాటిని ఎంతో ఓపికగా, ఆసక్తిగా సేక రిస్తారు. దగ్గర్లోని బీచ్‌లకు వెళ్లి గవ్వలను, పెంకులను తీసుకొని వాటిని శుభ్రపరచి తమ వద్ద ఎంతో జాగ్రత్తగా దాచుకుంటారు. అలాగే వీటిపై అధ్యయనాలు చేసే వారు కూడా ఉంటారు. చాలా మంది వీటిపై అధ్యయనాలు జరిపి అనేక పుస్తకాలు కూడా రచించారు.

పట్టించుకోవడం లేదు…
SuperStock సంభవించే వైపరిత్యాల రీత్యా అనేక మందికి పర్యావరణం పట్ల ఆసక్తి ఎక్కు వైంది. అనేక మంది పర్యావరణాన్ని రక్షించాలని నిర్ణయించుకుంటున్నారు. ప్ర కృతిని ప్రేమించేవారు, జీవావరణ సంబంధ రంగాల పరిశోధకులు కూడా ఎక్కువ అవుతున్నారు. ఇలాంటి కార్యకలాపాల్లో నేల మీద, మంచినీటి జీవుల మీద మాత్ర మే ఎక్కువ దృష్టి ేంద్రీకరిస్తు‚న్నారు. సముద్ర జీవుల గురించి అంతగా పట్టించు కోవడం లేదు. అందువల్ల అండమాన్‌, నికోబార్‌ దీవుల్లోని ఈ గవ్వలను ఉపయో గించి విడుదల చేసిన నాలుగు తపాలా బిళ్లల ద్వారా సముద్ర జీవావరణంపై దృష్టి మరల్చడానికి ప్రయత్నం చేశారు. ఇది ఏమేరకు పరిశోధకుల దృష్టికి పోతుందో వేచి చూడాలి మరి.

Surya Telugu Daily .

మార్చి 6, 2011 Posted by | ప్రకృతి | 1 వ్యాఖ్య

జీవన‘గీత’లు

జీవన‘గీత’లు
విభిన్న భావాలను ఒలికించే చిత్రకళలో నేడు ఎన్నో రూపాలు ఉన్నాయి. నాటి నుంచి నేటి వరకు ఈ కళ అనేక రకాలుగా రూపాంతరం చెందుతూ చిత్రకారుల సృజనాత్మకతకు అద్దంపడుతోంది. ఇటువంటి వైవిధ్యభరితమైన కళను అందంగా కళ్లకు కట్టినట్టు చూపించారు హైదరాబాద్‌ మాసాబ్‌ట్యాంక్‌లోని జెఎన్‌ఎఎఫ్‌ఎ యూనివర్సిటీ ఫైన్‌ ఆర్ట్‌‌స విభాగానికి చెందిన అప్లయిడ్‌ ఆర్ట్‌ విద్యార్థులు. చిత్రకళలోని విభిన్న రూపాలైన పెయింటింగ్స్‌, డ్రాయింగ్స్‌, మిని ప్రాజెక్ట్‌‌స, ఇలస్ట్రేషన్‌, గ్రాఫిక్‌ డిజైన్స్‌, ఛాయా చిత్రాలు, పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ వర్క్‌‌స, 3డి ఇమాజినేషన్‌ ఆర్ట్‌ వర్క్‌లను తమదైన శైలిలో అందంగా చిత్రీకరించి కళాశాలలో ప్రదర్శనకు ఉంచారు. ఈ ‘అప్లయిడ్‌ ఆర్ట్‌’ చిత్రకళా ప్రదర్శన ఈనెల 11వరకు కొనసాగనుంది.

geethalu2ర్యాగింగ్‌ అమానుషం… అంటూ విద్యార్థులు గీసిన పెయింటింగ్స్‌ అందర్నీ ఆలోచింపచేస్తున్నాయి. ధూమ పానం, గుట్కాలు తీసుకోవడం…ఆరోగ్యానికి హానికరం అంటూ విద్యార్థులు రూపొందించిన ఛాయాచిత్రాలు అద్భుతంగా రూపుదిద్దుకున్నాయి. ఇవేగాకుండా పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత…జాతీయ సమగ్రత వంటి అంశాలపై జెఎన్‌ ఎఎఫ్‌ యూనివర్సిటీ ఫైన్‌ ఆర్ట్‌‌సకు చెందిన అప్లయిడ్‌ ఆర్ట్‌ విద్యా ర్థులు అందమైన ఆర్ట్‌ వర్క్‌లను రూపొందించి తమ సృజనాత్మ కతను చాటుకున్నారు.

అద్భుతంగా రూపుదిద్దుకొని…
geethalu3 ఆర్ట్‌కు చెందిన మొదటి, రెండవ, మూడవ, నాలుగవ సంవత్సరం విద్యార్థులు ఒకే చోట విడి,విడిగా తమ ఆర్ట్‌ వర్క్‌లను ప్రదర్శనకు ఉంచారు. వీటిలో మొదటి సంవత్సరం విద్యార్థులు డ్రాయింగ్స్‌, పెయింటింగ్స్‌, కలర్‌ డిజైనింగ్‌, అప్లికేషన్‌ వర్క్‌లను రూపొందిస్తే, రెండవ సంవత్సరం విద్యార్థులు టైపోగ్రఫీ, డ్రాయిం గ్స్‌, గ్రాఫిక్‌ డిజైనింగ్‌ చిత్రాలను ఏర్పాటుచేశారు. మూడవ సంవ త్సరం విద్యార్థులు ఇలస్ట్రేషన్‌, ప్రోడక్ట్‌ డిజైన్‌, ట్యాగ్స్‌ను రూపొం దిస్తే, నాలుగవ సంవత్సరం విద్యార్థులు అడ్వాన్స్‌డ్‌ ఇలస్ట్రేషన్‌, 3డి ఇమాజినేషన్‌ ఆర్ట్‌ వర్క్‌లను తీర్చిదిద్ది ప్రదర్శనలో ఏర్పాటు చేశారు. విద్యార్థులంతా కలిసి దాదాపు 500 వరకు చిత్ర కళాఖం డాలను ఇక్కడ పొందుపరిచారు.

సృజనాత్మకతకు అద్దం పడుతూ…
geethalu‚విద్యార్థుల వివిధ రకాల చిత్ర కళాఖండాలు వేటికవే ఎంతో ప్రత్యే కంగా రూపుదిద్దుకున్నాయి. వీటిలో టైపోగ్రఫీలో భాగంగా అం దంగా రూపుదిద్దుకున్న చిత్రాలు ఎంతో ఆకర్షణీయంగా తీర్చిది ద్దారు. గ్రాఫిక్‌ డిజైనింగ్‌ చిత్రాల్లో సందేశాత్మక కళాఖండాలు ప్రత్యేకంగా రూపుదిద్దుకున్నాయి. వీటితో పాటు సెలబ్రిటీలు ఐశ్వ ర్యారాయ్‌, సచిన్‌ టెండూల్కర్‌, దేశ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, రా మకృష్ణ పరమహంసల పొర్ట్రెయిట్స్‌ సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. 3డి ఇమాజినేషన్‌లో భాగంగా కంప్యూటర్‌ పై వైవిధ్యభరితంగా రూపొందించిన చిత్ర కళాఖండాలు వేటికవే ఎంతో ప్రత్యేకంగా రూపుదిద్దుకున్నాయి.
విద్యార్థులను ప్రోత్సహించేందుకు..
-వేణు మోహన్‌,
ఫ్యాకల్టీ, అప్లయిడ్‌ ఆర్ట్‌.
అప్లయిడ్‌ ఆర్ట్‌ విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభాపాటవాలను ప్రోత్స హించేందుకు ఈ చిత్రకళా ప్రదర్శనను ఏర్పాటుచేశాం. అప్లయి డ్‌ ఆర్ట్‌ నాలుగు సంవత్సరాల విద్యార్థులు రూపొందించిన చిత్రా లను విడి,విడిగా ప్రదర్శనకు ఉంచాం. ఈ ప్రదర్శన 11వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం 11 నుంచి రాత్రి 8 గంటల వరకు కొ నసాగనుంది. ప్రజలందరూ ఉచితంగా తిలకించే అవకాశాన్ని కల్పించాం.
ఆలోచనలను చిత్రాలుగా…
-దివాకర్‌,
విద్యార్థి, అప్లయిడ్‌ ఆర్ట్‌.
మాలోని భావాలను అందమైన చిత్రాలుగా మలిచాం. ఆలోచ నలకు ప్రతిబింబంగా ఈ ఆర్ట్‌ వర్క్‌లు రూపుదిద్దుకున్నాయి. చిత్ర కళలోని వివిధ శైలులను అందంగా చిత్రీకరించాం. వీటిలో ఆధు నికమైన అడ్వాన్స్‌డ్‌ ఇలస్ట్రేటింగ్‌ చిత్రాలు సందర్శకులను అబ్బు రపరుస్తాయి.
ఆనందంగా ఉంది…
టి.దేవేందరాచారి,
-విద్యార్థి, అప్లయిడ్‌ ఆర్ట్‌
geethalu1 కళాశాలలో చిత్రకళలోని విభిన్న అంశాలను చక్కగా నేర్చుకుంటున్నాం. ఇందులో భాగంగా అందంగా రూపొందించి న ఆర్ట్‌ వర్క్‌లను ప్రదర్శించేందుకు అప్లయిడ్‌ ఆర్ట్‌ చిత్ర కళా ప్రద ర్శనను ఏర్పాటుచేశారు. ఈ ప్రదర్శనలో నా చిత్రాలకు చోటు ద క్కినందుకు ఆనందంగా ఉంది. ఇక భవిష్యత్తులో ఆర్ట్‌ గ్యాలరీని ఏర్పాటుచేయాలన్నది నా కోరిక. ప్రతిభకు అద్దంపడుతూ…
-ఎస్‌.తిరుపతి,
విద్యార్థి, అప్లయిడ్‌ ఆర్ట్‌.
అప్లయిడ్‌ ఆర్ట్‌ ప్రదర్శనలోని పలు చిత్ర కళాఖండాలు వేటికవే ఎం తో ప్రత్యేకంగా రూపుదిద్దుకున్నాయి. వీటిని నాతో పాటు తోటి వి ద్యార్థులు ఎంతో అందంగా చిత్రీకరించారు. సృజనాత్మకతకు అ ద్దంపట్టే ఈ చిత్రాలు సందర్శకులను ఆలోచింపచేసే విధంగా రూపుదిద్దుకున్నాయి.
విభిన్న భావాలు పలికిస్తూ…
-జి.కిషోర్‌,
విద్యార్థి, అప్లయిడ్‌ ఆర్ట్‌.
ఈ ప్రదర్శనలోని విభిన్న చిత్రాలు పలు భావాలను పలికిస్తున్నా యి. ముఖ్యంగా 3డి ఇమాజినేషన్‌ ఆర్ట్‌ వర్క్‌లు సందర్శకులను అబ్బురపరుస్తాయి. వీటిని కంప్యూటర్‌పై అందంగా చిత్రీకరించ డం జరిగింది. ఈ చిత్రాల్లో సృజనాత్మకతను జోడించి అందంగా తీర్చిదిద్దాం.
-ఎస్‌.అనిల్‌ కుమార్‌

Surya Telugu Daily.

మార్చి 6, 2011 Posted by | చూసొద్దాం | , | వ్యాఖ్యానించండి

తెలుగు కథానికల హిమగిరి

తెలుగు కథానికల హిమగిరి
ప్రచారాలకు…ప్రాభవాలకు ఆయన బహుదూరం…సామాజిక సమస్యలే ఆయన కథావస్తువులు…జైలుగోడల మధ్య జీవించే ఖైదీల కథలే ఆయనకు స్పందనలు…జీవితంలో ఆయన ఎప్పుడూ ఇది కావాలని కోరుకోలేదు…గొప్పగా జీవించాలని కోరుకోనూలేదు…డాక్టర్‌ మాత్రం అవ్వాలనుకున్నారు…పరిస్థితులు అనుకూలించకపోవడంతో డాక్టరేట్‌ అయ్యారు…అలాగని ఉన్నత చదువు చదివించలేని కన్నతండ్రిని ఏనాడూ నొచ్చుకోలేదు…కానీ లోలోపల ఆయనలోని నిస్సహాయతకు మదనపడినా…సమాజంపై అహంకారం పెంచుకోలేదు. మమకారమే పంచాలనుకున్నారు. సమకాలీన సమస్యలపై స్పందించిన ఆయన జర్నలిజాన్నే వృత్తిగా…తన కలాన్నే కత్తిగా మలిచి సామ్యవాద భారతానికి సలాంచేస్తూ…నిష్కల్మషంగా పరిశోధనాత్మక కథానికలకు శ్రీకారం చుట్టారు. ఆయనే వర్థమాన రచయిత వేదగిరి రాంబాబు. నాలుగు వందలకు పైగా కథానికలు…ఎనిమిది నవలికలు…ఎనిమిదివేలకు పైగా శీర్షికలు….రాంబాబు డైరెక్టర్‌గా హైద్రాబాద్‌లో 1994లో స్వాతంత్యానంతర తెలుగు కథానిక ఐదు రోజుల సదస్సు జరిపించారు.ఫలితంగా ‘బంగారు కథలు’ సంకలనం వచ్చింది దానికి సంపాదకులు వాకాతి పాండురంగారావు. నేషనల్‌ బుక్‌ ట్రస్ట్‌ (ఎన్‌బిటి, ఢిల్లీ) శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్ర్తి కథానికలకు వేదగిరి రాంబాబు సంపాదకత్వం వహించారు. మన రాష్ట్ర ప్రభుత్వం నేతృత్వంలో కల్చరల్‌ కౌన్సిల్‌ తరపున నిర్వహించిన రెండువారాల నవ రచయితల అధ్యయన శిబిరాలకు రాంబాబు కోఆర్డినేటర్‌గా వ్యవహరించారు.

madhusరాష్టస్థ్రాయి తెలుగు కథా రచయితలనందరినీ ఒకేవేదికపైకి తీసుకువచ్చే ఉద్దేశ్యంతో ఓ వెబ్‌సైట్‌ కూడా ఆయన ఆధ్వర్యంలో రూపుదిద్దుకుంది. హిమగిరి అంత ఎత్తుకు ఎదిగిన ఆయన ఖ్యాతిపర్వంలో మంచుబిందువంత మనం తెలుసుకునేదంతా…‘నేలవిడిచి సామును చేయను…నేను నమ్మిందే నమ్మకంగా చేస్తా’నంటారు…విముక్తి-పెద్ద కథానికల సంపుటి, కస్తూరి-గొలుసు కథానికల సంపుటి, పే(చీ)జీ కథలు (సింగిల్‌ పేజీ కథలు), ఈ ‘కాలమ్‌’ కథలు (కాలమ్‌…కథలు), వయసు కథలు-(ఒకే అంశంతో కూడినవి) ఇలాంటి సాహిత్య వినూత్న ప్రక్రియలెన్నో రాంబాబు ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టారు. అలాగే ఉస్మానియా యూనివర్సిటీ ఎం.ఏ.లో నాలుగు శతాబ్దాల నగరం, కథానికా సదస్సు, కొత్త కథానిక, కథన రంగం వంటి రాంబాబు రచనలు పాఠ్యాంశాలుగా, విద్యార్థుల పరిశోధనాంశాలుగా కొనసాగడం విశేషం.

బాల్యమంతా ఎక్కువగా కృష్ణాజిల్లా తెనాలి తాలూకా చుండూరులోనే…తండ్రి పూర్ణచంద్రరావు ఎకై్సజ్‌ శాఖలో క్రమశిక్షణ కలిగిన ఓ చిరుద్యోగి. ఆయన డ్యూటీలోని సిన్సియారిటీతో కోస్తా ప్రాంతమంతా దాదాపు బదిలీలమీద ఉద్యోగం చేయవలసివుండటంతో రాంబాబు బాల్యం, చదువు అంతా వివిధ ప్రాంతాలలో కొనసాగింది. బాల్యంలో పాఠశాల స్థాయిలో నాటకాలలో కప్పులు సాధించినా… కాలేజీ స్థాయిలో సినిమా ఛాన్సులకోసం ప్రయత్నించాలనుకున్నా తండ్రికి ఇష్టం లేకపోవడంతో ఆ ప్రయత్నాలన్నీ విరమించుకున్నారు రాంబాబు. డిగ్రీ చదువుతున్నప్పుడే సాహిత్యం పట్ల క్రమంగా అభిరుచి పెరిగింది.

యర్రంశెట్టి సాయి రచనలు స్ఫూర్తిదాయకంగా నిలిచాయంటారు. ఆ రోజుల్లో ఆదివిష్ణు, విహారి లాంటి రచయితలు బందరులోని హిందూ కాలేజీలో ఆయనకు సీనియర్లు. యర్రంశెట్టి సాయి,ఆదివిష్ణు, విహారిలు గురుతుల్యులంటారు రాంబాబు. 1974 సంవత్సరంలో రచయితగా డిగ్రీ ఫైనలియర్‌లో చదువుతుండగా ఆంధ్రపత్రిక దీపావళి కథల పోటీకి సరదాగా పంపిన తొలికథ ‘సముద్రం’ బహుమతి సాధించిపెట్టింది. ఇక అదే క్రమంలో అప్పటి ప్రముఖ వారపత్రికలైన యువ, జ్యోతి, స్వాతి, ఆంధ్రపత్రికలకు వరసగా కథలు పంపిస్తుండేవారు. కొంతకాలం ఆలిండియా రేడియోలో అనౌన్సర్‌గా పనిచేశారు.

రేడియో ద్వారా రాంబాబు కథానికలకు మంచి ప్రాచుర్యం కల్పించారు. తర్వాత ఫ్రీలాన్స్‌ జర్నలిస్ట్‌గా వ్యాసాలను వివిధ దినపత్రికలకు పంపించేవారు. కొంతకాలం ఆంధ్రభూమి వారపత్రికలో సీనియర్‌ జర్నలిస్ట్‌గా చేశారు.పల్లకి వారపత్రికకు సంపాదకుడిగా పనిచేశారు. ఎక్కడ ఏ ఉద్యోగం చేసినా తనలోని రచనా వ్యాపంగాన్ని కొనసాగిస్తునే ఉన్నారు. దూరదర్శన్‌ అందుబాటులోకి వచ్చాక దృశ్యమాధ్యమాన్ని సామాజిక అస్త్రంగా మలిచి జనాలలో మార్పుతేవాలని ఆశించారు. ఆ క్రమంలోనే ‘పాపం పసివాడు’ సీరియల్‌ను 52 వారాలపాటు నిరంతరాయంగా దూరదర్శన్‌లో రూపొందించారు. ఎన్నో కష్టనష్టాలకోర్చి దూరదర్శన్‌ టెలీ సీరియల్‌ను తన సొంతఖర్చుతోనే భరించి తీర్చిదిద్దారు.

కమర్షియల్‌గా డబ్బులు మాత్రం ఆశించి ఆ సీరియల్‌ను రూపొందించలేదు. దానికి మాత్రం నిర్మాత, దర్శకునిగా రాష్ట్రప్రభుత్వం తరపున బంగారు నంది అవార్డు దక్కింది. కృష్ణమోహన్‌ టైటిల్‌సాంగ్‌కి కూడా నంది అవార్డు వచ్చింది. ఆ తర్వాత ‘అడవి మనిషి’ సీరియల్‌కు రజిత నంది వచ్చింది. దూరదర్శన్‌లో శైలజాసుమన్‌, రమణీసన్యాల్‌ వంటివారితో కలిసి ఇన్‌హేస్‌ సీరియల్ని చేశారు.తర్వాత దాదాపు రెండు సంవత్సరాలపాటు ఎంతో కష్టపడి జైలు అధికారుల అనుమతి తీసుకుని రాష్ట్రంలోని పలు జైళ్లలో పరిస్థితుల ప్రభావంచేత ఖైదీలుగా శిక్ష అనుభవిస్తున్న ఖైదీల యథార్థగాథలను తీసుకుని వాటినే తన కథావస్తువులుగా చేసుకుని ‘జైలుగోడల మధ్య’ సీరియల్‌గా రూపొం దించారు.

అంతకుముందే అది స్వాతి వారపత్రికలో దాదాపు 60-70 వారాలపాటు పాఠకులను అలరించింది. తన రచనలు ఎక్కడవున్నా చదివి మరీ అభినందనలు తెలుపుతారు సమాచార శాఖలో ఉన్న ఐఏఎస్‌ పార్థసారథిగారు. తెలుగుదేశానికి చెందిన కోడెల శివప్రసాద్‌ కూడా అత్యంత ఇష్టపడే వ్యక్తి తనకు వేదగిరి రాంబాబేనంటారు. రాంబాబు రాసిన ‘జైలుగోడల మధ్య’ పుస్తకరూపంలో దాదాపు చాలా భాషల్లో ప్రచురితమైంది. బాలసాహిత్యంలోనూ బాలల కోసం ఆయన చేసిన కృషి అజరామరం. ఇంద్రధనుస్సు అనే బాలల తొలి వీడియో మేగజైన్‌కు తొలి ఎడిటర్‌గా పనిచేశారు రాంబాబు.

