హరివిల్లు

ఎన్నెన్నో వర్ణాలు-అన్నింటా అందాలు…

టేబుల్‌ మ్యానర్స్‌ అవసరమే…

టేబుల్‌ మ్యానర్స్‌ అవసరమే…

అదొక సెబ్రిటీ పార్టీ… రకరకాల డిజైన్ల డ్రెస్సులతో ఎంతోమంది ఉన్నారు.అందరూ ఆడుతూ పాడుతూ కనిపిస్తున్నారు. వారి ముఖాల్లో ఆనందం కనిపిస్తోంది. ఆటాపాటా ముగిసింది. ఇక మిగిలింది భోజనాల కార్యక్రమం. అక్కడే వచ్చింది అసలైన చిక్కంతా…పార్టీలు, పంక్షన్‌లలోనే కాదు ఎవరింటికైనా భోజనాలకు వెళ్లినప్పుడు అక్కడ ఎలా ప్రవర్తించాలో కొంతమందికి తెలియదు. ఎదుటివారి ముందు అందంగా తినడం కూడా ఒక కళే.

కొన్ని ప్రాథమిక అంశాలను దృష్టిలో ఉంచుకుంటే పార్టీలో మీరు సంతోషంగా పాల్గొనడమే కాదు. ఎదుటివారి అభినందనలకు పాత్రులవుతారు. వారి దృష్టిలో ప్రత్యేక స్థానాన్ని పొందగలుగుతారు. మీ అలవాట్లు మీ ఉన్నత సంస్కారానికి, హుందాతనానికి అద్దం పడతాయి. ఆకట్టుకునే మీ ప్రవర్తన మూలంగా మిమ్మల్ని పార్టీకి ఆహ్వానించాలన్నా, మీరిచ్చే పార్టీలకు హాజరుకావాలన్నా అందరికీ ఆనందమే. ఎప్పుడెప్పుడా అన్న ఎదురుచూపులే !

eatingoutఇంట్లో ఉన్నప్పడయినా పార్టీలలో అయినా భోజనం చేసేటప్పుడు కొన్ని పద్ధతులు పాటించడం ఉత్తమమైన లక్షణం. మన ఇంట్లో ఎలా తిన్నా ఏముందిలే అని చాలా మంది అనుకుంటారు. ఆ అలవాటు నలుగురిలో భోజనం చేస్తున్నప్పుడు కూడా వచ్చేస్తుంది.అదీకాక ఎప్పుడైనా స్నేహితుల, బంధువుల ఇంటికో వెళ్లినప్పుడు మన పద్ధతులు వారికి నచ్చే విధంగా ఉండాలి.అప్పుడే మనమీద ఉన్నతమైన అభిప్రాయం కలుగుతుంది. ఆహార్యం గొప్ప గా ఉన్నంత మాత్రాన గొప్ప వ్యక్తిత్వం ఉన్నవారు కాదు. వారి పద్ధతులు, అలవాట్లు ఉన్నతంగా ఉన్నప్పుడే నలుగురిలో సదాభిప్రాయం కలుగుతుంది. తమ పార్టీలకు తప్పకుండా పిలవాలని అనపిస్తుంటుంది. అంతేకాదు వారిపై అభిమానం పెరుగుతుంది.

టేబుల్‌ మ్యానర్స్‌ అంటే…
కుటుంబ స్నేహితులు ఒకరిద్దరికి ఇంట్లో ఇచ్చే డిన్నరే కావచ్చు. సహోద్యోగులతోనో, కొద్దిపాటి పరిచ యస్తులతోనో కలిసి వెళ్లవలసిన పార్టీయే కావచ్చు. భోజనాల బల్ల దగ్గర మీ ప్రవర్తన (టేబుల్‌ మేనర్స్‌) మీ సంస్కారానికి, అభిరుచులకు, అలవాట్లకు అద్దం పడుతుంది. ఆ ప్రవర్తన ఆధారంగానే మీ కుటుంబ స్థాయిని, తీరుతెన్నులను, మీరు పెరిగిన పరిస్థితులలోని గుణదోషాలను ఇతరులు అంచనా వేస్తారు.

తెలుసుకోవడం అవసరం…
eatingout1ఎంతో అధునాతనంగా అలంకరించుకొని ఉన్నత కుటుంబాలకు చెందిన వారిలా కన్పించే కొందరు వ్యకు తలు భోజనాల దగ్గర తమ తెలివి తక్కువతనాన్ని బయటపెట్టుకుంటారు. అవసరమైనంత వరకే మాట్లాడతూ ఆప్యాయంగా పలకరిస్తూ, చిరునవ్వు చెదరని ముఖంతో హుందాగా కనిపించే వారు ఎదుటివారి అభినందనలకు పాత్రులైతే, అదేపనిగా మాట్లాడుతూ అవసరం లేకపోయినా నవ్వుతూ లేనిపోని హడావిడి నటించేవారు అందరికీ చిరాకు కల్గిస్తారు. అందువల్ల పార్టీలకు వెళ్లినప్పుడు నలుగురిలో నగుబాటు కా కుండా ఉండాలంటే పిల్లలైనా పెద్దలైనా సరే భోజన సమ యంలో పాటించవలసిన కొన్ని మర్యాదలను తెలుసుకొని ఉండడం అవసరం.

మంచిపద్ధతి…
భోజనాల బల్ల దగ్గర కాళ్లూచేతులూ బార జాపుకొని కూర్చో కూడదు. మీరు భోజనం చెయ్యబోతున్నారే కాని వాలు కుర్చీలో విశ్రాంతి తీసుకోవడం లేదు కదా… ఒద్దికగా కూర్చోవడం మంచి పద్ధతి. అన్నం తినేటప్పుడు కుర్చీలో ముందుకూ, వెనక్కూ ఊగడం, కాలుమీద కాలేసుకోవడం, కాళ్లు ఊపడంవంటి అలవాట్లను మంచి లక్షణాలుగా భావించరు. మోకాళ్లు రెండూ దగ్గరగా ఉండేలా పాదాలను నేలమీద ఆనించి నిటారుగా కూర్చోవడం పద్ధతి. మోచేతు లను టేబుల్‌మీద ఆనించడం అమర్యాదగా భావిస్తారు. అందువల్ల చేతులను ఎప్పుడూ ఒడిలో ఉంచుకుని కూర్చో వాలి.

అవస్థపడకూడదు…
eatingout2భోజనానికి ఉపక్రమించేముందు టేబుల్‌ నాప్‌కిన్స్‌ను ఒడిలో పరుచుకోవాలి. భోజనం పూర్తయిన తరువాత వాటి తీసి నీట్‌గా ఉన్న ప్లేట్‌లో ఉంచాలి. ము ఖ్యంగా బట్టతో చేసిన నాప్‌కిన్‌ను ఎంగిలి ప్లే ట్‌లో పెట్టకూడదు. స్పూ ను, ఫోర్కులతో కాకుం డా చేత్తో తినే అలవాటు ఉన్నవారు అరిచేతులకు అన్నం అంటకుండా వేళ్లతో మాత్రమే భుజిం చాలి. భోజనం చేసేట ప్పుడు నోటినుంచి ఎలాంటి శబ్దాలూ చెయ్యకూడదు. జుర్రుకుం టున్నట్లుగా వింతవింత శబ్దా చెయ్యడం జంతువులకు, కార్టూన్‌ సినిమాలకు సరిపోతుంది కానీ నాగరి కులకు లక్షణమనిపించుకోదు. నోరు పట్టినంత పెట్టుకొని నమలలేక అవస్థ పడకూడదు. కొంచెం కొంచెం నోట్లోపెట్టుకొని, సాధ్యమైనంత వరకు పెద వులు కలిపి ఉంచే నమలాలి.ఎందుకంటే కొంత మందికి శబ్దాలు చేయడం ఇష్టం ఉండదు.

ప్రస్తావించకూడదు…
eatingout3భోజనాల వేళ ఎక్కువగా మాట్లాడ డం మంచి అలవాటు కాదు.జబ్బులు, ఆపరేషన్లు, యాక్సిటెంట్లకు సం బంధించిన విషయాలను అసలు ప్రస్తావించకూడదు. తీవ్ర వాదోప వాదాలకు దారితీసే రాజకీయ సంబంధ విషయాలను వ్యక్తిగత విషయాలను ఎత్తకూడదు. ఏదైనా రాయో, గింజో పంటి కిందకు వస్తే ఒక చెయ్యి నోటికి అడ్డుగా పెట్టుకొని, రెండో చేతిలోకి ఆ రాయిని నెమ్మదిగా తీసు కోవాలి. భోజనం పూర్తయి టేబుల్‌ ముందునుంచి లేవగానే కుర్చీని యథా స్థానంలో ఉంచాలి. లేకపోతే అది దారిలో అడ్డుగా ఉండి పక్కవారు పొర పాటున కాలుతగిలి పడిపోయేందుకు ఆస్కారం కావచ్చు.ఇలాంటి చిన్న చిన్న పద్ధతులను పాటించడం వల్ల నలుగురిలో వ్యక్తిత్వం పెరగడమే కాదు, మంచి మంచి అలవాట్లుకూడా అలవడతాయి.

టీకి ఓ మర్యాద టీ తాగడంలో పాటించాల్సిన చిన్న చిన్న మర్యాదల గురించి తెలుసుకుందాం…

 • టీ మరీ వేడిగా ఉందా…అయితే చల్లారేలా గట్టిగా ఊదడం అదీ శబ్దం వచ్చేలా…అంత బాగుండదేమో ఒక సారి ఆలోచించండి. అంతేకాదు త్వరగా చల్లారాలనే ఉద్దేశంతో సాసర్‌లో పోసుకొని తాగడం నలుగురి మధ్యలో ఉన్నప్పుడు ఏ మాత్రం మర్యాదకరం కాదు.
 • కప్పులో టీ పూర్తవుతోంది. కప్పును ఎత్తి తాగడం లేదా చెంచాతో టీని తాగాలని ప్రయత్నించడం…మీ హుందాతనానికి భంగం కలిగినట్లే అవుతుంది.
 • ఇంట్లో ఉన్నట్లు శబ్దం వచ్చేట్లు టీ కలపకూడదు.
 • టీతోపాటు బిస్కెట్లు ఓ ప్లేట్‌లో పెట్టడం సహజం. అయితే చాలా మందికి బిస్కెట్లను టీలో ముంచి తినడం అలవాటుంటుంది. అయితే నలుగురిలో ఉన్నప్పుడు మాత్రం అలా చేయవద్దు. ముందు బిస్కెట్‌ తిని ఆ తర్వాత టీ తాగాలి.
 • టీ చాలా మితంగా తాగడం మీకు అలవాటా… అయితే ఈ మాట ముందే చెప్పాలి. ఎందుకంటే తీరా వాళ్లు ఇచ్చిన తర్వాత సగం తాగి వదిలేయడం మర్యాద కాదు. అలాగే మీకు చక్కెర ఎంత అవసరమో ముందుగానే తెలపడం మంచిది.

 

Surya Telugu Daily

ప్రకటనలు

జనవరి 10, 2011 - Posted by | మ౦చి మాటలు

3 వ్యాఖ్యలు »

 1. Yes. It is true. Some persons behave crudely and ugly, while participating in the party meal. They must read it and inculcate good and dignified habits. Thanking you.

  వ్యాఖ్య ద్వారా Dr.LRGoje | జనవరి 10, 2011 | స్పందించండి

 2. ఉపయోగకరమైన వ్యాసం అందించారు…..భోజనాలలో పాల్గొనేవారందరికీ ఈ నియమాలు తెలుసుకోవడం, వాటిని పాటించడం ఎంతో అవసరం… ఆహార పదార్థాలను సరఫరా చేసేవారిని మాటిమాటికీ పిలవడం, పదార్థాల్లో ఎవైనా చిన్నచిన్న లోపాలుంటే వాటి గురించి బిగ్గరగా పక్కవారితో వ్యాఖ్యానించడం కూడా మంచి పద్ధతి కాదు.. ఇలా ఎన్నో….
  ధన్యవాదాలు…

  వ్యాఖ్య ద్వారా పిఆర్ తమిరి | జనవరి 11, 2011 | స్పందించండి

 3. To Hell with these so called Table Manners!

  విభేదిస్తున్నాననుకోవద్దు…..

  ఫైవ్ స్టార్, పైబడిన హోటళ్లలో బాగా డబ్బుచేసినవాళ్లు యేమి చేస్తే, అదే టేబుల్ మేనర్స్!

  18, 19 శతాబ్దాల్లో, ఆంగ్ల దేశాల్లో ఆడవాళ్లు తమ “డీ కోల్లెటేజ్” ప్రదర్శించడం ఓ సాంప్రదాయం. తమ భర్తలో, దగ్గరవాళ్లో యెవరో సున్నితంగా వారించినా, ‘ఓ! డోంట్ బీ ఏ ప్రూడ్’ అనేవారు. అది అప్పటి మేనర్స్!

  ఇక మగాళ్లెవరైనా ‘ఓ! జీసస్’ అన్నా, ‘డోంట్ స్వేర్….లేడీస్ ఆర్ హియర్’ అని మందలించేవారు ఆడాళ్లు! అది టేబుల్ మేనర్స్!

  ఫిఫ్టీన్ కోర్స్ డిన్నర్నైనా, యెంతో క్రమశిక్షణతో ఆరగించేవారు….మధ్య మధ్యలో టోస్ట్ లు చెప్పుకుంటూ!

  ఇప్పుడు మన సినిమాల్లో హీరోయిన్లు ఫ్రీగా “ఓ! షిట్” అనడం, అది ఓ హైలైట్ గా చూపించడం, దాన్నే పిల్లలు అలవాటు చేసుకొని స్టయిల్ గా అనడానికి ప్రయత్నించడం…..యేమిటివన్నీ?

  మెనూ చూసి, రకరకాల డిష్ లు ఆర్డరిచ్చేసి, బిల్లు కట్టేసి, తినలేక, అవన్నీ ‘ప్లీజ్ పేక్!’ అని ఇంటికి తీసుకెళ్లడం టేబుల్ మేనర్సా?

  సరేలెండి….ఇలా చెప్పుకుపోతే….గంటలు చాలవు!

  యేమైనా, మీ టపా మాత్రం బాగుంది.

  వ్యాఖ్య ద్వారా కృష్ణశ్రీ | జనవరి 11, 2011 | స్పందించండి


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: