హరివిల్లు

ఎన్నెన్నో వర్ణాలు-అన్నింటా అందాలు…

హిందుస్థానీ రాగ రత్న భీమ్‌సేన్‌

హిందుస్థానీ రాగ రత్న భీమ్‌సేన్‌

bemsen1హిందుస్థానీ సంగీత ప్రపంచంలో మారు మోగే పేరు భీవ్గుసేన్‌ గురురాజ్‌ జోషి. ఆయన గొంతులో జీవనపోరాటస్ఫూర్తి ఉంది. అది పాటని పైలోకాల నుంచి తీసుకువచ్చి మనకు పంచేందుకు ప్రకంపిస్తుం ది. వినే వారిని మంత్ర ముగ్ధుల్ని చేస్తుంది. ‘ఆకాశం బున నుండి శంభుని శిరంబందుండి శీతాద్రి’ అన్నట్టు గా ఆయన పాట పైలోకాలనుంచి మనకోసం ఆపాట మధరంగా దుకుతుంది. శాస్ర్తీయ సంగీతకారుల్లో ఒకొ్కక్కరిది ఒకొ్క రీతి అరుుతే భీవ్గు సేన్‌ జోషిది గుండెల్లో మఠం వేసుకొని ప్రతిధ్వనించే రీతి.

కిరానా ఘరానాకు చెందిన భీమ్‌సేన్‌ జోషి ’ఖయాల్‌ గాయనంలోనే కాక, భక్తిరస ప్రధానమైన భజనలు, అభంగ్‌లు పాడడంలో సిద్ధహస్తుడు.

సంగీత ప్రస్థానం: 20 వ శతాబ్దం పూర్వార్థం వరకూ, ’ఖయాల్‌ గాయనం’ గురుశిష్య పరంపర’ గా సాగేది. భీమ్‌సేన్‌ జోషి గురువైన సవాయి గంధర్వ, అబ్దుల్‌ కరీంఖాన్‌కు శిష్యుడు. అబ్దుల్‌ కరీంఖాన్‌ అబ్దుల్‌ వహీద్‌ ఖాన్‌తో కలిసి, కిరాణా ఘరాణాను స్థాపించారు.తన 11 వ ఏట, చిన్నతనంలో అబ్దుల్‌ కరీంఖాన్‌ గాయనం విని ఉత్తేజితుడై, ఇల్లు వదలి గురువును వెదుక్కుంటూ, ధార్వాడ్‌ తరువాత పూణె చేరుకున్నాడు. తరువాత గ్వాలియర్‌కు వెళ్ళి, ’మాధవ సంగీత పాఠశాల’లో చేరాడు. ఆ పాఠశాలను గ్వాలియర్‌ మహరాజులు, ప్రముఖ సరోద్‌ విద్వాంసుడు, హఫీజ్‌ అలీఖాన్‌ సహాయంతో నడుపుతుండేవారు.

bemsenమంచి గురువు కోసం, ఢిల్లీ, కోల్‌కతా, గ్వాలియర్‌, లక్నో, రాంపూర్‌లలో పర్యటించారు. చివరకు అతని తండ్రి, భీమ్‌సేన్‌ జోషిని జలంధర్‌లో పట్టుకొని, తిరిగి ఇంటికి తోడ్కొని వచ్చాడు. 1936 లో,సవాయి గంధర్వ, భీమ్‌సేన్‌ను శిష్యుడిగా స్వీకరించాడు. ప్రముఖ హిందుస్తానీ సంగీత గాయని గంగూబాయి హంగల్‌, అతని సహవిద్యార్థిని. అలా నాలుగేళ్ళు సవాయి గంధర్వ వద్ద సంగీతాన్ని అభ్యసించారు. చిన్నప్పటినుండి జోషి దృష్టంతా సంగీతం మీదే! ఇంట్లో తాతగారి ‘తంబుర’ ఉంటే దాన్ని జోషి కంట పడకుండా దాచేసారు పెద్దలు. జోషి తాతగారు కూడా కీర్తనకారుడు. ఎంతగా ఆ తంబురాను దాచిపెట్టినా దానిమీదకే జోషి చేతులు వెళ్లేవి. వాళ్ల ఇంటి సమీపంలో ఒక మసీదు నుండి తరచు ‘ఆజాన్‌’ వినపడేది. దాన్ని జోషి శ్రద్ధగా వినేవారు. అలాగే చుట్టుపక్కల ఇళ్ళలోంచి ‘భజనపాటలు’ వినపడితే జోషి చెవులు రిక్కించి వినేవారు. స్కూలు నుండి ఇంటికి వస్తూ దారిలో ఉన్న గ్రామ్‌ ఫోన్‌ దుకాణం దగ్గర నిలబడి ఆ షాపు నుంచి వినిపించే పాటలు వింటూ రోడ్డుమీదే తన్మయంగా నిలబడి పోయేవారు. తనకు నచ్చని విషయమేదో జరిగిందని గడగ్‌ రైల్వే స్టేషన్‌కు కట్టుబట్టలతో చేరుకుని రైలెక్కేసి టికెట్‌ లేని ప్రయాణం చేసి బీచుపూర్‌ చేరుకున్నారు. అక్కడ ’భజనలు’ పాడి కడుపు నింపుకున్నాడు. తన గురువుని అన్వేషించుకుంటూ ఎక్కడెక్కడో తిరిగారు. ఒక అజ్ఞాతవ్యక్తి సలహాపై గ్వాలియర్‌కని బయలుదేరారు.

Pandit-Bhimsen-Joshiకానీ వేరే రైలెక్కేసి పూణె చేరుకున్నారు. పూణె మహానగరం మహారాష్ట్రకు సాంస్కృతిక రాజధాని. అక్కడ జోషి క్రిష్ణారావు ఫులంబ్రికార్‌ అనే గురువుని ఆశ్రయించేందుకు వెళ్ళారు.. కానీ అతడు పెద్దమొత్తంలో ఫీజు అడిగాడు. పూటకు గతిలేని జోషి నిరాశపడ్డారు. ఎక్కడెక్కడో తిరిగి ఎట్టకేలకు గ్వాలియర్‌ చేరుకున్నారు. ఆ నగరం హిందూస్థానీ సంగీతానికి పెట్టింది పేరు. అందుకే జోషి గమ్యం కూడా ఆ నగరమే అయింది. సరోద్‌ విద్వాంసుడు హఫీజ్‌ అలీఖాన్‌ సహాయంతో గ్వాలియర్‌ మహారాజు ప్రోత్సహిస్తున్న మాధవ్‌ సంగీత్‌ విద్యాలయంలో జోషి చేరాడు. గ్వాలియర్‌లో ఆవిర్భవించిన హిందుస్థాన్‌ మౌలిక శైలి ’ఖయాల్‌’. దాని లోతుపాతులు తెలుసుకొని ‘గాయకి’ అనే అంశంలో పరిపూర్ణమైన పరిజ్ఞానం సంపాదించారు. బీమ్‌సేన్‌ జోషి. విభిన్న రాగాల మధ్య ఉండే వేరువేరు ధోరణులను పట్టుకోవాలన్న జిజ్ఞాసతో జోషి ఎందరో గురువుల్ని సంప్రదించారు.

జలంధర్‌లో ఉన్నప్పుడు సంగీత సాధనతోపాటు వ్యాయామం కూడా చేసేవారు. బలమైన శరీరం ఆయన కోరికల్లో ఒకటి. అది కూడా జలంధర్‌లో సాధించుకున్నారు. భీమ్‌సేన్‌ జోషి గురువు సవాయి గంధర్వ క్రమశిక్షణకు పెట్టింది పేరు. జోషి ఒకసారి అపస్వరం పలికితే అసహనపడి ఇనుప వస్తువు జోషి మీదికి విసిరివేసారు. అయినా జోషి మరింత శ్రద్ధతో ఆ గురువునే ఆశ్రయించారు. ఆదిలో జోషి ధర్వాడ్‌, సాంగ్లీ, మిరాజ్‌, కురుంద్వాడ్‌లలో చిన్నచిన్న కచేరీలు చేశారు. అయితే ఖ్యాతిగాంచిన సంగీత ప్రియులెందరో ఆ కచేరీలకు హాజరైనారు. అయినా ఆయనకు అసలైన గుర్తింపునిచ్చింది 1946లో సవాయి గంధర్వ 60వ జన్మదినాన పూణెలో ఆయన ఇచ్చిన కచేరి. అప్పటి నుండి ఆయన వెనుదిరిగిచూడలేదు. ఆయన తన సంగీత ప్రపంచంలో ఒక ఘనత సాధించారని సంగీత ప్రియులంటారు. అదేమిటంటే సంగీతంలో సాంప్రదాయ విలువలకు, జనాకర్షక గాత్రరీతికి మధ్య సయోధ్యను సాధించడం. జన్మతః లభించిన శక్తివంతమైన గొంతుక ఆయన్ను ఉన్నత శిఖరాలకు చేర్చిందనడం యధార్థం.

ఇష్టమైన రాగాలు : శుద్ధ కల్యాణ్‌, మియాన్‌ కీ తోడి, పురియా ధనశ్రీ, ముల్తానీ, భీమ్‌పలాసీ, దర్బారీ మరియు రామ్‌కలీ లు. భీమ్‌సేన్‌ అబ్దుల్‌ కరీంఖానే కాక, కేసర్‌బాయి కేర్కర్‌, బేగం అక్తర్‌, ఉస్తాద్‌ అమీర్‌ఖాన్‌ల వల్ల ఎంతో ప్రభావితుడయ్యారు. చివరకు తన ప్రత్యేక గాయన శైలిని రూపొందించుకొన్నారు.
వ్యక్తిగత జీవితం: భీమ్‌సేన్‌ జోషి తండ్రి, గురాచార్య జోషి… బడి పంతులు. చిన్న వయసులోనే భీమ్‌సేన్‌ జోషికి సునందతో వివాహం జరిగింది. పిల్లలు రాఘవేంద్ర, ఆనంద్‌ జోషిలు గాయకులు. తరువాత భీమ్‌సేన్‌ వత్సల అనే ఆమెను పెళ్లాడారు. శ్రీనివాస్‌ జోషి మంచి గాయకుడు…ఎన్నో ఆల్బంలను విడుదల చేశాడు.

సినిమాలు: బసంత్‌ బహార్‌ ( మన్నాడేతో ), బీర్బల్‌ మై బ్రదర్‌ ( పండిట్‌ జస్రాజ్‌తో), తాన్‌సేన్‌ (1958) మరియు అంకాహీ (1985). భీమ్‌సేన్‌ జోషి కన్నడ భజనలు (దాసవాణి, ఆల్బమ్‌) మరాఠీ అభంగ్‌లు పాడారు. జాతీయ సమగ్రతపై దూరదర్శన్‌ సౌజన్యంతో తీసిన సంగీతపరమైన వీడియో, ‘మిలే సుర్‌ మేరా తుమారా’ అనేది జగత్ప్రసిద్ధం. భీమ్‌సేన్‌ జోషి తన గురువు సవాయి గంధర్వ గౌరవజ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం, డిశంబరు నెలలో పూణె నగరంలో, సవాయి గంధర్వ సంగీత మహోత్సవం ను నిర్వహిస్తారు.

అవార్డులు: * పద్మశ్రీ 1972
– సంగీతనాటక అకాడమీ అవార్డు 1976

– పద్మవిభూషణ్‌ 1999* పద్మభూషణ్‌ 1985* మహారాష్ట్ర భూషణ్‌ 2002

– కర్నాటక రత్న 2005, * భారతరత్న 2008. భీమ్‌సే జోషి తండ్రి, గురాచార్య జోషి, బడి పంతులు. చిన్న వయసులోనే భీమ్‌సే జోషికి సునందతో వివాహం జరిగింది. తరువాత భీమ్‌సేన్‌ వత్సలను పెళ్లాడాడు. బసంత్‌ బహార్‌ (మన్నాడేతో), బీర్బల్‌ మై బ్రదర్‌ (పండిట్‌ జస్రాజ్‌తో), తాన్‌సేన్‌ (1958) అంకాహీ (1985) సినిమాలలో పాడి సినీ శ్రోతలను అలరించారు.

Surya Telugu Daily.

జనవరి 28, 2011 Posted by | సంస్కృతి | 1 వ్యాఖ్య

ఇంద్రజాలానికి గ్రహణం

ఇంద్రజాలానికి గ్రహణం

magic2ఎటువంటి ఆధారం లేకుండా యువతిని గాల్లో నిలబెట్టడం…పెట్టెలో నుంచి బయటకు వచ్చిన యువతి తలను కత్తితో కోయడం వంటి మ్యాజిక్‌లు సందర్శకులను అబ్బురపరుస్తాయి. పెట్టెలో బంధించిన యువకుడు ఏనుగుగా మారడం…చిత్తు కాగితాలను కరెన్సీ నోట్లుగా సృష్టించడం వంటి మ్యాజిక్‌లు వీక్షకులను చూపుతిప్పుకోకుండా చేస్తాయి. ఇటువంటి ఆశ్చర్యపరిచే దృశ్యాలతో కూడిన మ్యాజిక్‌ షోలు సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. కానీ రాష్ట్రంలో ఇటువంటి మ్యాజిక్‌ షోలు భవిష్యత్తులో రాను రాను తగ్గిపోయే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం మ్యాజిక్‌ షోలపై 20 శాతం ఎంటర్‌టైన్‌మెంట్‌ ట్యాక్స్‌ను విధించడమే దీనికి కారణం.

మన దేశం ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఎందరో మెజీషియన్లకు పేరు గాంచింది. మ్యాజిక్‌లోని కొన్ని అత్యంత క్లిష్టమైన అంశాలను ప్రదర్శించడంలో కొందరు మెజీషియన్లు పట్టు సాధించారు. ఇండియన్‌ రోప్‌ ట్రిక్‌ వంటి అంశాలు ప్రపంచంలో మహా మహావారిని కూడా చకితులను చేశాయి.

magic1మ్యాజిక్‌ లెజెండ్స్‌… : వీరిలో ముందుగా చెప్పుకోదన వారు పిసి సర్కార్‌ సీనియర్‌ (ప్రతుల్‌ చంద్ర సర్కార్‌). ఆయన ఆధునిక ఇండియన్‌ మ్యాజిక్‌కు తండ్రిగా పేరు గాంచారు. పడుకునేటప్పుడుకూడా ఇంద్రజాలమే నా శ్వాస, నేను మేల్కునప్పుడు మ్యాజిక్కే నా పని అని చెప్పే గొప్ప మెజీషియన్‌ ఆయన. ఇండియన్‌ మ్యాజిక్‌ ట్రిక్స్‌గా పేర్కొనే ఫ్లయింగ్‌ కార్పెట్‌, ద ఎక్స్‌రే ఐస్‌ను సృష్టించింది ఆయనే. దేశ విదేశాల్లో ఎన్నో ప్రదర్శనలిచ్చిన ఆయన ఎన్నో అవార్డులను అందుకున్నారు. చివరికి ఈ గొప్ప మెజీషియన్‌ గత ఏడాది ఫిబ్రవరి 23వ తేదీన కన్నుమూశారు. ఆయన జ్ఞాపకార్థం కేంద్రప్రభుత్వం పిసి సర్కార్‌ సీనియర్‌ పోస్టల్‌ స్టాంపును విడుదల చేసింది. పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి బుద్ధదేవ భట్టాచార్య ఈ స్టాంపును విడుదలచేశారు.కేరళ మ్యాజిక్‌కు తాతగా పేర్కొనే గొప్ప మెజీషియన్‌ వజకున్నన్‌ నీలకందన్‌ నంబూద్రి. కేరళలో మ్యాజిక్‌కు కొత్త అర్థాన్ని తీసుకువచ్చిన వ్యక్తి ఆయన. మ్యాజిక్‌ను ఓ కళగా గుర్తింపు తెచ్చేందుకు ఆయన ఎంతో కృషి చేశారు. ఆయన 1903లో కేరళలో జన్మించారు. తన మ్యాజిక్‌ ట్రిక్కులతో ఎందరో మెజీషియన్లకు ఆయన ఆదర్శప్రాయంగా నిలిచారు. పిసి సర్కార్‌ జూనియర్‌కు నీలకందన్‌ నంబూద్రి అంటే ఎంతో అభిమానం. తరచుగా ఆయన్ని కలుసుకొని మ్యాజిక్‌పై ఎన్నో విషయాలను చర్చించేవారు.

magic మంజేరి అలీ ఖాన్‌, ప్రొఫెసర్‌ ముతుకడ్‌, ఆర్‌.కె.మలాయత్‌, జాయ్‌ ఆలివర్‌, కె.పి.కౄఎష్ణన్‌ భట్టతిరిపడ్‌, కుట్టియడి నాను, కె.ఎస్‌.మనోహరన్‌, కె.జె. నాయర్‌ వంటి ప్రముఖ మెజీషియన్లు నంబూద్రి శిష్యులే.1983లో ఆయన తుది శ్వాస విడిచారు. దక్షిణాదిన తన మ్యాజిక్‌ విన్యాసా లతో ద బిగ్గెస్‌‌ట షో ఆఫ్‌ మ్యాజికల్‌ ఎంటర్‌ టైన్‌మెంట్‌కు చిరునామాగా పేరు గాంచారు ప్రొఫెసర్‌ కె.భాగ్యనాథ్‌. 1916లో జన్మించిన ఆయన ఫాంటాసియా అనే మ్యాజిక్‌ షోతో అందర్నీ అబ్బురపరిచేవారు. ఈ గ్రేట్‌ మెజీషియన్‌ 1999లో మృతిచెందారు. ఇక నేటి కాలంలో మన దేశంలోని కొందరు ప్రముఖ మెజీషియన్లు తమ మ్యాజిక్‌ ఫీట్లతో అంతర్జాతీయ పేరు, ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. వీరిలో పి.సి.సర్కార్‌ జూనియర్‌, జాదూగర్‌ ఆనంద్‌, సామ్రాజ్‌, గోపినాథ్‌ ముకుంద్‌, ఫిలిప్‌, పి.ఎం. మె హతా, ప్రహ్లాద్‌ ఆచార్య, సుహాని, లియో, పి.ఆర్‌. ఆకాష్‌ వంటి ఎందరో మెజీషియన్లు నేడు దేశ, విదేశాల్లో పాపులారిటీ సంపాదించుకున్నారు.

కనుమరుగవ్వనున్న మ్యాజిక్‌ షోలు: రాష్ట్రంలో కొనసాగే మ్యాజిక్‌ షోలపై 20 శాతం వినోదపు పన్ను ప్రభుత్వం విధించనున్నదనే వార్త ఆ రంగంలో వారిని ఆశ్చర్యానికిలోను చేసింది. ఈ మేరకు రాష్ర్ట ప్రభుత్వం జీఓ నెం.1271ను ఇటీవలే విడుదల చేసింది. ఇక నుంచి మ్యాజిక్‌ షోల ద్వారా మెజీషియన్లు ఆర్జించే ఆదాయంపై 20శాతం ప్రభుత్వానికి కట్టాల్సి ఉంటుంది..ఈ విషయంలో పలువురు రాష్ర్ట మెజీషియన్లు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తంచేస్తున్నారు.

Surya Telugu Daily.

జనవరి 28, 2011 Posted by | వార్తలు | 2 వ్యాఖ్యలు

కలంకారీ.. కళకళలు!

కలంకారీ.. కళకళలు!

కొంతమంది సహజంగానే అందంగా ఉంటారు. అందంగా ఉన్నంత మాత్రాన వారు ధరించే వస్త్రాలు అన్నీ వారికి నప్పుతాయనుకుంటే పొరపాటు. కొంతమందికి మోడ్రన్‌డ్రెస్సులు బాగుంటే మరికొంతమందికి సంప్రదాయ వస్త్రాలు మెరిపిస్తాయి. గతంలో ఏదైనా ఫంక్షన్‌ ఉందంటే మోడ్రన్‌ డ్రెస్సులవైపు మళ్ళిన అతివల దృష్టి ఇప్పుడు చీరలపైకి తిరిగింది. దీనికి ప్రధాన కారణం ఏ ఫంక్షన్‌కైనా, పార్టీకైైనా చీరకట్టు సందర్భోచితంగా ఉంటుంది. అందుకే వస్త్ర వ్యాపారస్తులు కూడా చీరల అమ్మకాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు.మాస్టర్‌వీవర్స్‌ సరికొత్తగా అందిస్తున్న బ్లాక్‌ ప్రింట్‌, కలంకారి, మంగళగిరి ఫ్యాబ్రిక్‌ల చీరెలు మగువల మనసు దోచుకుంటున్నాయి. మహిళల అందాన్ని ద్విగుణీకృతం చేసే ఈ చీరలను ఈ వారం ధీర మీకు పరిచయం చేస్తోంది.

saree2సీకో శారీ పై బ్లాక్‌ ప్రింట్‌ చేసి, పల్లులో ప్రత్యేకంగా పెన్‌ కలంకారి డిజైన్‌, మిషన్‌ ఎంబ్రాయిడరీతో ప్యాచింగ్‌ చేయడం వల్ల డిఫరెంట్‌ లుక్‌ ఇస్తుందీ శారీ..
ధర : 2375

saree1సూపర్‌ నెట్‌ శారీపై మొత్తం బ్లాక్‌ ప్రింట్‌ చేసి కలంకారి బ్లాక్‌ ప్రింట్‌, మంగళగిరి ఫ్యాబ్రిక్‌లను బార్డర్‌గా ప్యాచింగ్‌ చేశారు. రెండు ప్యాచింగ్‌ల మధ్య బ్లాక్‌ ప్రింట్‌తో హైలెట్‌ చేయడంతో అద్భుతంగా కనిపిస్తుందీ శారీ.
ధర : 1585

sareeసూపర్‌నెట్‌ ఫ్యాబ్రిక్‌కు బాతిక్‌, బ్లాక్‌ప్రింట్‌ కలంకారీ ఫ్యాబ్రిక్‌లను బార్డర్‌గా ప్యాచింగ్‌ చేశారు. శారీ మొత్తం గోల్డ్‌ కడీ ప్రింట్‌లతో నయనానందకరంగా వుందీ శారి

డిజైన్స్‌: మాస్టర్‌ వీవర్‌
దిల్‌సుఖ్‌నగర్‌ : 04024050422
బంజారాహిల్స్‌ : 04023386437
ఫోటోలు : అరుణ స్టూడియో
వెబ్‌సైట్‌ : http://www.masterweaver.in

.

