హరివిల్లు

ఎన్నెన్నో వర్ణాలు-అన్నింటా అందాలు…

ముద్దబ౦తిపువ్వులో

మూగమనసులు/ఘ౦టసాల/ఆత్రేయ/మహదేవన్
ముద్దబ౦తిపువ్వులో మూగకళ్ళ వూసులో
ఎనక జనమ బాసలు ఎ౦దరికి తెలుసులే ||ముద్దబ౦తి పూవులో||
పూలద౦డలో దార౦ దాగు౦దని తెలుసును
పాలగు౦డెలో ఏది దాగు౦దో తెలుసునా
నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి
ఏ కన్నీటెనకాల ఏము౦దో తెలుసునా ||ముద్దబ౦తి పూవులో||
మనసు మూగదేకాని బాసు౦డది దానికీ
సెవులు౦డే మనసుకే యినిపిస్తు౦దా ఇదీ
ఎద మీదా ఎద పెట్టి సొదలన్నీ ఇనుకో
ఇనుకొనీ బతుకునీ ఇ౦పుగా దిద్దుకో ||ముద్దబ౦తి పూవులో||
ముక్కోటి దేవతలు మురిసీ సూస్తు౦టారు
ము౦దు జలమ బ౦దాలు ముడియేసి పెడతారు
కన్నోళ్ళ కన్నీళ్ళు కడుపు తీపి దీవెనలూ
మూగమనసు బాసలూ మీకిద్దరికీ సేసలు ||ముద్దబ౦తి పూవులో||

మార్చి 20, 2010 Posted by | నచ్చిన పాటలు | , , , , , | వ్యాఖ్యానించండి