హరివిల్లు

ఎన్నెన్నో వర్ణాలు-అన్నింటా అందాలు…

మా మంచి తులసి…

మా మంచి తులసి…

వేల సంవత్సరాలుగా ఆయుర్వేద వైద్యంలో రారాజుగా వెలిగిపోతున్న మొక్క తులసి.. భారతీయ మగువలు ఎంతో పవిత్రంగా కొలిచే ఈ తులసి వంటింటి వైద్యంలో ఎంతో ముఖ్యం కూడా. కఫాన్ని, పైత్యాన్ని తీసివేయడంలో దీనికి మించినది లేదు. అంతేకాదు.. ఇంకా ఎన్నో రకాల వ్యాధులకు, జబ్బులకు మంచి మందు తులసి.

tulsi1

 • జ్ఞాపకశక్తిని మెరుగు పరచడంలో, నోటిసంబంధిత వ్యాధులకు, ఉబ్బసానికి మంచి మందు తులసి. చర్మవ్యాధులకు ఈ ఆకురసము మంచి ఫలితాన్నిస్తుంది.
 • గాయాలకు, దెబ్బలకు, విష జంతువులు కరిచి నపుడు ఈ ఆకు రసాన్ని పూసినా, వాడినా సత్వర ఉపశ మనం కలుగుతుంది.
 • ప్రతిరోజు 6-10 ఆకులు నమిలితే నోటి దుర్వాసన వుండదు. ప్రతి రోజు క్రమంగా పది ఆకులను తిన్నా లేక 1 చెంచా రసం పరగడుపున తాగినా ఆరోగ్యానికి మంచిది.
 • ఆకురసం, కొంచెం తేనె, ఒక చెంచా అల్లం రసం రంగరించి వాడితే జీర్ణకోశ సమస్యలుండవు.
 • తులసి రసంతో కొంచెం మిరియాల చూర్ణాన్ని కలిపి 2 చెంచాలు తింటే గొంతు బొంగురు పోవుటాన్ని, నీటిలో మరిగించి వడగట్టి తీసుకుంటే గొంతు గరగర, జలుబు, దగ్గు ఉన్నపుడు కఫం బయటకు వచ్చేటట్లు చేస్తుంది.
 • దోమ కాటు వలన వచ్చే మలేరియా వ్యాధికి ఇది మంచి ఔషధం.
  tulasi
 • ఇంటి ఆవరణలో ఈ చెట్లుంటే దోమలను పారదోలుతుంది. క్రిమిసంహారిగా కూడా పనిచేస్తుంది.
 • ఆధునిక పరిశోధనలో క్షయవ్యాధికి కారణమయ్యే బేసిల్లస్‌ ట్యూబర్క్యు లోసిన్‌ అను బ్యాక్టీరియా పెరుగుదలను అరికట్టి నశింపజేస్తుందని శాస్త్ర వేత్త లు వెల్లడించారు.
 • పత్రాలలోని సూక్ష్మమైన తైల గ్రంథులల్లోని తైలంలో యూజినాల్‌, యూజినాల్‌ మిథైల్‌, ఈథర్‌, కార్వసిరాల్‌, అను రసా యనాలే సువాసనకు, సూక్ష్మ జీవులను నశించేట్లు చేస్తాయి.
 • తులసి రసం, బెల్లం కలిపి తయారు చేసే తులసిసుధ అనే పానియం రక్తశుద్ధిని, వ్యాధి నిరోధకశక్తిని అభివృద్ది చేస్తుంది.
 • ఈ ఆకుల రసంతో చేసిన టీ జలుబు, దగ్గును, ఉదరకోశ రుగ్మతలకు బాగా పని చేస్తుంది. తులసి వనాలు వాతావరణ కాలుష్యాన్ని నివారిస్తాయి.

Surya Telugu Daily

జనవరి 18, 2011 - Posted by | ఆరోగ్యం

3 వ్యాఖ్యలు »

 1. Chaala manchi vishayaalu chepparu.Nenarlu..

  kannaji Rao

  వ్యాఖ్య ద్వారా kannaji | జనవరి 18, 2011 | స్పందించండి

 2. It is true. The modern Biochemistry reveal , its inherent capacity in immunity and cure of many diseases.

  వ్యాఖ్య ద్వారా Dr.Goje | జనవరి 20, 2011 | స్పందించండి

 3. అంతే కాదండి, టైఫాయిడ్ని యెటువంటి మాత్రలు తీసుకోకుండా కేవలం తులసి కషాయంతో తగ్గించవచ్చు, ఇది నా అనుభవంలో నిరూపించాను. నాతో కలిపీ మోత్తం ముగ్గిరి పైన ఈ క్రింది పద్దతి ప్రయత్నించడం జరిగింది. ఇందులో ఒకరి వయసు 62 గుండే జబ్బు వున్న వ్యక్తి కావడం ఎటువంటి ఇతర మాత్రలు తిసూకొరు. ఇంకొకరు మధుమేహ బాదితుడు వయసు 52, నేను 29 వయసు గలవాడ్ని అందరిపై ప్రయోగం ఆశ్చర్యకరమైన ఫలితాన్ని ఇచ్చింది. జ్వరం తగ్గటమే కాదు కండరాల నొప్పులు, దగ్గు, పడిశం ఇంకా తల బారంగా ఉండటం అన్ని తగ్గాయి.

  చేసె విదానం
  గుప్పెడు తులసి ఆకులు, 5 – 8 మిరియాలు, చిన్న సొంటి ముక్క, పటిక బెల్లం కాస్త పొడిచేసి, మూడు కప్పుల నీళ్ళలొ రెండు కప్పుల అయ్యేవరకు చిన్న మంటపై మరిగించాలి. మూడు పూటల ఒక్కొ కప్పు చొప్పున తాగాలి. ఇలా మూడు రోజులు చేస్తే టైఫాయిడ్ అంతం కాయం. ( టైఫాయిడ్ జ్వరం ఉన్నప్పుడు యెటువంటి ఘనాహారం తీసుకోకూడదని మరువద్దు, ఎంతగా కడుపు మాడితే అంత త్వరగా జ్వరం తగ్గుతుంది. )

  – రేణూ కూమార్

  వ్యాఖ్య ద్వారా renukumar | ఫిబ్రవరి 11, 2011 | స్పందించండి


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: