హరివిల్లు

ఎన్నెన్నో వర్ణాలు-అన్నింటా అందాలు…

భిల్ల ఆభరణాలు

భిల్ల ఆభరణాలు

nagaluభారతీయ మహిళల అనివార్య భాగం ఆభరణాలు. ఆభరణముల అతి పెద్ద ఎగుమతిదారులలో భారత దేశం కూడా ఒకటిగా ప్రపంచమంతా ప్రఖ్యాతి పొందింది. భారతీయ భిల్ల ఆభరణాలు, పూళ్ళు, ఆకులు, తీగెలు పండ్లు, లోహం మరియు చెక్కలను ఉపయోగించి సొగసైన వస్తువుల విన్యాసాలను వేసే కుశలతకు పేరు పొందినవి. ఇవన్నీ… ఈ కళను ఎక్కువ రసవంతంగా మార్చాయి. దేవతలకు ఒక ఉత్సవ నాదాన్ని ఇచ్చే గుర్రాలు, ఏనుగుల మీద కూడా ఆభరణాలను చూడవచ్చు. సంచారి, వలస పోయే భిల్ల సముదాయాలలో ధరించే ఆభరణాలను భద్రత… పెట్టుబడిల ప్రతిరూపంగా కూడా భావించ బడుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో భిల్ల ఆభరణాలను చేసేం దుకు ఉపయోగించే ముఖ్యమైన లోహాలలో వెండి కూడా ఒకటి.

ఇక్కడ వెండిని ఎక్కువగా వాడతారు. అన్ని భిల్ల జాతి మహిళలు వెండి ఆభరణాలను గర్వంతో, గౌరవంతో ఉపయోగిస్తారు. చిత్తూరు లోని పాపనాయుడుపేటకు చెందిన కొన్ని స్థానిక కళాకారులు అనేక ఛాయలలో గాజు కంకణాలను పూసలను తయారుచేస్తారు. ఇక్కడ తయారయ్యే వెండి, బంగారపు ఆభరణాలు కొన్ని మొఘల్‌ పరంపర పోలికలను పొంది ఉన్నాయి. ఈ కారణంగా ఇవి అతి సొగసైన రూపాన్ని పొందియున్నాయి. కళాకారులు సామాన్యంగా బంగారం పూసిన ఆభరణాలను చేస్తారు. దీనిలో వెండి, ఇత్తడి మరియు తామ్రాలను మట్టలోహంగా చేసి బంగారంతో కప్పబడుంటాయి.

కొన్ని సామాన్యమైన ఆభరణాలంటే ఈ భిల్లలు ఉపయోగించే గాజులు, హేర్‌ పిన్‌, కంఠ హారము, కమ్మలు మొదలైనవి. ఈ స్థలంలో ముందుగా లక్కతో చేసిన ఆభరణాలు ఎక్కువ ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు కృత్రిమ రాళ్ళు, గాజుతో చేసిన ఉంగరాలు, దర్పణాలు,గాజు పూసలు మొదలైనవి ప్రాముఖ్యత పొందియున్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బంజారా భిల్ల జాతివారు అసమానమైన నాణ్యత కంఠహారాన్ని తయారుచేయడం. చిప్పలు, లోహ-కన్ను, పూసలు మరియు హారాలతో శృంగారించిన సుందర ఆభరణాలు మరియు బెల్టులను ధరిస్తారు.

బిద్రి కళ: ఆంధ్రప్రదేశ్‌లోని ఒక ప్రముఖ వైఖరియంటే బిద్రి. ఈ పదము బీదర్‌ నుంచి ఉద్భవించిన ఒక లోహకళ. ఈ కళలో ముఖ్యంగా నల్ల లోహం మీద వెండిని తాపు చేస్తా రు. భిల్ల మహిళలు ధరించే ఆభరణములను చేసేందుకు ఈ లోహాన్ని ఉపయోగిస్తారు.

వెండి ఫెల్లగ్రీ:దీనిని కరీంనగర్‌కు చెందిన కళాకారులు ప్రత్యేకంగా తయారుచేస్తారు. వెండి ఫెల్లగ్రీ పనిలో కొన్ని సన్నమైన మరియు కళాత్మకమైన వెండి ఆభరణాలు, కొన్ని గృహోపయోగ వస్తువులను తయారుచేస్తారు.

సూర్య తెలుగు

 

జూలై 1, 2011 Posted by | అతివల కోసం | 1 వ్యాఖ్య

మెరిసే శ్వేతాభరణాలు..

మెరిసే శ్వేతాభరణాలు..
బంగారం తరువాత అతివలు ఎంతో ఇష్టపడే వాటిల్లో ముత్యాలకు మొదటి స్థానం ఉంది. బంగారం ధర అమాంతం పెరిగిపోతుండడంతో ప్రస్తుతం మగువలు పెరల్స్‌ జ్యువెలరీపై ఆసక్తి పెంచుకుంటున్నారు. మార్కెట్‌లో డిమాండ్‌ పెరుగుతుండడంతో వీటితో విభిన్న రకాలు, డిజైన్లలో అనేక ముత్యాల ఆభరణాలు మార్కెట్‌లోకి వస్తున్నాయి. కాలేజీలకు వెళ్లే వారినుంచి సామాన్యుల వరకు వీటిని కొనుగోలు చేస్తున్నారు. మెరిసిపోయే ముత్యాలను ధరించి మురిసిపోతున్నారు.