ఇదంతా నాణానికి ఒకవైపే…తెలుగు కథానికలపై వాటిని చిన్నచూపు చూసే వారిపై ఆయన ఇప్పటికీ విమర్శనాస్త్రాలు సంధిస్తునేవున్నారు. ఏనాటికైనా వాటికి కూడా జాతీయస్థాయి గుర్తింపు తేవాలని ఆయన ఉద్దేశం. గ్లోబల్‌ ఆసుపత్రి మీడియా ఇన్‌ఛార్జిగా పనిచేస్తూ తనవద్దకు సాయం కోసం వస్తే వాళ్లకు ఉదారంగా తనకు సాధ్యమైనంతలో వారికి తక్కువ ఖర్చుతోనే వైద్యసేవలు చేయిస్తూ ఇతోధిక సేవలందిస్తున్నారు రాంబాబు. తెలుగు కథానికలపై రాంబాబు తన మనోభావాలను ఇలా పంచుకున్నారు…

కథకి, కథానికకు తేడా ఏ విధంగా గుర్తించవచ్చు?
జ: వస్తువు (కథ) అన్ని సాహిత్య ప్రక్రియల్లో వుంటుంది. పద్యాల్లో చెబితే అటు ప్రబంధాలు, కావ్యాలు కావచ్చు. విస్తృతంగా చెబితే నవల కావచ్చు. సంభాషణ రూపంలో చెబితే నాటకం, నాటిక కావాచ్చు. అదే కథలో ఏకాంశం తీసుకొని క్లుప్తంగా, స్పష్టంగా సూటిగా, వర్ణనలు ఉపోద్ఘాతాలు లేకుండా తర్వాత ఏ జరుగుతుందో తెలుసుకోవాలని ఉత్సుకతని కల్గించే మొదలు, ఒక తీరైన నడక, ఊహించని సంభ్రమాశ్చర్యాలతో ముగించే ’ముగింపు’తో కథను మలిస్తే అది కథానిక అవుతుంది.

కథానికని చదివించే సమయం కన్నా తర్వాత ఆలోచింపజేసే సమయం ఎక్కువ. చాలామంది సరిగ్గా అర్థం చేసుకోలేని విషయం ఏమంటే ’సంపుటి’, ’సంకలనం’ మధ్య భేదం! ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం తెలుగు పాఠ్యాంశంలో భిన్న రచయితల కథానికల్ని వాచికంగా ప్రచురించి ’సంపుటి’ అన్నారు. అది ’సంకలనం’ అవుతుంది గాని సంపుటి కాదు. పిల్లలకే కాదు పెద్దలకైనా తెలియని విషయం బోధించేటప్పుడు సంపూర్ణ అవగాహనతో బోధించాలిగాని తెలిసి తెలియకుండా బోధించడం భవిష్యత్తరానికి, భాషకి చేసే ద్రోహం! కథకి ఆధునికత సమకూరింది గురజాడ చేతుల్లో. లక్షణాలను బట్టి ఆధునిక కథను ’కథానిక’ అనాలి. ఒకే రచయిత/త్రికథానికలకయితే ’సంపుటి’ అనాలి. భిన్న రచయిత/త్రిల కథానికలకయితే ’సంకలనం’ అనాలి. రచయితలకే కాదు పాఠకులకు కూడా తెలియటం అవసరం.

కథానికా సదస్సులు జిల్లాలవారీగా నిర్వహించారు కదా, అక్కడ రచయితల/రచయితల స్పందన ఎలావుంది?
జ: కథానిక చాలా గొప్ప ప్రక్రియ. దానికి ఎంతోమంది అభిమానులున్నారు. ఇలా జిల్లాల వెంట వెళ్తూ వారిని పలకరించినప్పుడు పండగ సంబరాలు కన్పించాయి. అలాగే అందరూ ’కథకులం’ మనది ’కథ కులం’ అనే అభిప్రాయం తప్ప వర్గ, కుల, ప్రాంత భావపరమైన ఆభిప్రాయాల్ని తమ మధ్య గోడవాలుగా ఎవరూ భావించటం లేదు. అందరూ కథానికలో తామూ ఒక భాగం అనుకొంటున్నారు. ఈ భాగాలన్నీ కలిస్తేనే ’కథానిక’ అవుతుంది.

రాష్టస్థ్రాయిలో మీరు జరిపిన కథానిక శతజయంతి ఉత్సవం గురించి చెప్పండి?
జ:వంద కథానికల పూర్తి వివరాలతో ’తెలుగు కథానిక డాట్‌ కామ్‌’ కూడా సిద్ధమైంది. 23 జిల్లాల కథానికా తీరుతెన్నులగూర్చి పోటీపెట్టి వ్యాసాల్ని సేకరించాము. ఈ వ్యాస సంకలనాలను జయంతి సభలో ఆవిష్కరించాం. అలాగే రచయిత(త)ల చిరునామాలతో ఒక డైరెక్టరీని తీసుకొచ్చాం. శ్రావ్య, దృశ్య మాధ్యమాల్లో కూడా ఈ సాహిత్యాన్ని, ఔన్నత్యాన్ని చూపించడానికి కృషి చేస్తున్నాము. రాష్తవ్య్రాప్తంగా ఎవరు, ఎక్కడ ఎటువంటి కథానిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నా తనవంతు సహకారాన్ని అందిస్తుంది శ్రీ వేదగిరి కమ్యూనికేషన్స్‌ . ఇది కథానిక కోసం అవతరించిన సంస్థ. కథానికకే అంకితమైన సంస్థ. ’కథానిక కొత్త కదలిక కదులిక’ అనేది ఈ సంస్థ నినాదం! ఈ కార్యక్రమాలన్నీ ఎవర్నించీ ఎటువంటి సహాయం స్వీకరించలేక కేవలం నా సొంత సంపాదనతో నిర్వహిస్తున్నాను. అదే నాకు తృప్తి. కాకపోతే ఇంతపెద్ద కార్యక్రమం నిర్వహించటానికి సహకరిస్తున్న వారందరికీ నా కథాభివందనాలు.

పాఠకుల్లో పఠనాసక్తి సన్నగిల్లిందా?
జ:మాధ్యమాల వల్ల పఠనాసక్తి తగ్గటంలేదు. తల్లిదండ్రులు తమ పిల్లల్ని పెద్ద భవిష్యత్తుకోసం ఎక్కడెక్కడికో విదేశాలకు పంపాలనే తాపత్రయంతో మాతృభాషను కనీసం చదవను, వ్రాయటం కూడా నేర్పటంలేదు. ఆంగ్లేయులు మనల్ని వదిలి దశాబ్దాలయినా మనం ఇంకా వాళ్ళ భాషాదాస్యం నుంచి బైటపడటంలేదు. మన మాతృభాషని మృతభాష చేస్తున్నాం. ఒక్కసారి ఆలోచించండి ఎంత హేయమైందో, జననీ జన్మభూమిలాగా మాననీయమైంది. మాతృభాష ప్రాధాన్యతని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు చెప్పటంతోబాటు పిల్లల్లోను తెలుగుపట్ల అభిమానం పెరగాలాని బాలసాహిత్యానికి సంబంధించిన సాహిత్యాన్ని విరివిగా కొని వెళ్ళిన స్కూళ్ళు అన్నిటిలోను పిల్లలకు పంచుతున్నాము. బాలసాహిత్యంతో పిల్లలు ఆకర్షణకు లోనయితే పెరిగిన తర్వాత ఆధునిక సాహిత్యాన్ని అందుకుంటారని ఆశ. మన సాహిత్యాన్ని మనం కోల్పోతే సంస్కారాన్ని కోల్పోతాం. సంస్కృతికి దూరమవుతాం. ఆందుకే అందరూ సాహిత్యాన్ని ఆదరించాలి.
– నండూరి రవిశంకర్‌

Surya Telugu Daily.

మార్చి 4, 2011 Posted by | వార్తలు | వ్యాఖ్యానించండి

భరతమైన నాట్యం

భరతమైన నాట్యం

bharatanatyaభరతనాట్యమనగా భావ, రాగ, తాళముల సమ్మేళనము. దీనిని ’దాసి అట్టం’ మరియి ‘సాదిర్‌’గా పిలుస్తారు. తంజావూరు రాజగు శరభోజి (క్రీ.శ.1798-1824) పరిపాలనా కాలంలో ఇది ఆరంభమయ్యింది. శరభోజి మహారాజు ఆస్థాన నర్తకులగు పొన్నెయ్య, చిన్నయ్య, వడివేలు, శివానందం అను నలుగురు సోదరులు దీనికి పితామహులుగా చెప్పబడుతున్నారు. వీరు నాట్యమునందు అలరిపు, జతిస్వరము, శబ్దము, వర్ణము, పదము, తిల్లాన అను క్రమమును ఏర్పరచి దానిని సువ్యవస్థితము చేశారు. భరత నాట్యానికి ఉపయుక్తమగు గీతాలు తెలుగు భాషలోవే అవడం గమనార్హం. భరతనాట్యంలో నాలుగు రకాల శైలులున్నాయి.

1. తంజావూరు శైలి, 2. పందనల్లూరు శైలి, 3. వళువూరు శైలి, 4. మైసూరు శైలి. ఈ నాట్యాన్ని కర్ణాటక సంగీత సంప్రదాయాన్ని అనుసరించి ప్రదర్శిస్తారు.ఏ నృత్యమైనా ముందుగా జానపదుల మధ్య పుటు ్టకొస్తుంది. వారి నృత్య జీవితంలో భాగంగా, వారి శ్రమ జీవనానికి అనుకూలంగా తాళ లయలతో, నంతోషాది రసాలనిముడ్చుకుని ప్రకృతి ప్రభావాలకు లోనవుతూ ఆవిర్భవిస్తుంది. అది పెరిగి, వ్యాప్తిచెంది జన జీవనంలో ఒక భాగమైపోతుంది. దీనిని పండితులు సంస్కరించి, మార్గాన్ని నిర్ణయించి మార్గ పద్ధతిగా మలుస్తారు. మన నృత్యాలన్నీ యిలా పుట్టి, యిలాగే పరిణతి చెందాయి.మనకున్న అనేక గ్రామ దేవతల ముందు ఆడే నృత్యాలు కొలువులలో, ఆరాధనలలో మనం చూస్తుంటాము.

bharatanatyaaజాతి జీవన రీతిలో, గణాల కలయికలలో, జాతులు యిచ్చి పుచ్చుకోవటంలో, మతాల ప్రారంభ ఆవేశాలలో, వాటి సహజీవనంలో ఎన్నో జానపద నృత్యాలు పుట్టుకొచ్చాయి. అవి కాలగతిననుసరించి తమ చారిత్రక కర్తవ్యాన్ని నెరవేర్చి రాలిపోతాయి.ఈనాడు మనం చూసే వీరనాట్యం, గరగలు, గరిడి, తప్పెటగుళ్ళు, పులి ఆట, గురువయ్యలు, బసవయ్యలు, ఒగ్గు, బయలాటలు, యిత్యాదికాలన్నీ తమ కర్తవ్యం వున్నంతవరకు నిలిచి వుంటాయి.

ఈ రకమైనవి భూస్వామ్య వ్యవస్థలోనే వుంటాయి. ఈనాటి ఎలక్ట్రానిక్‌ యుగంలో వీటి వునికి బలహీనపడి పోతోంది. పోషణ లేక కృశించి, నశించి పోతున్నాయి.ఇది చరిత్ర గతిలో తప్పని పరిణామం.ఆంధ్రదేశం తన ఉనికి వలన ఉత్తర భారతం, తూర్పు భాగం, దక్షిణ రాష్ట్రాల ప్రభావాన్ని కొంత యిచ్చి పుచ్చుకున్నా, తన ప్రత్యేకతను కాపాడుకొస్తోంది. ఎందరో రచయితలు రుూ నృత్యాలపై సంస్కృతంలో, తెలుగు పద్యంలో, వచనంలో వ్రాశారు. మన గాథాసప్తశతి ప్రాకృతంలో వున్నా, దానిలోనూ ఆంధ్రుల నృత్యాలు కన్పిస్తాయి.ఇలా తరతరాలనుండి, తెలుగింట, సిరిసిరి మువ్వల రవళీ రామణీయకతలు, విన్యాసాలు చేస్తున్నాయి. తాండవ లాస్యాలను చూపుతున్నాయి. తెలుగింట మురిపాలను పుష్పాంజలులుగా సమర్పిస్తున్నాయి.

Surya Telugu Daily

మార్చి 4, 2011 Posted by | నాట్యం | | 1 వ్యాఖ్య

అద్దకపు సాంప్రదాయం

అద్దకపు సాంప్రదాయం
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన పరిశ్రమలలో అద్దకపు పరిశ్రమ చాలా పురాతనమైనది. రాష్టమ్రంతటా వివిధ సాంేకతిక విధానాలను ఉపయోగించి స్థానిక సంప్రదాయానుగుణంగా ఇండిగో ప్రాసెస్‌ లేక రేసిస్టు స్టైల్‌, మార్డెంట్‌ లేక డైడ్గ స్టైల్‌, మెుదట చెప్పిన టై అండ్గ డై స్టైల్‌ అని మూడు రకాలుగా ఉంది. గుడారాలకు ఉపయోగించే గుడ్డలపై లైనింగులు, గుమ్మాలకు, కిటికీలకు తెరలు, కిషన్‌ కవరింగులు మెుదలైన వాటిపై అద్దకానికి మార్డెంట్‌ లేక డైడ్గ స్టైల్‌ ఉపయోగిస్తారు.

clothesఇండిగో రేసిస్ట్‌ స్టైల్‌నే కలంకారీ అద్దకం అంటారు. కలంకారీ అద్దకాలలో అందమైన అద్దకపు చీరలు, పడక దుప్పట్లు, కర్టెన్లు, బల్లగుడ్డలు అనేక అందమైన డిజైన్లలో లభిస్తున్నాయి. ఒక సన్నని వెదురు బద్దతో కలం చేసి దాని చివర పాయింట్‌గానీ, బ్రష్‌గానీ తయారు చేస్తారు. ఈ కలానికి ప్రత్యేకంగా తీయబడిన గాడిగుండా సిరా ప్రవహిస్తుంది. ఇదే వారి ప్రత్యేక సాధనం. రంగులకు ఉపయోగించే సిరా సహజంగా లభించే మూలికల నుండి తయారుచేస్తారు. నీలిమందు నుంచి నీలిరంగు, వివిధ రకాల మూలికలు, ఆకులు, బెరడు ఉపయోగించి ఎరుపు, పసుపు రంగులను తయారుచేస్తారు. ప్రయేకమైన సాధనికలంతో మూలికా సంబంధమైన వర్ణ ద్రవ్యాలను ఉపయోగించి చేతితో పెయింట్‌ చేయబడిన బ్రహ్మాండమైన కాలికోలు కలంకారీలు.

కలంకారీ అనేది ఒక ప్రాచీన కళ. అనేక శతాబ్దాలపాటు సంప్రదాయకంగా కళాకారులు గట్టి బట్ట మీద పురాణాలలోను, ఇతిహాసాలలోను గల గాథలకు అనురూపంగా చిత్రాలు వేసి ఆ బట్టను దేవాలయాలలో తెరలుగాను, గోడలకు అలంకారాలుగానూ ఉపయోగించేవారు. దేవాలయాలలో శిల్పాలు, దేవతా విగ్రహాలు, వివిధ కుడ్య చిత్రాలు మొదలైన వాటినుంచి కలంకారీ కళాకారులు స్ఫూర్తిని కలిగించుకున్నారు. దేవతా విగ్రహాల శిల్పకళా నైపుణ్యాన్ని, విగ్రహాల ఆభరణాలను, బొమ్మలను చూచి అనేక విషయాలను గ్రహించారు. ఫ్రెస్కో పెయింటింగ్‌లాగే కలంకారీ అద్దకాలు రామాయణ, మహాభారత చిత్రాలతో అతిరమణీయంగా ఉంటాయి.

clothes-designదివ్యమైన కలంకారీ కళ కళాకారుల హస్తకళా నైపుణ్యం కాదు, చిత్రకళా చాతుర్యం కాదు, ఒక విధమైన అప్పొర్వ భగవద్భక్తి ప్రకతిస్తూ వుంటాయి. అంధ్ర దేశంలో ప్రత్యేకంగా కలంకారీ చిత్ర కళకు రెండే రెండు కేంద్రాలు ప్రసిద్ధి పొందాయి. మొదటిది శ్రీకాళహస్తి, రెండవది అద్దకాలకు ముఖ్య కేంద్రమైన మచిలీపట్టణం.శ్రీకాళహస్తి కలంకారీ అద్దకానికి అంకితమైన గొప్ప యాత్రా స్థలము. మిక్కిలి ఓర్పుతో కలంకారీ అద్దకపు పరిశ్రమలో కళాకారులు ప్రదర్శించే అభిలాషలో, ఉత్సాహంలో వారి అర్పణభావం ప్రకటితమవుతుంది. మొట్టమొదట బట్టను కలంకారీ కళాకారుడు చిత్రించదలచిన కాన్వాసుగా తయారుచేసుకుంటాడు.

దళసరిపాటి గాడా చేనేత బట్టను శుభ్రంగా ప్రవహిస్తున్న నీటిలో బట్టకు పెట్టిన గంజి, పిండి పోయేదాకా నాలుగైదుసార్లు శుభ్రం చేస్తారు. దీనిని శుభ్రం చేయడానికి సబ్బుగానీ, ఇతర డిటర్జెంట్లుగానీ ఉపయోగించరు. ఈవిధంగా శుభ్రం చేసిన బట్టను గేదె పాలు, కరక్కాయల రసంకలిపిన మిశ్రమంలో ముంచి ఎండలో ఆరబెడతారు. ఈవిధంగా ఆరబెట్టిన బట్ట ఇప్పుడు కలంకారీ అద్దకానికి సిద్ధమైంది. చింతబొగ్గుతో తయారైన బొగ్గు కణికెలతో ఈ బట్ట మీద భావానుగుణ్యంగా హస్తకళానైపుణ్యంతో చిత్రాలను చిత్రిస్తారు. ఈ చిత్రాలను అన్నభేది ద్రావణంతో సుడిచి చిత్రాలను చెరగని నల్లరంగుగా తయరుచేస్తారు.

Surya Telugu Daily

మార్చి 4, 2011 Posted by | సంస్కృతి | | వ్యాఖ్యానించండి

శివోహం.. శివోహం..!

శివోహం.. శివోహం..!

shivaవేదాలు ఇతిహాస పురాణాలలో ముఖ్యమైనవి. ఋగ్వేదం చాలా గొప్పది. ఇందులో ఉన్నటువంటి రుద్రం ఇంకా గొప్పది. పంచాక్షరీలోని శివ అనే రెండక్షరాలు మరీ గొప్పవి. శివ అంటే మంగళ మని అర్థం.పరమ మంగళకరమైనది శివ స్వరూపం.ఆ పరమ శివుని అనుగ్రహం పొందటా నికి మనం జరుపుకునే ముఖ్యమైన పండుగ మహా శివరాత్రి. పురాణాల లో చెప్పినటువంటి ఈ మహాశివరాత్రిని ప్రతి సంవత్సరం మాఘ మాసం కృష్ణ పక్షంలో చతుర్థశినాడు జరుపుకుంటాం.

లింగోద్భవ కాలం ప్రకారం జన్మాష్టమి నుంచి 180 రోజులు లెక్కిస్తే శివ రాత్రి వస్తుంది. రూపరహితుడైన శివుడు, జ్యోతి రూపంలో, లింగా కారం గా అవిర్భవించిన సమయం కనుక శివరాత్రిని లింగోద్భవకాలం అం టారు. ఈ పరమేశ్వరుడి 64 స్వరూపాలలో లింగోద్భవమూర్తి చాలా ము ఖ్యమైనది. అర్థరాత్రి పన్నెండు గంటలకు లింగోద్భవ సమయమని పురా ణాలలో చెప్పారు. ఋగ్వేదం ప్రకారం భక్తజనులు ఆరోజు నిద్ర పోకుం డా మేల్కొని ఉపవాసముండి, మహాలింగ దర్శనం చేస్తారు. ఉపవాస దీక్ష స్త్రీలు, పురుషులు కూడా ఆచరించదగినదే. ప్రపంచమంతా శివ శక్త్యా త్మనమని తెలుసుకోవాలి. శివలింగానికి ప్రణవానికి సామ్యమున్నదం టారు.

