హరివిల్లు

ఎన్నెన్నో వర్ణాలు-అన్నింటా అందాలు…

అతి పెద్ద ఆకాశ హర్యాలు

అతి పెద్ద ఆకాశ హర్యాలు
భవన నిర్మాణరంగంలో మానవుని మేధాశక్తి అంబరాన్ని తాకుతోంది.ఇటీవలికాలంలో ఈ రంగంలో సాంకేతిక పరిజ్ఞానం ఎంతో అభివృద్ధి చెందింది. 21వ శతాబ్దంలో మనిషి తన మేధాశక్తికి మరింత పదునుపెట్టి అద్భుతాలు సృష్టిస్తున్నాడు. దానికి ప్రత్యక్ష ఉదాహరణే దుబాయ్‌లోని అతి పెద్దదైన ‘బుర్జ్‌ ఖలీఫా’ భవనం. 1.5 బిలియన్‌ డాలర్ల వ్యయంతో కేవలం ఐదేళ్ళలో 160 అంతస్తులతో రూపొందించిన ఈ ఆకాశ సౌధం ప్రపంచంలోనే అత్యంత ఎతె్తైన భవనంగా గుర్తింపు పొందింది. ఇవేకాకుండా ప్రపంచంలో ఇలాంటి కొన్ని భవనాలున్నాయి. ఈ నేపథ్యంలో వ్యాపార, నివాస అవసరాలకోస నిర్మించిన అనేక భవనాల్లో నిర్మాణపరంగా తొలి పది స్థానాల్లో నిలిచిన ఎతె్తైన ఆకాశ సౌధాలపై ఓ కథనం…

petronas-towers.jpgఆకాశహార్మ్యాల నిర్మాణంలో చైనీయులు అందరికంటే ముందు వరసలో ఉన్నారు. ప్రపంచంలోని టాప్‌ టెన్‌ ఎతె్తైన భవనాల్లో ఆరు భవనాలు చైనా, హాంగ్‌కాంగ్‌లలోనే నిర్మితం కావడం విశ ేషం. 1998 వరకు చికాగోలోని విల్లిస్‌ టవర్స్‌దే అగ్రస్థానం. 1974లో నిర్మించిన ఈ భవనం ఇరవైనాలుగేళ్ళపాటు తన ఆధిపత్యాన్ని చెలాయించింది. అయితే ఈ భవనం ఇప్పుడు ఏడవ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చిం దంటే భవన నిర్మాణ రంగంలో మూడు దశాబ్దాలలో ఎంత మార్పు సంభవించిందో అర్ధం చేసుకోవచ్చు. రోజురోజుకూ పెరిగిపోతున్న జనాభాను దృష్టిలో ఉంచుకొని అపార్ట్‌మెంట్లను నిర్మించడం పరిపాటిగా మారింది.

అత్యధిక జనా భా ఉండే మహా నగరాలలోనైతే ఇక చెప్పనవసరం లేదు. కేవ లం నివాస అవసరాలకే కాకుండా వ్యాపార అవసరాల కోసం పెద్ద షాపింగ్‌ మాల్స్‌ను నిర్మించడం కూడా గత రెండు మూ డు దశబ్దాల్లో ఎక్కువైంది. అయితే ఇలాంటి ఆకాశ సౌధాలు నిర్మించడం మానవ అవసరాల మాట అలా ఉంచితే ఇలాంటి నిర్మాణాల వలన భూకంపాలు, నీటి కొరత లాంటి సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు పర్యావరణవేత్తలు. భద్రత విషయంలో కూడా ఇవి శ్రేయస్కరం కా దని వారి అభిప్రాయం. ఏదేమైనప్పటికీ భవన నిర్మాణ రం గం లో అందనంత ఎత్తుకు ఎదిగిన మనిషి మేధా సంపత్తికి జై కొట్టాల్సిందే.

నేనెవరికీ అందను…
ప్రపంచంలోనే ఎతె్తైన మానవ నిర్మితంగా గుర్తింపు పొందిన దుబాయ్‌లోని బుర్జ్‌ ఖలీఫా భవనంలో మొత్తం 160 ఫోర్లు ఉండడం విశేషం. దీనిని బుర్జ్‌ దుబాయ్‌ అని కూడా పిలుస్తారు. 21 సెప్టెంబర్‌ 2004న పునాదులు వేసుకున్న ఈ భవన నిర్మాణం గత ఏడాది అక్టోబర్‌ 1వ తేదీన పూర్తయ్యిం ది. కేవల ఐదేళ్ళ రికార్డు కాలంలో నిర్మించిన ఈ నిర్మాణానికి 1.5 బిలియన్‌ డాలర్లు ఖర్చయిందట. 490 ఎకరాల విస్తీర్ణం లో నిర్మించిన ఈ భవన నిర్మాణానికి బిల్‌ బేకర్‌ అనే ఇంజనీర్‌ ఛీ్‌ఫ్‌ ఆర్కిటెక్ట్‌గా వ్యవహరించారు.ఎమార్‌ ప్రాపర్టీస్‌ సం స్థ ఆధ్వర్యంలో నిర్మాణం పూర్తి చేసుకుంది.

చికాగోలోని విల్లిస్‌ టవర్స్‌, న్యూయార్క్‌లోని ప్రఖ్యాత వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ లాంటి నిర్మాణాలకు సాంకేతిక పరిజ్ఙానాన్ని అందించిన స్కిడ్‌మోర్‌, ఓవింగ్స్‌ అండ్‌ మెరిల్‌ సంస్థ బుర్జ్‌ ఖలీఫాను డిజైన్‌ చేసింది.మలేషియాలోని పెట్రోనాస్‌ టవర్స్‌, తైవాన్‌లోని తైపీ 101లకు కాంట్రాక్టర్లుగా వ్యవహరించిన దక్షిణ కొరియాకు చెందిన శామ్‌సంగ్‌ ఇంజనీరింగ్‌లాంటి పలు సంస్థలు ఈ అ ద్భుత నిర్మాణంలో పాలుపంచుకున్నాయి. కార్యాలయాలకో సం ఆఫీస్‌ సూట్స్‌, వ్యాపార అవసరాలకోసం షా పింగ్‌ మా ల్స్‌, రెస్టారెంట్లతో పాటు రెసిడెన్షియల్‌ కాంప్లెక్స్‌ల ను కూడా ఇందులో పొందుపరచడం విశేషం. దక్షిణాసియా దేశాల నుం డి వెళ్ళిన సుమారు 7,500 మంది భవన నిర్మాణ కార్మికులు బుర్జ్‌ ఖలీఫా నిర్మాణంలో పాలుపంచుకున్నారు.

ఎత్తులో మేము సైతం…
తైపీ 101… బుర్జ్‌ ఖలీఫా నిర్మాణం పూర్తయ్యేవరకు ఈ నిర్మాణానిదే రికార్డు. 101 ఫ్లోర్లు కలిగి ఉండడంతో దీనికి ఆ పేరు వచ్చింది. కాన్ఫెరెన్స్‌ హాళ్లు, ఫిట్‌నెస్‌ సెంటర్లు, లైబ్రరీ, ఆఫీస్‌, రెస్టారెంట్‌, రిటైల్‌లాంటి ఎన్నో వ్యాపారాలకు ఇందు లో సదుపాయాలున్నాయి. ఈ భవనం యొక్క మరో విశిష్టత ఏమిటంటే వారంలో ఒక్కో రోజు ఒక్కో రంగులో దర్శనమివ్వడం తైపీ 101 ప్రత్యేకత. ప్రతిరోజు ఉదయం ఆరు గం టల నుండి రాత్రి పది గంటల వరకు ప్రతి రోజు వివిధ రం గుల్లో దర్శనమిచ్చే తైపీ 101…509 మీటర్ల ఎత్తుతో ప్రపం చంలోనే ఎతె్తైన భవానాల్లో రెండవ స్థానంలో ఉంది.

ఇక చైనాలో అత్యంత ఎతె్తైన ‘షాంఘై వరల్డ్‌ ఫైనాన్షియల్‌ సెంటర్‌’ ప్రపంచంలోని ఎతె్తైన భవనాల్లో మూడవ స్థానంలో కొనసాగుతోంది. 2008లో నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ కట్టడంలో తైపీ 101 లాగే వ్యాపార అవసరాలకు కావాల్సిన సదుపాయాలున్నాయి. 492 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ భవనంలో 101 ఫ్లోర్లు, 91 లిఫ్ట్‌లు ఉన్నాయి. దీని తరువాతి స్థానాన్ని హాంగ్‌ కాంగ్‌లోని ‘ఇంటర్నేషనల్‌ కామర్స్‌ సెంటర్‌’ ఆక్రమించుకుంది. 484 మీటర్లు ఎ త్తులో ఉన్న ఈ భవనాన్ని ఎమ్‌టిఆర్‌ కార్పోరేషన్‌ లివి ుటెడ్‌ నిర్మించింది.

ప్రపంచంలో ఎతెతైన నిర్మాణాల్లో ఎక్కువ పాపులారిటీ సంపాదించిన మరో ఆకాశ సౌధం ‘పెట్రోనాస్‌ టవర్స్‌’. మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో నిర్మించిన ఈ జంట సౌధా లను1992-98 మధ్యకాలంలో నిర్మించారు. వీటి తరువాత నన్జింగ్‌ గ్రీన్‌లాండ్‌ ఫైనాన్షియల్‌ సెంటర్‌, విల్లిస్‌ టవర్‌, గువాంగ్‌జౌ వెస్ట్‌ టవ ర్‌, జిన్‌ మావో టవర్‌, ఇంటర్నేషనల్‌ ఫైనాన్షియల్‌ సెంటర్‌ లాంటి నింగినంటే నిర్మాణాలు టాప్‌-10 లిస్ట్‌లో పేరు సంపాదించాయి. ఈ విషయంలో భారత్‌ మాత్రం చాలా వెనకబడి ఉందనే చెప్పవచ్చు.

ప్రపంచంలోని టాప్‌ – 10 ఆకాశసౌధాలు
1. బుర్జ్‌ ఖలీఫా

ఎత్తు		: 828 మీటర్లు
అంతస్తులు   	: 160
సిటీ		: దుబాయ్‌ (యూఏఈ)
ఆర్కిటెక్చర్‌   	: స్కిడ్‌మోర్‌, ఓవింగ్స్‌ అండ్‌ మెరిల్‌
నిర్మాణ సంస్థ	: ఎమార్‌ ప్రాపర్టీస్‌
నిర్మాణం ప్రారంభించింది: 21 సెప్టెంబర్‌ 2004
ప్రారంభం		: 4 జనవరి 2010
నిర్మాణ వ్యయం	: 1.5 బిలియన్‌ డాలర్లు
2. తైపీ 101
ఎత్తు		: 509 మీ
అంతస్తులు 		: 101
సిటీ		: తైపీ (తైవాన్‌)
ఆర్కిటెక్చర్‌ 		: సి.వై.లీ అండ్‌ పార్ట్‌నర్స్‌
నిర్మాణ సంస్థ 	: కేటీఆర్‌టీ జాంయింట్‌ వెంచర్‌, 			
         శామ్‌సంగ్‌ సీ అండ్‌ టీ.
నిర్మాణం కాలం	: 1999-2004
నిర్మాణ వ్యయం	: 1.76 బిలియన్‌ డాలర్లు
3. షాంఘై వరల్డ్‌ ఫైనాన్షియల్‌ సెంటర్‌
ఎత్తు		: 492 మీటర్లు
అంతస్తులు		: 101
సిటీ		: షాంఘై
దేశం		: చైనా
ఆర్కిటెక్చర్‌		: కోన్‌ పెడర్సన్‌ ఫాక్స్‌
నిర్మాణ సంస్థ	: మోరి బిల్డింగ్‌ కంపెనీ
నిర్మాణ కాలం	: 1997-2008
నిర్మాణ వ్యయం	: 1.2 బిలియన్‌ డాలర్లు
4. ఇంటర్నేషనల్‌ కామర్స్‌ సెంటర్‌,
ఎత్తు		: 483 మీటర్లు
అంతస్తులు		: 118
దేశం		: హాంగ్‌ కాంగ్‌
ఆర్కిటెక్చర్‌		: వాంగ్‌ అండ్‌ ఒయాంగ్‌ లిమిటెడ్‌
నిర్మాణ సంస్థ	: సన్‌ హంగ్‌ కాయ్‌ ప్రాపర్టీస్‌
నిర్మాణం కాలం	: 2002-09
5. పెట్రోనాస్‌ టవర్స్‌
ఎత్తు		: 452 మీటర్లు
అంతస్తులు		: 88 
సిటీ		: కౌలాలంపూర్‌
దేశం		: మలేషియా
ఆర్కిటెక్చర్‌		: సెసర్‌ పెల్లి
నిర్మాణ సంస్థ	: హజామా కార్పోరేషన్‌, శామ్‌సంగ్‌ సీ అండ్‌ టీ
నిర్మాణ కాలం	: 1992-98
6. నన్జింగ్‌ గ్రీన్‌లాండ్‌ ఫైనాన్షియల్‌ సెంటర్‌
ఎత్తు		: 450 మీటర్లు
అంతస్తులు		: 89
సిటీ		: నన్జింగ్‌
దేశం		: చైనా
ఆర్కిటెక్చర్‌		: స్కిడ్‌మోర్‌, ఓవింగ్స్‌ అండ్‌ మెరిల్‌
నిర్మాణ సంస్థ	: స్కిడ్‌మోర్‌, ఓవింగ్స్‌ అండ్‌ మెరిల్‌
నిర్మాణం కాలం	: 2008 నుండి నిర్మాణంలో ఉంది
7. విల్లిస్‌ టవర్‌
ఎత్తు		: 442 మీటర్లు
అంతస్తులు		: 108
సిటీ		: చికాగో
దేశం		: అమెరికా సంయుక్త రాష్ట్రాలు
ఆర్కిటెక్చర్‌		: స్కిడ్‌మోర్‌, ఓవింగ్స్‌ అండ్‌ మెరిల్‌
నిర్మాణ కాలం	: 1970 - 73
8. గువాంగ్‌జౌ వెస్ట్‌ టవర్‌
ఎత్తు		: 440 
అంతస్తులు		: 103
సిటీ		: గువాంగ్‌జౌ
దేశం		: చైనా
నిర్మాణ సంస్థ	: విల్కిన్సన్‌ ఐర్‌
నిర్మాణ కాలం	: 2009
9. జిన్‌ మావో టవర్‌
ఎత్తు		: 421 మీటర్లు 
అంతస్తులు		: 8
సిటీ		: షాంఘై
ఆర్కిటెక్చర్‌		: స్కిడ్‌మోర్‌, ఓవింగ్స్‌ అండ్‌ మెరిల్‌
నిర్మాణ కాలం	: 1994-98
10. టూ ఇంటర్నేషనల్‌ ఫైనాన్స్‌ సెంటర్‌
ఎత్తు		: 416 మీటర్లు 
అంతస్తులు		: 88
దేశం		: హాంగ్‌ కాంగ్‌
ఆర్కిటెక్చర్‌		: రొకో డిజైన్‌ లిమిటెడ్‌
నిర్మాణ సంస్థ	: ఐ.ఎఫ్‌.సీ

దేశంలో ఇంపీరియలే టాప్‌…
ఆకాశ హర్మ్యాల నిర్మాణాల్లో భారత్‌కు టాప్‌-100లో కూడా చోటు దక్కకపోవడం గమనార్హం. ప్రస్తుతం ముంబ యిలోని ఇంపీరియల్‌ 1, 2 జంట రెసిడెన్షియల్‌ టవర్లే భారత్‌లో ఎతె్తైన నిర్మాణాలు. 60 అంతస్తులు కలిగిన ఈ భవనాల ఎత్తు 249 మీటర్లు. ప్రపంచంలో ఎతె్తైన భవనాల్లో ఇంపీరియల్‌ స్థానం 153. భారత్‌లోనే ఎతె్తైన ఈ భవనాల లిస్టులో ముంబాయిలోని ‘అశోక టవర్స్‌’, బెంగుళూరులోని ‘యూబీ టవర్స్‌’ తర్వాతిస్థానాల్లో ఉన్నాయి. అయితే ప్రస్తుతం ముంబయిలో నిర్మాణ దశలో ఉన్న ‘ఇండియా టవర్స్‌’(301 మీ), ‘లోధా బెల్లిసిమో’(252) నిర్మాణాలు పూర్తయితే ఎతె్తైన భవనాల స్థానాల్లో మన స్థానం మరింత మెరుగుపడే అవకాశం ఉంది.

Surya Telugu Daily.

ఫిబ్రవరి 17, 2011 - Posted by | వింతలూ-విశేషాలు

2 వ్యాఖ్యలు »

 1. Sir,
  Chalaa vivarangaa bagaa teliyachesaaru. thank u very much.

  వ్యాఖ్య ద్వారా Anasuya Billapati | ఫిబ్రవరి 17, 2011 | స్పందించు

 2. hi

  వ్యాఖ్య ద్వారా govind | ఏప్రిల్ 17, 2011 | స్పందించు


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s

%d bloggers like this: