హరివిల్లు

ఎన్నెన్నో వర్ణాలు-అన్నింటా అందాలు…

అందుబాటులో ఔషదం అల్లం

అందుబాటులో ఔషదం అల్లం

అల్లంలో మనకు తెలియని ఔషధీయ గుణాలు ఎన్నో పుష్కలంగా ఉన్నాయి. ఇది అనేక ఆరోగ్య సమస్యలకు చక్కటి మందులా పనిచేస్తుంది. కొందరు అల్లాన్ని అన్నింటిలో వాడితే మరి కొంత మంది మాత్రం అల్లాన్ని చూస్తే ఆమడ దూరంలో ఉంటారు. అటువంటి వారు తెలుసుకోవలసింది ఏమిటంటే అల్లానికీ మన ఆరోగ్యానికి చాలా దగ్గరి సంబంధం ఉన్నది. అల్లాన్ని దూరం చేసుకుంటే మన ఆరోగ్యాన్ని దూరం చేసుకున్నట్టే.

gingerగాస్ట్రో ఇంటెస్టినల్‌ డిస్ట్రెస్‌ అంటే జీర్ణ సంబంధమైన ఇబ్బందులన్నిటికీ అల్లం రామ బాణంలా పనిచేస్తుంది.గర్భిణీ స్ర్తీలలో రెండవ నెల ఆరంభంతోనే వాంతులు అవడం, తలతిరుగుడు, నడుం బాధలు లాంటివి వస్తుంటాయి.అరుగుదల లేకపోవడం వంటి వాటిని మార్నింగ్‌ సిక్‌నెస్‌ అంటారు. దీనిని అల్లం బాగా తగ్గిస్తుంది. మోషన్‌ సిక్‌నెస్‌, సీసిక్‌నెస్‌లను తగ్గిస్తుంది. కడుపులో వాయువును అల్లం హరించి వేస్తుంది. జలుబు, ఫ్లూను నివారించేందుకు చికిత్స చేయటానికి కూడా అనాదిగా వైద్యులు, ఆయుర్వేద శాస్తక్రారులు అల్లాన్ని ఉపయోగించారు.

  • గుండెలో మంట వచ్చినప్పుడు అల్లం తీసుకుంటే వెంటనే ఉపశమనం లభిస్తుంది.
  • కొలెస్టరాల్‌ను తగ్గిస్తుంది. కేన్సర్‌ ట్యూమర్స్‌ పెరగనీయదు.
  • మైగ్రేన్‌ తలనొప్పిని వెంటనే తగ్గిస్తుంది.
  • అల్లం పెయిన్‌ కిల్లర్‌. అలానే మంట ఎక్కడ ఉన్నా తగ్గిస్తుంది.
  • కఫం, దగ్గుకు అల్లం తేనె కలిపి ఇచ్చిన వెంటనే ఉపశమనం కలుగుతుంది.
  • నీరసంగా ఉన్నప్పుడు అల్లం టీ త్రాగాలి. నూతనోత్సహం వస్తుంది.
  • అల్లం త్వరగా పాడవకుండా ఉండాలంటే ఇసుక కుండీలో గానీ, పెరటిలో గానీ పాతిపెడితే చాలా కాలం నిల్వ ఉంటుంది.
  • కాల్చిన అల్లాన్ని శొంఠి అంటారు. శొంఠిని పొడిగా చేసి అర స్పూన్‌ పొడి, ఆర స్పూన్‌ పంచదార కలుపుకొని పరకడుపున తీసుకోవాలి. లేదా మొదటి ముద్దలో శొంటిపొడిని తీసుకుంటే తిన్నది జీర్ణం బాగా అవుతుంది.
  • రక్త క్యాన్సర్‌ను నిరోధించ డంలో బాగా పని చేస్తుంది. కనుక అల్లాన్ని ఆహారంలో వాడడం ఎంతో మంచిది. అల్లం టీ త్రాగడం, రోజు ఉదయం ఓ చిన్న అల్లం ముక్క నమిలి తినడం ద్వారా అజీర్తి, గ్యాస్ట్రిక్‌ సమస్యలకు దూరంగా ఉండవచ్చు.
  • అందుకే పూర్వకాలం వంటిళ్ళల్లో అల్లం తప్పనిసరిగా కనిపించేది. అల్లాన్ని నిమ్మరసంలో ఊరబెట్టి అజీర్ణం అనిపించినప్పుడు తింటుంటే ఆ మందం తగ్గుతుంది. అల్లం సర్వరోగ నివారిణిగా పనిచేస్తుంది.
  • surya telugu

 

జూలై 12, 2011 Posted by | ఆరోగ్యం | | 1 వ్యాఖ్య