హరివిల్లు

ఎన్నెన్నో వర్ణాలు-అన్నింటా అందాలు…

పొట్ట తిప్పులు

పొట్ట తిప్పులు

obesityబొజ్జలు పలురకాలు. వాటితో వచ్చే అవస్థలు పలు విధాలు. ఊబకాయం ఉండటం వల్ల కూర్చోవడానికి కుర్చి సరిపోదు, బట్టలు అసలే పట్టవు,పరిగెత్తడం మహా కష్టం, నిలుచుంటే ఎప్పుడెప్పుడు కూర్చుందామా అనిపిస్తుంటుంది. అయితే బొజ్జ తగ్గదు.. దాని వల్ల వచ్చే బరువు తగ్గదు. పెరుగుతున్న పొట్టను ఫ్లాట్‌గా ఎలా చేయాలి? అలా పెరగకుండా ఎలా నియంత్రించుకోవాలన్న అంశాలపై అవగాహన అవసరం.

పొట్ట ఎలా పెరుగుతుంది…
పొట్ట ఊబకాయానికి ముఖ్యమైన సూచిక. అందుకు ఎంత తింటాం? ఎంత ఖర్చువుతుం ది? ఈ రెండు సమంగా ఉన్నాయా లేదా అనే విషయం చూసుకోవాలి. తినడం ఎక్కువై, క్యా లరీల ఖర్చు తక్కువ అయితే కొవ్వు పెరిగి పొట్ట ముందుకు చొచ్చుకు వస్తుంది. అది వా రిలో బిఎమ్‌ఆర్‌ అంటే ‘బేసల్‌ మెటబాలిక్‌ రేట్‌’ లెవల్‌ని బట్టి ఉంటుంది.

జంక్‌ఫుడ్‌ వల్ల పొట్ట తిప్పలు…
ఒక మనిషికి రోజులో 1000 నుంచి 1400ల కేలరీల ఆహారం సరిపోతుంది. అంతకంటే ఎక్కువగా తీసుకొన్న ఆహారం కొవ్వు రూపంలో తయారయ్యే అవకాశం ఉంది. తిండి మానేస్తే బరువు తగ్గుతారేమో గాని, లావు మాత్రము తగ్గరు. అందుకని తక్కువ కేలరీలు ఉన్న ఆహారాన్ని తీసు కోవడం, నిత్యం వ్యాయామం చేయ్యడం, నియమబద్ధ జీవితాన్ని గడపడం వల్ల పొట్ట పెరిగే అవకాశాలు తక్కువగా ఉంటాయి. మనం భుజించే ఆహారంలో ఎక్కువగా ప్రొటీన్లు, తక్కువ కార్బోహైడ్రేట్లు ఉండేలా చూసుకోవాలి. చిప్స్‌, పాప్‌కార్న్‌, కుకీస్‌, కేక్స్‌ మొదలైన జంక్‌ ఫుడ్‌ని అస్సలు తినకూడదు.

ఊబకాయం వల్ల మనకు వచ్చే రోగాలు…
bariatic-surgery-clipingsమన శరీరంలో కొవ్వు సులభంగా చేరిపోతుంది. దీని వల్ల బరువు పెరగడం కాని శరీరంలోని ఇతర అవయవాలు పెరగవు, కాని కొవ్వు వల్ల అధిక రక్త పో టు, గుండె జబ్బులు, కొలెస్ట్రాల్‌, డయాబెటీస్‌, హైపొథైరాయిడ్‌ ప్రాబ్లమ్‌, కీళ్ళ నొప్పులు, తలనొప్పి, అధిక నిద్ర, క్యాన్సర్లు, కొందరిలో వంధ్యత్వం, రుతు స్రా వంలో తేడాలులాంటి సమస్యలు రావచ్చు. కొందరిలో సమస్యలు మరింత తీవ్రంగా రావచ్చు. ఇలా మన శరీరానికి ఊబకాయం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి.

కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఊబకాయానికి చెక్‌ పెట్టవచ్చు…
పొట్ట రాకుండా రోజువారీగా తప్పరి సరిగా డైట్‌ విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకోవాలి.

  • కప్పు గోరు వెచ్చని నీటిలో స్పూన్‌ తేనె కలుపుకొని పరగడుపున తాగాలి. రోజులో కూడా ఎక్కువగా నీటిని తాగాలి. అప్పుడు పొట్టలోని మలినాలు, కొవ్వు కరిగి బయటకు విసర్జితమవుతాయి.
  • సహజంగా లభించే గ్రీన్‌ టీని ఉదయం పూట సేవించాలి. దానిమ్మ జ్యూస్‌ తప్ప మిగితా అన్ని రకాల జ్యూసులను తీసుకోవచ్చు, కాఫీ మాత్రం రోజుకు ఒక కప్పు మాత్రమే తీసుకోవాలి.
  • వైట్‌ పాస్తా, బ్రెడ్‌, బంగాళ దుంపలు తినకూడదు. గోధుమ పాస్తా, గోధుమ బ్రెడ్‌ను తీసుకోవచ్చు.
  • అన్ని రకాల ఆకు కూరలు తీసుకోవచ్చు. అయితే క్యారెట్‌ను మాత్రం తక్కువ మోతాదులో తీసుకోవాలి.
  • రాత్రి ఏడు దాటితే తినడం మానివేయాలి.
  • తక్కువగా ఫ్యాట్‌ ఉన్న పాలు, పాల ఉత్పత్తులను తీసుకోవాలి.
   బరువు సూచిక…
  • బి.ఎమ్‌.ఐ. అంటే బాడీ మాస్‌ ఇండెక్స్‌. ఎదుగుతున్న కొద్దీ అలాగే ఎత్తుకు తగ్గ బరువుండాలి.
  • బరువు/ఎత్తు – బి.ఎమ్‌.ఐని బెట్టి కొలవచ్చు.
  • సాధారణంగా మన దేశంలో 18-20 బి.ఎమ్‌.ఐ. ఉండటం మంచిది.
  • అధిక బరువు – బి.ఎమ్‌.ఐ. 25 కిలో గ్రాములు / ఎమ్‌ 2 కంటే ఎక్కువ.
  • ఊబకాయం – బి.ఎమ్‌.ఐ. 30 నుంచి 34.9 కిలో గ్రాములు / ఎమ్‌ 2 వరకు.
  • అధిక ఊబకాయం – బి.ఎమ్‌.ఐ. 35-39.9 కిలో గ్రాములు / ఎమ్‌ 2, బి.ఎమ్‌.ఐ. 40 కిలో గ్రాములు / ఎమ్‌ 2 అంతకంటే ఎక్కువ.

ఊబకాయానికి చికిత్సామార్గాలు…
Dr

   ల్యాప్రోస్కోపిక్‌ వంటి నూతన విధానాలు స్థూలకాయ శస్త్ర చికిత్సను సులభం చేశాయి. దీని వల్ల తినగల్గిన పరిమాణాన్ని నియంత్రించి అధిక కేలరీల చేరికను అరికట్టవచ్చు. ఉదరకోశాన్ని కుంచింపజేయడం స్లీవ్‌గ్రాసెక్టమీ ద్వారా చేయవచ్చు. అలాగే గ్యాస్ర్తిక్‌ బ్యాండ్‌ ద్వారా కొద్దిగా ఆహారం తీసుకొన్నా త్వరగా కడుపు నిండినట్టుగా అనిపిస్తుంది. పొట్ట భాగంలో చేరిన అధిక కొవ్వును లైపోసెక్షన్‌ పద్ధతి ద్వారా తీసివేయవచ్చు. అయితే ఈ చికిత్స తరువాత మళ్లీ బరువు పెరగకుండా నిత్యం వ్యాయామాలు చేయాల్సి ఉంటంది. బేరియాట్రిక్‌ చికిత్స అనేది కూడా ఉంది. అయితే ఇలాంటి చికిత్సలని నిపుణులైన వైద్యులను సంప్రదించి వారి సలహా మేరకు వారి పర్యవేక్షణలోనే తీసుకోవాలి.

– డా ఠాగూర్‌ మోహన్‌ గ్రంధి
Consultant Laproscopic Bariatric Surgeon,
Aware Global Hospitals,
L.B. Nagar, Hyderabad
Cell: 9000673344

surya telugu

జూలై 5, 2011 Posted by | ఆరోగ్యం | | 2 వ్యాఖ్యలు