హరివిల్లు

ఎన్నెన్నో వర్ణాలు-అన్నింటా అందాలు…

టాప్‌ టెన్‌… అందమైన బీచ్‌లు

టాప్‌ టెన్‌… అందమైన బీచ్‌లు

సాయంకాలం వేళ అస్తమించే సూర్యుడిని చూస్తూ సముద్రం దగ్గర ఇసుకలో ఆడుకోవడం అంటే చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతిఒక్కరికీ ఆనందంగా ఉంటుంది. అందువల్లే చాలా మంది కుటుంబంతో కలిసి ఆనందంగా గడిపే స్థలాల్లో బీచ్‌లకు ప్రథమ స్థానం ఇస్తారు. వేసవిలో సాయంకాలం బీచ్‌ల వద్ద హాయిగా గడపేందుకు కొందరు మక్కువ చూపుతారు. ఇటువంటి వారి కోసం ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన అందమైన పది బీచ్‌లు ఉన్నాయి. ఆ అందాల బీచ్‌లను సందర్శిద్దాం..

కోస్టాడెల్‌సల్‌ బీచ్‌…
italy_beachesఇటలీలోని కోస్టాడెల్‌సల్‌ బీచ్‌ పర్యాటకులను విశేషంగా ఆకర్షించడానికి కార ణం ఇక్కడి వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉండడమే. ఇక్కడి సముద్రంలో స్వచ్ఛమైన నీరు, ఒడ్డున తెల్లటి ఇసుక ఎక్కడో స్వర్గలోకంలో ఉన్న భావన కలిగిస్తుంది. ఇటలీలోని అన్ని బీచ్‌లకన్నా ఇది ఎంతో వైవిధ్యంగా ఉండటం వల్లనే ఇది అందమైన బీచ్‌లలో మొదటి స్థానం దక్కించుకుంది. ప్రతి ఏటా లక్షలాది మంది పర్యాటకులు ఈ బీచ్‌ను సందర్శించి మధురానుభూతులను పొందు తారు.

కటెస్లొ బీచ్‌…
పశ్చిమ ఆస్ట్రేలియాలోని పెర్త్‌ ప్రాంతంలో కటెస్లొ బీచ్‌ ఉంది. అందంగా ఉండడమే కాకుండా పిల్లలు సైతం సముద్రంలో మునగడానికి చాలా సురక్షి తంగా ఉంటుందిక్కడ. ఇక్కడి సముద్రపు నీటిలో ఉప్పు శాతం తక్కువగా ఉండడంతో చాలామంది పర్యాటకులు ఈత కొట్టడానికి ఇష్టపడు తుంటారు.

డర్బన్‌ బీచ్‌…
డర్బన్‌ బీచ్‌ ఎంతో ప్రత్యేకమైనది. ఇక్కడి సముద్రపు నీల్లు సాధారణంగా ఉండే వేడి కంటే చల్లగా ఉంటాయి. అంతేకాకుండా పిల్లలు, పెద్దవారు స్విమ్మిం గ్‌ చేయడానికి అనువుగా ఈతకొలనులు కూడా ఈ సముద్రం ఒడ్డున ఏర్పాటు చేయడం విశేషం. అందువల్లే ఇది యాత్రికులను ఎక్కువగా ఆకర్షిస్తుంది.

కరోన్‌ బీచ్‌…
aitutaki_beachథాయ్‌లాండ్‌లోని కరోన్‌ బీచ్‌ కుటుంబ సభ్యులతో లేదా స్నేహి తులతో సందర్శించడానికి అనువైన ప్రాంతం.ఇక్కడ సముద్రం ఒడ్డున అందమైన పార్కులను ఏర్పాటుచేశారు. అంతేకాకుండా సీఫుడ్స్‌ రెస్టారెంట్లతో, అమ్యూజిమెంట్‌ పార్క్‌లతో ఈ బీచ్‌ సందడిగా ఉంటుంది. అందుకే రాత్రిపూటకూడా బీచ్‌ దగ్గర ఎంజా య్‌ చేయడానికి ఎక్కువసంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు.

క్వాయ్‌ బీచ్‌…
అమెరికా హవాయ్‌ దీవులలోని క్వాయ్‌ బీచ్‌ అందమైన ఇసు తిన్నెలు, ఆహ్లాదరమైన వాతావరణంలో పర్యాటకులను ఆకర్షి స్తుంది. కానీ ఈ బీచ్‌కు మరో ప్రత్యేకత ఉంది. చిన్న పిల్ల కో సం ఇక్కడ డిస్కవరీ మ్యూజియంను ఏర్పాటు చేశారు. ఈ మ్యూజియంలో సముద్రంలోని అనేకరకాలైన చేపలు, ఇతర జీవులను చూడవచ్చు.

ఐటుటాకి బీచ్‌…
bechsకుక్‌ ఐలాండ్‌ దీవులలో ఐటుటాకి బీచ్‌ ఉంది. మాములు ఇసుకలా కాకుండా ఇక్కడి బీచ్‌ ఇసుక చాలా మెత్తగా ఉం టుంది. ఇక్కడి ఇసుకపై పడుకుంటే మెత్తటి పరుపై పడుకున్న అనుభూతిని కల్గుతుంది.ఇంతే కాకుండా ఐటుటాకి బీచ్‌కు మరో ప్రత్యేకత ఉంది.సముద్రంపై విహరించాలనే వారికి బోట్‌ సౌకర్యం ఉండడం విశేషం. చాలా చేపలు ఒడ్డునే కనిపిస్తూ సముద్రంలో ఈత కొట్టే వారిని కనువిందు చేస్తుంటాయి.

నూసా బీచ్‌…
అందాల బీచ్‌లో ఏడవ స్థానంలో నిలుస్తుంది ఆస్ట్రేలియాలోని నూ సా బీచ్‌. కుటుంబ సభ్యులతో కలిసి వెళ్ళాలనుకొనే చాలా మంది ఈ బీచ్‌కే వెళ్తుంటారు. సరదాగా గడపడానికి, ప్రకృతిని ఇష్టపడే వారికి ఇక్కడ నూసా నేషనల్‌ పార్క్‌ను ఏర్పాటుచేశారు. ఇక్కడ అన్ని రకా లపూల మొక్కలతో పాటు మహా వృక్షాలు కనువిందు చేస్తాయి.

తావిరా బీచ్‌…
పోర్చుగల్‌కు తూర్పున ఈ బీచ్‌ ఉంటుంది. ఈ బీచ్‌ వెంబడి కొన్ని కిలోమీటర్ల వరకు షాపులు, రెస్టారెంట్లు ఉంటాయి. బోట్‌ షికా ర్‌ చేయడానికి అనువుగా అన్ని రకాల బోట్లు ఇక్కడ పర్యాటకు లకు అందుబాటులో ఉంటాయి.

సాయులిటా బీచ్‌…
sanur-beach-baliమెక్సికోలోని సుందరమైన బీచ్‌ సాయులిటా. ఈ బీచ్‌ చాలా సురక్షితమైనదని పర్యాటకులు భావిస్తారు.చిన్నపిల్లల భద్రత కోసం ఇక్కడ ప్రత్యేకంగా సిబ్బం దిని ఏర్పాటు చేశారు. సరదాగా అటలు ఆడుకోవడానికి, ఐస్‌ క్రీం తింటూ ఎం జాయ్‌ చేయాలనుకొనేవారు తప్పకుండా సందర్శించాల్సిన బీచ్‌ ఇది.

సనుర్‌ బీచ్‌…
ఇండోనేషియాలోని సనుర్‌ బీచ్‌ ప్రపచంలోని అందమైన బీచ్‌లలో పదవ స్థానాన్ని ఆక్రమిస్తుంది. ఇక్కడికి ఎక్కువగా కొత్తగా పెళె్ళైన దంపతులు, స్నేహి తులు వస్తుంటారు. ఓపెన్‌ రెస్టారెంట్లను కలిగిఉండడం ఈ బీచ్‌ ప్రత్యేకత. పక్కనే చిన్న నగరం ఉండడంతో షాపింగ్‌ చేసే వారు కూడా ఇక్కడకు రావడానికి చాలా ఆసక్తి కనబరుస్తారు.

Surya Telugu Daily

ఫిబ్రవరి 25, 2011 Posted by | చూసొద్దాం | | 1 వ్యాఖ్య

రమణీయం.. సదా స్మరణీయం

రమణీయం.. సదా స్మరణీయం

ramana3ఒక్క తెలుగు వారికే సొంతమయిన అరుదయిన జంట…తనువు మనస్సూ ఒకటిగా మెలిగిన అపురూప స్నేహితులు… తెలుగు సినిమాకి, తెలుగు సాహిత్యానికి ఓ గుర్తింపు తెచ్చిన మహనుభావులు… బాపు, రమణ. ఇంతకాలం వాళ్ళిద్దరి పేర్లు కలిపి చదవాటానికి అలవాటుపడ్డ మనం.. వాళ్ళిద్దరినీ జంటగా చూడ్డమే అలవాటయిన మనం.. ఇకనుండి ఒట్టి బాపు గారినే చూస్తాం అనుకుంటే ఎంత బాధగా ఉందో! మనకే ఇంత బాధగా ఉంటే బాపు గారికి ఇంకెంత తీరని లోటు! ఆ క్షణం దాకా తనతో ఉన్న తన సహచరుడు ఇక తనతో లేడు అనుకుంటే…మీ ఇద్దరూ కలిసి తెలుగు వారికి ఓ బుడుగుని… ఓ సీగానపెసూనని…ఓ రెండు జళ్ళ సీతని….ఓ గోపాలాన్ని…అన్నిటికీ మించి ఓ కోతికొమ్మచ్చిని ఇచ్చినందుకు ఏమిచ్చి మీ ఋణం తీర్చుకోగలం అని తెలుగువారు కళ్లనీళ్ల పర్యంతమవుతున్నారు. బాపు, రమణలు కలిసి తెలుగు సినీరంగంలో దృశ్య కావ్యాలుగా పేరుగాంచిన హిట్‌ సినిమాలెన్నింటినో రూపొందించారు. ఈ క్లాసిక్‌ చిత్రాలు తెలుగు సినిమా ప్రేక్షకుల హృదయాలలో చిరస్థాయిగా చిలిచిపోతాయి.

– హాస్య రచనలతో సుప్రసిద్ధులుగా..

– బాపు, రమణలది ఆరు పదుల చెలిమి బంధం

– చివరి సినిమా శ్రీరామరాజ్యం

– ఆంధ్రపత్రికలో సబ్‌ ఎడిటర్‌గా చేసి…

– బుడుగు రచనతో పేరుతెచ్చుకొని…

-ముత్యాలముగ్గు, పెళ్లిపుస్తకం, మిస్టర్‌ పెళ్లాం వంటి హిట్‌ సినిమాలు
– తెలుగు సినిమాలో విలనిజానికి కొత్త రూపం

– గిలిగింతలు పెట్టే డెైలాగులకు పెట్టింది పేరు

– మాటల మాంత్రికుడు

– ఆయన మరణం తెలుగు సాహిత్యానికి తీరని లోటు
ramana2 ముళ్ళపూడి వెంకటరమణ 1931 జూన్‌ 28న ధవళేశ్వరంలో జన్మించారు. ఈయన అసలు పేరు ముళ్ళపూడి వెంకటరావు. తండ్రి సింహాచలం. గోదావరి ఆనకట్ట ఆఫీసులో పని చేసేవారు. వారి పూర్వీకులు బరంపురంకు చెందిన వారు. రమణ కుటుంబం గోదావరి ఒడ్డున ఒక మేడలో ఉండేవారు. రమణ చిన్నతనంలోనే తండ్రి మరణించారు. దీనితో కుటుంబం ఇబ్బందులలో పడిం ది. సాహసం చేసి అతని తల్లి కుటుంబంతో మద్రాసు వెళ్ళింది. మద్రాసులో అక్కా బావల వద్ద చదువు మొదలుపెట్టిన రమణ 5, 6 తరగతులు మద్రాసు పి.ఎస్‌.స్కూలులో చదివారు. 7,8 తరగతులు రాజమండ్రి వీరేశలింగం హైస్కూలులోను, ఎస్సెల్సీ ఆనర్స్‌ దాకా కేసరి స్కూలులోను చదివారు. పాఠశాల విద్యార్ధిగానే లెక్కలలోను, డిబేట్లు, వ్యాస రచనలోను ప్రతిభ చూపించారు. హాబీగా పద్యాలు అల్లేవారు. నాటకాలలో వేషాలు వేసేవారు కూడా.

ముళ్లపూడి వారి బుడుగు
ramana4 ముళ్ళపూడి వెంకటరమణ వ్రాసిన ఒక హాస్య రచన. ముళ్ళపూడి వ్రాతలు… బాపు బొమ్మల ద్వారా హా స్యపూర్వకంగా బుడుగు అనే పిల్లవాని భాష, అల్లరి, ఆలోచనలు, ప్రవర్తన ఈ పుస్త్తకంలో వివరించారు రమణగారు. తెలుగు సాహిత్యంలో ఈ తరహా పుస్త్తకాలలో ప్రసిద్ధమైంది ఇదొక్కటే అనవచ్చును.ముళ్ళపూడి రచనలు ముళ్ళపూడి సాహితీ సర్వస్వం అనే సంపుటాలుగా లభి స్తున్నాయి. అనువాద రమణీయం, సినీరమణీయం, బాలరమణీయం, కదం బ రమణీయం ఇలా. ఇందులో 3వ సంపుటం బాలరమణీయం బుడుగు. ఇది ఎమ్బీఎస్‌ ప్రసాద్‌ సంపాదకత్వం (ముందుమాట)తో వెలువడింది. ఈ రచన ప్రశంస ఆరుద్ర కూనలమ్మ పదాలులో ఇలా ఉంది. ‘హాస్యమందున అఋణ…అందె వేసిన కరుణ…బుడుగు వెంకటరమణ…ఓ కూనలమ్మా!

ఇలా ఆరుద్ర చెప్పినట్లుగా ముళ్ళపూడి వెంకటరమణ బుడుగు వెంకట రమణగా అయ్యారంటే ముళ్ళపూడి సృష్టించిన పాత్రలన్నింటిలోనూ బుడు గు ఎంత ప్రసిద్ధమయ్యాడో తెలుస్తుంది. నవంబరు 1956 నుండి ఏప్రిల్‌ 1957 వరకు ఆంధ్రపత్రిక వార పత్రికలో సీరియల్‌గా వచ్చింది. అప్పుడు రచయిత అసలు తన పేరు వేసుకోలేదు. చివరికి అందరి బలవంతం వల్ల ఇది వ్రాసి పెట్టినవాడు – ఫలానా, బొమ్మలు వేసిపెట్టినవాడు – ఫలానా అని ఆఖరు సంచికలో వేశారు. అప్పుడు వీక్లీ సీరియల్‌కు పెట్టిన పేరు బుడుగు – చిచ్చర పిడుగు 24.4.1957లో బుడుగు స్కూల్లో చేరడానికి, అల్లరి మానే యడానికి నిశ్చయించుకోవ డంతో సీరియల్‌ ఆగిపో యింది. నాలుగేళ్ళ తరు వాత ‘వురేయ్‌, మళ్ళీ నేనే’ అని పాఠకులను అలరిస్తూ వచ్చాడు. అప్పటికి కాస్త తెలివి మీరాడు. అణ్వస్త్ర భయం గురించి, మేష్టర్ల జీ తాల గురించి కూడా మా ట్లాడేవాడు బుడుగు.

బుడుగు పాత్ర సృష్టికి సు ప్రసిద్ధ ఆంగ్ల కార్టూన్‌ డెని స్‌ – ది మెనేస్‌ స్ఫూర్తి అని అంటుంటారు. ఇది ఎంత నిజమో తెలియదు కానీ ముళ్ళపూడి వెంకట రమ ణను చిన్నప్పుడు బుడుగు అని పిలిచేవారట.

1. డెనిస్‌, బుడుగు పాత్రలలో నూ, వారి పరిజనాలలోనూ సాహిత్యం ఉన్నదనుకొన్నా బుడుగు పరివారం, ఆలోచనలు, భాష అన్నీ పక్కా తెలుగు వాతావరణమే. ఆలోచించి చూస్తే డెనిస్‌ కంటె బుడుగు పాత్ర విస్తృతి ఎక్కువ (సమిష్టి కుటుంబం కారణంగా కావచ్చును).

బాపు బొమ్మలు: బుడుగు సృష్ట్టిలో బాపు పాత్ర చాలా ముఖ్యమైనది. పత్రిక లో వచ్చిన బుడుగు బొమ్మలే కాకుండా బుడుగు పుస్త్తకం ఒకో ప్రచురణలో ఒకోలాగా చిత్రిస్తూ కొత్తదనం మెయింటెయిన్‌ చేశారు. బాపు బొమ్మ వెబ్‌ సైటులో బుడుగు బొమ్మలు ప్రత్యేకంగా కనిపిస్తాయి.

బుడుగు పరిచయం: ఈ బొమ్మ నేను. నా పేరు బుడుగు. ఇంకో పేరు పిడుగు. … ఇంకో అస్సలు పేరుంది. ఇప్పుడు చెప్పడానికి టైము లేదు. కావ లిస్తే మా నాన్నని అడుగు అని మొదట్లో బుడుగు తనను పరిచయం చేసు కుంటాడు…

బుడుగు కుటుంబంలో మనుషులు: నాన్న (గోపాళం), అమ్మ (రాధ) అమ్మా నాన్నా నిఝంగా కొట్టరు. కొట్టినా గట్టిగా కొట్టరు. ఉత్తుత్తినే.

బామ్మ : బుడుగును హారి పిడుగా అంటుంది. బుడుగును వెనకేసుకొస్తుంది. ఇక బాబాయి రెండుజళ్ళ సీత వస్తుంటే విజిలేయమంటాడు. వీడి దగ్గిర బోల్డు లౌలెట్రులున్నాయి.

బుడుగు ఇరుగు, పొరుగు ప్రవేటు మాష్టారు: వీడు మంచివాడు కాడు. అసలు ప్రవేటు మాష్టర్లు అందరూ ఇంతే. ఇప్పటికి వీడు పదోవాడు. ఒక్క డూ పకోడీలు తేడు. పెైగా లెక్కలు చేయమంటారు. చెవి మెలిపెడతారు.

రెండుజళ్ళ సీత : చాలామంది ఉన్నారు. ఒకోసారి ఒక జడ ముందుకీ, ఒక జడ వెనక్కీ వేసుకొని నడుస్తారు. ఇది చాలా ఇబ్బంది. అప్పుడు వాళ్ళు వస్తు న్నారో వెళ్తున్నారో ఎలా తెలుస్తుంది?
లావుపాటి పిన్నిగారు : అవిడకు పెద్ద జడ లేదు. అయినా పేరంటంలో పెద్ద జడ ఉంటుంది. అది నిజం జడ కాదనుకో. డేంజరు అంటే పిన్నిగారూ, మా బామ్మా పోట్లాడుకోవడం.
సీగాన పెసూనాంబ : బుడుగు గర్ల్‌ఫ్రెండ్‌

ఇంకా డికెష్టివ్‌, విగ్గు లేని యముడు, పిన్నిగారి మొగుడు, సుబ్బలక్ష్మి – ఇలా చాలా మందున్నారు.

ramana1‘ నా అంతవాడు నేను. నన్ను ఎవరూ కొట్టకూడదు. నేను నిఝంగా పెద్ద వాడినే అనుకో. ఐతే వాళ్ళే నన్ను కురక్రుంకా అంటారుగా. అందుకని కొట్ట కూడదు. సిగరెట్లు తెల్లగా ఉంటాయిలే. వీటిని బాబాయిలాంటి కురవ్రాళ్ళు కాలుస్తారు. .. మరి నేను పెద్దవాడినిగా. అందుకనే కాలవను. నేను ఇంఖా పెద్దవాణ్ణయ్యాకా జెటకా బండియేనా రెైలింజనేనా తోలుతానుగా. అందుకని బీడీలు దాస్తాననుకో. అప్పుడు చెవులో పెట్టుకోవాలిగా. బీడీలు బామ్మ వత్తు ల పెట్టెలో దాస్తే భద్రంగా ఉంటాయి… అగరొత్తులు నల్లగా ఉంటాయి. వాటిని గోడమీద గుచ్చి కాలుస్తారు. సిగరెట్లేమో నోట్లో గుచ్చి కాలుస్తారు.

* ప్రెవేటు చెప్పడం – లౌలెట్రు వ్రాసినపుడు రెండుజళ్ళ సీత నాన్న బాబాయికి ప్రెవేటు చెబుతాడు. ఒకోసారి నాన్న అమ్మకు ప్రెవేటు చెబుతాడు.* జాఠర్‌ ఢమాల్‌ – అంటే ఏంటో.* అంకెలు – ఒకటి, రెండు, ఫది, డెభ్బయ్యో, బోల్డన్నో* అనుభవం : టెంకిజెల్లలు, మొట ి్టకాయలు తినడం…బుడుగు భాష ప్రత్యేకమైనది. అది వ్యాకరణ పరిధికి అందదు. భాషలోని తియ్యదనం అంతా ఆ మాటల్లోనే ఉంది.

తన కాలంలోనే కాక తరువాత కాలం లో కూడా వస్తువరణంలో, భాష విష యంలో చేసిన ప్రయోగాలు ఇతర రచయి తలపెైన ప్రభావం కలిగించడమే కాక రెండు మూడు తరాల ప్రజల మనసులపెై ముళ్ళపూడి వెంకట రమణ చెరగని ముద్ర వేసుకున్నారు. తెలు గు సాహిత్యంలో ఆయన ప్రత్యేకమైన రచయితగా నిలి చిపోయారు. హాస్యరచనలలో ముళ్ళపూడి వెంకట రమణది ఫోర్జరీ చెయ్యలేని సంతకం, హాస్యరచనలో అనన్యం… అనితర సాధ్యం అతని మార్గం అని ఆంధ్ర పాఠక లోకం సగర్వంగా చెప్పుకునే మనసున్న మహాకవి ముళ్ళపూడి వెంకట రమణకి తెలుగు సాహితీలోకం యావత్తూ నివాళులర్పిస్తోంది. యాభెై సంవత్సరాలుగా బాపును అంటిపెట్టుకుని స్నేహమనే పదానికి సరికొత్త అర్థాన్ని ఇచ్చారు వారిరువురూ…బాపూరమణీయం అనే పదం ఎంత అందంగా ఇమిడిపోయిందో…బాపూరమణలు కూడా అంతకన్నా ఎక్కువగానే చెలిమిబంధంతో ్జకలిసిపోయారు. ఇకపెై బాపు ఒంటరిగానే నెగ్గుకు రావాలి…రమణీయత కోల్పోయిన బాపు పక్కన ఇంకెవ్వరినీ ఊహించలేము…బాలకృష్ణతో తీయబోయే ‘శ్రీరామరాజ్యం’ ఈ జంటకు చివరి సినిమా. ఆ సినిమా పూర్తికాకుండానే రమణగారు తుదిశ్వాస విడిచారు.

హాస్య నవలలు, కథలు…
బుడుగు – చిన్నపిల్లల భాష, మనస్తత్వం, అల్లరి గురించి హాస్య ప్రధానమైన బొమ్మలతో కూడిన రచన
ఋణానందలహరి (అప్పుల అప్పారావు- అప్పుల ప్రహసనం) విక్రమార్కుని మార్కు సింహాసనం – సినీ మాయాలోక చిత్ర విచిత్రం
గిరీశం లెక్చర్లు – సినిమాలపెై సెటైర్లు
రాజకీయ బేతాళ పంచవిశతి – రాజకీయ చదరంగం గురించి
ఇద్దరమ్మాయిలు ముగ్గురబ్బాయిల ప్రేమాయణం
ఇవన్నీ మచ్చుకు కొన్ని మాత్రమే…అయితే ముళ్ళపూడి రచనలు పుస్త్తకాల రూపంగా కాక చెదురుమదురుగా పత్రికలలో వచ్చినవి కూడా ఎక్కువే అని చెప్పవచ్చు. ఇవే కాక సినిమా కథలు, సంభాషణలు ఉండనే ఉన్నాయి. ముళ్ళపూడి సాహిత్యాన్ని విశాలంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌ వారు 8 సంపుటాలుగా ప్రచురించారు. అవి
1. కథా రమణీయం -1 : సీతా కళ్యాణం, ఇద్దరమ్మాయిలూ ముగ్గురబ్బాయిలూ, జనతా ఎక్స్‌ప్రెస్‌, రాజకీయ బేతాళ పంచవింశతి, ఇతర కథలు
2. కథా రమణీయం – 2 : ఋణానంద లహరి, కానుక, రాధాగోపాలం, సాక్షి, ఆకలీ-ఆనందరావు, విమానం కథ, ఇతర కథలు
3. బాల రమణీయం : బుడుగు
4. కదంబ రమణీయం – 1 : నవ్వితే నవ్వండి, పీఠికలు, వ్యాసాలు, ఇతర రచనలు
5. కదంబ రమణీయం – 2 : గిరీశం లెక్చర్లు, కృష్ణ లీలలు, వ్యాసాలు, ఇతర రచనలు
6. సినీ రమణీయం – 1 : చలనచిత్ర ప్రముఖులపెై వ్యాసాలు, స్వదేశీ విదేశీ చిత్రాలపెై సమీక్షలు, విక్రమార్కుని మార్కు సింహాసనం కథలు
7. సినీ రమణీయం – 2 : కథానాయకుని కథ (అక్కినేని నాగేశ్వరరావు జీవిత చరిత్ర), చలనచిత్ర ప్రముఖులపెై వ్యాసాలు
8. అనువాద రమణీయం : 80 రోజుల్లో భూప్రదక్షిణ, పిటి 109
9. ప్రస్తుతం’ కోతికొమ్మచ్చి’ పేరుతో తన జీవిత చరిత్ర లాంటిది స్వాతి వార పత్రికలో వ్రాస్తున్నారు.
ఇంకా ఇవిగాక ఇద్దరు మిత్రులు (వెండితెర నవల), తిరుప్పావెై దివ్య ప్రబంధం మేలుపలుకుల మేలుకొలుపులు, రమణీయ భాగవత కథలు.
రామాయణం (ముళ్ళపూడి, బాపు), శ్రీకృష్ణ లీలలు.

అమ్మ మాట వినకపోతే…
1945లో బాల పత్రికలో రమణ మొదటి కథ అమ్మ మాట వినకపోతే అచ్చయ్యింది. అందులోనే బాల శతకం పద్యాలు కూడా అచ్చయ్యాయి. ఆ ఉత్సాహంతోనే ఉదయభాను అనే పత్రిక మొదలెట్టి తనే ఎడిటర్‌గా కీలక బాధ్యత వహించారు. మిత్రులతో కలిసి ఒక ప్రదర్శన నిర్వహించి, దానితో వచ్చిన డబ్బులతో ఒక సైక్లోస్టైల్‌ మెషిన్‌ కొన్నారు. ఆ పత్రికకు రమణగారే ఎడిటర్‌. చిత్రకారుడు మాత్రం బాపు. ఆర్ధిక ఇబ్బందుల వలన ఎస్సెల్సీతో చదువు ఆపిన రమణ చిన్నా చితకా ఉద్యోగాలు చేశారు. 1954లో ఆంధ్ర పత్రిక డెైలీలో సబ్‌ ఎడిటర్‌గా చేరారు. ఆంధ్రపత్రికలో పని చేసేటపుడే బుడుగు వ్రాశారు. దాదాపు ముళ్ళపూడి రచనలన్నీ బాపు బొమ్మల కొలువులు అని చెప్పవచ్చు.

బాపూ రమణీయం
బాపు అనగానే అందమైన బొమ్మలెలా గుర్తొస్తాయో, రమణ అనే పేరు కూడా జ్ఞప్తికి వస్తుంది. బాపు-రమణల స్నేహం అటువంటిది. బాపు బొమ్మల కొలువు పేర్చితే, ముళ్ళపూడి వెంకట రమణ ఆ బొమ్మల చేత అల్లరి చేయించి, మన ఇంట నవ్వుల పూవులు విరబూయించారు. బుడుగు గాడి అల్లరి, సీగాన పెసూనాంబ పాత్రలు పాఠకులు అంతలా దగ్గరయ్యారంటే రాసిన రమణదా గీసిన బాపుదా అంటే చెప్పడం చాలా కష్టం. ఈ మిత్రద్వయం తమ ప్రతిభతో తెలుగు చలనచిత్ర సీమకు ఆణిముత్యాలంటి చిత్రాలను అందించారు.

బాపు తెలుగు, హిందీ భాషల్లో 40 పెైగా చిత్రాలను రూపొందించారు. వీటిలో సాక్షి, బంగారు పిచ్చిక, బుద్ధిమంతుడు, సంపూర్ణ రామాయణం, సీతా కళ్యాణం, రామాంజనేయ యుద్దం, మంత్రి గారి వియ్యంకు డు, జాకీ, శ్రీరాజేశ్వరి వి లాస్‌ కాఫీ క్లబ్‌, శుభోదయం, ముత్యాలముగ్గు నుంచి పెళ్ళి పుస్త్తకం, మిస్టర్‌ పెళ్ళం వరకూ బాపు సినిమా లు రమణతో విడదీయలేని బంధాన్ని ఏర్పరుచుకున్నా యి. అందమైన తెలుగు వాకిళ్ళు, ఉయ్యాల బల్లలు, మెలిక ముగ్గులు. ఇలా ప్రతీ సన్ని వేశంలో తెలుగుద నం ఉట్టిపడుతుం ది. బాపు ఊహల కు రమణ తన సంభాషణా చాతు ర్యంతో ప్రాణం పోసేవారు. సీతా కళ్యాణం చిత్రంలో రామునికి ఒక్క సంభాషణ కూడా ఉండక పోవటం గమనార్హం. అలాగే, చారెడు-పిడికెడు-బారెడు అంటూ పెళ్ళిపుస్తకంలో దివ్యవాణి అందాన్ని, రాజేంద్ర ప్రసాద్‌ చేత తమాషాగా చెప్పించి, ఆ మాటల అర్ధాన్ని, ఒక పాటలో చెంపకు కన్నులు చారెడు-సన్నని నడుము పిడికెడు-దువ్వీ దువ్వక పువ్వులు ముడిచిన నల్లని నీ జడ బారెడు… అంటూ పూరించారు.

ఇంకా, అపార్ధసారధమ్మా(పెళ్ళి పుస్తకం), మంగళాస్త్రాలు(మంగళసూత్రమన్నమాట…సుందరకాండ సినిమాలో) వంటి పదప్రయోగాలు నవ్విస్తాయి. బాపు చిత్రాలలో చెప్పుకోదగిన ప్రయోగాలు…ఎప్పుడు చూసినా ఇద్దరు నాయికలతో అడిపాడే శోభన్‌బాబు చేత, ఏక పత్నీవ్రతుడెైన రాముని పాత్ర వేయించటం(సంపూర్ణ రామయణం).అలాగే, వాణిశ్రీతో మేకప్‌ లేకుండా నటింప చేయ టం(గోరంత దీపం). సినిమాలే కాక, బాపు-రమణలు టి.వి సీరియళ్ళు కూడా చేశారు. ‘భాగవతం’ అందులో చాలా ప్రసిద్ధి చెందింది.

ప్రముఖ రచయితగా…
ముళ్ళపూడి వెంకటరమణ ప్రముఖ తెలుగు రచయిత. తెలుగు నవలలు, కథలు, సినిమా కథలు, హాస్య కథలు అనేకం రాశారు. ముఖ్యంగా తన హాస్యరచనల ద్వారా సుప్రసిద్ధులయ్యారు. ఈయన వ్రాసిన పిల్లల పుస్తకం బుడుగు తెలుగు సాహిత్యంలో ముఖ్యంగా బాలసాహిత్యంలో ఒక విశిష్టమైన స్థానం సంపాదించింది. ప్రఖ్యాత చిత్రకారుడెైన బాపు ఈయన కృషిలో సహచరుడెైనందున వీరి జంటను బాపు-రమణ జంటగా పేర్కొంటారు. బాపు మొట్టమొదటి సినిమా సాక్షి , బంగారు పిచ్చుక, ముత్యాల ముగ్గు, గోరంత దీపం, మనవూరి పాండవులు, రాజాధిరాజు, పెళ్ళిపుస్తకం, మిష్టర్‌ పెళ్ళాం, రాధాగోపాలం వంటి మచ్చుక సినిమాలకు రచయితగా ముళ్లపూడివారు వ్యవహరించారు. 1995లో శ్రీ రాజాలక్ష్మీ ఫౌండేషన్‌ నుండి రాజాలక్ష్మీ సాహిత్య పురస్కారం అందుకున్నారు.

ముళ్ళపూడి ’చిత్ర‘ మణి మకుటాలు
– సాక్షి
– బంగారు పిచ్చుక
– ముత్యాల ముగ్గు
– గోరంత దీపం
– మనవూరి పాండవులు
– రాజాధిరాజు
– పెళ్ళి పుస్తకం
– మిష్టర్‌ పెళ్ళాం
– రాధాగోపాలం
– బుద్ధిమంతుడు,
– సంపూర్ణ రామాయణం,
– సీతా కళ్యాణం

– నండూరి రవిశంకర్‌

Surya Telugu Daily .

ఫిబ్రవరి 25, 2011 Posted by | సినిమా | 2 వ్యాఖ్యలు

పిలిచిన పలికే దైవం కోదండరాముడు

పిలిచిన పలికే దైవం కోదండరాముడు

ఒంటిమిట్ట కోదండరాముడు పిలిస్తే పలికే దేవుడిగా ప్రసిద్ధి చెందాడు. అందరి బంధువులా పిలిపించుకునే కోదండరాముడు భక్తులచే కోటి దండాలు అందుకుంటున్నాడు. మత సామరస్యాని, ప్రశాంత వాతావరణానికి ఆలవాలం ఇక్కడి కోదండరాముడు. కళలకు కాణాచి అయిన సీమకు ఆభరణంగా నిలిచి భక్తితో పాటు చారిత్రకంగా అపూర్వ సంపదగా అలరారుతున్నది ఈ ఆలయం.దక్షిణ భారతదేశంలో ప్రాచీన శిల్పకళా సంపదను ఎలుగెత్తి చాటిచెప్పే సుప్రసిద్ధ దేవాలయాల్లో ఒంటిమిట్ట రామాలయం ఒకటి. ఈ ఆలయం కడప- చెనై్న రహదారిలో కడప నుంచి 25కిలో మీటర్ల దూరంలో ఉంది. ఈనెల 23వ తేది నుంచి జరిగే బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ప్రత్యేక వ్యాసం.

దక్షిణ భారతదేశంలోనే సుప్రసిద్ధం…
vontimittaదక్షిణ భారతదేశంలో సుప్రసిద్ధ దేవాలయాల్లో కడప జిల్లా ఒంటిమిట్టలోని శ్రీకోదండ రామాలయం చెప్పుకోదగ్గది. ఈ ఆలయ విశిష్టమైన చరిత్ర, ప్రచారంలో ఉన్న కొన్ని మహిమలను గుర్తుకు తెచ్చు కుంటే ఆశ్చర్యం కలుగకమానదు. ఆంధ్ర వాల్మీకి వావికొలను సుబ్బారావుకు స్వప్నంలో బైరాగులు కనపడ టం, సహజ పండితుడు బమ్మెర పోతన రచిస్తున్న పద్యంలో చరణాలు గుర్తుకు రాక నిలిపి వేయగా శ్రీరాముడు ప్రత్యక్షమై పూర్తి చేయడం, అయ్యలరాజు రామభద్రునికి చిన్న ప్రాయంలో సీతా దేవి పాలు ఇవ్వడం, ఇమాంబేగ్‌ పిలిస్తే కోదండరాముడు పలుకడం, తూర్పువైపునకు ఉన్న సీతారామ లక్ష్మణమూ ర్తులు మాల ఓబన్న అనే భక్తుని కోసం పశ్చిమైపునకు మరలడం వంటి కథనాలు ఇక్కడి కోదండ రామా లయ మహిమలుగా చోటుచేసుకున్నాయి.

మతాలకతీతం.. భారతావనికే ఆదర్శం….
అయోధ్యలో రాముడి గుడి కట్టాలని మెజార్టీ హిందువులు, మసీదు నిర్మించాలని ముస్లిం తలలు బద్దలు కొట్టుకుంటున్న ప్రస్తుత తరుణంలో దేశ రాజకీయాలు అయోధ్య రాముని చుట్టూ పరిభ్రమిస్తున్నాయి.ఈ సమస్య అలాగే ఉన్న నేపథ్యంలో ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయం విశిష్టత యావత్‌ భారతా వనికే ఆదర్శంగా నిలుస్తోంది. రాష్ట్రంలోనే రెండో భద్రాద్రిగా పేరుగాంచిన ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయం చారిత్రాత్మకంగా ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. క్రీ.శ.1640 సంవత్సరంలో కడపను పాలించిన వారిలో అబ్దుల్‌ నబీఖాన్‌ ఆస్థానంలో ప్రతినిధిగా పనిచేసిన ఇమాంబేగ్‌ ఒంటిమిట్ట కోదండ రాముడిని పరీక్షించి రాముని మహిమను ప్రత్యక్షంగా వీక్షించారట. దీనితో నవాబు ఆనందభరితుడై వెంటనే కోదండరాముని కైంకర్యానికి బావిని కూడా త్రవ్వించాడని చరిత్ర చెబుతోంది. ప్రతి శుక్రవారం మంటపం పల్లె సమీపంలో దర్గాను దర్శించుకున్న ముస్లింలు ఇక్కడకు వచ్చి తీర్థప్రసాదాలు తీసుకొని వెళ్ళడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. ఈ ఆలయంలో 23 నుండి ఏప్రిల్‌ 12వ తేది వరకు జరిగే ఉ త్సవాలు అత్యంత వైభవంగా జరుగనున్నాయి. ఈ ఉత్సవాల కోసం అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

రామాలయ ఆవిర్భావం….
nandiవిజయనగర పాలకుల్లో ఒకరైన సదాశివరాముల కాలంనాటి శిలా శాసనాలను బట్టి చూస్తే క్రీ.శ.1500 సంవత్సరానికి పూర్వమే ఈ ఆలయం పూర్తయినట్లు తెలుస్తోంది.రామాలయ గోపురం నిర్మాణం, చోళ నిర్మాణ శైలికి దర్పణం పడుతున్నాయి. రామాలయానికి ఎదురుగా ఉన్న సంజీవ రామస్వామి ఆల యాన్ని చివరగా పునరుద్ధరించినట్లు తెలుస్తోంది.

ఆలయ చరిత్రను తెలిపే శాసనాలు…
శ్రీకోదండ రామాలయంలో రాజగోపురం ఉత్తర బాగాన రెండు శిలాశాసనాలు ఉన్నాయి. మొదటి శాసనం క్రీ.శ.1555లో. క్రీ.శ.1558లో రెండో శిలా శాసనాన్ని వేయించారు. వీటి ప్రకారం విజయ నగర పాలకుడు వీర సదాశివ దేవరాయల సామంతుడు గుత్తి తిరుమ లయ్య దేవ మహారాజు పులపత్తూరు గ్రామాన్ని ఆలయానికి దానం చేశా రు. శ్రీకోదండ రామా లయ ప్రాకార నిర్మాణాలకు రథం బ్రహ్మోత్సవాల నిర్వహణకు తిరుమల రాజయ్య, నాగరాజయ్య దేవ మహారాజులు ఒంటిమిట్టకు, ఈగ్రామానికి చెందే పల్లెలను, పొలాలను దానంగా ఇచ్చారు. ఈ రెండు శిలా శాస నాలు సదాశివరాముల ప్రధానిగా ఉన్న తిరుమలరాజు అనుమతితో వేయించారు.

ఆలయ పూర్వగాథ…
పితృవాక్య పరిపాలకుడైన శ్రీరామచంద్రుడు అరణ్యవాసం చేస్తూ ఆనాటి దండకారణ్యంలో భాగమైన ఒంటిమిట్టకు వచ్చిటన్లు ఇతిహాసం చెబుతోంది. ఇక్కడ మునులకు రాక్షసుడి బెడద నివారణకు ఒకే శిల పై నిర్మితమైన శ్రీసీతారామలక్ష్మణ విగ్రహాలను మునులకు ప్రదానం చేశారని అంటారు. ఈ విగ్ర హాలు మూడు విడివిడిగా కనిపించినా ఇవన్నీ ఒకేశిలపై ఆవిర్భవించి ఉన్నందున ఈ గ్రామానికి ఏక శిలా నగరమని పేరు వచ్చిందని చరిత్ర కారులు చెబుతున్నారు. ఈ పరిసర ప్రాంతాల్లో సీతాదేవికి దా హంగా ఉందని గ్రహించిన శ్రీరామచంద్రుడు తన బాణంతో పాతాళం నుంచి గంగను పైకి తెప్పిం చాడట. నీళ్లు పడిన చోటు రామతీర్థమని, లక్ష్మణుని ద్వారా నిర్మించిన తీర్థం లక్ష్మణ తీర్థమని అంటారు.ఒకరోజు జాంబవంతుడు ఇక్కడ విశ్రమించగా స్వప్నంలో సీతారామలక్ష్మణులు దర్శనమివ్వడంతో ఆనందభరితుడై విగ్రహాలను ప్రతిష్టించారంటారు. అందుకే వాటికి జాంబవంత ప్రతిష్ఠగా పేరు వచ్చిం దని ఇతిహాసం చెబుతోంది.

జనపదుల గాథ….
ద్వాపరయుగం తర్వాత కలియుగం మొదలైనపుడు పలువురు దొంగలు ముఠాలుగా ఏర్పడి గ్రామాలపై దాడిచేసి బంగారు నగలను అపహరించేవారు. ఈ ప్రాంతంలో ఒంటడు- మిట్టడు (వడ్డెవారు) అనే ఇద్దరు అన్నదమ్ములు ఈ పరిసర గ్రామాల్లో దోపిడి చేసి తీసుకొచ్చిన వస్తువులను ఇక్కడి అటవీగృహాల్లో దాచేవారు. ఒకనాడు గుహలో శిలపై సీతారామలక్ష్మణులు ప్రత్యక్షమై ‘ఒంటడు- మిట్టడు’లకు సత్ప్ర వర్తనతో నిజాయితీగా జీవించాలని ఆదేశించారట. అప్పుడు వారికి జ్ఞానోదయం కల్గి దేవుని విగ్రహాలను గర్భగుడిని నిర్మించారు. ఆ కారణంగా ఈ గ్రామానికి ఒంటిమిట్ట అనే పేరు స్థిరపడినట్లు చెబుతారు.

Vontimitta_Templeభారతదేశంలోని గొప్ప ఆలయ గోపురాల్లో ఒంటిమిట్టలోని శ్రీకోదండ రామాలయ గోపురం ఒకటని క్రీశ.1652 సంవత్సరంలో భారతదేశ యాత్ర చేసిన ఫ్రెంచ్‌ యాత్రికుడు టావర్నియర్‌ పేర్కొన్నారు. సహజ పండితునిగా వాసికెక్కిన బమ్మెర పోతనామాత్యులు, అష్టదిగ్గజాల్లో ఒకరైన అయ్యరాజ రామ భద్రాద్రి ఓబన్న, తిప్పకవి, ఇమాంబేగ్‌, ఆంధ్ర వాల్మీకిగా పేరుగాంచిన వాలింకొలను సుబ్బారావు వంటి ప్రముఖులంతా ఒంటిమిట్టలో నివసించిన వారే. ఆంధ్ర మహాభాగవతాన్ని తనకు అంకితమివ్వాలని పో తనను కోదండరాముడు కోరింది ఇక్కడేనని ప్రతీతి. అత్యంత సుందరమైన శిల్పి చాతుర్యానికి అద్దం పట్టేలా ఒంటిమిట్ట రామాలయం అలలారుతోంది.

బమ్మెర పోతన :
ఈయన క్రీ.శ.1465 నుండి క్రీ.శ.1470 ప్రాంతం వరకు ఉండి, ఆంధ్ర మహా భాగవతాన్ని తెలుగులోకి రచించి కోదండరాముడికి అర్పించిన సహజ పండితుడు పోతనామాత్యుడు. పోతన ఒంటిమిట్టవాసి అని కొందరు, ఓరుగళ్లు వాసి అని కూడా అక్కడివారు అంటుండడంతో కొంత వివాదం ఉంది. ఈయన ఒంటిమిట్టలో మహా భాగవతాన్ని రచిస్తుండగా గజేంద్ర మోక్షంలోకి ‘అల వై కుంఠ పురంబులో’ అనే పద్యంలో కొన్ని చరణాలు నిలిపివేశాడని, అప్పుడు శ్రీరాముడు ప్రత్యక్షమై ఆ పద్యాన్ని పూర్తి చేశాడని పురాణం చెబుతోంది.

వావిల కొలను సుబ్బారావు :
ఈయన 1863 సంవత్సరంలో జనవరి 23న కడప జిల్లా జమ్మల మడుగులో రామచంద్రారావు, కనకాంబ దంపతులకు జన్మించిన ఆంధ్ర వాల్మీకి వావిల కొలను సుబ్బా రావు. 50కి పైగా గ్రంథాలను రచించిన మహాకవి. ఒకనాటి రాత్రి స్వప్నంలో ఆయనకు ఇద్దరు బైరాగులు కనపడి ‘ఇక్కడ నువ్వు ఏమి చేస్తున్నావు. ఒంటిమిట్టకు రారాదా’ అని పిలిచారట. ఉదయాన్నే స్వప్నం గురించి చర్చించి ఒంటిమిట్టకు బయలుదేరారు. 1920 నాటికి ఒంటిమిట్టలోని రామాలయ మా న్యాలు, మడులు, అన్యాక్రాంతమయ్యాయి. ఆ పరిస్థితుల్లో స్వామి ప్రేరణతో సుబ్బారావు ఒంటి మిట్టలో నివాసమేర్పరచుకొని రామాలయాన్ని పునరుద్ధరించుటకు అవిరళకృషి చేశారు. టెంకాయ చిప్ప చేత బట్టుకొని పాదయాత్ర చేస్తూ లక్షలాది రూపాయలను సేకరించి ఆలయ నిర్మాణం గావించారు. ఈయన వాల్మీకి రామాయణాన్ని తెలుగులోకి యధాతథంగా అనువదించి ఆంధ్ర వాల్మీకి అనే బిరుదు పొందారు.

అయ్యరాజు తిప్పకవి :
gopuramఒంటిమిట్ట నివాసి అయిన అయ్యరాజు తిప్పకవి క్రీ.శ.1423నుండి 1446వరకు సంగరాజు వంశములలో ముఖ్యుడైన ప్రౌడదేవరాయుల ఆస్థానంలో కవిగా పనిచేశారు. ఈయన శ్రీ రఘువీర శతకాన్ని రచించారు.వరకవిః ఈ కవి పూర్తి పేరు తెలియదు. వరకవి అనేది ఆయనకు బిరుదు. ఈ కవి మట్టిరాజుల ఆస్థానంలోని వారు. ఒంటిమిట్ట కోదండరాముని మీద ఆయన శతకం రాశారు. ఈ శతకంలో ఆనాటి రాజకీయ అల్లకల్లోలాలను ప్రస్తా వించారు. ప్రస్తుతం ఈ శతకం శ్రీవెం కటేశ్వర యూనివర్సిటిలోని ప్రాచ్య పరి శోధనశాలలో వుంది. ఈ కవిపేరుమీద నెల్లూరు జిల్లాలో ‘వరకవిపూడి’ అని గ్రామం ఉంది.

మరుగున పడుతున్న శిల్పసంపద
– పట్టించుకోని పురావస్తు శాఖాధికారులు

రాష్ట్రంలోనే రెండో భద్రాచలమైన ఒంటిమిట్ట శ్రీకోదండ రామాలయం అద్భుతమైన శిల్ప కళకు పెట్టింది పేరు.ఈ ఆలయంలోని గోపు రాలపై ఉండే శిల్పసంపద రానురానూ అంత రించిపోతోంది. శిథిలమవుతున్న శిల్ప సం పద తిరిగి నిర్మించేందుకు భారత పురావస్తు శాఖ కుంటిసాకులు చెబుతోంది. దీనిపై ఈ ప్రాంత ప్రజల్లో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. చేస్తామని హామీలు ఇస్తూ వస్తున్న ప్రజాప్రతినిధులు కూడా మొండాల శిల్పాలకు పునరద్ధరించేందుకు భారత పురావస్తు శాఖపై ఒత్తిడి తేవడంలో విఫలమవు తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.

ఆలయంలోని రాజ గోపురం, గర్భగుడి గోపురంపై ఉన్న అద్భు తమైన శిల్పాలు రాను రానూ ముఖం, తల, చేతులు, కాళ్లు భాగాలుగా ఒక్కక్కటిగా ఊడిపోతూ అందవి హీనంగా దర్శనమిస్తున్నాయి. అయితే 2002 సంవత్స రంలో ఆలయంలోను, రాజగోపురం మరమ్మ తులు చేసి పురావస్తు శాఖ గోపురాలపై మొండాలుగా దర్శనమిస్తున్న శిల్పాలకు రూపాలు కల్పించక అలాగే వదిలేసి మరమ్మతులు చేయడంతో ప్రజలు నిరస న తెలుపుతున్నారు. పాడైపోయిన శిల్పాల రూపాలకు తమ వద్ద తగిన ఆనవాళ్లు లేవంటూ ఆ శాఖ ప నులు ముగించి చేతులు దులుపుకుంది. భారతదేశంలోని గొప్ప ఆలయ గోపురాల్లో ఒంటిమిట్టలోని శ్రీ కోదండ రామాలయ గోపురం ఒకటని, క్రీ.శ.1652 సంవత్సరం భారతదేశ యాత్ర చేసిన ఫ్రెంచ్‌ యా త్రికుడు టావర్నియర్‌ ప్రశంసించాడు.

అలాంటి గోపురానికి ఉన్న శిల్పాలు నేడు శిథిలావస్తలకు చేరు కున్నాయి. రూపాలు కోల్పోయి అంద విహీనంగా దర్శనమిస్తున్నాయి. ఎంతో ప్రాచీన ప్రాశస్థ్యం కలిగి న ఒంటిమిట్ట శ్రీకోదండ రామాల యాన్ని సందర్శించేందుకు ఆంధ్రప్రదేశ్‌ సహా పలు రాష్ట్రాల నుంచే కాక విదేశాల నుండి సైతం యాత్రి కులు వస్తుంటారు. మరి అలాంటి శిల్ప సంపద నేడు శిథిలావస్తకు చేరడంతో రాజగోపురం, గర్భగుడి గోపురాలు బోసిపోయి భక్తులను వెక్కిరిస్తున్నాయి. రాజగోపు రంపై సుమారు 250కిపైగా శిల్పాలు ఉండేవి. అయితే 50శాతం శిల్పాలను గతంలో ఉన్నవాటిలోనే శిల్ప కారులచే పురావస్తు శాఖాధి కారులు పునరుద్ధరిం చారు. ఇందు కోసంకొన్ని బొమ్మలను కర్నాటక రాష్ట్రం హంపి నుంచి తెప్పించి మరమ్మతులు చేశారు.

మిగిలిన 50శాతం శిల్పా లకు సంబంధించి రూపాలను తగిన ఆనవాళ్ళు లేవంటూ అప్పట్లో మరమ్మతు పనులు ముగించారు. శిల్పా లకు ఉన్న రూపాల చరిత్ర లేక పోవడంతో వాటికి మరమ్మతులు చేయకుండా అలా గే వదిలిపోవాల్సి వచ్చిందని పురావస్తు శాఖాధికారులు చెబుతున్నారు. ఎవ రైనా వాటి రూపాలకు సంబంధిం చిన ఆధారాలు చూపితే వాటిని పునః నిర్మిస్తామంటు న్నారు. ప్రభుత్వ శిల్పకారులను పిలిపించి శిల్పాలను తిరిగి నిర్మింప చేయాలని ప్రజలు కోరుతున్నారు.

– మేజర్‌ న్యూస్‌ ఒంటిమిట్ట

Surya Telugu Daily .

ఫిబ్రవరి 24, 2011 Posted by | చూసొద్దాం | 1 వ్యాఖ్య

జ్యూసులతో తేజస్సు..

జ్యూసులతో తేజస్సు..

కొందరి చర్మం మెరిసిపోతూ ఆరోగ్యంగా వుంటుంది. మరి కొందరిది పాలిపోయినట్లు నిర్జీవంగా వుంటుంది.ఎన్ని చిట్కాలు పాటించినా కూడా ఫలితం రాకపోగా మరిన్ని సమస్యలు కొనితెచ్చుకోవడం అవుతుంది. దీనికి కారణం బయటి సమస్య మాత్రమే కాదు.. లోపలిది కూడా.. కాబట్టి పైపై రంగులు, మేకప్‌ మాత్రమే కాకుండా అంతర్గతంగా కూడా కాస్త జాగ్రత్త వహించాలి.ముఖ్యంగా మెరిసే చర్మం కోసం జ్యూసులు ఎక్కువగా తీసుకోవాలి.

టమాటా :
frutssటమాటాలను మిక్సీలో వేసుకుని జ్యూస్‌లాగా చేసుకుని అందులో కొద్దిగా ఉప్పు లేదా చక్కెర వేసుకుని తీసుకుంటే చర్మానికి నిగారింపు వస్తుంది.అలాగే ఇది రక్తా న్ని శుద్ధి చేస్తుంది. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. విటమిన్స్‌ కూడా లభి స్తాయి.

క్యారెట్‌ :
తినడానికి ఎంతో రుచిగా వుండే క్యారెట్‌లో పోషకాలు కూడా ఎక్కువే. ఇది రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది. ఇందులో వుండే విటమిన్‌ ఏ, సిలు చ ర్మానికి తేజస్సును ఇస్తాయి. కళ్లకు కూడా ఎంతో మంచిది.

జామకాయతో :
జామకాయలో వుండే పో షకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తా యి. ఆరోగ్య సంబంధిత వ్యాధులు నయమవుతాయి. క్రమంగా చర్మం నిగారింపు సం తరించుకుంటుంది.

ఆపిల్‌ :
రోజూ ఒక ఆపిల్‌ తీసుకోవ డం వల్ల అనారోగ్యానికి కారణమయ్యే వాటిని చాలా వరకు దూరం చేసుకోవ చ్చు. యాపిల్‌లోని గుణాలు చర్మానికి మృదుత్వాన్ని ఇచ్చి మెరిసేలా చేస్తాయి.

బీట్‌రూట్‌ :
లివర్‌కు మంచిది. కిడ్నీ లను శుద్ధి చేస్తుంది. రక్తంలోని మలి నాలను తొలగిస్తుంది. ఎర్ర రక్త కణాల సంఖ్యని పెంచుతుంది. చర్మాన్ని మెరి సేలా చేస్తుంది. రుచికి కాస్త భిన్నంగా వున్నప్పటికీ ఇది ఎంతో మేలు చేస్తుంది ఈ దుంప.

పుచ్చకాయ :
90 శాతం నీరు వుండే కాయ పుచ్చకాయ. దాహార్తిని తీర్చడం తోపాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. శరీరానికి చలువను ఇస్తుంది. అందాన్ని ఇనుమడింపజేస్తుంది. పుచ్చకాయ జూసును తీసుకోవడం వల్ల చర్మం మరింత తేటగా మారుతుంది.

Surya Telugu Daily .

ఫిబ్రవరి 23, 2011 Posted by | ఆరోగ్యం | వ్యాఖ్యానించండి

హై హీల్స్‌… హై రిస్కులు…

హై హీల్స్‌… హై రిస్కులు…

High_Heel_Shoe1 వలన నడకలో హొయలు వచ్చి.. నడక అందాన్ని దిద్దుకుంటుంది. కాస్తంత ఎత్తు తక్కువగా ఉన్న వారు కూడా ఎత్తుగా వున్నవారిలా కన్పించే అవకాశం వీటిలో వుంది. అయితే హైహీల్స్‌ను ఏదో ఒక సందర్భంలో వుపయోగించడం వలన అంతగా ప్రమాదమేమీ ఉండదు. కానీ రెగ్యులర్‌గా ఉపయోగించారంటే మాత్రం వాటి కారణంగా చాలా రకాల ఇబ్బందులు ఎదురవుతాయి. హైహీల్స్‌ షేప్‌ కార ణంగా పాదాల మీద అధిక భా రం పడుతుం ది. వెన్నెము క, మెడ వీటి పైన కూడా, అధిక భారం పడి.. అవి నొప్పి పెట్టే అవకాశం ఉంది. ఎక్కువ కాలం హైహీల్స్‌ వాడటం వలన పాదం చీల మండలం దగ్గర వుండే ఎచిలిస్‌ టెండాన్‌ పొట్టిగా తయా రయ్యే అవకాశం ఉంది. దీంతో టెండాన్‌ ఇబ్బందిని కలిగిస్తుం ది. పాదాలపై ఆనెలు, బ్లిస్టర్స్‌ వంటివి రావటానికి, హైహీల్స్‌ కారణం అవుతాయి. ఆనెలు, వత్తిడితో కలిగే బ్లిస్టర్స్‌ నొప్పితో నడవ నీయని పరిస్థితి తెచ్చిపెట్టే ప్రమాదం ఉంది.

High_Heel_Shoe దీర్ఘకాలం హైహీల్స్‌ వాడేవారిని న్యూరోమా అన్న సమస్య వేధిస్తుంది. తీవ్రమైన నొప్పి కాకుండా… దీర్ఘకాలంగా పెయిన్‌ను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తే సర్జరీ చేయాల్సిన అవసరం కూడా రావచ్చు. దీర్ఘకాలం హైహీల్స్‌ వాడడం వలన పాదం వెనుక భాగంలో లోపం ఏర్పడుతుంది. ఇది కూడా వేధిస్తుంది.బొటన వ్రేళ్లలో కూడా లోపాలు ఏర్పడే అవకాశం ఉంది. హైహీల్స్‌ ధరించినప్పుడు మెదడుకు వెళ్లే నరాలు వత్తిడికి గురై.. మెదడు కార్యకలాపాలు సక్రమంగా జరగవు. పూర్తిగా హైహీల్స్‌కు దూరంగా వుండటం కుద రని పక్షంలో వీలయినంత వరకు వీటి వాడ కాన్ని తగ్గించేందుకు చేసేందుకు ప్రయ త్నించాలి. హీల్స్‌ గనుక వేసుకోవాల్సి వస్తే వాటిని వేసు కున్నా సరే కూ ర్చు న్నప్పుడు చెప్పు లను విడిచి పా దాలను నేలపై పె ట్టుకోవాలి. నడి చేటప్పుడు వేసు కోవాలి అని నిపుణులు సూచిస్తున్నారు.

Surya Telugu Daily .

ఫిబ్రవరి 21, 2011 Posted by | అతివల కోసం | వ్యాఖ్యానించండి

అతి పెద్ద ఆకాశ హర్యాలు

అతి పెద్ద ఆకాశ హర్యాలు
భవన నిర్మాణరంగంలో మానవుని మేధాశక్తి అంబరాన్ని తాకుతోంది.ఇటీవలికాలంలో ఈ రంగంలో సాంకేతిక పరిజ్ఞానం ఎంతో అభివృద్ధి చెందింది. 21వ శతాబ్దంలో మనిషి తన మేధాశక్తికి మరింత పదునుపెట్టి అద్భుతాలు సృష్టిస్తున్నాడు. దానికి ప్రత్యక్ష ఉదాహరణే దుబాయ్‌లోని అతి పెద్దదైన ‘బుర్జ్‌ ఖలీఫా’ భవనం. 1.5 బిలియన్‌ డాలర్ల వ్యయంతో కేవలం ఐదేళ్ళలో 160 అంతస్తులతో రూపొందించిన ఈ ఆకాశ సౌధం ప్రపంచంలోనే అత్యంత ఎతె్తైన భవనంగా గుర్తింపు పొందింది. ఇవేకాకుండా ప్రపంచంలో ఇలాంటి కొన్ని భవనాలున్నాయి. ఈ నేపథ్యంలో వ్యాపార, నివాస అవసరాలకోస నిర్మించిన అనేక భవనాల్లో నిర్మాణపరంగా తొలి పది స్థానాల్లో నిలిచిన ఎతె్తైన ఆకాశ సౌధాలపై ఓ కథనం…

petronas-towers.jpgఆకాశహార్మ్యాల నిర్మాణంలో చైనీయులు అందరికంటే ముందు వరసలో ఉన్నారు. ప్రపంచంలోని టాప్‌ టెన్‌ ఎతె్తైన భవనాల్లో ఆరు భవనాలు చైనా, హాంగ్‌కాంగ్‌లలోనే నిర్మితం కావడం విశ ేషం. 1998 వరకు చికాగోలోని విల్లిస్‌ టవర్స్‌దే అగ్రస్థానం. 1974లో నిర్మించిన ఈ భవనం ఇరవైనాలుగేళ్ళపాటు తన ఆధిపత్యాన్ని చెలాయించింది. అయితే ఈ భవనం ఇప్పుడు ఏడవ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చిం దంటే భవన నిర్మాణ రంగంలో మూడు దశాబ్దాలలో ఎంత మార్పు సంభవించిందో అర్ధం చేసుకోవచ్చు. రోజురోజుకూ పెరిగిపోతున్న జనాభాను దృష్టిలో ఉంచుకొని అపార్ట్‌మెంట్లను నిర్మించడం పరిపాటిగా మారింది.

అత్యధిక జనా భా ఉండే మహా నగరాలలోనైతే ఇక చెప్పనవసరం లేదు. కేవ లం నివాస అవసరాలకే కాకుండా వ్యాపార అవసరాల కోసం పెద్ద షాపింగ్‌ మాల్స్‌ను నిర్మించడం కూడా గత రెండు మూ డు దశబ్దాల్లో ఎక్కువైంది. అయితే ఇలాంటి ఆకాశ సౌధాలు నిర్మించడం మానవ అవసరాల మాట అలా ఉంచితే ఇలాంటి నిర్మాణాల వలన భూకంపాలు, నీటి కొరత లాంటి సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు పర్యావరణవేత్తలు. భద్రత విషయంలో కూడా ఇవి శ్రేయస్కరం కా దని వారి అభిప్రాయం. ఏదేమైనప్పటికీ భవన నిర్మాణ రం గం లో అందనంత ఎత్తుకు ఎదిగిన మనిషి మేధా సంపత్తికి జై కొట్టాల్సిందే.

నేనెవరికీ అందను…
ప్రపంచంలోనే ఎతె్తైన మానవ నిర్మితంగా గుర్తింపు పొందిన దుబాయ్‌లోని బుర్జ్‌ ఖలీఫా భవనంలో మొత్తం 160 ఫోర్లు ఉండడం విశేషం. దీనిని బుర్జ్‌ దుబాయ్‌ అని కూడా పిలుస్తారు. 21 సెప్టెంబర్‌ 2004న పునాదులు వేసుకున్న ఈ భవన నిర్మాణం గత ఏడాది అక్టోబర్‌ 1వ తేదీన పూర్తయ్యిం ది. కేవల ఐదేళ్ళ రికార్డు కాలంలో నిర్మించిన ఈ నిర్మాణానికి 1.5 బిలియన్‌ డాలర్లు ఖర్చయిందట. 490 ఎకరాల విస్తీర్ణం లో నిర్మించిన ఈ భవన నిర్మాణానికి బిల్‌ బేకర్‌ అనే ఇంజనీర్‌ ఛీ్‌ఫ్‌ ఆర్కిటెక్ట్‌గా వ్యవహరించారు.ఎమార్‌ ప్రాపర్టీస్‌ సం స్థ ఆధ్వర్యంలో నిర్మాణం పూర్తి చేసుకుంది.

చికాగోలోని విల్లిస్‌ టవర్స్‌, న్యూయార్క్‌లోని ప్రఖ్యాత వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ లాంటి నిర్మాణాలకు సాంకేతిక పరిజ్ఙానాన్ని అందించిన స్కిడ్‌మోర్‌, ఓవింగ్స్‌ అండ్‌ మెరిల్‌ సంస్థ బుర్జ్‌ ఖలీఫాను డిజైన్‌ చేసింది.మలేషియాలోని పెట్రోనాస్‌ టవర్స్‌, తైవాన్‌లోని తైపీ 101లకు కాంట్రాక్టర్లుగా వ్యవహరించిన దక్షిణ కొరియాకు చెందిన శామ్‌సంగ్‌ ఇంజనీరింగ్‌లాంటి పలు సంస్థలు ఈ అ ద్భుత నిర్మాణంలో పాలుపంచుకున్నాయి. కార్యాలయాలకో సం ఆఫీస్‌ సూట్స్‌, వ్యాపార అవసరాలకోసం షా పింగ్‌ మా ల్స్‌, రెస్టారెంట్లతో పాటు రెసిడెన్షియల్‌ కాంప్లెక్స్‌ల ను కూడా ఇందులో పొందుపరచడం విశేషం. దక్షిణాసియా దేశాల నుం డి వెళ్ళిన సుమారు 7,500 మంది భవన నిర్మాణ కార్మికులు బుర్జ్‌ ఖలీఫా నిర్మాణంలో పాలుపంచుకున్నారు.

ఎత్తులో మేము సైతం…
తైపీ 101… బుర్జ్‌ ఖలీఫా నిర్మాణం పూర్తయ్యేవరకు ఈ నిర్మాణానిదే రికార్డు. 101 ఫ్లోర్లు కలిగి ఉండడంతో దీనికి ఆ పేరు వచ్చింది. కాన్ఫెరెన్స్‌ హాళ్లు, ఫిట్‌నెస్‌ సెంటర్లు, లైబ్రరీ, ఆఫీస్‌, రెస్టారెంట్‌, రిటైల్‌లాంటి ఎన్నో వ్యాపారాలకు ఇందు లో సదుపాయాలున్నాయి. ఈ భవనం యొక్క మరో విశిష్టత ఏమిటంటే వారంలో ఒక్కో రోజు ఒక్కో రంగులో దర్శనమివ్వడం తైపీ 101 ప్రత్యేకత. ప్రతిరోజు ఉదయం ఆరు గం టల నుండి రాత్రి పది గంటల వరకు ప్రతి రోజు వివిధ రం గుల్లో దర్శనమిచ్చే తైపీ 101…509 మీటర్ల ఎత్తుతో ప్రపం చంలోనే ఎతె్తైన భవానాల్లో రెండవ స్థానంలో ఉంది.

ఇక చైనాలో అత్యంత ఎతె్తైన ‘షాంఘై వరల్డ్‌ ఫైనాన్షియల్‌ సెంటర్‌’ ప్రపంచంలోని ఎతె్తైన భవనాల్లో మూడవ స్థానంలో కొనసాగుతోంది. 2008లో నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ కట్టడంలో తైపీ 101 లాగే వ్యాపార అవసరాలకు కావాల్సిన సదుపాయాలున్నాయి. 492 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ భవనంలో 101 ఫ్లోర్లు, 91 లిఫ్ట్‌లు ఉన్నాయి. దీని తరువాతి స్థానాన్ని హాంగ్‌ కాంగ్‌లోని ‘ఇంటర్నేషనల్‌ కామర్స్‌ సెంటర్‌’ ఆక్రమించుకుంది. 484 మీటర్లు ఎ త్తులో ఉన్న ఈ భవనాన్ని ఎమ్‌టిఆర్‌ కార్పోరేషన్‌ లివి ుటెడ్‌ నిర్మించింది.

ప్రపంచంలో ఎతెతైన నిర్మాణాల్లో ఎక్కువ పాపులారిటీ సంపాదించిన మరో ఆకాశ సౌధం ‘పెట్రోనాస్‌ టవర్స్‌’. మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో నిర్మించిన ఈ జంట సౌధా లను1992-98 మధ్యకాలంలో నిర్మించారు. వీటి తరువాత నన్జింగ్‌ గ్రీన్‌లాండ్‌ ఫైనాన్షియల్‌ సెంటర్‌, విల్లిస్‌ టవర్‌, గువాంగ్‌జౌ వెస్ట్‌ టవ ర్‌, జిన్‌ మావో టవర్‌, ఇంటర్నేషనల్‌ ఫైనాన్షియల్‌ సెంటర్‌ లాంటి నింగినంటే నిర్మాణాలు టాప్‌-10 లిస్ట్‌లో పేరు సంపాదించాయి. ఈ విషయంలో భారత్‌ మాత్రం చాలా వెనకబడి ఉందనే చెప్పవచ్చు.

ప్రపంచంలోని టాప్‌ – 10 ఆకాశసౌధాలు
1. బుర్జ్‌ ఖలీఫా

ఎత్తు		: 828 మీటర్లు
అంతస్తులు   	: 160
సిటీ		: దుబాయ్‌ (యూఏఈ)
ఆర్కిటెక్చర్‌   	: స్కిడ్‌మోర్‌, ఓవింగ్స్‌ అండ్‌ మెరిల్‌
నిర్మాణ సంస్థ	: ఎమార్‌ ప్రాపర్టీస్‌
నిర్మాణం ప్రారంభించింది: 21 సెప్టెంబర్‌ 2004
ప్రారంభం		: 4 జనవరి 2010
నిర్మాణ వ్యయం	: 1.5 బిలియన్‌ డాలర్లు
2. తైపీ 101
ఎత్తు		: 509 మీ
అంతస్తులు 		: 101
సిటీ		: తైపీ (తైవాన్‌)
ఆర్కిటెక్చర్‌ 		: సి.వై.లీ అండ్‌ పార్ట్‌నర్స్‌
నిర్మాణ సంస్థ 	: కేటీఆర్‌టీ జాంయింట్‌ వెంచర్‌, 			
         శామ్‌సంగ్‌ సీ అండ్‌ టీ.
నిర్మాణం కాలం	: 1999-2004
నిర్మాణ వ్యయం	: 1.76 బిలియన్‌ డాలర్లు
3. షాంఘై వరల్డ్‌ ఫైనాన్షియల్‌ సెంటర్‌
ఎత్తు		: 492 మీటర్లు
అంతస్తులు		: 101
సిటీ		: షాంఘై
దేశం		: చైనా
ఆర్కిటెక్చర్‌		: కోన్‌ పెడర్సన్‌ ఫాక్స్‌
నిర్మాణ సంస్థ	: మోరి బిల్డింగ్‌ కంపెనీ
నిర్మాణ కాలం	: 1997-2008
నిర్మాణ వ్యయం	: 1.2 బిలియన్‌ డాలర్లు
4. ఇంటర్నేషనల్‌ కామర్స్‌ సెంటర్‌,
ఎత్తు		: 483 మీటర్లు
అంతస్తులు		: 118
దేశం		: హాంగ్‌ కాంగ్‌
ఆర్కిటెక్చర్‌		: వాంగ్‌ అండ్‌ ఒయాంగ్‌ లిమిటెడ్‌
నిర్మాణ సంస్థ	: సన్‌ హంగ్‌ కాయ్‌ ప్రాపర్టీస్‌
నిర్మాణం కాలం	: 2002-09
5. పెట్రోనాస్‌ టవర్స్‌
ఎత్తు		: 452 మీటర్లు
అంతస్తులు		: 88 
సిటీ		: కౌలాలంపూర్‌
దేశం		: మలేషియా
ఆర్కిటెక్చర్‌		: సెసర్‌ పెల్లి
నిర్మాణ సంస్థ	: హజామా కార్పోరేషన్‌, శామ్‌సంగ్‌ సీ అండ్‌ టీ
నిర్మాణ కాలం	: 1992-98
6. నన్జింగ్‌ గ్రీన్‌లాండ్‌ ఫైనాన్షియల్‌ సెంటర్‌
ఎత్తు		: 450 మీటర్లు
అంతస్తులు		: 89
సిటీ		: నన్జింగ్‌
దేశం		: చైనా
ఆర్కిటెక్చర్‌		: స్కిడ్‌మోర్‌, ఓవింగ్స్‌ అండ్‌ మెరిల్‌
నిర్మాణ సంస్థ	: స్కిడ్‌మోర్‌, ఓవింగ్స్‌ అండ్‌ మెరిల్‌
నిర్మాణం కాలం	: 2008 నుండి నిర్మాణంలో ఉంది
7. విల్లిస్‌ టవర్‌
ఎత్తు		: 442 మీటర్లు
అంతస్తులు		: 108
సిటీ		: చికాగో
దేశం		: అమెరికా సంయుక్త రాష్ట్రాలు
ఆర్కిటెక్చర్‌		: స్కిడ్‌మోర్‌, ఓవింగ్స్‌ అండ్‌ మెరిల్‌
నిర్మాణ కాలం	: 1970 - 73
8. గువాంగ్‌జౌ వెస్ట్‌ టవర్‌
ఎత్తు		: 440 
అంతస్తులు		: 103
సిటీ		: గువాంగ్‌జౌ
దేశం		: చైనా
నిర్మాణ సంస్థ	: విల్కిన్సన్‌ ఐర్‌
నిర్మాణ కాలం	: 2009
9. జిన్‌ మావో టవర్‌
ఎత్తు		: 421 మీటర్లు 
అంతస్తులు		: 8
సిటీ		: షాంఘై
ఆర్కిటెక్చర్‌		: స్కిడ్‌మోర్‌, ఓవింగ్స్‌ అండ్‌ మెరిల్‌
నిర్మాణ కాలం	: 1994-98
10. టూ ఇంటర్నేషనల్‌ ఫైనాన్స్‌ సెంటర్‌
ఎత్తు		: 416 మీటర్లు 
అంతస్తులు		: 88
దేశం		: హాంగ్‌ కాంగ్‌
ఆర్కిటెక్చర్‌		: రొకో డిజైన్‌ లిమిటెడ్‌
నిర్మాణ సంస్థ	: ఐ.ఎఫ్‌.సీ

దేశంలో ఇంపీరియలే టాప్‌…
ఆకాశ హర్మ్యాల నిర్మాణాల్లో భారత్‌కు టాప్‌-100లో కూడా చోటు దక్కకపోవడం గమనార్హం. ప్రస్తుతం ముంబ యిలోని ఇంపీరియల్‌ 1, 2 జంట రెసిడెన్షియల్‌ టవర్లే భారత్‌లో ఎతె్తైన నిర్మాణాలు. 60 అంతస్తులు కలిగిన ఈ భవనాల ఎత్తు 249 మీటర్లు. ప్రపంచంలో ఎతె్తైన భవనాల్లో ఇంపీరియల్‌ స్థానం 153. భారత్‌లోనే ఎతె్తైన ఈ భవనాల లిస్టులో ముంబాయిలోని ‘అశోక టవర్స్‌’, బెంగుళూరులోని ‘యూబీ టవర్స్‌’ తర్వాతిస్థానాల్లో ఉన్నాయి. అయితే ప్రస్తుతం ముంబయిలో నిర్మాణ దశలో ఉన్న ‘ఇండియా టవర్స్‌’(301 మీ), ‘లోధా బెల్లిసిమో’(252) నిర్మాణాలు పూర్తయితే ఎతె్తైన భవనాల స్థానాల్లో మన స్థానం మరింత మెరుగుపడే అవకాశం ఉంది.

Surya Telugu Daily.

ఫిబ్రవరి 17, 2011 Posted by | వింతలూ-విశేషాలు | 2 వ్యాఖ్యలు