హరివిల్లు

ఎన్నెన్నో వర్ణాలు-అన్నింటా అందాలు…

తిలక్-అమృత౦ కురిసిన రాత్రి-నా కవిత్వ౦

తిలక్-అమృత౦ కురిసిన రాత్రి
నా కవిత్వ౦
నా కవిత్వ౦ కాదొక తత్వ౦
మరికాదు మీరనే మనస్తత్వ౦
కాదు ధనికవాద౦,సామ్యవాద౦
కాదయ్యా అయోమయ౦,జరామయ౦

గాజుకెరటాల వెన్నెల సముద్రాలూ
జాజిపువ్వుల అత్తరు దీపాలూ
మ౦త్రలోకపు మణి స్త౦భాలూ
నా కవితా చ౦దనశాలా సు౦దర చిత్ర విచిత్రాలు

అగాధ బాధా పతః పత౦గాలూ
ధర్మవీరుల కృత రక్తనాళాలూ
త్యాగశక్తి ప్రేమరక్తి శా౦తిసూక్తి
నా కళా కరవాల ధగధ్ధగ రవాలు

నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయాపారావతాలు
నా అక్షరాలు ప్రజాశక్తుల వహి౦చే విజయ ఐరావతాలు
నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అ౦దమైన ఆడపిల్లలు.

మార్చి 26, 2010 Posted by | నచ్చిన కవితలు | , | 2 వ్యాఖ్యలు