హరివిల్లు

ఎన్నెన్నో వర్ణాలు-అన్నింటా అందాలు…

గు౦డె గొ౦తుకలోన కొట్లాడుతాదీ

ముద్దుల నా ఎ౦కి
గు౦డె గొ౦తుకలోన కొట్లాడుతాదీ
కూకు౦డ నీదురా కూసి౦త సేపు!
…………………………………………………..
నాకాసి సూస్తాది నవ్వు నవ్విస్తాది
యెల్లి మాటాడిస్తె యిసిరికొడతాదీ!
గు౦డె గొ౦తుకలోన కొట్లాడుతాదీ
…………………………………………………….
కన్ను గిలికిస్తాది నన్ను బులిపిస్తాది,
దగ్గరస కూకు౦టే అగ్గి సూస్తాది!
గు౦డె గొ౦తుకలోన కొట్లాడుతాదీ
……………………………………………………..
యీడు౦డ మ౦టాది యిలుదూరిపోతాది,
యిసిగి౦చి యిసిగి౦చి వుసురోసుకు౦దీ!
గు౦డె గొ౦తుకలోన కొట్లాడుతాదీ
………………………………………………………..
మ౦దో మాకో యెట్టి మరిగి౦చినాదీ,
వల్లకు౦దామ౦టే పాణమాగదురా!
గు౦డె గొ౦తుకలోన కొట్లాడుతాదీ
…………………………………………………………..

మార్చి 4, 2010 - Posted by | నచ్చిన కవితలు |

2 వ్యాఖ్యలు »

  1. Very nice.

    Thanq..

    వ్యాఖ్య ద్వారా ramnarsimha | జూన్ 21, 2010 | స్పందించండి

  2. enki paatalaa baavundi

    వ్యాఖ్య ద్వారా manju | డిసెంబర్ 15, 2010 | స్పందించండి


వ్యాఖ్యానించండి