Girl-with-the-Pearlపూర్వకాలంలో ఖరీదైన సహజ ముత్యాలతోనే ఆభరాలను తయారు చేసేవారు. అందువల్ల ఇవి ధనికులు, ఉన్నత కుటుంబాల వరకే పరి మితమయ్యాయి.1900 దశకంలో కృత్రిమ పద్ధతిలో ముత్యాలు తయారు చేయడం కనిపెట్టినప్పటి నుంచి సామాన్యులకు కూడా ఇవి అందుబాటులోకి వచ్చాయి.

ముత్యాల రాజధాని…
మన హైదరాబాద్‌ నగరానికి ముత్యాల రాజధాని అనే పేరు ఎప్పటినుంచో ఉంది. పూర్వపు రోజుల్లో ము త్యాలను రాశులుగా పోసి అమ్మిన ప్రాంతం కాబట్టి ఆ పేరు వచ్చింది. క్రమేపీ నాగరి కత పెరగడంతో వీటి వాడకం తగ్గింది. అయితే ఇప్పుడు ఆధు నిక యువతీ యువకులు ము త్యాల ఆభరణాలను ధరించేం దుకు ఇష్టపడుతున్నారు. బం గారం ధర కొండెక్కి కూర్చో వడం ఒక కారణమైతే ఆర్టిఫిషి యల్‌ పెరల్స్‌తో ఎంతో అందంగా డిజైన్‌ చేసిన ఆభరణాలు, యాక్ససరీస్‌ మార్కెట్‌లోకి రావడం మరొక కారణం. ముత్యాలతో చేసిన ఆభరాణాలంటే అతివలకు ఎంతోఇష్టం. అంతేకాదు మార్కెట్లో వీటికి ఎంతో గిరాకీ కూడా ఉంది. సముద్రపు అడుగుల్లో మాత్రమే లభించే ముత్యాలను 1914 నుంచి మంచినీటి చెరువుల్లో కూడా ముత్యాలను పెంచడం నేర్చుకున్నారు రైతులు. ఇక అప్పటినుంచి ముత్యాల వాడకం పెరిగింది.

చరిత్రలో…
ప్రాచీన ఈజిప్టులో ముత్యాలకు ప్రముఖ స్థానం కల్పించినట్లుగా చరిత్ర చెబు తుంది. అతి ప్రాచీనమైన ముత్యంగా ప్రసిద్ధి గాంచిన ‘జోమాన్‌’ జపాన్‌ దేశా నికి చెందింది. దీనికి 5500 సంవత్సరాల చరిత్ర ఉంది. చైనీయులు కూడా వారి అభరణాలలో ముత్యాలు వాడినట్లుగా 4000 సంవత్సరాల చరి త్ర కలి గిన వారి గ్రంధాలు చెబుతున్నాయి. ప్రాచీన చైనీయుల సంకేత భాషలో ము త్యము స్వచ్ఛతకు, విలువలకు సంకేతంగా భావించేవారు. అప్పటి ప్రభు త్వాలు ముత్యాలను పన్ను రూపంలో చెల్లించడానికి కూడా అనుమతించేవి. ధనవంతులైన వారు చనిపోయినప్పుడు వాని నోట్లో ఒక ముత్యాన్ని ఉంచి ఖననం చేసేవారు. ఇలా అనేక రూపాల్లో పూర్వం ఈ ముత్యాలు వాడుకలో ఉండేవి.

ఉత్సాహం చూపిస్తున్నారు…
‘నేడు బంగారం ధర ఎలా పెరిగిపోతోందో మనందరికీ తెలుసు. అందువల్ల వాటిని కొనేందుకు వెనకడుగు వేస్తున్నారు. వాటికి బదులుగా వన్‌గ్రామ్‌ గో ల్డ్‌ జ్యూవెరీని, ముత్యాలతో చేసిన ఆభరణాలను కొనుగోలుకు ఆసక్తి కనబ రుస్తున్నారు. నేడు పలు రంగులలో, డిజైన్లలో పెరల్స్‌ మార్కెట్‌లో లభిస్తున్నా యి. ధరలు కూడా అందుబాటులో ఉండటం వల్ల ఈ ఆభరణాలను ఎక్కు వగా కొనుగోలుచేస్తున్నాను. మేమే కాదు మా కాలనీలోని చాలా మంది పెర ల్స్‌ జ్యువెరీనే కొనేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు’ అని కార్పొరేట్‌ కంపెనీల ప్రాజెక్ట్‌ మేనేజర్‌గా పనిచేస్తున్న సుధ అన్నారు. ఇక జ్యూయలరీ డిజైనర్లు మగువల డిమాండ్‌ మేరకు ప్రత్యేకంగా అందమైన డిజైన్లలో పెరల్స్‌ జ్యూయలరీని రూపొందిస్తున్నారు.

మూడురకాలుగా…
స్వాతి కార్తె తొలకరి చినుకు ముత్యపుచిప్పలో పడితే ముత్యంగా మారుతుం దని అందరం భావిస్తుంటాం. శాస్ర్తీయ భాషలో ‘ఆయిస్టర్‌’ అనే గుల్ల కలిగిన కవచం ఎక్కువగా సముద్రాలలో ఉంటుంది. ఈ కవచంలో నీటి బిందువు, ధూళి, ఇసుక రేణువు పడితే క్రమేనా దాని చుట్టూ గట్టిపొరలు పొరలుగా ఏర్పడుతుంది. దీన్నే మనం ముత్యంగా వ్యవహరిస్తాం. ప్రస్తుతం ఈ ము త్యాలను మూడు రకాలుగా వర్గీకరించవచ్చు. ఇవి సహజముత్యాలు (నేచు రల్‌ పెరల్స్‌), సాగుచేసిన ముత్యాలు (కల్చర్డ్‌ పెరల్స్‌), అనుకరణ ముత్యాలు (ఇమిటేషన్‌ పెరల్స్‌)గా చెప్పుకోవచ్చు.

సహజ ముత్యాలు…
పేరుకు తగ్గట్టుగానే ఇవి ఎవరిచేతనైనా పెంచబడకుండా వాటంతట అవే తయారవుతాయి. ఇప్పటికీ చాలా చోట్ల ముత్యాలు సహజంగానే ఏర్పడు తుంటాయి. కానీ వీటిని కనుగొనాలంటే ఎక్కడో సముద్రపు అడుగు భాగాన వెతకాల్సిందే. ఇప్పట్లో సహజ ముత్యాలను సంపాదించి ఓ హారాన్ని తయా రుచేయాలంటే దాదాపు అసాధ్యమైన పని. సముద్రాలలో సహజంగా తయా రైన ముత్యాలు సాధారణంగా నిర్ధిష్ట ఆకారాన్ని కలిగిఉండవు. ఇంకా ధర కూ డా చాలా ఎక్కువగా ఉంటాయి. ధనిక కుటుంబాలు కూడా ప్రస్తుతం ఆర్టి ఫిషియల్‌ పెరల్స్‌పైనే మక్కువ చూపుతున్నారు.

అందుబాటులోకి తీసుకు వచ్చారు…
ముత్యాలను ధరించాలనే ఆసక్తి ఎక్కువైన సమయంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సహజ పద్ధతికి దగ్గరగా వాణిజ్య స్థాయిలో ముత్యాల సాగు అందుబాటులోి తీసుకొచ్చారు. 1914 వ సంవత్సరం నుంచి రైతులు మం చినీటి గుంటల్లో కూడా ముత్యాలను పెంచడం ప్రారంభించారు. ఇక అప్పటి నుంచి మధ్యతరగతి, సామాన్యులకు కూడా ఇవి అందుబాటులోకి వచ్చా యి. ఇవి కల్చర్డ్‌ పెరల్స్‌. తరువాత ఫ్యారీల్లో తయారుచేసే ముత్యాలు మా ర్కెట్‌లోకి వచ్చాయి. ప్లాస్టిక్‌, ఫైబర్‌ వంటి పదార్ధాలతో తయారుచేసే అను కరణ ముత్యాలూ వచ్చాయి. ఎక్కడి నుంచి వచ్చినా ఎలా ఏర్పడినా ఇవి తయారయ్యేది మాత్రం కాల్షియం కార్బోనేట్‌ అనే పదార్థం తోనే. ఇవి గుండ్రంగా, కొన్ని ద్రవ బిందువుల ఆకారంలోనూ, కొన్ని అండాకారంలోనూ ఉంటాయి. వీటిలో గుండ్రంగా ఉన్నవి, బిందువు ఆకారంలో ఉ న్నవి ఎక్కువ ధర పలుకు తాయి.

అనేక రంగులలో…
jwellaryladyసహజంగా లభించే ముత్యాలు తెలుపు రంగులోనే ఉంటాయి. కానీ ఇప్పుడు రైతులు పసుపు, ఆకుపచ్చ, నీలం, నలుపు, గులాబీ, బ్రౌన్‌ ఇంకా పర్పుల్‌ కలర్‌లలో రూపొం దిస్తున్నారు. దాంతో ముత్యాల తో ఆభరణాలను తయారుచేసే వారికి కొత్త కొ త్త డిజైన్లతో తయారు చేసేందుకు ఎక్కువ అవకాశాలు కలిగాయి. సరికొత్త మోడల్స్‌తో నగలను రూపొందించేందుకు మార్గం సులువయ్యింది.

