హరివిల్లు

ఎన్నెన్నో వర్ణాలు-అన్నింటా అందాలు…

flute recital

జూన్ 18, 2018 Posted by | (స్నే)హితులు, నచ్చిన పాటలు, ప్రకృతి, విద్యార్థులకు, సంస్కృతి | , | వ్యాఖ్యానించండి

అభినందన మందారమాల

ప్రపంచ  తెలుగు మహాసభల సందర్భంగా తెలుగు భాషాభివృద్ధికి కృషి చేస్తున్న వారందరికీ శుభాభినందనలు….

Maa-Telugu-Talliki

1

డిసెంబర్ 28, 2012 Posted by | సంస్కృతి | , , | వ్యాఖ్యానించండి

అక్షతల పరమార్థం ఏమిటి?

అక్షతల పరమార్థం ఏమిటి?

akshitaluవివాహ శుభకార్యంలో జీలకర్ర, బెల్లం పెట్టే వేళ, మాంగల్యధారణ వేళ, వధూవరులపై ఆహుతులు అక్షతలు చల్లి ఆశీర్వదించడం మన హిందూ సంప్రదాయం. వివాహ శుభకార్యాల్లోనే కాదు, ప్రతి శుభకార్యంలోనూ పెద్దలు, పిన్నలకు అక్షతలు వేసి ‘దీర్ఘాయుష్మాన్‌ భవ, చిరంజీవి భవ, సంతాన ప్రాప్తిరస్తు, ఆరోగ్య ప్రాప్తిరస్తు, సుఖజీవన ప్రాప్తిరస్తు’ అంటూ ఆశీర్వదిస్తారు. ఇక దైవసన్నిధిలో సరే సరి, పూజారైతే మంత్రాక్షతలతో అందరినీ దీవిస్తారు.

‘అక్షతలు’ అనే మాట నుంచి వచ్చిందే ‘అక్షింతలు’.క్షతం కానివి అక్షతలు. అంటే రోకలి పోటుకు విరగని, శ్రేష్ఠమైన బియ్యం అన్నమాట. అలాంటి బియ్యాన్ని పసుపు లేక కుంకుమతో, నేతితో కలిపి అక్షతలు తయారు చేస్తారు. నవగ్రహాల్లో ఒక్కో గ్రహానికి ఒక్కో ధాన్యాన్ని దానవస్తువుగా పేర్కొంటారు. ఆ రకంగా నవగ్రహాలలో చంద్రుడికి ప్రీతి కరమైన దానవస్తువు బియ్యం. జ్యోతిషశాస్త్రం ప్రకారం చంద్రుడు మనస్సుకు అధినాయకుడు.

మనిషి మనసు, బుద్ధి, గుణము, తల్లి, వ్యసనము ఇత్యాదులన్నీ చంద్ర కారకాలే అని అన్నారు పెద్దలు. అందుకే మనిషిపై చంద్రుడి ప్రభావం ఎక్కు వగా ఉంటుంది. ఆ చంద్రుడికి సంకేతమైన బియ్యం కూడా మనిషి మన స్సుపై ప్రభావం చూపుతుంది. మనోధర్మాన్ని నియంత్రిస్తాయి.
శాస్ర్తీయంగా చూస్తే, మనిషి దేహం ఓ విద్యుత్‌ కేంద్రం. విద్యుత్‌ సరఫరాల్లో హెచ్చుతగ్గులు సాధారణం. ఈ వ్యత్యాసాలు మనిషి మనస్సు మీద, ఆరోగ్యం మీద ప్రభావాన్ని చూపుతాయి. మనుషుల్లో తమో, రజో, సాత్త్యికాలనే త్రిగుణాలకూ కారకము.

పెద్దలు వధూవరులపై అక్షతలు చల్లి ఆశీర్వదించే సమయంలో, దేహం లోని విద్యుత్తులో కొంత బాగం ఈ అక్షతలను తాకుతాయి. ఆశీస్సులు ఇచ్చే వాళ్ల నుంచి, పుచ్చుకొనే వాళ్ల కొంత విద్యుత్‌ బదిలీ అవుతుంది. ఈ కారణంగా అక్షతల ద్వారా పెద్దలలో ఉండే సాత్విక గుణం పిన్నలకు లభిస్తుందనేది మన నమ్మకం. పెద్దలు, విద్వాంసులు, గురువులు, తల్లి దండ్రులు, అత్తమామలు వివాహ సమయంలో, శుభకార్యాలలో మనకు అక్షతలు వేసి శిరస్సును తాకి ఆశీర్వదించడంలోని ఆంతర్యం, పర మార్థం ఇదే!

మరో సిద్ధాంతం ప్రకారం చూస్తే మనిషి దేహంలో విద్యుత్‌ కేంద్రాలు ఇరవై నాలుగు ఉంటాయట. వాటిలో ప్రధానమైనది శిరస్సు. ఇది విద్యుదుత్పత్తి కేంద్రమే కాదు. విద్యుత్‌ ప్రసార కేంద్రం కూడా. తలపై అక్షింతలు వేయడం ద్వారా వాటిలోని విద్యుత్‌ను గ్రహించి దేహానికి ప్రసారం చేస్తుం ది శిరస్సు.అది సరే కాని! అక్షతలుగా ఉపయోగించే బియ్యానికి పసుపు కుంకుమలు కలపడం ఎందుకు? ఆయుర్వేదం ప్రకారం, చర్మ సంబంధ రోగాల్ని అడ్డుకునే శక్తి పసుపుకు ఉంది. పసుపు నుంచి తయారయ్యే కుంకుమకూ ఈ శక్తి ఉంది. అక్షతలు వేసే వారికి ఎలాంటి రోగ సమస్యలున్నా, పుచ్చు కొనే వాళ్ళకి అవి సోకకుండా ఈ పసుపు కుంకుమలు నివారిస్తాయట. అంతేకాక పసుపు కుంకుమలు శుభానికి సంకేతాలు కూడా. ఆధ్యాత్మి కంగా చెప్పాలంటే జీవుడికి సంకేతం బియ్యం.

భగవద్గీతలో
‘అన్నాద్భవన్తి భూతాని’ అని మూడవ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు. జీవులు అన్నం చేత పుడతారట. ఈ అన్నం తయారీకి మనం ఉపయోగించే ధాన్యం బియ్యం. భగవంతునిపై అక్షతలు వేసి నమస్కరిం చడం అంటే, జీవుడు ఈ అన్నంలో పుట్టీ, తిరగి ఈ జీవుడిని భగవంతుడి లోకి చేర్చడమే. అక్షతలలో ఇంతటి పరమార్థం గోచరిస్తుంది.
తెలుగులో ఈ అక్షతలని తలంబ్రాలు లేదా తలబ్రాలు అని కూడా అంటారు.

తలను = తల యందు పోయబడే, ప్రాలు = బియ్యం అని అర్థం.
పూర్వం వధువు ధాన్యలక్ష్మిగా చెప్పబడింది. ఈ తలంబ్రాల కార్యక్రమంలో బియ్యానికి ఒక ప్రత్యేకత ఉంది. ‘ఓ వధువా! నీవు మా ఇంటికి వచ్చాక, మన ఇంట ధాన్యం ఇలా కుప్పతెప్పలుగా విరివిగా ఉండి, మన జీవనానికి’ ఆధారభూతమైన ధాన్యంతో మనం నిత్య సంపదల వాళ్ళమై తులతూగు తూ ఉండాలి’ అనే భావానికి అనుగుణంగా ఈ తలంబ్రాల కార్యక్రమం సాగుతుంది.
వరుడు, వధువు శిరస్సులపై తలంబ్రాలు పోసుకొనే దానికి ముందు, వరు డు ముందుగా వధువు చేతిని దర్భతో తుడిచి, దోసిలిలో రెండు మార్లుగా బియ్యాన్ని వేసి, ఆ మీదట పాలని కొద్దిగా చల్లి తలంబ్రాలకి సిద్ధం చేస్తాడు. తలంబ్రాలు వేసాక వధువు ఇలా చెయ్యాలని ఒక పద్ధతి చెప్తుంది. ఈ కాలంలో పురోహితులే చేయించి పోయిస్తున్నారు.

‘ఈ కన్య వంశాన్ని తరింపజేయుగాక పుణ్యం వృద్ధి చెందుగాక. శాంతి, పుష్టి, సంతోషం, అభివృద్ధి, విఘ్నాలు లేకపోవడం, ఆయురారోగ్యాలు అన్నీ వీరికి కల్గుగాక!’ అని చదువుతూ అక్షతారోపణం (తలంబ్రాలు పోయించడం) చేయిస్తారు. ఈ చేసిన వివాహకర్మ మొత్తం అక్షతము (నాశనము లేనిది) అగుగాక! అని దీని భావం.

అక్షతలలో, తలంబ్రాలలో ఇంతటి పరమార్థం గోచరిస్తుంది. మన పూర్వీకులు ఈ వివాహ శుభకార్యాలలో, ఇతర శుభకార్యాలలో ఏర్పాటు చేసిన సంప్రదాయాల్లో, ఆచారాల్లో ఇంత గూఢార్థం ఉంది. వివాహ సమయంలో నవదంపతులు కలిసి జీవించి ఉండాలనీ, ఆదర్శ దంపతు లుగా మెలగాలనీ, వధూవరులపై ఆహుతులు అక్షంతలు చల్లి ఆశీర్వదిం చడమే అక్షతల కార్యక్రమంలోని అర్థం, పరమార్థం. దాన్ని తెలుసుకుని అందుకు అనుగుణంగా మెలగాలి.

 

Surya Telugu 

డిసెంబర్ 16, 2011 Posted by | సంస్కృతి | 5 వ్యాఖ్యలు

పదహారణాల తెలుగుభామ బాపు బొమ్మ

పదహారణాల తెలుగుభామ బాపు బోమ్మ

bapu4రెండు జడలు వేసుకున్న అందమైన అమ్మారుు కార్టూన్‌ కనిపిస్తే తెలుగువాళ్లు ఎవరైనా అది బాపు గీసిన బొమ్మలాగా ఉంది అని అనకుండా ఉండలేకపోతారు. ఈ మాటలు బాపు గొప్పతనాన్ని తెలియజేస్తారుు. గొప్ప చిత్రకారుడైన బాపు బొమ్మలు, కార్టూన్‌లకు నేడు మన రాష్ట్రంలోనే కాదు దేశ, విదేశాల్లో కూడా మంచి పేరుంది. బాపు బొమ్మల్లో అందమైన తెలుగు అమ్మారుు చక్కగా ముస్తాబై కనిపిస్తుంది. ఆయన కార్టూన్‌లలో ‘రెండు జడల సీత’ అనే అమ్మారుు సందర్శకులను మైమరపిస్తుంది.

ఈ బొమ్మ ఎంత పాపులర్‌ అరుుందంటే ఎవరైనా రెండు జడలు వేసుకుంటే బాపు బొమ్మ రెండు జడల సీతలాగా ఉన్నావని తెలుగువాళ్లు అనడం మెుదలెట్టారు. బాపు బొమ్మలు అనేక అంశాలపై రూపుదిద్దుకున్నారుు. ఆయన బొమ్మల్లో పదహరణాల తెలుగు అమ్మారుు స్పష్టంగా కనిపిస్తుంది. తెలుగు సంస్కృతిని ప్రతిబింబించేవిధంగా అమ్మారుులు పొడవాటి వాలుజడ, ముఖానికి పెద్ద బొట్టు, అందమైన చీరకట్టు, చారడేసి కళ్లతో అందంగా కనిపించేవిధంగా బాపు బొమ్మలు గీశారు. పురాణ ఇతిహాసాలైన రామాయణ, మహాభారతాలపై కూడా బాపు ఎన్నో బొమ్మలు వేశారు. వీటన్నింటిలో తెలుగుదనం మనకు కనిపిస్తుంది.

బాపు బొమ్మల రమణీయత అందరినీ ఆకట్టుకుంటుంది. బాపు గీసిన బొమ్మలను తెలుగువాళ్లు ఎవరైనా చూశారంటే అవి బాపు బొమ్మలు అనకుండా ఉండలేకపోతారు. ఇక రాష్ట్రంలోని ఏ ప్రాంతంలోని అమ్మాయిని అయినా బాపు బొమ్మలాగా ఉన్నావంటే తాను అందంగా ఉన్నానని పొగుడుతున్నారని ఆమె సంతోష పడుతుంది. గొప్ప చిత్రకా రుడైన బాపు సినిమా రూపకర్తగా పలు అద్భుతమైన చిత్రాలను సైతం రూపొందించారు. ఆయన సినిమాల్లో పదహరణాల తెలుగు అమ్మాయి తప్పకుండా ఉండాల్సిందే.
బాపు అసలు పేరు సత్తిరాజు క్ష్మినారాయణ. ఆయన 1933 సంవత్సరం డిసెంబర్‌ 15న జన్మించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని నర్సాపూర్‌లో తెలుగు నియోగి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు. ఇక బాపు ప్రముఖ చిత్రకారుడిగా, కార్టూనిస్ట్‌గా, డిజైనర్‌గా, సినిమాల రూపకర్తగా ఎంతో ప్రఖ్యాతిగాంచారు. మద్రాస్‌ యూనివర్సిటీ నుంచి 1955లో లా డిగ్రీ పూర్తిచేశారు. బాపు ఆంధ్రపత్రిక వార్తా పత్రికలో 1955లో పొలిటికల్‌ కార్టూనిస్ట్‌గా సైతం పనిచేశారు.

బాపు అసలు పేరు సత్తిరాజు లక్ష్మీనారాయణ. ఆయన 1933 సంవత్సరం డిసెంబర్‌ 15న పశ్చిమ గోదావరి జిల్లాలోని నర్సాపురంలో తెలుగు నియోగి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు.ఇక ఆయన మద్రాస్‌
యూనివర్సిటీ నుంచి 1955లో లా డిగ్రీ పూర్తిచేశారు.

ఆకట్టుకునే అద్భుతమైన శైలి…
బాపు చిత్రాను గీసే విధానం ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఆయన సహజమైన ముదురు రంగులతో తనదైన పెయింటింగ్‌ స్టైల్‌ను సృష్టించా రు. ఫ్రీ హ్యాండ్‌ డ్రాయింగ్‌, పెయింటింగ్‌ స్ట్రోక్స్‌, అందమైన బ్యాక్‌గ్రౌండ్‌తో సందర్శకులను మైమరపిస్తారు. ఆయన పలు పెయింటింగ్స్‌ హిందూ పౌరాణిక పాత్రలను ప్రతిబింబిస్తాయి. ఆయన ఎంతో అందంగా పురాణ ఇతిహాసమైన రామాయణాన్ని పిక్టోరియల్‌ స్టోరీగా మలిచారు. ఆయన బొమ్మల్లో శివుడు, భీముడు, దుర్యోధునుడి వంటి వారు కనిపిస్తారు. మగ వారు వెడల్పుగా ఉండే ఎతె్తైన ఛాతితో, ధృడమైన భుజాలతో కనిపిస్తారు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు వంటి దేవతలను నయనమనోహరంగా బాపు బొమ్మల్లో కనిపిస్తారు.

ఇక ఆడ వాళ్లు చారడేసి కళ్లు, కోటేరు ముక్కు, వాలు జడతో అందంగా కనిపిస్తూ వయ్యారాలు ఒలకబోస్తారు. బాపు బొమ్మ అంటే అందమైన తెలు గమ్మాయి అనేవిధంగా పేరొచ్చింది. ఆయన బొమ్మల్లో రెండు జతల సీత తప్పకుండా కనపిస్తుంది. దీంతో తెలుగమ్మాయి రెండు జడలతో కనిపిస్తే రెండు జడ ల సీతలాగా ఉన్నావని అనడం ప్రారంభించారు. బాపు తన దైన శైలిలో తెలుగులో రాయడం మొదలెట్టారు. ఆయన బొమ్మల మాదిరిగా బాపు లిపి కూడా ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఇక బాపు బొమ్మలు, కార్టూన్‌లు ఎన్నో దేశ, విదేశాలకు చెందిన మ్యా గజైన్‌ల కవర్‌పేజీలపై దర్శనమిచ్చి పాఠకులను ఎంతగానో ఆకట్టుకు న్నాయి. యుఎస్‌ఎలో తెలుగువారి కోసం అక్కడి నుంచి వెలువడు తున్న తెలుగు నాడి అనే మ్యాగజైన్‌ బాపు అద్భుతమైన బొమ్మలన్నింటిని ప్రచు రించింది. ఆ తర్వాత ఆ మ్యాగజైన్‌ సలహా మండలిలో బాపు సభ్యుడి గా చేరి తెలుగు పాఠకులను దృష్టిలో పెట్టుకొని మ్యాగజైన్‌ వెలువడేటట్టు చేశారు.

bapu1బాపు 1945 నుంచి బొమ్మలు, కార్టూన్లు, తెలుగు మ్యాగజైన్లకు కవర్‌ డిజైన్లు చేస్తుండడం విశేషం. సృజనాత్మకతతో వైవిధ్యభరితమైన అందమైన బొమ్మలను గీయడంలో బాపుకు ఎవరు సాటిరారు. ఎందరో రచరుుతలు తమ రచనలకు బాపు బొమ్మలు ఉంటే అంతకంటే మించిది లేదని భావించడం విశేషం. తమ రచనలకు బాపు బొమ్మలను జోడిస్తే పాఠకులు వాటిని ఎంతో ఇష్టంగా చదువుతారని రచరుుతలు భావించి ఆయనచేత బొమ్మలు వేరుుంచుకున్నారు.

ఇతర చిత్రకారులతో కలిసి…
బాపు ప్రముఖ చిత్రకారుడు సత్యం సంకరమంచితో కలిసి 101 చిత్రాలను అమరావతి కథ కోసం గీశారు. ఒక్కో కథ కోసం ఒక బొమ్మను ఆయన రూపొందించారు. ఇక ముళ్లపూడి వెంకటరమణతో బాపు అనుబంధం విడదీయలేనిది. తెలుగు సినీ రంగంలో బాపు-రమణలు కలసి పలు అద్భుతమైన సినిమాలను రూపొందించారు. బాపు దర్శకుడిగా ముళ్లపూడి రమణ సినిమా స్క్రిప్ట్‌, డైలాగుల రచయితగా సినిమాలను నిర్మించారు. రమణ క్యారెక్టర్‌ ‘బుడుగు’కు ప్రాణం పోసి అందమైన బొమ్మలను గీశారు బాపు. ఆయన తన చిత్రాల ద్వారా రావుగోపాలరావు, రాజేంద్రప్రసాద్‌, ఆమని వంటి సినీ నటులను బాగా వెలుగులోకి తీసుకువచ్చారు.

bapu2 బాపు బొమ్మలు, కార్టూన్‌లు దేశ, విదేశాలకు చెందిన పలు మ్యాగజైన్‌ల కవర్‌పేజీలపై దర్శనమిచ్చి పాఠకులను ఎంతగానో ఆకట్టుకున్నారుు. యుఎస్‌ఎలో తెలుగువారి కోసం అక్కడి నుంచి వెలువడుతున్న తెలుగు నాడి అనే మ్యాగజైన్‌ బాపు అద్భుతమైన బొమ్మలన్నింటిని ప్రచురించింది. ఆ తర్వాత ఆ మ్యాగజైన్‌ సలహా మండలిలో బాపు సభ్యుడిగా చేరి తెలుగు పాఠకులను దృష్టిలో పెట్టుకొని మ్యాగజైన్‌ వెలువడేటట్టు చేశారు.

తెలుగు సంస్కృతికి ప్రతిబింబంగా…
తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు, జీవన విధానంతో అందమైన బొమ్మలను గీయడంలో బాపు ఎంతో ఆరితేరారు. ఇక చూడగానే సందర్శకులను కట్టిపడేసే విధంగా ఉండడం బాపు బొమ్మల ప్రత్యేకత. ఆయన బొమ్మలన్నీ తెలుగు సంస్కృ తిని ప్రతిబింబిస్తాయి. ఇక బాపు 1945 నుంచి బొమ్మలు, కార్టూన్లు, తెలుగు మ్యాగజైన్లకు కవర్‌ డిజైన్లు చేస్తుండడం విశేషం. సృజనాత్మకతతో వైవిధ్యభరిత మైన అందమైన బొమ్మలను గీయడంలో బాపుకు ఎవరు సాటిరారు.

ఎందరో రచయితలు తమ రచనలకు బాపు బొమ్మలు ఉంటే అంతకంటే మించిది లేదని భావించడం విశేషం. తమ రచనలకు బాపు బొమ్మలను జోడిస్తే పాఠకులు వాటి ని ఎంతో ఇష్టంగా చదువుతారని రచయితలు భావించి ఆయనచేత బొమ్మలు వేయించుకున్నారు. బాపు బొమ్మల్లోని ఆడవారిలో అందం, గ్లామర్‌ కనిపిస్తే మగ వారిలో హుందాతనం స్పష్టంగా కనిపిస్తుంది. చిత్రకారుడిగా బాపు గొప్పతనాన్ని గుర్తించిన రాష్ట్రప్రభుత్వం ‘బాపు బొమ్మల కొలువు’ పేరిట పూర్తి స్థాయిలో ఆర్ట్‌ గ్యాలరీని హైదరాబాద్‌లో ఏర్పాటుచేస్తామని ప్రకటించింది. సహజమైన ముదు రు రంగులతో రూపుదిద్దుకునే ఆయన చిత్రాలు అందర్నీ మైమరపిస్తాయి. బాపు ఆర్ట్‌ వర్క్‌‌సలో రామాయణ మహా కావ్యం, సీతా స్వయంవరం, రాముడి గొప్పత నం, రావణుడు, సీతల సంవాదం వంటి బొమ్మల సంకలనాలు ఆయనలోని గొప్ప చిత్రకారుడిని మనకు అవగతం చేస్తాయి.

bapu3ముళ్లపూడి వెంకటరమణతో బాపు అనుబంధం విడదీయలేనిది. తెలుగు సినీ రంగంలో బాపు-రమణలు కలసి పలు అద్భుతమైన సినిమాలను రూపొందించారు. బాపు దర్శకుడిగా ముళ్లపూడి రమణ సినిమా స్క్రిప్ట్‌, డైలాగుల రచరుుతగా సినిమాలను నిర్మించారు. రమణ క్యారెక్టర్‌ ‘బుడుగు’కు ప్రాణం పోసి అందమైన బొమ్మలను గీశారు బాపు.

సృజనాత్మతకు ప్రతిబింబంగా కార్టూన్‌లు…
బాపు తన సృజనాత్మకమైన కార్టూన్‌లతో ఎంతో పాపులారిటీ సంపాదించారు. సింపుల్‌గా ఉండే ఫ్రేమ్‌తో ఆయన తాను చెప్పదల్చుకున్నది సులభంగా చెప్పేస్తా రు. నవ్వించే ఆయన కార్టూన్లలో అంతర్గతంగా నిజం దాగి ఉం టుంది. బాపు కార్టూనిస్ట్‌ ఆంధ్ర పత్రికలో కొంత కాలం పని చేశారు. 50వ దశకంలో ఆయన కార్టూనిస్ట్‌గా పత్రికలో చేశా రు. పలు వారపత్రికలకు కార్టూన్లను గీసి ఇచ్చారు. ఎందరో రచయితల రచనలకు బొమ్మలను అందించారు. రాష్ట్రంలోని కార్టూనిస్ట్‌లకు బాపు ఆదర్శప్రాయులుగా నిలుస్తారు. కార్టూని స్ట్‌గానే కాకుండా గ్రాఫిక్‌ ఆర్ట్‌ వర్క్‌లో కూడా బాపు తన నైపు ణ్యాన్ని ప్రదర్శించారు. బాపు కార్టూన్లంటే తెలుగువారిలో నవ్వు లు కనిపిస్తాయి. అంతటి పాపులారిటీ సంపాదించారు ఆయన.

సినిమాల రూపకల్పనలోనూ విశిష్టత…
తెలుగువారి సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా బాపు సినిమాలను రూపొందించారు. ఆయన చిత్రాలన్నీ కుటుంబంలోని అనుబంధాలు, అంశాలపై రూపుదిద్దుకున్నవే. సినిమాల్లో పౌరాణిక, ఇతిహాస పాత్రలను జోడించి అద్భుతంగా తెరకెక్కించారు. హీరోయిన్లను అందంగా చూపిస్తూ తెలుగుదనం ప్రతిబింబించే విధంగా చిత్రాలను రూపొందించారు బాపు. ఆయన సినిమాల్లో పాటలు, డ్యాన్సులు అందర్నీ ఆకట్టుకుంటాయి. తెలుగుదనానికి దగ్గరగా కనిపించే హీరోయిన్లను తన సినిమాల్లో నటింపచేశారు బాపు.

surya telugu

 

సెప్టెంబర్ 5, 2011 Posted by | సంస్కృతి | , | 2 వ్యాఖ్యలు

ఆచార్యదేవోభవ

ద గైడ్‌ ఆచార్యదేవోభవ

Sarvepalli-Radhakrishnanఅఆలు నేర్పిన ఉపాధ్యాయుడినుంచి విద్యాభ్యాసం పూర్తయ్యేవరకు పాఠం చెప్పిన ప్రతిఒక్కరూ గురువే. గురువంటే మార్గదర్శి. ద గైడ్‌. జీవనయానంలో ఉన్నతస్థానానికి ఎదగాలంటే అక్షరాలు దిద్దిననాటినుంచి వెన్నంటి ఉండి, తీర్చిదిద్ది ఉత్తమ పౌరునిగా, ఉత్తమ వ్యక్తిగా ఎదగడానికి దోహదపడే శక్తియుక్తుల్ని నేర్పేవారే ఆచార్యులు. అందుకే పూర్వం తల్లిదండ్రుల తర్వాత స్థానాన్ని గురువుకు ఇచ్చి ఆచార్యదేవోభవ అన్నారు. అసలు గురువును బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరులతో పోల్చారంటే వారికి లభించిన గౌరవం, మన్నన అర్థం చేసుకోవాలి.

పురాణేతిహాసాల్లో ఓ విశ్వామిత్రుడు, ఓ ద్రోణాచార్యుడు తమ శిష్యులైన రామలక్ష్మణులను, అర్జునుడిని ఎలా తీర్చిదిద్దారో, వారిమధ్య గురుశిష్య సంబంధం ఎలా పరిఢవిల్లిందో తెలుసుకుంటే ఒళ్లు పులకరిస్తుంది. ఆనాటితో పోలిస్తే….ఇప్పుడు గురుశిష్య సంబంధాలు గతితప్పాయి. వారిమధ్య అప్పుడు గౌరవం, మన్నన ఉంటే ఇప్పుడు ఆయావర్గాల మధ్య స్నేహం పెరిగింది. ఆధునికభారతదేశంలో గురువంటే ఎలా ఉండాలో, శిష్యులపై ఎలాంటి ముద్రవేయాలో ఆచరించి చూపిన ఆచార్యుడు సర్వేపల్లి రాధాకృష్ణన్‌ను ఈ క్షణాన తలుచుకోవాల్సిందే. ఆయన చూపినబాటలో ఉపాధ్యాయ, విద్యార్థివర్గం పయనించాల్సిందే.

srkమన దేశ తొలి ఉపాధ్యక్షుడు, రెండవ అధ్యక్షుడు అయిన సర్వేపల్లి రాధాకృష్ణ సెప్టెంబర్‌ 5న జన్మించారు. ఆయన జన్మించిన రోజును దేశవాసులు ‘టీచర్స్‌ డే’గా జరుపుకుంటున్నారు. 1962 నుంచి 1967 వరకు దేశ అధ్యక్షుడిగా పనిచేశారు రాధాకృష్ణ. ఆ సమయంలో కొందరు విద్యార్థులు, స్నేహితులు రాధాకృష్ణన్‌ను కలిసి ఆయన జన్మదినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటామని పేర్కొన్నారు.

తన జన్మదినోత్సవానికి బదులు ఈ రోజును టీచర్స్‌డేగా జరుపుకోవాలని కోరారు. అప్పటి నుంచి రాధాకృష్ణన్‌ జన్మదినోత్సవాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం ప్రారంభించారు. మన దేశంలో టీచర్స్‌ డేకు సెలవు లేదు. ఈ రోజును ‘సెలబ్రేషన్స్‌ డే’గా ఘనంగా జరుపుకుంటున్నారు. పాఠశాల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి వేడుకలను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ రోజున కొన్ని పాఠశాలల్లో విద్యార్థులనే ఉపాధ్యాయులుగా పాఠాలు బోధించేటట్టు చేస్తారు. దీంతో విద్యార్థులకు ఉపాధ్యాయుల పట్ల భయం పోయి వారి పట్ల గౌరవ, మర్యాదలు పెంపొందుతాయి.

గొప్ప వేదాంతి…indiragandhi
సర్వేపల్లి రాధాకృష్ణ గొప్ప వేదాంతిగా పేరుతెచ్చుకున్నారు. 1888 సంవత్సరం సెప్టెంబర్‌ 5న జన్మించిన ఆయన 1975 ఏప్రిల్‌ 17న మృతిచెందారు. ఇక ఆయన దేశ తొలి ఉపాధ్యక్షుడిగా 1952 నుంచి 1962 వరకు పనిచేయగా దేశ అధ్యక్షుడిగా1962 నుంచి 1967వరకు పనిచేశారు. రాధాకృష్ణ తన వేదాంత పద్ధతులతో పాశ్చాత్య దేశాలు, మన దేశానికి మధ్య వారధిని నిర్మించేందుకు ప్రయత్నించారు.

ప్రారంభ జీవితం, విద్య…
సర్వేపల్లి రాధాకృష్ణ మద్రాస్‌ రెసిడెన్సీలోని తిరుత్తణి ప్రాంతంలో తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో (ప్రస్తుత తమిళనాడులోని తిరువల్లూర్‌ జిల్లా) ఆయన జన్మించారు. ఆయన మాతృభాష తెలుగు. ఆయన తల్లి పేరు సీతమ్మ. ఆయన బాల్య జీవితం తిరుత్తణి, తిరుపతి ప్రాంతాల్లో గడిచింది. ఆయన తండ్రి రెవిన్యూ అధికారిగా పనిచేశారు. తిరుత్తణిలోని ప్రైమరీ బోర్డు హైస్కూల్‌లో ప్రాథమిక విద్య ముగియగా, తిరుపతిలోని హెర్మన్స్‌బర్గ్‌ ఎవాంజెలికల్‌ లూథర్‌ మిషన్‌ స్కూల్‌లో సైతం ఆయన చదువుకున్నారు. మద్రాస్‌ క్రిస్టియన్‌ కాలేజీలో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేశారు. అనంతరం ఎం.ఎ. పూర్తిచేశారు. ఇక డాక్టర్‌ రాధాకృష్ణన్‌ అనుకోకుండా వేదాంతం చదువుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత వేదాంతంపై ఎంతో ఆసక్తి కనబరిచి అధ్యయనం చేశారు. ఈ నేపథ్యంలో వేదాంతంపై ఎన్నో రచనలు చేశారు. ఆయన రచనలు ఎందరినో ప్రభావితుల్ని చేశాయి.

గొప్ప ప్రొఫెసర్‌గా…
కోల్‌కతా యూనివర్సిటీలోని కింగ్‌ జార్జ్‌ వి చైర్‌ ఆఫ్‌ మెంటల్‌ అండ్‌ మోరల్‌ సైన్స్‌లో సర్వేపల్లి రాధాకృష్ణ ప్రొఫెసర్‌గా 1921 నుంచి 1935 వరకు పనిచేశారు. ఆ తర్వాత ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీలో 1936 నుంచి 1952 వరకు పనిచేయడం విశేషం. ఆయన ఉత్తమ అధ్యాపకుడిగా విద్యార్థులకు చక్కటి విద్యాబోధన చేస్తూ పలువురి ప్రశంసలనందుకున్నారు. ఆయన ప్రతిభకుగాను నైట్‌హుడ్‌(1931), భారతరత్న (1954), ఆర్డర్‌ ఆఫ్‌ మెరిట్‌ (1963) అవార్డులను అందజేశారు. ఇక 1909లో సర్వేపల్లి రాధాకృష్ణన్‌ మద్రాస్‌ ప్రెసిడెన్సీ కాలేజీలో ఫిలాసఫీ డిపార్ట్‌మెంట్‌లో పనిచేశారు. అనంతరం మైసూర్‌ యూనివర్సిటీ వేదాంతం ప్రొఫెసర్‌గా అతన్ని నియమించింది.

ఈ సమయంలో ఆయన ప్రముఖ జర్నల్స్‌ ద క్వెస్ట్‌, జర్నల్‌ ఆఫ్‌ ఫిలాసఫీ, ఇంటర్నేషనల్‌ జర్నల్‌ ఆప్‌ ఎథిక్స్‌కు ఎన్నో ఆర్టికల్స్‌ రాశారు. ఆయన తొలిసారిగా ‘ది ఫిలాసఫి ఆఫ్‌ రవీంద్రనాథ్‌’ అనే పుస్తకాన్ని రాశారు. ఆయన ఠాగూర్‌ ఫిలాసఫీని ఉత్తమ వేదాంతంగా పేర్కొన్నారు. ఇక రాధాకృష్ణన్‌ ఆంధ్రా యూనివర్సిటీ వైస్‌ఛాన్స్‌లర్‌గా 1931 నుంచి 1936 వరకు పనిచేశారు. 1939లో పండిత్‌ మదన్‌ మోహన్‌ మాలవ్య బనారస్‌ హిందూ యూనివర్సిటీ వైస్‌ ఛాన్స్‌లర్‌గా చేయాలని రాధాకృష్ణన్‌ను విజ్ఞప్తిచేశారు. దీంతో రాధాకృష్ణన్‌ బనారస్‌ యూనివర్సిటీ వైస్‌ ఛాన్స్‌లర్‌గా పదవీబాధ్యతలు స్వీకరించి 1948 సంవత్సరం జనవరి వరకు పనిచేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత డాక్టర్‌ రాధాకృష్ణన్‌ యునెస్కోలో ఇండియా ప్రతినిధిగా 1952 వరకు కొనసాగారు. ఇక 1952లో దేశ ఉపాధ్యక్షుడిగా ఆయన ఎంపికయ్యారు. ఆ తర్వాత దేశ రెండవ అధ్యక్షుడిగా 1962 నుంచి 1967 వరకు పనిచేసి ఎంతో పేరుతెచ్చుకున్నారు.

గురువును దైవంగా భావించి…
అనాదిగా మన దేశంలో గురువును దైవంగా భావించారు. తల్లి,తండ్రి, గురువులు దైవంతో సమానమని మన పెద్దలు చెప్పారు. ‘గురు బ్రహ్మ…గురు విష్ణు, గురు దేవో మహేశ్వరహ… గురు సాక్షాత్‌ పరబ్రహ్మ… తసై్మ శ్రీ గురవే నమః’ అని గురువును కీర్తించారు. గురువు త్రిమూర్తులతో సమానమని గురువును అభివర్ణించారు. ఒకప్పుడు మన దేశంలో గురుకులాలు ఉండేవి. తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ గురుకులాల్లో చిన్నవయసులోనే చేర్పించేవారు. అక్కడ గురువులు పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి కొంతకాలం తర్వాత వారిని తల్లిదండ్రుల వద్దకు తిరిగి పంపించేవారు. పురాణ ఇతిహాసాల్లో కూడా గురువులను చాలా గొప్పగా చూపించారు.

శ్రీరాముడు, లక్ష్మణుడు చిన్నతనంలో గురువు విశ్వామిత్రుడి వద్ద విద్యాబుద్ధులు నేర్చుకున్నారు. అడవుల్లోకి వెళ్లి రామలక్ష్మణులు విశ్వామిత్రుడి వద్ద ఉన్నారు. అస్త్ర శస్త్ర విద్యలతోపాటు సకల విద్యలు విశ్వామిత్రుడు నేర్పించారు. వారికి అన్ని విద్యలు నేర్పిన తర్వాత తిరిగి తండ్రి దశరథుడి వద్దకు పంపించారు. అదేవిధంగా ద్రోణాచార్యుడు కౌరవ, పాండవులకు సకల శాస్త్రాలు, అస్తశ్రస్త్ర విద్యలు నేర్పించారు. పాండవుల్లో అర్జునుడికి విలు విద్యను, భీముడికి గదాయుద్ధంలో శిక్షణనిచ్చారు. పాండవులు, కౌరవులను అన్ని విద్యలను నేర్పించిన గురువు ద్రోణాచార్యుడు. ఇక ఏకలవ్యుడు ద్రోణాచార్యుడి విగ్రహాన్ని రూపొందించి ఆయన్ని తన గురువుగా భావించి సొంతంగా అస్తశ్రస్త్రాలు నేర్చుకున్నాడు. అన్ని విద్యల్లో ఆరితేరాడు.

ఈ విధంగా పురాణ ఇతిహాసాల్లో గురువులకు ఉన్న ప్రాముఖ్యతను వివరించారు. ఆనాడు పిల్లలు తల్లిదండ్రులకు దూరంగా గురుకులాల్లో ఉంటూ గురువు వద్ద అన్ని విద్యలు నేర్చుకునేవారు. పూర్తిగా విద్యాబుద్ధులు నేర్చుకున్న అనంతరం గురువు వారిని తల్లిదండ్రులకు పంపించేవారు. ఇక నేడు కాలం మారింది. గురుశిష్యుల మధ్య అనుబంధం కూడా మారింది. నేడు విద్యార్థులు గురువులకు సరైన గౌరవ, మర్యాదలు ఇవ్వడం లేదు. అదేవిధంగా కొందరు గురువులు విద్యార్థులకు విద్యాబుద్ధులను నేర్పడంలో పూర్తి శ్రద్ధవహించడం లేదు. కాలేజీలలో గురువులను ఎదిరించి మాట్లాడుతున్న విద్యార్థులు కూడా ఉన్నారు. ప్రతిఏటా సెప్టెంబర్‌ 5న జరుపుకునే ఉపాధ్యాయ దినోత్సవంనాడు గురుశిష్యుల పవిత్రబంధం గురించి తెలియచేసుకోవాలి. విద్యార్థులు గురువులకు ఇవ్వాల్సిన గౌరవ, మర్యాదలను ఇవాళ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా గురువులు కూడా విద్యార్థులను తీర్చిదిద్దడంలో పూర్తి శ్రద్ధ వహించాల్సిన ఆవశ్యకతను కూడా ఈ దినోత్సవం గుర్తుచేస్తుంది.

తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే…Savitribaihusband
దేశంలోనే తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా సావిత్రిబాయి పూలే చరిత్రలోకెక్కారు. దేశంలోని తొలి మహిళా పాఠశాలను ప్రారంభించిన ఆమె ఉపాధ్యాయురాలిగా మహిళలకు విద్యాబోధన చేశారు. ఇక స్ర్తీ విద్య కోసం పాటుపడిన సంఘసేవకురాలు సావిత్రిబాయి. ప్రముఖ సంఘసేవకుడు జ్యోతిరావ్‌పూలే భార్య సావిత్రిబాయి ఆ కాలంలో మహిళా విద్య గురించి ఎంతో తపించారు. దళిత వర్గంలో పుట్టిన ఈ దంపతులు బ్రిటీష్‌ వారి కాలంలో మహిళల హక్కుల కోసం పోరాడారు. ఇక సావిత్రిబాయి పూలే దళితుల కోసం 1852లో మొదటి పాఠశాలను కూడా ప్రారంభించడం విశేషం.

ఆ కాలంలో స్ర్తీలు బయటకు వెళ్లనిచ్చేవారు కాదు. కానీ సావిత్రిబాయి పూలే బాలికలకు విద్యాబుద్ధులు నేర్పేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చారు. అప్పటి ఛాందసులు ఆమెపై కుళ్లిన గుడ్లు, ఆవు మాంసం, టమాటాలు, రాళ్లు విసిరి హింసించేవారు. కానీ సావిత్రిబాయి వీటికి జంకకుండా ధైర్యంగా తిరిగేవారు. ఆమె భర్త జ్యోతిరావ్‌ పూలే తన భార్యకు పూర్తి అండగా ఉంటూ ఆమెను ప్రోత్సహించారు. దీంతో ఆమె దేశంలోనే మహిళల కోసం 1848లో తొలి పాఠశాలను ప్రారంభించి అక్కడ మొదటి ఉపాధ్యాయినిగా పాఠాలు బోధించారు. మొదట వివిధ కులాలకు చెందిన తొమ్మిది బాలికలు ఆమె పాఠశాలలో చేరి చదువుకున్నారు. ఆ తర్వాత సమాజంలో కొంత మార్పు వచ్చి తల్లిదండ్రులు తమ అమ్మాయిలను చదువుకునేందుకు పాఠశాలకు పంపించడం ప్రారంభించారు. దీంతో సావిత్రిబాయి మహిళల కోసం మరో ఐదు పాఠశాలలను ప్రారంభించడం విశేషం. చివరికి బ్రిటీష్‌ ప్రభుత్వం స్ర్తీ విద్య కోసం ఆమె కృషిని గుర్తించి ఘనంగా సత్కరించింది.

ఆదర్శప్రాయమైన వ్యక్తి ఉపాధ్యాయుడు..Chukaramaiah.jpg
సమాజంలో ఆదర్శవంతమైన వృత్తి టీచర్‌. అలాంటీ వృత్తికి వన్నెతెచ్చిన మహానుభావుడు సర్వేపల్లి రాధాకృష్ణ. నేడు ఉన్నతమైన స్థానాల్లో ఉన్న ప్రతి మనిషికి విద్యాబుద్ధులను నేర్పించిన గురువులకు ఈ రోజు శుభాకాంక్షలు.నిరంతరం విద్యార్థి విజయాన్ని ఆకాంక్షించేది కేవలం గురువు మాత్రమే అనడంలో సందేహం లేదు.ఎందరో రాజకీయంగా,ఆర్థికంగా ఎదిగిన వారిలో నేటికి గురువుల పట్ల గౌరవం ఉంది.తన విద్యార్థులను అన్నింటీలో ముందుంచాలని తాపత్రయపడే వాడు నిజమైన ఉపాధ్యాయుడు.

-చుక్కా రామయ్య,ఎం.ఎల్‌.సి

నైతిక విలువలు కాపాడాలి….sultana
నేటీ సమాజంలో ఉపాధ్యాయులను కేవలం హాస్యానికి ప్రతిరూపాలుగా సినిమాల్లో చూపిస్తు న్నారు.ఈ దుస్సంసృ్కతి వల్ల విద్యార్థులు గురు వుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఇంతకు పూర్వం గురువులను పాఠశాల ప్రాంగణంలోనే కాకుండా ఎక్కడ కన్పించిన మర్యాద,గౌరవం లభించేది.కానీ ఆధునికరణ మోజులో వారి విలువలను తుంగలో తొక్కుతున్నారు.ఇలాంటి సంప్రదాయాలకు ముగింపు పలికి గురువును గురువులాగా గౌరవించాలి.

-సుల్తానా, విశ్రాంతఉపాధ్యాయురాలు.

>అన్నింట మొదటి స్థానం గురువుదే…Nageswarao.k
ఒక విద్యార్థి ఉన్నతంగా ఉన్నాడంటే అది గురువు నేర్పిన విద్యకు ప్రతిఫలం.అదే విద్యార్థి ఎదగలేకపోవడానికి కూడా అదే గురువు కారణం.విద్యార్థులను అను నిత్యం ప్రోత్సహిస్తు ముందుకు వెళ్ళనిచ్చె ఉపాధ్యాయుడు నిజంగా దేవుడితో సమానం.అలాంటీ దేవుళ్లకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.టీచర్ల పట్ల విద్యార్థులు సత్ప్రర్తన కల్గి ఉండాలి.తమ అభ్యునతికి కృషి చేస్తున్న వారిని గౌరవించాలి.

– నాగేశ్వర్‌రావు,ఎం.ఎల్‌.సి

మా ఉన్నతికి గురువులే కారణంsami
గ్రామీణ ప్రాంతానికి చెందిన నేను ఈ రోజు ఉన్నత స్థానంలో ఉన్నానంటే అది నాకు విద్య నేర్పిన నా గురువుల చలువే.అలాంటీ గురువు లను విస్మరించిన నాడు నా చదువుకు విలువ ఉండదు.నేనే కాదు ప్రతీ విద్యార్థి తనకు విద్యాబుద్ధులు నేర్పించిన గురువుకు జీవితాంతం రుణపడిఉండాలి.విద్యలేని వాడు వింత పశువు అన్నట్లు,గురువులను గౌరవించనివాడు పవువుకంటే హీనం.

-సమి.డి.డి.యం. (ఇండియన్‌ ఎలాక్ట్రానిక్‌ గవర్నెన్స్‌)

సంస్కారాన్ని నేర్పించారుdontula-ramesh
ఉన్నత చదువులు చదివినంత మాత్రాన సరిపోదు,ఆ చదువులను నేర్పించిన గురువులు కలకాలం గౌరవించాలి.ఉపాధ్యాయులు నేర్పిం చిన విద్యాబుద్ధులే నేడు సమాజంలో నన్ను ఉన్నత స్థానంలో నిలిపింది.అన్ని వేళల నా గురువులకు అభిమానపాత్రుడిగా ఉంటాను. గురువులందరికి గురుపూజోత్సవ శుభాకాంక్షలు.

దొంతుల రమేష్‌ (సివిల్స్‌ విద్యార్థి)

స్నేహంగా వుంటూ మార్గనిర్దేశం చేస్తున్నారు 4RE5VJA
మా అధ్యాపకులు మాతో చాలా స్నేహంగా వుంటున్నారు. స్కూల్‌ టీచర్స్‌తో పోల్చిచూస్తే కాలేజ్‌ లెక్చరర్స్‌ చాలా సన్నిహితంగా వ్యవహరిస్తూ సబ్జెక్టులపైన పూర్తి అవగాహన కల్పిస్తున్నారు. పాఠ్యాంశాలను ప్రయోగాత్మకంగా విశదీకరిస్తూ భవిష్యత్‌ మార్గనిర్దేశనం చేస్తు న్నారు. కొద్దిపాటి అంతరాలున్నా మొత్తం మీద స్నేహపూరిత వాతావరణంలోనే చదువు సాగుతోంది.

– రష్మి, ఇంటర్మీడియట్‌ విద్యార్థిని, విజయవాడ

ఆచార్యదేవోభవ.. ఆ కాలం పోయింది 4RE1VJA3
పాతకాలంలో విద్యార్ధులు తమ గురువులపై పూజ్య భావం కలిగివుండేవారు. ఆచార్యదేవోభవ అనే మాట కాలగర్భంలో కలసిపోయి భయం, వినయం కనుమరుగయ్యాయి. అధ్యాపకులు విద్యార్ధులకు మార్గదర్శకులుగా పని చేస్తూ వారితో అభిరుచి మేరకు బోధనాశైలిని అవలంభించాలి.

– ఆర్‌.శారద., ప్రభుత్వ అధ్యాపకురాలు, విజయవాడ

స్నేహపూరిత వాతావరణం పెరిగింది 4RE1VJA1
నాటికి నేటికీ పోల్చితే గురు శిష్యుల మధ్య స్నేహపూరిత వాతావరణం వృద్ధి చెందింది. విద్యార్ధులు భవిష్యత్‌ ప్రణాళికతో అధ్యయనం చేస్తూ అందుకు అవసరమైన సహకారాన్ని ఉపాధ్యాయుల వద్ద నుండి పొందే ప్రయత్నం చేస్తున్నారు. దండనతో కాకుండా విద్యార్ధులకు అర్ధమయ్యే రీతిలో బోధించడానికి ప్రాధాన్యతనిస్తున్నాం. ఒకప్పటితో పోల్చినపుడు విద్యార్ధులకు గురువుల వద్ద ఒకింత చనువు పెరిగిందనే చెప్పాలి.

– జె.ఎన్‌.కుసుమకుమారి., ప్రభుత్వోపాధ్యాయురాలు, విజయవాడ

విద్యార్ధుల దృక్పదంలో మార్పు వచ్చింది 4RE1VJA4
పాత తరం విద్యార్ధులతో నేటి తరం వారిని తరచి చూస్తే ఆధునిక విద్యార్ధుల దృక్పదంలో చాలా మార్పు వచ్చింది. గురువులంటే భయం లేకుండా వారికి తగిన గౌరవం ఇస్తూ సందేహాలకు సమాధానాలను ఎటువంటి సంకోచం లేకుండా గురువుల నుండి రాబట్టుకుంటున్నారు. విపరీతమైన పోటీ వాతావరణం విద్యార్ధులు ఉపాధ్యాయుల సంబంధాలను ప్రభావితం చేస్తుంది.

– కె.సునీల్‌రాజు., ప్రభుత్వ అధ్యాపకులు, విజయవాడ

విద్యార్ధుల్లో భయం పోయింది 4RE1VJA2
ఒకప్పుడు గురువంటే విద్యార్ధులకు గౌరవభావం, భయం వుండేవి. ప్రస్తుతం భయం పోయి విద్యార్ధులు తమ అధ్యాపకులను కూడా స్నేహితుల్లా భావిస్తున్నాం. విద్యార్ధులకు మాకు మధ్య అంతరాలను తగ్గించుకుని వారితో సన్నిహితంగా మెలగుతూ విద్యా బోధన చేస్తున్నాం.

– జె.వెంకటేశ్వరరావు., అధ్యాపకులు, విజయవాడ.

surya telugu

సెప్టెంబర్ 5, 2011 Posted by | సంస్కృతి | , | 3 వ్యాఖ్యలు

పితృ దేవో భవః నేడు ఫాదర్స్‌ డే

పితృ దేవో భవః నేడు ఫాదర్స్‌ డే

పిల్లల్ని కనిపెంచటం…వారికి విద్యాబుద్ధులు నేర్పించటం… వారి బంగారు భవిష్యత్తును అందంగా తీర్చిదిద్దటంలో తల్లిదండ్రుల పాత్ర సమానంగావున్నా తల్లికి లభించే గుర్తింపే ఎక్కువ. అంటే తల్లి ప్రేమ సెంటిమెంట్‌గా వ్రాసే కథలు, కవితలు, తీసే సినిమాలు… వీటన్నింటిని చూస్తే తండ్రి పాత్రకు అంతగా ప్రాధాన్యత లభించడం లేదని చెప్పుకోవచ్చు. బిడ్డ కోసం అమ్మ చేసే త్యాగం, ఎంత ముఖ్యమైనదో… నాన్న పడే తాపత్రయం, శ్రమ అంతే ముఖ్యమైనవి.

కానీ తండ్రి శ్రమ, అభిమానం, తాపత్రయం.. అన్నీ పరోక్షమైనవి. నవమాపాలు మోసి పిల్లల్ని కనటం వలన స్ర్తీ (తల్లి)దే పైచేయి. పైగా పిల్లల అవసరాలరీత్యా బాల్యం అంతా అమ్మ చుట్టూ తిరుగుతుంది. అందుకే అమ్మతో ఆ బంధం అంత సులభంగా, సహజంగా ఏర్పడుతుందనటంలో అతిశయోక్తి లేదు. కానీ తండ్రి పిల్లలకు అవసమైన సదుపాయాలను సమకూరుస్తూ వారికి ఏ లోటు రాకుండా చూస్తాడు. పిల్లల దగ్గర ఎప్పుడూ తల్లి ఉండేటట్టు చూసి వారిని కంటికి రెప్పలా కాపాడుతుంటాడు. ఈ నేపథ్యంలో తల్లితో పాటు తండ్రికి కూడా సమాన గౌరవం ఇవ్వాలన్ని ఉద్దేశ్యంతో ప్రతి ఏటా జూన్‌ 19వ తేదీన ‘ఫాదర్స్‌ డే’ను జరుపుకుంటున్నారు.

fdayభార్య గర్భం దాల్చిన దగ్గర్నించి ఆమెతో పాటు సమానంగా ఆమెను, ఆమె కడుపున వున్న బిడ్డను కూడా ఎంతో జాగ్రత్తగా చూసుకునే తండ్రుల సంఖ్య పెరిగింది. ప్రసవం సమయంలో, ప్రసవానంతర సమ యంలో స్ర్తీకి ధీటుగా స్ర్తీకన్నా ఎక్కువగా కూడా పుట్టిన బిడ్డని ఎంతో జాగ్రత్తతో కూడిన మమకారంతో చూస్తు న్న తండ్రుల సంఖ్య గణనీయంగా పెరిగింది అనటంలో అతిశయోక్తి లేదనే చెప్పాలి. అసలు కొన్ని చోట్ల విదే శాల్లో పురుషునికి కూడా మెటర్నటీ లీవ్‌ ఇస్తారని వినికిడి.

మన దేశంలో కూడా ఇలా భార్యను, పిల్లల్ని బాధ్యతగా ప్రెగ్నిన్సీ నిర్ధారణ జరిగిన రోజు నుంచి అత్యంత ఆదరంగా, అభిమానంగా, చూసే భర్తలు ఎంద రో? అంటే అలాంటి తండ్రులకి.. నేడు ఫాదర్స్‌ డే గ్రీటింగ్స్‌ చెప్పాల్సిన బాధ్యత మనకి లేదా?? తల్లి స్థానం ‘నిజం’ అని తండ్రి స్థానం ‘నమ్మకం’ అనే మాటను వినే వుంటారు చాలామంది. తండ్రి ఎవరో తల్లి చెప్తే తప్ప తెలీదు అనే స్ర్తీవాదులున్నప్పటికీ సైంటిఫిక్‌గా అది నిజం కానే కాదుట. పసి పిల్లలు తమ తండ్రిని గుర్తిస్తారు ట. కళ్లు తెరచినప్పటి నుంచీ తమ తల్లితో పాటుగా తండ్రి కోసం కూడా వెతుకుతారుట. అంటే తమ తండ్రి స్పర్శను వారు చక్కగా గుర్తించగలరు. తల్లి, తండ్రులు, బిడ్డల మధ్య పెనవేసుకున్నది ‘జెనిటిక్‌ బాండ్‌’. అది తరతరాలకి పాకే అపూర్వ నిధి.

మార్గదర్శకుడిగా తండ్రి…
‘ధైర్యం నాన్న ఇచ్చేది…భద్రత నాన్న ఇచ్చేది…క్రమశిక్షణ నాన్న నేర్పేది…అవసరాలు నాన్న తీర్చేవి… పిల్ల లకు తండ్రి రోల్‌ మోడల్‌…‘బిడ్డల అభివృద్ధే నాన్న లక్ష్యం…తండ్రి ప్రభావం కన్పించేది కాదు… అనుభవిం చేది…వందమంది ఉపాధ్యాయుల పెట్టు ఒక తండ్రి…తండ్రి కోపం వెనుక బాధ్యత వుంది…‘ఎలా బ్రతకాలో నేర్పించడు తండ్రి.. కాని బ్రతకటం ఎలాగో తన పిల్లలకి తెలిసేట్లుగా నేర్పిచగలడు…మంచి తండ్రి వున్న బిడ్డలు ధన్యులు..’.ఇలా ఎన్నో చెప్పగలము తండ్రి గురించి. అసలు తండ్రి చూపే అభిమానం, బాధ్యతలు ఎవరికీ స్పష్టంగా కంటికి కనపడవు. కానీ ప్రభావం చాలా వుంటుంది. ఒకప్పటి తం డ్రులు తమ హాబీలకు, ఇతర సుఖాలకు ప్రాధాన్యత ఇచ్చాకే కుటుంబం, భా ర్య, పిల్లలు అన్నట్లుగా వ్యవహరించినా… నేటి తరంలో తండ్రులు చాలా జాగ్రత్తగా ప్రణాళికాబద్ధంగా పిల్లల చదువులు, కెరీర్‌ విషయాల్లో ఆలోచిస్తున్నారు.

ఈ తరం తండ్రులు…

  • పెత్తనానికి ప్రాధాన్యత ఇవ్వటం లేదు.
  • ఇంటి పనుల్లో సంపూర్ణంగా చేదోడు, వాదోడుగా వుంటున్నారు.
  • పిల్లలకి అనుగుణంగా స్నేహితుల్లా వ్యవహరిస్తున్నారు.
  • పిల్లల భావోద్వేగాలు చక్కగా అర్థం చేసుకుంటున్నారు.
  • అదనపు బాధ్యతలు మోయటంలో ఉత్సాహంగా వున్నారు.
  • హాబీలు, అవసరాలు కూడా విస్మరిస్తున్నారు.
  • బిడ్డలపట్ల అపరిమితమైన వాత్సల్యాన్ని చూపిస్తున్నారు.
  • స్ర్తీ ఉద్యోగ, ఆరోగ్య రీత్యా ఇబ్బంది పడినా తను మాత్రం సంతోషంగా అన్నీ బాధ్యతలు మోయటం గమనార్హం.
  • పురుషాహంకారం అనే మాటకి అవకాశం లేకుండా పిల్లల స్నానం, భోజనం, తినిపించటం అన్నీ తానే చూస్తున్నారు.
  • పిల్లల్ని ఎత్తుకు తిప్పటం, లాలించడం, ఆడిం చటం అనే పనులకి అత్యధిక సమయాన్ని కేటాయి స్తున్నారు. తమ పనులు, అవసరాలు కూడా మరచిపోయి.ఒక్కపుడు ‘‘అమ్మ కూచి’’ ‘‘బామ్మ కూచి’’… అన్న మాటలు నేడు చాలా వరకూ (ఈనాటి తండ్రుల హయాంలో) వినబడటం లేదు. ‘‘నాన్న కూచి’’ అన్నదే తరచుగా మనకి వినబడుతున్నది. అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా వాళ్ళు ‘‘నాన్న కూచులే’’! అయిపోతున్నారు.

fday1

   సహనం, ప్రేమ, అనురాగం, అభిమానం, బాధ్యత.. ఆలనా, పాలనా… అన్నిటా తల్లులను మించిపోతు న్నారు నేటి తండ్రులు. పిల్లలు పసి మొగ్గలు కదా! వారికి ఎవరో నేర్పక్కరలేదు.‘అమ్మని.. నాన్నని అభిమానించమని కాని నేటి సిసింద్రీ లు ‘నాన్న కావాలి, నాన్నతో వెడతాం అనటం చాలా విడ్డూర మా? కాదు, అలా పిల్లల్ని పెంచటంలో తండ్రులు తీసుకునే పాత్ర అలా వుంది.‘తండ్రి ఎటువంటి వాడైనా తన కన్న బిడ్డల క్షేమాన్ని అభివృద్ధి ని కోరుకుంటాడు అనటంలో అనుమానమే లేదు.
   ఎవరి మెప్పుకోసమో తన కు టుంబం కోసం తండ్రులు పాటుపడరు. అయినా సంఘంలో తల్లి పాత్రకి వచ్చి నంత గుర్తింపు తండ్రి పాత్రకి రావటం లేదు. పిల్లల ఆర్ధిక అవసరాలు తీర్చటం, పిల్లల విద్యాబుద్ధులు నేర్పటం, భార్య పిల్లలు అవసరాలు గుర్తించటం, ఇంటి యజమానిగా తగిన సరియైన నిర్ణయాలు తీసుకోవటం.. ఇవి తండ్రి బాధ్యతలుగా సంఘం నిర్దేశించింది.అవసరాల రీత్యా చిన్నతనంలో అందునా బాల్యంలో తల్లికి అతి దగ్గరైన పిల్లలు సైతం వయసు వచ్చే కొద్దీ త మ తండ్రి విలువను తెలుసుకొని, ఆయన మనసుని అర్థం చేసుకొని – ఆయన్నీ గౌరవిస్తారు. అసలు పిల్ల లకి తొలి ‘హీరో తమ తండ్రే’’! పిల్లలు పసితనం నుంచి ఊహ తెలిసే లోపల ఏ టివి యాడ్‌ చూసినా అం దులో పురుషపాత్ర కనపడగానే నాన్న… డాడీ అని పిలవటం నేర్చుకోటం చూస్తుంటాం!

సమాజంలో…

   మన సమాజంలో తండ్రుల మీద ఒక రకమైన భావం వుంది. భర్తను పోగొట్టుకున్న స్ర్తీ మరో వివాహం చేసు కోదు. పిల్లల కోసం బ్రతుకుతుంది. కానీ భార్య మరణించిన వ్యక్తి మరో వివాహానికి సిద్ధపడతాడు అంటా రు. తల్లులలాగా తండ్రులు పిల్లల కోసం త్యాగం చేయరని ఒక బలమైన అభిప్రాయం. ఇది సామాజి కంగా వున్న అభిప్రాయమే తప్ప, పిల్లల్ని నిర్లక్ష్యంతో తండ్రి వివాహం చేసుకోవటం కానేకాదు. పిల్లల బాగోగులు చూసేందుకే అతను మరొ పెళ్ళి చేసుకొనే ఆలోచన అన్నది అంతరార్ధం!

ఎప్పటి నుంచి జరుపుకుంటున్నారు…

   బాధ్యత గల పౌరులుగా పిల్లల్ని తీర్చిదిద్దే తండ్రి పాత్ర ప్రాముఖ్యతను గుర్తించి ప్రశంసిస్తూ చేసే అందమైన రోజు ‘ఫాదర్స్‌ డే’. ప్రపంచ వ్యాప్తంగా తండ్రి పాత్ర కీలకమైనా గత శతాబ్ది వరకు పిల్లల జీవి తంలో తండ్రి పాత్రకు సంబంధించిన అధికారిక గుర్తింపు లేదు. అసలు ఫాదర్స్‌డే ఉత్స వాలను జరపాలని ఆ అవసరా న్ని గుర్తించిన మహిళ లవింగ్‌ డాటర్‌ సొనారా. ఆమె వాషింగ్‌టన్‌లోని స్పొకన్‌కు చెందింది. ఆధునిక ఫాద ర్స్‌డే ఉత్సవాలకు మూలం.
   ‘అమెరికా సంయుక్త రాష్ట్రాలు’ అయినా అన్ని ప్రపంచ దేశాలకు పాకింది తండ్రులందరి గౌరవా ర్ధం ఈ పండుగ! 1909లో మదర్స్‌డే అనే మాట స్మార్ట్‌ కుటుంబంలో తండ్రి పోషించిన పాత్ర ‘ఫాదర్స్‌’ డేకి పునాధి అయ్యింది. అసలు దాని వెను క కథ! హెన్రీ జాక్సన్‌ స్మార్ట్‌, విలియమ్‌ స్మార్ట్‌ దంపతులు స్పోకనే గ్రామంలో వుండేవారు. వారికి ఆరుగురు సంతానం. వారిలో చివరి సంతానం ‘సొనారా’, ఆమె ఆరు నెలల వయసులో తల్లి మరణించింది. అందరికన్నా పెద్దపిల్ల 12 సంవత్సరాలు. ఇది 1885 నాటి స్థితి ఇది. అయితే అపుడు అతను (తండ్రి) మరల వివాహం చేసుకోవచ్చు.
   ఆ అవకాశం, హక్కు సమాజంలో వున్నాయి. కానీ తను వివాహం చేసుకొని సం సార సుఖం కన్నా కూడా తండ్రిగా తన పాత్రను నిర్వహించేందుకు చాలా ఇష్టపడ్డాడు. వ్యవసాయం చేస్తూనే ఆరుగురు బిడ్డలకీ తల్లి లేని లోటు తెలీకుండా పెంచాడు. ఆఖరిదైన సొనారాకి ఆయనే తల్లి తండ్రి అయ్యి పాలు పట్టటం, స్నానం, ఆహారం, జోల పాడి నిద్రపుచ్చటం, అన్నీ చేసి తల్లి పాత్రను అద్భుతంగా పోషించాడు. అసలు ఆయన పెంపకంలో ఆమెకి తల్లి అనేది వుంటుందని… తల్లి పాత్ర ఒలా వుంటుందని కానీ తెలీలేదు. ఆమెకి తెల్సింది తనని కంటికి రెప్పలా కాపాడిన తండ్రి.. ఊహ తెల్సింది మొదలు కళ్ళ ముందు తండ్రి. దైవంలా తనను కాపాడిన ఆ తండ్రి రుణాన్ని తీర్చుకోవటం కోసం బాగా ఆలోచించింది.. అందులోంచి వచ్చినదే వేడుకగా ‘‘అతని పుట్టిన రోజు ఘనంగా నిర్వహించటం’’.
   తన తండ్రి మిగిలిన తండ్రిలా కాదు. ఆషామాషీగా నిర్వహించకూడదు. తమ కోసం ఎంతో త్యాగం చేసిన మానవతా మూర్తి. అందుకే ఆయన జన్మదినాన్ని తండ్రులందరి జన్మదినంగా జరపాలని ఆమె అనుకుంది. కానీ ఆయన పుట్టిన తేదీ తెలీదు కానీ జూన్‌ నెలలో పుట్టినట్లుగా తెల్సు. అందుకే జూన్‌ నెలలో ఒక రోజు గ్రామంలోని వారందరినీ పిలిచి ఈ పుట్టిన రోజు కేవలం తన తండ్రిదే కాదని, అందరి తండ్రులందరిదీ అని తండ్రులు నిర్వహిస్తున్న పాత్రను మొత్తం సమాజం తెలుసుకొనే రోజని, పిల్లలకి విలువలు తెలిపే రోజని, దీన్ని ‘ఫాదర్స్‌ డే’ గా జరుపుకుందాం అని ప్రకటించింది సొనారా! పైగా మదర్స్‌డే వున్నపుడు ఫాదర్స్‌ డే కూ డా ఎందుకు నిర్వహించరాదని సొనారా ప్రశ్నించింది. అంతా నవ్వుకున్న కూడా ఆమె ‘ఆ ఫాదర్స్‌ డే’ గుర్తిం పు కోసం నిజాయితీగా తీవ్రంగా ప్రచారం ప్రయత్నించింది 1910 జూన్‌ 19వ తేదీన ‘స్పోకన్‌’లో తొలి ఫాదర్స్‌డే జరుపుకున్నపుడు ఆమెకు తొలి విజయ సంకేతాలు కన్పించాయి. మినిిస్టీరియల్‌ అసోసియేషన్‌ స్థానిక యంగ్‌మెన్‌ క్రిస్టియన్‌ అసోసియేషన్‌ (వైఎంసిఎ)ల మద్ధతుతో ఈ కార్యక్రమం జరిగింది.
   అసలు మొదట జూన్‌ 5న మమతానురాగాలు అందించే తండ్రి పుట్టిన రోజును ఫాదర్స్‌డేగా నిర్వహించాల నుకున్న కూడా ఏర్పాట్లకి తగిన సమయం లేక జూన్‌ 3వ ఆదివారం నాడు నిర్వహించారు. అయితే 1916 లో ఉడ్రోవిల్మన్‌ అధికారికంగా ఆమోదించాడు. 1966 జూన్‌ 3వ ఆదివారం ఫాదర్స్‌డే నిర్వహించాలని తీర్మానంపై అప్పటి అధ్యక్షుడు ‘లిండన జన్మన్‌’ సంతకాలు చేసాడు. 1972లో ‘రిచర్డ్‌ నిక్మన్‌’ (అప్పటి అధ్యక్షుడు) జూన్‌ 3వ ఆదివారం ఫాదర్స్‌డే నిర్వహించాలని శాశ్వత జాతీయ ప్రతిపత్తిని కల్పించారు. ఆనా టి నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఫాదర్స్‌డే ప్రసిద్ధి పొందింది.
   నేటి ఆధునిక ఫాదర్స్‌డే మాత్రమే కాక తండ్రులకి ప్రత్యేక రోజును కృతజ్ఞతా సూచకంగా కేటాయించి న ట్లు అనేక వేల సంవత్సరాల క్రితం ఉందని చరిత్రకారులు అంటారు. బాబిలోన్‌ శిధిలాల్లో లభించినట్లు చేస్తారు ఫాదర్స్‌డే ఆనవాళ్లు!ఎల్మెసు అనే పిల్లాడు నాలుగు వేల సం క్రితం మట్టితో కార్డు తయారు చేసి దానిపై ఫాదర్స్‌ డే సందేశాన్ని చెక్కించినట్లు చరిత్రకారులు చెప్తారు. అందులో తన తండ్రి మంచి ఆరోగ్యంగా దీర్ఘకాలం జీవించాలని ఎల్మేసు తండ్రికి ఏం జరిగిందన్నది అన్నట్లు: ఫాదర్స్‌డే ఉత్సవాలు మాత్రం ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో జరుపుకునే ఆచారం వుంది.

ఫాదర్స్‌ డే మూలం… సిద్ధాంతాలు…

   1908 – తొలి ఫాదర్స్‌ డే, చర్చ్‌ సర్వీస్‌, వెస్ట్‌ వర్జీనియా (కొందరి ఉద్దేశం)
   ఇంకొందరు వాషింగ్టన్‌లో వాంకోడర్‌లో, తొలి ఫాదర్స్‌డే అంటారు
   1915 – చికాగో లయన్స్‌ క్లబ్‌ అధ్యక్షుడు హ్యారీమీక్‌ జరిపాడంటారు.
   మరికొందరు చరిత్రకారులు ‘‘ఫాదర్స్‌ డే ప్రారంభ ఘనతను వెస్ట్‌ వర్జీనియాకు చెందిన శ్రీమతి చార్లెస్‌ క్లేట న్‌ది అని అంటారు. పాశ్చాత్య దేశాల నుంచి దిగుమతి అయిన వేడుక ఇది. మన దేశంలో దీని వయస్సు శతాబ్ది కాలం లోపే.

బయటే కాదు ఇంటి పనులు కూడా…

   ఒకప్పుడు తల్లి మాత్రమే పిల్లలతో చాలా చనువుగా ఉండేది. కానీ నేడు మారుతున్న కాలానికి అనుగుణంగా తండ్రి కూడా పిల్లలను దగ్గరకు తీసుకొని వారితో చనువుగా ఉంటున్నాడు. పిల్లలను స్నేహితులుగా చూస్తున్న తండ్రులు కూడా నేడు ఉన్నాడు. ఇంటి పనులతో పాటు ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తిస్తున్న తల్లి మాదిరిగానే తండ్రి కూడా ఒకవైపు ఉద్యోగం చేస్తూ అవసరమైతే ఇంటి పనులను కూడా చేస్తున్నాడు.

-సరళ, విద్యార్థిని

అమ్మానాన్నంటే ప్రాణం…

   మా నాన్నంటే నాకెంతో ఇష్టం. ఆయన నన్ను కంటికి రెప్పలా చూస్తాడు. పెద్దయిన తర్వాత కూడా చిన్నప్పటి ప్రేమ ఏమాత్రం తగ్గలేదు. నాతో కలిసి సినిమాలు, షికార్లకు కూడా వస్తాడు. నాన్న, నేను మంచి స్నేహితులుగా ఉంటాం. ఇక అమ్మ నన్ను ఎంతో గారాబం చేస్తుంది. అమ్మ, నాన్న ఇద్దరూ నాకు ప్రాణం.

– శ్రీకాంత్‌, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి

నాన్నవల్లే క్రమశిక్షణ…

   చిన్నప్పటి నుంచి నాన్నకు నేనంటే ఎంతో ఇష్టం. అంతమాత్రాన నన్ను బాగా గారాబం చేయలేదు. నాకు ఎప్పుడూ ఎలా నడుచుకోవాలే చెబుతూ ఎంతో క్రమశిక్షణగా పెంచాడు. మంచి,చెడు గురించి చెప్పి సన్మార్గంలో పయనిస్తేనే సమాజం లో అందరి దృష్టిలో మంచివారిగా మిగిలిపో తామని చెబుతాడు. నాన్నవల్లే నాకు క్రమశిక్షణ అబ్బింది.

-రూపల్‌, విద్యార్థిని

తల్లితో సమానంగా తండ్రికి గౌరవం..

   మాతృదేవో భవః…పితృదేవో భవః…అని అన్నారు మన పెద్దలు. తల్లితో పాటు తండ్రికి సైతం సమాన గౌరవం ఇవ్వాలి. తల్లి కని పెంచితే తండ్రి కంటికి రెప్పలా కాపాడతాడు. తన పిల్లకు అవసరమైన సదుపాయాలన్నింటినీ కల్పిస్తాడు. తల్లి ఇంట్లో ఉండి ఇంటి పనిచేసుకుంటూ పిల్లలను పోషిస్తే…తండ్రి ఉద్యోగం చేసి ఇంటికి, పిల్లలకు కావాల్సిన సౌకర్యాలను సమకూరుస్తాడు. తల్లిలాగా పిల్లలతో చనువుగా ఉండలేకపోయినా తండ్రి పిల్లలను దారిలో పెట్టేందుకు వారిని కోప్పడతాడు. క్రమశిక్షణతో మెలిగే విధంగా చూస్తాడు.

-సురేష్‌, ప్రైవేట్‌ ఉద్యోగి

డా ఈడుపుగంటి పద్మజారాణి

suryatelugu

 

జూన్ 19, 2011 Posted by | సంస్కృతి | , | 1 వ్యాఖ్య

కొయ్యబొమ్మలు కొనేవారేరి ?

కొయ్యబొమ్మలు కొనేవారేరి ?

koiahbommalu3 కోటనందూరుబొమ్మలంటే ముచ్చటపడనివారుండరు. చిన్నారుల నుంచి పెద్దల వరకు బొమ్మలంటే అందరికీ ఇష్టమే. ఇటువంటి బొమ్మల పేర్లు చెప్పగానే కొండపల్లి, ఏటికొప్పాక గుర్తుకు రావడం సహజం. కోటనందూరు మండలంలో ఓ మారుమూల గ్రామం కొట్టాం. దశాబ్ధాల కాలం నుంచి ఆ బొమ్మల తయారీయే వృత్తిగా జీవిస్తున్న వారి జీవితాల్లో మాత్రం ఆశించిన వెలుగులు కానరావడం లేదు. కొయ్యబొమ్మలకు రూపం కల్పించి జీవంపోసే వారి జీవనం అప్పుల ఊబిలో,కష్టాల కడలిలో సాగుతోంది. షరా మామూలుగానే ప్రభుత్వ ప్రోత్సాహం కరువవుతోంది. తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల సరిహద్దుల్లోని కోటనందూరు మండలంలో గల కొట్టాం గ్రామంలో దశాబ్ధాల కాలం నుంచి కొయ్యబొమ్మల పరిశ్రమ కుటీర పరిశ్రమగా సాగుతుంది. అయినా దీనికి అంతగా గుర్తింపు లభించడం లేదు.

koiahbommalu సుమారు 80 ఏళ్ళక్రితం కొట్టాం గ్రామానికి చెందిన శొంఠేణం రామ్మూర్తి విశాఖ జిల్లా ఏటికొప్పాక గ్రామంలోని తన బంధువుల ఇంటికి వెళ్ళారట. అక్కడ తయారవుతున్న కొయ్యబొమ్మల పట్ల ఆకర్షితులయ్యారు. స్వగ్రామమైన పాతకొట్టాం వచ్చి కొయ్యబొమ్మల తయారీకి శ్రీకారం చుట్టారని చెబుతారు. విద్యుత్‌ మోటార్లు అందుబాటు లోలేని ఆ రోజుల్లో లేత్‌ను తిప్పేందుకు కూలీలను పెట్టేవారు. పూర్తి మానవ శక్తితో తయారైన ఈ కొయ్యబొమ్మలకు సహజ సిద్ధమైన రంగులను దిద్ది వాటిని అమ్ముకుని జీవనం సాగించేవారు. నాడు కూలీలుగా పనిచేసిన కొందరు ఈ బొమ్మల తయారీలో నైపుణ్యం సంపాదించి సొంతంగా బొమ్మల తయారీ ప్రారంభించారు.కొయ్యబొమ్మల తయారీ విధానం: ఈ ప్రాంతానికి విశాఖ జిల్లా సరిహద్దుల్లో ఉన్న కొండలపై అంకుడు చెట్లు ఉంటాయి.

koiahbommalu1 చాలాకాలంపాటు వాటిని వంట చెరకుగానే ఉపయోగించేవారు. ఆ కర్రతో అందమైన బొమ్మలకు జీవం పోయవచ్చని గుర్తించారు. ఆ కర్రను కొనుగోలుచేసి కళాకారులు లేత్‌మిషన్‌పై పదునైన ఉలులతో వివిధ బొమ్మలకు ప్రాణం పోస్తున్నారు. వీటికి లక్కతో కలిపిన రసాయన రంగులు పూస్తారు.

రంగుల తయారీ విధానం
పూర్వం ఈ బొమ్మలకు రసాయన రంగులు పూసేవారు. ప్రస్తుతం వీటికి సహజ సిద్ధమైన రంగులు పూస్తున్నారు. ఈ రంగు తయారీకి జాబర్‌ గింజలను రెండురోజులు నీటిలో నానబెడతారు.
దానినుంచి కషాయం వంటిరంగు దిగుతుంది. ఈ నీటిని బాగా మరిగిస్తారు. నీరంతా ఆవిరిగా పోయిన తర్వాత ఆ రంగు పేస్టుగా మారుతుంది. దానిలో కావల్సినంత పసుపు కలిపితే నారింజరంగు వస్తుంది. దీన్ని మరుగుతున్న లక్కలో వేసి పొడవాడి కడ్డీగా తయారుచేస్తారు.

Surya Telugu Daily.

మార్చి 27, 2011 Posted by | సంస్కృతి | వ్యాఖ్యానించండి

గిరిజన సంప్రదాయం.. కొమ్ము – డోలు నృత్యం

గిరిజన సంప్రదాయం.. కొమ్ము – డోలు నృత్యం

kommudolu1 గిరిజనుల్లో ప్రత్యేకించి కోయ జాతివారు మాత్రమే ఆడతారు. తలపై గొర్రె గేదె కొమ్ములు తగిలించుకొని మెడల్లో పెద్దడోలు వేసుకుని ఆడే ఈ ఆటకు ’కొమ్ము – డోలు’ ఆట అని పేరు సార్థకమైంది. దీని పేరులో ’ఆట’ అనే శబ్దం ఉన్నా దీన్ని ఒక నృత్యంగా చెప్పవచ్చు. ఎందుచేతనంటే కోయజాతి స్ర్తీలు చిన్నాపెద్దా ముదుసలి, అనే తారతమ్యం లేకుండా ఒకరిచేతులు ఒకరు పట్టుకొని దండకట్టి ’రేల’ అనే పదంతో విన్యాసాలు చేస్తుండగా మగవారు గౌన్లు తొడిగి తలపై కొమ్ములు తగిలించుకొని అవి నిలబడేటట్లు తలపాగా చుట్టి వెనుక భాగాన తోకలా వ్రేళ్లాడేటట్లు కడతారు మెడలో తగిలించుకున్న డోలు చాలా పెద్దదిగా ఉంటుంది. డోలునకు వాడే చర్మం మేక చర్మం ఒకవైపు పుల్లతోను మరొకవైపు చేతితోను ఈ వాద్యాన్ని వాయిస్తారు. ఇలా గెంతుతూ వాయిస్తూ వుంటే ఆ వాద్యానికి అనుగుణంగా లయబద్ధంగా స్ర్తీలు నాట్యం చేస్తారు.

kommudolu విద్య కేవలం వారి వినోదం కోసమే కావడం దీనిపై వారి జీవనాధారం లేకపోవడం వల్ల వారి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడకపోవడం వలన వాటిపై అశ్రద్ధ ఎక్కువైన కారణంగా సంప్రదాయసిద్ధంగా వస్తున్న డోళ్లు మూలనబడిపోయి వాటికి చర్మం మూతలు లేక అవశేషాలుగా మిగిలిపోయాయి. వారి సంతతి విద్యావంతులు కావడం, ఈ కళను నేర్చుకోడానికి వారు ఇష్టపడకపోవడం …ప్రస్తుతం గిరిజనల ఇళ్ళల్లో సహితం జరిగే విందులు వినోదాలు శుభాశుభ కార్యాలకు సహితం ఆధునికత ఉట్టిపడే మైక్‌సెట్లు, బ్యాండ్‌మేళం ఉపయోగించడం వల్ల కూడా ఈ కళ కొద్దికాలంలో అంతరించిపోయే ప్రమాదం ఉంది.తొలిదశలో కళలు ఆటవిక జాతి నుండే ఉద్భవించాయి అని చెప్పవచ్చు. మానవుడు భాషను కూడా నేర్వని కాలంలో తన భావ ప్రకటన కోసం సంజ్ఞలతో ఆనందం వ్యక్తం చేయడానికి వేసిన గెంతులు తరువాతి కాలంలో కాలక్రమేణా భాషగా, నృత్యంగా మార్పుచెందాయి. అందువల్ల గిరిజన కళలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంది. ఆ కళల్లో ప్రసిద్ధమైనటువంటిదే ’కొమ్ము- డోలు’ ఆట.

Surya Telugu Daily .

మార్చి 27, 2011 Posted by | సంస్కృతి | 1 వ్యాఖ్య

సంగీత సాహితీస్రష్ట రాళ్ళపల్లి

సంగీత సాహితీస్రష్ట రాళ్ళపల్లి

శాస్త్రీయమైన సాహిత్య విమర్శనకు కళాత్మకమైన రూపురేఖలు దిద్దిన ఆధునికాంధ్ర సాహిత్య విమర్శకులలో అగ్రగణ్యులు రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ. రాళ్ళపల్లివారు అనంతపురం జిల్లా రాళ్ళపల్లి గ్రామంలో 1893 జనవరి 23న అలివేలు మంగమ్మ, కృష్ణమాచార్యులు పుత్రులుగా జన్మించారు. సంస్కృతాంధ్రములలో పండితులైన తండ్రి వద్ద సంస్కృతాంధ్రముల నభ్యసించారు. తల్లి కీర్తనలు, జానపదగేయాలను శ్రావ్యంగా గానం చేసేవారు. తల్లి నేర్పిన పాటలను యథాతథంగా నేర్చుకొన్నారు. మేనమామ ప్రోత్సాహంతో ఫిడేలు వాయించడం నేర్చుకున్నారు.

1906లో శర్మగారు మైసూరులోని పరకాల మఠంలో శ్రీకృష్ణ బ్రహ్మతంత్ర పరకాలయతీంధ్రుల సన్నిధిలో వుంటూ శ్రీ చామరాజేంద్ర సంస్కృత కళాశాల విద్యార్ధిగా వ్యాకరణం సంస్కృత కావ్యాలను సాకల్యంగా అభ్యసించారు. 1910లో కట్టమంచి రామలింగారెడ్డిగారు మైసూరు మహారాజు కళాశాలలో చరిత్ర, తర్కం, తత్త్వశాస్త్రం, ఆంగ్ల సాహిత్యాచార్యులుగా బోధించేవారు. రెడ్డిగారితో పరిచయం వల్ల శర్మగారు ఆంధ్ర సాహిత్యంలో చక్కని పాండిత్యం గడించారు. రెడ్డి శర్మగారి ప్రతిభాపాటవాలను గుర్తించి మైసూరు మహారాజా కాలేజిలో తెలుగు పండితులుగా నియమింపచేశారు. బోధకాగ్రగణ్యులుగా పేరుగాంచిన శర్మ కాలేజీలో ముప్పది ఏళ్ళు పనిచేశారు. శర్మ, కట్టమంచి వారు సవిమర్శకంగా కవిత్రయ భారతాన్ని అధ్యయనం చేశారు. 1911లో, తారాదేవి, మీరాబాయి అనే ఖండకావ్యా లను రచించారు. 1913లో ”లీలావతి” అన్న నవలను వంగభాష నుండి కన్నడీకరించారు. కట్టమంచివారు, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఉపాధ్యక్షులుగా వుండి వేమనపై ఉపన్యాసాలను అనంతపురంలోని సీడెడ్‌ డిస్ట్రిక్స్‌ కళాశాలలో ఏర్పాటు చేశారు. 1928 నవంబరు చివరన శర్మ వేమనపై చేసిన ఉపన్యాసాలు ఎంతో విజ్ఞానదాయక మైనవి. ఆ ఉపన్యాసాలలోని కొన్ని వాక్యాలు ”ఇరు ప్రక్క లందును మరుగులేని మంచి పదనుగల చురకత్తివంటి కవితాశక్తి, దానికి మెరుగిచ్చినట్టి, సంకేత దూషితముగాని, ప్రపంచ వ్యవహారములందలి సూక్ష్మదృష్టి, గాయపు మందు కత్తికే పూసి కొట్టినట్లు తిట్టుచునే నవ్వించు హాస్యకుశలత”… ఇవన్నియు వేమన్నను సృష్టిచేయునపుడు బ్రహ్మదేవుడుపయోగించిన మూల ద్రవ్యములు” అన్నారు. వేమన ద్వారా రాళ్ళపల్లి వారు కవి జీవిత కావ్యార్థ సమన్వయ విమర్శకు బాటవేశారు. రాళ్ళపల్లివారి సారస్వతోపన్యాసాలు, వారిని తెలుగు విమర్శకులలో అగ్రగణ్యునిగా చేశాయి. పీఠికా రచనలో కూడా రాళ్ళపల్లి గొప్ప పేరు గాంచారు. 1934లో బళ్ళారిలో ధర్మవరం కృష్ణమాచార్యులు, కోలాచలం శ్రీనివాసరావుల స్మారకోత్సవంలో శర్మగారిచ్చిన ”నాటకోపన్యాసములు”లో నాటక లక్షణములను విపులంగా వివరించారు. సుందరపాండ్యుని ”ఆర్య”ను శర్మగారు తెనిగించారు. ప్రాకృత భాషలో పరిణితులైన శర్మగారి ”గాథా సప్తశతీసారము” వారి అనువాద సామర్ధ్యానికి నిదర్శనంగా వుంది. మధునాపంతులవారు రాళ్ళపల్లివారిని గురించి రాస్తూ ”సాహిత్య ప్రపంచమున కవితా విమర్శనశాఖకు వారి దర్శనము చిరంతన వసంతమన్నారు. సత్యం,శివం,సుందరం అన్ని గుణాలు వారి వ్యక్తిత్వంలో భాగాలు. వారి భాషణ మితహితం. సంభాషణ సరసచతురం. శర్మగారు రచించిన ”గానకలె”, జీవమత్తుకలె” అన్న గ్రంథాలు వారి కన్నడ భాషా వైదుష్యానికి మచ్చుతునకలు. సంగీత ప్రియులైన శర్మగారు, సంగీత విద్వాంసులైన బిడారం కృష్ణప్పగారి వద్ద నాలుగైదేళ్ళు శాస్త్రీయంగా సాధన చేశారు. 1927లో అనంతపురంలో జరిగిన ఆంధ్రగాయక మహాసభలో శ్రోతలు భోజన సమయాన్ని విస్మరించి అత్యంత ఆసక్తితో విని వారి గానలహరిలో మునకలు వేశారు. మైసూరు మహారాజావారు ఏర్పాటుచేసిన కవితాపరీక్షలో ప్రథమబహుమతి నందుకొని మహారాజావారి దర్బారులో ఘన సత్కార మందుకొన్నారు. గానకళాసింధు, గానకళాప్రపూర్ణ, సంగీత కళానిధి బిరుదములందుకొన్నారు.

మైసూరులో ఉద్యోగ విరమణ చేసిన తర్వాత తిరుపతి తిరుమల దేవస్థాన కార్య నిర్వాహణాధికారి, చెలికాని అన్నారావుగారు ‘తాళ్ళపాక కవుల కీర్తనల పరిష్కరణ కార్యం నిర్వహించమని కోరారు. శర్మగారు 1950-57 మధ్య తాళ్ళపాక కవుల సంకీర్తనలను పరిశీలించి వాటిని స్వరపరిచారు. శర్మగారిని కేంద్ర సంగీత నాటక అకాడమీ 18-10-1970న ”ఫెలోషిప్‌”నిచ్చి సత్కరించింది. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యా లయం 30-4-1974 గౌరవ ”డి.లిట్‌” పట్టాతో గౌరవించింది. రేడియోకు ”ఆకాశవాణి” అన్నపేరు పెట్టింది శర్మగారే. సంగీత, సాహిత్య రంగాలలో విశిష్ట సేవలందించిన శర్మగారిని 1979 మార్చి 11న తి.తి.దేవస్థానం వారు ఆస్థాన విద్వాంసులుగా నియమించారు. వయోభారంతో వారు తిరుపతికి వెళ్ళలేక పోయారు కార్యనిర్వాహణాధికారి పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌గారు బెంగుళూరు వెళ్ళి సాయంత్రం 4 గంటలకు శర్మగారికి బిరుదు ప్రదానంచేసి సత్కరించారు. కాని ఆ దినం రాత్రం 7-05 గంటలకు శ్రీనివాసుని ఆస్థాన విద్వాంసులైన రాళ్ళపల్లివారు స్వర్గస్థులైనారు.

-జానమద్ది హనుమచ్ఛాస్త్రి

Visalaandhra Daily .

మార్చి 13, 2011 Posted by | సంస్కృతి | వ్యాఖ్యానించండి

అద్దకపు సాంప్రదాయం

అద్దకపు సాంప్రదాయం
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన పరిశ్రమలలో అద్దకపు పరిశ్రమ చాలా పురాతనమైనది. రాష్టమ్రంతటా వివిధ సాంేకతిక విధానాలను ఉపయోగించి స్థానిక సంప్రదాయానుగుణంగా ఇండిగో ప్రాసెస్‌ లేక రేసిస్టు స్టైల్‌, మార్డెంట్‌ లేక డైడ్గ స్టైల్‌, మెుదట చెప్పిన టై అండ్గ డై స్టైల్‌ అని మూడు రకాలుగా ఉంది. గుడారాలకు ఉపయోగించే గుడ్డలపై లైనింగులు, గుమ్మాలకు, కిటికీలకు తెరలు, కిషన్‌ కవరింగులు మెుదలైన వాటిపై అద్దకానికి మార్డెంట్‌ లేక డైడ్గ స్టైల్‌ ఉపయోగిస్తారు.

clothesఇండిగో రేసిస్ట్‌ స్టైల్‌నే కలంకారీ అద్దకం అంటారు. కలంకారీ అద్దకాలలో అందమైన అద్దకపు చీరలు, పడక దుప్పట్లు, కర్టెన్లు, బల్లగుడ్డలు అనేక అందమైన డిజైన్లలో లభిస్తున్నాయి. ఒక సన్నని వెదురు బద్దతో కలం చేసి దాని చివర పాయింట్‌గానీ, బ్రష్‌గానీ తయారు చేస్తారు. ఈ కలానికి ప్రత్యేకంగా తీయబడిన గాడిగుండా సిరా ప్రవహిస్తుంది. ఇదే వారి ప్రత్యేక సాధనం. రంగులకు ఉపయోగించే సిరా సహజంగా లభించే మూలికల నుండి తయారుచేస్తారు. నీలిమందు నుంచి నీలిరంగు, వివిధ రకాల మూలికలు, ఆకులు, బెరడు ఉపయోగించి ఎరుపు, పసుపు రంగులను తయారుచేస్తారు. ప్రయేకమైన సాధనికలంతో మూలికా సంబంధమైన వర్ణ ద్రవ్యాలను ఉపయోగించి చేతితో పెయింట్‌ చేయబడిన బ్రహ్మాండమైన కాలికోలు కలంకారీలు.

కలంకారీ అనేది ఒక ప్రాచీన కళ. అనేక శతాబ్దాలపాటు సంప్రదాయకంగా కళాకారులు గట్టి బట్ట మీద పురాణాలలోను, ఇతిహాసాలలోను గల గాథలకు అనురూపంగా చిత్రాలు వేసి ఆ బట్టను దేవాలయాలలో తెరలుగాను, గోడలకు అలంకారాలుగానూ ఉపయోగించేవారు. దేవాలయాలలో శిల్పాలు, దేవతా విగ్రహాలు, వివిధ కుడ్య చిత్రాలు మొదలైన వాటినుంచి కలంకారీ కళాకారులు స్ఫూర్తిని కలిగించుకున్నారు. దేవతా విగ్రహాల శిల్పకళా నైపుణ్యాన్ని, విగ్రహాల ఆభరణాలను, బొమ్మలను చూచి అనేక విషయాలను గ్రహించారు. ఫ్రెస్కో పెయింటింగ్‌లాగే కలంకారీ అద్దకాలు రామాయణ, మహాభారత చిత్రాలతో అతిరమణీయంగా ఉంటాయి.

clothes-designదివ్యమైన కలంకారీ కళ కళాకారుల హస్తకళా నైపుణ్యం కాదు, చిత్రకళా చాతుర్యం కాదు, ఒక విధమైన అప్పొర్వ భగవద్భక్తి ప్రకతిస్తూ వుంటాయి. అంధ్ర దేశంలో ప్రత్యేకంగా కలంకారీ చిత్ర కళకు రెండే రెండు కేంద్రాలు ప్రసిద్ధి పొందాయి. మొదటిది శ్రీకాళహస్తి, రెండవది అద్దకాలకు ముఖ్య కేంద్రమైన మచిలీపట్టణం.శ్రీకాళహస్తి కలంకారీ అద్దకానికి అంకితమైన గొప్ప యాత్రా స్థలము. మిక్కిలి ఓర్పుతో కలంకారీ అద్దకపు పరిశ్రమలో కళాకారులు ప్రదర్శించే అభిలాషలో, ఉత్సాహంలో వారి అర్పణభావం ప్రకటితమవుతుంది. మొట్టమొదట బట్టను కలంకారీ కళాకారుడు చిత్రించదలచిన కాన్వాసుగా తయారుచేసుకుంటాడు.

దళసరిపాటి గాడా చేనేత బట్టను శుభ్రంగా ప్రవహిస్తున్న నీటిలో బట్టకు పెట్టిన గంజి, పిండి పోయేదాకా నాలుగైదుసార్లు శుభ్రం చేస్తారు. దీనిని శుభ్రం చేయడానికి సబ్బుగానీ, ఇతర డిటర్జెంట్లుగానీ ఉపయోగించరు. ఈవిధంగా శుభ్రం చేసిన బట్టను గేదె పాలు, కరక్కాయల రసంకలిపిన మిశ్రమంలో ముంచి ఎండలో ఆరబెడతారు. ఈవిధంగా ఆరబెట్టిన బట్ట ఇప్పుడు కలంకారీ అద్దకానికి సిద్ధమైంది. చింతబొగ్గుతో తయారైన బొగ్గు కణికెలతో ఈ బట్ట మీద భావానుగుణ్యంగా హస్తకళానైపుణ్యంతో చిత్రాలను చిత్రిస్తారు. ఈ చిత్రాలను అన్నభేది ద్రావణంతో సుడిచి చిత్రాలను చెరగని నల్లరంగుగా తయరుచేస్తారు.

Surya Telugu Daily

మార్చి 4, 2011 Posted by | సంస్కృతి | | వ్యాఖ్యానించండి

హిందుస్థానీ రాగ రత్న భీమ్‌సేన్‌

హిందుస్థానీ రాగ రత్న భీమ్‌సేన్‌

bemsen1హిందుస్థానీ సంగీత ప్రపంచంలో మారు మోగే పేరు భీవ్గుసేన్‌ గురురాజ్‌ జోషి. ఆయన గొంతులో జీవనపోరాటస్ఫూర్తి ఉంది. అది పాటని పైలోకాల నుంచి తీసుకువచ్చి మనకు పంచేందుకు ప్రకంపిస్తుం ది. వినే వారిని మంత్ర ముగ్ధుల్ని చేస్తుంది. ‘ఆకాశం బున నుండి శంభుని శిరంబందుండి శీతాద్రి’ అన్నట్టు గా ఆయన పాట పైలోకాలనుంచి మనకోసం ఆపాట మధరంగా దుకుతుంది. శాస్ర్తీయ సంగీతకారుల్లో ఒకొ్కక్కరిది ఒకొ్క రీతి అరుుతే భీవ్గు సేన్‌ జోషిది గుండెల్లో మఠం వేసుకొని ప్రతిధ్వనించే రీతి.

కిరానా ఘరానాకు చెందిన భీమ్‌సేన్‌ జోషి ’ఖయాల్‌ గాయనంలోనే కాక, భక్తిరస ప్రధానమైన భజనలు, అభంగ్‌లు పాడడంలో సిద్ధహస్తుడు.

సంగీత ప్రస్థానం: 20 వ శతాబ్దం పూర్వార్థం వరకూ, ’ఖయాల్‌ గాయనం’ గురుశిష్య పరంపర’ గా సాగేది. భీమ్‌సేన్‌ జోషి గురువైన సవాయి గంధర్వ, అబ్దుల్‌ కరీంఖాన్‌కు శిష్యుడు. అబ్దుల్‌ కరీంఖాన్‌ అబ్దుల్‌ వహీద్‌ ఖాన్‌తో కలిసి, కిరాణా ఘరాణాను స్థాపించారు.తన 11 వ ఏట, చిన్నతనంలో అబ్దుల్‌ కరీంఖాన్‌ గాయనం విని ఉత్తేజితుడై, ఇల్లు వదలి గురువును వెదుక్కుంటూ, ధార్వాడ్‌ తరువాత పూణె చేరుకున్నాడు. తరువాత గ్వాలియర్‌కు వెళ్ళి, ’మాధవ సంగీత పాఠశాల’లో చేరాడు. ఆ పాఠశాలను గ్వాలియర్‌ మహరాజులు, ప్రముఖ సరోద్‌ విద్వాంసుడు, హఫీజ్‌ అలీఖాన్‌ సహాయంతో నడుపుతుండేవారు.

bemsenమంచి గురువు కోసం, ఢిల్లీ, కోల్‌కతా, గ్వాలియర్‌, లక్నో, రాంపూర్‌లలో పర్యటించారు. చివరకు అతని తండ్రి, భీమ్‌సేన్‌ జోషిని జలంధర్‌లో పట్టుకొని, తిరిగి ఇంటికి తోడ్కొని వచ్చాడు. 1936 లో,సవాయి గంధర్వ, భీమ్‌సేన్‌ను శిష్యుడిగా స్వీకరించాడు. ప్రముఖ హిందుస్తానీ సంగీత గాయని గంగూబాయి హంగల్‌, అతని సహవిద్యార్థిని. అలా నాలుగేళ్ళు సవాయి గంధర్వ వద్ద సంగీతాన్ని అభ్యసించారు. చిన్నప్పటినుండి జోషి దృష్టంతా సంగీతం మీదే! ఇంట్లో తాతగారి ‘తంబుర’ ఉంటే దాన్ని జోషి కంట పడకుండా దాచేసారు పెద్దలు. జోషి తాతగారు కూడా కీర్తనకారుడు. ఎంతగా ఆ తంబురాను దాచిపెట్టినా దానిమీదకే జోషి చేతులు వెళ్లేవి. వాళ్ల ఇంటి సమీపంలో ఒక మసీదు నుండి తరచు ‘ఆజాన్‌’ వినపడేది. దాన్ని జోషి శ్రద్ధగా వినేవారు. అలాగే చుట్టుపక్కల ఇళ్ళలోంచి ‘భజనపాటలు’ వినపడితే జోషి చెవులు రిక్కించి వినేవారు. స్కూలు నుండి ఇంటికి వస్తూ దారిలో ఉన్న గ్రామ్‌ ఫోన్‌ దుకాణం దగ్గర నిలబడి ఆ షాపు నుంచి వినిపించే పాటలు వింటూ రోడ్డుమీదే తన్మయంగా నిలబడి పోయేవారు. తనకు నచ్చని విషయమేదో జరిగిందని గడగ్‌ రైల్వే స్టేషన్‌కు కట్టుబట్టలతో చేరుకుని రైలెక్కేసి టికెట్‌ లేని ప్రయాణం చేసి బీచుపూర్‌ చేరుకున్నారు. అక్కడ ’భజనలు’ పాడి కడుపు నింపుకున్నాడు. తన గురువుని అన్వేషించుకుంటూ ఎక్కడెక్కడో తిరిగారు. ఒక అజ్ఞాతవ్యక్తి సలహాపై గ్వాలియర్‌కని బయలుదేరారు.

Pandit-Bhimsen-Joshiకానీ వేరే రైలెక్కేసి పూణె చేరుకున్నారు. పూణె మహానగరం మహారాష్ట్రకు సాంస్కృతిక రాజధాని. అక్కడ జోషి క్రిష్ణారావు ఫులంబ్రికార్‌ అనే గురువుని ఆశ్రయించేందుకు వెళ్ళారు.. కానీ అతడు పెద్దమొత్తంలో ఫీజు అడిగాడు. పూటకు గతిలేని జోషి నిరాశపడ్డారు. ఎక్కడెక్కడో తిరిగి ఎట్టకేలకు గ్వాలియర్‌ చేరుకున్నారు. ఆ నగరం హిందూస్థానీ సంగీతానికి పెట్టింది పేరు. అందుకే జోషి గమ్యం కూడా ఆ నగరమే అయింది. సరోద్‌ విద్వాంసుడు హఫీజ్‌ అలీఖాన్‌ సహాయంతో గ్వాలియర్‌ మహారాజు ప్రోత్సహిస్తున్న మాధవ్‌ సంగీత్‌ విద్యాలయంలో జోషి చేరాడు. గ్వాలియర్‌లో ఆవిర్భవించిన హిందుస్థాన్‌ మౌలిక శైలి ’ఖయాల్‌’. దాని లోతుపాతులు తెలుసుకొని ‘గాయకి’ అనే అంశంలో పరిపూర్ణమైన పరిజ్ఞానం సంపాదించారు. బీమ్‌సేన్‌ జోషి. విభిన్న రాగాల మధ్య ఉండే వేరువేరు ధోరణులను పట్టుకోవాలన్న జిజ్ఞాసతో జోషి ఎందరో గురువుల్ని సంప్రదించారు.

జలంధర్‌లో ఉన్నప్పుడు సంగీత సాధనతోపాటు వ్యాయామం కూడా చేసేవారు. బలమైన శరీరం ఆయన కోరికల్లో ఒకటి. అది కూడా జలంధర్‌లో సాధించుకున్నారు. భీమ్‌సేన్‌ జోషి గురువు సవాయి గంధర్వ క్రమశిక్షణకు పెట్టింది పేరు. జోషి ఒకసారి అపస్వరం పలికితే అసహనపడి ఇనుప వస్తువు జోషి మీదికి విసిరివేసారు. అయినా జోషి మరింత శ్రద్ధతో ఆ గురువునే ఆశ్రయించారు. ఆదిలో జోషి ధర్వాడ్‌, సాంగ్లీ, మిరాజ్‌, కురుంద్వాడ్‌లలో చిన్నచిన్న కచేరీలు చేశారు. అయితే ఖ్యాతిగాంచిన సంగీత ప్రియులెందరో ఆ కచేరీలకు హాజరైనారు. అయినా ఆయనకు అసలైన గుర్తింపునిచ్చింది 1946లో సవాయి గంధర్వ 60వ జన్మదినాన పూణెలో ఆయన ఇచ్చిన కచేరి. అప్పటి నుండి ఆయన వెనుదిరిగిచూడలేదు. ఆయన తన సంగీత ప్రపంచంలో ఒక ఘనత సాధించారని సంగీత ప్రియులంటారు. అదేమిటంటే సంగీతంలో సాంప్రదాయ విలువలకు, జనాకర్షక గాత్రరీతికి మధ్య సయోధ్యను సాధించడం. జన్మతః లభించిన శక్తివంతమైన గొంతుక ఆయన్ను ఉన్నత శిఖరాలకు చేర్చిందనడం యధార్థం.

ఇష్టమైన రాగాలు : శుద్ధ కల్యాణ్‌, మియాన్‌ కీ తోడి, పురియా ధనశ్రీ, ముల్తానీ, భీమ్‌పలాసీ, దర్బారీ మరియు రామ్‌కలీ లు. భీమ్‌సేన్‌ అబ్దుల్‌ కరీంఖానే కాక, కేసర్‌బాయి కేర్కర్‌, బేగం అక్తర్‌, ఉస్తాద్‌ అమీర్‌ఖాన్‌ల వల్ల ఎంతో ప్రభావితుడయ్యారు. చివరకు తన ప్రత్యేక గాయన శైలిని రూపొందించుకొన్నారు.
వ్యక్తిగత జీవితం: భీమ్‌సేన్‌ జోషి తండ్రి, గురాచార్య జోషి… బడి పంతులు. చిన్న వయసులోనే భీమ్‌సేన్‌ జోషికి సునందతో వివాహం జరిగింది. పిల్లలు రాఘవేంద్ర, ఆనంద్‌ జోషిలు గాయకులు. తరువాత భీమ్‌సేన్‌ వత్సల అనే ఆమెను పెళ్లాడారు. శ్రీనివాస్‌ జోషి మంచి గాయకుడు…ఎన్నో ఆల్బంలను విడుదల చేశాడు.

సినిమాలు: బసంత్‌ బహార్‌ ( మన్నాడేతో ), బీర్బల్‌ మై బ్రదర్‌ ( పండిట్‌ జస్రాజ్‌తో), తాన్‌సేన్‌ (1958) మరియు అంకాహీ (1985). భీమ్‌సేన్‌ జోషి కన్నడ భజనలు (దాసవాణి, ఆల్బమ్‌) మరాఠీ అభంగ్‌లు పాడారు. జాతీయ సమగ్రతపై దూరదర్శన్‌ సౌజన్యంతో తీసిన సంగీతపరమైన వీడియో, ‘మిలే సుర్‌ మేరా తుమారా’ అనేది జగత్ప్రసిద్ధం. భీమ్‌సేన్‌ జోషి తన గురువు సవాయి గంధర్వ గౌరవజ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం, డిశంబరు నెలలో పూణె నగరంలో, సవాయి గంధర్వ సంగీత మహోత్సవం ను నిర్వహిస్తారు.

అవార్డులు: * పద్మశ్రీ 1972
– సంగీతనాటక అకాడమీ అవార్డు 1976

– పద్మవిభూషణ్‌ 1999* పద్మభూషణ్‌ 1985* మహారాష్ట్ర భూషణ్‌ 2002

– కర్నాటక రత్న 2005, * భారతరత్న 2008. భీమ్‌సే జోషి తండ్రి, గురాచార్య జోషి, బడి పంతులు. చిన్న వయసులోనే భీమ్‌సే జోషికి సునందతో వివాహం జరిగింది. తరువాత భీమ్‌సేన్‌ వత్సలను పెళ్లాడాడు. బసంత్‌ బహార్‌ (మన్నాడేతో), బీర్బల్‌ మై బ్రదర్‌ (పండిట్‌ జస్రాజ్‌తో), తాన్‌సేన్‌ (1958) అంకాహీ (1985) సినిమాలలో పాడి సినీ శ్రోతలను అలరించారు.

Surya Telugu Daily.

జనవరి 28, 2011 Posted by | సంస్కృతి | 1 వ్యాఖ్య

సంక్రాంతి సంపదకు చిహ్నాలు పల్లెల్లో పురులు

సంక్రాంతి సంపదకు చిహ్నాలు పల్లెల్లో పురులు

-ధాన్యపు నిల్వకు ఖర్చులేని పురాతన పద్ధతి
-అందుబాటులో గల వరిగడ్డితో తయారీ
-మంచి లాభసాటి పద్ధతి
-గ్రామాల్లో పాత విధానం పట్ల రైతాంగం చూపు

vari1ఖరీఫ్‌ పంట చేతికొచ్చిన వేళ జరుపుకునే సంక్రాంతి పండుగ రైతుల జీవితాల్లో ఆనందోత్సాహాలను నింపుతుంది. ప్రతి ఏటా పంటలు వచ్చే వేళ జరిగే ఈ పండుగను పల్లెల్లో ఎంతో ఆడంబరంగా నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో వచ్చిన ధాన్యాలను పురులలో నిల్వ చేసుకుంటారు రైతులు. ముఖ్యంగా పల్లెల్లో సంక్రాంతి పండుగ రోజుల్లో వరిపురులు నిండుగా మారి రైతులకు సంతోషాలను మిగులుస్తాయి.

మారుతున్న కాలంతో‚ పోటీపడలేకపోతున్న రైతాంగం అతి తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉన్న పాతకాలం పద్ధతులను నేటికీ అవలంభిస్తున్నారు. ధాన్యం నిల్వ చేయడానికి అవలంభించే పాత కాలపు పద్ధతైన ‘పురికట్టే’ విధానాన్ని రైతులు నేటికీ అవలంభిస్తున్నారు. పెరిగిన రైసుమిల్లులు సైతం రైతు నిల్వలకు పెద్దగా మొగ్గు చూపే అవకాశం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో రైతాంగం ధా న్యం మసూళ్లు అనంతరం నిల్వ చేసేందుకు ధాన్యపు పురులను సిద్ధం చేసుకుంటున్నారు.

సులభంగా పురుల తయారీ…

variరైతులు పండిన ధాన్యాన్ని తరలించకుండా పొ లాల్లోనూ లేదంటే పశువుల కొట్టాల దగ్గర పురు లు కట్టి నిల్వచేసుకుంటున్నారు. దీని కోసం పండ ిన పంటలోని వరిగడ్డినే ఎంట్లు (వరిగడ్డిని పెనవే యడం) చుట్టి కావాల్సినంత సిద్ధం చేసుకుం టున్నారు. ముందుగా అదే వరిగడ్డిని మం దంగా వేసి తేమ తగిలే అవకాశం లేకుండా చూసుకుని వాటిపై బాగా ఆరుదల వచ్చిన ధాన్యం పోస్తూ గుండ్రంగా ఎంట్లు చుడుతూ ధాన్యం పూర్తయ్యేవరకు పోసి గడ్డిని రక్షణగా ఏర్పాటుచేస్తున్నారు. దీనికి గాను పురులు తొక్కేందుకు నైపు ణ్యం గల వ్యవసాయ కూలీలను ఏర్పాటుచేసుకుంటున్నారు. అయితే ఈ విధానంలో ఎక్కువ కాలం నిల్వ చేయాలంటే ధాన్యానికి ఎలుకల బెడద ఉండేది. అం తేకాకుండా అగ్నిప్రమాదాలకు ఆస్కారం ఉన్నా నేటికీ వివిధ జాగ్రత్తలను పాటిస్తూ పురులను ఏర్పాటుచేసుకుంటున్నారు రై తులు. పదిహేను ఏళ్ల క్రితం వరకు ఈ పురుల విధానాన్ని భూ స్వాములు ఎక్కువగా అవలంభించేవారు. కానీ నేడు సామాన్య రైతులు కూడా పురులను ఏర్పాటుచేసుకొని ధాన్యాన్ని నిల్వ చేస్తున్నారు.

సంక్రాంతి శోభ…

vari2ఖరీఫ్‌ పంట చేతికొచ్చే సంక్రాంతి రోజులు రైతులకు మంచి రోజులు. పంట ధాన్యం చేతికి రావ డంతో పల్లెల్లో సంక్రాంతి శోభ ‘ఆనంద’కాంతులను వెదజల్లుతుంది. ఇక వచ్చిన ధాన్యాన్ని పురు లలో నిల్వ చేసుకునే రోజులివి. ఇక గ్రామాల్లో వ్యవసాయదారుల ఇళ్లల్లో నాలుగేళ్లకు పైగా వరిని పురులలో నిల్వచేసి వాటిని బాలింతలకు పాతబియ్యం పేరిట వండిపెట్టేవారు. ఈ నిల్వ బియ్యంలో మంచి పోషక విలువలు ఉంటాయన్నది నమ్మకం. ఇటువంటి పాత బియ్యం నిల్వలు మారుమూల పల్లెటూళ్లలో ఎక్కువగా చూడవచ్చు. కానీ ఇప్పుడు పురులు కట్టే సంప్రదాయం అంతరించి పోయే స్థితిలో ఉండడం శోచనీయం.

Surya Telugu Daily

జనవరి 16, 2011 Posted by | సంస్కృతి | వ్యాఖ్యానించండి

కర్ణాటక సంగీత కలికితురాయి

కర్ణాటక సంగీత కలికితురాయి
సంగీతం ఓ గలగలపారే ప్రవాహం…ఈ సంగీత సాగర ప్రవాహంలో ఎందరో మహానుభావులు తమదైన ముద్రను వేశారు. వారు దివంగత లోకాలకు వెళ్లిపోరుునా వారందించిన సంగీత స్వరాలు కొన్ని వందల సంవత్సరాలదాకా జనం నోళ్లల్లో నానుతూ చిరంజీవులవుతున్నారు. వారి ఖ్యాతి ఆచంద్ర తారార్కం వెలుగొందుతూనే ఉంటుంది. కర్ణాటక సంగీత సామ్రాజ్యాన్ని ఏలిన త్రిమూర్తులుగా చెప్పబడే త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్ర్తిలలో రెండవవారైన ముత్తుస్వామి దీక్షితులు కర్ణాటక సంగీతంలోని హంసధ్వని రాగానికి ఆయువుపట్టుగా మారి తన గాత్ర సంగీతానికి ఊపిరిలూదారు.‘వాతాపి గణపతిం భజే’ అనే కీర్తన నేటికీ ప్రతి ఇంటా మార్మోగిపోతూనే ఉంటుంది. ఆ కీర్తన రూపకల్పన చేసింది ముత్తుస్వామి దీక్షితులే…ఆ మహానుభావుని గురించి క్లుప్తంగా తెలుసుకుందాం…

muttuswamyకర్ణాటక సంగీత సరస్వతీదేవి కిరీటంలో పొదిగిన త్రిరత్నములుగా త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్ర్తిలను పేర్కొంటారు. ఈ కర్ణాటక సంగీతత్రయంలో ఒకరెైన వాగ్గేయకారుడే ముత్తుస్వామి దీక్షితులు. ‘వాతాపి గణపతిం భజే’ అన్న కీర్తన విననివారుండరంటే అది అతిశయోక్తి కాదేమో. అది ఆయన రచించినదే. కర్ణాటక ప్రాంతానికి చెందిన రామస్వామి దీక్షితార్‌, సుబ్బలక్ష్మి అంబాళ్‌ పుణ్యదంపతుల సంతానంగా ముత్తుస్వామి 1775లో పుట్టారు. చిన్ననాటినుండి వినయవిధేయతలతో…భక్తిప్రపత్తులతో తన గుణగణాల ద్వారా మంచి బాలునిగా పేరుగాంచారు. పెద్దల యందు భక్తిశ్రద్ధలుగల వ్యక్తిగా ఎంతో అణుకువను బాల్యంలోనే ఈయన ప్రదర్శించారు.

తన తండ్రి వద్ద తెలుగు, సంస్కృతంతో పాటు శాస్ర్తీయ సంగీతాన్ని కూడా ఈయన అభ్యసించారు.సంగీతంపెై వెలువడిన వెంకటాముఖి సుప్రసిద్ధ గ్రంథం చతుర్‌దండి ప్రకాశికైను అధ్యయనం చేశాడు. కావలసినమేరకు వేదవేదాంగ,పౌరాణిక ధర్మ గ్రంథాలపరమైన జ్ఞానాన్ని కూడా సంపాదించగలిగారీయన.ఒకసారి ఇంటికి అతిధిగా వచ్చిన చిదంబరనాధ యోగి బాలునిగా ఉన్న ముత్తుస్వామి దీక్షితార్‌ను కాశీకి తీసుకెళ్ళారు. అక్కడ ముత్తుస్వామికి ఉపాసనా మార్గాన్ని బోధించారు.వారణాసిలో ఉన్నప్పుడు ముత్తుస్వామి ఉత్తరదేశపు సంగీతమైన హిందూస్తానీని కూడా నేర్చుకున్నారు.

శ్రీనాదాదిగరుగుహోజయతి అనే మాటలతో ప్రారంభమయ్యే తొలి కీర్తనను ఇతడు రచించి రాగం కూర్చారు.తురుత్తణిలో వెలసిన శివుడి కుమారుడెైన మురుగ భగవానుడి భక్తిపారవశ్యంలో లీనమైనప్పుడు పెై సంకీర్తనను ముత్తుస్వామి రచించారు. ఆధ్యాత్మిక వెలుగులో ఈయన సృజనాత్మకత ప్రతిభ ప్రకాశించింది. అచిరకాలంలోనే ఎందరో శిష్యపరమాణువులను పొందగలిగారు. ముత్తుస్వామి తన శిష్యులను ఎంతో జాగ్రత్తగా ఎన్నుకుని వారికి తన కృతులను ఆలపించడం ఎలానో బోధించేవారు.
తన తమ్ముడు చిన్నస్వామి చనిపోయినప్పుడు ఆ దుఃఖంలో ఉన్నప్పుడు మధురెై మీనాక్షి అమ్మన్‌ ఆలయాన్ని దర్శించారు ముత్తుస్వామి. అక్కడే అతడు మీనాక్షి మేముదం దేహి, మామన మీనాక్షి అనే కీర్తనలను వరుసగా పూర్వీ కళ్యాణి, వరాళి రాగాలలో ఆలపించారు.

ధ్యాన యోగం, జ్యోతిష్యశాస్త్రం, మంత్ర యోగం, పురాణాల సారం మొదలెైనవి దీక్షితార్‌ కృతులలోని ప్రత్యేకతలు. అంబాళ్‌పెై అతడు రాసిన నవవర్ణ కీర్తనలు నవగ్రహాలపెైన రాసిన నవగ్రహ కీర్తనలు ఆయన రచనా గొప్పతనానికి ఉజ్వల ఉదాహరణలు. శక్తి ఉపాసనలోని సూక్ష్మాలను వివరిస్తూ శ్రీ విద్యా తత్వ రహస్యంపెై ఈయన ఎన్నో కీర్తనలను రచించారు. శివ పాహి ఓం శివే అన్న మంత్రాన్ని ఉచ్చరిస్తున్నవేళ 1835లో తనువు చాలించాడు. ఎంతో ఉన్నత… అత్యద్భుతమైన కృతులను రచించిన ముత్తుస్వామి దీక్షితులు కర్ణాటక సంగీతత్రయంగా చెప్పుకునే త్యాగరాజు తర్వాత రెండవవారిగా పరిగణింపబడతారు.రామస్వామి దీక్షితులు వీరి తండ్రి. వీరు సంగీత, వ్యాకరణ, జ్యోతిష, వాస్తు, మాంత్రిక, వెైద్య విద్యలలో ఆరితేరిన వ్యక్తి. గురుగుహ ముద్రతో వున్న వీరి కృతులన్నీ సంస్కృతంలోనే వున్నాయి.

హిందూస్థానీ సంగీతంనుండి వీరు కర్ణాటక సంప్రదాయానికి తెచ్చిన రాగాలు సారంగ, ద్విజావంతి మొదలెైనవి. వీరు అనేక క్షేత్రములు తిరిగి ఆయా ప్రదేశములలో వున్న దేవస్థానములను సందర్శించి దేవతలపెై కృతులు కట్టారు. ఆయన రూపొందించిన కృతులలో కమలాంబా నవావర్ణ కృతులు, నవగ్రహ కీర్తనలు ప్రత్యేక స్థానాన్ని కలిగి వున్నాయి. వాతాపి గణపతిం భజే, మహా గణపతిం, శ్రీనాథాది గురుగుహో, అక్షయలింగ విభో, బాలగోపాల, అఖిలాండేశ్వరి, రామచంద్రం భావయామి, చేత: శ్రీబాలకృష్ణం, శ్రీ వరలక్ష్మి, సిద్ధి వినాయకం, త్యాగరాజ యోగవెైభవం, హిరణ్మరుూం, అన్నపూర్ణే, అరుణాచలనాథం, ఆనందామృతకర్షిణి, మామవ మీనాక్షి, మీనాక్షి మే ముదం దేహి, నీలకంఠం భజే, స్వామినాథ, శ్రీ సుబ్రహ్మణ్యాయ, పరిమళ రంగనాథం, మొదలెైనవి వీరి యితర ప్రముఖ రచనలు. ముత్తుస్వామి తండ్రి రామస్వామి దీక్షితులు, హంసధ్వని రాగమును కనిపెట్టిన మేధావి. ఈ భక్త శిరోమణి కాశ్యప సగోత్రీకుడు.

అతని పూర్వీకులు గోవింద దీక్షితులు నిర్మించిన అగ్రహారమైన గోవిందపురములో రామస్వామి 1735 లో జన్మించారు. వేంకటేశ్వర దీక్షితులు, భాగీరథి అతని తల్లి దండ్రులు. వారు 1751లో పరలోకగతులయ్యారు. తదనంతరం రామస్వామి తంజావూరుకు వెళ్లారు. అచ్చట రాజాస్థానములో సంగీత విద్వాంసుడువీరభద్రయ్య వద్ద రామస్వామి సంగీతవిద్యను అభ్యసించి, తిరిగి తన స్వగ్రామమునకు వచ్చారు.సంగీతము పట్ల గల అమిత జిజ్ఞాసతో, అనురక్తితో, మరల విద్యాభ్యాస ప్రయాణమును కొనసాగించారు. మధ్వార్జున క్షేత్రమునందు వేంకట వెైద్యనాథ దీక్షితులు అనే వెైణికుడు నివసించుచుండెను.

వెంకట వెైద్యనాథ దీక్షితులు యొక్క పూర్వీకుడు వేంకటమఖి అమోఘ పండితుడు. వెంకటమఖి రచించిన చతుర్దండి ప్రకాశిక కర్ణాటక సంగీతము నేర్చుకొను వారికి కరదీపిక వంటిది.వెంకటముఖి 72 మేళ రాగములను సూత్రీకరించెను. తనను ఆశ్రయించిన రామస్వామిలోని భక్తి శ్రద్ధలకు, సంగీతము పట్ల ఆసక్తి వెైద్యనాథులకు ఎంతో నచ్చాయి.తన పూర్వీకులు ఒసగినట్టి, ఆ జన్యు రాగ సంపదలను, వెైద్యనాథ దీక్షిత పండితవరేణ్యులు నిష్కామముగా బోధించెను.రామస్వామి దీక్షితులు సంగీత విద్యలను క్షుణ్ణంగా అభ్యసించేవారు. స్వయంకృషితో రామస్వామి దీక్షితులు కనిపెట్టిన ‘హంసధ్వని రాగం’ కర్ణాటక సంగీతసీమలో ప్రాచుర్యము పొందినది. వేంకట వెైద్యనాథులు, రామస్వామి దీక్షితులు ఇద్దరూ అపురూపమైన గురుశిష్యు. వారు ఇరువురూ పరస్పరమూ పౌర్ణమి చంద్రుడు, పాల వెన్నెల వంటివారు.

-నండూరి రవిశంకర్‌

Surya Telugu Daily

జనవరి 15, 2011 Posted by | సంస్కృతి | 2 వ్యాఖ్యలు

ఏవీ ఆ రోజులు… ఎక్కడ సంక్రాంతి సరదాలు…

ఏవీ ఆ రోజులు… ఎక్కడ సంక్రాంతి సరదాలు…

సిగ్గు ముసుగు వీడి సిరి వెన్నెల తీరానికి పయనించేటి మకర సంక్రమణం పూర్తి మహదుల్లాసము తేచ్చేది సంక్రాంతి. పసిపాపల నవ్వుల పువ్వులవోలె ఆకట్టుకుని ఇంటి ముంగిట ముగ్గుల మెలికలో కూర్చున్న గొబ్బెమ్మ పాటే సంక్రాంత్రి. భోగిమంటల పిల్లగాలుల, హరిదాసు జానపద లహరికి నాందే సంక్రాంతి. వాకిట గుమ్మిలలో పొంగిపొర్లుతున్న వరి ధాన్య సంపుటి,పసుపు పచ్చని కోకల్లో ఆటలాడే కన్నె మొగ్గల పండుగే సంక్రాంతి. పోటీలుపడి వాయునాధుడి సహనాన్ని పరీక్షించి పతం గులను ఎగురవేసే యువత కేరింతలే సంక్రాంతి. తెలు గుతనపు సిరి మువ్వల సవ్వడే మరక సంక్రాంతి…

big-kiteసంక్రాంతి పండగ వచ్చిందంటే చాలు అటు నగరంలోనూ…ఇటు గ్రామా ల్లో వారం రోజుల ముందే పండగ వాతావరణం నెలకొని ఉండేది. యువత పతంగులతో, మగువలు ముగ్గల పోటీలల్లో మునిగి తేలేవారు.పెద్దలు పండగ ఏర్పాట్ల గురించి ముందస్తుగానే ఆలోచించేవారు. కాని ప్రస్తుత యాంత్రిక జీవన విధానంలో పండుగలంటే ఓ రోజు దండగ అనే విధంగా రోజులు మారా యి. గతాన్ని ఒక్కసారి స్మరించుకుంటే…

ఏవీ ఆ రోజులు….
సంక్రాంతి పండగ వచ్చిందంటే చాలు పాఠశాలలు ఇచ్చే వారం రోజుల సెలవు లలో జీవితంలోనే మరిచిపోలేని తీపి జ్ఞాపకాలను రూపకల్పన చేసుకునేవారు పిల్లలు.గ్రామాల్లో, నగరల్లో పతంగులకు(గాలిపటాలు) ప్రత్యేక గుర్తింపు ఉం డేది. ఎక్కడ చూసినా యువత అల్లర్ల నడుమ పంతగులను ఎగురవేస్తూ కాలా న్నే మరిచిపోయేవారు. ఉదయాన్నే ఇంట్లోంచి వెళ్తే చాలు పతంగులను పట్టు కుని ఎగురవేయడం లేదా పోటాపోటీగా కట్టెలు చేతపట్టి ఎంతటి కష్టమైనా సరే దారం తెగిన పతంగి తమ వశం కావాలనే తపనతో పట్టుకునే సాహసాలు ఎక్కడ చూసినా దర్శనమిచ్చేవి. కాని కాలక్రమేణా ఎన్నో మార్పులను చవి చూస్తున్నామనడంలో అనుమానమే లేదు.

ప్రస్తుతం యువత పండుగలు వచ్చా యంటే చాలు ఇతర ఆనందాల్లో మునిగి కేరింతలు వేస్తున్నారే తప్ప పండుగ ప్రాముఖ్యతను తెలుసుకోవడం లేదు. అద ేవిధంగా అమ్మాయిలు సైతం తమ నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు వెనుకడుగు వేస్తున్నారు. మగువలకు ప్రత్యేక ఆక ర్షణగా ఏర్పాటు చేసే ముగ్గుల పోటీ తత్వాలు కూడా పూర్తిగా అంతరించి పో యాయనే చెప్పాలి. నగరాల్లో ఇరుకైన ప్రాంతాలు, పెద్ద పెద్ద అపార్టుమెంట్లలో నివసించే వారే ఎక్కువగా ఉండడంతో అసలు ముగ్గులలో ఉన్న తీపి జ్ఞాపకాన్ని పూర్తిగా విస్మరిస్తున్నారు. పండుగలు వచ్చాయంటే కేవలం పూజా కార్యక్రమా లను నిర్వహించి తాము ఎంతో గొప్పగా పండుగలను జరుపుకున్నామని ఒకరికి ఒకరు చెప్పుకోవడం ప్రస్తుతం ప్యాషన్‌గా మారిపోయింది.

ఇదేనా మన సంస్కృతి..
kaitesసంక్రాంతి పండగ వచ్చిందంటే గొబ్బిళ్లు, హరిదాసుల పాటలు, గంగిగోవు ఆరాధన, ఇంటిముంగిట పాలపొంగులు.. మగువల ముగ్గులు,యువత పతం గుల ఆట పాటాలు నేడు కనుమరుగవుతున్నాయి.పాశ్చాత్య సంస్కృతి సాంప్ర దాయాలకు అలవాటు పడుతున్న మనం పెద్దలు మనకు ఇచ్చిన సాంప్రదా యాలను పూర్తిగా విస్మరించి ఇదేదో బలవంతంపు ఫెస్టివల్‌గా ఇబ్బందులతో పండులను జరుపుకోవడంతో విచారకరంగా ఉందని పెద్దలు విచారం వ్యక్తం చేస్తున్నారు.

యువతకు ప్రత్యేక ఆకర్షణ ‘పతంగి’…
సంక్రాంతి వచ్చిందంటే చాలు పిల్లలకు ముందుగా గుర్తువచ్చేది పతం గి(గాలిపటం). చేతిలో చిల్లిగవ్వ లేకున్నా అమ్మానాన్నను ఇబ్బంది పెట్టైనా పంతంగులను కొనుక్కొని ఎగురవేసి సంతృప్తి పడేవారు. కాని నేటి యువత అందుకు భిన్నంగా మారుతోంది. అనునిత్యం తలకు మించిన చదువులు…. గొంతు కోతల పోటీల మధ్య నేటి పండుగల ప్రత్యేకత మారిపోయింది. ఇప్పటికీ కొన్ని రాష్ట్రాలల్లో పతంగులను ఎగురవేసే పోటీలను నిర్వహించి యువ తను ప్రోత్సహిస్తున్నారు. కాని హైటెక్‌ నగరంలో అందరూ యమ బీజీగానే కాలాన్ని గడుపుతున్నారంటే అతిశయోక్తికాదు. నగర జీవనానికి అలవాటుపడి పండుగల సందర్భంగా కూడా సంస్కృతిని పూర్తిగా విస్మరిస్తున్నారు. గత పదే ళ్లలో పండుగలపై తగ్గిన మక్కువ మరో పదేళ్లలో సంస్కృతీ సాంప్రదాయాలకు కొత్త నిర్వచనాన్ని చాటే ప్రమాదం లేకపోలేదని సంప్రదాయవాదులు భావిస్తు న్నారు. ఇదే సమయంలో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఈ పండుగను విశేషంగా జరుపుకోవడం గమనార్హం.

ఆహ్మదాబాద్‌లో ‘కార్పొరేట్‌’ డిమాండ్‌
kite-festival1సంక్రాంతి పండుగ అహ్మదాబాద్‌లోని గాలిపటాల తయారీ దారులకు మరింత ఆనందాన్ని తెచ్చిపెడుతోంది.సాధార ణంగా ప్రతి ఏడాది ప్రజల కోసం వారు గాలిపటాలను తయారు చేస్తుంటారు. కానీ ఈ ఏడాది కార్పోరేట్‌ కంపెనీల కోసం ప్రత్యేకంగా గాలిపటాలను తయారుచేస్తుండడం విశేషం. పండుగ రోజున పతంగుల ద్వారా తమ కంపెనీల ప్రచారాన్ని విస్తృతంగా చేపట్టాలని వాటి యాజమాన్యం భావించడంతో గాలిపటాల తయారీదారులకు ఈ ఏడాది చేతినిండా పని దొరికింది.

సంక్రాంతి పండుగను అహ్మదాబాద్‌వాసులు ఎంతో ఘనం గా జరుపుకుంటారు. దేశంలోనే ప్రత్యేక శైలిలో ఇక్కడ ఈ పండుగను ఆనందోత్సాహాల మధ్య నిర్వహిస్తారు. ఈనెల 14వ తేదీన వారు ఉత్తరాయన్‌ పేరిట జరుపుకునే పండుగ రోజున గాలి పటాలను పెద్ద ఎత్తున ఎగురవేస్తారు. ఈ నేప థ్యంలో అహ్మదాబాద్‌ గాలిపటాల తయారీదారులకు ఈ ఏడాది చేతినిండా పని దొరికింది. పలు కంపెనీల గాలిపటా ల ద్వారా తమ ప్రచారాన్ని చేపట్టాలని భావించడమే ఇందు కు కారణం. ఈ కంపెనీల గాలి పటాల తయారీదారులకు సంక్రాంతి పండుగ కోసం పెద్ద ఎత్తున గాలిపటాల ఆర్డర్లని చ్చారు. దీంతో పతంగుల తయారీదారులు తమకిష్టమైన రేట్లను డిమాండ్‌ చేస్తుండడం విశేషం.

60 మిలియన్లకు పైగా విక్రయాలు…
దీపావళి తర్వాత మూడు నెలల కాలంలో అహ్మదాబాద్‌ లోని పాతబస్తీలో నివసించే గాలిపటాల తయారీదారులు పతంగుల ద్వారా పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తారు. ఇక సం క్రాంతి పండుగ రోజుల్లో అహ్మదాబాద్‌లో దాదాపు పది వేల మంది గాలిపటాలను తయారుచేస్తుంటారని ఇక్కడి జమ ల్‌పూర్‌లోని స్టార్‌ పతంగ్‌ యజమాని టి.ఎ.షేక్‌ అన్నారు. పండుగ సీజన్‌లో తాము 1.5 మిలియన్ల గాలిపటాలను త యారుచేస్తామని చెప్పారు. ఈ సీజన్‌ మూడు నెలల కా లంలో అహ్మదాబాద్‌లో 60మిలియన్లకు పైగా పతంగుల విక్రయాలు జరుగుతాయని ఆయన వివరించారు.

‘కార్పొ రేట్‌ కంపెనీలు ఈ ఏడాది గాలిపటాల ఆర్డర్లను ఆలస్యంగా ఇచ్చాయి. దీంతో మేము పగలు, రాత్రి పనిచేసి ఈ ఆర్డర్ల మేరకు గాలిపటాలను తయారుచేసి ఇవ్వాల్సి వస్తోంది. కొందరు తయారీదారులు డిమాండ్‌ మేరకు గాలిపటాలను తయారుచేసి ఇవ్వలేక ఆర్డర్లను కూడా తీసుకోవడం లేదు. ఈ ఏడాది కార్పొరేట్‌ కంపెనీల పుణ్యమా అని పతంగులకు పెద్ద ఎత్తున డిమాండ్‌ ఏర్పడింది. గత ఏడాదితో పోల్చుకుం టే ఈ ఏడాది 25 శాతం విక్రయాలు పెరగాయనీ ఇది కార్పొరేట్‌ కంపెనీల చలవే’ అని షేక్‌ అన్నారు.

నాలుగవ వంతు గాలిపటాలు కంపెనీల కోసం…
అహ్మదాబాద్‌కు చెందిన మరో గాలిపటాల తయారీదారు డు అయూబ్‌ భాయ్‌ మాట్లాడుతూ ‘ఈ ఏడాది అహ్మదా బాద్‌లో తయారవుతున్న గాలిపటాల్లో 25 శాతం కార్పొ రేట్‌ కంపెనీలు కొనుక్కుంటున్నాయి.డిమాండ్‌ పెరగడం తో కంపెనీల అవసరాలను తీర్చలేకపోతున్నాము. పని వాళ్లు కూడా దొరకడం లేదు. దీంతో ఉన్న వాళ్లతోనే పగ లు, రాత్రి కూడా చేయిస్తున్నాము. దీంతో పనివాళ్లకు మూ డురెట్లు డబ్బులు చెల్లించాల్సి వస్తోంది’ అని చెప్పారు. అహ్మదాబాద్‌ కృష్ణానగర్‌కు చెందిన గాలిపటాల తయారీ దారుడు అశోక్‌ గెహాని పలు బ్రాండెడ్‌ కంపెనీలకు గాలి పటాలను తయారు చేసి ఇస్తున్నారు. ఆయన ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌, వీడాల్‌ వంటి కంపెనీలకు పతంగులను సర ఫరా చేస్తున్నారు.

ఇక కొన్ని కంపెనీలు తమ కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీలో భాగంగా తమ కంపెనీ పేర్లు ముద్రించిన గాలిపటాలను తయారుచేసి ప్రజలకు ఉచి తంగా సైతం సరఫరా చేస్తుండడం విశేషం. ‘ప్రతి సంవత్స రం ఉత్తరాయణ్‌ పండుగను ఘనంగా జరుపుకుంటు న్నాము. కంపెనీ ఉద్యోగుల కోసం గాలిపటాలను కొనుగో లు చేస్తున్నాం. ఇక గాలిపటాల ద్వారా ప్రచారం సరేసరి. దీంతోపాటు గుజరాత్లోని పలు గ్రౌండ్స్‌ను అద్దెకు తీసు కొని కైట్‌ ఫ్లయింగ్‌ కాంపిటీషన్స్‌ను సైతం నిర్వహిస్తున్నా ము’ అని వొడాఫోన్‌ ప్రతినిధి ఒకరు తెలిపారు.

కనువిందుగా కైట్‌ ఫెస్టివల్‌…
kite-festivalదేశవిదేశాలకు చెందిన వారితో అహ్మదాబాద్‌లో 20వ ఇంటర్నే షనల్‌ కైట్‌ ఫెస్టివల్‌ ఎంతో అట్టహాసంగా జరుగుతోంది. ఈ ఏడాది ఫెస్టివల్‌లో మనదేశంతో పాటు 34 దేశాలకు చెందిన వారు పాల్గొని ఆకర్షణీయంగా తయారైన వెరైటీ గాలిపటాలను ఎగురవేస్తున్నారు. బ్రిటన్‌, జర్మనీ, లిథివేనియా, సింగపూర్‌, మలేషియా తదితర దేశాలకు చెందిన వారు పాల్గొని ఈ పండు గకు ప్రత్యేక శోభను తీసుకువచ్చారు. ఇక ఈ అంతర్జాతీయ గాలిపటాల పండుగను గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి ప్రారంభించారు.

విభిన్న ఆకృతుల్లో గాలిపటాలు…
ఇంటర్నేషనల్‌ కైట్‌ ఫెస్టివల్‌లో విభిన్న ఆకృతుల గాలిపటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. సింగపూర్‌ పెవిలియన్‌ నుంచి మహిళ ఆకృతిలో రూపుదిద్దుకున్న గాలిపటాన్ని ఎగుర వేయగా ఇది అందర్నీ మైమరపించింది. ఇక ఇండోనేషియా వారు గద్ద ఆకారంలోని భారీ గాలిపటాన్ని ఎగురవేయగా, లిథి వేనియావాసులు సృజనాత్మక డిజైన్లలో గాలిపటాలను రూపొం దించి అందర్నీ ఆకట్టుకున్నారు. వీటిలో డాల్ఫిన్‌, సీతాకోక చిలుకల గాలిపటాలు అందర్నీ ఆకట్టుకున్నాయి.

గొప్ప అనుభూతినిచ్చింది…
‘అహ్మదాబాద్‌లో జరుగుతున్న ఇంటర్నేషనల్‌ కైట్‌ ఫెస్టివల్‌లో మొదటిసారిగా పాల్గొంటున్నాను.దేశ,విదేశాలకు చెందిన వారు అధిక సంఖ్యలో ఈ పండుగలో పాల్గొంటున్నారు. వేలాది మంది మధ్య సందర్శకుల మధ్య గాలిపటాలను ఎగురవేయడం ఎంతో ఆనందాన్నిస్తోంది. ఈ ఫెస్టివల్‌లో పాల్గొనడం గొప్ప అనుభూతి’ అని లిథివేనియాకు చెం దిన గిడ్రే జాక్‌స్టెయిట్‌ పేర్కొన్నారు. ‘సందర్శకుల కేరింతలు, చప్పట్ల మధ్య గాలి పటాలను ఎగుర వేయ డం మరచిపోని అను భూతి. వచ్చే ఏడాది కూడా ఈ ఫెస్టివల్‌లో పాల్గొ నాలని కోరుకుంటున్నాను’ అని ఆమె చెప్పారు. బ్రిటన్‌కు చెందిన క్లెయిర్‌ జేన్‌ మాట్లాడుతూ ‘నాకు, నా భర్తకు గాలి పటాల ను ఎగుర వేయడం ఓహాబీ.

ఈ నేపథ్యంలోనే మేము అహ్మదాబా ద్‌ కైట్‌ ఫెస్టివల్‌కు హాజరయ్యాము. మొదటిసారిగా ఈ పండు గలో పాల్గొంటున్నాము. పండుగలో భాగంగా త్రీ-డైమెన్షనల్‌, బాక్స్‌ షేప్‌డ్‌ కైట్స్‌ను తయారుచేసి ఎగురవేశాము.మాకు ఈ ఫెస్టివల్‌లో పాల్గొనడమే ముఖ్యంకానీ కాంపిటీషన్‌లో గెలుపొం దాలనే లక్ష్యం మాకు లేదు’ అని పేర్కొన్నారు. ఇక ఈ ఫెస్టివల్‌లో 34 దేశాల నుంచి 105మంది, మన దేశం లోని వివిధ ప్రాంతాల నుంచి 120 మంది పాల్గొని గాలి పటా లను ఎగురవేస్తున్నారు. సబర్మతి నదీ తీరాన జరిగే ఈ ఫెస్టివల్‌ ఈనెల 14వ తేదీన గుజరాతీలు జరుపుకునే ఉత్తరాయణ్‌ పం డుగ రోజున మరింత ఆకర్షణీయంగా జరుగుతుంది. ‘అహ్మదా బాద్‌ జనాభా ఆరు మిలియన్లు. ఇక ఉత్తరాయణ్‌ రోజున దా దాపు నాలుగు మిలియన్ల గాలిపటాలు ఆకాశంలో ఎగురుతా యి. ఈ పండుగకు ప్రజల్లో ఎంత క్రేజ్‌ ఉందో ఇదే నిదర్శనం గా చెప్పుకోవచ్చు’ అని టూరిజమ్‌ అధికారి ఒకరు తెలిపారు.

– దుద్దాల రాజు,
నార్సింగి, మేజర్‌న్యూస్‌

Surya Telugu Daily

జనవరి 14, 2011 Posted by | సంస్కృతి | 2 వ్యాఖ్యలు

నాలుగు శాతాబ్దల ‘ప్రభల’ సంప్రదాయం

నాలుగు శాతాబ్దల ‘ప్రభల’ సంప్రదాయం

తెలుగు సంస్కృతీ సంప్రదాయాలు ఎంతో గొప్పవి. వీటికి దేశ, విదేశాల్లో మంచి పేరుంది. ముఖ్యంగా పండుగలు, పర్వదినాలలో తెలుగువారి ఆచార వ్యవహారాలు ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. మన పండుగల్లో సంక్రాంతి పండుగకు విశేష ప్రాధాన్యత ఉంది. తెలుగు సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించే ఈ పండుగను కోనసీమలో ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. పండుగ వేడుకల్లో భాగంగా నిర్వహించే ప్రభల ఉత్సవాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. కోనసీమ వ్యాప్తంగా మూడురోజులపాటు జరిగే సంక్రాంతి ఉత్సవాలను పురస్కరించుకొని ప్రభల తీర్థం ఎంతో అట్టహాసంగా, ఆర్భాటంగా జరుపుతారు.

amalapuram1దాదాపు నాలుగువందల ఏళ్లుగా కొనసాగుతున్న జగ్గన్నతోట ప్రభల తీర్థం, కొత్తపేటలో జరిగే ప్రభల తీర్థానికి రాష్టస్థ్రాయిలో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ తీర్థానికి తరలివచ్చే ప్రభలు ఎగువ కౌశికదాటి వస్తున్న తీరుచూసి భక్తులు గగుర్పాటుకు గురవుతారు.మకరసంక్రాంతి తర్వాత వచ్చే ఉత్తరాయణ కాలంలో ప్రభలను ఊరి పొలిమేరలు దాటిస్తే మంచిదని ప్రజల ప్రగాఢ విశ్వాసం.

కోనసీమ ప్రత్యేకత…
సంక్రాంతిని పురస్కరించుకొని ప్రభల తీర్థం నిర్వహించడం కోనసీమ ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ఇక్కడి సుమారు 82 చోట్ల ప్రభలతీర్థం ఘనంగా జరుగుతుంది. వీటిలో అంబాజీపేట మండలం మొసలపల్లి శివారు జగ్గన్నతోట, అంబాజీపేట, ఉప్పలగుప్తం, ముమ్మిడివరం, మామిడికుదురు, కొత్తపేటలలో జరిగే ప్రభల తీర్థాలు అతి పెద్దవిగా పేరొందాయి. కనుమపండుగ రోజున జరిగే జగ్గన్నతోట తీర్థానికి రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా 11 మంది ఏకాదశరుద్రులు తరలివస్తారు. జగ్గన్నతోటకు ఆనుకుని ఉన్న చుట్టుప్రక్కల గ్రామాలలో నెలకొన్న 11 శివాలయాలనుండి ఈశ్వరుని ఉత్సవ విగ్రహాలను ప్రభలపై జగ్గన్నతోటకు తీసుకువస్తారు.

మొసలపల్లి గ్రామానికి చెందిన భోగేశ్వరస్వామి ఆహ్వానం మేరకు ఇక్కడకు పరమశివులు వస్తారని, ఇలా వచ్చే పరమశివులు లోక కళ్యాణం గురించి చర్చలు జరుపుతారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ తీర్థానికి వ్యాఘ్రేశ్వరం, పుల్లేటికుర్రు, ముక్కామల, వక్కలంక, గంగలకుర్రు, గంగలకుర్రు అగ్రహారం, నేదునూరు, ఇరుసుమండ, కె.పెదపూడి, కముజువారిలంక గ్రామాలకు చెందిన ప్రభలు వస్తాయి. వీటిలో వ్యాఘ్రేశ్వరం ప్రభ నుండి వచ్చిన వ్యాఘ్రేశ్వరస్వామి అధ్యక్షత వహిస్తారు. అందుకే ఈ ప్రభ వచ్చేవరకు భక్తులు మొక్కుబడులు తీర్చకుండా వేచి ఉండడం తరతరాలుగా కొనసాగుతోంది. వ్యాఘ్రేశ్వరం నుండి వ్యాఘ్రేశ్వరం ప్రభ వచ్చినపుడు మిగిలిన ప్రభలను గౌరవ సూచకంగా ఒకసారి ఎత్తి దింపడం సంప్రదాయంగా కొనసాగుతోంది.

స్థల పురాణం…
amalapuramజగ్గన్నతోట ప్రభల తీర్థానికి విశేష ప్రాధాన్యత ఉంది. ఇక్కడ స్థలపురాణం ప్రకారం విఠలాజగ్గన్న అనే ఏకసంధ్యాగ్రహి ప్రక్కనే ఉన్న కౌశికలో స్నానం చేసి పూజాదికార్యక్రమాలు నిర్వహించేవాడని పెద్దలు చెబుతారు. అప్పటినుండే ఈ ప్రాంతానికి జగ్గన్నతోటగా పేరొచ్చింది. నాడు ఆయన చేసిన పూజల ఫలితంగానే ఇక్కడ ప్రభల తీర్థం జరుగుతుందని స్థానికుల నమ్మకం. అంతేగాక 11 గ్రామాలకు ఈ తోట పొలిమేర కావడం మరో విశేషం. ఈ కారణంచేతే ఉత్తరాయణ కాలంలో ఇక్కడకు 11 గ్రామాలనుండి ప్రభలను తీసుకువచ్చి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం మరో కారణంగా చెబుతారు.

సుబ్బరాజు తోటలో…
మొసలపల్లి గ్రామానికి చెందిన దంతులూరి సుబ్బరాజు అనే రైతుకు తాతలనాటినుండి సంక్రమిస్తున్న ఏడెకరాల కొబ్బరితోటలో ప్రభల తీర్థాన్ని కొనసాగించడం ఆచారంగా కొనసాగుతుంది. అంతేగాక సంప్రదాయంగా ఒకే కుటుంబానికి చెందినవారు ప్రభలను తయారు చేస్తుంటారు. తాటిశూలం, టేకుచెక్క, వెదురుబొంగులతో తయారుచేసి రంగురంగుల వస్త్రాలతో, నెమలి పింఛాలతో అలంకరిస్తారు. దేవాలయాలలో ఉండే పసిడి కుండలను, వరికంకులను ప్రభలపై ఉంచి జేగంటలుగా వ్రేలాడదీస్తారు. వివిధ గ్రామాలనుండి ప్రభలను ఊరేగింపుగా తీసుకువచ్చేటపుడు పంట చేల మధ్యగా, కొబ్బరితోటల మధ్యగా వ్యయప్రయాసల కోర్చి తీసుకువస్తారు.

ఇలా తీసుకువచ్చేటపుడు పంటచేలను తొక్కుతూ ఊరేగింపుగా ప్రభలను తీసుకురావడం శుభసూచకంగా భావిస్తారు. దారిలో గోతులు, గొప్పులు, ముళ్లకంచెలను దాటుకుంటూ సుమారు పదిహేను అడుగులు క్రిందకు ఉండే ఆరడుగుల నీటిలో నడుస్తూ నేర్పుగా ప్రభలను తీసుకుని రావడం మరో ప్రత్యేకత.ఎడ్లబండిపై కొబ్బరిచాపలను గూడుగా ఏర్పాటుచేసి కుటుంబసమేతంగా ఈ తీర్థానికి రావడం నేటికీ కొనసాగుతోంది.పచ్చని పంటపొలాల మధ్య గూడుబళ్లు ఒకదానివెనుక ఒకటిగా తీర్థానికి వచ్చే తీరు కన్నులపండుగగా ఉంటుంది.

రాష్ట్రం నలుమూలల నుంచి…
amalapuram3ముఖ్యంగా కోనసీమకు చెందిన వారు ఉద్యోగ, వ్యాపారాల నిమిత్తం, దూరప్రాంతాలకు వెళ్లినవారు సంక్రాంతికి నిర్వహించే ఈ తీర్థాలకు తప్పనిసరిగా తరలిరావడం విశేషం. కోనసీమలో నిర్వహించే ప్రభల తీర్థాలన్నీ కనుమపండుగ రోజున నిర్వహిస్తుండగా కొత్తపేటలో మాత్రం సంక్రాంతి రోజున నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.ఇక్కడ ప్రభల తీర్థాన్ని చూడడం కోసం రాష్ట్రం నలుమూలలనుండి జనం తరలివస్తారు. ఇక్కడ పూర్వ కాలంనుండి కొత్తరామాలయం, పాతరామాలయం వీధుల పేరుతో గోడిపాలెంవీధి ప్రభలు పాల్గొని ప్రభుత్వ కళాశాల ఆవరణకు చేరుకున్న అనంతరం ఒకరి తర్వాత ఒకరు పోటాపోటీగా మిరుమిట్లుగొలిపే బాణాసంచాలు కాల్చి గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేస్తారు. ఈ సంబరం దీపావళిని తలపిస్తుంది. పైగా బహుమతులు ఉండడంతో స్థానికులు ఎంతో ఉత్సాహంతో పాల్గొంటారు.

కనువిందుచేసే సాంస్కృతిక కార్యక్రమాలు…
amalapuram2మధ్యాహ్నం ప్రభల తీర్థాలు ముగిసిన అనంతరం రాత్రి 9 గంటలనుండి అసలు సంబరాలు ప్రారంభమవుతాయి. వింతవింత విద్యుత్‌కాంతుల దీపాలమధ్య తీసుకువచ్చే ప్రభలు వివిధ నృత్యమేళాలు, సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహిస్తూ మిరుమిట్లు గొలిపే బాణాసంచా కాల్చుతూ ఊరేగింపును జరుపుతారు.అర్థరాత్రి ఒంటి గంట సమయానికి పాత బస్టాండ్‌ సెంటర్‌ చేరుకోగానే ఒకరికి ఒకరు పోటాపోటీగా బాణాసంచా కాల్పులను ప్రారంభించి తెల్లవారుజాము 5 గంటలవరకు కొనసాగిస్తారు. సంక్రాంతి చివరిరోజైన కనుమపండుగను పురష్కరించుకుని రైతులు తమ వ్యవసాయ పనిముట్లు శుభ్రపరుచుకుని బళ్లను, ఎద్దులను ప్రత్యేకంగా అలంకరించి వీధులలో ఊరేగిస్తారు. ఈరోజున చిన్నాపెద్దా తేడాలేకుండా మొక్కుబడులు తీర్చుకుని ఉత్సాహంగా ఉల్లాసంగా గడుపుతారు.

చెయ్యేరు ప్రభల తీర్థం…
కోనసీమలో జగ్గన్నతోట, కొత్తపేట తీర్థాల తర్వాత చెయ్యేరు ప్రభలతీర్థం మూడవస్థానం ఆక్రమిస్తుంది. ఈ తీర్థం మూడు శతాబ్థాల క్రిందట దంతులూరివారి కుటుంబం ప్రారంభించింది. అప్పటినుండి ఈ కుటుంబాల వారి చేతుల్లోనే ప్రభలతీర్థం కొనసాగడం ఆచారంగా వస్తోంది. ఈ గ్రామప్రభ కదలందే మిగిలిన గ్రామాల ప్రభలు కదలవు. ఈ ప్రభల ఉత్సవాలలో శాంతిభద్రతల పర్యవేక్షణ పోలీసులకు పెనుసవాల్‌గా మారుతోంది.క్షణకాలం తీరికలేకుండా గడుపుతున్న ఈ ఆధునిక కాలంలో తాతలనాటి ఆచారాలపేరుతో సంక్రాంతి పర్వదినాలలో కుటుంబసభ్యులంతా ఒక్కటిగా చేరి ఆనందోత్సహాలతో కాలం గడుపుతారు. పాత సంప్రదాయాలను ప్రక్కనబెట్టే నేటికాలంలో తరతరాలుగా కొనసాగుతున్న సంప్రదాయాలుగా ప్రభల ఉత్సవాలకు కోనసీమలో ప్రాధాన్యత కొనసాగుతుండడం విశేషం.

– రామకృష్ణ, మేజర్‌న్యూస్‌, అమలాపురం.

Surya Telugu Daily

జనవరి 14, 2011 Posted by | సంస్కృతి | 1 వ్యాఖ్య

వేలల్లో పాట… ఎద్దుల పందేలాట…!

వేలల్లో పాట… ఎద్దుల పందేలాట…!
సంక్రాంతి పండుగ తెలుగునాట అత్యంత ప్రాధన్యత కలిగినది. తెలుగువారి జనజీవన స్రవంతిలో ఒక భాగమైన అందరికీ ఇష్టమైన సంబరాల పండుగ ఇది. ఈ పండుగలో రెైతు లోగిళ్లు కళకళలాడుతూ…సిరిసంపదలతో తులతూగుతూ ఉంటాయి. ఇక పండుగలో ముఖ్య ఘట్టం ఎడ్ల పందేలు.పందెం ఎడ్లు రంకెలు వేస్తూ సంక్రాంతి శోభను మరింత ద్విగుణీకృతం చేస్తాయి. పండుగ ఉత్సాహాన్ని రెట్టింపు చేసేందుకు ఎడ్లు సంక్రాంతి బరిలో నిలిచి ప్రజలను అలరిస్తాయి. పందెం రాయళ్ల జోరుకు మరింత ఉల్లాసాన్ని కలగలిపి పల్లెసీమల్లో పందేల హోరును రేకెత్తిస్తాయి. కోస్తాంధ్రల్లోని వివిధ పల్లెలు ఎడ్ల పందేలతో సందడిగా మారుతాయి.

pandemపాడిపంటలు, పశువులతో తులతూగే పల్లెలు సంక్రాంతి సం దర్భంగా సరికొత్త శోభను సంతరించుకున్నాయి. ఈ పం డుగలో ప్రత్యేకత ఎడ్ల పందేలు. సంక్రాంతి వస్తుందంటే పందేల కోసం ప్రత్యేక ఆహారాన్నిచ్చి ఎద్దులకు శిక్షణనిస్తారు. బరిలో దింపేందుకు పందెం రాయుళ్లు కొన్ని నెలల ముందుగానే వాటికి కావాల్సిన అన్నింటిని సమకూర్చి పందెంలో నెగ్గడమే ధ్యే యంగా వాటిని జాగ్రత్తగా చూసుకుంటారు.

ఒంగోలు జాతి ఎద్దులు…
కోస్తాంధ్రలోని పల్లెల్లో ఎక్కువగా ఒంగోలు జాతి పశువులను సంక్రాంతి పందేల కోసం శిక్షణనిచ్చి సిద్ధం చేస్తారు. సంక్రాంతి సంబరాల్లో పశు బలప్రదర్శనలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. మన సంస్కృతి, సంప్రదాయాలకు అద్దంపట్టే ఈ పోటీలను పల్లెసీమల్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తారు.బండలాగుడుతో పాటు ఎద్దులకు అందాల పోటీలు కూడా నిర్వహిస్తుండడం విశేషం. ఈ పోటీల్లో ఒంగోలు జాతి ప శువులు ప్రత్యేక ఆకర్షణగా ఉంటా యి. పూర్వంకాలం నుంచే ఈ పోటీలు నిర్వ హిస్తున్న నేపథ్యంలో ఆనాటి సంస్కృతికి అద్దంపట్టే ఈ పందేలు పల్లెల్లో నేటికీ కొనసాగుతున్నాయి.ఇప్పటికీ గ్రామాల్లో ఎడ్లతో బలప్రదర్శనలు, వివిధ రకాల పందేలు, పోటీలను నిర్వహిస్తూ తెలుగువారు సంక్రాంతి పండుగను ఆనందోత్సాహాలతో జరుపు కుంటారు.

గెలుపే ప్రధానం…
pandem123సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని గెలుపే ప్రధానంగా పందెపు ఎడ్లను సిద్ధం చేస్తారు. సంక్రాంతికి ముందు నుంచే పందెంరాయుళ్లు వాటికి శిక్షణనిచ్చి పోటీల్లో ప్రవేశపెడతారు. బండలాగుడు, నీటిలో ఈత, అందాల ప్రదర్శన వంటి పోటీల్లో ప్రవేశపెట్టేందుకు పశువులకు శిక్షణనివ్వడానికి లక్షల్లో ఖర్చు చేస్తుండడం విశేషం. రాష్ట్రంలో ఏ మూల పోటీలు జరిగినా ఎడ్లతో అక్క డకు చేరుకుని పోటీల్లో ప్రవేశపెడతారు.సంక్రాంతి రెండు, మూడు నెల ల్లో వస్తుందన్న తరుణంలోనే పశువు లకు బలవర్ధకమైన ఆహారమైన ఉలవలు, కోడిగుడ్డు, జొన్నలు వంటి వాటిని అందించి పందేల కోసం వాటిని సిద్ధంచేస్తారు.

పందెంరాయుళ్ల జోరు…
ఎడ్ల పందేల సందర్భంగా పందెంరాయుళ్ల జోరుకు హద్దు ఉండదు. ఎడ్ల పందాలకు లక్షలు వెచ్చించి గెలుపు కోసం వారుపడే తపన అంతా ఇంతా కాదు. తమ ఎడ్లకే బహుమతి లభించాలని వాటికి కఠోర శిక్షణనిస్తారు. ఎడ్లపెై పందేలు రూ.50 వేల నుంచి మొదలెై లక్షలు దాటుతాయంటే అతిశయోక్తి కాదు.మంత్రుల నుంచి పలు వురు ప్రముఖుల వరకూ అందరూ ఎడ్ల పందేల్లో పాల్గొనడానికి ఉ త్సాహం చూపిస్తారు. అయితే వీటిపెైనే ఆధారపడి జీవించేవారు కూడా ఉన్నారు. సంక్రాంతి కోసం వీటికి శిక్షణనివ్వడానికి ఎంతో వెచ్చించి పందెంలో గెలుపు కోసం పోటీపడుతుంటారు. ఒక్క కోస్తాలోనే కొన్ని కోట్ల రూపాయల మేర పం దేలు నిర్వహిస్తారంటే ఎడ్ల పందేలకు ఉన్న ప్రాముఖ్యత ఎంతో అవగతమవుతోంది.

చూసేవారికి పండుగే…
velamతెలుగుదనాన్ని ప్రతిబింబించే సంక్రాంతి పండుగ సందర్భంగా పల్లె సీమలు కళకళలా డతాయి. పల్లెసీమల్లో ప్రతి ఇంటి ముందు రంగురంగుల రంగవల్లులు, గొబ్బెమ్మలు, భోగి మంటలు, కొత్త అల్లుళ్ల రాకతో పండుగ శోభ మరింత పెరుగుతోంది. పండుగ వేడుకల్లో భాగంగా నిర్వహించే ఎడ్ల పందేలు ఆయా పల్లెల్లో జోరుగా సాగుతుంటాయి. ఇక ఈ ఎడ్ల పందేలను చూసేందుకు ప్రజలు తండోపతండాలుగా తరలివస్తారు. పందేల ను చూస్తూ ఆనందోత్సాహాల్లో మునిగితేలుతూ పండుగను ఘనంగా జరుపుకుంటారు.

ప్రతిష్టాత్మకంగా రంగంపేట పోటీలు…
చిత్తూరు జిల్లాలోని రంగం పేట ఎద్దుల పోటీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతాయి. ఈ పోటీలకు ప్రతిఏటా ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఓ వెైపు వేలల్లో పాట .. ఎద్దుల పందేలాట అనే నానుడి ఇక్కడే ఆవిర్భవించిందేమో అన్నట్లు ఇక్కడ జరిగే పోటీలు కనువిందు చే స్తాయి. ప్రాణాలను సైతం పణంగా పెట్టి యువకులు .. కొత్త అల్లుళ్లు సైతం ఎద్దుల మెడలు ఒంచేందుకు ఉరకులు,పరుగులు పెట్టి ముందుకు దూకుతుంటారు. సంక్రాంతి సంబరాల్లో కనుమ పండుగ రోజు జరిగే ఈ ఎద్దుల పోటీలకు జిల్లానుంచే కాకుండా రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి లక్షల సంఖ్యలో సందర్శకులు హాజరు అవుతారు.

కనుమ పండుగ నాడు ఉదయం నుంచే అడవుల్లో మేతకు వెళ్లిన పశువులను తీసుకువచ్చి గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక దొడ్లలో ఉంచుతారు. తెల్లవారు జా మున లేచి రెైతులు ఎద్దులకు కొత్తగా తయారు చేసిన పలకలు, కొమ్ములకు కట్టి ఎంతో ఆకర్షణీయంగా అలంకరి స్తారు. అందరి ఎద్దులను సిద్ధం చేసిన తరువాత ప్రధాన వీధిలో వాటిని వదలుతారు. యువకులు కేరింతలు కొడుతూ ఎద్దులను పట్టుకోడానికి పో టీలు పడతారు. క్షణ క్షణం… ఉత్కంఠ భరితంగా సాగే ఈ ఎద్దుల పోటీలు ఏ నిమిషంలో ఎవ రి ప్రాణాలు హరిస్తాయో కూడా తెలియని విధంగా జరగడం రంగం పేట ఎద్దుల పోటీల విశిష్టత.

-మార్కండేయులు, కృష్ణ
మేజర్‌ న్యూస్‌, తెనాలి, తిరుపతి బ్యూరో

Surya Telugu Daily

జనవరి 14, 2011 Posted by | సంస్కృతి | వ్యాఖ్యానించండి

కోట్ల రూపాయల కోడి పందేలు..

కోట్ల రూపాయల కోడి పందేలు..

కోడి పందేలు…రాజుల కాలం నుంచి నేటి వరకు ప్రజలను అలరిస్తున్న ఓ వింత క్రీడ. నాటి కాలంలో కోడి పందేల మూలంగా వివిధ రాజ్యాల మధ్య పెద్ద యుద్దాలే జరిగాయి. ఈ యుద్ధాలలో అధిక సంఖ్యలో ప్రజలు హతమయ్యారు. ముఖ్యంగా పల్నాడు వంటి ప్రాంతాల్లో నాటి నుంచి నేటివరకు ఈ పందేలకు ప్రజల్లో విపరీతమైన జ్‌ ఉంది. కాలం మారినా ప్రజల్లో కోడి పందేల పట్ల ఉన్న క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదు.ఈ పందేలపై కోట్లాది రూపాయల బెట్టింగ్‌లు జరుగడం నేటి ట్రెండ్‌. సంక్రాంతి పండుగ రోజున ఈ బెట్టింగ్‌లు జోరుగా సాగుతుంటాయి.ఆధునికులకు అర్థం కావాలంటే ఈ బెట్టింగ్‌లు క్రికెట్‌ బెట్టింగ్‌ల లాంటి వన్నమాట.

pandem1సంక్రాంతి పండుగకు తూర్పు గోదావరి జిల్లాలో ఎంతో ప్రత్యేకత ఉంది. ఇతర ప్రాంతాల్లో మాదిరిగా ఇక్కడ సంక్రాంతి వేడుకలను నిర్వహిం చడంతో పాటు ప్రత్యేకంగా కోడి పందేలను నిర్వహిస్తారు. పండుగ సందర్భంగా కోడి పందేలను జోరుగా నిర్వహించడం ఇక్కడి ప్రత్యేకత.జిల్లాలో కోడి పందేలు ఆట వినోదంగా మారింది.ఎన్నో ఏళ్లు నుండి పోలీసులు ఈ రాక్షస క్రీడను అరిడతామని బీరాలు పలికినా రాజకీయ పలుకుబడితో కోడి పందేలు కొనసాగుతుండడంతో పోలీసులు తోక ముడుస్తున్నారు. ప్రతి ఏడాది కోడి పందేల మీద బెట్టింగ్‌లను అరికడతామని పోలీసు ఉన్నతాధికారులు ప్రకటనలు చేస్తున్నారే తప్ప వాస్తవంగా ఎటువంటి చర్యలు తీసుకుంటున్న దాఖలాలు మాత్రం లేవు. ఫలితంగా సామాన్య ప్రజలు సైతం ఈ పందేలపై వేలాదిరూపాయలను పెడుతున్నారు. ఫలితంగా సంక్రాంతి పండుగ రోజుల్లో కోట్లాది రూపాయల డబ్బులు చేతులు మారుతున్నాయి. ఇంత జరుగుతున్నా పోలీసులు మాత్రం ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు.

కోడి పందేల చాటున జూదం…
తూర్పు గోదావరి జిల్లాలో సంక్రాంతి పండుగ మూడు రోజులు కోడి పందేలు జాతర రసవత్తరంగా సాగుతుంది. కోడిపందేలు మాటున గుండాట, పేకాట, ‘లోపల బయట’ అనే జూదం యదేచ్ఛగా సాగుతాయి. కోడిపందేల చాటున గుట్టు చప్పుడు కాకుండా జరిగే ఈ జూద కార్యక్రమాలు కొందరికి రెండు,మూడు రోజుల్లోనే లక్షలాది రూపాయలను ఆర్జించి పెడుతున్నాయి. ఈ సంక్రాంతికి కూడా కోడి పందాలు నిర్వహించేందుకు ఇప్పటికే పుంజులను సిద్ధం చేశారు. ఒక్కొక్క పుంజు రూ. 10వేలు నుండి 25వేలు వరకు కొనుగోలు చేస్తున్నారు. డెల్టాలో సంక్రాంతికి ప్రత్యేకంగా కోడిపుంజులను మేపుతారు.

pandem2ఈ మూడు రోజులు యువత నుండి వృద్ధుల వరకు పందేలను చూసేందుకు ఎగబడతారు. ఈ పందేలలో డబ్బులు గెలిచిన వారు సంక్రాంతి జోష్‌గా వేడుకలు చేసుకుంటే ఓడినవారు అప్పు చేసి మద్యం త్రాగి ఇంట్లో జోగుతారు. గుంటూరు నుండి కోడిపందేలు ఇప్పటికే భీమవరం పరిసర ప్రాంతాలకు చేరుకున్నాయి.పౌరుషానికి పెట్టింది పేరైన పల్నాటి కోడి పందేలకు మంచి గిరాకి ఉంది. ప్రజలు ఎంతో ఆసక్తిగా ఈ పందేలను తిలకిస్తుంటారు. పండుగ రోజుల్లో కోడి పందేలను తిలకించేందుకు వేలాది మంది ప్రజలు రాష్ట్రం నలుమూలల నుంచి ఇక్కడికి విచ్చేస్తుంటారు. ఇక పందేల కోసం కోడి పెట్టతో క్రాసింగ్‌ చేయించి పుంజులను ప్రత్యేకంగా ఉత్పత్తి చేశారు.

కోట్లల్లో పందేలు…
డెల్టాలో ప్రతి గ్రామంలో కోడి పందేలకు ఒక ప్రత్యేకమైన బరిని ఏర్పాటు చేస్తారు. సంక్రాంతి మూడురోజుల్లో ఈ బరికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది. నేలను చదునుచేసి, చుట్టు తాళ్ళాతో ప్రహారీని ఏర్పాటు చేస్తారు. ముందుగా బరికి నైవేధ్యంగా నల్లకోడిని బలిస్తారు. గ్రామంలో రూ.25వేలు నుండి లక్ష వరకు పందేలు సాగుతాయి. ఆకివీడు మండలం ఐ భీమవరం, ప్రకృతి ఆశ్రమం దగ్గరలోని తోటలో, చించినాడ సమీపంలో, జువ్వలపాలెం, తదతర ప్రత్యేక బరులల్లో కోట్లాది రూపాయాల పందాలు జరుగుతాయి.పందాల నిర్వహణకు ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి పందేలను తిలకించేందుకు వచ్చే వారి కోసం అవసరమైన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. పండుగ రోజుల్లో విందువినోదాల్లో మునిగితేలేందుకు అవసరమైన సౌకర్యాలను ఇక్కడ కల్పిస్తున్నారు.

పందెం కోడికి ప్రత్యేకాహారం…
బరిలో దిగే పందెం కోడికి ప్రత్యేకాహారాన్ని అందిస్తారు. గుడ్లు, గంట్లు,చోళ్ళు, కైమా, బాదం పిక్కలు, తొండమాంసం వేస్తారు. దీంతో పందెం కోడి బలంగా తయారవుతుంది. వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు వ్యాక్సిన్‌, ఇతర మందులు కూడా వాడతారు. పందెంలో కోడికి గాయమైతే రక్తం వెంటనే బయటకు రాకుండా ఈ ఆహారాన్ని వాడతారు. పందెం కోడికి ప్రత్యేకమైన శిక్షణ కూడా శిక్షణ కూడా ఇస్తారు. ఇక పందేలలో కోళ్లకు కత్తులు కట్టి వాటిని పోట్లాటకు దించుతారు. కత్తులు గాయాలతో రక్తాలు కారుతున్నా అవి ఏమాత్రం వెనుకంజ వేయకుండా పోరాడడం సందర్శకులను చూపుతిప్పుకోకుండా చేస్తుంది. ఈ విధంగా పందెం కోళ్లకు శిక్షణనిస్తారు. చివరికి ఈ పందేలలో కొన్ని కోళ్లు కూడా మృతిచెందుతాయి.ప్రజలకు వినోదాన్ని పంచి చివరికి తమ జీవితాలను ముగిస్తాయి.

కొన్ని జీవితాలకు ఆధారం…
pandemకోడి పందాలను ఆధారంగా చేసుకుని కొన్ని కుటుంబాలు జీవిస్తున్నాయి. ఈ కుటుంబాల్లో ఉన్న పెద్దలు కుక్కుట శాస్త్రాన్ని ఎక్కువగా చదువుతారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇదే వృత్తిని ఎంచుకుని కోడి పుంజులను పెంచుతారు. మాములు రోజుల్లో పుంజు ధరరూ.3వేలు నుండి 10వేలుకు అమ్ముతారు. ఇవే పుంజుల ధరలు సంక్రాంతి సీజన్‌లో ఆకాశానికి తాకుతాయి. పందెం కోడికి కత్తి కట్టేవారు ఈ పందేళ్ళపైన ఆధారపడి జీవిస్తారు.

పుంజుల్లో రకాలు…
కోడి పుంజుల్లో అనేక రకాల జాతులన్నాయి. అయితే ప్రధానంగా 17రకాల జాతులను మేలు జాతులుగా పందెం కోళ్లుగా పరిగణిస్తారు. డేగా, నెమలి, నల్ల నెమలి, కేతువ, నేతువ, పర్ల, పెట్టమారు, మైలా, రసంగి, కోక్కిరాయి. కాకి, పచ్చకాకి, తెల్లపర్ల, కౌజు, సరళ ఇటువంటి రకాలను మేలైన జాతి పుంజులుగా పరిగణించి పెంచుతారు. ఈ పందెం కోళ్ళల్లో నెమలి,కాకి, డేగ జాతులే నెంబర్‌ వన్‌ కోళ్ళుగా పెర్కొంటారు.

బారుతీరుతున్న జనం…
సంక్రాంతి పండుగ మూడు రోజుల్లో ఇంటి అల్లుళ్ళులతో పాటు బంధువులు సైతం కోడి పందేలను చూసేందుకు వెళ్తారు. సుదూర ప్రాంతాల నుండి పందేలను చూడాడానికి తరలి వస్తారు. హైదరాబాద్‌, విశాఖ నగరాతో పాటు ఇతర రాష్ట్రాల నుండి ప్రముఖులు పందాలు కోసం ప్రత్యేకగా వస్తారు. ఇతర ప్రాంతాల్లో ఉద్యోగం, వ్యాపారరంగాల్లో స్థిరపడిన జిల్లావాసులు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రత్యేకంగా కోడి పందేలను చూడడానికి రావడం గమనార్హం. భీమవరం ప్రకృతి ఆశ్రమం దగ్గరలో ఉన్న బరిలో జరిగే కోడి పందేలకు సినీతారలను ప్రత్యేక ఆకర్షణగా తీసుకు వస్తారు.

-కె.శ్రీనివాస్‌, మేజర్‌న్యూస్‌, భీమవరం

Surya Telugu Daily

జనవరి 12, 2011 Posted by | సంస్కృతి | 1 వ్యాఖ్య

ముంగిళ్ల మెరిసే రంగుల సందేశాలు…

ముంగిళ్ల మెరిసే రంగుల సందేశాలు…

రోజూ వేసే రంగు రంగుల ముగ్గులను చూస్తేనే తెలుస్తుంది… ఇది ధనుర్మాసమని, వచ్చేది సంక్రాంతి పండుగని… ఈ పండుకు నెల రోజుల ముందు నుండే సందడి మొదలవుతుంది. మాసం మొత్తం పండుగ వాతావరణాన్ని తలపింపజేస్తుంది. ప్రతీ గడపా రంగు రంగుల ముగ్గులతో ముస్తాబవుతుంది. భారతీయ సంప్రదాయంగా ఎన్నో వందల ఏళ్లుగా కొనసాగుతూ వస్తున్న ముగ్గుల సంప్రదాయం కేవలం అలంకరణ కోసమే కాదు.. ఆరోగ్యం… అందం.. ఆనందం కోసం కూడా.. అటువంటి ఈ ముగ్గుల కథేంటో తెలుసుకుందాం..

rangoli1సంక్రాంతి పండుగ అంటేనే మిగిలిన వాటికి ఎంతో ప్రత్యే కమైంది. పల్లెటూళ్లలో ధాన్యం ఇళ్లకు చేరే సమయం.. అన్ని గడపలూ ఆనందంతో నిండిపోతాయి..పైగా సూర్యుడు ధనురాశిలోకి ప్రవేశించే పవిత్రమైన ధనుర్మాసం.. మిగిలిన పండుగలన్నీ చాంద్రమానాన్ని అనుసరించి చేసుకున్నా ఈ పండుగకు మాత్రం సౌరమానాన్ని అనుసరిస్తారు. అందుకే ఈ పండుగకు ఎంతో ప్రత్యేకత వుంటుంది.

రంగోలి…
రంగోలి అనేది ఉత్తర భారతదేశంలో ముగ్గుకు మరో పేరు. ముగ్గు, రంగవళ్లి అనేది మన తెలుగు భాషలోని పేరు. బెంగాలీ లో అల్పానా, తమిళ్‌లో కోలమ్‌, అని ఎలా పిలిస్తారు. పేరు ఏదై నా వ్యక్తీకరణ సృజనాత్మకమే.

గ్రామీణ ప్రాంతాల్లో…
గతంలో గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లను ఎర్రమన్నుతో కట్టుకునే వారు. అలా కట్టుకున్న ఇంటికి మట్టిపేడను కలిపి అలికేవారు. దీని వల్ల దుమ్ముధూళి వంటివి ఇంట్లోకి రాకుండా అణగి పోయే వి. పురుగులు వంటివి రాకుండా బియ్యపు పిండితో ముగ్గులు పెట్టేవారు. వీటి వల్ల అవి ఆ బియ్యం పిండిని ఆహారంగా తీసుకు ని ఇంట్లోకి రాకుండా పోయేవట.

దక్షిణ భారతదేశంలో..
rangoli3దక్షిణ భారతదేశంలోని పల్లెటూళ్లలో ఇప్పటికీ పేడ నీటిని చల్లి బియ్యపు పిండితో ముగ్గులు పెట్టుకునేవారున్నారు. ఇప్పుడు చాలావరకు బియ్యపు పిండికి బదులు ముగ్గురాళ్ల పొడి దొరుకుతుంది. దీని ద్వారా వేసు కుంటున్నారు.

స్వాగత అలంకారం…
ధనుర్మాసం విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైనది. ఈ మాసంలో విష్ణుమూర్తి భూమి మీదకు వస్తా రని నమ్ముతారు. ఈ మాసంలోనే స్వర్గపు ద్వారాలు కూడా తెరు చుకుంటాయనేది మన పెద్దల నమ్మకం.అందుకే మహిళలంతా ఉదయాన్నే తొందరగా లేచి ఇంటి ముందు శుభ్రం చేస్తారు. పేడను నీటిలో కలిపి చల్లుతారు. ఇంటి ముందు అందమైన రంగ వల్లులను తీర్చిదిద్దుతారు. ఈ ముగ్గులను వేసుకునేప్పుడు విష్ణునామస్మరణ చేస్తూ పూర్తి చేస్తారు.

ముగ్గులలో గొబ్బిళ్లు…
ఈ నెల మొత్తం ఆవు పేడను ముద్దలుగా చేసి ముగ్గుల మధ్యలో పెడతారు. వీటిని గొబ్బెమ్మలు అంటారు. ఇది గౌరీమాతను పూజించడంలో ఓ భాగంగా వస్తోంది. ఈ గొబ్బెమ్మళ్లను పసుపు కుంకుమలతో అలంకరించి మధ్యలో గుమ్మడి లేదా బంతి పూల ను పెడతారు. పెద్దదాన్ని ముగ్గు మధ్యలో పెట్టి చిన్న చిన్న వాటిని వాటి చుట్టూ పెడతారు.

కోరికలు తీర్చమంటూ…
చిన్న చిన్న పిల్లలు, ెపెళ్ళికాని యువతులు మంచి భర్త రావాలని ఈ ముగ్గుల చుట్టూ పాటలు పాడుతూ గొబ్బి తడతారు. పెళ్లైన మహిళలు తమ దాంపత్య జీవితం బాగా గడవాలని కోరుతూ ఈ వేడుకను చేసుకుంటారు.

వేడుకల అనంతరం..
rangoliరోజూ ముగ్గులలో పెట్టే గొబ్బిళ్లను తీసి ఎండలో ఎండబెడతారు.వీటిని పండుగ రోజు సూర్యభగవానుడికి నైవేద్యంగా పెట్టే తీపి అన్నం(పాయసం)వండేందుకు పిడకలుగా వుపయోగిస్తారు. ఇప్పటికీ పల్లెటూళ్లలో వీటినే వంట చేసుకునేందుకు వుపయోగి స్తారు. ఇవి ప్రకృతికి ఎంతో మేలు చేస్తాయి కూడా.

రెండు రకాలు..
ఈ ముగ్గులలోనూ రెండు రకాలు వున్నాయి.. అవి ఒకటి చుక్క లు పెట్టి వేసేవి. మరొకటి డిజైన్స్‌..వీటికి ఏ చుక్కలూ అవసరం లేదు. సృజనాత్మకంగా తమ మనసులోని రూపాలను వేయడం అన్నమాట. ఏది ఏమైనా వీటిలో ప్రకృతికి ఎంతో ప్రాధాన్యత. పువ్వులు, కుందేళ్లు, చిలుకలు, చెరుకుగడలు, ఇళ్లు, లక్ష్మీదేవి వంటి వాటికే ప్రాధాన్యత ఎక్కువ.

పోటీలు…
ఈ మాసంలో మహిళలు పోటీ పడి మరీ ముగ్గులను వేస్తారు. అనేక చోట్ల పోటీలను కూడా నిర్వహిస్తారు.మ్యాగజీన్స్‌, న్యూస్‌ పేపర్స్‌, ఇతర సంస్థలు పోటీలను నిర్వహించి బహుమతులను కూడా అందజేస్తారు.

ఆరోగ్యం…
ముగ్గు వేయడం కేవలం సంప్రదాయం మాత్రమే కాదు.. ఆరోగ్యానికి ఓ వరం కూడా. ఉదయాన్నే లేవడం… నీటిని తెచ్చి అందులో పేడ కలపడం… చల్లడం.. వంగి ముగ్గులు పెట్టడం ఇదంతా శరీరానికి చక్కటి వ్యాయామాన్ని ఇస్తుంది. ఇది చేతి వేళ్లు మొదలు పాదం వరకు అన్నిటిలో ఉత్తేజాన్ని కలిగిస్తుంది. ఉదయాన్నే లేవడం వల్ల రోజు మొత్తం ఆహ్లాదంగా వుంటుంది. అధిక బరువు, అనవసర కొవ్వు వంటివి శరీరంలో చేరకుండా కాపాడుతుంది. పైగా పేడలోని ఔషధ గుణాలు ఎన్నో రకాల క్రిములను నాశనం చేస్తాయి. ఆరోగ్యాన్నిస్తాయి.

– హైమ సింగతల

Surya Telugu Daily

జనవరి 12, 2011 Posted by | సంస్కృతి | 2 వ్యాఖ్యలు

సుబ్బీ గొబ్బెమ్మా… శుభములీయవే…!

సుబ్బీ గొబ్బెమ్మా… శుభములీయవే…!

మంచు దొంతరలు విడిపోక మునుపే.. ముద్దులొలికే లోగిళ్లలో ముచ్చటైన గొబ్బెమ్మలు ఒదిగేందుకు సిద్ధం.. కన్నె పిల్లలంతా కలిసి తమ కోర్కెలను తీర్చమంటూ చిట్టాను పాటకట్టే సమయం.. తమ కుటుంబాన్ని చల్లగా చూడమంటూ ఇంతులంతా వేడుకునే తరుణం… మురికి వాడలు సైతం అందంగా ముస్తాబయి ఆహ్వానం పలుకుతున్న శుభోదయాలు.. ఈ మాసం మొత్తం అందంగా..ఆనందంగా..శుభాలు ఇవ్వాలని కోరుతూ..

ragoli-mugguగోవును గౌరీమాతగా కొలిచే సంప్రదాయం మనది. అందుకే ఆవు పేడను కూడా ఎంతో పవిత్రంగా భావిస్తారు. కేవలం పవిత్రం మాత్రమే కాదు.. ప్రకృతికి మేలు చేసే ఎన్నో మంచి గుణాలు ఇందులో వున్నాయి. అందుకే ధనుర్మాసంలో ప్రత్యేకంగా ఆవు పేడతో చేసిన గొబ్బిళ్ళను ముగ్గుల మధ్యలో పెట్టి పూజిస్తారు. గొబ్బెమ్మలను గౌరీదేవిగా భావించే యువతులు సందె గొబ్బెమ్మలను పెట్టి గొబ్బియాలతో పాటలను పాడి ఆడుతారు. అలా చేస్తే కోరుకున్న వరుడొస్తాడని, త్వరగా పెళ్ళి అవుతుందని వారి నమ్మకం. ఈ ఆట వివాహ వ్యవస్థపై మన యువతులకున్న నమ్మకాన్ని రుజువు చేస్తుందంటారు.

గొబ్బెమ్మలు..
పెద్ద వయసు స్ర్తీలు ముగ్గులు పెడుతుంటే చిన్న వయసు ఆడపిల్లలు ఆవు పేడతో చేసిన గొబ్బి ళ్ళను ముగ్గుల మధ్యలో పెడతారు. గొబ్బెమ్మలు కృష్ణుని భక్తురాళె్ళైన గోపికలకు సంకేతంగా భావిస్తారు. ఈ ముద్దల తలమీద కనిపించే రంగుల పూలరేకులు, పసుపు కుంకుమలు ముతె్తైదువులకు సంకేతం.గోపీ+బొమ్మలు=గొబ్బెమ్మలు అని చెబుతుంటారు పెద్దలు. మధ్య వుండే పెద్ద గొబ్బమ్మ గోదాదేవికి సంకేతం. సంక్రాంతి రోజులలో వీటి చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ నృత్యం చేసే బాలికలంతా కృష్ణభక్తి తమకూ కలగాలని ప్రార్థిస్తుంటారు. దీనిని సందె గొబ్బెమ్మ అంటారు. గొబ్బెమ్మలు పొద్దున పూట ముగ్గులో ఉంచి, దానిపై గుమ్మ డి పూలతో అలంకారం చేస్తే చాలా అందంగా వుంటుంది.

గొబ్బిళ్ళ పాటలు..
sankrantiగొబ్బి పాటలకు జానపద వాజ్మయంలో ఒక ప్రత్యేక స్థానం ఉంది.గోపికలనే వ్యవహారంలో గొబ్బెమ్మలుగా భావిస్తారు అని ముందుగానే చెప్పుకున్నాం.. ‘కొలని దోసరికి గొబ్బిళ్ళో యదు కుల సామికి గొబ్బిళ్ళో’ అనే అన్నమయ్య పాట అందరికీ తెలిసిందే. ఈ ధనుర్మాసం రోజుల్లో ఊరూరా ఆడవారు తెల్ల వారకముంద లేచి ఇం టి ముందు పేడనీళ్లు చల్లి ముగ్గులు వేసిన తరువాత పేడతో చేసిన ముద్దలను గొబ్బె మ్మ లుగా భావించి ఆ ము గ్గుల మధ్య భాగంలో పెట్టి వాటికి అలంకా రంగా పువ్వులు పెడతా రు. సాయంత్రమ య్యాక పేడతోగానీ, పసుపుతోగానీ గొబ్బె మ్మలు చేసి ఒక పెద్ద పళ్లెంలో ఉం చుతారు.

కళ్ళ స్థా నంలో గురి వింద గింజలు, ముక్కు స్థానంలో సంపెంగ లాంటి పువ్వును ఉంచుతారు. ఈ గొబ్బెమ్మలకు రక రకాల అలంకారం చేసి ఇంటింటి ముందుకూ తీసు కువెళ్ళి పళ్ళెంతో సహా నేలమీద ఉం చి గొబ్బెమ్మ చు ట్టూ తిరుగుతూ చేతులతో చప్పట్లు తడుతూ పాటలు పాడతారు. అక్కడ పాడే పాటలే గొబ్బి పాటలు. పాడటం పూర్తయ్యాక మధ్యలో ఉన్న అమ్మాయి గొబ్బెమ్మను పట్టుకుంటే మిగిలిన ఆడపిల్లలు అందరూ ఆ అమ్మాయికి ఇరువైపులా చేరి ఒకరి భుజాల మీద ఇంకొకరు చేతులు వేసుకుని గొంతులు కలిపి పాటలు పాడుకుంటూ తిరిగి వస్తారు. చివరి రోజైన కనుమ రోజు పాటలు పాడటం పూర్తయ్యాక గొబ్బుమ్మలను నీటిలో నిమజ్జనం చేస్తారు.

whomanగొబ్బెమ్మలకు తెలంగాణా ప్రాంతంలోని బతుకమ్మలకు పోలికలున్నా, కొన్ని విషయాల్లో స్వల్ప బేధాలున్నాయి. బతు కమ్మపాటలు ఒక నిర్ణీత ప్రదేశంలో పాడితే గొబ్బి పాటలు ఊరంతా తిరుగుతూ ప్రతి ఇంటి ముందూ పాడుతారు. గొబ్బి పాటలు నిటారుగా నిలబడి తిరుగుతూ పాడతారు. బతుకమ్మ పాటలు పాడేవాళ్లు నడుం దగ్గర వంగి తిరుగుతారు. బతుకమ్మపాటు పాడేవారి కదలికల్లో అందం ఉంటే గొబ్బిపాటలు పాడేవారిలో హుందాతనం ఉంటుంది. బతుకమ్మ పాటలు పాడేవాళ్లు చప్పట్లు వేగంగా తడితే గొబ్బి పాటలు పాడేవాళ్ళు నిదానంగా తడతారు.

దేవుని నైవేద్యం కోసం..
రోజూ ముగ్గులో పెట్టి పూజించే గొబ్బెమ్మలను ఎండలో ఎండబెడతారు. పండుగ రోజు సూర్యభగవానునికి నైవేద్యం సమర్పించేందుకు సిద్ధం చేసే ప్రసాదాన్ని వండేందుకు ఈ గొబ్బి పిడకలనే వుపయోగిస్తారు.ఎండిపోయిన ఆ పేడ ముద్దలను మండించి ప్రసాదాన్ని తయారు చేస్తారు.

– హైమ సింగతల

Surya Telugu Daily

జనవరి 12, 2011 Posted by | సంస్కృతి | 1 వ్యాఖ్య

నాటకకళ

నాటకకళ
అలసి సొలసిన మనసుకు సాంత్వన చేకున్చేవి కళలు. అలనాడు రాజుల ఆలనా .. పాలనలో ఎందరో కళాకారులు తమ ప్రతిభతో ప్రజలను రంజింపజేసేవారు. కాల క్రమేణా రాజులు పోయారు … రాజ్యాలు కనిపించకుండా పోయారుు .

Dramaనాటకం అనేది ఒక శ్రవణ సహిత దృశ్య రూపకం. జానపద కళలు విలసిల్లుతున్న రోజులలో, రాజుల పరిపాలనా కాలంలో ప్రజల వినోదం కోసం అత్యధికంగా ఆదరింపబడిన కళ నాటకం.కందుకూరి మీరేశలింగం పంతులు గారు పుట్టిన ఏప్రిల్‌ 16వ తేదీన తెలుగు నాటకరంగం దినోత్సవంగా రాష్ట్ర సాంస్కృతిక శాఖ గుర్తించింది .

నాటకం సంగీత నృత్యాలతో కూడుకున్న ప్రక్రియ. యక్షగానానికి రూపాంతరమైన నాటకానికి సూత్రధారుడే ఆయువుపట్టు. ఇందులోని పాత్రలన్నీ తమను తామే పరిచయం చేసుకుంటూ రంగపవ్రేశం చేస్తాయి. 16వ శతాబ్దంలో ప్రారంభమైన నాటక ప్రక్రియను యక్షగాన నాటకం, వీధి భాగవతం, బయలాట అని పిలుస్తారు. వీధి నాటకాలను ఎక్కువ ప్రచారంలోకి తెచ్చిన వారు కూచిపూడి భాగవతులు. కాకతీయుల కాలంలో ప్రదర్శించిన క్రీడాభిరామం కూడా ఒక నాటకమే. తెలుగులో ఆదికవిగా పేరుగాంచిన నన్నయ్య తన భారత అవతారికలో రసాన్విత కావ్యనాటకముల్‌ పెక్కుజూచితి అనడాన్ని బట్టి నన్నయ కాలానికి నాటక ప్రదర్శనలుండేవని అర్ధం చేసుకొవచ్చు.

Hara-Vilasam-dramaనాటకం రకాలు: వీధి నాటకాలు, స్టేజి నాటకాలు, రేడియో నాటకాలు, పౌరాణిక నాటకాలు, సాంఘిక నాటకాలు, జానపద నాటకాలునటుడి చలిని కప్పే దుప్పట్లు… చప్పట్లు! శభాష్‌ అంటూ రసజ్ఞుల ప్రశంసలు… రసానందంతో మైమరిచిపోయి వన్స్‌మోర్‌ టపటపమంటూ కరతాళధ్వనులతో ప్రేక్షకుల ఆదరణ.. ఇవే నాటక రంగానికి ఊపిరి, ఉత్సాహాన్ని అందిస్తాయి. ఇప్పటికీ పల్లెల్లో జరిగే జాతర్లకు, శ్రీరామోత్సవాలు, వివిధ శుభకార్యాల్లో నాటకాల ప్రదర్శనలతో రంగస్థలం ప్రత్యేకత చాటుకుంటోంది. వివిధ మాధ్యమాలు వస్తున్నప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో నాటకాలు ప్రదర్శింపజేసి విభిన్న రుచులు కలిగిన జనావళికి ఏకపత్ర సమారాధన చేసే మహత్తర కళా ప్రక్రియ నాటక కళ. శతాబ్ది పైచిలుకు సుదీర్ఘ చరిత్ర కలిగిన నాటకానికి ఎందరో రచయితలు, మరెందరో నటులు… ఇంకెందరో దర్శకులు, ప్రయోక్తలు మెరుగులు దిద్దారు. నటరాజ కాలి అందెల్లో సిరిమువ్వలుగా నిలిచారు.

Hara-Vilasam-drama1చిక్కోలు నాటకరంగం: శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఎందరో కళాకారులు నాటకరంగం వికాసానికి దోహదపడ్డారు. ప్రభుత్వపరంగా కూడా రాష్ట్రంలో ఏ జిల్లాలో లేని విధంగా 686 మంది కళాకారులకు జీవన భృతిని అందిస్తుండడం, శ్రీకాకుళ రంగస్థల కళాకారుల సమాఖ్య లాంటి సాంస్కృతిక సంస్థలు పేద కళాకారులకు ప్రతినెలా ఆర్థిక చేయూతతో పాటు జిల్లా కేంద్రం, ఇతర ప్రాంతాల్లో ప్రదర్శనకు అవకాశాలు కల్పిస్తుండడంతో చిక్కోలు నాటకరంగం చిగురిస్తోందని చెప్పొచ్చు.

 

Surya Telugu Daily

డిసెంబర్ 25, 2010 Posted by | సంస్కృతి | | 1 వ్యాఖ్య

కథాశిల్పి …డాక్టర్‌ కాకాని చక్రపాణి

కథాశిల్పి

Chakrapani-f-కథలు రాయటం తేలికా కష్టమా అనే మీమాంస వచ్చిన ప్పుడు రెండు విధాలగానూ అభిప్రాయం వ్యక్తం చేస్తారు రచయితలు. అసలు కథకంటే నవల రాయటమే బహు తేలిక అనే వాళ్ళూ వున్నారు.డాక్టర్‌ కాకాని చక్రపాణి ప్రముఖ రచయిత. ఆయన కథలూ, నవలలూ కూడా బహు తేలిగ్గా రాయగలిగాడు.ఆయన రచనలు ఎందరో సాహితీ విమర్శకుల దృష్టికి వెళ్ళి మెప్పులు పొందటమే గాకుండా వివిధ పత్రికలు, సంస్థలు నిర్వహిం చిన పోటీలలో బహుమతులూ పొం దినయి.

కథను సంఘటన చుట్టూ తిప్పు తూ, పాత్రల మనస్తత్వాన్ని విశ్లేషిస్తూ చెప్పదలుచుకున్న విషయాన్ని లోతు గా పరిశీలించి పాఠకుడిని ఆలోచిం ప చేయగలిగిన రచనలు చేయటం ఆయన నేర్చుకున్న విద్య.చక్రపాణి కథనంలో ఒక ఒడుపు, ఒక చాతుర్యమూ, భావుకత్వంతో కూడిన ఒక వేగమూ కన్పిస్తాయి. ఆత్మవిశ్వాసమూ, సంస్కారపూరిత ధి క్కార స్వభావమూ ఉండే స్త్రీ పాత్ర చిత్రణ ఆయన రచనల్లో కనిపి స్తుంది. సాహిత్య సామాజికాంశాల ప్రత్యేకతే కాకుండా, చాలామంది కథా రచయితల్లో కన్పించని కంఠస్వర వైవిధ్యం చక్రపాణి కథల్లో కన్పిస్తుంది.

ప్రతి రచయితకూ క్షణక్షణం కవ్వించే జీవితమే అంతులేని ఆకర్ష ణ. తన ఒక్కొక్క రచన ద్వారా ఆకాశమంత ప్రహేళికలో ఖాళీ స్థానాలను పూర్తి చేసుకుంటూ పోయే రచయిత తన ఊహల పిడికిలికి అంది నంత మేర ఆకారం, అర్థం ఇస్తాడు. అటు వంటి నిత్యార్యార్థకం అవ తారాలే చక్రపాణి కథలు. వీటినిండా మనకు తెలిసిన వ్యక్తులే ఉంటా రు. తెలిసిన చీకటి వెలుగులే ఉంటయి.వీరి కథలు చాలామంది పాఠకులని ఆకర్షిస్తాయి అనటంలో అతి శయోక్తి లేదు. డాక్టర్‌ కేతు విశ్వనాథరెడ్డి, వాకాటి పాండురంగారా వు, మునిపల్లె రాజులాంటి ప్రముఖ రచయితలు కూడా ఆయన కథలంటే ఆసక్తి చూపిస్తారు.

కాకాని మూడు కథా సంపుటాలను ప్రచురించారు. అవి థ్రిల్లిం త, నివురు, పతితపావని. అందులో ఒకదానికి డాక్టర్‌ కేతు విశ్వనా థరెడ్డి ముందుమాట రాస్తూ ‘చిత్తవృత్తుల్ని ఆడించే శక్తుల్ని ఈ రచ యిత తన కథల్లో ఒక అన్వేషకుడిగా పట్టుకో డానికి ప్రయత్నించా డు. మనిషిని మనిషిగా, ఒక సామాజిక సాంస్కృతిక మూర్త పదా ర్థంగా పరిశీలించాడు. మనుష్యులు కోల్పోతున్న ఆపేక్షలను గుర్తిం చాడు. పోగొట్టుకుంటున్న విలువల్ని చర్చించాడు’ అంటారు.అసలు మనిషికి స్వేచ్ఛ వున్నదా, వుంటే ఆ మేరకు ఏ వ్యక్తి అయి నా జీవించగలడా, ఆ గీతలు గీచే సమాజ ప్రభావం ఎలాం టిది అన్న అతి గహనమైన విషయాన్ని చక్కటి శిల్పంతో దిద్దిన కథ ‘నిస్వార్థం’. మెరుపు తీగలాటి వివేకవతి అయిన భార్య వుండి కూడా వీధుల వెంబడి కుక్కల్లాగా తిరిగే భర్తను, సంయమనం నిండిన ఛీత్కారంతో చిత్రించింది ‘చుక్కల్లో చంద్రుడు’ కథ.

‘మరమరాలు బఠాణీలు అందులో సామ్యవాదం’లోని నారా యణరావు, ‘రెండు ముఖాల చంద్రుడు’లోని రామచంద్రం, ‘మహా పర్వతంా మరుగుజ్జు’లోని రామం నేటి కాలంలోని పురుషకు సం స్కారానికి ప్రతినిధులు.స్త్రీ పురుష సంబంధాలను వేర్వేరు కోణాలనుండి ‘భార్యంటే’, ‘తాకట్టు’, ‘ఛీ! ఏం మగాడు’ కథలు పరిశీలించగా ‘పద్మావతీ చరణ చారణ చక్రవర్తి’ మనసుకు శరీరానికి మధ్యగల శక్తివంతమైన సం బంధాన్ని చిత్రీకరిస్తుంది.

ఆయన రచనలో వ్యక్తీకరించిన కొన్ని యదార్థ వాదాలు ఇలా వుం టాయి. ఆడది చాలా విషయాల్లో మగవాడిని పల్టీ కొట్టిటస్తుంది. అటు వంటిది అందమైన స్త్రీ ముందు నిలబడ్డ మగవాడు మరింత బిడియ స్తుడవుతాడు. పిచ్చిమొక్కలు కోసినంత తేలిగ్గా గులాబీలను త్రుంచ డానికి మనవేళ్ళు మనకు సహకరించవు గనుక మగవాడు ఆడదాన్ని మహా పర్వతం చేసి తను మరగుజ్జు అవుతున్నాడు. అలా గే, మరో చోట చంద్రుడిలోని నల్లని మచ్చను కుందేలులా ఊహిం చుకునే మనస్సు మనది అంటాడు.‘దయ్యం వదిలింది’ లో కథనం ఇలా నడుస్తుంది ’ఆయన రాసిన కథలు వయసొచ్చిన ఆడపిల్లల్లాం టివి. వాటిని గుండెల మీద కుంపట్లలా భరించేవాడు ఆయన. తల్లి దండ్రులు కూతురికి వీలయినంత మంచి సంబం తధమే చేయాలని చూస్తారు. అలాగే మా బావగారికి తన కథలు మంచి పత్రికలలో రావాలని వుండేది’ అంటుంది అందులోని ఒక పాత్ర.

చక్రపాణికి కథలు రాయటమే కాకుండా, ఇతర భాషా రచనలను తెలుగులోకి, తెలుగులోని మంచి రచనలను ఆంగ్లం లో కి అనువదించటం, మిత్రులతో కలిసి మాటలు చెప్పటం తృప్తినిచ్చే పనులు. ఆయన మాట్లాడుతుంటే మనకూ కాలం తెలియదు.ఆరవై అయిదేళ్ళ క్రితం మాట. ఇప్పుడా దృశ్యానికి ఎన్ని మార్పు లూ, చేర్పులూ వచ్చాయో తెలియదు. గుంటూరు జిల్లా, మంగళ గిరి మండలలో చినకాకాని గ్రామంలో జన్మించాడు కాకాని చక్ర పాణి. తరువాత ప్రముఖ రచయిత అయి, కథలూ నవలలూ వ్రాసి, సవ్యసాచిలా తెలుగులోనూ, ఇంగ్లీషూలోనూ రచనలు చేస్తూ సాహిత్యంలో డాక్టర్‌ ఆవ్వటమే గాకుండా తెలుగులో ఎంతోమంది సాహితీ ప్రియులకు సన్నిహితుడయ్యాడు.

కష్టాలు లేందే సుఖంలోని మజా తెలియదంటారు. అనారోగ్యం వలన బిఎస్సీ చదువును అర్ధాంతరంగా ఆపేసినా, తరువాత ఉద్యో గం చేస్తూ, సంసారమనే సాగరాన్ని ఈదుతూ ఇంగ్లీష్‌ లిటరేచర్‌ లోను, ప్రాచీన భారత దేశ చరిత్ర, సంస్కృతి, పురాతత్వ శాస్త్రంలో ను ఏం.ఏ.పట్టా పుచ్చుకొని, ‘తెలుగు సాహిత్యంపై సోమర్‌ సెట్‌మామ్‌ ప్రభావం’ అన్న విషయం మీద పరిశోధనాత్మక వ్యాసం తో డాక్టర య్యాడంటే ఆయనలోని పట్టుదలా, ఆత్మవిశ్వా సాలు ఎలాంటివో తెలుస్తుంది. ఆ పరిశోధనలో భాగంగానే, సోమ ర్‌సెట్‌ మామ్‌ మాగ్నం ఓపస్‌ నవల ‘ఆఫ్‌ హ్యూమన్‌ బాండేజ్‌’ ను తెలుగు లోకి అనువదించాడు.ఆయన చేసిన ఆ పని తెలుగు సాహిత్యాన్ని మరింత సు సంపన్నం చేసిందనటంలో నిస్సందేహం.

కాకాని చక్రపాణి హైదరాబాద్‌లోని ఆంధ్ర సారస్వత పరిషత్తు ప్రాచ్య కళాశాలలో ఆంగ్లోపన్యాసకులుగా ముప్పయి సంవత్సరాల కు పైగా పనిచేసి విశ్రాంత జీవితం గడుపుతున్నాడు.ఆయన రాజశేఖర చరిత్ర, మైదానం, చివరకు మిగిలేది, అల్ప జీవి నాలుగు తెలుగు ప్రముఖ నవలలను ఆంగ్లంలోకి అనువదిం చగా, వాటిని కుప్పంలోని ద్రావిడ విశ్వవిద్యాలయం ‘ఫోర్‌ క్లాసిక్స్‌ ఆఫ్‌ తెలుగు ఫిక్షన్‌’ అన్న పేరుతో పుస్తకరూపంలోకి తీసుకు వచ్చిం ది. వీరు రాసిన పెక్కు కథలకు వివిధ పత్రికల నుండి బహుమతులు రావటమే గాకుండా, వీరి ‘సాహిత్య ప్రభావం’ గ్రంథం విమర్శా ప్రక్రి యకు 2009లో తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారాన్ని పొం దింది. మనిషి మృదుభాషి. తను విభేదించే విషయంలో సైతం ఎదు టివారిని నొప్పించని తత్వం.

ఆయన 60 దాకా తెలుగులో కథలు, పదకొండు నవలలు వ్రాశా రు. దాదాపు పది సంవత్సరాలు ఆంధ్రభూమి దినపత్రికలో వారం వారం ‘కధలు కాకరకాయలు’ అనే శీర్షికతో పెక్కు రాజకీయ సామా జిక విషయాలపై సున్నితమైన హాస్యంతో వ్యంగ్య బాణాలు విసిరారు.1989లో కేంద్ర సాహిత్య అకాడమి నిర్వహించిన పదిరోజుల గోష్టి కార్యక్రమంలో ఆహ్వానితుడుగా పాల్గొన్నారు. ఆయన ప్రచు రించిన ‘భారతీయ సాహిత్యం సమ కాలీని కథలు’ పుస్తకంలో వివిధ భాషలనుండి అనువదించిన కథలు ప్రచురితమయ్యాయి.

డాక్టర్‌ దుర్గంపూడి చంద్రశేఖర రెడ్డి, డాక్టర్‌ గోవిందరాజు చక్ర ధర్‌, జి.వెంకటరాజం వంటివారితో కలిసి చాలా పుస్తకాలను ఆంగ్ల నుండి తెలు గులోకి అనువదించి పుస్తక రూపం లో ప్రచురించారు. అందులో ముఖ్య మయినవి స్వామి రంగనాధానంద ఆధ్యాత్మిక వ్యాసాలను ‘పరిపూర్ణ సా ఫల్యానికి ప్రజాస్వామ్యం’. మామ్‌ వ్రాసిన ‘క్రిస్ట మస్‌ హాలీడే’ ను ‘యవ్వనపు దారిలో’గా, సరోజినీ రేగాని ‘నిజాం బ్రిటిష్‌ రిలేషన్స్‌’ను ‘నిజాం బ్రటిష్‌ సంబంధాలు’గా, పి.వి.పరబ్రహ్మం ‘కాకతీయ ఆఫ్‌ వరంగల్‌’ను ‘కాకతీ యులు’గా, కీ.శ 624 నుండి 1000 వరకు తొలి మధ్య యుగ ఆంధ్రప్రదేశ్‌ సమగ్ర చరిత్ర సమీకృతిగాను, రాబర్ట్‌ స్యూయల్‌ ‘ఫర ్‌గాటెన్‌ ఎంపైర్‌ (విజయనగర)’ ను ‘విస్మృత సామ్రాజ్యం విజయ నగరం’ అన్న పేరుతోనూ అనువదించారు.

ఇవిగాక హిందీనుంచి ‘అభయ మౌర్యా యుగనాయక’ను, ఇతర భాషలనుంచి మరో ఇరవై ఆయి దు కథలను ఆంగ్లంలోకి అనువదించారు.ఆయనకు మామ్‌ కథలంటే చాలా ఇష్టం. మామ్‌ ‘మనిషి తను సుఖంగా బతకాలంటే ప్రథమంగా అవసరమైనది మానవుల అని వార్య స్వార్థపరత్వాన్ని గుర్తించటం.ఇతరులు నీ కోర్కె తీర్చటం కో సం తమ కోర్కెలు త్యాగం చేయాలనటం మహా అసంగత మైన పని.నువ్వు ఇతరులను స్వార్థరహితంగా వుండమని అడు గుతు న్నావు.

వాళ్ళలా ఎందుకుండాలి? ప్రతి వ్యక్తీ తన కొరకే అనే నిజం తో నువ్వు రాజీ పడనప్పుడు, నీ చుట్టూ వున్న వాళ్ళ నుంచి నువ్వడి గేది అతిస్వల్పం. వాళ్ళు నిన్ను నిరాశ పర్చరు. వాళ్ళను మరింత స ద్భావంతో పరికిస్తావు.’ అంటాడు.చక్రపాణి కూడా ఆ భావ నలను నమ్ముతాడనే విషయం ఆయన రచనలే చెబుతాయి.ఆయన రచనలో నిత్యయవ్వనుడు. ఆ యవ్వనాన్ని అలాగే నిలు పుకుంటూ ఇంకా ఇంకా నవలలు, కథలూ వ్రాయాలని, తెలు గు సాహితీ సంపదను ఇతర భాషీయులకు అంది వచ్చేలా తీసుకు రావాలని కోరుకుందాం.

 

Surya Telugu Daily

డిసెంబర్ 22, 2010 Posted by | సంస్కృతి | 1 వ్యాఖ్య

కలంకారీ కళాకృతులు

కలంకారీ కళాకృతులు

 

సుమారు 500 కుటుంబాల కళాకారులు ఈ కలంకారీ కళపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఈ 21వ శతాబ్దం వచ్చేసరికి చాలామంది కళాకారులు వ్యవసాయంవైపు, ఇతర పనులవైపు మళ్లడంతో ఈ కలంకారీ కళ దాదాపు అంతరించే స్థారుుకి చేరుకుంది. 1950లో కమలాదేవి చటోపాధ్యాయ అనే ఉద్యమ కళాకారిణి కృషితో ప్రభుత్వం ఈ కళ యొక్క ప్రాముఖ్యాన్ని గుర్తించి శ్రద్ధ తీసుకోవడంతో మళ్లీ ఈ కలంకారీ కళ గుర్తింపు పొందింది.

kalankariకలంకారీ� కళ అంటే వెదురుతో చేసిన కలంతో సహజమైన రంగులను ఉపయోగించి వస్త్రాలపై చిత్రించే ఒక కళ. ఇది చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో పుట్టి తరువాత రాష్ట్రానికి వ్యాపించింది. ఒకప్పుడు పురాతన హరప్పా నాగరికతకు సంబంధించిన తవ్వకాలలో లభించిన ఒక వెండి పాత్రపై చిత్రాలున్న ఒక వస్త్రం లభించింది. దీని ఆధారంగా ఈ కలంకారీ కళ చాలా పురాతనమైందని తెలుస్తోంది. �కారీ� అనగా హిందీ లేదా ఉర్దూలో �పని� అని అర్ధం. 10వ శతాబ్దంలో పర్షియన్‌, భారతీయ వర్తకుల సంబంధాలలో ఈ పదం వచ్చి ఉంటుందని చరిత్రకారుల అభిప్రాయం. ఆనాడు పోర్చుగీసు, డచ్చి, బ్రిటీష్‌ వారితో వివిధ వాణిజ్య వ్యాపారాలలో ఈ కలంకారీ డిజైన్లతో తయారు చేసిన వస్త్రాలకు చాలా గిరాకీ ఉండేదట. ఇంకా మన రాష్ట్రంలో కృష్ణాజిల్లా పెడనలో ఈ కలంకారీ కళ చాలా ప్రసిద్ధి పొందింది. అయితే పెడనలో ఈ కళను బ్లాక్‌ ప్రింటింగ్‌ అంటారు. ప్రస్తుతం మనం చూసే పెడన వస్త్రాలు అన్నీ ఈ కలంకారీ కళాత్మక ప్రింటింగ్‌ వస్త్రాలే. కొన్ని వస్త్రాలమీద దేవతా బొమ్మతో వస్తాయి. అవి మాత్రం శ్రీకాళహస్తి కళాకారులు చిత్రించినవే.

ఈ కలంకారీ కళ పురాతనమైనా 13వ శతాబ్దంలో శ్రీకాళహస్తిలో ఈ కళతో చిత్రించిన వస్త్రాలు కోరమాండల్‌ తీరం వెంబడి వస్త్ర వ్యాపారం బాగా జరిగేది. అందువలనే ఈ కలంకారీ కళ దక్కను పీఠభూమి అంతా వ్యాపించింది. ఎల్లప్పుడూ ఈ పట్టణాన్ని ఆనుకుని ప్రవహించే సువర్ణముఖీ నదిలో ఈ కళకు కావలసినంత స్వచ్ఛమైన నీరు లభించడం కూడా ఇక్కడ కలంకారీ కళ వృద్ధి పొందడానికి ఒక కారణమంటారు. ఈ కళ ఎక్కువగా హిందూ సంప్రదాయాన్నే ప్రతిబింబిస్తుంది. ఇక్కడి కళాకారులు ఇప్పటికీ ఇక్కడ రామాయణ, భారత, భాగవత కథలనే వస్త్రాలమీద చిత్రిస్తున్నారు.

arts ఇక పెడనలో.. సముద్రతీరం వెంబడి ఉన్న ముఖ్యమైన రేవు పట్నం �బందరు� (మచిలీపట్నం).ఈ రేవుకు అప్పట్లో సరైన సౌకర్యాలు లేకపోవడంతో గోల్కొండ ప్రభువులతో సంబంధాలు నెరుపుకున్నారు. దీంతో �బందరు� పెద్ద ఓడరేవుగా ప్రసిద్ధి చెందింది. గోల్కొండ ప్రభువులైన �కుతుబ్‌షాహీలు� ఈ కలంకారీ కళ ఉత్పత్తులను ఎక్కువగా ఇష్టపడే పర్షియన్‌ వర్తకులతో వ్యాపార సంబంధాలను నెరిపేవారట. ఈజిప్ట్‌లోని కైరో వద్దున్న �పోస్టాట్‌� అనే ప్రదేశంలో పురాతత్వ తవ్వకాలు జరిపే వరకూ భారతదేశంలో ఇలా వస్త్రాలపై అద్భుతమైన కళా ఖండాలను సృష్టిస్తున్నారనే విషయం ఎవరికీ తెలియదు. ఈ తవ్వకాలలో వివిధ అద్భుతమైన చిత్రాలతో కూడిన భారతదేశ నూలు వస్త్రాలు కన్పించాయి. ఈ వస్త్రాలు 18వ శతాబ్దంలో పశ్ఛిమ తీరం ద్వారా ఆయా దేశాలకు ఎగుమతి అయి ఉండవచ్చని చరిత్రకారుల అభిప్రాయం.తరువాత అధ్యయనంలో తేలిందేమంటే ఆనాడు సుగంధద్రవ్యాలు అమ్మే వ్యాపారస్తులు తమ వ్యాపారం కోసం వస్తుమార్పిడి పద్ధతి ద్వారా ఈ భారతీయ కలంకారీ వస్త్రాలను తీసుకెళ్ళేవారు.

ఈ కలంకారీ కళలో వాడే ఒక ముఖ్యమైన విషయం ఏమంటే ఈ వస్త్రాలకు వాడే రంగులు. ఈ రంగులన్నీ సహజసిద్ధమైన రంగులు. వివిధ కూరగాయల నుండి తీసి వాడే ఈ వస్త్రాలు ధరిస్తే శరీరానికి ఏవిధమైన హాని చేయవు. నిజాం ప్రభువుల కాలంలో విదేశీయులు కలంకారీ వస్త్రాలపై ఉన్న కలంకారీ కళకు ఆకర్షితులై ఆ వస్త్రాలకు సరితూగే ఎత్తున బంగారాన్ని ఇచ్చి కలంకారీ వస్త్రాలను కినుగోలు చేసుకుని వెళ్లేవారట.

కలంకారీ ఉత్పత్తులు మార్కెట్‌ అవసరాన్ని బట్టి వివిధ రూపాల్లో తయారౌతుంటాయి. ప్రార్ధన వస్త్రాలు, దుప్పట్లు, దిండు గలీబులు, వాకిలికి వాడే కర్టెన్లు, వివిధ పుష్పాలతో, లతలతో అందంగా తయారు చేసిన వస్త్రాలు మధ్య ఆసియా మార్కెట్‌కోసం చేసేవారట. అలాగే కుట్టుపనితనంలా ఉండే డిజైన్లు, చెట్లు వంటివి ఐరోపా మార్కెట్‌ కోసం చేసేవారట. గోడకు వేలాడదీసే చిత్రపటాలలో ఉంచే వస్త్రాలను ఆగ్నేయ ఆసియాకోసం, ధరించే వస్త్రాలకు, దుప్పట్లు తదితర అవసరమైయ్యే డిజైన్లు తూర్పు ఆసియాకు ఎగుమతి చేసేవారట.

arts119వ శతాబ్దపు కళాకారుల్లో ఎక్కువగా �బలిజ� కులస్తులే ఉండేవారు. వీరు సంప్రదాయక వ్యవసాయం, కటీర పరిశ్రమలపై ఆధారపడి జీవించేవారు. ప్రస్తుతం శ్రీకాళహస్తి ఊరు చుట్టుపక్కల సుమారు 500 కుటుంబాల కళాకారులు ఈ కలంకారీ కళపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఈ 20వ శతాబ్దం వచ్చేసరికి చాలామంది కళాకారులు వ్యవసాయంవైపు, ఇతర పనులవైపు మళ్లడంతో ఈ కలంకారీ కళ దాదాపు అంతరించే స్థాయికి చేరుకుంది. 1950లో కమలాదేవి చటోపాధ్యాయఅనే కళా ఉద్యమ కళాకారిణి కృషితో ప్రభుత్వం ఈ కళ యొక్క ప్రాముఖ్యాన్ని గుర్తించి శ్రద్ధచతీసుకోవడంతో మళ్లీ ఈ కలంకారీ కళ పునర్జీవం పొందింది.

చిత్రించే విధానం : చాలా ఓర్పతో చేసే కలంకారీ అద్దకపు పరిశ్రమలో కళాకారులు ఉత్సాహం, అభిలాష, అర్పితభావం కన్పిస్తుంది. మొదటిగా తను వేయాలనుకున్న చిత్రాన్ని కళాకారుడు ఒక దళసరిగా ఉన్న చేనేత బట్టను క్వాన్వాసుగా తయారు చేసుకుంటాడు. ఆ నేత బట్టను ప్రవహించే నీటిలో బాగా ఝాడించి బట్టకు ఉన్న గంజిని, ఇంకా పిండిని పోయేదాకా నీటిలో ఉతుకుతాడు. ఈ నేత బట్టను శుభ్రపరచడానికి ఎలాంటి సబ్బును వాడరు.విధంగా శుభ్రం చేసిన బట్టను గేదెపాలు, కరక్కాయ రసం కలిపిన మిశ్రమంలో ముంచి ఎండలో ఆరబెడతారు. ఇలా ఎండబెట్టిన బట్ట ఇపుడు కలంకారీ అద్దకానికి సిద్ధమౌతుంది. ఎండిన ఈ బట్టమీద చింత కర్రను కాల్చిన బొగ్గుతో ఈ బట్టమీద భావానుగుణ్యంగా హస్త కళానైపుణ్యంతో చిత్రాలను చిత్రిస్తారు. ఆ తరువాత ఈ చిత్రించిన బట్టను �అన్నభేది� ద్రావణంలో ముంచుతారు. ఇపుడు చిత్రాలు చెరగని నల్లరంగుగా మారతాయి. సుదీర్ఘమైన కలంకారీ కళలో ఇది తొలిమెట్టు.ఈ విధంగా ఉతికి ఉడకబెట్టి చిత్రాలు గీసి పెయింటింగ్‌ను వేసి ఎండబెట్టి కలంకారీ అద్దకపు బట్టను పూర్తి చేస్తారు.ఇక కలంకారీ చిత్రాలను చిత్రకారులు గీస్తుంటు చూడడం గొప్ప ఆనందం కలుగుతుంది. కలాన్ని వేలితో పట్టకొని కావలసిన రంగులో చిన్నగుడ్డను కానీ, దూదిని కానీ ముంచి కలంపై పెట్టి వేలితో దూదిని నొక్కుతూ మొనగుండా ఆ చిత్రానికి రంగులు అద్దుతాడు కలంకారీ చిత్రకారుడు.
ఇక్కడి కలంకారీ కళాకారులలో చెప్పుకోదగ్గ వ్యక్తి జి. కృష్ణారెడ్డి. 1960 సంవత్సరంలో జె.లక్ష్మయ్య అనే వ్యక్తి వద్ద ఈ కలంకారీ వృత్తిలో నైపుణ్యత విషయంలో కృష్ణారెడ్డి శిక్షణ పొందారు. ప్రస్తుతానికి కృష్ణారెడ్డి తనకున్న అపార అనుభవంతో చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో కలంకారీ వర్క్‌షాప్‌ ప్రారంభించారు. కృష్ణారెడ్డి నేతృత్వంలో సుమారు 17 మంది కళాకారులు అతని వద్ద తర్ఫీదు పొంది ఈ వృత్తిలో అంతర్జాతీయ ఖ్యాతినార్జిస్తున్నారు. కృష్ణారెడ్డి సంతానంలో అతని కుమార్తె మంజుల, ఇద్దరు కుమారులు దామోదరం, బాలాజీలు తండ్రికి చేదోడువాదోడుగా ఉంటూ తమవంతు కృషిచేస్తున్నారు. సంప్రదాయంగా వస్తున్న కలంకారీ చిత్రకళను తన కుటుంబ సభ్యులందరితో పంచుకోవడం ఎంతో ఆనందంగా ఉందంటారు కృష్ణారెడ్డి. ఈ కుటుంబం నుంచి వచ్చే కలంకారీ దుప్పట్లు, చీరలు, కర్టెన్లకు మార్కెట్లో మంచి డిమాండే ఉంది.

1996 సంవత్సరంలో కృష్ణారెడ్డి మరికొందరు కళాకారులతో కలిసి 36గీ 16 అడుగుల వస్త్రంపై రామాయణ దృశ్యకావ్యాలను అందమైన కలంకారీ పెయింట్‌ చేయడం విశేషం. ఈ వస్త్రంపై రాముడి బాల్యవిశేషాలతోపాటు లవకుశుల జననం వరకూ కూడా సంపూర్ణరామాయణానికి సంబంధించిన చిత్రాలు పెయింట్‌ చేయడం హైలెట్‌. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రశంస పురస్కారాన్ని కూడా అందుకున్న వ్యక్తి కృష్ణారెడ్డి. తన కళకు కులమతప్రాంతీయ తత్వాలు లేనేలేవంటారు కృష్ణారెడ్డి. అందుకే రామాయణ, భారత, భాగవతాది చిత్రాలతోపాటు జీసస్‌ బొమ్మలను, చర్చికి సంబంధించిన పెయింట్స్‌ కూడా తన కలంకారి చిత్రకళకు ఉపయోగిస్తుంటానని గర్వంగా చెబుతారు కృష్ణారెడ్డి. భారతదేశమన్నా…ఇక్కడి సంప్రదాయాలన్నా తనకు అత్యంత ప్రాణప్రదమంటారు ఆయన. అందుకే కృష్ణారెడ్డిని హిందూ, ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌, వివిధ మీడియా సంస్థలు ఆయనతో గతంలో ఇంటర్వ్యూలు జరిపాయి. భారతదేశానికే వారసత్వంగా భాసిల్లే ఇటువంటి కళలు మరుగునపడిపోకుండా తర్వాతి తరాలు కూడా గుర్తుంచుకునేలా ప్రభుత్వం తగినవిధంగా ప్రోత్సహించాలంటారు కృష్ణారెడ్డి. తనుమాత్రమే కాకుండా తన కుటుంబ సభ్యులు కూడా జీవితాంతం ఈ కలంకారి కళకు అంకితభావంతో పనిచేస్తామని నిగర్వంగా చెబుతున్నారు.
-దామర్ల విజయలక్ష్మి, అనంతపురం

Surya Telugu Daily

డిసెంబర్ 17, 2010 Posted by | సంస్కృతి | | 1 వ్యాఖ్య

ప్రపంచ సాహిత్యం తెలుగులో…

ప్రపంచ సాహిత్యం తెలుగులో…

ఒక జాతి మనుగడకు భాష అవసరం. భాషలేకుండా బతకడం అసంభవం. ఆ భాష సజీవంగా కొనసాగాలన్నా నిరంతరం దాని గురించి అధ్యయనం జరగాలి. అవసరాన్ని విస్తృత పరచాలి.భాష వినియోగం పెరగాలి. ఎవరికైనా విషయం మాతృభాషలోనే సులువుగా అర్థం అవుతుంది.సమగ్రంగా ఆకళింపుచేసుకొని, అవగాహనపరుచుకోవటానికి వీలవుతుంది. తెలుగు భాషను సజీవంగా ఉంచడం కోసం అనాదిగా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. వీటిలో పీకాక్‌ క్లాసిక్స్‌ వారు చేస్తున్నది అద్వితీయమైనది.ప్రపంచ సాహిత్యాన్ని తెలుగు భాషలోకి తీసుకురావాలన్న వారి ధ్యేయం గొప్పది.విశ్వవిద్యాలయాలు చేయాల్సిన పనిని వీరు తమ భుజస్కంధాలపెై మోస్తున్నారు. ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి వంద పుస్తకాలకు పెైగా తీసుకొచ్చారు. తెలుగు భాషా ప్రేమికులంతా ఈ ప్రయత్నంలో భాగస్వామ్యులు కావాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.

Mullaప్రపంచంలోని జ్ఞాన సంపదనంతటినీ తెలుగులోకి తెచ్చుకోవాలన్న తపనే పీకాక్‌ క్లాసిక్స్‌ ఆవిర్భావానికి మూలం. పీపుల్స్‌ ట్రస్ట్‌ ప్రచురణ విభాగమే పీకాక్‌ క్లాసిక్స్‌. ప్రపంచ సాహిత్యంలో ఆణిముత్యాలు కొన్ని ఇంతకు ముందు తెలుగులోకి వచ్చాయి.స్వాతంత్య్రానికి కొంచెం ముందు ప్రారంభమై స్వాతంత్య్రం తర్వాత రెండు మూడు దశాబ్దాల పాటు ఈ క్రమం కొనసాగింది.ఎందుకో అది అక్కడ ఆగిపోయింది. ఆ దశలో నవలాలోకంలో క్లాసిక్స్‌ అనదగినవి అనేకం అనువాదమయ్యాయి. అయితే అప్పుడుగానీ, తర్వాతగానీ శాస్త్ర రంగాల్లోని మౌలిక గ్రంథాలను తెలుగులోకి తెచ్చుకునే ప్రయత్నం ఎన్నడూ సంపూర్ణంగా జరగనేలేదు.అడపదడపా అక్కడో పుస్తకం ఇక్కడో పుస్తకం రాలేదని కాదు. ఆ పని ఒక యజ్ఞంలా మాత్రం సాగలేదు. ఇప్పుడా యజ్ఞాన్ని పీకాక్‌ క్లాసిక్స్‌ చేస్తోంది.

ఇంగ్లీష్‌ వ్యామోహం…
ఇంగ్లీష్‌ భాష బాగా నేర్చుకుంటే తప్ప ఎవరెైనా మేధా సంపన్నులు కాలేని పరిస్థితి మన దేశంలో నెలకొని ఉంది. ఈ వింత పరిస్థితి ఒక జర్మన్‌కు లేదు. ఒక రష్యన్‌కు లేదు. ఒక ఫ్రెంచి వాడికి లేదు. నార్వేని చూడండి. చిన్నదేశం. దాని జనాభా మన హైదరాబాద్‌ జనాభా అంత ఉంటుందేమో. ఒక నార్వేనియన్‌ ఆడమ్‌స్మిత్‌ని చదవా లనుకుంటే ఇంగ్లీషు నేర్చుకొని తీరాలని లేదు. టాల్‌స్టాయ్‌ని చదవడానికి రష్యన్‌ అక్కర్లేదు. ప్లేటోని చదవాలంటే గ్రీకు నేర్చుకోనక్కర్లేదు.

మార్క్‌‌సని చదవా లంటే జర్మన్‌ రానక్కర్లేదు. రామాయణం చదవడానికి సంస్కృతం అవసరం లేదు. తన మాతృభాషలోనే ఈ గ్రంథాల్ని చదువుకోగలడు నార్వేనియన్‌. అరకోటికి మించిన నార్వే ప్రజలు ఇతర భాషల్లో ఉన్న అమూల్య గ్రంథాలన్నింటినీ తమ భాషలోకి తెచ్చుకోవడం అవసరమని భావించారు.అందుకునే ఆ పనిని వారు సాధించుకున్నారు. మరి 8 కోట్ల మంది తెలుగువారికి అటువంటి అవసరం ఉండదా? ఉంటుంది కాబట్టే ఈ అవసరం కోసం నడుంబిగించింది పీకాక్‌ క్లాసిక్స్‌.

ఏయే పుస్తకాలు?
chiti-rajaప్రాచీన నాగరికతలున్న భారత్‌, చెైనా, గ్రీసు, ఈజిప్ట్‌ తదితర దేశాల ప్రాచీన గ్రంథాలు.. యూరపులో పునర్వికాసోద్యమ కాలంలో వచ్చిన మహాగ్రంథాలు… ప్రపం చాన్ని దాదాపు ఒకటిన్నర శతాబ్ధంగా తన ప్రభావంలో ముంచెత్తుతున్న మార్క్సిస్టు మౌలిక గ్రంథాలు..సమకాలీన సామాజిక, ఆర్థిక, తాత్విక, శాస్త్ర రంగాల్లో వెలువడిన ఆణి ముత్యాలు.వీటన్నింటినీ తెలుగులోకి తీసుకువస్తున్నట్టు పీకాక్‌ క్లాసిక్స్‌ ఎడిటర్‌ అన్నపనేని గాంధీ అన్నారు.వీటిని తెలుగులోకి తీసుకురావడంలో ఎన్నో సాధక బాధకాలు న్నాయన్నారు.

ఒక పుస్తకాన్ని ఎంపిక చేయడం మొదలు కొని దానిని పాఠకుని దగ్గరకు చేర్చేవరకూ మధ్యలో ఎన్నో దశలు, ఇబ్బందులు, సమస్యలున్నాయని పేర్కొ న్నారు. అయినా తాము ఎంతో మొండిగా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ ఈ పనిని నిర్విఘ్నంగా చేపడుతున్నామని తెలిపారు. ఇప్పటివరకు ప్రచురించిన పుస్తకాల పూర్తి వివరాలకు ఫోన్‌ నెంబర్లు 040-23890328, 9010204633 సంప్రదించాలని ఆయన కోరారు.

తెలుగులో…
వాల్మీకి, వ్యాసుడు, హోమర్‌, ప్లేటో, అరిస్టాటిల్‌, విష్ణుశర్మ, ఈసపు, స్మితో, రికార్డో, గెలీలియో, ఐన్‌స్టీన్‌, హాకింగ్‌, వాల్టెయిర్‌, రూసో, హాబ్స్‌, లాక్‌, మోర్గాన్‌, డార్విన్‌, మార్క్‌‌స, ఏంజిల్స్‌, కీన్స్‌, టాల్‌స్టాయ్‌, గెథే, ఫ్రాయిడ్‌, వెైల్డ్‌, గుణాఢ్యుడు, కోశాంబి, అమార్త్యసేన్‌, తిక్కన, పోతన…వంటి హేమాహేమీల రచనలన్నింటినీ పీకాక్‌ క్లాసిక్స్‌ తెలుగులో తీసుకువచ్చింది.

Surya Telugu Daily

డిసెంబర్ 15, 2010 Posted by | సంస్కృతి | | 3 వ్యాఖ్యలు

తెలుగమ్మల జోల

తెలుగమ్మల జోల

కమ్మని కవితల హేల

జోలపాటలు, లాలి పాటలు మన సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పడతాయ. ఒక తల్లి తన శిశువుకు జోల పాడుతూ సాటిలేని అందచందాల బంగారపు బొమ్మ. అని భావిస్తూ పాప పుట్టుక బంగరు కొడవళ్ళతో కొయ్యాల్సిన బంగారపు పంటగా అభివర్ణిస్తుంది. ఇంత భావ సౌందర్యము, ధ్వని గాంభీర్యము ఉన్నాయి. ఈ రెండు పంక్తుల జోల చరణంలో…
‘ఊళ్ళోకి ఉయ్యాల లమ్మవచ్చినవి
కొడుకు, కూతుళ్ళ తల్లి! కొనవె ఉయ్యాల’
ఇద్దరు అప్పజెల్లెళ్ళు మాట్లాడుకుంటున్నట్టుగా ఈ జోల చరణం. ‘మన ఊళ్ళో ఉయ్యాల మంచాలు అమ్మేవాడు వచ్చాడు. నీకు కొడుకులు, కూతుళ్ళు ఉన్నారు. ఒక ఉయ్యాల కొనుక్కోరాదుటే?’ అన్నది ఒక చెల్లెలు తన అక్కతో. ‘కొనుక్కోవాలనే ఉన్నది ఒక వెండి ఉయ్యాల. కానీ ఏమిచ్చి కొనమంటావు?’ అని అడిగింది అక్క. ‘వెండిదే మిటే? ఏకంగా బంగారందే కొనవే. మనకు మంచి పాడి సంపద ఉన్నది. పాలుపోసి కొను’ అన్నది. ఈ పాట పుట్టిన కొన్ని శతాబ్దాల కిందట వస్తు మారకపు పద్ధతి ఉండేది.
మరో తల్లి ఏడవకు ఏడవకు ఇటుల నా తండ్రి!
ఏడిస్తె నీ కళ్ళు నీలాలు కారు
నీలాలు కారితే నే జూడలేను
పాలైన కార్చరా బంగారు కనుల అని
తల్లడిల్లి పోతోంది తల్లి. ‘ఏడవకురా నాన్నా! నీవు ఏడుస్తుంటే నీ కళ్ళంబడి నల్లనల్లగా కన్నీళ్ళు వస్తున్నాయి’. నీలము అంటే నలుపు. అంతేకాదు. విషము అనే అర్థం గూడా వుంది. ‘నీవు కార్చే కన్నీరు నాకు విషపుధార చూసినంత భయం పుట్టిస్తోంది. పసిపిల్లలకు కాటుక పెడతారు. అందుచేత కన్నీరు నల్లగా కారటం కూడా సహజమే.
‘ఆ నల్లని కన్నీరు చూచి భరించలేను గనుక నీ బంగారు కనులలోంచి పాలను స్రవించరా నాన్నా’ అంటున్నది ఆ అమ్మ.
‘చిట్టి ముత్యం పుట్టె సీత గర్భాన
స్వాతి వానలు గురిసె సంద్రాల మీద’ – ఒక నిర్మాలాంతఃకరణపు ఇల్లాలి భావన ఇది. బంగారుతల్లి అయిన సీతాదేవి కడుపున ఒక బాబు పుట్టాడు. ఆ శుభ సంఘటన ప్రభావంగా మరెన్నో శుభ సంఘటనలు జరిగాయట. సముద్రాలమీద స్వాతిచినుకులు పడ్డాయట. స్వాతి చినుకులు ముత్యపు చిప్పల్లో పడి ముత్యాలవుతాయి. అంటే సీత కడుపు పండటం చూసిన ప్రకృతిమాత పులకించి పరమానంద భరితురాలై మరెన్నో ముత్యాలను ప్రసవించింది అని ఒక మధురాతి మధుర మహోదాత్త ఊహ. ఒక దీపం వెలిగితే దానితో చాలా దీపాలు వెలుగుతాయి. అనే ఒక సార్వకాలిక సమాహ్లాద సంభరిత వాస్తవికతకు ఇదొక ప్రతిబింబ.
‘హాయి – ఓయు ఆపదల గాయి’ అని చాలా జోలపాటలకు ఆరంభ చరణంగా వుంటుంది. ఈ హాయి, ఓయి అనే వాటికి స్ర్తి రూపభావ వ్యక్తిత్వాలను ప్రతిక్షేపించుకుంటే – లేక ఆపాదిస్తే (పర్సానిఫికేషన్) ‘హాయమ్మ’, ‘ఓయమ్మ’ అవుతారు. చాలా ఇళ్లల్లోని తోడికోడళ్ళలాగా ఉప్పు – నిప్పుగా ఉంటాయి. ఇలా ఇందులోని మొదటి పంక్తి ఆహ్లాద జనకమయితే రెండో పంక్తి హాస్యభావ సంభరితం. ప్రతి స్ర్తికి తన పుట్టింటి వారి ప్రేమాను బంధాల మీద, ముచ్చట్ల మీద అంతనమ్మకం. అందుకే అంటుంది ‘మీ మేనమామలైతే మరిమరీ నిన్ను ముద్దాడతారు’ అని. తన పిల్లడు అంటే తల్లికి ఎంత అబ్బడమో, ఎంత ముచ్చటో తెలుసుకోవాలంటే ఈ పంక్తులు దర్పణాలుగా నిలుస్తాయి.
‘మీసాల మీదిదే రోసాల ఎఱుక
అబ్బాయి చేతిదే బంగారు గిలక’ – అని జోలపాటలో ఒక చరణం. ఈ చేష్టలు వారి పూర్వీకుల రాజసానికి సంకేతాలు. దాన్ని ఆమె గడుసుగా.
మరో ఇల్లాలు ఓయి ఓ ఇల్లాల! ఓ బాలులార!
మా బాలుడొచ్చాడ మీ తోటి యాడ?
మీ బాలుడెవ్వరో మేమెరుగ మమ్మ!
కాళ్ళగజ్జెల తండ్రి బంగారు బొమ్మ – ఇదొక సంభాషణాత్మకమైన జోలపాట చరణం. తన బాబు ఇంట్లో కనిపించటం లేదు. బుడిబుడి నడకలతో, ఇరుగుపొరుగు ఇళ్ళకు వెళ్ళాడేమో! ఇరుగింటి ఇల్లాలిని, పొరుగింటి పోరగాళ్ళను అడుగుతోంది. మీ పిల్లడెవరో మాకు తెలియదన్నారు వాళ్ళు. అప్పుడు చెప్తున్నది వాళ్ళకు ఆనవాళ్ళు. తన బాబు కాళ్ళకు గజ్జెలున్నాయట. అదొక గొప్ప. అంతేకాదు. అతగాడు బంగారు బొమ్మట. అంటే మీ కందరికన్న బాగుంటాడు అని ఘనంగా చెప్తోంది – ఇదే ఇందులోని నిసర్గమైన, అందమైన బడాయి.
‘చిన్నారి పొన్నారి చిట్టిదాసారి
దాసారి నీ మగడు దేశ దిమ్మరి’
ఇది ఒక తమాషా అయిన ఒరవడి
చాలామంది తల్లులు. తల్లి తానేమో ఒక ఇంటిపేరు వారి బిడ్డ. తన బిడ్డలేమో మరో ఇంటిపేరు వారి బిడ్డలు. ఆ ఇంటిపేరు వారు, తన ఇంటి పేరు వారు తన పెళ్ళి కారణాన పరస్పరం వియ్యాల వారైనారు. అంటే తన మామగారి ఇంటిపేరు వారందరూ తనకు బావలు, వదినలు, మరుదులు, మరదళ్ళు అవుతారు. అందుకని తన బిడ్డలను ఆటపట్టిస్తూ ఎగతాళిగా, హేళనగా మాట్లాడటం ఒక ముచ్చట. ఇది పల్లెసీమలలో ఇప్పటికీ కనిపిస్తుంటుంది. మరో తల్లి తన పిల్లాడిని ‘చిట్టీత పండెరుపు చిలుక ముక్కెరుపు తానెరుపు అబ్బాయి తనవారిలోన’ అని అంటుంది. తన కుటుంబంలో తనబాబే ఎర్రగా, బుర్రగా వుంటాడుట. ఇది దృష్టాంతాలంకారానికి ఒక మంచి దృష్టాంతం.
‘చిన్నారివే నీవు చిలకవే నీవు
చిగురు మామిళ్ళలో చిన్న కోయిలవు’ – ఇది ఇంకొక కమనీయ కవితా పంక్తి. తన పాప ఆకారంలో అందాల చిలుక. మరి కంఠం విషయంలో మామిళ్ళ చిగుళ్ళతో పసదేరిన పంచమస్వర కోకిల అంటూ తన పాపను ఆకాశానికెత్తుతోంది ఒక తల్లి ఊహల ఊయెల ఊపుల హాయితో.
ప్రత్యక్ష పద అర్థం కన్న పరోక్ష భావార్థం హృదయంగమంగా కనిపించేదానే్న ‘్ధ్వని’ అంటారు. ఈ ధ్వని అనేదే అసలు కావ్యాత్మ అంటాడు ఆనంద వర్ధనుడు తన ‘్ధ్వన్యాలోకం’ కావ్యశిల్ప శాస్త్ర గ్రంథంలో ధ్వని సిద్ధాంతానికి సలక్షణమైన, విలక్షణమైన లక్ష్యప్రాయాలుగా శాశ్వతంగా నిలిచేవి మన జోలపాటలు.
– శ్రీపతి పండితారాధ్యుల పార్వతీశం

Andhra Bhoomi.

డిసెంబర్ 12, 2010 Posted by | సంస్కృతి | 1 వ్యాఖ్య

జానపద నజరాన చెక్కభజన

జానపద నజరాన చెక్కభజన
సంప్రదాయ ఉత్సవాలు, కార్యక్రమాలలో దేవుని ఊరేగింపు జరిపేటప్పుడు చెక్కభజన బృందం చేసే భజనలు ఆ కార్యక్రమాన్ని రక్తికట్టిస్తారుు. చెక్కభజనను ప్రాచుర్యంలోనికి తెచ్చిన వారు కంచెర్ల గోపన్న. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి ప్రాంతానికి చెందిన రామదాసుగా ప్రసిద్దుడైన గోపన్న కీర్తనలు భజన సంప్రదాయానికి చెందినవి. భజనల్లో పండరి భజన, చెక్కభజన, కులుకు భజన వంటివి అనేకం. వీటిలో చెక్కభజన ప్రఖ్యాతిగాంచింది. ఇందులో నృత్యంకూడ ఉండడంచేత ఇది మరింత కళాత్మకతను కలిగి ఉంది.

janapadaluప్రకృతిలోని వస్తువులను వాడుకుని వాటి ద్వారా సంగీతాన్ని సృష్టించుకుని దానికి అనుగుణంగా అడుగులు వేస్తూ తానే కాకుండా తన చుట్టూ ఉన్నవారిని కూడా ఉల్లాసవంతమైన ప్రపంచంలోనికి తీసుకుపోగలగే లక్షణం ఒక్క జానపదుడికే సొంతం. ఈ లక్షణం చెక్కభజనలో కనిపిస్తుంది. కర్రముక్కలకు తాళాలు జోడించి వాటితో లయను సృష్టించడం, సామూహికంగా అడుగులు వేయడం చెక్కభజనలో కనిపించే దృశ్యం. చెక్కభజన సామూహిక నృత్యరూపం.

పండుగ, పర్వదినాల్లో, జాతరలు, ఉత్సవాలలో , సాయంకాలం ఊళ్ళో గుడిముంగిట, ఎప్పుడు పడితే అప్పుడు , ఎక్కడపడితే అక్కడ జానపదులు చెక్క భజన ప్రదర్శిస్తుంటారు. భారత రామాయణాది కథలను పాటలుగా మలచుకుని స్థానిక కళాకారులు నృత్యాలు చేస్తారు. గురువు మధ్యలో ఉంటాడు. అతను జట్టును నడిపిస్తుంటాడు. అతని ఆదేసానుసారంగా జట్టు అడుగులు వేస్తుంది. చెక్కభజనతో చేసే నృత్యంలో అడుగులు వేస్తారు. ఈ అడుగులు చాలా ఉన్నాయి. అది అడుగు, రెండు, మూడు, పర్ణశాల, కుప్ప కొట్టడం, కులుకు వంటివి అనేకం ఇందులో ఉంటాయి. మొత్తం గుంపు ఒకే రకంగా అడుగులు వెయడం, చెక్కలు కొట్టడం మధ్యలో గురువు అరుపులు, కేకలు, ఈ ప్రదర్శనను కనులపండువగా చేస్తాయి. గురువు ఒక పాటలోని చరణం పాడితే దానిని జట్టులోని వారందరూ తిరిగి పాడతారు. ఈ పునరుక్తి వలన పాటకు అందం వస్తుంది.

భక్త రామదాసు విరచితం: చెక్కభజనను ప్రాచుర్యంలోనికి తెచ్చిన వారు ఖమ్మం జిల్లా నేలకొండపల్లికి చెందిన కంచెర్ల గోపన్న. భక్త రామదాసుగా ఆయన జగద్విఖ్యాతులు. రామదాసుగా ప్రసిద్దుడైన గోపన్న కీర్తనలు భజన సంప్రదాయానికి చెందినవి. ఇప్పటికీ ఆంధ్రాప్రాంతంలో శ్రీరామనవమి ఉత్సవాలలో వేసిన పందిళ్లలో కొన్ని భజన బృందాలు శ్రీరామనామగానంతో, తమ చెక్కభజనలతో జనాన్ని ఉర్రూతలూగిస్తుంటారు. భజనల్లో పండరి భజన, చెక్కభజన, కులుకు భజన వంటివి అనేకం. వీటిలో చెక్కభజనలో నృత్యంకూడ ఉండడంచేత ఇది మరింత కళాత్మకతను కలిగి ఉంది.

భక్తి ఉద్యమంలో ప్రధానపాత్ర:మధ్యయుగాల్లో భారత దేశంలో వచ్చిన భక్తి ఉద్యమ ప్రభావం చెక్క భజనలో చూడవచ్చు. వేదాంతాన్ని సామాన్యులకు అందించాలన్న ఉద్దేశ్యం భక్తి ఉద్యమంలో కనిపిస్తుంది. చెక్కభజనలో కూడ వేదాంత పరమైన భారత, రామాయణ, భాగవతాది కథలను పాటల రూపంలో పామరులకు కూడ అర్థమయ్యే భాషలో చెప్పడం జరుగుతుంది. అందువల్లనే చెక్కభజన సర్వ జనాదరణీయమైంది. రాముడి గుడిలేని ఊరు లేనట్లే, అంధ్ర దేశంలో చెక్కభజన గుంపు లేని ఊరు లేదు. ప్రతి గ్రామంలోను చెక్కభజన గురువు ఉండేవాడు…అలానే చెక్కభజన గుంపు కూడా ఉండేది.

janapadalu1చెక్కభజనకు చిరునామా:చెక్కభజనకు కడప జిల్లా పెట్టింది పేరు. ఇక్కడ ప్రతి గ్రామంలోను చెక్కల శబ్ధాలు, గురువుల కేకలు, జట్టులోని కళాకారుల అడుగుల నాదాలు వినిపిస్తూనే ఉంటాయి. ఇక్కడి నుండి చాలమంది కళాకారులు భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో కళా ప్రదర్శనలు ఇచ్చారు. కడప జిల్లలోని గొరిగనూరు వాసి పుల్లయ్య, చెన్నూరు వాసి ఈశ్వరరెడ్డి చెక్కభజనలో ప్రయోగాలు చేస్తున్నారు.

చెక్కభజన కూడ జానపదత్వం కోల్పోయింది. ఆధునిక ప్రసార మాధ్యమాలు టీ.వి , సినిమాలు చెక్కభజనను దెబ్బ తీస్తున్నాయి. వీటిని తట్టుకొని నిలబడడానికి ఈ కళాకారులు కూడా చెక్కభజనలో ప్రయోగాలూ చేస్తున్నారు.

నిజానికి చెక్కభజనలో కేవలం తప్పెట మాత్రమే ఉపయోగిస్తారు. అప్పుడే చెక్కభజనకు అందం వస్తుంది.మన జానపద కళారూపాలు మన సంస్కృతికి నిలువెత్తు దర్పణాలు. వాటిని కాపాడుకోకపోతే మనం సంస్కతి విధ్వంసకులమవుతాము.

భాషాభివృద్ధికి తోడ్పాటు: ఒకప్పుడు ఉత్తరాదికి పరిమితమైన దేవనాగరిలిపి దక్షిణాదికి కూడా వ్యాప్తిచెందడానికి ఈ చెక్కభజనలే కారణమంటే ఆశ్చర్యం కలగక మానదు. తుకారం, కబీర్‌, పురందరదాస్‌, మీరాభాయ్‌ వంటి ఉత్తరాది కళాకారులు తమ గీతామృతాల ద్వారా వాటి భజనల ద్వారా దక్షిణాదికి కూడా తమ భాషను వ్యాప్తినొందించారు. వారి భక్తబృందాలు ఆ రకంగా దక్షిణాదిన కూడా కొద్దోగొప్పో హిందీ భాషాభివృద్ధికి ఈ చెక్కభజనలు తోడ్పడ్డాయి.
-నండూరి రవిశంకర్‌

Surya Telugu Daily

డిసెంబర్ 10, 2010 Posted by | సంస్కృతి | 2 వ్యాఖ్యలు

హంపీ నుంచి హరప్పా దాకా బహుముఖ ప్రజ్ఞాశాలి తిరుమల రామచంద్ర

హంపీ నుంచి హరప్పా దాకా బహుముఖ ప్రజ్ఞాశాలి తిరుమల రామచంద్ర

Dr-Thirmala-ramachandraతిరుమల రామచంద్ర తన 84 ఏళ్ళ జీవి తంలో అర్ధ శతాబ్ది- పత్రికా రచనకే అంకి తమైనారు. ప్రసిద్ధ కవిపండితులు, కళా కారులు, భాషావేత్తలు, తత్త్వ చింతకులు అయిన ప్రతిభాశాలురతో వందమందిని పైగానే ఆయన ఇంట ర్వ్యూ చేసి ఉంటారు. సుమారు 50 పుస్తకాల దాకా ఆయనవి అచె్చైనాయి.ఆయన చూసినంత దేశమూ, ఆయనకు లభించినన్ని జీవితానుభవాలు, దేశమం తటా ఆయనకు లభించిన విశిష్ట వ్యక్తుల పరిచయా లూ మరెవరి విషయంలోనూ ప్రస్తావించలేము. ఆయన స్వీయ చరిత్ర ఒక గొప్ప నవలకన్నా ఆసక్తికరంగా చదివిస్తుంది. ఉత్కంఠ భరితంగా సాగుతుంది. వారికి తెలిసినన్ని భాషలు కూడా సమకాలీనులైన సాహితీ వేత్తలకు తెలియవనే చెప్పాలి…చదవండి

 

 

 

 

నవంబర్ 18, 2010 Posted by | సంస్కృతి | వ్యాఖ్యానించండి

దీపావళి శుభాకాంక్షలు

దీపావళి శుభాకాంక్షలు
ఈ దీపావళి మీ జీవితంలో మరిన్ని వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తూ…
సనారాజు

నవంబర్ 5, 2010 Posted by | సంస్కృతి | , | 8 వ్యాఖ్యలు

రంజాన్ శుభాకాంక్షలు -మక్కా ను దర్శించండి

రంజాన్ శుభాకాంక్షలు
-మక్కా ను దర్శించండి

సెప్టెంబర్ 9, 2010 Posted by | సంస్కృతి | , | 2 వ్యాఖ్యలు

రక్షాబంధన శుభాకాంక్షలు

సహోదరుల ఆత్మీయ పండుగ
రక్షాబంధన శుభాకాంక్షలు

ఆగస్ట్ 23, 2010 Posted by | సంస్కృతి | , | 1 వ్యాఖ్య

భారత మాతకు జేజేలు

భారత మాతకు జేజేలు
64 వ స్వాతంత్ర్య దిన శుభాకాంక్షలతో

సకల జనావళికి శుభం కలగాలని ఆశిస్తూ... జయ జయ జయహే ...జైహింద్

ఆగస్ట్ 14, 2010 Posted by | సంస్కృతి | , , | 3 వ్యాఖ్యలు

డప్పు-ఆంధ్రా వాయిద్యం

డప్పు-ఆంధ్రా వాయిద్యం

ఆగస్ట్ 4, 2010 Posted by | సంస్కృతి | 2 వ్యాఖ్యలు

బోనాల పండగ

బోనాల పండగ
అందరికి శుభాకాంక్షలు

ఆగస్ట్ 2, 2010 Posted by | సంస్కృతి | , , | 3 వ్యాఖ్యలు

కేరళా సంప్రదాయ నృత్యం-కథాకళి

కేరళా సంప్రదాయ నృత్యం-కథాకళి

ఆగస్ట్ 1, 2010 Posted by | సంస్కృతి | , , | వ్యాఖ్యానించండి

భారత స్వాతంత్ర సంగ్రామ చరిత్ర -వీడియో

భారత స్వాతంత్ర సంగ్రామ చరిత్ర -వీడియో

జూలై 27, 2010 Posted by | సంస్కృతి | , | 1 వ్యాఖ్య

జనగణమన -ప్రముఖ వాయిద్యకారులచే వీడియో

జనగణమన -ప్రముఖ వాయిద్యకారులచే వీడియో

జూలై 24, 2010 Posted by | సంస్కృతి | , , | వ్యాఖ్యానించండి

చెరుకుమిల్లివాసుల ఔదార్యం

చెరుకుమిల్లివాసుల ఔదార్యం
అన్ని పల్లెలూ ఇలా వుంటే ….

జూలై 7, 2010 Posted by | సంస్కృతి | | 1 వ్యాఖ్య

బాతిక్ వర్ణచిత్రాలు

బాతిక్ వర్ణచిత్రాలు

జూన్ 21, 2010 Posted by | సంస్కృతి | , | 7 వ్యాఖ్యలు

ikebana -పూల అలంకరణ

ikebana -పూల అలంకరణ

జూన్ 19, 2010 Posted by | సంస్కృతి | , | 2 వ్యాఖ్యలు

ఇత్తడి ప్రతిమలు

ఇత్తడి ప్రతిమలు

జూన్ 19, 2010 Posted by | సంస్కృతి | | 2 వ్యాఖ్యలు

జానపద గీతాలు-ఒద్దొద్దు నాకొద్దే ఈ పెండ్లి సూపుల భాగోతము

జానపద గీతాలు-ఒద్దొద్దు నాకొద్దే ఈ పెండ్లి సూపుల భాగోతము

జూన్ 15, 2010 Posted by | సంస్కృతి | , , , , | 3 వ్యాఖ్యలు

లంబాడి పాట

లంబాడి పాట

జూన్ 11, 2010 Posted by | సంస్కృతి | , , , , , , | 1 వ్యాఖ్య