హరివిల్లు

ఎన్నెన్నో వర్ణాలు-అన్నింటా అందాలు…

శతసహస్ర వందనాలు…

శతసహస్ర వందనాలు…

నా ఈ హరివిల్లును నిరంతరం ప్రోత్సహిస్తూ అక్షరాలా లక్ష వీక్షణాలు పూర్తిచేసిన మిత్రులందరికీ కృతజ్ఞతలు…

సనారాజు

జూన్ 28, 2011 Posted by | అవర్గీకృతం | 3 వ్యాఖ్యలు

స్టీవియాతో మధుమేహం దూరం

స్టీవియాతో మధుమేహం దూరం

Stevia_Rebaudiaమధుమేహ వ్యాధితో బాధపడే వారు మధుపత్రి (స్టీవియా) ఆకులను ప్రతి రోజు నమిలి తింటుంటే మధుమేహ వ్యాధి మటుమాయమవుతుందంటున్నారు ఆయుర్వేద వైద్యులు. దీనిని ఇంగ్లీషులో స్టీవియా అని అంటారు. మధుమేహ వ్యాధిగ్రస్తులు తీపి పదార్థాలు తినేందుకు వెనుకాడుతుంటారు. కాని తీపి పదార్థాలను తిన్న తర్వాత మధుపత్రిని నమిలితే శరీరంలో చక్కెర శాతం అదుపులో వుంటుందంటున్నారు ఆయుర్వేద వైద్యులు.

స్టీవియా ఆకులను నోట్లో వేసుకుని చప్పరిస్తే పిప్పరమెంట్‌లా తియ్యగా ఉంటాయి. పంచదార కంటే 30 రెట్లు తియ్యదనాన్ని కల్గివుంటాయి. వీటినుంచి తీసిన చక్కెర మామూలు పంచదార కన్నా 300 రెట్లు తీపిగా ఉంటుంది. సాధారణంగా ఒక కప్పు పంచదార స్టీవియా ఆకుల నుంచి తీసిన పంచదార ఒక స్పూనుతో సమానం. ఇది వింటే ఎవరికైనా ఆశ్చర్యం కలుగకమానదు. మన దేశంలోనే కాదు ఇప్పుడు విదేశాల్లోనూ స్టీవియా మొక్కలను పెంచుతున్నారు…అచ్చ తెలు గులో దీనిని మధుపత్రం అని అంటారు.

చెరకు కన్నా తీపి…
మధుపత్రి ఆకుల్లో చెరకు కన్నా మూడింతల తీపు వుంటుంది. భోజనం చేసే ఇరవై నిమిషాల ముందు మధుపత్రి (స్టీవియా) ఆకులను నమిలితే ఫలితం ఉంటుంది. ఈ మొక్కలను ఇంట్లోను పెంచుకోవచ్చు. మధుపత్రి ఇన్సులిన్‌ను విడుదల చేయడంలో ప్రధానపాత్ర వహిస్తుంది. మధుప త్రి సేవిస్తుంటే మధుమేహ వ్యాధితోపాటు రక్తపోటు, హైపర్‌ టెన్షన్‌, దంతాలు, గ్యాస్‌, కడుపులో మంట, గుండె జబ్బులు కలవారు, చర్మ వ్యాధులు కలవారు, ముఖంపై ముడతలు పడటం నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది.

Stevia_rebaudianaస్వీట్‌ స్టీవియా ఇది అత్యంత తియ్యదనం కలిగిన ఔషదీయ మొక్క. కేవలం దీని పచ్చి ఆకులను తమలపాకుల్లా బుగ్గన పెట్టుకుని చప్పరిస్తే చాలు నోటి క్యాన్సర్‌ వంటి వ్యాధులు క్రమేణా దూరమవుతాయి. అంతేకాదు నోటి దుర్వాసన పోగొట్టే మౌత్‌ ఫ్రెష్‌నర్‌గా కూడా దీనిని ఉపయోగించ వచ్చు. మామూలుగా పంచదార తింటే అనేక వ్యాధులు వస్తాయి. కానీ స్టీవియాతో తయారైన పంచదార తీసుకుంటే ఎటువంటి సైడ్‌ ఎఫెక్ట్‌లు కలిగించకపోగా… మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా నిర్భయంగా దీనిని తీసుకోవచ్చు.

ఆరోగ్య సంజీవని…
స్టీవియాను తీసుకుంటే మన శరీరంలో ఎటువంటి అదనపు క్యాలరీలు చేరవు. దీంతో రక్తంలోని గ్లూకోజ్‌లో ఏరకమైన మార్పు ఉండక… పెరిగిన నిల్వలను తగ్గించి గ్లూకోజ్‌ శాతాన్ని క్రమబద్ధీకరించడంలో స్టీవియా అమోఘంగా పనిచేస్తుంది. ఇది కేవలం డయాబెటీస్‌ వ్యాధిగ్రస్తులకే కాక… అధిక రక్తపోటును తగ్గించడంలో, అంతకంతకూ పెరిగిపోతున్న ఊబకా యాన్ని స్థిరీకరించడంలో, దంత వ్యాధుల నివారణలో సంజీవినిలా పనిచేస్తుందని శాస్ర్తీయ పరిశోధనలలో తేలింది. అంతేకాదు వీటిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ ఫంగల్‌, యాంటీ వైరల్‌ లక్షణాలు మనలో రోగనిరోధక శక్తిని పెంచడంలో… అత్యంత వేగవంతం గాను… సమర్థవంతంగాను పనిచేస్తాయని తేలింది.

ఎక్కడ పుట్టింది?
ఇన్ని సుగుణాలు ఉన్న ఈ మొక్క ఎక్కడ పుట్టిందో తెలుసా… ఇది పెరుగ్వే దేశంలో ఎక్కువగా కాలువల పక్కన, కొలనుల వద్ద విచ్చలవిడిగా పెరిగేది. దీనిని ఆ ప్రాంతం వారు కొన్ని శతాబా ్దలుగా ఔషధ విలువలు కలిగిన మొక్కగా గుర్తించి విరివిగా వాడుతుండేవారు. ఆ ప్రాంతంలో ఉండే ఆదివాిసీలుగా పిలువబడే గ్వారాని ఇండియన్లు దీనిని ‘క్వాహీహీ అని పిలిచేవారట. క్వాహీహీ అంటే తీపి మొక్క అని అర్థం.

దేశ,దేశాలలో…
సుమారు 50 సంవత్సరాల క్రితం ఈ మొక్కలలోని విశేష గుణాలను జపనీయులు గుర్తించారు.గుర్తించడమే గాక దీనిని ఔషధాల తయారీలో కూడా ఉపయోగిస్తున్నారు. అక్కడి నుండి చైనా, థాయ్‌లాండ్‌, మలేషియా, తైవాన్‌ వంటి దేశాలు వీటి సాగు మీద శ్రద్ధవహించాయి. ఇటీవలే దీనికి ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థల గుర్తింపు వచ్చింది.

suryatelugu

 

జూన్ 20, 2011 Posted by | ఆరోగ్యం | | 7 వ్యాఖ్యలు

చిన్నారులకు విజ్ఞానం-సూర్య గ్రహణం


జూన్ 20, 2011 Posted by | విజ్ఞానం | | 1 వ్యాఖ్య

పితృ దేవో భవః నేడు ఫాదర్స్‌ డే

పితృ దేవో భవః నేడు ఫాదర్స్‌ డే

పిల్లల్ని కనిపెంచటం…వారికి విద్యాబుద్ధులు నేర్పించటం… వారి బంగారు భవిష్యత్తును అందంగా తీర్చిదిద్దటంలో తల్లిదండ్రుల పాత్ర సమానంగావున్నా తల్లికి లభించే గుర్తింపే ఎక్కువ. అంటే తల్లి ప్రేమ సెంటిమెంట్‌గా వ్రాసే కథలు, కవితలు, తీసే సినిమాలు… వీటన్నింటిని చూస్తే తండ్రి పాత్రకు అంతగా ప్రాధాన్యత లభించడం లేదని చెప్పుకోవచ్చు. బిడ్డ కోసం అమ్మ చేసే త్యాగం, ఎంత ముఖ్యమైనదో… నాన్న పడే తాపత్రయం, శ్రమ అంతే ముఖ్యమైనవి.

కానీ తండ్రి శ్రమ, అభిమానం, తాపత్రయం.. అన్నీ పరోక్షమైనవి. నవమాపాలు మోసి పిల్లల్ని కనటం వలన స్ర్తీ (తల్లి)దే పైచేయి. పైగా పిల్లల అవసరాలరీత్యా బాల్యం అంతా అమ్మ చుట్టూ తిరుగుతుంది. అందుకే అమ్మతో ఆ బంధం అంత సులభంగా, సహజంగా ఏర్పడుతుందనటంలో అతిశయోక్తి లేదు. కానీ తండ్రి పిల్లలకు అవసమైన సదుపాయాలను సమకూరుస్తూ వారికి ఏ లోటు రాకుండా చూస్తాడు. పిల్లల దగ్గర ఎప్పుడూ తల్లి ఉండేటట్టు చూసి వారిని కంటికి రెప్పలా కాపాడుతుంటాడు. ఈ నేపథ్యంలో తల్లితో పాటు తండ్రికి కూడా సమాన గౌరవం ఇవ్వాలన్ని ఉద్దేశ్యంతో ప్రతి ఏటా జూన్‌ 19వ తేదీన ‘ఫాదర్స్‌ డే’ను జరుపుకుంటున్నారు.

fdayభార్య గర్భం దాల్చిన దగ్గర్నించి ఆమెతో పాటు సమానంగా ఆమెను, ఆమె కడుపున వున్న బిడ్డను కూడా ఎంతో జాగ్రత్తగా చూసుకునే తండ్రుల సంఖ్య పెరిగింది. ప్రసవం సమయంలో, ప్రసవానంతర సమ యంలో స్ర్తీకి ధీటుగా స్ర్తీకన్నా ఎక్కువగా కూడా పుట్టిన బిడ్డని ఎంతో జాగ్రత్తతో కూడిన మమకారంతో చూస్తు న్న తండ్రుల సంఖ్య గణనీయంగా పెరిగింది అనటంలో అతిశయోక్తి లేదనే చెప్పాలి. అసలు కొన్ని చోట్ల విదే శాల్లో పురుషునికి కూడా మెటర్నటీ లీవ్‌ ఇస్తారని వినికిడి.

మన దేశంలో కూడా ఇలా భార్యను, పిల్లల్ని బాధ్యతగా ప్రెగ్నిన్సీ నిర్ధారణ జరిగిన రోజు నుంచి అత్యంత ఆదరంగా, అభిమానంగా, చూసే భర్తలు ఎంద రో? అంటే అలాంటి తండ్రులకి.. నేడు ఫాదర్స్‌ డే గ్రీటింగ్స్‌ చెప్పాల్సిన బాధ్యత మనకి లేదా?? తల్లి స్థానం ‘నిజం’ అని తండ్రి స్థానం ‘నమ్మకం’ అనే మాటను వినే వుంటారు చాలామంది. తండ్రి ఎవరో తల్లి చెప్తే తప్ప తెలీదు అనే స్ర్తీవాదులున్నప్పటికీ సైంటిఫిక్‌గా అది నిజం కానే కాదుట. పసి పిల్లలు తమ తండ్రిని గుర్తిస్తారు ట. కళ్లు తెరచినప్పటి నుంచీ తమ తల్లితో పాటుగా తండ్రి కోసం కూడా వెతుకుతారుట. అంటే తమ తండ్రి స్పర్శను వారు చక్కగా గుర్తించగలరు. తల్లి, తండ్రులు, బిడ్డల మధ్య పెనవేసుకున్నది ‘జెనిటిక్‌ బాండ్‌’. అది తరతరాలకి పాకే అపూర్వ నిధి.

మార్గదర్శకుడిగా తండ్రి…
‘ధైర్యం నాన్న ఇచ్చేది…భద్రత నాన్న ఇచ్చేది…క్రమశిక్షణ నాన్న నేర్పేది…అవసరాలు నాన్న తీర్చేవి… పిల్ల లకు తండ్రి రోల్‌ మోడల్‌…‘బిడ్డల అభివృద్ధే నాన్న లక్ష్యం…తండ్రి ప్రభావం కన్పించేది కాదు… అనుభవిం చేది…వందమంది ఉపాధ్యాయుల పెట్టు ఒక తండ్రి…తండ్రి కోపం వెనుక బాధ్యత వుంది…‘ఎలా బ్రతకాలో నేర్పించడు తండ్రి.. కాని బ్రతకటం ఎలాగో తన పిల్లలకి తెలిసేట్లుగా నేర్పిచగలడు…మంచి తండ్రి వున్న బిడ్డలు ధన్యులు..’.ఇలా ఎన్నో చెప్పగలము తండ్రి గురించి. అసలు తండ్రి చూపే అభిమానం, బాధ్యతలు ఎవరికీ స్పష్టంగా కంటికి కనపడవు. కానీ ప్రభావం చాలా వుంటుంది. ఒకప్పటి తం డ్రులు తమ హాబీలకు, ఇతర సుఖాలకు ప్రాధాన్యత ఇచ్చాకే కుటుంబం, భా ర్య, పిల్లలు అన్నట్లుగా వ్యవహరించినా… నేటి తరంలో తండ్రులు చాలా జాగ్రత్తగా ప్రణాళికాబద్ధంగా పిల్లల చదువులు, కెరీర్‌ విషయాల్లో ఆలోచిస్తున్నారు.

ఈ తరం తండ్రులు…

  • పెత్తనానికి ప్రాధాన్యత ఇవ్వటం లేదు.
  • ఇంటి పనుల్లో సంపూర్ణంగా చేదోడు, వాదోడుగా వుంటున్నారు.
  • పిల్లలకి అనుగుణంగా స్నేహితుల్లా వ్యవహరిస్తున్నారు.
  • పిల్లల భావోద్వేగాలు చక్కగా అర్థం చేసుకుంటున్నారు.
  • అదనపు బాధ్యతలు మోయటంలో ఉత్సాహంగా వున్నారు.
  • హాబీలు, అవసరాలు కూడా విస్మరిస్తున్నారు.
  • బిడ్డలపట్ల అపరిమితమైన వాత్సల్యాన్ని చూపిస్తున్నారు.
  • స్ర్తీ ఉద్యోగ, ఆరోగ్య రీత్యా ఇబ్బంది పడినా తను మాత్రం సంతోషంగా అన్నీ బాధ్యతలు మోయటం గమనార్హం.
  • పురుషాహంకారం అనే మాటకి అవకాశం లేకుండా పిల్లల స్నానం, భోజనం, తినిపించటం అన్నీ తానే చూస్తున్నారు.
  • పిల్లల్ని ఎత్తుకు తిప్పటం, లాలించడం, ఆడిం చటం అనే పనులకి అత్యధిక సమయాన్ని కేటాయి స్తున్నారు. తమ పనులు, అవసరాలు కూడా మరచిపోయి.ఒక్కపుడు ‘‘అమ్మ కూచి’’ ‘‘బామ్మ కూచి’’… అన్న మాటలు నేడు చాలా వరకూ (ఈనాటి తండ్రుల హయాంలో) వినబడటం లేదు. ‘‘నాన్న కూచి’’ అన్నదే తరచుగా మనకి వినబడుతున్నది. అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా వాళ్ళు ‘‘నాన్న కూచులే’’! అయిపోతున్నారు.

fday1

   సహనం, ప్రేమ, అనురాగం, అభిమానం, బాధ్యత.. ఆలనా, పాలనా… అన్నిటా తల్లులను మించిపోతు న్నారు నేటి తండ్రులు. పిల్లలు పసి మొగ్గలు కదా! వారికి ఎవరో నేర్పక్కరలేదు.‘అమ్మని.. నాన్నని అభిమానించమని కాని నేటి సిసింద్రీ లు ‘నాన్న కావాలి, నాన్నతో వెడతాం అనటం చాలా విడ్డూర మా? కాదు, అలా పిల్లల్ని పెంచటంలో తండ్రులు తీసుకునే పాత్ర అలా వుంది.‘తండ్రి ఎటువంటి వాడైనా తన కన్న బిడ్డల క్షేమాన్ని అభివృద్ధి ని కోరుకుంటాడు అనటంలో అనుమానమే లేదు.
   ఎవరి మెప్పుకోసమో తన కు టుంబం కోసం తండ్రులు పాటుపడరు. అయినా సంఘంలో తల్లి పాత్రకి వచ్చి నంత గుర్తింపు తండ్రి పాత్రకి రావటం లేదు. పిల్లల ఆర్ధిక అవసరాలు తీర్చటం, పిల్లల విద్యాబుద్ధులు నేర్పటం, భార్య పిల్లలు అవసరాలు గుర్తించటం, ఇంటి యజమానిగా తగిన సరియైన నిర్ణయాలు తీసుకోవటం.. ఇవి తండ్రి బాధ్యతలుగా సంఘం నిర్దేశించింది.అవసరాల రీత్యా చిన్నతనంలో అందునా బాల్యంలో తల్లికి అతి దగ్గరైన పిల్లలు సైతం వయసు వచ్చే కొద్దీ త మ తండ్రి విలువను తెలుసుకొని, ఆయన మనసుని అర్థం చేసుకొని – ఆయన్నీ గౌరవిస్తారు. అసలు పిల్ల లకి తొలి ‘హీరో తమ తండ్రే’’! పిల్లలు పసితనం నుంచి ఊహ తెలిసే లోపల ఏ టివి యాడ్‌ చూసినా అం దులో పురుషపాత్ర కనపడగానే నాన్న… డాడీ అని పిలవటం నేర్చుకోటం చూస్తుంటాం!

సమాజంలో…

   మన సమాజంలో తండ్రుల మీద ఒక రకమైన భావం వుంది. భర్తను పోగొట్టుకున్న స్ర్తీ మరో వివాహం చేసు కోదు. పిల్లల కోసం బ్రతుకుతుంది. కానీ భార్య మరణించిన వ్యక్తి మరో వివాహానికి సిద్ధపడతాడు అంటా రు. తల్లులలాగా తండ్రులు పిల్లల కోసం త్యాగం చేయరని ఒక బలమైన అభిప్రాయం. ఇది సామాజి కంగా వున్న అభిప్రాయమే తప్ప, పిల్లల్ని నిర్లక్ష్యంతో తండ్రి వివాహం చేసుకోవటం కానేకాదు. పిల్లల బాగోగులు చూసేందుకే అతను మరొ పెళ్ళి చేసుకొనే ఆలోచన అన్నది అంతరార్ధం!

ఎప్పటి నుంచి జరుపుకుంటున్నారు…

   బాధ్యత గల పౌరులుగా పిల్లల్ని తీర్చిదిద్దే తండ్రి పాత్ర ప్రాముఖ్యతను గుర్తించి ప్రశంసిస్తూ చేసే అందమైన రోజు ‘ఫాదర్స్‌ డే’. ప్రపంచ వ్యాప్తంగా తండ్రి పాత్ర కీలకమైనా గత శతాబ్ది వరకు పిల్లల జీవి తంలో తండ్రి పాత్రకు సంబంధించిన అధికారిక గుర్తింపు లేదు. అసలు ఫాదర్స్‌డే ఉత్స వాలను జరపాలని ఆ అవసరా న్ని గుర్తించిన మహిళ లవింగ్‌ డాటర్‌ సొనారా. ఆమె వాషింగ్‌టన్‌లోని స్పొకన్‌కు చెందింది. ఆధునిక ఫాద ర్స్‌డే ఉత్సవాలకు మూలం.
   ‘అమెరికా సంయుక్త రాష్ట్రాలు’ అయినా అన్ని ప్రపంచ దేశాలకు పాకింది తండ్రులందరి గౌరవా ర్ధం ఈ పండుగ! 1909లో మదర్స్‌డే అనే మాట స్మార్ట్‌ కుటుంబంలో తండ్రి పోషించిన పాత్ర ‘ఫాదర్స్‌’ డేకి పునాధి అయ్యింది. అసలు దాని వెను క కథ! హెన్రీ జాక్సన్‌ స్మార్ట్‌, విలియమ్‌ స్మార్ట్‌ దంపతులు స్పోకనే గ్రామంలో వుండేవారు. వారికి ఆరుగురు సంతానం. వారిలో చివరి సంతానం ‘సొనారా’, ఆమె ఆరు నెలల వయసులో తల్లి మరణించింది. అందరికన్నా పెద్దపిల్ల 12 సంవత్సరాలు. ఇది 1885 నాటి స్థితి ఇది. అయితే అపుడు అతను (తండ్రి) మరల వివాహం చేసుకోవచ్చు.
   ఆ అవకాశం, హక్కు సమాజంలో వున్నాయి. కానీ తను వివాహం చేసుకొని సం సార సుఖం కన్నా కూడా తండ్రిగా తన పాత్రను నిర్వహించేందుకు చాలా ఇష్టపడ్డాడు. వ్యవసాయం చేస్తూనే ఆరుగురు బిడ్డలకీ తల్లి లేని లోటు తెలీకుండా పెంచాడు. ఆఖరిదైన సొనారాకి ఆయనే తల్లి తండ్రి అయ్యి పాలు పట్టటం, స్నానం, ఆహారం, జోల పాడి నిద్రపుచ్చటం, అన్నీ చేసి తల్లి పాత్రను అద్భుతంగా పోషించాడు. అసలు ఆయన పెంపకంలో ఆమెకి తల్లి అనేది వుంటుందని… తల్లి పాత్ర ఒలా వుంటుందని కానీ తెలీలేదు. ఆమెకి తెల్సింది తనని కంటికి రెప్పలా కాపాడిన తండ్రి.. ఊహ తెల్సింది మొదలు కళ్ళ ముందు తండ్రి. దైవంలా తనను కాపాడిన ఆ తండ్రి రుణాన్ని తీర్చుకోవటం కోసం బాగా ఆలోచించింది.. అందులోంచి వచ్చినదే వేడుకగా ‘‘అతని పుట్టిన రోజు ఘనంగా నిర్వహించటం’’.
   తన తండ్రి మిగిలిన తండ్రిలా కాదు. ఆషామాషీగా నిర్వహించకూడదు. తమ కోసం ఎంతో త్యాగం చేసిన మానవతా మూర్తి. అందుకే ఆయన జన్మదినాన్ని తండ్రులందరి జన్మదినంగా జరపాలని ఆమె అనుకుంది. కానీ ఆయన పుట్టిన తేదీ తెలీదు కానీ జూన్‌ నెలలో పుట్టినట్లుగా తెల్సు. అందుకే జూన్‌ నెలలో ఒక రోజు గ్రామంలోని వారందరినీ పిలిచి ఈ పుట్టిన రోజు కేవలం తన తండ్రిదే కాదని, అందరి తండ్రులందరిదీ అని తండ్రులు నిర్వహిస్తున్న పాత్రను మొత్తం సమాజం తెలుసుకొనే రోజని, పిల్లలకి విలువలు తెలిపే రోజని, దీన్ని ‘ఫాదర్స్‌ డే’ గా జరుపుకుందాం అని ప్రకటించింది సొనారా! పైగా మదర్స్‌డే వున్నపుడు ఫాదర్స్‌ డే కూ డా ఎందుకు నిర్వహించరాదని సొనారా ప్రశ్నించింది. అంతా నవ్వుకున్న కూడా ఆమె ‘ఆ ఫాదర్స్‌ డే’ గుర్తిం పు కోసం నిజాయితీగా తీవ్రంగా ప్రచారం ప్రయత్నించింది 1910 జూన్‌ 19వ తేదీన ‘స్పోకన్‌’లో తొలి ఫాదర్స్‌డే జరుపుకున్నపుడు ఆమెకు తొలి విజయ సంకేతాలు కన్పించాయి. మినిిస్టీరియల్‌ అసోసియేషన్‌ స్థానిక యంగ్‌మెన్‌ క్రిస్టియన్‌ అసోసియేషన్‌ (వైఎంసిఎ)ల మద్ధతుతో ఈ కార్యక్రమం జరిగింది.
   అసలు మొదట జూన్‌ 5న మమతానురాగాలు అందించే తండ్రి పుట్టిన రోజును ఫాదర్స్‌డేగా నిర్వహించాల నుకున్న కూడా ఏర్పాట్లకి తగిన సమయం లేక జూన్‌ 3వ ఆదివారం నాడు నిర్వహించారు. అయితే 1916 లో ఉడ్రోవిల్మన్‌ అధికారికంగా ఆమోదించాడు. 1966 జూన్‌ 3వ ఆదివారం ఫాదర్స్‌డే నిర్వహించాలని తీర్మానంపై అప్పటి అధ్యక్షుడు ‘లిండన జన్మన్‌’ సంతకాలు చేసాడు. 1972లో ‘రిచర్డ్‌ నిక్మన్‌’ (అప్పటి అధ్యక్షుడు) జూన్‌ 3వ ఆదివారం ఫాదర్స్‌డే నిర్వహించాలని శాశ్వత జాతీయ ప్రతిపత్తిని కల్పించారు. ఆనా టి నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఫాదర్స్‌డే ప్రసిద్ధి పొందింది.
   నేటి ఆధునిక ఫాదర్స్‌డే మాత్రమే కాక తండ్రులకి ప్రత్యేక రోజును కృతజ్ఞతా సూచకంగా కేటాయించి న ట్లు అనేక వేల సంవత్సరాల క్రితం ఉందని చరిత్రకారులు అంటారు. బాబిలోన్‌ శిధిలాల్లో లభించినట్లు చేస్తారు ఫాదర్స్‌డే ఆనవాళ్లు!ఎల్మెసు అనే పిల్లాడు నాలుగు వేల సం క్రితం మట్టితో కార్డు తయారు చేసి దానిపై ఫాదర్స్‌ డే సందేశాన్ని చెక్కించినట్లు చరిత్రకారులు చెప్తారు. అందులో తన తండ్రి మంచి ఆరోగ్యంగా దీర్ఘకాలం జీవించాలని ఎల్మేసు తండ్రికి ఏం జరిగిందన్నది అన్నట్లు: ఫాదర్స్‌డే ఉత్సవాలు మాత్రం ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో జరుపుకునే ఆచారం వుంది.

ఫాదర్స్‌ డే మూలం… సిద్ధాంతాలు…

   1908 – తొలి ఫాదర్స్‌ డే, చర్చ్‌ సర్వీస్‌, వెస్ట్‌ వర్జీనియా (కొందరి ఉద్దేశం)
   ఇంకొందరు వాషింగ్టన్‌లో వాంకోడర్‌లో, తొలి ఫాదర్స్‌డే అంటారు
   1915 – చికాగో లయన్స్‌ క్లబ్‌ అధ్యక్షుడు హ్యారీమీక్‌ జరిపాడంటారు.
   మరికొందరు చరిత్రకారులు ‘‘ఫాదర్స్‌ డే ప్రారంభ ఘనతను వెస్ట్‌ వర్జీనియాకు చెందిన శ్రీమతి చార్లెస్‌ క్లేట న్‌ది అని అంటారు. పాశ్చాత్య దేశాల నుంచి దిగుమతి అయిన వేడుక ఇది. మన దేశంలో దీని వయస్సు శతాబ్ది కాలం లోపే.

బయటే కాదు ఇంటి పనులు కూడా…

   ఒకప్పుడు తల్లి మాత్రమే పిల్లలతో చాలా చనువుగా ఉండేది. కానీ నేడు మారుతున్న కాలానికి అనుగుణంగా తండ్రి కూడా పిల్లలను దగ్గరకు తీసుకొని వారితో చనువుగా ఉంటున్నాడు. పిల్లలను స్నేహితులుగా చూస్తున్న తండ్రులు కూడా నేడు ఉన్నాడు. ఇంటి పనులతో పాటు ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తిస్తున్న తల్లి మాదిరిగానే తండ్రి కూడా ఒకవైపు ఉద్యోగం చేస్తూ అవసరమైతే ఇంటి పనులను కూడా చేస్తున్నాడు.

-సరళ, విద్యార్థిని

అమ్మానాన్నంటే ప్రాణం…

   మా నాన్నంటే నాకెంతో ఇష్టం. ఆయన నన్ను కంటికి రెప్పలా చూస్తాడు. పెద్దయిన తర్వాత కూడా చిన్నప్పటి ప్రేమ ఏమాత్రం తగ్గలేదు. నాతో కలిసి సినిమాలు, షికార్లకు కూడా వస్తాడు. నాన్న, నేను మంచి స్నేహితులుగా ఉంటాం. ఇక అమ్మ నన్ను ఎంతో గారాబం చేస్తుంది. అమ్మ, నాన్న ఇద్దరూ నాకు ప్రాణం.

– శ్రీకాంత్‌, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి

నాన్నవల్లే క్రమశిక్షణ…

   చిన్నప్పటి నుంచి నాన్నకు నేనంటే ఎంతో ఇష్టం. అంతమాత్రాన నన్ను బాగా గారాబం చేయలేదు. నాకు ఎప్పుడూ ఎలా నడుచుకోవాలే చెబుతూ ఎంతో క్రమశిక్షణగా పెంచాడు. మంచి,చెడు గురించి చెప్పి సన్మార్గంలో పయనిస్తేనే సమాజం లో అందరి దృష్టిలో మంచివారిగా మిగిలిపో తామని చెబుతాడు. నాన్నవల్లే నాకు క్రమశిక్షణ అబ్బింది.

-రూపల్‌, విద్యార్థిని

తల్లితో సమానంగా తండ్రికి గౌరవం..

   మాతృదేవో భవః…పితృదేవో భవః…అని అన్నారు మన పెద్దలు. తల్లితో పాటు తండ్రికి సైతం సమాన గౌరవం ఇవ్వాలి. తల్లి కని పెంచితే తండ్రి కంటికి రెప్పలా కాపాడతాడు. తన పిల్లకు అవసరమైన సదుపాయాలన్నింటినీ కల్పిస్తాడు. తల్లి ఇంట్లో ఉండి ఇంటి పనిచేసుకుంటూ పిల్లలను పోషిస్తే…తండ్రి ఉద్యోగం చేసి ఇంటికి, పిల్లలకు కావాల్సిన సౌకర్యాలను సమకూరుస్తాడు. తల్లిలాగా పిల్లలతో చనువుగా ఉండలేకపోయినా తండ్రి పిల్లలను దారిలో పెట్టేందుకు వారిని కోప్పడతాడు. క్రమశిక్షణతో మెలిగే విధంగా చూస్తాడు.

-సురేష్‌, ప్రైవేట్‌ ఉద్యోగి

డా ఈడుపుగంటి పద్మజారాణి

suryatelugu

 

జూన్ 19, 2011 Posted by | సంస్కృతి | , | 1 వ్యాఖ్య

అందాలొలికే అనంతగిరి

అందాలొలికే అనంతగిరి

Anantagiri_Hillsరాష్ట్రంలో ఉక్కు నగరంగా పేరుగాంచిన సుందర నగరం విశాఖ. ఈ అందమైన తీర ప్రాంత పట్టాణానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది అనంతగిరి. ప్రశాంతమైన ప్రకృతి నడుమ… దట్టమైన అడవులు, పచ్చని చెట్లు, సుందర దృశ్యాలతో రంజింపజేసే ఈ ప్రాంతం ప్రకృతి ప్రేమికులకు ఓ సరికొత్తలోకంలోకి తీసుకెళ్తుంది. అనంతగిరిలో వాతావరణం ఎల్లప్పుడూ శీతలంగా ఉండటమే కాకుండా ఎంతో నయానందకరంగా ఉండటం వలన ఇక్కడికి సంవత్సరం పొడవునా పర్యాటకుల తాకిడి ఉంటుంది. రాష్ట్రంలో పేరొందిన హిల్‌ స్టేషన్లలో ఒకటి ఈ అరకు అనంతగిరి. అంబరాన్ని తాకే కొండలు, ఆ కొండలపై పచ్చని చెట్ల సోయగాలు, ఏటవాలుగా ఉండే కనుమలు, లోయలు, జలపాతాలు పర్యాటకులను రంజింపజేస్తాయి.

ముఖ్యంగా కొత్తగా పెళె్ళైన జంటలకు ఈ ప్రదేశం ఓ స్వర్గధామమంటే అతిశయోక్తికాదు. అరకు లోయకు 17 కిలోమీటర్ల దూరంలో, అక్కడి తిరుమల హిల్స్‌ పై భాగం లోని తూర్పు కనుమల్లో భాగంగా ఈ ప్రదేశం పర్యాటకుల మనసును దోచుకుంటోంది. తిరుమల గిరికి వెళ్లేందుకు ఘాట్‌ రోడ్డులలో చేసే ప్రయాణం అద్భుతంగా ఉంటుంది. ఎటుచూసి నా సుగంధ సుమధుర పరిమళాలను అందించే కాఫీ తోటల సౌందర్యం పర్యాటకులను ఆనంద సాగరంలో ఓలాడిస్తుంది. అంతేకాకుండా రకరకాల పండ్ల తోటలు మనసును పరవశింపజేస్తాయి. ఈ ప్రాంతంలో కాఫీ తోటలు, పండ్ల తోటలు మాత్రమే కాకుండా వనమూలికలు కూడా లభ్యమవటం విశేషం.

దక్షిణ బధ్రీనాథ్‌…
ముఖ్యంగా దక్షిణ బధ్రీనాథ్‌గా పేరుగాంచిన తిరుమలగిరి ప్రాంతంలో భవనాశి సరస్సును అత్యంత పవిత్రమైన తీర్థంగా సేవిస్తుంటారు ఇక్కడికి వచ్చే పర్యాటకులు. ఈ సరస్సు వల్లనే ఈ ప్రాంతానికి దక్షిణ బధ్రీనాథ్‌ అనే పేరు వచ్చిందని కూడా చెబుతారు. అలాగే అనంతగిరి నుంచి ముచికుందా నది పాయలుగా చీలి వేగంగా పరుగులు తీస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. అనంతగిరిలో కాఫీ తోటల పరిమళాలతోపాటు రకరకాల పూల తోటల సుగంధాలతో, పక్షుల కిలకిలారావాలతో, సూర్యోదయ-సూర్యాస్తమయ సమయాల్లో ప్రకృతి వింతశోభతో అలరారుతూ ఉంటుంది. ఇక్కడ లోతుగా ఉండే లోయలలోకి వేగంగా దుమికే జలపాతాల సౌందర్యం, పలు రకాల పండ్లతో అలరించే మామిడి తోటలు కూడా పర్యాటకులకు ఓ వింత అనుభూతికి గురిచేస్తాయి.

కోరిన కోరికలు తీర్చే… అనంత పద్మనాభుడు…
ప్రకృతి రమణీయతను విశేషంగా కలిగి ఉండడమే కాకుండా ఇక్కడికి వచ్చే యాత్రికులను భక్తి పారవశ్యంలో నింపుతుంది ఇక్కడి అనంత పద్మనాభస్వామి ఆలయం. ఆంధ్రా ఊటీగా స్థానికు లు ప్రేమగా పిలిచే ఈ ప్రాంతం ఎంతో ఆహ్లాదకరంగా ఉండటంతోపాటు ఇక్కడి ఎత్తైన ప్రాంతాలు, సేలయేర్లు, కొండలు, పెద్ద పెద్ద చెట్లు పర్యాటకులను కట్టిప డేస్తున్నట్లుగా ఉంటాయి.

ఇలా వెళ్ళాలి…
అనంతగిరికి చేరుకోవటం ఎలాగంటే… ఈ ప్రాంతానికి రైలు, రోడ్డు మార్గాల ద్వారా వెళ్లవచ్చు. శ్రీకాకుళం రైల్వే స్టేషన్‌ నుంచి 3 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే అనంతగిరి చేరవచ్చు. అలాగే ఈ ప్రాంతానికి విశాఖపట్నం నుంచి బస్సు సౌకర్యం కూడా కలదు. హైదరాబాద్‌, విశాఖపట్నం, ఇతర నగరాల నుంచి కూడా బస్సు సౌకర్యం కలదు. ఇక్కడ బస చేసేందుకు ప్రైవేటు కాటేజీలు, హోటళ్లు, ఇన్‌స్పెక్షన్‌ బంగళాలు అందుబాటులో ఉన్నాయి.

surya telugu

 

జూన్ 17, 2011 Posted by | చూసొద్దాం | , | 1 వ్యాఖ్య

భారతీయ శిల్పకళాకాణాచి ఖజురహో

 

 

 

 

 

 

 

 

 

 

 

 

భారతీయ శిల్పకళాకాణాచి ఖజురహో

అవి కొండలే కావచ్చు… కాని మనసుల్ని దోచే అరు దైన కళాఖండాలు ఆ కొండల మాటున దాగి ఉన్నాయి. అవి రాళ్లే కావచ్చు… కాని జవ్వనులైన జవరాళ్లలా నాట్యం చేస్తాయి. ప్రపంచానికి భారతదేశం అందించిన వరాలీ శిల్పాలు. నిజజీవితంలోని విభిన్న కోణాల్ని ఇక్కడి శిలలు అణువణువునా ఆవిష్కరిస్తున్నాయి. ఛందేలా రాజపుత్రుల కృషికి ఇవి దర్పణాలుగా నిలుస్తాయి.

Khajuraho-Templeఖజురహో దేవాలయాల నిర్మాణానికి దాదాపు వందేళ్లు పట్టింది. ్రశ 950-1050 మధ్య కాలంలో ఛందేలా రాజపుత్ర రాజులు ఈ గుహాలయాల నిర్మాణాన్ని చేపట్టారు. కళాత్మక నైపుణ్యానికి, వైభవానికి ఈ గుహాలయాలు దర్పణాలు. మొత్తం 85 దేవాలయాల్లో ఇప్పటికే నిలిచి ఉన్నవి కేవలం 22 మాత్రమే. ఖజురహో చుట్టూ 8 ద్వారాలతో కూడిన కుడ్యం ఉన్నది. ప్రతి ద్వారం రెండు బంగారు కొబ్బరి కాండముల మధ్య ఉన్నది. సుమారు 8 చదరపు మైళ్ళ అంటే 21 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణం లో 80 కి పైగా హిందూ దేవాలయాలు పరుచుకొని ఉన్నాయి.

ఉత్తర భారతం లో ఇతర సాంస్కృతిక స్థానాల వలె ఖజురాహో దేవాలయాలు క్రీశ 1100-1400 ల మధ్య ముస్లిం చొరబాటు దారుల చేత నేలమట్టం కాలేదు. చాలా కాలం నిర్లక్ష్యం తరువాత 19 వ శతాబ్దం లో బ్రిటీష్‌ వారు వీటిలో కొన్నింటిని కనిపెట్టారు. తవ్వకాలు మొదలు పెట్టారు. జులై-మార్చి మధ్య కాలం ఖజురహో సందర్శించడానికి అనువైన సమయం. ఈ పురాతన ఖజురహో దేవాలయాలు యునెస్కో వారసత్వ సంపదగా గుర్తింపబడినాయి. ఇక్కడ నిర్మించిన దేవాలయాలు, హిందూ మరియు జైన దేవాలయాల సమూహం. దీనికి ఆ పేరు హిందీ భాష నుండి మూలంగా వచ్చినది. హిందీలో ఖజూర్‌ అనగా ఖర్జూరము.

శృంగార జగత్తు ఖజురహో…
Khajurahoభారతీయ సంసృ్కతిలోని శృంగార తత్వాన్ని చాటి చెప్పే ఖజురహో మధ్యప్రదేశ్‌లో ఉంది. శృంగార రసాధిదేవతల చిత్రాలున్న ఖజురహో శిల్పకళా సౌందర్యాన్ని చూడాలంటే రెండు కళ్ళూ చాలవు. సుమారు వెయ్యేళ్ళ చరిత్ర కలిగిన ఈ విశిష్ట ఆలయాలు… ఎన్నో ప్రకృతి బీభత్సాలకు గురయ్యాయి. ఎందరో దురాశాపరుల దాడులతో పాడైపోగా మిగిలిన ఆలయాల్లో జీవం ఉట్టిపడే శిల్పకళా సంపద ఈనాటికీ సందర్శకులను మంత్రముగ్ధుల్ని చేస్తోంది. వెయ్యేళ్ల కిత్రం చందేలా రాజవంశీయుల పరిపాలనలో రాజధానిగా వెలుగొందిన ఖజురహో గ్రామం… ఆ రాజుల పరిపాలన అంతమవడంతో అక్కడి అద్భుత శిల్ప సంపద కూడా మరుగున పడిపోయింది.

కాలక్రమంలో ఈ గ్రామం చుట్టూ చెట్లు పెరిగిపోయి ఒక అడివిలా మారిపోయింది. 1839 లో మళ్లీ ఖజురహో వెలుగు చూసింది. ఆనాడు చందేలా రాజులు మొత్తం 80 దేవాలయాలు నిర్మించగా నేడు 22 దేవాలయాలు మాత్రమే కన్పిస్తున్నాయి. ఈ ఆయలయాల మీద ఉన్న శిల్పాలు అపురూపమైనవే కాదు శృంగారాన్ని ఉద్దీపింపజేసేవిగా ఉంటాయి. వెయ్యేళ్లపాటు ఇంతటి కళా ప్రాశస్త్యాన్ని తనలో దాచుకున్న ఖజురహోను మరింతగా ప్రాచుర్యంలోకి తేవడానికి మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఇందుకోసం ఈ చిన్నగ్రామంలో విమానాశ్రయాన్ని కూడా ఏర్పాటు చేయడం విశేషం.

ఆలయాలకు ఆలవాలం…
Khajuraho1ఆదినాధ దేవాలయం: జైన తీర్ధాందకరుడు. ఆది నాధుడికి అంకితమైన ఆలయం ఇది.
ఘంటాయ్‌ గుడి: ఇది కూడా జైన దేవాలయం. ఇందులో వర్ధమాన మహావీరుడి తల్లి యొక్క 16 స్వప్నాల్ని ఆవిష్కరించే చిహ్నాలు ఉన్నాయి. గరుడ పక్షిపై ఉన్న జైన దేవత చిహ్నం కూడా ఇక్కడ ఉంది.
పార్శ్వనాధ దేవాలయం: ఇక్కడ ఉన్న జైన దేవాలయాల్లో కెల్లా అతిపెద్ద దేవాలయం ఇది. ఉత్తరం దిక్కున ఉన్న కుడ్యాలపై చిత్రాలు ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి. నిజజీవితంలోని రోజువారీ కార్యక్రమాల్ని ఇవి ప్రతిబింబిస్తాయి. మొదటి తీర్ధాంకరుడైన ఆదినాధుడి వృషభానికి ఎదురుగా ఉన్న సింహాసనం ఎంతో ఆకర్షణీయంగా ఉంది. 1860లో ఇక్కడ పార్శ్వనాధుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.

చతుర్భుజ దేవాలయం: విష్ణుమూర్తిని గర్భగృహంలో కలిగిన దేవాలయమిది.
దూల్‌దాహ దేవాలయం: ఇది శివాలయం. అప్సర, కిన్నెర కింపురుషాదుల కూడ్య చిత్రాలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.

మాతానాగేశ్వర దేవాలయం: ఇది శివాలయం ఎనిమిది అడుగుల ఎత్తున్న లింగం ఇక్కడ ప్రసిద్ధి.
లక్ష్మణ దేవాలయం: ఇది వైష్ణవాలయం. ఇక్కడ త్రిమ్తూరులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల విగ్రహాలు ఉన్నాయి. విష్ణుమూర్తి అర్ధాంగి లక్ష్మీదేవి విగ్రహం కూడా ఉంది. విష్ణుమూర్తి అవతారాలైన నరసింహావతారం, వరాహావతరాలతో కూడిన విగ్రహం ప్రసిద్ధి చెందింది. ఇలాంటి వరాహావతారం – వరాహ దేవాలయంలో కూడా – తొమ్మిది అడుగుల ఎత్తుతో అలరారుతోంది.
విశ్వనాథ దేవాలయం: మూడు తలల బ్రహ్మ విగ్రహం ఇక్కడ ఉంది.
చిత్రగుప్త దేవాలయం: ఇది సూర్య దేవాలయం. ఉదయించే సూర్యుడిని దర్శిస్తూ తూర్పు ముఖాన ఈ దేవాలయం ఉంది.

చౌంసత్‌ యోగిని దేవాలయం: ఖజురహోలోని గ్రానైట్‌తో తయారైన ఏకైక దేవాలయం ఇది. అన్నింటిలోకెల్లా అత్యంత ప్రాచీనకాలానికి అంటే క్రీశ900 శతాబ్దానికి చెందింది. ఇది కాళిమాతకు చెందిన ఆలయం.

కాందారియ మహాదేవ్‌ దేవాలయం: ఖజురహోలోని అతిపెద్ద దేవాలయం ఇది. దీని ఎత్తు 31 మీటర్లు. ఇది శివాలయం.

నృత్యోత్సవాలు…
ఖజురహో లోని శిలలపై చెక్కిన శిల్పాలు ప్రదర్శించే నృత్యభంగిమలు అన్నీ ఇన్నీకావు. అలా నాట్యాలాడే శిల్పాలను తలదన్నే రీతిలో ఖజురహో నృత్యోత్సవాలు ఏటా కన్నుల పండువగా జరుగుతాయి. భారతీయ శాస్ర్తీయ నృత్య కళాకారులకు ఈ ఉత్సవాలు ప్రధాన వేదికగా నిలుస్తాయి. ఇవి ఏటా ఫిబ్రవరి / మార్చిలో జరుగుతాయి. వారం రోజుల పాటు జరుగే ఈ ఉత్సవాలకు దేశవిదేశాల నుండి పర్యాటకులు విశేషంగా తరలివస్తారు.

చూడాల్సినవివే…
mahesh-khajurahఖజురహో నుంచి 32 కిలోమీటర్ల దూరంలో ఉన్న పన్నా నేషనల్‌ పార్క్‌.. ఇక్క డ ముఖ్యమైన విహారకేంద్రం. ఖజురహో నుండి అరగంట ప్రయాణం. చిరుత పులి, పులి, చింకారా, తదితర వన్యమృగాలకు ఈ పార్క్‌ ఎంతో ప్రసిద్ధి. నేషన ల్‌ పార్క్‌కు వెళ్లే దారిలో ఉన్న పాండవ జలపాతాలు పర్యాటకుల మదిని ఇట్టే ఆకట్టుకుంటాయి. ఇవే కాకుండా చుట్టుప్రక్కల వేణీసాగర్‌ డ్యాం, రాణె జలపా తాలు, రాంగ్వన్‌ సరస్సు, దూబెల మ్యూజియం ఇక్కడ ప్రసిద్ధిగాంచిన పర్యా టక ప్రదేశాలు. అంతేకాకుండా ఇక్కడి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న అజ య్‌గఢ్‌ కోట కూడా ఎంతో ప్రసిద్ధిగాంచింది. ఈ ప్రాంతంలో కొండపైనున్న అ తిపెద్ద కోట ఇది. మరో అత్యంత పురాతన కోట కలింజర్‌. ఇది ఖజు రహో నుండి ఉత్తరదిశగా 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

ఎలా చేరుకోవాలి?
రోడ్డు మార్గం: సాత్నా, హర్పలూర్‌, ఝాన్సీ, మహోబా నుంచి ఖజురహోకు బస్సులు ఉన్నాయి.
రైలు మార్గం: ఖజురహో నుంచి 94 కిలోమీటర్ల దూరంలో హర్పలూర్‌, 61 కిలోమీటర్ల దూరంలో మహోబా నుంచి రైళ్లు ఉన్నాయి. ఢిల్లీ, చెన్నై నుంచి వచ్చే యాత్రీకులకు ఝ్సానీ నుంచి రైలు సదుపాయాలు ఉన్నాయి. ముంబై, కోల్‌కతా, వారణాసిల నుంచి వచ్చే వారిి ముంబై అలహాబాద్‌ మార్గం ద్వారా సాత్నా నుంచి ఉన్నాయి.

స్థానిక రవాణా మార్గాలు: ఖజురహోలోని దేవాలయాన్ని సందర్శించాలంటే స్థానికంగా ఉండే రవాణా మార్గాలపై ఆధారపడక తప్పదు. ఇక్కడ ప్రధా నంగా సైకిళ్లపై స్థానిక ప్రాంతాల్ని సందర్శించే పర్యాటకులు ఎక్కువ. కాబట్టి సైకిల్‌ రిక్షాలు, సైకిళ్లు అద్దెకు దొరకుతాయి.

SURYA TELUGU

 

జూన్ 17, 2011 Posted by | చూసొద్దాం | | 2 వ్యాఖ్యలు

హృద్రోగాలు – చికిత్స

హృద్రోగాలు – చికిత్స

coldheartbigఆధునిక కాలంలో వయసుతో నిమిత్తం లేకుండా వ్యక్తులు గుండెపోటుకు గురవుతున్నారు. ఇందుకు ఒక కారణం మన జీవనశైలిలో ఉన్న లోపాలు కాగా మరికొన్ని వంశపారంపర్యమైనవి, మరికొన్ని ఇతరత్రా కారణాల వల్ల వచ్చేవి అయి ఉంటున్నాయి. శరీరంలో అత్యంత కీలకమైన పాత్ర పోషించే గుండెను కాపాడుకోవడం మన బాధ్యత. గుండె పోటు ఎందుకు వస్తుంది? దానికి చికిత్స ఏమిటి? నివారణ ఎలా? అన్న విషయాలను వివరించే వ్యాసమిది..

నూతన చికిత్సా విధానాలు…
మన దేశంలో స్వతంత్రానికి ముందుఅంటే అరశతాబ్దం క్రితం సగటు ఆయుషు 36-37 సంవత్సరాలు మాత్రమే ఉండేది. ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న శాస్ర్తీయ పరిజ్ఞానంతో అది 60 సంవత్సరాలు దాటింది. ఆయుష్షుతో పాటుగానే జబ్బుల బారిన పడే అవకాశాలు కూడా మెండుగా పెరిగాయి. వంశపారంపర్యంగా వచ్చే మధుమేహం, అధికరక్తపోటు, స్థూలకాయం మొదలైనవి కావచ్చు లేదా ధూమపానం, మద్యపానం, మానసిక ఒత్తిడి, అధిక కొవ్వుతో కూడుకున్న ఆహారం వల్ల కావచ్చు.గత కొన్ని దశాబ్దాలలో వైద్యరంగంలో కూడా గణనీయమైన మార్పులు వచ్చాయి. వస్తున్నా యి. మన దేశంలో 1970-80వ దశకంలో గుండెపోటు వస్తే మందులు మాత్రమే మార్గం గా ఉండేది. ఎవరికైనా బైపాస్‌ అవసరమైతే ఎక్కడో అమెరికాలోనో మరో అభివృద్ధి చెందిన దేశంలో మాత్రమే అందుబాటులో ఉండేది. అదీ ఎందరికి సాధ్యమయ్యేదో ఊహించవచ్చు. గడిచిన 20-25 సంవత్సరాల్లో మనం ఎంతో అభివృద్ధి సాధించామని చెప్పవచ్చు.

1977లో ఆండ్రూ గ్రండ్జ్‌విగ్‌ అనే జర్మన్‌ శాస్తవ్రేత్త బైపాస్‌ ఆపరేషన్‌కు ప్రత్యామ్నాయంగా మరో శాస్ర్తీయ మార్గముందని ప్రపంచానికి చాటి చెప్పాడు. అది మన దేశంలో తొలిసా రిగా 1985లో చేశారు. శాస్ర్తీయ పరిజ్ఞాన మార్పిడి మనకు అన్వయించుకునేందుకుసమయం పడుతూ ఉండేది. ఇప్పుడు కాలం మారుతున్న తరుణంలో శాస్ర్తీయ పరిజ్ఞానం అందుబాటు కొన్ని రోజులు లేదా కొన్ని గంటల తేడా బదిలీ అవుతున్నది. ఈ సరికొత్త విధానాలలో ముఖ్యంగా హృద్రోగులకు అందుబాటులోకి వచ్చిన విధానం ఇంటర్వెన్షనల్‌ కార్డియాలజీ అంటే సూక్ష్మనాళం ద్వారా వైద్య ప్రక్రియలు.

heartగుండెలోగల లోపాన్ని సూక్ష్మనాళం ద్వారా గుర్తించి సరిచేయడం, రక్తనాళాల్లో ఏర్పడిన అడ్డంకులను తొలగించడం, మూసుకుపోయిన కవాటాలు వెడల్పు చేయడం, పుట్టకతో వచ్చిన లోపాలను సరి చేయడం వంటివి చేయవచ్చు.గుండెపోటు రావటానికి గల కారణాన్ని ఆంజియోగ్రామ్‌ అనే పరీక్ష ద్వారా గుర్తించి వ్యాధి తీవ్రతను బట్టి చికిత్సా విధానాన్ని నిర్ణయించవచ్చు. దీనికి అందుబాటులో ఉన్న చికిత్సా విధానాలు…ఇందులో ఉన్న వివిధ రకాల చికిత్సలు ఇలా ఉంటాయి. 1. మెడికల్‌ మేనేజ్‌మెంట్‌ (మందుల ద్వారా చికిత్స) 2. బెలూన్‌ యాంజోప్లాస్టీ 3. బైపాస్‌ సర్జరీ.

బెలూన్‌ ఆంజియోప్లాస్టీ/ స్టెంట్స్‌…
సూక్ష్మనాళం ద్వారా మనకి అందుబాటులో ఉన్న ఆంజియోప్లాస్టీ చికిత్స ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా బహుళ ప్రాచుర్యం పొందింది. లక్షలాది హృద్రోగులు ఈ మా ర్గం ద్వారా లబ్ది పొందుతున్నారు. అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం ఇప్పు డు బైపాస్‌కన్నా అధిక సంఖ్యలో ఈ చికిత్సలు జరుగుతున్నాయని అంచనా.
ఈ ప్రక్రియలో ముందుగా సూక్ష్మనాళాన్ని (కెథెటర్‌) మూసుకుపోయిన రక్తనాళంలోకి పంపడం జరుగుతుంది. తర్వాత సన్నటి తీగ (గైడ్‌ వైర్‌)ను రక్తనాళంలోకి చొప్పించడం, తద్వారా బెలూన్‌ను పంపడం జరుగుతుంది. రక్తనాళంలో ఉన్న కొవ్వును ఈ బెలూన్‌ ద్వారా తొలగించడం స్టెంట్‌ను అమర్చడం ద్వారా చికిత్స పూర్తి అవుతుంది.అడ్డంకి (బ్లాక్‌)ని తొలగించడం వల్ల రక్తప్రసారం మామూలు స్థాయికి చేరి గుండె కండరాలు బలహీనపడకుండా ఉంటాయి.

కెరోటిడ్‌ ఆంజియోప్లాస్టీ…
మెదడు ప్రధాన రక్తనాళంలో ఏర్పడిన అడ్డంకులను తొలగించడం చేయవచ్చు.
పెరిఫెరల్‌ ఆంజియోప్లాస్టీ…
కాళ్ళు చేతులకు సంబంధించిన ప్రధాన రక్తనాళాల అడ్డంకులను తొలగించడం.
సెరిబ్రల్‌ ఆంజియోప్లాస్టీ…
మెదడుకు సరఫరా చేసే ప్రధాన రక్తనాళాల అడ్డంకులను తొలగించడం.
రీనల్‌ ఆంజియోప్లాస్టీ…
మూత్రపిండాలకు సరఫరా చేసే రక్తనాళాల అడ్డంకులను తొలగించడం.
మైట్రన్‌ వాల్వులో ప్లాస్టీ…
గుండెకు ఎడమ పక్క ఉన్న మైట్రల్‌ కవాటం మూసుకుపోయినపుడు దాన్ని వాల్వులో ప్లాస్టీ అనే ప్రక్రియ ద్వారా బెలూన్‌ సహాయంతో వెడల్పు చేయడం జరుగుతుంది.
పల్మొనరీ వాల్వులోప్లాస్టీ…
గుండె నుంచి ఊపిరితిత్తులకు రక్తాన్ని తీసుకువెళ్లే దమనికి ఉన్న కవాటం (పల్మొనరీ వాల్వ్‌) మూసుకుపోయినపుడు బెలూన్‌ ద్వారా తెరవవచ్చు. ఈలోపం సాధారణంగా పుట్టుకతో వచ్చేది కాబట్టి చిన్న వయస్సులో కూడా సరిచేయవచ్చు.
పిబిఎవి.. గుండె నుంచి రక్తాన్ని శరీరానికి తీసుకువెళ్ళే ధమనికి (అయోర్టా) ఉన్న కవాటం (అయోర్టిక్‌ వాల్వ్‌) పుట్టుకతోగాని లేదా కొన్ని కారణాల వల్ల మూసుకుపోవచ్చు. వీటిని ఆపరేషన్‌ లేకుండా సరిచేయవచ్చు.
పిబిటివి.. పుట్టుకతోగాని లేదా కొన్ని కారణాల వల్ల గుండెకు కుడి పక్కన ఉన్న ట్రైకస్పిడ్‌ కవాటం మూసుకుపోతే వీటిని ఆపరేషన్‌ లేకుండా సరిచేయవచ్చు. ఈ కవాటం మూసుకుపోయినప్పుడు బెలైన్‌ సహాయంతో తెరవవచ్చు.
ఐవిసి ఫిల్టర్స్‌… కాళ్ళలో ఉన్న సరిల్లో కొన్ని సందర్భాల్లో రక్తం గడ్డకడుతూ ఉంటుంది (డీప్‌ వీన్‌ త్రాంబోసిస్‌). ఈ రక్తపు గడ్డలు విడిపోయినప్పుడు అవి ప్రాణాంతకం కావచ్చు. శ్వాసకోశ సంబంధమైన బాధలు (పల్మనరీ ఎంబోలిజమ్‌) ఏర్పడవచ్చు. ఈ రక్తపు గడ్డలు ఐవిసి ఫిల్టర్‌ అనే చిన్న పరికరాన్ని అమర్చడం ద్వారా అరికట్టవచ్చు.
పర్మినెంట్‌ పేస్‌ మేకర్‌…
గుండె నాడీ వ్యవస్థ (కండక్షన్‌ సిస్టమ్‌)లో ఏర్పడే లోపాల వల్ల నాడీ స్థాయి కొన్నిసార్లు పడిపోయి గుండె ఆగిపోవచ్చు. వీటిని పేస్‌ మేకర్‌ అనే పరికరం అమర్చడం ద్వారా సరిచేయవచ్చు.
ఎఐసిడి ఇంప్లిమెంటేషన్‌…
కొన్ని సందర్భాల్లో గుండె కొట్టుకునే వేగం పెరిగి (నిమిషానికి 200-250సార్లు) కొట్టుకొని గుండె ఆగిపోయే ప్రమాదం ఏర్పడవచ్చు. ఆటోమేటిక్‌ ఇంప్లాంటబుల్‌ కార్డియాక్‌ డిఫిబ్రిలేటర్‌ (ఎఐసిడి) అనే పరికరం అమర్చడం వల్ల ప్రాణాపాయాన్ని అరికట్టవచ్చు.
సిఆర్‌టి- డి…
గుండె కండరం బలహీనపడి, పంపింగ్‌ తగ్గినప్పుడు గుండె ఆగిపోయే పరిస్థితికి దారి తీస్తుంది. సిఆర్‌టిడి పేషెంటుకు అమర్చడం వల్ల బలం పుంజుకునేటట్లు తోడ్పడుతుంది.
కెథెటర్‌ ఇంటర్వెన్షన్స్‌ ఇన్‌ కాంజినిటల్‌ హార్ట్‌ డిసీజ్‌ (పుట్టకతో వచ్చే లోపాలను సరిచేయడం)…
గుండె నుంచి రక్తాన్ని శరీరానికి తీసుకువెళ్ళే ధమని (అయోర్టా) పుట్టుకతో సన్నపడవచ్చు. దీన్ని కూడా బెలూన్‌ పద్ధతిలో సరి చేయవచ్చు.
ఎఎస్‌డి క్లోజర్‌.. విఎస్‌డి క్లోజర్‌…
పుట్టుకతో గుండెలో ఉన్న రంధ్రాలను డివైజ్‌ క్లోజర్‌ ద్వారా ఆపరేషన్‌ లేకుండా మూసి వేయవచ్చు.
పిడిఎ క్లోజర్‌…
గుండె నుంచి రక్తాన్ని తీసుకువెళ్లే రెండు ప్రధాన రక్తనాళాలు విడివిగా ఉంటాయి. శుద్ధమైన రక్తం ఎడమ పక్క నుండి శరీరానికి పంప్‌ అవుతుంది. శరీరం చెడు రక్తం కుడి పక్కకు చేరి ఊపిరితిత్తులలో శుభ్రపడుతుంది. ఈ రెండు రక్తనాళాల మధ్య పిడిఎ అనే మార్గం వల్ల మంచి చెడు రక్తాల మిశ్రమం జరుగుతుంది. ఇది వ్యాధులకు దారి తీయవచ్చు. వీటిని సూక్ష్మనాళ పద్ధతి ద్వారా వేరు చేయడానికి (కాయిల్‌) అనేది ఉపయోగపడుతుంది. దీనిద్వారా పిడిఎ మార్గాన్ని మూసి వేయవచ్చు.
గుండెపోటు రావడానికి పలు కారణాలున్నాయి. అందులో ముఖ్యమైనవి
1. మధుమేహం
2. అధిక రక్తపోటు
3. ధూమపానం
4. అధిక కొవ్వు చేరడం
5. స్థూలకాయం
6. మానసిక ఒత్తిడి
7. వంశపారంపర్యం
మొదలైనవి ముఖ్యమైనవి. ఇవి కాక రక్తనాళాల్లో బ్లాకులు (అడ్డంకులు) ఏర్పడినప్పుడు కూడా గుండెపోటు వస్తుంది.
అధిక కొలెస్టరాల్‌ వల్ల అనర్థాలు…
రక్త నాళాల్లో కొవ్వు చేరడం ద్వారా గుండెపోటుకు దారి తీయడం, పక్షవాతం మొదలైనవి రావడానికి ఆస్కారం ఉంటుంది. అందుకే ఆహారపు అలవాట్లను నియంత్రించుకోవలసిందిగా వైద్యులు సూచిస్తారు.
గుండె పోటు వచ్చిన తర్వాత ఎంతకాలంలో బైపాస్‌ చేయించుకోవాలి…
ఆంజియోగ్రామ్‌ ద్వారా వ్యాధి తీవ్రత నిర్ధారించిన తర్వాత ఇది నిర్ణయించడం జరుగుతుంది. గుండెపోటు వచ్చిన ప్రతి వారరికీ బైపాస్‌ అవసరం ఉండదు.
బెలూన్‌ ఆంజియోప్లాస్టి, బైపాస్‌ సర్జరీల్లో ఏది ఉత్తమం..
గుండె కండరాలకు రక్తప్రాసరంలో అడ్డంకుల వల్ల అది తగ్గినప్పుడు ఈ రెండు మార్గాలూ ఉత్తమమైనవే.
ఆపరేషన్‌ తర్వాత జాగ్రత్తలు…
ఆపరేషన్‌ తర్వాత మందుల వాడకం గురించి పలువురికి సందేహాలు ఉంటాయి. అయితే ఒక్కసారి ఆపరేషన్‌ చేయించుకున్న తర్వాత మందులు జీవితాంతం వాడాల్సి ఉంటుంది. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. ఆహారంలో కొవ్వు పదార్ధాలు లేకుండా చూసుకోవాలి. నిత్యం ఎంతో కొంత వ్యాయామం చేయాలి.
శారీరక శ్రమ ఎంతవరకు చేయవచ్చు…
ఎకో, టియంటి వంటి పరీక్షల ద్వారా దీన్ని నిర్ణయిస్తారు. గుండె కండరం బలహీనపడకుండా మామూలు స్థాయిలో పంపింగ్‌ కనుక ఉన్నట్లయితే మామూలు స్థాయి పని చేసుకోవచ్చు.
స్టంట్స్‌ రకాలు, వాటి ఫలితాలు…
బెలూన్‌ ఎక్స్‌పాండబుల్‌ స్టెంట్స్‌, సెల్ఫ్‌ ఎక్స్‌పాండబుల్‌ స్టెంట్స్‌, బేర్‌ మెటల్‌ స్టెంట్స్‌ (బి.ఎం.ఎస్‌.), డ్రగ్‌ ఎల్యూటింగ్‌ స్టెంట్స్‌ (డి.ఇ.ఎస్‌) అన్నవి స్టెంట్స్‌లో రకాలు. స్టెంట్స్‌ వల్ల రక్తనాళాలు త్వరగా పూడుకుపోయే సమస్య పరిష్కారమవుతుంది.
రెండవ బైపాస్‌ ఎందుకు చేయాల్సి వస్తుంది…viperaju
జోడించిన రక్తనాళాలు మూసుకుపోవడం, కొత్త బ్లాకులు ఏర్పడటం వల్ల రెండవసారి కూడా బైపాస్‌ చేయాల్సి వస్తుంది.
బైపాస్‌ వల్ల రిస్కు ఎంత ఉంటుంది…
వయస్సు, గుండె పంపింగ్‌, మూత్రపిండాల పనితీరు, కారాటిడ్‌ వ్యాధు లు అన్న వాటిని బట్టి 1 శాతం నుండి 4 శాతం వరకు ఉండవచ్చు.
పిన్‌ హోల్‌ ప్రొసీజర్స్‌ (సూక్ష్మ నాళం ద్వారా) అంటే ఏమిటి…
ఆపరేషన్‌ లేకుండా సూక్ష్మనాళం ద్వారా అనేక గుండెవ్యాధులకు చేసే చికిత్సనే పిన్‌ హోల్‌ సర్జరీ అంటారు. పిటిసిఎ, పిబిఎమ్‌ వి, పేస్‌ మేకర్‌, ఎఐసిడి, ఐవిసి ఫిల్టర్స్‌, ఎఎస్‌డి/విఎస్‌డి క్లోజర్స్‌ వంటివి.
మందుల వల్ల దుష్పరిణామాలు…
గుండె వ్యాధులు ఉన్నవారు వాడే మందులతో జాగ్రత్తగా ఉండాలి. ఆస్పిరిన్‌ వాడకం వల్ల గాస్ట్రైటిస్‌, ఆల్సర్లు వస్తాయి. స్టాటిన్స్‌ వాడకం వల్ల కండరాల నొప్పులు, కాలేయ సమస్యలు వస్తాయి. నైట్రేట్ల వాడకం వల్ల తలనొప్పులు, క్లోపిడోపెరాల్‌ వంటి మందుల వల్ల త్రాంబసీ వంటివి వస్తాయి.

SURYA TELUGU

జూన్ 13, 2011 Posted by | ఆరోగ్యం | , | 1 వ్యాఖ్య