పలు రకాలు…
ముత్యాలతో హారాలు, ఇయర్‌్‌రింగ్స్‌ వంటి ఆభరణాలే కాకుండా బ్రేస్‌లేట్స్‌, బ్రూచ్‌, చేతి ఉంగరాలు, వాచీలు, లాకెట్‌ వంటి యాక్ససరీస్‌ను కూడా తయారుచేస్త్తున్నారు. ఇంతకు మునుపు అతివలు ధరించేం
దుకు వీలుగా ఉండేవాటినే తయారు చేసేవారు. ఇప్పుడు మగవారు కూడా ధరించేందుకు వీలైన ఆభరణాలను, డిజైన్లను కొత్తగా రూపొందిస్తున్నారు. వాచీలు, ఉంగరాలు, లాకెట్‌, బ్రేస్‌లేట్స్‌ వంటి వాడిని ఎంతో నూతనంగా డిజైన్‌ చేస్తున్నారు. చీరలు పార్టీవేర్‌ దుస్తులకు అనుగుణంగా ఇవి తయారవుతున్నాయి.

Surya Telugu Daily.

మార్చి 6, 2011 Posted by | అతివల కోసం | | 1 వ్యాఖ్య

హై హీల్స్‌… హై రిస్కులు…

హై హీల్స్‌… హై రిస్కులు…

High_Heel_Shoe1 వలన నడకలో హొయలు వచ్చి.. నడక అందాన్ని దిద్దుకుంటుంది. కాస్తంత ఎత్తు తక్కువగా ఉన్న వారు కూడా ఎత్తుగా వున్నవారిలా కన్పించే అవకాశం వీటిలో వుంది. అయితే హైహీల్స్‌ను ఏదో ఒక సందర్భంలో వుపయోగించడం వలన అంతగా ప్రమాదమేమీ ఉండదు. కానీ రెగ్యులర్‌గా ఉపయోగించారంటే మాత్రం వాటి కారణంగా చాలా రకాల ఇబ్బందులు ఎదురవుతాయి. హైహీల్స్‌ షేప్‌ కార ణంగా పాదాల మీద అధిక భా రం పడుతుం ది. వెన్నెము క, మెడ వీటి పైన కూడా, అధిక భారం పడి.. అవి నొప్పి పెట్టే అవకాశం ఉంది. ఎక్కువ కాలం హైహీల్స్‌ వాడటం వలన పాదం చీల మండలం దగ్గర వుండే ఎచిలిస్‌ టెండాన్‌ పొట్టిగా తయా రయ్యే అవకాశం ఉంది. దీంతో టెండాన్‌ ఇబ్బందిని కలిగిస్తుం ది. పాదాలపై ఆనెలు, బ్లిస్టర్స్‌ వంటివి రావటానికి, హైహీల్స్‌ కారణం అవుతాయి. ఆనెలు, వత్తిడితో కలిగే బ్లిస్టర్స్‌ నొప్పితో నడవ నీయని పరిస్థితి తెచ్చిపెట్టే ప్రమాదం ఉంది.

High_Heel_Shoe దీర్ఘకాలం హైహీల్స్‌ వాడేవారిని న్యూరోమా అన్న సమస్య వేధిస్తుంది. తీవ్రమైన నొప్పి కాకుండా… దీర్ఘకాలంగా పెయిన్‌ను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తే సర్జరీ చేయాల్సిన అవసరం కూడా రావచ్చు. దీర్ఘకాలం హైహీల్స్‌ వాడడం వలన పాదం వెనుక భాగంలో లోపం ఏర్పడుతుంది. ఇది కూడా వేధిస్తుంది.బొటన వ్రేళ్లలో కూడా లోపాలు ఏర్పడే అవకాశం ఉంది. హైహీల్స్‌ ధరించినప్పుడు మెదడుకు వెళ్లే నరాలు వత్తిడికి గురై.. మెదడు కార్యకలాపాలు సక్రమంగా జరగవు. పూర్తిగా హైహీల్స్‌కు దూరంగా వుండటం కుద రని పక్షంలో వీలయినంత వరకు వీటి వాడ కాన్ని తగ్గించేందుకు చేసేందుకు ప్రయ త్నించాలి. హీల్స్‌ గనుక వేసుకోవాల్సి వస్తే వాటిని వేసు కున్నా సరే కూ ర్చు న్నప్పుడు చెప్పు లను విడిచి పా దాలను నేలపై పె ట్టుకోవాలి. నడి చేటప్పుడు వేసు కోవాలి అని నిపుణులు సూచిస్తున్నారు.

Surya Telugu Daily .

ఫిబ్రవరి 21, 2011 Posted by | అతివల కోసం | వ్యాఖ్యానించండి

కలంకారీ.. కళకళలు!

కలంకారీ.. కళకళలు!