ఆ పంధాలో చూస్తే ఈ శివలింగం ఆరు విధాలు ఇలా ఒక్కొక్క వి ధానంలో ఆరేసి లింగాలు ద్వివిదా ద్వాదశలింగాలుగా చెప్పబడుతున్నప్ప టికీ, శివాగమాలరీత్యా మాత్రం ఆచార గర్వాది లింగాలే సరియైనవి కనుక ఈ ఆరులింగాలనే అనుదినం ఆరాధించాలి. పరమశివు డు శివరాత్రి పర్వదినమున ఎన్నో విధాలుగా ఆలంకరింపబడతాడు. ఆ స్వరూపాలలో విభూతిధారణ ఒకటి. విభూతి అంటే ఐశ్వర్యం. అది అగ్నిలో కాలిన శు ద్ధమైన వస్తువు. ఈశ్వరుడు ఒంటి నిండా విభూతి అద్దుకుంటాడు. రెండ వది రుద్రాక్ష. రుద్రాక్ష అంటే శివుని మూడవ కన్ను. అందరు దేవతలలో ఫాల భాగంలో కన్ను గలవాడు ఆయన ఒక్కడే.

మూడవది పంచాక్షరి జపం. పంచాక్షరీ మంత్రోపదేశం లేని వారు శివ నామాం జపిస్తే చాలు. నాలుగవది మారేడు దళాలతో శివున్ని పూజించడం. శివునికి మూడు దళాలుంటాయి. అయిదవది అంతరంగంలో శివ స్వరూపాన్ని ఎల్లవేళలా స్మరిస్తూ ఉండాలి. శివరాత్రి రోజున సాయంకాల సమయాన్ని ప్రదోషం అంటారు.త్రయోదశి వాటి సంధ్యాకాలం మహా ప్రదోషం. ప్రదోష సమ యంలో శివస్మరణ, శివదర్శనం విధిగా చెయ్యాలి. వేదాలన్నింటకీి తాత్పర్యం ఓంకారం. ఆ ఓంకార స్వరూపమే పరమేశ్వ రుడు. ‘శివ’ శబ్దాన్ని దీర్ఘంతీస్తే ‘శివా’ ఆవుతుంది. అది అమ్మవారి పేరు ఈ స్వరూప ధ్యేయమే జగత్తుకు తల్లిదండ్రులు. పార్వతీపరమేశ్వరులు, సూర్యుడు, అగ్ని ఈ మూడిం టిలోను శివుడుంటాడు. పరమ శాంతినిచ్చే ది శివనామస్మరణమే. శివస్మరణకు అందరూ అర్హలే. పరమ శివునికి చాలా ప్రీతికరమైనటువంటి తిధి నక్షత్రాలలో ఏకాదశి. ఈ తిధి నెలలో రెండుసార్లు వస్తుంది.

srisailamప్రతిమాసము ఏకాదశినాడు, శివుడు ఉపవాసాలతో వుండేవాడని, వేద పురాణాలలో చెప్పడం జరిగింది.అలాంటి ఏకాదశినాడు ప్రతి మానవుడు ఉపవాసము ఉండుటం వలన మహాశివరాత్రి రోజున కలిగేటటువంటి ఫలితాన్ని పొందు తారని, విభూతి, రుద్రాక్ష మహిమవలన మనకు సకల కోరికలు నెరవేరుతాయని పార్వతీదేశి కఠోరమైన తపస్సు ద్వారా తెలిపింది.ఆసమయంలోనే రాజమందిరంలో ిహమవంతుని కల్పిన సప్తఋషూలు పార్వతీపరమేశ్వరుల వివాహం లోక శుభకరమవుతుంద ని, వారి దాంపత్యం ముల్లోకాలకు ఆదర్శప్రాయమవుతుందని పలికి సం బంధం నిశ్చయించిన హిమవంతుని ప్రార్థన మేరకు వివాహ ముహూ ర్తాన్ని కూడా నిర్ణయించారు. ఆ సమయములో మొదటి మఘమాసంలో బహుళ చతుర్థశినాడు తొలిసారిగా లింగోద్భవం జరిగింది.

దానినే మహా శివరాత్రిగా లోకులు భావించారు.ఆపుణ్య తిధినాడే పార్వతీపరమేశ్వరుల కల్యాణము జరిపించుటకు శుభముహుర్తంగా నిర్ణయించారు. ఈ జగత్తు దేనిలో సంచరించ దేనిలో లయం చెందుతుందో అదే లింగము. దీని మొదలు ఏదో చెప్పడానికి వీలుకాదు. కనుక అద్యంతాలు లేనిదే లింగము.లింగతత్వమే…. ఆత్మ…కనుక ప్రతిదేహమందు ఆత్మ అనే లింగము ఉంటున్నది. ఆ లింగస్వరూపుడే శివుడు. ఆ సత్యమును చాటడానికే ఆ పరబ్రహ్మ తొలుత లింగరూపుడై ఉదర్భవించి బ్రహ్మ విష్ణువులుకు దర్శనవిచ్చాడు… ఆనంత లింగాకారుడై ముల్లోకాలలోను వెలసి నిత్యాభిషేక అర్చనలు అందుకున్నారు.

అలంకార రహితంగా ఉండడంలోని నిగూఢత్వం
ఈశ్వరుడు అభిషేక ప్రియుడు. పుష్ప స్వర్ణాభరణాలంకారాలతో పరమే శునికి పని లేదు. ఈ అనంతవిశ్వంలో ఏ అలంకరణలు, ఏ అభరణాలు శాశ్వతం కావు. బాహ్య సౌందర్యం పరమావధి కానేకాదు. జీర్ణించుకు పోయే బాహ్య దేహానికి ముఖ్యత్వం ఇవ్వడం అవివేకం. శాశ్వతంగా ఏ మార్పులేకుండా చిరస్థాయిగా నిలిచివుండేది. ఆత్మ ఒక్కటే. అలాంటి మ హోన్నత ఆత్మను మనం సదా గౌరవించి నిర్మలంగా ఉంచుకోవడమే ముక్తిని పొందే మార్గం. ఈ నిగూఢ నిర్మల తత్త్వాన్ని మనకు అవగతం చేసేందుకు అద్యంతరహితుడైన పార్వతీశుడు ఏ అలంకరణలూ లేకుం డా అతి నిరాడంబరంగా దిగంబరుడుగా లోకాన నిలిచాడు.

శివశక్తుల మహిమను ప్రభావితం చేసే నామం..
శైవనామాన్ని ధరించేవారు మధ్య రేఖ మద్యలో చందనమూ, కుంకుమ మిశ్రమంలో కూడిన వృత్తాకార రూపాన్ని తప్పక ధరించాలి. వర్థి విభూతి రేఖలవలన శైవ కృపకు మాత్రమే పాత్రులు అవుతారు.అలాకాక మధ్య లో వృత్తాన్ని ధరించడం వల్ల ఆ శివుని పత్నియైన పార్వతీమాత కటాక్షాన్ని కూడా పొందవచ్చు.దేహంలోని మిగిలిన అంగాలపైన మూడు విభూతి రేఖలు మాత్రమే దిద్దుకొవాలి. జప తప ధ్యానాదుల ద్వారా మూలాధార చక్రంలో మేల్కొన్న కుండలిని శక్తి ‘ఇలాపింగళ’ నాడులు (సుషూమ్నా) కలయిక ప్రదేశంలో చేరుకొన్నపడు దానిలోని శక్తిప్రసారం ‘భృకుటి’ (రెండు కనుబొమ్మలు బయటకు రావడానికి ప్రయత్నించే ప్రదేశంలో శివుని త్రిశూలమైన రక్షిణిని తెల్లని వర్ణంలో దిద్దుకుంటారు.

ఈ త్రిశూ లంలోని మధ్యమొనను (గీతను) ఎరుపులో దిద్దుకోవడం వెనుక ఒక రహస్యమున్నది. శక్తిని (ఇది తపము, జపము, ధ్యానముల వల్ల కల్గినది) ఎరుపు వర్ణముతో సూచిస్తారు. కుండలిని శక్తి వర్ణం కూడా ఎరుపే అవ్వడంవలన మధ్య రేఖను తప్పనిసరిగా ఎరుపు రంగులో దిద్దుకుం టారు. నిగూఢంలో పరిశీలిస్తే వైష్ణవనామం, శైవనామం ఈశ్వరుని ఆ యుధాల కలయిక అని సుస్పష్టమౌతుంది. అందువల్లనే ‘శివాయ విష్ణూ రూపాయ! విష్ణూ రూపాయ శివహే’ అన్నారు.

ప్రదక్షణ విధులు…
శివాలయములో ప్రవేశించిన తర్వాత నందికి ఏ ప్రక్కనుంచి లోపలకు వెళ్తారో ఆ ప్రక్కనుంచి మాత్రమే, వెనక్కి రావాలి. శివలింగం, నందీశ్వ రుల మధ్య నుంచి రాకూడదు. ఇలావచ్చినా పుణ్యం రాదు సరి కదా పూర్వ జన్మలోని పుణ్యం కూడా పోతుంది.

గంగను భరించడంలో అంతరార్థం
ఈ భూమండలంలో గంగానదికి ఎంతో ప్రత్యేకత ఉంది. పలు కార్యాలు దిగ్విజయం చేసిన గంగానది యుగాలందు కలిగిన మార్పులలో ఒకసారి గౌతమమహర్షి పాపనివృత్తికై గోభస్మం నుండి ప్రవహించి గోదావరిగా మానవాళికి ఉపయోగకారిగా, వునీతులను చేస్తోంది. ఇలా గోదావరిగా భూలోకానికి వచ్చింది.ఆ సమయంలోనే ఆమె ప్రవాహం ఆపడానికి తన జటాఝాటంలో ముడివేసాడు గౌరీశుడు.అనేకానేక కార్యాలను నిర్వ హించిన ఘనత నదులలో గంగానదికి తప్ప మరే ఇతర నదులకు లేదు.

అనేక అంశరూపాంశాలను పొంది ఒకదానికొకటి పొంతన లేని అనేక కా ర్యాలను సాగించిన గంగ, సరాసరి మానవాళి విషయంలో చంచలమైన మనసు వంటిది.. మనస్సు అడ్డూ ఆపు మరచి నియమం హద్దు దాటి ప్ర వహించే గంగా ప్రవాహంతో పోల్చుకుంటే, వేగాన్ని కట్టడి చేసేందుకే పరమేశుడు తన జటాఝాటంలో బంధించి వేగాన్ని నియంత్రించి లోకా లను హద్దులేని గంగా ప్రవాహం నుండి సంరక్షించాడు.అంటే మనస్సు వేగాన్ని మనం కూడా సరైన రీతిలో సంరక్షించకపోతే అదుపు లేక గతి తప్పి మనస్సు మనలను ముంచేస్తుందన్న నిగూడార్థం.

చంద్రుని పొందడంలో అంతర్యం
ఈశ్వరుడు చంద్రశేఖరుడుగా మారిన కారణం మనకు విదితమే. తనకు కలిగిన పాప ప్రక్షాళన నిమిత్తం చంద్రుడు చేసిన తప: ప్రభావాన పరమేశుడు చంద్రుడిని ధరించి చంధ్రశేఖరుడయ్యాడు. పార్వతీశుని త్రినేత్రం అగ్నితో సమానం. సూర్య తేజస్సు కంటే అమిత తేజోమయం. సూర్యచంద్రులే ప్రపంచ ఉనికికి మూలం.మానవ జీవనాధారం. అలా ప్రగతికి, మనుగడకు, విశ్వానికి మూలాధారమైన సూర్య చంద్రులను తాను పొందడం ద్వారా ఈ సృష్టి తనలోనే నిక్షిప్తమై ఉన్నదనీ, ఈ సృష్టికి తానే మూలమనీ, అద్యంతాలు, మూలాధారం తానే అనీ సుస్పష్టం చేస్తున్నాడు శంకరుడు.

బిల్వ దళం ప్రాముఖ్యత:
బిల్వం లేదా మారేడు దళం అంటే శివుడికి మహా ఇష్టం. బిల్వ దళం మూడు అకుల్ని కలిగి ఉంటుంది.ఇందులో కుడి ఎడమలు విష్ణు, బ్రహ్మలైతే మధ్యలో ఉండేది శివుడు. మారేడుకే శి వప్రియ అని మరోపేరు ఉంది. బిల్వదళం పొరబాటున కాలికి తగిలితే ఆయష్షు క్షీణిస్తుందంటారు. ఇది శివుడి అజ్ఞ.బిల్వం ఇంటి అవ రణం లోని ఈశాన్యంలో ఉంటే ఐశ్వర్యం. తుర్పున ఉంటే సౌఖ్యం. పశ్చి మాన ఉంటే సంతానాభివృద్ధి. దక్షినాన ఆపదల నివారణ. వసంతం, గ్రీష్మంలో బిల్వంతో శివున్ని పూజిస్తే అనంతకోటి గోదాన ఫలితం కలుగుతుంది.

నంది దర్శనం
nandiనందీశ్వరుని ప్రార్థించిన తర్వాతే శివ దర్శనానికి వేళ్ళాలి.నందీశ్వరుని అనుమతి లేనిదే శివపూజ చేయకూడదు. అలా చేస్తే ఫలితం శూన్యం. ‘‘నందీశ్వర సమస్తుభ్యం శాంతా నంద ప్రదాయకం! మహాదేవసేవార్థం అనుజ్ఞాందాతుమర్హసి’’ అని ప్రార్థించి ఆయన కొమ్ముల మధ్యనుండి శివలింగాన్ని చూస్తూ ‘‘ఓంహర, ఓంహర’’ అంటూ ప్రార్థిస్తే ఏడుకోట్ల మహామంత్రాలను జపించిన ఫలాన్ని పొందుతారు. యువతులు అపస వ్యంగా, బ్రహ్మచారులు సవ్యంగాను, గృహస్థులు సవ్యాపసవ్యములుగాను శివప్రదక్షిణం, ‘‘చండీ’’ ప్రదక్షిణం చేయాలి. శివునికి ప్రదిణం చేసేటప్పుడు సోమసూత్రం దాటరాదు. చండి ప్రదక్షిణము ఒకసారి చేస్తే 30 వేల సార్లు ప్రదక్షణ చేసిన ఫలము వచ్చును.

ద్వాదశ జోతిర్లింగాలు…
శ్రీ సోమనాధేశ్వర జ్యోతిర్లింగం….

లభ్యమైన ఆధారాలను బట్టి ఈ జ్యోతిర్లింగాలయం క్రీపూ. 200 సం.రాల నాటిది. 20వ శాతాబ్దం వరకు ఎన్నో యుద్ధబీభత్సాలకు గురైనా 1957లో పున:ప్రాణ ప్రతిష్ఠను పొందింది.
శ్రీశైలమల్లిఖార్జున జ్యోతిర్లింగం ….
ఏ శిఖర రూపంలో పర్వతుడు అవతరించాడో ఆ శిఖర మీదే తపస్సు చేస్తున ఒక్కానొక భక్తురాలుకు శివసాక్షాత్కరం కలిగిన ఆచోటు తన పేరుతో నిలవాలని కోరడం వల్లన ఆ శిఖరం శ్రీశైలంగా పేరొందింది. మూడో శతాబ్దం నుండి ఈ క్షేత్రం ఉనికి కనిపిస్తుంది.
శ్రీ మహాకాళేశ్వర జ్యోతిర్లింగం ….
ఉజ్జయినిలో ఈ లింగంవుంది. చైనా యాత్రికుడయిన హ్యుయాన్‌ త్సాంగ్‌ తన పర్యటన గ్రంధంలో ఈ క్షేత్రం గూర్చి చక్కగా వర్ణించారు.
శ్రీ ఓంకారేశ్వర జ్యోతిర్లింగం …..
చారిత్రక ఆధారమంటూ ఈక్షేత్రం గూర్చి ఏమీ లేదు. ‘మాంధాత’ చేసిన తపస్సు ఫలి తంగా ఓంకారేశ్వడు అవిర్భవించాడు.
శ్రీ వైద్యనాథేశ్వరలింగం ….
మహా బలేశ్వరలింగమే వైద్యనాధేశ్వర లింగంగా ప్రసిద్ది చెందింది లంకేశ్వరుడైన రావణునికోరిక మేరకు సాంబ శివుడు ఈ ఆత్మలింగంను ప్రసాదించాడు.
శ్రీ భీమ శంకర జ్యోతిర్లింగం ….
భీముడు వల్ల వివత్తును తొలిగించి నందువల్ల ఆ జ్యోతిర్లింగం ప్రసిద్ధిచెందింది. దీనికి ఉపలింగం భీమేశ్వరలింగం.
శ్రీ నాగేశ్వర జ్యోతిర్లింగం ….
తనని ఆరాధించిన వారికి సర్వ కష్టాలను నివారించి ప్రతిజ్ఞా పూర్వకంగా చెప్పి శివుడు జ్యోతిర్లింగంలోకి నాగేశ్వరుడుగా కలిసి పోతాడు. ఆ జ్యోతిర్లింగమే నాగేశ్వర జ్యోతిర్లింగము.
శ్రీ విశ్వేశ్వర జ్యోతిర్లింగం ….
వైశ్రమణుని ఘోర తపస్సు వల్ల శివుడు లింగరూపంలో వెలసి ముక్తిని ప్రసాదిస్తాడు. ఆలింగమే విశ్వేశ్వర లింగం.
శ్రీ త్రియంబకేశ్వర జ్యోతిర్లింగం ….
శివుడు మూర్తిమంతమై విష్ణువు, బ్రహ్మలకు జ్ఞాన బోధచేయగా త్రిమూర్తులు ఏకమైన లింగంగా శ్రీత్రియంబకేశ్వర జ్యోతిర్లింగం వెలసింది.
శ్రీ కేదారేశ్వర జ్యోతిర్లింగం …
ధర్ముడనే మునికి నరనారాయణలనే పేరిట విష్ణూవు ఇద్దరు పుత్రులుగా జన్మిస్తాడు. ఆ ఇద్దరి కోరిక మేరకు శివుడు బదరీ వనంలో ఈ లింగరూపంలో వెలిసాడు.
శ్రీ రామేశ్వర జ్యోతిర్లింగం ….
శ్రీరామాధిత దైవతలింగం గనుక ఆ జ్యోతిర్లింగమే శ్రీరామేశ్వర లింగంగా పేరు పొందింది.
శ్రీ ఘృశ్నేశ్వర జ్యోతిర్లింగం …
ఘ్నశ్నే అనే భక్తురాలు కోరిక మేరకు శివుడు ఈ జ్యోతిర్లింగంగా వెలిసాడు. సంతాన నష్టం, అకాల మరణం నుండి ఈ లింగం తప్పిస్తుందని చెపుతారు.

శివరాత్రులు ఎన్ని?
kedareswarశివరాత్రి వైదిక కాలం నాటి పండుగ. ఏడాదిలో వచ్చే శివరాత్రులు మొ త్తం అయిదు. అవి : నిత్య శివరాత్రి, పక్ష శివరాత్రి మాస శివరాత్రి, మ హాశివరాత్రి, యోగ శివరాత్రి. వీటిలో పరమేశ్వరుడి పర్వదినం మహా శివరాత్రి. మార్గశిరమాసంలో బహుళ చతుర్థి, అర్ద్ర నక్షత్రం రోజున శివుడు లింగోద్భవం జరిగింది.శివునికి అతి ఇష్టమైన తిథి అది. అందుకే ఈరోజున శివుడ్ని లింగాత్మకంగా ఆరాధించిన వారెవరైనా సరై పురుషోత్త ముడవుతాడని పురాణాల మాట.ఈ రోజున శివ ప్రతిష్ట చేసినా లేక శివ కళ్యాణం చేసినా ఎంతో శ్రేష్టం. మహాశివరాత్రి రోజు తనను పూజిస్తే తన కుమారుడైన కుమారస్వామి కన్నా ఇష్టులవుతారని శివుడు చెప్పడాన్ని బట్టి ఈ విశిష్టత ఏంతో అర్థం చేసుకోవచ్చు. త్రయోదశినాడు ఒంటిపొ ద్దు ఉండి చతుర్థశినాడు ఉపవాసం ఉండాలి. అష్టమి సోమవా రంతో కూ డి వచ్చే కృష్ణ చతుర్థశి నాటి మహాశివరాత్రి మరింత శ్రేష్టమైందంటారు.

భస్మధారణలోని అంతరార్థం:
ఎంతో నిగూఢత్వం నిండివున్న భస్మా న్ని మరే ఇతర దేవుడుగాక పరమశివుడే ధరించడంలో అంతరార్థం ఏమి టో, మరే ఇతర దైవాలు ఎందుక భస్మాన్ని ధరించరో, శంకరుడే ధరించడానకి గల కారణం ఏమిటో చెప్పే కథ ఒకటుంది. మహర్షి ఆశ్ర మానికి సద్బ్రాహ్మణుడి వేషంలో తరలి వచ్చాడు పార్వతీశుడు. సాటి బ్రహ్మణుడిని చూడగానే ఘనంగా స్వాగతం పలికి అతిథిమర్యాదలు చేసాడు మహర్షి. మర్యాదలన్నీ పొందిన పిదప బ్రహ్మణ వేషధారియైన గంగేశుడు మహర్షిని ఉద్దేశించి ‘‘మహర్షి ! అతిథి సత్కారాలు సంపూ ర్ణం గా తెలిసిన నీకు విజయోస్తు ! నీవంటి జ్ఞానసంపన్నుడు, తపోధీరుడు సుఖదు:ఖాలకు అతీతుడైన ఉండాలి. సంతోషాలను ఆవేకావేశాలను అదుపులో ఉంచుకోవాలి.

కానీ నీవు ఏ విషయమో పదేపదే స్మరించు కుంటూ మహా సంబర పడుతున్నావు. నీ అంతటి అమిత తపోధీరుడిని సైతం మాయ చేసి ఇంతగా సంతోషపెట్టి ఉబ్బితబ్బిబ్బు చేస్తున్న సంగతే మిటోనే తెలుసుకోవచ్చునా?’’ అని అడిగాడు. అంతవరకు తనలోనే దాచుకున్న సంతోషాన్ని పంచుకునేందుకు ఒకరు వచ్చినందుకు మహర్షి ఎంతగానో సంబరపడుతూ ‘‘ఓ సాధుపుంగవా! నా అమితానందానికి కారణం నువ్వు తెలుసుకుంటే ఎంతటి తప: స్సంపన్నుడైనా దైవాంశ సంఘటనలకు సంతోష పడడం సహజమేనని తెలుసుకుంటావు. నా చేతి వ్రేలు గాయపడినపుడు గాయం నుండి రక్తానికి బదులు,పరిమళ భరిత ద్రావకం వెలువడుతోంది.

అంటే నా తపస్సుకు పరంథాముడు అంగీక రించినట్లే కదా! ఇంతకంటే ఆనందకారకం ఏం కావాలి’’ అంటూ వివ రించాడు. పరమశివుడు మహర్షి అజ్ఞానానికి నవ్వుతూ ‘‘మహర్షీ ! నీ అ మాయకత్వానికి ఎంతో దిగులుగా ఉంది. ఈ శరీరం, సకల జీవరాశు లు, సమస్త ప్రకృతి, ఈ అనంతవిశ్వమంతా ఏదో ఒక సమయంలో ల యం కావలసినవే. అలా లయమైనపుడు సహజ ధర్మాలకు ఆధారమైన ఆకృతి కాలి మసి కావలసిందే. అలాంటి సంపూర్ణ లయత్వంలో సృష్టిలో మిగిలేది బూడిదే. శాశ్వతమైన బూడిదను పొందడమే అద్భుతమైనది.

నా వ్రేలి నుండి అటువంటి శాశ్వతానందం నీవు చూడగలవు’’ అంటూ తన వ్రేలిని సున్నితంగా గాయపరచుకున్నాడు.ఆ వెంటనే స్వామి వ్రేలి నుండి బూడిద రాలసాగింది. వచ్చినది ఈశ్వరుడని గ్రహించి ‘స్వామీ ! నా అజ్ఞానం తెలియవచ్చింది. ఎంతో అద్భుతాన్ని నాకు చూపించి, నా అజ్ఞా నం పొగొట్టిన నీవు ఎవరో నీ దివ్యరూపమేటి టో నాకు చూసి నన్ను ధ న్యుడిని, పునీతుడిని గావించు’’ అని మహర్షి వేడుకున్నాడు.విశ్వనాథుడు తన అమిత మహోన్నత సుందర దివ్య నమ్మోహన రూపంతో దర్శనమిచ్చాడు.

– డా వి.జి.శర్మ, 9440944132

Surya Telugu Daily

మార్చి 2, 2011 Posted by | భక్తి | | వ్యాఖ్యానించండి

పల్లవుల శిల్పకళావైభవం… భైరవకోన

పల్లవుల శిల్పకళావైభవం… భైరవకోన
భైరవ కోన 9వ శతాబ్దానికి చెందిన ఓ అద్భుత శివాలయం. ప్రకాశం జిల్లాలోని చంద్రశేఖరపురం మండలం, కొత్తపల్లి గ్రామానికి దగ్గరలో ఉంది. పల్లవులకాలంనాటి అద్భుత శిల్పకళకు సాక్షీభూతంగా నిలుస్తున్న, ప్రసిద్ధి గాంచిన పురాతన గుహలకు నెలవు భైరవకోన…

Bhairavakona1సుమారు 250 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ నల్లమల అరణ్యంలో ఎక్కడచూసినా దేవీదేవతల శిలారూపాలే కనిపిస్తుంటాయి. ముఖ్యంగా ఓ కొండలోనే ఎనిమిది ఆలయాలు చెక్కిన వైనం ఎంతో అపురూ పంగా అనిపిస్తుంటుంది. ఇక్కడున్న దుర్గాంబ ఆలయంలో అమ్మవారి విగ్రహం మీద కార్తీకపౌర్ణమి రోజున చంద్రకిరణాలు పడటం భైరవకోనకున్న మరో విశేషం. అందుకే ఆరోజున భక్తులు విశేషంగా ఇక్కడకు తరలివస్తుంటారు. శివరాత్రికి పక్కనే ఉన్న జలపాత సేలయేటిలో స్నానంచేసి శివరూపాల్ని దర్శించుకుంటారు.

కొండల్ని తొలిచి ఆలయాలుగా చెక్కడం అన్నది భారతదేశంలో ప్రాచీనకాలంనుంచి ఉన్నదే. ఆంధ్రప్రదేశ్‌ లో వీటి జాబితా చాలానే ఉంది. గుంటుపల్లి, ఉండవల్లి, మొగల్రాజపురం (విజయవాడ), బొజ్జనకొండ, శ్రీపర్వతం, లింగాలమెట్ట గుహలన్నీ ఈ కోవకు చెందినవే. అయితే ప్రకాశంజిల్లాలోని సీతారామపురం మండలంలోని భైరవకోన గుహలకు పౌరాణిక, చారిత్రక ప్రాశస్త్యం ఉంది. వీటిలో అడుగడుగునా పల్లవ శిల్పకళ కనిపిస్తుంటుంది. ఒకే కొండలో మలిచిన ఎనిమిది శివాలయాలనూ ఏకకాలంలో ఇక్కడ దర్శించుకోవచ్చు. వీటిలో ఏడు దేవాలయాలు తూర్పుముఖంగా, ఒక్కటి మాత్రం ఉత్తర ముఖంగా చెక్కబడ్డాయి.

bhiravaవీటన్నింటిలోనూ గర్భాలయాలూ, వరండాలూ స్తంభాలూ అన్నీ ఆ కొండ రాయితోనే మలచగలగడం విశేషం.శివలింగాలను మాత్రమే గ్రానైట్‌ శిలలతో చెక్కి ప్రతిష్ఠించారు. ఈ గుహాలయాల్లో నెలకొన్న ప్రధానదైవం భర్గేశ్వరుడు. ఈ ప్రాంతానికి క్షేత్రపాలకుడు భైరవుడు.ఆయనపేరుమీదే దీన్ని భైరవక్షేత్రంగా పిలుస్తున్నారు.అయితే ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని కాలభైరవుడు అనే చక్రవర్తి పాలించాడనీ అందుకే ఇది భైరవకోన అయిందనీ అంటారు. అందుకు సాక్ష్యంగా ఈ ప్రాంతం చుట్టూ కోటల ఆనవాళ్లు అనేకం కనిపిస్తుంటాయి.

శివలింగాలన్నీ ఒక్కచోటే…
ఇక్కడ కొలువుతీరిన శివలింగాలు సుప్రసిద్ధ క్షేత్రాల్లోని శివలింగాల్ని పోలి ఉండటంతో వీటిని కూడా ఆ పేర్లతోనే పిలుస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని అమరనాథ్‌లో కన్పించే శశినాగలింగం, మేరు పర్వత పంక్తిలోని రుదల్రింగం, కాశీగంగాతీరంలోని విశ్వేశ్వరలింగం, తిరుమల కొండల్లోని నగరికేశ్వ రిలింగం, భర్గేశ్వరలింగం (ఇక్కడి ప్రధానదైవం) రామనాథపురం సముద్రతీర ప్రాంతంలోని రామే శ్వరలింగం, శ్రీశైలంలోని మల్లికార్జునలింగం, మందరపర్వతంలోని పక్షఘాతలింగం పేర్లతో వీటిని ఆరాధిస్తున్నారు.

ఒకేచోట త్రిమూర్తులు…
bhairava-konaఇక్కడ ఉత్తరముఖంగా ఉన్నదే మొదటిగుహ. దీనికి ఎదురుగా నంది ఉంటుంది. తలపాగాలు ధరించిన ద్వారపాలక శిల్పాలు ఈ గుహ ప్రధాన ఆకర్షణ.మిగిలినవన్నీ తూర్పు ముఖంగానే ఉంటాయి. అయితే అన్నింటికన్నా ఏడో గుహాల యం సుందరంగా కనిపిస్తుంటుంది. ఎనిమిదో గుహలో లింగంతోపాటు బ్రహ్మ, విష్ణువుల బొమ్మలు కూడా చెక్కివుండడం విశేషం. త్రిమూర్తులు ఒకేచోట ఉన్న అరుదైన ప్రదేశంగా ఇది అత్యంత ప్రాచుర్యం పొందింది.అంతేకాదు ఈ ప్రాంతం అనేక ఔషధ మొక్కలకు పుట్టినిల్లు కూడా.ఆయుర్వేద వైద్యానికి అవసరమైన ఎన్నో మూలికల్ని ఇక్కడనుంచే సేకరిస్తుంటారు.

పల్లవ గుహాలయాలు…
waterఇక్కడి ఆలయాలకు మహాబలిపురంలోని ఆలయ నిర్మాణ శిల్పశైలికి సారూప్యం ఉండటంతో ఈ గుహాలయాలను పల్లవుల కాలానికి చెందినవిగా భావిస్తున్నారు. క్రీశ 600-630 కాలానికి చెందిన మహేంద్రవర్మ పాలనలోనే ఈ గుహాలయాలు ప్రారంభించి ఉంటారన్నది చరిత్రకారుల అభిప్రాయం. అయితే ఐదోగుహలోని స్తంభాలమీద ఉన్న నరనరేంద్రుడు, శ్రీత్రిభువనాదిత్యం…వంటి పదాలను చూస్తుంటే ఈ ఆలయాల నిర్మాణం ఏడో శతాబ్దం నుంచి చాళు క్యులకాలం వరకూ అంటే 11వ శతాబ్దంవరకూ కొన సాగి ఉంటుందని అంచనా. ఇక్కడ ఈ గుహాలయాలతో పాటు చుట్టుపక్కల ఉన్న గుండాలనూ దోనల్నీ చూడొచ్చు. సోమనాథ, పాల, కళింగ దోనలు; పార్వతి, కాముని, సరస్వతి, త్రివేణి, పాచికల గుండాలు ఇక్కడ దర్శనీయస్థలాలు. అయితే అటవీప్రాంతం కావడంతో ఇవన్నీ తిరగాలంటే కాలినడక తప్పనిసరి.

కోనకు ఇలా వెళ్ళాలి…
భైరవకోనకు వెళ్లాలంటే ప్రకాశం జిల్లా అంబ వరం, కొత్తపల్లి చేరు కుంటే అక్కడినుండి ఉదయం నుంచి రాత్రి 10 గంటలవరకూ బస్సు సౌకర్యం ఉంటుంది. అటవీప్రాంతం కాబట్టి నిర్వాకులు ఇక్కడ నిత్యాన్నదానాన్ని ఏర్పాటుచేశారు. ఓ చిన్న అతిథి గృహం కూడా ఉంది.

Surya Telugu Daily .

మార్చి 1, 2011 Posted by | చూసొద్దాం | వ్యాఖ్యానించండి

గోదారి ఒడ్డున ప్రకృతి పడుచు… పట్టీసీమ

గోదారి ఒడ్డున ప్రకృతి పడుచు… పట్టీసీమ
అందమైన గోదారి నడుమ అహ్లాద కరమైన వాతావరణంలో పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోన్న ప్రకృతి సౌందర్య కేంద్రం పట్టిసీమ. పట్టిసీమలో విడిది చేయకుండా… పాకింకొండలు-భద్రాచలం బోటు ప్రయాణం పరిపూర్ణం కాదంటే అతిశయోక్తి కాదు. ఇక్కడ వెలిసిన శ్రీ వీరభద్రస్వామి ఆలయంలో ప్రతి సంవత్సరం జరిగే మహాశివరాత్రి తిరునాళ్ళు తప్పకుండా దర్శించాల్సిన ఉత్తవాలు. ప్రకృతి అందాలతోనే కాక చారిత్రకంగా, ఆద్యాత్మికంగా విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్న పట్టిసీమ పర్యాటక విశేషాలు… ఈవారం విహారిలో…

Pattiseema_3స్థానికులు ‘పట్టిసం’ అని కూడా పిలుచుకునే విశిష్ట విహారకేంద్రం పశ్చిమగోదావరి జిల్లా పోలవరం మండలంలోని పట్టిసీమ. కొవ్వూరుకు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రదేశం గోదావరి ఒడ్డున, ఇసుకతిన్నెల నడుమ ప్రకృతి అందాలతో అలరారుతోంది.పాపికొండల మధ్య సాగే గోదావరి బోటు ప్రయాణంలో ఇది ప్రధాన విడిది కేంద్రం. ఇక్కడ గోదావరి ఒడ్డున దేవకూట పర్వతంపైన వీరభద్రస్వామి వారి ఆలయం, భావనారాయణ స్వామివార్ల ఆలయాలు ఉన్నాయి. తెలుగు సినిమాలలో అత్యధికంగా చిత్రీకరణ జరిగిన మంచి అందమైన దేవాలయం ఇది. ఎప్పుడూ సినిమా షూటింగులతో రద్దీగా ఉండే దీన్ని పట్టిసం, పట్టిసంనిధి, పట్టిసీమ అని కూడా పిలుస్తుంటారు. గోదావరి మధ్యనున్న చిన్న లంక మాదిరి ప్రదేశంలో శ్రీ వీరభధ్రస్వామి దేవస్థానం ప్రశాంత వాతవరణంలో అతి సుందరంగా ఉంటుంది. ఇక్కడ మహాశివరాత్రి పర్వదినాన ప్రతియేటా ఐదురోజులపాటు బ్రహ్మాండమైన ఉత్సవాలు జరుగుతాయి. ఈ తిరునాళ్ళకు లక్షలాదిగా భక్తులు తరలి వస్తుంటారు.

సినిమా షూటింగ్‌కు ప్రసిద్ధిగాంచిన దేవాలయం…
పాపి కొండల మధ్య సాగే గోదావరి నది ఒడ్డున ఉన్న చిన్న కొండపై ఈ వీరభద్రస్వామి దేవస్థానం కొలువై ఉంది. చుట్టూ గోదావరి మధ్యలో దేవాలయం ఉండడంతో ఇక్కటి వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. అలాగే ప్రస్తుతం విస్తరణ పనుల్లో భాగంగా ఆలయం చుట్టూ పెంచిన చెట్ల పెంపకంతో ఈ ప్రాంతాన్ని సందర్శించిన వారిని ఈ దేవాలయం విశేషంగా ఆకర్షిస్తుంది. ఈ కారణంగానే దాదాపు అన్ని కాలాల్లో ఇక్కడ సినిమా షూటింగ్‌లు జరుగుతుంటాయి.

ఆధ్యాత్మికతను నెలవు వీరభద్రస్వామి దేవస్థానం…
ఇక్కడ వెలిసిన వెలసిన వీరభద్రస్వామి ఆలయం మరీ అంత పెద్దది కాకపోయినా సమీప గ్రామాల్లో ఈ ఆలయం విశిష్ట స్థానం సంపాదించుకుంది. ఏడాది మొత్తంలో జరిగే చిన్నా చితకా ఉత్సవాలతో పాటు మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇక్కడ ఐదు రోజుల పాటు ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలకు చుట్టు పక్కల గ్రామాల నుంచి లక్షలాదిగా భక్తులు తరలి వస్తుంటారు. ఒకప్పుడు దేవాలయము శిధిలమవడం వల్ల దేవాలయానికి పూర్తి మరమ్మత్తులు చేశారు. దేవాలయం చుట్టూ అందమైన తోటలు, పూలమొక్కలు, గడ్డి పెంచుతున్నారు.

Pattiseemaఒకప్పుడు ఇక్కడ కనీసం మంచి నీళ్ళు కూడా దొరకని పరిస్థితి ఉండేది. కాని ఇప్పుడు దేవాలయములో అన్ని రకాల సౌకర్యాలున్నాయి. భక్తులు విడిది చేసేందుకు ఇక్కడ గదులు నిర్మించారు. త్రాగుగునీటి వసతులు, భోజనశాలలు, గోదావరి పడవల రేవు, స్నానాలరేవులను రెండేళ్ళ క్రితం కొత్తగా ఏర్పాటు చేశారు. చుట్టూ గోదావరి, మధ్యలో దేవాలయం ఉండడంతో ఇక్కటి వాతావరణం గంభీరంగానూ, అందంగానూ ఉంటుంది. అలాగే ప్రస్తుతం విస్తరణ పనుల్లో భాగంగా ఆలయం చుట్టూ పెంచిన చెట్ల పెంపకంతో ఈ ప్రాంతాన్ని సందర్శించిన వారిని ఈ దేవాలయం విశేషంగా ఆకర్షిస్తుంది.

ఆలయ చరిత్ర…
దక్షయాగంలో సతీదేవి అగ్నికి ఆహుతికాగా, రౌదమ్రూర్తియైన పరమశివుడు తన శిరస్సునుండి ఒక జటాజూటాన్ని పెరికి నేలకు వేసి కొట్టగా అందులోనుండి వీరభద్రుడు ఆవిర్భవించిచాడు. అప్పుడు… దక్షుని యాగాన్ని ధ్వంసం చేయమని శివుడు ఆనతీయగా వీరభద్రుడు ప్రమధగణాలతో హుటాహుటిన దక్షుని యాగ శాలకు వెళ్ళి యఙ్ఞకుండమును ధ్వంసముచేసి అడ్డువచ్చినవారిని సంహరిస్తూ దక్షుని శిరస్సు ఖండించాడు. ఆ రౌద్రమూర్తి దేవకూట పర్వతముపై ప్రళయ తాండవం చేస్తుండగా… అతని చేతిలోని ‘పట్టిసం’ అనే కత్తి జారి దేవకూట పర్వతముపై పడింది. వీరభద్రుని రౌద్ర తాండవాన్ని ఎవరూ ఆపలేక చివరకు అగస్త్యమహామునిని వేడుకున్నారు.

Pattiseema_2అప్పుడు అగస్త్యమహాముని వచ్చి వీరభద్రుని వెనకనుంచి ఆలింగనముచేసుకొని విడిపోయిన అతని జటాజూటాన్ని ముడివేసి అతన్ని శాంతింపచేశాడని పురాణ గాధ.అక్కడే రుద్ర సంభూతుడైన వీరభద్రుడు భద్రకాళీ సమేతుడై వెలిశాడట. ఈ ఆలయంలో మూల విగ్రహముపై అగస్త్యుని చేతిగుర్తులు, శిరస్సుపై ముడిని మనం చూడవచ్చును. పట్టిసం జారిపడినది కనుక ఈక్షేత్రానికి పట్టిసాచల క్షేత్రమని పేరు వచ్చింది.కాలక్రమేణా అది పట్టిసం, పట్టిసీమగా మారింది.కొవ్వూరు నుండి గోదావరి గట్టున 26వ కిలోమీటరు వద్ద ఉన్న ఈ ేత్రానికి… గోదావరి నదిలోనికి ఏటవాలుగ చక్కని రోడ్డు వుంది.అక్కడనుంచి పడవలలో నది దాటి నదిమధ్యలో గల పట్టిసం కొండకు చేరవచ్చు. వర్షాకాలం మినహాయించి నదీ ప్రవాహాన్ని బట్టి ఇక్కడ ఇసుక తిప్పలు ఏర్పడతాయి.

ఇలా చేరుకోవచ్చు…
పశ్చిమగోదావరి జిల్లాలోని ప్రముఖ నగరమైన రాజమండ్రి నుండి పట్టిసీమ సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. రాజమండ్రి నుంచి పట్టిసీమకు ఎల్లప్పుడూ బస్సులు అందుబాటులో ఉంటాయి. అలాగే ప్రకృతిని ఆస్వాదిస్తూ వెళ్లాలనుకునే వారికి రాజమండ్రి నుంచి పాపికొండల మధ్య ప్రవహించే గోదావరిపై ప్రయాణించే లాంచీలు కూడా అందుబాటులో ఉంటాయి. విమానం ద్వారా వచ్చే దూరప్రాంత ప్రయాణీకులు రాజమండ్రిలోని కోరుకొండ విమానాశ్రయం నుండి చేరుకోవచ్చు. ఇక రైలు ప్రయాణీకులు రాజమండ్రి లేదా నిడదవోలు స్టేషన్ల ద్వారా ఇక్కడికి చేరవచ్చు. కొవ్వూరు కూడా దగ్గరి రైల్వే స్టేషన్‌ అయినప్పటికీ అక్కడ తగినన్ని ఎక్స్‌ప్రెస్‌ రైళ్ళు ఆగవు.

Surya Telugu Daily.

మార్చి 1, 2011 Posted by | చూసొద్దాం | వ్యాఖ్యానించండి