హరివిల్లు

ఎన్నెన్నో వర్ణాలు-అన్నింటా అందాలు…

పోషక, ఔషధ పరిమాళాల జామ

పోషక, ఔషధ పరిమాళాల జామ
పెరటిలో పెంచుకోదగిన ఫల జాతులలో జామ చెట్టు ప్రత్యేకమైంది. కేవలం పండును మాత్రమే కాదు.. ఆ పండును ముక్కుతో పొడిచి తినే రామచిలుకల దృశ్యం కూడా జ్ఞాపకమే..కానీ జామ పండ్లను చిన్న చూపు చూసే వారు కూడా వున్నారు. పోషక విలువలో ఆపిల్‌తో సరితూగే జామను నిర్లక్ష్యం చేయడం విచారకరం.

guavaఇంగ్లీషులో ‘గావా’గా పిలువబడుతున్న జామ‘గావా ఆపి ల్‌’గా పేరొందింది. ఆపిల్‌ కన్నా సరసమైన ధరలో లభిస్తు న్నందన‘పేదల పాలిటి ఆపిల్‌’గా కూడా ప్రసిద్ధి. పీచుపదార్థాలు పుష్కలంగా ఉండే వాటిలో జామపండును పేర్కొనవచ్చు. విటమిన్లు ప్రధానంగా ‘సి’ విటమిను నారింజపండు కంటే 5 రెట్లు అధికమని అంచనా. కొలెస్ట్రాల్‌ బొత్తిగా వుండదు.యాంటికాన్సర్‌ కారకాలైన యాంటి యాంటిఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉన్నాయని శాస్తజ్ఞ్రుల అధ్యయనంలో తేలింది. వైటమిన్‌ ‘ఎ’, మానవశరీర నిర్మాణంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన బీటా కెరోటిన్లు ఈ పండులో సమృద్ధిగా వున్నాయి. మధుమేహ వ్యాధి గ్రస్తులకు నిషేధించబడని ప్రయోజనకారి జామపండు. అయితే వీటి లోనూ దోరకాయ చాలా మంచిది.

వృక్షశాస్త్ర వర్గీకరణలో ‘మిర్టేసి’ కుటుం బానికి చెందిన జామను శాస్ర్తీయంగా ‘సీడియమ్‌ గావా’గా పిలుస్తారు. ఉష్ణ, ఉపఉష్ణమండలాలలో విస్తరించి మధ్య రకమైన ఎత్తులో వుండే జామ పుష్పాలు తెలుపు రంగులో వుంటాయి. అనేక కేసరాలు లేత పసుపు వర్ణం లో పొందికగా చూడముచ్చటగా కనిపిస్తాయి.ఫలాలు తెలుపు లేక ఎరుపు, ఆరంజి రంగుల్లో వున్న కండను కలిగి వుండి మధ్య భాగంలో చిన్న చిన్న విత్తనాలు అమరి వుంటాయి. చిన్నవైనా ఇవి దృఢంగా వుంటాయి. కొన్ని రకాలలో మెత్తగానూ వుంటాయి.చెట్ల నుండి మనం పొందే అన్ని రకాల ఫలాలలోకి శక్తివంత మైన యాంటిఆక్సిడెంట్ల విలువలు అధికం.తెల్ల గుజ్జులో కంటే ఎరుపు, ఆరంజి కండలో బీటాకెరోటిన్లు, పాలిఫినాల్స్‌, కెరటి నాయిడ్స్‌ హెచ్చు.పోషకవిలువల రీత్యా 165 గ్రా విడి పండులో నిపుణుల పరిశీల ప్రకారం

ఔషధ రీత్యా పరిశీలిస్తే…
guava1

    • చెట్టు బెరడు డికాక్షన్‌ సూక్ష్మజీవులను నశింపజేస్తుంది. 2,3 ఆకులను నమిలితే దంతాలు శుభ్రపడతాయి. దృఢత్వం కూడా చేకూరుతుంది. 5,6 ఆకులను నీటిలో మరగకాచి డికాక్షన్‌ వాడి తే దగ్గు, జలుబు పోతుంది. ఆకుల నుండి లభించే తైలం యాంటి ఆక్సిడెంట్ల చర్యలను వేగవంతం చేస్తాయి. ఆకులతో తయారైన మందులు డయేరియా, డిసెంట్రీలకు మంచి ఫలితాన్నిస్తాయి.
    • బాగా మాగిన పండును రోజూ తీసుకుంటే రక్తపోటు నియం త్రణలో వుంటుంది. ఎసిడిటికి కూడా రోజుకో పండును వాడితే మంచిది. పచ్చి కూరగాయ ముక్కలతో పాటు జామకాయ ముక్క లను కలిపి వాడితే ఊపిరితిత్తుల వ్యవస్థ సక్రమంగా పనిచేయడా నికి దోహదం చేస్తుంది.
    • ఇందులోని కెరొటినాయిడ్స్‌, ఐసోఫావో నాయిడ్స్‌, పాలిఫినాల్స్‌ మెదడు కణాలు చురుకుగా పనిచేయడానికి తోడ్పడతాయి.
    • కాలిన గాయాలకు గుజ్జును రాస్తే తొందరగా ఉపశమనం దొరుకుతుంది. డైటింగ్‌ చేసేవారికి జామపండు బలవర్ధక ఆహారం.
    • లేత పసుపు, తెలుపు, లేత ఆకుపచ్చ రంగులలో గుండ్రంగా లేదా అండాకారంలో వుండే జామపండ్లు సువాసన కూడా కలిగి వుంటాయి. ఈ సువాసన వల్లే ఇంటిలో ఎక్కడ వున్నా ఇట్టే పట్టే యవచ్చు. ఏ మాత్రం అవకాశం వున్నా ఈ చెట్లను పెంచి తాజా ఫలాలను పొందవచ్చు. జామ పండును నాలుగు భాగాలు చేసి చిటికెడు ఉప్పు, కారం లేక మిరియాల పొడిని చల్లి తింటే చాలా బాగుంటుంది. జామ్‌, జెల్లీ, సలాడ్స్‌, కెండిల్స్‌ వగైరాలలో వీటిని వాడుతూ వుండటం తెలిసిందే.
    • పోషకాల రీత్యా, ఔషధ గుణాల రీత్యా ఇంతటి విశేషాలున్న జామ పండును ఉపేక్షించక ఆహారంగా తీసుకుంటే ఎంతో మేలుకలుగుతుంది.
శక్తి... 		   112 కెలరీలు.
పీచు పదార్థాం 		8.9గ్రా
పిండి పదార్థం 		23.6గ్రా
మాంసకృత్తులు 		4.2గ్రా
కొవ్వు పదార్థం 		1.6 గ్రా
పొటాషియం 		688మి.గ్రా
భాస్వరం 			66 మి.గ్రా
సున్నం 			30 మి.గ్రా
వైటమిన్‌ ‘ఎ’(రెటినాల్‌) 	1030 మైక్రోగ్రా
వైటమిన్‌ ‘సి’(ఆస్కార్బిక్‌ ఆమ్లము)377 మిగ్రా
ఫోలిక్‌ ఆమ్లము 		81 మిగ్రా

– కె.భార్గవి

surya telugu

ఏప్రిల్ 22, 2011 Posted by | ఆరోగ్యం | 2 వ్యాఖ్యలు