కొంతమంది సహజంగానే అందంగా ఉంటారు. అందంగా ఉన్నంత మాత్రాన వారు ధరించే వస్త్రాలు అన్నీ వారికి నప్పుతాయనుకుంటే పొరపాటు. కొంతమందికి మోడ్రన్‌డ్రెస్సులు బాగుంటే మరికొంతమందికి సంప్రదాయ వస్త్రాలు మెరిపిస్తాయి. గతంలో ఏదైనా ఫంక్షన్‌ ఉందంటే మోడ్రన్‌ డ్రెస్సులవైపు మళ్ళిన అతివల దృష్టి ఇప్పుడు చీరలపైకి తిరిగింది. దీనికి ప్రధాన కారణం ఏ ఫంక్షన్‌కైనా, పార్టీకైైనా చీరకట్టు సందర్భోచితంగా ఉంటుంది. అందుకే వస్త్ర వ్యాపారస్తులు కూడా చీరల అమ్మకాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు.మాస్టర్‌వీవర్స్‌ సరికొత్తగా అందిస్తున్న బ్లాక్‌ ప్రింట్‌, కలంకారి, మంగళగిరి ఫ్యాబ్రిక్‌ల చీరెలు మగువల మనసు దోచుకుంటున్నాయి. మహిళల అందాన్ని ద్విగుణీకృతం చేసే ఈ చీరలను ఈ వారం ధీర మీకు పరిచయం చేస్తోంది.

saree2సీకో శారీ పై బ్లాక్‌ ప్రింట్‌ చేసి, పల్లులో ప్రత్యేకంగా పెన్‌ కలంకారి డిజైన్‌, మిషన్‌ ఎంబ్రాయిడరీతో ప్యాచింగ్‌ చేయడం వల్ల డిఫరెంట్‌ లుక్‌ ఇస్తుందీ శారీ..
ధర : 2375

saree1సూపర్‌ నెట్‌ శారీపై మొత్తం బ్లాక్‌ ప్రింట్‌ చేసి కలంకారి బ్లాక్‌ ప్రింట్‌, మంగళగిరి ఫ్యాబ్రిక్‌లను బార్డర్‌గా ప్యాచింగ్‌ చేశారు. రెండు ప్యాచింగ్‌ల మధ్య బ్లాక్‌ ప్రింట్‌తో హైలెట్‌ చేయడంతో అద్భుతంగా కనిపిస్తుందీ శారీ.
ధర : 1585

sareeసూపర్‌నెట్‌ ఫ్యాబ్రిక్‌కు బాతిక్‌, బ్లాక్‌ప్రింట్‌ కలంకారీ ఫ్యాబ్రిక్‌లను బార్డర్‌గా ప్యాచింగ్‌ చేశారు. శారీ మొత్తం గోల్డ్‌ కడీ ప్రింట్‌లతో నయనానందకరంగా వుందీ శారి

డిజైన్స్‌: మాస్టర్‌ వీవర్‌
దిల్‌సుఖ్‌నగర్‌ : 04024050422
బంజారాహిల్స్‌ : 04023386437
ఫోటోలు : అరుణ స్టూడియో
వెబ్‌సైట్‌ : http://www.masterweaver.in

.

Surya Telugu Daily .

జనవరి 28, 2011 Posted by | అతివల కోసం | వ్యాఖ్యానించండి

మనసు గెలిచే మంత్రం

మనసు గెలిచే మంత్రం

రాజీ అనే పదం వినగానే చాలామంది తమ వ్యక్తిత్వానికే భంగం కలిగినట్టే భావిస్తుంటారు. రాజీ పడడమంటే తనను తాను తక్కువ చేసుకోవడమేనని అనుకుంటారు. అయితే అన్ని సమయాల్లోనూ మొండితనం పనికిరాదు. పట్టు విడుపులు లేకపోతే వ్యక్తిగా మనం ముందుకు వెళ్ళడం కష్టం. అదే ఇక కుటుంబ సంబంధాలు, మానవ సంబంధాలలో రాజీ అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది.ముఖ్యంగా కొత్తగా పెళ్ళి అయి అత్తగారింట్లో అడుగుపెట్టిన అమ్మాయికి రాజీ ఒక కీలక సూత్రం. అందునా ఇప్పటి ఆడపిల్లలు విద్యావంతులు, భర్తలతో సమానంగా సంపాదిస్తూ, ఆర్థిక స్వేచ్ఛను సాధించి తమ కాళ్ళపై తాము నిలబడ్డవారు. వారికి కొత్త కోడలిగా అందరినీ మెప్పించడం ఒక ప్రధాన అంశం. అందుకోసం కొంత అణకువ ప్రదర్శించడం అవసరమే.

కొత్తకోడలికి…
familyసంప్రదాయబద్ధంగా జరిగే వివాహమైనా, ప్రేమ వివాహమైనా అత్తింట్లో కొత్త కోడలి మనుగడ కత్తిమీద సామే. తాను పుట్టి పెరిగిన వాతావరణాన్ని వదిలి, కొత్త ఇంట్లోకి వచ్చిన ఆమె సర్దుకోవడానికి కొంత సమయం పడుతుంది. సర్దుబాటు అనివా ర్యం. ఎందుకంటే భవిష్యత్‌ జీవితమంతా గడిపేది అక్కడే. అందు కే మొదట్లో కాస్త రాజీ పడడం ద్వారా ఆ ఇంటివారితో సత్సంబంధాలను పెంచుకోవడమే కాదు గృహ వాతావరణం ఆహ్లాదభరితం చేసేందుకు దోహదపడుతుంది.కోడలు ఎంత చదువుకున్నా తన ముందు ఒదిగి ఉండాలనే కోరిక అత్తగారికి ఉంటుంది.చిన్న చిన్న పనుల ద్వారానే అత్తింటివారి మనసును దోచుకోవచ్చు.ఆధునికతను, సంప్రదాయాన్ని రెండింటిని సమతులం చేయగలిగిన వారు ఇంటిని స్వర్గధామంగా ఉంచుకోగలుగుతారు.

సమస్యలు ఎదురైనా..
కొన్ని సమస్యలు ఎదురైనా కొద్ది రోజులు సంప్రదాయబద్ధంగా ఉండటం ద్వారా వారి మనసును గెలుచుకొని అనంతరం దానిలోని సాధకబాధకాలను వివరిస్తే వారే దారిలోకి వచ్చేస్తారు. తన తల్లిదండ్రులను సంతోష పెట్టినందుకు భర్త కూడా ఎంతో ఆనందానికి లోనవుతాడు. తద్వారా భార్యభర్తల మధ్యే కాదు కుటుంబంలో బంధాలు పటిష్టమౌతాయి. ముఖ్యంగా ప్రేమ వివాహం చేసుకున్నవారు అత్తింట్లో మొదట్లో కొంత రాజీ ధోరణిని అవలంబించడం ద్వారా వారి ప్రేమకు కూడా పాత్రులు కావచ్చు.

మతాంతర వివాహం చేసుకున్నవారు…
ఇక మతాంతర వివాహం చేసుకున్నవారు మరిన్ని సమస్యలు ఎదుర్కొంటారు. ఊహ తెలిసినప్పటి నుంచి ఒక మతాన్ని అవలంబించి, వివాహం చేసుకున్న తరువాత వేరే మతాన్ని అనుసరించడం వారికి కొంత కష్టంగానే ఉం టుం ‚ది. అయితే కొన్ని పొందడానికి, మరికొన్ని త్యాగం చేయక తప్పదు. అత్తగారింటి పద్ధతులు కొన్నింటినైనా అనుసరించడం ద్వారా వారి మనసును గెలుచుకోవచ్చు. కొన్ని సార్లు వేషధారణను, చేస్తున్న పనిని కూడా మార్చుకోవలసి రావచ్చు. కుటుంబం ముఖ్యమనుకుంటే వాటిని కూడా మార్చుకోవలసి ఉంటుంది.

వాస్తవ జీవితానికి దగ్గరగా..
motherపెళ్ళికి ముందు ప్రతి ఆడపిల్లా తనను చేసుకోబోయే అబ్బాయి గురించి అనేక కలలు కంటుంది. కానీ ఊహ వేరు, వాస్తవం వేరు. అది అనుభవంలోకి వచ్చినప్పుడు కొంత ఇబ్బంది కలిగే మాట నిజమే. ఇక తాను పుట్టి పెరిగిన ఇంటిని, ప్రాంతాన్ని వదిలివెళ్ళే వారి పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. కొత్త మనుషులు, కొత్త ఇల్లు, ఊరు కాని ఊరు.స్నేహితులు ఉండరు. భాష రాదు. చాలా దయనీయమైన పరిస్థితే.అటువంటప్పుడు అత్తింటివారు మినహా పలకరించే దిక్కు ఉండదు. ఈ పరిస్థితుల్లో వారితోనే స్నేహం చేయడం ఉత్తమం.

స్నేహం ఓ మార్గం…
పెద్దవారితో ఎలా ప్రవర్తించాలా అన్న మీమాంస ఉంటే ముందుగా ఆ ఇంట్లో తమ వయసువారితో స్నేహం చేయడం ఒక మంచి ఉపాయం అవుతుంది. సహజంగానే ఒకే వయసువారి మధ్య స్నేహం వికసించడానికి ఎక్కువ సమయం పట్టదు. అలా ఆడపడుచులు లేదా మరుదులు ఎవరైనా సరే వారితో స్నేహం చేయడం ద్వారా అత్తగారితో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకోవడానికి మార్గాన్ని సుగమం చేసుకోవచ్చు.ఒంటరితనాన్ని, ఇతరత్రా సమస్యలను అధిగమించడం తేలిక అవుతుంది. అమ్మ సలహా తీసుకున్నట్టే అత్త సలహా తీసుకోవడం ద్వారా ఆమె విశ్వాసాన్ని చూరగొనవచ్చు.

రాజీ మంత్రం…
గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు ఇంట్లోని పెద్దలే అమ్మాయిని ఆ పరిస్థితులకు అనుగుణంగా మారేలా అన్నీ చెప్పేవారు. కానీ ప్రస్తుతం అన్నీ న్యూక్లియర్‌ కుటుంబాలు కావడంతో వివాహానికి ఆడపిల్లను సంసిద్ధం చేయడం ఒక పెద్ద సవాలుగా మారుతున్నది. గతంలో వివాహానికి సంబంధించిన ఇబ్బందులు వచ్చినా కౌన్సెలర్ల వద్దకు కాక ఇంటి పెద్దల వద్దకు వెళ్ళేవారు. ఇప్పుడు కాలం మారింది. అయితే మారనిది ఒకటే �రాజీ�. సంతోషకరమైన జీవితానికి ఇదొక గొప్ప సూత్రం.

Surya Telugu Daily

డిసెంబర్ 16, 2010 Posted by | అతివల కోసం | వ్యాఖ్యానించండి

కుషన్లతో ఇంటికి శోభ

కుషన్లతో ఇంటికి శోభ
ఇంట్లో ప్రతి వస్తువు ఒక ప్రత్యేకతను కలిగి ఉంటుంది. మొక్కలు మొదలుకొని ఇంట్లోని ఫ్లవర్‌ వాజ్‌, టీపాయ్‌, కర్టెన్లు, కుషన్‌ కవర్లది ప్రముఖ పాత్ర. వీటన్నింటికీ చక్కని అలంకరణ తోడయితే మీ హాల్‌ రూమ్‌ మరింత అందంగా కనిపిస్తుంది. హాల్‌లో ముఖ్యంగా సోఫా, దివాన్‌, కుషన్‌లు ముఖ్యపాత్రను పోషిస్తాయి.

Cushionsకుషన్‌ కవర్లు మీ డ్రాయింగ్‌ రూములో మరింత ఆహ్లాదాన్ని అందిస్తాయి. అయితే కుషన్లలో చాలా రకాలు ఉన్నాయి. ఇందులో సోఫా కుషన్‌ కవర్లు, సిల్‌‌క కుషన్‌ వర్లు, కాటన్‌ కుషన్‌ కవర్లు, ఎంబ్రాయిడరీ చేయబడినవి, డెకోరేటివ్‌ కుషన్‌ కవర్లు, లెదర్‌ కుషన్లు, అవుట్‌డోర్‌ ఫర్నీచర్‌ కుషన్స్‌, ఇండియన్‌ కుషన్‌ కవర్లు, ఛైర్‌ కుషనుల, లెదర్‌ కుషన్లు, సిల్‌‌క కుషన్లు, ప్యాచ్‌వర్క్‌, పింటక్‌ కుషన్లు, డై కుషన్లు, ఇలా బోలెడన్నీ రకాలు. ఇందులో మీకు నచ్చినవి ఎన్నుకొని మీ ఇంటికి మరింత అందంగా తీర్చిదిద్దుకోండి…

సిల్‌‌క కుషన్స్‌
ఉత్తమ నాణ్యతగల ఫ్యాబ్రిక్‌ మీద కలర్‌ఫుల్‌ డిజైన్‌లను ప్రింట్‌ చేసి ఉన్న ఈ సిల్‌‌క కుషన్స్‌ లివింగ్‌ రూమ్‌ లేదా, బెడ్‌ రూముల్లో అమర్చ వచ్చు. వీటి ధర కూడా తక్కువే.

డై కుషన్స్‌
ప్రత్యేక పద్ధతిలో డై చేయబడ్డ కుషన్‌ కవర్లను కార్యాలయాల్లో వాడితే మరింత హుందా త నాన్ని ప్రతిబింబిస్తాయి. సిల్‌‌క క్లాత్‌పై వెరైటీ కలర్స్‌, ప్యాటర్న్స్‌, డిజైన్లు ఎన్నో మార్కెట్లో అందుబాటులో ఉ న్నాయి. డై కుషన్స్‌ ఎక్కువగా కాటన్‌, సిల్‌‌క, ట ిష్యూ, ఆర్గంగా ఫ్యాబ్రిక్‌లలో కనిపిస్తాయి.

ఎంబ్రాయిడర్‌ కుషన్స్
అందమైన డిజైన్లను కు షన్లపై అల్లికలు వేసిన ఎంబ్రాయిడరీ కుషన్లు ఎలాం టి సమయ సందర్భాల్లోనైనా వాడవచ్చు. అద్భుత మైన ఎంబ్రాయిడరీ వర్క్‌ను అందిస్తున్న ప్రత్యేక సంస్థ లు కూడా ఉన్నాయి.

ఫ్యాన్సీ కుషన్స్‌
చూడాటానికి భారీ ప్రింట్‌ తో కనిపించే ఈ కుషన్లు ఫ్యాన్సీగా ఉంటాయి. ఎక్కువగా ఈ రకాలు విఐపీ హాలులో, కాన్ఫరెన్స్‌ హాలులో వాడతారు. రాజస్థానీ ప్యాచ్‌ వర్క్‌, గుజరాతీ సంప్రదాయ రంగుల మేళవింపుతో కనిపించే ఈ ఫ్యాన్సీ కుషన్‌ కవర్లు పార్టీలు, ఫంక్షన్‌లు, పెళ్ళిళ్లకు ఉపయోకరంగా ఉంటాయి.

లెదర్‌ కుషన్స్‌
స్పష్టమైన గ్రాఫిక్స్‌ ప్రింట్‌ను కలి గిన ఈ లెదర్‌ కుషన్‌ కవర్లు లేటెస్ట్‌గా వచ్చాయి. మీ ఇంటి ఇంటీరియర్‌కు కొత్త స్టైల్‌ను తీసుకు వస్తాయి. స్టేన్‌ ప్రూఫ్‌తో ఉన్న ఈ లెదర్‌ కుషన్‌లు హై- డ్యూరబుల్‌గా ఉంటాయి.

ప్యాచ్‌వర్క్‌ కుషన్స్‌
ఆహ్లాకరమైన రంగులను కాంట్రాస్ట్‌లో ఉపయోగించిన ఫైన్‌ ఫ్యాబ్రిక్‌ మీద ముద్రించే ఈ మల్టిపుల్‌ ప్యాచ్‌వర్క్‌ కుషన్‌లు వివిధ సైజుల్లో, డిజైన్లలో పలు రంగుల కాంబినేషన్‌లో మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.

పింటక్‌ కుషన్స్‌
క్లాస్‌లుక్‌తో స్టైల్‌, ఎలిగెన్స్‌ను అందించే ఈ సిల్‌‌క కుషన్‌ కవర్లు డైమండ్‌, స్వైర్‌ ఆకారంలో అందుబాటులో ఉన్నాయి. మీ గదికి ఈ పింటక్‌ కుషన్‌లు డీసెంట్‌ లుక్‌ను అందిస్తాయి.

Surya Telugu Daily

డిసెంబర్ 13, 2010 Posted by | అతివల కోసం | 2 వ్యాఖ్యలు

వెండి పూజాసామాగ్రి

వెండి పూజాసామాగ్రి

జూలై 31, 2010 Posted by | అతివల కోసం | | 1 వ్యాఖ్య

అతివల కోసం-నక్లేసులు

అతివల కోసం-నక్లేసులు

జూలై 16, 2010 Posted by | అతివల కోసం | , , , | 2 వ్యాఖ్యలు

లేసు డిజైన్లు

లేసు డిజైన్లు

జూన్ 29, 2010 Posted by | అతివల కోసం | | 1 వ్యాఖ్య

కనువిందు చేసే పుష్పగుచ్చాలు

కనువిందు చేసే పుష్పగుచ్చాలు

జూన్ 28, 2010 Posted by | అతివల కోసం | , | వ్యాఖ్యానించండి

కాఫీ కప్పులు

కాఫీ కప్పులు

జూన్ 25, 2010 Posted by | అతివల కోసం | , | 9 వ్యాఖ్యలు

మహిళలకు నక్లెసులు

మహిళలకు నక్లెసులు

జూన్ 14, 2010 Posted by | అతివల కోసం | | వ్యాఖ్యానించండి

అతివల కోసం -మహెంది

అతివల కోసం -మహెంది
బావున్నాయా …చెప్పండి

మే 15, 2010 Posted by | అతివల కోసం | , , , | 5 వ్యాఖ్యలు

పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ

పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ

happy mother’s day

మే 9, 2010 Posted by | అతివల కోసం | , , | 4 వ్యాఖ్యలు

అమ్మ అన్నది ఒక చక్కని మాట

అమ్మ అన్నది ఒక చక్కని మాట

తల్లులందరికి MOTHER’S DAY శుభాకాంక్షలు

మే 9, 2010 Posted by | అతివల కోసం | , , | 2 వ్యాఖ్యలు

వాలుజడా వాలుజడా

వాలుజడా వాలుజడా

ఏప్రిల్ 16, 2010 Posted by | అతివల కోసం | 5 వ్యాఖ్యలు

అర్ధాంగి -నిన్న నేడు రేపు

అర్ధాంగి -నిన్న నేడు రేపు

నిన్న

నేడు

రేపు

తప్పెవరిది

మార్చి 25, 2010 Posted by | అతివల కోసం | , , | 4 వ్యాఖ్యలు

ఫేషన్ ప్రపంచం

ఫేషన్ ప్రపంచం

మార్చి 20, 2010 Posted by | అతివల కోసం | , , , , | వ్యాఖ్యానించండి

బంగారు గాజులు -అతివల ప్రత్యేకం

బంగారు గాజులు -అతివల ప్రత్యేకం

మార్చి 14, 2010 Posted by | అతివల కోసం | , , , , , | 6 వ్యాఖ్యలు

కాలి అందియలు-అతివల కోసం

కాలి అందియలు-అతివల కోసం

మార్చి 9, 2010 Posted by | అతివల కోసం | , , , , , , , , , , , , | వ్యాఖ్యానించండి

అతివల కోసం ఆభరణాలు

మార్చి 3, 2010 Posted by | అతివల కోసం | 1 వ్యాఖ్య