హరివిల్లు

ఎన్నెన్నో వర్ణాలు-అన్నింటా అందాలు…

హృద్రోగాలు – చికిత్స

హృద్రోగాలు – చికిత్స

coldheartbigఆధునిక కాలంలో వయసుతో నిమిత్తం లేకుండా వ్యక్తులు గుండెపోటుకు గురవుతున్నారు. ఇందుకు ఒక కారణం మన జీవనశైలిలో ఉన్న లోపాలు కాగా మరికొన్ని వంశపారంపర్యమైనవి, మరికొన్ని ఇతరత్రా కారణాల వల్ల వచ్చేవి అయి ఉంటున్నాయి. శరీరంలో అత్యంత కీలకమైన పాత్ర పోషించే గుండెను కాపాడుకోవడం మన బాధ్యత. గుండె పోటు ఎందుకు వస్తుంది? దానికి చికిత్స ఏమిటి? నివారణ ఎలా? అన్న విషయాలను వివరించే వ్యాసమిది..

నూతన చికిత్సా విధానాలు…
మన దేశంలో స్వతంత్రానికి ముందుఅంటే అరశతాబ్దం క్రితం సగటు ఆయుషు 36-37 సంవత్సరాలు మాత్రమే ఉండేది. ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న శాస్ర్తీయ పరిజ్ఞానంతో అది 60 సంవత్సరాలు దాటింది. ఆయుష్షుతో పాటుగానే జబ్బుల బారిన పడే అవకాశాలు కూడా మెండుగా పెరిగాయి. వంశపారంపర్యంగా వచ్చే మధుమేహం, అధికరక్తపోటు, స్థూలకాయం మొదలైనవి కావచ్చు లేదా ధూమపానం, మద్యపానం, మానసిక ఒత్తిడి, అధిక కొవ్వుతో కూడుకున్న ఆహారం వల్ల కావచ్చు.గత కొన్ని దశాబ్దాలలో వైద్యరంగంలో కూడా గణనీయమైన మార్పులు వచ్చాయి. వస్తున్నా యి. మన దేశంలో 1970-80వ దశకంలో గుండెపోటు వస్తే మందులు మాత్రమే మార్గం గా ఉండేది. ఎవరికైనా బైపాస్‌ అవసరమైతే ఎక్కడో అమెరికాలోనో మరో అభివృద్ధి చెందిన దేశంలో మాత్రమే అందుబాటులో ఉండేది. అదీ ఎందరికి సాధ్యమయ్యేదో ఊహించవచ్చు. గడిచిన 20-25 సంవత్సరాల్లో మనం ఎంతో అభివృద్ధి సాధించామని చెప్పవచ్చు.

1977లో ఆండ్రూ గ్రండ్జ్‌విగ్‌ అనే జర్మన్‌ శాస్తవ్రేత్త బైపాస్‌ ఆపరేషన్‌కు ప్రత్యామ్నాయంగా మరో శాస్ర్తీయ మార్గముందని ప్రపంచానికి చాటి చెప్పాడు. అది మన దేశంలో తొలిసా రిగా 1985లో చేశారు. శాస్ర్తీయ పరిజ్ఞాన మార్పిడి మనకు అన్వయించుకునేందుకుసమయం పడుతూ ఉండేది. ఇప్పుడు కాలం మారుతున్న తరుణంలో శాస్ర్తీయ పరిజ్ఞానం అందుబాటు కొన్ని రోజులు లేదా కొన్ని గంటల తేడా బదిలీ అవుతున్నది. ఈ సరికొత్త విధానాలలో ముఖ్యంగా హృద్రోగులకు అందుబాటులోకి వచ్చిన విధానం ఇంటర్వెన్షనల్‌ కార్డియాలజీ అంటే సూక్ష్మనాళం ద్వారా వైద్య ప్రక్రియలు.

heartగుండెలోగల లోపాన్ని సూక్ష్మనాళం ద్వారా గుర్తించి సరిచేయడం, రక్తనాళాల్లో ఏర్పడిన అడ్డంకులను తొలగించడం, మూసుకుపోయిన కవాటాలు వెడల్పు చేయడం, పుట్టకతో వచ్చిన లోపాలను సరి చేయడం వంటివి చేయవచ్చు.గుండెపోటు రావటానికి గల కారణాన్ని ఆంజియోగ్రామ్‌ అనే పరీక్ష ద్వారా గుర్తించి వ్యాధి తీవ్రతను బట్టి చికిత్సా విధానాన్ని నిర్ణయించవచ్చు. దీనికి అందుబాటులో ఉన్న చికిత్సా విధానాలు…ఇందులో ఉన్న వివిధ రకాల చికిత్సలు ఇలా ఉంటాయి. 1. మెడికల్‌ మేనేజ్‌మెంట్‌ (మందుల ద్వారా చికిత్స) 2. బెలూన్‌ యాంజోప్లాస్టీ 3. బైపాస్‌ సర్జరీ.

బెలూన్‌ ఆంజియోప్లాస్టీ/ స్టెంట్స్‌…
సూక్ష్మనాళం ద్వారా మనకి అందుబాటులో ఉన్న ఆంజియోప్లాస్టీ చికిత్స ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా బహుళ ప్రాచుర్యం పొందింది. లక్షలాది హృద్రోగులు ఈ మా ర్గం ద్వారా లబ్ది పొందుతున్నారు. అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం ఇప్పు డు బైపాస్‌కన్నా అధిక సంఖ్యలో ఈ చికిత్సలు జరుగుతున్నాయని అంచనా.
ఈ ప్రక్రియలో ముందుగా సూక్ష్మనాళాన్ని (కెథెటర్‌) మూసుకుపోయిన రక్తనాళంలోకి పంపడం జరుగుతుంది. తర్వాత సన్నటి తీగ (గైడ్‌ వైర్‌)ను రక్తనాళంలోకి చొప్పించడం, తద్వారా బెలూన్‌ను పంపడం జరుగుతుంది. రక్తనాళంలో ఉన్న కొవ్వును ఈ బెలూన్‌ ద్వారా తొలగించడం స్టెంట్‌ను అమర్చడం ద్వారా చికిత్స పూర్తి అవుతుంది.అడ్డంకి (బ్లాక్‌)ని తొలగించడం వల్ల రక్తప్రసారం మామూలు స్థాయికి చేరి గుండె కండరాలు బలహీనపడకుండా ఉంటాయి.

కెరోటిడ్‌ ఆంజియోప్లాస్టీ…
మెదడు ప్రధాన రక్తనాళంలో ఏర్పడిన అడ్డంకులను తొలగించడం చేయవచ్చు.
పెరిఫెరల్‌ ఆంజియోప్లాస్టీ…
కాళ్ళు చేతులకు సంబంధించిన ప్రధాన రక్తనాళాల అడ్డంకులను తొలగించడం.
సెరిబ్రల్‌ ఆంజియోప్లాస్టీ…
మెదడుకు సరఫరా చేసే ప్రధాన రక్తనాళాల అడ్డంకులను తొలగించడం.
రీనల్‌ ఆంజియోప్లాస్టీ…
మూత్రపిండాలకు సరఫరా చేసే రక్తనాళాల అడ్డంకులను తొలగించడం.
మైట్రన్‌ వాల్వులో ప్లాస్టీ…
గుండెకు ఎడమ పక్క ఉన్న మైట్రల్‌ కవాటం మూసుకుపోయినపుడు దాన్ని వాల్వులో ప్లాస్టీ అనే ప్రక్రియ ద్వారా బెలూన్‌ సహాయంతో వెడల్పు చేయడం జరుగుతుంది.
పల్మొనరీ వాల్వులోప్లాస్టీ…
గుండె నుంచి ఊపిరితిత్తులకు రక్తాన్ని తీసుకువెళ్లే దమనికి ఉన్న కవాటం (పల్మొనరీ వాల్వ్‌) మూసుకుపోయినపుడు బెలూన్‌ ద్వారా తెరవవచ్చు. ఈలోపం సాధారణంగా పుట్టుకతో వచ్చేది కాబట్టి చిన్న వయస్సులో కూడా సరిచేయవచ్చు.
పిబిఎవి.. గుండె నుంచి రక్తాన్ని శరీరానికి తీసుకువెళ్ళే ధమనికి (అయోర్టా) ఉన్న కవాటం (అయోర్టిక్‌ వాల్వ్‌) పుట్టుకతోగాని లేదా కొన్ని కారణాల వల్ల మూసుకుపోవచ్చు. వీటిని ఆపరేషన్‌ లేకుండా సరిచేయవచ్చు.
పిబిటివి.. పుట్టుకతోగాని లేదా కొన్ని కారణాల వల్ల గుండెకు కుడి పక్కన ఉన్న ట్రైకస్పిడ్‌ కవాటం మూసుకుపోతే వీటిని ఆపరేషన్‌ లేకుండా సరిచేయవచ్చు. ఈ కవాటం మూసుకుపోయినప్పుడు బెలైన్‌ సహాయంతో తెరవవచ్చు.
ఐవిసి ఫిల్టర్స్‌… కాళ్ళలో ఉన్న సరిల్లో కొన్ని సందర్భాల్లో రక్తం గడ్డకడుతూ ఉంటుంది (డీప్‌ వీన్‌ త్రాంబోసిస్‌). ఈ రక్తపు గడ్డలు విడిపోయినప్పుడు అవి ప్రాణాంతకం కావచ్చు. శ్వాసకోశ సంబంధమైన బాధలు (పల్మనరీ ఎంబోలిజమ్‌) ఏర్పడవచ్చు. ఈ రక్తపు గడ్డలు ఐవిసి ఫిల్టర్‌ అనే చిన్న పరికరాన్ని అమర్చడం ద్వారా అరికట్టవచ్చు.
పర్మినెంట్‌ పేస్‌ మేకర్‌…
గుండె నాడీ వ్యవస్థ (కండక్షన్‌ సిస్టమ్‌)లో ఏర్పడే లోపాల వల్ల నాడీ స్థాయి కొన్నిసార్లు పడిపోయి గుండె ఆగిపోవచ్చు. వీటిని పేస్‌ మేకర్‌ అనే పరికరం అమర్చడం ద్వారా సరిచేయవచ్చు.
ఎఐసిడి ఇంప్లిమెంటేషన్‌…
కొన్ని సందర్భాల్లో గుండె కొట్టుకునే వేగం పెరిగి (నిమిషానికి 200-250సార్లు) కొట్టుకొని గుండె ఆగిపోయే ప్రమాదం ఏర్పడవచ్చు. ఆటోమేటిక్‌ ఇంప్లాంటబుల్‌ కార్డియాక్‌ డిఫిబ్రిలేటర్‌ (ఎఐసిడి) అనే పరికరం అమర్చడం వల్ల ప్రాణాపాయాన్ని అరికట్టవచ్చు.
సిఆర్‌టి- డి…
గుండె కండరం బలహీనపడి, పంపింగ్‌ తగ్గినప్పుడు గుండె ఆగిపోయే పరిస్థితికి దారి తీస్తుంది. సిఆర్‌టిడి పేషెంటుకు అమర్చడం వల్ల బలం పుంజుకునేటట్లు తోడ్పడుతుంది.
కెథెటర్‌ ఇంటర్వెన్షన్స్‌ ఇన్‌ కాంజినిటల్‌ హార్ట్‌ డిసీజ్‌ (పుట్టకతో వచ్చే లోపాలను సరిచేయడం)…
గుండె నుంచి రక్తాన్ని శరీరానికి తీసుకువెళ్ళే ధమని (అయోర్టా) పుట్టుకతో సన్నపడవచ్చు. దీన్ని కూడా బెలూన్‌ పద్ధతిలో సరి చేయవచ్చు.
ఎఎస్‌డి క్లోజర్‌.. విఎస్‌డి క్లోజర్‌…
పుట్టుకతో గుండెలో ఉన్న రంధ్రాలను డివైజ్‌ క్లోజర్‌ ద్వారా ఆపరేషన్‌ లేకుండా మూసి వేయవచ్చు.
పిడిఎ క్లోజర్‌…
గుండె నుంచి రక్తాన్ని తీసుకువెళ్లే రెండు ప్రధాన రక్తనాళాలు విడివిగా ఉంటాయి. శుద్ధమైన రక్తం ఎడమ పక్క నుండి శరీరానికి పంప్‌ అవుతుంది. శరీరం చెడు రక్తం కుడి పక్కకు చేరి ఊపిరితిత్తులలో శుభ్రపడుతుంది. ఈ రెండు రక్తనాళాల మధ్య పిడిఎ అనే మార్గం వల్ల మంచి చెడు రక్తాల మిశ్రమం జరుగుతుంది. ఇది వ్యాధులకు దారి తీయవచ్చు. వీటిని సూక్ష్మనాళ పద్ధతి ద్వారా వేరు చేయడానికి (కాయిల్‌) అనేది ఉపయోగపడుతుంది. దీనిద్వారా పిడిఎ మార్గాన్ని మూసి వేయవచ్చు.
గుండెపోటు రావడానికి పలు కారణాలున్నాయి. అందులో ముఖ్యమైనవి
1. మధుమేహం
2. అధిక రక్తపోటు
3. ధూమపానం
4. అధిక కొవ్వు చేరడం
5. స్థూలకాయం
6. మానసిక ఒత్తిడి
7. వంశపారంపర్యం
మొదలైనవి ముఖ్యమైనవి. ఇవి కాక రక్తనాళాల్లో బ్లాకులు (అడ్డంకులు) ఏర్పడినప్పుడు కూడా గుండెపోటు వస్తుంది.
అధిక కొలెస్టరాల్‌ వల్ల అనర్థాలు…
రక్త నాళాల్లో కొవ్వు చేరడం ద్వారా గుండెపోటుకు దారి తీయడం, పక్షవాతం మొదలైనవి రావడానికి ఆస్కారం ఉంటుంది. అందుకే ఆహారపు అలవాట్లను నియంత్రించుకోవలసిందిగా వైద్యులు సూచిస్తారు.
గుండె పోటు వచ్చిన తర్వాత ఎంతకాలంలో బైపాస్‌ చేయించుకోవాలి…
ఆంజియోగ్రామ్‌ ద్వారా వ్యాధి తీవ్రత నిర్ధారించిన తర్వాత ఇది నిర్ణయించడం జరుగుతుంది. గుండెపోటు వచ్చిన ప్రతి వారరికీ బైపాస్‌ అవసరం ఉండదు.
బెలూన్‌ ఆంజియోప్లాస్టి, బైపాస్‌ సర్జరీల్లో ఏది ఉత్తమం..
గుండె కండరాలకు రక్తప్రాసరంలో అడ్డంకుల వల్ల అది తగ్గినప్పుడు ఈ రెండు మార్గాలూ ఉత్తమమైనవే.
ఆపరేషన్‌ తర్వాత జాగ్రత్తలు…
ఆపరేషన్‌ తర్వాత మందుల వాడకం గురించి పలువురికి సందేహాలు ఉంటాయి. అయితే ఒక్కసారి ఆపరేషన్‌ చేయించుకున్న తర్వాత మందులు జీవితాంతం వాడాల్సి ఉంటుంది. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. ఆహారంలో కొవ్వు పదార్ధాలు లేకుండా చూసుకోవాలి. నిత్యం ఎంతో కొంత వ్యాయామం చేయాలి.
శారీరక శ్రమ ఎంతవరకు చేయవచ్చు…
ఎకో, టియంటి వంటి పరీక్షల ద్వారా దీన్ని నిర్ణయిస్తారు. గుండె కండరం బలహీనపడకుండా మామూలు స్థాయిలో పంపింగ్‌ కనుక ఉన్నట్లయితే మామూలు స్థాయి పని చేసుకోవచ్చు.
స్టంట్స్‌ రకాలు, వాటి ఫలితాలు…
బెలూన్‌ ఎక్స్‌పాండబుల్‌ స్టెంట్స్‌, సెల్ఫ్‌ ఎక్స్‌పాండబుల్‌ స్టెంట్స్‌, బేర్‌ మెటల్‌ స్టెంట్స్‌ (బి.ఎం.ఎస్‌.), డ్రగ్‌ ఎల్యూటింగ్‌ స్టెంట్స్‌ (డి.ఇ.ఎస్‌) అన్నవి స్టెంట్స్‌లో రకాలు. స్టెంట్స్‌ వల్ల రక్తనాళాలు త్వరగా పూడుకుపోయే సమస్య పరిష్కారమవుతుంది.
రెండవ బైపాస్‌ ఎందుకు చేయాల్సి వస్తుంది…viperaju
జోడించిన రక్తనాళాలు మూసుకుపోవడం, కొత్త బ్లాకులు ఏర్పడటం వల్ల రెండవసారి కూడా బైపాస్‌ చేయాల్సి వస్తుంది.
బైపాస్‌ వల్ల రిస్కు ఎంత ఉంటుంది…
వయస్సు, గుండె పంపింగ్‌, మూత్రపిండాల పనితీరు, కారాటిడ్‌ వ్యాధు లు అన్న వాటిని బట్టి 1 శాతం నుండి 4 శాతం వరకు ఉండవచ్చు.
పిన్‌ హోల్‌ ప్రొసీజర్స్‌ (సూక్ష్మ నాళం ద్వారా) అంటే ఏమిటి…
ఆపరేషన్‌ లేకుండా సూక్ష్మనాళం ద్వారా అనేక గుండెవ్యాధులకు చేసే చికిత్సనే పిన్‌ హోల్‌ సర్జరీ అంటారు. పిటిసిఎ, పిబిఎమ్‌ వి, పేస్‌ మేకర్‌, ఎఐసిడి, ఐవిసి ఫిల్టర్స్‌, ఎఎస్‌డి/విఎస్‌డి క్లోజర్స్‌ వంటివి.
మందుల వల్ల దుష్పరిణామాలు…
గుండె వ్యాధులు ఉన్నవారు వాడే మందులతో జాగ్రత్తగా ఉండాలి. ఆస్పిరిన్‌ వాడకం వల్ల గాస్ట్రైటిస్‌, ఆల్సర్లు వస్తాయి. స్టాటిన్స్‌ వాడకం వల్ల కండరాల నొప్పులు, కాలేయ సమస్యలు వస్తాయి. నైట్రేట్ల వాడకం వల్ల తలనొప్పులు, క్లోపిడోపెరాల్‌ వంటి మందుల వల్ల త్రాంబసీ వంటివి వస్తాయి.

SURYA TELUGU

జూన్ 13, 2011 - Posted by | ఆరోగ్యం | ,

1 వ్యాఖ్య »

  1. Very useful Item……

    వ్యాఖ్య ద్వారా pullarao tamiri | జూన్ 13, 2011 | స్పందించండి


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: