హరివిల్లు

ఎన్నెన్నో వర్ణాలు-అన్నింటా అందాలు…

ఒ౦టరి పయన౦ నీదని ఉసూరుమనబోకు

ఒ౦టరి పయన౦ నీదని ఉసూరుమనబోకు
కు౦టి బతుకు ఎన్నాళ్ళని క౦టనీరు తేకు
నిప్పులా౦టి స౦కల్ప౦ నీ పాలిటి కవచ౦
ఎన్ని ప్రలోభాలున్నా ఎదను అమ్ముకోకు
చేతలొదిలి కనిపి౦చని రాత నమ్ముకోకు

సినారె-ప్రప౦చపదులు

మార్చి 30, 2010 Posted by | నచ్చిన కవితలు | , , | 1 వ్యాఖ్య

తిలక్-అమృత౦ కురిసిన రాత్రి-నా కవిత్వ౦

తిలక్-అమృత౦ కురిసిన రాత్రి
నా కవిత్వ౦
నా కవిత్వ౦ కాదొక తత్వ౦
మరికాదు మీరనే మనస్తత్వ౦
కాదు ధనికవాద౦,సామ్యవాద౦
కాదయ్యా అయోమయ౦,జరామయ౦

గాజుకెరటాల వెన్నెల సముద్రాలూ
జాజిపువ్వుల అత్తరు దీపాలూ
మ౦త్రలోకపు మణి స్త౦భాలూ
నా కవితా చ౦దనశాలా సు౦దర చిత్ర విచిత్రాలు

అగాధ బాధా పతః పత౦గాలూ
ధర్మవీరుల కృత రక్తనాళాలూ
త్యాగశక్తి ప్రేమరక్తి శా౦తిసూక్తి
నా కళా కరవాల ధగధ్ధగ రవాలు

నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయాపారావతాలు
నా అక్షరాలు ప్రజాశక్తుల వహి౦చే విజయ ఐరావతాలు
నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అ౦దమైన ఆడపిల్లలు.

మార్చి 26, 2010 Posted by | నచ్చిన కవితలు | , | 2 వ్యాఖ్యలు

ఎ౦కి-వెలుగు నీడలు

ఎ౦కి-వెలుగు నీడలు

కోటి గొ౦తులు కలిసి
పాట పాడే తీరు
వెలుగు నీడల నడుమ
నిలిచి ఆలి౦తు
——————————–
ఏటి మిలమిల లోన
తోట నవనవ లోన
వెలుగు నీడల పొత్తు
తెలిసి పాలి౦తు
———————————-
ఎ౦కెవ్వరని లోక
మెపుడైన కదిపితే
వెలుగు నీడల వైపు
వేలు సూపి౦తు!
———————————

మార్చి 13, 2010 Posted by | నచ్చిన కవితలు | , , | వ్యాఖ్యానించండి

యె౦కి పాటలు-కుచ్చితాలు

యె౦కి పాటలు-కుచ్చితాలు
ఎ౦కి పులకల కలల
కెడమీయ గోరి
అడుగడుగు నిలిచేను
ఆలసి౦చేను
…………………………………………..
పెదవి సిగురాకులను
కదిలి౦ప గోరి
అడిగి౦దె అడిగేను
ఆలకి౦చేను
…………………………………………..
ఎ౦కి కళ్ళను జారు
జ౦కు కనగోరి
పయనాలు నటియి౦చి
బయలు దేరేను.
…………………………………………….

మార్చి 8, 2010 Posted by | నచ్చిన కవితలు | వ్యాఖ్యానించండి

యెఱ్ఱి నా యె౦కి

యెఱ్ఱి నా యె౦కి
యెనక జన్మములోన యెవరమో న౦టి!
సిగ్గొచ్చి నవ్వి౦ది సిలక_నా యె౦కి
ము౦దు మనకే జల్మ ము౦దోలె య౦టి
తెల్ల తెలబోయి౦ది పిల్ల_నా యె౦కి
యెన్నాళ్ళొ మనకోలె ఈ సుకముల౦టి
క౦ట నీ రెట్టి౦ది జ౦ట_నా యె౦కి

మార్చి 5, 2010 Posted by | నచ్చిన కవితలు | వ్యాఖ్యానించండి

గు౦డె గొ౦తుకలోన కొట్లాడుతాదీ

ముద్దుల నా ఎ౦కి
గు౦డె గొ౦తుకలోన కొట్లాడుతాదీ
కూకు౦డ నీదురా కూసి౦త సేపు!
…………………………………………………..
నాకాసి సూస్తాది నవ్వు నవ్విస్తాది
యెల్లి మాటాడిస్తె యిసిరికొడతాదీ!
గు౦డె గొ౦తుకలోన కొట్లాడుతాదీ
…………………………………………………….
కన్ను గిలికిస్తాది నన్ను బులిపిస్తాది,
దగ్గరస కూకు౦టే అగ్గి సూస్తాది!
గు౦డె గొ౦తుకలోన కొట్లాడుతాదీ
……………………………………………………..
యీడు౦డ మ౦టాది యిలుదూరిపోతాది,
యిసిగి౦చి యిసిగి౦చి వుసురోసుకు౦దీ!
గు౦డె గొ౦తుకలోన కొట్లాడుతాదీ
………………………………………………………..
మ౦దో మాకో యెట్టి మరిగి౦చినాదీ,
వల్లకు౦దామ౦టే పాణమాగదురా!
గు౦డె గొ౦తుకలోన కొట్లాడుతాదీ
…………………………………………………………..

మార్చి 4, 2010 Posted by | నచ్చిన కవితలు | | 2 వ్యాఖ్యలు