హరివిల్లు

ఎన్నెన్నో వర్ణాలు-అన్నింటా అందాలు…

మహిళలను బాధించే గర్భాశయ క్యాన్సర్‌

మహిళలను బాధించే గర్భాశయ క్యాన్సర్‌

మహిళల్లో గర్భాశయ క్యాన్సర్‌ వ్యాధిగ్రస్థుల సంఖ్య ఏటా పెరుగుతూ వస్తోంది. దీనినే ఎండోమెట్రిక్‌ క్యాన్సర్‌ అని అంటారు. ఈ వ్యాధి ఎక్కువగా డబ్బున్న కుటుంబాలలోని మహిళలకు ఎక్కువగా వస్తోంది.వారి జీవనశైలే ఈ వ్యాధి రావడానికి కారణంగా పేర్కొనవచ్చు.

Endometrial-Cancerగర్భాశయ ముఖ ద్వారం క్యాన్సర్‌ వ్యాధిగ్రస్థులతోపాటు గర్భాశయ క్యాన్స ర్‌ వచ్చే మహిళల సంఖ్య క్రమేణా పెరుగుతూ వస్తోంది. మెనోపాజ్‌, పెరి మెనోపాజ్‌ వాళ్లకి ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు పిల్లలు లేని వారిలో ఈ వ్యాధి సాధారణంగా కనిపిస్తుంది. ఒబెసిటీ, బిపి, షుగర్‌ ఉన్న మగువల్లో సైతం ఈ వ్యాధి వచ్చే అవకాశా లున్నాయి. మెనోపాజ్‌లో ఉన్న మహి ళల్లో ఈస్ట్రోజోన్‌ థెరపీ తీసుకుంటే వారిలో కూడా ఈ వ్యాధి కనిపిస్తుంది. ఎక్కువ బ్లీడింగ్‌ జరిగే స్ర్తీలకు ఈ వ్యాధి వచ్చే అవకాశాలున్నాయి. కుటుం బంలోని ఒకరికి ఈ వ్యాధి ఉంటే మరొకరికి సైతం రావచ్చు. గర్భా శయం పొరలు మందంగా ఉన్న వాళ్లలో ఈ వ్యాధి వచ్చే అవకాశాలున్నాయి.

వివిధ రకాలుగా…
ఎండోమెట్రిక్‌ క్యాన్సర్‌ గర్భా శయంలో చిన్న గడ్డల మాదిరిగా ప్రారంభమవుతుంది. ఇందులో మూడు గ్రేడులు ఉంటాయి. ఒకటవ గ్రేడ్‌ను ప్రారంభ దశగా పరిగణిస్తే రెండు, మూడు గ్రేడులను ప్రమాదకరంగా భావిస్తారు. ఈ వ్యాధిని నాలుగు స్టేజ్‌లుగా విభజిస్తారు. మొదటి స్టేజ్‌లో గర్భాశయం లోపలి పొరల్లో వస్తే, రెండవ స్టేజ్‌లో గర్భాశయం మధ్య పొరల్లో(మజిల్స్‌), మూడవ స్టేజ్‌లో గర్భాశయం బయట కూ డా వ్యాధి వస్తుంది. బాగా ముదిరిన తర్వాత వచ్చే నాలుగవ స్టేజ్‌లో గర్భాశయం పక్కన ఉండే ఊపిరితిత్తులు, బ్లాడర్‌ తదితర అవయవాలకు సైతం ఈ వ్యాధి సంక్రమిస్తుంది.

వ్యాధి లక్షణాలు…
గర్భాశయ క్యాన్సర్‌ వచ్చిన మహిళల్లో బ్లీడింగ్‌ ఎక్కువగా ఉంటుంది. పీరి యడ్స్‌ ఆగే ముందు బ్లీడింగ్‌ అవుతుంది. ఈ క్రమంలో ఎక్కువగా రక్తస్రావం అవుతుంటే స్ర్తీలు వెంటనే డాక్టర్‌ను సంప్రదించి చెకప్‌ చేయించుకోవాలి. ఈ వ్యాధి వచ్చిన వారిలో గర్భాశయానికి చీము పట్టవచ్చు. కడుపులో నొప్పిగా ఉంటుంది. జ్వరం, ఒళ్లు నొప్పులు వస్తాయి. బరువు తగ్గడం, ఆకలి లేకపో వడం, ఆయాసం రావడం జరుగుతుంది.

వ్యాధి నిర్ధారణ…
ఎండోమెటల్‌ బయాప్సి ద్వారా వ్యాధి నిర్దారణ చేస్తారు. వ్యాధిగ్రస్థులకు రక్తం, మూత్ర పరీక్షలు నిర్వహిస్తారు. అల్ట్రాసౌండ్‌ పరీక్షలు నిర్వహించి వ్యాధి నిర్దారణ చేస్తారు. ఈ పరీక్షలలో యుటెరస్‌ సైజు పెరిగిందా, గడ్డలు ఉన్నాయా అని తెలు సుకుంటారు. మిగతా ఆర్గాన్స్‌కు ఏమైనా వ్యాధి వ్యాపించిందా అని పరీక్షిస్తారు. అవసరమైతే సీటి స్కాన్‌ చేస్తారు. ఎంఆర్‌ఐ నిర్వహిస్తారు. ఇందులో వ్యాధి యుటెరస్‌కు ఎంత పాకింది. ఎముకలు, ఊపిరితిత్తులకు వ్యాధి సోకిందా అని తెలుసుకుంటారు.

నివారణ…
లావుగా ఉన్న మహిళలు, హార్మోన్ల మార్పిడి, ఈస్ట్రోజన్‌ మార్పిడి చేయించుకున్న మగువలు రెగ్యులర్‌గా డాక్టర్‌ను సంప్రదించి పరీక్షలు నిర్వహించుకోవాలి.వీరికి గర్భాశయ సమస్యలు తీవ్రమైతే యుటిరస్‌ను తీయించుకోవాల్సి ఉంటుంది.

చికిత్స…
ప్రీమా లిగ్నమెంట్‌ స్టేజ్‌లో ఉన్న వ్యాధిగ్రస్థులు రెగ్యులర్‌గా డాక్టర్‌ చేత చెకప్‌ చేయించుకోవాలి. వీరికి అవసరమైతే ప్రొజిస్ట్రీన్‌ హార్మోన్‌ సప్లిమెంట్‌ ఇస్తారు. ప్రొజిస్టరాన్‌ చికిత్స నిర్వహిస్తారు. గర్భాశయం క్యాన్సర్‌ బాగా ముదిరితే యుటిరస్‌ను తీయించుకోవాల్సి ఉంటుంది. ఒకటవ స్టేజ్‌లో ఉన్నవారు యుటిరస్‌, ఓవరీస్‌ తీసివేస్తారు. అవసరమైతే రేడియో థెరపి, కీమా థెరపి చేస్తారు. రెండవ స్టేజ్‌లో ఉన్నవారు రేడియో థెరపీతో పాటు హార్మోన్లను కూడా అందజే స్తారు. కీమో థెరపీ కూడా ఇస్తారు. పీరియడ్స్‌ ఆగిపోయిన మహిళలు రెగ్యులర్‌గా డాక్టర్‌ చేత చెకప్‌ చేయించుకోవాలి. మెనోపాజ్‌లో ఉన్నవారికి మొత్తం స్క్రీనింగ్‌ చేయించు కోవాల్సి ఉంటుంది.

padmarvati

Surya Telugu Daily .

మార్చి 7, 2011 Posted by | ఆరోగ్యం | | వ్యాఖ్యానించండి

సంతాన ప్రాప్తిరస్తు ! సంతానలేమి అంటే…

సంతాన ప్రాప్తిరస్తు ! సంతానలేమి అంటే…

స్ర్తీ సంపూర్ణత్వానికి ప్రతీకగా మాతృత్వాన్ని చెబుతారు. అలాంటి మాతృత్వాన్ని పొందలేని వారెందరో నేడు సమాజంలో ఉన్నారు. ఈ విధమైన సంతానలేమి లోపాలు మహిళల్లోనూ కాకుండా పురుషుల్లోనూ ఉండవచ్చు. లోపం ఎవరిలో ఉన్నా కూడా ఆ లోపాన్ని సరిజేసి సంతానం పొందే భాగ్యాన్ని కలిగించే ఆధునిక చికిత్సలూ నేడు అందుబాటులో ఉన్నాయి. సంతానలేమిపై అపోహలు, కారణాలు, చికిత్స విధానాలు తదితర అంశాలపై ప్రత్యేక కథనం… సంతాన ప్రాప్తిరస్తు.

సంతానలేమి అంటే…
family-planఒక ఏడాది కాలం పాటు ఎలాంటి గర్భనిరోధకాలు వాడకుండా, గర్భధారణ కు ప్రయత్నించి నప్పటి కీ ఓ జంటకు సంతా నం కలగకపోవ డా న్ని లేదా గర్భ దార ణ జరగకపో వడా న్ని సంతాన లేమి గా చెప్పవచ్చు.

సంతానలేమికి కారణాలేంటి?
మహిళలో లేదా పురుషు నిలో లేదా ఇద్ద రి లోనూ ప్రత్యుత్ప త్తి వ్యవస్థలో ఉండే సమస్యలు సంతాన లేమికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. దిగువ పేర్కొన్న అంశాలకు సంబం ధించిన సమస్యలను సంతానలేమికి ముఖ్యకారణాలుగా పేర్కొనవచ్చు.
* పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ
* మహిళ ఫాలోపియన్‌ ట్యూబ్‌లు
* మహిళ గర్భాశయం లేదా సెర్విక్స్‌
*మహిళ రుతుచక్రం
* సాధారణ పరీక్షల్లో వెల్లడి కాని కారణాలు
సంతానలేమి సమస్య అరుదా? సాధారణమా? తీవ్రత ఏ స్థాయిలో ఉంది?
ప్రతీ ఆరు జంటల్లో ఒక జంట ఏదో ఒకస్థాయిలో ఎంతో కొంత మేరకు సంతానలేమి సమస్యతో బాధపడుతూ ఉంటుంది. వీరికి వైద్యసలహా లేదా చికిత్స అవసరమవుతుంది.

సాధారణంగా ఫలదీకరణ ఎలా జరుగుతుంది?
babysపురుషవీర్యకణం అండంతో కలవడాన్ని ఫలదీకరణగా చెప్పవచ్చు. మహిళ ఫాలోపియన్‌ ట్యూబ్‌లలో ఈ ప్రక్రియ చోటు చేసుకుంటుంది. ఫలదీకరణం చెందిన అండం గర్భాశయంలోకి చేరుకుంటుంది. అక్కడి యుటెరిన్‌ లైనింగ్‌లో స్థిరపడుతుంది. గర్భధారణ జరగాలంటే, ఫలదీకరణ చెందిన అండం ఈ విధంగా గర్భాశయాన్ని చేరుకోవాలి. ప్రతీ రుతుచక్రంలోనూ ఒక్కటే అండం విడుదల అవుతుంది. ఆ సమయంలో ఆ అండం ఫలదీకరణం చెందకుండా ఉంటే తిరిగి రుతుచక్రం పూర్తయ్యే వరకూ గర్భధారణ సాధ్యపడదు.

సంతానలేమిని ఏవిధంగా నిర్ధారిస్తారు?
మొదట ఓ జంట మెడికల్‌ హిస్టరీని పరిశీలించడంతో పాటు వారికి వివిధ ఫిజికల్‌ పరీక్షలు నిర్వహించడం ద్వారా సంతాన సాఫల్యతలో ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తిస్తారు. ఈ పరీక్షలు దంపతులిద్దరికీ చేస్తారు. రక్తపరీక్ష, వీర్య విశ్లేషణ, అల్ట్రాసౌండ్‌ పరీక్షలు లేదా మహిళలకు ఎక్స్‌ప్లొరేటరీ సర్జరీ నిర్వహిస్తారు.

మహిళల్లో సంతానలేమి సమస్యను ఏవిధంగా పరిష్కరిస్తారు?
సంతానలేమి సమస్య ఉందని నిర్ధారణ అయిన తరువాత ఏ విధమైన చికిత్స ఎలా, ఎప్పుడు చేయాలన్న ప్రణాళిక రూపొందిస్తారు. కొన్ని సందర్భాల్లో ఓ చిన్న సలహా లేదా కొద్ది పాటి చికిత్సతోనే ఆశించిన ఫలితం దక్కే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో సర్జరీ అవసరం కావచ్చు.

పురుషుల్లో సంతానలేమి సమస్యను ఏవిధంగా పరిష్కరిస్తారు?
పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించిన సమస్యలను చాలా వరకు మందులతో లేదా అవసరమైతే సర్జరీతో పరిష్కరించవచ్చు.

పురుషుల్లో సంతానలేమి సమస్యకు దారి తీసే అంశాలేంటి?
పురుషుడి ఆరోగ్యం, జీవనశైలి ప్రభావం వీర్యం నాణ్యత, పరిమాణంపై ప్రభావం కనబర్చే అవకాశం ఉంది. మద్యం, ధూమపానం, మాదకద్రవ్యాలు, ఒత్తిళ్ళు, పరిసరాల్లో ఉండే విషతుల్యాలు, ఆరోగ్యసమస్యలు, కొన్ని రకాల మందులు, కెమెథెరపీ, వయస్సు లాంటివి పురుషుల్లో సంతానలేమి సమస్యను ప్రభావితం చేస్తాయి.మహిళల్లో సంతానలేమి సమస్యకు దారి తీసే అంశాలేంటి? వయస్సు, ఒత్తిళ్ళు, పోషకాహార లోపం, స్థూలకాయం, బరువు తక్కువగా ఉండడం, ధూమపానం, లైంగికంగా సంక్రమించే వ్యాధులు (ఎస్‌టీడీ), హార్మోన్ల సమస్యలు, ఇతర ఆరోగ్య సమస్యలు మహిళల్లో సంతాన లేమి సమస్యకు దారి తీసే అవకాశం ఉంది.

వయస్సు ఓ మహిళ సంతాన సాఫల్యత అవకాశాన్ని ఏవిధంగా ప్రభావితం చేస్తుంది?
party-time-for-babiesమహిళల్లో అండం నాణ్యత వయస్సు పెరుగుతున్న కొద్దీ క్షీణిస్తుంది. ఏళ్ళు పైబడుతున్న కొద్దీ అండం ఫలదీ కరణం చెందే శక్తి కూడా సన్నగిల్లుతుంటుంది. అండం విడుదలలోనూ సమస్యలు ఎదురవుతుంటాయి. రుతు చక్రంలో హార్మోన్లకు సంబంధించిన సమస్యలు ఎదురు కావచ్చు. వయస్సు పెరుగుతున్న కొద్దీ అబార్షన్‌ అయ్యే అవకాశాలు అధికం అవుతుంటాయి.

సంతానలేమి సమస్యలు వారసత్వంగా వచ్చే అవకాశం ఉందా?
సంతానలేమి సమస్యలు చాలావరకు వారసత్వా నికి సంబంధిం చినవి కావు.
సంతానలేమి చికిత్సలు ఎంత వరకు విజయవంత మవుతాయి?
చిక్సిత పొందతున్న దంపతుల్లో చాలామం ది ఔషధాలు, సర్జరీల్లో మెరుగుదల, ఏఆర్‌టీ (అసిస్టెడ్‌ రిప్రొడక్టివ్‌ టెక్నాల జీ) లాంటి వాటివల్ల గర్భధారణ పొందే అవకాశం ఉంది. ఏఆర్‌టీ కింద చికిత్స పొందే దంపతుల్లో సక్సెట్‌ రేటు బాగా వృద్ధి చెందింది. ఏఆర్‌టీలో విజయాన్ని ప్రభావితం చేసే అం శాలు ఎన్నో ఉంటాయి. ఐయూఐలో 15 -20 శా తం దాకా, ఐవీఎఫ్‌లో 40-50 శాతం దాకా విజయా వకాశాలు ఉంటాయి.

దంపతుల్లో మహిళ వయస్సు 34 ఏళ్ళ కంటే తక్కువగా ఉండి, 12 నెలల పాటు ఎలాంటి గర్భ నిరో ధక సాధనాలు ఉపయోగించనప్పటికీ, గర్భం దాల్చకుం టే సంతానలేమి సమస్య ఉన్నట్లుగా భావిస్తారు. మహిళ వయ స్సు 35ఏళ్ళు దాటిన సందర్భంలో వైద్యులను సంప్రదించేం దుకు 6 నెలల సమయానికి మించి వేచిచూడ కూడదు.(వయస్సు పెరుగుతున్న కొద్దీ అండం నాణ్యత లోపిస్తుంటుంది.)

చాలావరకు, ఎలాంటి గర్భనిరోధకాలు ఉపయోగించకుండా సజావుగా దాంపత్య సంబధాలు కలిగి ఉంటే ప్రతీ 100 జంటల్లో 84 జంటలు ఏడాదిలోగానే గర్భం దాల్చే అవకాశం ఉంటుంది. ఏడాదిలో గాకున్నా, రెండేళ్ళ లోపు గర్భం దాల్చే అవకాశం 92 జంటల్లో ఉంటుంది. 35 ఏళ్ళు దాటిన మహిళల్లో, గర్భ ధారణ కోసం ప్రయత్నిస్తున్న మూడేళ్ళలోగా గర్భం దాల్చే అవకాశం నూటికి 94 మందిలో ఉంటుంది. 38 ఏళ్ళు దాటితే మాత్రం నూటికి 77 మంది మా త్రమే గర్భం దాల్చగలుగుతారు. బ్రిటన్‌లో ఐవీఎఫ్‌ చికిత్సను ఆశ్రయించే దం పతుల్లో సగం జంటల్లో పురుషుడు సంతానలేమి సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్నట్లుగా తెలుస్తోంది. స్వీడన్‌లో కనీసం 10 శాతం దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు.

ప్రధాన కారణాలు
జన్యుకారణాలు: క్రోమోజోము ల అమరికలో మార్పులు
సాధారణ కారణాలు: డయాబెటి స్‌ మెలిటస్‌ (టైప్‌2 డయాబెటిస్‌), థైరాయిడ్‌ సంబంధితాలు, అడ్రెనల్‌ (కిడ్నీల పైభాగంలో ఉండి వివిధ హా ర్మోన్లను ఉత్పత్తి చేసే గ్రంథి)వ్యాధి

హైపొథాలమిక్‌ పిట్యుటరీ సంబంధితం: మెదడు దిగువ భాగంలో ఉండే పిట్యుటరీ గ్రంథి ఉత్పత్తి చేసే 8 రకాల హార్మోన్లలో ఏదేని ఒక దాని ఉత్పత్తి తగ్గిపోవడం,
కాల్‌మాన్‌ సిండ్రోమ్‌: సెక్స్‌ హార్మోన్లను ఉత్పత్తి చేసే గ్రంథుల పనితీరు తగ్గిపోవడం. రక్తంలో ప్రోలాక్టిన్‌ పరిమాణం అధికంగా ఉండడం.
పరిసరాల ప్రభావం: వివిధ రకాల విషతుల్యాలు, రసాయనాలకు చేరువలో ఉండడం.
ధూమపానంతో చేటు:పొగతాగని వారితో పోలిస్తే పొగ తాగే వారు 60 శాతం అధికంగా సంతానలేమి సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉందని తెలుస్తోంది. పొగతాగే వారిలో ఐవీఎఫ్‌ ద్వారా శిశు వును పొందే అవ కాశం 34 శాతం తగ్గిపోతుం ది. గర్భస్రావం అయ్యే అవకాశాలు 30 శాతం పెరుగుతాయి.
8. జన్యుఉత్పరివర్తనాలు: మానవ డీఎన్‌ఏలో చోటు చేసుకునే మ్యుటేషన్స్‌ (ఉత్పర్తివర్తనం) కూడా సంతానలేమి సమస్యలకు దారి తీయ గలదు.
మహిళల్లో సంతానలేమి: 35 ఏళ్ళు పై బడిన మహిళ ఆరునెలలు ప్రయత్నిం చి నా గర్భం దాల్చని పక్షంలో మరో ఏడాది అం టూ వేచి చూడకుండా వెంటనే వైద్యు లను సంప్రదించడం ఉత్తమం. ఆమెకు అప్పటికే గర్భాశయ సమస్యలేవైనా ఉ న్నా, భాగస్వామికి స్పెర్మ్‌కౌంట్‌ (వీర్య కణాల సంఖ్య) తక్కువ ఉందని అప్ప టికే తెలిసినా మరింత ఆలస్యం చేయ కుండా డాక్టర్‌ను సంప్రదించాలి. 40 ఏ ళ్ళు దాటిన మహిళలు మూడు నెలల పాటు ప్రయత్నించినా గర్భందాల్చని పక్షంలో వెను వెంటనే నిర్ధారణ పరీక్షలు, చికిత్స ప్రారంభించాలి.
మహిళల్లో సంతానలేమికి కారణాలు:
రుతుచక్రం, ఆరోగ్యదాయక అండాల ఉత్పత్తి: రుతుచక్రం ముగియడానికి 14 రోజులు ముందుగా అండాశయం నుంచి అండం విడుదల అవుతుంది. మహిళ గర్భం దాల్చేందుకు అనువైన సమయమిది.
అనువైన వీర్యం:వృషణాల్లో వీర్యం వృద్ధి చెంది ఉత్పత్తి అయ్యేందుకు 64 రోజులు పడుతుంది. స్ఖలనం సందర్భంగా వీర్యం వెలుపలికి వస్తుంది. ఆ వీర్యంలో 100 మిలియన్ల దాకా వీర్యకణాలుంటాయి. ఇందులో కొన్ని వందలు మాత్రమే ఫాలోపియన్‌ ట్యూబ్‌ (స్ర్తీ బీజవాహిక) లను చేరుకోగలుగుతాయి.బీజవాహికల గుండా పయనించి వీర్యకణాలను చేరుకునే శక్తి అండానికి ఉండడంసెర్విక్స్‌ ద్వారా పయనించి అండాన్ని చేరుకునే శక్తి వీర్యకణాలకు ఉండడం
అండాన్ని ఫలదీకరించే శక్తి వీర్యానికి ఉండడం: వీర్యకణాల సంఖ్య, నాణ్యతను బట్టి ఇది ఆధారపడి ఉంటుంది. వీర్యకణాల నాణ్యత అంటే ముందుకు వెళ్ళేందుకు వీర్య కణాలకు ఉండే కదలిక శక్తి, ఆకారం.ఫలదీకరణ చెందిన అండం ఆరోగ్య వంతమైన పిండం గా మారి గర్భాశ యంలో నిలదొక్కు కోగలుగుతుంది.

durga-raoSurya Telugu Daily .

మార్చి 7, 2011 Posted by | ఆరోగ్యం | 1 వ్యాఖ్య

కిడ్నీలను కాపాడుకుంటే మనం క్షేమం… మార్చి 10న వరల్డ్‌ కిడ్నీ డే

కిడ్నీలను కాపాడుకుంటే మనం క్షేమం… మార్చి 10న వరల్డ్‌ కిడ్నీ డే

మన దేశంలో కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నవారు 20లక్షల మంది వరకు ఉన్నారని ఒక అంచనా. ఏటా అదనంగా రెండు లక్షల మంది కిడ్నీ వ్యాధులకు గురవుతున్నారని, మన రాష్ట్రం విషయానికి వస్తే రాజధాని నగరంలో 30వేల మంది నుంచి 40 వేల మంది కిడ్నీ వ్యాధిగ్రస్థుకు డయాలసిస్‌ అవసరం అవుతున్నది. ఈ కిడ్నీ సమస్యలకు ప్రధానంగా మధుమేహం (40శాతం), హైబిపి (30శాతం) కారణమవుతున్నాయి. వీటిని అదుపులో ఉంచజీుకుంటే మూత్రపిండాలు చాలా వరకు కాపాడుకోవచ్చు.

Kidney-Picturనిరంతరం రక్తంలోని వ్యర్ధాలను వడకడుతూ.. మూత్ర పిండాలు మన శరీరంలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంటాయి. వీటిని జాగ్రత్తగా కాపాడుకోవడం ప్రాణావసరం. ఒకసారి మూత్రపిండం పనితీరు మందగించి అది విఫలమవటం ఆరంభమైందంటే దాన్ని పూర్తిగా నయం చేయటం కష్టం. పైగా చికిత్సకు ఎంతో ఖర్చు అవుతుంది. మూత్రపిండం పూర్తిగా విఫలమైతే కృత్రిమంగా రక్తాన్ని శుద్ధి చేసుకుంటూ ఉండక తప్పదు. ఈ ‘డయాలసిస్‌’ కోసం నెలకు సుమారు రూ.4-5వేలు ఖర్చు అవుతాయి. అంతేకాకుండా ఇతరత్రా సమస్యలు ఏర్పడతాయి. చికిత్స తీసుకున్నా కిడ్నీ తిరిగి సమర్ధంగా మారదు.

kidney_stonesగుండె జబ్బులు, అవయవాలు దెబ్బతినటం వంటివీ మొదలవుతాయి. పోనీ దెబ్బతిన్న మూత్రపిండాన్ని మార్పిడి చేయించుకోవాలంటే కిడ్నీ దాతలు దొరకటం కష్టం. ఆపరేషన్‌ పెద్ద ప్రయత్నమనుకుంటే ఇక ఆ రత్వాత జీవితాంతం వేసుకోవాల్సిన మందులకూ ఖర్చు చాలా ఎక్కువ అవుతుంది. ఎన్నో ఇబ్బందులు, దుష్ర్పభావాలు. ఇంత ఖర్చు చేసి చికిత్స తీసుకున్నా జీవనకాలమూ తగ్గవచ్చు. ఇలాంటి ప్రమాదాలన్నీ దరిచేరకుండా ఉండాలంటే ముందే మేల్కొని, అసలు కిడ్నీలు దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకోవటం మంచిది.

మన జీవనశైలి మార్పులే కిడ్నీలకు సెగ:
Kidney-Pictureమన దేశంలో మధుమేహం ఎంత విపరీతంగా విస్తరిస్తోందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2015 నాటికి వీరి సంఖ్య రెట్టింపు కావచ్చని అంచనాలు చెబుతున్నాయి. ఈ మధుమేహంతో పాటే మూత్రపిండాల వైఫల్యం కేసులు పెరుగుతున్నాయి. టైప్‌-1 మధుమేహ బాధితుల్లో 10-30శాతం, టైప్‌-2 మధుమేహుల్లో 40శాతం మంది కిడ్నీ సమస్యల బారినపడే అవకాశం ఉంది. ఒకసారి ఈ మూత్రపిండాల సమస్య మొదలైందంటే.. దాన్ని పూర్తిగా నయం చేయటం కష్టం. అందుకే సమస్యను తొలిదశలో గుర్తిస్తే దాన్ని ముదరకుండా నిలువరించే అవకాశం ఉంది. అందుకే మధుమేహులంతా కిడ్నీల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. సాధారణ ఆరోగ్యవంతులు అసలు మధుమేహం బారినపడకుండా చూసుకోవాలి.

కిడ్నీల పరిరక్షణకు తేలికైన పరీక్షలు
bobrekkalpfotomanటైప్‌-1 రకం బాధితులు మధుమేహం బారినపడిన ఐదేళ్ళ నుంచి ప్రతి ఏటా కిడ్నీ సమస్యలు వస్తున్నాయేమో పరీక్షించుకోవటం మంచిది. టైప్‌- 3 మధుమేహులైతే దాన్ని గుర్తించిన తక్షణమే కిడ్నీ పనితీరు తెలుసుకునే పరీక్షలు చేయించుకోవాలి. ఆ తర్వాత కనీసం ఏడాదికి ఒకసారైనా క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. కిడ్నీ సమస్యలేమైనా తల ఎత్తుతున్నాయా? అన్నది తేలికైన పరీక్షల ద్వారా చాలా ముందుగానే గుర్తించవచ్చు.

1. మూత్రంలో అల్బుమిన్‌:అల్బుమిన్‌ అనేది ఒక రకం ప్రోటీను. మూత్రంలో ఈ సుద్ద ఎక్కువగా పోతోందంటే కిడ్నీల వడపోత సామర్ధ్యం తగ్గిపోతున్నట్టే. అందుకే ప్రతి ఏటా తప్పనిసరిగా ఈ పరీక్ష చేయించుకోవాల్సిందే. దీని ద్వారా కిడ్నీ సమస్యను గుర్తించవచ్చు.

2. రక్తంలో సిరమ్‌ క్రియాటిన్‌:మన కిడ్నీల వడపోత సామర్ధ్యం ఎలా ఉందో చెప్పేందుకు ఈ పరీక్ష కీలకం. దీని ఆధారంగా వడపోత సామర్ధ్యాన్ని ( ఎస్టిమేటెడ్‌ గ్లోమెరూలార్‌ ఫిల్టరేషన్‌ రేట్‌-ఈజీఎఫ్‌ఆర్‌(ను లెక్కించి… కిడ్నీల సమస్య తలెత్తే అవకాశం ఎంతవరకూ ఉందన్నదనే అంచనా వేస్తారు. సాధారణంగా ఇది 110 మి.లీ. వరకూ ఉంటుంది. ఇది 60 మి.లీ.కన్నా తక్కువుంటే మూత్రపిండాల సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువ. కేవలం క్రియాటినైన్‌ పరీక్ష చేయించుకుంటే సరిపోదు. కిడ్నీ 50శాతం దెబ్బతినే వరకూ కూడా సిరమ్‌ క్రియాటినైన్‌ పెరగకపోవచ్చు. కాబట్టి ‘ఈజీఎఫ్‌ఆర్‌’ను చూసుకోవటం ముఖ్యం. సీరమ్‌ క్రియాటినైన్‌ పరీక్షించి దానితో పాటు వయసు, బరువు, ఎత్తు వంటి ప్రమాణాల ఆధారంగా ‘ఈజీఎఫ్‌ఆర్‌’ లెక్కిస్తారు.

కిడ్నీలను కాపాడుకోవాలంటే?
మధుమేహం, అధిక రక్తపోటు కచ్చితంగా నియంత్రణలో ఉంచుకోవాలి. మధుమేహులు- హెచ్‌బిఎ 1సి (గ్లైకాసిలేటెడ్‌ హిమోగ్లోబిన్‌) పరీక్ష ఫలితం 7కన్నా తక్కువ ఉండేలా కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది గత మూడు నెలల సమయంలో మధుమేహం కచ్చితంగా అదుపులో ఉందా లేదా? అని చెప్పే పరీక్ష. మధుమేహం, హైబీపీ రెండూ ఒకదానికి ఒకటి తోడై.. చివరికి కిడ్నీలను దెబ్బతీసే స్థాయికి చేరకుంటాయి. అందుకే రక్తపోటును 130/80 కంటే తక్కువే ఉండేలా చూసుకోవాలి.రక్తంలో కొలెస్ట్రాల్‌ పెరగకుండా చూసుకోవాలి. అలాగే రక్తహీనత తలెత్తకుండా చూసుకోవాలి.మూత్రంలో సుద్ద పోతుంటే వెంటనే గుర్తించి తక్షణం చికిత్స తీసుకోవాలి. అందుకే తరచూ పరీక్షలు చేయించుకోవటం ముఖ్యం.
sirdhardoc

Surya Telugu Daily .

మార్చి 7, 2011 Posted by | ఆరోగ్యం | | 2 వ్యాఖ్యలు