హరివిల్లు

ఎన్నెన్నో వర్ణాలు-అన్నింటా అందాలు…

వెబ్‌ ప్రపంచంలో… సంపన్నులు

వెబ్‌ ప్రపంచంలో… సంపన్నులు
వ్యాపారలావాదేవీల్లో ఎంతో తెలివితేటలు ప్రదర్శించి కోట్లకు పడగెత్తినవారు అనేమంది ఉన్నారు. వారసత్వంగా, కుటుంబపరంగా వచ్చిన వ్యాపార, వాణిజ్య సంస్థలను మరింత అభివృద్ధి చేసి కోటీశ్వరులెైనవారూ ఉన్నారు. వ్యాపార రంగం తీరుతెన్నులు అర్థం కాక చేతులెత్తేసిన వాళ్లూ లేకపోలేదు. ఆధునిక కాలంలో పెరుగుతున్న సాంకేతిక అంశాలను దృష్టిలో ఉంచుకుని ఇంటర్‌నెట్‌ రంగంలోకి దిగి ప్రపంచమంతా ఆకట్టుకొనే డాట్‌కామ్‌లు సృష్టించి సంపన్నుల జాబితాలో చేరిన కొందరు ప్రముఖులు ఉన్నారు.

లారీపేజ్‌ – గూగుల్‌
నికర ఆస్తి : 18.6 బిలియన్‌ డాలర్లు
Anurag-dixitస్ట్రాన్‌ఫోర్డ్‌లో కంప్యూటర్‌ సైన్సెస్‌ పి హెచ్‌డి చేశాడు లారీ పేజ్‌. ఇతను రష్యా కి చెందినవాడే అయినా మిచిగన్‌లో పెరిగాడు. ఆయన 1998లో స్నేహితుని గ్యారేజ్‌ నుంచీ గూగుల్‌ ప్రారంభించాడు. ఆయన సంస్థకు తొలి దశలో స్టాన్‌ఫోర్డ్‌ ఎండోమెంట్స్‌, ఏంజిల్‌ ఇన్‌వెస్టర్లు కె.రామ్‌ శ్రీరామ్‌, ఆండీ వాన్‌ బెక్టోల్షీమ్‌లు ఆర్ధిక మద్దతు నిచ్చారు. దాంతో మరో 25 మిలియన్‌ డాలర్ల వెంచర్‌ క్లినర్‌ పార్కిన్స్‌ను 1999లో ప్రారంభించారు. అనుకున్న లక్ష్య సాధన కోసం 2001లో సాంకేతిక నిపుణు డు ఎరిక్‌ ిస్మిత్‌ను తీసుకున్నాడు. వెబ్‌ వీడియో పోర్టల్‌ యూట్యూబ్‌ను 1.65 బిలియన్‌ డాలర్లకు 2006లో కొని తన ప్రధాన కార్యాలయాన్ని కాలిఫోర్నియాలోని మౌంటెన్‌ వ్యూకి మార్చాడు. ఇదే సోలార్‌ పవర్‌ ప్రధాన స్థావరంగానూ మారింది. 2007లో అత్యధికంగా 740 బిలియన్‌ డాలర్ల షేర్‌తో ఉన్నత స్థాయిలో నిలిచాడు.

పెరియాద్‌ – ఈ-బే
నికర ఆస్తి : 7.7 బిలియన్‌ డాలర్లు.
david-filo ఫ్రాన్స్‌లో జన్మించిన ఈ కంప్యూటర్‌ ప్రోగ్రామర్‌ 1995లో ఆన్‌లెైన్‌ ఆక్షన్‌ ఈ-బేను ప్రారంభించాడు. మిలియన్‌మందికి పెైగా తమ రాబడికి దీన్నో అవకాశంగా వినియోగించుకున్నారు. అయితే 1998లో కార్యనిర్వాహక అధికారాలను మెగ్‌ విట్‌మాన్‌కు అందజేసి తాను చెైర్మన్‌గా ఉన్నాడు. పెరియాద్‌ తన నెట్‌వర్క్‌ ద్వారా ఎందరికో సహాయసహకారాలు అందిస్తూ సమాజ సేవలో పాలుపంచుకుంటున్నాడు.

డేవిడ్‌ ఫిలో – యాహూ
నికర ఆస్తి : 2.5 బిలియన్‌ డాలర్లు
periodజెర్రీ యంగ్‌తో కలిసి 1996లో యూ హూ పోర్టల్‌ ప్రారంభించాడు. వెబ్‌ లో కంలోకి ప్రొఫెషనల్‌ మేనేజ్‌మెంట్‌ను పరిచయం చేసిన ఘనుడాయన. 2007లో చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ సెమెల్‌ విడిపోయాడు. గత జూన్‌లో యాంగ్‌ ఛీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ అయ్యాడు. యాహూను కొనడానికి మైక్రోసాఫ్ట్‌ చేసిన ఆఫర్‌ను తిరస్కరించాడు. అలీబాబా డాట్‌కామ్‌ లో 40శాతం వాటాను 2005లో కొన్నాడు. చెైనాలో బిజినెస్‌ విస్తరించి లాభాలు గడించాడు. దీనికి యాంగ్‌ కృషి అపారం.

టాడ్‌ వాగ్నర్‌ – బ్రాడ్‌కాస్ట్‌ డాట్‌ కామ్‌
నికర ఆస్తి : 1.5 బిలియన్‌ డాలర్లు
న్యాయవాది అయిన వాగ్నర్‌ తన కెరీర్‌ మార్చుకుని బ్రాడ్‌కాస్ట్‌ డాట్‌కామ్‌ అనే ఇంటర్నెట్‌ వీడియోను ప్రారంభించా డు. దీన్నే 1999లో యాహూకి 5.7 బిలియన్‌ డాలర్లకు అమ్మేశాడు. ఇపుడు ఆ కంపెనీ లేదు. వాగ్నర్‌ హాలీవుడ్‌ వెళ్లాడు. క్యూబన్‌కు మంగోలియా పిక్చర్స్‌, లాండ్‌మార్క్‌ థియేటర్స్‌, హెచ్‌డి నెట్‌, లయన్స్‌ గేట్‌ వంటి సంస్థల్లో 29 శాతం భాగస్వామ్యం ఉంది. వియ్‌ ఓన్‌ ది నెైట్‌ ను 1999 మేలో సోనీకి 11.5 మిలియన్‌ డాలర్లకు అమ్మాడు. ఆ కార్యక్రమంలో ప్రముఖ నటులు జావోకిన్‌ ఫోని క్స్‌, మార్క్‌ వాల్‌బెర్గ్‌ తదితరులు పాల్గొనానరు.

మార్క్‌ జకర్‌బెర్గ్‌ – ఫేస్‌బుక్
నికర ఆస్తి : 1.5 బిలియన్‌ డాలర్లుసాంకేతిక నిపుణుల్లో మేటిగా మన్ననలు అందుకున్న మార్క్‌ జకర్‌ బెర్గ్‌ ఫేస్‌బుక్‌ అనే నెట్‌వర్క్‌ సైట్‌ను 2004లో ప్రారంభించాడు. మరుసటి సంవత్సరమే సిలికాన్‌ వ్యాలీకి మకాం మార్చాడు. పేపాల్‌ నెలకొల్పినవారిలో ఒకడెైన పీటర్‌ థీల్‌ అయిదు లక్షల డాలర్ల పెట్టుబడి పెట్టాడు. అంతే వ్యాపారం మూడింతలెై యాక్సెల్‌ పాట్నర్స్‌, గ్రెలాక్‌ పాట్నర్స్‌ వంటి వెంచర్లు ప్రారంభించాడు. ఇపుడు ఫేస్‌బుక్‌కి దాదాపు 70 మిలియన్ల మంది యూజర్లు ఉండడం విశేషం. వార్షి క రాబడి సుమారు 150 మిలియన్‌ డాలర్లు ఉంటుంది. కాలేజ్‌ ఓన్లీ మెసేజ్‌ వి దానాన్ని అధిగమించి ఇపుడు 55 వేల పాఠశాలలు, వ్యాపారసంస్థలు, సిటీ నెట్‌వర్క్‌లు వీరి సేవలు అందుకుంటున్నాయి. 2006లో న్యూ ఫీడ్‌ ప్రారంభిం చాడు. గత ఏడాది ఫేస్‌బుక్‌ బీకన్‌ ప్రా రంభించి వివాదాల్లో చిక్కుకున్నాడు. చాలామంది తమ స్నేహితుల కార్యకలాపాలను కొన్ని ఎంపికచేసిన సైట్స్‌లో ఉం డటాన్ని గురించి జాగ్రత్తలు తీసుకున్నా రు. గత అక్టోబర్‌లో మైక్రోసాఫ్ట్‌ 240 మిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టింది. అయితే ఈ ఒప్పందంతో ఫేస్‌బుక్‌ విలు వ ఇపుడు 15 బిలియన్‌ డాలర్లకు తగ్గిం దని అంటున్నారు.

రాబిన్‌ లీ – బెైడ్‌ డాట్‌ కామ్‌
నికర ఆస్తి : 1.4 బిలియన్‌ డాలర్లు
బెైడు డాట్‌కామ్‌ వ్యవస్థాపకుల్లో ఒకడు. చెైనాలో ప్రసిద్ధి పొందిన ఇంటర్నెట్‌ సర్చ్‌ ఇంజన్‌ ఎగ్జిక్యూటివ్‌ రాబిన్‌ లీ 1990ల్లో సిలికాన్‌ వ్యాలీలో ఇన్‌ఫోసీక్‌ సర్చ్‌ ఇంజ న్‌ పయనీర్‌తో కలిసి పనిచేశాడు. 2000లో బెైడు డాట్‌కామ్‌ను ప్రారంభిం చాడు. 2005 నాస్డాక్‌ షేర్స్‌లో ఆయన కంపెనీ నిలిచింది. లీ త్వరలో ఇ-కామర్స్‌ మార్కెట్లోకి వస్తున్నట్టు ప్రకటించాడు.

అమరాగ్‌ దీక్షిత్‌ – పార్టీగేమింగ్‌
నికర ఆస్తి : 1.6 బిలియన్‌ డాలర్లు
larry-pageమామూలు ఇంజనీర్‌ స్థాయి నుంచీ ఆన్‌లెైన్‌ గ్యాంబ్లింగ్‌ మొగల్‌గా మారాడు దీక్షిత్‌. న్యూఢిల్లీ ఐఐటిలో కంప్యూటర్‌ సైన్స్‌ డిగ్రీ, ఇంజనీరింగ్‌ డిగ్రీలు పొందిన దీక్షిత్‌ మొదట సిఎంసి, వెబ్‌సి, ఎటి అండ్‌ టి వంటి సంస్థల్లో పనిచేశాడు. పార్టీ గేమింగ్‌ నెలకొల్పిన అమెరికా ఇంజనీర్‌ రత్‌ పారాసోల్‌తో కలిసి స్టార్‌లక్‌ కాసినోవాను 1997లో ఇంటర్నెట్‌లో ప్రారంభించాడు. మరుసటి ఏడాది ఆ సంస్థ లో చేరిన దీక్షిత్‌ కంపెనీ బెట్టింగ్‌ సాఫ్ట్‌వేర్‌ను రాశాడు. దీంతో ప్రపంచంలో ఎక్కడెైనా సరే గ్యాంబ్లింగ్‌లో సులభంగా ఆడేందుకు వీలయింది. అయితే ఈ తరహా వ్యాపారంపెై అమెరికా చట్టాలు నిషేధం విధించడంతో సంస్థ నుంచి బయటికి వచ్చాడు. అయినా అందులో చెప్పుకోదగ్గ స్థాయిలో ఆయనకు భాగస్వామ్యం ఉంది.

కె.రామ్‌ శ్రీరామ్‌ – జంగ్లే, నౌకరీ డాట్‌కామ్‌, స్టంబుల్‌ అపాన్‌డాట్‌కామ్‌నికర ఆస్తి : 18.6 బిలియన్‌ డాలర్లు
todd-wagnerభారత దేశానికి చెందిన ఈ ఫెైనాన్సియర్‌ జంగ్లీని ప్రారంభించి 1998లో అమెజాన్‌కు అమ్మేశాడు. నెట్‌స్కేప్‌, అమేజాన్‌లలో పనిచేశాడు. 2000లో షెర్పాలో అనే సంస్థను ప్రారంభించాడు. గూగుల్‌ తొలినాళ్లలో బోర్డ్‌ సభ్యుడెైన శ్రీరామ్‌ 2004లో మూడు మిలియన్‌ షేర్లకు పెైగా అమ్మేశాడు. ప్రస్తుతం మన దేశంలో, అమెరికాలో 24/7 కస్టమర్‌, ఫ్రంట్‌లెైన్‌ వెైర్‌లెస్‌, జాజల్‌డాట్‌కామ్‌ వంటి సాంకేతిక సంస్థలకు మద్దతునిస్తున్నాడు. 2007లో ఆన్‌లెైన్‌ క్లాసిఫెైడ్‌ సైట్‌ స్టంబుల్‌ అపాన్‌ డాట్‌ కామ్‌ను ఈ-బేకి అమ్మేశాడు. ఇక శ్రీరామ్‌ నౌకరీ డాట్‌కామ్‌ వ్యవస్థాపకుడు ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరుతెచ్చుకున్నారు.

surya Telugu Daily .

ఏప్రిల్ 16, 2011 Posted by | వార్తలు | వ్యాఖ్యానించండి

లక్షలాది గొంతుకుల శంఖారావం అన్నా హజారే

లక్షలాది గొంతుకుల శంఖారావం అన్నా హజారే
అన్నా హజారే…అవినీతిపై సమర శంఖాన్ని పూరించిన సంఘ సంస్కర్త. ఇందు కోసం లోక్‌ పాల్‌ బిల్లు స్థానంలో జన్‌ లోక్‌పాల్‌ బిల్లును ఏర్పాటుచేయాలని మంగళవారం నుంచి ఆమరణనిరాహార దీక్ష చేస్తూ యుపిఎ ప్రభుత్వాన్ని గడగడలాడిస్తున్న వ్యక్తి. దేశంలో ఎంతటి పెద్దవారైనా సరే అవినీతికి పాల్పడితే వారిని విచారించే అధికారం జన్‌లోక్‌పాల్‌కు కల్పించాలని ఆయన ఉద్యమిస్తున్నారు. ఆయనకు మద్దతుగా సంఘ సంస్కర్త స్వామి అగ్నివేష్‌, మాజీ ఐపిఎస్‌ అధికారిణి కిరణ్‌బేడితో పాటు పలువురు మద్దతుపలికారు. గాంధేయ పద్దతిలో ఆయన చేస్తున్న సత్యాగ్రహం దేశంలోని అందరినీ కదిలించింది. నాలుగు రోజులుగా దేశ వ్యాప్తంగా ప్రజలు ఆయనకు మద్దతుగా ఆందోళనలు చేపడతున్నారు.

annaఅన్నా హజారే మహారాష్టల్రోని అహ్మద్‌నగర్‌ జిల్లాలోని రాలేగన్‌ సిద్ధి అనే గ్రామాన్ని మోడల్‌ గ్రామంగా తీర్చిదిద్ది ఎంతో పేరుతెచ్చుకున్నారు. దీంతో ఆయన దేశ,విదేశాల్లో ఎంతో ప్రఖ్యాతిగాంచారు. ఆయన కృషిని గుర్తించిన ప్రభుత్వం పద్మభూషణ్‌ అవార్డును ఇచ్చి సన్మానించింది.

కుటుంబ నేపథ్యం…
సంఘ సంస్కర్త కిసాన్‌ బాపట్‌ బాబురావు హజారేను ప్రజలందరూ అన్నా హజరేగా పిలుస్తారు. ఆయన 1949 సంవత్సరం జనవరి 15న బింగర్‌ గ్రామంలో జన్మిం చారు. బాబురావు హజారే, లక్ష్మిభాయ్‌ దంపతులకు ఆ యన పుట్టారు. తల్లిదండ్రులు కార్మికులుగా పనిచేస్తుం డేవారు. అన్నా హజారేకు ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. పరిస్థితులు బాగా లేకపోవడంతో అన్నా హజారే కుటుంబం 1952లో రాలేగన్‌ సిద్ది గ్రామానికి తరలి వెళ్లింది. ఆ తర్వాత ఆయన ముంబయ్‌లోని తన అత్త వద్ద ఏడవ తరగతి వరకు చదువుకొని కొన్ని పరిస్థితుల మూలంగా మధ్యలోనే చదువును ఆపేయాల్సి వచ్చింది.

దేశ సైన్యంలో పనిచేసి…
anna3 హజారే తన ఉద్యోగ జీవితాన్ని ఇండియన్‌ ఆర్మీలో డ్రైవర్‌గా ప్రారంభించడం విశేషం. తీరిక సమయాల్లో ఆయన స్వామి వివేకానంద, మహాత్మా గాంధీ, ఆచార్య వినోబా భావే వంటి ప్రముఖుల పుస్తకాలను చదివి ప్రభావితులయ్యారు. దీంతో ఆయన సంఘ సంస్కర్తగా, ఉద్యకారునిగా కొత్త జీవితాన్ని ప్రారంభించారు. 1965లో జరిగిన ఇండో-పాకిస్తాన్‌ యుద్దం సమయంలో డ్రైవర్‌గా ట్రక్‌ను నడుపుకుంటూ సరిహద్దులకు వెళ్లి సురక్షితంగా బయటకు వచ్చారు. 1970 దశకం మధ్య సమయంలో ఆయన డ్రైవింగ్‌ చేస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది.

రాలేగన్‌ సిద్ది గ్రామంలో…
సైన్యంలో కొంతకాలం పనిచేసిన తర్వాత అన్నా హజారే అక్కడ వాలంటరీ రిటైర్మెంట్‌ తీసుకున్నారు. అనంతరం 1975లో తన స్వగ్రామం రాలేగన్‌ సిద్దికి తిరిగి వచ్చారు. ఆ గ్రామంలో ముందుగా యువతను అందరినీ కూడగట్టుకొని తరుణ్‌ మండల్‌ అనే యువజన సంఘాన్ని ఏర్పాటుచేశారు. దీంతో పాటు అందరికీ నీటి సరఫరా కోసం పానీ పురావత మండల్స్‌ (నీటి సంఘాలు)ను ఏర్పాటుకు కృషిచేశారు.

మద్యానికి వ్యతిరేకంగా…
anna4సంఘ సంస్కర్తగా అన్నా హజారే సమాజంలో పలు మార్పులకు కృషిచేశారు. ఆయన యువతను కూడగట్టుకొని మద్యానికి వ్యతిరేకంగా ఉద్యమించారు. రాలేగన్‌ గ్రామంలోని ప్రజలు అన్ని విధాలా అభివృద్దిచెందడానికి మద్యం అడ్డంకిగా మారిందని ఆయన భావించారు. దీంతో గ్రామంలోని దేవాలయం వద్ద ఓ సమావేశాన్ని ఏర్పాటుచేసి ప్రజలతో చర్చించారు. గ్రామంలోని మద్యం కేంద్రాలను మూసివేయడంతో పాటు మద్యం తాగడాన్ని నిషేధించేందుకు సమావేశంలో ప్రజలందరూ ఒప్పుకున్నారు. దేవాలయంలో తీసుకున్న ఈ నిర్ణయం ఓ విప్లవాత్మకమైన నిర్ణయంగా మారింది. దీంతో దాదాపు 30కిపైగా లిక్కర్‌ కేంద్రాలను వాటి యజమానులే స్వచ్చంధగా మూసివేయడం విశేషం. తెరచిఉన్న మద్యం కేంద్రాలను యువత ఉద్యమించి వాటిని బలవంతంగా మూసివేయించారు.

మద్యం కేంద్రాలు చట్ట విరుద్ధంగా నడుస్తుండడంతో వాటి యజమానులు సైతం ఎటువంటి ఫిర్యాదులు చేయలేదు. గ్రామాల్లో తీసుకున్న నిర్ణయానికి విరుద్దంగా కొందరు పక్క గ్రామాల నుంచి మద్యం తెచ్చుకొని తాగితే వారిని మూడు సార్లు హెచ్చరించి నాలుగవ సారి నుంచి శిక్షించడం ప్రారంభించారు. ఇది బాగా పనిచేసి రాలేగన్‌ గ్రామంలో సంపూర్ణ మద్య నిషేధం సాధ్యమైంది. దీంతో గత 25 సంవత్సరాలుగా ఈ గ్రామంలో సంపూర్ణ మద్యం నిషేధం కొనసాగుతుండం విశేషం. అన్నా హజారే పిలుపు మేరకు చివరికి గ్రామంలోని యువత పొగాకు, సిగరేట్లు, బీడీలను సైతం తాగకూడదని నిషేధాన్ని విధించుకున్నారు. హోలి రోజున వీటన్నింటిని తగలబెట్టి గ్రామవాసులు వీటికి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు.

వాటర్‌షెడ్‌ అభివృద్ది కార్యక్రమం…
anna5వ్యవసాయ దిగుబడులను పెంచాలంటే నీటి సరఫరా వ్యవస్థను మెరుగుపర్చాలని అన్నాహజారే భావించారు. దీంతో ఆయన రాలేగన్‌ గ్రామంలో వాటర్‌షెడ్‌ నిర్మాణానికి కృషిచేశారు. దీని నిర్మాణం కోసం గ్రామవాసులు శ్రమదానం చేయాలని పిలుపునిచ్చారు. ఆయన పిలుపుమేరకు ప్రజలందరూ స్వచ్చంధంగా శ్రమదానంలో పాల్గొని కాల్వలు, చెక్‌ డ్యామ్‌లను నిర్మించుకున్నారు. దీంతో గ్రామంలో వ్యవసాయం కోసం నీటి కొరత తీరి పంట దిగుబడులు బాగా పెరిగాయి.

పాల ఉత్పత్తి…
రాలేగన్‌ సిద్ది గ్రామంలో పాల ఉత్పత్తిని పెంచేందుకు అన్నా హజారే ఎంతో కృషిచేశారు. ఎక్కువగా పాలిచ్చే గేదెలను కొనుగోలుచేసి వెటర్నరీ డాక్టర్ల సహచారంతో క్రాస్‌ బ్రీడ్‌ ద్వారా గేదెల పెంపకాన్ని చేపట్టారు. దీంతో గ్రామంలో పాలిచ్చే గేదెల సంఖ్య పెరిగి పాల ఉత్పత్తి క్రమ,క్రమంగా పెరిగింది. ఆయన కృషితో 1975కి ముందు గ్రామంలో వంద లీటర్ల పాలు ఉత్పత్తి అయితే ఆ తర్వాత పాలిచ్చే గేదెల మూలంగా 2500 లీటర్ల పాలు ఉత్పత్తి కావడం విశేషం. ఈ పాలను గ్రామవాసులు అహ్మద్‌నగర్‌లోని మల్‌గంగ డైరీలో విక్రయిస్తూ ఆర్థికంగా అభివృద్ది చెందారు. అన్నా హజారే కృషితో గ్రామవాసులు రాలేగన్‌ సిద్ది గ్రామంతో పాటు పొరుగు గ్రామాల్లోని బాల్వాడీలలో పిల్లలకు పోషకాహారంగా పాలను ఉచితంగా ఇవ్వడం ప్రారంభించారు. గ్రామస్థులు అందరూ కలిసి మెలిసి ఉంటూ ప్రతిరోజు మినీ ట్రక్కుల ద్వారా పాలను అహ్మద్‌నగర్‌కు తీసుకెళ్లి, వచ్చేటప్పుడు గ్రామానికి కావాల్సిన కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువులను తీసుకురావడం ప్రారంభించారు.

విద్య…
anna2 గ్రామంలో అక్షరాస్యతను పెంపొందించేం దుకు అన్నా హజారే విశేషంగా కృషిచేశారు. ఒకప్పుడు అక్కడ చిన్న పాఠశాల ఉంటే హజారే కృషి మేరకు 1979 వరకు ప్రాథమిక, మాద్యమిక, ఉన్నత పాఠశాలలు ప్రారంభమయ్యాయి. గ్రామంలో అక్షరాస్యత కోసం సంత్‌ యాదవ్‌ బాబా శిక్షాణ్‌ ప్రసారక్‌ మండల్‌ (ట్రస్ట్‌)ను 1979లో ప్రారంభించారు.

అంటరానితనం నిర్మూలనకు…
రాలేగన్‌ గ్రామంలో అంటరానిత నాన్ని దూరం చేసేందుకు అన్నా హజారే పోరాటం చేశారు. ఆయన కృషితో గ్రామంలోని అగ్రవర్ణాలు, బడగు, బలహీన వర్గాలు, వెనుకబడిన తరగతుల ప్రజలందరూ ఐక్యంగా ఉంటూ వివిధ పండుగలు, పర్వదినా లను జరుపుకోవడం ప్రారంభించారు. అక్కడ దళితులు కూడా జనజీవన స్రవంతిలో కలిసిపోయి వేడుకలను జరుపుకుంటున్నారు.

సామూహిక వివాహాలు…
సామూహిక వివాహాల ద్వారా పేద కుటుంబాల్లోని యువతీ,యువకుల పెళ్లిళ్లు జరిపించారు అన్నా హజారే. పేద కుటుంబాలు వివాహానికి పెద్ద మొత్తంలో అయ్యే ఖర్చును భరించేవారు కాదు. దీన్ని గుర్తించిన హజారే గ్రామంలో తరుణ్‌ మండల్‌ ద్వారా పేద వధూ,వరుల వివాహాలను సామూహికంగా జరిపించి పెళ్లి భోజనాన్ని ఉచితంగా వండించి వడ్డించేవారు. వివాహానికి అవసరమైన లౌడ్‌ స్పీకర్లు, మండపం, అలంకరణ అంతా తరుణ్‌ మండల్‌ చూసుకునేది. ఇలా 1976 నుంచి 1986 వరకు అన్నా హజారే ఆధ్వర్యంలో 424 వివాహాలను జరగడం విశేషం.

సమాచార హక్కు ఉద్యమం…
ప్రజలందరికీ ప్రభుత్వ శాఖలోని అన్ని రకాల సమాచారాన్ని తెలుసుకునే అవకాశం కోసం సమాచార హక్కును కల్పించాలని అన్నాహజారే మహారాష్టల్రో ఉద్య మించారు. ఆయన ఉద్యమం మూలంగా అక్కడ మహా రాష్ట్ర రైట్‌ టు ఇన్ఫర్మేషన్‌ యాక్ట్‌ వచ్చింది. ఆ తర్వాత కేం ద్ర ప్రభుత్వం దీన్ని కొన్ని మార్పులతో రైట్‌ టు ఇన్ఫర్మేషన్‌ యాక్ట్‌ 2005 (ఆర్‌టిఐ)గా తీసుకురావడం విశేషం.
– ఎస్‌.అనిల్‌ కుమార్‌
అవినీతికి చెక్‌…?
anna1అవినీతిని నిరోధించేందుకు ఇదివరకే లోక్‌పాల్‌ బిల్లు ఉన్నా అది కేవలం నామమాత్రంగా మిగిలిపోయింది. దీని స్థానంలో జన్‌ లోక్‌పాల్‌ బిల్లును ప్రవేశపెట్టాలని అన్నా హజారే ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. ఇంతకీ లోక్‌పాల్‌ బిల్లులో ఏమున్నాయి..?, జన్‌ లోక్‌ పాల్‌లో ఏముండాలని హజారే కోరుకుంటున్నారో తెలుసుకుందామా…

లోక్‌పాల్‌ బిల్లు…
1. స్వతంత్రంగా చర్యలు తీసుకునే అధికారం లోక్‌పాల్‌కు లేదు. లోక్‌సభ స్పీకర్‌ లేదా రాజ్యసభ అద్యక్షుడికి ప్రజలు ఫిర్యాదులు చేయాలి. వారు ఆమోదించి పంపిన వాటిపైనే లోక్‌పాల్‌ దర్యాప్తు జరిపిస్తుంది.
2.సలహా సంఘంగా మాత్రమే లోక్‌పాల్‌ పనిచేస్తుంది. అది దర్యాప్తు నివేదికను సంబంధిత అధీకృత సంస్థకు పంపాలి. చివరికి చర్యలు తీసుకునేది ఆ సంస్థే. మంత్రుల విషయంలో ప్రధాని, ఎంపీల విషయంలో లోక్‌సభ, రాజ్యసభ అధ్యక్షులదే తుది నిర్ణయం. ఇక ప్రధానిపైన ఆరోపణలు వస్తే చేయడానికేమీ లేదు.
3.లోక్‌పాల్‌కు చట్టపరమైన రక్షణ, పోలీసు అధికారాలు లేవు. ఈ సంస్థ చేపట్టే విచారణలు ప్రాథమిక విచారణలే.
4.ఇందులో సీబీఐ పాత్ర ఎలా ఉంటుందో తెలియదు.
5.ఏదైనా ఫిర్యాదు అబద్దమని తేలితే ఫిర్యాదుదారున్ని లోక్‌పాల్‌ జైలుకు పంపవచ్చు. ఈ ఫిర్యాదు నిజమైతే రాజకీయ నాయకుడిని జైలుకు పంపే అధికారం మాత్రం లోక్‌పాల్‌కు లేదు.

జన్‌ లోక్‌పాల్‌లో…
1.స్వతంత్రంగా దర్యాప్తు జరిపే సంస్థగా లోక్‌పాల్‌కు అధికారాలు ఇవ్వాలి. ప్రజలు నేరుగా ఈ సంస్థకు ఫిర్యాదుచేసుకునే అవకాశం కల్పించాలి.
2.లోక్‌పాల్‌ను సలహా సంఘం గా కాకుండా దర్యాప్తు పూర్తయిన తర్వాత ఎంతటి వ్యక్తికి వ్యతిరేకం గానైనా విచారణ ప్రారంభించే అవకాశం కల్పించాలి.
3.సంపూర్ణ పోలీసు అధికారాలతో కూడిన లోక్‌పాల్‌ కావాలి. దీంతో ఫిర్యాదు దర్యాప్తుతో పాటు ప్రాసిక్యూషన్‌కు అవకాశం ఏర్పడుతుంది.
4.అవినీతి కేసులను దర్యాప్తు చేసే సీబీఐ విభాగాన్ని లోక్‌పాల్‌లో విలీనం చేయాలి.
5. లోక్‌పాల్‌ విచారణ పరిధిని కేవలం రాజకీయ నాయకుల వరకే పరిమితం చేయకుండా అధికారులు, న్యాయమూర్తులను కూడా అందులో చేర్చాలి.

anna6

Surya Telugu Daily.

ఏప్రిల్ 9, 2011 Posted by | వార్తలు | , | 4 వ్యాఖ్యలు

జయహో ఇండియా …

జయహో ఇండియా …

2011 ప్రపంచ కప్ విజేతలకు శుభాభినందనలు …

 

ఏప్రిల్ 3, 2011 Posted by | వార్తలు | | 2 వ్యాఖ్యలు

తెలుగు కథానికల హిమగిరి

తెలుగు కథానికల హిమగిరి
ప్రచారాలకు…ప్రాభవాలకు ఆయన బహుదూరం…సామాజిక సమస్యలే ఆయన కథావస్తువులు…జైలుగోడల మధ్య జీవించే ఖైదీల కథలే ఆయనకు స్పందనలు…జీవితంలో ఆయన ఎప్పుడూ ఇది కావాలని కోరుకోలేదు…గొప్పగా జీవించాలని కోరుకోనూలేదు…డాక్టర్‌ మాత్రం అవ్వాలనుకున్నారు…పరిస్థితులు అనుకూలించకపోవడంతో డాక్టరేట్‌ అయ్యారు…అలాగని ఉన్నత చదువు చదివించలేని కన్నతండ్రిని ఏనాడూ నొచ్చుకోలేదు…కానీ లోలోపల ఆయనలోని నిస్సహాయతకు మదనపడినా…సమాజంపై అహంకారం పెంచుకోలేదు. మమకారమే పంచాలనుకున్నారు. సమకాలీన సమస్యలపై స్పందించిన ఆయన జర్నలిజాన్నే వృత్తిగా…తన కలాన్నే కత్తిగా మలిచి సామ్యవాద భారతానికి సలాంచేస్తూ…నిష్కల్మషంగా పరిశోధనాత్మక కథానికలకు శ్రీకారం చుట్టారు. ఆయనే వర్థమాన రచయిత వేదగిరి రాంబాబు. నాలుగు వందలకు పైగా కథానికలు…ఎనిమిది నవలికలు…ఎనిమిదివేలకు పైగా శీర్షికలు….రాంబాబు డైరెక్టర్‌గా హైద్రాబాద్‌లో 1994లో స్వాతంత్యానంతర తెలుగు కథానిక ఐదు రోజుల సదస్సు జరిపించారు.ఫలితంగా ‘బంగారు కథలు’ సంకలనం వచ్చింది దానికి సంపాదకులు వాకాతి పాండురంగారావు. నేషనల్‌ బుక్‌ ట్రస్ట్‌ (ఎన్‌బిటి, ఢిల్లీ) శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్ర్తి కథానికలకు వేదగిరి రాంబాబు సంపాదకత్వం వహించారు. మన రాష్ట్ర ప్రభుత్వం నేతృత్వంలో కల్చరల్‌ కౌన్సిల్‌ తరపున నిర్వహించిన రెండువారాల నవ రచయితల అధ్యయన శిబిరాలకు రాంబాబు కోఆర్డినేటర్‌గా వ్యవహరించారు.

madhusరాష్టస్థ్రాయి తెలుగు కథా రచయితలనందరినీ ఒకేవేదికపైకి తీసుకువచ్చే ఉద్దేశ్యంతో ఓ వెబ్‌సైట్‌ కూడా ఆయన ఆధ్వర్యంలో రూపుదిద్దుకుంది. హిమగిరి అంత ఎత్తుకు ఎదిగిన ఆయన ఖ్యాతిపర్వంలో మంచుబిందువంత మనం తెలుసుకునేదంతా…‘నేలవిడిచి సామును చేయను…నేను నమ్మిందే నమ్మకంగా చేస్తా’నంటారు…విముక్తి-పెద్ద కథానికల సంపుటి, కస్తూరి-గొలుసు కథానికల సంపుటి, పే(చీ)జీ కథలు (సింగిల్‌ పేజీ కథలు), ఈ ‘కాలమ్‌’ కథలు (కాలమ్‌…కథలు), వయసు కథలు-(ఒకే అంశంతో కూడినవి) ఇలాంటి సాహిత్య వినూత్న ప్రక్రియలెన్నో రాంబాబు ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టారు. అలాగే ఉస్మానియా యూనివర్సిటీ ఎం.ఏ.లో నాలుగు శతాబ్దాల నగరం, కథానికా సదస్సు, కొత్త కథానిక, కథన రంగం వంటి రాంబాబు రచనలు పాఠ్యాంశాలుగా, విద్యార్థుల పరిశోధనాంశాలుగా కొనసాగడం విశేషం.

బాల్యమంతా ఎక్కువగా కృష్ణాజిల్లా తెనాలి తాలూకా చుండూరులోనే…తండ్రి పూర్ణచంద్రరావు ఎకై్సజ్‌ శాఖలో క్రమశిక్షణ కలిగిన ఓ చిరుద్యోగి. ఆయన డ్యూటీలోని సిన్సియారిటీతో కోస్తా ప్రాంతమంతా దాదాపు బదిలీలమీద ఉద్యోగం చేయవలసివుండటంతో రాంబాబు బాల్యం, చదువు అంతా వివిధ ప్రాంతాలలో కొనసాగింది. బాల్యంలో పాఠశాల స్థాయిలో నాటకాలలో కప్పులు సాధించినా… కాలేజీ స్థాయిలో సినిమా ఛాన్సులకోసం ప్రయత్నించాలనుకున్నా తండ్రికి ఇష్టం లేకపోవడంతో ఆ ప్రయత్నాలన్నీ విరమించుకున్నారు రాంబాబు. డిగ్రీ చదువుతున్నప్పుడే సాహిత్యం పట్ల క్రమంగా అభిరుచి పెరిగింది.

యర్రంశెట్టి సాయి రచనలు స్ఫూర్తిదాయకంగా నిలిచాయంటారు. ఆ రోజుల్లో ఆదివిష్ణు, విహారి లాంటి రచయితలు బందరులోని హిందూ కాలేజీలో ఆయనకు సీనియర్లు. యర్రంశెట్టి సాయి,ఆదివిష్ణు, విహారిలు గురుతుల్యులంటారు రాంబాబు. 1974 సంవత్సరంలో రచయితగా డిగ్రీ ఫైనలియర్‌లో చదువుతుండగా ఆంధ్రపత్రిక దీపావళి కథల పోటీకి సరదాగా పంపిన తొలికథ ‘సముద్రం’ బహుమతి సాధించిపెట్టింది. ఇక అదే క్రమంలో అప్పటి ప్రముఖ వారపత్రికలైన యువ, జ్యోతి, స్వాతి, ఆంధ్రపత్రికలకు వరసగా కథలు పంపిస్తుండేవారు. కొంతకాలం ఆలిండియా రేడియోలో అనౌన్సర్‌గా పనిచేశారు.

రేడియో ద్వారా రాంబాబు కథానికలకు మంచి ప్రాచుర్యం కల్పించారు. తర్వాత ఫ్రీలాన్స్‌ జర్నలిస్ట్‌గా వ్యాసాలను వివిధ దినపత్రికలకు పంపించేవారు. కొంతకాలం ఆంధ్రభూమి వారపత్రికలో సీనియర్‌ జర్నలిస్ట్‌గా చేశారు.పల్లకి వారపత్రికకు సంపాదకుడిగా పనిచేశారు. ఎక్కడ ఏ ఉద్యోగం చేసినా తనలోని రచనా వ్యాపంగాన్ని కొనసాగిస్తునే ఉన్నారు. దూరదర్శన్‌ అందుబాటులోకి వచ్చాక దృశ్యమాధ్యమాన్ని సామాజిక అస్త్రంగా మలిచి జనాలలో మార్పుతేవాలని ఆశించారు. ఆ క్రమంలోనే ‘పాపం పసివాడు’ సీరియల్‌ను 52 వారాలపాటు నిరంతరాయంగా దూరదర్శన్‌లో రూపొందించారు. ఎన్నో కష్టనష్టాలకోర్చి దూరదర్శన్‌ టెలీ సీరియల్‌ను తన సొంతఖర్చుతోనే భరించి తీర్చిదిద్దారు.

కమర్షియల్‌గా డబ్బులు మాత్రం ఆశించి ఆ సీరియల్‌ను రూపొందించలేదు. దానికి మాత్రం నిర్మాత, దర్శకునిగా రాష్ట్రప్రభుత్వం తరపున బంగారు నంది అవార్డు దక్కింది. కృష్ణమోహన్‌ టైటిల్‌సాంగ్‌కి కూడా నంది అవార్డు వచ్చింది. ఆ తర్వాత ‘అడవి మనిషి’ సీరియల్‌కు రజిత నంది వచ్చింది. దూరదర్శన్‌లో శైలజాసుమన్‌, రమణీసన్యాల్‌ వంటివారితో కలిసి ఇన్‌హేస్‌ సీరియల్ని చేశారు.తర్వాత దాదాపు రెండు సంవత్సరాలపాటు ఎంతో కష్టపడి జైలు అధికారుల అనుమతి తీసుకుని రాష్ట్రంలోని పలు జైళ్లలో పరిస్థితుల ప్రభావంచేత ఖైదీలుగా శిక్ష అనుభవిస్తున్న ఖైదీల యథార్థగాథలను తీసుకుని వాటినే తన కథావస్తువులుగా చేసుకుని ‘జైలుగోడల మధ్య’ సీరియల్‌గా రూపొం దించారు.

అంతకుముందే అది స్వాతి వారపత్రికలో దాదాపు 60-70 వారాలపాటు పాఠకులను అలరించింది. తన రచనలు ఎక్కడవున్నా చదివి మరీ అభినందనలు తెలుపుతారు సమాచార శాఖలో ఉన్న ఐఏఎస్‌ పార్థసారథిగారు. తెలుగుదేశానికి చెందిన కోడెల శివప్రసాద్‌ కూడా అత్యంత ఇష్టపడే వ్యక్తి తనకు వేదగిరి రాంబాబేనంటారు. రాంబాబు రాసిన ‘జైలుగోడల మధ్య’ పుస్తకరూపంలో దాదాపు చాలా భాషల్లో ప్రచురితమైంది. బాలసాహిత్యంలోనూ బాలల కోసం ఆయన చేసిన కృషి అజరామరం. ఇంద్రధనుస్సు అనే బాలల తొలి వీడియో మేగజైన్‌కు తొలి ఎడిటర్‌గా పనిచేశారు రాంబాబు.

ఇదంతా నాణానికి ఒకవైపే…తెలుగు కథానికలపై వాటిని చిన్నచూపు చూసే వారిపై ఆయన ఇప్పటికీ విమర్శనాస్త్రాలు సంధిస్తునేవున్నారు. ఏనాటికైనా వాటికి కూడా జాతీయస్థాయి గుర్తింపు తేవాలని ఆయన ఉద్దేశం. గ్లోబల్‌ ఆసుపత్రి మీడియా ఇన్‌ఛార్జిగా పనిచేస్తూ తనవద్దకు సాయం కోసం వస్తే వాళ్లకు ఉదారంగా తనకు సాధ్యమైనంతలో వారికి తక్కువ ఖర్చుతోనే వైద్యసేవలు చేయిస్తూ ఇతోధిక సేవలందిస్తున్నారు రాంబాబు. తెలుగు కథానికలపై రాంబాబు తన మనోభావాలను ఇలా పంచుకున్నారు…

కథకి, కథానికకు తేడా ఏ విధంగా గుర్తించవచ్చు?
జ: వస్తువు (కథ) అన్ని సాహిత్య ప్రక్రియల్లో వుంటుంది. పద్యాల్లో చెబితే అటు ప్రబంధాలు, కావ్యాలు కావచ్చు. విస్తృతంగా చెబితే నవల కావచ్చు. సంభాషణ రూపంలో చెబితే నాటకం, నాటిక కావాచ్చు. అదే కథలో ఏకాంశం తీసుకొని క్లుప్తంగా, స్పష్టంగా సూటిగా, వర్ణనలు ఉపోద్ఘాతాలు లేకుండా తర్వాత ఏ జరుగుతుందో తెలుసుకోవాలని ఉత్సుకతని కల్గించే మొదలు, ఒక తీరైన నడక, ఊహించని సంభ్రమాశ్చర్యాలతో ముగించే ’ముగింపు’తో కథను మలిస్తే అది కథానిక అవుతుంది.

కథానికని చదివించే సమయం కన్నా తర్వాత ఆలోచింపజేసే సమయం ఎక్కువ. చాలామంది సరిగ్గా అర్థం చేసుకోలేని విషయం ఏమంటే ’సంపుటి’, ’సంకలనం’ మధ్య భేదం! ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం తెలుగు పాఠ్యాంశంలో భిన్న రచయితల కథానికల్ని వాచికంగా ప్రచురించి ’సంపుటి’ అన్నారు. అది ’సంకలనం’ అవుతుంది గాని సంపుటి కాదు. పిల్లలకే కాదు పెద్దలకైనా తెలియని విషయం బోధించేటప్పుడు సంపూర్ణ అవగాహనతో బోధించాలిగాని తెలిసి తెలియకుండా బోధించడం భవిష్యత్తరానికి, భాషకి చేసే ద్రోహం! కథకి ఆధునికత సమకూరింది గురజాడ చేతుల్లో. లక్షణాలను బట్టి ఆధునిక కథను ’కథానిక’ అనాలి. ఒకే రచయిత/త్రికథానికలకయితే ’సంపుటి’ అనాలి. భిన్న రచయిత/త్రిల కథానికలకయితే ’సంకలనం’ అనాలి. రచయితలకే కాదు పాఠకులకు కూడా తెలియటం అవసరం.

కథానికా సదస్సులు జిల్లాలవారీగా నిర్వహించారు కదా, అక్కడ రచయితల/రచయితల స్పందన ఎలావుంది?
జ: కథానిక చాలా గొప్ప ప్రక్రియ. దానికి ఎంతోమంది అభిమానులున్నారు. ఇలా జిల్లాల వెంట వెళ్తూ వారిని పలకరించినప్పుడు పండగ సంబరాలు కన్పించాయి. అలాగే అందరూ ’కథకులం’ మనది ’కథ కులం’ అనే అభిప్రాయం తప్ప వర్గ, కుల, ప్రాంత భావపరమైన ఆభిప్రాయాల్ని తమ మధ్య గోడవాలుగా ఎవరూ భావించటం లేదు. అందరూ కథానికలో తామూ ఒక భాగం అనుకొంటున్నారు. ఈ భాగాలన్నీ కలిస్తేనే ’కథానిక’ అవుతుంది.

రాష్టస్థ్రాయిలో మీరు జరిపిన కథానిక శతజయంతి ఉత్సవం గురించి చెప్పండి?
జ:వంద కథానికల పూర్తి వివరాలతో ’తెలుగు కథానిక డాట్‌ కామ్‌’ కూడా సిద్ధమైంది. 23 జిల్లాల కథానికా తీరుతెన్నులగూర్చి పోటీపెట్టి వ్యాసాల్ని సేకరించాము. ఈ వ్యాస సంకలనాలను జయంతి సభలో ఆవిష్కరించాం. అలాగే రచయిత(త)ల చిరునామాలతో ఒక డైరెక్టరీని తీసుకొచ్చాం. శ్రావ్య, దృశ్య మాధ్యమాల్లో కూడా ఈ సాహిత్యాన్ని, ఔన్నత్యాన్ని చూపించడానికి కృషి చేస్తున్నాము. రాష్తవ్య్రాప్తంగా ఎవరు, ఎక్కడ ఎటువంటి కథానిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నా తనవంతు సహకారాన్ని అందిస్తుంది శ్రీ వేదగిరి కమ్యూనికేషన్స్‌ . ఇది కథానిక కోసం అవతరించిన సంస్థ. కథానికకే అంకితమైన సంస్థ. ’కథానిక కొత్త కదలిక కదులిక’ అనేది ఈ సంస్థ నినాదం! ఈ కార్యక్రమాలన్నీ ఎవర్నించీ ఎటువంటి సహాయం స్వీకరించలేక కేవలం నా సొంత సంపాదనతో నిర్వహిస్తున్నాను. అదే నాకు తృప్తి. కాకపోతే ఇంతపెద్ద కార్యక్రమం నిర్వహించటానికి సహకరిస్తున్న వారందరికీ నా కథాభివందనాలు.

పాఠకుల్లో పఠనాసక్తి సన్నగిల్లిందా?
జ:మాధ్యమాల వల్ల పఠనాసక్తి తగ్గటంలేదు. తల్లిదండ్రులు తమ పిల్లల్ని పెద్ద భవిష్యత్తుకోసం ఎక్కడెక్కడికో విదేశాలకు పంపాలనే తాపత్రయంతో మాతృభాషను కనీసం చదవను, వ్రాయటం కూడా నేర్పటంలేదు. ఆంగ్లేయులు మనల్ని వదిలి దశాబ్దాలయినా మనం ఇంకా వాళ్ళ భాషాదాస్యం నుంచి బైటపడటంలేదు. మన మాతృభాషని మృతభాష చేస్తున్నాం. ఒక్కసారి ఆలోచించండి ఎంత హేయమైందో, జననీ జన్మభూమిలాగా మాననీయమైంది. మాతృభాష ప్రాధాన్యతని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు చెప్పటంతోబాటు పిల్లల్లోను తెలుగుపట్ల అభిమానం పెరగాలాని బాలసాహిత్యానికి సంబంధించిన సాహిత్యాన్ని విరివిగా కొని వెళ్ళిన స్కూళ్ళు అన్నిటిలోను పిల్లలకు పంచుతున్నాము. బాలసాహిత్యంతో పిల్లలు ఆకర్షణకు లోనయితే పెరిగిన తర్వాత ఆధునిక సాహిత్యాన్ని అందుకుంటారని ఆశ. మన సాహిత్యాన్ని మనం కోల్పోతే సంస్కారాన్ని కోల్పోతాం. సంస్కృతికి దూరమవుతాం. ఆందుకే అందరూ సాహిత్యాన్ని ఆదరించాలి.
– నండూరి రవిశంకర్‌

Surya Telugu Daily.

మార్చి 4, 2011 Posted by | వార్తలు | వ్యాఖ్యానించండి

ఇంద్రజాలానికి గ్రహణం

ఇంద్రజాలానికి గ్రహణం

magic2ఎటువంటి ఆధారం లేకుండా యువతిని గాల్లో నిలబెట్టడం…పెట్టెలో నుంచి బయటకు వచ్చిన యువతి తలను కత్తితో కోయడం వంటి మ్యాజిక్‌లు సందర్శకులను అబ్బురపరుస్తాయి. పెట్టెలో బంధించిన యువకుడు ఏనుగుగా మారడం…చిత్తు కాగితాలను కరెన్సీ నోట్లుగా సృష్టించడం వంటి మ్యాజిక్‌లు వీక్షకులను చూపుతిప్పుకోకుండా చేస్తాయి. ఇటువంటి ఆశ్చర్యపరిచే దృశ్యాలతో కూడిన మ్యాజిక్‌ షోలు సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. కానీ రాష్ట్రంలో ఇటువంటి మ్యాజిక్‌ షోలు భవిష్యత్తులో రాను రాను తగ్గిపోయే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం మ్యాజిక్‌ షోలపై 20 శాతం ఎంటర్‌టైన్‌మెంట్‌ ట్యాక్స్‌ను విధించడమే దీనికి కారణం.

మన దేశం ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఎందరో మెజీషియన్లకు పేరు గాంచింది. మ్యాజిక్‌లోని కొన్ని అత్యంత క్లిష్టమైన అంశాలను ప్రదర్శించడంలో కొందరు మెజీషియన్లు పట్టు సాధించారు. ఇండియన్‌ రోప్‌ ట్రిక్‌ వంటి అంశాలు ప్రపంచంలో మహా మహావారిని కూడా చకితులను చేశాయి.

magic1మ్యాజిక్‌ లెజెండ్స్‌… : వీరిలో ముందుగా చెప్పుకోదన వారు పిసి సర్కార్‌ సీనియర్‌ (ప్రతుల్‌ చంద్ర సర్కార్‌). ఆయన ఆధునిక ఇండియన్‌ మ్యాజిక్‌కు తండ్రిగా పేరు గాంచారు. పడుకునేటప్పుడుకూడా ఇంద్రజాలమే నా శ్వాస, నేను మేల్కునప్పుడు మ్యాజిక్కే నా పని అని చెప్పే గొప్ప మెజీషియన్‌ ఆయన. ఇండియన్‌ మ్యాజిక్‌ ట్రిక్స్‌గా పేర్కొనే ఫ్లయింగ్‌ కార్పెట్‌, ద ఎక్స్‌రే ఐస్‌ను సృష్టించింది ఆయనే. దేశ విదేశాల్లో ఎన్నో ప్రదర్శనలిచ్చిన ఆయన ఎన్నో అవార్డులను అందుకున్నారు. చివరికి ఈ గొప్ప మెజీషియన్‌ గత ఏడాది ఫిబ్రవరి 23వ తేదీన కన్నుమూశారు. ఆయన జ్ఞాపకార్థం కేంద్రప్రభుత్వం పిసి సర్కార్‌ సీనియర్‌ పోస్టల్‌ స్టాంపును విడుదల చేసింది. పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి బుద్ధదేవ భట్టాచార్య ఈ స్టాంపును విడుదలచేశారు.కేరళ మ్యాజిక్‌కు తాతగా పేర్కొనే గొప్ప మెజీషియన్‌ వజకున్నన్‌ నీలకందన్‌ నంబూద్రి. కేరళలో మ్యాజిక్‌కు కొత్త అర్థాన్ని తీసుకువచ్చిన వ్యక్తి ఆయన. మ్యాజిక్‌ను ఓ కళగా గుర్తింపు తెచ్చేందుకు ఆయన ఎంతో కృషి చేశారు. ఆయన 1903లో కేరళలో జన్మించారు. తన మ్యాజిక్‌ ట్రిక్కులతో ఎందరో మెజీషియన్లకు ఆయన ఆదర్శప్రాయంగా నిలిచారు. పిసి సర్కార్‌ జూనియర్‌కు నీలకందన్‌ నంబూద్రి అంటే ఎంతో అభిమానం. తరచుగా ఆయన్ని కలుసుకొని మ్యాజిక్‌పై ఎన్నో విషయాలను చర్చించేవారు.

magic మంజేరి అలీ ఖాన్‌, ప్రొఫెసర్‌ ముతుకడ్‌, ఆర్‌.కె.మలాయత్‌, జాయ్‌ ఆలివర్‌, కె.పి.కౄఎష్ణన్‌ భట్టతిరిపడ్‌, కుట్టియడి నాను, కె.ఎస్‌.మనోహరన్‌, కె.జె. నాయర్‌ వంటి ప్రముఖ మెజీషియన్లు నంబూద్రి శిష్యులే.1983లో ఆయన తుది శ్వాస విడిచారు. దక్షిణాదిన తన మ్యాజిక్‌ విన్యాసా లతో ద బిగ్గెస్‌‌ట షో ఆఫ్‌ మ్యాజికల్‌ ఎంటర్‌ టైన్‌మెంట్‌కు చిరునామాగా పేరు గాంచారు ప్రొఫెసర్‌ కె.భాగ్యనాథ్‌. 1916లో జన్మించిన ఆయన ఫాంటాసియా అనే మ్యాజిక్‌ షోతో అందర్నీ అబ్బురపరిచేవారు. ఈ గ్రేట్‌ మెజీషియన్‌ 1999లో మృతిచెందారు. ఇక నేటి కాలంలో మన దేశంలోని కొందరు ప్రముఖ మెజీషియన్లు తమ మ్యాజిక్‌ ఫీట్లతో అంతర్జాతీయ పేరు, ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. వీరిలో పి.సి.సర్కార్‌ జూనియర్‌, జాదూగర్‌ ఆనంద్‌, సామ్రాజ్‌, గోపినాథ్‌ ముకుంద్‌, ఫిలిప్‌, పి.ఎం. మె హతా, ప్రహ్లాద్‌ ఆచార్య, సుహాని, లియో, పి.ఆర్‌. ఆకాష్‌ వంటి ఎందరో మెజీషియన్లు నేడు దేశ, విదేశాల్లో పాపులారిటీ సంపాదించుకున్నారు.

కనుమరుగవ్వనున్న మ్యాజిక్‌ షోలు: రాష్ట్రంలో కొనసాగే మ్యాజిక్‌ షోలపై 20 శాతం వినోదపు పన్ను ప్రభుత్వం విధించనున్నదనే వార్త ఆ రంగంలో వారిని ఆశ్చర్యానికిలోను చేసింది. ఈ మేరకు రాష్ర్ట ప్రభుత్వం జీఓ నెం.1271ను ఇటీవలే విడుదల చేసింది. ఇక నుంచి మ్యాజిక్‌ షోల ద్వారా మెజీషియన్లు ఆర్జించే ఆదాయంపై 20శాతం ప్రభుత్వానికి కట్టాల్సి ఉంటుంది..ఈ విషయంలో పలువురు రాష్ర్ట మెజీషియన్లు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తంచేస్తున్నారు.

Surya Telugu Daily.

జనవరి 28, 2011 Posted by | వార్తలు | 2 వ్యాఖ్యలు

సికింద్రాబాద్‌ పుట్టుక ఇదీ…

సికింద్రాబాద్‌ పుట్టుక ఇదీ…

sec-badదక్కన్‌ ప్రాంతాన్ని అసఫ్‌జాహీ ప్రభువులు 1724 నుంచి 1948 వరకు అంటే భారతదేశానికి స్వాతం త్య్రం సిద్ధించే వరకు 224 సంవత్సరాల పాటు పాలించారు.అసఫ్‌ జాహీ రాజ్య వంశ స్థాపకుడు ని జాం- ఉల్‌-ముల్క్‌, మీర్‌ ఖుమద్రీన్‌ ఆలీఖాన్‌ (1724-1748) గొప్ప పరాక్రమశాలిగా దక్కన్‌ ప్రాంతాన్ని పాలించాడు. నిజాం అనేది మొఘలు చక్రవర్తులు అసఫ్‌జాహీ వంశీయులకు ఇచ్చిన గౌరవ పురస్కారం.1762లో పరాక్రమశాలిగా కీర్తిగడించిన నిజాం ఆలీఖాన్‌ రెండో నిజాం ప్రభువుగా సింహాసనం అధిష్టించా డు. 1762 నుంచి 1803 వరకు ఆయన దక్కన్‌ ప్రాంతాన్ని పాలించారు. నిజాం ఆలీఖాన్‌ తన శత్రు సైన్యాల ను ఎదుర్కోవడానికి వీలుగా బ్రిటిష్‌ సైనికుల సహకారం కోరుతూ 1798లో బ్రిటిిష్‌ వారితో ఓ ఒప్పందం కుదుర్చుకున్నారు.

sec-bad1దీని ప్రకారం నిజాంకు మరాఠాలతో కానీ, మరే ఇతర శత్రు సైన్యాలనైనా ఎదు ర్కోవడానికి అవసరమైన బ్రిటిష్‌ సైనిక బల గాలను సమకూర్చాల్సి ఉంటుంది. అందుకు బ్రిటిష్‌ సైన్యానికి అయ్యే ఖర్చునంతా నిజాం సంస్థానం భరించా ల్సి ఉంటుంది. ఈ ఒప్పందం మేరకు ముందుగా 5000 మంది సైనికులతో హుస్సేన్‌ సాగర్‌కు ఉత్తరాన ఆరుమైళ్ల దూరంలో సైనికస్థావరాలు, కంటోన్మెంట్‌ ఏర్పాటు జరిగింది. ప్రస్తుత జన రల్‌ బజార్‌ సమీపంలో మిలిటరీ గుడారాలు ఏర్పాటు చేసుకు న్నారు. తరు వాత సైనికుల సంఖ్య పెరుగుతుండడంతో వారికి అనువైన తిరుమలగిరి, బొల్లారం, బోయిన్‌పల్లి ప్రాంతాలకు విస్తరించారు.

హైదరాబాద్‌ రాజ్యంలో బ్రిటిష్‌ సైనిక స్థావరాలు అలా పెరగడంతో రెండో నిజాం ప్రభువు నిజాం ఆలీఖాన్‌ మర ణానం తరం సింహాసనం అధిష్టించిన అతని కుమారుడు మూ డో నిజాం సికిందర్‌జా పాలనా కాలంలో నాటి బ్రిటిష్‌ సైనికా ధికారి కెప్టెన్‌ సీడెన్‌హామ్‌ కంటోన్మెంట్‌ ప్రాంతానికి నిజాం పేరుమీదుగా సికింద్రాబాద్‌ జంటనగర ఏర్పాటును ప్రతిపా దించారు. ఇందుకుసికిందర్‌జా అంగీకరించి 1806 జూన్‌ 3న అధికారికంగా ‘ఫర్మానా’ను విడుదల చేశారు. అలా హైద రాబాద్‌కు జంటనగరంగా సికింద్రాబాద్‌ ఏర్పాటైంది.

Surya Telugu Daily.

జనవరి 26, 2011 Posted by | వార్తలు | 4 వ్యాఖ్యలు

విభిన్న రకాల రంగులను ఎలా తయారు చేస్తారు ?

విభిన్న రకాల రంగులను ఎలా తయారు చేస్తారు ?

wool_colorsగత నూరు లేక యాభెై సంవత్సరాలకంటే నేడు ప్రపంచం ఎంతో ప్రకాశవంతంగా, రంగుల మయంగా వుంది. రంగుల తయారీలో జ రిగిన పరిశోధనలు, అభివృద్ధుల ఫలితమే ఇది. రంగుల ఉత్పత్తి వలన వ స్త్ర పరిశ్రమలో లెక్కలేనన్ని రంగులలో వస్త్రాలు తయారవుతున్నాయి.

  • గత శతాబ్ది మధ్య కాలం వరకు లభించే రంగులు ప్రకృతి సిద్ధంగా లభించే పువ్వులు, మొక్కల నుండి తయారయ్యేవి. అప్పుడు రంగుల వన్నెలు తక్కు వుండేవి. ఈ రోజుల్లో నీలం రంగు చెట్టు ఇండిగో నుండి నీలం, మేడర్‌ అ నే ఎర్ర రంగు, సాఫోవర్‌ అనే పచ్చరంగు, టర్మరిక్‌ పసుపు అనే పసుపు ప చ్చ రంగును కొన్ని సముద్ర ప్రాణుల నుండి తయారు చేసేవారు.
  • మొట్టమొదటి కృత్రిమమైన రంగును 1856లో కనుగొనేసరికి రంగుల ప్ర పంచంలో కొత్త ఇంద్రధనస్సులేర్పడ్డాయి. క్వినెైన్‌ మందును కృత్రిమంగా తయారు చేయడానికి విలియమ్‌ పెర్కిన్‌ ప్రయోగాలు చేస్తుండగా, ఈ రం గు సునాయాసంగా తయారెైంది. దీని పేరు మేవీన్‌. ఇది నీలం రంగులో వుండేది. ఆ తరువాత అనేక రంగులలో కృత్రిమ వర్ణాలను తయారు చేయడం జరిగింది.
  • కృత్రిమంగా తయారయిన రంగులు ఊలు మొదలెైన బట్టలకు వేసిన పుడు వెలిసిపోయేవి కాదు. నూలు బట్టలకు ఈ రంగులను వేసినపుడు, బట్టలను ఉతికేసరికి రంగులు వెలిసి పోయేవి. రంగు వెలవకుండా ఉం డేందుకు రంగు వేసే ముందు నూలు బట్టలను టేనిక్‌ ఆమ్లము లేదా లో హపు లవణాలలో ముంచేవారు. దీని వలన రంగు పోయేది కాదు.
  • paintఈ రంగుల తర్వాత ఏజో రంగులు తయారయ్యాయి. ఈ రంగులలో రెండు రకాలు. మొదటి రంగులో ముంచి తీసిన పిదప ఆరబెట్టి రెండవ రంగులో మరలా ముంచి తీసి ఆరబెడతారు. రెండు రంగులు కలసి బట్ట కు పట్టుకుంటాయి. తరువాత ఈ బట్టలను ఉతికినా రంగులు వెలసి పోవు.
  • వాట్‌ రంగులు మరో సముదాయానికి చెందినవి. నూలు బట్టలకు ఇవి ఎంతో మంచివి. ఈ రంగులతో కొన్ని రసాయనాలను కలిపి బట్టలకు ప ట్టించినట్లయితే అవి ఎంత కాలానికి వెలువ కుండా మెరుస్తుంటాయి.
  • ఇంకా ఇప్పుడు, తారు, పెట్రోలియం పదార్థాలతో తయారయ్యే అనేక రంగులు లభిస్తున్నాయి. ఇవి బట్టల కోసమే కాదు, ప్లాస్టిక్‌, చర్మం, కాగి తం, తెైలాలు, రబ్బరు, సబ్బులు, ఆహార పదార్థాలు వంటి, సిరాలు మొదలెైనవి తయారు చేయడానికి ఉపయోగిస్త్తున్నారు.

Surya Telugu Daily

డిసెంబర్ 19, 2010 Posted by | వార్తలు | 1 వ్యాఖ్య

సాహితీ వనంలో నేల రాలిన పువ్వు

సాహితీ వనంలో నేల రాలిన పువ్వు

విజయనగరం మున్సిపల్‌/కల్చరల్‌,మేజర్‌న్యూస్‌: ప్రముఖ అభ్యుదయ కవి అయినంపూడి లక్ష్మీనరసింహరాజు (అల) మృతిపట్ల పలువురు సాహితీవేత్తలు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు, అభిమానులు, వివిధ పార్టీల రాజకీయ నాయకులు ఓ ప్రకటనలో సంతాపాన్ని తెలిపారు. సాహితీ వనంలో ఒక పువ్వు నేల రాలిందని, సాహితీ లోకానికి తీరనిలోటని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రొంగలి పొతన్న ఆవేదన వ్యక్తం చేశారు. ‘అల’ అకాల మరణం తనకు తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని, కొంతకాలంగా అలతో తనకు వున్న పరిచయం, ఆయన నిరాడంబరత తనను అతని పట్ల అభిమానం పెంచిందన్నారు.

Surya Telugu Daily

నవంబర్ 25, 2010 Posted by | వార్తలు | 1 వ్యాఖ్య

ఒక్కప్పటి నిజాం ప్యాలెస్‌ నేడది స్టార్‌ హోటల్‌

ఒక్కప్పటి నిజాం ప్యాలెస్‌ నేడది స్టార్‌ హోటల్‌
హైదరాబాద్‌ నగరం వివిధ చారిత్రక ప్యాలెస్‌లకు ఎంతో ప్రసిద్ధి గాంచింది.నిజాం నవాబులు, వారి బంధువులు నివసించిన పలు రకాల ప్యాలెస్‌లు టూరిస్ట్‌లను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన పలు చారిత్రక కట్టడాలు, ప్యాలెస్‌లతో హైదరాబాద్‌ ప్రపంచ చారిత్రక కట్టడాలలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. వీటిలో దేశ,విదేశాల్లో పేరుగాంచిన ఫలక్‌నుమా ప్యాలెస్‌కు ఎంతో చారిత్రక నేపథ్యం ఉంది. ఈ కట్టడాన్ని అందంగా ఆధునీకరించి నేడు స్టార్‌ హోటల్‌గా తీర్చిదిద్ది కొద్ది రోజుల క్రితమే ప్రారంభించారు.

Hyderabad news, Andhra , Telugu Culture and Tradition, etc.

నవంబర్ 22, 2010 Posted by | వార్తలు | వ్యాఖ్యానించండి

వంద మంది బిడ్డలకు తండ్రి కావడమే లక్ష్యం: అబ్దుల్

నేటి ఆధునిక కాలంలో ఇద్దరు ముగ్గురు పిల్లలను పోషించడమే గగనమైపోతున్న తరుణంలో అబుదాబీకి చెందిన ఒక ఆసామీ ఏకంగా 100 మంది పిల్లలకు తండ్రి కావాలన్నదే లక్ష్యంగా పెట్టుకున్నాడు. అందుకే 64 సంవత్సరాల వయస్సులోనూ మరో వివాహం చేసుకున్నాడూ ఈ అబుదాబీకి చెందిన అబ్దుల్ రెహ్మాన్ అనే వృద్ధుడు…చదవండి …

వంద మంది బిడ్డలకు తండ్రి కావడమే లక్ష్యం: అబ్దుల్.

నవంబర్ 21, 2010 Posted by | వార్తలు | 1 వ్యాఖ్య

సత్తా చాటిన తెలుగు గళం -జై శ్రీ రామ్

సత్తా చాటిన తెలుగు గళం -జై శ్రీ రామ్
సోనీ ఇండియన్ ఇడోల్5 విజేత శ్రీ రామ్ కు శుభాభినందనలు
మీ అభినందనలు తెలియజేయండి.

ఆగస్ట్ 16, 2010 Posted by | వార్తలు | , , | 3 వ్యాఖ్యలు

మన హైదరాబాద్ ట్రాఫిక్

మన హైదరాబాద్ ట్రాఫిక్

మే 29, 2010 Posted by | వార్తలు | , | వ్యాఖ్యానించండి

వార్తలు -rss feed

http://news.google.co.in/news?cf=all&ned=te_in&hl=te&output=rss

ఫిబ్రవరి 27, 2010 Posted by | వార్తలు | వ్యాఖ్యానించండి