హరివిల్లు

ఎన్నెన్నో వర్ణాలు-అన్నింటా అందాలు…

ప్రపంచంలోని మరో వింత! భోపాల్‌ తాజ్‌మహల్‌

ప్రపంచంలోని మరో వింత! భోపాల్‌ తాజ్‌మహల్‌
ఆగ్రాలో ఉన్న అందమైన కట్టడం తాజ్‌మహల్‌ ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటిగా నిలిచి పేరు తెచ్చుకుంది. ఈ అద్భుత కట్టడం గురించి అందరికీ తెలిసిందే. కానీ మన దేశంలో మరో తాజ్‌ మహల్‌ కూడా ఉందన్న విషయం చాలా మందికి తెలియదు. ఈ తాజ్‌ మహల్‌ భోపాల్‌లో ఉండడం విశేషం.ఒకప్పుడు ప్రపంచంలోని అతిపెద్ద రాజప్రాసాదంగా పేరుగాంచిన ఈ అద్భుత చారిత్రక కట్టడం గురించి..

taj-mahal-bhopal1భోపాల్‌ రాజ్యాన్ని పరిపాలించిన 11వ పరిపాలకురాలు నవాబ్‌ షాజ హాన్‌ బేగమ్‌ ఎన్నో అందమైన కట్టడాలను నిర్మించారు.1868 నుంచి 1901 వరకు ఆమె భోపాల్‌ను పరిపాలించి నిర్మించిన కట్టడాల్లో తాజ్‌ మహల్‌ కూడా ఒకటి. ఈ తాజ్‌మహల్‌ భోపాల్‌లోని అతిపెద్దదైన మసీదు తాజ్‌-ఉల్‌-మజీద్‌ పక్కన నిర్మితమైంది.

రాజప్రాసాదంగా…
షాజహాన్‌ తన ప్రియురాలి కోసం తాజ్‌మహల్‌ను కట్టించాడు. కా నీ భోపాల్‌లోని తాజ్‌ మహల్‌ బేగమ్‌ నివాసంగా రూపుదిద్దుకుంది. ఆ కాలంలో 70 లక్షల రూపాయలతో దీన్ని నిర్మించారు. 1871 నుంచి 1884 వరకు 13 సంవత్సరాల కాలంలో ఈ చారిత్రక కట్టడం రూపుదిద్దు కుంది. ఆ కాలంలో ప్రపంచంలోనే అతిపెద్దదైన రాజప్రాసాదంగా దీన్ని నిర్మించడం విశేషం. మొదట దీన్ని రాజ్‌ మహల్‌ పేరుతో పిలిచేవారు. ఆ తర్వాత భోపాల్‌లో నివసించిన బ్రిటీష్‌ పరిపాలకులు దీని నిర్మాణాన్ని చూసి ఎంతో ముగ్ధులయ్యారు. దీని ఆర్కిటెక్చర్‌ పనితనం వారికి బాగా నచ్చి ఈ కట్టడాన్ని కూడా తాజ్‌ మహల్‌గా పిలిచారు. ఇక బోపాల్‌ తాజ్‌మహల్‌ నిర్మాణం పూర్తయి న తర్వాత బేగమ్‌ జష్న్‌-ఎ-తాజ్‌మహల్‌ పేరిట మూడు సంవత్సరాల పాటు వేడుకలను నిర్వహించారు.

స్వాతంత్య్రం వచ్చిన తర్వాత…
taj1947లో స్వాతంత్య్రం వచ్చి పాకిస్తాన్‌ నుంచి దేశం విడిపోయిన తర్వాత నవా బ్‌ హమీదుల్లా ఖాన్‌ సింధీ కాందిశీకులను ఈ ప్యాలెస్‌లో నివసించేందుకు ఏర్పాట్లు చేశారు.వారు తాజ్‌ మహల్‌లో నాలుగు సంవత్సరాల పాటు నివసిం చారు. ఆ తర్వాత భోపాల్‌లోని బైరాఘర్‌ కు తమ నివాసాన్ని మార్చారు. ఈ కాలంలో ఈ రాజప్రాసాదం కొంత దెబ్బతింది. ఆ తర్వాత పలువురు భోపాల్‌ రాజవంశీ కులు ఈ రాజప్రాసాదంలో నివసించి ్రమ,క్రమంగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. 2008లో ఈ రాజమహల్‌లోని పలు భవనాలు కూలిపోయాయి. 2005లో భోపాల్‌ తాజ్‌హమల్‌ను మధ్య ప్రదేశ్‌ ప్రభుత్వం రాష్ర్ట చారిత్రక వారసత్వ సంపదగా ప్రకటించింది.

అధ్బుతమైన ఆర్కిటెక్చర్‌తో…
భోపాల్‌ తాజ్‌మహల్‌ను వివిధ రకాల శిల్పకళాపనితనంతో అందంగా నిర్మించారు. బ్రిటీష్‌, ఫ్రెంచ్‌, మొగల్‌, అరబిక్‌, హిందూ వాస్తు నిర్మాణ పద్ధతులతో దీన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ ప్యాలెస్‌లో 120 గదులను నిర్మిం చారు. ఇందులో శీష్‌మహల్‌ (అద్దాల ప్యాలెస్‌), అతి పెద్దదైన సావన్‌ బడో పెవిలియన్‌ ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద ఏడు అంతస్తుల భవనం ఇక్కడ చూడ
దగినది. భోపాల్‌ తాజ్‌మహల్‌పై పరిశోధన చేసిన హుస్సేన్‌(75) ఈ కట్టడంపై ప్రత్యేకంగా ‘ద రాయల్‌ జర్నీ ఆఫ్‌ భోపాల్‌’ అనే పుస్తకాన్ని రాశారు.

taj1భోపాల్‌లోనే అతిపెద్ద ప్యాలెస్‌గా దీన్ని ఆయన అభి వర్ణించారు.ఇక భోపాల్‌ తాజ్‌ మహల్‌ పర్యాటకులను వి శేషంగా ఆకర్షిస్తోంది. దేశ, విదేశాలకు చెందిన వేలాది మంది పర్యాటకులు ప్రతి ఏటా ఈ కట్టడాన్ని తిలకిసు్తన్నారు. ఈ కట్టడం అందాలకు వారు మంత్రముగ్ధులవుతున్నారు. ‘భోపాల్‌ తాజ్‌మహల్‌ అందాలు వర్ణనాతీతం. ఒకప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద రాజ ప్రాసాదంగా నిర్మించిన ఈ కట్టడం వివిధ వాస్తు నిర్మాణ శైలులకు అద్దం పడు తోంది. ఈ కట్టడంలోని వివిధ భవనాలు ఎంతో అందంగా తీర్చిదిద్దారు’ అని పర్యాటకుడు ఉమేష్‌ అన్నారు.

తాజ్‌ పరిరక్షణకు…
ఇక భోపాల్‌ తాజ్‌ను పరిరక్షించేందుకు గత ఆరు సంవత్సరాలుగా ప్రచార కార్యక్రమాన్ని నిర్వమిస్తున్న సవితా రాజె కొంత కాలం క్రితం ప్యారిస్‌లోని స్కూల్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌ డీన్‌ సెర్జ్‌ సాంటెల్లిని ప్రత్యేకంగా భోపాల్‌కు ఆహ్వానిం చారు. ‘సెర్జ్‌ సాంటెల్లి తాజ్‌మహల్‌లోని పలు భవన సముదాయాలను పరి రక్షించేందుకు కృషిచేస్తున్నారు. ఆయన స్వయంగా ఈ ప్యాలెస్‌ను ప్రపంచం లోని అందమైన ప్యాలెస్‌లలో ఒకదానిగా అభివర్ణించారు’ అని రాజె పేర్కొ న్నారు.

Surya Telugu Daily.

ఏప్రిల్ 14, 2011 - Posted by | చూసొద్దాం |

1 వ్యాఖ్య »

  1. Sir,
    maaku chalaa bagaa teliyachesaru.Thank u .

    వ్యాఖ్య ద్వారా Anasuya Billapati | ఏప్రిల్ 14, 2011 | స్పందించండి


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: