హరివిల్లు

ఎన్నెన్నో వర్ణాలు-అన్నింటా అందాలు…

ఒత్తిడికి ఖర్చులేని మందు ప్రాణాయామం

ఒత్తిడికి ఖర్చులేని మందు ప్రాణాయామం

ఆధునిక జీవన శైలి కారణంగా తరుచు అనారోగ్యాలకు గురయ్యే మహిళలు నిత్యం యోగా చేయడం వల్ల అరోగ్యం కుదుటపడుతుందని వైద్యులు సూచిస్తున్నారు. మానసిక ఒత్తిడిని అధిగమించడానికి యోగా ఎంతోగానో ఉపయోగపడుతుందని, మహిళలు ఇంటి పట్టునే ఉండి ప్రతిరోజు యోగాసనాలను, ప్రాణాయామాన్ని చేయడం వల్ల శారీరంగా, మానసింగా ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు చెప్తున్నారు.

ప్రాణాయామ విశేషాలు…
Pranayamaప్రాణం + ఆయామం = ప్రాణాయమం. ప్రాణమం టే జీవన శక్తి. ఆయామం అంటే విస్తరింపచేయుట లేక నియంత్రించి ఉంచుట అని అర్ధం. పతంజలి మహర్షి ప్రసాదించిన యోగ సూత్ర ప్రకారం శ్వాస, నిశ్వాసల్ని నియంత్రించి ఉంచడమే ప్రాణాయామం అని నిర్ధారించడం జరిగింది. లోనికి పీల్చే గాలిని శ్వాస అని, బయటికి వదిలే గాలిని ప్రశ్వాస అని అం టారు. శ్వాస ప్రశ్వాసల్ని నియంత్రించడం, క్రమబ ద్ధ్దం చేయడం ద్వారా అంతర్గత సూక్ష్మప్రాణాన్ని కూ డా అదుపులో ఉంచవచ్చు.

నాడీమండలం, రక్త ప్రసార ధమనులు, జీర్ణకోశం, మూత్రకోశం మొదలుగా గల వాటన్నిటిలో ప్రాణం సంచరిస్తూ ఉంటుంది. ప్రాణాయామం వల్ల వాట న్నింటికి శక్తి, రక్షణ కల్పిస్తాయి. కనుకనే ‘‘ ప్రాణా యామేన యుక్తేన సర్వరోగ క్షయ భవేత్‌’’ అంటే ప్రాణాయామం నియమబద్ధంగా ఆచరిస్తే సర్వరో గాలు హరించిపోతాయి అనే సూత్రం ప్రచారం అయింది. ప్రాణానికి ప్రాణ, అపాన, సమాన; ఉదాన, వ్యానమ నే 5 రూపాలు ఉన్నాయి. ప్రాణానికి స్థానం హృద యం. అపానానికి స్థానం గుదం. సమానానికి స్థా నం నాభి. ఉదనానికి స్థానం కంఠం. వ్యానానికి స్థా నం శరీరమంతా. శ్వాసక్రియకు ప్రాణం, విసర్జన క్రియకు అపానం, పచన క్రియకు సమానం, కంఠ శక్తికి ఉదానం, రక్తప్రసార క్రియకు వ్యానం తోడ్పడుతాయి.శ్వాసను బయటకు వదిలే క్రియను రేచకం అని, లోపలకి పీల్చే క్రియను పూరకం అని, లోపల గాలిని ఉంచడాన్ని అంతర్‌ పూరకం అని, తిరిగి బయటకి వదిలి ఆపి ఉంచడాన్ని బాహ్యకుంభకం అని అంటా రు. ఈ క్రియలు ప్రాణాయామానికి సాధనాలు.

మెడికల్‌ సైన్స్‌ ప్రకారం రెండు ముక్కు రంధ్రాల ప్ర యోజనం ఒక్కటే. కాని యోగులు ఈ రెండింటికి మధ్య గల భేదం గ్రహించారు. వారి పరిశోధన ప్ర కారం కుడి ముక్కు రంధ్రాన్నుంచి నడిచే గాలి కొ ద్దిగా ఉష్ణం కలిగిస్తుంది. అందువల్ల దీన్ని వారు సూ ర్యనాడి లేక సూర్య స్వరం అని అన్నారు. అట్లే ఎడ మ ముక్కు రంధ్రం ప్రభావం వల్ల చల్లని దనం అందువల్ల దాన్ని చంద్రనాడి లేక చంద్రస్వరం అని అన్నారు. ఈ రెండిటికి మధ్య సమన్వయం సాదిం చుటకు యోగ శాస్త్రంలో ప్రాధాన్యం ఇవ్వబడింది. హ అను అక్షరం చంద్రుడికి, ట అను అక్షరం సూ ర్యుడికి గుర్తుగా నిర్ధారించారు. అందువల్ల హఠ యోగం వెలువడింది. హఠ యోగమంటే చంద్ర సూ ర్య నాడులకు సంబంధించిన విజ్ఞానం అన్నమాట. హఠం అనగాబలవంతం అనికాదు. ప్రాణాయా మ విజ్ఞానమంతా చంద్ర, సూర్య స్వరాలకు సంబం ధించినదే.

