హరివిల్లు

ఎన్నెన్నో వర్ణాలు-అన్నింటా అందాలు…

ఈ గాలి.. ఈ నేల.. సాయిమయం

ఈ గాలి.. ఈ నేల.. సాయిమయం

Puttaparti_fy మేజర్‌న్యూస్‌ బ్యూరో, అనంతపురం: ఒకప్పటి కుగ్రామం నేడు అంత ర్జాతీయ ఆధ్మాత్మిక కేంద్రం. భగవాన్‌ సత్యసాయిబాబా జన్మస్థల మైన పుట్టపర్తి సాయిబాబా ఆశీస్సులతో అంచలంచలుగా ఎదిగి అంతర్జాతీయ ఆధ్మాత్మిక కేంద్రంగా పేరు పొందింది. సాయిబాబా బాల్యంలో ఉన్నప్పుడు బాబాగా సిద్ది పొందిన బాల సాయిని ఎద్దులబండిలో ఉరవ కొండ నుంచి పుట్టపర్తికి తీసుకు వచ్చారు. అప్పుడు ఆ ప్రాంతమంతా పుట్టలమయంగా ఉండేది. అప్పట్లో అదో కుగ్రామం. కొ న్ని గుడిసెలు .. ఒకటి రెండు మిద్దెలు ఉండేవి. రెండు దేవా లయాలు ఉండేవి. ఒకటి వేణుగోపాలస్వామి ఆలయం, రెండవది సత్యభామ దేవా లయం. బాలసాయి మొదటిసారిగా పుట్టపర్తి వచ్చినప్పుడు కరణం సుబ్బ మ్మ ఇంట్లో దిగారు. ఆ ఇంటి వరండాలో బాలసాయి భక్తులను కలుసుకుని భజ నలు చేసేవారు. ఆయనను చూడడానికి వచ్చే భక్తులకు గ్రామంలో బస చేయడానికి సౌకర్యం లేక భోజనం లభించక ఇబ్బందులు కలిగేవి. భక్తుల ఇబ్బం దులను గమనించిన సుబ్బమ్మ అందరికీ భోజనం పెట్టడమే కాకుండా పడుకోవడానికి తన ఇంటి వరండాను కూడా కేటాయించారు.

Puttaparti_fy1 ప్రసిద్ది చెంది వచ్చే భక్తుల సంఖ్య పెరగడంతో వారి సౌక ర్యార్థం సుబ్బమ్మ తమ ఇంటి పక్కనే షెడ్‌ నిర్మించి ఇచ్చారు. దానితో మొద లైన పుట్టపర్తి విస్తరణ అనూహ్యంగా పెరిగి ప్రశాంతి నిలయంగా మారింది. 1942లో మొదటిసారిగా మోటారు వాహనం పుట్టపర్తికి వచ్చింది. బస్సు సౌకర్యం కూడా ఏర్పడింది. 1945లో ఓ చిన్న రేకుల షెడ్‌లో బస్‌స్టేషన్‌ ఏర్పాటు చేశారు. ధర్మవరం, హిందూపురం, బెంగుళూ రుల నుంచి రెండు మూడు బస్సులు వచ్చి ఆగేవి. ఆ రేకులషెడ్డు నేడు ఆర్టీసీ బస్టాండుగా మారింది. ఆర్టీసీ డిపో కూడా ఏర్పాటయ్యింది. వంద లాది ఆర్టీసీ బస్సులు నేడు పుట్టపర్తికి వస్తున్నాయి. రాష్ట్రంలోని వివిధ డిపోలకు చెందిన బస్సులు వస్తున్నాయి. గతంలో టీ స్టాలు కూడా లేని పుట్టపర్తిలో పెద్ద పెద్ద హోటళ్లు, లాడ్జీలు వెలిశాయి. ముఖ్యంగా ప్రశాంతి నిలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం షెడ్‌లు, అపార్టుమెంటులు, వందలా ది గదులు, షాపింగ్‌ కాంప్లె క్సులు, విద్యాసంస్థలు నిర్మిత మయ్యాయి. గతంలో ఉన్న క్యాంటీన్‌ షెడ్‌ను తొలగించి అధునాతనమైన రెండంతస్థుల క్యాంటీన్‌ భవనాన్ని నిర్మించారు. ఇందులో ఒకేసారి రెండు వేల మంది భోజనం చేయవచ్చు. 1970లో వరల్డ్‌ కాన్ఫరెన్స్‌ జరిగినప్పుడు సాయిబాబా జన్మదినోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించడానికి పెద్ద ఎత్తున అభివృద్ది కార్యక్రమాలను నిర్వహించారు.

రేకుల షెడ్డుగా ఉన్న భజన మందిరాన్ని తొలగించి అధునాతమైన పూర్ణ చంద్ర ఆడిటోరియాన్ని నిర్మించారు. 150 అడుగుల పొడవు, 20 అడుగుల వెడల్పుతో మధ్యలో ఎక్కడా స్థంభాలు లేకుండా నిర్మించిన ఈ హాలు ఇంజనీ రింగ్‌ రంగంలో ఓ అధ్బుతంగా ఉంది. ఈ హాలులో 20 వేల మంది భక్తులు కూర్చునేందుకు సౌకర్యం ఉంది. ఈ మందిరానికి వేదిక ఒక అలంకరణ. 1993లో ఈ హాలుపై అంతస్థులు నిర్మించి అందమైన బాల్కనీలను ఏర్పా టు చేశారు. మందిర ప్రాంగణంలో రెండు కోట్ల రూపాయలతో సాయి కుల్వంత్‌ హాలును నిర్మించారు. 75 జన్మదినోత్సవ వేడుకలప్పుడు దీనిని మరింత ఆధునీకరించారు. అందులోనే సత్యసాయి బాబా ప్రతిరోజూ భక్తులకు దర్శ నమిస్తున్నారు. ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే వరల్డ్‌ కాన్ఫరె న్స్‌కు దేశ విదేశాలకు లక్షలాది మంది భక్తులు వస్తుండడంతో జన్మదిన వేడుకలను సాయి కుల్వంత్‌ హాలులో నిర్వహించడం కష్టసాధ్యం కావడంతో ఈశ్వరమ్మ మెమోరియల్‌ పాఠశాల వెనుక ఓపన్‌ ఫర్‌ హిల్‌ వ్యూ స్టేడియం నిర్మించారు. అత్యంత సుందరంగా నిర్మించిన శాంతి వేదిక ఇరు వైపులా గ్యాలరీలు ఏర్పాటుచేశారు. ఎక్కడినుంచి చూసినా కనిపించేవిధంగా ఆంజనేయస్వామి విగ్రహంతో పాటు గుట్టమీద నిర్మించిన యూనివర్శిటీ పరిపాలన విభాగపు భవన సత్యసాయి మ్యూజియం ప్రశాంతి నిలయానికే అందాన్నిచ్చాయి.

ఈ మ్యూజియంలో మానవ సంస్కృతి, సంప్రదాయాలు, మత విశ్వాసాలు ప్రదీప్తి చెందే ప్రజ్ఞా పాటవ ప్రయోగం, చైతన్య మహా ప్రభు వేదాంతం, బాబా దివ్య అవతార ప్రకటన, మక్కా మదీనా మసీదులు మహా అద్భుతాలకు ప్రతీకలుగా నిలిచాయి. విద్య, వైద్య, సాంకేతిక, ఆధ్యాత్మిక రంగాలలో సేవలందించేందుకు సత్యసాయి సేవా సంస్థలను ప్రపంచవ్యాప్తంగా ఏర్పా టుచేశారు. సత్యసాయి బాబా సందేశాలను ప్రచారం చేయడంతో పాటు నిర్మాణాత్మక సేవా కార్యక్రమాలలో సత్యసాయి సేవా సంస్థలకు చెందిన లక్షలాది మంది సేవా కార్యకర్తలు స్త్రీ, పురుష వయో బేధం లేకుండా పాల్గొంటు న్నారు. 1964లో ఏర్పాటయిన ఈ సేవా సంస్థలు నేడు ప్రపంచంలోనే 160 దేశాల్లో సేవలు అందిస్తున్నాయి. మన రాష్ర్టంలో 1500 శాఖలు, దేశంలో ఆరు వేల శాఖలు, ప్రపంచంలో ఐదు వేల శాఖలుగా విస్తరించాయి. కుల, మత, జాతి, వివక్షత లేకుండా సర్వ మానవ సౌభ్రాతృత్వానికి ఆత్మవికాసానికి కృషి చేస్తున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్‌ స్టేడియం ఇక్కడ నిర్మించారు. సాయి స్పేస్‌ థియేటర్‌ ప్రశాంతి నిలయంలో నిర్మించిన సాయి స్పేస్‌ థియే టర్‌ లలో కనువిందు చేసే వినువీధిని వీక్షించవచ్చు. అంతర్జాతీయ ఆధ్మాత్మిక కేంద్ర మయిన పుట్టపర్తికి ప్రతిరోజూ దేశ విదేశాల నుంచి భక్తులు విచ్చేస్తుంటారు.

సత్యసాయి అవతారం
Puttaparti_fy5మేజర్‌న్యూస్‌ బ్యూరో, అనంతపురం: మాన వత్వపు విలువలు క్షీణించిపోతున్న నేటి సమాజం లో వాటిని పునరుజ్జీవింపచేయడమే సత్యసాయి బాబా అవతార లక్ష్యం. ప్రపంచవ్యాప్తంగా బాబా దీన్నొక యజ్ఞంగా భావించి అమలు చేస్తున్నారు. మనిషిలోని దివ్యత్వపు విలు వలను ఆధ్యాత్మిక సాధన ద్వారా నిత్య జీవితంలో ఆచరణరూపంగా చూపించా లని స్వామి ప్రభోదిస్తున్నా రు. ‘‘ఎవరినీ మతం మార్చుకోమనడం లేదు …కానీ అన్ని మతాలలోని అమూల్యమైన విలువలు ఇవేనంటారు… సన్యాసం తీసుకోవాలని చెప్పడం లేదు ..కానీ ఏ ఆశ్రమంలో ఉన్నా మానవత్వపు విలువలు పెంపొం దించుకోమంటున్నారు.. మంత్రతంత్రాలు ఉపదేశించ డం లేదు … మానవుడు త్రికరణ శుద్దిగా బ్రతకాలన్న జీవనసూత్రాన్ని ప్రభోదిస్తు న్నారు’’ ఇలా ప్రపంచానికి ప్రేమతత్వం చాటుతూ సత్యసాయిబాబా తాను సాయి అవతారమని ప్రకటించింది అనంతపురం జిల్లా ఉరవ కొండలో. బాబా పుట్టుక అవతార విశేషాలను ఒకసారి పరిశీలిస్తే … అనంతపురం జిల్లాలోని పుట్టపర్తిలో 1926 నవం బరు 23న ఈశ్వరమ్మ, పెద్ద వెంకమరాజు దంపతులకు సత్యసాయి నాల్గవ సంతానంగా జన్మిం చారు. తల్లితండ్రులు ఆ బాలుడికి సత్య నారాయణ రాజుగా నామకరణం చేశారు. ఆయన విద్యాభ్యాసం బుక్క పట్నం, ఉరవకొండలలోనే కొనసాగింది. విద్యార్థి దశలోనే ఆయన అనేక మహిమలను చూపిస్తూ తోటి విద్యార్థులనే కాకుండా ఉపాధ్యాయులను కూడా అబ్బుర పరిచేవాడు. పాఠశాలలో విద్యాభ్యాసం కొనసాగించే సమయంలోనే పాఠశాలలో మౌనంగా ఉండేవాడు. తన పెద్దన్న శేషమరాజు వద్ద ఉంటూ చదువుకునేవాడు. శేషమరాజు వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు కావడంతో తరచూ బదిలీలు అయ్యేవి.

ఆయనతో పాటు సత్యనారాయణరాజు కూడా వెళ్లేవాడు. అలా ఉరవ కొండలో ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యాభ్యాసం కొనసాగుతూ ఉండేది. పాఠశాలలో మౌనంగా ఉండడం, తనకు ఇష్టమైనప్పుడు అక్కడి సమీపంలో ఉన్న అబ్కారీ ఇన్‌స్పెక్టరు బంగళా ఆవరణంలోని పెద్ద రాతి గుండుపై కూర్చుని ఆలోచిస్తూ గడిపేవారు. 1940 ఆగష్టు 20న పాఠశాలకు వెళ్లి ఇంటికి తిరిగి వస్తూ ఇంట్లోకి రాగానే తన చేతిలోని పుస్తకాల సంచీని ఇంటిలోనికి విసిరి కొట్టి ‘‘మాయ వీడినది నేను సత్య నారాయణుడిని కాదు .. సాయిబాబాను .. నేను నా కర్తవ్యా న్ని నిర్వహించాల్సి ఉంది .. నా భ క్తులు నన్ను పిలుస్తు న్నారు.. నేను వెళ్తున్నా ను’’ అంటూ అబ్కారీ ఇన్‌స్పెక్టరు బంగళా లోని రాతి గుండుపై కూర్చుండి పోయాడు. అప్పుడు ఆయన వయస్సు 14 సంవత్స రాలు. ఎనిమిదవ తరగతి చదువుతున్నారు. అక్కడే రాతిగుండుపై ధ్యానంలో మునిగిపోయాడు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా ఉరవకొండ గ్రామమంతా పాకిపోయింది.

అక్కడికి వచ్చిన భక్తులకు తాను నేటి నుంచి సత్యనారాయణ రాజును కాదని సత్యసాయిబాబానని ప్రకటించుకున్నారు. మానవ జాతిని అసత్యం నుంచి సత్యం వైపునకు, చీకటి నుంచి వెలుగుకు నడిపించే గురుచరణములను పూజించి దుర్భరమైన సంసార సాగరాన్ని దాటడానికి ప్రయత్నించండంటూ ప్రభోదిస్తూ .. మొదటిసారిగా ‘‘మానస భజరే గురచరణం దరుస్తర భావసాగర తరణం’’ అనే భజన గీతాన్ని భక్తుల చేత ఆలపింప చేశారు. సత్యనారాయణ రాజు ఇంటి నుంచి వెళ్లిపోయి అవతార ప్రకటన చేసిన సంగతిని శేషమరాజు ద్వారా తెలుసుకున్న తల్లితండ్రులు ఉరవకొండకు చేరుకున్నారు. తీసుకెళ్లడానికి ప్రయత్నించిన తల్లితండ్రులను బాబా వారించారు. దీంతో కళ్లనీళ్లు పెట్టుకున్న బాబా తల్లి ఈశ్వరమ్మ తమ కళ్లెదుటే ఉండి ఏమి చేసినను తమకు సమ్మతమేనని తె లపడంతో సత్యసాయిబాబా పుట్టపర్తికి చేరుకున్నారు. అక్కడి నుంచే తన ప్రేమ తత్వాన్ని సర్వలోకానికి చాటడం మొదలుపెట్టారు.

సత్యసాయి – గీతాసారం
Puttaparti_fy4‘భగవద్గీతను అందరూ చదవగలరు. కొంత మందే దాని సారాన్ని గ్రహించగలుగుతారు. శ్రీకృష్ణుడు బృందావనంలో వేణుగానాన్ని ఆలపించాడు. అదే వేణుగానాన్ని యుద్ధభూమిలోనూ ఆలపించాడు. రుద్రభూమి అయినా, భద్రభూమి అయినా ఆ పరమాత్మునికి సమానమైనవే. తన ఉపదేశాలను వినిపించడానికి ఈ రెండు ప్రదేశాలను సమానంగా భావించాడు.

అందుకే ఆయన భక్తుడైన అర్జునుడు యుద్ధభూమిలో, తనను ఆరాధించే గోపికలు బృందావనంలో వేణుగాన సందేశాన్ని స్వీకరించగలి గారు. ఈ రెండింటిలో ఉన్న తేడా ఒక్కటే. అదే ఏకాగ్రత. ఏకాగ్రతను పెంపొందిం చుకుంటే కురుక్షేత్రంలోనైనా గీతాసారాన్ని గ్రహించగలం. అది భగవద్గీత అయినా, సాయిగీత అయినా, సత్యసాయి గీతాసారాంశమైనా దాన్ని స్వీకరించగలుగుతాం.

నేను మీకు ఇచ్చే సలహా ఒక్కటే. ముందుగా మీ భౌతిక అవసరాలపై శ్రద్ధ పెట్టండి. అనంతరం మీ అంతర్గత శక్తిని మేల్కొలపండి. పదును పెట్టండి. రోజూ ఉదయం ఒక గంట, రాత్రి ఒక గంట, బ్రహ్మ ముహూర్తం లో మరో గంట జపాల ద్వారా, మెడిటేషన్‌ ద్వారా సాధన చేయండి. అంత ర్గత శక్తిని చైతన్యపరచండి. దాని ప్రభావమేంటో మీకు అర్థమౌతుంది. సాధనను నిరంతరం కొనసాగిస్తే ప్రశాంతతను, మానసిక బలాన్ని పొంద గలుగుతారు. ఏకాగ్రత శక్తి ఏమిటో తెలుస్తుంది.

(గోఖలే మహల్‌, మద్రాస్‌, 25-3-1958)

సాయి పాద ధూళితో.. పరమపావనం
Puttaparti_fy2మేజర్‌న్యూస్‌బ్యూరో, అనంతపురం: పుట్టపర్తిలో ప్రశాంతి నిలయం అనగానే బాబా దర్శనం ఇచ్చే ప్రాంతం ఆయన నివసించే ప్రాంతాలన్న సంగతి గుర్తుకు వస్తాయి. ప్రశాంతి నిలయంలో అనేక ఇతర నిర్మాణాలు ఉన్నాయి. ఆలయాలు, షాపింగ్‌ మాల్స్‌, భక్తుల విడిది ప్రదేశాలు లాంటివి అనేకం ఉన్నా పేరుకు తగ్గట్టుగానే ప్రశాంతి నిల యం ప్రశాంతంగానే ఉంటుంది. ఎన్ని వేల మంది ఇక్కడ ఉన్నా ఏ మాత్రం అలికిడి లేకుండా ఇక్కడ నిశ్శబ్దవాతా వ రణం తాండవిస్తూ ఉంటుంది. ప్రశాంతి నిలయంలోని ఇ తర నిర్మాణాల్లో ముఖ్యమైన వాటిని ఒకసారి పరిశీలిస్తే…

1.సాయి కుల్వంత్‌ హాలు. 2. గ్రీన్‌రూమ్‌. 3. యజు ర్వేద మందిరం. 4. వినాయకుని గుడి. 5. శ్రీనివాస గెస్ట్‌హౌస్‌. 6.శాంతిభవన్‌. 7.సౌత్‌ ఇండియన్‌ క్యాంటీన్‌. 8.నార్త్‌ ఇండియన్‌ క్యాంటీన్‌. 9. షాపింగ్‌ కాంప్లెక్స్‌. 10. సర్వమత స్థూపం. 11.గాయత్రీ దేవాలయం. 12.సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం.

సాయి కుల్వంత్‌ హాలు: రూ. రెండు కోట్ల వ్య యం తో సాయి కుల్వంత్‌ హాలును నిర్మించా రు. బాబా దర్శనార్థం వచ్చే భక్తుల కోసం దీనిని ఏర్పాటు చేశారు. ఇక్కడే బాబా భక్తులకు దర్శనమిస్తారు. ఇక్క డ ఒకేసారి 20 వేల నుంచి 30 వేల మంది వరకూ భక్తులు ఉండవచ్చు. ఉదయం, సాయంత్రం వేళల్లో బాబా రావ డానికి ముందు ఇక్కడ భజనలు, కీర్తనలు కొనసాగుతూ ఉంటాయి.

గ్రీన్‌ రూమ్‌ : దేశ విదేశాల నుంచి బాబా దర్శనార్థం విచ్చేసే విఐపి, వివిఐపి భక్తులకు బాబా ఈ గ్రీన్‌రూ మ్‌లోనే ఇంటర్య్వూలు ఇస్తారు. ఇక్కడే వారికి దర్శ నం, ఆశీర్వచ నాలు ఉంటాయి. దర్శన సమ యంలో బాబా ఇక్కడే విశ్రాంతి తీసు కుంటారు.

యజుర్వేద మందిరం: బాబా విశ్రాంతి తీసుకునే మందిరం. బాబా పుట్టపర్తిలో ఉన్నన్ని రోజులూ దర్శన సమయం మినహా యజుర్వేద మందిరంలోనే గడిపే స్తారు. భోజన ఏర్పాట్లు మొదలు అన్నీ ఇక్కడే బాబా చూసుకుంటారు. ట్రస్టు సభ్యులతో మంతనాలు, చర్చలు, కీలక నిర్ణయాలు ఇక్కడే తీసుకుంటారు.

శ్రీనివాస గెస్ట్‌హౌస్‌: టీటీడీ మాజీ ఛైర్మన్‌ డికె. ఆదికేశ వులు నాయుడు దీనిని నిర్మించారు. వివిధ దేశాలకు చెందిన వివిఐపిలకు ఇక్కడే బస ఏర్పాటు చేస్తారు.
శాంతి భవన్‌: ప్రముఖులు ప్రశాంతి నిలయానికి వచ్చి నప్పుడు వారి విశ్రాంతి కోసం ఏర్పాటు చేశారు.

సౌత్‌ ఇండియన్‌ క్యాంటీన్‌: ప్రశాంతి నిలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం దీనిని ఏర్పాటు చేశారు. భక్తులకు అతి తక్కువ ధరలో అల్పాహారం, టీ, భోజనాల ఏర్పాట్లు ఉంటాయి. ఇక్కడికి వచ్చే ప్రము ఖులకు సైతం ఇక్కడ తయారు చేసిన వంటకాలనే అందిస్తారు.

నార్త్‌ ఇండియన్‌ క్యాంటీన్‌: ఉత్తరాది భక్తుల కోసం నార్త్‌ ఇండియన్‌ క్యాంటీ న్‌ను ఏర్పాటు చేశారు. ఉత రాది సంప్రదాయానికి అనుగుణంగానే ఇక్కడ వంట కాలు ఉంటాయి. ఇక్కడ కూడా అతి తక్కువ ధరకే టీ, అల్పాహారం, భోజన సౌకర్యాలు ఏర్పాటు చేశారు.

వినాయక విగ్రహం: ప్రశాంతి నిలయం ప్రధాన గే టు కు ఎదురుగా వినాయక విగ్రహం ఉంది. ఇది ఉద్భవ లింగంగా ప్రచారంలో ఉంది. ఇక్కడ పూజలు చేసిన వారికి వారు కోరిన కోరికలు, సమస్యలు తీరుతాయ న్న నమ్మకం ఉంది. భక్తులు వినాయక విగ్రహానికి పూజలు చేసి, బాబా దర్శనానికి వెళతారు.

వసతి గృహాలు: భక్తులకు తక్కువ ధరకే గదులు కేటాయించడానికి వీలుగా గదులను నిర్మించారు. విదేశీ యులకు ప్రత్యేకంగా గదులు, వసతులు న్నాయి. డార్మెటరీలు కూడా తక్కువ ధరలోనే అందు బాటులో ఉన్నాయి.

సర్వమత స్థూపం: యజుర్వేద మందిరానికి సమీ పంలో సర్వమత స్థూపం ఉంది. యజుర్వేద మంది రం నిర్మించడానికి పూర్వమే దీనిని ఇక్కడ ఏర్పాటు చేశారు. సత్యం, ధర్మం, ప్రేమ, శాంతి, అహింసలకు గుర్తుగా దీనిని ఏర్పాటు చేశారు.

షాపింగ్‌ మాల్స్‌: భక్తుల సౌకర్యార్థం షాపింగ్‌ మాల్స్‌ను కూడా ప్రశాంతి నిలయంలో ఏర్పాటు చేశారు. ఇక్కడ నిత్యావసర వస్తువుల మొదలు అన్ని వస్తువులు అతి తక్కువ ధరలకే అందుబాటులో ఉంచారు. ఉదయం రెండు గంటలు, సాయంత్రం రెండు గంటల పాటు మాత్ర మే షాపింగ్‌ మాల్స్‌ తెరు స్తారు. ఉదయం స్ర్తీలు, సాయం త్రం పురుషులకు ఇ క్కడ ప్రవేశం ఉంటుంది. గాయత్రీ దేవాలయం, సు బ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం కూడా ఉన్నాయి.

సత్యసాయి – ధైవమార్గం
Puttaparti_fy3జీవితం అనేది పరమాత్ముని సన్నిధికి చేరుకోవడానికి ఉద్దేశించిన యాత్ర. ఆ భగవంతున్ని చేర్చడానికి మీ ముందు ఉన్న మార్గం అసత్యాలతో నిండి ఉంది. మీ ప్రయాణాన్ని ఎలా ఆరంభిస్తారు? ధైర్యంగా, సడలని విశ్వాసంతో, ప్రశాంతత చిత్తంతో, అచంచల మనస్సుతో ముందుడుగు వేయండి. అప్పుడే లక్ష్యాన్ని, విజయాన్ని అందుకోగలు గుతారు. ఈ మార్గంలో మీ లోని మరో మనిషి ప్రయాణానికి అవసరమైన బండికి మనస్సు, మేధస్సు జోడెద్దుల్లాంటివి. మనస్సు, మేధస్సు అనే జోడెద్దులు సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ అనే సన్మార్గంలో ప్రయాణించడానికి ఇష్టపడ వు. అసత్యం, అన్యాయం, చింత, అసహనం మార్గంలో మిమ్మల్ని తీసుకెళ్తా యి. మిమ్మల్ని సన్మార్గంలో ప్రయాణించేలా మీరే వాటికి శిక్షణ ఇవ్వాలి. బానిసత్వం, పరాధీనత వైపు మొగ్గు చూపకుండా మీరే నిరోధించాలి. మీ చిన్నారి తన చేష్టలతో మీరు ఎంతో సంతోషిస్తారు. మీరు వేరే పనిలో ఉన్నప్పుడు ఆటంకం కలిగిస్తే ఆగ్రహిస్తారు. ఇది చాలా సహజమైన ప్రక్రి య. జీవితంలో, సంతోషంలో ఉన్న విభిన్న పార్శ్యాలు అంటే అవే. అందుకే దీన్ని రెండింటినీ సమానంగా భావించేలా మనస్సును మలచుకోండి. సరిదిద్దుకోండి. సంతోషానికి, దుఖాఃనికి కారణభూతమైనది మనస్సే. ప్రపంచంలో జరిగే సహజ సిద్ధ పరిణామాలను, వాస్తవాన్ని సహజంగా గ్రహించేలా మనస్సును నియంత్రించుకోండి. అదే నిజమైన విద్య.

(తిరువనంతపుపురం, 20-12-1958)

” ఈ మహిమలు ప్రదర్శన కోసం కాదు. ఇవి నా దివ్యత్వానికి నిదర్శనం. నా దివ్యత్వం అనంతం. పంచభూతాలు నా హస్తగతం. నా సంకల్పం నిర్వికల్పం. ఎంతటి కష్టతరమైనదైనా జరిగి తీరుతుంది. ఇన్ని లక్షల మంది నా దర్శనార్ధం వస్తున్నారంటే వాటి ఆవశ్యకత ఎంతో ఏమిటో ఇట్టే అర్ధమవుతుంది. సాధన వల్ల సంక్రమించిన శక్తులను సిద్ధులంటారు. అవి సాధన వల్ల సిద్ధిస్తారుు. సాధన యొక్క ప్రాబల్యం అంతరించగానే ఆ శక్తులు అంతరిస్తారుు. నా శక్తులు జన్మత: వచ్చినవి. ఇవి స్వయంసిద్ధం. ఈ శక్తులు నా సంకల్పానుసారం దినదిన ప్రవర్ధమానమవుతారుు కానీ తరగవు. నేను చేసే మిరకిల్స్‌ అన్నీ భక్తుల యోగక్షేమాల కొరేక. “
” దైవప్రీతి కూడా అందరికీ అంత సులభంగా కలుగదు. అనేక జన్మల సంస్కారమే అట్టిదానికి కారణం. భూమిలో ఎప్పుడో ఒకప్పుడు పడిన విత్తనమే వర్షము కురిసిన తర్వాత మెుక్క కావచ్చును కానీ, విత్తనమే లేకున్నచో ఎంత వాన కురిసిననూ, ఎంత ఎరువు వేసిననూ మెుక్క రాదు. అటులనే ఏనాడో ఏ జన్మలోనో సంస్కారమను విత్తనము హృదయ భూమిలో దాగి యుండిననే సత్సంగమను వర్షము కురిసి సాధనయను ఎరువు తోడగుట చేత సన్నిధి అను పెన్నిధి మెుక్క చక్కగా బహిర్ముఖమై ఫలముల నందించును. దానికి మనోవాక్కాయముల తపస్సు అత్యవసరము. అదే మెుక్కను కాపాడు కంచె.”

ఏప్రిల్ 25, 2011 Posted by | భక్తి | , , | 1 వ్యాఖ్య