హరివిల్లు

ఎన్నెన్నో వర్ణాలు-అన్నింటా అందాలు…

పిలిచిన పలికే దైవం కోదండరాముడు

పిలిచిన పలికే దైవం కోదండరాముడు

ఒంటిమిట్ట కోదండరాముడు పిలిస్తే పలికే దేవుడిగా ప్రసిద్ధి చెందాడు. అందరి బంధువులా పిలిపించుకునే కోదండరాముడు భక్తులచే కోటి దండాలు అందుకుంటున్నాడు. మత సామరస్యాని, ప్రశాంత వాతావరణానికి ఆలవాలం ఇక్కడి కోదండరాముడు. కళలకు కాణాచి అయిన సీమకు ఆభరణంగా నిలిచి భక్తితో పాటు చారిత్రకంగా అపూర్వ సంపదగా అలరారుతున్నది ఈ ఆలయం.దక్షిణ భారతదేశంలో ప్రాచీన శిల్పకళా సంపదను ఎలుగెత్తి చాటిచెప్పే సుప్రసిద్ధ దేవాలయాల్లో ఒంటిమిట్ట రామాలయం ఒకటి. ఈ ఆలయం కడప- చెనై్న రహదారిలో కడప నుంచి 25కిలో మీటర్ల దూరంలో ఉంది. ఈనెల 23వ తేది నుంచి జరిగే బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ప్రత్యేక వ్యాసం.

దక్షిణ భారతదేశంలోనే సుప్రసిద్ధం…
vontimittaదక్షిణ భారతదేశంలో సుప్రసిద్ధ దేవాలయాల్లో కడప జిల్లా ఒంటిమిట్టలోని శ్రీకోదండ రామాలయం చెప్పుకోదగ్గది. ఈ ఆలయ విశిష్టమైన చరిత్ర, ప్రచారంలో ఉన్న కొన్ని మహిమలను గుర్తుకు తెచ్చు కుంటే ఆశ్చర్యం కలుగకమానదు. ఆంధ్ర వాల్మీకి వావికొలను సుబ్బారావుకు స్వప్నంలో బైరాగులు కనపడ టం, సహజ పండితుడు బమ్మెర పోతన రచిస్తున్న పద్యంలో చరణాలు గుర్తుకు రాక నిలిపి వేయగా శ్రీరాముడు ప్రత్యక్షమై పూర్తి చేయడం, అయ్యలరాజు రామభద్రునికి చిన్న ప్రాయంలో సీతా దేవి పాలు ఇవ్వడం, ఇమాంబేగ్‌ పిలిస్తే కోదండరాముడు పలుకడం, తూర్పువైపునకు ఉన్న సీతారామ లక్ష్మణమూ ర్తులు మాల ఓబన్న అనే భక్తుని కోసం పశ్చిమైపునకు మరలడం వంటి కథనాలు ఇక్కడి కోదండ రామా లయ మహిమలుగా చోటుచేసుకున్నాయి.

మతాలకతీతం.. భారతావనికే ఆదర్శం….
అయోధ్యలో రాముడి గుడి కట్టాలని మెజార్టీ హిందువులు, మసీదు నిర్మించాలని ముస్లిం తలలు బద్దలు కొట్టుకుంటున్న ప్రస్తుత తరుణంలో దేశ రాజకీయాలు అయోధ్య రాముని చుట్టూ పరిభ్రమిస్తున్నాయి.ఈ సమస్య అలాగే ఉన్న నేపథ్యంలో ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయం విశిష్టత యావత్‌ భారతా వనికే ఆదర్శంగా నిలుస్తోంది. రాష్ట్రంలోనే రెండో భద్రాద్రిగా పేరుగాంచిన ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయం చారిత్రాత్మకంగా ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. క్రీ.శ.1640 సంవత్సరంలో కడపను పాలించిన వారిలో అబ్దుల్‌ నబీఖాన్‌ ఆస్థానంలో ప్రతినిధిగా పనిచేసిన ఇమాంబేగ్‌ ఒంటిమిట్ట కోదండ రాముడిని పరీక్షించి రాముని మహిమను ప్రత్యక్షంగా వీక్షించారట. దీనితో నవాబు ఆనందభరితుడై వెంటనే కోదండరాముని కైంకర్యానికి బావిని కూడా త్రవ్వించాడని చరిత్ర చెబుతోంది. ప్రతి శుక్రవారం మంటపం పల్లె సమీపంలో దర్గాను దర్శించుకున్న ముస్లింలు ఇక్కడకు వచ్చి తీర్థప్రసాదాలు తీసుకొని వెళ్ళడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. ఈ ఆలయంలో 23 నుండి ఏప్రిల్‌ 12వ తేది వరకు జరిగే ఉ త్సవాలు అత్యంత వైభవంగా జరుగనున్నాయి. ఈ ఉత్సవాల కోసం అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

