హరివిల్లు

ఎన్నెన్నో వర్ణాలు-అన్నింటా అందాలు…

సికింద్రాబాద్‌ పుట్టుక ఇదీ…

సికింద్రాబాద్‌ పుట్టుక ఇదీ…

sec-badదక్కన్‌ ప్రాంతాన్ని అసఫ్‌జాహీ ప్రభువులు 1724 నుంచి 1948 వరకు అంటే భారతదేశానికి స్వాతం త్య్రం సిద్ధించే వరకు 224 సంవత్సరాల పాటు పాలించారు.అసఫ్‌ జాహీ రాజ్య వంశ స్థాపకుడు ని జాం- ఉల్‌-ముల్క్‌, మీర్‌ ఖుమద్రీన్‌ ఆలీఖాన్‌ (1724-1748) గొప్ప పరాక్రమశాలిగా దక్కన్‌ ప్రాంతాన్ని పాలించాడు. నిజాం అనేది మొఘలు చక్రవర్తులు అసఫ్‌జాహీ వంశీయులకు ఇచ్చిన గౌరవ పురస్కారం.1762లో పరాక్రమశాలిగా కీర్తిగడించిన నిజాం ఆలీఖాన్‌ రెండో నిజాం ప్రభువుగా సింహాసనం అధిష్టించా డు. 1762 నుంచి 1803 వరకు ఆయన దక్కన్‌ ప్రాంతాన్ని పాలించారు. నిజాం ఆలీఖాన్‌ తన శత్రు సైన్యాల ను ఎదుర్కోవడానికి వీలుగా బ్రిటిష్‌ సైనికుల సహకారం కోరుతూ 1798లో బ్రిటిిష్‌ వారితో ఓ ఒప్పందం కుదుర్చుకున్నారు.

sec-bad1దీని ప్రకారం నిజాంకు మరాఠాలతో కానీ, మరే ఇతర శత్రు సైన్యాలనైనా ఎదు ర్కోవడానికి అవసరమైన బ్రిటిష్‌ సైనిక బల గాలను సమకూర్చాల్సి ఉంటుంది. అందుకు బ్రిటిష్‌ సైన్యానికి అయ్యే ఖర్చునంతా నిజాం సంస్థానం భరించా ల్సి ఉంటుంది. ఈ ఒప్పందం మేరకు ముందుగా 5000 మంది సైనికులతో హుస్సేన్‌ సాగర్‌కు ఉత్తరాన ఆరుమైళ్ల దూరంలో సైనికస్థావరాలు, కంటోన్మెంట్‌ ఏర్పాటు జరిగింది. ప్రస్తుత జన రల్‌ బజార్‌ సమీపంలో మిలిటరీ గుడారాలు ఏర్పాటు చేసుకు న్నారు. తరు వాత సైనికుల సంఖ్య పెరుగుతుండడంతో వారికి అనువైన తిరుమలగిరి, బొల్లారం, బోయిన్‌పల్లి ప్రాంతాలకు విస్తరించారు.

హైదరాబాద్‌ రాజ్యంలో బ్రిటిష్‌ సైనిక స్థావరాలు అలా పెరగడంతో రెండో నిజాం ప్రభువు నిజాం ఆలీఖాన్‌ మర ణానం తరం సింహాసనం అధిష్టించిన అతని కుమారుడు మూ డో నిజాం సికిందర్‌జా పాలనా కాలంలో నాటి బ్రిటిష్‌ సైనికా ధికారి కెప్టెన్‌ సీడెన్‌హామ్‌ కంటోన్మెంట్‌ ప్రాంతానికి నిజాం పేరుమీదుగా సికింద్రాబాద్‌ జంటనగర ఏర్పాటును ప్రతిపా దించారు. ఇందుకుసికిందర్‌జా అంగీకరించి 1806 జూన్‌ 3న అధికారికంగా ‘ఫర్మానా’ను విడుదల చేశారు. అలా హైద రాబాద్‌కు జంటనగరంగా సికింద్రాబాద్‌ ఏర్పాటైంది.

Surya Telugu Daily.

జనవరి 26, 2011 - Posted by | వార్తలు

4 వ్యాఖ్యలు »

 1. Hai,
  Chalaa bagaa teliya chesaaru. thank u.

  వ్యాఖ్య ద్వారా Anasuya Billapati | జనవరి 26, 2011 | స్పందించు

 2. You gave a very good information on Sec’bad.

  వ్యాఖ్య ద్వారా Dr.Goje Laxman Rao | జనవరి 26, 2011 | స్పందించు

 3. అంతే కాదు … ఈ ఖర్చుల నిమిత్తమే “సికందర్ ఝా నిజాం” దత్త మండలాలను(కడప, కర్నూల్, అనంతపురం, బళ్ళారి) 1801లో బ్రిటిష్ వారికి దానం చేసాడు. అంతకుముందు మైసూర్ నవాబు “టిప్పు సుల్తాను”ను అంతమొందించడంలో తమకు సహకరించినందుకు 1799లో బ్రిటిష్ వారు ఈ నాలుగు జిల్లాలను నిజాంకు నజరానా గా ఇచ్చారు. అలా రాయలసీమలోని మూడు జిల్లాలు కేవలం రెండు సంవత్సరాలు నిజాం పాలనలో ఉన్నాయి. ఇలా చరిత్రలో మరుగునపడిన విషయాలు చాలానే ఉన్నాయి. సమైక్య రాష్ట్రంలో ఇవన్నీ పాఠ్య పుస్తకాల్లోకి చేరలేదు.

  వ్యాఖ్య ద్వారా .డా. ఆచార్య ఫణీంద్ర | జనవరి 27, 2011 | స్పందించు

 4. మరి, పట్నం కన్నా ముందే ‘లష్కరు’ అభివృధ్ధి చెందింది అంటారే? దాన్ని గురించి కూడా వ్రాయండి.

  వ్యాఖ్య ద్వారా కృష్ణశ్రీ | జనవరి 30, 2011 | స్పందించు


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s

%d bloggers like this: