హరివిల్లు

ఎన్నెన్నో వర్ణాలు-అన్నింటా అందాలు…

జగన్నాధ రథచక్రాలు…

జగన్నాధ రథచక్రాలు…

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

జూలై 4, 2011 Posted by | భక్తి | 1 వ్యాఖ్య

ఈ గాలి.. ఈ నేల.. సాయిమయం

ఈ గాలి.. ఈ నేల.. సాయిమయం

Puttaparti_fy మేజర్‌న్యూస్‌ బ్యూరో, అనంతపురం: ఒకప్పటి కుగ్రామం నేడు అంత ర్జాతీయ ఆధ్మాత్మిక కేంద్రం. భగవాన్‌ సత్యసాయిబాబా జన్మస్థల మైన పుట్టపర్తి సాయిబాబా ఆశీస్సులతో అంచలంచలుగా ఎదిగి అంతర్జాతీయ ఆధ్మాత్మిక కేంద్రంగా పేరు పొందింది. సాయిబాబా బాల్యంలో ఉన్నప్పుడు బాబాగా సిద్ది పొందిన బాల సాయిని ఎద్దులబండిలో ఉరవ కొండ నుంచి పుట్టపర్తికి తీసుకు వచ్చారు. అప్పుడు ఆ ప్రాంతమంతా పుట్టలమయంగా ఉండేది. అప్పట్లో అదో కుగ్రామం. కొ న్ని గుడిసెలు .. ఒకటి రెండు మిద్దెలు ఉండేవి. రెండు దేవా లయాలు ఉండేవి. ఒకటి వేణుగోపాలస్వామి ఆలయం, రెండవది సత్యభామ దేవా లయం. బాలసాయి మొదటిసారిగా పుట్టపర్తి వచ్చినప్పుడు కరణం సుబ్బ మ్మ ఇంట్లో దిగారు. ఆ ఇంటి వరండాలో బాలసాయి భక్తులను కలుసుకుని భజ నలు చేసేవారు. ఆయనను చూడడానికి వచ్చే భక్తులకు గ్రామంలో బస చేయడానికి సౌకర్యం లేక భోజనం లభించక ఇబ్బందులు కలిగేవి. భక్తుల ఇబ్బం దులను గమనించిన సుబ్బమ్మ అందరికీ భోజనం పెట్టడమే కాకుండా పడుకోవడానికి తన ఇంటి వరండాను కూడా కేటాయించారు.

Puttaparti_fy1 ప్రసిద్ది చెంది వచ్చే భక్తుల సంఖ్య పెరగడంతో వారి సౌక ర్యార్థం సుబ్బమ్మ తమ ఇంటి పక్కనే షెడ్‌ నిర్మించి ఇచ్చారు. దానితో మొద లైన పుట్టపర్తి విస్తరణ అనూహ్యంగా పెరిగి ప్రశాంతి నిలయంగా మారింది. 1942లో మొదటిసారిగా మోటారు వాహనం పుట్టపర్తికి వచ్చింది. బస్సు సౌకర్యం కూడా ఏర్పడింది. 1945లో ఓ చిన్న రేకుల షెడ్‌లో బస్‌స్టేషన్‌ ఏర్పాటు చేశారు. ధర్మవరం, హిందూపురం, బెంగుళూ రుల నుంచి రెండు మూడు బస్సులు వచ్చి ఆగేవి. ఆ రేకులషెడ్డు నేడు ఆర్టీసీ బస్టాండుగా మారింది. ఆర్టీసీ డిపో కూడా ఏర్పాటయ్యింది. వంద లాది ఆర్టీసీ బస్సులు నేడు పుట్టపర్తికి వస్తున్నాయి. రాష్ట్రంలోని వివిధ డిపోలకు చెందిన బస్సులు వస్తున్నాయి. గతంలో టీ స్టాలు కూడా లేని పుట్టపర్తిలో పెద్ద పెద్ద హోటళ్లు, లాడ్జీలు వెలిశాయి. ముఖ్యంగా ప్రశాంతి నిలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం షెడ్‌లు, అపార్టుమెంటులు, వందలా ది గదులు, షాపింగ్‌ కాంప్లె క్సులు, విద్యాసంస్థలు నిర్మిత మయ్యాయి. గతంలో ఉన్న క్యాంటీన్‌ షెడ్‌ను తొలగించి అధునాతనమైన రెండంతస్థుల క్యాంటీన్‌ భవనాన్ని నిర్మించారు. ఇందులో ఒకేసారి రెండు వేల మంది భోజనం చేయవచ్చు. 1970లో వరల్డ్‌ కాన్ఫరెన్స్‌ జరిగినప్పుడు సాయిబాబా జన్మదినోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించడానికి పెద్ద ఎత్తున అభివృద్ది కార్యక్రమాలను నిర్వహించారు.

రేకుల షెడ్డుగా ఉన్న భజన మందిరాన్ని తొలగించి అధునాతమైన పూర్ణ చంద్ర ఆడిటోరియాన్ని నిర్మించారు. 150 అడుగుల పొడవు, 20 అడుగుల వెడల్పుతో మధ్యలో ఎక్కడా స్థంభాలు లేకుండా నిర్మించిన ఈ హాలు ఇంజనీ రింగ్‌ రంగంలో ఓ అధ్బుతంగా ఉంది. ఈ హాలులో 20 వేల మంది భక్తులు కూర్చునేందుకు సౌకర్యం ఉంది. ఈ మందిరానికి వేదిక ఒక అలంకరణ. 1993లో ఈ హాలుపై అంతస్థులు నిర్మించి అందమైన బాల్కనీలను ఏర్పా టు చేశారు. మందిర ప్రాంగణంలో రెండు కోట్ల రూపాయలతో సాయి కుల్వంత్‌ హాలును నిర్మించారు. 75 జన్మదినోత్సవ వేడుకలప్పుడు దీనిని మరింత ఆధునీకరించారు. అందులోనే సత్యసాయి బాబా ప్రతిరోజూ భక్తులకు దర్శ నమిస్తున్నారు. ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే వరల్డ్‌ కాన్ఫరె న్స్‌కు దేశ విదేశాలకు లక్షలాది మంది భక్తులు వస్తుండడంతో జన్మదిన వేడుకలను సాయి కుల్వంత్‌ హాలులో నిర్వహించడం కష్టసాధ్యం కావడంతో ఈశ్వరమ్మ మెమోరియల్‌ పాఠశాల వెనుక ఓపన్‌ ఫర్‌ హిల్‌ వ్యూ స్టేడియం నిర్మించారు. అత్యంత సుందరంగా నిర్మించిన శాంతి వేదిక ఇరు వైపులా గ్యాలరీలు ఏర్పాటుచేశారు. ఎక్కడినుంచి చూసినా కనిపించేవిధంగా ఆంజనేయస్వామి విగ్రహంతో పాటు గుట్టమీద నిర్మించిన యూనివర్శిటీ పరిపాలన విభాగపు భవన సత్యసాయి మ్యూజియం ప్రశాంతి నిలయానికే అందాన్నిచ్చాయి.

ఈ మ్యూజియంలో మానవ సంస్కృతి, సంప్రదాయాలు, మత విశ్వాసాలు ప్రదీప్తి చెందే ప్రజ్ఞా పాటవ ప్రయోగం, చైతన్య మహా ప్రభు వేదాంతం, బాబా దివ్య అవతార ప్రకటన, మక్కా మదీనా మసీదులు మహా అద్భుతాలకు ప్రతీకలుగా నిలిచాయి. విద్య, వైద్య, సాంకేతిక, ఆధ్యాత్మిక రంగాలలో సేవలందించేందుకు సత్యసాయి సేవా సంస్థలను ప్రపంచవ్యాప్తంగా ఏర్పా టుచేశారు. సత్యసాయి బాబా సందేశాలను ప్రచారం చేయడంతో పాటు నిర్మాణాత్మక సేవా కార్యక్రమాలలో సత్యసాయి సేవా సంస్థలకు చెందిన లక్షలాది మంది సేవా కార్యకర్తలు స్త్రీ, పురుష వయో బేధం లేకుండా పాల్గొంటు న్నారు. 1964లో ఏర్పాటయిన ఈ సేవా సంస్థలు నేడు ప్రపంచంలోనే 160 దేశాల్లో సేవలు అందిస్తున్నాయి. మన రాష్ర్టంలో 1500 శాఖలు, దేశంలో ఆరు వేల శాఖలు, ప్రపంచంలో ఐదు వేల శాఖలుగా విస్తరించాయి. కుల, మత, జాతి, వివక్షత లేకుండా సర్వ మానవ సౌభ్రాతృత్వానికి ఆత్మవికాసానికి కృషి చేస్తున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్‌ స్టేడియం ఇక్కడ నిర్మించారు. సాయి స్పేస్‌ థియేటర్‌ ప్రశాంతి నిలయంలో నిర్మించిన సాయి స్పేస్‌ థియే టర్‌ లలో కనువిందు చేసే వినువీధిని వీక్షించవచ్చు. అంతర్జాతీయ ఆధ్మాత్మిక కేంద్ర మయిన పుట్టపర్తికి ప్రతిరోజూ దేశ విదేశాల నుంచి భక్తులు విచ్చేస్తుంటారు.

సత్యసాయి అవతారం
Puttaparti_fy5మేజర్‌న్యూస్‌ బ్యూరో, అనంతపురం: మాన వత్వపు విలువలు క్షీణించిపోతున్న నేటి సమాజం లో వాటిని పునరుజ్జీవింపచేయడమే సత్యసాయి బాబా అవతార లక్ష్యం. ప్రపంచవ్యాప్తంగా బాబా దీన్నొక యజ్ఞంగా భావించి అమలు చేస్తున్నారు. మనిషిలోని దివ్యత్వపు విలు వలను ఆధ్యాత్మిక సాధన ద్వారా నిత్య జీవితంలో ఆచరణరూపంగా చూపించా లని స్వామి ప్రభోదిస్తున్నా రు. ‘‘ఎవరినీ మతం మార్చుకోమనడం లేదు …కానీ అన్ని మతాలలోని అమూల్యమైన విలువలు ఇవేనంటారు… సన్యాసం తీసుకోవాలని చెప్పడం లేదు ..కానీ ఏ ఆశ్రమంలో ఉన్నా మానవత్వపు విలువలు పెంపొం దించుకోమంటున్నారు.. మంత్రతంత్రాలు ఉపదేశించ డం లేదు … మానవుడు త్రికరణ శుద్దిగా బ్రతకాలన్న జీవనసూత్రాన్ని ప్రభోదిస్తు న్నారు’’ ఇలా ప్రపంచానికి ప్రేమతత్వం చాటుతూ సత్యసాయిబాబా తాను సాయి అవతారమని ప్రకటించింది అనంతపురం జిల్లా ఉరవ కొండలో. బాబా పుట్టుక అవతార విశేషాలను ఒకసారి పరిశీలిస్తే … అనంతపురం జిల్లాలోని పుట్టపర్తిలో 1926 నవం బరు 23న ఈశ్వరమ్మ, పెద్ద వెంకమరాజు దంపతులకు సత్యసాయి నాల్గవ సంతానంగా జన్మిం చారు. తల్లితండ్రులు ఆ బాలుడికి సత్య నారాయణ రాజుగా నామకరణం చేశారు. ఆయన విద్యాభ్యాసం బుక్క పట్నం, ఉరవకొండలలోనే కొనసాగింది. విద్యార్థి దశలోనే ఆయన అనేక మహిమలను చూపిస్తూ తోటి విద్యార్థులనే కాకుండా ఉపాధ్యాయులను కూడా అబ్బుర పరిచేవాడు. పాఠశాలలో విద్యాభ్యాసం కొనసాగించే సమయంలోనే పాఠశాలలో మౌనంగా ఉండేవాడు. తన పెద్దన్న శేషమరాజు వద్ద ఉంటూ చదువుకునేవాడు. శేషమరాజు వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు కావడంతో తరచూ బదిలీలు అయ్యేవి.

ఆయనతో పాటు సత్యనారాయణరాజు కూడా వెళ్లేవాడు. అలా ఉరవ కొండలో ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యాభ్యాసం కొనసాగుతూ ఉండేది. పాఠశాలలో మౌనంగా ఉండడం, తనకు ఇష్టమైనప్పుడు అక్కడి సమీపంలో ఉన్న అబ్కారీ ఇన్‌స్పెక్టరు బంగళా ఆవరణంలోని పెద్ద రాతి గుండుపై కూర్చుని ఆలోచిస్తూ గడిపేవారు. 1940 ఆగష్టు 20న పాఠశాలకు వెళ్లి ఇంటికి తిరిగి వస్తూ ఇంట్లోకి రాగానే తన చేతిలోని పుస్తకాల సంచీని ఇంటిలోనికి విసిరి కొట్టి ‘‘మాయ వీడినది నేను సత్య నారాయణుడిని కాదు .. సాయిబాబాను .. నేను నా కర్తవ్యా న్ని నిర్వహించాల్సి ఉంది .. నా భ క్తులు నన్ను పిలుస్తు న్నారు.. నేను వెళ్తున్నా ను’’ అంటూ అబ్కారీ ఇన్‌స్పెక్టరు బంగళా లోని రాతి గుండుపై కూర్చుండి పోయాడు. అప్పుడు ఆయన వయస్సు 14 సంవత్స రాలు. ఎనిమిదవ తరగతి చదువుతున్నారు. అక్కడే రాతిగుండుపై ధ్యానంలో మునిగిపోయాడు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా ఉరవకొండ గ్రామమంతా పాకిపోయింది.

అక్కడికి వచ్చిన భక్తులకు తాను నేటి నుంచి సత్యనారాయణ రాజును కాదని సత్యసాయిబాబానని ప్రకటించుకున్నారు. మానవ జాతిని అసత్యం నుంచి సత్యం వైపునకు, చీకటి నుంచి వెలుగుకు నడిపించే గురుచరణములను పూజించి దుర్భరమైన సంసార సాగరాన్ని దాటడానికి ప్రయత్నించండంటూ ప్రభోదిస్తూ .. మొదటిసారిగా ‘‘మానస భజరే గురచరణం దరుస్తర భావసాగర తరణం’’ అనే భజన గీతాన్ని భక్తుల చేత ఆలపింప చేశారు. సత్యనారాయణ రాజు ఇంటి నుంచి వెళ్లిపోయి అవతార ప్రకటన చేసిన సంగతిని శేషమరాజు ద్వారా తెలుసుకున్న తల్లితండ్రులు ఉరవకొండకు చేరుకున్నారు. తీసుకెళ్లడానికి ప్రయత్నించిన తల్లితండ్రులను బాబా వారించారు. దీంతో కళ్లనీళ్లు పెట్టుకున్న బాబా తల్లి ఈశ్వరమ్మ తమ కళ్లెదుటే ఉండి ఏమి చేసినను తమకు సమ్మతమేనని తె లపడంతో సత్యసాయిబాబా పుట్టపర్తికి చేరుకున్నారు. అక్కడి నుంచే తన ప్రేమ తత్వాన్ని సర్వలోకానికి చాటడం మొదలుపెట్టారు.

సత్యసాయి – గీతాసారం
Puttaparti_fy4‘భగవద్గీతను అందరూ చదవగలరు. కొంత మందే దాని సారాన్ని గ్రహించగలుగుతారు. శ్రీకృష్ణుడు బృందావనంలో వేణుగానాన్ని ఆలపించాడు. అదే వేణుగానాన్ని యుద్ధభూమిలోనూ ఆలపించాడు. రుద్రభూమి అయినా, భద్రభూమి అయినా ఆ పరమాత్మునికి సమానమైనవే. తన ఉపదేశాలను వినిపించడానికి ఈ రెండు ప్రదేశాలను సమానంగా భావించాడు.

అందుకే ఆయన భక్తుడైన అర్జునుడు యుద్ధభూమిలో, తనను ఆరాధించే గోపికలు బృందావనంలో వేణుగాన సందేశాన్ని స్వీకరించగలి గారు. ఈ రెండింటిలో ఉన్న తేడా ఒక్కటే. అదే ఏకాగ్రత. ఏకాగ్రతను పెంపొందిం చుకుంటే కురుక్షేత్రంలోనైనా గీతాసారాన్ని గ్రహించగలం. అది భగవద్గీత అయినా, సాయిగీత అయినా, సత్యసాయి గీతాసారాంశమైనా దాన్ని స్వీకరించగలుగుతాం.

నేను మీకు ఇచ్చే సలహా ఒక్కటే. ముందుగా మీ భౌతిక అవసరాలపై శ్రద్ధ పెట్టండి. అనంతరం మీ అంతర్గత శక్తిని మేల్కొలపండి. పదును పెట్టండి. రోజూ ఉదయం ఒక గంట, రాత్రి ఒక గంట, బ్రహ్మ ముహూర్తం లో మరో గంట జపాల ద్వారా, మెడిటేషన్‌ ద్వారా సాధన చేయండి. అంత ర్గత శక్తిని చైతన్యపరచండి. దాని ప్రభావమేంటో మీకు అర్థమౌతుంది. సాధనను నిరంతరం కొనసాగిస్తే ప్రశాంతతను, మానసిక బలాన్ని పొంద గలుగుతారు. ఏకాగ్రత శక్తి ఏమిటో తెలుస్తుంది.

(గోఖలే మహల్‌, మద్రాస్‌, 25-3-1958)

సాయి పాద ధూళితో.. పరమపావనం
Puttaparti_fy2మేజర్‌న్యూస్‌బ్యూరో, అనంతపురం: పుట్టపర్తిలో ప్రశాంతి నిలయం అనగానే బాబా దర్శనం ఇచ్చే ప్రాంతం ఆయన నివసించే ప్రాంతాలన్న సంగతి గుర్తుకు వస్తాయి. ప్రశాంతి నిలయంలో అనేక ఇతర నిర్మాణాలు ఉన్నాయి. ఆలయాలు, షాపింగ్‌ మాల్స్‌, భక్తుల విడిది ప్రదేశాలు లాంటివి అనేకం ఉన్నా పేరుకు తగ్గట్టుగానే ప్రశాంతి నిల యం ప్రశాంతంగానే ఉంటుంది. ఎన్ని వేల మంది ఇక్కడ ఉన్నా ఏ మాత్రం అలికిడి లేకుండా ఇక్కడ నిశ్శబ్దవాతా వ రణం తాండవిస్తూ ఉంటుంది. ప్రశాంతి నిలయంలోని ఇ తర నిర్మాణాల్లో ముఖ్యమైన వాటిని ఒకసారి పరిశీలిస్తే…

1.సాయి కుల్వంత్‌ హాలు. 2. గ్రీన్‌రూమ్‌. 3. యజు ర్వేద మందిరం. 4. వినాయకుని గుడి. 5. శ్రీనివాస గెస్ట్‌హౌస్‌. 6.శాంతిభవన్‌. 7.సౌత్‌ ఇండియన్‌ క్యాంటీన్‌. 8.నార్త్‌ ఇండియన్‌ క్యాంటీన్‌. 9. షాపింగ్‌ కాంప్లెక్స్‌. 10. సర్వమత స్థూపం. 11.గాయత్రీ దేవాలయం. 12.సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం.

సాయి కుల్వంత్‌ హాలు: రూ. రెండు కోట్ల వ్య యం తో సాయి కుల్వంత్‌ హాలును నిర్మించా రు. బాబా దర్శనార్థం వచ్చే భక్తుల కోసం దీనిని ఏర్పాటు చేశారు. ఇక్కడే బాబా భక్తులకు దర్శనమిస్తారు. ఇక్క డ ఒకేసారి 20 వేల నుంచి 30 వేల మంది వరకూ భక్తులు ఉండవచ్చు. ఉదయం, సాయంత్రం వేళల్లో బాబా రావ డానికి ముందు ఇక్కడ భజనలు, కీర్తనలు కొనసాగుతూ ఉంటాయి.

గ్రీన్‌ రూమ్‌ : దేశ విదేశాల నుంచి బాబా దర్శనార్థం విచ్చేసే విఐపి, వివిఐపి భక్తులకు బాబా ఈ గ్రీన్‌రూ మ్‌లోనే ఇంటర్య్వూలు ఇస్తారు. ఇక్కడే వారికి దర్శ నం, ఆశీర్వచ నాలు ఉంటాయి. దర్శన సమ యంలో బాబా ఇక్కడే విశ్రాంతి తీసు కుంటారు.

యజుర్వేద మందిరం: బాబా విశ్రాంతి తీసుకునే మందిరం. బాబా పుట్టపర్తిలో ఉన్నన్ని రోజులూ దర్శన సమయం మినహా యజుర్వేద మందిరంలోనే గడిపే స్తారు. భోజన ఏర్పాట్లు మొదలు అన్నీ ఇక్కడే బాబా చూసుకుంటారు. ట్రస్టు సభ్యులతో మంతనాలు, చర్చలు, కీలక నిర్ణయాలు ఇక్కడే తీసుకుంటారు.

శ్రీనివాస గెస్ట్‌హౌస్‌: టీటీడీ మాజీ ఛైర్మన్‌ డికె. ఆదికేశ వులు నాయుడు దీనిని నిర్మించారు. వివిధ దేశాలకు చెందిన వివిఐపిలకు ఇక్కడే బస ఏర్పాటు చేస్తారు.
శాంతి భవన్‌: ప్రముఖులు ప్రశాంతి నిలయానికి వచ్చి నప్పుడు వారి విశ్రాంతి కోసం ఏర్పాటు చేశారు.

సౌత్‌ ఇండియన్‌ క్యాంటీన్‌: ప్రశాంతి నిలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం దీనిని ఏర్పాటు చేశారు. భక్తులకు అతి తక్కువ ధరలో అల్పాహారం, టీ, భోజనాల ఏర్పాట్లు ఉంటాయి. ఇక్కడికి వచ్చే ప్రము ఖులకు సైతం ఇక్కడ తయారు చేసిన వంటకాలనే అందిస్తారు.

నార్త్‌ ఇండియన్‌ క్యాంటీన్‌: ఉత్తరాది భక్తుల కోసం నార్త్‌ ఇండియన్‌ క్యాంటీ న్‌ను ఏర్పాటు చేశారు. ఉత రాది సంప్రదాయానికి అనుగుణంగానే ఇక్కడ వంట కాలు ఉంటాయి. ఇక్కడ కూడా అతి తక్కువ ధరకే టీ, అల్పాహారం, భోజన సౌకర్యాలు ఏర్పాటు చేశారు.

వినాయక విగ్రహం: ప్రశాంతి నిలయం ప్రధాన గే టు కు ఎదురుగా వినాయక విగ్రహం ఉంది. ఇది ఉద్భవ లింగంగా ప్రచారంలో ఉంది. ఇక్కడ పూజలు చేసిన వారికి వారు కోరిన కోరికలు, సమస్యలు తీరుతాయ న్న నమ్మకం ఉంది. భక్తులు వినాయక విగ్రహానికి పూజలు చేసి, బాబా దర్శనానికి వెళతారు.

వసతి గృహాలు: భక్తులకు తక్కువ ధరకే గదులు కేటాయించడానికి వీలుగా గదులను నిర్మించారు. విదేశీ యులకు ప్రత్యేకంగా గదులు, వసతులు న్నాయి. డార్మెటరీలు కూడా తక్కువ ధరలోనే అందు బాటులో ఉన్నాయి.

సర్వమత స్థూపం: యజుర్వేద మందిరానికి సమీ పంలో సర్వమత స్థూపం ఉంది. యజుర్వేద మంది రం నిర్మించడానికి పూర్వమే దీనిని ఇక్కడ ఏర్పాటు చేశారు. సత్యం, ధర్మం, ప్రేమ, శాంతి, అహింసలకు గుర్తుగా దీనిని ఏర్పాటు చేశారు.

షాపింగ్‌ మాల్స్‌: భక్తుల సౌకర్యార్థం షాపింగ్‌ మాల్స్‌ను కూడా ప్రశాంతి నిలయంలో ఏర్పాటు చేశారు. ఇక్కడ నిత్యావసర వస్తువుల మొదలు అన్ని వస్తువులు అతి తక్కువ ధరలకే అందుబాటులో ఉంచారు. ఉదయం రెండు గంటలు, సాయంత్రం రెండు గంటల పాటు మాత్ర మే షాపింగ్‌ మాల్స్‌ తెరు స్తారు. ఉదయం స్ర్తీలు, సాయం త్రం పురుషులకు ఇ క్కడ ప్రవేశం ఉంటుంది. గాయత్రీ దేవాలయం, సు బ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం కూడా ఉన్నాయి.

సత్యసాయి – ధైవమార్గం
Puttaparti_fy3జీవితం అనేది పరమాత్ముని సన్నిధికి చేరుకోవడానికి ఉద్దేశించిన యాత్ర. ఆ భగవంతున్ని చేర్చడానికి మీ ముందు ఉన్న మార్గం అసత్యాలతో నిండి ఉంది. మీ ప్రయాణాన్ని ఎలా ఆరంభిస్తారు? ధైర్యంగా, సడలని విశ్వాసంతో, ప్రశాంతత చిత్తంతో, అచంచల మనస్సుతో ముందుడుగు వేయండి. అప్పుడే లక్ష్యాన్ని, విజయాన్ని అందుకోగలు గుతారు. ఈ మార్గంలో మీ లోని మరో మనిషి ప్రయాణానికి అవసరమైన బండికి మనస్సు, మేధస్సు జోడెద్దుల్లాంటివి. మనస్సు, మేధస్సు అనే జోడెద్దులు సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ అనే సన్మార్గంలో ప్రయాణించడానికి ఇష్టపడ వు. అసత్యం, అన్యాయం, చింత, అసహనం మార్గంలో మిమ్మల్ని తీసుకెళ్తా యి. మిమ్మల్ని సన్మార్గంలో ప్రయాణించేలా మీరే వాటికి శిక్షణ ఇవ్వాలి. బానిసత్వం, పరాధీనత వైపు మొగ్గు చూపకుండా మీరే నిరోధించాలి. మీ చిన్నారి తన చేష్టలతో మీరు ఎంతో సంతోషిస్తారు. మీరు వేరే పనిలో ఉన్నప్పుడు ఆటంకం కలిగిస్తే ఆగ్రహిస్తారు. ఇది చాలా సహజమైన ప్రక్రి య. జీవితంలో, సంతోషంలో ఉన్న విభిన్న పార్శ్యాలు అంటే అవే. అందుకే దీన్ని రెండింటినీ సమానంగా భావించేలా మనస్సును మలచుకోండి. సరిదిద్దుకోండి. సంతోషానికి, దుఖాఃనికి కారణభూతమైనది మనస్సే. ప్రపంచంలో జరిగే సహజ సిద్ధ పరిణామాలను, వాస్తవాన్ని సహజంగా గ్రహించేలా మనస్సును నియంత్రించుకోండి. అదే నిజమైన విద్య.

(తిరువనంతపుపురం, 20-12-1958)

” ఈ మహిమలు ప్రదర్శన కోసం కాదు. ఇవి నా దివ్యత్వానికి నిదర్శనం. నా దివ్యత్వం అనంతం. పంచభూతాలు నా హస్తగతం. నా సంకల్పం నిర్వికల్పం. ఎంతటి కష్టతరమైనదైనా జరిగి తీరుతుంది. ఇన్ని లక్షల మంది నా దర్శనార్ధం వస్తున్నారంటే వాటి ఆవశ్యకత ఎంతో ఏమిటో ఇట్టే అర్ధమవుతుంది. సాధన వల్ల సంక్రమించిన శక్తులను సిద్ధులంటారు. అవి సాధన వల్ల సిద్ధిస్తారుు. సాధన యొక్క ప్రాబల్యం అంతరించగానే ఆ శక్తులు అంతరిస్తారుు. నా శక్తులు జన్మత: వచ్చినవి. ఇవి స్వయంసిద్ధం. ఈ శక్తులు నా సంకల్పానుసారం దినదిన ప్రవర్ధమానమవుతారుు కానీ తరగవు. నేను చేసే మిరకిల్స్‌ అన్నీ భక్తుల యోగక్షేమాల కొరేక. “
” దైవప్రీతి కూడా అందరికీ అంత సులభంగా కలుగదు. అనేక జన్మల సంస్కారమే అట్టిదానికి కారణం. భూమిలో ఎప్పుడో ఒకప్పుడు పడిన విత్తనమే వర్షము కురిసిన తర్వాత మెుక్క కావచ్చును కానీ, విత్తనమే లేకున్నచో ఎంత వాన కురిసిననూ, ఎంత ఎరువు వేసిననూ మెుక్క రాదు. అటులనే ఏనాడో ఏ జన్మలోనో సంస్కారమను విత్తనము హృదయ భూమిలో దాగి యుండిననే సత్సంగమను వర్షము కురిసి సాధనయను ఎరువు తోడగుట చేత సన్నిధి అను పెన్నిధి మెుక్క చక్కగా బహిర్ముఖమై ఫలముల నందించును. దానికి మనోవాక్కాయముల తపస్సు అత్యవసరము. అదే మెుక్కను కాపాడు కంచె.”

ఏప్రిల్ 25, 2011 Posted by | భక్తి | , , | 1 వ్యాఖ్య

దక్షిణాకాశి ధర్మపురి క్షేత్రం dharmapuri

దక్షిణాకాశి ధర్మపురి క్షేత్రం

dharmapuri కరీంనగర్‌ జిల్లాలోని ధర్మపురి క్షేత్రాన్ని దర్శించిన వారికి యమపురి ఉండదు అని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. ప్రాచీన పుణ్యక్షేత్రమైన ధర్మపురి క్షేత్రంలోని దక్షిణవాహిగా ప్రవహిస్తున్న గోదావరి నదిలో మూడు సార్లు మునిగి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకుంటే గత మూడు జన్మలలో చేసిన పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. అందుకే రాష్ట్రం నలుమూలల నుండి నిత్యం వేలాది మంది భక్తులు వచ్చి స్వామి వారిని దర్శించుకుంటుంటారు. ప్రముఖ రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు, మేధావులు స్వామివారిని తరచూ దర్శించుకుంటూ తమ మొక్కులు చెల్లించుకుంటారు. ప్రస్తుతం వార్షిక పండుగ ఉత్సవాల్లో లక్షలాది మంది భక్తులు స్వామి వారిని దర్శించుకునేందుకు ధర్మపురి క్షేత్రానికి తరలివచ్చారు. అశేష భర్త జనావళితో క్షేత్రం కిటకిటలాడుతోంది.

ధర్మపురి క్షేత్రంలో బ్రహ్మ విష్ణు, మహేశ్వరుడు ముగ్గురు కొలువైనందున త్రిమూర్తి క్షేత్రంగా, శ్రీ బ్రహ్మదేవుడు, విష్ణుస్వ రూపుడైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారు కొలువై ఉన్నందున నరసింహ క్షేత్రంగా ప్రసిద్ధికెక్కింది. ఈ నరసింహ క్షేత్రం ప్రాచీన పుణ్యక్షేత్రంగా, చారిత్రాత్మకంగా ప్రసిద్ధి గాంచింది. క్షేత్రంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ప్రాంగ ణంలో ప్రధాన దేవాలయంతోపాటు శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ ఉగ్ర నరసింహ స్వామి, శ్రీ ఆంజనేయ స్వామి, శ్రీ వేణుగో పాల స్వామి, యమధర్మరాజు, శ్రీ రామలింగేశ్వర స్వామి, శ్రీ వినాయక స్వామిల ఆలయాలు ఉన్నాయి. విశాలమైన బ్రహ్మ పుష్కరిణితో పాటు సత్యవతి ఆలయానికి ఇసుక స్తంభం ప్రాశ స్త్యము. క్షేత్రం గుండా ప్రవహిస్తున్న గోదావరి నదిలో బ్రహ్మ గుండం, సత్యవతి గుండం, యమ గుండం, పాల గుండం, చక్ర గుండములు కలవు.

dharmapuri1 క్షేత్ర మహాత్యం : రాష్ట్రంలోని ప్రసిద్ధి పుణ్య క్షేత్రాల్లోని నవనారసింహా క్షేత్రాల్లో ధర్మపురి శ్రీ యోగానంద లక్ష్మీనృసిం హాస్వామి వారి క్షేత్రం ఒకటిగా వెలుగొందుతోంది. ఈ క్షేత్రమును పూర్వం ‘ధర్మవర్మ’ అనే మహారాజు పరిపాలించడం వల్ల ఈ క్షేత్రానికి ధర్మపురి అనే వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్షేత్రం క్రీ.శ 850- 928 సంవత్సరం కంటే పూర్వం అయినప్పటికీ క్రీ.శ 1422-1436 కాలంలో బహుమనీ సుల్తానుల దండ యాత్రలో ధ్వంసమై తిరిగి 17వ శతాబ్దంలో ఈ ఆలయం పునరుద్ధరింప బడినట్లు క్షేత్ర చరిత్ర తెలుపుతోంది. ఈ క్షేత్రంలో ప్రధాన మూర్తి అయిన శ్రీ యోగా నంద లక్ష్మీనర సింహాస్వామి సాలగ్రామ శిలగా వెలసియున్నారు. ఈ క్షేత్రానికి ఆనుకుని పవిత్ర గోదావరి నది దక్షిణవాహినిగా ప్రవిహస్తోంది. అందుకే ఈ క్షేత్రం దక్షిణకాశీగా, తీర్థరాజముగా, హరిహర క్షేత్రముగా పిలువబడుతోంది. స్వామివారి ఆలయ ప్రాంగ ణంలో భారతదేశంలో ఎక్కడా లేని విధంగా శ్రీ యమధర్మ రాజు ఆలయం ఉంది.

dharmapuri3 స్వామి వారిని దర్శించుకునే భక్తులు అనంతరం యమధర్మరాజును కూడా దర్శించుకుంటారు. అందువల్లే ధర్మపురికి వచ్చిన వారికి యమపురి ఉండదనే నానుడి ఉంది. ధర్మపురి క్షేత్రం ఆలయాలతో పాటు వేదాలకు ప్రాచీన సంస్కృతికి, సంగీతానికి, సాహిత్యానికి, కవిత్వానికి పుట్టినిల్లుగా ప్రసిద్ధి గాంచింది. ఈ దివ్య క్షేత్రంలో శ్రీ స్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రతి ఏటా పాల్గుణ శుద్ధ ఏకాదశి నుంచి 13 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించబడుతాయి. ఈ బ్రహ్మోత్స వాల్లో పాల్గొనేందుకు రాష్ట్రంలోని నలుమూలల నుంచే కాకుండా మహా రాష్ట్ర నుంచి కూడా భక్తులు వేలాదిగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. స్వామి వారికి నిత్య కళ్యాణంతో పాటు నిత్య అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతి 12 సంవత్సరాలకో సారి వచ్చే గోదావ రి పుష్కరాలు ఘనంగా జరుగుతాయి.

క్షేత్రంలో ఏడాది పొడుగునా ఉత్సవాలు:
చైత్ర మాసం ః- ఉగాది, శ్రీరామనవమి, చిన్న హన్మాన్‌ జయంతి.
వైశాఖ మాసంః- నరసింహ నవరాత్రోత్సవాలు, పెద్ద హన్మాన్‌ జయంతి ఉత్సవం
జ్యేష్ట మాసంః- పౌర్ణమి – వటసావిత్రి పౌర్ణమి.
ఆషాఢ మాసంః- శుద్ధ ఏకాదశి, గురు పౌర్ణమి ఉత్సవాలు,
శ్రావణమాసంః- శ్రీ కృష్ణాష్ఠమి, మరుసటి రోజున ఉట్ల పండుగ, శుద్ద పౌర్ణమిన శ్రావణ జంధ్యాల పౌర్ణమి రాఖీ పౌర్ణమి, శుద్ధ పంచమిన నాగుల చవితి, రెండవ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం, పొలాల అమావాస్య ఉత్సవాలు,

dharmapuri2భాద్రపదం మాసం ః- శుద్ధ చవితిన వినాయకచవితి, శుద్ధ పంచమిన ఋషి పంచమి ఉత్సవాలు.

ఆశ్వీయుజం మాసం ః- దసరా నవ రాత్రోత్సవాలు, దుర్గాష్ఠమి, మహర్నవమి, విజయదశిమి, కోజగిరి పౌర్ణమి, పాలలో చంద్ర వీక్షణ, బహుళ త్రయోదశిన ధన త్రయోదశి, చతుర్దశిన నరక చతుర్దశి, అమవాస్య రోజున దీపావళి, కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమిన పంచసహస్ర దీపాలంకరణ.
మార్గశిర మాసంః- మార్గశిర శుద్ధ పౌర్ణమిన దత్తాత్రేయ జయంతి, పుష్యమాసంః- ఆదివారాలు- పర్వదినాలు.

మాఘమాసంః- శుద్ధపంచమిన వసంత పంచమి, శుద్ధ సప్తమిన రథసప్తమి.
ఫాల్గుణ మాసంః- శుద్ధ ఏకాదశి నుండి 13 రోజుల పాటు శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు, ఏకాదశిన అంకురార్పణ, ద్వాదశిన కల్యాణం, పౌర్ణమిన తెప్పోత్సవము, డోలోత్సవము, బహుళ పంచమిన రథోత్సవము కార్యక్రమా లు నిర్వహిస్తారు.

రవాణా సౌకర్యాలు : ధర్మపురి క్షేత్రం హైదరాబాద్‌ నగరానికి సుమారు 230 కిలోమీటర్ల దూరంలో, జిల్లా కేంద్రమైన కరీంనగ ర్‌కు 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హైదరాబాద్‌, కరీంనగర్‌ నుంచి ఈ క్షేత్రానికి బస్సు సౌకర్యం ఉంది. అలాగే ఈ క్షేత్రానికి 40 కిలోమీటర్ల దూరంలో మంచిర్యాల రైల్వే స్టేషన్‌, 130 కిలోమీటర్ల దూరంలో నిజామాబాద్‌ రైల్వే స్టేషన్‌ ఉంది. ఆయా స్టేషన్‌లకు రైళ్ల ద్వారా చేరుకుని అక్కడి నుంచి బస్సు సౌకర్యం ద్వారా ధర్మపురికి చేరుకోవచ్చు.

వెబ్‌సైట్‌లో ఆలయ వివరాలు: ధర్మపురి క్షేత్రానికి సంబంధిం చిన వివరాలను ఆలయ అధికారులు ప్రపం చానికి అందజేయాలనే ఉద్దే శంతో వెబ్‌సైట్‌లో పొందు పరిచారు. డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ.శ్రీలక్ష్మీ నర్సిం హా.ఓఆర్‌జి, డబ్ల్యూడబ్ల్యూ డ బ్ల్యూ.ధర్మపురినర్సింహస్వామి.ఓఆర్‌జి అనే వెబ్‌సైట్‌లో ఆల యానికి సంబంధించిన వివరాలు, ప్రాశస్త్యం గురించి తెలుసుకోవచ్చు.

– ధర్మపురి, మేజర్‌న్యూస్‌

Surya Telugu Daily .

మార్చి 24, 2011 Posted by | భక్తి | వ్యాఖ్యానించండి

నైతిక శక్తి

నైతిక శక్తి

Omప్రస్తుతం ప్రపంచంలో నైతిక విలువల ఆచరణ అన్ని చోట్ల చర్చనీయాంశంగా మారింది. నైతిక విలువలు లోపించినం దున ఎన్నో సమస్యలు, బాధలు ఉత్పన్నమవుతున్నాయని అర్థమవుతున్న ది. జీవితం నిర్మలంగా సద్గుణాలతో నిండుగా ఉండాలి. దివ్యమైన సమా జ స్థాపన జరగాలంటే ప్రతివారికీ నైతిక విలువల ఆచరణ అవసరమనే సందేశం నియమబద్ధం కావాలి. నైతిక శక్తి యొక్క వ్యక్తీకరణలో దివ్య గుణాలు, నైతిక విలువలున్నప్పుడే మానవ జీవితంలో నైతిక శక్తి ఏర్పడుతుంది. ఇందులో శ్రద్ధ ఎంతైనా అవసరం. జ్ఞాన యోగాల ద్వారా శక్తి లభించినట్లే ఈ నైతిక విలువల ద్వారా శక్తి వికసిస్తుంది. ఇది అనేక విధాలుగా వ్యక్తీకరింపబడుతుంది.

విషమ పరిస్థితులేర్పడినప్పుడు నైతిక శక్తి కల వ్యక్తి కంగారుపడి, నిరాశతో ఆత్మగౌరవాన్ని, సిద్ధాంతాలను వదిలి అవినీతిగా ప్రవర్తించడు. అతడు ఆ పరిస్థితుల్లో అవినీతికరమైన ఆలోచనలు, విధానాలు దాటే విషయంలో దృఢంగా ఉంటాడు. కుటుంబంలో పేదరికం, అనారోగ్యం వల్ల తనకు డబ్బు ఎంత అత్యవసరమైనా లంచగొండితనం, మోసం చేసే ఆలోచనలతో నమ్మకద్రహోం, పాపపు సంపాదన చేయడానికి ఇష్టపడడు. అతని నైతిక శక్తి అవినీతి ముందు తలవంచక ఎన్ని కష్టాలు వచ్చినా శక్తివంతంగా, తొణకకుండా ఉంటారు.

నీతి, నియమాలను పాటించే వ్యక్తి ఆత్మిక శక్తి ఉండడం వలన నిశ్చింతగా ఉంటాడు. అతడు అసత్యాన్ని ఆధారం చేసుకోక తన శ్రేష్ఠ కర్మలతో పాటు భగవంతుడే సహాయపడతాడని నమ్ముతాడు. ఈ సత్యాన్ని నమ్మిన అతనికి మనసులో సందేహముండదు. ఒకవేళ ఏ పనిలోనైనా విజయం లభించకపోయినా సద్గుణాల ప్రాప్తి అతనిలో కనిపిస్తుంది. ఆత్మ వెంట వచ్చేది ఈ అవినాశ ప్రాప్తియే. గౌరవాన్ని అమ్ముకున్న వ్యక్తి దగ్గర మిగిలే ది ఏముంది? స్వమాన్యవ, ఆత్మగౌరవాన్ని కోల్పోతే అంతరాత్మ ధిక్కరిస్తుంది. అందుచేత నైతిక విలువలను పాటించే వ్యక్తి సూక్ష్మ ప్రాప్తుల వలన సంతృప్తితో నిశ్చింతగా చక్రవర్తిలా ఉంటాడు.

నైతికంగా అస్థిరత్వం ఉన్న వ్యక్తి ముందు ఎన్నో ప్రలోభాలు ఊరిస్తుంటాయి. అతనికి అంతులేని ధనంతో పాటు, పొగడ్తలు, వెనుకా ముం దు వందిమాగధుల్లా పరుగులు తీసేవారుంటారు. అతనికి బహుమతులిస్తూ అతనికోసం ఏమైనా చేసేందుకు సిద్ధపడతారు. నైతిక విలువలతో నడిచే వ్యక్తి ఆంతరంగిక సుఖాన్ని కలిగి ఉండడం వలన వస్తువు, వైభవాలు, పొగడ్తలపై మోహాన్ని పెంచుకొని సుడిగుండం లో చిక్కుకోక అతీతంగా ఉంటాడు. గొప్ప కార్యం కోసం జనం నుండి స్వీకరిస్తాడే కాని తన దగ్గర దాచుకునేందుకు స్వీకరించాలనుకోడు.

ఈ నైతిక శక్తి కల వ్యక్తి విలువలను కేవలం తాను పాటించడమే కాక ఇతరులు వాటిని పాటించడంలో ఏవైనా సమస్యలు వస్తే వారికి సహాయం చేసి వారిని పరిపక్వం చేస్తాడు. అతడు సాక్షియై ఏ విషయంలోనూ తమా షా చూడక ప్రపంచంలో నైతికతను ప్రోత్సహిస్తూ ఆచరణలో వచ్చేలా చేస్తాడు. ఈ విధంగా నైతిక శక్తిని తన కోసమే కాక ఇతర పీడిత వ్యక్తులకు కూడా వినియోగిస్తాడు. ప్రపం చంలో ఎంతోమంది సన్యాసి వేషం లో అరాచకమైన పనులు చేసేవారున్నారు. తమను తాము గొప్పగా భా వించి నికృష్ట కర్మలు చేస్తారు.

నమ్మకమనే ముసుగులో అపనమ్మకమనే పనులు చేస్తూ ధర్మానికి ప్రతినిధులమనిపించకుంటూ కర్మకాండలు, పూజలు, ప్రార్ధనలు చేయడం తప్ప వారి పనులన్నీ అనర్ధమైనవే. లోపల ఒకరకంగా బయటకు ఒక రకంగా ఉంటూ మాటలకు, చేతలకు పొం తన లేకుండా ఉంటారు. వీరు ప్ర పంచానికి చాలా ప్రమాదకరమైన వారు. అలాంటి వారి వ్యవహారం వల్ల ధర్మానికి ఎదురు దెబ్బ తగలగటమే కాక నైతికతను నమ్ముకున్న వారు కూడా నిరాశ చెంది ధర్మమే పెద్ద మోసమంటారు.

dadi-janakiమరికొందరు భగవంతుడు కూడా వీరిని శిక్షించరా అని బాధపడుతూ ఉంటారు. ధర్మం పేరున మోసాలను చేస్తూ ధనాన్ని జమ చేస్తూ ప్రజాహిత కార్యాలకని చెప్పుకుంటారు. అలాంటి పరిస్థితుల్లో నైతిక శక్తిని పాటించే కొందరు ఇలాంటి వారిని చూసి నోటమాట రాక ఉండిపోతారు. ఆము నైతిక విలువలు పాటించినప్పటికీ కొందరు నైతిక మార్గంలో వారు ప్రయాణిస్తారు కాని అవినీతిని ఎదుర్కోలేరు. ఇలాంటి శక్తి నైతిక శక్తి అవదు. ఇది నైతికంగా ధైర్యం లోపించిన స్థితి. నైతిక శక్తి ఉన్నవారు సింహంలా ధైర్యంగా ఉండి ఎవరి పేరు చెప్పినా భయపడరు.

– దాదీ జానకి
బ్రహ్మకుమారీస్‌ అధినేత్రి

Surya Telugu Daily .

మార్చి 10, 2011 Posted by | భక్తి | | వ్యాఖ్యానించండి

పంచ నారసింహ క్షేత్రాలలో విశిష్ఠం యాదగిరి గుట్ట

పంచ నారసింహ క్షేత్రాలలో విశిష్ఠం యాదగిరి గుట్ట

temp-colorతెలంగాణలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ూదగిరిగుట్ట ఒకటి. ఇది పురాతన విష్ణు క్షేత్రం శ్రీమహావిష్ణువు ఈ క్షేత్రంలో లక్ష్మీనర్సింహ్మాస్వామి వెలసి ఉన్నాడు. స్వామి ఆవిర్భావ కాలం పురాణల నుండి గ్రహించవచ్చు. అధునిక చర్రితకారుల వూహకు అందనిది. ఈక్షేత్రం హైదారాబాద్‌ వరంగల్‌ రోడ్డులో హైదరాబాద్‌కు 60 కిలోమీటర్లదూరంలో ఉన్నది. సికింద్రబాద్‌, వరంగల్‌ రైల్వే లైన్‌ మీద ఉన్న భువనగిరికి రాయగిరి మీదుగా 6మైళ్ల రోడ్డు మార్గం కలదు. దేశంలో వందకు పైగా నర్సింహ్మా క్షేత్రాలు ఉన్నాయి. వాటిలో సింహచలం,ఆహోబిలం,మంగళగిరి, వేదాద్రి, యాదగిరిక్షేత్రాలు ప్రసిద్దమైనవి.యాదగిరిగుట్ట క్షేత్రంలో గుహాలయం, విష్ణుతుండం,గోపురచ్రం మహామహిమానిత్వలు అవడం ఈక్షేత్రానికి అత్యంత ప్రాశస్త్యాన్ని చేకూర్చింది. క్షేత్ర పాలకుడు ఆంజనేయస్వామి.

చారిత్రక ధృవీకరణ…..
ూదగిరి క్షేత్రం పురాతనమైనదే విషయాన్ని చారిత్రాక ఆధారాలు ధృవీకరిస్తున్నాయి.క్రీస్తుశకం 12వ శతాబ్దం వరకు మునులకు,యోగులకు మాత్రమే దర్శనీయమైఉన్న యాదగిరి సామాన్య మానవులకు అందుబాటులో ఉండేది కాదు. ఈక్షేత్ర మహత్యం తెలిసిన వారు కూడా తక్కువే.12వ శతాబ్ధిలో రాజమహేంద్రవరం రాజాధానిగా చేసుకొని ఆంధ్ర ప్రాంతాన్ని పశ్చిమచాళుక్యులు పరిపాలిస్తుండేవారు.1148 సంవత్సరంలో త్రిభువనమల్లుడు అనే పశ్చిమచాళుక్యరాజు రాజ్యవిస్తరణకై తెలంగాణ ప్రాంతాలో ఉన్న రాజ్యాలను జయిస్తూ ఇక్కడి భువనగిరి ప్రాంతానికి వచ్చాడు.ఈ విశాలమైన ఏకశిలను చూసి ముగ్ధుడయ్యాడు.

devuduచుట్టూ వాతావరణం కూడా అతనికి నచ్చడంతో భువనగిరి ఏకశిల మీద కోటను నిర్మించుకున్నాడు. కాని అందులో ఉంటున్న సమయంలో పృధ్వివల్లుల ఒక గుజరాతి భూవల్లభునితో వైరం ఏర్పడింది. ఇతనికి జయం సుసాధ్యమైంది. జగదేవుడు అనే మంత్రి సలహాలను పాటించి విభువనవల్లభుడు యాదగిరిక్షేత్రం దర్శించి శ్రీలక్ష్మీనర్సింహస్వామిని ఆరాధించాడు. స్వామి ప్రసన్నడై అతనికి విజయం చేకూర్చాడు. అతని పేరు మీద ఈఏకశిలకు భువనగిరి అని పేరు పెట్టారు.

ammavaruఅనంతరం దాని చుట్టూ ఏర్పడిన పట్టణానికి కూడా భువనగిరి పేరు స్థిరపడింది. విభువనమల్లుడు యాదగిరి లక్ష్మీనర్సింహ్మాస్వామిని సేవించి జయం పొందడంతో యాదగిరిక్షేత్ర మహత్యం కూడా బాహ్యప్రపంచానికి తెలిసింది. యాదగిరికి భువనగిరి పది కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇప్పటికి నాలుగు వందల సంవత్సరాలకు పూర్వం శ్రీకృష్ణదేవరాయలు ఆంధ్రదేశాన్ని లోబర్చుకొని గోలుకొండకు వచ్చాడు. సమీపంలో ఉన్న యాదగిరి నర్సింహస్వామి మహత్యంను విని సతీసమేతంగా స్వామిని దర్శనం చేసుకున్నట్లు చారిత్రక ఆధారాలు చెప్తున్నాయి.

ఆలయ ప్రాకారాల నిర్మాణం……
యాదగిరి ప్రాంతమంతా సామాన్యులు చొరబడలేని ఆరణ్యప్రాంతం కావడంతో ఇటీవల వరకు అనగా 19వ శతాబ్దం వరకు స్వామికి నిత్యధూపదీప నైవేద్యాలు జరిగే అవకా శం లేకపోయింది. శ్రీకృష్ణదేవరాయలు దర్శించుకొని వెళ్లిన తర్వాత కూడా చాలా కాలం వరకు దుర్గమమై ఉన్నందున ఈక్షేత్రాన్ని ప్రజలు మరచిపోయే వరకు వచ్చింది. కాగా సుమారు రెండు వందల సంవత్సరాల క్రిందట ఈ ప్రాంతంలో ఒక గ్రామ పెద్ద స్వామి వారు లలో కనిపించి యాదగిరిలో విష్ణుకుండం సమీపంలో ఒక గృహంలో ఉంటానని చెప్పి ఆదృశ్యమయ్యాడు.

yagnamగ్రామాధికారి ఆగమశాస్త్ర విధులను తెలిపిన వైష్ణవ పండితులను, అర్చకులను రప్పించి స్వామికి నిత్యం అభిషేకం, పూజ, దీపారాధన, నైవేద్యం తదితర ఉపచారాలు జరిపేందుకు నియమాకాలు చేశాడు. ఈ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు గుల్లపల్లి రామభట్టును నియమించాడు. వారి సంతతి వారే వంశపరపరంగా ఈక్షేత్రాన్ని అంటి పెట్టుకొని సేవలు చేస్తున్నారు.

భక్తుల రాక యేటే టా పెరగడంతో ఈక్షేత్రం తెలంగాణ తిరుపతిగా వాసికెక్కింది. ఇదిలా ఉండగా హైదరబాద్‌ వాస్తవ్యుడైన రాజామోతీలాల్‌ యాదగిరి లక్ష్మీనర్సింహ్మస్వామి వైభవం విని స్వామి వారిని దర్శించాడు. స్వామి వారికి ఆలయనిర్మాణం చేయించాడు. ప్రాకారం, గోపుర ద్వారం, ముఖమండపం నిర్మించాడు. ఆ తర్వాత భక్తులు తమ యాత్ర సందర్భాల్లో పలు సౌకర్యాలు ఏర్పరుచుతూ వచ్చారు. ప్రస్తుతం ఈక్షేత్ర యాజమాన్యం దే వాదయ శాఖ ఆధ్వర్యంలో ఉంది. మంచినీటి వసతితోపాటు ఆధునిక వసతులతో యా దగిరిలక్ష్మీనర్సింహ క్షేత్రం జనాకర్షకమై భక్తుల కొంగుబంగారమై విరాజిల్లుతున్నది.

నైజాం ప్రభువుల కృషి
temp-ayyavaruరెండవ తిరుపతిగా రాష్ట్ర ప్రజలు ఆరాధ్యదైవంగా కొలువబడుతున్న శ్రీలక్ష్మీనర్సింహ స్వామి దేవస్థానానికి మొదటి చైర్మన్‌ను నైజాం ప్రభుత్వం నియమించింది. 1937కు పూర్వం నైజాం ప్రభువు తమ తహసీల్దార్‌ రాజారిని చైర్మన్‌గా నియమించడంతో ఆల య అభివృద్ధికి కృషి ప్రారంభమైంది. అంతకు పూర్వం నుంచే శేషచార్యులు ఈ ఆల య పూజారిగా వ్యవహరించారు. ఆయనే క్షేత్రప్రచారకుడిగా ఎంతో పాటుపడ్డాడు. రాజారి తర్వాత భువనగిరికి చెందిన రామ్‌దయాల్‌, నైజాం ప్రభుత్వం సభ సభ్యుడిగా వ్యవహరించిన యాదగిరివాస్తవ్యుడు రామారావులు చైర్మన్‌గా కొనసాగారు.

రామారావు హయంలో పూజారి శేషచార్యులతో వాగ్వివాదం జరిగింది. ఇది చిలికిచిలికి గాలివానైంది. రాయగిరిలో పౌరోహిత పనిచేస్తున్న ఆనంతయ్యను ఆలయ పూజారిగా చేశా రు. ఆనంతయ్య కుమార్తె రాధాభామయ్య దేవస్థాన హక్కుదారుగా మారారు. ఆయవార్ల నుండి బ్రహ్మణులకు వశంపరపర్యహక్కు మారింది. రామారావు తర్వాత హనుమంతరావు, బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వ హయంలో మందమాల నర్సింహ్మారావు తర్వాత పన్నాలాల్‌ కొనసాగారు. రాష్ట్ర దేవాదాయ చట్టాన్ని రూపొందించాక రాధాభామయ్యను వశంపరపర్య హక్కుదారుగా గుర్తించారు.

temp-devoteeనాటి నుండి నేటి వరకు ఆమె వంశీయులే వంశపరపర్య హక్కుదారుగా కొనసాగుతున్నారు. స్వాతంత్య్రం రాకపూర్వం ఆలయ ప్రాకారం నిర్మితం కాగా సుమారు 1940వ సంవత్సరంలో నిర్మితమైన ఘాట్‌రోడ్డును అప్పటి నైజాం ప్రభుత్వం వజీర్‌యాజం హైదరీ ప్రారంభించాడు. ఆయన కుటుంబ సమేతంగా వచ్చి స్వామిని దర్శించి పూజలు జరిపించారు. ప్రైవేట్‌ సంస్థగా కొనసాగిన దేవస్థానం కొండల్‌రావు, బసవయ్యల హయంలో ఎంతో అభివృద్ధి చెందింది. 1966లో దేవాదయ, ధర్మాదయ చట్టంతో ధర్మాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో దేవాలయంగా కొనసాగుతుంది. ఏటేటా పెరుగుతున్న భక్తులతో గుట్ట వార్షిక ఆదాయం 4నుండి 6కోట్లకు చేరుకుంది.

వార్షిక బ్రహ్మోత్సవాలు…
శ్రీ యాదగిరిగుట్ట వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రతిఏటా ఫాల్గుణశుద్ధ విదియ నుంచి మొదలై ద్వాదశి వరకు పది రోజుల పాటు కన్నుల పండవగా కొనసాగుతాయి. ఈ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని విశేష అలంకారాలు, సేవలు నిర్వహిస్తారు. పది రోజుల పాటు జరిగే బ్రహ్మో త్సవాలలో ఎదుర్కోళ్ళు, కళ్యాణం, రథోత్సవం ముఖ్యమైనవి. ఈ నెల 7 నుంచి ప్రారంభమైన వార్షిక బ్రహ్మోత్సవాలు 17 వరకు కొనసాగుతాయి. బ్రహ్మాత్సవాలలో భాగంగా స్వామి జగన్మో హిని రామ, కృష్ణ, నరసింహ అవతరాలలో భక్తులకు దర్శనమిస్తారు.

devudu-godఉదయం పూట అలంకా రాలు, సాయంత్రం పూట సేవలు నిర్వహిస్తారు. బ్రహ్మాత్సవాలను పురస్కరించుకొని స్వామి వారికి కేశవాహాన సేవ, అన్నవాహాన సేవ, కల్పవృక్షం, గరుడసేవ, అశ్వవాహాన సేవలు ఘనం గా నిర్వహిస్తారు. ఈ సేవల సందర్భంగా స్వామి అమ్మవారులను పట్టుపీతాంబరాలు, వివిధ బంగారు ఆభరణాలు , పూలతో శోభాయామానంగా అలంకరించి పుర వీధులలో ఊరేగిస్తారు. ఆధ్యాత్మిక భావన వెల్లివిరిసేందుకు 75 మంది రుత్వికులతో రామాయణం, మహాభారతం, భాగ వతం, విష్ణుసహాస్రనామాలు, సుందరకాండ పారాయణాలు చేస్తారు. ఈ నెల 13 ఎదుర్కోళ్ళు, 14 కళ్యాణం, 15 రథోత్సవాల సందర్భంగా లక్షలాది భక్తులు తరలి వచ్చే అవకాశం ఉన్నందున అధికారులు భక్తులకు ఎలాంటి అసౌకర్యా లు కలుగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
– మేజర్‌న్యూస్‌ ప్రతినిధి, నల్లగొండ

Surya Telugu Daily .

మార్చి 10, 2011 Posted by | భక్తి | , | వ్యాఖ్యానించండి

శివోహం.. శివోహం..!

శివోహం.. శివోహం..!

shivaవేదాలు ఇతిహాస పురాణాలలో ముఖ్యమైనవి. ఋగ్వేదం చాలా గొప్పది. ఇందులో ఉన్నటువంటి రుద్రం ఇంకా గొప్పది. పంచాక్షరీలోని శివ అనే రెండక్షరాలు మరీ గొప్పవి. శివ అంటే మంగళ మని అర్థం.పరమ మంగళకరమైనది శివ స్వరూపం.ఆ పరమ శివుని అనుగ్రహం పొందటా నికి మనం జరుపుకునే ముఖ్యమైన పండుగ మహా శివరాత్రి. పురాణాల లో చెప్పినటువంటి ఈ మహాశివరాత్రిని ప్రతి సంవత్సరం మాఘ మాసం కృష్ణ పక్షంలో చతుర్థశినాడు జరుపుకుంటాం.

లింగోద్భవ కాలం ప్రకారం జన్మాష్టమి నుంచి 180 రోజులు లెక్కిస్తే శివ రాత్రి వస్తుంది. రూపరహితుడైన శివుడు, జ్యోతి రూపంలో, లింగా కారం గా అవిర్భవించిన సమయం కనుక శివరాత్రిని లింగోద్భవకాలం అం టారు. ఈ పరమేశ్వరుడి 64 స్వరూపాలలో లింగోద్భవమూర్తి చాలా ము ఖ్యమైనది. అర్థరాత్రి పన్నెండు గంటలకు లింగోద్భవ సమయమని పురా ణాలలో చెప్పారు. ఋగ్వేదం ప్రకారం భక్తజనులు ఆరోజు నిద్ర పోకుం డా మేల్కొని ఉపవాసముండి, మహాలింగ దర్శనం చేస్తారు. ఉపవాస దీక్ష స్త్రీలు, పురుషులు కూడా ఆచరించదగినదే. ప్రపంచమంతా శివ శక్త్యా త్మనమని తెలుసుకోవాలి. శివలింగానికి ప్రణవానికి సామ్యమున్నదం టారు.

ఆ పంధాలో చూస్తే ఈ శివలింగం ఆరు విధాలు ఇలా ఒక్కొక్క వి ధానంలో ఆరేసి లింగాలు ద్వివిదా ద్వాదశలింగాలుగా చెప్పబడుతున్నప్ప టికీ, శివాగమాలరీత్యా మాత్రం ఆచార గర్వాది లింగాలే సరియైనవి కనుక ఈ ఆరులింగాలనే అనుదినం ఆరాధించాలి. పరమశివు డు శివరాత్రి పర్వదినమున ఎన్నో విధాలుగా ఆలంకరింపబడతాడు. ఆ స్వరూపాలలో విభూతిధారణ ఒకటి. విభూతి అంటే ఐశ్వర్యం. అది అగ్నిలో కాలిన శు ద్ధమైన వస్తువు. ఈశ్వరుడు ఒంటి నిండా విభూతి అద్దుకుంటాడు. రెండ వది రుద్రాక్ష. రుద్రాక్ష అంటే శివుని మూడవ కన్ను. అందరు దేవతలలో ఫాల భాగంలో కన్ను గలవాడు ఆయన ఒక్కడే.

మూడవది పంచాక్షరి జపం. పంచాక్షరీ మంత్రోపదేశం లేని వారు శివ నామాం జపిస్తే చాలు. నాలుగవది మారేడు దళాలతో శివున్ని పూజించడం. శివునికి మూడు దళాలుంటాయి. అయిదవది అంతరంగంలో శివ స్వరూపాన్ని ఎల్లవేళలా స్మరిస్తూ ఉండాలి. శివరాత్రి రోజున సాయంకాల సమయాన్ని ప్రదోషం అంటారు.త్రయోదశి వాటి సంధ్యాకాలం మహా ప్రదోషం. ప్రదోష సమ యంలో శివస్మరణ, శివదర్శనం విధిగా చెయ్యాలి. వేదాలన్నింటకీి తాత్పర్యం ఓంకారం. ఆ ఓంకార స్వరూపమే పరమేశ్వ రుడు. ‘శివ’ శబ్దాన్ని దీర్ఘంతీస్తే ‘శివా’ ఆవుతుంది. అది అమ్మవారి పేరు ఈ స్వరూప ధ్యేయమే జగత్తుకు తల్లిదండ్రులు. పార్వతీపరమేశ్వరులు, సూర్యుడు, అగ్ని ఈ మూడిం టిలోను శివుడుంటాడు. పరమ శాంతినిచ్చే ది శివనామస్మరణమే. శివస్మరణకు అందరూ అర్హలే. పరమ శివునికి చాలా ప్రీతికరమైనటువంటి తిధి నక్షత్రాలలో ఏకాదశి. ఈ తిధి నెలలో రెండుసార్లు వస్తుంది.

srisailamప్రతిమాసము ఏకాదశినాడు, శివుడు ఉపవాసాలతో వుండేవాడని, వేద పురాణాలలో చెప్పడం జరిగింది.అలాంటి ఏకాదశినాడు ప్రతి మానవుడు ఉపవాసము ఉండుటం వలన మహాశివరాత్రి రోజున కలిగేటటువంటి ఫలితాన్ని పొందు తారని, విభూతి, రుద్రాక్ష మహిమవలన మనకు సకల కోరికలు నెరవేరుతాయని పార్వతీదేశి కఠోరమైన తపస్సు ద్వారా తెలిపింది.ఆసమయంలోనే రాజమందిరంలో ిహమవంతుని కల్పిన సప్తఋషూలు పార్వతీపరమేశ్వరుల వివాహం లోక శుభకరమవుతుంద ని, వారి దాంపత్యం ముల్లోకాలకు ఆదర్శప్రాయమవుతుందని పలికి సం బంధం నిశ్చయించిన హిమవంతుని ప్రార్థన మేరకు వివాహ ముహూ ర్తాన్ని కూడా నిర్ణయించారు. ఆ సమయములో మొదటి మఘమాసంలో బహుళ చతుర్థశినాడు తొలిసారిగా లింగోద్భవం జరిగింది.

దానినే మహా శివరాత్రిగా లోకులు భావించారు.ఆపుణ్య తిధినాడే పార్వతీపరమేశ్వరుల కల్యాణము జరిపించుటకు శుభముహుర్తంగా నిర్ణయించారు. ఈ జగత్తు దేనిలో సంచరించ దేనిలో లయం చెందుతుందో అదే లింగము. దీని మొదలు ఏదో చెప్పడానికి వీలుకాదు. కనుక అద్యంతాలు లేనిదే లింగము.లింగతత్వమే…. ఆత్మ…కనుక ప్రతిదేహమందు ఆత్మ అనే లింగము ఉంటున్నది. ఆ లింగస్వరూపుడే శివుడు. ఆ సత్యమును చాటడానికే ఆ పరబ్రహ్మ తొలుత లింగరూపుడై ఉదర్భవించి బ్రహ్మ విష్ణువులుకు దర్శనవిచ్చాడు… ఆనంత లింగాకారుడై ముల్లోకాలలోను వెలసి నిత్యాభిషేక అర్చనలు అందుకున్నారు.

అలంకార రహితంగా ఉండడంలోని నిగూఢత్వం
ఈశ్వరుడు అభిషేక ప్రియుడు. పుష్ప స్వర్ణాభరణాలంకారాలతో పరమే శునికి పని లేదు. ఈ అనంతవిశ్వంలో ఏ అలంకరణలు, ఏ అభరణాలు శాశ్వతం కావు. బాహ్య సౌందర్యం పరమావధి కానేకాదు. జీర్ణించుకు పోయే బాహ్య దేహానికి ముఖ్యత్వం ఇవ్వడం అవివేకం. శాశ్వతంగా ఏ మార్పులేకుండా చిరస్థాయిగా నిలిచివుండేది. ఆత్మ ఒక్కటే. అలాంటి మ హోన్నత ఆత్మను మనం సదా గౌరవించి నిర్మలంగా ఉంచుకోవడమే ముక్తిని పొందే మార్గం. ఈ నిగూఢ నిర్మల తత్త్వాన్ని మనకు అవగతం చేసేందుకు అద్యంతరహితుడైన పార్వతీశుడు ఏ అలంకరణలూ లేకుం డా అతి నిరాడంబరంగా దిగంబరుడుగా లోకాన నిలిచాడు.

శివశక్తుల మహిమను ప్రభావితం చేసే నామం..
శైవనామాన్ని ధరించేవారు మధ్య రేఖ మద్యలో చందనమూ, కుంకుమ మిశ్రమంలో కూడిన వృత్తాకార రూపాన్ని తప్పక ధరించాలి. వర్థి విభూతి రేఖలవలన శైవ కృపకు మాత్రమే పాత్రులు అవుతారు.అలాకాక మధ్య లో వృత్తాన్ని ధరించడం వల్ల ఆ శివుని పత్నియైన పార్వతీమాత కటాక్షాన్ని కూడా పొందవచ్చు.దేహంలోని మిగిలిన అంగాలపైన మూడు విభూతి రేఖలు మాత్రమే దిద్దుకొవాలి. జప తప ధ్యానాదుల ద్వారా మూలాధార చక్రంలో మేల్కొన్న కుండలిని శక్తి ‘ఇలాపింగళ’ నాడులు (సుషూమ్నా) కలయిక ప్రదేశంలో చేరుకొన్నపడు దానిలోని శక్తిప్రసారం ‘భృకుటి’ (రెండు కనుబొమ్మలు బయటకు రావడానికి ప్రయత్నించే ప్రదేశంలో శివుని త్రిశూలమైన రక్షిణిని తెల్లని వర్ణంలో దిద్దుకుంటారు.

ఈ త్రిశూ లంలోని మధ్యమొనను (గీతను) ఎరుపులో దిద్దుకోవడం వెనుక ఒక రహస్యమున్నది. శక్తిని (ఇది తపము, జపము, ధ్యానముల వల్ల కల్గినది) ఎరుపు వర్ణముతో సూచిస్తారు. కుండలిని శక్తి వర్ణం కూడా ఎరుపే అవ్వడంవలన మధ్య రేఖను తప్పనిసరిగా ఎరుపు రంగులో దిద్దుకుం టారు. నిగూఢంలో పరిశీలిస్తే వైష్ణవనామం, శైవనామం ఈశ్వరుని ఆ యుధాల కలయిక అని సుస్పష్టమౌతుంది. అందువల్లనే ‘శివాయ విష్ణూ రూపాయ! విష్ణూ రూపాయ శివహే’ అన్నారు.

ప్రదక్షణ విధులు…
శివాలయములో ప్రవేశించిన తర్వాత నందికి ఏ ప్రక్కనుంచి లోపలకు వెళ్తారో ఆ ప్రక్కనుంచి మాత్రమే, వెనక్కి రావాలి. శివలింగం, నందీశ్వ రుల మధ్య నుంచి రాకూడదు. ఇలావచ్చినా పుణ్యం రాదు సరి కదా పూర్వ జన్మలోని పుణ్యం కూడా పోతుంది.

గంగను భరించడంలో అంతరార్థం
ఈ భూమండలంలో గంగానదికి ఎంతో ప్రత్యేకత ఉంది. పలు కార్యాలు దిగ్విజయం చేసిన గంగానది యుగాలందు కలిగిన మార్పులలో ఒకసారి గౌతమమహర్షి పాపనివృత్తికై గోభస్మం నుండి ప్రవహించి గోదావరిగా మానవాళికి ఉపయోగకారిగా, వునీతులను చేస్తోంది. ఇలా గోదావరిగా భూలోకానికి వచ్చింది.ఆ సమయంలోనే ఆమె ప్రవాహం ఆపడానికి తన జటాఝాటంలో ముడివేసాడు గౌరీశుడు.అనేకానేక కార్యాలను నిర్వ హించిన ఘనత నదులలో గంగానదికి తప్ప మరే ఇతర నదులకు లేదు.

అనేక అంశరూపాంశాలను పొంది ఒకదానికొకటి పొంతన లేని అనేక కా ర్యాలను సాగించిన గంగ, సరాసరి మానవాళి విషయంలో చంచలమైన మనసు వంటిది.. మనస్సు అడ్డూ ఆపు మరచి నియమం హద్దు దాటి ప్ర వహించే గంగా ప్రవాహంతో పోల్చుకుంటే, వేగాన్ని కట్టడి చేసేందుకే పరమేశుడు తన జటాఝాటంలో బంధించి వేగాన్ని నియంత్రించి లోకా లను హద్దులేని గంగా ప్రవాహం నుండి సంరక్షించాడు.అంటే మనస్సు వేగాన్ని మనం కూడా సరైన రీతిలో సంరక్షించకపోతే అదుపు లేక గతి తప్పి మనస్సు మనలను ముంచేస్తుందన్న నిగూడార్థం.

చంద్రుని పొందడంలో అంతర్యం
ఈశ్వరుడు చంద్రశేఖరుడుగా మారిన కారణం మనకు విదితమే. తనకు కలిగిన పాప ప్రక్షాళన నిమిత్తం చంద్రుడు చేసిన తప: ప్రభావాన పరమేశుడు చంద్రుడిని ధరించి చంధ్రశేఖరుడయ్యాడు. పార్వతీశుని త్రినేత్రం అగ్నితో సమానం. సూర్య తేజస్సు కంటే అమిత తేజోమయం. సూర్యచంద్రులే ప్రపంచ ఉనికికి మూలం.మానవ జీవనాధారం. అలా ప్రగతికి, మనుగడకు, విశ్వానికి మూలాధారమైన సూర్య చంద్రులను తాను పొందడం ద్వారా ఈ సృష్టి తనలోనే నిక్షిప్తమై ఉన్నదనీ, ఈ సృష్టికి తానే మూలమనీ, అద్యంతాలు, మూలాధారం తానే అనీ సుస్పష్టం చేస్తున్నాడు శంకరుడు.

బిల్వ దళం ప్రాముఖ్యత:
బిల్వం లేదా మారేడు దళం అంటే శివుడికి మహా ఇష్టం. బిల్వ దళం మూడు అకుల్ని కలిగి ఉంటుంది.ఇందులో కుడి ఎడమలు విష్ణు, బ్రహ్మలైతే మధ్యలో ఉండేది శివుడు. మారేడుకే శి వప్రియ అని మరోపేరు ఉంది. బిల్వదళం పొరబాటున కాలికి తగిలితే ఆయష్షు క్షీణిస్తుందంటారు. ఇది శివుడి అజ్ఞ.బిల్వం ఇంటి అవ రణం లోని ఈశాన్యంలో ఉంటే ఐశ్వర్యం. తుర్పున ఉంటే సౌఖ్యం. పశ్చి మాన ఉంటే సంతానాభివృద్ధి. దక్షినాన ఆపదల నివారణ. వసంతం, గ్రీష్మంలో బిల్వంతో శివున్ని పూజిస్తే అనంతకోటి గోదాన ఫలితం కలుగుతుంది.

నంది దర్శనం
nandiనందీశ్వరుని ప్రార్థించిన తర్వాతే శివ దర్శనానికి వేళ్ళాలి.నందీశ్వరుని అనుమతి లేనిదే శివపూజ చేయకూడదు. అలా చేస్తే ఫలితం శూన్యం. ‘‘నందీశ్వర సమస్తుభ్యం శాంతా నంద ప్రదాయకం! మహాదేవసేవార్థం అనుజ్ఞాందాతుమర్హసి’’ అని ప్రార్థించి ఆయన కొమ్ముల మధ్యనుండి శివలింగాన్ని చూస్తూ ‘‘ఓంహర, ఓంహర’’ అంటూ ప్రార్థిస్తే ఏడుకోట్ల మహామంత్రాలను జపించిన ఫలాన్ని పొందుతారు. యువతులు అపస వ్యంగా, బ్రహ్మచారులు సవ్యంగాను, గృహస్థులు సవ్యాపసవ్యములుగాను శివప్రదక్షిణం, ‘‘చండీ’’ ప్రదక్షిణం చేయాలి. శివునికి ప్రదిణం చేసేటప్పుడు సోమసూత్రం దాటరాదు. చండి ప్రదక్షిణము ఒకసారి చేస్తే 30 వేల సార్లు ప్రదక్షణ చేసిన ఫలము వచ్చును.

ద్వాదశ జోతిర్లింగాలు…
శ్రీ సోమనాధేశ్వర జ్యోతిర్లింగం….

లభ్యమైన ఆధారాలను బట్టి ఈ జ్యోతిర్లింగాలయం క్రీపూ. 200 సం.రాల నాటిది. 20వ శాతాబ్దం వరకు ఎన్నో యుద్ధబీభత్సాలకు గురైనా 1957లో పున:ప్రాణ ప్రతిష్ఠను పొందింది.
శ్రీశైలమల్లిఖార్జున జ్యోతిర్లింగం ….
ఏ శిఖర రూపంలో పర్వతుడు అవతరించాడో ఆ శిఖర మీదే తపస్సు చేస్తున ఒక్కానొక భక్తురాలుకు శివసాక్షాత్కరం కలిగిన ఆచోటు తన పేరుతో నిలవాలని కోరడం వల్లన ఆ శిఖరం శ్రీశైలంగా పేరొందింది. మూడో శతాబ్దం నుండి ఈ క్షేత్రం ఉనికి కనిపిస్తుంది.
శ్రీ మహాకాళేశ్వర జ్యోతిర్లింగం ….
ఉజ్జయినిలో ఈ లింగంవుంది. చైనా యాత్రికుడయిన హ్యుయాన్‌ త్సాంగ్‌ తన పర్యటన గ్రంధంలో ఈ క్షేత్రం గూర్చి చక్కగా వర్ణించారు.
శ్రీ ఓంకారేశ్వర జ్యోతిర్లింగం …..
చారిత్రక ఆధారమంటూ ఈక్షేత్రం గూర్చి ఏమీ లేదు. ‘మాంధాత’ చేసిన తపస్సు ఫలి తంగా ఓంకారేశ్వడు అవిర్భవించాడు.
శ్రీ వైద్యనాథేశ్వరలింగం ….
మహా బలేశ్వరలింగమే వైద్యనాధేశ్వర లింగంగా ప్రసిద్ది చెందింది లంకేశ్వరుడైన రావణునికోరిక మేరకు సాంబ శివుడు ఈ ఆత్మలింగంను ప్రసాదించాడు.
శ్రీ భీమ శంకర జ్యోతిర్లింగం ….
భీముడు వల్ల వివత్తును తొలిగించి నందువల్ల ఆ జ్యోతిర్లింగం ప్రసిద్ధిచెందింది. దీనికి ఉపలింగం భీమేశ్వరలింగం.
శ్రీ నాగేశ్వర జ్యోతిర్లింగం ….
తనని ఆరాధించిన వారికి సర్వ కష్టాలను నివారించి ప్రతిజ్ఞా పూర్వకంగా చెప్పి శివుడు జ్యోతిర్లింగంలోకి నాగేశ్వరుడుగా కలిసి పోతాడు. ఆ జ్యోతిర్లింగమే నాగేశ్వర జ్యోతిర్లింగము.
శ్రీ విశ్వేశ్వర జ్యోతిర్లింగం ….
వైశ్రమణుని ఘోర తపస్సు వల్ల శివుడు లింగరూపంలో వెలసి ముక్తిని ప్రసాదిస్తాడు. ఆలింగమే విశ్వేశ్వర లింగం.
శ్రీ త్రియంబకేశ్వర జ్యోతిర్లింగం ….
శివుడు మూర్తిమంతమై విష్ణువు, బ్రహ్మలకు జ్ఞాన బోధచేయగా త్రిమూర్తులు ఏకమైన లింగంగా శ్రీత్రియంబకేశ్వర జ్యోతిర్లింగం వెలసింది.
శ్రీ కేదారేశ్వర జ్యోతిర్లింగం …
ధర్ముడనే మునికి నరనారాయణలనే పేరిట విష్ణూవు ఇద్దరు పుత్రులుగా జన్మిస్తాడు. ఆ ఇద్దరి కోరిక మేరకు శివుడు బదరీ వనంలో ఈ లింగరూపంలో వెలిసాడు.
శ్రీ రామేశ్వర జ్యోతిర్లింగం ….
శ్రీరామాధిత దైవతలింగం గనుక ఆ జ్యోతిర్లింగమే శ్రీరామేశ్వర లింగంగా పేరు పొందింది.
శ్రీ ఘృశ్నేశ్వర జ్యోతిర్లింగం …
ఘ్నశ్నే అనే భక్తురాలు కోరిక మేరకు శివుడు ఈ జ్యోతిర్లింగంగా వెలిసాడు. సంతాన నష్టం, అకాల మరణం నుండి ఈ లింగం తప్పిస్తుందని చెపుతారు.

శివరాత్రులు ఎన్ని?
kedareswarశివరాత్రి వైదిక కాలం నాటి పండుగ. ఏడాదిలో వచ్చే శివరాత్రులు మొ త్తం అయిదు. అవి : నిత్య శివరాత్రి, పక్ష శివరాత్రి మాస శివరాత్రి, మ హాశివరాత్రి, యోగ శివరాత్రి. వీటిలో పరమేశ్వరుడి పర్వదినం మహా శివరాత్రి. మార్గశిరమాసంలో బహుళ చతుర్థి, అర్ద్ర నక్షత్రం రోజున శివుడు లింగోద్భవం జరిగింది.శివునికి అతి ఇష్టమైన తిథి అది. అందుకే ఈరోజున శివుడ్ని లింగాత్మకంగా ఆరాధించిన వారెవరైనా సరై పురుషోత్త ముడవుతాడని పురాణాల మాట.ఈ రోజున శివ ప్రతిష్ట చేసినా లేక శివ కళ్యాణం చేసినా ఎంతో శ్రేష్టం. మహాశివరాత్రి రోజు తనను పూజిస్తే తన కుమారుడైన కుమారస్వామి కన్నా ఇష్టులవుతారని శివుడు చెప్పడాన్ని బట్టి ఈ విశిష్టత ఏంతో అర్థం చేసుకోవచ్చు. త్రయోదశినాడు ఒంటిపొ ద్దు ఉండి చతుర్థశినాడు ఉపవాసం ఉండాలి. అష్టమి సోమవా రంతో కూ డి వచ్చే కృష్ణ చతుర్థశి నాటి మహాశివరాత్రి మరింత శ్రేష్టమైందంటారు.

భస్మధారణలోని అంతరార్థం:
ఎంతో నిగూఢత్వం నిండివున్న భస్మా న్ని మరే ఇతర దేవుడుగాక పరమశివుడే ధరించడంలో అంతరార్థం ఏమి టో, మరే ఇతర దైవాలు ఎందుక భస్మాన్ని ధరించరో, శంకరుడే ధరించడానకి గల కారణం ఏమిటో చెప్పే కథ ఒకటుంది. మహర్షి ఆశ్ర మానికి సద్బ్రాహ్మణుడి వేషంలో తరలి వచ్చాడు పార్వతీశుడు. సాటి బ్రహ్మణుడిని చూడగానే ఘనంగా స్వాగతం పలికి అతిథిమర్యాదలు చేసాడు మహర్షి. మర్యాదలన్నీ పొందిన పిదప బ్రహ్మణ వేషధారియైన గంగేశుడు మహర్షిని ఉద్దేశించి ‘‘మహర్షి ! అతిథి సత్కారాలు సంపూ ర్ణం గా తెలిసిన నీకు విజయోస్తు ! నీవంటి జ్ఞానసంపన్నుడు, తపోధీరుడు సుఖదు:ఖాలకు అతీతుడైన ఉండాలి. సంతోషాలను ఆవేకావేశాలను అదుపులో ఉంచుకోవాలి.

కానీ నీవు ఏ విషయమో పదేపదే స్మరించు కుంటూ మహా సంబర పడుతున్నావు. నీ అంతటి అమిత తపోధీరుడిని సైతం మాయ చేసి ఇంతగా సంతోషపెట్టి ఉబ్బితబ్బిబ్బు చేస్తున్న సంగతే మిటోనే తెలుసుకోవచ్చునా?’’ అని అడిగాడు. అంతవరకు తనలోనే దాచుకున్న సంతోషాన్ని పంచుకునేందుకు ఒకరు వచ్చినందుకు మహర్షి ఎంతగానో సంబరపడుతూ ‘‘ఓ సాధుపుంగవా! నా అమితానందానికి కారణం నువ్వు తెలుసుకుంటే ఎంతటి తప: స్సంపన్నుడైనా దైవాంశ సంఘటనలకు సంతోష పడడం సహజమేనని తెలుసుకుంటావు. నా చేతి వ్రేలు గాయపడినపుడు గాయం నుండి రక్తానికి బదులు,పరిమళ భరిత ద్రావకం వెలువడుతోంది.

అంటే నా తపస్సుకు పరంథాముడు అంగీక రించినట్లే కదా! ఇంతకంటే ఆనందకారకం ఏం కావాలి’’ అంటూ వివ రించాడు. పరమశివుడు మహర్షి అజ్ఞానానికి నవ్వుతూ ‘‘మహర్షీ ! నీ అ మాయకత్వానికి ఎంతో దిగులుగా ఉంది. ఈ శరీరం, సకల జీవరాశు లు, సమస్త ప్రకృతి, ఈ అనంతవిశ్వమంతా ఏదో ఒక సమయంలో ల యం కావలసినవే. అలా లయమైనపుడు సహజ ధర్మాలకు ఆధారమైన ఆకృతి కాలి మసి కావలసిందే. అలాంటి సంపూర్ణ లయత్వంలో సృష్టిలో మిగిలేది బూడిదే. శాశ్వతమైన బూడిదను పొందడమే అద్భుతమైనది.

నా వ్రేలి నుండి అటువంటి శాశ్వతానందం నీవు చూడగలవు’’ అంటూ తన వ్రేలిని సున్నితంగా గాయపరచుకున్నాడు.ఆ వెంటనే స్వామి వ్రేలి నుండి బూడిద రాలసాగింది. వచ్చినది ఈశ్వరుడని గ్రహించి ‘స్వామీ ! నా అజ్ఞానం తెలియవచ్చింది. ఎంతో అద్భుతాన్ని నాకు చూపించి, నా అజ్ఞా నం పొగొట్టిన నీవు ఎవరో నీ దివ్యరూపమేటి టో నాకు చూసి నన్ను ధ న్యుడిని, పునీతుడిని గావించు’’ అని మహర్షి వేడుకున్నాడు.విశ్వనాథుడు తన అమిత మహోన్నత సుందర దివ్య నమ్మోహన రూపంతో దర్శనమిచ్చాడు.

– డా వి.జి.శర్మ, 9440944132

Surya Telugu Daily

మార్చి 2, 2011 Posted by | భక్తి | | వ్యాఖ్యానించండి

రామనామగానపనదాసుడు

రామనామగానపనదాసుడు
Ornaments-by-ramadasuదాశరధీ…కరుణాపయోనిధీ అన్నా…శ్రీరామనీనామమెంత రుచిరా అని పాడినా ఆయనేక చెల్లింది…17వ శతాబ్దపు సంకీర్తనాచార్యుడు ఆయన. గోపన్నగా పుట్టినా రామయ్య కీర్తనలలోనే తరించిన పుణ్యమూర్తి ఆయన. వెంకటేశ్వరస్వామి కీర్తనలకు అన్నమయ్య ఎంత ప్రసిద్ధుడో శ్రీరాముని సంకీర్తనలకు ఆయన చిరునామా అరుునారు. ఆ కాలంలోనే కులమతాలకతీతంగా తక్కువకులంలో పుట్టిన అభినవ శబరిగా కీర్తించబడే పోకలదమ్మక్క కోరికమేరకు భద్రాచలంలో శ్రీరామునికి ఆలయం కట్టించిన దాత. కష్టాలను దిగమింగి జైలులోనే శ్రీరాముని కీర్తనలు ఆర్తిగా ఆలపించారు…ఆ ఆర్తితో పాడిన సంకీర్తనలే ఆయనకు కీర్తికలికితురారుుగా నిలిచారుు…ఆయనే కంచెర్లగోపన్నగా ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో జన్మించిన రామదాసు…శ్రీరాముని కీర్తిని మారుమూల పల్లెల్లో సైతం మారుమ్రోగేలా చేసిన అభినవ హరిదాసు…

ramaiah1భద్రాచల రామదాసుగా ప్రసిద్ధి పొందిన ఇతని అసలు పేరు కంచెర్ల గోపన్న. 1620లో ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో లింగన్నమూర్తి, కామాంబ దంపతులకు జన్మించినారు. శ్రీరాముని కొలిచి, కీర్తించి, భక్త రామదాసుగా సుప్రసిద్ధుడైనారు. భద్రాచల దేవస్థానమునకు, ఈయన జీవిత కథకు అవినాభావ సంబంధము ఉన్నది. తెలుగులో భక్తిరస కీర్తనలకు ఆద్యుడు. దాశరధి శతకము, ఎన్నో రామ సంకీర్తనలు, భద్రాచలం దేవస్థానము ఇవన్నీ తెలుగువారికి శ్రీరామదాసు నుండి తెలుగు వారికి సంక్రమించిన పెన్నిధులు. రామదాసు గురువు శ్రీ రఘునాథ భట్టాచార్యులు.కబీర్‌ దాసు రామదాసునకు తారక మంత్రం ఉపదేశించారని కూడా ఒక కథ ప్రచారంలో ఉంది.
గోపన్న మేనమామ మాదన్న అప్పటి గోల్కొండ నవాబు తానీషా కొలువులో పెద్ద ఉద్యోగి. మేనమామ సిఫారసుతో గోపన్నకు పాల్వంచ పరగణానికి తహసిల్దారు పని లభించింది. గోదావరి తీరములోని భద్రాచల గ్రామము ఈ పరగణాలోనిదే. వనవాసకాలమున సీతా లక్ష్మణులతో శ్రీరాముడు ఇక్కడే పర్ణశాలలో నివసించెననీ, భక్తురాలైన శబరి ఆతిథ్యము స్వీకరించెననీ అక్కడి స్థలపురాణము చెబుతుంది.
పోకల దమ్మక్క అనే భక్తురాలు అక్కడి జీర్ణదశలోనున్న మందిరమును పునరుద్ధరింపవలెనని గోపన్నను కోరగా, స్వతహాగా హరి భక్తులైన గోపన్న అందుకు అంగీకరించారు.

ఆలయనిర్మాణానికి విరాళములు సేకరించారు. అయితే అది చాలలేదు. జనులు తమ పంటలు పండగానే మరింత విరాళములిచ్చెదమని, గుడి కట్టే పని ఆపవద్దనీ కోరినారు. అప్పుడు అతను తాను వసూలు చేసిన శిస్తునుండి కొంతసొమ్ము మందిరనిర్మాణ కార్యమునకు వినియోగించెను. ఈ విషయములో కూడా అనేకమైన కథలున్నాయి. కోపించిన నవాబుగారు గోపన్నకు 12 ఏండ్ల చెరసాల శిక్ష విధించాడు. గోల్కొండ కోటలో ఆయన ఉన్న చెరసాలను ఇప్పటికీ చూడవచ్చును.

ramaiahగోల్కొండ ఖైదులో నున్న రామదాసు గోడపై సీతారామలక్ష్మణాంజనేయులను చిత్రంచుకొని, వారిని కీర్తిస్తూ ఆ కరుణా పయోనిధి శ్రీ రాముని కటాక్షమునకు ఆక్రోశిస్తూ కాలము గడిపినారు. రామదాసు యొక్క మార్దవభరితమైన ఎన్నో ప్రసిద్ధ సంకీర్తనలు ఈ కాలములోనే వెలువడినాయి. నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి, పలుకే బంగారమాయెనా, అబ్బబ్బో దెబ్బలకునోర్వలేనురా వంటివి. అతని బాధను వెళ్ళగక్కిన ఇక్ష్వాకు కులతిలక, ఇకనైన పలుక, కీర్తన బాగా ప్రసిద్ధి చెందినది- నీకోసము ఇంతింత ఖర్చు పెట్టాను. ఎవడబ్బ సొమ్మని కులుకుచున్నావు? నీబాబిచ్చాడా? నీ మామిచ్చాడా? – అని వాపోయి, మరలా – ఈ దెబ్బలకోర్వలేక తిట్టాను. ఏమీ అనుకోవద్దు. నా బ్రతుకిలాగయ్యింది. నీవే నాకు దిక్కు – అని వేడుకొన్నారు. రామదాసు సీతమ్మ వారికి చేయించిన చింతాకు పతకము, లక్ష్మణునకు చేయంచిన హారము, సీతారాముల కళ్యాణమునకు చేయించిన తాళి వంటి ఆభరణాలు ఇప్పటికీ దేవస్థానములోని నగలలో ఉన్నాయి.

రామదాసు కర్మశేషము పరిసమాప్తి కాగానే, రామ లక్ష్మణులు తానీషా గారి వద్దకు వెళ్ళి, ఆరు లక్షల వరహాలు శిస్తు సొమ్ము చెల్లించి, రామదాసు విడుదల పత్రము తీసుకొన్నారని ప్రతీతి. ఆప్పుడిచ్చిన నాణెములను రామటంకా నాణెములని అంటారు. వీటికి ఒకవైపు శ్రీరామ పట్టాభిషేకము ముద్ర, మరొకవైపు రామభక్తుడు హనుమంతుని ముద్ర ఉన్నాయి. ఇవి ఇప్పుడు కూడా ఉన్నాయి. రామదాసు గొప్పతనము తెలిసికొన్న నవాబుగారు వెంటనే ఆయనను విడుదల చేయించి, భద్రాచల రాముని సేవా నిమిత్తమై భూమిని ఇచ్చారు. శ్రీ సీతారామ కళ్యాణ సమయంలో గోల్కొండ దర్బారు నుండి ముత్యాల తలంబ్రాలను పంపే సంప్రదాయము అప్పుటినుండే మొదలయ్యింది. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ ప్రభుత్వము ద్వారా ఈ ఆనవాయితీ కొనసాగుతున్నది.

మచ్చుకి కొన్ని రామదాసు కీర్తనలు

>1. అంతా రామమయం ఈ జగమంతా రామమయం 2. అదిగో భద్రాద్రి గౌతమి ఇదిగో చూడండి 3. అడుగు దాటి కదల నియ్యను4. అమ్మ నను బ్రోవవే రఘురాముని 5. అయ్యయ్యో నీవంటి అన్యాయ దైవము 6. అయ్యయ్యో నే నేరనైతి ఆదినారాయణుని తెలియనైతి7. ఆదరణలే 8. ఆన బెట్టితినని 9. ఆనందమానందమాయెను 10. ఇక్ష్వాకుల తిలక 11. ఇతడేనా రుూ12. ఇతరము లెరుగనయా 13. ఇనకుల తిలక ఏమయ్య రామయ్యా 14. ఇన్ని కల్గి మీరూ రకున్న15. ఉన్నాడో లేడో16. ఎంతపని చేసితివి 17. ఎం తో మహానుభావుడవు18. ఎందుకు కృపరాదు 19. ఎక్కడి కర్మము 20. ఎటుబోతివో 21. ఎన్నగాను 22. ఎన్నెన్ని జన్మము 23. ఎవరు దూషించిన 24. ఏ తీరుగ నను 25. ఏమయ్య రామ 26. ఏమిర రామ నావల్ల నేర మేమిరా రామ 27. ఏటికి దయరాదు 28. ఏడనున్నాడో 29. ఏల దయ రాదో రామయ్య30. ఏలాగు తాళుదునే 31. ఓ రఘునందన 32. ఓ రఘువీరా యని నే పిలిచిన 33.

ఓ రామ నీ నామ 34. కట కట 35. కమలనయన 36. కరుణ జూడవే 37. కరుణించు దైవ లలామ 38. కలయె గోపాలం 39. కలియుగ వైకుంఠము 40. కోదండరా ములు 41. కంటి మా రాములను కనుగొంటి నేను 42. కోదండరామ కోదండరామ43. గరుడగమన 44. గోవింద సుందర మోహన దీన మందార 45. చరణములే నమ్మితి 46. జానకీ రమణ కళ్యాణ సజ్జన 47. తక్కువేమి మనకు 48. తగున య్యా దశరధరామ49. తరలిపాదాము 50. తారక మంత్రము 51. దక్షిణాశాస్యం 52. దరిశనమాయెను శ్రీరాములవారి 53. దశరధరామ గోవిందా 54. దినమే సుదినము సీతారామ స్మరణే పావనము 55. దీనదయాళో దీనదయాళో 56. దైవమని 57. నం దబాలం భజరే 58. నను బ్రోవమని 59. నమ్మినవారిని 60. నర హరి నమ్మక 61. నా తప్పులన్ని క్షమియించుమీ 62. నామొరాల కింప 63. నారాయణ నారాయణ 64. నారాయణ యనరాదా 65. నిను పోనిచ్చెదనా సీతారామ 66. నిన్ను నమ్మియున్నవాడను 67. నీసంకల్పం 68. పలుకే బంగారమాయెనా 69. పాలయమాం జ యరామ 70. పాలయమాం రుక్మిణీ నాయక71. పావన రామ 72. పాహిమాం శ్రీరామ73. పాహిరామ 74. బిడియమేల నిక75. బూచివాని 76.

భజరే మానస రామం 77. భజరే శ్రీరామం హే 78. భళి వైరాగ్యంబెంతో 79. భారములన్నిటికి 80. భావయే పవమాన 81. మరువకను నీ దివ్యనామ 82. మానసమా నీవు మరువకుమీ పెన్ని 83. మారుతే నమోస్తుతే 84. రక్షించు దీనుని రామ రామ నీ 85. రక్షించు దీనుని 86. రక్షించే దొర నీవని87. రక్షింపు మిదియేమో 88. రామ నీ దయ రాదుగా 89. రామ రామ నీవేగతి90. రామ రామ భద్రాచల 91. రామ రామ యని 92. రామ రామ రామ 93. రామ రామ రామ శ్రీరఘురామ…
నండూరి రవిశంకర్‌

Surya Telugu Daily

డిసెంబర్ 24, 2010 Posted by | భక్తి | , | 1 వ్యాఖ్య

వైకుంఠ ద్వారాలు తెరుచుకునే పుణ్య ఏకాదశి

వైకుంఠ ద్వారాలు తెరుచుకునే పుణ్య ఏకాదశి

ఏకాదశ్యాం నిరాహారో భూత్వాహమపర్వేహని
భోక్ష్యామి పుండరీకాక్షశరణంమేభవాభ్యుత

ananthapadmanabhaధనుర్మాసంలో వచ్చే ఈ ఏకాదశి పవిత్రమైనది. ఈ ఏకాదశి రోజున విష్ణురాధన ప్రాముఖ్యం చెప్పబడింది. విష్ణుమూర్తికి ప్రీతికరమూనది. ఏకాదశులలో ఈ ఏకాదశి అత్యంత ప్రధానమైనది. మరియు ఈ రోజున వైకుంఠ ద్వారాలు తెరుచుకొనే రోజుగా భావిస్తాము.
కోణస్థ ః పింగిళోబభ్రు ః కృష్ణోశాద్రోంతకాయమః
శౌర ః శనైశ్చరో మంద ః పిప్పలాదేనసంస్తుతః
నమస్తే కోణిసంస్థాయపింగళాయ నమోస్తుతే
నమస్తేయిభ్రుశూపాయ కృస్ణాయజనమోస్తుతే
నమస్తే శాద్రదేహాయ నమస్తే చాంతకాయచ
నమస్తేమమే సంజ్ఞాయ నమస్తే సౌరమేవిభో
నమస్తే మంద సంజ్ఞాయ శనైశ్చరనమోస్తుతే
ప్రసాదం మమదేశదేనస్వప్రణతిస్వజ

అధరం మధురం వందనం మధురం నయనం మధురం హసితం మధురం
హృదయంమధురం గమనం మధురం మధురాదిపతే శఖిలం మమరమ్‌

శ్రీమహా విష్ణువుకు అత్యంత ప్రీతికరమైన ఈ వైకుంఠ ఏకాదశిరోజున వేయినేలతో వీక్షించి సేవించి తరించి పోవాలని మూడు కోట్ల మంది దేవతలు వైకుంఠము నకు చేరుకునే పుణ్యప్రదమైన రోజు.కనుకనే ఏకాదశి ప్రాముఖ్యతలో రెండు కథలు చెప్పబడినవి. మొదటగా ఈ రోజు విష్ణు సహ్యస్త్యపారాయణము నారాయణార్చన విశేషఫలప్రధమైనది. భోగముగలది భోగి విష్ణు చిత్తు నికుమార్తె అయిన శ్రీగోదాదేవి (ఆండాల) శ్రీరంగనాధు ని వరించి తరించిన భూలక్ష్మి స్వామిని అలంకరించా ల్సిన పూలమాలను తానూ ధరించి వాటి సౌందర్యానికి మురిసి ఆ తరువాత భగవంతునికి అలంకరించేది. శ్రీ మన్నారాయణుని పతిగా కోరి ధనుర్మాస వ్రతం ఆచరిం చి ఆ స్వామి అనుగ్రహాన్ని పొందినది.

వ్రత పరి సమాప్తి జరిగిన రోజుఈ ఏకాదశికి ఇంకొక కథ చెప్ప బడినది. ఈ వైకుంఠ ఏకాదశినే పుత్రధ ఏకాదశి అని కూడా అంటారు.పూర్వం �సుకేతుడు� అను మహారాజు భద్రావతి అను రాజ్యాన్ని ప్రజాభీష్టాలను తరచూ గమనిస్తూ వారి పరి పాలన ఎల్లప్పుడూ గుర్తుండేలా ప్రజలను సర్వసౌఖ్యా లను కల్గిస్తూ ప్రజల మన్ననలను పొందుతూ ఉండే వారు. అట్టి మహారాజు భార్య �చంపక� ఆమె అం తటి మహారాణి అయినా గృహస్థ ధర్మాన్ని స్వయంగా చక్కగా నిర్వహిస్తూ గౌరవిస్తూ, భర్తను పూజిస్తూ వ్రతా లు చేస్తూ ఉండేది. మహారాజు కూడా ఆమెను ఎంతో ప్రోత్సహించేవారు. అట్టి అన్యోన్య పుణ్యదంపతులకు మాత్రం పుత్ర సౌభాగ్యం కరువై అదే వారి జీవితాలకి తీరని లోటుగా మారింది. ఒక నది తీరంలో కొందరు మహార్షులు తపస్సు చేసుకుంటున్నారని వార్త మహర్షికి తెలిసింది. వెంటనే ఆ మహర్షులను దర్శించి పుత్రభిక్ష పెట్టమని ప్రార్థించాడు.

మహర్షులు మహారాజు వేదనను గ్రహించి �ఓ రాజా మేము విశ్వజీవులము. మీకు పుత్ర సంతాన భాగ్యం తప్పక కలుగుతుంద�ని ఆదిత్య తేజోమూర్తులు దీవిస్తూ నేడు సరిగా వైకుంఠ ఏకాదశి (పుత్రదేకాదశి) నీవు, నీ భార్యతో ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన యెడల మీ మనోభీష్టము తప్పక నెరవేరుతుంది� అని చెప్పారు. అనంతరం వ్రతము ఆచరించు విధానము కూడా చెప్పి అదృష్యమయారు. సంతోషముతో మహారాజు నగరా నికి చేరుకుని నదీ తీరములో జరిగిన వృత్తాంతమంతా తన భార్య చంపకాదేవితో చెప్తాడు.

అనంతరం వారి రువురు కలిసి భక్తిశ్రద్దలతో శ్రీ లక్ష్మీ నారాయణులను పార్వతీ పరమేశ్వరులను పూజించి ఉపవాసజాగర ణలతో భగవన్నామ సం ీర్తనలతో మహర్షులు ఉపదే శించిన విధముగా �ఏకాదశీ� వ్రతాన్ని పూర్తిచేస్తారు. కొంత కాలమునకు �హరిహరా యల� కృపాకటాక్షము లతో కులవర్ణనుడైన కుమా రుడు జన్మిస్తాడు. ఆ పిల్లవాడు క్షుక్లపక్ష చంద్రునివలె దినదిన ప్రవర్థమానమ గుచూ సత్‌శీలముతో విద్యాబుద్దులు నేర్చుకుని యవ్వ నమురాగానే తల్లిదండ్రుల అభీష్ట ముపై మహారాజై ప్రజారం జకముగా పాలిస్తూ వివరిస్తూ ప్రజల అందరి చేత ఈ వ్రతాన్ని చేయిస్తాడు. ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఆ స్వామి మహిమానిత్వాని మనందరికీ కలు గాలని మనమంతా భక్తిశ్రద్దలతో ఆ లక్ష్మీ నారాయ ణులను ప్రార్థించి స్వామి కృపాకుపాత్రులవు దాము. �లోకా సంస్తసుకినో భవంతు� ఓం శాంతి శాంతి శాంతి!
– సిద్దాంతి డా.వి.జి.శర్మ.

Surya Telugu Daily

డిసెంబర్ 16, 2010 Posted by | భక్తి | 1 వ్యాఖ్య

గం గణపతయే నమః

గం గణపతయే నమః

శివ శివ మూర్తివి గణనాథా
నీవు శివుని కుమారుడవు గణనాథా

సెప్టెంబర్ 10, 2010 Posted by | భక్తి | , | 5 వ్యాఖ్యలు

సిరుత నవ్వులవాడు -అన్నమాచార్య కృతి

సిరుత నవ్వులవాడు -అన్నమాచార్య కృతి

ఆగస్ట్ 5, 2010 Posted by | భక్తి | , , | 3 వ్యాఖ్యలు

కాల భైరవాష్టకం -తెలుగు వీడియో

కాల భైరవాష్టకం -తెలుగు వీడియో

జూలై 1, 2010 Posted by | భక్తి | , , | వ్యాఖ్యానించండి

చంద్రశేఖరాష్టకం

చంద్రశేఖరాష్టకం

జూన్ 20, 2010 Posted by | భక్తి | , | వ్యాఖ్యానించండి

అష్టలక్ష్మి స్తోత్రం వీడియో -తెలుగు

అష్టలక్ష్మి స్తోత్రం వీడియో -తెలుగు

జూన్ 17, 2010 Posted by | భక్తి | , , , , | వ్యాఖ్యానించండి

వెంకటేశ్వర సుప్రభాతం

వెంకటేశ్వర సుప్రభాతం

జూన్ 13, 2010 Posted by | భక్తి | , , , | 2 వ్యాఖ్యలు

కనకధారా స్తోత్రం -m.s.సుబ్బులక్ష్మి

కనకధారా స్తోత్రం -m.s.సుబ్బులక్ష్మి

జూన్ 5, 2010 Posted by | భక్తి | , , , | 3 వ్యాఖ్యలు

తారక మంత్రము కోరిన దొరికెను -ప్రియా సిస్టర్స్

తారక మంత్రము కోరిన దొరికెను -ప్రియా సిస్టర్స్

జూన్ 2, 2010 Posted by | భక్తి | , , | 1 వ్యాఖ్య

అక్షరధాం దేవాలయం

అక్షరధాం దేవాలయం

జూన్ 1, 2010 Posted by | భక్తి | , , | 1 వ్యాఖ్య

కృష్ణం వందే జగద్గురుం

కృష్ణం వందే జగద్గురుం

మే 28, 2010 Posted by | భక్తి | , , , , , | 4 వ్యాఖ్యలు

అష్టలక్ష్మి స్తోత్రం

అష్టలక్ష్మి స్తోత్రం

మే 20, 2010 Posted by | భక్తి | , , , , | వ్యాఖ్యానించండి

గణేశ పంచరత్న స్తోత్రం-M.S.సుబ్బులక్ష్మి

గణేశ పంచరత్న స్తోత్రం-M.S.సుబ్బులక్ష్మి

మే 17, 2010 Posted by | భక్తి | , , , , | 1 వ్యాఖ్య

ధ్యానం కోసం గాయత్రి మంత్రం

ధ్యానం కోసం గాయత్రి మంత్రం

మే 15, 2010 Posted by | భక్తి | , , , | 3 వ్యాఖ్యలు

రామదాస కీర్తన -పలుకే బంగారమాయెనా

రామదాస కీర్తన -పలుకే బంగారమాయెనా
శ్రీ రామ నవమి అలంకారం

మే 5, 2010 Posted by | భక్తి | , , | వ్యాఖ్యానించండి

గణేశ పంచరత్న స్తోత్రం-ms సుబ్బులక్ష్మి

గణేశ పంచరత్న స్తోత్రం-ms సుబ్బులక్ష్మి

ఏప్రిల్ 5, 2010 Posted by | భక్తి | , , , , , | 1 వ్యాఖ్య