Surya Telugu Daily .

జనవరి 28, 2011 Posted by | అతివల కోసం | వ్యాఖ్యానించండి

సికింద్రాబాద్‌ పుట్టుక ఇదీ…

సికింద్రాబాద్‌ పుట్టుక ఇదీ…

sec-badదక్కన్‌ ప్రాంతాన్ని అసఫ్‌జాహీ ప్రభువులు 1724 నుంచి 1948 వరకు అంటే భారతదేశానికి స్వాతం త్య్రం సిద్ధించే వరకు 224 సంవత్సరాల పాటు పాలించారు.అసఫ్‌ జాహీ రాజ్య వంశ స్థాపకుడు ని జాం- ఉల్‌-ముల్క్‌, మీర్‌ ఖుమద్రీన్‌ ఆలీఖాన్‌ (1724-1748) గొప్ప పరాక్రమశాలిగా దక్కన్‌ ప్రాంతాన్ని పాలించాడు. నిజాం అనేది మొఘలు చక్రవర్తులు అసఫ్‌జాహీ వంశీయులకు ఇచ్చిన గౌరవ పురస్కారం.1762లో పరాక్రమశాలిగా కీర్తిగడించిన నిజాం ఆలీఖాన్‌ రెండో నిజాం ప్రభువుగా సింహాసనం అధిష్టించా డు. 1762 నుంచి 1803 వరకు ఆయన దక్కన్‌ ప్రాంతాన్ని పాలించారు. నిజాం ఆలీఖాన్‌ తన శత్రు సైన్యాల ను ఎదుర్కోవడానికి వీలుగా బ్రిటిష్‌ సైనికుల సహకారం కోరుతూ 1798లో బ్రిటిిష్‌ వారితో ఓ ఒప్పందం కుదుర్చుకున్నారు.

sec-bad1దీని ప్రకారం నిజాంకు మరాఠాలతో కానీ, మరే ఇతర శత్రు సైన్యాలనైనా ఎదు ర్కోవడానికి అవసరమైన బ్రిటిష్‌ సైనిక బల గాలను సమకూర్చాల్సి ఉంటుంది. అందుకు బ్రిటిష్‌ సైన్యానికి అయ్యే ఖర్చునంతా నిజాం సంస్థానం భరించా ల్సి ఉంటుంది. ఈ ఒప్పందం మేరకు ముందుగా 5000 మంది సైనికులతో హుస్సేన్‌ సాగర్‌కు ఉత్తరాన ఆరుమైళ్ల దూరంలో సైనికస్థావరాలు, కంటోన్మెంట్‌ ఏర్పాటు జరిగింది. ప్రస్తుత జన రల్‌ బజార్‌ సమీపంలో మిలిటరీ గుడారాలు ఏర్పాటు చేసుకు న్నారు. తరు వాత సైనికుల సంఖ్య పెరుగుతుండడంతో వారికి అనువైన తిరుమలగిరి, బొల్లారం, బోయిన్‌పల్లి ప్రాంతాలకు విస్తరించారు.

హైదరాబాద్‌ రాజ్యంలో బ్రిటిష్‌ సైనిక స్థావరాలు అలా పెరగడంతో రెండో నిజాం ప్రభువు నిజాం ఆలీఖాన్‌ మర ణానం తరం సింహాసనం అధిష్టించిన అతని కుమారుడు మూ డో నిజాం సికిందర్‌జా పాలనా కాలంలో నాటి బ్రిటిష్‌ సైనికా ధికారి కెప్టెన్‌ సీడెన్‌హామ్‌ కంటోన్మెంట్‌ ప్రాంతానికి నిజాం పేరుమీదుగా సికింద్రాబాద్‌ జంటనగర ఏర్పాటును ప్రతిపా దించారు. ఇందుకుసికిందర్‌జా అంగీకరించి 1806 జూన్‌ 3న అధికారికంగా ‘ఫర్మానా’ను విడుదల చేశారు. అలా హైద రాబాద్‌కు జంటనగరంగా సికింద్రాబాద్‌ ఏర్పాటైంది.

Surya Telugu Daily.

జనవరి 26, 2011 Posted by | వార్తలు | 4 వ్యాఖ్యలు

మేరా భారత్‌ మహాన్‌

మేరా భారత్‌ మహాన్‌

ఘన పథకాలతో..!
Republic-day5మన రాజ్యాంగ లక్ష్యాలైన సమానత్వం, సమన్యాయం స్వాతంత్య్రం సాధించిన ఇన్ని దశాబ్దాలైనప్పటికీ ఎండమావులుగానే రుజువు చేసుకుంటున్నాయి. ఆరు దశాబ్దాల స్వతంత్ర దేశంలో ఇంకా రెండు పూటలా తిండికి నోచుకోని ప్రజలు కోట్ల సంఖ్యలో ఉండడమే ఇందుకు ఉదాహరణ. అయితే ప్రతి ప్రభుత్వమూ సామాన్య పౌరుడికోసం ఎన్నో పథకాలను అమలు చేస్తున్నది. ఇన్ని పథకాలు అమలు చేసినా లబ్దిదారులకు మాత్రం చేరవలసిన ఫలాలు చేరకపోవడం ఒక విషా దం. ఏమైనప్పటికీ ఆమ్‌ ఆద్మీ కోసం ప్రభుత్వాలు పని చేస్తూనే ఉన్నాయి. అనేక పథకాలను, చట్టాలను ప్రవేశపెడుతూనే ఉన్నాయి. యుపిఎ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన పథకాలలో కొంతమేర అవినీతి జరిగినా కొంతమేరకు పేదలకు లబ్ది చేకూరుస్తున్నాయి.

సమాచార హక్కు చట్టం…
Republic-day7ప్రభుత్వ కార్యాలయాల్లో సమాచారాన్ని తెలుసుకునే హ క్కును ప్రజలకు కల్పించడమే ఈ రైట్‌ టు ఇన్ఫర్మే షన్‌(ఆర్‌టిఐ) యాక్ట్‌ ఉద్దేశ్యం. ప్రభుత్వ కార్యాలయాల్లో ఒకప్పుడు రహస్యంగా ఉన్న సమాచారం ఇప్పుడు ఈ చట్టం ద్వారా సామాన్య ప్రజలు సులభంగా తెలుసుకోవ చ్చు. ప్రభుత్వ కార్యాలయాల్లో జరుగుతున్న అవినీతిని నిరోధించడమే ఈ చట్టం ఉద్దేశ్యం. ఈ చట్టాన్ని పార్లమెంట్‌లో 2005లో రూపొందించారు. ఈ చట్టం ఓ విప్లవా త్మకమైన మార్పుగా చెప్పుకోవచ్చు. కుంభ కోణాలు, అవి నీతి పెరిగిపోతున్న ఈ రోజుల్లో సమాచార హక్కు ద్వారా కొంతమేరకైనా కళ్లెం పడుతుందని ఆశించవచ్చు. ‘ఈ చట్టం ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య అనుబంధాన్ని మ రింత పెంచేందుకు తోడ్పడుతుంది. కానీ బ్యూరోక్రసీ మాత్రం ప్రభుత్వ కార్యాలయాల్లో జరుగుతున్నదంతా రహస్యంగా ఉంచాలని చూస్తోంది’ అని సామాజికవేత్తలు కొందరు అభిప్రాయపడుతున్నారు. ‘ప్రజాస్వామ్య ప్రభు త్వాలు కొనసాగుతున్న దేశంలో సమాచార హక్కు విప్ల వాత్మకమైనది. ఆర్‌టిఐ యాక్ట్‌లోని సెక్షన్‌ 4 ప్రకారం దేశ పౌరులు ఎవరైనా ప్రభుత్వ కార్యాలయాల్లోని సమా చారాన్ని పొందవచ్చు’ అని సమాచార కమీషనర్‌ శైలేష్‌ గాంధీ అన్నారు.

మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి పథకం…
RP-Bhavan దేశంలో రూపొందించి అమలు చేస్తున్న అసా ధారణ పథకం మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి పథకాన్ని(ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎస్‌). గ్రామీణ ప్రాంతాలవాసులకు ఇది ఓ వరంగా పేర్కొనవచ్చు. ఈ పథకాన్ని 2006లో ప్రారంభించారు. ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల వాసులు ఎందరో ఉపాధి పొందుతున్నారు. ఈ మేరకు 2008-09 సంవత్సర కాలంలో 4.47 కోట్లు, 2007- 08 కాలంలో 3.39 కోట్ల మంది ఉపాధి పొందడం విశే షం. ఇది ఉద్యోగ, ఉపాధి అవకాశాల హామీ పథకంగా పేరొందింది. గతంలో బీహార్‌ వంటి రాష్ట్రాల్లో భూములు లేని కార్మికులు పని కోసం పంజాబ్‌ వంటి రాష్ట్రాలకు వలసవెళ్లేవారు. కానీ ఈ పథకం ప్రవేశపెట్టిన తర్వాత గ్రామీణ ప్రాంతాలవాసులు స్థానికంగానే ఉపాధి అవకా శాలు పొంది అక్కడే ఉండిపోగలిగారు. ఈ పథకం ద్వా రా రెండు లాభాలు ఉన్నాయి. ఒకటి గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కాగా రెండవది స్థానికులకు ఉపాధి అవకా శాలు కల్పించడం. ఈ పథకం ద్వారా గ్రామీణ వాసుల కు నీటి సంరక్షణ, అటవీకరణ పథకాల్లో ఉపాధిని కల్పి స్తున్నారు. దీంతో పాటు వరద నీటి ముంపు ప్రాంతాల్లో పనులు, చెరువు అభివృద్ది పనులను అందజేస్తున్నారు.

జాతీయ ఆహార బిల్లు…
Republic-day3దేశంలోని లక్షలాది పేద ప్రజలు రెండు పూటలా తిండిలేక అలమటిస్తున్నారు. ఇటువంటివారికి కడుపులు నిం పేందుకు ఉద్దేశించిన చట్టం నేషనల్‌ ఫుడ్‌ సెక్యూరిటీ యాక్ట్‌. ఈ చట్టం ప్రకారం దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న ప్రతి కుటుంబానికి ప్రతి నెలా 25 కిలోల బియ్యం లేదా గోధుమలను అందజేస్తారు. ఒక్కో కిలో మూడు రూపాయల చొప్పున అందజేయడం జరుగుతుంది. 2009లో జరిగిన సాధారణ ఎన్నికల సందర్భంగా కాం్ర గెస్‌ పార్టీ ఈ చట్టాన్ని రూపొందిస్తామని ప్రజలకు హామీ ఇచ్చింది. ఈ చట్టం త్వరలో రూపుదిద్దుకుంటుందని ఇటీ వల కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ వెల్లడించారు.

అత్యుత్తమ సైనిక పురస్కారాలు…
మన దేశ స్వాతంత్య్రం కోసం ఎందరో స్వాతంత్య్ర సమర యో ధులు తమ జీవితాలను త్యాగం చేశారు. అహింసే ఆయు ధంగా కొందరు శాంతియుతంగా పోరాడితే మరికొందరు హింసా మార్గంలో నేరుగా బ్రిటీష్‌వారిని ఢీకొని ప్రాణాలర్పించారు. ఇక దేశ స్వాతంత్య్రానంతరం ప్రధానంగా పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధ్దా ల్లో దేశాన్ని రక్షించేందుకు పలువురు అమర జవాన్లు పోరా డి తమ ప్రాణాలనొడ్డారు. వీరి ధైర్యసాహసాలను గుర్తించి మన దేశ అత్యు త్తమ సైనిక శౌర్య పురస్కారాలను అందజేసి కేంద్ర ప్రభుత్వం వారి ని గౌరవించింది.

Republic-dayదేశం కోసం యుద్ధాలలో ప్రాణాల ర్పించిన అమర జవాన్లు ఎందరో ఉన్నా రు. వీరికి కేంద్ర ప్రభుత్వం శౌర్య పుర స్కారాలను అందజేసింది. యుద్ధాలలో అమితమైన ధైర్యసాహసాలను ప్రదర్శిం చి శత్రువులపై దాడి చేసిన సైనికులకు ఈ అవార్డులను అంద జేస్తారు. ఈ పుర స్కారాలలో అత్యుత్త మైనవి పరమ వీర చక్ర(పివిసి), మహా వీర చక్ర (ఎంవిసి), వీర్‌ చక్ర (విఆర్‌సి).

పరమ వీర చ్రః
తిరుగులేని ధైర్య,సాహసాలను ప్రదర్శించి శత్రువులకు వెన్ను చూపకుండా పోరాడిన సైనిక యోధులకు ఈ అత్యుత్తమ పురస్కా రాన్ని ప్రదానం చేస్తున్నారు. ఈ పురస్కారాన్ని బ్రిటీష్‌ విక్టోరియా క్రాస్‌, యుఎస్‌ మెడల్‌ ఆఫ్‌ హానర్‌, ఫ్రెంచ్‌ లీజి యన్‌ ఆప్‌ హానర్‌, రష్యన్‌ క్రాస్‌ ఆఫ్‌ సెయింట్‌ జార్జ్‌తో పోలుస్తారు. ఇండియన్‌ మిలిట రీలోని సైనికులకు దీన్ని అందజేస్తారు. కేంద్ర ప్రభుత్వం అందజేసే భారతరత్న తర్వాత రెండవ అత్యున్నత పురస్కారం ఇదే. పరమ వీర చక్ర మెడల్‌ గుండ్రటి కాంస్య పతకం. దీన్ని 1.375 అంగుళాల వ్యాసంతో దీన్ని రూపొం దిస్తారు.

పరమ వీర చక్రను అందుకున్న యోధులు…
KaramSingh1. మేజర్‌ సోమ్‌నాథ్‌ శర్మ (1947, మరణానంతరం)
2. లాన్స్‌ నాయక్‌ కరమ్‌ సింగ్‌ (1948)
3. సెకండ్‌ లెఫ్టినెంట్‌ రామ రగోబ రాణె (1948)
4. నాయక్‌ జాదునాథ్‌ సింగ్‌ (1948, మరణానంతరం)
5. కంపెనీ హవల్దార్‌ మేజర్‌ పీరూ సింగ్‌ షెకావత్‌ (1948, మరణానంతరం)
6. కెప్టెన్‌ గురుబచన్‌ సింగ్‌ సలారియా(1961, మరణానంతరం)
7. మేజర్‌ ధన్‌సింగ్‌ థాపా (1962)
8. సుబేదార్‌ జోగిందర్‌ సింగ్‌ (1962, మరణానంతరం)
9. మేజర్‌ శైతాన్‌ సింగ్‌ (1962, మరణానంతరం)
10. కంపెనీ క్వార్టర్‌ మాస్టర్‌ హవీల్దార్‌ అబ్దుల్‌ హమీద్‌ (1965, మరణానంతరం)
11. లెఫ్టినెంట్‌ కల్నల్‌ ఆర్దెశిర్‌ బుర్జోర్జి తారపూర్‌ (1965, మరణానంతరం)
MajorSomnathSharma
12. లాన్స్‌నాయక్‌ ఆల్బర్ట్‌ ఎక్కా (1971, మరణానంతరం)
13. ఫ్లయింగ్‌ ఆఫీసర్‌ నిర్మల్‌జిత్‌సింగ్‌ సెకాన్‌ (1971, మరణానంతరం)
14. సెకండ్‌ లెఫ్టినెంట్‌ అరుణ్‌ కెతార్పల్‌ (1971, మరణానంతరం)
15. మేజర్‌ హోషియార్‌ సింగ్‌ (1971)
16. నాయబ్‌ సుబేదార్‌ బనా సింగ్‌ (1987)
17. మేజర్‌ రామస్వామి పరమేశ్వరన్‌ (1987, మరణానంతరం)
18. కెప్టెన్‌ మనోజ్‌ కుమార్‌ పాండే (1999, మరణానంతరం)
19. గ్రేనేడియర్‌ యోగిందర్‌ సింగ్‌ యాదవ్‌ (1999)
20. రైఫిల్‌మన్‌ సంజయ్‌ కుమార్‌ (1999, మరణానంతరం)

మహా వీర చక్రను అందుకున్న యోధులు…
రెండవ అత్యుత్తమ సైనిక పురస్కారం మహా వీర చక్రను పలు వురు వీర సైనికులు అందుకున్నారు. ఈ పురస్కారం మెడల్‌ను వెండితో గుండ్రటి ఆకృతిలో తయారుచేస్తారు. ఈ పురస్కారాన్ని 155మంది సైనికులు అందుకున్నారు. 1971లో జరిగిన ఇండో పాకిస్తాన్‌ యుద్ధంలో పాల్గొన్న సైనికులకు ఎక్కువగా ఈ అవా ర్డులు దక్కాయి. ఈ యుద్ధంలో పాల్గొన్న 11మంది ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ సైనికులకు ఈ అవార్డులను అందజేశారు.

రెండవ సారి మహా వీర చక్ర…
acharya ధైర్య,సాహసాలు ప్రదర్శించిన సైనికులకు రెండవ సారి కూడా మహా వీర చక్రను కేంద్ర ప్రభుత్వం అందజేస్తోంది. ఇటువంటి వీర సైనికులు ఆరుగురు ఉన్నారు.
1. వింగ్‌ కమాండర్‌ జగ్‌మోహన్‌ నాథ్‌ (1962,1965)
2. మేజర్‌ జనరల్‌ రాజీందర్‌ సింగ్‌ (1948, 1965)
3. జనరల్‌ అరుణ్‌ శ్రీధర్‌ వైద్య (1965, 1971)
4. వింగ్‌ కమాండర్‌ పద్మనాథ్‌ గౌతమ్‌
(1965, 1871)
5. కల్నల్‌ చెవాంగ్‌ రించెన్‌ (1948, 1971)
6. బ్రిగేడియర్‌ సంత్‌ సింగ్‌ (1965, 1972)

మూడవ అత్యుత్తమ పురస్కారం వీర చక్ర…
దేశ సైనికులకు అందజేసే మూడవ అత్యుత్తమ పురస్కారం వీర చక్ర. ఈ మెడల్‌ను వెండితో తయారు చేస్తారు. ఇక వీరచక్ర అవార్డును రెండుసార్లు అందు కున్న సైనిక యోధులు కొందరు ఉన్నారు. ఈ వీర

సైనికులు ఎవరంటే…
Republic-day21. సుబేదార్‌ హర్‌సింగ్‌ (1947, 1948)
2. రిసాల్దార్‌ కర్తార్‌ సింగ్‌ గిల్‌ (1948)
3. సుబేదార్‌ మేజర్‌ భీమ్‌ చంద్‌ (1948)
4. మేజర్‌ జనరల్‌ వెంకటపతి రంగస్వామి (1948, 1951)
5. ఎయిర్‌ కమాండర్‌ ఆంథోని ఇగ్నేషియస్‌ కెన్నెథ్‌ స్యూర్స్‌ (1950, 1961)
6. గ్రూప్‌ కెప్టెన్‌ పురుషోత్తమ్‌ లాల్‌ ధావన్‌ (1950, 1962)
7. లెఫ్టినెంట్‌ కల్నల్‌ సతీష్‌ చంద్ర జోషి (1948, 1965)
8. ఎయిర్‌ మార్షల్‌ వినోద్‌ కుమార్‌ భాటియా (1965, 1971)
9. వింగ్‌ కమాండర్‌ వినోద్‌ కుమార్‌ నేబ్‌ (1965, 1971)
10. ఎయిర్‌ వైస్‌మార్షల్‌ భూపేంద్ర కుమార్‌ బిష్నాయ్‌ (1965, 1971)
11. నాబ్‌ సుబేదార్‌ గుర్‌దేవ్‌ సింగ్‌ హన్స్‌ (1971)
12. కెప్టెన్‌ వి.ఎస్‌.శర్మ (1971)

మహావీర చక్ర ‘మేజర్‌ పద్మపాణి’
Republic-day6దశాబ్ద కాలం క్రితం జరిగిన కార్గిల్‌ యుద్దంలో ఎందరో వీర సైనికులు తమ ప్రాణాలొడ్డి పోరాడారు. 1999లో పాకిస్తాన్‌తో జరిగిన ఈ యుద్దంలో పలువురు అమరవీరులు తమ జీవితాలను త్యాగం చేసి భరతమాతను రక్షించారు. పాకిస్తాన్‌ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు లష్కరే తోయిబా, హర్కత్‌ ఉల్‌ అన్సార్‌తో పాటు పల ఇతర సంస్థల ఉగ్రవాదులు మన దేశ సరిహద్దులను దాటి ప్రవేశించారు. వారితో పాటు పాకిస్తాన్‌ సైనికులు కార్గిల్‌ ప్రాంతంలో కొంత మేర ఆక్రమించారు. దీంతో ఇండియా, పాకిస్తాన్‌ల మధ్య యుద్ధం చెలరేగింది. మన దేశ సైనిక దళాలు ఎంతో ధైర్యంగా పోరాడి పాకిస్తాన్‌ను చిత్తుచేశాయి. చివరికి అప్పటి పాకిస్తాన్‌ ప్రధానమంత్రి నవాజ్‌ షరీఫ్‌ ఇండియా సైనిక దళాల జోరుకు బెదిరి ఎక్కడ ఆ దళాలు తమ దేశాన్ని ఆక్రమిస్తాయో అని భయపడ్డాడు. అతను వెంటనే అమెరికా సహాయాన్ని కోరాడు. చివరికి అమెరికా చెప్పిన దాని ప్రకారం పాకిస్తాన్‌ సైనిక దళాలను సరిహద్దు నుంచి నవాజ్‌ షరీఫ్‌ వెంటనే వెనక్కి తెప్పించాడు.

రాష్ట్రానికే గర్వకారణంగా…
Yogendra-Singh-Yadavకార్గిల్‌ యుద్దంలో ఎందరో సైనికులు ధైర్యంగా పోరాడి తమ జీవితాలను అర్పించారు. వీరిలో ఒకరు మేజర్‌ పద్మఫణి ఆచార్య. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు చెందిన ఆయన కార్గిల్‌ యుద్దంలో వెన్నుచూపకుండా పోరాడి వీరమరణం పొందారు. రెండవ రాజ్‌పుతానా రైఫిల్స్‌కు కంపెనీ కమాండర్‌గా మేజర్‌ పద్మఫణి ఆచార్య 1999 జూన్‌ 28న పాకిస్తాన్‌ సైనికులతో వీరోచితంగా పోరాడారు. చివరికి సైనిక ఉన్నతాధికారులు తనకు అప్పగించిన లక్ష్యాన్ని పూర్తిచేసిన ఆయన తీవ్ర గాయాలతో ప్రాణాలర్పించారు. ఈ వీర సైనికుడికి మరణానంతరం మహావీర చక్ర పురస్కారాన్ని ప్రదానం చేసి దేశం గౌరవించింది. ఈ యుద్దంలో పాల్గొన్న సమయంలో ఆయన తన తండ్రికి ఓ లేఖ రాశారు. ‘దేశం కోసం పోరాడే యుద్దంలో చనిపోతే నేరుగా స్వర్గానికి వెళ్తావు…’అని శీకృష్ణుడి అర్జునుడికి బోధించిన గీతోపదేశానికి సంబంధించిన విషయాలను వెల్లడించారు.

పంచవర్ష ప్రణాళికలు – ప్రాధాన్యతలు
list1. తొలి ప్రణాళిక – 1951-56 వ్యవసాయానికి అత్యున్నత ప్రాధాన్యత, నీటి పారుదల, విద్యుత్‌
2. రెండవ ప్రణాళిక – 1956- 61 భారీ పరిశ్రమలకు అత్యంత ప్రాధాన్యత
3. మూడవ ప్రణాళిక – 1961- 66 స్వయం పోషకత్వం
4. ప్రణాళికా విరామం 1967- 69 మూడు వార్షిక ప్రణాళికలు
5. నాలుగవ ప్రణాళిక – 1969- 74 సమానత్వం, సామాజిక న్యాయం
6. ఐదవ ప్రణాళిక – 1974-79 స్వయం సమృద్ధి
7. ఆరవ ప్రణాళిక – 1980-85 దారిద్య్ర నిర్మూలన
8. ఏడవ ప్రణాళిక – 1985-90 ఉపాధి అవకాశాల పెంపు
9. వార్షిక ప్రణాళికలు -1991-92 —-
10. ఎనిమిదవ ప్రణాళిక – 1992-97 వేగవంతమైన ఆర్థికాభివృద్ధి
11. తొమ్మిదవ ప్రణాళిక – 1996-2002 నిలకడైన ధరలతో వేగవంతమైన ఆర్థికాభివృద్ధి
12. పదవ ప్రణాళిక – 2002-07 మెరుగైన జీవన ప్రమాణాలతో కూడిన వృద్ధి
13. పదకొండవ ప్రణాళిక – 2007-12 వేగవంతమైన, కలుపుకుపోయే వృద్ధి
మన రాజ్‌భవన్‌ చరిత్ర..

హైదరాబాదు రాజ్‌భవన్‌.. గవర్నర్‌ నివాసం. 21.50 ఎకరాలలో విస్తరించిన ఈ భవనం చరిత్ర ఇప్పటి కాదు.. స్వాతంత్రం రాక మునుపే ఎన్నో ఏళ్ళక్రితమే ఈ భవనానికి పునాదులు పడ్డాయి. అప్పటి నిజాం ప్రభువుల పాలనలోనే ఎన్నో మార్పులూ.. చేర్పులకూ గురవుతూ ప్రస్తుతం రాజ్‌భవన్‌గా.. గవర్నర్‌ నివాసంగా వెలుగుతోంది.

list11930లో నిజాం పరిపాలనా సమయంలో నవాబ్‌ ప్రధానమంత్రి అధికార భవనం ఇక్కడ వుండేది. నవాబ్‌ షహజర్‌ జంగ్‌, సయ్యద్‌ అఖిల్‌ బిల్‌గ్రామి పరిపాలనా కాలంలోని(1914)లో హైదరాబాదు సంస్థానం మ్యాప్‌ గనుక చూసినట్లైతే ప్రస్తుతం ఇప్పుడున్న దర్బారు హాలు కు దగ్గరలో రెండు భవనాలు వుండేవి. వీటిని నవాబ్‌ షహజోర్‌ జంగ్‌ కట్టించాడు. అనంతరం కాలక్రమేణా వీటి స్థానంలో ఆధునిక భవనాలను నిర్మించారు. ముఖ భాగాన్ని ఎన్నో మార్పులు చేయించారు.

ఇప్పుడున్న దర్బారు హాల్‌ను 1936లో ఎరిక్‌ మారె ట్‌, జైన్‌ యార్‌ జంగ్‌ అనేవారు జూబ్లీ హాల్‌, ఇతర మామూలు భవనాలు వంటివన్నీ తిరిగి పునర్‌నిర్మిం చేందుకు కావలసిన ప్లానును చేశారు. ఇప్పుడున్న జూబ్లీ హాల్‌, బాల్‌ భవన్‌, పబ్లిక్‌ గార్డెన్స్‌, లేడా హైదరి క్లబ్‌, బషీర్‌బాగ్‌లోని ప్రాంతాల నిర్మాణాలన్నీ వీరే డిజైన్‌ చేశారు.

1936లో నిజాం ప్రధానమంత్రి దర్బార్‌ హాల్‌ను ఆక్రమించి అక్కడే నివాసం వున్నారు. కానీ ఎక్కువ కాలం వుండలేకపోయారు. 1941లో ఇప్పటి దిల్‌కుషా గెస్ట్‌ హౌస్‌కు సమీపంలోని ఒక భవనానికి తన మకాం ను మార్చుకున్నారు. అనంతరం ప్రధానమంత్రి నవాబ్‌ చత్తరి (1941-1946 తరువాత మే-నవంబర్‌, 1947), సర్‌ మీర్జా ఇస్మాయిల్‌ (ఆగష్టు 1946- 1947 మే), సర్‌ మెహదీ యార్‌ జంగ్‌ (నవంబర్‌- డిసెంబర్‌, 1947) మీర్‌ లేఖ్‌ అలి, కౌన్సిల్‌ ప్రెసిడెంట్‌ (1947-48) వీటిలో నివాసం వున్నారు.
ఇప్పుడున్న నిర్మాణానికి సంబంధించి ముఖ్యమైన భాగాలకు వస్తే.. వీటిని అప్పుడే ఎంతో ప్రత్యేకంగా నిర్మాణం చేశారు (అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునికంగా దీన్ని రూపొందించారు). ఇది ఓ చేప ఆకారాన్ని పోలినట్లుగా నిర్మించారు. ఇది 1930లోనే నిర్మించా రు. అప్పటి నుండి తిరిగి జనవరి 2002లో పునర్‌ నిర్మాణం చేశారు.

దీని చారిత్రక విశేషాన్ని దృష్టిలో వుంచుకుని ఆ కాలంలో వేటితో అయితే నిర్మాణం చేసేవారో వాటినే వుపయోగించి పునరుద్ధరించారు.

ఇక 1914లో నిర్మించిన నిర్మాణా విషయాలకు వస్తే.. షాహ్‌ మంజిల్‌, ఉమ్మీద్‌ మంజిల్‌ హయాంలోనే వీటన్నిటి నిర్మాణం జరిగింది.. ఉమ్మీద్‌ మంజిల్‌ నిర్మా ణాలు 19వ శతాబ్దం చివరి వరకు కూడా చాలా చేశా రు. శతాబ్దం చివరి వరకు యూరోపియన్‌, ఇస్లామిక్‌ స్టైల్‌లో వారు భవనాలను నిర్మించారు. ఇతర దేశాల నుండి కూడా కళాకారులను వీరు రప్పించి మరీ నిర్మాణం చేశారు.

ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ భవనం నిర్మాణం మొదటి భాగంలో ఉమ్మీద్‌ మంజిల్‌ యూరోపియన్‌ స్టైల్‌ని అనుసరించారు. మిగిలిన విభాగాలలోనూ ఎన్నో ప్రత్యేకతలను తీసుకున్నారు. షాహ్‌ మంజిల్‌ నిర్మించిన భవనం (ఏఎస్‌డిసి ప్రస్తుత భవనం) ఇప్పటికీ మనకు కనిపిస్తుంది. మొఘల్‌ ఆర్చ్‌ నిర్మాణం వర్ణించడానికి కూడా అంతుచిక్కనిది. ఇక వీరు వుపయోగించిన కిటికీలు, లాంతర్లు మిగిలినవి రాజస్థానీ స్టైల్‌లో నిర్మించారు.

ఇప్పటికీ ఓ అద్భుతం..
Republic-day45ఆంధ్రప్రదేశ్‌ రాజ్‌ భవన్‌ ప్రస్తుత భవనం పూర్వ సంస్కృతిని నిదర్శనంగా మిగిలిన వాటిలో చాలా ముఖ్యమైనది. అప్పటి సంస్కృతీ, వారి కళాత్మకత, నైపుణ్యం వంటివన్నీ ఇందులో ప్రతిబిం బిస్తున్నాయి. రాష్టప్రతి, చీఫ్‌ కమాండర్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఆర్మీ ఫోర్సెస్‌ పదాతి దళాల నుండి వందన గౌరవం స్వీకరిస్తారు. ఈ వేడుకలకు ముఖ్య అతిధిగా మరో దేశ ముఖ్య నేతను ఆహ్వానిస్తారు. ఈ పెరేడ్‌లో సైనిక కవాతుతో పాటు మన మన ఆయుధ సంపత్తిని కూడా ప్రదర్శిస్తారు. అనేక సాంస్కృతి కళాత్మక కార్యక్రమాలునిర్వహిస్తారు. చివరిగా ఈ కార్యక్రమం ముగింపులో వైమానిక దళాలు జెట్‌ విమానాలతో కలిసి చేసే ‘మువ్వన్వెల జెండా’ రెపరెపల అనంతరం ముగుస్తుంది. వీటికి సమానంగా రాష్ట్రాలలోనూ పెరేడ్‌ నిర్వహిస్తారు. ఇక్కడ గవర్నర్లు గౌరవ వందనాన్ని స్వీకరిస్తారు. అక్కడిలాగే ఇక్కడా పెరేడ్‌ నిర్వహిస్తారు.

-ఎస్‌ అనిల్‌కుమార్‌, హైమ సింగతల

 

Surya Telugu Daily.

జనవరి 26, 2011 Posted by | మ౦చి మాటలు | 6 వ్యాఖ్యలు

మా మంచి తులసి…

మా మంచి తులసి…

వేల సంవత్సరాలుగా ఆయుర్వేద వైద్యంలో రారాజుగా వెలిగిపోతున్న మొక్క తులసి.. భారతీయ మగువలు ఎంతో పవిత్రంగా కొలిచే ఈ తులసి వంటింటి వైద్యంలో ఎంతో ముఖ్యం కూడా. కఫాన్ని, పైత్యాన్ని తీసివేయడంలో దీనికి మించినది లేదు. అంతేకాదు.. ఇంకా ఎన్నో రకాల వ్యాధులకు, జబ్బులకు మంచి మందు తులసి.

tulsi1

 • జ్ఞాపకశక్తిని మెరుగు పరచడంలో, నోటిసంబంధిత వ్యాధులకు, ఉబ్బసానికి మంచి మందు తులసి. చర్మవ్యాధులకు ఈ ఆకురసము మంచి ఫలితాన్నిస్తుంది.
 • గాయాలకు, దెబ్బలకు, విష జంతువులు కరిచి నపుడు ఈ ఆకు రసాన్ని పూసినా, వాడినా సత్వర ఉపశ మనం కలుగుతుంది.
 • ప్రతిరోజు 6-10 ఆకులు నమిలితే నోటి దుర్వాసన వుండదు. ప్రతి రోజు క్రమంగా పది ఆకులను తిన్నా లేక 1 చెంచా రసం పరగడుపున తాగినా ఆరోగ్యానికి మంచిది.
 • ఆకురసం, కొంచెం తేనె, ఒక చెంచా అల్లం రసం రంగరించి వాడితే జీర్ణకోశ సమస్యలుండవు.
 • తులసి రసంతో కొంచెం మిరియాల చూర్ణాన్ని కలిపి 2 చెంచాలు తింటే గొంతు బొంగురు పోవుటాన్ని, నీటిలో మరిగించి వడగట్టి తీసుకుంటే గొంతు గరగర, జలుబు, దగ్గు ఉన్నపుడు కఫం బయటకు వచ్చేటట్లు చేస్తుంది.
 • దోమ కాటు వలన వచ్చే మలేరియా వ్యాధికి ఇది మంచి ఔషధం.
  tulasi
 • ఇంటి ఆవరణలో ఈ చెట్లుంటే దోమలను పారదోలుతుంది. క్రిమిసంహారిగా కూడా పనిచేస్తుంది.
 • ఆధునిక పరిశోధనలో క్షయవ్యాధికి కారణమయ్యే బేసిల్లస్‌ ట్యూబర్క్యు లోసిన్‌ అను బ్యాక్టీరియా పెరుగుదలను అరికట్టి నశింపజేస్తుందని శాస్త్ర వేత్త లు వెల్లడించారు.
 • పత్రాలలోని సూక్ష్మమైన తైల గ్రంథులల్లోని తైలంలో యూజినాల్‌, యూజినాల్‌ మిథైల్‌, ఈథర్‌, కార్వసిరాల్‌, అను రసా యనాలే సువాసనకు, సూక్ష్మ జీవులను నశించేట్లు చేస్తాయి.
 • తులసి రసం, బెల్లం కలిపి తయారు చేసే తులసిసుధ అనే పానియం రక్తశుద్ధిని, వ్యాధి నిరోధకశక్తిని అభివృద్ది చేస్తుంది.
 • ఈ ఆకుల రసంతో చేసిన టీ జలుబు, దగ్గును, ఉదరకోశ రుగ్మతలకు బాగా పని చేస్తుంది. తులసి వనాలు వాతావరణ కాలుష్యాన్ని నివారిస్తాయి.

Surya Telugu Daily

జనవరి 18, 2011 Posted by | ఆరోగ్యం | 3 వ్యాఖ్యలు

సంక్రాంతి సంపదకు చిహ్నాలు పల్లెల్లో పురులు

సంక్రాంతి సంపదకు చిహ్నాలు పల్లెల్లో పురులు

-ధాన్యపు నిల్వకు ఖర్చులేని పురాతన పద్ధతి
-అందుబాటులో గల వరిగడ్డితో తయారీ
-మంచి లాభసాటి పద్ధతి
-గ్రామాల్లో పాత విధానం పట్ల రైతాంగం చూపు

vari1ఖరీఫ్‌ పంట చేతికొచ్చిన వేళ జరుపుకునే సంక్రాంతి పండుగ రైతుల జీవితాల్లో ఆనందోత్సాహాలను నింపుతుంది. ప్రతి ఏటా పంటలు వచ్చే వేళ జరిగే ఈ పండుగను పల్లెల్లో ఎంతో ఆడంబరంగా నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో వచ్చిన ధాన్యాలను పురులలో నిల్వ చేసుకుంటారు రైతులు. ముఖ్యంగా పల్లెల్లో సంక్రాంతి పండుగ రోజుల్లో వరిపురులు నిండుగా మారి రైతులకు సంతోషాలను మిగులుస్తాయి.

మారుతున్న కాలంతో‚ పోటీపడలేకపోతున్న రైతాంగం అతి తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉన్న పాతకాలం పద్ధతులను నేటికీ అవలంభిస్తున్నారు. ధాన్యం నిల్వ చేయడానికి అవలంభించే పాత కాలపు పద్ధతైన ‘పురికట్టే’ విధానాన్ని రైతులు నేటికీ అవలంభిస్తున్నారు. పెరిగిన రైసుమిల్లులు సైతం రైతు నిల్వలకు పెద్దగా మొగ్గు చూపే అవకాశం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో రైతాంగం ధా న్యం మసూళ్లు అనంతరం నిల్వ చేసేందుకు ధాన్యపు పురులను సిద్ధం చేసుకుంటున్నారు.

సులభంగా పురుల తయారీ…

variరైతులు పండిన ధాన్యాన్ని తరలించకుండా పొ లాల్లోనూ లేదంటే పశువుల కొట్టాల దగ్గర పురు లు కట్టి నిల్వచేసుకుంటున్నారు. దీని కోసం పండ ిన పంటలోని వరిగడ్డినే ఎంట్లు (వరిగడ్డిని పెనవే యడం) చుట్టి కావాల్సినంత సిద్ధం చేసుకుం టున్నారు. ముందుగా అదే వరిగడ్డిని మం దంగా వేసి తేమ తగిలే అవకాశం లేకుండా చూసుకుని వాటిపై బాగా ఆరుదల వచ్చిన ధాన్యం పోస్తూ గుండ్రంగా ఎంట్లు చుడుతూ ధాన్యం పూర్తయ్యేవరకు పోసి గడ్డిని రక్షణగా ఏర్పాటుచేస్తున్నారు. దీనికి గాను పురులు తొక్కేందుకు నైపు ణ్యం గల వ్యవసాయ కూలీలను ఏర్పాటుచేసుకుంటున్నారు. అయితే ఈ విధానంలో ఎక్కువ కాలం నిల్వ చేయాలంటే ధాన్యానికి ఎలుకల బెడద ఉండేది. అం తేకాకుండా అగ్నిప్రమాదాలకు ఆస్కారం ఉన్నా నేటికీ వివిధ జాగ్రత్తలను పాటిస్తూ పురులను ఏర్పాటుచేసుకుంటున్నారు రై తులు. పదిహేను ఏళ్ల క్రితం వరకు ఈ పురుల విధానాన్ని భూ స్వాములు ఎక్కువగా అవలంభించేవారు. కానీ నేడు సామాన్య రైతులు కూడా పురులను ఏర్పాటుచేసుకొని ధాన్యాన్ని నిల్వ చేస్తున్నారు.

సంక్రాంతి శోభ…

vari2ఖరీఫ్‌ పంట చేతికొచ్చే సంక్రాంతి రోజులు రైతులకు మంచి రోజులు. పంట ధాన్యం చేతికి రావ డంతో పల్లెల్లో సంక్రాంతి శోభ ‘ఆనంద’కాంతులను వెదజల్లుతుంది. ఇక వచ్చిన ధాన్యాన్ని పురు లలో నిల్వ చేసుకునే రోజులివి. ఇక గ్రామాల్లో వ్యవసాయదారుల ఇళ్లల్లో నాలుగేళ్లకు పైగా వరిని పురులలో నిల్వచేసి వాటిని బాలింతలకు పాతబియ్యం పేరిట వండిపెట్టేవారు. ఈ నిల్వ బియ్యంలో మంచి పోషక విలువలు ఉంటాయన్నది నమ్మకం. ఇటువంటి పాత బియ్యం నిల్వలు మారుమూల పల్లెటూళ్లలో ఎక్కువగా చూడవచ్చు. కానీ ఇప్పుడు పురులు కట్టే సంప్రదాయం అంతరించి పోయే స్థితిలో ఉండడం శోచనీయం.

Surya Telugu Daily

జనవరి 16, 2011 Posted by | సంస్కృతి | వ్యాఖ్యానించండి

కర్ణాటక సంగీత కలికితురాయి

కర్ణాటక సంగీత కలికితురాయి
సంగీతం ఓ గలగలపారే ప్రవాహం…ఈ సంగీత సాగర ప్రవాహంలో ఎందరో మహానుభావులు తమదైన ముద్రను వేశారు. వారు దివంగత లోకాలకు వెళ్లిపోరుునా వారందించిన సంగీత స్వరాలు కొన్ని వందల సంవత్సరాలదాకా జనం నోళ్లల్లో నానుతూ చిరంజీవులవుతున్నారు. వారి ఖ్యాతి ఆచంద్ర తారార్కం వెలుగొందుతూనే ఉంటుంది. కర్ణాటక సంగీత సామ్రాజ్యాన్ని ఏలిన త్రిమూర్తులుగా చెప్పబడే త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్ర్తిలలో రెండవవారైన ముత్తుస్వామి దీక్షితులు కర్ణాటక సంగీతంలోని హంసధ్వని రాగానికి ఆయువుపట్టుగా మారి తన గాత్ర సంగీతానికి ఊపిరిలూదారు.‘వాతాపి గణపతిం భజే’ అనే కీర్తన నేటికీ ప్రతి ఇంటా మార్మోగిపోతూనే ఉంటుంది. ఆ కీర్తన రూపకల్పన చేసింది ముత్తుస్వామి దీక్షితులే…ఆ మహానుభావుని గురించి క్లుప్తంగా తెలుసుకుందాం…

muttuswamyకర్ణాటక సంగీత సరస్వతీదేవి కిరీటంలో పొదిగిన త్రిరత్నములుగా త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్ర్తిలను పేర్కొంటారు. ఈ కర్ణాటక సంగీతత్రయంలో ఒకరెైన వాగ్గేయకారుడే ముత్తుస్వామి దీక్షితులు. ‘వాతాపి గణపతిం భజే’ అన్న కీర్తన విననివారుండరంటే అది అతిశయోక్తి కాదేమో. అది ఆయన రచించినదే. కర్ణాటక ప్రాంతానికి చెందిన రామస్వామి దీక్షితార్‌, సుబ్బలక్ష్మి అంబాళ్‌ పుణ్యదంపతుల సంతానంగా ముత్తుస్వామి 1775లో పుట్టారు. చిన్ననాటినుండి వినయవిధేయతలతో…భక్తిప్రపత్తులతో తన గుణగణాల ద్వారా మంచి బాలునిగా పేరుగాంచారు. పెద్దల యందు భక్తిశ్రద్ధలుగల వ్యక్తిగా ఎంతో అణుకువను బాల్యంలోనే ఈయన ప్రదర్శించారు.

తన తండ్రి వద్ద తెలుగు, సంస్కృతంతో పాటు శాస్ర్తీయ సంగీతాన్ని కూడా ఈయన అభ్యసించారు.సంగీతంపెై వెలువడిన వెంకటాముఖి సుప్రసిద్ధ గ్రంథం చతుర్‌దండి ప్రకాశికైను అధ్యయనం చేశాడు. కావలసినమేరకు వేదవేదాంగ,పౌరాణిక ధర్మ గ్రంథాలపరమైన జ్ఞానాన్ని కూడా సంపాదించగలిగారీయన.ఒకసారి ఇంటికి అతిధిగా వచ్చిన చిదంబరనాధ యోగి బాలునిగా ఉన్న ముత్తుస్వామి దీక్షితార్‌ను కాశీకి తీసుకెళ్ళారు. అక్కడ ముత్తుస్వామికి ఉపాసనా మార్గాన్ని బోధించారు.వారణాసిలో ఉన్నప్పుడు ముత్తుస్వామి ఉత్తరదేశపు సంగీతమైన హిందూస్తానీని కూడా నేర్చుకున్నారు.

శ్రీనాదాదిగరుగుహోజయతి అనే మాటలతో ప్రారంభమయ్యే తొలి కీర్తనను ఇతడు రచించి రాగం కూర్చారు.తురుత్తణిలో వెలసిన శివుడి కుమారుడెైన మురుగ భగవానుడి భక్తిపారవశ్యంలో లీనమైనప్పుడు పెై సంకీర్తనను ముత్తుస్వామి రచించారు. ఆధ్యాత్మిక వెలుగులో ఈయన సృజనాత్మకత ప్రతిభ ప్రకాశించింది. అచిరకాలంలోనే ఎందరో శిష్యపరమాణువులను పొందగలిగారు. ముత్తుస్వామి తన శిష్యులను ఎంతో జాగ్రత్తగా ఎన్నుకుని వారికి తన కృతులను ఆలపించడం ఎలానో బోధించేవారు.
తన తమ్ముడు చిన్నస్వామి చనిపోయినప్పుడు ఆ దుఃఖంలో ఉన్నప్పుడు మధురెై మీనాక్షి అమ్మన్‌ ఆలయాన్ని దర్శించారు ముత్తుస్వామి. అక్కడే అతడు మీనాక్షి మేముదం దేహి, మామన మీనాక్షి అనే కీర్తనలను వరుసగా పూర్వీ కళ్యాణి, వరాళి రాగాలలో ఆలపించారు.

ధ్యాన యోగం, జ్యోతిష్యశాస్త్రం, మంత్ర యోగం, పురాణాల సారం మొదలెైనవి దీక్షితార్‌ కృతులలోని ప్రత్యేకతలు. అంబాళ్‌పెై అతడు రాసిన నవవర్ణ కీర్తనలు నవగ్రహాలపెైన రాసిన నవగ్రహ కీర్తనలు ఆయన రచనా గొప్పతనానికి ఉజ్వల ఉదాహరణలు. శక్తి ఉపాసనలోని సూక్ష్మాలను వివరిస్తూ శ్రీ విద్యా తత్వ రహస్యంపెై ఈయన ఎన్నో కీర్తనలను రచించారు. శివ పాహి ఓం శివే అన్న మంత్రాన్ని ఉచ్చరిస్తున్నవేళ 1835లో తనువు చాలించాడు. ఎంతో ఉన్నత… అత్యద్భుతమైన కృతులను రచించిన ముత్తుస్వామి దీక్షితులు కర్ణాటక సంగీతత్రయంగా చెప్పుకునే త్యాగరాజు తర్వాత రెండవవారిగా పరిగణింపబడతారు.రామస్వామి దీక్షితులు వీరి తండ్రి. వీరు సంగీత, వ్యాకరణ, జ్యోతిష, వాస్తు, మాంత్రిక, వెైద్య విద్యలలో ఆరితేరిన వ్యక్తి. గురుగుహ ముద్రతో వున్న వీరి కృతులన్నీ సంస్కృతంలోనే వున్నాయి.

హిందూస్థానీ సంగీతంనుండి వీరు కర్ణాటక సంప్రదాయానికి తెచ్చిన రాగాలు సారంగ, ద్విజావంతి మొదలెైనవి. వీరు అనేక క్షేత్రములు తిరిగి ఆయా ప్రదేశములలో వున్న దేవస్థానములను సందర్శించి దేవతలపెై కృతులు కట్టారు. ఆయన రూపొందించిన కృతులలో కమలాంబా నవావర్ణ కృతులు, నవగ్రహ కీర్తనలు ప్రత్యేక స్థానాన్ని కలిగి వున్నాయి. వాతాపి గణపతిం భజే, మహా గణపతిం, శ్రీనాథాది గురుగుహో, అక్షయలింగ విభో, బాలగోపాల, అఖిలాండేశ్వరి, రామచంద్రం భావయామి, చేత: శ్రీబాలకృష్ణం, శ్రీ వరలక్ష్మి, సిద్ధి వినాయకం, త్యాగరాజ యోగవెైభవం, హిరణ్మరుూం, అన్నపూర్ణే, అరుణాచలనాథం, ఆనందామృతకర్షిణి, మామవ మీనాక్షి, మీనాక్షి మే ముదం దేహి, నీలకంఠం భజే, స్వామినాథ, శ్రీ సుబ్రహ్మణ్యాయ, పరిమళ రంగనాథం, మొదలెైనవి వీరి యితర ప్రముఖ రచనలు. ముత్తుస్వామి తండ్రి రామస్వామి దీక్షితులు, హంసధ్వని రాగమును కనిపెట్టిన మేధావి. ఈ భక్త శిరోమణి కాశ్యప సగోత్రీకుడు.

అతని పూర్వీకులు గోవింద దీక్షితులు నిర్మించిన అగ్రహారమైన గోవిందపురములో రామస్వామి 1735 లో జన్మించారు. వేంకటేశ్వర దీక్షితులు, భాగీరథి అతని తల్లి దండ్రులు. వారు 1751లో పరలోకగతులయ్యారు. తదనంతరం రామస్వామి తంజావూరుకు వెళ్లారు. అచ్చట రాజాస్థానములో సంగీత విద్వాంసుడువీరభద్రయ్య వద్ద రామస్వామి సంగీతవిద్యను అభ్యసించి, తిరిగి తన స్వగ్రామమునకు వచ్చారు.సంగీతము పట్ల గల అమిత జిజ్ఞాసతో, అనురక్తితో, మరల విద్యాభ్యాస ప్రయాణమును కొనసాగించారు. మధ్వార్జున క్షేత్రమునందు వేంకట వెైద్యనాథ దీక్షితులు అనే వెైణికుడు నివసించుచుండెను.

వెంకట వెైద్యనాథ దీక్షితులు యొక్క పూర్వీకుడు వేంకటమఖి అమోఘ పండితుడు. వెంకటమఖి రచించిన చతుర్దండి ప్రకాశిక కర్ణాటక సంగీతము నేర్చుకొను వారికి కరదీపిక వంటిది.వెంకటముఖి 72 మేళ రాగములను సూత్రీకరించెను. తనను ఆశ్రయించిన రామస్వామిలోని భక్తి శ్రద్ధలకు, సంగీతము పట్ల ఆసక్తి వెైద్యనాథులకు ఎంతో నచ్చాయి.తన పూర్వీకులు ఒసగినట్టి, ఆ జన్యు రాగ సంపదలను, వెైద్యనాథ దీక్షిత పండితవరేణ్యులు నిష్కామముగా బోధించెను.రామస్వామి దీక్షితులు సంగీత విద్యలను క్షుణ్ణంగా అభ్యసించేవారు. స్వయంకృషితో రామస్వామి దీక్షితులు కనిపెట్టిన ‘హంసధ్వని రాగం’ కర్ణాటక సంగీతసీమలో ప్రాచుర్యము పొందినది. వేంకట వెైద్యనాథులు, రామస్వామి దీక్షితులు ఇద్దరూ అపురూపమైన గురుశిష్యు. వారు ఇరువురూ పరస్పరమూ పౌర్ణమి చంద్రుడు, పాల వెన్నెల వంటివారు.

-నండూరి రవిశంకర్‌

Surya Telugu Daily

జనవరి 15, 2011 Posted by | సంస్కృతి | 2 వ్యాఖ్యలు

భావవ్యక్తీకరణకు దర్పణం గ్రాఫిటీ కళ

భావవ్యక్తీకరణకు దర్పణం గ్రాఫిటీ కళ
గ్రాఫిటీకి సంబంధించిన ప్రారంభ రూపాలు క్రీ.పూ. 30,000 కాలంలో ఉన్నాయి, చరిత్రపూర్వ గుహ చిత్తరువులు, చిత్రలిపిలో తెలియజేసిన ఊహాచిత్రాల్లో దీనిని గుర్తించవచ్చు, ఆ కాలంలో వీటిని చెక్కేందుకు లేదా గీసేందుకు జంతువుల ఎముకలు మరియు వర్ణద్రవ్యాల వంటి సాధనాలను ఉపయోగించారు.

lapd_pigఒక ప్రదేశంలో ఎటువంటి పద్ధతిలోనెైనా చెక్కిన, వికారంగా రాసిన, రంగులతో చిత్రీకరించిన లేదా గుర్తించిన చిత్రాలు లేదా అక్షరాలను సూచించేందుకు ఉపయోగించే పేరును గ్రాఫిటీ అంటారు. ఏ విధమైన బహిరంగ గుర్తులనెైనా గ్రాఫిటీగా పరిగణించవచ్చు, ఇవి గోడమీద చిత్రాలను విశదపరిచేందుకు రాసిన సాధారణ పద రూపాల్లో కూడా ఉండవచ్చు. పురాతన కాలం నుంచి గ్రాఫిటీ ఉనికి కలిగివుంది, వీటికి ఉదాహరణలను పురాతన గ్రీసు, రోమన్‌ సామ్రాజ్య కాలాల్లో కూడా ఉన్నాయి. ఆధునిక రోజుల్లో, గ్రాఫిటీ రూపకల్పనకు స్ప్రే పేయింట్‌, సాధారణ పేయింట్‌ (వర్ణం) మరియు మార్కర్‌ల వంటి పదార్థాలను సాధారణంగా ఉపయోగిస్తున్నారు.

అనేక దేశాల్లో, యజమాని అనుమతి లేకుండా గ్రాఫిటీని ఉపయోగించి ఆస్తిని పాడు చేయడాన్ని ఉద్దేశపూర్వక విధ్వంసక చర్యగా పరిగణిస్తారు, ఇది చట్ట పరిధిలో దండనార్హమైన నేరంగా ఉంది. కొన్ని సందర్భాల్లో సామాజిక లేదా రాజకీయ సందేశాలను తెలియజేసేందుకు కూడా గోడమీద రాతలను (గ్రాఫిటీ) ఉపయోగిస్తారు. కొందరికి, ప్రదర్శనా కేంద్రాలు,ప్రదర్శనల్లో ప్రదర్శించేందుకు ఇది ఒక విలువెైన కళా రూపం.ఇతరుల దృష్టిలో ఇది కేవలం ఉద్దేశపూర్వక విరూప చర్యగా పరిగణించబడుతుంది. పాప్‌ సంస్కృతి ఉనికిగా పరిణమించినప్పటి నుంచి, సాధారణ ప్రజానీకం నుంచి ఇప్పటికీ గోప్యంగా ఉంచబడుతున్న జీవనశెైలిని సృష్టిస్తున్న అవ్యక్త హిప్‌ హాప్‌ సంగీతం, బి-బాయింగ్‌తో గ్రాఫిటీ తరచుగా అనుబంధించబడుతుంది.

vmkhxgభూభాగాన్ని గుర్తించేందుకు లేదా ముఠా-సంబంధ కార్యకలాపానికి ఒక సూచికగా లేదా ట్యాగ్‌గా పనిచేసేందుకు గ్రాఫిటీని ఒక ముఠా సంకేతంగా ఉపయోగిస్తారు. గ్రాఫిటీని చుట్టుముట్టి ఉన్న వివాదాలు నగర అధికారులు/చట్ట అమలు శాఖాధికారుల మధ్య విభేదాలు సృష్ట్టించడం కొనసాగుతూనే ఉంది.ఇప్పుడిప్పుడే బహిరంగ ప్రదేశాల్లో గ్రాఫిటీ కళాకారులు వారి కళను ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తున్నారు.గ్రాఫిటీలో అనేక రకాలు, శెైలులు ఉన్నాయి, ఇది వేగంగా అభివృద్ధి చెందుతున్న కళారూపం, దీని విలువ బాగా వివాదాస్పదంగా ఉంది. అనేక అధికారిక యంత్రాంగాలు దీనిని వ్యతిరేకిస్తున్నాయి, ఒకే అధికార పరిధిలో కొన్నిసార్లు ఇది రక్షణకు లోబడివుంటుంది.

చరిత్రలో గ్రాఫిటీని వర్తింపజేస్తున్నారు. దీని అనుబంధ పదం గ్రాఫిటోను వర్ణద్రవ్యం యొక్క ఒక పొరపెై గీయడం ద్వారా దాని కింద ఉన్న మరో పొరను బయటకు తేవడాన్ని సూచించేందుకు ఉపయోగిస్తారు.కుమ్మరులు ఈ పద్ధతిని మొదట ఉపయోగించారు, వీరు వారి వస్తువులకు మెరుగు అద్ది, తరవాత దానిపెై నమూనాను గీస్తారు. పురాతన కాలంలో, గ్రాఫిటీని గోడలపెై పదునెైన వస్తువులతో చెక్కేవారు, కొన్ని సందర్భాల్లో సున్నపురాయి లేదా బొగ్గును కూడా ఉపయోగించారు.కాటాకాంబ్స్‌ ఆఫ్‌ రోమ్‌లో లేదా పోంఫీ వద్ద మాదిరిగా, పురాతన శవమందిరాలు లేదా శిథిలాల గోడలపెై శాసనాలు , చిత్రలేఖనాలు, తదితరాలను సూచించేందుకు గ్రాఫిటీ అనే పదాన్ని ఉపయోగించవచ్చు. ఉద్దేశపూర్వక విరూప చర్యతో కూడిన ఒక పద్ధతిలో ఉపరితలాలపెై గీసిన ఎటువంటి ఉహాచిత్రాలనెైనా సూచించేందుకు ఈ పదాన్ని ఉపయోగిస్తున్నారు.

barcelona-graffitiగ్రాఫిటీకి సంబంధించిన ప్రారంభ రూపాలు క్రీ.పూ.30,000 కాలంలో ఉన్నాయి, చరిత్రపూర్వ గుహ చిత్తరువులు, చిత్రలిపిలో తెలియజేసిన ఊహాచిత్రాల్లో దీనిని గుర్తించవచ్చు, ఆ కాలంలో వీటిని చెక్కేందుకు లేదా గీసేందుకు జంతువుల ఎముకలు మరియు వర్ణద్రవ్యాల వంటి సాధనాలను ఉపయోగించారు. ఈ చిత్తరువులను తరచుగా గుహల లోపలి భాగంలో కర్మసంబంధమైన మరియు పుణ్య ప్రదేశాల్లో ఉంచేవారు.గోడలపెై గీసిన చిత్రాలు ఎక్కువగా జంతు అటవిక జీవితం మరియు వేటాటడం వంటి పరిస్థితులకు సంబంధించిన దౄఎశ్యాలను కలిగివున్నాయి. చరిత్రపూర్వ సమాజానికి చెందిన మానవులు ఇటువంటి చిత్తరువుల సృష్టిని సమర్థించారని పరిగణించడం వలన, ఈ గ్రాఫిటీ రూపం వివాదాస్పదంగా ఉంది.

ఆధునిక-శెైలి గ్రాఫిటీఆధునిక శెైలి గ్రాఫిటీకి సంబంధించిన మొదటి ఉదాహరణను పురతాన గ్రీకు నగరమైన ఎఫెసస్‌ (ఆధునిక రోజు టర్కీ)లో గుర్తించారు. స్థానిక గెైడ్‌లు (ప్రదేశ విశిష్టతను వివరించేవారు) దీనిని పడువువౄఎత్తికి ఒక ప్రకటన అని చెబుతారు. ఒక చిత్రాస్తరం (వివిధ రకాల, వర్ణాల గాజురాళ్లు పొదిగి విచిత్రంగా తయారు చేసిన గచ్చు) మరియు రాతి కాలిబాటకు సమీపంలో ఉన్న గ్రాఫిటీ ఒక కాలిముద్ర మరియు ఒక సంఖ్యతోపాటు, అస్పష్టంగా గుండెను ప్రతిబింబించే ఒక చేతిముద్రను చూపిస్తుంది. ఇది డబ్బు చెల్లింపును సంకేతీకరిస్తున్న చేతిముద్రతో, వేశ్య సమీపంలోనే ఉన్నట్లు సూచిస్తున్నట్లు భావించబడుతుంది.

ఒక రాజకీయ నాయకుడి యొక్‌ పురాతన పోంపీ గ్రాఫిటీ వ్యంగ్య చిత్రం.పురాతన రోమన్లు గోడలు, స్మారక కట్టడాలపెై గ్రాఫిటీని మలిచారు, దీనికి సంబంధించిన ఉదాహరణలు ఈజిప్టులో గుర్తించవచ్చు. ప్రస్తుత సామాజిక ఆందోళన సందర్భం సూచించేదాని కంటే, సంప్రదాయ ప్రపంచంలో గ్రాఫిటీకి వివిధ సహజార్థాలు ఉన్నాయి. పురాతన గ్రాఫిటీ ప్రేమ ప్రకటనలు, రాజకీయ వాక్పటిమ మరియు ఆలోచనకు సంబంధించిన సాధారణ పదాలకు సంబంధించిన పదబంధాల్లో ప్రదర్శించబడేది, ఈ రోజు దీనిని సామాజిక,రాజకీయ భావాలకు సంబంధించిన ప్రసిద్ధ సందేశాలకు ఉపయోగిస్తున్నారు. చెైనాలో, గ్రాఫిటీ కళ 1920లో మావో జెడాంగ్‌తో ప్రారంభమైంది, దేశంలో కమ్యూనిస్ట్‌ విప్లవానికి జీవం పోసేందుకు బహిరంగ ప్రదేశాల్లో విప్లవాత్మక నినాదాలు, చిత్రాలు గీయించడానికి ఆయన గ్రాఫిటీని ఉపయోగించారు. అత్యంత పొడవెైన గ్రాఫిటీని సృష్టించిన రికార్డు మావో పేరిట ఉంది.

Surya Telugu Daily

జనవరి 15, 2011 Posted by | వర్ణ చిత్రాలు | 2 వ్యాఖ్యలు

ఏవీ ఆ రోజులు… ఎక్కడ సంక్రాంతి సరదాలు…

ఏవీ ఆ రోజులు… ఎక్కడ సంక్రాంతి సరదాలు…

సిగ్గు ముసుగు వీడి సిరి వెన్నెల తీరానికి పయనించేటి మకర సంక్రమణం పూర్తి మహదుల్లాసము తేచ్చేది సంక్రాంతి. పసిపాపల నవ్వుల పువ్వులవోలె ఆకట్టుకుని ఇంటి ముంగిట ముగ్గుల మెలికలో కూర్చున్న గొబ్బెమ్మ పాటే సంక్రాంత్రి. భోగిమంటల పిల్లగాలుల, హరిదాసు జానపద లహరికి నాందే సంక్రాంతి. వాకిట గుమ్మిలలో పొంగిపొర్లుతున్న వరి ధాన్య సంపుటి,పసుపు పచ్చని కోకల్లో ఆటలాడే కన్నె మొగ్గల పండుగే సంక్రాంతి. పోటీలుపడి వాయునాధుడి సహనాన్ని పరీక్షించి పతం గులను ఎగురవేసే యువత కేరింతలే సంక్రాంతి. తెలు గుతనపు సిరి మువ్వల సవ్వడే మరక సంక్రాంతి…

big-kiteసంక్రాంతి పండగ వచ్చిందంటే చాలు అటు నగరంలోనూ…ఇటు గ్రామా ల్లో వారం రోజుల ముందే పండగ వాతావరణం నెలకొని ఉండేది. యువత పతంగులతో, మగువలు ముగ్గల పోటీలల్లో మునిగి తేలేవారు.పెద్దలు పండగ ఏర్పాట్ల గురించి ముందస్తుగానే ఆలోచించేవారు. కాని ప్రస్తుత యాంత్రిక జీవన విధానంలో పండుగలంటే ఓ రోజు దండగ అనే విధంగా రోజులు మారా యి. గతాన్ని ఒక్కసారి స్మరించుకుంటే…

ఏవీ ఆ రోజులు….
సంక్రాంతి పండగ వచ్చిందంటే చాలు పాఠశాలలు ఇచ్చే వారం రోజుల సెలవు లలో జీవితంలోనే మరిచిపోలేని తీపి జ్ఞాపకాలను రూపకల్పన చేసుకునేవారు పిల్లలు.గ్రామాల్లో, నగరల్లో పతంగులకు(గాలిపటాలు) ప్రత్యేక గుర్తింపు ఉం డేది. ఎక్కడ చూసినా యువత అల్లర్ల నడుమ పంతగులను ఎగురవేస్తూ కాలా న్నే మరిచిపోయేవారు. ఉదయాన్నే ఇంట్లోంచి వెళ్తే చాలు పతంగులను పట్టు కుని ఎగురవేయడం లేదా పోటాపోటీగా కట్టెలు చేతపట్టి ఎంతటి కష్టమైనా సరే దారం తెగిన పతంగి తమ వశం కావాలనే తపనతో పట్టుకునే సాహసాలు ఎక్కడ చూసినా దర్శనమిచ్చేవి. కాని కాలక్రమేణా ఎన్నో మార్పులను చవి చూస్తున్నామనడంలో అనుమానమే లేదు.

ప్రస్తుతం యువత పండుగలు వచ్చా యంటే చాలు ఇతర ఆనందాల్లో మునిగి కేరింతలు వేస్తున్నారే తప్ప పండుగ ప్రాముఖ్యతను తెలుసుకోవడం లేదు. అద ేవిధంగా అమ్మాయిలు సైతం తమ నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు వెనుకడుగు వేస్తున్నారు. మగువలకు ప్రత్యేక ఆక ర్షణగా ఏర్పాటు చేసే ముగ్గుల పోటీ తత్వాలు కూడా పూర్తిగా అంతరించి పో యాయనే చెప్పాలి. నగరాల్లో ఇరుకైన ప్రాంతాలు, పెద్ద పెద్ద అపార్టుమెంట్లలో నివసించే వారే ఎక్కువగా ఉండడంతో అసలు ముగ్గులలో ఉన్న తీపి జ్ఞాపకాన్ని పూర్తిగా విస్మరిస్తున్నారు. పండుగలు వచ్చాయంటే కేవలం పూజా కార్యక్రమా లను నిర్వహించి తాము ఎంతో గొప్పగా పండుగలను జరుపుకున్నామని ఒకరికి ఒకరు చెప్పుకోవడం ప్రస్తుతం ప్యాషన్‌గా మారిపోయింది.

ఇదేనా మన సంస్కృతి..
kaitesసంక్రాంతి పండగ వచ్చిందంటే గొబ్బిళ్లు, హరిదాసుల పాటలు, గంగిగోవు ఆరాధన, ఇంటిముంగిట పాలపొంగులు.. మగువల ముగ్గులు,యువత పతం గుల ఆట పాటాలు నేడు కనుమరుగవుతున్నాయి.పాశ్చాత్య సంస్కృతి సాంప్ర దాయాలకు అలవాటు పడుతున్న మనం పెద్దలు మనకు ఇచ్చిన సాంప్రదా యాలను పూర్తిగా విస్మరించి ఇదేదో బలవంతంపు ఫెస్టివల్‌గా ఇబ్బందులతో పండులను జరుపుకోవడంతో విచారకరంగా ఉందని పెద్దలు విచారం వ్యక్తం చేస్తున్నారు.

యువతకు ప్రత్యేక ఆకర్షణ ‘పతంగి’…
సంక్రాంతి వచ్చిందంటే చాలు పిల్లలకు ముందుగా గుర్తువచ్చేది పతం గి(గాలిపటం). చేతిలో చిల్లిగవ్వ లేకున్నా అమ్మానాన్నను ఇబ్బంది పెట్టైనా పంతంగులను కొనుక్కొని ఎగురవేసి సంతృప్తి పడేవారు. కాని నేటి యువత అందుకు భిన్నంగా మారుతోంది. అనునిత్యం తలకు మించిన చదువులు…. గొంతు కోతల పోటీల మధ్య నేటి పండుగల ప్రత్యేకత మారిపోయింది. ఇప్పటికీ కొన్ని రాష్ట్రాలల్లో పతంగులను ఎగురవేసే పోటీలను నిర్వహించి యువ తను ప్రోత్సహిస్తున్నారు. కాని హైటెక్‌ నగరంలో అందరూ యమ బీజీగానే కాలాన్ని గడుపుతున్నారంటే అతిశయోక్తికాదు. నగర జీవనానికి అలవాటుపడి పండుగల సందర్భంగా కూడా సంస్కృతిని పూర్తిగా విస్మరిస్తున్నారు. గత పదే ళ్లలో పండుగలపై తగ్గిన మక్కువ మరో పదేళ్లలో సంస్కృతీ సాంప్రదాయాలకు కొత్త నిర్వచనాన్ని చాటే ప్రమాదం లేకపోలేదని సంప్రదాయవాదులు భావిస్తు న్నారు. ఇదే సమయంలో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఈ పండుగను విశేషంగా జరుపుకోవడం గమనార్హం.

ఆహ్మదాబాద్‌లో ‘కార్పొరేట్‌’ డిమాండ్‌
kite-festival1సంక్రాంతి పండుగ అహ్మదాబాద్‌లోని గాలిపటాల తయారీ దారులకు మరింత ఆనందాన్ని తెచ్చిపెడుతోంది.సాధార ణంగా ప్రతి ఏడాది ప్రజల కోసం వారు గాలిపటాలను తయారు చేస్తుంటారు. కానీ ఈ ఏడాది కార్పోరేట్‌ కంపెనీల కోసం ప్రత్యేకంగా గాలిపటాలను తయారుచేస్తుండడం విశేషం. పండుగ రోజున పతంగుల ద్వారా తమ కంపెనీల ప్రచారాన్ని విస్తృతంగా చేపట్టాలని వాటి యాజమాన్యం భావించడంతో గాలిపటాల తయారీదారులకు ఈ ఏడాది చేతినిండా పని దొరికింది.

సంక్రాంతి పండుగను అహ్మదాబాద్‌వాసులు ఎంతో ఘనం గా జరుపుకుంటారు. దేశంలోనే ప్రత్యేక శైలిలో ఇక్కడ ఈ పండుగను ఆనందోత్సాహాల మధ్య నిర్వహిస్తారు. ఈనెల 14వ తేదీన వారు ఉత్తరాయన్‌ పేరిట జరుపుకునే పండుగ రోజున గాలి పటాలను పెద్ద ఎత్తున ఎగురవేస్తారు. ఈ నేప థ్యంలో అహ్మదాబాద్‌ గాలిపటాల తయారీదారులకు ఈ ఏడాది చేతినిండా పని దొరికింది. పలు కంపెనీల గాలిపటా ల ద్వారా తమ ప్రచారాన్ని చేపట్టాలని భావించడమే ఇందు కు కారణం. ఈ కంపెనీల గాలి పటాల తయారీదారులకు సంక్రాంతి పండుగ కోసం పెద్ద ఎత్తున గాలిపటాల ఆర్డర్లని చ్చారు. దీంతో పతంగుల తయారీదారులు తమకిష్టమైన రేట్లను డిమాండ్‌ చేస్తుండడం విశేషం.

60 మిలియన్లకు పైగా విక్రయాలు…
దీపావళి తర్వాత మూడు నెలల కాలంలో అహ్మదాబాద్‌ లోని పాతబస్తీలో నివసించే గాలిపటాల తయారీదారులు పతంగుల ద్వారా పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తారు. ఇక సం క్రాంతి పండుగ రోజుల్లో అహ్మదాబాద్‌లో దాదాపు పది వేల మంది గాలిపటాలను తయారుచేస్తుంటారని ఇక్కడి జమ ల్‌పూర్‌లోని స్టార్‌ పతంగ్‌ యజమాని టి.ఎ.షేక్‌ అన్నారు. పండుగ సీజన్‌లో తాము 1.5 మిలియన్ల గాలిపటాలను త యారుచేస్తామని చెప్పారు. ఈ సీజన్‌ మూడు నెలల కా లంలో అహ్మదాబాద్‌లో 60మిలియన్లకు పైగా పతంగుల విక్రయాలు జరుగుతాయని ఆయన వివరించారు.

‘కార్పొ రేట్‌ కంపెనీలు ఈ ఏడాది గాలిపటాల ఆర్డర్లను ఆలస్యంగా ఇచ్చాయి. దీంతో మేము పగలు, రాత్రి పనిచేసి ఈ ఆర్డర్ల మేరకు గాలిపటాలను తయారుచేసి ఇవ్వాల్సి వస్తోంది. కొందరు తయారీదారులు డిమాండ్‌ మేరకు గాలిపటాలను తయారుచేసి ఇవ్వలేక ఆర్డర్లను కూడా తీసుకోవడం లేదు. ఈ ఏడాది కార్పొరేట్‌ కంపెనీల పుణ్యమా అని పతంగులకు పెద్ద ఎత్తున డిమాండ్‌ ఏర్పడింది. గత ఏడాదితో పోల్చుకుం టే ఈ ఏడాది 25 శాతం విక్రయాలు పెరగాయనీ ఇది కార్పొరేట్‌ కంపెనీల చలవే’ అని షేక్‌ అన్నారు.

నాలుగవ వంతు గాలిపటాలు కంపెనీల కోసం…
అహ్మదాబాద్‌కు చెందిన మరో గాలిపటాల తయారీదారు డు అయూబ్‌ భాయ్‌ మాట్లాడుతూ ‘ఈ ఏడాది అహ్మదా బాద్‌లో తయారవుతున్న గాలిపటాల్లో 25 శాతం కార్పొ రేట్‌ కంపెనీలు కొనుక్కుంటున్నాయి.డిమాండ్‌ పెరగడం తో కంపెనీల అవసరాలను తీర్చలేకపోతున్నాము. పని వాళ్లు కూడా దొరకడం లేదు. దీంతో ఉన్న వాళ్లతోనే పగ లు, రాత్రి కూడా చేయిస్తున్నాము. దీంతో పనివాళ్లకు మూ డురెట్లు డబ్బులు చెల్లించాల్సి వస్తోంది’ అని చెప్పారు. అహ్మదాబాద్‌ కృష్ణానగర్‌కు చెందిన గాలిపటాల తయారీ దారుడు అశోక్‌ గెహాని పలు బ్రాండెడ్‌ కంపెనీలకు గాలి పటాలను తయారు చేసి ఇస్తున్నారు. ఆయన ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌, వీడాల్‌ వంటి కంపెనీలకు పతంగులను సర ఫరా చేస్తున్నారు.

ఇక కొన్ని కంపెనీలు తమ కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీలో భాగంగా తమ కంపెనీ పేర్లు ముద్రించిన గాలిపటాలను తయారుచేసి ప్రజలకు ఉచి తంగా సైతం సరఫరా చేస్తుండడం విశేషం. ‘ప్రతి సంవత్స రం ఉత్తరాయణ్‌ పండుగను ఘనంగా జరుపుకుంటు న్నాము. కంపెనీ ఉద్యోగుల కోసం గాలిపటాలను కొనుగో లు చేస్తున్నాం. ఇక గాలిపటాల ద్వారా ప్రచారం సరేసరి. దీంతోపాటు గుజరాత్లోని పలు గ్రౌండ్స్‌ను అద్దెకు తీసు కొని కైట్‌ ఫ్లయింగ్‌ కాంపిటీషన్స్‌ను సైతం నిర్వహిస్తున్నా ము’ అని వొడాఫోన్‌ ప్రతినిధి ఒకరు తెలిపారు.

కనువిందుగా కైట్‌ ఫెస్టివల్‌…
kite-festivalదేశవిదేశాలకు చెందిన వారితో అహ్మదాబాద్‌లో 20వ ఇంటర్నే షనల్‌ కైట్‌ ఫెస్టివల్‌ ఎంతో అట్టహాసంగా జరుగుతోంది. ఈ ఏడాది ఫెస్టివల్‌లో మనదేశంతో పాటు 34 దేశాలకు చెందిన వారు పాల్గొని ఆకర్షణీయంగా తయారైన వెరైటీ గాలిపటాలను ఎగురవేస్తున్నారు. బ్రిటన్‌, జర్మనీ, లిథివేనియా, సింగపూర్‌, మలేషియా తదితర దేశాలకు చెందిన వారు పాల్గొని ఈ పండు గకు ప్రత్యేక శోభను తీసుకువచ్చారు. ఇక ఈ అంతర్జాతీయ గాలిపటాల పండుగను గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి ప్రారంభించారు.

విభిన్న ఆకృతుల్లో గాలిపటాలు…
ఇంటర్నేషనల్‌ కైట్‌ ఫెస్టివల్‌లో విభిన్న ఆకృతుల గాలిపటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. సింగపూర్‌ పెవిలియన్‌ నుంచి మహిళ ఆకృతిలో రూపుదిద్దుకున్న గాలిపటాన్ని ఎగుర వేయగా ఇది అందర్నీ మైమరపించింది. ఇక ఇండోనేషియా వారు గద్ద ఆకారంలోని భారీ గాలిపటాన్ని ఎగురవేయగా, లిథి వేనియావాసులు సృజనాత్మక డిజైన్లలో గాలిపటాలను రూపొం దించి అందర్నీ ఆకట్టుకున్నారు. వీటిలో డాల్ఫిన్‌, సీతాకోక చిలుకల గాలిపటాలు అందర్నీ ఆకట్టుకున్నాయి.

గొప్ప అనుభూతినిచ్చింది…
‘అహ్మదాబాద్‌లో జరుగుతున్న ఇంటర్నేషనల్‌ కైట్‌ ఫెస్టివల్‌లో మొదటిసారిగా పాల్గొంటున్నాను.దేశ,విదేశాలకు చెందిన వారు అధిక సంఖ్యలో ఈ పండుగలో పాల్గొంటున్నారు. వేలాది మంది మధ్య సందర్శకుల మధ్య గాలిపటాలను ఎగురవేయడం ఎంతో ఆనందాన్నిస్తోంది. ఈ ఫెస్టివల్‌లో పాల్గొనడం గొప్ప అనుభూతి’ అని లిథివేనియాకు చెం దిన గిడ్రే జాక్‌స్టెయిట్‌ పేర్కొన్నారు. ‘సందర్శకుల కేరింతలు, చప్పట్ల మధ్య గాలి పటాలను ఎగుర వేయ డం మరచిపోని అను భూతి. వచ్చే ఏడాది కూడా ఈ ఫెస్టివల్‌లో పాల్గొ నాలని కోరుకుంటున్నాను’ అని ఆమె చెప్పారు. బ్రిటన్‌కు చెందిన క్లెయిర్‌ జేన్‌ మాట్లాడుతూ ‘నాకు, నా భర్తకు గాలి పటాల ను ఎగుర వేయడం ఓహాబీ.

ఈ నేపథ్యంలోనే మేము అహ్మదాబా ద్‌ కైట్‌ ఫెస్టివల్‌కు హాజరయ్యాము. మొదటిసారిగా ఈ పండు గలో పాల్గొంటున్నాము. పండుగలో భాగంగా త్రీ-డైమెన్షనల్‌, బాక్స్‌ షేప్‌డ్‌ కైట్స్‌ను తయారుచేసి ఎగురవేశాము.మాకు ఈ ఫెస్టివల్‌లో పాల్గొనడమే ముఖ్యంకానీ కాంపిటీషన్‌లో గెలుపొం దాలనే లక్ష్యం మాకు లేదు’ అని పేర్కొన్నారు. ఇక ఈ ఫెస్టివల్‌లో 34 దేశాల నుంచి 105మంది, మన దేశం లోని వివిధ ప్రాంతాల నుంచి 120 మంది పాల్గొని గాలి పటా లను ఎగురవేస్తున్నారు. సబర్మతి నదీ తీరాన జరిగే ఈ ఫెస్టివల్‌ ఈనెల 14వ తేదీన గుజరాతీలు జరుపుకునే ఉత్తరాయణ్‌ పం డుగ రోజున మరింత ఆకర్షణీయంగా జరుగుతుంది. ‘అహ్మదా బాద్‌ జనాభా ఆరు మిలియన్లు. ఇక ఉత్తరాయణ్‌ రోజున దా దాపు నాలుగు మిలియన్ల గాలిపటాలు ఆకాశంలో ఎగురుతా యి. ఈ పండుగకు ప్రజల్లో ఎంత క్రేజ్‌ ఉందో ఇదే నిదర్శనం గా చెప్పుకోవచ్చు’ అని టూరిజమ్‌ అధికారి ఒకరు తెలిపారు.

– దుద్దాల రాజు,
నార్సింగి, మేజర్‌న్యూస్‌

Surya Telugu Daily

జనవరి 14, 2011 Posted by | సంస్కృతి | 2 వ్యాఖ్యలు

నాలుగు శాతాబ్దల ‘ప్రభల’ సంప్రదాయం

నాలుగు శాతాబ్దల ‘ప్రభల’ సంప్రదాయం

తెలుగు సంస్కృతీ సంప్రదాయాలు ఎంతో గొప్పవి. వీటికి దేశ, విదేశాల్లో మంచి పేరుంది. ముఖ్యంగా పండుగలు, పర్వదినాలలో తెలుగువారి ఆచార వ్యవహారాలు ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. మన పండుగల్లో సంక్రాంతి పండుగకు విశేష ప్రాధాన్యత ఉంది. తెలుగు సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించే ఈ పండుగను కోనసీమలో ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. పండుగ వేడుకల్లో భాగంగా నిర్వహించే ప్రభల ఉత్సవాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. కోనసీమ వ్యాప్తంగా మూడురోజులపాటు జరిగే సంక్రాంతి ఉత్సవాలను పురస్కరించుకొని ప్రభల తీర్థం ఎంతో అట్టహాసంగా, ఆర్భాటంగా జరుపుతారు.

amalapuram1దాదాపు నాలుగువందల ఏళ్లుగా కొనసాగుతున్న జగ్గన్నతోట ప్రభల తీర్థం, కొత్తపేటలో జరిగే ప్రభల తీర్థానికి రాష్టస్థ్రాయిలో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ తీర్థానికి తరలివచ్చే ప్రభలు ఎగువ కౌశికదాటి వస్తున్న తీరుచూసి భక్తులు గగుర్పాటుకు గురవుతారు.మకరసంక్రాంతి తర్వాత వచ్చే ఉత్తరాయణ కాలంలో ప్రభలను ఊరి పొలిమేరలు దాటిస్తే మంచిదని ప్రజల ప్రగాఢ విశ్వాసం.

కోనసీమ ప్రత్యేకత…
సంక్రాంతిని పురస్కరించుకొని ప్రభల తీర్థం నిర్వహించడం కోనసీమ ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ఇక్కడి సుమారు 82 చోట్ల ప్రభలతీర్థం ఘనంగా జరుగుతుంది. వీటిలో అంబాజీపేట మండలం మొసలపల్లి శివారు జగ్గన్నతోట, అంబాజీపేట, ఉప్పలగుప్తం, ముమ్మిడివరం, మామిడికుదురు, కొత్తపేటలలో జరిగే ప్రభల తీర్థాలు అతి పెద్దవిగా పేరొందాయి. కనుమపండుగ రోజున జరిగే జగ్గన్నతోట తీర్థానికి రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా 11 మంది ఏకాదశరుద్రులు తరలివస్తారు. జగ్గన్నతోటకు ఆనుకుని ఉన్న చుట్టుప్రక్కల గ్రామాలలో నెలకొన్న 11 శివాలయాలనుండి ఈశ్వరుని ఉత్సవ విగ్రహాలను ప్రభలపై జగ్గన్నతోటకు తీసుకువస్తారు.

మొసలపల్లి గ్రామానికి చెందిన భోగేశ్వరస్వామి ఆహ్వానం మేరకు ఇక్కడకు పరమశివులు వస్తారని, ఇలా వచ్చే పరమశివులు లోక కళ్యాణం గురించి చర్చలు జరుపుతారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ తీర్థానికి వ్యాఘ్రేశ్వరం, పుల్లేటికుర్రు, ముక్కామల, వక్కలంక, గంగలకుర్రు, గంగలకుర్రు అగ్రహారం, నేదునూరు, ఇరుసుమండ, కె.పెదపూడి, కముజువారిలంక గ్రామాలకు చెందిన ప్రభలు వస్తాయి. వీటిలో వ్యాఘ్రేశ్వరం ప్రభ నుండి వచ్చిన వ్యాఘ్రేశ్వరస్వామి అధ్యక్షత వహిస్తారు. అందుకే ఈ ప్రభ వచ్చేవరకు భక్తులు మొక్కుబడులు తీర్చకుండా వేచి ఉండడం తరతరాలుగా కొనసాగుతోంది. వ్యాఘ్రేశ్వరం నుండి వ్యాఘ్రేశ్వరం ప్రభ వచ్చినపుడు మిగిలిన ప్రభలను గౌరవ సూచకంగా ఒకసారి ఎత్తి దింపడం సంప్రదాయంగా కొనసాగుతోంది.

స్థల పురాణం…
amalapuramజగ్గన్నతోట ప్రభల తీర్థానికి విశేష ప్రాధాన్యత ఉంది. ఇక్కడ స్థలపురాణం ప్రకారం విఠలాజగ్గన్న అనే ఏకసంధ్యాగ్రహి ప్రక్కనే ఉన్న కౌశికలో స్నానం చేసి పూజాదికార్యక్రమాలు నిర్వహించేవాడని పెద్దలు చెబుతారు. అప్పటినుండే ఈ ప్రాంతానికి జగ్గన్నతోటగా పేరొచ్చింది. నాడు ఆయన చేసిన పూజల ఫలితంగానే ఇక్కడ ప్రభల తీర్థం జరుగుతుందని స్థానికుల నమ్మకం. అంతేగాక 11 గ్రామాలకు ఈ తోట పొలిమేర కావడం మరో విశేషం. ఈ కారణంచేతే ఉత్తరాయణ కాలంలో ఇక్కడకు 11 గ్రామాలనుండి ప్రభలను తీసుకువచ్చి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం మరో కారణంగా చెబుతారు.

సుబ్బరాజు తోటలో…
మొసలపల్లి గ్రామానికి చెందిన దంతులూరి సుబ్బరాజు అనే రైతుకు తాతలనాటినుండి సంక్రమిస్తున్న ఏడెకరాల కొబ్బరితోటలో ప్రభల తీర్థాన్ని కొనసాగించడం ఆచారంగా కొనసాగుతుంది. అంతేగాక సంప్రదాయంగా ఒకే కుటుంబానికి చెందినవారు ప్రభలను తయారు చేస్తుంటారు. తాటిశూలం, టేకుచెక్క, వెదురుబొంగులతో తయారుచేసి రంగురంగుల వస్త్రాలతో, నెమలి పింఛాలతో అలంకరిస్తారు. దేవాలయాలలో ఉండే పసిడి కుండలను, వరికంకులను ప్రభలపై ఉంచి జేగంటలుగా వ్రేలాడదీస్తారు. వివిధ గ్రామాలనుండి ప్రభలను ఊరేగింపుగా తీసుకువచ్చేటపుడు పంట చేల మధ్యగా, కొబ్బరితోటల మధ్యగా వ్యయప్రయాసల కోర్చి తీసుకువస్తారు.

ఇలా తీసుకువచ్చేటపుడు పంటచేలను తొక్కుతూ ఊరేగింపుగా ప్రభలను తీసుకురావడం శుభసూచకంగా భావిస్తారు. దారిలో గోతులు, గొప్పులు, ముళ్లకంచెలను దాటుకుంటూ సుమారు పదిహేను అడుగులు క్రిందకు ఉండే ఆరడుగుల నీటిలో నడుస్తూ నేర్పుగా ప్రభలను తీసుకుని రావడం మరో ప్రత్యేకత.ఎడ్లబండిపై కొబ్బరిచాపలను గూడుగా ఏర్పాటుచేసి కుటుంబసమేతంగా ఈ తీర్థానికి రావడం నేటికీ కొనసాగుతోంది.పచ్చని పంటపొలాల మధ్య గూడుబళ్లు ఒకదానివెనుక ఒకటిగా తీర్థానికి వచ్చే తీరు కన్నులపండుగగా ఉంటుంది.

రాష్ట్రం నలుమూలల నుంచి…
amalapuram3ముఖ్యంగా కోనసీమకు చెందిన వారు ఉద్యోగ, వ్యాపారాల నిమిత్తం, దూరప్రాంతాలకు వెళ్లినవారు సంక్రాంతికి నిర్వహించే ఈ తీర్థాలకు తప్పనిసరిగా తరలిరావడం విశేషం. కోనసీమలో నిర్వహించే ప్రభల తీర్థాలన్నీ కనుమపండుగ రోజున నిర్వహిస్తుండగా కొత్తపేటలో మాత్రం సంక్రాంతి రోజున నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.ఇక్కడ ప్రభల తీర్థాన్ని చూడడం కోసం రాష్ట్రం నలుమూలలనుండి జనం తరలివస్తారు. ఇక్కడ పూర్వ కాలంనుండి కొత్తరామాలయం, పాతరామాలయం వీధుల పేరుతో గోడిపాలెంవీధి ప్రభలు పాల్గొని ప్రభుత్వ కళాశాల ఆవరణకు చేరుకున్న అనంతరం ఒకరి తర్వాత ఒకరు పోటాపోటీగా మిరుమిట్లుగొలిపే బాణాసంచాలు కాల్చి గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేస్తారు. ఈ సంబరం దీపావళిని తలపిస్తుంది. పైగా బహుమతులు ఉండడంతో స్థానికులు ఎంతో ఉత్సాహంతో పాల్గొంటారు.

కనువిందుచేసే సాంస్కృతిక కార్యక్రమాలు…
amalapuram2మధ్యాహ్నం ప్రభల తీర్థాలు ముగిసిన అనంతరం రాత్రి 9 గంటలనుండి అసలు సంబరాలు ప్రారంభమవుతాయి. వింతవింత విద్యుత్‌కాంతుల దీపాలమధ్య తీసుకువచ్చే ప్రభలు వివిధ నృత్యమేళాలు, సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహిస్తూ మిరుమిట్లు గొలిపే బాణాసంచా కాల్చుతూ ఊరేగింపును జరుపుతారు.అర్థరాత్రి ఒంటి గంట సమయానికి పాత బస్టాండ్‌ సెంటర్‌ చేరుకోగానే ఒకరికి ఒకరు పోటాపోటీగా బాణాసంచా కాల్పులను ప్రారంభించి తెల్లవారుజాము 5 గంటలవరకు కొనసాగిస్తారు. సంక్రాంతి చివరిరోజైన కనుమపండుగను పురష్కరించుకుని రైతులు తమ వ్యవసాయ పనిముట్లు శుభ్రపరుచుకుని బళ్లను, ఎద్దులను ప్రత్యేకంగా అలంకరించి వీధులలో ఊరేగిస్తారు. ఈరోజున చిన్నాపెద్దా తేడాలేకుండా మొక్కుబడులు తీర్చుకుని ఉత్సాహంగా ఉల్లాసంగా గడుపుతారు.

చెయ్యేరు ప్రభల తీర్థం…
కోనసీమలో జగ్గన్నతోట, కొత్తపేట తీర్థాల తర్వాత చెయ్యేరు ప్రభలతీర్థం మూడవస్థానం ఆక్రమిస్తుంది. ఈ తీర్థం మూడు శతాబ్థాల క్రిందట దంతులూరివారి కుటుంబం ప్రారంభించింది. అప్పటినుండి ఈ కుటుంబాల వారి చేతుల్లోనే ప్రభలతీర్థం కొనసాగడం ఆచారంగా వస్తోంది. ఈ గ్రామప్రభ కదలందే మిగిలిన గ్రామాల ప్రభలు కదలవు. ఈ ప్రభల ఉత్సవాలలో శాంతిభద్రతల పర్యవేక్షణ పోలీసులకు పెనుసవాల్‌గా మారుతోంది.క్షణకాలం తీరికలేకుండా గడుపుతున్న ఈ ఆధునిక కాలంలో తాతలనాటి ఆచారాలపేరుతో సంక్రాంతి పర్వదినాలలో కుటుంబసభ్యులంతా ఒక్కటిగా చేరి ఆనందోత్సహాలతో కాలం గడుపుతారు. పాత సంప్రదాయాలను ప్రక్కనబెట్టే నేటికాలంలో తరతరాలుగా కొనసాగుతున్న సంప్రదాయాలుగా ప్రభల ఉత్సవాలకు కోనసీమలో ప్రాధాన్యత కొనసాగుతుండడం విశేషం.

– రామకృష్ణ, మేజర్‌న్యూస్‌, అమలాపురం.

Surya Telugu Daily

జనవరి 14, 2011 Posted by | సంస్కృతి | 1 వ్యాఖ్య

వేలల్లో పాట… ఎద్దుల పందేలాట…!

వేలల్లో పాట… ఎద్దుల పందేలాట…!
సంక్రాంతి పండుగ తెలుగునాట అత్యంత ప్రాధన్యత కలిగినది. తెలుగువారి జనజీవన స్రవంతిలో ఒక భాగమైన అందరికీ ఇష్టమైన సంబరాల పండుగ ఇది. ఈ పండుగలో రెైతు లోగిళ్లు కళకళలాడుతూ…సిరిసంపదలతో తులతూగుతూ ఉంటాయి. ఇక పండుగలో ముఖ్య ఘట్టం ఎడ్ల పందేలు.పందెం ఎడ్లు రంకెలు వేస్తూ సంక్రాంతి శోభను మరింత ద్విగుణీకృతం చేస్తాయి. పండుగ ఉత్సాహాన్ని రెట్టింపు చేసేందుకు ఎడ్లు సంక్రాంతి బరిలో నిలిచి ప్రజలను అలరిస్తాయి. పందెం రాయళ్ల జోరుకు మరింత ఉల్లాసాన్ని కలగలిపి పల్లెసీమల్లో పందేల హోరును రేకెత్తిస్తాయి. కోస్తాంధ్రల్లోని వివిధ పల్లెలు ఎడ్ల పందేలతో సందడిగా మారుతాయి.

pandemపాడిపంటలు, పశువులతో తులతూగే పల్లెలు సంక్రాంతి సం దర్భంగా సరికొత్త శోభను సంతరించుకున్నాయి. ఈ పం డుగలో ప్రత్యేకత ఎడ్ల పందేలు. సంక్రాంతి వస్తుందంటే పందేల కోసం ప్రత్యేక ఆహారాన్నిచ్చి ఎద్దులకు శిక్షణనిస్తారు. బరిలో దింపేందుకు పందెం రాయుళ్లు కొన్ని నెలల ముందుగానే వాటికి కావాల్సిన అన్నింటిని సమకూర్చి పందెంలో నెగ్గడమే ధ్యే యంగా వాటిని జాగ్రత్తగా చూసుకుంటారు.

ఒంగోలు జాతి ఎద్దులు…
కోస్తాంధ్రలోని పల్లెల్లో ఎక్కువగా ఒంగోలు జాతి పశువులను సంక్రాంతి పందేల కోసం శిక్షణనిచ్చి సిద్ధం చేస్తారు. సంక్రాంతి సంబరాల్లో పశు బలప్రదర్శనలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. మన సంస్కృతి, సంప్రదాయాలకు అద్దంపట్టే ఈ పోటీలను పల్లెసీమల్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తారు.బండలాగుడుతో పాటు ఎద్దులకు అందాల పోటీలు కూడా నిర్వహిస్తుండడం విశేషం. ఈ పోటీల్లో ఒంగోలు జాతి ప శువులు ప్రత్యేక ఆకర్షణగా ఉంటా యి. పూర్వంకాలం నుంచే ఈ పోటీలు నిర్వ హిస్తున్న నేపథ్యంలో ఆనాటి సంస్కృతికి అద్దంపట్టే ఈ పందేలు పల్లెల్లో నేటికీ కొనసాగుతున్నాయి.ఇప్పటికీ గ్రామాల్లో ఎడ్లతో బలప్రదర్శనలు, వివిధ రకాల పందేలు, పోటీలను నిర్వహిస్తూ తెలుగువారు సంక్రాంతి పండుగను ఆనందోత్సాహాలతో జరుపు కుంటారు.

గెలుపే ప్రధానం…
pandem123సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని గెలుపే ప్రధానంగా పందెపు ఎడ్లను సిద్ధం చేస్తారు. సంక్రాంతికి ముందు నుంచే పందెంరాయుళ్లు వాటికి శిక్షణనిచ్చి పోటీల్లో ప్రవేశపెడతారు. బండలాగుడు, నీటిలో ఈత, అందాల ప్రదర్శన వంటి పోటీల్లో ప్రవేశపెట్టేందుకు పశువులకు శిక్షణనివ్వడానికి లక్షల్లో ఖర్చు చేస్తుండడం విశేషం. రాష్ట్రంలో ఏ మూల పోటీలు జరిగినా ఎడ్లతో అక్క డకు చేరుకుని పోటీల్లో ప్రవేశపెడతారు.సంక్రాంతి రెండు, మూడు నెల ల్లో వస్తుందన్న తరుణంలోనే పశువు లకు బలవర్ధకమైన ఆహారమైన ఉలవలు, కోడిగుడ్డు, జొన్నలు వంటి వాటిని అందించి పందేల కోసం వాటిని సిద్ధంచేస్తారు.

పందెంరాయుళ్ల జోరు…
ఎడ్ల పందేల సందర్భంగా పందెంరాయుళ్ల జోరుకు హద్దు ఉండదు. ఎడ్ల పందాలకు లక్షలు వెచ్చించి గెలుపు కోసం వారుపడే తపన అంతా ఇంతా కాదు. తమ ఎడ్లకే బహుమతి లభించాలని వాటికి కఠోర శిక్షణనిస్తారు. ఎడ్లపెై పందేలు రూ.50 వేల నుంచి మొదలెై లక్షలు దాటుతాయంటే అతిశయోక్తి కాదు.మంత్రుల నుంచి పలు వురు ప్రముఖుల వరకూ అందరూ ఎడ్ల పందేల్లో పాల్గొనడానికి ఉ త్సాహం చూపిస్తారు. అయితే వీటిపెైనే ఆధారపడి జీవించేవారు కూడా ఉన్నారు. సంక్రాంతి కోసం వీటికి శిక్షణనివ్వడానికి ఎంతో వెచ్చించి పందెంలో గెలుపు కోసం పోటీపడుతుంటారు. ఒక్క కోస్తాలోనే కొన్ని కోట్ల రూపాయల మేర పం దేలు నిర్వహిస్తారంటే ఎడ్ల పందేలకు ఉన్న ప్రాముఖ్యత ఎంతో అవగతమవుతోంది.

చూసేవారికి పండుగే…
velamతెలుగుదనాన్ని ప్రతిబింబించే సంక్రాంతి పండుగ సందర్భంగా పల్లె సీమలు కళకళలా డతాయి. పల్లెసీమల్లో ప్రతి ఇంటి ముందు రంగురంగుల రంగవల్లులు, గొబ్బెమ్మలు, భోగి మంటలు, కొత్త అల్లుళ్ల రాకతో పండుగ శోభ మరింత పెరుగుతోంది. పండుగ వేడుకల్లో భాగంగా నిర్వహించే ఎడ్ల పందేలు ఆయా పల్లెల్లో జోరుగా సాగుతుంటాయి. ఇక ఈ ఎడ్ల పందేలను చూసేందుకు ప్రజలు తండోపతండాలుగా తరలివస్తారు. పందేల ను చూస్తూ ఆనందోత్సాహాల్లో మునిగితేలుతూ పండుగను ఘనంగా జరుపుకుంటారు.

ప్రతిష్టాత్మకంగా రంగంపేట పోటీలు…
చిత్తూరు జిల్లాలోని రంగం పేట ఎద్దుల పోటీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతాయి. ఈ పోటీలకు ప్రతిఏటా ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఓ వెైపు వేలల్లో పాట .. ఎద్దుల పందేలాట అనే నానుడి ఇక్కడే ఆవిర్భవించిందేమో అన్నట్లు ఇక్కడ జరిగే పోటీలు కనువిందు చే స్తాయి. ప్రాణాలను సైతం పణంగా పెట్టి యువకులు .. కొత్త అల్లుళ్లు సైతం ఎద్దుల మెడలు ఒంచేందుకు ఉరకులు,పరుగులు పెట్టి ముందుకు దూకుతుంటారు. సంక్రాంతి సంబరాల్లో కనుమ పండుగ రోజు జరిగే ఈ ఎద్దుల పోటీలకు జిల్లానుంచే కాకుండా రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి లక్షల సంఖ్యలో సందర్శకులు హాజరు అవుతారు.

కనుమ పండుగ నాడు ఉదయం నుంచే అడవుల్లో మేతకు వెళ్లిన పశువులను తీసుకువచ్చి గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక దొడ్లలో ఉంచుతారు. తెల్లవారు జా మున లేచి రెైతులు ఎద్దులకు కొత్తగా తయారు చేసిన పలకలు, కొమ్ములకు కట్టి ఎంతో ఆకర్షణీయంగా అలంకరి స్తారు. అందరి ఎద్దులను సిద్ధం చేసిన తరువాత ప్రధాన వీధిలో వాటిని వదలుతారు. యువకులు కేరింతలు కొడుతూ ఎద్దులను పట్టుకోడానికి పో టీలు పడతారు. క్షణ క్షణం… ఉత్కంఠ భరితంగా సాగే ఈ ఎద్దుల పోటీలు ఏ నిమిషంలో ఎవ రి ప్రాణాలు హరిస్తాయో కూడా తెలియని విధంగా జరగడం రంగం పేట ఎద్దుల పోటీల విశిష్టత.

-మార్కండేయులు, కృష్ణ
మేజర్‌ న్యూస్‌, తెనాలి, తిరుపతి బ్యూరో

Surya Telugu Daily

జనవరి 14, 2011 Posted by | సంస్కృతి | వ్యాఖ్యానించండి

శుభాకాంక్షలు…

ఆత్మీయులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు…

ఈ సంక్రాంతి మీ జీవితాలలో రంగవల్లికలు అద్దాలని సుఖము,శాంతి,శుభాలను చేకూర్చాలని ఆశిస్తూ…

సనారాజు.

జనవరి 14, 2011 Posted by | (స్నే)హితులు | 1 వ్యాఖ్య

కోట్ల రూపాయల కోడి పందేలు..

కోట్ల రూపాయల కోడి పందేలు..

కోడి పందేలు…రాజుల కాలం నుంచి నేటి వరకు ప్రజలను అలరిస్తున్న ఓ వింత క్రీడ. నాటి కాలంలో కోడి పందేల మూలంగా వివిధ రాజ్యాల మధ్య పెద్ద యుద్దాలే జరిగాయి. ఈ యుద్ధాలలో అధిక సంఖ్యలో ప్రజలు హతమయ్యారు. ముఖ్యంగా పల్నాడు వంటి ప్రాంతాల్లో నాటి నుంచి నేటివరకు ఈ పందేలకు ప్రజల్లో విపరీతమైన జ్‌ ఉంది. కాలం మారినా ప్రజల్లో కోడి పందేల పట్ల ఉన్న క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదు.ఈ పందేలపై కోట్లాది రూపాయల బెట్టింగ్‌లు జరుగడం నేటి ట్రెండ్‌. సంక్రాంతి పండుగ రోజున ఈ బెట్టింగ్‌లు జోరుగా సాగుతుంటాయి.ఆధునికులకు అర్థం కావాలంటే ఈ బెట్టింగ్‌లు క్రికెట్‌ బెట్టింగ్‌ల లాంటి వన్నమాట.

pandem1సంక్రాంతి పండుగకు తూర్పు గోదావరి జిల్లాలో ఎంతో ప్రత్యేకత ఉంది. ఇతర ప్రాంతాల్లో మాదిరిగా ఇక్కడ సంక్రాంతి వేడుకలను నిర్వహిం చడంతో పాటు ప్రత్యేకంగా కోడి పందేలను నిర్వహిస్తారు. పండుగ సందర్భంగా కోడి పందేలను జోరుగా నిర్వహించడం ఇక్కడి ప్రత్యేకత.జిల్లాలో కోడి పందేలు ఆట వినోదంగా మారింది.ఎన్నో ఏళ్లు నుండి పోలీసులు ఈ రాక్షస క్రీడను అరిడతామని బీరాలు పలికినా రాజకీయ పలుకుబడితో కోడి పందేలు కొనసాగుతుండడంతో పోలీసులు తోక ముడుస్తున్నారు. ప్రతి ఏడాది కోడి పందేల మీద బెట్టింగ్‌లను అరికడతామని పోలీసు ఉన్నతాధికారులు ప్రకటనలు చేస్తున్నారే తప్ప వాస్తవంగా ఎటువంటి చర్యలు తీసుకుంటున్న దాఖలాలు మాత్రం లేవు. ఫలితంగా సామాన్య ప్రజలు సైతం ఈ పందేలపై వేలాదిరూపాయలను పెడుతున్నారు. ఫలితంగా సంక్రాంతి పండుగ రోజుల్లో కోట్లాది రూపాయల డబ్బులు చేతులు మారుతున్నాయి. ఇంత జరుగుతున్నా పోలీసులు మాత్రం ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు.

కోడి పందేల చాటున జూదం…
తూర్పు గోదావరి జిల్లాలో సంక్రాంతి పండుగ మూడు రోజులు కోడి పందేలు జాతర రసవత్తరంగా సాగుతుంది. కోడిపందేలు మాటున గుండాట, పేకాట, ‘లోపల బయట’ అనే జూదం యదేచ్ఛగా సాగుతాయి. కోడిపందేల చాటున గుట్టు చప్పుడు కాకుండా జరిగే ఈ జూద కార్యక్రమాలు కొందరికి రెండు,మూడు రోజుల్లోనే లక్షలాది రూపాయలను ఆర్జించి పెడుతున్నాయి. ఈ సంక్రాంతికి కూడా కోడి పందాలు నిర్వహించేందుకు ఇప్పటికే పుంజులను సిద్ధం చేశారు. ఒక్కొక్క పుంజు రూ. 10వేలు నుండి 25వేలు వరకు కొనుగోలు చేస్తున్నారు. డెల్టాలో సంక్రాంతికి ప్రత్యేకంగా కోడిపుంజులను మేపుతారు.

pandem2ఈ మూడు రోజులు యువత నుండి వృద్ధుల వరకు పందేలను చూసేందుకు ఎగబడతారు. ఈ పందేలలో డబ్బులు గెలిచిన వారు సంక్రాంతి జోష్‌గా వేడుకలు చేసుకుంటే ఓడినవారు అప్పు చేసి మద్యం త్రాగి ఇంట్లో జోగుతారు. గుంటూరు నుండి కోడిపందేలు ఇప్పటికే భీమవరం పరిసర ప్రాంతాలకు చేరుకున్నాయి.పౌరుషానికి పెట్టింది పేరైన పల్నాటి కోడి పందేలకు మంచి గిరాకి ఉంది. ప్రజలు ఎంతో ఆసక్తిగా ఈ పందేలను తిలకిస్తుంటారు. పండుగ రోజుల్లో కోడి పందేలను తిలకించేందుకు వేలాది మంది ప్రజలు రాష్ట్రం నలుమూలల నుంచి ఇక్కడికి విచ్చేస్తుంటారు. ఇక పందేల కోసం కోడి పెట్టతో క్రాసింగ్‌ చేయించి పుంజులను ప్రత్యేకంగా ఉత్పత్తి చేశారు.

కోట్లల్లో పందేలు…
డెల్టాలో ప్రతి గ్రామంలో కోడి పందేలకు ఒక ప్రత్యేకమైన బరిని ఏర్పాటు చేస్తారు. సంక్రాంతి మూడురోజుల్లో ఈ బరికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది. నేలను చదునుచేసి, చుట్టు తాళ్ళాతో ప్రహారీని ఏర్పాటు చేస్తారు. ముందుగా బరికి నైవేధ్యంగా నల్లకోడిని బలిస్తారు. గ్రామంలో రూ.25వేలు నుండి లక్ష వరకు పందేలు సాగుతాయి. ఆకివీడు మండలం ఐ భీమవరం, ప్రకృతి ఆశ్రమం దగ్గరలోని తోటలో, చించినాడ సమీపంలో, జువ్వలపాలెం, తదతర ప్రత్యేక బరులల్లో కోట్లాది రూపాయాల పందాలు జరుగుతాయి.పందాల నిర్వహణకు ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి పందేలను తిలకించేందుకు వచ్చే వారి కోసం అవసరమైన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. పండుగ రోజుల్లో విందువినోదాల్లో మునిగితేలేందుకు అవసరమైన సౌకర్యాలను ఇక్కడ కల్పిస్తున్నారు.

పందెం కోడికి ప్రత్యేకాహారం…
బరిలో దిగే పందెం కోడికి ప్రత్యేకాహారాన్ని అందిస్తారు. గుడ్లు, గంట్లు,చోళ్ళు, కైమా, బాదం పిక్కలు, తొండమాంసం వేస్తారు. దీంతో పందెం కోడి బలంగా తయారవుతుంది. వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు వ్యాక్సిన్‌, ఇతర మందులు కూడా వాడతారు. పందెంలో కోడికి గాయమైతే రక్తం వెంటనే బయటకు రాకుండా ఈ ఆహారాన్ని వాడతారు. పందెం కోడికి ప్రత్యేకమైన శిక్షణ కూడా శిక్షణ కూడా ఇస్తారు. ఇక పందేలలో కోళ్లకు కత్తులు కట్టి వాటిని పోట్లాటకు దించుతారు. కత్తులు గాయాలతో రక్తాలు కారుతున్నా అవి ఏమాత్రం వెనుకంజ వేయకుండా పోరాడడం సందర్శకులను చూపుతిప్పుకోకుండా చేస్తుంది. ఈ విధంగా పందెం కోళ్లకు శిక్షణనిస్తారు. చివరికి ఈ పందేలలో కొన్ని కోళ్లు కూడా మృతిచెందుతాయి.ప్రజలకు వినోదాన్ని పంచి చివరికి తమ జీవితాలను ముగిస్తాయి.

కొన్ని జీవితాలకు ఆధారం…
pandemకోడి పందాలను ఆధారంగా చేసుకుని కొన్ని కుటుంబాలు జీవిస్తున్నాయి. ఈ కుటుంబాల్లో ఉన్న పెద్దలు కుక్కుట శాస్త్రాన్ని ఎక్కువగా చదువుతారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇదే వృత్తిని ఎంచుకుని కోడి పుంజులను పెంచుతారు. మాములు రోజుల్లో పుంజు ధరరూ.3వేలు నుండి 10వేలుకు అమ్ముతారు. ఇవే పుంజుల ధరలు సంక్రాంతి సీజన్‌లో ఆకాశానికి తాకుతాయి. పందెం కోడికి కత్తి కట్టేవారు ఈ పందేళ్ళపైన ఆధారపడి జీవిస్తారు.

పుంజుల్లో రకాలు…
కోడి పుంజుల్లో అనేక రకాల జాతులన్నాయి. అయితే ప్రధానంగా 17రకాల జాతులను మేలు జాతులుగా పందెం కోళ్లుగా పరిగణిస్తారు. డేగా, నెమలి, నల్ల నెమలి, కేతువ, నేతువ, పర్ల, పెట్టమారు, మైలా, రసంగి, కోక్కిరాయి. కాకి, పచ్చకాకి, తెల్లపర్ల, కౌజు, సరళ ఇటువంటి రకాలను మేలైన జాతి పుంజులుగా పరిగణించి పెంచుతారు. ఈ పందెం కోళ్ళల్లో నెమలి,కాకి, డేగ జాతులే నెంబర్‌ వన్‌ కోళ్ళుగా పెర్కొంటారు.

బారుతీరుతున్న జనం…
సంక్రాంతి పండుగ మూడు రోజుల్లో ఇంటి అల్లుళ్ళులతో పాటు బంధువులు సైతం కోడి పందేలను చూసేందుకు వెళ్తారు. సుదూర ప్రాంతాల నుండి పందేలను చూడాడానికి తరలి వస్తారు. హైదరాబాద్‌, విశాఖ నగరాతో పాటు ఇతర రాష్ట్రాల నుండి ప్రముఖులు పందాలు కోసం ప్రత్యేకగా వస్తారు. ఇతర ప్రాంతాల్లో ఉద్యోగం, వ్యాపారరంగాల్లో స్థిరపడిన జిల్లావాసులు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రత్యేకంగా కోడి పందేలను చూడడానికి రావడం గమనార్హం. భీమవరం ప్రకృతి ఆశ్రమం దగ్గరలో ఉన్న బరిలో జరిగే కోడి పందేలకు సినీతారలను ప్రత్యేక ఆకర్షణగా తీసుకు వస్తారు.

-కె.శ్రీనివాస్‌, మేజర్‌న్యూస్‌, భీమవరం

Surya Telugu Daily

జనవరి 12, 2011 Posted by | సంస్కృతి | 1 వ్యాఖ్య

ముంగిళ్ల మెరిసే రంగుల సందేశాలు…

ముంగిళ్ల మెరిసే రంగుల సందేశాలు…

రోజూ వేసే రంగు రంగుల ముగ్గులను చూస్తేనే తెలుస్తుంది… ఇది ధనుర్మాసమని, వచ్చేది సంక్రాంతి పండుగని… ఈ పండుకు నెల రోజుల ముందు నుండే సందడి మొదలవుతుంది. మాసం మొత్తం పండుగ వాతావరణాన్ని తలపింపజేస్తుంది. ప్రతీ గడపా రంగు రంగుల ముగ్గులతో ముస్తాబవుతుంది. భారతీయ సంప్రదాయంగా ఎన్నో వందల ఏళ్లుగా కొనసాగుతూ వస్తున్న ముగ్గుల సంప్రదాయం కేవలం అలంకరణ కోసమే కాదు.. ఆరోగ్యం… అందం.. ఆనందం కోసం కూడా.. అటువంటి ఈ ముగ్గుల కథేంటో తెలుసుకుందాం..

rangoli1సంక్రాంతి పండుగ అంటేనే మిగిలిన వాటికి ఎంతో ప్రత్యే కమైంది. పల్లెటూళ్లలో ధాన్యం ఇళ్లకు చేరే సమయం.. అన్ని గడపలూ ఆనందంతో నిండిపోతాయి..పైగా సూర్యుడు ధనురాశిలోకి ప్రవేశించే పవిత్రమైన ధనుర్మాసం.. మిగిలిన పండుగలన్నీ చాంద్రమానాన్ని అనుసరించి చేసుకున్నా ఈ పండుగకు మాత్రం సౌరమానాన్ని అనుసరిస్తారు. అందుకే ఈ పండుగకు ఎంతో ప్రత్యేకత వుంటుంది.

రంగోలి…
రంగోలి అనేది ఉత్తర భారతదేశంలో ముగ్గుకు మరో పేరు. ముగ్గు, రంగవళ్లి అనేది మన తెలుగు భాషలోని పేరు. బెంగాలీ లో అల్పానా, తమిళ్‌లో కోలమ్‌, అని ఎలా పిలిస్తారు. పేరు ఏదై నా వ్యక్తీకరణ సృజనాత్మకమే.

గ్రామీణ ప్రాంతాల్లో…
గతంలో గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లను ఎర్రమన్నుతో కట్టుకునే వారు. అలా కట్టుకున్న ఇంటికి మట్టిపేడను కలిపి అలికేవారు. దీని వల్ల దుమ్ముధూళి వంటివి ఇంట్లోకి రాకుండా అణగి పోయే వి. పురుగులు వంటివి రాకుండా బియ్యపు పిండితో ముగ్గులు పెట్టేవారు. వీటి వల్ల అవి ఆ బియ్యం పిండిని ఆహారంగా తీసుకు ని ఇంట్లోకి రాకుండా పోయేవట.

దక్షిణ భారతదేశంలో..
rangoli3దక్షిణ భారతదేశంలోని పల్లెటూళ్లలో ఇప్పటికీ పేడ నీటిని చల్లి బియ్యపు పిండితో ముగ్గులు పెట్టుకునేవారున్నారు. ఇప్పుడు చాలావరకు బియ్యపు పిండికి బదులు ముగ్గురాళ్ల పొడి దొరుకుతుంది. దీని ద్వారా వేసు కుంటున్నారు.

స్వాగత అలంకారం…
ధనుర్మాసం విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైనది. ఈ మాసంలో విష్ణుమూర్తి భూమి మీదకు వస్తా రని నమ్ముతారు. ఈ మాసంలోనే స్వర్గపు ద్వారాలు కూడా తెరు చుకుంటాయనేది మన పెద్దల నమ్మకం.అందుకే మహిళలంతా ఉదయాన్నే తొందరగా లేచి ఇంటి ముందు శుభ్రం చేస్తారు. పేడను నీటిలో కలిపి చల్లుతారు. ఇంటి ముందు అందమైన రంగ వల్లులను తీర్చిదిద్దుతారు. ఈ ముగ్గులను వేసుకునేప్పుడు విష్ణునామస్మరణ చేస్తూ పూర్తి చేస్తారు.

ముగ్గులలో గొబ్బిళ్లు…
ఈ నెల మొత్తం ఆవు పేడను ముద్దలుగా చేసి ముగ్గుల మధ్యలో పెడతారు. వీటిని గొబ్బెమ్మలు అంటారు. ఇది గౌరీమాతను పూజించడంలో ఓ భాగంగా వస్తోంది. ఈ గొబ్బెమ్మళ్లను పసుపు కుంకుమలతో అలంకరించి మధ్యలో గుమ్మడి లేదా బంతి పూల ను పెడతారు. పెద్దదాన్ని ముగ్గు మధ్యలో పెట్టి చిన్న చిన్న వాటిని వాటి చుట్టూ పెడతారు.

కోరికలు తీర్చమంటూ…
చిన్న చిన్న పిల్లలు, ెపెళ్ళికాని యువతులు మంచి భర్త రావాలని ఈ ముగ్గుల చుట్టూ పాటలు పాడుతూ గొబ్బి తడతారు. పెళ్లైన మహిళలు తమ దాంపత్య జీవితం బాగా గడవాలని కోరుతూ ఈ వేడుకను చేసుకుంటారు.

వేడుకల అనంతరం..
rangoliరోజూ ముగ్గులలో పెట్టే గొబ్బిళ్లను తీసి ఎండలో ఎండబెడతారు.వీటిని పండుగ రోజు సూర్యభగవానుడికి నైవేద్యంగా పెట్టే తీపి అన్నం(పాయసం)వండేందుకు పిడకలుగా వుపయోగిస్తారు. ఇప్పటికీ పల్లెటూళ్లలో వీటినే వంట చేసుకునేందుకు వుపయోగి స్తారు. ఇవి ప్రకృతికి ఎంతో మేలు చేస్తాయి కూడా.

రెండు రకాలు..
ఈ ముగ్గులలోనూ రెండు రకాలు వున్నాయి.. అవి ఒకటి చుక్క లు పెట్టి వేసేవి. మరొకటి డిజైన్స్‌..వీటికి ఏ చుక్కలూ అవసరం లేదు. సృజనాత్మకంగా తమ మనసులోని రూపాలను వేయడం అన్నమాట. ఏది ఏమైనా వీటిలో ప్రకృతికి ఎంతో ప్రాధాన్యత. పువ్వులు, కుందేళ్లు, చిలుకలు, చెరుకుగడలు, ఇళ్లు, లక్ష్మీదేవి వంటి వాటికే ప్రాధాన్యత ఎక్కువ.

పోటీలు…
ఈ మాసంలో మహిళలు పోటీ పడి మరీ ముగ్గులను వేస్తారు. అనేక చోట్ల పోటీలను కూడా నిర్వహిస్తారు.మ్యాగజీన్స్‌, న్యూస్‌ పేపర్స్‌, ఇతర సంస్థలు పోటీలను నిర్వహించి బహుమతులను కూడా అందజేస్తారు.

ఆరోగ్యం…
ముగ్గు వేయడం కేవలం సంప్రదాయం మాత్రమే కాదు.. ఆరోగ్యానికి ఓ వరం కూడా. ఉదయాన్నే లేవడం… నీటిని తెచ్చి అందులో పేడ కలపడం… చల్లడం.. వంగి ముగ్గులు పెట్టడం ఇదంతా శరీరానికి చక్కటి వ్యాయామాన్ని ఇస్తుంది. ఇది చేతి వేళ్లు మొదలు పాదం వరకు అన్నిటిలో ఉత్తేజాన్ని కలిగిస్తుంది. ఉదయాన్నే లేవడం వల్ల రోజు మొత్తం ఆహ్లాదంగా వుంటుంది. అధిక బరువు, అనవసర కొవ్వు వంటివి శరీరంలో చేరకుండా కాపాడుతుంది. పైగా పేడలోని ఔషధ గుణాలు ఎన్నో రకాల క్రిములను నాశనం చేస్తాయి. ఆరోగ్యాన్నిస్తాయి.

– హైమ సింగతల

Surya Telugu Daily

జనవరి 12, 2011 Posted by | సంస్కృతి | 2 వ్యాఖ్యలు

సుబ్బీ గొబ్బెమ్మా… శుభములీయవే…!

సుబ్బీ గొబ్బెమ్మా… శుభములీయవే…!

మంచు దొంతరలు విడిపోక మునుపే.. ముద్దులొలికే లోగిళ్లలో ముచ్చటైన గొబ్బెమ్మలు ఒదిగేందుకు సిద్ధం.. కన్నె పిల్లలంతా కలిసి తమ కోర్కెలను తీర్చమంటూ చిట్టాను పాటకట్టే సమయం.. తమ కుటుంబాన్ని చల్లగా చూడమంటూ ఇంతులంతా వేడుకునే తరుణం… మురికి వాడలు సైతం అందంగా ముస్తాబయి ఆహ్వానం పలుకుతున్న శుభోదయాలు.. ఈ మాసం మొత్తం అందంగా..ఆనందంగా..శుభాలు ఇవ్వాలని కోరుతూ..

ragoli-mugguగోవును గౌరీమాతగా కొలిచే సంప్రదాయం మనది. అందుకే ఆవు పేడను కూడా ఎంతో పవిత్రంగా భావిస్తారు. కేవలం పవిత్రం మాత్రమే కాదు.. ప్రకృతికి మేలు చేసే ఎన్నో మంచి గుణాలు ఇందులో వున్నాయి. అందుకే ధనుర్మాసంలో ప్రత్యేకంగా ఆవు పేడతో చేసిన గొబ్బిళ్ళను ముగ్గుల మధ్యలో పెట్టి పూజిస్తారు. గొబ్బెమ్మలను గౌరీదేవిగా భావించే యువతులు సందె గొబ్బెమ్మలను పెట్టి గొబ్బియాలతో పాటలను పాడి ఆడుతారు. అలా చేస్తే కోరుకున్న వరుడొస్తాడని, త్వరగా పెళ్ళి అవుతుందని వారి నమ్మకం. ఈ ఆట వివాహ వ్యవస్థపై మన యువతులకున్న నమ్మకాన్ని రుజువు చేస్తుందంటారు.

గొబ్బెమ్మలు..
పెద్ద వయసు స్ర్తీలు ముగ్గులు పెడుతుంటే చిన్న వయసు ఆడపిల్లలు ఆవు పేడతో చేసిన గొబ్బి ళ్ళను ముగ్గుల మధ్యలో పెడతారు. గొబ్బెమ్మలు కృష్ణుని భక్తురాళె్ళైన గోపికలకు సంకేతంగా భావిస్తారు. ఈ ముద్దల తలమీద కనిపించే రంగుల పూలరేకులు, పసుపు కుంకుమలు ముతె్తైదువులకు సంకేతం.గోపీ+బొమ్మలు=గొబ్బెమ్మలు అని చెబుతుంటారు పెద్దలు. మధ్య వుండే పెద్ద గొబ్బమ్మ గోదాదేవికి సంకేతం. సంక్రాంతి రోజులలో వీటి చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ నృత్యం చేసే బాలికలంతా కృష్ణభక్తి తమకూ కలగాలని ప్రార్థిస్తుంటారు. దీనిని సందె గొబ్బెమ్మ అంటారు. గొబ్బెమ్మలు పొద్దున పూట ముగ్గులో ఉంచి, దానిపై గుమ్మ డి పూలతో అలంకారం చేస్తే చాలా అందంగా వుంటుంది.

గొబ్బిళ్ళ పాటలు..
sankrantiగొబ్బి పాటలకు జానపద వాజ్మయంలో ఒక ప్రత్యేక స్థానం ఉంది.గోపికలనే వ్యవహారంలో గొబ్బెమ్మలుగా భావిస్తారు అని ముందుగానే చెప్పుకున్నాం.. ‘కొలని దోసరికి గొబ్బిళ్ళో యదు కుల సామికి గొబ్బిళ్ళో’ అనే అన్నమయ్య పాట అందరికీ తెలిసిందే. ఈ ధనుర్మాసం రోజుల్లో ఊరూరా ఆడవారు తెల్ల వారకముంద లేచి ఇం టి ముందు పేడనీళ్లు చల్లి ముగ్గులు వేసిన తరువాత పేడతో చేసిన ముద్దలను గొబ్బె మ్మ లుగా భావించి ఆ ము గ్గుల మధ్య భాగంలో పెట్టి వాటికి అలంకా రంగా పువ్వులు పెడతా రు. సాయంత్రమ య్యాక పేడతోగానీ, పసుపుతోగానీ గొబ్బె మ్మలు చేసి ఒక పెద్ద పళ్లెంలో ఉం చుతారు.

కళ్ళ స్థా నంలో గురి వింద గింజలు, ముక్కు స్థానంలో సంపెంగ లాంటి పువ్వును ఉంచుతారు. ఈ గొబ్బెమ్మలకు రక రకాల అలంకారం చేసి ఇంటింటి ముందుకూ తీసు కువెళ్ళి పళ్ళెంతో సహా నేలమీద ఉం చి గొబ్బెమ్మ చు ట్టూ తిరుగుతూ చేతులతో చప్పట్లు తడుతూ పాటలు పాడతారు. అక్కడ పాడే పాటలే గొబ్బి పాటలు. పాడటం పూర్తయ్యాక మధ్యలో ఉన్న అమ్మాయి గొబ్బెమ్మను పట్టుకుంటే మిగిలిన ఆడపిల్లలు అందరూ ఆ అమ్మాయికి ఇరువైపులా చేరి ఒకరి భుజాల మీద ఇంకొకరు చేతులు వేసుకుని గొంతులు కలిపి పాటలు పాడుకుంటూ తిరిగి వస్తారు. చివరి రోజైన కనుమ రోజు పాటలు పాడటం పూర్తయ్యాక గొబ్బుమ్మలను నీటిలో నిమజ్జనం చేస్తారు.

whomanగొబ్బెమ్మలకు తెలంగాణా ప్రాంతంలోని బతుకమ్మలకు పోలికలున్నా, కొన్ని విషయాల్లో స్వల్ప బేధాలున్నాయి. బతు కమ్మపాటలు ఒక నిర్ణీత ప్రదేశంలో పాడితే గొబ్బి పాటలు ఊరంతా తిరుగుతూ ప్రతి ఇంటి ముందూ పాడుతారు. గొబ్బి పాటలు నిటారుగా నిలబడి తిరుగుతూ పాడతారు. బతుకమ్మ పాటలు పాడేవాళ్లు నడుం దగ్గర వంగి తిరుగుతారు. బతుకమ్మపాటు పాడేవారి కదలికల్లో అందం ఉంటే గొబ్బిపాటలు పాడేవారిలో హుందాతనం ఉంటుంది. బతుకమ్మ పాటలు పాడేవాళ్లు చప్పట్లు వేగంగా తడితే గొబ్బి పాటలు పాడేవాళ్ళు నిదానంగా తడతారు.

దేవుని నైవేద్యం కోసం..
రోజూ ముగ్గులో పెట్టి పూజించే గొబ్బెమ్మలను ఎండలో ఎండబెడతారు. పండుగ రోజు సూర్యభగవానునికి నైవేద్యం సమర్పించేందుకు సిద్ధం చేసే ప్రసాదాన్ని వండేందుకు ఈ గొబ్బి పిడకలనే వుపయోగిస్తారు.ఎండిపోయిన ఆ పేడ ముద్దలను మండించి ప్రసాదాన్ని తయారు చేస్తారు.

– హైమ సింగతల

Surya Telugu Daily

జనవరి 12, 2011 Posted by | సంస్కృతి | 1 వ్యాఖ్య

టేబుల్‌ మ్యానర్స్‌ అవసరమే…

టేబుల్‌ మ్యానర్స్‌ అవసరమే…

అదొక సెబ్రిటీ పార్టీ… రకరకాల డిజైన్ల డ్రెస్సులతో ఎంతోమంది ఉన్నారు.అందరూ ఆడుతూ పాడుతూ కనిపిస్తున్నారు. వారి ముఖాల్లో ఆనందం కనిపిస్తోంది. ఆటాపాటా ముగిసింది. ఇక మిగిలింది భోజనాల కార్యక్రమం. అక్కడే వచ్చింది అసలైన చిక్కంతా…పార్టీలు, పంక్షన్‌లలోనే కాదు ఎవరింటికైనా భోజనాలకు వెళ్లినప్పుడు అక్కడ ఎలా ప్రవర్తించాలో కొంతమందికి తెలియదు. ఎదుటివారి ముందు అందంగా తినడం కూడా ఒక కళే.

కొన్ని ప్రాథమిక అంశాలను దృష్టిలో ఉంచుకుంటే పార్టీలో మీరు సంతోషంగా పాల్గొనడమే కాదు. ఎదుటివారి అభినందనలకు పాత్రులవుతారు. వారి దృష్టిలో ప్రత్యేక స్థానాన్ని పొందగలుగుతారు. మీ అలవాట్లు మీ ఉన్నత సంస్కారానికి, హుందాతనానికి అద్దం పడతాయి. ఆకట్టుకునే మీ ప్రవర్తన మూలంగా మిమ్మల్ని పార్టీకి ఆహ్వానించాలన్నా, మీరిచ్చే పార్టీలకు హాజరుకావాలన్నా అందరికీ ఆనందమే. ఎప్పుడెప్పుడా అన్న ఎదురుచూపులే !

eatingoutఇంట్లో ఉన్నప్పడయినా పార్టీలలో అయినా భోజనం చేసేటప్పుడు కొన్ని పద్ధతులు పాటించడం ఉత్తమమైన లక్షణం. మన ఇంట్లో ఎలా తిన్నా ఏముందిలే అని చాలా మంది అనుకుంటారు. ఆ అలవాటు నలుగురిలో భోజనం చేస్తున్నప్పుడు కూడా వచ్చేస్తుంది.అదీకాక ఎప్పుడైనా స్నేహితుల, బంధువుల ఇంటికో వెళ్లినప్పుడు మన పద్ధతులు వారికి నచ్చే విధంగా ఉండాలి.అప్పుడే మనమీద ఉన్నతమైన అభిప్రాయం కలుగుతుంది. ఆహార్యం గొప్ప గా ఉన్నంత మాత్రాన గొప్ప వ్యక్తిత్వం ఉన్నవారు కాదు. వారి పద్ధతులు, అలవాట్లు ఉన్నతంగా ఉన్నప్పుడే నలుగురిలో సదాభిప్రాయం కలుగుతుంది. తమ పార్టీలకు తప్పకుండా పిలవాలని అనపిస్తుంటుంది. అంతేకాదు వారిపై అభిమానం పెరుగుతుంది.

టేబుల్‌ మ్యానర్స్‌ అంటే…
కుటుంబ స్నేహితులు ఒకరిద్దరికి ఇంట్లో ఇచ్చే డిన్నరే కావచ్చు. సహోద్యోగులతోనో, కొద్దిపాటి పరిచ యస్తులతోనో కలిసి వెళ్లవలసిన పార్టీయే కావచ్చు. భోజనాల బల్ల దగ్గర మీ ప్రవర్తన (టేబుల్‌ మేనర్స్‌) మీ సంస్కారానికి, అభిరుచులకు, అలవాట్లకు అద్దం పడుతుంది. ఆ ప్రవర్తన ఆధారంగానే మీ కుటుంబ స్థాయిని, తీరుతెన్నులను, మీరు పెరిగిన పరిస్థితులలోని గుణదోషాలను ఇతరులు అంచనా వేస్తారు.

తెలుసుకోవడం అవసరం…
eatingout1ఎంతో అధునాతనంగా అలంకరించుకొని ఉన్నత కుటుంబాలకు చెందిన వారిలా కన్పించే కొందరు వ్యకు తలు భోజనాల దగ్గర తమ తెలివి తక్కువతనాన్ని బయటపెట్టుకుంటారు. అవసరమైనంత వరకే మాట్లాడతూ ఆప్యాయంగా పలకరిస్తూ, చిరునవ్వు చెదరని ముఖంతో హుందాగా కనిపించే వారు ఎదుటివారి అభినందనలకు పాత్రులైతే, అదేపనిగా మాట్లాడుతూ అవసరం లేకపోయినా నవ్వుతూ లేనిపోని హడావిడి నటించేవారు అందరికీ చిరాకు కల్గిస్తారు. అందువల్ల పార్టీలకు వెళ్లినప్పుడు నలుగురిలో నగుబాటు కా కుండా ఉండాలంటే పిల్లలైనా పెద్దలైనా సరే భోజన సమ యంలో పాటించవలసిన కొన్ని మర్యాదలను తెలుసుకొని ఉండడం అవసరం.

మంచిపద్ధతి…
భోజనాల బల్ల దగ్గర కాళ్లూచేతులూ బార జాపుకొని కూర్చో కూడదు. మీరు భోజనం చెయ్యబోతున్నారే కాని వాలు కుర్చీలో విశ్రాంతి తీసుకోవడం లేదు కదా… ఒద్దికగా కూర్చోవడం మంచి పద్ధతి. అన్నం తినేటప్పుడు కుర్చీలో ముందుకూ, వెనక్కూ ఊగడం, కాలుమీద కాలేసుకోవడం, కాళ్లు ఊపడంవంటి అలవాట్లను మంచి లక్షణాలుగా భావించరు. మోకాళ్లు రెండూ దగ్గరగా ఉండేలా పాదాలను నేలమీద ఆనించి నిటారుగా కూర్చోవడం పద్ధతి. మోచేతు లను టేబుల్‌మీద ఆనించడం అమర్యాదగా భావిస్తారు. అందువల్ల చేతులను ఎప్పుడూ ఒడిలో ఉంచుకుని కూర్చో వాలి.

అవస్థపడకూడదు…
eatingout2భోజనానికి ఉపక్రమించేముందు టేబుల్‌ నాప్‌కిన్స్‌ను ఒడిలో పరుచుకోవాలి. భోజనం పూర్తయిన తరువాత వాటి తీసి నీట్‌గా ఉన్న ప్లేట్‌లో ఉంచాలి. ము ఖ్యంగా బట్టతో చేసిన నాప్‌కిన్‌ను ఎంగిలి ప్లే ట్‌లో పెట్టకూడదు. స్పూ ను, ఫోర్కులతో కాకుం డా చేత్తో తినే అలవాటు ఉన్నవారు అరిచేతులకు అన్నం అంటకుండా వేళ్లతో మాత్రమే భుజిం చాలి. భోజనం చేసేట ప్పుడు నోటినుంచి ఎలాంటి శబ్దాలూ చెయ్యకూడదు. జుర్రుకుం టున్నట్లుగా వింతవింత శబ్దా చెయ్యడం జంతువులకు, కార్టూన్‌ సినిమాలకు సరిపోతుంది కానీ నాగరి కులకు లక్షణమనిపించుకోదు. నోరు పట్టినంత పెట్టుకొని నమలలేక అవస్థ పడకూడదు. కొంచెం కొంచెం నోట్లోపెట్టుకొని, సాధ్యమైనంత వరకు పెద వులు కలిపి ఉంచే నమలాలి.ఎందుకంటే కొంత మందికి శబ్దాలు చేయడం ఇష్టం ఉండదు.

ప్రస్తావించకూడదు…
eatingout3భోజనాల వేళ ఎక్కువగా మాట్లాడ డం మంచి అలవాటు కాదు.జబ్బులు, ఆపరేషన్లు, యాక్సిటెంట్లకు సం బంధించిన విషయాలను అసలు ప్రస్తావించకూడదు. తీవ్ర వాదోప వాదాలకు దారితీసే రాజకీయ సంబంధ విషయాలను వ్యక్తిగత విషయాలను ఎత్తకూడదు. ఏదైనా రాయో, గింజో పంటి కిందకు వస్తే ఒక చెయ్యి నోటికి అడ్డుగా పెట్టుకొని, రెండో చేతిలోకి ఆ రాయిని నెమ్మదిగా తీసు కోవాలి. భోజనం పూర్తయి టేబుల్‌ ముందునుంచి లేవగానే కుర్చీని యథా స్థానంలో ఉంచాలి. లేకపోతే అది దారిలో అడ్డుగా ఉండి పక్కవారు పొర పాటున కాలుతగిలి పడిపోయేందుకు ఆస్కారం కావచ్చు.ఇలాంటి చిన్న చిన్న పద్ధతులను పాటించడం వల్ల నలుగురిలో వ్యక్తిత్వం పెరగడమే కాదు, మంచి మంచి అలవాట్లుకూడా అలవడతాయి.

టీకి ఓ మర్యాద టీ తాగడంలో పాటించాల్సిన చిన్న చిన్న మర్యాదల గురించి తెలుసుకుందాం…

 • టీ మరీ వేడిగా ఉందా…అయితే చల్లారేలా గట్టిగా ఊదడం అదీ శబ్దం వచ్చేలా…అంత బాగుండదేమో ఒక సారి ఆలోచించండి. అంతేకాదు త్వరగా చల్లారాలనే ఉద్దేశంతో సాసర్‌లో పోసుకొని తాగడం నలుగురి మధ్యలో ఉన్నప్పుడు ఏ మాత్రం మర్యాదకరం కాదు.
 • కప్పులో టీ పూర్తవుతోంది. కప్పును ఎత్తి తాగడం లేదా చెంచాతో టీని తాగాలని ప్రయత్నించడం…మీ హుందాతనానికి భంగం కలిగినట్లే అవుతుంది.
 • ఇంట్లో ఉన్నట్లు శబ్దం వచ్చేట్లు టీ కలపకూడదు.
 • టీతోపాటు బిస్కెట్లు ఓ ప్లేట్‌లో పెట్టడం సహజం. అయితే చాలా మందికి బిస్కెట్లను టీలో ముంచి తినడం అలవాటుంటుంది. అయితే నలుగురిలో ఉన్నప్పుడు మాత్రం అలా చేయవద్దు. ముందు బిస్కెట్‌ తిని ఆ తర్వాత టీ తాగాలి.
 • టీ చాలా మితంగా తాగడం మీకు అలవాటా… అయితే ఈ మాట ముందే చెప్పాలి. ఎందుకంటే తీరా వాళ్లు ఇచ్చిన తర్వాత సగం తాగి వదిలేయడం మర్యాద కాదు. అలాగే మీకు చక్కెర ఎంత అవసరమో ముందుగానే తెలపడం మంచిది.

 

Surya Telugu Daily

జనవరి 10, 2011 Posted by | మ౦చి మాటలు | 3 వ్యాఖ్యలు

చదువు నేర్వని శాస్తవ్రేత్త

చదువు నేర్వని శాస్తవ్రేత్త

women2 అక్షరజ్ఞానం అంతగా తెలియదు.. శాస్ర్తీయ పద్ధతులపెై అవగాహన అసలే లేదు.. చుట్టూ ఉన్న ఆకులు అమలు మాత్రమే తెలుసు… వాటిద్వారానే ఆగ్రామ ప్రజలకు వెైద్య సేవలు అందుతాయి. ఎంతటి వ్యాధులెైనా.. రాచపుండులెైనా ఆ వెైద్యంతో మటుమాయం అవుతాయి… ఇంతటి శక్తిగల ఆకులు, అలమలు వ్యవసాయ రంగానికి ఎందుకు పనికి రావనేది ఆమె ఆలోచన… ఆ ఆలోచనతోనే ప్రతి ఆకును పరిశీలించడం వాటిని పంటపొలాలు, క్రిమికీటకాలపెై ప్రయోగించడం మొదలు పెట్టింది. శాస్తవ్రేత్తలకు దీటుగా సేంద్రీయ వ్యవసాయ పద్ధతులను అవలంబించి అధిక దిగుబడులను సాధించేందుకు కావలసిన ఎరువులను తయారు చేసింది. ఆమె ఖమ్మం జిల్లా జూలూరుపాడు మండలంలోని రామచంద్రాపురం శ్రీదుర్గా గ్రామసమాఖ్య అధ్యక్షురాలు ముక్తిలక్మి. ఆమె ఉపయోగించే వ్యర్థ పదార్థాలు.. ఆకులు అమలు… సాధించిన విజయం గురించిన లక్ష్మి చెబుతున్న కథనమే ఇది…

women1పంటకు వచ్చే చీడ పురుగులు, రకరకాల రోగాల పేరుతో భూసారం పెంచేందుకు అడుగు మందులు, నత్రజని వంటి ఖరీదెైన ఎరువులు, పురుగుల మందుల కోసం షాపుల వద్ద క్యూ కట్టి తీసుకోవడం… పలు దఫాలుగా రెైతులు నకిలీల బారినపడి పంటలను కోల్పోవడం వంటి సంఘటనలు నిత్యం వింటూనే ఉన్నాం. ఆధునిక ఎరువులతో పండించిన పంటలలో పోష క విలువలు నశించడమే కాకుండా వీటిని ఆహారంగా తీసుకోవడంతో రకరకాల రోగాల చుట్టు ముడుతున్నాయి. అందుకే కంపోస్టు ఎరువులు… సేంద్రీయ వ్యవసాయ విధానాలను అవలంబిం చాల్సిన అవసరం వుంది. మాకున్న మూడు ఎకరాల పొలంలోనే నా పరిశోధనలు మొదలు పెట్టాను. తొలుత ఈ పద్ధతుల ద్వారా పంటలను సాగుచేయడంతో ఎంతో లాభదాయకమ నిపించింది. దీంతో ఇరుగు పొరుగు వారికి కూడా వీటి గురించి వివరించాను. ఇప్పుడు మా పరిసర ప్రాంతాల్లోని దాదాపు రెండువేల ఎకరాల్లో ఈ పద్ధతుల్లోనే సాగు చేస్తున్నారు. ఆహార పంటలు, కూరగాయలు పండించడంలో వీటిని పాటిస్తూ రెైతులు అధిక లాభాలను పొందుతున్నారు. రసా యనిక ఎరువులతో పండించిన కూరగాయలకంటే ఈ విధానాల్లో పండించిన కూరగాయలకు మార్కెట్‌లో ఎక్కువ గిరాకీ ఉంటోంది కూడా.

వ్యర్థపదార్థాలే ఎరువులు…

womenమా పరిసర ప్రాంతాల్లో దొరికే వేపాకు, ముష్టి ఆకు, సీతాఫలం ఆకులు, పచ్చి మిరపకాయలు, లొట్టపీచు ఆకు, తూటికాడ, నిమ్మరసం, కోడిగుడ్లు, పులిసిపోయిన మజ్జిగ, ఆవు మూత్రం, ఆవుపేడ, వాయిలాకు, సర్ఫు, పంగల కరల్రు, పసుపు, ఆజోళ్ళ, పచ్చిరొట్ట ఎరువు, ఇంగువకొడిశాకు, ఎరల్రు (వాన పాములు), పప్పుదినుసులు, పొగాకు, వెల్లుల్లి, కిరోసిన్‌, సర్ఫు పౌడర్‌, నీలిరంగు పౌడర్‌, వేపనూనె, శనగపిండి, అడవిపుట్టమన్ను, సహజ సిద్ధంగా లభించే ఇతర చెట్ల ఆకులను వర్మి కంపోస్టు ఎరువులను, కషాయాలతో వరిటానిక్‌ను తయారు చేయడం వంటివి సొంతంగా చేశాను. ఈ పదార్థాలతో పంటల చీడపీడలను నివారించడం చాలా సులభం కూడా. ఇది నేను చేసి చూపించాను కూడా. అందుకే ఇక్కడి రెైతులు నా మాటలను వింటున్నారు.

ఇంతింతెై…

లక్ష్మి తయారు చేసిన సేంద్రియ ఎరువులు క్రమంగా గ్రామం నుండి జిల్లా వరకు వ్యాపించాయి. ఆమె అవలంబించిన విధానాలను పదిమందికి వివరించేందుకు ఎంతో శ్రమించారు. ఆమె మొదలు పెట్టిన ఈ విధానాల ద్వారా 2005లో 34 మంది రెైతులు 3 ఎకరాల్లో వర్మీ కంపోస్టు సేంద్రీయ ఎరువు, కషాయాలను ఉపయోగించి అధిక దిగు బడులను పొందారు. 2006లో 77 మంది రెైతులు 118 ఎకరాల్లో, 2007లో 82 మంది రెైతులు 466 ఎకరాల్లో, 2008లో 102 మంది 618 ఎకరాల్లో, 2009లో 136 మంది రెైతులు 986 ఎకరాల్లో, 2010లో 136 మంది 1460 ఎకరాల్లో పత్తి,వరి పంటలకు ఈ కషాయాలను ఉపయోగిస్తున్నారు. ఎన్‌పిఎమ్‌ చేస్తున్న మహిళలకు సిఐఎఫ్‌ (లింకేజ్‌) కింద 10 గ్రూపులకు 2006లో 38 లక్షల రూపాయలు ఐకేపి ద్వారా రుణాలు పొందారు. ప్రతి గ్రూపులోని మహిళలు వర్మీకంపోస్టు ఎరు వులు తయారుచేస్తారు. ముఖ్యంగా సుస్థిర వ్యవసాయ విధా నాన్ని జిల్లాలోని రామచంద్రాపురం, నల్లబండబోడు, గాంధీ నగర్‌, బచ్చలకోయగూడెం తదితర గ్రామాలలో రెైతులు ఉపయోగిస్తున్నారు.

ఎరువుల తయారీ విధానం….

women3నాడే కాంపోస్ట్‌ ఎరువు : రంధ్రాలున్న తడికలను నాలుగు వెైపులా కట్టి వివిధ రకాల పచ్చిరొట్ట(పచ్చిఆకులు) పేడను చిక్కగా కలిపి రొట్టమీద చల్లుతారు. కుళ్లిన తర్వాత అది ఎరువుగా మారుతుంది.

వానపాముల ఎరువు : తొట్లలో బెడ్లు కట్టి ఫ్లోరింగ్‌ మామూలుగా చేసి కొబ్బరిపీచు, ఎరువును పోసి బయటి నుంచి తెచ్చిన వానపాములు వేసి 45 రోజు ల తర్వాత వానపాముల విసర్జక పదార్థం వర్మీకం పోస్టు ఎరువు తయారవుతుంది. దీనిలో 16 రకా ల పోషకాలు ఉంటాయి. భూమిలో తేమశాతం ఉండి, భూమి సారవంతంగా ఉండడంతో మొ క్కల పెరుగుదలకు తోడ్పడుతుంది. తెగుళ్లు, చీడ, పీడలు పంటలకు సోకవు.

తూటికాడ (లొట్టపీచు) లేదా శీలేంద్రం ఎరువు : తూటిఆకు, ఆవుమూత్రాన్ని కలిపి ఉడక పెట్టాలి. అటు తర్వాత కిరోసిన్‌, సర్ఫు, నీరు కలిపి పంటపొలాలలోని మొ క్క మొదళ్లపెైన పిచికారీ చేస్తే దోమకాటు తోపాటు, తెగుళ్లు, చీడపీడలను నివా రించవచ్చు.

కషాయాల తయారీ : వేప ఆకు, ఆవుపేడ, ఆవుమూత్రం, సర్ఫు, వాయిలాకు, ఉడకబెట్టి కషాయం తయారుచేస్తారు. అదేవిధంగా వేపపిండి, సర్ఫు కలిపి కూడా కషాయం తయారుచేస్తారు.

రవ్వ ద్రవజీవం : ఆవుపేడ, శనగపిండి, ఆవుమూత్రం, అడవిపుట్టమన్నుతో తయారుచేసిన జీవరసాయనం పంట పెరుగుదలకు ఉపయోగపడుతుంది.

కొడిశ కషాయం : కొడిశ ఆకు, ముష్టి ఆకు, శీతాఫలం ఆకు, వాయిలాకు, వేపాకులతో తయారుచేసిన కషాయం పంటపొలాలకు ఉపయోగిస్తే రెక్కల పురుగు చనిపోతుంది.

వరి టానిక్‌ : ఈ ద్రవం వరి ధాన్యం బరువు పెరగడానికి, వరి కంకి పెరుగుదలకు ఉపయో గపడుతుంది. ఈ టానిక్‌ తయారీకి ఏడు రకాల పప్పు దినుసులెైన గోధుమలు, నువ్వులు, పెసలు, కందులు, శనగలు, మినుములు, బొబ్బర్లను ఒక్కరోజు నానపెట్టిన తర్వాత రుబ్బి కషాయాన్ని తయారుచేసి వరిపొలాలకు పిచికారీ చేయాలి.

బ్రహ్మాస్త్రం కషాయం : పొగాకు, వేపాకు, ఆవుపేడ, ఆవుమూత్రం, సర్ఫు, నీరు కలిపి ఈ కషాయాన్ని తయారుచేస్తారు.

ప్రముఖుల అభినందనలు…

ముక్తి లక్ష్మికి పురుగు మందులు లేని వ్యవసాయ విధానానికి విశేష కృషి చేసినందుకు ఆగస్టు 15, 2008లో అప్పటి కలెక్టర్‌ శశిభూషణ్‌కుమార్‌ ఉత్తమ మహిళా రెైతు అవార్డును అంద జేశారు.
కేంద్రమంత్రి జెైరామ్‌ రమేష్‌ ముక్తి లక్ష్మిని ్రపసంశాపత్రంతో అభినందించారు.

ఏలూరులో జరిగిన రెైతు సదస్సులో మాజీ ముఖ్యమంత్రి వెైఎస్‌.రాజశేఖరరెడ్డి, పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌లు అభినందించారు.

జాతీయ ఆంగ్ల మాసపత్రిక ‘‘డౌన్‌ టు ఎర్త్‌’’ ముక్తి లక్ష్మిని ఒక శక్తి వనరుగా 2006, మే 31న పేర్కొనడం విశేషం.

బీహార్‌ రాష్ట్ర కలెక్టర్ల బృందం జూన్‌8, 2006లో ముక్తి లక్ష్మి చేస్తున్న సుస్థిర వ్యవసాయ విధానాన్ని పరిశీలించి ప్రశంసించారు. ప్రతి సోమవారం సమీప గ్రామీణ ప్రాంతాల్లోని పంటపొలాలను, అంతరపంటలను పరిశీలించి వారికి తగిన సూచనలు ఇస్తున్నట్లు ముక్తి లక్ష్మి తెలిపారు.

మహిళా ప్రగతిని పరిశీలించిన ఇతర ప్రాంతాలవారు ఖమ్మం జిల్లాతోపాటు, మహబూబ్‌ నగర్‌ జిల్లా ఐకెపి సమాఖ్య బృందాలు, బీహార్‌ కలెక్టర్ల బృందం, కర్నాటక శాస్తవ్రేత్తలు, మహారాష్ట్ర రెైతులు, చెనె్నై వ్యవసాయ విద్యార్థులు, బంగ్లాదేశ్‌ వ్యవసాయాధికారులు, ప్రపంచబ్యాంకు బృందం అనేకసార్లు ఈ గ్రామంలో పర్యటించి మహిళల కృషిని ప్రశంసించారు.

స్వల్ప ఖర్చులు… అధిక దిగుబడులు

సిఆర్‌డిఎస్‌ స్వచ్ఛంద సేవాసంస్థ ఇందిరా క్రాంతి పథకం ఆర్థిక సహకారంతో సుస్థిర వ్యవసాయ పద్ధతిలో రామచంద్రాపురం, గాంధీనగర్‌, బచ్చలికోయగూడెం గ్రామాల్లో రెైతులు పత్తి, వరి పంటలను సాగుచేస్తూ సుస్థిర వ్యవసాయ పద్ధతులు అమలుచేస్తూ అధిక దిగుబడులు సాధించి ఆదర్శంగా నిలుస్తున్నారు.
– ఈలగాలి బిక్షం, స్టాప్‌ రిపోర్టర్‌, ఖమ్మం

 

Surya Telugu Daily

జనవరి 9, 2011 Posted by | ప్రకృతి | 1 వ్యాఖ్య

పద పదవే ఓ గాలిపటమా..

పద పదవే ఓ గాలిపటమా..

photoloadసంక్రాంతి పండుగ అంటే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేవి గాలిపటాలు. పండుగ రోజున పిల్లలతో పాటు పెద్దవారు కూడా గాలిపటాలు ఎగురవేసి ఆనందోత్సాహాల్లో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో అహ్మదాబాద్‌లో ఇంటర్నేషనల్‌ కైట్‌ ఫెస్టివల్‌ జరుగుతోంది. దీన్ని పురస్కరించుకొని ఇందులో పాల్గొంటున్న ఓ వ్యక్తి వరుసగా అమర్చిన 150 గాలిపటాలను ఒకే దారంతో ఎగురవేసేందుకు ప్రయత్నించాడు.

 

Surya Telugu Daily

జనవరి 8, 2011 Posted by | చిన్నారి లోకం | 2 వ్యాఖ్యలు

బ్లాగు మిత్రులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు

బ్లాగు మిత్రులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు

ఈ నూతన సంవత్సరం మీ జీవితాలలో కొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తూ  …

సనారాజు

జనవరి 1, 2011 Posted by | (స్నే)హితులు | 3 వ్యాఖ్యలు