హరివిల్లు

ఎన్నెన్నో వర్ణాలు-అన్నింటా అందాలు…

flute recital

జూన్ 18, 2018 Posted by | (స్నే)హితులు, నచ్చిన పాటలు, ప్రకృతి, విద్యార్థులకు, సంస్కృతి | , | వ్యాఖ్యానించండి

హాయి హాయిగా. . హార్సిలీ కొండల్లో. .

హాయి హాయిగా. . హార్సిలీ కొండల్లో. .
ఆకాశాన్ని తాకుతున్నట్లుండే ఎతె్తైన పర్వతశ్రేణులు… కనుచూపుమేర పరుచుకున్న పచ్చదనం… అక్కడ అడుగుపెట్టగానే చల్లని పిల్లతిమ్మెరలు ఒడలికి ఒక విచిత్ర అనూభూతిని కలిగిస్తాయి… చల్లని వాతవరణం… చుట్టూ పచ్చని చెట్లు… రంగురంగుల పక్షుల కిలకిలరావాలు… ఆ అనుభూతే వేరు. రాష్ట్రంలో ఉన్న ఎకైక వేసవి విడిదికేంద్రం హర్సిలీ హిల్స్‌. సముద్రమట్టానికి 1314 మీ ఎత్తులో ఉన్న ఈ అద్భుత విహారకేంద్రం… పచ్చని అడువులు, ఔషధ గుణాలు కల చెట్లుతో అలరారుతోంది. గ్రీష్మతాపంతో తల్లడిల్లుతోన్న ప్రజలు ఆహ్లాదకర వాతావరణంలో సేదదీరడానికి, మధురానుభూతులను మిగుల్చుకోవడానికి వచ్చే జనసందడితో నేడు హార్సిలీ హిల్స్‌ కళకళ లాడుతోంది

ఆహ్లదకర వాతావరణం, ప్రకృతి సౌందర్యం హార్సిలీహిల్స్‌ ప్రత్యేకతలు. ఇక్కడికి వేళ్ళే కొండ దారి.. వంకలు తిరిగి ఎంతో అందంగా వుంటుంది. రెండువైపులా నీలగిరి వంటి అనేక జాతుల చేట్లు, కొండ చుట్టూ అడవులు, కం టికి ఇంపుగా కనిపించే సువిస్తారమైన పచ్చదనం మదిని పులకరింప చేస్తాయి.

మత్తేకించే పూల ఘమఘమలు…
h-Hillsహార్సీలీహిల్స్‌.. సువాసనలను వెదజల్లే సంపంగి పూలకు ప్రసిద్ది. సంపెంగ సువాసనలతో హర్సిలీ హిల్స్‌ ఘమఘమలు పర్యాటకులను మరో ప్రపంచం లోకి తీసుకేళ్తాయి. వీటితోపాటిగా చందనం, ఎర్రచందనం, కలప, రీటా, శీకా కాయ, ఉసిరిగ చెట్లు ఇక్కడ కోకొల్లలుగా వున్నాయి.

ఆపేరు ఎలా వచ్చిందంటే…
ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో వున్న ఈ ప్రాంతం.. ఒకప్పుడు కడప జిల్లాలో వుం డేది. కడప అసలే వేడి ప్రదేశం. బ్రిటీషు హయంలో కలెక్టర్‌గా వున్న డబ్ల్యూ.డి హర్సీలీ వేసవి తాపాన్ని తట్టుకునేందుకు ఎక్కువగా ఇక్కడికి వచ్చేవారు. ఆయ నకు విశ్రాంతి నిలయంగా వున్న ఈ ప్రాంతం కొన్నాళ్ల తరువాత మెల్లగా ఆయ నకు వేసవి నివాసంగా మారిపోయింది. అన్ని ఆధికారిక కార్యక్రమాలు అక్కడి నుంచే సాగేవి. దీంతో ఈ కొండ ప్రాంతాలకు ‘హర్సీలీహిల్స్‌’గా పేరు ముద్ర పడిపోయింది. 1863లో ఆయన వేసివి విడిదిగా ఇక్కడ ఒక ఇంటిని నిర్మిం చారు. దీనిని ఫారెస్టు బంగ్లా అంటారు. అ తరువాత కార్యలయ భవనం నిర్మిం చారు. ఈ భవనాలు ఇప్పటికీ నివాసా యోగ్యంగా వుండి వాడుకలో వుండడం విశేషం! ఫారెస్టు బంగ్లాలోని 4 గదులలో ఒక దానికి హర్సీలీ పేరు పెట్టారు.

ఆహ్లాదాన్నిచ్చే చల్లగాలులు…
చల్లని పిల్లగాలులు పర్యటకుల శరీరాన్ని తాకుతూ వేళ్తుంటే ఆ అనుభూతే వేరు. తూర్పు కనుమలలోని దక్షిణ భాగంలో విస్తరించిన కొండలే హర్సీలీ కొండలు. చలికాలంలో 3 డిగ్రీల సెంటీగ్రేడ్‌ నుంచి మండువేసవిలో 30 డిగ్రీల సెంటీగ్రేడ్‌ వరకు ఉష్ణోగ్రత వున్న ఈ ప్రాంతం, చల్లటిగాలిలో తేలుతూ వచ్చే సంపెంగల సువాసనలు పర్యాటకులను ఈ ప్రాంతానికి మళ్ళీమళ్లీ రప్పిస్తాయి. దట్టమైన చెట్లు, విస్తారమైన పచ్చిక బయళ్లు జనాన్ని అకర్షిస్తాయి. ఇలా వివిధ రకాల చెట్లు, చేమల మధ్య చెంచుజాతి కి చెందిన వారు ఈ ప్రాంతలో జీవనం సాగిస్తున్నారు. హర్సీలీకొండల వాలుపై సంపెంగ పూల మొక్కలను నాటింది ఈ చెంచులే.

చూడముచ్చటైన చెంచు జానపదం…
h-Hills1ఈ విహర స్థలానికి ఏనుగు మల్లమ్మ కొండ అనే పేరు కూడా ఉంది. జాన పదుల కథనం మేరకు పూర్వాశ్రమమంలో మల్లమ్మ అనే చిన్నారిని గజరాజు రక్షిస్తూ వుండేవాడట. కొండమీద చెంచులకు ఏ ఆపద వచ్చినా, జబ్బులు వచ్చినా చిన్నారి మల్లమ్మ అభయ హస్తం ఇచ్చి కాపాడేదట. ఉన్నట్టుండి ఒక రోజు చిన్నారి మల్లమ్మ అదృశ్యంమైంది. కొండా, కోనా, వాగు-వంకా, చెట్లు – పుట్ట వెతికి వేసారిపోయిన చెంచులు ఆమెకు కోవెల కట్టి, తమ ఇలవేల్పుగా చేసుకొని ఈ నాటికి కొలుస్తూనే వున్నారు. నేటికి కొండమీద వున్న బస్టాండ్‌ సమీపంలోని మల్లమ్మ కోవెలలో నిత్యం ధూపదీప పూజార్చనలు జరుగుతూ వుండడం చెంచుల అచంచల భక్తికి నిదర్శనం. ఏటా చెంచులందరూ… పర్యా టకులు, పరిసర గ్రామీణులతో కలిసి నేటికి ఏనుగు మల్లమ్మ జాతర అంగరం గ వైభవంగా జరుపుతారు.

అరుదైన వన్యసంపద…
h-Hills3 భూతల స్వర్గాన్ని తలపించే అందాలతో పాటు 152 సంవత్సరాల వయస్సు కల్గిన ‘కళ్యాణి’ – అనే పేరుగల యూకలిప్టస్‌ చెట్టు ఇక్కడ ప్రధాన అకర్షణలలో ఒకటి. 1859లో డబ్ల్యూ.డి.హర్సీలీ నాటిన ఈ వృక్ష రాజం ఎత్తు 40 మీటర్ల పైమాటే. దుప్పులు, అడవికోళ్ళు, నక్కలు, ఎలుగుబంట్లు, గజరాజులు, కుందే ళ్ళు, కొండ ఎలుకలు, జింకలు, చిరుతపులులు, లేళ్ళు, అడవి పిల్లు లతో కూడిన అత్యంత అకర్షణీయ మైన వన్యమృగ కేంద్రం పర్యాటకు ల మనసును కట్టిపడేస్తుంది. ఆంధ్ర ప్రదేశ్‌ పర్యాటక శాఖ ఏర్పాటు చేసి న ‘పున్నమి’ వేసవి విడిది బంగ్లా ముందు కాండాలు కలిసిపోయి రెం డుగా చీలి ఏపుగా పెరిగిన రెండు మహవృక్షాలు చూపరులను అలరి స్తాయి. మొసళ్ళు మిసమిసలాడు తూ పర్యాటకుల వైపు ఎగబాకే క్రోకడైల్‌ పూల్‌ చూపరుల ఒళ్లు జలదరింపజేస్తుంది. రంగురంగుల ఈకలతో చిటారి శబ్దాలు చేసే పక్షి కేంద్రంతో పాటు జింకల పార్కు అల రిస్తుంది. ప్రేమికులు మనసు విప్పి మదిలోని ఊసులను గుసగుసలాడడానికి హర్సీలీహిల్స్‌లో వేదికాగా మారిన ‘గాలిబండ’ పైనుంచి మంచుకురిసే వేళా సూర్యోదయం, సూర్యాస్తమయం చూసే పర్యాటకులకు గుండె ఝల్లుమన డం ఖాయం. ఇక ఏనుగు మల్లమ్మ కోవెల అందాలు చెప్పనలివి కానివి.

సాహసవీరుల ఖిల్లా…
h-Hills2 హర్సీలీహిల్స్‌ సాహసవీరులకు అరుదైన అవకాశం కల్పిస్తుంది. ట్రెక్కింగ్‌, రాక్‌క్లైంబింగ్‌, బంజీ రన్నింగ్‌, గోర్బింగ్‌, రాపెల్లింగ్‌, బర్మాబ్రిడ్జి వాకింగ్‌, బర్మాలూప్స్‌, ఎర్త్‌కేక్‌ లాంటి సాహసకృత్యాల కోసం విదేశాలకు, లేదా పక్కరాష్ట్రాలకు పరుగు తీయాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక శాఖ ఇలాంటి అవకాశాలను హర్సీలీ హిల్స్‌పై కల్పించడంతో పాటు పగలు, రాత్రివేళల్లో అక్కడే గడేపే విధంగా ప్యాకేజీలను రూపోందించింది. ఇక వసతి, భోజన సౌకర్యాలను కూడా ఆశాఖ ఏర్పాటు చేసింది. పిల్లలు ఆడుకొవడానికి వీలుగా ప్లేగ్రౌండ్‌, పెద్దలకు బార్‌, సిమ్మింగ్‌పూల్‌ మొదలు ఆర్డర్‌ ఇస్తే గంటలో వేడి వేడిగా వండివార్చే హోటల్స్‌ ఇక్కడ వున్నాయి. అంతేకాక పర్యాటకుల జిహ్వ చాపల్యానికి తగినరీతిలో… మైమరిపించే రాయలసీమ స్పెషల్‌ ‘సంగ టి-నాటుకొడి కూర’ క్షణాల్లో అందించే ప్రైవేట్‌ కుక్స్‌ కూడా ఇక్కడ ఉండడం విశేషం.

వసతి సౌకర్యాలు…
పర్యాటక శాఖ పున్నమి రిసార్ట్‌‌స, హరితా హిల్స్‌ రిసార్ట్‌‌స, గవర్నర్‌ బంగ్లా, ఫార ెస్టు బంగ్లా, చిత్తూరు సహకార సమాఖ్య అతిధి గృహం, ఎ.డి.సి క్వార్టర్స్‌ ఇలా లెక్కకు మించిన కాటేజీలు ఇక్కడ వున్నాయి. వీటితో పాటు హెల్త్‌ కబ్ల్‌, మసాజ్‌ సెంటర్‌ కాన్షరెన్సు హల్‌, స్విమ్మింగ్‌ పూల్‌ కూడా అందుబాటులో వున్నాయి. పర్యాటకులకు మరిన్ని వివరాలు అందించడానికి 09440272241, 08571 27932324 నెంబర్లుకు సిద్ధంగా ఉన్నాయి.

ఇలా చేరుకోవాలి…
విమానల ద్యాదా వచ్చే దూరప్రాంత పర్యాటకులు బెంగళూరు లేదా తిరుపతి విమానశ్రయాలకు చేరుకొని, అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్యారా మదనపల్లికి చేరుకొని హార్సీల్‌హిల్స్‌ వెళ్ళవచ్చు. రైలు మార్గం ద్వారా వచ్చే ప్రయాణీకులు మదనపల్లె రోడ్‌ రైల్వే స్టేషన్‌లో దిగి అక్కడి నుండి రోడ్డు మార్గం ద్వారా హార్సీలీ హిల్స్‌ చేరుకోవచ్చు. మదనపల్లి నుంచి దాదాపు ప్రతి అరగంటకు ఒక బస్సు వుంది. అలాగే అద్దె వాహనాల్లో కూడా కొండ మీదకు వేళ్ళవచ్చు.
– ఎస్‌.ఎం.రఫీ, మదనపల్లి

Surya Telugu Daily .

మార్చి 29, 2011 Posted by | ప్రకృతి | , | వ్యాఖ్యానించండి

అందమైన గవ్వలు…

అందమైన గవ్వలు…
గవ్వలు అందానికి మారుపేరు. కొన్ని గవ్వలు, ఆల్చిప్పల అందం మనల్ని కట్టిపడేస్తుంది. మరికొన్ని గవ్వలు రత్న మాణిక్యాల కన్నా ఖరీదైనవి. ఇవి మానవ జాతిని కొన్ని వేల సంవత్సరాలుగా అబ్బుర పరుస్తూనే ఉన్నాయి. వాటిలో ఉన్నది కేవలం సున్నమే (కాల్షియం) కావచ్చు. కానీ వాటి ఆకారాలు, రంగులు సృష్టిలోని అద్భుత కళాఖండాలకు ఏమాత్రం తీసిపోవు. నత్తలు తదితర రకాల జీవులు ఈ గవ్వలను ఆ రూపంలో తయారు చేస్తాయి. గవ్వలు మానవుడిని ఎప్పుడూ ఆకట్టుకుంటూనే ఉన్నాయి. పూర్వకాలం వీటిని కరెన్సీగా కూడా ఉపయోగించారు. ప్రస్తుతం అలంకరణ సామాగ్రిగా, సంగీత వాయిద్యాలుగా వీటిని ఉపయోగిస్తున్నారు. ఎంతో మందికి అందమైన గవ్వలను, ఆల్చిప్పలను సేకరిండం హాబీగా ఉంటుంది.

seashellsమనసుపెట్టి చూడాలేగానీ ప్రకృతిలో ప్రతిదీ అందంగానే ఉంటుం ది. అందులో సముద్రతీరాలలో దొరికే గవ్వలు ప్రముఖంగా చెప్పు కోవచ్చు. రకరాల ఆకృతులతో ఎంతో అందంగా, చూడముచ్చటగా ఉండే కొన్ని ప్రత్యేకమైన గవ్వలు (సీషెల్స్‌ ) బంగారం, రత్నాలకన్నా ఎంతో విలువైనవి. వీటిని గృహా లంకరణకు ఉపయోగిస్తే ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. ఈ నవీన కాలంలో కూ డా చాలా మంది ఇళ్లల్లో ఇవి కనిపిస్తుంటాయి. అనాదిగా ఇవి అందర్నీ ఆట్టు కుంటూనే ఉన్నాయి. మెక్సికో దేవాల యాల్లో, రోమన్‌ పాత్రల్లో పునర్వికాస దశ నాటి శిలా ప్రతిమల్లో వీటిని అలం కరణ సా మా గ్రిగా వినియో గించే వా రు. ఇప్పటి కీ వీటి వాడ కం పెరుగుతూనే ఉంది అనడానికి మాల్స్‌ లో ప్రత్యక్షమవుతున్న అందమైన గవ్వలే ఆధారం.

గట్టిగా ఉంటాయి…
సముద్రాలలో దొరికే గవ్వలు చాలా గట్టిగా ఉంటాయి. వెన్నముకలేని సముద్ర జీవుల బాహ్యా అస్థిపంజరమే గవ్వలేదా అల్చిప్ప. ఈ గవ్వలు మృదువైన శరీరం గల సముద్ర జీవులకు కవచాలుగా ఉంటాయి. నత్తల లాంటి శరీరం కల జీవుల నుండి ఈ గవ్వలు ఎక్కువగా తయారవుతూ ఉంటాయి. ఇవి సముద్రజలాల్లోనూ , సముద్ర తీరంలోనూ లభ్యమవుతాయి. నత్తలు, పీతల పెంకులు, పగడాలవలే గవ్వలుకూడా కాల్షియం కార్బొనేట్‌తో తయారవుతాయి. గుడ్డు పొదిగి నత్తగా ఉన్నప్పుడే వాటి చుట్టూ చిన్న పెంకు ఉంటుంది. పెంకు అంచుల్లో నత్తలు గవ్వలు తయారుకావడానికి అవసరమైన కొత్త పదార్థం తయారు చేస్తుంటాయి. నత్త పరి మాణం పెరిగే కొద్దీ ఈ పెంకు కూడా పెరుగుతూ ఉంటుంది. ఒక్కో జాతికి చెందిన జీవి ఒక్కోరకమైన గవ్వను తయారుచేస్తుంది. ఇది వాతావరణం, శీతోష్ణస్థితి, పర్యావరణం, జన్యువులు మొదలైన వాటిపై గవ్వల రూపు రేఖలు ఆధారపడి ఉంటాయి. ఒక పరాన్న జీవి లేదా మరో వస్తువు లాంటిది నత్తకు తగిలి దానిని ఆ నత్త వదిలించుకోలేక పోతే ఆ పరాన్న జీవి లేదా పదార్థం మీద కాల్షియం కార్బొ నేట్‌, మాంసకృ త్తులు ఆవరిస్తాయి. అప్పుడు ముత్యాలు తయారవుతాయి. పాత గవ్వను, ఆల్చిప్పను తెల్లని వెనిగర్‌లో ఉంచితే అది పగిలి చివరకు బొగ్గుపులుసు వాయువుగా వెలువడుతుంది. దీన్ని బట్టి అది కాల్షియం కార్బోనేట్‌ ద్వారా తయా రైందని తెలుసుకోవచ్చు.

సంగీత పరికరాలుగా…
seashells1సముద్ర గవ్వలను, శంఖువులను సంగీత వాయిద్యాలుగా కూడా ఉపయోగిస్తు న్నారు. పెద్ద పెద్ద శంఖువుల మధ్యలో కన్నం వేసి బాకాలుగా వాడతారు. ఇప్పటికీ చాలా ప్రాంతాలలో వీటిని సంగీత కచేరీలలో సంగీత వాయిద్యంగా ఉపయోగి స్తున్నారు. అంతేకాకుండా చరిత్ర పూర్వ దశ నుంచి కూడా గవ్వలను అలంకరణ సామాగ్రిగా ఉపయోగించే వారని చరిత్ర ద్వారా తెలుస్తోంది. కొన్ని సందర్భాలలో నగలుగా కూడా ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం యువత ధరించే లాకెట్‌లో చిన్న చిన్న గవ్వలను ఉపయోగించడం మనం చూస్తూనే ఉన్నాం.

మార్పిడి వస్తువుగా…
సంగీత వాయిద్యాలు, నగలగానే కాకుండా ఈ గవ్వలను డబ్బులుగా కూడా పూర్వపు రోజులలో ఉపయోగించేవారు. హిందూ మహాసముద్రం, పసిఫిక్‌ మహా సముద్రం దీవుల్లోనూ, ఉత్తర అమెరికా, ఆఫ్రికా, కరేబియన్‌లోనూ గవ్వలను మా రకంగా కూడా ఉపయోగిస్తారు. సైప్రేయియా మొనెటా, మనీకోరీ లాంటి గవ్వలు ఇలా డబ్బురూపంలో ఉపయోగించేవే. ఉత్తర అమెరికాలోని వాయువ్య ప్రాంతా ల్లో డెంటాలియం అనే గవ్వలను డబ్బురూపంలో ఉపయోగించేవారు. సైప్రేయి యా మొనెటా, సైప్రేయియా అన్సులస్‌ అనే గవ్వలను మారకంగా ఉపయోగించి హిందూ మహా సముద్ర, పసిఫిక్‌ సముద్ర తీర ప్రాంతంలోని అనేక దేశాలను వల స రాజ్యాలుగా మార్చిన డచ్‌ ఈస్ట్‌ ఇండియా కంపెనీ వారు విశిష్టమైన జంతువు లను, వజ్రాలను కొని అపార సంపత్తిని సమకూర్చుకున్నారు. ఈ వస్తువులన్నిం టికీ అప్పుడు యూరప్‌లో చాలా విలువ ఉండేది. ఈ రకం గవ్వలు మామూలు వాటికన్నా చాలా గట్టిగా ఉంటాయి.

పనిముట్లుగా…
ఈ గవ్వలు వివిధ ఆకారాల్లో , చలా గట్టిగా ఉంటాయి గనుక వాటిని పనిముట్లు గా కూడా ఉపయోగిస్తారు. కొన్నింటిని పాత్రలుగానూ, మరీ పెద్దగా ఉన్న వాటిని స్నానపు తొట్టెలుగానూ ఉపయోగిస్తారు. చాలా రకాల గవ్వలను బ్లేడ్‌లుగా, గీకే వస్తువులుగా, కత్తులుగా కూడా ఉపయోగిస్తారు. వాటి ఆకారాలను బట్టి పని ముట్లుగా మలచుకుంటారు. కొన్నింటిని దీపపు ప్రమిదలుగా కూడా వాడు తుం టారు. వాటి మధ్యలో ఉండే కాలువ లాంటి దానిలో వత్తి వేసి ప్రమిదగా వినియో గిస్తారు. వీటిలో కాల్షియం కార్బొనేట్‌ అధికంగా ఉంటుంది. దీంతో ఉద్యానవనా ల్లో అల్చిప్పలను భూసారాన్ని పెంపొందించడానికి కూడా ఉపయోగిస్తారు. ఆల్చిప్ప లను పొడిచేసి వాడితే భూసారం పెరుగుతుంది. తీరప్రాంతాలకు చెందిన వారు తప్ప మిగతావారు ప్రస్తుతం ఉపయోగించడం లేదనే చెప్పాలి.

అలంకరణ వస్తువులుగా…
వీటి ఆకారం అందంగా ఉంటుంది. కనక కళాకృతులు, పెయింటిం గ్‌లు, శిల్పాలు మొదలైన వాటిలో ఎక్కువగా వినియోగిస్తారు. రంగు రంగులుగా, బహువర్ణ ప్రకాశకంగా ఉండే గవ్వలను, ఆల్చిప్పలను గోడలను, ఫర్నీచర్‌ను, పెట్టెలను అలంకరించడానికి కూడా వాడ తా రు. అద్దాల ఫ్రేములకు, ఫర్నీచర్స్‌కు అలంకరించడానికి ఇవి ఉపకరిస్తాయి. భా రత్‌లో గవ్వలకు సంప్రదాయకంగా మతాచార వ్యవహారాల్లో ప్రాధాన్యత ఉంది.

హాబీగా…
కొంతమందికి సముద్రపు ఒడ్డున దొరికే అందమైన గవ్వలను సేకరించడం హాబీ గా ఉంటుంది. రకరకాల ఆకృతులు కలిగిన వాటిని ఎంతో ఓపికగా, ఆసక్తిగా సేక రిస్తారు. దగ్గర్లోని బీచ్‌లకు వెళ్లి గవ్వలను, పెంకులను తీసుకొని వాటిని శుభ్రపరచి తమ వద్ద ఎంతో జాగ్రత్తగా దాచుకుంటారు. అలాగే వీటిపై అధ్యయనాలు చేసే వారు కూడా ఉంటారు. చాలా మంది వీటిపై అధ్యయనాలు జరిపి అనేక పుస్తకాలు కూడా రచించారు.

పట్టించుకోవడం లేదు…
SuperStock సంభవించే వైపరిత్యాల రీత్యా అనేక మందికి పర్యావరణం పట్ల ఆసక్తి ఎక్కు వైంది. అనేక మంది పర్యావరణాన్ని రక్షించాలని నిర్ణయించుకుంటున్నారు. ప్ర కృతిని ప్రేమించేవారు, జీవావరణ సంబంధ రంగాల పరిశోధకులు కూడా ఎక్కువ అవుతున్నారు. ఇలాంటి కార్యకలాపాల్లో నేల మీద, మంచినీటి జీవుల మీద మాత్ర మే ఎక్కువ దృష్టి ేంద్రీకరిస్తు‚న్నారు. సముద్ర జీవుల గురించి అంతగా పట్టించు కోవడం లేదు. అందువల్ల అండమాన్‌, నికోబార్‌ దీవుల్లోని ఈ గవ్వలను ఉపయో గించి విడుదల చేసిన నాలుగు తపాలా బిళ్లల ద్వారా సముద్ర జీవావరణంపై దృష్టి మరల్చడానికి ప్రయత్నం చేశారు. ఇది ఏమేరకు పరిశోధకుల దృష్టికి పోతుందో వేచి చూడాలి మరి.

Surya Telugu Daily .

మార్చి 6, 2011 Posted by | ప్రకృతి | 1 వ్యాఖ్య

చదువు నేర్వని శాస్తవ్రేత్త

చదువు నేర్వని శాస్తవ్రేత్త

women2 అక్షరజ్ఞానం అంతగా తెలియదు.. శాస్ర్తీయ పద్ధతులపెై అవగాహన అసలే లేదు.. చుట్టూ ఉన్న ఆకులు అమలు మాత్రమే తెలుసు… వాటిద్వారానే ఆగ్రామ ప్రజలకు వెైద్య సేవలు అందుతాయి. ఎంతటి వ్యాధులెైనా.. రాచపుండులెైనా ఆ వెైద్యంతో మటుమాయం అవుతాయి… ఇంతటి శక్తిగల ఆకులు, అలమలు వ్యవసాయ రంగానికి ఎందుకు పనికి రావనేది ఆమె ఆలోచన… ఆ ఆలోచనతోనే ప్రతి ఆకును పరిశీలించడం వాటిని పంటపొలాలు, క్రిమికీటకాలపెై ప్రయోగించడం మొదలు పెట్టింది. శాస్తవ్రేత్తలకు దీటుగా సేంద్రీయ వ్యవసాయ పద్ధతులను అవలంబించి అధిక దిగుబడులను సాధించేందుకు కావలసిన ఎరువులను తయారు చేసింది. ఆమె ఖమ్మం జిల్లా జూలూరుపాడు మండలంలోని రామచంద్రాపురం శ్రీదుర్గా గ్రామసమాఖ్య అధ్యక్షురాలు ముక్తిలక్మి. ఆమె ఉపయోగించే వ్యర్థ పదార్థాలు.. ఆకులు అమలు… సాధించిన విజయం గురించిన లక్ష్మి చెబుతున్న కథనమే ఇది…

women1పంటకు వచ్చే చీడ పురుగులు, రకరకాల రోగాల పేరుతో భూసారం పెంచేందుకు అడుగు మందులు, నత్రజని వంటి ఖరీదెైన ఎరువులు, పురుగుల మందుల కోసం షాపుల వద్ద క్యూ కట్టి తీసుకోవడం… పలు దఫాలుగా రెైతులు నకిలీల బారినపడి పంటలను కోల్పోవడం వంటి సంఘటనలు నిత్యం వింటూనే ఉన్నాం. ఆధునిక ఎరువులతో పండించిన పంటలలో పోష క విలువలు నశించడమే కాకుండా వీటిని ఆహారంగా తీసుకోవడంతో రకరకాల రోగాల చుట్టు ముడుతున్నాయి. అందుకే కంపోస్టు ఎరువులు… సేంద్రీయ వ్యవసాయ విధానాలను అవలంబిం చాల్సిన అవసరం వుంది. మాకున్న మూడు ఎకరాల పొలంలోనే నా పరిశోధనలు మొదలు పెట్టాను. తొలుత ఈ పద్ధతుల ద్వారా పంటలను సాగుచేయడంతో ఎంతో లాభదాయకమ నిపించింది. దీంతో ఇరుగు పొరుగు వారికి కూడా వీటి గురించి వివరించాను. ఇప్పుడు మా పరిసర ప్రాంతాల్లోని దాదాపు రెండువేల ఎకరాల్లో ఈ పద్ధతుల్లోనే సాగు చేస్తున్నారు. ఆహార పంటలు, కూరగాయలు పండించడంలో వీటిని పాటిస్తూ రెైతులు అధిక లాభాలను పొందుతున్నారు. రసా యనిక ఎరువులతో పండించిన కూరగాయలకంటే ఈ విధానాల్లో పండించిన కూరగాయలకు మార్కెట్‌లో ఎక్కువ గిరాకీ ఉంటోంది కూడా.

వ్యర్థపదార్థాలే ఎరువులు…

womenమా పరిసర ప్రాంతాల్లో దొరికే వేపాకు, ముష్టి ఆకు, సీతాఫలం ఆకులు, పచ్చి మిరపకాయలు, లొట్టపీచు ఆకు, తూటికాడ, నిమ్మరసం, కోడిగుడ్లు, పులిసిపోయిన మజ్జిగ, ఆవు మూత్రం, ఆవుపేడ, వాయిలాకు, సర్ఫు, పంగల కరల్రు, పసుపు, ఆజోళ్ళ, పచ్చిరొట్ట ఎరువు, ఇంగువకొడిశాకు, ఎరల్రు (వాన పాములు), పప్పుదినుసులు, పొగాకు, వెల్లుల్లి, కిరోసిన్‌, సర్ఫు పౌడర్‌, నీలిరంగు పౌడర్‌, వేపనూనె, శనగపిండి, అడవిపుట్టమన్ను, సహజ సిద్ధంగా లభించే ఇతర చెట్ల ఆకులను వర్మి కంపోస్టు ఎరువులను, కషాయాలతో వరిటానిక్‌ను తయారు చేయడం వంటివి సొంతంగా చేశాను. ఈ పదార్థాలతో పంటల చీడపీడలను నివారించడం చాలా సులభం కూడా. ఇది నేను చేసి చూపించాను కూడా. అందుకే ఇక్కడి రెైతులు నా మాటలను వింటున్నారు.

ఇంతింతెై…

లక్ష్మి తయారు చేసిన సేంద్రియ ఎరువులు క్రమంగా గ్రామం నుండి జిల్లా వరకు వ్యాపించాయి. ఆమె అవలంబించిన విధానాలను పదిమందికి వివరించేందుకు ఎంతో శ్రమించారు. ఆమె మొదలు పెట్టిన ఈ విధానాల ద్వారా 2005లో 34 మంది రెైతులు 3 ఎకరాల్లో వర్మీ కంపోస్టు సేంద్రీయ ఎరువు, కషాయాలను ఉపయోగించి అధిక దిగు బడులను పొందారు. 2006లో 77 మంది రెైతులు 118 ఎకరాల్లో, 2007లో 82 మంది రెైతులు 466 ఎకరాల్లో, 2008లో 102 మంది 618 ఎకరాల్లో, 2009లో 136 మంది రెైతులు 986 ఎకరాల్లో, 2010లో 136 మంది 1460 ఎకరాల్లో పత్తి,వరి పంటలకు ఈ కషాయాలను ఉపయోగిస్తున్నారు. ఎన్‌పిఎమ్‌ చేస్తున్న మహిళలకు సిఐఎఫ్‌ (లింకేజ్‌) కింద 10 గ్రూపులకు 2006లో 38 లక్షల రూపాయలు ఐకేపి ద్వారా రుణాలు పొందారు. ప్రతి గ్రూపులోని మహిళలు వర్మీకంపోస్టు ఎరు వులు తయారుచేస్తారు. ముఖ్యంగా సుస్థిర వ్యవసాయ విధా నాన్ని జిల్లాలోని రామచంద్రాపురం, నల్లబండబోడు, గాంధీ నగర్‌, బచ్చలకోయగూడెం తదితర గ్రామాలలో రెైతులు ఉపయోగిస్తున్నారు.

ఎరువుల తయారీ విధానం….

women3నాడే కాంపోస్ట్‌ ఎరువు : రంధ్రాలున్న తడికలను నాలుగు వెైపులా కట్టి వివిధ రకాల పచ్చిరొట్ట(పచ్చిఆకులు) పేడను చిక్కగా కలిపి రొట్టమీద చల్లుతారు. కుళ్లిన తర్వాత అది ఎరువుగా మారుతుంది.

వానపాముల ఎరువు : తొట్లలో బెడ్లు కట్టి ఫ్లోరింగ్‌ మామూలుగా చేసి కొబ్బరిపీచు, ఎరువును పోసి బయటి నుంచి తెచ్చిన వానపాములు వేసి 45 రోజు ల తర్వాత వానపాముల విసర్జక పదార్థం వర్మీకం పోస్టు ఎరువు తయారవుతుంది. దీనిలో 16 రకా ల పోషకాలు ఉంటాయి. భూమిలో తేమశాతం ఉండి, భూమి సారవంతంగా ఉండడంతో మొ క్కల పెరుగుదలకు తోడ్పడుతుంది. తెగుళ్లు, చీడ, పీడలు పంటలకు సోకవు.

తూటికాడ (లొట్టపీచు) లేదా శీలేంద్రం ఎరువు : తూటిఆకు, ఆవుమూత్రాన్ని కలిపి ఉడక పెట్టాలి. అటు తర్వాత కిరోసిన్‌, సర్ఫు, నీరు కలిపి పంటపొలాలలోని మొ క్క మొదళ్లపెైన పిచికారీ చేస్తే దోమకాటు తోపాటు, తెగుళ్లు, చీడపీడలను నివా రించవచ్చు.

కషాయాల తయారీ : వేప ఆకు, ఆవుపేడ, ఆవుమూత్రం, సర్ఫు, వాయిలాకు, ఉడకబెట్టి కషాయం తయారుచేస్తారు. అదేవిధంగా వేపపిండి, సర్ఫు కలిపి కూడా కషాయం తయారుచేస్తారు.

రవ్వ ద్రవజీవం : ఆవుపేడ, శనగపిండి, ఆవుమూత్రం, అడవిపుట్టమన్నుతో తయారుచేసిన జీవరసాయనం పంట పెరుగుదలకు ఉపయోగపడుతుంది.

కొడిశ కషాయం : కొడిశ ఆకు, ముష్టి ఆకు, శీతాఫలం ఆకు, వాయిలాకు, వేపాకులతో తయారుచేసిన కషాయం పంటపొలాలకు ఉపయోగిస్తే రెక్కల పురుగు చనిపోతుంది.

వరి టానిక్‌ : ఈ ద్రవం వరి ధాన్యం బరువు పెరగడానికి, వరి కంకి పెరుగుదలకు ఉపయో గపడుతుంది. ఈ టానిక్‌ తయారీకి ఏడు రకాల పప్పు దినుసులెైన గోధుమలు, నువ్వులు, పెసలు, కందులు, శనగలు, మినుములు, బొబ్బర్లను ఒక్కరోజు నానపెట్టిన తర్వాత రుబ్బి కషాయాన్ని తయారుచేసి వరిపొలాలకు పిచికారీ చేయాలి.

బ్రహ్మాస్త్రం కషాయం : పొగాకు, వేపాకు, ఆవుపేడ, ఆవుమూత్రం, సర్ఫు, నీరు కలిపి ఈ కషాయాన్ని తయారుచేస్తారు.

ప్రముఖుల అభినందనలు…

ముక్తి లక్ష్మికి పురుగు మందులు లేని వ్యవసాయ విధానానికి విశేష కృషి చేసినందుకు ఆగస్టు 15, 2008లో అప్పటి కలెక్టర్‌ శశిభూషణ్‌కుమార్‌ ఉత్తమ మహిళా రెైతు అవార్డును అంద జేశారు.
కేంద్రమంత్రి జెైరామ్‌ రమేష్‌ ముక్తి లక్ష్మిని ్రపసంశాపత్రంతో అభినందించారు.

ఏలూరులో జరిగిన రెైతు సదస్సులో మాజీ ముఖ్యమంత్రి వెైఎస్‌.రాజశేఖరరెడ్డి, పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌లు అభినందించారు.

జాతీయ ఆంగ్ల మాసపత్రిక ‘‘డౌన్‌ టు ఎర్త్‌’’ ముక్తి లక్ష్మిని ఒక శక్తి వనరుగా 2006, మే 31న పేర్కొనడం విశేషం.

బీహార్‌ రాష్ట్ర కలెక్టర్ల బృందం జూన్‌8, 2006లో ముక్తి లక్ష్మి చేస్తున్న సుస్థిర వ్యవసాయ విధానాన్ని పరిశీలించి ప్రశంసించారు. ప్రతి సోమవారం సమీప గ్రామీణ ప్రాంతాల్లోని పంటపొలాలను, అంతరపంటలను పరిశీలించి వారికి తగిన సూచనలు ఇస్తున్నట్లు ముక్తి లక్ష్మి తెలిపారు.

మహిళా ప్రగతిని పరిశీలించిన ఇతర ప్రాంతాలవారు ఖమ్మం జిల్లాతోపాటు, మహబూబ్‌ నగర్‌ జిల్లా ఐకెపి సమాఖ్య బృందాలు, బీహార్‌ కలెక్టర్ల బృందం, కర్నాటక శాస్తవ్రేత్తలు, మహారాష్ట్ర రెైతులు, చెనె్నై వ్యవసాయ విద్యార్థులు, బంగ్లాదేశ్‌ వ్యవసాయాధికారులు, ప్రపంచబ్యాంకు బృందం అనేకసార్లు ఈ గ్రామంలో పర్యటించి మహిళల కృషిని ప్రశంసించారు.

స్వల్ప ఖర్చులు… అధిక దిగుబడులు

సిఆర్‌డిఎస్‌ స్వచ్ఛంద సేవాసంస్థ ఇందిరా క్రాంతి పథకం ఆర్థిక సహకారంతో సుస్థిర వ్యవసాయ పద్ధతిలో రామచంద్రాపురం, గాంధీనగర్‌, బచ్చలికోయగూడెం గ్రామాల్లో రెైతులు పత్తి, వరి పంటలను సాగుచేస్తూ సుస్థిర వ్యవసాయ పద్ధతులు అమలుచేస్తూ అధిక దిగుబడులు సాధించి ఆదర్శంగా నిలుస్తున్నారు.
– ఈలగాలి బిక్షం, స్టాప్‌ రిపోర్టర్‌, ఖమ్మం

 

Surya Telugu Daily

జనవరి 9, 2011 Posted by | ప్రకృతి | 1 వ్యాఖ్య

వృక్ష చిత్రాలు-3

వృక్ష చిత్రాలు-3

ఆగస్ట్ 6, 2010 Posted by | ప్రకృతి | | 2 వ్యాఖ్యలు

సుమం ప్రతిసుమం సుమం -1

సుమం ప్రతిసుమం సుమం -1

ఆగస్ట్ 3, 2010 Posted by | ప్రకృతి | , , | 3 వ్యాఖ్యలు

అందమైన కాక్టస్ మొక్కలు

అందమైన కాక్టస్ మొక్కలు

astrophytum-myriostigma-cactus

cactus-montanero

ethelm-cactus

guia_cactus

Hoodia cactus south africa

prickly-pear-cactus

saguaro_cactus

san_pedro_cactus

జూలై 25, 2010 Posted by | ప్రకృతి | | 2 వ్యాఖ్యలు

కనువిందుచేసే రామచిలుకలు

కనువిందుచేసే రామచిలుకలు

జూలై 21, 2010 Posted by | ప్రకృతి | | 4 వ్యాఖ్యలు

ఫలభరితం

ఫలభరితం

జూలై 4, 2010 Posted by | ప్రకృతి | | వ్యాఖ్యానించండి

camouflage-పరిసరాలతో మమేకం

camouflage-పరిసరాలతో మమేకం

జూలై 2, 2010 Posted by | ప్రకృతి | | 7 వ్యాఖ్యలు

ఆక్వారియం చేపలు

ఆక్వారియం చేపలు

జూలై 1, 2010 Posted by | ప్రకృతి | , , | 1 వ్యాఖ్య

వృక్షో రక్షతి రక్షితః

వృక్షో రక్షతి రక్షితః

జూన్ 27, 2010 Posted by | ప్రకృతి | | 4 వ్యాఖ్యలు

ఏమైపోయాయి-ఈ పిచ్చుకలు

ఏమైపోయాయి-ఈ పిచ్చుకలు

జూన్ 26, 2010 Posted by | ప్రకృతి | | 5 వ్యాఖ్యలు

ఎంత బాగుంటాయో

ఎంత బాగుంటాయో

మే 30, 2010 Posted by | ప్రకృతి | , | 1 వ్యాఖ్య

ఊసరవెల్లి

ఊసరవెల్లి

మే 28, 2010 Posted by | ప్రకృతి | 2 వ్యాఖ్యలు

శిలాకృతులు

శిలాకృతులు
ప్రకృతి నిర్మితాలు

మే 18, 2010 Posted by | ప్రకృతి | , , , , , | 2 వ్యాఖ్యలు

సిరా తో చిత్రాలు

సిరా తో చిత్రాలు

మే 16, 2010 Posted by | ప్రకృతి | , , , , | వ్యాఖ్యానించండి

కడియం నర్సరీలు

కడియం నర్సరీలు

మే 12, 2010 Posted by | ప్రకృతి | , , , | 6 వ్యాఖ్యలు

పాములు-మన సహజీవులు

పాములు-మన సహజీవులు

అనకొండ

ఆల్బినో కార్న్

కోరల్ స్నేక్  కోరల్ స్నేక్

కార్న్ స్నేక్

గార్టార్

గోఫర్

గ్రీన్ స్నేక్

రేసర్

కింగ్ కోబ్రా

త్రాచు పాము

పైథాన్

రెండు తలల పాము

మే 10, 2010 Posted by | ప్రకృతి | , , , , , , , | 1 వ్యాఖ్య

వెదురు టాక్సీ

వెదురు టాక్సీ
పర్యావరణం బాగు బాగు

మే 8, 2010 Posted by | ప్రకృతి | | 1 వ్యాఖ్య

వృక్ష ఆవాసాలు

వృక్ష ఆవాసాలు
ప్రక్రుతి తో సహవాసాలు

మే 5, 2010 Posted by | ప్రకృతి | | వ్యాఖ్యానించండి

తైల వర్ణాలు

తైల వర్ణాలు

మే 4, 2010 Posted by | ప్రకృతి | , , | వ్యాఖ్యానించండి

వృక్ష చిత్రాలు

వృక్ష చిత్రాలు

మీకు ఏది నచ్చింది ….

ఏప్రిల్ 17, 2010 Posted by | ప్రకృతి | , | 2 వ్యాఖ్యలు

ఫలాలు -ప్రకృతి వరాలు

ఫలాలు -ప్రకృతి వరాలు

సీజన్లో పండ్లు తినండి.ఆరోగ్యంగా వుండండి.

ఏప్రిల్ 16, 2010 Posted by | ప్రకృతి | , , , , | 2 వ్యాఖ్యలు

సాయంకాలం సాగరతీరం

సాయంకాలం సాగరతీరం
విశాఖ అందం

అరటికాయ బజ్జి

ఏప్రిల్ 13, 2010 Posted by | ప్రకృతి | , , , , , | 5 వ్యాఖ్యలు

ఈ పూవును ఎక్కడైనా చూసారా

ఈ పూవును ఎక్కడైనా చూసారా

ఏప్రిల్ 11, 2010 Posted by | ప్రకృతి | , , , | 11 వ్యాఖ్యలు

పక్షులు-కలిసి జీవిద్దాము

పక్షులు-కలిసి జీవిద్దాము

ఏప్రిల్ 5, 2010 Posted by | ప్రకృతి | , , , , | 2 వ్యాఖ్యలు

ఆర్కిడ్లు-నయనానందకరాలు

ఆర్కిడ్లు-నయనానందకరాలు

ఏప్రిల్ 3, 2010 Posted by | ప్రకృతి | | 4 వ్యాఖ్యలు

వర్ణచిత్రాలు-1

వర్ణచిత్రాలు-1
పులకించని మది పులకించు

ఏప్రిల్ 3, 2010 Posted by | ప్రకృతి | , , | వ్యాఖ్యానించండి

రుద్రాక్షలు

రుద్రాక్షలు

రుద్రాక్ష చెట్టు

ఏక ముఖి

ద్విముఖి

త్రిముఖి

చతుర్ముఖి

పంచముఖి

షణ్ముఖి

అష్టముఖి

నవముఖి

దశముఖి

ఏకాదశ ముఖి

ద్వాదశ ముఖి

త్రయో దశ ముఖి

చతుర్ దశ ముఖి

16 ముఖి

17 ముఖి

19 ముఖి

21 ముఖి

గౌరీ రుద్రాక్ష -బహు పవిత్రం

ఏప్రిల్ 2, 2010 Posted by | ప్రకృతి | , , | 2 వ్యాఖ్యలు

హిమగిరి సొగసులు

హిమగిరి సొగసులు

ఎవరెస్ట్ శిఖరం

ఎవెరెస్ట్ బేస్ క్యాంపు

గ్లేసియర్లు

గ్లేసియర్లు

గ్లేసియర్లు

మానస సరోవరం

కైలాస శిఖరం

పాండు కేసరం

ఎవరెస్ట్ 2

ఎవెరెస్ట్ 3

కైలాసం హరహర మహాదేవ

ఏప్రిల్ 1, 2010 Posted by | ప్రకృతి | , , , , , , , , , | 5 వ్యాఖ్యలు

పక్షి గూళ్ళు

పక్షి గూళ్ళు

గూడు చెదరనీకు -వాటి గుండె చెదరనీకు

మార్చి 30, 2010 Posted by | ప్రకృతి | , , | 3 వ్యాఖ్యలు

కోనసీమ

కోనసీమ

antarvedi

inavilli

kotipalli

ఆయ్ మరి ఎల్లొత్తామ౦డి

మార్చి 28, 2010 Posted by | ప్రకృతి | , , , , , | 9 వ్యాఖ్యలు

దారు శిల్పాలు

దారు శిల్పాలు

మార్చి 27, 2010 Posted by | ప్రకృతి | , , | 2 వ్యాఖ్యలు

సాలెగూళ్ళు

సాలెగూళ్ళు

మార్చి 26, 2010 Posted by | ప్రకృతి | , , , | వ్యాఖ్యానించండి

సీతాకోక చిలుకలు

సీతాకోక చిలుకలు
అందాల నేస్తాలు

మార్చి 22, 2010 Posted by | ప్రకృతి | , , , | 1 వ్యాఖ్య

బొర్రా గుహలు

బొర్రా గుహలు

మార్చి 21, 2010 Posted by | ప్రకృతి | , , , | 1 వ్యాఖ్య

కీటకాలను తినే మొక్కలు

కీటకాలను తినే మొక్కలు

Nepenthes_villosa

drosera_capensis

pitcherplant

Highland Tropical Pitcher Plant

red_ceph_cindy

మార్చి 19, 2010 Posted by | ప్రకృతి | , | 2 వ్యాఖ్యలు

సముద్ర జీవులు

సముద్ర జీవులు

మార్చి 16, 2010 Posted by | ప్రకృతి | , , , | 1 వ్యాఖ్య

పూల సౌరభాలు

పూల సౌరభాలు