టాప్ టెన్… అందమైన బీచ్‌లు
టాప్ టెన్… అందమైన బీచ్‌లు
సాయంకాలం వేళ అస్తమించే సూర్యుడిని చూస్తూ సముద్రం దగ్గర ఇసుకలో ఆడుకోవడం అంటే చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతిఒక్కరికీ ఆనందంగా ఉంటుంది. అందువల్లే చాలా మంది కుటుంబంతో కలిసి ఆనందంగా గడిపే స్థలాల్లో బీచ్‌లకు ప్రథమ స్థానం ఇస్తారు. వేసవిలో సాయంకాలం బీచ్‌ల వద్ద హాయిగా గడపేందుకు కొందరు మక్కువ చూపుతారు. ఇటువంటి వారి కోసం ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన అందమైన పది బీచ్‌లు ఉన్నాయి. ఆ అందాల బీచ్‌లను సందర్శిద్దాం..
కోస్టాడెల్సల్ బీచ్…
ఇటలీలోని కోస్టాడెల్సల్ బీచ్ పర్యాటకులను విశేషంగా ఆకర్షించడానికి కార ణం ఇక్కడి వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉండడమే. ఇక్కడి సముద్రంలో స్వచ్ఛమైన నీరు, ఒడ్డున తెల్లటి ఇసుక ఎక్కడో స్వర్గలోకంలో ఉన్న భావన కలిగిస్తుంది. ఇటలీలోని అన్ని బీచ్లకన్నా ఇది ఎంతో వైవిధ్యంగా ఉండటం వల్లనే ఇది అందమైన బీచ్‌లలో మొదటి స్థానం దక్కించుకుంది. ప్రతి ఏటా లక్షలాది మంది పర్యాటకులు ఈ బీచ్‌ను సందర్శించి మధురానుభూతులను పొందు తారు.
కటెస్లొ బీచ్…
పశ్చిమ ఆస్ట్రేలియాలోని పెర్త్ ప్రాంతంలో కటెస్లొ బీచ్ ఉంది. అందంగా ఉండడమే కాకుండా పిల్లలు సైతం సముద్రంలో మునగడానికి చాలా సురక్షి తంగా ఉంటుందిక్కడ. ఇక్కడి సముద్రపు నీటిలో ఉప్పు శాతం తక్కువగా ఉండడంతో చాలామంది పర్యాటకులు ఈత కొట్టడానికి ఇష్టపడు తుంటారు.
డర్బన్ బీచ్…
డర్బన్ బీచ్ ఎంతో ప్రత్యేకమైనది. ఇక్కడి సముద్రపు నీల్లు సాధారణంగా ఉండే వేడి కంటే చల్లగా ఉంటాయి. అంతేకాకుండా పిల్లలు, పెద్దవారు స్విమ్మిం గ్ చేయడానికి అనువుగా ఈతకొలనులు కూడా ఈ సముద్రం ఒడ్డున ఏర్పాటు చేయడం విశేషం. అందువల్లే ఇది యాత్రికులను ఎక్కువగా ఆకర్షిస్తుంది.
కరోన్ బీచ్…
థాయ్‌లాండ్‌లోని కరోన్ బీచ్ కుటుంబ సభ్యులతో లేదా స్నేహి తులతో సందర్శించడానికి అనువైన ప్రాంతం.ఇక్కడ సముద్రం ఒడ్డున అందమైన పార్కులను ఏర్పాటుచేశారు. అంతేకాకుండా సీఫుడ్స్ రెస్టారెంట్లతో, అమ్యూజిమెంట్ పార్క్‌లతో ఈ బీచ్ సందడిగా ఉంటుంది. అందుకే రాత్రిపూటకూడా బీచ్ దగ్గర ఎంజా య్ చేయడానికి ఎక్కువసంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు.
క్వాయ్ బీచ్…
అమెరికా హవాయ్ దీవులలోని క్వాయ్ బీచ్ అందమైన ఇసు తిన్నెలు, ఆహ్లాదరమైన వాతావరణంలో పర్యాటకులను ఆకర్షి స్తుంది. కానీ ఈ బీచ్‌కు మరో ప్రత్యేకత ఉంది. చిన్న పిల్ల కో సం ఇక్కడ డిస్కవరీ మ్యూజియంను ఏర్పాటు చేశారు. ఈ మ్యూజియంలో సముద్రంలోని అనేకరకాలైన చేపలు, ఇతర జీవులను చూడవచ్చు.
ఐటుటాకి బీచ్…
కుక్ ఐలాండ్ దీవులలో ఐటుటాకి బీచ్ ఉంది. మాములు ఇసుకలా కాకుండా ఇక్కడి బీచ్ ఇసుక చాలా మెత్తగా ఉం టుంది. ఇక్కడి ఇసుకపై పడుకుంటే మెత్తటి పరుపై పడుకున్న అనుభూతిని కల్గుతుంది.ఇంతే కాకుండా ఐటుటాకి బీచ్‌కు మరో ప్రత్యేకత ఉంది.సముద్రంపై విహరించాలనే వారికి బోట్ సౌకర్యం ఉండడం విశేషం. చాలా చేపలు ఒడ్డునే కనిపిస్తూ సముద్రంలో ఈత కొట్టే వారిని కనువిందు చేస్తుంటాయి.
నూసా బీచ్…
అందాల బీచ్‌లో ఏడవ స్థానంలో నిలుస్తుంది ఆస్ట్రేలియాలోని నూ సా బీచ్. కుటుంబ సభ్యులతో కలిసి వెళ్ళాలనుకొనే చాలా మంది ఈ బీచ్‌కే వెళ్తుంటారు. సరదాగా గడపడానికి, ప్రకృతిని ఇష్టపడే వారికి ఇక్కడ నూసా నేషనల్ పార్క్‌ను ఏర్పాటుచేశారు. ఇక్కడ అన్ని రకా లపూల మొక్కలతో పాటు మహా వృక్షాలు కనువిందు చేస్తాయి.
తావిరా బీచ్…
పోర్చుగల్‌కు తూర్పున ఈ బీచ్ ఉంటుంది. ఈ బీచ్ వెంబడి కొన్ని కిలోమీటర్ల వరకు షాపులు, రెస్టారెంట్లు ఉంటాయి. బోట్ షికా ర్ చేయడానికి అనువుగా అన్ని రకాల బోట్లు ఇక్కడ పర్యాటకు లకు అందుబాటులో ఉంటాయి.
సాయులిటా బీచ్…
మెక్సికోలోని సుందరమైన బీచ్ సాయులిటా. ఈ బీచ్ చాలా సురక్షితమైనదని పర్యాటకులు భావిస్తారు.చిన్నపిల్లల భద్రత కోసం ఇక్కడ ప్రత్యేకంగా సిబ్బం దిని ఏర్పాటు చేశారు. సరదాగా అటలు ఆడుకోవడానికి, ఐస్ క్రీం తింటూ ఎం జాయ్ చేయాలనుకొనేవారు తప్పకుండా సందర్శించాల్సిన బీచ్ ఇది.
సనుర్ బీచ్…
ఇండోనేషియాలోని సనుర్ బీచ్ ప్రపచంలోని అందమైన బీచ్‌లలో పదవ స్థానాన్ని ఆక్రమిస్తుంది. ఇక్కడికి ఎక్కువగా కొత్తగా పెళె్ళైన దంపతులు, స్నేహి తులు వస్తుంటారు. ఓపెన్ రెస్టారెంట్లను కలిగిఉండడం ఈ బీచ్ ప్రత్యేకత. పక్కనే చిన్న నగరం ఉండడంతో షాపింగ్ చేసే వారు కూడా ఇక్కడకు రావడానికి చాలా ఆసక్తి కనబరుస్తారు.
Surya Telugu Daily
1 వ్యాఖ్య »
స్పందించండి
-
భాండాగారం
- డిసెంబర్ 2012 (1)
- డిసెంబర్ 2011 (2)
- నవంబర్ 2011 (2)
- సెప్టెంబర్ 2011 (2)
- జూలై 2011 (5)
- జూన్ 2011 (7)
- ఏప్రిల్ 2011 (6)
- మార్చి 2011 (28)
- ఫిబ్రవరి 2011 (6)
- జనవరి 2011 (20)
- డిసెంబర్ 2010 (21)
- నవంబర్ 2010 (14)
-
వర్గాలు
- (స్నే)హితులు
- అతివల కోసం
- అవర్గీకృతం
- ఆరోగ్యం
- ఇతర బ్లాగులు సైట్లు
- చిన్నారి లోకం
- చూడు చూడు నీడలు
- చూసొద్దాం
- నచ్చిన కవితలు
- నచ్చిన పాటలు
- నాట్యం
- ప్రకృతి
- భక్తి
- ముద్రలు
- మ౦చి మాటలు
- యూట్యూబు లో తెలుగు
- యెర్రె౦కడు
- రింగ్ టోన్స్
- వర్ణ చిత్రాలు
- వార్తలు
- వింతలూ-విశేషాలు
- విచిత్ర చిత్రాలు
- విజ్ఞానం
- విదేశాలలో మన దేవాలయాలు
- విద్యార్థులకు
- వ౦టా-వార్పు
- సంస్కృతి
- సామెతలు
- సినిమా
- సూపర్ సింగర్స్
- సైకత శిల్పాలు
-
RSS
Entries RSS
Comments RSS
chala bagunnayi.