హరివిల్లు

ఎన్నెన్నో వర్ణాలు-అన్నింటా అందాలు…

సముద్రంపెై అద్భుత నగరం

సముద్రంపెై అద్భుత నగరం
జపాన్‌లో భూభాగం పూర్తిగా ఖాళీ అయిపోయిందో.. లేక అక్కడి ప్రజలకు భూమిపెై నివసించడం బోర్‌ కొట్టేసిందో.. ఏమో వాళ్లు ఏకంగా సముద్రంపెై పడ్డారు. సముద్రంపెై అందమైన భవంతులను నెలకొల్పేందు వారు ప్రణాళికలు సిద్ధం చేసేస్తున్నారు. నీటిపెై తేలియాడే ఆకాశహర్మ్యాలకు చకా చకా ప్లాన్లు వేసేస్తున్నారు. జపాన్‌కు చెందిన ఓ సంస్థ ఈ సన్నాహాలు చేరం

americascupపెరుగుతున్న గ్లోబల్‌ వార్మింగ్‌ను దృష్టిలో ఉంచుకొని పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ’కార్బన్‌-న్యూట్రల్‌’ నగరాలను నిర్మించాలని జపాన్‌లోని షిముజ సంస్థ వారు నిశ్చయించారు. దీనికి ’గ్రీన్‌ ఫ్లోట్‌’ కాన్సెప్ట్‌ అని పేరు కూడా పెట్టేశారు.ఈ విధానంలో ఒక్కోటి చదరపు కిలోమీటరు వెశాల్యం ఉన్న విభాగాలను బోలెడన్నింటి నిర్మించి వాటిని ఒక కేంద్రక టవర్‌కు అనుసంధానిస్తారు. అలా అది ఒక పెద్ద నగరంగా తయారవుతుంది.

ఇక్కడ నిర్మించే ఇళ్లన్నీ నీటిపెై తేలుతూ ఉంటాయి.ఇలా నిర్మించిన విభాగాలలో.. ఒక్కొక్క విభాగానికి గానూ 10,000 నుంచి 50,000 మంది మనుషులు నివసించవచ్చు. అంతే కాదండోయ్‌.. భూమి మీద మాదిరిగానే ఈ విభాగాల్లో చెట్లు, చిన్న చిన్న పంటలు కూడా వేసుకోవచ్చు. కేంద్రక టవర్‌ చుట్టూ.. ఆ ప్రాంతంలో నివసిం చేవారికి అవసరమెన ఆహారం ఉత్పత్తి చేసేం దుకు పొలాలు, అడవు లు, పశువులు కూడా ఉంటాయి.

సాధ్యమేనా…
వినడానికి బాగానే ఉంది కానీ.. అసలు ఇది సాధ్య మేనా..? ఇలాంటి కట్టడాలను సముద్రంలో తేలియాడేలా నిర్మించాలని షిముజు సంస్థ ప్రణాళికలు రూపొందించింది. ఈ కట్టడాలను నిర్మించేటపుడు అలాగే వాటిని మనుషులు ఉపయోగించే సమయంలోనూ.. ఎక్కడా పర్యావరణానికి హాని కలగని రీతిలో నిపుణులు ప్రణాళికలు వేస్తున్నారు. ఈ కట్టడాలకు ఉపయోగించే లోహాలను కూడా సముద్రం నుంచే తయారు చేయడం ఇక్కడ చెప్పుకోదగిన విషయం.

సముద్ర జలాల్లో లభించే మెగ్నీషియంను తీసి దానితోనే నీళ్ల మీద తేలే ఓడల్లాంటి భవనాలను నిర్మిస్తారట. షిముజు సంస్థ నిపుణుల ప్రకారం.. ఇలాంటి ప్రదేశాల్లో నివసిస్తే పర్యావరణానికి హాని కలిగించే కార్బన్‌ వాయువుల విడుదలను 40 శాతం మేరకు తగ్గించొచ్చు. ఏమెనా వ్యర్థాలుంటే వాటితోనూ ద్వీపాలను తయారు చేసి సముద్రాల్లో భవనాలను నిర్మించేస్తామని చెబుతున్నారు.

తుఫాన్లు వస్తే…
future_architecture1అంతా బానే వుంది కానీ.. సముద్రుడు ఎప్పడు ప్రశాంతంగా ఉంటాడో..ఎప్పుడు కోపంగా ఉంటాడో తెలియదు. ప్రశాంతగా ఉన్నంత సేపు ప్రమాదం లేదు కానీ.. కోపం వచ్చి విజృంభించి ఏ సునామీనో సృష్టించాడనుకోండి అప్పుడు పరిస్థితి ఏంటి..? అలాంటి భయం ఏం అక్కర్లేదంటున్నారు నిపుణులు.అందుకు జలహర్మ్యాల్లో బయటి వెైపు ఎలాస్టిక్‌ పొరలను ఏర్పాటు చేస్తారట. అవి సముద్ర మట్టానికి 30 అడుగుల ఎత్తులో ఉంటాయి కాబట్టి లోపలి వారిని అలలే మీ చేయలేవని ఎంచక్కా భరోసా ఇచ్చేస్తున్నారు. తుఫాన్‌, వర్షాల సమయంలో పిడుగుపాటు నుంచి కాపాడుకోవడానికి లెట్నింగ్‌ కండక్టర్లు కూడా వీటిలో ఉంటాయట.

జపాన్‌లో జరిగిన యూనివర్సిటీల సమావేశంలో షిముజు సంస్థ తమ ఊహాచిత్రాలను ప్రదర్శించి పలువురి ప్రశంసలు పొందింది. మరి ఇది వాస్తవ రూపం దాల్చుతుందో.. లేక ఊహాగానాలుగానే మిగిలిపోతాయో వేచి చూడాల్సిందే.. మరి. ఏదేమైనా ఈ ఆలోచన మాత్రం అద్భుతం కదా… పెై పెచ్చు అక్కడ నివసించడానికి కొంచెం గుండె ధెైర్యం కూడా కావాలి సుమా..!!

Surya Telugu Daily

డిసెంబర్ 8, 2010 - Posted by | చూసొద్దాం

3 వ్యాఖ్యలు »

 1. బాగుందండి!

  ఇంతకీ ఒక్కో ఫ్లాట్ యెన్ని కోట్ల యెన్నులు (యెన్నులదేముంది లెండి–డాలర్లందాం) ఖరీదు చేస్తుందో లెఖ్ఖలు వేశారా?

  యెంతైతే యేముంది లెండి బాగా “డబ్బుచేసిన” వాళ్లకి! చంద్రుడి మీదా, అంగారకుడి మీదా కూడా ఫ్లాట్లు బుక్ చేసుకున్నవాళ్లకి ఇదో లెఖ్ఖా!

  వ్యాఖ్య ద్వారా కృష్ణశ్రీ | డిసెంబర్ 8, 2010 | స్పందించండి

 2. It is an excellent idea of Japan architects.
  In India poor is unable to construct a small hut on soil !

  వ్యాఖ్య ద్వారా Dr.Laxman Rao Goje | డిసెంబర్ 8, 2010 | స్పందించండి

 3. It is fine

  వ్యాఖ్య ద్వారా gopal | డిసెంబర్ 23, 2011 | స్పందించండి


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: