పదహారణాల తెలుగుభామ బాపు బొమ్మ
పదహారణాల తెలుగుభామ బాపు బోమ్మ
రెండు జడలు వేసుకున్న అందమైన అమ్మారుు కార్టూన్ కనిపిస్తే తెలుగువాళ్లు ఎవరైనా అది బాపు గీసిన బొమ్మలాగా ఉంది అని అనకుండా ఉండలేకపోతారు. ఈ మాటలు బాపు గొప్పతనాన్ని తెలియజేస్తారుు. గొప్ప చిత్రకారుడైన బాపు బొమ్మలు, కార్టూన్లకు నేడు మన రాష్ట్రంలోనే కాదు దేశ, విదేశాల్లో కూడా మంచి పేరుంది. బాపు బొమ్మల్లో అందమైన తెలుగు అమ్మారుు చక్కగా ముస్తాబై కనిపిస్తుంది. ఆయన కార్టూన్లలో ‘రెండు జడల సీత’ అనే అమ్మారుు సందర్శకులను మైమరపిస్తుంది.
ఈ బొమ్మ ఎంత పాపులర్ అరుుందంటే ఎవరైనా రెండు జడలు వేసుకుంటే బాపు బొమ్మ రెండు జడల సీతలాగా ఉన్నావని తెలుగువాళ్లు అనడం మెుదలెట్టారు. బాపు బొమ్మలు అనేక అంశాలపై రూపుదిద్దుకున్నారుు. ఆయన బొమ్మల్లో పదహరణాల తెలుగు అమ్మారుు స్పష్టంగా కనిపిస్తుంది. తెలుగు సంస్కృతిని ప్రతిబింబించేవిధంగా అమ్మారుులు పొడవాటి వాలుజడ, ముఖానికి పెద్ద బొట్టు, అందమైన చీరకట్టు, చారడేసి కళ్లతో అందంగా కనిపించేవిధంగా బాపు బొమ్మలు గీశారు. పురాణ ఇతిహాసాలైన రామాయణ, మహాభారతాలపై కూడా బాపు ఎన్నో బొమ్మలు వేశారు. వీటన్నింటిలో తెలుగుదనం మనకు కనిపిస్తుంది.
బాపు బొమ్మల రమణీయత అందరినీ ఆకట్టుకుంటుంది. బాపు గీసిన బొమ్మలను తెలుగువాళ్లు ఎవరైనా చూశారంటే అవి బాపు బొమ్మలు అనకుండా ఉండలేకపోతారు. ఇక రాష్ట్రంలోని ఏ ప్రాంతంలోని అమ్మాయిని అయినా బాపు బొమ్మలాగా ఉన్నావంటే తాను అందంగా ఉన్నానని పొగుడుతున్నారని ఆమె సంతోష పడుతుంది. గొప్ప చిత్రకా రుడైన బాపు సినిమా రూపకర్తగా పలు అద్భుతమైన చిత్రాలను సైతం రూపొందించారు. ఆయన సినిమాల్లో పదహరణాల తెలుగు అమ్మాయి తప్పకుండా ఉండాల్సిందే.
బాపు అసలు పేరు సత్తిరాజు క్ష్మినారాయణ. ఆయన 1933 సంవత్సరం డిసెంబర్ 15న జన్మించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని నర్సాపూర్‌లో తెలుగు నియోగి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు. ఇక బాపు ప్రముఖ చిత్రకారుడిగా, కార్టూనిస్ట్‌గా, డిజైనర్‌గా, సినిమాల రూపకర్తగా ఎంతో ప్రఖ్యాతిగాంచారు. మద్రాస్ యూనివర్సిటీ నుంచి 1955లో లా డిగ్రీ పూర్తిచేశారు. బాపు ఆంధ్రపత్రిక వార్తా పత్రికలో 1955లో పొలిటికల్ కార్టూనిస్ట్‌గా సైతం పనిచేశారు.
బాపు అసలు పేరు సత్తిరాజు లక్ష్మీనారాయణ. ఆయన 1933 సంవత్సరం డిసెంబర్ 15న పశ్చిమ గోదావరి జిల్లాలోని నర్సాపురంలో తెలుగు నియోగి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు.ఇక ఆయన మద్రాస్
యూనివర్సిటీ నుంచి 1955లో లా డిగ్రీ పూర్తిచేశారు.
ఆకట్టుకునే అద్భుతమైన శైలి…
బాపు చిత్రాను గీసే విధానం ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఆయన సహజమైన ముదురు రంగులతో తనదైన పెయింటింగ్ స్టైల్‌ను సృష్టించా రు. ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్, పెయింటింగ్ స్ట్రోక్స్, అందమైన బ్యాక్‌గ్రౌండ్‌తో సందర్శకులను మైమరపిస్తారు. ఆయన పలు పెయింటింగ్స్ హిందూ పౌరాణిక పాత్రలను ప్రతిబింబిస్తాయి. ఆయన ఎంతో అందంగా పురాణ ఇతిహాసమైన రామాయణాన్ని పిక్టోరియల్ స్టోరీగా మలిచారు. ఆయన బొమ్మల్లో శివుడు, భీముడు, దుర్యోధునుడి వంటి వారు కనిపిస్తారు. మగ వారు వెడల్పుగా ఉండే ఎతె్తైన ఛాతితో, ధృడమైన భుజాలతో కనిపిస్తారు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు వంటి దేవతలను నయనమనోహరంగా బాపు బొమ్మల్లో కనిపిస్తారు.
ఇక ఆడ వాళ్లు చారడేసి కళ్లు, కోటేరు ముక్కు, వాలు జడతో అందంగా కనిపిస్తూ వయ్యారాలు ఒలకబోస్తారు. బాపు బొమ్మ అంటే అందమైన తెలు గమ్మాయి అనేవిధంగా పేరొచ్చింది. ఆయన బొమ్మల్లో రెండు జతల సీత తప్పకుండా కనపిస్తుంది. దీంతో తెలుగమ్మాయి రెండు జడలతో కనిపిస్తే రెండు జడ ల సీతలాగా ఉన్నావని అనడం ప్రారంభించారు. బాపు తన దైన శైలిలో తెలుగులో రాయడం మొదలెట్టారు. ఆయన బొమ్మల మాదిరిగా బాపు లిపి కూడా ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఇక బాపు బొమ్మలు, కార్టూన్లు ఎన్నో దేశ, విదేశాలకు చెందిన మ్యా గజైన్ల కవర్‌పేజీలపై దర్శనమిచ్చి పాఠకులను ఎంతగానో ఆకట్టుకు న్నాయి. యుఎస్ఎలో తెలుగువారి కోసం అక్కడి నుంచి వెలువడు తున్న తెలుగు నాడి అనే మ్యాగజైన్ బాపు అద్భుతమైన బొమ్మలన్నింటిని ప్రచు రించింది. ఆ తర్వాత ఆ మ్యాగజైన్ సలహా మండలిలో బాపు సభ్యుడి గా చేరి తెలుగు పాఠకులను దృష్టిలో పెట్టుకొని మ్యాగజైన్ వెలువడేటట్టు చేశారు.
బాపు 1945 నుంచి బొమ్మలు, కార్టూన్లు, తెలుగు మ్యాగజైన్లకు కవర్ డిజైన్లు చేస్తుండడం విశేషం. సృజనాత్మకతతో వైవిధ్యభరితమైన అందమైన బొమ్మలను గీయడంలో బాపుకు ఎవరు సాటిరారు. ఎందరో రచరుుతలు తమ రచనలకు బాపు బొమ్మలు ఉంటే అంతకంటే మించిది లేదని భావించడం విశేషం. తమ రచనలకు బాపు బొమ్మలను జోడిస్తే పాఠకులు వాటిని ఎంతో ఇష్టంగా చదువుతారని రచరుుతలు భావించి ఆయనచేత బొమ్మలు వేరుుంచుకున్నారు.
ఇతర చిత్రకారులతో కలిసి…
బాపు ప్రముఖ చిత్రకారుడు సత్యం సంకరమంచితో కలిసి 101 చిత్రాలను అమరావతి కథ కోసం గీశారు. ఒక్కో కథ కోసం ఒక బొమ్మను ఆయన రూపొందించారు. ఇక ముళ్లపూడి వెంకటరమణతో బాపు అనుబంధం విడదీయలేనిది. తెలుగు సినీ రంగంలో బాపు-రమణలు కలసి పలు అద్భుతమైన సినిమాలను రూపొందించారు. బాపు దర్శకుడిగా ముళ్లపూడి రమణ సినిమా స్క్రిప్ట్, డైలాగుల రచయితగా సినిమాలను నిర్మించారు. రమణ క్యారెక్టర్ ‘బుడుగు’కు ప్రాణం పోసి అందమైన బొమ్మలను గీశారు బాపు. ఆయన తన చిత్రాల ద్వారా రావుగోపాలరావు, రాజేంద్రప్రసాద్, ఆమని వంటి సినీ నటులను బాగా వెలుగులోకి తీసుకువచ్చారు.
బాపు బొమ్మలు, కార్టూన్లు దేశ, విదేశాలకు చెందిన పలు మ్యాగజైన్ల కవర్‌పేజీలపై దర్శనమిచ్చి పాఠకులను ఎంతగానో ఆకట్టుకున్నారుు. యుఎస్ఎలో తెలుగువారి కోసం అక్కడి నుంచి వెలువడుతున్న తెలుగు నాడి అనే మ్యాగజైన్ బాపు అద్భుతమైన బొమ్మలన్నింటిని ప్రచురించింది. ఆ తర్వాత ఆ మ్యాగజైన్ సలహా మండలిలో బాపు సభ్యుడిగా చేరి తెలుగు పాఠకులను దృష్టిలో పెట్టుకొని మ్యాగజైన్ వెలువడేటట్టు చేశారు.
తెలుగు సంస్కృతికి ప్రతిబింబంగా…
తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు, జీవన విధానంతో అందమైన బొమ్మలను గీయడంలో బాపు ఎంతో ఆరితేరారు. ఇక చూడగానే సందర్శకులను కట్టిపడేసే విధంగా ఉండడం బాపు బొమ్మల ప్రత్యేకత. ఆయన బొమ్మలన్నీ తెలుగు సంస్కృ తిని ప్రతిబింబిస్తాయి. ఇక బాపు 1945 నుంచి బొమ్మలు, కార్టూన్లు, తెలుగు మ్యాగజైన్లకు కవర్ డిజైన్లు చేస్తుండడం విశేషం. సృజనాత్మకతతో వైవిధ్యభరిత మైన అందమైన బొమ్మలను గీయడంలో బాపుకు ఎవరు సాటిరారు.
ఎందరో రచయితలు తమ రచనలకు బాపు బొమ్మలు ఉంటే అంతకంటే మించిది లేదని భావించడం విశేషం. తమ రచనలకు బాపు బొమ్మలను జోడిస్తే పాఠకులు వాటి ని ఎంతో ఇష్టంగా చదువుతారని రచయితలు భావించి ఆయనచేత బొమ్మలు వేయించుకున్నారు. బాపు బొమ్మల్లోని ఆడవారిలో అందం, గ్లామర్ కనిపిస్తే మగ వారిలో హుందాతనం స్పష్టంగా కనిపిస్తుంది. చిత్రకారుడిగా బాపు గొప్పతనాన్ని గుర్తించిన రాష్ట్రప్రభుత్వం ‘బాపు బొమ్మల కొలువు’ పేరిట పూర్తి స్థాయిలో ఆర్ట్ గ్యాలరీని హైదరాబాద్‌లో ఏర్పాటుచేస్తామని ప్రకటించింది. సహజమైన ముదు రు రంగులతో రూపుదిద్దుకునే ఆయన చిత్రాలు అందర్నీ మైమరపిస్తాయి. బాపు ఆర్ట్ వర్క్సలో రామాయణ మహా కావ్యం, సీతా స్వయంవరం, రాముడి గొప్పత నం, రావణుడు, సీతల సంవాదం వంటి బొమ్మల సంకలనాలు ఆయనలోని గొప్ప చిత్రకారుడిని మనకు అవగతం చేస్తాయి.
ముళ్లపూడి వెంకటరమణతో బాపు అనుబంధం విడదీయలేనిది. తెలుగు సినీ రంగంలో బాపు-రమణలు కలసి పలు అద్భుతమైన సినిమాలను రూపొందించారు. బాపు దర్శకుడిగా ముళ్లపూడి రమణ సినిమా స్క్రిప్ట్, డైలాగుల రచరుుతగా సినిమాలను నిర్మించారు. రమణ క్యారెక్టర్ ‘బుడుగు’కు ప్రాణం పోసి అందమైన బొమ్మలను గీశారు బాపు.
సృజనాత్మతకు ప్రతిబింబంగా కార్టూన్లు…
బాపు తన సృజనాత్మకమైన కార్టూన్లతో ఎంతో పాపులారిటీ సంపాదించారు. సింపుల్‌గా ఉండే ఫ్రేమ్‌తో ఆయన తాను చెప్పదల్చుకున్నది సులభంగా చెప్పేస్తా రు. నవ్వించే ఆయన కార్టూన్లలో అంతర్గతంగా నిజం దాగి ఉం టుంది. బాపు కార్టూనిస్ట్ ఆంధ్ర పత్రికలో కొంత కాలం పని చేశారు. 50వ దశకంలో ఆయన కార్టూనిస్ట్‌గా పత్రికలో చేశా రు. పలు వారపత్రికలకు కార్టూన్లను గీసి ఇచ్చారు. ఎందరో రచయితల రచనలకు బొమ్మలను అందించారు. రాష్ట్రంలోని కార్టూనిస్ట్‌లకు బాపు ఆదర్శప్రాయులుగా నిలుస్తారు. కార్టూని స్ట్గానే కాకుండా గ్రాఫిక్ ఆర్ట్ వర్క్‌లో కూడా బాపు తన నైపు ణ్యాన్ని ప్రదర్శించారు. బాపు కార్టూన్లంటే తెలుగువారిలో నవ్వు లు కనిపిస్తాయి. అంతటి పాపులారిటీ సంపాదించారు ఆయన.
సినిమాల రూపకల్పనలోనూ విశిష్టత…
తెలుగువారి సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా బాపు సినిమాలను రూపొందించారు. ఆయన చిత్రాలన్నీ కుటుంబంలోని అనుబంధాలు, అంశాలపై రూపుదిద్దుకున్నవే. సినిమాల్లో పౌరాణిక, ఇతిహాస పాత్రలను జోడించి అద్భుతంగా తెరకెక్కించారు. హీరోయిన్లను అందంగా చూపిస్తూ తెలుగుదనం ప్రతిబింబించే విధంగా చిత్రాలను రూపొందించారు బాపు. ఆయన సినిమాల్లో పాటలు, డ్యాన్సులు అందర్నీ ఆకట్టుకుంటాయి. తెలుగుదనానికి దగ్గరగా కనిపించే హీరోయిన్లను తన సినిమాల్లో నటింపచేశారు బాపు.
ఆచార్యదేవోభవ
ద గైడ్ ఆచార్యదేవోభవ
అఆలు నేర్పిన ఉపాధ్యాయుడినుంచి విద్యాభ్యాసం పూర్తయ్యేవరకు పాఠం చెప్పిన ప్రతిఒక్కరూ గురువే. గురువంటే మార్గదర్శి. ద గైడ్. జీవనయానంలో ఉన్నతస్థానానికి ఎదగాలంటే అక్షరాలు దిద్దిననాటినుంచి వెన్నంటి ఉండి, తీర్చిదిద్ది ఉత్తమ పౌరునిగా, ఉత్తమ వ్యక్తిగా ఎదగడానికి దోహదపడే శక్తియుక్తుల్ని నేర్పేవారే ఆచార్యులు. అందుకే పూర్వం తల్లిదండ్రుల తర్వాత స్థానాన్ని గురువుకు ఇచ్చి ఆచార్యదేవోభవ అన్నారు. అసలు గురువును బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరులతో పోల్చారంటే వారికి లభించిన గౌరవం, మన్నన అర్థం చేసుకోవాలి.
పురాణేతిహాసాల్లో ఓ విశ్వామిత్రుడు, ఓ ద్రోణాచార్యుడు తమ శిష్యులైన రామలక్ష్మణులను, అర్జునుడిని ఎలా తీర్చిదిద్దారో, వారిమధ్య గురుశిష్య సంబంధం ఎలా పరిఢవిల్లిందో తెలుసుకుంటే ఒళ్లు పులకరిస్తుంది. ఆనాటితో పోలిస్తే….ఇప్పుడు గురుశిష్య సంబంధాలు గతితప్పాయి. వారిమధ్య అప్పుడు గౌరవం, మన్నన ఉంటే ఇప్పుడు ఆయావర్గాల మధ్య స్నేహం పెరిగింది. ఆధునికభారతదేశంలో గురువంటే ఎలా ఉండాలో, శిష్యులపై ఎలాంటి ముద్రవేయాలో ఆచరించి చూపిన ఆచార్యుడు సర్వేపల్లి రాధాకృష్ణన్‌ను ఈ క్షణాన తలుచుకోవాల్సిందే. ఆయన చూపినబాటలో ఉపాధ్యాయ, విద్యార్థివర్గం పయనించాల్సిందే.
మన దేశ తొలి ఉపాధ్యక్షుడు, రెండవ అధ్యక్షుడు అయిన సర్వేపల్లి రాధాకృష్ణ సెప్టెంబర్ 5న జన్మించారు. ఆయన జన్మించిన రోజును దేశవాసులు ‘టీచర్స్ డే’గా జరుపుకుంటున్నారు. 1962 నుంచి 1967 వరకు దేశ అధ్యక్షుడిగా పనిచేశారు రాధాకృష్ణ. ఆ సమయంలో కొందరు విద్యార్థులు, స్నేహితులు రాధాకృష్ణన్‌ను కలిసి ఆయన జన్మదినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటామని పేర్కొన్నారు.
తన జన్మదినోత్సవానికి బదులు ఈ రోజును టీచర్స్‌డేగా జరుపుకోవాలని కోరారు. అప్పటి నుంచి రాధాకృష్ణన్ జన్మదినోత్సవాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం ప్రారంభించారు. మన దేశంలో టీచర్స్ డేకు సెలవు లేదు. ఈ రోజును ‘సెలబ్రేషన్స్ డే’గా ఘనంగా జరుపుకుంటున్నారు. పాఠశాల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి వేడుకలను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ రోజున కొన్ని పాఠశాలల్లో విద్యార్థులనే ఉపాధ్యాయులుగా పాఠాలు బోధించేటట్టు చేస్తారు. దీంతో విద్యార్థులకు ఉపాధ్యాయుల పట్ల భయం పోయి వారి పట్ల గౌరవ, మర్యాదలు పెంపొందుతాయి.
గొప్ప వేదాంతి…
సర్వేపల్లి రాధాకృష్ణ గొప్ప వేదాంతిగా పేరుతెచ్చుకున్నారు. 1888 సంవత్సరం సెప్టెంబర్ 5న జన్మించిన ఆయన 1975 ఏప్రిల్ 17న మృతిచెందారు. ఇక ఆయన దేశ తొలి ఉపాధ్యక్షుడిగా 1952 నుంచి 1962 వరకు పనిచేయగా దేశ అధ్యక్షుడిగా1962 నుంచి 1967వరకు పనిచేశారు. రాధాకృష్ణ తన వేదాంత పద్ధతులతో పాశ్చాత్య దేశాలు, మన దేశానికి మధ్య వారధిని నిర్మించేందుకు ప్రయత్నించారు.
ప్రారంభ జీవితం, విద్య…
సర్వేపల్లి రాధాకృష్ణ మద్రాస్ రెసిడెన్సీలోని తిరుత్తణి ప్రాంతంలో తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో (ప్రస్తుత తమిళనాడులోని తిరువల్లూర్ జిల్లా) ఆయన జన్మించారు. ఆయన మాతృభాష తెలుగు. ఆయన తల్లి పేరు సీతమ్మ. ఆయన బాల్య జీవితం తిరుత్తణి, తిరుపతి ప్రాంతాల్లో గడిచింది. ఆయన తండ్రి రెవిన్యూ అధికారిగా పనిచేశారు. తిరుత్తణిలోని ప్రైమరీ బోర్డు హైస్కూల్లో ప్రాథమిక విద్య ముగియగా, తిరుపతిలోని హెర్మన్స్బర్గ్ ఎవాంజెలికల్ లూథర్ మిషన్ స్కూల్లో సైతం ఆయన చదువుకున్నారు. మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. అనంతరం ఎం.ఎ. పూర్తిచేశారు. ఇక డాక్టర్ రాధాకృష్ణన్ అనుకోకుండా వేదాంతం చదువుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత వేదాంతంపై ఎంతో ఆసక్తి కనబరిచి అధ్యయనం చేశారు. ఈ నేపథ్యంలో వేదాంతంపై ఎన్నో రచనలు చేశారు. ఆయన రచనలు ఎందరినో ప్రభావితుల్ని చేశాయి.
గొప్ప ప్రొఫెసర్‌గా…
కోల్‌కతా యూనివర్సిటీలోని కింగ్ జార్జ్ వి చైర్ ఆఫ్ మెంటల్ అండ్ మోరల్ సైన్స్‌లో సర్వేపల్లి రాధాకృష్ణ ప్రొఫెసర్‌గా 1921 నుంచి 1935 వరకు పనిచేశారు. ఆ తర్వాత ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీలో 1936 నుంచి 1952 వరకు పనిచేయడం విశేషం. ఆయన ఉత్తమ అధ్యాపకుడిగా విద్యార్థులకు చక్కటి విద్యాబోధన చేస్తూ పలువురి ప్రశంసలనందుకున్నారు. ఆయన ప్రతిభకుగాను నైట్‌హుడ్(1931), భారతరత్న (1954), ఆర్డర్ ఆఫ్ మెరిట్ (1963) అవార్డులను అందజేశారు. ఇక 1909లో సర్వేపల్లి రాధాకృష్ణన్ మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీలో ఫిలాసఫీ డిపార్ట్మెంట్లో పనిచేశారు. అనంతరం మైసూర్ యూనివర్సిటీ వేదాంతం ప్రొఫెసర్‌గా అతన్ని నియమించింది.
ఈ సమయంలో ఆయన ప్రముఖ జర్నల్స్ ద క్వెస్ట్, జర్నల్ ఆఫ్ ఫిలాసఫీ, ఇంటర్నేషనల్ జర్నల్ ఆప్ ఎథిక్స్‌కు ఎన్నో ఆర్టికల్స్ రాశారు. ఆయన తొలిసారిగా ‘ది ఫిలాసఫి ఆఫ్ రవీంద్రనాథ్’ అనే పుస్తకాన్ని రాశారు. ఆయన ఠాగూర్ ఫిలాసఫీని ఉత్తమ వేదాంతంగా పేర్కొన్నారు. ఇక రాధాకృష్ణన్ ఆంధ్రా యూనివర్సిటీ వైస్ఛాన్స్లర్గా 1931 నుంచి 1936 వరకు పనిచేశారు. 1939లో పండిత్ మదన్ మోహన్ మాలవ్య బనారస్ హిందూ యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్‌గా చేయాలని రాధాకృష్ణన్‌ను విజ్ఞప్తిచేశారు. దీంతో రాధాకృష్ణన్ బనారస్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్‌గా పదవీబాధ్యతలు స్వీకరించి 1948 సంవత్సరం జనవరి వరకు పనిచేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత డాక్టర్ రాధాకృష్ణన్ యునెస్కోలో ఇండియా ప్రతినిధిగా 1952 వరకు కొనసాగారు. ఇక 1952లో దేశ ఉపాధ్యక్షుడిగా ఆయన ఎంపికయ్యారు. ఆ తర్వాత దేశ రెండవ అధ్యక్షుడిగా 1962 నుంచి 1967 వరకు పనిచేసి ఎంతో పేరుతెచ్చుకున్నారు.
గురువును దైవంగా భావించి…
అనాదిగా మన దేశంలో గురువును దైవంగా భావించారు. తల్లి,తండ్రి, గురువులు దైవంతో సమానమని మన పెద్దలు చెప్పారు. ‘గురు బ్రహ్మ…గురు విష్ణు, గురు దేవో మహేశ్వరహ… గురు సాక్షాత్ పరబ్రహ్మ… తసై్మ శ్రీ గురవే నమః’ అని గురువును కీర్తించారు. గురువు త్రిమూర్తులతో సమానమని గురువును అభివర్ణించారు. ఒకప్పుడు మన దేశంలో గురుకులాలు ఉండేవి. తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ గురుకులాల్లో చిన్నవయసులోనే చేర్పించేవారు. అక్కడ గురువులు పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి కొంతకాలం తర్వాత వారిని తల్లిదండ్రుల వద్దకు తిరిగి పంపించేవారు. పురాణ ఇతిహాసాల్లో కూడా గురువులను చాలా గొప్పగా చూపించారు.
శ్రీరాముడు, లక్ష్మణుడు చిన్నతనంలో గురువు విశ్వామిత్రుడి వద్ద విద్యాబుద్ధులు నేర్చుకున్నారు. అడవుల్లోకి వెళ్లి రామలక్ష్మణులు విశ్వామిత్రుడి వద్ద ఉన్నారు. అస్త్ర శస్త్ర విద్యలతోపాటు సకల విద్యలు విశ్వామిత్రుడు నేర్పించారు. వారికి అన్ని విద్యలు నేర్పిన తర్వాత తిరిగి తండ్రి దశరథుడి వద్దకు పంపించారు. అదేవిధంగా ద్రోణాచార్యుడు కౌరవ, పాండవులకు సకల శాస్త్రాలు, అస్తశ్రస్త్ర విద్యలు నేర్పించారు. పాండవుల్లో అర్జునుడికి విలు విద్యను, భీముడికి గదాయుద్ధంలో శిక్షణనిచ్చారు. పాండవులు, కౌరవులను అన్ని విద్యలను నేర్పించిన గురువు ద్రోణాచార్యుడు. ఇక ఏకలవ్యుడు ద్రోణాచార్యుడి విగ్రహాన్ని రూపొందించి ఆయన్ని తన గురువుగా భావించి సొంతంగా అస్తశ్రస్త్రాలు నేర్చుకున్నాడు. అన్ని విద్యల్లో ఆరితేరాడు.
ఈ విధంగా పురాణ ఇతిహాసాల్లో గురువులకు ఉన్న ప్రాముఖ్యతను వివరించారు. ఆనాడు పిల్లలు తల్లిదండ్రులకు దూరంగా గురుకులాల్లో ఉంటూ గురువు వద్ద అన్ని విద్యలు నేర్చుకునేవారు. పూర్తిగా విద్యాబుద్ధులు నేర్చుకున్న అనంతరం గురువు వారిని తల్లిదండ్రులకు పంపించేవారు. ఇక నేడు కాలం మారింది. గురుశిష్యుల మధ్య అనుబంధం కూడా మారింది. నేడు విద్యార్థులు గురువులకు సరైన గౌరవ, మర్యాదలు ఇవ్వడం లేదు. అదేవిధంగా కొందరు గురువులు విద్యార్థులకు విద్యాబుద్ధులను నేర్పడంలో పూర్తి శ్రద్ధవహించడం లేదు. కాలేజీలలో గురువులను ఎదిరించి మాట్లాడుతున్న విద్యార్థులు కూడా ఉన్నారు. ప్రతిఏటా సెప్టెంబర్ 5న జరుపుకునే ఉపాధ్యాయ దినోత్సవంనాడు గురుశిష్యుల పవిత్రబంధం గురించి తెలియచేసుకోవాలి. విద్యార్థులు గురువులకు ఇవ్వాల్సిన గౌరవ, మర్యాదలను ఇవాళ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా గురువులు కూడా విద్యార్థులను తీర్చిదిద్దడంలో పూర్తి శ్రద్ధ వహించాల్సిన ఆవశ్యకతను కూడా ఈ దినోత్సవం గుర్తుచేస్తుంది.
తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే…
దేశంలోనే తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా సావిత్రిబాయి పూలే చరిత్రలోకెక్కారు. దేశంలోని తొలి మహిళా పాఠశాలను ప్రారంభించిన ఆమె ఉపాధ్యాయురాలిగా మహిళలకు విద్యాబోధన చేశారు. ఇక స్ర్తీ విద్య కోసం పాటుపడిన సంఘసేవకురాలు సావిత్రిబాయి. ప్రముఖ సంఘసేవకుడు జ్యోతిరావ్‌పూలే భార్య సావిత్రిబాయి ఆ కాలంలో మహిళా విద్య గురించి ఎంతో తపించారు. దళిత వర్గంలో పుట్టిన ఈ దంపతులు బ్రిటీష్ వారి కాలంలో మహిళల హక్కుల కోసం పోరాడారు. ఇక సావిత్రిబాయి పూలే దళితుల కోసం 1852లో మొదటి పాఠశాలను కూడా ప్రారంభించడం విశేషం.
ఆ కాలంలో స్ర్తీలు బయటకు వెళ్లనిచ్చేవారు కాదు. కానీ సావిత్రిబాయి పూలే బాలికలకు విద్యాబుద్ధులు నేర్పేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చారు. అప్పటి ఛాందసులు ఆమెపై కుళ్లిన గుడ్లు, ఆవు మాంసం, టమాటాలు, రాళ్లు విసిరి హింసించేవారు. కానీ సావిత్రిబాయి వీటికి జంకకుండా ధైర్యంగా తిరిగేవారు. ఆమె భర్త జ్యోతిరావ్ పూలే తన భార్యకు పూర్తి అండగా ఉంటూ ఆమెను ప్రోత్సహించారు. దీంతో ఆమె దేశంలోనే మహిళల కోసం 1848లో తొలి పాఠశాలను ప్రారంభించి అక్కడ మొదటి ఉపాధ్యాయినిగా పాఠాలు బోధించారు. మొదట వివిధ కులాలకు చెందిన తొమ్మిది బాలికలు ఆమె పాఠశాలలో చేరి చదువుకున్నారు. ఆ తర్వాత సమాజంలో కొంత మార్పు వచ్చి తల్లిదండ్రులు తమ అమ్మాయిలను చదువుకునేందుకు పాఠశాలకు పంపించడం ప్రారంభించారు. దీంతో సావిత్రిబాయి మహిళల కోసం మరో ఐదు పాఠశాలలను ప్రారంభించడం విశేషం. చివరికి బ్రిటీష్ ప్రభుత్వం స్ర్తీ విద్య కోసం ఆమె కృషిని గుర్తించి ఘనంగా సత్కరించింది.
ఆదర్శప్రాయమైన వ్యక్తి ఉపాధ్యాయుడు..
సమాజంలో ఆదర్శవంతమైన వృత్తి టీచర్. అలాంటీ వృత్తికి వన్నెతెచ్చిన మహానుభావుడు సర్వేపల్లి రాధాకృష్ణ. నేడు ఉన్నతమైన స్థానాల్లో ఉన్న ప్రతి మనిషికి విద్యాబుద్ధులను నేర్పించిన గురువులకు ఈ రోజు శుభాకాంక్షలు.నిరంతరం విద్యార్థి విజయాన్ని ఆకాంక్షించేది కేవలం గురువు మాత్రమే అనడంలో సందేహం లేదు.ఎందరో రాజకీయంగా,ఆర్థికంగా ఎదిగిన వారిలో నేటికి గురువుల పట్ల గౌరవం ఉంది.తన విద్యార్థులను అన్నింటీలో ముందుంచాలని తాపత్రయపడే వాడు నిజమైన ఉపాధ్యాయుడు.
-చుక్కా రామయ్య,ఎం.ఎల్.సి
నైతిక విలువలు కాపాడాలి….
నేటీ సమాజంలో ఉపాధ్యాయులను కేవలం హాస్యానికి ప్రతిరూపాలుగా సినిమాల్లో చూపిస్తు న్నారు.ఈ దుస్సంసృ్కతి వల్ల విద్యార్థులు గురు వుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఇంతకు పూర్వం గురువులను పాఠశాల ప్రాంగణంలోనే కాకుండా ఎక్కడ కన్పించిన మర్యాద,గౌరవం లభించేది.కానీ ఆధునికరణ మోజులో వారి విలువలను తుంగలో తొక్కుతున్నారు.ఇలాంటి సంప్రదాయాలకు ముగింపు పలికి గురువును గురువులాగా గౌరవించాలి.
-సుల్తానా, విశ్రాంతఉపాధ్యాయురాలు.
>అన్నింట మొదటి స్థానం గురువుదే…
ఒక విద్యార్థి ఉన్నతంగా ఉన్నాడంటే అది గురువు నేర్పిన విద్యకు ప్రతిఫలం.అదే విద్యార్థి ఎదగలేకపోవడానికి కూడా అదే గురువు కారణం.విద్యార్థులను అను నిత్యం ప్రోత్సహిస్తు ముందుకు వెళ్ళనిచ్చె ఉపాధ్యాయుడు నిజంగా దేవుడితో సమానం.అలాంటీ దేవుళ్లకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.టీచర్ల పట్ల విద్యార్థులు సత్ప్రర్తన కల్గి ఉండాలి.తమ అభ్యునతికి కృషి చేస్తున్న వారిని గౌరవించాలి.
– నాగేశ్వర్రావు,ఎం.ఎల్.సి
మా ఉన్నతికి గురువులే కారణం
గ్రామీణ ప్రాంతానికి చెందిన నేను ఈ రోజు ఉన్నత స్థానంలో ఉన్నానంటే అది నాకు విద్య నేర్పిన నా గురువుల చలువే.అలాంటీ గురువు లను విస్మరించిన నాడు నా చదువుకు విలువ ఉండదు.నేనే కాదు ప్రతీ విద్యార్థి తనకు విద్యాబుద్ధులు నేర్పించిన గురువుకు జీవితాంతం రుణపడిఉండాలి.విద్యలేని వాడు వింత పశువు అన్నట్లు,గురువులను గౌరవించనివాడు పవువుకంటే హీనం.
-సమి.డి.డి.యం. (ఇండియన్ ఎలాక్ట్రానిక్ గవర్నెన్స్)
సంస్కారాన్ని నేర్పించారు
ఉన్నత చదువులు చదివినంత మాత్రాన సరిపోదు,ఆ చదువులను నేర్పించిన గురువులు కలకాలం గౌరవించాలి.ఉపాధ్యాయులు నేర్పిం చిన విద్యాబుద్ధులే నేడు సమాజంలో నన్ను ఉన్నత స్థానంలో నిలిపింది.అన్ని వేళల నా గురువులకు అభిమానపాత్రుడిగా ఉంటాను. గురువులందరికి గురుపూజోత్సవ శుభాకాంక్షలు.
–
దొంతుల రమేష్ (సివిల్స్ విద్యార్థి)
స్నేహంగా వుంటూ మార్గనిర్దేశం చేస్తున్నారు
మా అధ్యాపకులు మాతో చాలా స్నేహంగా వుంటున్నారు. స్కూల్ టీచర్స్‌తో పోల్చిచూస్తే కాలేజ్ లెక్చరర్స్ చాలా సన్నిహితంగా వ్యవహరిస్తూ సబ్జెక్టులపైన పూర్తి అవగాహన కల్పిస్తున్నారు. పాఠ్యాంశాలను ప్రయోగాత్మకంగా విశదీకరిస్తూ భవిష్యత్ మార్గనిర్దేశనం చేస్తు న్నారు. కొద్దిపాటి అంతరాలున్నా మొత్తం మీద స్నేహపూరిత వాతావరణంలోనే చదువు సాగుతోంది.
– రష్మి, ఇంటర్మీడియట్ విద్యార్థిని, విజయవాడ
ఆచార్యదేవోభవ.. ఆ కాలం పోయింది
పాతకాలంలో విద్యార్ధులు తమ గురువులపై పూజ్య భావం కలిగివుండేవారు. ఆచార్యదేవోభవ అనే మాట కాలగర్భంలో కలసిపోయి భయం, వినయం కనుమరుగయ్యాయి. అధ్యాపకులు విద్యార్ధులకు మార్గదర్శకులుగా పని చేస్తూ వారితో అభిరుచి మేరకు బోధనాశైలిని అవలంభించాలి.
– ఆర్.శారద., ప్రభుత్వ అధ్యాపకురాలు, విజయవాడ
స్నేహపూరిత వాతావరణం పెరిగింది
నాటికి నేటికీ పోల్చితే గురు శిష్యుల మధ్య స్నేహపూరిత వాతావరణం వృద్ధి చెందింది. విద్యార్ధులు భవిష్యత్ ప్రణాళికతో అధ్యయనం చేస్తూ అందుకు అవసరమైన సహకారాన్ని ఉపాధ్యాయుల వద్ద నుండి పొందే ప్రయత్నం చేస్తున్నారు. దండనతో కాకుండా విద్యార్ధులకు అర్ధమయ్యే రీతిలో బోధించడానికి ప్రాధాన్యతనిస్తున్నాం. ఒకప్పటితో పోల్చినపుడు విద్యార్ధులకు గురువుల వద్ద ఒకింత చనువు పెరిగిందనే చెప్పాలి.
– జె.ఎన్.కుసుమకుమారి., ప్రభుత్వోపాధ్యాయురాలు, విజయవాడ
విద్యార్ధుల దృక్పదంలో మార్పు వచ్చింది
పాత తరం విద్యార్ధులతో నేటి తరం వారిని తరచి చూస్తే ఆధునిక విద్యార్ధుల దృక్పదంలో చాలా మార్పు వచ్చింది. గురువులంటే భయం లేకుండా వారికి తగిన గౌరవం ఇస్తూ సందేహాలకు సమాధానాలను ఎటువంటి సంకోచం లేకుండా గురువుల నుండి రాబట్టుకుంటున్నారు. విపరీతమైన పోటీ వాతావరణం విద్యార్ధులు ఉపాధ్యాయుల సంబంధాలను ప్రభావితం చేస్తుంది.
– కె.సునీల్రాజు., ప్రభుత్వ అధ్యాపకులు, విజయవాడ
విద్యార్ధుల్లో భయం పోయింది
ఒకప్పుడు గురువంటే విద్యార్ధులకు గౌరవభావం, భయం వుండేవి. ప్రస్తుతం భయం పోయి విద్యార్ధులు తమ అధ్యాపకులను కూడా స్నేహితుల్లా భావిస్తున్నాం. విద్యార్ధులకు మాకు మధ్య అంతరాలను తగ్గించుకుని వారితో సన్నిహితంగా మెలగుతూ విద్యా బోధన చేస్తున్నాం.
– జె.వెంకటేశ్వరరావు., అధ్యాపకులు, విజయవాడ.
surya telugu
-
భాండాగారం
- జనవరి 2020 (13)
- జూన్ 2018 (1)
- డిసెంబర్ 2012 (1)
- డిసెంబర్ 2011 (2)
- నవంబర్ 2011 (2)
- సెప్టెంబర్ 2011 (2)
- జూలై 2011 (5)
- జూన్ 2011 (7)
- ఏప్రిల్ 2011 (6)
- మార్చి 2011 (28)
- ఫిబ్రవరి 2011 (6)
- జనవరి 2011 (20)
-
వర్గాలు
- (స్నే)హితులు
- అతివల కోసం
- అవర్గీకృతం
- ఆరోగ్యం
- ఇతర బ్లాగులు సైట్లు
- చిన్నారి లోకం
- చూడు చూడు నీడలు
- చూసొద్దాం
- నచ్చిన కవితలు
- నచ్చిన పాటలు
- నాట్యం
- ప్రకృతి
- భక్తి
- ముద్రలు
- మ౦చి మాటలు
- యూట్యూబు లో తెలుగు
- యెర్రె౦కడు
- రింగ్ టోన్స్
- వర్ణ చిత్రాలు
- వార్తలు
- వింతలూ-విశేషాలు
- విచిత్ర చిత్రాలు
- విజ్ఞానం
- విదేశాలలో మన దేవాలయాలు
- విద్యార్థులకు
- వ౦టా-వార్పు
- సంస్కృతి
- సామెతలు
- సినిమా
- సూపర్ సింగర్స్
- సైకత శిల్పాలు
-
RSS
Entries RSS
Comments RSS