ప్రాణాయామం వల్ల కలిగే ప్రయోజనాలు…

 • ఊపిరితిత్తులు బాగా పనిచేస్తాయి.
 • శరీరానికి ప్రాణవాయువు బాగా లభిస్తుంది.
 • రక్త శుద్ధి జరిగి అందులోని చెడు అంతా బయటికి వెళ్లిపోతుంది.
 • గుండెకు సత్తువ లభిస్తుంది.
 • మెదడు చురుగ్గా పనిచేస్తుంది.
 • ప్రేగులు, నరాలు, నాడులు శుభ్ర పడతాయి.
 • జఠరాగ్ని పెరుగుతుంది.
 • శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.
 • ఆయుష్షు పెరుగుతుంది. తీసుకోవలసిన జాగ్రత్తలు…
 • మైదానంలోగాని, తోటలోగాని, తలుపులు తెరచిఉన్న గదిలోగాని, కంబళీ లేక బట్ట లేక ఏదైనా ఆసనం మీద కూర్చొని ప్రాణాయామం చేయాలి.
 • గాలి విపరీతంగా వీస్తూంటే ఆ గాలి మధ్య ప్రాణాయామం చేయకూడదు.
 • మురికిగా ఉన్న చోట, దుర్వాసన వస్తున్న చోట, పొగ వస్తున్న చోట ప్రాణాయామం చేయకూడదు.
 • సిగరెట్టు, బీడి, చుట్టపొగ వస్తున్న చోట ప్రాణాయామం చేయకూడదు.
 • పొట్ట నిండుగా ఉన్నపుడు ప్రాణాయామం చేయకూడదు.
 • ప్రాణాయామం చేసే ముందు, చేసిన తరువాత కూడా ఇతర యోగాసనాలు వేయవచ్చు. అయితే చివర శవాసనం వేసి కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలి.
 • ప్రాణాయామం వేసినపుడు బట్టలు తక్కువగానూ, వదులుగానూ ధరించాలి.
 • పద్మాసనం, సుఖాసనం, సిద్ధాసనం, వజ్రాసనం ప్రాణాయామానికి అనువైన ఆసనాలు. నేల మీద కూర్చోలేనివారు, కుర్చి మీద నిటారుగా కూర్చొని ప్రాణాయామం చేయవచ్చు.
 • నడుం, వీపు, వెన్నెముక, మెడలను నిటారుగా ఉంచి ప్రాణాయామం చేయాలి.
 • ప్రాణాయామం చేసేటపుడు ఒకసారి కుడి ముక్కు రంధ్రాన్ని, ఒకసారి ఎడమ ముక్కు రంధ్రాన్ని మూయవలసి ఉంటుంది. కుడి ముక్కు రంధ్రాన్ని కుడిచేతి బొటన వ్రేలితోనూ, ఎడమ ముక్కు రంధ్రాన్ని కుడిచేతి ఉంగరం వ్రేలితోనూ మూయాలి.
 • ముక్కు రంధ్రాలు సరిగా శుభ్రంగా లేకపోతే ప్రాణాయామం చేసే ముందు జలనేతి, సూత్రనేతి క్రియలు సక్రమంగా చేయాలి. అలాచేస్తే ప్రాణాయామం చేస్తున్నపుడు శ్వాస సరిగ్గా ఆడుతుంది.
 • ప్రాణాయామ క్రియలు చేస్తూ ఉన్నపుడు మనస్సును పూర్తిగా శ్వాస ప్రశ్వాస క్రియలపై కేంద్రీకరిచాలి. వేరే యోచనలకు తావు ఇవ్వకూడదు.
 • surya telugu

జూలై 10, 2011 - Posted by | ఆరోగ్యం | , ,

4 వ్యాఖ్యలు »

 1. Oh! Wonderful Indian Culture. Hinduism is the way of life. ‘Matham’ is ‘Abhimatham’= one’s ideas to follow. Every aspect of ‘Hinduism’ is for happy, healthy, and co-existance of organisms specially between human beings. I salute to ‘Maha rishis’ to after a long trial and error methods, started implementing. A perfect ‘Rishi’ can live with out food, taking only air (Vayu Bakshana ).
  I am very much thankful for youressay.
  -Dr.Goje

  వ్యాఖ్య ద్వారా Dr.Laxman Rao Goje | జూలై 11, 2011 | స్పందించండి

 2. thank u very much for your valuable information

  వ్యాఖ్య ద్వారా jagadeesh reddy | నవంబర్ 14, 2011 | స్పందించండి

 3. IT IS VERY VERY USEFUL TO ALL HUMANS

  వ్యాఖ్య ద్వారా V.SAI DAS | జనవరి 26, 2012 | స్పందించండి

 4. thank u very much for your valuable information. i am very happy. i will do.

  వ్యాఖ్య ద్వారా jayalakshmi | ఫిబ్రవరి 14, 2012 | స్పందించండి


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: