మెరిసే శ్వేతాభరణాలు..
మెరిసే శ్వేతాభరణాలు..
పూర్వకాలంలో ఖరీదైన సహజ ముత్యాలతోనే ఆభరాలను తయారు చేసేవారు. అందువల్ల ఇవి ధనికులు, ఉన్నత కుటుంబాల వరకే పరి మితమయ్యాయి.1900 దశకంలో కృత్రిమ పద్ధతిలో ముత్యాలు తయారు చేయడం కనిపెట్టినప్పటి నుంచి సామాన్యులకు కూడా ఇవి అందుబాటులోకి వచ్చాయి.
ముత్యాల రాజధాని…
మన హైదరాబాద్ నగరానికి ముత్యాల రాజధాని అనే పేరు ఎప్పటినుంచో ఉంది. పూర్వపు రోజుల్లో ము త్యాలను రాశులుగా పోసి అమ్మిన ప్రాంతం కాబట్టి ఆ పేరు వచ్చింది. క్రమేపీ నాగరి కత పెరగడంతో వీటి వాడకం తగ్గింది. అయితే ఇప్పుడు ఆధు నిక యువతీ యువకులు ము త్యాల ఆభరణాలను ధరించేం దుకు ఇష్టపడుతున్నారు. బం గారం ధర కొండెక్కి కూర్చో వడం ఒక కారణమైతే ఆర్టిఫిషి యల్ పెరల్స్‌తో ఎంతో అందంగా డిజైన్ చేసిన ఆభరణాలు, యాక్ససరీస్ మార్కెట్లోకి రావడం మరొక కారణం. ముత్యాలతో చేసిన ఆభరాణాలంటే అతివలకు ఎంతోఇష్టం. అంతేకాదు మార్కెట్లో వీటికి ఎంతో గిరాకీ కూడా ఉంది. సముద్రపు అడుగుల్లో మాత్రమే లభించే ముత్యాలను 1914 నుంచి మంచినీటి చెరువుల్లో కూడా ముత్యాలను పెంచడం నేర్చుకున్నారు రైతులు. ఇక అప్పటినుంచి ముత్యాల వాడకం పెరిగింది.
చరిత్రలో…
ప్రాచీన ఈజిప్టులో ముత్యాలకు ప్రముఖ స్థానం కల్పించినట్లుగా చరిత్ర చెబు తుంది. అతి ప్రాచీనమైన ముత్యంగా ప్రసిద్ధి గాంచిన ‘జోమాన్’ జపాన్ దేశా నికి చెందింది. దీనికి 5500 సంవత్సరాల చరిత్ర ఉంది. చైనీయులు కూడా వారి అభరణాలలో ముత్యాలు వాడినట్లుగా 4000 సంవత్సరాల చరి త్ర కలి గిన వారి గ్రంధాలు చెబుతున్నాయి. ప్రాచీన చైనీయుల సంకేత భాషలో ము త్యము స్వచ్ఛతకు, విలువలకు సంకేతంగా భావించేవారు. అప్పటి ప్రభు త్వాలు ముత్యాలను పన్ను రూపంలో చెల్లించడానికి కూడా అనుమతించేవి. ధనవంతులైన వారు చనిపోయినప్పుడు వాని నోట్లో ఒక ముత్యాన్ని ఉంచి ఖననం చేసేవారు. ఇలా అనేక రూపాల్లో పూర్వం ఈ ముత్యాలు వాడుకలో ఉండేవి.
ఉత్సాహం చూపిస్తున్నారు…
‘నేడు బంగారం ధర ఎలా పెరిగిపోతోందో మనందరికీ తెలుసు. అందువల్ల వాటిని కొనేందుకు వెనకడుగు వేస్తున్నారు. వాటికి బదులుగా వన్‌గ్రామ్ గో ల్డ్ జ్యూవెరీని, ముత్యాలతో చేసిన ఆభరణాలను కొనుగోలుకు ఆసక్తి కనబ రుస్తున్నారు. నేడు పలు రంగులలో, డిజైన్లలో పెరల్స్ మార్కెట్లో లభిస్తున్నా యి. ధరలు కూడా అందుబాటులో ఉండటం వల్ల ఈ ఆభరణాలను ఎక్కు వగా కొనుగోలుచేస్తున్నాను. మేమే కాదు మా కాలనీలోని చాలా మంది పెర ల్స్ జ్యువెరీనే కొనేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు’ అని కార్పొరేట్ కంపెనీల ప్రాజెక్ట్ మేనేజర్‌గా పనిచేస్తున్న సుధ అన్నారు. ఇక జ్యూయలరీ డిజైనర్లు మగువల డిమాండ్ మేరకు ప్రత్యేకంగా అందమైన డిజైన్లలో పెరల్స్ జ్యూయలరీని రూపొందిస్తున్నారు.
మూడురకాలుగా…
స్వాతి కార్తె తొలకరి చినుకు ముత్యపుచిప్పలో పడితే ముత్యంగా మారుతుం దని అందరం భావిస్తుంటాం. శాస్ర్తీయ భాషలో ‘ఆయిస్టర్’ అనే గుల్ల కలిగిన కవచం ఎక్కువగా సముద్రాలలో ఉంటుంది. ఈ కవచంలో నీటి బిందువు, ధూళి, ఇసుక రేణువు పడితే క్రమేనా దాని చుట్టూ గట్టిపొరలు పొరలుగా ఏర్పడుతుంది. దీన్నే మనం ముత్యంగా వ్యవహరిస్తాం. ప్రస్తుతం ఈ ము త్యాలను మూడు రకాలుగా వర్గీకరించవచ్చు. ఇవి సహజముత్యాలు (నేచు రల్ పెరల్స్), సాగుచేసిన ముత్యాలు (కల్చర్డ్ పెరల్స్), అనుకరణ ముత్యాలు (ఇమిటేషన్ పెరల్స్)గా చెప్పుకోవచ్చు.
సహజ ముత్యాలు…
పేరుకు తగ్గట్టుగానే ఇవి ఎవరిచేతనైనా పెంచబడకుండా వాటంతట అవే తయారవుతాయి. ఇప్పటికీ చాలా చోట్ల ముత్యాలు సహజంగానే ఏర్పడు తుంటాయి. కానీ వీటిని కనుగొనాలంటే ఎక్కడో సముద్రపు అడుగు భాగాన వెతకాల్సిందే. ఇప్పట్లో సహజ ముత్యాలను సంపాదించి ఓ హారాన్ని తయా రుచేయాలంటే దాదాపు అసాధ్యమైన పని. సముద్రాలలో సహజంగా తయా రైన ముత్యాలు సాధారణంగా నిర్ధిష్ట ఆకారాన్ని కలిగిఉండవు. ఇంకా ధర కూ డా చాలా ఎక్కువగా ఉంటాయి. ధనిక కుటుంబాలు కూడా ప్రస్తుతం ఆర్టి ఫిషియల్ పెరల్స్పైనే మక్కువ చూపుతున్నారు.
అందుబాటులోకి తీసుకు వచ్చారు…
ముత్యాలను ధరించాలనే ఆసక్తి ఎక్కువైన సమయంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సహజ పద్ధతికి దగ్గరగా వాణిజ్య స్థాయిలో ముత్యాల సాగు అందుబాటులోి తీసుకొచ్చారు. 1914 వ సంవత్సరం నుంచి రైతులు మం చినీటి గుంటల్లో కూడా ముత్యాలను పెంచడం ప్రారంభించారు. ఇక అప్పటి నుంచి మధ్యతరగతి, సామాన్యులకు కూడా ఇవి అందుబాటులోకి వచ్చా యి. ఇవి కల్చర్డ్ పెరల్స్. తరువాత ఫ్యారీల్లో తయారుచేసే ముత్యాలు మా ర్కెట్లోకి వచ్చాయి. ప్లాస్టిక్, ఫైబర్ వంటి పదార్ధాలతో తయారుచేసే అను కరణ ముత్యాలూ వచ్చాయి. ఎక్కడి నుంచి వచ్చినా ఎలా ఏర్పడినా ఇవి తయారయ్యేది మాత్రం కాల్షియం కార్బోనేట్ అనే పదార్థం తోనే. ఇవి గుండ్రంగా, కొన్ని ద్రవ బిందువుల ఆకారంలోనూ, కొన్ని అండాకారంలోనూ ఉంటాయి. వీటిలో గుండ్రంగా ఉన్నవి, బిందువు ఆకారంలో ఉ న్నవి ఎక్కువ ధర పలుకు తాయి.
అనేక రంగులలో…
సహజంగా లభించే ముత్యాలు తెలుపు రంగులోనే ఉంటాయి. కానీ ఇప్పుడు రైతులు పసుపు, ఆకుపచ్చ, నీలం, నలుపు, గులాబీ, బ్రౌన్ ఇంకా పర్పుల్ కలర్లలో రూపొం దిస్తున్నారు. దాంతో ముత్యాల తో ఆభరణాలను తయారుచేసే వారికి కొత్త కొ త్త డిజైన్లతో తయారు చేసేందుకు ఎక్కువ అవకాశాలు కలిగాయి. సరికొత్త మోడల్స్‌తో నగలను రూపొందించేందుకు మార్గం సులువయ్యింది.
పలు రకాలు…
ముత్యాలతో హారాలు, ఇయర్్రింగ్స్ వంటి ఆభరణాలే కాకుండా బ్రేస్లేట్స్, బ్రూచ్, చేతి ఉంగరాలు, వాచీలు, లాకెట్ వంటి యాక్ససరీస్‌ను కూడా తయారుచేస్త్తున్నారు. ఇంతకు మునుపు అతివలు ధరించేం
దుకు వీలుగా ఉండేవాటినే తయారు చేసేవారు. ఇప్పుడు మగవారు కూడా ధరించేందుకు వీలైన ఆభరణాలను, డిజైన్లను కొత్తగా రూపొందిస్తున్నారు. వాచీలు, ఉంగరాలు, లాకెట్, బ్రేస్లేట్స్ వంటి వాడిని ఎంతో నూతనంగా డిజైన్ చేస్తున్నారు. చీరలు పార్టీవేర్ దుస్తులకు అనుగుణంగా ఇవి తయారవుతున్నాయి.
Surya Telugu Daily.
అందమైన గవ్వలు…
అందమైన గవ్వలు…
మనసుపెట్టి చూడాలేగానీ ప్రకృతిలో ప్రతిదీ అందంగానే ఉంటుం ది. అందులో సముద్రతీరాలలో దొరికే గవ్వలు ప్రముఖంగా చెప్పు కోవచ్చు. రకరాల ఆకృతులతో ఎంతో అందంగా, చూడముచ్చటగా ఉండే కొన్ని ప్రత్యేకమైన గవ్వలు (సీషెల్స్ ) బంగారం, రత్నాలకన్నా ఎంతో విలువైనవి. వీటిని గృహా లంకరణకు ఉపయోగిస్తే ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. ఈ నవీన కాలంలో కూ డా చాలా మంది ఇళ్లల్లో ఇవి కనిపిస్తుంటాయి. అనాదిగా ఇవి అందర్నీ ఆట్టు కుంటూనే ఉన్నాయి. మెక్సికో దేవాల యాల్లో, రోమన్ పాత్రల్లో పునర్వికాస దశ నాటి శిలా ప్రతిమల్లో వీటిని అలం కరణ సా మా గ్రిగా వినియో గించే వా రు. ఇప్పటి కీ వీటి వాడ కం పెరుగుతూనే ఉంది అనడానికి మాల్స్ లో ప్రత్యక్షమవుతున్న అందమైన గవ్వలే ఆధారం.
గట్టిగా ఉంటాయి…
సముద్రాలలో దొరికే గవ్వలు చాలా గట్టిగా ఉంటాయి. వెన్నముకలేని సముద్ర జీవుల బాహ్యా అస్థిపంజరమే గవ్వలేదా అల్చిప్ప. ఈ గవ్వలు మృదువైన శరీరం గల సముద్ర జీవులకు కవచాలుగా ఉంటాయి. నత్తల లాంటి శరీరం కల జీవుల నుండి ఈ గవ్వలు ఎక్కువగా తయారవుతూ ఉంటాయి. ఇవి సముద్రజలాల్లోనూ , సముద్ర తీరంలోనూ లభ్యమవుతాయి. నత్తలు, పీతల పెంకులు, పగడాలవలే గవ్వలుకూడా కాల్షియం కార్బొనేట్‌తో తయారవుతాయి. గుడ్డు పొదిగి నత్తగా ఉన్నప్పుడే వాటి చుట్టూ చిన్న పెంకు ఉంటుంది. పెంకు అంచుల్లో నత్తలు గవ్వలు తయారుకావడానికి అవసరమైన కొత్త పదార్థం తయారు చేస్తుంటాయి. నత్త పరి మాణం పెరిగే కొద్దీ ఈ పెంకు కూడా పెరుగుతూ ఉంటుంది. ఒక్కో జాతికి చెందిన జీవి ఒక్కోరకమైన గవ్వను తయారుచేస్తుంది. ఇది వాతావరణం, శీతోష్ణస్థితి, పర్యావరణం, జన్యువులు మొదలైన వాటిపై గవ్వల రూపు రేఖలు ఆధారపడి ఉంటాయి. ఒక పరాన్న జీవి లేదా మరో వస్తువు లాంటిది నత్తకు తగిలి దానిని ఆ నత్త వదిలించుకోలేక పోతే ఆ పరాన్న జీవి లేదా పదార్థం మీద కాల్షియం కార్బొ నేట్, మాంసకృ త్తులు ఆవరిస్తాయి. అప్పుడు ముత్యాలు తయారవుతాయి. పాత గవ్వను, ఆల్చిప్పను తెల్లని వెనిగర్‌లో ఉంచితే అది పగిలి చివరకు బొగ్గుపులుసు వాయువుగా వెలువడుతుంది. దీన్ని బట్టి అది కాల్షియం కార్బోనేట్ ద్వారా తయా రైందని తెలుసుకోవచ్చు.
సంగీత పరికరాలుగా…
సముద్ర గవ్వలను, శంఖువులను సంగీత వాయిద్యాలుగా కూడా ఉపయోగిస్తు న్నారు. పెద్ద పెద్ద శంఖువుల మధ్యలో కన్నం వేసి బాకాలుగా వాడతారు. ఇప్పటికీ చాలా ప్రాంతాలలో వీటిని సంగీత కచేరీలలో సంగీత వాయిద్యంగా ఉపయోగి స్తున్నారు. అంతేకాకుండా చరిత్ర పూర్వ దశ నుంచి కూడా గవ్వలను అలంకరణ సామాగ్రిగా ఉపయోగించే వారని చరిత్ర ద్వారా తెలుస్తోంది. కొన్ని సందర్భాలలో నగలుగా కూడా ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం యువత ధరించే లాకెట్లో చిన్న చిన్న గవ్వలను ఉపయోగించడం మనం చూస్తూనే ఉన్నాం.
మార్పిడి వస్తువుగా…
సంగీత వాయిద్యాలు, నగలగానే కాకుండా ఈ గవ్వలను డబ్బులుగా కూడా పూర్వపు రోజులలో ఉపయోగించేవారు. హిందూ మహాసముద్రం, పసిఫిక్ మహా సముద్రం దీవుల్లోనూ, ఉత్తర అమెరికా, ఆఫ్రికా, కరేబియన్‌లోనూ గవ్వలను మా రకంగా కూడా ఉపయోగిస్తారు. సైప్రేయియా మొనెటా, మనీకోరీ లాంటి గవ్వలు ఇలా డబ్బురూపంలో ఉపయోగించేవే. ఉత్తర అమెరికాలోని వాయువ్య ప్రాంతా ల్లో డెంటాలియం అనే గవ్వలను డబ్బురూపంలో ఉపయోగించేవారు. సైప్రేయి యా మొనెటా, సైప్రేయియా అన్సులస్ అనే గవ్వలను మారకంగా ఉపయోగించి హిందూ మహా సముద్ర, పసిఫిక్ సముద్ర తీర ప్రాంతంలోని అనేక దేశాలను వల స రాజ్యాలుగా మార్చిన డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు విశిష్టమైన జంతువు లను, వజ్రాలను కొని అపార సంపత్తిని సమకూర్చుకున్నారు. ఈ వస్తువులన్నిం టికీ అప్పుడు యూరప్‌లో చాలా విలువ ఉండేది. ఈ రకం గవ్వలు మామూలు వాటికన్నా చాలా గట్టిగా ఉంటాయి.
పనిముట్లుగా…
ఈ గవ్వలు వివిధ ఆకారాల్లో , చలా గట్టిగా ఉంటాయి గనుక వాటిని పనిముట్లు గా కూడా ఉపయోగిస్తారు. కొన్నింటిని పాత్రలుగానూ, మరీ పెద్దగా ఉన్న వాటిని స్నానపు తొట్టెలుగానూ ఉపయోగిస్తారు. చాలా రకాల గవ్వలను బ్లేడ్లుగా, గీకే వస్తువులుగా, కత్తులుగా కూడా ఉపయోగిస్తారు. వాటి ఆకారాలను బట్టి పని ముట్లుగా మలచుకుంటారు. కొన్నింటిని దీపపు ప్రమిదలుగా కూడా వాడు తుం టారు. వాటి మధ్యలో ఉండే కాలువ లాంటి దానిలో వత్తి వేసి ప్రమిదగా వినియో గిస్తారు. వీటిలో కాల్షియం కార్బొనేట్ అధికంగా ఉంటుంది. దీంతో ఉద్యానవనా ల్లో అల్చిప్పలను భూసారాన్ని పెంపొందించడానికి కూడా ఉపయోగిస్తారు. ఆల్చిప్ప లను పొడిచేసి వాడితే భూసారం పెరుగుతుంది. తీరప్రాంతాలకు చెందిన వారు తప్ప మిగతావారు ప్రస్తుతం ఉపయోగించడం లేదనే చెప్పాలి.
అలంకరణ వస్తువులుగా…
వీటి ఆకారం అందంగా ఉంటుంది. కనక కళాకృతులు, పెయింటిం గ్లు, శిల్పాలు మొదలైన వాటిలో ఎక్కువగా వినియోగిస్తారు. రంగు రంగులుగా, బహువర్ణ ప్రకాశకంగా ఉండే గవ్వలను, ఆల్చిప్పలను గోడలను, ఫర్నీచర్‌ను, పెట్టెలను అలంకరించడానికి కూడా వాడ తా రు. అద్దాల ఫ్రేములకు, ఫర్నీచర్స్‌కు అలంకరించడానికి ఇవి ఉపకరిస్తాయి. భా రత్‌లో గవ్వలకు సంప్రదాయకంగా మతాచార వ్యవహారాల్లో ప్రాధాన్యత ఉంది.
హాబీగా…
కొంతమందికి సముద్రపు ఒడ్డున దొరికే అందమైన గవ్వలను సేకరించడం హాబీ గా ఉంటుంది. రకరకాల ఆకృతులు కలిగిన వాటిని ఎంతో ఓపికగా, ఆసక్తిగా సేక రిస్తారు. దగ్గర్లోని బీచ్‌లకు వెళ్లి గవ్వలను, పెంకులను తీసుకొని వాటిని శుభ్రపరచి తమ వద్ద ఎంతో జాగ్రత్తగా దాచుకుంటారు. అలాగే వీటిపై అధ్యయనాలు చేసే వారు కూడా ఉంటారు. చాలా మంది వీటిపై అధ్యయనాలు జరిపి అనేక పుస్తకాలు కూడా రచించారు.
పట్టించుకోవడం లేదు…
సంభవించే వైపరిత్యాల రీత్యా అనేక మందికి పర్యావరణం పట్ల ఆసక్తి ఎక్కు వైంది. అనేక మంది పర్యావరణాన్ని రక్షించాలని నిర్ణయించుకుంటున్నారు. ప్ర కృతిని ప్రేమించేవారు, జీవావరణ సంబంధ రంగాల పరిశోధకులు కూడా ఎక్కువ అవుతున్నారు. ఇలాంటి కార్యకలాపాల్లో నేల మీద, మంచినీటి జీవుల మీద మాత్ర మే ఎక్కువ దృష్టి ేంద్రీకరిస్తున్నారు. సముద్ర జీవుల గురించి అంతగా పట్టించు కోవడం లేదు. అందువల్ల అండమాన్, నికోబార్ దీవుల్లోని ఈ గవ్వలను ఉపయో గించి విడుదల చేసిన నాలుగు తపాలా బిళ్లల ద్వారా సముద్ర జీవావరణంపై దృష్టి మరల్చడానికి ప్రయత్నం చేశారు. ఇది ఏమేరకు పరిశోధకుల దృష్టికి పోతుందో వేచి చూడాలి మరి.
Surya Telugu Daily .
జీవన‘గీత’లు
జీవన‘గీత’లు
ర్యాగింగ్ అమానుషం… అంటూ విద్యార్థులు గీసిన పెయింటింగ్స్ అందర్నీ ఆలోచింపచేస్తున్నాయి. ధూమ పానం, గుట్కాలు తీసుకోవడం…ఆరోగ్యానికి హానికరం అంటూ విద్యార్థులు రూపొందించిన ఛాయాచిత్రాలు అద్భుతంగా రూపుదిద్దుకున్నాయి. ఇవేగాకుండా పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత…జాతీయ సమగ్రత వంటి అంశాలపై జెఎన్ ఎఎఫ్ యూనివర్సిటీ ఫైన్ ఆర్ట్సకు చెందిన అప్లయిడ్ ఆర్ట్ విద్యా ర్థులు అందమైన ఆర్ట్ వర్క్‌లను రూపొందించి తమ సృజనాత్మ కతను చాటుకున్నారు.
అద్భుతంగా రూపుదిద్దుకొని…
ఆర్ట్‌కు చెందిన మొదటి, రెండవ, మూడవ, నాలుగవ సంవత్సరం విద్యార్థులు ఒకే చోట విడి,విడిగా తమ ఆర్ట్ వర్క్‌లను ప్రదర్శనకు ఉంచారు. వీటిలో మొదటి సంవత్సరం విద్యార్థులు డ్రాయింగ్స్, పెయింటింగ్స్, కలర్ డిజైనింగ్, అప్లికేషన్ వర్క్‌లను రూపొందిస్తే, రెండవ సంవత్సరం విద్యార్థులు టైపోగ్రఫీ, డ్రాయిం గ్స్, గ్రాఫిక్ డిజైనింగ్ చిత్రాలను ఏర్పాటుచేశారు. మూడవ సంవ త్సరం విద్యార్థులు ఇలస్ట్రేషన్, ప్రోడక్ట్ డిజైన్, ట్యాగ్స్‌ను రూపొం దిస్తే, నాలుగవ సంవత్సరం విద్యార్థులు అడ్వాన్స్డ్ ఇలస్ట్రేషన్, 3డి ఇమాజినేషన్ ఆర్ట్ వర్క్‌లను తీర్చిదిద్ది ప్రదర్శనలో ఏర్పాటు చేశారు. విద్యార్థులంతా కలిసి దాదాపు 500 వరకు చిత్ర కళాఖం డాలను ఇక్కడ పొందుపరిచారు.
సృజనాత్మకతకు అద్దం పడుతూ…
విద్యార్థుల వివిధ రకాల చిత్ర కళాఖండాలు వేటికవే ఎంతో ప్రత్యే కంగా రూపుదిద్దుకున్నాయి. వీటిలో టైపోగ్రఫీలో భాగంగా అం దంగా రూపుదిద్దుకున్న చిత్రాలు ఎంతో ఆకర్షణీయంగా తీర్చిది ద్దారు. గ్రాఫిక్ డిజైనింగ్ చిత్రాల్లో సందేశాత్మక కళాఖండాలు ప్రత్యేకంగా రూపుదిద్దుకున్నాయి. వీటితో పాటు సెలబ్రిటీలు ఐశ్వ ర్యారాయ్, సచిన్ టెండూల్కర్, దేశ ప్రధాని మన్మోహన్ సింగ్, రా మకృష్ణ పరమహంసల పొర్ట్రెయిట్స్ సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. 3డి ఇమాజినేషన్లో భాగంగా కంప్యూటర్ పై వైవిధ్యభరితంగా రూపొందించిన చిత్ర కళాఖండాలు వేటికవే ఎంతో ప్రత్యేకంగా రూపుదిద్దుకున్నాయి.
విద్యార్థులను ప్రోత్సహించేందుకు..
-వేణు మోహన్,
ఫ్యాకల్టీ, అప్లయిడ్ ఆర్ట్.
అప్లయిడ్ ఆర్ట్ విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభాపాటవాలను ప్రోత్స హించేందుకు ఈ చిత్రకళా ప్రదర్శనను ఏర్పాటుచేశాం. అప్లయి డ్ ఆర్ట్ నాలుగు సంవత్సరాల విద్యార్థులు రూపొందించిన చిత్రా లను విడి,విడిగా ప్రదర్శనకు ఉంచాం. ఈ ప్రదర్శన 11వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం 11 నుంచి రాత్రి 8 గంటల వరకు కొ నసాగనుంది. ప్రజలందరూ ఉచితంగా తిలకించే అవకాశాన్ని కల్పించాం.
ఆలోచనలను చిత్రాలుగా…
-దివాకర్,
విద్యార్థి, అప్లయిడ్ ఆర్ట్.
మాలోని భావాలను అందమైన చిత్రాలుగా మలిచాం. ఆలోచ నలకు ప్రతిబింబంగా ఈ ఆర్ట్ వర్క్‌లు రూపుదిద్దుకున్నాయి. చిత్ర కళలోని వివిధ శైలులను అందంగా చిత్రీకరించాం. వీటిలో ఆధు నికమైన అడ్వాన్స్డ్ ఇలస్ట్రేటింగ్ చిత్రాలు సందర్శకులను అబ్బు రపరుస్తాయి.
ఆనందంగా ఉంది…
టి.దేవేందరాచారి,
-విద్యార్థి, అప్లయిడ్ ఆర్ట్
కళాశాలలో చిత్రకళలోని విభిన్న అంశాలను చక్కగా నేర్చుకుంటున్నాం. ఇందులో భాగంగా అందంగా రూపొందించి న ఆర్ట్ వర్క్‌లను ప్రదర్శించేందుకు అప్లయిడ్ ఆర్ట్ చిత్ర కళా ప్రద ర్శనను ఏర్పాటుచేశారు. ఈ ప్రదర్శనలో నా చిత్రాలకు చోటు ద క్కినందుకు ఆనందంగా ఉంది. ఇక భవిష్యత్తులో ఆర్ట్ గ్యాలరీని ఏర్పాటుచేయాలన్నది నా కోరిక. ప్రతిభకు అద్దంపడుతూ…
-ఎస్.తిరుపతి,
విద్యార్థి, అప్లయిడ్ ఆర్ట్.
అప్లయిడ్ ఆర్ట్ ప్రదర్శనలోని పలు చిత్ర కళాఖండాలు వేటికవే ఎం తో ప్రత్యేకంగా రూపుదిద్దుకున్నాయి. వీటిని నాతో పాటు తోటి వి ద్యార్థులు ఎంతో అందంగా చిత్రీకరించారు. సృజనాత్మకతకు అ ద్దంపట్టే ఈ చిత్రాలు సందర్శకులను ఆలోచింపచేసే విధంగా రూపుదిద్దుకున్నాయి.
విభిన్న భావాలు పలికిస్తూ…
-జి.కిషోర్,
విద్యార్థి, అప్లయిడ్ ఆర్ట్.
ఈ ప్రదర్శనలోని విభిన్న చిత్రాలు పలు భావాలను పలికిస్తున్నా యి. ముఖ్యంగా 3డి ఇమాజినేషన్ ఆర్ట్ వర్క్‌లు సందర్శకులను అబ్బురపరుస్తాయి. వీటిని కంప్యూటర్‌పై అందంగా చిత్రీకరించ డం జరిగింది. ఈ చిత్రాల్లో సృజనాత్మకతను జోడించి అందంగా తీర్చిదిద్దాం.
-ఎస్.అనిల్ కుమార్
Surya Telugu Daily.
-
భాండాగారం
- జూన్ 2018 (1)
- డిసెంబర్ 2012 (1)
- డిసెంబర్ 2011 (2)
- నవంబర్ 2011 (2)
- సెప్టెంబర్ 2011 (2)
- జూలై 2011 (5)
- జూన్ 2011 (7)
- ఏప్రిల్ 2011 (6)
- మార్చి 2011 (28)
- ఫిబ్రవరి 2011 (6)
- జనవరి 2011 (20)
- డిసెంబర్ 2010 (21)
-
వర్గాలు
- (స్నే)హితులు
- అతివల కోసం
- అవర్గీకృతం
- ఆరోగ్యం
- ఇతర బ్లాగులు సైట్లు
- చిన్నారి లోకం
- చూడు చూడు నీడలు
- చూసొద్దాం
- నచ్చిన కవితలు
- నచ్చిన పాటలు
- నాట్యం
- ప్రకృతి
- భక్తి
- ముద్రలు
- మ౦చి మాటలు
- యూట్యూబు లో తెలుగు
- యెర్రె౦కడు
- రింగ్ టోన్స్
- వర్ణ చిత్రాలు
- వార్తలు
- వింతలూ-విశేషాలు
- విచిత్ర చిత్రాలు
- విజ్ఞానం
- విదేశాలలో మన దేవాలయాలు
- విద్యార్థులకు
- వ౦టా-వార్పు
- సంస్కృతి
- సామెతలు
- సినిమా
- సూపర్ సింగర్స్
- సైకత శిల్పాలు
-
RSS
Entries RSS
Comments RSS