కాగితపు గుజ్జుతో కళాకృతులు
కాగితపు గుజ్జుతో కళాకృతులు
రంగు, రంగుల కాగితాల ముక్కలను ఒకదానిపై మరొకదాన్ని అందమైన ఆకృతులను సృష్టించే రీతిలో అంటించడాన్ని పర్ కొలేజస్ అంటారు. సాధారణంగా ఇలాంటి కొలేజస్ బల్లపరుపుగా ఉంటారుు. కానీ జగదీష్ కొలేజస్ వీటికి పూర్తి భిన్నమైనవి. ఇవి త్రీ డైమెన్షనల్ తరహాలో ఉంటారుు. వసంతకాలం నుండి వేసవి కాలం వరకు వివిధ రుతువులను ప్రతిబింబించే కొలేజస్ ఇవి. పాశ్చాత్య ప్రపంచంలోని వాతావరణానికి సంబంధించినవే అరుునప్పటికీ వాటిలోని అద్వితీయ నైపుణ్యం చూసే ప్రతి ఒక్కరినీ కట్టిపడేస్తుంది.
దేశ విదేశాలలో విశేష ఖ్యాతినార్జించిన హైదరాబాదుకు చెందిన కళాకారుడు జగదీష్ చింతల. ఆయన అద్భుత కళాప్రస్థానాన్ని సూచిస్తూ ఐకాన్ ఆర్ట్ గ్యాలరీ తన ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా కొంతకాలం క్రితం ఏర్పాటు చేసిన సోలో ప్రదర్శన ప్రేక్షకులను ఆశ్చర్యంతో, ఆనందంతో తన్మయులను గావించింది. సాధారణంగా గ్యాలరీల్లో ప్రదర్శన అనగానే గోడలకు తగిలించిన అందమైన చిత్రాలు, లేదా కొలువుతీరిన శిల్పాలు మన కళ్లముందు గోచరిస్తాయి.
ఒక్కసారి ఆయన ప్రదర్శన తిలకించిన వారికి అది ఎందువల్ల సాధ్యమయిందో స్పష్టమవుతుంది.ముందుగా చూడగానే మొట్టమొదట ఆకట్టుకునేవి పేపర్ కొలేజస్. పేపర్ కొలేజస్ అంటే రంగు, రంగుల కాగితాల ముక్కలను ఒకదానిపై మరొకదాన్ని అందమైన ఆకృతులను సృష్టించే రీతిలో అంటించడం. సాధారణంగా ఇలాంటి కొలేజస్ బల్లపరుపుగా ఉంటాయి. కానీ జగదీష్ రూపొందించిన కొలేజస్ వీటికి పూర్తి భిన్నమైనవి.
ఇవి త్రీ డైమెన్షనల్ తరహాలో ఉంటాయి. వసంత కాలం నుండి వేసవి కాలం వరకు వివిధ రుతువులను ప్రతిబింబించే కొలేజస్ ఇవి. పాశ్చాత్య ప్రపంచంలోని వాతావరణానికి సంబంధించినవే అయినప్పటికీ వాటిలోని అద్వితీయ నైపుణ్యం ప్రతి ఒక్కరినీ కట్టిపడేస్తుంది. వివిధ రుతువులను సూచించే చెట్లు, ఆకులు, పుష్పాలు, వాటికి అనువైన వర్ణాలు- వాటన్నింటినీ అమర్చిన తీరు ఆశ్చర్య చకితులను చేస్తుంది. ఇవి కాకుండా కేవలం ఒకే ఒక్క పుష్పాన్ని పెద్ద ఆకారంలో కొలేజ్గా రూపొందించినవి కాగితాలతో ఎంతటి అద్భుత సృష్ట్టినైనా చేయవచ్చుననడానికి ఇవి నిదర్శనాలు.
Surya Telugu
ఇంకా వ్యాఖ్యలు లేవు.
-
భాండాగారం
- జనవరి 2020 (13)
- జూన్ 2018 (1)
- డిసెంబర్ 2012 (1)
- డిసెంబర్ 2011 (2)
- నవంబర్ 2011 (2)
- సెప్టెంబర్ 2011 (2)
- జూలై 2011 (5)
- జూన్ 2011 (7)
- ఏప్రిల్ 2011 (6)
- మార్చి 2011 (28)
- ఫిబ్రవరి 2011 (6)
- జనవరి 2011 (20)
-
వర్గాలు
- (స్నే)హితులు
- అతివల కోసం
- అవర్గీకృతం
- ఆరోగ్యం
- ఇతర బ్లాగులు సైట్లు
- చిన్నారి లోకం
- చూడు చూడు నీడలు
- చూసొద్దాం
- నచ్చిన కవితలు
- నచ్చిన పాటలు
- నాట్యం
- ప్రకృతి
- భక్తి
- ముద్రలు
- మ౦చి మాటలు
- యూట్యూబు లో తెలుగు
- యెర్రె౦కడు
- రింగ్ టోన్స్
- వర్ణ చిత్రాలు
- వార్తలు
- వింతలూ-విశేషాలు
- విచిత్ర చిత్రాలు
- విజ్ఞానం
- విదేశాలలో మన దేవాలయాలు
- విద్యార్థులకు
- వ౦టా-వార్పు
- సంస్కృతి
- సామెతలు
- సినిమా
- సూపర్ సింగర్స్
- సైకత శిల్పాలు
-
RSS
Entries RSS
Comments RSS
వ్యాఖ్యానించండి