రామాలయ ఆవిర్భావం….
nandiవిజయనగర పాలకుల్లో ఒకరైన సదాశివరాముల కాలంనాటి శిలా శాసనాలను బట్టి చూస్తే క్రీ.శ.1500 సంవత్సరానికి పూర్వమే ఈ ఆలయం పూర్తయినట్లు తెలుస్తోంది.రామాలయ గోపురం నిర్మాణం, చోళ నిర్మాణ శైలికి దర్పణం పడుతున్నాయి. రామాలయానికి ఎదురుగా ఉన్న సంజీవ రామస్వామి ఆల యాన్ని చివరగా పునరుద్ధరించినట్లు తెలుస్తోంది.

ఆలయ చరిత్రను తెలిపే శాసనాలు…
శ్రీకోదండ రామాలయంలో రాజగోపురం ఉత్తర బాగాన రెండు శిలాశాసనాలు ఉన్నాయి. మొదటి శాసనం క్రీ.శ.1555లో. క్రీ.శ.1558లో రెండో శిలా శాసనాన్ని వేయించారు. వీటి ప్రకారం విజయ నగర పాలకుడు వీర సదాశివ దేవరాయల సామంతుడు గుత్తి తిరుమ లయ్య దేవ మహారాజు పులపత్తూరు గ్రామాన్ని ఆలయానికి దానం చేశా రు. శ్రీకోదండ రామా లయ ప్రాకార నిర్మాణాలకు రథం బ్రహ్మోత్సవాల నిర్వహణకు తిరుమల రాజయ్య, నాగరాజయ్య దేవ మహారాజులు ఒంటిమిట్టకు, ఈగ్రామానికి చెందే పల్లెలను, పొలాలను దానంగా ఇచ్చారు. ఈ రెండు శిలా శాస నాలు సదాశివరాముల ప్రధానిగా ఉన్న తిరుమలరాజు అనుమతితో వేయించారు.

ఆలయ పూర్వగాథ…
పితృవాక్య పరిపాలకుడైన శ్రీరామచంద్రుడు అరణ్యవాసం చేస్తూ ఆనాటి దండకారణ్యంలో భాగమైన ఒంటిమిట్టకు వచ్చిటన్లు ఇతిహాసం చెబుతోంది. ఇక్కడ మునులకు రాక్షసుడి బెడద నివారణకు ఒకే శిల పై నిర్మితమైన శ్రీసీతారామలక్ష్మణ విగ్రహాలను మునులకు ప్రదానం చేశారని అంటారు. ఈ విగ్ర హాలు మూడు విడివిడిగా కనిపించినా ఇవన్నీ ఒకేశిలపై ఆవిర్భవించి ఉన్నందున ఈ గ్రామానికి ఏక శిలా నగరమని పేరు వచ్చిందని చరిత్ర కారులు చెబుతున్నారు. ఈ పరిసర ప్రాంతాల్లో సీతాదేవికి దా హంగా ఉందని గ్రహించిన శ్రీరామచంద్రుడు తన బాణంతో పాతాళం నుంచి గంగను పైకి తెప్పిం చాడట. నీళ్లు పడిన చోటు రామతీర్థమని, లక్ష్మణుని ద్వారా నిర్మించిన తీర్థం లక్ష్మణ తీర్థమని అంటారు.ఒకరోజు జాంబవంతుడు ఇక్కడ విశ్రమించగా స్వప్నంలో సీతారామలక్ష్మణులు దర్శనమివ్వడంతో ఆనందభరితుడై విగ్రహాలను ప్రతిష్టించారంటారు. అందుకే వాటికి జాంబవంత ప్రతిష్ఠగా పేరు వచ్చిం దని ఇతిహాసం చెబుతోంది.

జనపదుల గాథ….
ద్వాపరయుగం తర్వాత కలియుగం మొదలైనపుడు పలువురు దొంగలు ముఠాలుగా ఏర్పడి గ్రామాలపై దాడిచేసి బంగారు నగలను అపహరించేవారు. ఈ ప్రాంతంలో ఒంటడు- మిట్టడు (వడ్డెవారు) అనే ఇద్దరు అన్నదమ్ములు ఈ పరిసర గ్రామాల్లో దోపిడి చేసి తీసుకొచ్చిన వస్తువులను ఇక్కడి అటవీగృహాల్లో దాచేవారు. ఒకనాడు గుహలో శిలపై సీతారామలక్ష్మణులు ప్రత్యక్షమై ‘ఒంటడు- మిట్టడు’లకు సత్ప్ర వర్తనతో నిజాయితీగా జీవించాలని ఆదేశించారట. అప్పుడు వారికి జ్ఞానోదయం కల్గి దేవుని విగ్రహాలను గర్భగుడిని నిర్మించారు. ఆ కారణంగా ఈ గ్రామానికి ఒంటిమిట్ట అనే పేరు స్థిరపడినట్లు చెబుతారు.

Vontimitta_Templeభారతదేశంలోని గొప్ప ఆలయ గోపురాల్లో ఒంటిమిట్టలోని శ్రీకోదండ రామాలయ గోపురం ఒకటని క్రీశ.1652 సంవత్సరంలో భారతదేశ యాత్ర చేసిన ఫ్రెంచ్‌ యాత్రికుడు టావర్నియర్‌ పేర్కొన్నారు. సహజ పండితునిగా వాసికెక్కిన బమ్మెర పోతనామాత్యులు, అష్టదిగ్గజాల్లో ఒకరైన అయ్యరాజ రామ భద్రాద్రి ఓబన్న, తిప్పకవి, ఇమాంబేగ్‌, ఆంధ్ర వాల్మీకిగా పేరుగాంచిన వాలింకొలను సుబ్బారావు వంటి ప్రముఖులంతా ఒంటిమిట్టలో నివసించిన వారే. ఆంధ్ర మహాభాగవతాన్ని తనకు అంకితమివ్వాలని పో తనను కోదండరాముడు కోరింది ఇక్కడేనని ప్రతీతి. అత్యంత సుందరమైన శిల్పి చాతుర్యానికి అద్దం పట్టేలా ఒంటిమిట్ట రామాలయం అలలారుతోంది.

బమ్మెర పోతన :
ఈయన క్రీ.శ.1465 నుండి క్రీ.శ.1470 ప్రాంతం వరకు ఉండి, ఆంధ్ర మహా భాగవతాన్ని తెలుగులోకి రచించి కోదండరాముడికి అర్పించిన సహజ పండితుడు పోతనామాత్యుడు. పోతన ఒంటిమిట్టవాసి అని కొందరు, ఓరుగళ్లు వాసి అని కూడా అక్కడివారు అంటుండడంతో కొంత వివాదం ఉంది. ఈయన ఒంటిమిట్టలో మహా భాగవతాన్ని రచిస్తుండగా గజేంద్ర మోక్షంలోకి ‘అల వై కుంఠ పురంబులో’ అనే పద్యంలో కొన్ని చరణాలు నిలిపివేశాడని, అప్పుడు శ్రీరాముడు ప్రత్యక్షమై ఆ పద్యాన్ని పూర్తి చేశాడని పురాణం చెబుతోంది.

వావిల కొలను సుబ్బారావు :
ఈయన 1863 సంవత్సరంలో జనవరి 23న కడప జిల్లా జమ్మల మడుగులో రామచంద్రారావు, కనకాంబ దంపతులకు జన్మించిన ఆంధ్ర వాల్మీకి వావిల కొలను సుబ్బా రావు. 50కి పైగా గ్రంథాలను రచించిన మహాకవి. ఒకనాటి రాత్రి స్వప్నంలో ఆయనకు ఇద్దరు బైరాగులు కనపడి ‘ఇక్కడ నువ్వు ఏమి చేస్తున్నావు. ఒంటిమిట్టకు రారాదా’ అని పిలిచారట. ఉదయాన్నే స్వప్నం గురించి చర్చించి ఒంటిమిట్టకు బయలుదేరారు. 1920 నాటికి ఒంటిమిట్టలోని రామాలయ మా న్యాలు, మడులు, అన్యాక్రాంతమయ్యాయి. ఆ పరిస్థితుల్లో స్వామి ప్రేరణతో సుబ్బారావు ఒంటి మిట్టలో నివాసమేర్పరచుకొని రామాలయాన్ని పునరుద్ధరించుటకు అవిరళకృషి చేశారు. టెంకాయ చిప్ప చేత బట్టుకొని పాదయాత్ర చేస్తూ లక్షలాది రూపాయలను సేకరించి ఆలయ నిర్మాణం గావించారు. ఈయన వాల్మీకి రామాయణాన్ని తెలుగులోకి యధాతథంగా అనువదించి ఆంధ్ర వాల్మీకి అనే బిరుదు పొందారు.

అయ్యరాజు తిప్పకవి :
gopuramఒంటిమిట్ట నివాసి అయిన అయ్యరాజు తిప్పకవి క్రీ.శ.1423నుండి 1446వరకు సంగరాజు వంశములలో ముఖ్యుడైన ప్రౌడదేవరాయుల ఆస్థానంలో కవిగా పనిచేశారు. ఈయన శ్రీ రఘువీర శతకాన్ని రచించారు.వరకవిః ఈ కవి పూర్తి పేరు తెలియదు. వరకవి అనేది ఆయనకు బిరుదు. ఈ కవి మట్టిరాజుల ఆస్థానంలోని వారు. ఒంటిమిట్ట కోదండరాముని మీద ఆయన శతకం రాశారు. ఈ శతకంలో ఆనాటి రాజకీయ అల్లకల్లోలాలను ప్రస్తా వించారు. ప్రస్తుతం ఈ శతకం శ్రీవెం కటేశ్వర యూనివర్సిటిలోని ప్రాచ్య పరి శోధనశాలలో వుంది. ఈ కవిపేరుమీద నెల్లూరు జిల్లాలో ‘వరకవిపూడి’ అని గ్రామం ఉంది.

మరుగున పడుతున్న శిల్పసంపద
– పట్టించుకోని పురావస్తు శాఖాధికారులు

రాష్ట్రంలోనే రెండో భద్రాచలమైన ఒంటిమిట్ట శ్రీకోదండ రామాలయం అద్భుతమైన శిల్ప కళకు పెట్టింది పేరు.ఈ ఆలయంలోని గోపు రాలపై ఉండే శిల్పసంపద రానురానూ అంత రించిపోతోంది. శిథిలమవుతున్న శిల్ప సం పద తిరిగి నిర్మించేందుకు భారత పురావస్తు శాఖ కుంటిసాకులు చెబుతోంది. దీనిపై ఈ ప్రాంత ప్రజల్లో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. చేస్తామని హామీలు ఇస్తూ వస్తున్న ప్రజాప్రతినిధులు కూడా మొండాల శిల్పాలకు పునరద్ధరించేందుకు భారత పురావస్తు శాఖపై ఒత్తిడి తేవడంలో విఫలమవు తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.

ఆలయంలోని రాజ గోపురం, గర్భగుడి గోపురంపై ఉన్న అద్భు తమైన శిల్పాలు రాను రానూ ముఖం, తల, చేతులు, కాళ్లు భాగాలుగా ఒక్కక్కటిగా ఊడిపోతూ అందవి హీనంగా దర్శనమిస్తున్నాయి. అయితే 2002 సంవత్స రంలో ఆలయంలోను, రాజగోపురం మరమ్మ తులు చేసి పురావస్తు శాఖ గోపురాలపై మొండాలుగా దర్శనమిస్తున్న శిల్పాలకు రూపాలు కల్పించక అలాగే వదిలేసి మరమ్మతులు చేయడంతో ప్రజలు నిరస న తెలుపుతున్నారు. పాడైపోయిన శిల్పాల రూపాలకు తమ వద్ద తగిన ఆనవాళ్లు లేవంటూ ఆ శాఖ ప నులు ముగించి చేతులు దులుపుకుంది. భారతదేశంలోని గొప్ప ఆలయ గోపురాల్లో ఒంటిమిట్టలోని శ్రీ కోదండ రామాలయ గోపురం ఒకటని, క్రీ.శ.1652 సంవత్సరం భారతదేశ యాత్ర చేసిన ఫ్రెంచ్‌ యా త్రికుడు టావర్నియర్‌ ప్రశంసించాడు.

అలాంటి గోపురానికి ఉన్న శిల్పాలు నేడు శిథిలావస్తలకు చేరు కున్నాయి. రూపాలు కోల్పోయి అంద విహీనంగా దర్శనమిస్తున్నాయి. ఎంతో ప్రాచీన ప్రాశస్థ్యం కలిగి న ఒంటిమిట్ట శ్రీకోదండ రామాల యాన్ని సందర్శించేందుకు ఆంధ్రప్రదేశ్‌ సహా పలు రాష్ట్రాల నుంచే కాక విదేశాల నుండి సైతం యాత్రి కులు వస్తుంటారు. మరి అలాంటి శిల్ప సంపద నేడు శిథిలావస్తకు చేరడంతో రాజగోపురం, గర్భగుడి గోపురాలు బోసిపోయి భక్తులను వెక్కిరిస్తున్నాయి. రాజగోపు రంపై సుమారు 250కిపైగా శిల్పాలు ఉండేవి. అయితే 50శాతం శిల్పాలను గతంలో ఉన్నవాటిలోనే శిల్ప కారులచే పురావస్తు శాఖాధి కారులు పునరుద్ధరిం చారు. ఇందు కోసంకొన్ని బొమ్మలను కర్నాటక రాష్ట్రం హంపి నుంచి తెప్పించి మరమ్మతులు చేశారు.

మిగిలిన 50శాతం శిల్పా లకు సంబంధించి రూపాలను తగిన ఆనవాళ్ళు లేవంటూ అప్పట్లో మరమ్మతు పనులు ముగించారు. శిల్పా లకు ఉన్న రూపాల చరిత్ర లేక పోవడంతో వాటికి మరమ్మతులు చేయకుండా అలా గే వదిలిపోవాల్సి వచ్చిందని పురావస్తు శాఖాధికారులు చెబుతున్నారు. ఎవ రైనా వాటి రూపాలకు సంబంధిం చిన ఆధారాలు చూపితే వాటిని పునః నిర్మిస్తామంటు న్నారు. ప్రభుత్వ శిల్పకారులను పిలిపించి శిల్పాలను తిరిగి నిర్మింప చేయాలని ప్రజలు కోరుతున్నారు.

– మేజర్‌ న్యూస్‌ ఒంటిమిట్ట

Surya Telugu Daily .

ఫిబ్రవరి 24, 2011 Posted by | చూసొద్దాం | 1 వ్యాఖ్య