హరివిల్లు

ఎన్నెన్నో వర్ణాలు-అన్నింటా అందాలు…

జీవ వైవిధ్యానికి నెలవు.. నాగర్‌హోల్‌ జాతీయవనం

జీవ వైవిధ్యానికి నెలవు.. నాగర్‌హోల్‌ జాతీయవనం
Nagarhole2ప్రపంచంలోని జంతుజాలం అంతా ఇక్కడే నివాసం ఏర్పరుచుకున్నదా… అనే సందేహం… నాగర్‌హోల్‌ నేషనల్‌ పార్క్‌ను సందర్శించిన ప్రతి ఒక్కరికీ కలుగకమానదు. ఎందుకంటే… దేశంలో మరే ఇతర పార్క్‌ల్లో లేని విధంగా ఇక్కడ ఎన్నో అరుదైన జంతు, పక్షి జాతులు మనుగడ సాగిస్తున్నాయి. అంతేకాకుండా వృక్షసంపదలో కూడా తన ప్రత్యేకతను చాటుకుంటోంది ఈ పార్క్‌. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద నేషనల్‌ పార్క్‌గా గుర్తింపు పొందిన ఈ పార్క్‌కు ఏటా సందర్శకుల తాకిడి కూడా ఎక్కువగానే ఉంటుంది. దేశీయ పర్యాటకులే కాకుండా… విదేశీ పర్యాటకులను సైతం ఈ పార్క్‌ అమితంగా ఆకట్టుకుంటోంది. పర్యాటకుల సందర్శన నిమిత్తం అటవీశాఖ ప్రత్యేక సఫారీలు కూడా ఏర్పాటు చేసింది. పలు, జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఇక్కడి జీవజాలంపై ఎన్నో పరిశోధనలు చేపట్టాయి. అలాంటి అరుదైన జాతీయవనాన్ని ఈవారం మనమూ దర్శిద్దాం…

Nagarholeరాజీవ్‌ గాంధీ నేషనల్‌ పార్క్‌ గా పేరొందిన నాగరోహోల్‌ నేషనల్‌ పార్క్‌ దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద నేషనల్‌ పార్క్‌. కర్నాటకలోని మైసూర్‌ నగరానికి 94 కిమీల దూరంలో ఉన్న ఈ జాతీయ ఉద్యానవనం కొడగు జిల్లా నుండి మైసూర్‌ జిల్లా వరకు వ్యాపించి ఉంది. బందీపూర్‌ నేషనల్‌ పార్క్‌కి వాయువ్యంగా ఉన్న నాగరోహోల్‌ నేషనల్‌ పార్క్‌కి బందీపూర్‌ నేషనల్‌ పార్క్‌కి మధ్యనున్న కబినీ రిజర్వాయర్‌ ఈ రెండు పార్కులనీ విడదీస్తుంది. మాజీ మైసూర్‌ పాలకులు దీనిని ప్రత్యేకమైన హంటింగ్‌ రిజర్వ్‌ (పరిరక్షించబడిన వేట ప్రాంతం) గా ఉపయోగించేవారు. దట్టమైన చెట్లతో కప్పబడిన ఈ అటవీ ప్రాంతంలో చిన్న వాగులూ, లోయలూ, జలపాతాలూ దర్శనమిస్తాయి. కర్నాటక రాష్ట్రంలోని వన్యప్రాణులను సంరక్షిస్తోన్న ఈ పార్క్‌ 643 చకిమీ మేర వ్యాపించి ఉన్నది. బందీపూర్‌ నేషనల్‌ పార్క్‌ 870 చకిమీ, మదుమలై నేషనల్‌ పార్క్‌ 320 చకిమీ. వాయనాడ్‌ వైల్డ్‌లైఫ్‌ శాంక్చురీ 344 చకిమీ తో కలిపి మొత్తం 2183 చకిమీ మేర వ్యాపించి ఉన్న ఈ స్థలం దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద వన్యప్రాణి సంరక్షణ స్థలం.

Nagarhole3 ‘నాగ’ అంటే ‘పాము’, ‘హొలె’ అంటే ‘వాగు’ అన్న రెండు పదాల నుండి నాగరోహోల్‌ అన్న పదం పుట్టింది. 1955లో స్థాపించబడిన ఈ పార్క్‌ దేశంలో అత్యుత్తమంగా నిర్వహించబడుతోన్న పార్కులలో ఒకటిగా గుర్తించబడింది. ఇక్కడి వాతావరణం ఉష్ణంగా ఉండి, వేసవిలో వేడిగానూ, శీతాకాలంలో ఆహ్లాదకరంగానూ ఉంటుంది. ఆరోగ్యకరమైన వ్యాఘ్ర-క్రూరమృగాలు సరైన నిష్పత్తి ఉన్న ఈ పార్క్‌లో బందిపూర్‌ కంటే పులి, అడవిదున్న, ఏనుగుల జనాభా అధికంగా ఉంటుంది. నీలగిరి బయోస్ఫియర్‌ (జీవావరణము) రిజర్వ్‌లో ఈ పార్క్‌ ఒక భాగం. పడమటి కనుమలు, నీలగిరి సబ్‌ క్లస్టర్‌ (6,000 చకిమీ), నాగరోహోల్‌ నేషనల్‌ పార్క్‌ – ఇవన్నీ కూడా ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా ఆమోదం పొందడానికి యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీ పరిగణనలో ఉన్నాయి.

విశాల వనం…

ఈ అడవి వెస్టర్న్‌ ఘాట్స్‌ పర్వత పాదం నుండి కొండ వైపు… అలాగే దక్షిణం వైపు కేరళ వరకు వ్యాపించి ఉన్నది. ఈ అడవి వృక్షసంపద గురించి చెప్పాలంటే దక్షిణ భాగాన తేమతో కూడిన డెసిడ్యూస్‌ (కాలానుగునంగా ఆకులు రాల్చు) అడవి (టెక్టోనా గ్రాండిస్‌, డల్బెర్జియా లాటిఫోరియా), తూర్పు భాగాన, పొడిగా ఉండే ఉష్ణారణ్యం (రైటియా టింక్టోరియా, అకేషియా), ఉపపర్వత లోయలో బురదతో కూడిన అడవి (యూజనియా) ఉన్నాయి. ఎర్రకలప, టేకు, గంధం, సిల్వర్‌ ఓక్‌ ఈ ప్రాంతంలో ముఖ్యమైన వృక్షసంపద. బందీపూర్‌ సరిహద్దులకు దగ్గరగా ఉన్న దక్షిణ భాగాలు సాధారణంగా వాయువ్య భాగాల కంటే పొడిగా ఉంటాయి.

జంతు, వృక్షజాలం…

Nagarhole4నాగర్‌హోల్‌లో ఏనుగుల జనాభా ఎక్కువ. పులులు, చిరుత పులులు, అడవి కుక్కలు, ఎలుగుబంట్లు అధికంగా కనిపిస్తాయి. అడవిదున్న, సాంబార్‌ జింక, చీతల్‌ (మచ్చలున్న జింక), కామన్‌ మున్జాక్‌ జింక, నాలుగు కొమ్ముల జింక, మౌజ్‌ జింక, వైల్డ్‌ బోర్‌ (అడవి పంది) లాంటి గిట్టలున్న జంతువుల మీద పెద్ద క్రూరమృగాలు ఆహారం కోసం ఆధారపడతాయి. గ్రే లంగూర్స్‌, లయన్‌ టేల్డ్‌ మకాక్స్‌, బోన్నెట్‌ మకాక్స్‌ ఈ పార్క్‌లోని ఆదిమ జాతులుగా చెప్పవచ్చు. పార్క్‌ బయట, చుట్టూ వ్యాపించి ఉన్న కొండలలో నీలగిరి టార్స్‌, నీలగిరి లంగూర్స్‌ కనపడతాయి. దక్షిణ భాగాన ఉండే ఉష్ణం, తేమతో కూడిన మిశ్రమమైన డెసిడ్యూస్‌ అడవుల నుండి, తూర్పు భాగాన ఉండే బురద కూడిన కొండ లోయ అడవుల వరకు చాలా భిన్నంగా ఉంటాయి.

పొడిగా ఉండే డెసిడ్యూస్‌ అడవిలో టేర్మినాలియా టర్మెన్టోసా, టెక్టోనా గ్రాండిస్‌, లాజస్ట్రోమియా లాన్సివొలాటా, టేరోకార్పస్‌ మార్సపియం, గ్రూవియా తిలేఫోలియా, దళ్బెర్జియా లాతిఫోరియా మరియు ఎంజీసుస్‌ లాతిఫోరియా మొదలగు వృక్ష జాతులతో కూడిన వృక్షసంపద ఉన్నది. ఇతర వృక్ష జాతులలో లాజస్ట్రోమియా మైక్రోకార్పా, అదీనా కొర్డిఫోలియా, బొంబాక్స్‌ మలబార్సియం, స్క్లీషేరా ట్రైజూగా, ఫైకస్‌ జాతికి చెందినా వృక్షాలు కనిపిస్తాయి. పొదలు, మొక్కలు, పొదలలో పెరుగుతూ కనపడే జాతులు – కైడియా కాలిసినా, ఎంబికా అఫీషినాలిస్‌ మరియు గ్మేలీనార్బోరియా. సోలానం, డేస్మోడియం, హెలిక్టర్స్‌ అతిగా వృద్ది చెందు లాంటానా కామరా, యూపటోరియం లాంటి పొదలు అధికంగా కనిపిస్తాయి. బురదతో కూడిన అడవి భాగంలో యూజనియా అధికంగా కనిపిస్తే, తేమతో కూడిన డెసిడ్యూస్‌ అడవుల్లో సాధారణంగా కనపడే ఎనోజీసస్‌ లాటిఫోరియా, కాసియా ఫిస్ట్యూలా, బూటియా మోనోస్పెర్మా, డెన్డ్రోకాలమస్‌ స్ట్రిక్టస్‌, రైటియా టింక్టోరియా, అకేషియా , లాంటి వృక్ష జాతులు పొడిగా ఉండే డెసిడ్యూస్‌ అడవుల్లో కూడా కనపడతాయి. ఎర్రకలప, టేకు వృక్షాలే కాక, వాణిజ్యపరంగా ముఖ్యమైన వృక్ష జాతులు, గంధం, సిల్వర్‌ ఓక్‌ కూడా కనపడతాయి.

Nagarhole1 అతి ముఖ్యమైన జాతులైన పులి, ఇండియన్‌ బైసన్‌ లేదా గౌర్‌ (అడవి దున్న), ఏషియన్‌ ఏనుగులు చాలా పెద్ద మోతాదులో పార్క్‌ లోపల కనిపిస్తాయి. వైల్డ్‌ లైఫ్‌ కాన్సర్వేషన్‌ సొసైటీకి చెందిన ఉల్హాస్‌ కారంత్‌ నాగరోహోల్‌ అడవుల్లో చేసిన అధ్యయనం ప్రకారం… ఆసక్తికరంగా, వేటాడే జాతులకి చెందిన జంతువులు పులి, చిరుత అడవికుక్కలు సమతుల్యమైన సాంద్రత కలిగి ఉన్నాయని తేలింది. ఈ పార్క్‌లో తోడేళ్ళు, బూడిద రంగు ముంగిస, ఎలుగుబంట్లు, చారల సివంగి, మచ్చల జింక లేదా చీతల్‌, సామ్బర్‌ జింక, మొరిగే జింక, నాలుగు కొమ్ముల జింక , అడివి పందులు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇతర క్షీరదాలైన కామన్‌ ఫాం సివెట (పునుగు పిల్లి జాతి), బ్రౌన్‌ మాన్గూస్‌, స్ట్రైప్డ్‌ నెక్డ్‌ మాంగూస్‌ (ముంగిస జాతి), బ్లాక్‌ నేప్డ్‌ హేర్‌ (చెవుల పిల్లి లేదా కుందేలు జాతి), ఇండీన్‌ పాంగోలిస్‌ (పొలుసులతో కూడిన చీమలు తిను జంతువు), రెడ్‌ జైంట్‌ ఫ్లాఇంగ్‌ స్క్విరల్‌ (ఉడుత జాతి), ఇండియన్‌ పోర్సుపైన్‌ (ముళ్ళ పంది జాతి), ఇండియన్‌ జెయింట్‌ ఫ్లైయింగ్‌ స్క్వారెల్‌ (ఉడుత జాతి) వంటి వివిధ జాతులకు చెందిన జంతువులు ఉన్నాయి.

పక్షి విహంగానికి అనువైన కేంద్రం…

ముఖ్యమైన విహంగ స్థలంగా గుర్తింపు పొందిన ఈ పార్క్‌లో 270 జాతులకి చెందిన పక్షులు ఉన్నాయి. వీటలో శీఘ్రంగా అంతరించిపోతున్న జాతులకి చెందిన ఓరియంటల్‌ వైట్‌ బాక్డ్‌ వల్చర్‌ (రాబందు జాతి), వల్నరబుల్‌ లెస్సర్‌ అడ్జూటంట్‌ (బెగ్గురు కొంగ జాతి), గ్రేటర్‌ స్పాటెడ్‌ ఈగల్‌ (గద్ద జాతి), నీలగిరి వుడ్‌ పిజియన్‌ (పావురం జాతి) వంటి పక్షులు ఉన్నాయి. దాదాపుగా ఆపదకి గురయ్యే జాతుల్లో డార్టర్స్‌ (కొంగ జాతి), ఓరియంటల్‌ వైట్‌ ఐబిస్‌ (కొంగ జాతి), గ్రేటర్‌ గ్రే హెడెడ్‌ ఫిష్‌ ఈగల్‌ (గద్ద జాతి), రెడ్‌ హెడెడ్‌ వల్చర (రాబందు జాతి) వంటి పక్షులు కూడా ఇక్కడ కనువిందు చేస్తాయి. స్థల విశిష్టమైన జాతుల్లో బ్లూ వింగ్డ్‌ పారాకీట్‌ (చిలుక జాతి), మలబార్‌ గ్రే హార్న్‌ బిల్‌ (వడ్రంగి పిట్ట జాతి), వైట్‌ బెల్లీడ్‌ ట్రీపై (కాకిజాతి) వంటి ఎన్నో పక్షులు ఉన్నాయి. ఇక్కడ కనపడే కొన్ని పక్షుల్లో వైట్‌ చీక్డ్‌ బార్బెట్‌, ఇండియన్‌ స్కైమైటార్‌ బాబ్లర్‌ ఉన్నాయి. పొడి ప్రదేశాలలో సాధారణం గా కనపడే పేయింటెడ్‌ బుష్‌ క్వైల్‌ (కొలంకి పిట్ట), సర్కీర్‌ మల్ఖొవా, ఆషి ప్రైనియా (పిచ్చుక జాతి), ఇండియన్‌ రాబిన్‌ (పాలపిట్ట జాతి), ఇండియన్‌ పీఫౌల్‌ (నెమలి జాతి) యెల్లో లెగ్డ్‌ గ్రీన్‌ పిజియన్‌ (పావురం జాతి) లాంటి పక్షులు ఇక్కడ కనిపిస్తాయి.

రకరాకాల పాములు…

సాధారణంగా కనపడే సరీసృపాలలో వైన్‌ స్నేక్‌, కామన్‌ వుల్ఫ్‌ స్నేక్‌, రాట్‌ స్నేక్‌, బాంబూ పిట్‌ వైపర్‌, రసెల్స్‌ వైపర్‌ (సెంజెర జాతి), కామన్‌ క్రైట్‌ (కట్లపాము జాతి), ఇండియన్‌ రాక్‌ పైథాన్‌ (కొండ చిలువ జాతి), ఈందియన్‌ మానిటర్‌ లిజార్డ్‌, కామన్‌ టోడ్‌… ఇక్కడ కనపించే పాము జాతులు. బెంగళూరుకి చెందిన ‘అశోకా ట్రస్ట్‌ ఫర్‌ రిసెర్చ్‌ ఇన్‌ ఇకాలజి అండ్‌ ది ఎన్వైరన్మెంట్‌’ కి చెందిన పరిశోధకులు ఈ ప్రాంతంలోని కీటకాల జనాభాకు సంబంధించిన బయొడైవర్సిటీ (జీవ భిన్నత్వం) పై విస్తృతమైన అధ్యయనాలు చేశారు. ఈ పార్క్‌లో కీటక జీవ భిన్నత్వంలో 96 జాతులకు చెందిన డంగ్‌ బీటిల్స్‌ ( పేడపురుగులు) 60 జాతులకు చెందిన చీమలు కూడా ఉన్నాయి. అసాధారణ జాతులుగా గుర్తించిన చీమలో హార్పెగ్నథొస్‌ సాల్టేటర్‌ అనబడే, ఎగిరే చీమలను గుర్తించారు. ఇవి ఒక మీటరు యెత్తున ఎగరగలవు. టెట్రాపోనేరా రూఫోనిగ్ర జాతికి చెందిన చీమలు అడవికి ఆరోగ్యసూచకంగా ఉపయొగపడవచ్చు, ఎందుకంటే… ఇవి చెదపురుగులని తిని బ్రతుకుతాయి. చచ్చిన చెట్లు ఉండే ప్రాంతాలలో ఇవి పుష్కలంగా కనిపిస్తా యి. ఏనుగు పేడ మీద మాత్రమే బ్రతికే హీలియోకొప్రిస్‌ డొమి నస్‌, ఇండియాలోని అతిపెద్ద పేడపురుగు (ఆం థొఫేగస్‌ డామా) కామన్‌ డంగ్‌ బీటిల్‌, చాలా అరుదుగా కని పించే ఆంథొఫేగస్‌ పాక్టోలస్‌ కూడా ఇక్కడి పేడ పురుగుల జాతు ల్లో ఉన్నాయి.

హాయి… హాయిగా సఫారీ యాత్ర…

బెంగళూరుకి సుమారు 220 కి.మీ. దూరంలో ఉన్న ముర్కల్‌ అతిధి గృహాలలో పర్యాటకులకు అటవీశాఖ విడిది ఏర్పాటు చేసింది. పార్క్‌లోని కార్యాలయం దగ్గర కూడా వసతి ఉన్నది. అటవీశాఖకు చెందిన వాహనాలలో రోజుకి రెండుసార్లు, అంటే వేకువఝామున, సాయం సమయంలో సఫారి యాత్ర ఏర్పాటుచేస్తారు. పాఠశాల విద్యార్థుల కోసం తరచూ విద్యా శిబిరాలు నిర్వహిస్తారు. ఇంకా అటవీశాఖ పాఠశాల విద్యార్థుల పర్యటన కోసం కర్నాటక ప్రభుత్వం ప్రత్యేకమైన రాయితీలు ఇస్తుండడం విశేషం. అయితే జంతువుల కలయిక కాలంలో, వర్షాకాలంలో సఫారి యాత్రలు లేకుండా పార్క్‌ని మూసివేస్తారు. ట్రాఫిక్‌ కదలికలను ప్రొద్దున 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కట్టడి చేసి అడవికి ఇరువైపులా ఉండే గేట్లని మూసివేస్తారు.

 

Surya Telugu Daily

డిసెంబర్ 28, 2010 Posted by | చూసొద్దాం | , | వ్యాఖ్యానించండి

ఏకశిలా విగ్రహాతోరణం.. ఉండవల్లి గుహలు

ఏకశిలా విగ్రహాతోరణం.. ఉండవల్లి గుహలు

AnantaNaradaఆంధ్రప్రదేశ్‌లో చూడదగ్గ పర్యాటక కేంద్రాల్లో ఉండవల్లి గుహలకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఓ పెద్ద కొండను తొలిచి లోపల గదులుగా నిర్మించిన ఆనాటి శిల్పుల శిల్పాకళా నైపుణ్యానికి ఉండవల్లి గుహలు సజీవ సాక్షాలు. కొండకు ముఖ ద్వారాన్ని ఏర్పరచి అందులోంచి లోపలికి వెళ్లే కొద్దీ అక్కడ చెక్కబడి ఉన్న వివిధ రకాలైన దేవతామూర్తులు, శిల్పాలు ఈ ఉండవల్లి గుహల ప్రత్యేకత.

గుహలోని విశేషాలు ..

బయటినుంచి చూస్తే కొండముందు కట్టబడిన ఓ రాతి భవనం లాంటి నిర్మాణంగా కనిపించినా… లోపలికి వెళితే ఓ అద్భుతలోకం ఆవిష్కరించబడుతుంది. గుహ లోపల నాలుగు అంతస్థులుగా తొలచి అందు లో దేవతా విగ్రహాలతోపాటు వివిధ రకాల శిల్పాలు చెక్క బడి ఉన్నాయి. అలాగే కొండకు వెలుపలి భాగంలో తపోవనంలో ఉన్న మహ ర్షులను పోలి న విగ్రహాలు కన్పిస్తాయి. గుహ లోపల శయనించి ఉన్న అతిపెద్ద మహా విష్ణు వు (అనంత పద్మనాభస్వామి) విగ్రహం పర్యాటకులను విశే షంగా ఆకర్షిస్తుంది.

Undavallicaves అతిపెద్ద గ్రానైట్‌ రాయిపై చెక్కబడిన ఈ వి గ్రహంతోపాటు ఇతర దేవతల విగ్రహాలు సె ైతం ఇక్కడ దర్శనమిస్తాయి. ఇతర ఆలయాల్లో త్రి మూర్తులు అయిన బ్రహ్మ, విష్ణువు, శివుడు దేవ తలకు ఉద్దేశించినవి. గుహాంత ర్బాగంలో కమలంలో కూర్చున్న బ్రహ్మ, సప్తర్షులు ఇతర దేవతల విగ్రహాలూ కలవు. ఇవి గుప్తుల కాలం నాటి ప్రధమ భాగానికి చెందిన నిర్మాణ శైలికి లభిస్తు న్న ఆధారాలలో ఒ టి. పర్వతము బ యటి వైపు గుహాలయ పైభా గంలో సప్తఋషు ల వి గ్రహాలు పెద్దవిగా చెక్కారు. ఒకే పర్వతా న్ని గుహలుగానూ దేవ తా ప్రతిమలతో పాటు ఏకశిలా నిర్మితంగా ని ర్మించిన శిల్పుల ఘనత ఏపాటిదో ఇక్కడ చూే స్తనే తెలుస్తుంది. ఈ గుహల నుంచి పూర్వ కాలంలో మంగళగిరి వరకు సొరంగ మార్గం ఉండేదని పూర్వీకులు చెబుతుంటారు. ఈ మార్గం నుండి రాజులు తమ సైన్యాన్ని శత్రురాజులకు తెలియకుండా తరలించేవారని ప్రతీతి. ఈ గుహల నిర్మాణశైలి బౌద్ధ విహారాల శైలిని పోలి ఉంది. ఆలయాల చుట్టూ పచ్చని పంటపొలాలు కనువిందు చేస్తాయి. ఈ గుహలను క్రీశ 430 ప్రాంతంలో పాలించిన విష్ణుకుండుల కాలానికి చెందినవిగా చరిత్రకారులు పేర్కొంటారు.

ఇతర విశేషాలు…

Vishnuఇది పల్లెటూరు కావడం వల్ల ఇక్కడ పర్యాటకులకు అవసరమైన సౌకర్యాలు అంతంతమాత్రంగానే ఉంటాయి. ఉండవల్లి గ్రామానికి సమీపంలో ఉండే ఇతర ప్రాంతాల గురించి చెప్పాలంటే ప్రకాశం బ్యారేజ్‌ ఈ ప్రాంతానికి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలోనే ఉంది. కానీ, ప్రకాశం బ్యారేజీ పైన బస్సు సదుపాయం లేదు. అలాగే విజయవాడ కూడా ఈ ప్రాంతానికి అతి సమీపంలోనే ఉంది. మంగళగిరికి 5 కిమీల దూరంలో, అమరావతి సైతం ఈ ప్రాంతానికి అత్యంత సమీపంలోనే ఉంది.

 

Surya Telugu Daily

డిసెంబర్ 28, 2010 Posted by | చూసొద్దాం | , , | 1 వ్యాఖ్య

గిన్నీస్‌ రికార్డులో ‘కూచిపూడి ’…

గిన్నీస్‌ రికార్డులో ‘కూచిపూడి ’…

ఒకరా ఇద్దరా ఏకంగా 2,800మంది ఒకేసారి కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శించారు. లయబద్ధమైన సంగీతం మధ్య గురువులు, కళాకారులు కలిసి నిర్వహించిన నృత్య ప్రదర్శన సందర్శకులను అబ్బురపరిచింది.ఇంతమంది కూచిపూడి నృత్యకారులు ఒకేసారి నిర్వహించిన నృత్య ప్రదర్శన ఏకంగా గిన్నీస్‌ రికార్డులోకి ఎక్కింది. వీరి నృత్యాభినయం సందర్శకులను చూపుతిప్పుకోకుండా చేసింది.సిలికానాంధ్ర, రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖల సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో జరిగిన ‘అంతర్జాతీయ కూచిపూడి సమ్మేళనం’లో భాగంగా ఈ అద్భుతమైన రికార్డు చోటుచేసుకుంది. మూడు రోజుల పాటు జరిగిన ఈ సమ్మేళనం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. ఈ సమ్మేళనానికి హాజరైన కేంద్రమంత్రి పురందేశ్వరి ప్రత్యేకంగా కూచిపూడి నృత్యం చేయడం విశేషం.

DSCతెలుగువారి సంప్రదాయ నృత్యం కూచిపూడి. ఈ సంప్రదాయ నృత్యం కృష్ణాజిల్లా కూచిపూడి గ్రామంలో జన్మించింది. ముందుగా కూచిపూడి గ్రామంలోని బ్రాహ్మణులు ఈ నృత్యాన్ని నేర్చుకొని ప్రదర్శనలిచ్చేవారు.కాల క్రమేణా ఈ నృత్యానికి దక్షిణాదినే కాకుండా దేశవ్యాప్తంగా మంచి పేరు, ప్రఖ్యాతులు లభించాయి. కర్నాటక సంగీతం మధ్య చక్కటి నృత్యాభిన యంతో నిర్వహించే కూచిపూడి నృత్యం నయనమనోహరంగా ఉంటుందని కళాప్రియులు పేర్కొంటారు. వయోలిన్‌, ఫ్లూట్‌, తంబూరాల సంగీతం మధ్య ఈ నృత్య ప్రదర్శన మైమరపిస్తుందని వారు చెబుతారు.

కూచిపూడికి అంతర్జాతీయ గుర్తింపు…
దేశంలో ప్రసిద్దిగాంచిన కూచిపూడి నృత్యం నేడు విదేశాల్లో సైతం క్రమ, క్రమంగా ప్రాచుర్యం పొందుతోంది. ఈ అందమైన నృత్యానికి అంతర్జాతీయ గుర్తింపును తీసుకువచ్చేందుకు సిలికానాంధ్ర చేసిన ప్రయత్నం అంతర్జాతీయ కూచిపూడి సమ్మేళనంతో ఫలించింది. ఈనెల 24 నుంచి 26 వరకు మూడు రోజుల వరకు ఈ సమ్మేళనం జరిగింది. ఈ సమ్మేళనం హైదరాబాద్‌లోని నోవాటెల్‌ హెచ్‌ఐసిసిలో శుక్రవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా అమె రికా న్యూజెర్సీకి చెందిన సిద్దేంధ్ర కూచిపూడి అకాడమీ నాట్యగురువు స్వాతి గుండపనిడి ఆధ్వర్యంలో అదేరోజు రవీంద్రభారతిలో నిర్వహించిన కూచి పూడి నృత్య ప్రదర్శన సందర్శకులకు మధురానుభూతులను పంచింది. ఇక మూడు రోజుల పాటు జరిగిన అంతర్జాతీయ కూచిపూడి సమ్మేళనంలో మన దేశంతో పాటు వివిధ దేశాలకు చెందిన పలువురు నృత్యగురువులు, నృత్య కారులు పాల్గొన్నారు.

గిన్నీస్‌ రికార్డు…
Kuchipudi-artistsతెలుగువారి సొంతమైన కూచిపూడి నృత్యానికి గిన్నీస్‌ బుక్‌లో చోటుకల్పిం చేందుకు సిలికానాంధ్ర చేసిన కృషి సఫలీకృతమైంది. ఇందులో భాగంగా ఆదివారం హైదరాబాద్‌లోని గచ్చీబౌలిలో ఉన్న జిఎంసి.బాలయోగి స్టేడి యంలో జరిగిన కూచిపూడి నృత్య ప్రదర్శన ఈ ప్రయత్నానికి వేదికగా మారింది. ఒకేసారి 2,800మంది కూచిపూడి నృత్యకారులు లయబద్దంగా నృత్యం చేసి కూచిపూడికి గిన్నీస్‌ బుక్‌లో చోటుకల్పించారు. ఐదు నుంచి అరవై సంవత్సరాల వయస్సున్న నృత్యకారులు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. ఈ ప్రదర్శనలో మనదేశంతో పాటు 16 దేశాల నృత్యకారులు పాల్నొడం విశేషం.

purandeshwariగురువుల బృందం, శిష్య బృందంతో కలిసి నిర్విహంచిన కూచిపూడి నృత్యం నయనమనోహరంగా కొనసాగింది. హిందోళ రాగంలో సాగిన తిల్లా న నృత్య రూపకానికి పద్మభూషణ్‌ వెంపటి చినసత్యం నృత్య దర్శకత్వం వహించారు. రాష్టప్రతి ప్రతిభాపాటిల్‌, రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌, ముఖ్యమం త్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సమక్షంలో ఈ ప్రదర్శన కొనసాగింది. అనంతరం గిన్నీస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ ప్రతినిధులు కార్యక్రమంలో సిలికానాంధ్రకు గిన్నీస్‌ రికార్డు పత్రాన్ని అందజేశారు.

‘తెలుగువారి నృత్యమైన కూచిపూడికి అంతర్జాతీయ గుర్తింపును తీసుకువచ్చేందుకే అంతర్జాతీయ కూచిపూడి సమ్మే ళనాన్ని నిర్వహించాము. ఇందులో భాగంగానే 2,800మంది నృత్యకారులతో కూచిపూడి నృత్య ప్రదర్శన జరిగింది. ఈ అరుదైన ప్రదర్శనతో కూచిపూడికి గిన్నీస్‌బుక్‌ రికార్డులో చోటుదక్కింది. తెలుగువారి కళలకు అంతర్జాతీయ గుర్తింపును తీసుకువచ్చేందుకు సిలికానాంధ్ర కృషిచేస్తోంది. ఇందులో భాగంగానే గత ఏడాది హైదరాబాద్‌లో లక్షగళార్చన కార్యక్రమాన్ని నిర్వహించి గిన్నీస్‌ బుక్‌ రికార్డులోకి ఎక్కాము’ అని ఈ సందర్భంగా సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కూచిబోట్ల ఆనంద్‌ అన్నారు.

ఆకట్టుకున్న రాజారాధారెడ్డి శిష్యబృందం ప్రదర్శన…
KSRఅంతర్జాతీయ కూచిపూడి నృత్యసమ్మేళనంలో భాగంగా చివరిరోజున రాజా రాధారెడ్డి శిష్య బృందం నిర్వహించిన నృత్యప్రదర్శన కళాప్రియులను ఎంత గానో ఆకట్టుకుంది. వారి దేవీస్తుతి నృత్యరూపకం కనువిందుచేసింది. ఈ బృందం ఇండో వెస్ట్రన్‌ ఫ్యూజన్‌లో ప్రదర్శించిన నృత్యం లేజర్‌ లైటింగ్‌లో అద్భుతంగా కొనసాగింది. ఈ ప్రదర్శనను తిలకించిన సందర్శకుల కరతాళ ధ్వనులతో జిఎంసి బాలయోగి స్టేడియం మారుమ్రోగింది.

 

Surya Telugu Daily

డిసెంబర్ 28, 2010 Posted by | నాట్యం | | 2 వ్యాఖ్యలు

నాటకకళ

నాటకకళ
అలసి సొలసిన మనసుకు సాంత్వన చేకున్చేవి కళలు. అలనాడు రాజుల ఆలనా .. పాలనలో ఎందరో కళాకారులు తమ ప్రతిభతో ప్రజలను రంజింపజేసేవారు. కాల క్రమేణా రాజులు పోయారు … రాజ్యాలు కనిపించకుండా పోయారుు .

Dramaనాటకం అనేది ఒక శ్రవణ సహిత దృశ్య రూపకం. జానపద కళలు విలసిల్లుతున్న రోజులలో, రాజుల పరిపాలనా కాలంలో ప్రజల వినోదం కోసం అత్యధికంగా ఆదరింపబడిన కళ నాటకం.కందుకూరి మీరేశలింగం పంతులు గారు పుట్టిన ఏప్రిల్‌ 16వ తేదీన తెలుగు నాటకరంగం దినోత్సవంగా రాష్ట్ర సాంస్కృతిక శాఖ గుర్తించింది .

నాటకం సంగీత నృత్యాలతో కూడుకున్న ప్రక్రియ. యక్షగానానికి రూపాంతరమైన నాటకానికి సూత్రధారుడే ఆయువుపట్టు. ఇందులోని పాత్రలన్నీ తమను తామే పరిచయం చేసుకుంటూ రంగపవ్రేశం చేస్తాయి. 16వ శతాబ్దంలో ప్రారంభమైన నాటక ప్రక్రియను యక్షగాన నాటకం, వీధి భాగవతం, బయలాట అని పిలుస్తారు. వీధి నాటకాలను ఎక్కువ ప్రచారంలోకి తెచ్చిన వారు కూచిపూడి భాగవతులు. కాకతీయుల కాలంలో ప్రదర్శించిన క్రీడాభిరామం కూడా ఒక నాటకమే. తెలుగులో ఆదికవిగా పేరుగాంచిన నన్నయ్య తన భారత అవతారికలో రసాన్విత కావ్యనాటకముల్‌ పెక్కుజూచితి అనడాన్ని బట్టి నన్నయ కాలానికి నాటక ప్రదర్శనలుండేవని అర్ధం చేసుకొవచ్చు.

Hara-Vilasam-dramaనాటకం రకాలు: వీధి నాటకాలు, స్టేజి నాటకాలు, రేడియో నాటకాలు, పౌరాణిక నాటకాలు, సాంఘిక నాటకాలు, జానపద నాటకాలునటుడి చలిని కప్పే దుప్పట్లు… చప్పట్లు! శభాష్‌ అంటూ రసజ్ఞుల ప్రశంసలు… రసానందంతో మైమరిచిపోయి వన్స్‌మోర్‌ టపటపమంటూ కరతాళధ్వనులతో ప్రేక్షకుల ఆదరణ.. ఇవే నాటక రంగానికి ఊపిరి, ఉత్సాహాన్ని అందిస్తాయి. ఇప్పటికీ పల్లెల్లో జరిగే జాతర్లకు, శ్రీరామోత్సవాలు, వివిధ శుభకార్యాల్లో నాటకాల ప్రదర్శనలతో రంగస్థలం ప్రత్యేకత చాటుకుంటోంది. వివిధ మాధ్యమాలు వస్తున్నప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో నాటకాలు ప్రదర్శింపజేసి విభిన్న రుచులు కలిగిన జనావళికి ఏకపత్ర సమారాధన చేసే మహత్తర కళా ప్రక్రియ నాటక కళ. శతాబ్ది పైచిలుకు సుదీర్ఘ చరిత్ర కలిగిన నాటకానికి ఎందరో రచయితలు, మరెందరో నటులు… ఇంకెందరో దర్శకులు, ప్రయోక్తలు మెరుగులు దిద్దారు. నటరాజ కాలి అందెల్లో సిరిమువ్వలుగా నిలిచారు.

Hara-Vilasam-drama1చిక్కోలు నాటకరంగం: శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఎందరో కళాకారులు నాటకరంగం వికాసానికి దోహదపడ్డారు. ప్రభుత్వపరంగా కూడా రాష్ట్రంలో ఏ జిల్లాలో లేని విధంగా 686 మంది కళాకారులకు జీవన భృతిని అందిస్తుండడం, శ్రీకాకుళ రంగస్థల కళాకారుల సమాఖ్య లాంటి సాంస్కృతిక సంస్థలు పేద కళాకారులకు ప్రతినెలా ఆర్థిక చేయూతతో పాటు జిల్లా కేంద్రం, ఇతర ప్రాంతాల్లో ప్రదర్శనకు అవకాశాలు కల్పిస్తుండడంతో చిక్కోలు నాటకరంగం చిగురిస్తోందని చెప్పొచ్చు.

 

Surya Telugu Daily

డిసెంబర్ 25, 2010 Posted by | సంస్కృతి | | 1 వ్యాఖ్య

రామనామగానపనదాసుడు

రామనామగానపనదాసుడు
Ornaments-by-ramadasuదాశరధీ…కరుణాపయోనిధీ అన్నా…శ్రీరామనీనామమెంత రుచిరా అని పాడినా ఆయనేక చెల్లింది…17వ శతాబ్దపు సంకీర్తనాచార్యుడు ఆయన. గోపన్నగా పుట్టినా రామయ్య కీర్తనలలోనే తరించిన పుణ్యమూర్తి ఆయన. వెంకటేశ్వరస్వామి కీర్తనలకు అన్నమయ్య ఎంత ప్రసిద్ధుడో శ్రీరాముని సంకీర్తనలకు ఆయన చిరునామా అరుునారు. ఆ కాలంలోనే కులమతాలకతీతంగా తక్కువకులంలో పుట్టిన అభినవ శబరిగా కీర్తించబడే పోకలదమ్మక్క కోరికమేరకు భద్రాచలంలో శ్రీరామునికి ఆలయం కట్టించిన దాత. కష్టాలను దిగమింగి జైలులోనే శ్రీరాముని కీర్తనలు ఆర్తిగా ఆలపించారు…ఆ ఆర్తితో పాడిన సంకీర్తనలే ఆయనకు కీర్తికలికితురారుుగా నిలిచారుు…ఆయనే కంచెర్లగోపన్నగా ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో జన్మించిన రామదాసు…శ్రీరాముని కీర్తిని మారుమూల పల్లెల్లో సైతం మారుమ్రోగేలా చేసిన అభినవ హరిదాసు…

ramaiah1భద్రాచల రామదాసుగా ప్రసిద్ధి పొందిన ఇతని అసలు పేరు కంచెర్ల గోపన్న. 1620లో ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో లింగన్నమూర్తి, కామాంబ దంపతులకు జన్మించినారు. శ్రీరాముని కొలిచి, కీర్తించి, భక్త రామదాసుగా సుప్రసిద్ధుడైనారు. భద్రాచల దేవస్థానమునకు, ఈయన జీవిత కథకు అవినాభావ సంబంధము ఉన్నది. తెలుగులో భక్తిరస కీర్తనలకు ఆద్యుడు. దాశరధి శతకము, ఎన్నో రామ సంకీర్తనలు, భద్రాచలం దేవస్థానము ఇవన్నీ తెలుగువారికి శ్రీరామదాసు నుండి తెలుగు వారికి సంక్రమించిన పెన్నిధులు. రామదాసు గురువు శ్రీ రఘునాథ భట్టాచార్యులు.కబీర్‌ దాసు రామదాసునకు తారక మంత్రం ఉపదేశించారని కూడా ఒక కథ ప్రచారంలో ఉంది.
గోపన్న మేనమామ మాదన్న అప్పటి గోల్కొండ నవాబు తానీషా కొలువులో పెద్ద ఉద్యోగి. మేనమామ సిఫారసుతో గోపన్నకు పాల్వంచ పరగణానికి తహసిల్దారు పని లభించింది. గోదావరి తీరములోని భద్రాచల గ్రామము ఈ పరగణాలోనిదే. వనవాసకాలమున సీతా లక్ష్మణులతో శ్రీరాముడు ఇక్కడే పర్ణశాలలో నివసించెననీ, భక్తురాలైన శబరి ఆతిథ్యము స్వీకరించెననీ అక్కడి స్థలపురాణము చెబుతుంది.
పోకల దమ్మక్క అనే భక్తురాలు అక్కడి జీర్ణదశలోనున్న మందిరమును పునరుద్ధరింపవలెనని గోపన్నను కోరగా, స్వతహాగా హరి భక్తులైన గోపన్న అందుకు అంగీకరించారు.

ఆలయనిర్మాణానికి విరాళములు సేకరించారు. అయితే అది చాలలేదు. జనులు తమ పంటలు పండగానే మరింత విరాళములిచ్చెదమని, గుడి కట్టే పని ఆపవద్దనీ కోరినారు. అప్పుడు అతను తాను వసూలు చేసిన శిస్తునుండి కొంతసొమ్ము మందిరనిర్మాణ కార్యమునకు వినియోగించెను. ఈ విషయములో కూడా అనేకమైన కథలున్నాయి. కోపించిన నవాబుగారు గోపన్నకు 12 ఏండ్ల చెరసాల శిక్ష విధించాడు. గోల్కొండ కోటలో ఆయన ఉన్న చెరసాలను ఇప్పటికీ చూడవచ్చును.

ramaiahగోల్కొండ ఖైదులో నున్న రామదాసు గోడపై సీతారామలక్ష్మణాంజనేయులను చిత్రంచుకొని, వారిని కీర్తిస్తూ ఆ కరుణా పయోనిధి శ్రీ రాముని కటాక్షమునకు ఆక్రోశిస్తూ కాలము గడిపినారు. రామదాసు యొక్క మార్దవభరితమైన ఎన్నో ప్రసిద్ధ సంకీర్తనలు ఈ కాలములోనే వెలువడినాయి. నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి, పలుకే బంగారమాయెనా, అబ్బబ్బో దెబ్బలకునోర్వలేనురా వంటివి. అతని బాధను వెళ్ళగక్కిన ఇక్ష్వాకు కులతిలక, ఇకనైన పలుక, కీర్తన బాగా ప్రసిద్ధి చెందినది- నీకోసము ఇంతింత ఖర్చు పెట్టాను. ఎవడబ్బ సొమ్మని కులుకుచున్నావు? నీబాబిచ్చాడా? నీ మామిచ్చాడా? – అని వాపోయి, మరలా – ఈ దెబ్బలకోర్వలేక తిట్టాను. ఏమీ అనుకోవద్దు. నా బ్రతుకిలాగయ్యింది. నీవే నాకు దిక్కు – అని వేడుకొన్నారు. రామదాసు సీతమ్మ వారికి చేయించిన చింతాకు పతకము, లక్ష్మణునకు చేయంచిన హారము, సీతారాముల కళ్యాణమునకు చేయించిన తాళి వంటి ఆభరణాలు ఇప్పటికీ దేవస్థానములోని నగలలో ఉన్నాయి.

రామదాసు కర్మశేషము పరిసమాప్తి కాగానే, రామ లక్ష్మణులు తానీషా గారి వద్దకు వెళ్ళి, ఆరు లక్షల వరహాలు శిస్తు సొమ్ము చెల్లించి, రామదాసు విడుదల పత్రము తీసుకొన్నారని ప్రతీతి. ఆప్పుడిచ్చిన నాణెములను రామటంకా నాణెములని అంటారు. వీటికి ఒకవైపు శ్రీరామ పట్టాభిషేకము ముద్ర, మరొకవైపు రామభక్తుడు హనుమంతుని ముద్ర ఉన్నాయి. ఇవి ఇప్పుడు కూడా ఉన్నాయి. రామదాసు గొప్పతనము తెలిసికొన్న నవాబుగారు వెంటనే ఆయనను విడుదల చేయించి, భద్రాచల రాముని సేవా నిమిత్తమై భూమిని ఇచ్చారు. శ్రీ సీతారామ కళ్యాణ సమయంలో గోల్కొండ దర్బారు నుండి ముత్యాల తలంబ్రాలను పంపే సంప్రదాయము అప్పుటినుండే మొదలయ్యింది. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ ప్రభుత్వము ద్వారా ఈ ఆనవాయితీ కొనసాగుతున్నది.

మచ్చుకి కొన్ని రామదాసు కీర్తనలు

>1. అంతా రామమయం ఈ జగమంతా రామమయం 2. అదిగో భద్రాద్రి గౌతమి ఇదిగో చూడండి 3. అడుగు దాటి కదల నియ్యను4. అమ్మ నను బ్రోవవే రఘురాముని 5. అయ్యయ్యో నీవంటి అన్యాయ దైవము 6. అయ్యయ్యో నే నేరనైతి ఆదినారాయణుని తెలియనైతి7. ఆదరణలే 8. ఆన బెట్టితినని 9. ఆనందమానందమాయెను 10. ఇక్ష్వాకుల తిలక 11. ఇతడేనా రుూ12. ఇతరము లెరుగనయా 13. ఇనకుల తిలక ఏమయ్య రామయ్యా 14. ఇన్ని కల్గి మీరూ రకున్న15. ఉన్నాడో లేడో16. ఎంతపని చేసితివి 17. ఎం తో మహానుభావుడవు18. ఎందుకు కృపరాదు 19. ఎక్కడి కర్మము 20. ఎటుబోతివో 21. ఎన్నగాను 22. ఎన్నెన్ని జన్మము 23. ఎవరు దూషించిన 24. ఏ తీరుగ నను 25. ఏమయ్య రామ 26. ఏమిర రామ నావల్ల నేర మేమిరా రామ 27. ఏటికి దయరాదు 28. ఏడనున్నాడో 29. ఏల దయ రాదో రామయ్య30. ఏలాగు తాళుదునే 31. ఓ రఘునందన 32. ఓ రఘువీరా యని నే పిలిచిన 33.

ఓ రామ నీ నామ 34. కట కట 35. కమలనయన 36. కరుణ జూడవే 37. కరుణించు దైవ లలామ 38. కలయె గోపాలం 39. కలియుగ వైకుంఠము 40. కోదండరా ములు 41. కంటి మా రాములను కనుగొంటి నేను 42. కోదండరామ కోదండరామ43. గరుడగమన 44. గోవింద సుందర మోహన దీన మందార 45. చరణములే నమ్మితి 46. జానకీ రమణ కళ్యాణ సజ్జన 47. తక్కువేమి మనకు 48. తగున య్యా దశరధరామ49. తరలిపాదాము 50. తారక మంత్రము 51. దక్షిణాశాస్యం 52. దరిశనమాయెను శ్రీరాములవారి 53. దశరధరామ గోవిందా 54. దినమే సుదినము సీతారామ స్మరణే పావనము 55. దీనదయాళో దీనదయాళో 56. దైవమని 57. నం దబాలం భజరే 58. నను బ్రోవమని 59. నమ్మినవారిని 60. నర హరి నమ్మక 61. నా తప్పులన్ని క్షమియించుమీ 62. నామొరాల కింప 63. నారాయణ నారాయణ 64. నారాయణ యనరాదా 65. నిను పోనిచ్చెదనా సీతారామ 66. నిన్ను నమ్మియున్నవాడను 67. నీసంకల్పం 68. పలుకే బంగారమాయెనా 69. పాలయమాం జ యరామ 70. పాలయమాం రుక్మిణీ నాయక71. పావన రామ 72. పాహిమాం శ్రీరామ73. పాహిరామ 74. బిడియమేల నిక75. బూచివాని 76.

భజరే మానస రామం 77. భజరే శ్రీరామం హే 78. భళి వైరాగ్యంబెంతో 79. భారములన్నిటికి 80. భావయే పవమాన 81. మరువకను నీ దివ్యనామ 82. మానసమా నీవు మరువకుమీ పెన్ని 83. మారుతే నమోస్తుతే 84. రక్షించు దీనుని రామ రామ నీ 85. రక్షించు దీనుని 86. రక్షించే దొర నీవని87. రక్షింపు మిదియేమో 88. రామ నీ దయ రాదుగా 89. రామ రామ నీవేగతి90. రామ రామ భద్రాచల 91. రామ రామ యని 92. రామ రామ రామ 93. రామ రామ రామ శ్రీరఘురామ…
నండూరి రవిశంకర్‌

Surya Telugu Daily

డిసెంబర్ 24, 2010 Posted by | భక్తి | , | 1 వ్యాఖ్య

కథాశిల్పి …డాక్టర్‌ కాకాని చక్రపాణి

కథాశిల్పి

Chakrapani-f-కథలు రాయటం తేలికా కష్టమా అనే మీమాంస వచ్చిన ప్పుడు రెండు విధాలగానూ అభిప్రాయం వ్యక్తం చేస్తారు రచయితలు. అసలు కథకంటే నవల రాయటమే బహు తేలిక అనే వాళ్ళూ వున్నారు.డాక్టర్‌ కాకాని చక్రపాణి ప్రముఖ రచయిత. ఆయన కథలూ, నవలలూ కూడా బహు తేలిగ్గా రాయగలిగాడు.ఆయన రచనలు ఎందరో సాహితీ విమర్శకుల దృష్టికి వెళ్ళి మెప్పులు పొందటమే గాకుండా వివిధ పత్రికలు, సంస్థలు నిర్వహిం చిన పోటీలలో బహుమతులూ పొం దినయి.

కథను సంఘటన చుట్టూ తిప్పు తూ, పాత్రల మనస్తత్వాన్ని విశ్లేషిస్తూ చెప్పదలుచుకున్న విషయాన్ని లోతు గా పరిశీలించి పాఠకుడిని ఆలోచిం ప చేయగలిగిన రచనలు చేయటం ఆయన నేర్చుకున్న విద్య.చక్రపాణి కథనంలో ఒక ఒడుపు, ఒక చాతుర్యమూ, భావుకత్వంతో కూడిన ఒక వేగమూ కన్పిస్తాయి. ఆత్మవిశ్వాసమూ, సంస్కారపూరిత ధి క్కార స్వభావమూ ఉండే స్త్రీ పాత్ర చిత్రణ ఆయన రచనల్లో కనిపి స్తుంది. సాహిత్య సామాజికాంశాల ప్రత్యేకతే కాకుండా, చాలామంది కథా రచయితల్లో కన్పించని కంఠస్వర వైవిధ్యం చక్రపాణి కథల్లో కన్పిస్తుంది.

ప్రతి రచయితకూ క్షణక్షణం కవ్వించే జీవితమే అంతులేని ఆకర్ష ణ. తన ఒక్కొక్క రచన ద్వారా ఆకాశమంత ప్రహేళికలో ఖాళీ స్థానాలను పూర్తి చేసుకుంటూ పోయే రచయిత తన ఊహల పిడికిలికి అంది నంత మేర ఆకారం, అర్థం ఇస్తాడు. అటు వంటి నిత్యార్యార్థకం అవ తారాలే చక్రపాణి కథలు. వీటినిండా మనకు తెలిసిన వ్యక్తులే ఉంటా రు. తెలిసిన చీకటి వెలుగులే ఉంటయి.వీరి కథలు చాలామంది పాఠకులని ఆకర్షిస్తాయి అనటంలో అతి శయోక్తి లేదు. డాక్టర్‌ కేతు విశ్వనాథరెడ్డి, వాకాటి పాండురంగారా వు, మునిపల్లె రాజులాంటి ప్రముఖ రచయితలు కూడా ఆయన కథలంటే ఆసక్తి చూపిస్తారు.

కాకాని మూడు కథా సంపుటాలను ప్రచురించారు. అవి థ్రిల్లిం త, నివురు, పతితపావని. అందులో ఒకదానికి డాక్టర్‌ కేతు విశ్వనా థరెడ్డి ముందుమాట రాస్తూ ‘చిత్తవృత్తుల్ని ఆడించే శక్తుల్ని ఈ రచ యిత తన కథల్లో ఒక అన్వేషకుడిగా పట్టుకో డానికి ప్రయత్నించా డు. మనిషిని మనిషిగా, ఒక సామాజిక సాంస్కృతిక మూర్త పదా ర్థంగా పరిశీలించాడు. మనుష్యులు కోల్పోతున్న ఆపేక్షలను గుర్తిం చాడు. పోగొట్టుకుంటున్న విలువల్ని చర్చించాడు’ అంటారు.అసలు మనిషికి స్వేచ్ఛ వున్నదా, వుంటే ఆ మేరకు ఏ వ్యక్తి అయి నా జీవించగలడా, ఆ గీతలు గీచే సమాజ ప్రభావం ఎలాం టిది అన్న అతి గహనమైన విషయాన్ని చక్కటి శిల్పంతో దిద్దిన కథ ‘నిస్వార్థం’. మెరుపు తీగలాటి వివేకవతి అయిన భార్య వుండి కూడా వీధుల వెంబడి కుక్కల్లాగా తిరిగే భర్తను, సంయమనం నిండిన ఛీత్కారంతో చిత్రించింది ‘చుక్కల్లో చంద్రుడు’ కథ.

‘మరమరాలు బఠాణీలు అందులో సామ్యవాదం’లోని నారా యణరావు, ‘రెండు ముఖాల చంద్రుడు’లోని రామచంద్రం, ‘మహా పర్వతంా మరుగుజ్జు’లోని రామం నేటి కాలంలోని పురుషకు సం స్కారానికి ప్రతినిధులు.స్త్రీ పురుష సంబంధాలను వేర్వేరు కోణాలనుండి ‘భార్యంటే’, ‘తాకట్టు’, ‘ఛీ! ఏం మగాడు’ కథలు పరిశీలించగా ‘పద్మావతీ చరణ చారణ చక్రవర్తి’ మనసుకు శరీరానికి మధ్యగల శక్తివంతమైన సం బంధాన్ని చిత్రీకరిస్తుంది.

ఆయన రచనలో వ్యక్తీకరించిన కొన్ని యదార్థ వాదాలు ఇలా వుం టాయి. ఆడది చాలా విషయాల్లో మగవాడిని పల్టీ కొట్టిటస్తుంది. అటు వంటిది అందమైన స్త్రీ ముందు నిలబడ్డ మగవాడు మరింత బిడియ స్తుడవుతాడు. పిచ్చిమొక్కలు కోసినంత తేలిగ్గా గులాబీలను త్రుంచ డానికి మనవేళ్ళు మనకు సహకరించవు గనుక మగవాడు ఆడదాన్ని మహా పర్వతం చేసి తను మరగుజ్జు అవుతున్నాడు. అలా గే, మరో చోట చంద్రుడిలోని నల్లని మచ్చను కుందేలులా ఊహిం చుకునే మనస్సు మనది అంటాడు.‘దయ్యం వదిలింది’ లో కథనం ఇలా నడుస్తుంది ’ఆయన రాసిన కథలు వయసొచ్చిన ఆడపిల్లల్లాం టివి. వాటిని గుండెల మీద కుంపట్లలా భరించేవాడు ఆయన. తల్లి దండ్రులు కూతురికి వీలయినంత మంచి సంబం తధమే చేయాలని చూస్తారు. అలాగే మా బావగారికి తన కథలు మంచి పత్రికలలో రావాలని వుండేది’ అంటుంది అందులోని ఒక పాత్ర.

చక్రపాణికి కథలు రాయటమే కాకుండా, ఇతర భాషా రచనలను తెలుగులోకి, తెలుగులోని మంచి రచనలను ఆంగ్లం లో కి అనువదించటం, మిత్రులతో కలిసి మాటలు చెప్పటం తృప్తినిచ్చే పనులు. ఆయన మాట్లాడుతుంటే మనకూ కాలం తెలియదు.ఆరవై అయిదేళ్ళ క్రితం మాట. ఇప్పుడా దృశ్యానికి ఎన్ని మార్పు లూ, చేర్పులూ వచ్చాయో తెలియదు. గుంటూరు జిల్లా, మంగళ గిరి మండలలో చినకాకాని గ్రామంలో జన్మించాడు కాకాని చక్ర పాణి. తరువాత ప్రముఖ రచయిత అయి, కథలూ నవలలూ వ్రాసి, సవ్యసాచిలా తెలుగులోనూ, ఇంగ్లీషూలోనూ రచనలు చేస్తూ సాహిత్యంలో డాక్టర్‌ ఆవ్వటమే గాకుండా తెలుగులో ఎంతోమంది సాహితీ ప్రియులకు సన్నిహితుడయ్యాడు.

కష్టాలు లేందే సుఖంలోని మజా తెలియదంటారు. అనారోగ్యం వలన బిఎస్సీ చదువును అర్ధాంతరంగా ఆపేసినా, తరువాత ఉద్యో గం చేస్తూ, సంసారమనే సాగరాన్ని ఈదుతూ ఇంగ్లీష్‌ లిటరేచర్‌ లోను, ప్రాచీన భారత దేశ చరిత్ర, సంస్కృతి, పురాతత్వ శాస్త్రంలో ను ఏం.ఏ.పట్టా పుచ్చుకొని, ‘తెలుగు సాహిత్యంపై సోమర్‌ సెట్‌మామ్‌ ప్రభావం’ అన్న విషయం మీద పరిశోధనాత్మక వ్యాసం తో డాక్టర య్యాడంటే ఆయనలోని పట్టుదలా, ఆత్మవిశ్వా సాలు ఎలాంటివో తెలుస్తుంది. ఆ పరిశోధనలో భాగంగానే, సోమ ర్‌సెట్‌ మామ్‌ మాగ్నం ఓపస్‌ నవల ‘ఆఫ్‌ హ్యూమన్‌ బాండేజ్‌’ ను తెలుగు లోకి అనువదించాడు.ఆయన చేసిన ఆ పని తెలుగు సాహిత్యాన్ని మరింత సు సంపన్నం చేసిందనటంలో నిస్సందేహం.

కాకాని చక్రపాణి హైదరాబాద్‌లోని ఆంధ్ర సారస్వత పరిషత్తు ప్రాచ్య కళాశాలలో ఆంగ్లోపన్యాసకులుగా ముప్పయి సంవత్సరాల కు పైగా పనిచేసి విశ్రాంత జీవితం గడుపుతున్నాడు.ఆయన రాజశేఖర చరిత్ర, మైదానం, చివరకు మిగిలేది, అల్ప జీవి నాలుగు తెలుగు ప్రముఖ నవలలను ఆంగ్లంలోకి అనువదిం చగా, వాటిని కుప్పంలోని ద్రావిడ విశ్వవిద్యాలయం ‘ఫోర్‌ క్లాసిక్స్‌ ఆఫ్‌ తెలుగు ఫిక్షన్‌’ అన్న పేరుతో పుస్తకరూపంలోకి తీసుకు వచ్చిం ది. వీరు రాసిన పెక్కు కథలకు వివిధ పత్రికల నుండి బహుమతులు రావటమే గాకుండా, వీరి ‘సాహిత్య ప్రభావం’ గ్రంథం విమర్శా ప్రక్రి యకు 2009లో తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారాన్ని పొం దింది. మనిషి మృదుభాషి. తను విభేదించే విషయంలో సైతం ఎదు టివారిని నొప్పించని తత్వం.

ఆయన 60 దాకా తెలుగులో కథలు, పదకొండు నవలలు వ్రాశా రు. దాదాపు పది సంవత్సరాలు ఆంధ్రభూమి దినపత్రికలో వారం వారం ‘కధలు కాకరకాయలు’ అనే శీర్షికతో పెక్కు రాజకీయ సామా జిక విషయాలపై సున్నితమైన హాస్యంతో వ్యంగ్య బాణాలు విసిరారు.1989లో కేంద్ర సాహిత్య అకాడమి నిర్వహించిన పదిరోజుల గోష్టి కార్యక్రమంలో ఆహ్వానితుడుగా పాల్గొన్నారు. ఆయన ప్రచు రించిన ‘భారతీయ సాహిత్యం సమ కాలీని కథలు’ పుస్తకంలో వివిధ భాషలనుండి అనువదించిన కథలు ప్రచురితమయ్యాయి.

డాక్టర్‌ దుర్గంపూడి చంద్రశేఖర రెడ్డి, డాక్టర్‌ గోవిందరాజు చక్ర ధర్‌, జి.వెంకటరాజం వంటివారితో కలిసి చాలా పుస్తకాలను ఆంగ్ల నుండి తెలు గులోకి అనువదించి పుస్తక రూపం లో ప్రచురించారు. అందులో ముఖ్య మయినవి స్వామి రంగనాధానంద ఆధ్యాత్మిక వ్యాసాలను ‘పరిపూర్ణ సా ఫల్యానికి ప్రజాస్వామ్యం’. మామ్‌ వ్రాసిన ‘క్రిస్ట మస్‌ హాలీడే’ ను ‘యవ్వనపు దారిలో’గా, సరోజినీ రేగాని ‘నిజాం బ్రిటిష్‌ రిలేషన్స్‌’ను ‘నిజాం బ్రటిష్‌ సంబంధాలు’గా, పి.వి.పరబ్రహ్మం ‘కాకతీయ ఆఫ్‌ వరంగల్‌’ను ‘కాకతీ యులు’గా, కీ.శ 624 నుండి 1000 వరకు తొలి మధ్య యుగ ఆంధ్రప్రదేశ్‌ సమగ్ర చరిత్ర సమీకృతిగాను, రాబర్ట్‌ స్యూయల్‌ ‘ఫర ్‌గాటెన్‌ ఎంపైర్‌ (విజయనగర)’ ను ‘విస్మృత సామ్రాజ్యం విజయ నగరం’ అన్న పేరుతోనూ అనువదించారు.

ఇవిగాక హిందీనుంచి ‘అభయ మౌర్యా యుగనాయక’ను, ఇతర భాషలనుంచి మరో ఇరవై ఆయి దు కథలను ఆంగ్లంలోకి అనువదించారు.ఆయనకు మామ్‌ కథలంటే చాలా ఇష్టం. మామ్‌ ‘మనిషి తను సుఖంగా బతకాలంటే ప్రథమంగా అవసరమైనది మానవుల అని వార్య స్వార్థపరత్వాన్ని గుర్తించటం.ఇతరులు నీ కోర్కె తీర్చటం కో సం తమ కోర్కెలు త్యాగం చేయాలనటం మహా అసంగత మైన పని.నువ్వు ఇతరులను స్వార్థరహితంగా వుండమని అడు గుతు న్నావు.

వాళ్ళలా ఎందుకుండాలి? ప్రతి వ్యక్తీ తన కొరకే అనే నిజం తో నువ్వు రాజీ పడనప్పుడు, నీ చుట్టూ వున్న వాళ్ళ నుంచి నువ్వడి గేది అతిస్వల్పం. వాళ్ళు నిన్ను నిరాశ పర్చరు. వాళ్ళను మరింత స ద్భావంతో పరికిస్తావు.’ అంటాడు.చక్రపాణి కూడా ఆ భావ నలను నమ్ముతాడనే విషయం ఆయన రచనలే చెబుతాయి.ఆయన రచనలో నిత్యయవ్వనుడు. ఆ యవ్వనాన్ని అలాగే నిలు పుకుంటూ ఇంకా ఇంకా నవలలు, కథలూ వ్రాయాలని, తెలు గు సాహితీ సంపదను ఇతర భాషీయులకు అంది వచ్చేలా తీసుకు రావాలని కోరుకుందాం.

 

Surya Telugu Daily

డిసెంబర్ 22, 2010 Posted by | సంస్కృతి | 1 వ్యాఖ్య

టోక్యో చుట్టేద్దామా…!

టోక్యో చుట్టేద్దామా…!
tokyo2జపాన్‌ పేరు వింటే యంత్రాలు, అద్భుత సాంకేతిక పరిజ్ఞానం, ఆధునిక జీవనశైలి వంటివి గుర్తుకు వస్తాయి. అభివృద్ధి చెందిన దేశంగా గుర్తింపు పొందిన జపాన్‌ రాజధాని టోక్యో. మెయిన్‌ల్యాండ్‌ హోన్షుకు పశ్చిమ దిశలోని జపాన్‌లో ఈ నగరం ఉంది. టోక్యో అంటే పశ్చిమ రాజధాని, దేశ సంప్రదాయాలను ఇది ప్రతిబింబిస్తుంది. జపాన్‌లో 47 నగరాలలో ఒకటిగా పేరుగాంచిన మహానగరం టోక్యో. అంతేకాదు అంతర్జాతీయ నగరం, మెగాసిటీగా ప్రపంచ పటంలో ఎంతో పేరుగాంచింది. ఇక్కడి సంస్కృతి, వారసత్వ సంపద యాత్రికులను అబ్బురపరుస్తాయి. టోక్యోలో చూడదగిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో వాస్తు కళాశిల్పుల నైపుణ్యం గత చరిత్రను కళ్లకు కట్టినట్టుగా చూపుతాయి. టోక్యో ప్రజలు పూర్తిగా ఆధునిక జీవనశైలికి అలవాటుపడినా పాత సంప్రదాయాలు మాత్రం మరిచిపోలేదు. వారి అలవాట్లు, పనులు భిన్నంగా ఉంటాయి. ఇంకా టోక్యో గురించి తెలుసుకోవాలనుందా అయితే చదవండి…

టోక్యో నగరం ఆలయాలు, పుణ్యక్షేత్రాలు, సుందరమైన వాస్తు శిల్పాలతో నిండి ఉంది. ఇవన్నీ ప్రశాంతమైన ప్రదేశాలు ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. ఇక్కడికి వచ్చే యాత్రికుల నుంచి దానధర్మాలు ఎక్కువగానే వస్తాయి. నగరంలో గోకుకు-జి ఆలయం, సెన్సోజి ఆలయాలు ఎంతో పేరుగాంచినవి. మత వారసత్వ ప్రదేశాలుగా గుర్తింపు పొందిన అసకుసా, మీజి జింగు, యాసుకుని వంటి పుణ్యక్షేత్రాల్లో విడిధి పర్యాటకులకు మరిచిపోలేని అనుభవం. ప్రశాంత వాతావరణం, సామరస్యం నగరంలో కనిపిస్తాయి.

గత వైభవం సజీవంగా…

tokyoకళలు, కళాకృతులకు సంబంధించిన శిల్పాలు, కట్టడాలు టోక్యో నగరంలో చాలా కనిపిస్తాయి. యాత్రికులు చూసేందుకు నగరంలో అనేక మ్యూజియాలు, ఆర్ట్‌ గ్యాలరీలు ఉన్నాయి. ఇక్కడి మ్యూజియాలు గత చరిత్ర వైభవాన్ని కళ్లకు కట్టినట్టుగా చూపిస్తాయి. జపాన్‌లో టోక్యో నేషనల్‌ మ్యూజియం అతిపెద్ద, పురాతన మ్యూజియంగా ప్రజాదరణ పొందింది. ఇందులో దేశానికి చెందిన వైభవోపేత కళాఖండాలు ఎన్నో ఉన్నాయి. తప్పకుండా చూడవలసిన ఇతర మ్యూజియాలు.. మోరి ఆర్ట్‌ మ్యూజియం, అసకురా ఛోసో మ్యూజియం, బ్రిడ్జిస్టోన్‌ మ్యూజియం ఆఫ్‌ ఆర్ట్‌, ఫుకగావా ఎడో పిరియడ్‌ మ్యూజియం. ఇంకా చారిత్రాత్మక ప్రదేశాలు.. ఎవోయామా సెమెటరీ, హయాషి మెమోరియల్‌ హాల్‌, ఎడో క్యాస్టిల్‌, హాచికో, స్టాచ్యూ ఆఫ్‌ లిబర్టీ వంటివి చూడవచ్చు.

ఎంటర్‌టైన్‌మెంట్‌ పార్కులు…

tokyo1టోక్యోలో తొలి పబ్లిక్‌ పార్క్‌ ఉఎనో. దీనిని 1873లో నిర్మించారు. ఈ పార్క్‌లో అనేక ఆలయాలు, పుణ్యక్షేత్రాలు, బోట్‌ లేక్‌, చారిత్రాత్మక స్మారక చిహ్నాలు, చెర్రీ బ్లాసమ్‌ చెట్లు ఉంటాయి. ఒక రోజు మొత్తం ఈ పార్క్‌లోని ప్రదేశాలను చూసేందుకే సరిపోతుంది. ప్రదేశాలన్నింటిని సందర్శించాలనుకుంటే ఎక్కువ సమయం కేటాయించాల్సిందే. కుటుంబ సమేతంగా వెళ్లి ఈ పార్కులో ఎంజాయ్‌ చేయవచ్చు.

మనిషి సృష్టించిన విచిత్రాలు…

టోక్యోలో ఆధునిక కట్టడాల గురించి తెలుసుకోవాల నుకున్నట్లయితే రెయిన్‌బో బ్రిడ్జి సరైన ప్రదేశం. ఇది తాత్కాళికంగా నిలుపుదల చేసిన బ్రిడ్జి. 1993లో నిర్మించిన రెయిన్‌బో బ్రిడ్జి 918 మీటర్ల పొడవు, రెండు టవర్లకు మధ్య 570 మీటర్ల దూరం ఉంటుంది. ఎనిమిది ట్రాఫిక్‌ లేన్‌లు, రెండు రైల్వే లైన్లను ఈ బ్రిడ్జి ఇముడ్చుకుంది. టోక్యో టవర్‌ మానవుడు సృష్టించిన మరో అద్భుతంగా చెప్పవచ్చు. ఇది తప్పకుండా చూడవలసిన ప్రదేశం.

 

Surya Telugu Daily

డిసెంబర్ 22, 2010 Posted by | చూసొద్దాం | , , | 2 వ్యాఖ్యలు

ఏకశిల్ప మహాద్భుతం.. రాక్‌పోర్ట్‌ టెంపుల్‌

ఏకశిల్ప మహాద్భుతం.. రాక్‌పోర్ట్‌ టెంపుల్‌

trichyప్రపంచంలోనే అతిపురాతన దేవాలయం… 300 కోట్ల సంవత్సరాల చరిత్ర… విజయనగర రాజుల అలనాటి సైనిక శిబిరం… పల్లవరాజుల శిల్పకళానైపుణ్యానికి నిలువెత్తు నిదర్శనం. ఇలా చెప్పుకుంటూపోతే ప్రపంచంలో మరే దేవాలయానికి లేని ప్రత్యేతలను తనలో ఇముడ్చుకున్న అరుదైన దేవాలయ సముదాయం రాక్‌ఫోర్ట్‌. ఒకే శిలపై మూడు దేవాలయాలు ఉన్న ఈ అరుదైన ప్రదేశం ప్రపంచంలో మరెక్కడా లేదనే చెప్పాలి. వినాయకుడు, శివుడు ఒకే చోట వెలిసిన… తిరుచ్చిలోని రాక్‌ఫోర్ట్‌ విశేషాలు… నేటి ‘విహారి’లో…

పేరుకు తగ్గట్టు రాక్‌ఫోర్ట్‌ టెంపుల్‌… పర్వతంపై 83 మీటర్ల ఎత్తున శిలలో అత్యద్భుతంగా మలచబడింది. ఈ కొండపై మొత్తం మూడు దేవాలయాలు ఉన్నాయి. ఈ దేవాలయ సముదాయాల నిర్మాణం పల్లవుల హయాంలో ప్రారంభమైనప్పటికీ… ఆ తరువాత విజయనగర రాజుల ఆధ్వర్యంలో మధురై నాయకులు వీటి నిర్మాణాన్ని పూర్తిచేశారు. వీరికాలంలో దేవాలయం ఎంతగానో అభివృద్ధి చెందింది. ఏకశిలను తొలిచి నిర్మించిన రాక్‌ఫోర్ట్‌ పర్వత శిఖరానికి… ఎంతో కఠినతరమైన 437 ఎగుడు మెట్లు ఎక్కితే గాని చేరుకోలేం.
మూడు దేవాలయాల సమాగయంగా ఉన్న రాక్‌ఫోర్ట్‌ తమిళనాడులో తిరుచ్చి (తిరుచిరాపల్లి)లో ఉన్నది.

Rockfort_nightపర్వత పాదాల వద్ద ‘మనిక వినాయకర్‌’ దేవాలయం ఉండగా… పర్వత శిఖరం వద్ద ‘ఉచ్చి పిల్లయార్‌ కోయిల్‌’ దేవస్థానం ఉంది. ఇక్కడ… ప్రసిద్ధిగాంచిన శివాలయం ‘తాయుమనస్వామి దేవాలయం’ ఉన్నది. శిలను చెక్కి అపురూపంగా మలిచిన ఈ ‘శివస్థలం’ పర్యాటకులను కనురెప్పవేయనీయదు. ఇక్కడ ఉన్న దేవాలయ సముదాయంలో… లలితాంకుర పల్లవేశ్వరం అనే పల్లవులు నిర్మించిన దేవాలయం కూడా ఎంతో ప్రఖ్యాతిపొందినది. ఇక్కడ ఎన్నో అరుదైన శాశనాలు పల్లవ రాజు మంహేంద్ర పల్లవన్‌ గురించి అనేక విశేషాలను తెలియజేస్తాయి. చోళలు, విజయనగర రాజులు, మధురై నాయకులు ఈ దేవాలయాన్ని విశేషంగా అభివృద్ధి చేశారు. అంతేకాకుండా, కొండపై ఉన్న రెండంతస్థుల తాయుమనస్వామి దేవాయలం ఇక్కడి నిర్మాణాల్లోనే తురుపుముక్కగా అనడంలో ఎలాంటి సందేహం లేదు. అద్భుత కళానైపుణ్యం ఈ దేవాలయం సొంతం.

ప్రతిరోజు ఇక్కడ ఆరు రకాల పూజలు జరుగుతాయి. చితిరైలో ప్రతియేటా ఒకసారి బ్రహ్మోత్సవం కూడా జరుగుతుది. ఆదిపూరం, ‘ఫ్లోట్‌ ఫెస్టివల్‌’ జరిగే ‘పంగుని’ ప్రదేశం కూడా ఇక్కడ ఎంతో ప్రఖ్యాతిపొందిన ప్రదేశం. మధురై నాయకులు నిర్మించిన ఈ రెండు దేవాలయాల్లో ఒకటి శివాలయం కాగా, మరొకటి గణేష్‌ దేవస్థానం. అద్భుత శిల్పకళారీతులకు ఆలవాలంగా ఉన్న… 7వ శతాబ్దానికి చెందిన దేవాలయాలు ఇవి. ప్రఖ్యాతిగాంచిన ఎన్నో శిల్పరీతులకు పెట్టింది పేరు. పర్వత పాదాల వద్ద ఉన్న వినాయకుడి దేవస్థానం, అలాగే పర్వత శిఖరం వద్ద ఉన్న అతిపెద్ద శ్రీ తాయుమాన స్వామి దేవాలయాల్లోకి హిందూయేతరులను అనుమతించరు. పర్యాటకుల సందర్శనార్థం ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఈ ఆలయాలను తెరిచి ఉంచుతారు.

వినాయక దేవస్థానం… పౌరాణిక గాధ…

uchipillayarEntranceలంకాధీశుడైన రావణుడి అనుంగు సోదరుడైన విభీషణడు… అపహరణకు గురైన సీతాదేవి ని రక్షించేందుకు రాముడి పక్షాన చేరి తన సహాయ సహకారాలను అందిస్తాడు. తరువాత యుద్ధంలో రావణుడి ఓడించిన రాముడు తన ధర్మపత్ని సీతను కాపాడుకుంటాడు. ఈ నేపథ్యంలో తనకు సహాయాన్ని అందించిన విభీషణుడికి ఏదైనా బహుమతి ఇవ్వాలనే ఉద్దేశంతో రాముడు… విష్ణుమూర్తి అవ తారమైన రంగనాథస్వామి విగ్ర హాన్ని ఇస్తాడు. అయితే ఇది గమనించిన దేవతలు… ఒక అసురుడు విష్ణుమూర్తి అవతా రమైన రంగనాథస్వామి విగ్ర హాన్ని తన రాజ్యానికి తీసు కెళ్ళడాన్ని సహించలేక పోతారు. దాంతో, దేవతలు ఎలాగైనా విభీషణుడు ఆ విగ్రహాన్ని తీసు కెళ్ళకుండా ఆపాలని నిశ్చయిం చుకొని విఘ్ననాయకుడైన వినా యకుడి సహాయం కోరుతారు. అప్పుడు వినాయకుడు వారి కోరికను మన్నిస్తాడు. రాముడు ప్రసాదించిన విగ్రహాన్ని తీసుకొని లంకకు బయలుదేరిన విభీషణుడు కావేరీ నది మీదుగా వెళ్తూ… ఆ నదిలో స్నానం చేయాలని భావిస్తాడు. ఆ సమయంలో ఆ విగ్రహాన్ని ఎవరికైనా ఇవ్వాలనుకుంటాడు.

Thayumanavar ఎందుకంటే, ఒకసారి ఆ విగ్రహాన్ని నేలపైన పెడితే మళ్లీ తీయడం అసంభవం. దాంతో ఏం చేయాలి? అని మదనపడుతున్న సమయంలో అక్కడే పశువులను కాస్తున్న బాలుడిలా మారువేషంలో ఉన్న వినాయకుడి చేతికి ఆ విగ్రహాన్ని అందించి… విభీషణుడు స్నానానికి ఉపక్రమిస్తాడు. విభీషణుడు నదిలో మునగగానే మారువేషంలో ఉన్న వినాయకుడు ఆ విగ్రహాన్ని కావేరీ నది తీరంలో ఉన్న ఇసుకపై పెడతాడు (ఆ విగ్రహం పెట్టిన చోటే… నేడు ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయంగా విరాజిల్లుతున్న రంగనాథస్వామి దేవాలయం). ఇది గమనించిన విభీషణుడు పశులకాపరిని తరుముతూ వెంబడిస్తాడు. దీంతో ఆ బాలుడు పక్కనే ఉన్న కొండపైకి చచకా ఎక్కేస్తాడు. విభీషణుడు కూడా ఆ కొండపైకి ఎక్కి ఆ బాలుడి నుదిటిపై ముష్టిఘాతం కురిపిస్తాడు. అప్పుడు మారువేషంలో ఉన్న ఆ బాలుడు వినాయకుడిగా మారిపోతాడు. అప్పుడు తన తప్పును తెలుసుకొని వినాయకుడిని క్షమాపణ వేడుకుంటాడు విభీషణుడు. ప్రసన్నుడైన విఘ్నరాజు విభీషణుడి దీవించి లంకకు పంపిస్తాడు. వినాయకుడి ఎక్కిన ఆ కొండనే ఈ రాక్‌ఫోర్ట్‌ టెంపుల్‌. అక్కడ వెలిసిన వినాయకుడి దేవస్థానమే ‘ఉచ్చి పిల్లయార్‌ దేవాలయం’.

తాయుమనస్వామి చరిత్ర…

వినాయుడి దేవస్థానానికి ఉన్నట్టే, ఈ గుడికి కూడా పురాతన గాధ ప్రచారంలో ఉంది. ఒకనాడు శివభక్తురాలైన రత్నవతి అనే ఆవిడ పురిటినొప్పులతో బాధపడుతూ తన తల్లి రాకకోసం ఎదురుచూస్తుంది. ఎంతసేపటికీ తన తల్లి రాకపోవడంతో… ‘నన్ను ఎలాగైనా రక్షించు స్వామీ’ అని శివుడిని వేడుకుంటుంది. అప్పుడు శివుడే స్వయంగా రత్నవతి తల్లి రూపంలో వచ్చి పురుడు పోస్తాడు. అప్పటినుండి ఆయనకు ‘తాయుమనస్వామి’ అనే పేరు స్థిరపడిపోయింది (తాయుం – అన – స్వామి అంటే… తల్లి రూపంలో వచ్చిన భగవంతుడు అని అర్థం). అప్పటినుండి ఈ దేవాలయానికి తాయుమనస్వామి దేవాలయం అనే పేరు సార్థకమైంది. పర్వతపాద ప్రాంతం నుండి సుమారు రెండు వందల అడుగుల ఎత్తులో ఉన్న ఈ దేవాలయం ఎంతో అందంగా, ఆకర్షణీయంగా ఉంటుంది. దేవాయం పైకప్పుపై ఉన్న పెయింటింగ్స్‌ సందర్శకులను మైమరపిస్తాయి. ఈ ఆలయ నిర్మాణం ఆనాటి పల్లవుల శిల్పకళా నైపుణ్యానికి అద్దం పడతాయి. ఇక్కడ శివపార్వతులతో పాటు మహాలక్ష్మి విగ్రహం కూడా ఉండడం విశేషం. ఇక్కడ ఉన్న శివాలయంలో శివుడు అతిపెద్ద లింగాకారంలో ఉంటాడు. అలాగే… పార్వతి దేవి కి ప్రత్యేక గర్భగుడి ఉంది.

చేరుకునేదిలా…

విమాన మార్గం: రాక్‌ఫోర్ట్‌ టెంపుల్‌ నుండి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో తిరుచ్చి ఎయిర్‌పోర్టు ఉంది. చెనై్న మీదుగా దేశంలోని అన్ని ప్రధాన నగరాలు విమాన సౌకర్యం ఉంది.

రైలు మార్గం: రైలు మార్గం ద్వారా వచ్చే ప్రయాణీకులు తిరుచ్చి రైల్వేస్టేషన్‌ చేరుకుని అక్కడినుండి రోడ్డు మార్గం ద్వారా రాక్‌ఫోర్ట్‌ టెంపుల్‌ చేరుకోవచ్చు. దక్షిణ రైల్వే పరిధిలో అతిపెద్ద జంక్షన్‌ తిరుచ్చి. ఇక్కడి నుండి చెనై్న, తంజావూర్‌, మధురై, తిరుపతి, ట్యుటికోరిన్‌, రామేశ్వరం తదితర ప్రాంతాలకు మీటర్‌ గేజీ లైను ఉంది. అలాగే బెంగుళూరు, కోయంబత్తూర్‌, మైసూర్‌, కొచ్చి, కన్యాకుమారి, మంగళూరు లను కలుపుతూ బ్రాడ్‌గేజ్‌ లైన్‌ ఉంది. ప్రతిరోజు పదుల సంఖ్యలో ఈ జంక్షన్‌ నుండి వివిధ రైళ్ళు అందుబాటులో ఉంటాయి.

రోడ్డుమార్గం: దాదాపు దక్షిణ భారత దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుండి ఇక్కడి రోడ్డు మార్గం ఉంది. ప్రతిరోజూ ఆ నగరాలనుండి ఇక్కడి బస్సులు నడుస్తాయి. ఇక లోకల్‌గా తిరగడానికి సిటీ బస్సులు, టూరిస్ట్‌ ట్యాక్సీ, ఆటో రిక్షా, సైకిల్‌ రిక్షా వంటివి అందుబాటులో ఉంటాయి.

 

Surya Telugu Daily

డిసెంబర్ 21, 2010 Posted by | చూసొద్దాం | | 1 వ్యాఖ్య

డార్క్ చాక్లెట్‌లతో గుండె సమస్యలకు చెక్..!!

డార్క్ చాక్లెట్‌లతో గుండె సమస్యలకు చెక్..!!  

<!–

 

–>చిన్న పెద్ద అంటూ వయో బేధం లేకుండా అందరినీ నోరూరించేవి చాక్లెట్లు. అయితే చాక్లెట్లు ఎక్కువగా తినకూడదని, తింటే దంతాలు పాడవుతాయని చాలా మంది హెచ్చరిస్తుంటారు. ఇక నుంచి అలా అనే వాళ్లు మరొక్క సారి ఆలోచించుకోవాలేమో..!! ఎందుకంటే.. డార్క్ చాక్లెట్లు తినడం వల్ల ఆనందంతో పాటు ఆరోగ్యం కూడా వస్తుందని తాజా పరిశోధనలో వెల్లడైంది.

డార్క్ చాక్లెట్లు తినడం వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్‌ స్థాయిని గణనీయంగా తగ్గించవచ్చని ఇటీవలి పరిశోధనలో వెల్లడైంది. బ్రిటన్‌లోని హల్‌ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్తవ్రేత్తలు డార్క్ చాక్లెట్‌లపై జరిపిన పరిశోధనలో ఈ విషయాలను వెల్లడించారు. దేహంలో ప్రమాదకర స్థాయికి పెరిగిన మధుమేహాన్ని తగ్గించటానికి డార్క్ చాక్లెట్లు చక్కటి ఔషధంలా ఉపయోగపడతాయని వారు తెలిపారు.

చాక్లెట్లలో పాలీఫినోల్ అనే పదార్థం అధిక స్థాయిలో అది కోకావా సాలిడ్స్‌ను కలిగి ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్‌ స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి అధికంగా ఉండే మధుమేహ (డయాబెటిక్) వ్యాధిగ్రస్థులకు తరచూ గుండె జబ్బులు వచ్చే ఆస్కారం ఉంది. గత పరిశోధనలు కూడా కొలెస్ట్రాల్‌‌ గుండె సంబంధిత సమస్యను తగ్గిస్తుందని రుజువు చేశాయి.

ఈ తాజా పరిశోధనలో కోకావా విత్తనాలలో ఉన్న రసాయనాలు కొలెస్ట్రాల్‌ను ప్రభావితం చేస్తాయని పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధనలో భాగంగా టైప్-2 మధుమేహం కలిగిన 12 మంది వాలంటీర్లకు 16 వారాల పాటూ పాలీఫినోల్స్ అధికంగా ఉన్న చాక్లెట్ బార్లను ఇచ్చి పరీక్షించారు. అనంతరం వారి కొలెస్ట్రాల్ స్థాయిని పరీక్షించి చూడాగా.. అది గణనీయంగా తగ్గింది.

దీని అర్థం హృదయ సమస్యను తగ్గిస్తుంది” అని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన ప్రొఫెసర్ స్టీవ్ అట్కిన్ అన్నారు. అధిక కొకావా ఉండే చాక్లెట్లు టైప్-2 డయాబెటిక్ వారికి కావలసిన డైట్‌ను అందించడంతో పాటు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుందని ఆయన అన్నారు. అయితే బ్రిటన్‌లోని కొందరు మధుమేహ నిపుణులు మాత్రం దీనిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు.

ఈ చాక్లెట్లలో అధిక స్థాయిలో కొకావాతో పాటు అంతే అధిక స్థాయిలో ఫ్యాట్ (కొవ్వు), షుగర్ (పంచదార)లు కూడా ఉంటాయి. కాబట్టి ఇవి మేలు కన్నా ఎక్కువ కీడునే కలిగిస్తాయనేది విమర్శకుల వాదన. బ్రిటన్‌లో దొరికే ప్రముఖ బ్రాండెడ్ చాక్లెట్‌ బార్‌లలో 200 కేలరీలు, 16 గ్రాముల వరకూ కొవ్వు ఉంటుంది. వీటిని తినడం వల్ల శరీర మంతా కొవ్వు పేరుకుపోతుందని వారు వాదిస్తున్నారు.

web duniya

డిసెంబర్ 20, 2010 Posted by | ఆరోగ్యం | 1 వ్యాఖ్య

విభిన్న రకాల రంగులను ఎలా తయారు చేస్తారు ?

విభిన్న రకాల రంగులను ఎలా తయారు చేస్తారు ?

wool_colorsగత నూరు లేక యాభెై సంవత్సరాలకంటే నేడు ప్రపంచం ఎంతో ప్రకాశవంతంగా, రంగుల మయంగా వుంది. రంగుల తయారీలో జ రిగిన పరిశోధనలు, అభివృద్ధుల ఫలితమే ఇది. రంగుల ఉత్పత్తి వలన వ స్త్ర పరిశ్రమలో లెక్కలేనన్ని రంగులలో వస్త్రాలు తయారవుతున్నాయి.

  • గత శతాబ్ది మధ్య కాలం వరకు లభించే రంగులు ప్రకృతి సిద్ధంగా లభించే పువ్వులు, మొక్కల నుండి తయారయ్యేవి. అప్పుడు రంగుల వన్నెలు తక్కు వుండేవి. ఈ రోజుల్లో నీలం రంగు చెట్టు ఇండిగో నుండి నీలం, మేడర్‌ అ నే ఎర్ర రంగు, సాఫోవర్‌ అనే పచ్చరంగు, టర్మరిక్‌ పసుపు అనే పసుపు ప చ్చ రంగును కొన్ని సముద్ర ప్రాణుల నుండి తయారు చేసేవారు.
  • మొట్టమొదటి కృత్రిమమైన రంగును 1856లో కనుగొనేసరికి రంగుల ప్ర పంచంలో కొత్త ఇంద్రధనస్సులేర్పడ్డాయి. క్వినెైన్‌ మందును కృత్రిమంగా తయారు చేయడానికి విలియమ్‌ పెర్కిన్‌ ప్రయోగాలు చేస్తుండగా, ఈ రం గు సునాయాసంగా తయారెైంది. దీని పేరు మేవీన్‌. ఇది నీలం రంగులో వుండేది. ఆ తరువాత అనేక రంగులలో కృత్రిమ వర్ణాలను తయారు చేయడం జరిగింది.
  • కృత్రిమంగా తయారయిన రంగులు ఊలు మొదలెైన బట్టలకు వేసిన పుడు వెలిసిపోయేవి కాదు. నూలు బట్టలకు ఈ రంగులను వేసినపుడు, బట్టలను ఉతికేసరికి రంగులు వెలిసి పోయేవి. రంగు వెలవకుండా ఉం డేందుకు రంగు వేసే ముందు నూలు బట్టలను టేనిక్‌ ఆమ్లము లేదా లో హపు లవణాలలో ముంచేవారు. దీని వలన రంగు పోయేది కాదు.
  • paintఈ రంగుల తర్వాత ఏజో రంగులు తయారయ్యాయి. ఈ రంగులలో రెండు రకాలు. మొదటి రంగులో ముంచి తీసిన పిదప ఆరబెట్టి రెండవ రంగులో మరలా ముంచి తీసి ఆరబెడతారు. రెండు రంగులు కలసి బట్ట కు పట్టుకుంటాయి. తరువాత ఈ బట్టలను ఉతికినా రంగులు వెలసి పోవు.
  • వాట్‌ రంగులు మరో సముదాయానికి చెందినవి. నూలు బట్టలకు ఇవి ఎంతో మంచివి. ఈ రంగులతో కొన్ని రసాయనాలను కలిపి బట్టలకు ప ట్టించినట్లయితే అవి ఎంత కాలానికి వెలువ కుండా మెరుస్తుంటాయి.
  • ఇంకా ఇప్పుడు, తారు, పెట్రోలియం పదార్థాలతో తయారయ్యే అనేక రంగులు లభిస్తున్నాయి. ఇవి బట్టల కోసమే కాదు, ప్లాస్టిక్‌, చర్మం, కాగి తం, తెైలాలు, రబ్బరు, సబ్బులు, ఆహార పదార్థాలు వంటి, సిరాలు మొదలెైనవి తయారు చేయడానికి ఉపయోగిస్త్తున్నారు.

Surya Telugu Daily

డిసెంబర్ 19, 2010 Posted by | వార్తలు | 1 వ్యాఖ్య

కలంకారీ కళాకృతులు

కలంకారీ కళాకృతులు

 

సుమారు 500 కుటుంబాల కళాకారులు ఈ కలంకారీ కళపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఈ 21వ శతాబ్దం వచ్చేసరికి చాలామంది కళాకారులు వ్యవసాయంవైపు, ఇతర పనులవైపు మళ్లడంతో ఈ కలంకారీ కళ దాదాపు అంతరించే స్థారుుకి చేరుకుంది. 1950లో కమలాదేవి చటోపాధ్యాయ అనే ఉద్యమ కళాకారిణి కృషితో ప్రభుత్వం ఈ కళ యొక్క ప్రాముఖ్యాన్ని గుర్తించి శ్రద్ధ తీసుకోవడంతో మళ్లీ ఈ కలంకారీ కళ గుర్తింపు పొందింది.

kalankariకలంకారీ� కళ అంటే వెదురుతో చేసిన కలంతో సహజమైన రంగులను ఉపయోగించి వస్త్రాలపై చిత్రించే ఒక కళ. ఇది చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో పుట్టి తరువాత రాష్ట్రానికి వ్యాపించింది. ఒకప్పుడు పురాతన హరప్పా నాగరికతకు సంబంధించిన తవ్వకాలలో లభించిన ఒక వెండి పాత్రపై చిత్రాలున్న ఒక వస్త్రం లభించింది. దీని ఆధారంగా ఈ కలంకారీ కళ చాలా పురాతనమైందని తెలుస్తోంది. �కారీ� అనగా హిందీ లేదా ఉర్దూలో �పని� అని అర్ధం. 10వ శతాబ్దంలో పర్షియన్‌, భారతీయ వర్తకుల సంబంధాలలో ఈ పదం వచ్చి ఉంటుందని చరిత్రకారుల అభిప్రాయం. ఆనాడు పోర్చుగీసు, డచ్చి, బ్రిటీష్‌ వారితో వివిధ వాణిజ్య వ్యాపారాలలో ఈ కలంకారీ డిజైన్లతో తయారు చేసిన వస్త్రాలకు చాలా గిరాకీ ఉండేదట. ఇంకా మన రాష్ట్రంలో కృష్ణాజిల్లా పెడనలో ఈ కలంకారీ కళ చాలా ప్రసిద్ధి పొందింది. అయితే పెడనలో ఈ కళను బ్లాక్‌ ప్రింటింగ్‌ అంటారు. ప్రస్తుతం మనం చూసే పెడన వస్త్రాలు అన్నీ ఈ కలంకారీ కళాత్మక ప్రింటింగ్‌ వస్త్రాలే. కొన్ని వస్త్రాలమీద దేవతా బొమ్మతో వస్తాయి. అవి మాత్రం శ్రీకాళహస్తి కళాకారులు చిత్రించినవే.

ఈ కలంకారీ కళ పురాతనమైనా 13వ శతాబ్దంలో శ్రీకాళహస్తిలో ఈ కళతో చిత్రించిన వస్త్రాలు కోరమాండల్‌ తీరం వెంబడి వస్త్ర వ్యాపారం బాగా జరిగేది. అందువలనే ఈ కలంకారీ కళ దక్కను పీఠభూమి అంతా వ్యాపించింది. ఎల్లప్పుడూ ఈ పట్టణాన్ని ఆనుకుని ప్రవహించే సువర్ణముఖీ నదిలో ఈ కళకు కావలసినంత స్వచ్ఛమైన నీరు లభించడం కూడా ఇక్కడ కలంకారీ కళ వృద్ధి పొందడానికి ఒక కారణమంటారు. ఈ కళ ఎక్కువగా హిందూ సంప్రదాయాన్నే ప్రతిబింబిస్తుంది. ఇక్కడి కళాకారులు ఇప్పటికీ ఇక్కడ రామాయణ, భారత, భాగవత కథలనే వస్త్రాలమీద చిత్రిస్తున్నారు.

arts ఇక పెడనలో.. సముద్రతీరం వెంబడి ఉన్న ముఖ్యమైన రేవు పట్నం �బందరు� (మచిలీపట్నం).ఈ రేవుకు అప్పట్లో సరైన సౌకర్యాలు లేకపోవడంతో గోల్కొండ ప్రభువులతో సంబంధాలు నెరుపుకున్నారు. దీంతో �బందరు� పెద్ద ఓడరేవుగా ప్రసిద్ధి చెందింది. గోల్కొండ ప్రభువులైన �కుతుబ్‌షాహీలు� ఈ కలంకారీ కళ ఉత్పత్తులను ఎక్కువగా ఇష్టపడే పర్షియన్‌ వర్తకులతో వ్యాపార సంబంధాలను నెరిపేవారట. ఈజిప్ట్‌లోని కైరో వద్దున్న �పోస్టాట్‌� అనే ప్రదేశంలో పురాతత్వ తవ్వకాలు జరిపే వరకూ భారతదేశంలో ఇలా వస్త్రాలపై అద్భుతమైన కళా ఖండాలను సృష్టిస్తున్నారనే విషయం ఎవరికీ తెలియదు. ఈ తవ్వకాలలో వివిధ అద్భుతమైన చిత్రాలతో కూడిన భారతదేశ నూలు వస్త్రాలు కన్పించాయి. ఈ వస్త్రాలు 18వ శతాబ్దంలో పశ్ఛిమ తీరం ద్వారా ఆయా దేశాలకు ఎగుమతి అయి ఉండవచ్చని చరిత్రకారుల అభిప్రాయం.తరువాత అధ్యయనంలో తేలిందేమంటే ఆనాడు సుగంధద్రవ్యాలు అమ్మే వ్యాపారస్తులు తమ వ్యాపారం కోసం వస్తుమార్పిడి పద్ధతి ద్వారా ఈ భారతీయ కలంకారీ వస్త్రాలను తీసుకెళ్ళేవారు.

ఈ కలంకారీ కళలో వాడే ఒక ముఖ్యమైన విషయం ఏమంటే ఈ వస్త్రాలకు వాడే రంగులు. ఈ రంగులన్నీ సహజసిద్ధమైన రంగులు. వివిధ కూరగాయల నుండి తీసి వాడే ఈ వస్త్రాలు ధరిస్తే శరీరానికి ఏవిధమైన హాని చేయవు. నిజాం ప్రభువుల కాలంలో విదేశీయులు కలంకారీ వస్త్రాలపై ఉన్న కలంకారీ కళకు ఆకర్షితులై ఆ వస్త్రాలకు సరితూగే ఎత్తున బంగారాన్ని ఇచ్చి కలంకారీ వస్త్రాలను కినుగోలు చేసుకుని వెళ్లేవారట.

కలంకారీ ఉత్పత్తులు మార్కెట్‌ అవసరాన్ని బట్టి వివిధ రూపాల్లో తయారౌతుంటాయి. ప్రార్ధన వస్త్రాలు, దుప్పట్లు, దిండు గలీబులు, వాకిలికి వాడే కర్టెన్లు, వివిధ పుష్పాలతో, లతలతో అందంగా తయారు చేసిన వస్త్రాలు మధ్య ఆసియా మార్కెట్‌కోసం చేసేవారట. అలాగే కుట్టుపనితనంలా ఉండే డిజైన్లు, చెట్లు వంటివి ఐరోపా మార్కెట్‌ కోసం చేసేవారట. గోడకు వేలాడదీసే చిత్రపటాలలో ఉంచే వస్త్రాలను ఆగ్నేయ ఆసియాకోసం, ధరించే వస్త్రాలకు, దుప్పట్లు తదితర అవసరమైయ్యే డిజైన్లు తూర్పు ఆసియాకు ఎగుమతి చేసేవారట.

arts119వ శతాబ్దపు కళాకారుల్లో ఎక్కువగా �బలిజ� కులస్తులే ఉండేవారు. వీరు సంప్రదాయక వ్యవసాయం, కటీర పరిశ్రమలపై ఆధారపడి జీవించేవారు. ప్రస్తుతం శ్రీకాళహస్తి ఊరు చుట్టుపక్కల సుమారు 500 కుటుంబాల కళాకారులు ఈ కలంకారీ కళపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఈ 20వ శతాబ్దం వచ్చేసరికి చాలామంది కళాకారులు వ్యవసాయంవైపు, ఇతర పనులవైపు మళ్లడంతో ఈ కలంకారీ కళ దాదాపు అంతరించే స్థాయికి చేరుకుంది. 1950లో కమలాదేవి చటోపాధ్యాయఅనే కళా ఉద్యమ కళాకారిణి కృషితో ప్రభుత్వం ఈ కళ యొక్క ప్రాముఖ్యాన్ని గుర్తించి శ్రద్ధచతీసుకోవడంతో మళ్లీ ఈ కలంకారీ కళ పునర్జీవం పొందింది.

చిత్రించే విధానం : చాలా ఓర్పతో చేసే కలంకారీ అద్దకపు పరిశ్రమలో కళాకారులు ఉత్సాహం, అభిలాష, అర్పితభావం కన్పిస్తుంది. మొదటిగా తను వేయాలనుకున్న చిత్రాన్ని కళాకారుడు ఒక దళసరిగా ఉన్న చేనేత బట్టను క్వాన్వాసుగా తయారు చేసుకుంటాడు. ఆ నేత బట్టను ప్రవహించే నీటిలో బాగా ఝాడించి బట్టకు ఉన్న గంజిని, ఇంకా పిండిని పోయేదాకా నీటిలో ఉతుకుతాడు. ఈ నేత బట్టను శుభ్రపరచడానికి ఎలాంటి సబ్బును వాడరు.విధంగా శుభ్రం చేసిన బట్టను గేదెపాలు, కరక్కాయ రసం కలిపిన మిశ్రమంలో ముంచి ఎండలో ఆరబెడతారు. ఇలా ఎండబెట్టిన బట్ట ఇపుడు కలంకారీ అద్దకానికి సిద్ధమౌతుంది. ఎండిన ఈ బట్టమీద చింత కర్రను కాల్చిన బొగ్గుతో ఈ బట్టమీద భావానుగుణ్యంగా హస్త కళానైపుణ్యంతో చిత్రాలను చిత్రిస్తారు. ఆ తరువాత ఈ చిత్రించిన బట్టను �అన్నభేది� ద్రావణంలో ముంచుతారు. ఇపుడు చిత్రాలు చెరగని నల్లరంగుగా మారతాయి. సుదీర్ఘమైన కలంకారీ కళలో ఇది తొలిమెట్టు.ఈ విధంగా ఉతికి ఉడకబెట్టి చిత్రాలు గీసి పెయింటింగ్‌ను వేసి ఎండబెట్టి కలంకారీ అద్దకపు బట్టను పూర్తి చేస్తారు.ఇక కలంకారీ చిత్రాలను చిత్రకారులు గీస్తుంటు చూడడం గొప్ప ఆనందం కలుగుతుంది. కలాన్ని వేలితో పట్టకొని కావలసిన రంగులో చిన్నగుడ్డను కానీ, దూదిని కానీ ముంచి కలంపై పెట్టి వేలితో దూదిని నొక్కుతూ మొనగుండా ఆ చిత్రానికి రంగులు అద్దుతాడు కలంకారీ చిత్రకారుడు.
ఇక్కడి కలంకారీ కళాకారులలో చెప్పుకోదగ్గ వ్యక్తి జి. కృష్ణారెడ్డి. 1960 సంవత్సరంలో జె.లక్ష్మయ్య అనే వ్యక్తి వద్ద ఈ కలంకారీ వృత్తిలో నైపుణ్యత విషయంలో కృష్ణారెడ్డి శిక్షణ పొందారు. ప్రస్తుతానికి కృష్ణారెడ్డి తనకున్న అపార అనుభవంతో చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో కలంకారీ వర్క్‌షాప్‌ ప్రారంభించారు. కృష్ణారెడ్డి నేతృత్వంలో సుమారు 17 మంది కళాకారులు అతని వద్ద తర్ఫీదు పొంది ఈ వృత్తిలో అంతర్జాతీయ ఖ్యాతినార్జిస్తున్నారు. కృష్ణారెడ్డి సంతానంలో అతని కుమార్తె మంజుల, ఇద్దరు కుమారులు దామోదరం, బాలాజీలు తండ్రికి చేదోడువాదోడుగా ఉంటూ తమవంతు కృషిచేస్తున్నారు. సంప్రదాయంగా వస్తున్న కలంకారీ చిత్రకళను తన కుటుంబ సభ్యులందరితో పంచుకోవడం ఎంతో ఆనందంగా ఉందంటారు కృష్ణారెడ్డి. ఈ కుటుంబం నుంచి వచ్చే కలంకారీ దుప్పట్లు, చీరలు, కర్టెన్లకు మార్కెట్లో మంచి డిమాండే ఉంది.

1996 సంవత్సరంలో కృష్ణారెడ్డి మరికొందరు కళాకారులతో కలిసి 36గీ 16 అడుగుల వస్త్రంపై రామాయణ దృశ్యకావ్యాలను అందమైన కలంకారీ పెయింట్‌ చేయడం విశేషం. ఈ వస్త్రంపై రాముడి బాల్యవిశేషాలతోపాటు లవకుశుల జననం వరకూ కూడా సంపూర్ణరామాయణానికి సంబంధించిన చిత్రాలు పెయింట్‌ చేయడం హైలెట్‌. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రశంస పురస్కారాన్ని కూడా అందుకున్న వ్యక్తి కృష్ణారెడ్డి. తన కళకు కులమతప్రాంతీయ తత్వాలు లేనేలేవంటారు కృష్ణారెడ్డి. అందుకే రామాయణ, భారత, భాగవతాది చిత్రాలతోపాటు జీసస్‌ బొమ్మలను, చర్చికి సంబంధించిన పెయింట్స్‌ కూడా తన కలంకారి చిత్రకళకు ఉపయోగిస్తుంటానని గర్వంగా చెబుతారు కృష్ణారెడ్డి. భారతదేశమన్నా…ఇక్కడి సంప్రదాయాలన్నా తనకు అత్యంత ప్రాణప్రదమంటారు ఆయన. అందుకే కృష్ణారెడ్డిని హిందూ, ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌, వివిధ మీడియా సంస్థలు ఆయనతో గతంలో ఇంటర్వ్యూలు జరిపాయి. భారతదేశానికే వారసత్వంగా భాసిల్లే ఇటువంటి కళలు మరుగునపడిపోకుండా తర్వాతి తరాలు కూడా గుర్తుంచుకునేలా ప్రభుత్వం తగినవిధంగా ప్రోత్సహించాలంటారు కృష్ణారెడ్డి. తనుమాత్రమే కాకుండా తన కుటుంబ సభ్యులు కూడా జీవితాంతం ఈ కలంకారి కళకు అంకితభావంతో పనిచేస్తామని నిగర్వంగా చెబుతున్నారు.
-దామర్ల విజయలక్ష్మి, అనంతపురం

Surya Telugu Daily

డిసెంబర్ 17, 2010 Posted by | సంస్కృతి | | 1 వ్యాఖ్య

మనసు గెలిచే మంత్రం

మనసు గెలిచే మంత్రం

రాజీ అనే పదం వినగానే చాలామంది తమ వ్యక్తిత్వానికే భంగం కలిగినట్టే భావిస్తుంటారు. రాజీ పడడమంటే తనను తాను తక్కువ చేసుకోవడమేనని అనుకుంటారు. అయితే అన్ని సమయాల్లోనూ మొండితనం పనికిరాదు. పట్టు విడుపులు లేకపోతే వ్యక్తిగా మనం ముందుకు వెళ్ళడం కష్టం. అదే ఇక కుటుంబ సంబంధాలు, మానవ సంబంధాలలో రాజీ అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది.ముఖ్యంగా కొత్తగా పెళ్ళి అయి అత్తగారింట్లో అడుగుపెట్టిన అమ్మాయికి రాజీ ఒక కీలక సూత్రం. అందునా ఇప్పటి ఆడపిల్లలు విద్యావంతులు, భర్తలతో సమానంగా సంపాదిస్తూ, ఆర్థిక స్వేచ్ఛను సాధించి తమ కాళ్ళపై తాము నిలబడ్డవారు. వారికి కొత్త కోడలిగా అందరినీ మెప్పించడం ఒక ప్రధాన అంశం. అందుకోసం కొంత అణకువ ప్రదర్శించడం అవసరమే.

కొత్తకోడలికి…
familyసంప్రదాయబద్ధంగా జరిగే వివాహమైనా, ప్రేమ వివాహమైనా అత్తింట్లో కొత్త కోడలి మనుగడ కత్తిమీద సామే. తాను పుట్టి పెరిగిన వాతావరణాన్ని వదిలి, కొత్త ఇంట్లోకి వచ్చిన ఆమె సర్దుకోవడానికి కొంత సమయం పడుతుంది. సర్దుబాటు అనివా ర్యం. ఎందుకంటే భవిష్యత్‌ జీవితమంతా గడిపేది అక్కడే. అందు కే మొదట్లో కాస్త రాజీ పడడం ద్వారా ఆ ఇంటివారితో సత్సంబంధాలను పెంచుకోవడమే కాదు గృహ వాతావరణం ఆహ్లాదభరితం చేసేందుకు దోహదపడుతుంది.కోడలు ఎంత చదువుకున్నా తన ముందు ఒదిగి ఉండాలనే కోరిక అత్తగారికి ఉంటుంది.చిన్న చిన్న పనుల ద్వారానే అత్తింటివారి మనసును దోచుకోవచ్చు.ఆధునికతను, సంప్రదాయాన్ని రెండింటిని సమతులం చేయగలిగిన వారు ఇంటిని స్వర్గధామంగా ఉంచుకోగలుగుతారు.

సమస్యలు ఎదురైనా..
కొన్ని సమస్యలు ఎదురైనా కొద్ది రోజులు సంప్రదాయబద్ధంగా ఉండటం ద్వారా వారి మనసును గెలుచుకొని అనంతరం దానిలోని సాధకబాధకాలను వివరిస్తే వారే దారిలోకి వచ్చేస్తారు. తన తల్లిదండ్రులను సంతోష పెట్టినందుకు భర్త కూడా ఎంతో ఆనందానికి లోనవుతాడు. తద్వారా భార్యభర్తల మధ్యే కాదు కుటుంబంలో బంధాలు పటిష్టమౌతాయి. ముఖ్యంగా ప్రేమ వివాహం చేసుకున్నవారు అత్తింట్లో మొదట్లో కొంత రాజీ ధోరణిని అవలంబించడం ద్వారా వారి ప్రేమకు కూడా పాత్రులు కావచ్చు.

మతాంతర వివాహం చేసుకున్నవారు…
ఇక మతాంతర వివాహం చేసుకున్నవారు మరిన్ని సమస్యలు ఎదుర్కొంటారు. ఊహ తెలిసినప్పటి నుంచి ఒక మతాన్ని అవలంబించి, వివాహం చేసుకున్న తరువాత వేరే మతాన్ని అనుసరించడం వారికి కొంత కష్టంగానే ఉం టుం ‚ది. అయితే కొన్ని పొందడానికి, మరికొన్ని త్యాగం చేయక తప్పదు. అత్తగారింటి పద్ధతులు కొన్నింటినైనా అనుసరించడం ద్వారా వారి మనసును గెలుచుకోవచ్చు. కొన్ని సార్లు వేషధారణను, చేస్తున్న పనిని కూడా మార్చుకోవలసి రావచ్చు. కుటుంబం ముఖ్యమనుకుంటే వాటిని కూడా మార్చుకోవలసి ఉంటుంది.

వాస్తవ జీవితానికి దగ్గరగా..
motherపెళ్ళికి ముందు ప్రతి ఆడపిల్లా తనను చేసుకోబోయే అబ్బాయి గురించి అనేక కలలు కంటుంది. కానీ ఊహ వేరు, వాస్తవం వేరు. అది అనుభవంలోకి వచ్చినప్పుడు కొంత ఇబ్బంది కలిగే మాట నిజమే. ఇక తాను పుట్టి పెరిగిన ఇంటిని, ప్రాంతాన్ని వదిలివెళ్ళే వారి పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. కొత్త మనుషులు, కొత్త ఇల్లు, ఊరు కాని ఊరు.స్నేహితులు ఉండరు. భాష రాదు. చాలా దయనీయమైన పరిస్థితే.అటువంటప్పుడు అత్తింటివారు మినహా పలకరించే దిక్కు ఉండదు. ఈ పరిస్థితుల్లో వారితోనే స్నేహం చేయడం ఉత్తమం.

స్నేహం ఓ మార్గం…
పెద్దవారితో ఎలా ప్రవర్తించాలా అన్న మీమాంస ఉంటే ముందుగా ఆ ఇంట్లో తమ వయసువారితో స్నేహం చేయడం ఒక మంచి ఉపాయం అవుతుంది. సహజంగానే ఒకే వయసువారి మధ్య స్నేహం వికసించడానికి ఎక్కువ సమయం పట్టదు. అలా ఆడపడుచులు లేదా మరుదులు ఎవరైనా సరే వారితో స్నేహం చేయడం ద్వారా అత్తగారితో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకోవడానికి మార్గాన్ని సుగమం చేసుకోవచ్చు.ఒంటరితనాన్ని, ఇతరత్రా సమస్యలను అధిగమించడం తేలిక అవుతుంది. అమ్మ సలహా తీసుకున్నట్టే అత్త సలహా తీసుకోవడం ద్వారా ఆమె విశ్వాసాన్ని చూరగొనవచ్చు.

రాజీ మంత్రం…
గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు ఇంట్లోని పెద్దలే అమ్మాయిని ఆ పరిస్థితులకు అనుగుణంగా మారేలా అన్నీ చెప్పేవారు. కానీ ప్రస్తుతం అన్నీ న్యూక్లియర్‌ కుటుంబాలు కావడంతో వివాహానికి ఆడపిల్లను సంసిద్ధం చేయడం ఒక పెద్ద సవాలుగా మారుతున్నది. గతంలో వివాహానికి సంబంధించిన ఇబ్బందులు వచ్చినా కౌన్సెలర్ల వద్దకు కాక ఇంటి పెద్దల వద్దకు వెళ్ళేవారు. ఇప్పుడు కాలం మారింది. అయితే మారనిది ఒకటే �రాజీ�. సంతోషకరమైన జీవితానికి ఇదొక గొప్ప సూత్రం.

Surya Telugu Daily

డిసెంబర్ 16, 2010 Posted by | అతివల కోసం | వ్యాఖ్యానించండి

వైకుంఠ ద్వారాలు తెరుచుకునే పుణ్య ఏకాదశి

వైకుంఠ ద్వారాలు తెరుచుకునే పుణ్య ఏకాదశి

ఏకాదశ్యాం నిరాహారో భూత్వాహమపర్వేహని
భోక్ష్యామి పుండరీకాక్షశరణంమేభవాభ్యుత

ananthapadmanabhaధనుర్మాసంలో వచ్చే ఈ ఏకాదశి పవిత్రమైనది. ఈ ఏకాదశి రోజున విష్ణురాధన ప్రాముఖ్యం చెప్పబడింది. విష్ణుమూర్తికి ప్రీతికరమూనది. ఏకాదశులలో ఈ ఏకాదశి అత్యంత ప్రధానమైనది. మరియు ఈ రోజున వైకుంఠ ద్వారాలు తెరుచుకొనే రోజుగా భావిస్తాము.
కోణస్థ ః పింగిళోబభ్రు ః కృష్ణోశాద్రోంతకాయమః
శౌర ః శనైశ్చరో మంద ః పిప్పలాదేనసంస్తుతః
నమస్తే కోణిసంస్థాయపింగళాయ నమోస్తుతే
నమస్తేయిభ్రుశూపాయ కృస్ణాయజనమోస్తుతే
నమస్తే శాద్రదేహాయ నమస్తే చాంతకాయచ
నమస్తేమమే సంజ్ఞాయ నమస్తే సౌరమేవిభో
నమస్తే మంద సంజ్ఞాయ శనైశ్చరనమోస్తుతే
ప్రసాదం మమదేశదేనస్వప్రణతిస్వజ

అధరం మధురం వందనం మధురం నయనం మధురం హసితం మధురం
హృదయంమధురం గమనం మధురం మధురాదిపతే శఖిలం మమరమ్‌

శ్రీమహా విష్ణువుకు అత్యంత ప్రీతికరమైన ఈ వైకుంఠ ఏకాదశిరోజున వేయినేలతో వీక్షించి సేవించి తరించి పోవాలని మూడు కోట్ల మంది దేవతలు వైకుంఠము నకు చేరుకునే పుణ్యప్రదమైన రోజు.కనుకనే ఏకాదశి ప్రాముఖ్యతలో రెండు కథలు చెప్పబడినవి. మొదటగా ఈ రోజు విష్ణు సహ్యస్త్యపారాయణము నారాయణార్చన విశేషఫలప్రధమైనది. భోగముగలది భోగి విష్ణు చిత్తు నికుమార్తె అయిన శ్రీగోదాదేవి (ఆండాల) శ్రీరంగనాధు ని వరించి తరించిన భూలక్ష్మి స్వామిని అలంకరించా ల్సిన పూలమాలను తానూ ధరించి వాటి సౌందర్యానికి మురిసి ఆ తరువాత భగవంతునికి అలంకరించేది. శ్రీ మన్నారాయణుని పతిగా కోరి ధనుర్మాస వ్రతం ఆచరిం చి ఆ స్వామి అనుగ్రహాన్ని పొందినది.

వ్రత పరి సమాప్తి జరిగిన రోజుఈ ఏకాదశికి ఇంకొక కథ చెప్ప బడినది. ఈ వైకుంఠ ఏకాదశినే పుత్రధ ఏకాదశి అని కూడా అంటారు.పూర్వం �సుకేతుడు� అను మహారాజు భద్రావతి అను రాజ్యాన్ని ప్రజాభీష్టాలను తరచూ గమనిస్తూ వారి పరి పాలన ఎల్లప్పుడూ గుర్తుండేలా ప్రజలను సర్వసౌఖ్యా లను కల్గిస్తూ ప్రజల మన్ననలను పొందుతూ ఉండే వారు. అట్టి మహారాజు భార్య �చంపక� ఆమె అం తటి మహారాణి అయినా గృహస్థ ధర్మాన్ని స్వయంగా చక్కగా నిర్వహిస్తూ గౌరవిస్తూ, భర్తను పూజిస్తూ వ్రతా లు చేస్తూ ఉండేది. మహారాజు కూడా ఆమెను ఎంతో ప్రోత్సహించేవారు. అట్టి అన్యోన్య పుణ్యదంపతులకు మాత్రం పుత్ర సౌభాగ్యం కరువై అదే వారి జీవితాలకి తీరని లోటుగా మారింది. ఒక నది తీరంలో కొందరు మహార్షులు తపస్సు చేసుకుంటున్నారని వార్త మహర్షికి తెలిసింది. వెంటనే ఆ మహర్షులను దర్శించి పుత్రభిక్ష పెట్టమని ప్రార్థించాడు.

మహర్షులు మహారాజు వేదనను గ్రహించి �ఓ రాజా మేము విశ్వజీవులము. మీకు పుత్ర సంతాన భాగ్యం తప్పక కలుగుతుంద�ని ఆదిత్య తేజోమూర్తులు దీవిస్తూ నేడు సరిగా వైకుంఠ ఏకాదశి (పుత్రదేకాదశి) నీవు, నీ భార్యతో ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన యెడల మీ మనోభీష్టము తప్పక నెరవేరుతుంది� అని చెప్పారు. అనంతరం వ్రతము ఆచరించు విధానము కూడా చెప్పి అదృష్యమయారు. సంతోషముతో మహారాజు నగరా నికి చేరుకుని నదీ తీరములో జరిగిన వృత్తాంతమంతా తన భార్య చంపకాదేవితో చెప్తాడు.

అనంతరం వారి రువురు కలిసి భక్తిశ్రద్దలతో శ్రీ లక్ష్మీ నారాయణులను పార్వతీ పరమేశ్వరులను పూజించి ఉపవాసజాగర ణలతో భగవన్నామ సం ీర్తనలతో మహర్షులు ఉపదే శించిన విధముగా �ఏకాదశీ� వ్రతాన్ని పూర్తిచేస్తారు. కొంత కాలమునకు �హరిహరా యల� కృపాకటాక్షము లతో కులవర్ణనుడైన కుమా రుడు జన్మిస్తాడు. ఆ పిల్లవాడు క్షుక్లపక్ష చంద్రునివలె దినదిన ప్రవర్థమానమ గుచూ సత్‌శీలముతో విద్యాబుద్దులు నేర్చుకుని యవ్వ నమురాగానే తల్లిదండ్రుల అభీష్ట ముపై మహారాజై ప్రజారం జకముగా పాలిస్తూ వివరిస్తూ ప్రజల అందరి చేత ఈ వ్రతాన్ని చేయిస్తాడు. ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఆ స్వామి మహిమానిత్వాని మనందరికీ కలు గాలని మనమంతా భక్తిశ్రద్దలతో ఆ లక్ష్మీ నారాయ ణులను ప్రార్థించి స్వామి కృపాకుపాత్రులవు దాము. �లోకా సంస్తసుకినో భవంతు� ఓం శాంతి శాంతి శాంతి!
– సిద్దాంతి డా.వి.జి.శర్మ.

Surya Telugu Daily

డిసెంబర్ 16, 2010 Posted by | భక్తి | 1 వ్యాఖ్య

ప్రపంచ సాహిత్యం తెలుగులో…

ప్రపంచ సాహిత్యం తెలుగులో…

ఒక జాతి మనుగడకు భాష అవసరం. భాషలేకుండా బతకడం అసంభవం. ఆ భాష సజీవంగా కొనసాగాలన్నా నిరంతరం దాని గురించి అధ్యయనం జరగాలి. అవసరాన్ని విస్తృత పరచాలి.భాష వినియోగం పెరగాలి. ఎవరికైనా విషయం మాతృభాషలోనే సులువుగా అర్థం అవుతుంది.సమగ్రంగా ఆకళింపుచేసుకొని, అవగాహనపరుచుకోవటానికి వీలవుతుంది. తెలుగు భాషను సజీవంగా ఉంచడం కోసం అనాదిగా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. వీటిలో పీకాక్‌ క్లాసిక్స్‌ వారు చేస్తున్నది అద్వితీయమైనది.ప్రపంచ సాహిత్యాన్ని తెలుగు భాషలోకి తీసుకురావాలన్న వారి ధ్యేయం గొప్పది.విశ్వవిద్యాలయాలు చేయాల్సిన పనిని వీరు తమ భుజస్కంధాలపెై మోస్తున్నారు. ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి వంద పుస్తకాలకు పెైగా తీసుకొచ్చారు. తెలుగు భాషా ప్రేమికులంతా ఈ ప్రయత్నంలో భాగస్వామ్యులు కావాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.

Mullaప్రపంచంలోని జ్ఞాన సంపదనంతటినీ తెలుగులోకి తెచ్చుకోవాలన్న తపనే పీకాక్‌ క్లాసిక్స్‌ ఆవిర్భావానికి మూలం. పీపుల్స్‌ ట్రస్ట్‌ ప్రచురణ విభాగమే పీకాక్‌ క్లాసిక్స్‌. ప్రపంచ సాహిత్యంలో ఆణిముత్యాలు కొన్ని ఇంతకు ముందు తెలుగులోకి వచ్చాయి.స్వాతంత్య్రానికి కొంచెం ముందు ప్రారంభమై స్వాతంత్య్రం తర్వాత రెండు మూడు దశాబ్దాల పాటు ఈ క్రమం కొనసాగింది.ఎందుకో అది అక్కడ ఆగిపోయింది. ఆ దశలో నవలాలోకంలో క్లాసిక్స్‌ అనదగినవి అనేకం అనువాదమయ్యాయి. అయితే అప్పుడుగానీ, తర్వాతగానీ శాస్త్ర రంగాల్లోని మౌలిక గ్రంథాలను తెలుగులోకి తెచ్చుకునే ప్రయత్నం ఎన్నడూ సంపూర్ణంగా జరగనేలేదు.అడపదడపా అక్కడో పుస్తకం ఇక్కడో పుస్తకం రాలేదని కాదు. ఆ పని ఒక యజ్ఞంలా మాత్రం సాగలేదు. ఇప్పుడా యజ్ఞాన్ని పీకాక్‌ క్లాసిక్స్‌ చేస్తోంది.

ఇంగ్లీష్‌ వ్యామోహం…
ఇంగ్లీష్‌ భాష బాగా నేర్చుకుంటే తప్ప ఎవరెైనా మేధా సంపన్నులు కాలేని పరిస్థితి మన దేశంలో నెలకొని ఉంది. ఈ వింత పరిస్థితి ఒక జర్మన్‌కు లేదు. ఒక రష్యన్‌కు లేదు. ఒక ఫ్రెంచి వాడికి లేదు. నార్వేని చూడండి. చిన్నదేశం. దాని జనాభా మన హైదరాబాద్‌ జనాభా అంత ఉంటుందేమో. ఒక నార్వేనియన్‌ ఆడమ్‌స్మిత్‌ని చదవా లనుకుంటే ఇంగ్లీషు నేర్చుకొని తీరాలని లేదు. టాల్‌స్టాయ్‌ని చదవడానికి రష్యన్‌ అక్కర్లేదు. ప్లేటోని చదవాలంటే గ్రీకు నేర్చుకోనక్కర్లేదు.

మార్క్‌‌సని చదవా లంటే జర్మన్‌ రానక్కర్లేదు. రామాయణం చదవడానికి సంస్కృతం అవసరం లేదు. తన మాతృభాషలోనే ఈ గ్రంథాల్ని చదువుకోగలడు నార్వేనియన్‌. అరకోటికి మించిన నార్వే ప్రజలు ఇతర భాషల్లో ఉన్న అమూల్య గ్రంథాలన్నింటినీ తమ భాషలోకి తెచ్చుకోవడం అవసరమని భావించారు.అందుకునే ఆ పనిని వారు సాధించుకున్నారు. మరి 8 కోట్ల మంది తెలుగువారికి అటువంటి అవసరం ఉండదా? ఉంటుంది కాబట్టే ఈ అవసరం కోసం నడుంబిగించింది పీకాక్‌ క్లాసిక్స్‌.

ఏయే పుస్తకాలు?
chiti-rajaప్రాచీన నాగరికతలున్న భారత్‌, చెైనా, గ్రీసు, ఈజిప్ట్‌ తదితర దేశాల ప్రాచీన గ్రంథాలు.. యూరపులో పునర్వికాసోద్యమ కాలంలో వచ్చిన మహాగ్రంథాలు… ప్రపం చాన్ని దాదాపు ఒకటిన్నర శతాబ్ధంగా తన ప్రభావంలో ముంచెత్తుతున్న మార్క్సిస్టు మౌలిక గ్రంథాలు..సమకాలీన సామాజిక, ఆర్థిక, తాత్విక, శాస్త్ర రంగాల్లో వెలువడిన ఆణి ముత్యాలు.వీటన్నింటినీ తెలుగులోకి తీసుకువస్తున్నట్టు పీకాక్‌ క్లాసిక్స్‌ ఎడిటర్‌ అన్నపనేని గాంధీ అన్నారు.వీటిని తెలుగులోకి తీసుకురావడంలో ఎన్నో సాధక బాధకాలు న్నాయన్నారు.

ఒక పుస్తకాన్ని ఎంపిక చేయడం మొదలు కొని దానిని పాఠకుని దగ్గరకు చేర్చేవరకూ మధ్యలో ఎన్నో దశలు, ఇబ్బందులు, సమస్యలున్నాయని పేర్కొ న్నారు. అయినా తాము ఎంతో మొండిగా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ ఈ పనిని నిర్విఘ్నంగా చేపడుతున్నామని తెలిపారు. ఇప్పటివరకు ప్రచురించిన పుస్తకాల పూర్తి వివరాలకు ఫోన్‌ నెంబర్లు 040-23890328, 9010204633 సంప్రదించాలని ఆయన కోరారు.

తెలుగులో…
వాల్మీకి, వ్యాసుడు, హోమర్‌, ప్లేటో, అరిస్టాటిల్‌, విష్ణుశర్మ, ఈసపు, స్మితో, రికార్డో, గెలీలియో, ఐన్‌స్టీన్‌, హాకింగ్‌, వాల్టెయిర్‌, రూసో, హాబ్స్‌, లాక్‌, మోర్గాన్‌, డార్విన్‌, మార్క్‌‌స, ఏంజిల్స్‌, కీన్స్‌, టాల్‌స్టాయ్‌, గెథే, ఫ్రాయిడ్‌, వెైల్డ్‌, గుణాఢ్యుడు, కోశాంబి, అమార్త్యసేన్‌, తిక్కన, పోతన…వంటి హేమాహేమీల రచనలన్నింటినీ పీకాక్‌ క్లాసిక్స్‌ తెలుగులో తీసుకువచ్చింది.

Surya Telugu Daily

డిసెంబర్ 15, 2010 Posted by | సంస్కృతి | | 3 వ్యాఖ్యలు

జైన సంస్కృతి చిహ్నం.. బాహుబలి

జైన సంస్కృతి చిహ్నం.. బాహుబలి

Bahubaliమనదేశం భిన్నమతాలకు ఆలవాలం హైందవ, ముస్లిం, క్రైస్తవ, సిక్కు, జైన, బౌద్ధ సంస్కృతులు ఈ నేలలో ఫరిఢవిల్లాయి. చారిత్రక కట్టడాల రూపంలో సంస్కృతుల చిహ్నాలు… దేశవ్యాప్తంగా నేడు ప్రసిద్ధ పర్యాటక కేంద్రాలుగా వెలుగొందుతున్నాయి. వందల, వేల ఏళ్ళనాడే భారతావనిలో జైన మతం విశేష ప్రాచుర్యం పొందింది. ముఖ్యంగా రాజస్థాన్‌, కర్ణాటక రాష్ట్రాల్లో అనేక దేవాలయాలు, సంస్కృతి చిహ్నాలు మనకు దర్శనమిస్తాయి. అలాంటి వాటిలో పేరెన్నికగన్నదే ‘శ్రావణ బెళగొళ’… దేశంలోనే పెద్దదైన ‘బాహుబలి’ విగ్రహం ఇక్కడి ప్రధాన ఆకర్షణ. జైన సంస్కృతీ సంపదను కళ్ళకు కడుతున్న కర్ణాటకలోని ‘శ్రావణ బెళగొళ’ విశేషాలు… ఈ వారం ‘విహారి’లో…

రెండు కొండల మధ్య ప్రృతి సిద్దంగా ఏర్పడిన సరోవరమే బెళగొళ కన్న డంలో బెళ్ళి అంటే తెల్లని అని, గొళ అంటే నీటిగుండం అని అర్థం. జైన సంప్రదాయం ప్రకారం సంసార జీవితాన్ని త్యజించి సన్యాసాశ్రమం స్వీకరించిన వారిలో అత్యంత పూజనీయులైన వారిని శ్రమణులు అంటారు. అలాంటి శ్రమ ణులు చాలామంది ధ్యానంలో శేషజీవితం గడిపి నిర్యాణం పొందడానికి ఈ కొం డలలో, పరిసర ప్రాంతాలలో నివసించారు. శ్రమణులు ఉన్న ప్రదేశం కాబట్టి ఈ బెళగొళను ‘శ్రమణ బెళగొళ’ అనేవారు. క్రమంగా ‘శ్రావణ బెళగొళ’గా మారిం ది. స్థానికులు ‘బెళగొళ’ అనే పిలుస్తారు. చంద్రగిరి, ఇంద్రగిరి కొండల మధ్య ఉన్న బెళగొళను చుడడానికి దేశం నలుమూలల నుండి పర్యాటకులు వస్తారు.

భారీ గోమఠేశ్వరుడు…

Bahuఇక్కడ ఉన్న 58 అడుగుల బాహుబలి (గోమఠేశ్వరుడు) విగ్రహం దేశంలోని జైన తీర్థంకరుల, శ్రమణుల విగ్రహాలన్నింటిలోకి పెద్దది. క్రీశ 983వ సం వత్సరంలో చాముండరాయ అనే మంత్రి గోమఠేశ్వరుని విగ్రహాన్ని ఇంద్రగిరి పర్వతంపై చెక్కించినట్లు చారిత్రక కథనం. దీనికే గోమఠేశ్వరుని ఆలయంగా వాడుక. ఇక్కడ ఆలయం కట్టడం, విగ్రహాన్ని ప్రతిష్టించడం జరగలేదు. కొండ చివరి భాగంలో విగ్రహం మలిచారు. బాహుబలిగా పిలిచే గోమఠేశ్వరుని విగ్ర హాన్ని చెక్కడంలో శిల్పి అర్త్సమేణి కనబరచిన నైపుణ్యం స్వయంగా చూడాల్సిం దే. ధ్యానంలో బాహుబలి ముఖం ప్రశాంతతకు చిహ్నంగా, సర్వం త్యజించిన వ్యక్తి ముఖంలో కనిపించే నిర్వేదాన్ని చక్కగా మలిచారు. ద్యానంలో శిలగా మారిన మనిషి చుట్టూ చెట్లు అల్లుకుపోయినట్లు బాహుబలి భుజాల చుట్టూ చెట్ల తీగలు, ఆకులను అద్భుతంగా చెక్కారు. విగ్రహం కాలిగోళ్ళు వాటి చుట్టూ ఉండే చర్మం గీతలు సహజంగా ఉన్నట్లు చాలా స్పష్టంగా చెక్కారు. మనం విగ్రహం దగ్గర నిలబడితే బాహు బలి పాదం ఎత్తుకు సరిపోతాం.

కనులకు విందు… మస్తకాభిషేకం…

12 ఏళ్ళకొకసారి జరిగే మహామస్తకాభిషేకం సందర్భంగా భక్తులు అభిషే కం చేసేటప్పుడు కింద నిలబడి పాదాలను మాత్రమే అభిషేకించగలం. గోమఠేశ్వరునికి క్యాన్ల కొద్దీ పలు, తేనె, పెరుగు, అన్నం, కొబ్బరి పాలు, నెయ్యి, చక్కెర, బాదం పప్పు, కుంకుమ పువ్వు, నాణేలు, పసుపు, డ్రైఫ్రూ ట్స్‌, పండ్లతో విగ్రహం మొత్తం తడిసేదాకా అభిషేకం చేస్తారు. పూజారులు విగ్రహం పై నుండి అభిషేకం చేయడానికి వీలుగా స్ట్రక్చర్‌ కడతారు. దీని మీదకు వెళ్ళి అభిషే కం తంతు పూర్తి చేస్తారు. పర్యాటకులకు మహామస్తకాభి షేకం సమ యంలో చూడటం కంటే మామూలు రోజుల్లో వెళ్ళడమే అనువుగా ఉంటుంది. ఈ ఆల యం కొండమీద ఉం టుంది. ఈ కొండ ఎక్కువ ఎత్తు లేకపోయి నా ఎక్కడం కొంచెం కష్ట మే. మెట్లు ఎత్తుగా ఉండడంతో యువకులు కూడా మధ్యలో విశ్రాంతి తీసుకుంటూ ఎక్కుతారు. మొత్తం మీద పదిహేను-ఇరవై నిమిషాల తరువాత కొండపైకి చేరుకుంటారు….

బాహుబలి చరిత్ర…

Jain_Inscriptగోమఠేశ్వరుడు జైనమతం అవలంభించి ధ్యానముద్రలోకి వెళ్ళడానికి ఒక కథ వాడుకలో ఉంది. బాహుబలిగా పిలిచే గోమఠేశ్వరుడు ఋషబుని కుమారుడు (రామాయణంలో శ్రీరాముని వంశానికి మూల పురుషుడు ఋషబుడని ఉంది.) ఇతడికి ఇద్దరు భార్యలు. రాజ్యాన్ని పిల్లలందరికీ సమానంగా పంచాడు. పెద్ద భార్య పెద్ద కొడుకు భరతునికి రాజదాని కోసల పట్టణాన్ని అప్పగించి మిగిలిన కొడుకుల రాజ్యభారం బాధ్యత కూడా అప్పగించాడు. భరతునికి రాజ్యాన్ని విస్తరించాలన్న కోరిక కలిగింది. తమ్ముళ్ళందరిపై దండయాత్ర చేశాడు. బాహుబలి మినహా అందరూ రాజ్యాన్ని భరతుని వశం చేసి తపస్సు చేసుకోవడానికి తండ్రి వద్దకు వెళ్ళిపోయారు. అన్న దురాక్రమణ సహించలేని బాహుబలి భరతుని ఎదిరిస్తాడు. స్వతహాగా శాంతికాముకుడైన బాహుబలి యుద్దంలో అనవసరమైన ప్రాణనష్టాన్ని వద్దని ద్వంద్వ యుద్దం చేసి గెలుస్తాడు. భరతుడిని చేతులతో పైకెత్తి నేలకు కొట్టబోయి, అంతలోనే పునరాలోచనలో పడతాడు. ఇహపరమైన సుఖాల కోసం పాపపు పనులు చేయడం ఎందుకని భరతుని వదిలివేసి, రాజ్యాన్ని అతడికే అప్పగించి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతాడు. ఇంద్రగిరి కొండపై బాహుబలి తపస్సు చేసి మోక్షం పొందిన ప్రాంతంలోనే దేవాలయ నిర్మాణం జరిగినట్లు భావిస్తారు.

జైన విశిష్టత…

Belagola మన దేశంలో బౌద్దజైన మతాలు రెండూ దాదాపుగా ఒకే సమయంలో ప్రాచుర్యంలోకి వచ్చినప్పటికీ బౌద్దం వ్యాపి చెందినంతగా జైనం విస్తృతం కాలేదు. జైన మతంలో సన్యాసులు పాటించిన నియమాలు మరీ కష్టమైనవి కావడంతో దీన్ని ఆచరించడానికి ఎక్కువ మంది ముందుకు రాలేదు. కఠిన నియమాల కారణంగానే శ్వేతాంబరులు, దిగంబరులు అని రెండు వర్గాలుగా విడిపోయారు. శ్వేతాంబరులు ఉత్తర భారతదేశంలో కొన్ని చోట్ల ఉన్నారు. వీరు సంసార జీవితం కొనసాగిస్తారు. దిగంబరులు సన్యాసులు. వీరు దైవ చింతనలో ఉంటూ శరీరాన్ని ృశింప చేసి నిర్యాణం పొందే దీక్షలో ఉంటారు.

అంతా శాసనాలమయం…

బాహుబలి విగ్రహం తర్వాత ఇక్కడ చూడాల్సిన ప్రాంతాలన్నీ దాదాపుగా జైనమత ప్రాధాన్యం ఉన్నవే. జైన తీర్థంకరుల దేవాలయాలు ఉన్నాయి. వీటిలో చంద్రగిరి పర్వతం మీద అశోకుడు నిర్మించినట్లు నిర్మించినట్లు చెబుతున్న చంద్రగుప్త బస్తీ ముఖ్యమైనది. ఇందులో సెమీ ప్రిషియస్‌ స్టోన్స్‌ పొదిగి అద్భుతంగా చెక్కిన ఎనిమిది విగ్రహాలు పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటాయి. ఇక్కడ ఉన్నన్ని శాసనాలు మన దేశంలో మరే ప్రాంతంలోనూ లేవు. చరిత్ర పరిశోధకులు 523 శాసనాలను గుర్తించారు. ఇందులో చిన్న కొండ మీద 271,ె పద్ద కొండ మీద 172, 80 శాసనాలు బెళగొళలో, మరో 50 బెళగొళ పరిసర గ్రామాల్లో ఉన్నాయి. ఇవన్ని కూడా క్రీశ 600-19వ శతాబ్దం మధ్యనాటివే. లెక్కకు మించిన శాసనాలే కాక లెక్కలేనన్ని దేవాలయాలు కూడా ఇక్కడ ఉన్నాయి. జైనతీర్థాంకురుల స్మృతి చిహ్నాలుగా పర్యాకులను ఆకర్షిస్తాయి.

ఇలా వెళ్లాలి…

శ్రావణ బెళగొళ కర్నాటక రాష్ట్రం హసన్‌ జిల్లాలో ఉంది.బెంగుళూరుకు పశ్చిమంగా 146కి.మీ.దూరంలో ఉన్న ఈ ప్రదేశానికి 11కి.మీ.దూరంలో ఉన్న చెన్నరాయ పట్టణం ప్రధాన కేంద్రం. ఇక్కడికి అన్ని ముఖ్యమైన పట్టణాలను కలుపుతూ రవాణా సౌకర్యాలు ఉన్నాయి. బెంగుళూరు-మంగుళూరు హైవే రూట్‌లో వస్తుంది. రైల్వే ద్వారా చేరాలంటే హసన్‌ రైల్వే స్టేషన్‌లో దిగి రోడ్డు మార్గం గుండా ప్రయాణించాలి. ఇక విమానయానం ద్వారా వచ్చే ప్రయాణీకులు బెంగుళూరు ఎయిర్‌పోర్ట్‌లో దిగి రోడ్డు మార్గం ద్వారా చేరాలి. యాత్రికులు బెళగొళలో పర్యటించడానికి అవసరమైన సమగ్ర సమాచారం కోసం ఇక్కడ ఉన్న జైనమఠం అడ్రస్‌లో సంప్రదించవచ్చు.

Surya Telugu Daily

డిసెంబర్ 14, 2010 Posted by | చూసొద్దాం | , , , | 1 వ్యాఖ్య

కుషన్లతో ఇంటికి శోభ

కుషన్లతో ఇంటికి శోభ
ఇంట్లో ప్రతి వస్తువు ఒక ప్రత్యేకతను కలిగి ఉంటుంది. మొక్కలు మొదలుకొని ఇంట్లోని ఫ్లవర్‌ వాజ్‌, టీపాయ్‌, కర్టెన్లు, కుషన్‌ కవర్లది ప్రముఖ పాత్ర. వీటన్నింటికీ చక్కని అలంకరణ తోడయితే మీ హాల్‌ రూమ్‌ మరింత అందంగా కనిపిస్తుంది. హాల్‌లో ముఖ్యంగా సోఫా, దివాన్‌, కుషన్‌లు ముఖ్యపాత్రను పోషిస్తాయి.

Cushionsకుషన్‌ కవర్లు మీ డ్రాయింగ్‌ రూములో మరింత ఆహ్లాదాన్ని అందిస్తాయి. అయితే కుషన్లలో చాలా రకాలు ఉన్నాయి. ఇందులో సోఫా కుషన్‌ కవర్లు, సిల్‌‌క కుషన్‌ వర్లు, కాటన్‌ కుషన్‌ కవర్లు, ఎంబ్రాయిడరీ చేయబడినవి, డెకోరేటివ్‌ కుషన్‌ కవర్లు, లెదర్‌ కుషన్లు, అవుట్‌డోర్‌ ఫర్నీచర్‌ కుషన్స్‌, ఇండియన్‌ కుషన్‌ కవర్లు, ఛైర్‌ కుషనుల, లెదర్‌ కుషన్లు, సిల్‌‌క కుషన్లు, ప్యాచ్‌వర్క్‌, పింటక్‌ కుషన్లు, డై కుషన్లు, ఇలా బోలెడన్నీ రకాలు. ఇందులో మీకు నచ్చినవి ఎన్నుకొని మీ ఇంటికి మరింత అందంగా తీర్చిదిద్దుకోండి…

సిల్‌‌క కుషన్స్‌
ఉత్తమ నాణ్యతగల ఫ్యాబ్రిక్‌ మీద కలర్‌ఫుల్‌ డిజైన్‌లను ప్రింట్‌ చేసి ఉన్న ఈ సిల్‌‌క కుషన్స్‌ లివింగ్‌ రూమ్‌ లేదా, బెడ్‌ రూముల్లో అమర్చ వచ్చు. వీటి ధర కూడా తక్కువే.

డై కుషన్స్‌
ప్రత్యేక పద్ధతిలో డై చేయబడ్డ కుషన్‌ కవర్లను కార్యాలయాల్లో వాడితే మరింత హుందా త నాన్ని ప్రతిబింబిస్తాయి. సిల్‌‌క క్లాత్‌పై వెరైటీ కలర్స్‌, ప్యాటర్న్స్‌, డిజైన్లు ఎన్నో మార్కెట్లో అందుబాటులో ఉ న్నాయి. డై కుషన్స్‌ ఎక్కువగా కాటన్‌, సిల్‌‌క, ట ిష్యూ, ఆర్గంగా ఫ్యాబ్రిక్‌లలో కనిపిస్తాయి.

ఎంబ్రాయిడర్‌ కుషన్స్
అందమైన డిజైన్లను కు షన్లపై అల్లికలు వేసిన ఎంబ్రాయిడరీ కుషన్లు ఎలాం టి సమయ సందర్భాల్లోనైనా వాడవచ్చు. అద్భుత మైన ఎంబ్రాయిడరీ వర్క్‌ను అందిస్తున్న ప్రత్యేక సంస్థ లు కూడా ఉన్నాయి.

ఫ్యాన్సీ కుషన్స్‌
చూడాటానికి భారీ ప్రింట్‌ తో కనిపించే ఈ కుషన్లు ఫ్యాన్సీగా ఉంటాయి. ఎక్కువగా ఈ రకాలు విఐపీ హాలులో, కాన్ఫరెన్స్‌ హాలులో వాడతారు. రాజస్థానీ ప్యాచ్‌ వర్క్‌, గుజరాతీ సంప్రదాయ రంగుల మేళవింపుతో కనిపించే ఈ ఫ్యాన్సీ కుషన్‌ కవర్లు పార్టీలు, ఫంక్షన్‌లు, పెళ్ళిళ్లకు ఉపయోకరంగా ఉంటాయి.

లెదర్‌ కుషన్స్‌
స్పష్టమైన గ్రాఫిక్స్‌ ప్రింట్‌ను కలి గిన ఈ లెదర్‌ కుషన్‌ కవర్లు లేటెస్ట్‌గా వచ్చాయి. మీ ఇంటి ఇంటీరియర్‌కు కొత్త స్టైల్‌ను తీసుకు వస్తాయి. స్టేన్‌ ప్రూఫ్‌తో ఉన్న ఈ లెదర్‌ కుషన్‌లు హై- డ్యూరబుల్‌గా ఉంటాయి.

ప్యాచ్‌వర్క్‌ కుషన్స్‌
ఆహ్లాకరమైన రంగులను కాంట్రాస్ట్‌లో ఉపయోగించిన ఫైన్‌ ఫ్యాబ్రిక్‌ మీద ముద్రించే ఈ మల్టిపుల్‌ ప్యాచ్‌వర్క్‌ కుషన్‌లు వివిధ సైజుల్లో, డిజైన్లలో పలు రంగుల కాంబినేషన్‌లో మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.

పింటక్‌ కుషన్స్‌
క్లాస్‌లుక్‌తో స్టైల్‌, ఎలిగెన్స్‌ను అందించే ఈ సిల్‌‌క కుషన్‌ కవర్లు డైమండ్‌, స్వైర్‌ ఆకారంలో అందుబాటులో ఉన్నాయి. మీ గదికి ఈ పింటక్‌ కుషన్‌లు డీసెంట్‌ లుక్‌ను అందిస్తాయి.

Surya Telugu Daily

డిసెంబర్ 13, 2010 Posted by | అతివల కోసం | 2 వ్యాఖ్యలు

తెలుగమ్మల జోల

తెలుగమ్మల జోల

కమ్మని కవితల హేల

జోలపాటలు, లాలి పాటలు మన సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పడతాయ. ఒక తల్లి తన శిశువుకు జోల పాడుతూ సాటిలేని అందచందాల బంగారపు బొమ్మ. అని భావిస్తూ పాప పుట్టుక బంగరు కొడవళ్ళతో కొయ్యాల్సిన బంగారపు పంటగా అభివర్ణిస్తుంది. ఇంత భావ సౌందర్యము, ధ్వని గాంభీర్యము ఉన్నాయి. ఈ రెండు పంక్తుల జోల చరణంలో…
‘ఊళ్ళోకి ఉయ్యాల లమ్మవచ్చినవి
కొడుకు, కూతుళ్ళ తల్లి! కొనవె ఉయ్యాల’
ఇద్దరు అప్పజెల్లెళ్ళు మాట్లాడుకుంటున్నట్టుగా ఈ జోల చరణం. ‘మన ఊళ్ళో ఉయ్యాల మంచాలు అమ్మేవాడు వచ్చాడు. నీకు కొడుకులు, కూతుళ్ళు ఉన్నారు. ఒక ఉయ్యాల కొనుక్కోరాదుటే?’ అన్నది ఒక చెల్లెలు తన అక్కతో. ‘కొనుక్కోవాలనే ఉన్నది ఒక వెండి ఉయ్యాల. కానీ ఏమిచ్చి కొనమంటావు?’ అని అడిగింది అక్క. ‘వెండిదే మిటే? ఏకంగా బంగారందే కొనవే. మనకు మంచి పాడి సంపద ఉన్నది. పాలుపోసి కొను’ అన్నది. ఈ పాట పుట్టిన కొన్ని శతాబ్దాల కిందట వస్తు మారకపు పద్ధతి ఉండేది.
మరో తల్లి ఏడవకు ఏడవకు ఇటుల నా తండ్రి!
ఏడిస్తె నీ కళ్ళు నీలాలు కారు
నీలాలు కారితే నే జూడలేను
పాలైన కార్చరా బంగారు కనుల అని
తల్లడిల్లి పోతోంది తల్లి. ‘ఏడవకురా నాన్నా! నీవు ఏడుస్తుంటే నీ కళ్ళంబడి నల్లనల్లగా కన్నీళ్ళు వస్తున్నాయి’. నీలము అంటే నలుపు. అంతేకాదు. విషము అనే అర్థం గూడా వుంది. ‘నీవు కార్చే కన్నీరు నాకు విషపుధార చూసినంత భయం పుట్టిస్తోంది. పసిపిల్లలకు కాటుక పెడతారు. అందుచేత కన్నీరు నల్లగా కారటం కూడా సహజమే.
‘ఆ నల్లని కన్నీరు చూచి భరించలేను గనుక నీ బంగారు కనులలోంచి పాలను స్రవించరా నాన్నా’ అంటున్నది ఆ అమ్మ.
‘చిట్టి ముత్యం పుట్టె సీత గర్భాన
స్వాతి వానలు గురిసె సంద్రాల మీద’ – ఒక నిర్మాలాంతఃకరణపు ఇల్లాలి భావన ఇది. బంగారుతల్లి అయిన సీతాదేవి కడుపున ఒక బాబు పుట్టాడు. ఆ శుభ సంఘటన ప్రభావంగా మరెన్నో శుభ సంఘటనలు జరిగాయట. సముద్రాలమీద స్వాతిచినుకులు పడ్డాయట. స్వాతి చినుకులు ముత్యపు చిప్పల్లో పడి ముత్యాలవుతాయి. అంటే సీత కడుపు పండటం చూసిన ప్రకృతిమాత పులకించి పరమానంద భరితురాలై మరెన్నో ముత్యాలను ప్రసవించింది అని ఒక మధురాతి మధుర మహోదాత్త ఊహ. ఒక దీపం వెలిగితే దానితో చాలా దీపాలు వెలుగుతాయి. అనే ఒక సార్వకాలిక సమాహ్లాద సంభరిత వాస్తవికతకు ఇదొక ప్రతిబింబ.
‘హాయి – ఓయు ఆపదల గాయి’ అని చాలా జోలపాటలకు ఆరంభ చరణంగా వుంటుంది. ఈ హాయి, ఓయి అనే వాటికి స్ర్తి రూపభావ వ్యక్తిత్వాలను ప్రతిక్షేపించుకుంటే – లేక ఆపాదిస్తే (పర్సానిఫికేషన్) ‘హాయమ్మ’, ‘ఓయమ్మ’ అవుతారు. చాలా ఇళ్లల్లోని తోడికోడళ్ళలాగా ఉప్పు – నిప్పుగా ఉంటాయి. ఇలా ఇందులోని మొదటి పంక్తి ఆహ్లాద జనకమయితే రెండో పంక్తి హాస్యభావ సంభరితం. ప్రతి స్ర్తికి తన పుట్టింటి వారి ప్రేమాను బంధాల మీద, ముచ్చట్ల మీద అంతనమ్మకం. అందుకే అంటుంది ‘మీ మేనమామలైతే మరిమరీ నిన్ను ముద్దాడతారు’ అని. తన పిల్లడు అంటే తల్లికి ఎంత అబ్బడమో, ఎంత ముచ్చటో తెలుసుకోవాలంటే ఈ పంక్తులు దర్పణాలుగా నిలుస్తాయి.
‘మీసాల మీదిదే రోసాల ఎఱుక
అబ్బాయి చేతిదే బంగారు గిలక’ – అని జోలపాటలో ఒక చరణం. ఈ చేష్టలు వారి పూర్వీకుల రాజసానికి సంకేతాలు. దాన్ని ఆమె గడుసుగా.
మరో ఇల్లాలు ఓయి ఓ ఇల్లాల! ఓ బాలులార!
మా బాలుడొచ్చాడ మీ తోటి యాడ?
మీ బాలుడెవ్వరో మేమెరుగ మమ్మ!
కాళ్ళగజ్జెల తండ్రి బంగారు బొమ్మ – ఇదొక సంభాషణాత్మకమైన జోలపాట చరణం. తన బాబు ఇంట్లో కనిపించటం లేదు. బుడిబుడి నడకలతో, ఇరుగుపొరుగు ఇళ్ళకు వెళ్ళాడేమో! ఇరుగింటి ఇల్లాలిని, పొరుగింటి పోరగాళ్ళను అడుగుతోంది. మీ పిల్లడెవరో మాకు తెలియదన్నారు వాళ్ళు. అప్పుడు చెప్తున్నది వాళ్ళకు ఆనవాళ్ళు. తన బాబు కాళ్ళకు గజ్జెలున్నాయట. అదొక గొప్ప. అంతేకాదు. అతగాడు బంగారు బొమ్మట. అంటే మీ కందరికన్న బాగుంటాడు అని ఘనంగా చెప్తోంది – ఇదే ఇందులోని నిసర్గమైన, అందమైన బడాయి.
‘చిన్నారి పొన్నారి చిట్టిదాసారి
దాసారి నీ మగడు దేశ దిమ్మరి’
ఇది ఒక తమాషా అయిన ఒరవడి
చాలామంది తల్లులు. తల్లి తానేమో ఒక ఇంటిపేరు వారి బిడ్డ. తన బిడ్డలేమో మరో ఇంటిపేరు వారి బిడ్డలు. ఆ ఇంటిపేరు వారు, తన ఇంటి పేరు వారు తన పెళ్ళి కారణాన పరస్పరం వియ్యాల వారైనారు. అంటే తన మామగారి ఇంటిపేరు వారందరూ తనకు బావలు, వదినలు, మరుదులు, మరదళ్ళు అవుతారు. అందుకని తన బిడ్డలను ఆటపట్టిస్తూ ఎగతాళిగా, హేళనగా మాట్లాడటం ఒక ముచ్చట. ఇది పల్లెసీమలలో ఇప్పటికీ కనిపిస్తుంటుంది. మరో తల్లి తన పిల్లాడిని ‘చిట్టీత పండెరుపు చిలుక ముక్కెరుపు తానెరుపు అబ్బాయి తనవారిలోన’ అని అంటుంది. తన కుటుంబంలో తనబాబే ఎర్రగా, బుర్రగా వుంటాడుట. ఇది దృష్టాంతాలంకారానికి ఒక మంచి దృష్టాంతం.
‘చిన్నారివే నీవు చిలకవే నీవు
చిగురు మామిళ్ళలో చిన్న కోయిలవు’ – ఇది ఇంకొక కమనీయ కవితా పంక్తి. తన పాప ఆకారంలో అందాల చిలుక. మరి కంఠం విషయంలో మామిళ్ళ చిగుళ్ళతో పసదేరిన పంచమస్వర కోకిల అంటూ తన పాపను ఆకాశానికెత్తుతోంది ఒక తల్లి ఊహల ఊయెల ఊపుల హాయితో.
ప్రత్యక్ష పద అర్థం కన్న పరోక్ష భావార్థం హృదయంగమంగా కనిపించేదానే్న ‘్ధ్వని’ అంటారు. ఈ ధ్వని అనేదే అసలు కావ్యాత్మ అంటాడు ఆనంద వర్ధనుడు తన ‘్ధ్వన్యాలోకం’ కావ్యశిల్ప శాస్త్ర గ్రంథంలో ధ్వని సిద్ధాంతానికి సలక్షణమైన, విలక్షణమైన లక్ష్యప్రాయాలుగా శాశ్వతంగా నిలిచేవి మన జోలపాటలు.
– శ్రీపతి పండితారాధ్యుల పార్వతీశం

Andhra Bhoomi.

డిసెంబర్ 12, 2010 Posted by | సంస్కృతి | 1 వ్యాఖ్య

పదునెైన ఆకృతికి ‘పంచా’ మృతాలు

పదునెైన ఆకృతికి ‘పంచా’ మృతాలు
మహిళలను ఎక్కువగా బాధించే సమస్య స్థూలకాయం. ఈ సమస్య బారినుండి తప్పించుకోవడం కోసం వారు ఎన్నో తంటాలు పడతారు. అవసరమైనా లేకపోయినా రకరకాల ఔషధాలు సేవిస్తారు. వీటితో స్థూలకాయం తగ్గుముఖం పట్టినా కొత్త ఆరోగ్య సమస్యలు పుట్టుకుచ్చే ప్రమాదం ఉంది. ఈ ఔషధాలకు దూరంగా… మనం రోజూ తీసుకునే ఆహరంతోనే బరువు తగ్గొచ్చు అంటున్నారు నిపుణులు. మనం రోజూ తీసుకునే ఆహారంలో సుగంధ ద్రవ్యాలను తగిన మోతాదులో వాడితే స్థూలకాయం సమస్య నుండి బయటపడవచ్చట. మహిళల శరీరాకృతిని కాపాడడంలో ఇవి ఎంతో ముఖ్యపాత్ర పోషిస్తాయి. నిజానికి భారతీయ వంటల్లో సుగంధ ద్రవ్యాలకు చాలా ప్రాముఖ్యం ఉంది. ఇతర దేశాలతో పోలిస్తే మనదగ్గర స్థూలకాయం సమస్య చాలా తక్కువ. అందుకు ఈ సుగంధ ద్రవ్యాలే కారణమని అనేక పరిశోధనల్లో వెల్లడెైంది. స్థూలకాయంతో బాధపడేవారు ఆహారంలో వీటిని కూడా చేర్చుకోవడం వల్ల ప్రయోజనం పొందవచ్చు. ఇందులో పలురకాల సుగంధ ద్రవ్యాలు ఏ విధంగా మేలు చేస్తాయో చూద్దాం…

అల్లం…
Gingerఅల్లానికి ఆయుర్వేదంలో చాలా ప్రాముఖ్యం ఉంది. మూత్ర విసర్జన సాఫీగా జరిగేందుకు ఇది ఎంతగానో సహకరిస్తుంది. జీవక్రియలు సాఫీగా సాగేందుకు సైతం ఇది తోడ్పడుతుంది.ఉపయోగాలు: తీసుకున్న ఆహారంలో చెడును వెంటనే బయటకు నెట్టేస్తుంది. దాంతో బరువు పెరగకుండా ఉండడం సాధ్యమవుతుంది. వొవేరియన్‌ క్యాన్సర్‌ కణాలను నిర్వీర్యం చేసే శక్తి అల్లానికి ఉందని పలు పరిశోధనల్లో వెల్లడెైంది. జలుబు, మైగ్రేన్‌, ఉదయం పూట మగతగా ఉండే ఇబ్బందులను సైతం ఇది తొలగిస్తుంది.

మిరపకాయ…
Red_Chilliఎరట్రి పొడవెైన మిరపకాయల్లో క్యాప్సాసిన్‌ అనే రసాయనం ఉంటుంది. దీనికున్న గుణమేంటంటే కేంద్రనాడీ వ్యవస్థను ఉత్తేజపరచి శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తుంది.ఉపయోగాలు: ఆ వేడికి శరీరంలో ఉన్న కొవ్వు కరిగిపోతుందని పరిశోధనల్లో స్పష్టమైంది. ఆకలి పుట్టించే గుణం కూడా దీనికుంది. ఈ రసాయనం శరీరంలో కొవ్వు నిల్వలు పేరుకోకుండా చూడడంలో అద్భుతంగా ఉపయోగపడుతుందని శాస్తవ్రేత్తలు తెలియజేస్తున్నారు.

ఆవాలు…
Mustardఇక ఈ జాబితాలో తర్వాతి స్థానం ఆవాలదే. ఇవి కూడా దేహంలో జీవక్రియలను ఉత్తేజపరుస్తా యి.దాంతో అధికంగా ఉన్న కొవ్వు వేగంగా కరిగిపోయి బరువు తగ్గడం సులభమవుతుంది.ఉపయోగాలు: రోజుకొక చెంచాడు ఆవపిండిని తీసుకుంటే 25 శాతం మేరకు జీవక్రియలు ఉత్తేజితమవుతాయని ఇంగ్లాండ్‌లోని ఆక్స్‌ఫర్డ్‌ పాలిటెక్నిక్‌ శాస్తవ్రేత్తల అధ్యయనం లో తాజాగా వెల్లడెైంది. అధిక రక్తపోటు తగ్గించడానికి ఆవనూనె చక్కగా పనిచేస్తుం ది. వీటిల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, ఐరన్‌, మాంగనీస్‌, జింక్‌, ప్రొటీన్‌, కాల్షియం, నయసిన్‌ సమృద్ధిగా లభిస్తాయి.

నల్ల మిరియాలు…
Black_Pepperఇప్పుడంటే వీటిని ఆహారంలో వాడడం తగ్గించాం కానీ పూర్వం మిరపకాయలకు బదులుగా మిరియాల పొడినే ఉపయోగించేవారు. నల్ల మిరియాలతో మంచి ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.ఉపయోగాలు: జీర్ణశక్తిని వృద్ధి చేయడానికి ఇవి ఎంతగానో సహకరిస్తాయి. తీసుకున్న ఆహారం ద్వారా శరీ రంలోని అన్ని భాగాలకూ పోషకాలందేలా చూస్తాయి. దీనిలో ఉండే పిపరిన్‌ రసాయనం దేహంలోని జీవక్రియలను ఉత్తేజపరుస్తుంది.శరీర బరువు సమతుల్యంగా ఉంచడానికి తోడ్పడుతుంది. తాజా మిరియాల్లో ఔషధ గుణాలెక్కువగా ఉంటాయి. ఈ సుగంధ ద్రవ్యాల వల్ల బరువు తగ్గించడంతో పాటు అనేక రకాల ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అందుకే మన రోజు వారీ ఆహారంలో వీటిని ఉపయోగించడం ఎంతో అవసరం.

దాల్చినచెక్క…
Dalchina_Chekkaరోజులో ఒక్క చెంచాడు దాల్చినచెక్క పొడిని తీసుకున్నారంటే మీ అధిక బరువు క్రమంగా తగ్గిపోతుంది.ఆరోగ్యం, అందం కూడా మెరుగు పడుతుందని శాస్తవ్రేత్తలు జరిపిన పలు పరిశోధనల్లో వెల్లడెైంది.ఉపయోగాలు: దీనికి రక్తంలో గ్లూకోజ్‌ని తగ్గించే గుణం ఉంది. చెడు కొలెస్టరాల్‌ను 27 శాతం వరకు తగ్గించే శక్తి దీని సొంతం. టైప్‌ 2 మధు మేహ రోగులకు ఇది మంచి ప్రయోజనకారి. రక్తం గడ్డకుండా నిరోధిస్తుం ది. అలా అని దీన్ని మోతాదుకు మించి తీసుకోకూడదు. అలా తీసుకుంటే దీనిలో ఉండే కొమారిన్‌ అనే రసాయనం లివర్‌కి హాని చేస్తుంది.

Surya Telugu Daily

డిసెంబర్ 12, 2010 Posted by | ఆరోగ్యం | 1 వ్యాఖ్య

జానపద నజరాన చెక్కభజన

జానపద నజరాన చెక్కభజన
సంప్రదాయ ఉత్సవాలు, కార్యక్రమాలలో దేవుని ఊరేగింపు జరిపేటప్పుడు చెక్కభజన బృందం చేసే భజనలు ఆ కార్యక్రమాన్ని రక్తికట్టిస్తారుు. చెక్కభజనను ప్రాచుర్యంలోనికి తెచ్చిన వారు కంచెర్ల గోపన్న. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి ప్రాంతానికి చెందిన రామదాసుగా ప్రసిద్దుడైన గోపన్న కీర్తనలు భజన సంప్రదాయానికి చెందినవి. భజనల్లో పండరి భజన, చెక్కభజన, కులుకు భజన వంటివి అనేకం. వీటిలో చెక్కభజన ప్రఖ్యాతిగాంచింది. ఇందులో నృత్యంకూడ ఉండడంచేత ఇది మరింత కళాత్మకతను కలిగి ఉంది.

janapadaluప్రకృతిలోని వస్తువులను వాడుకుని వాటి ద్వారా సంగీతాన్ని సృష్టించుకుని దానికి అనుగుణంగా అడుగులు వేస్తూ తానే కాకుండా తన చుట్టూ ఉన్నవారిని కూడా ఉల్లాసవంతమైన ప్రపంచంలోనికి తీసుకుపోగలగే లక్షణం ఒక్క జానపదుడికే సొంతం. ఈ లక్షణం చెక్కభజనలో కనిపిస్తుంది. కర్రముక్కలకు తాళాలు జోడించి వాటితో లయను సృష్టించడం, సామూహికంగా అడుగులు వేయడం చెక్కభజనలో కనిపించే దృశ్యం. చెక్కభజన సామూహిక నృత్యరూపం.

పండుగ, పర్వదినాల్లో, జాతరలు, ఉత్సవాలలో , సాయంకాలం ఊళ్ళో గుడిముంగిట, ఎప్పుడు పడితే అప్పుడు , ఎక్కడపడితే అక్కడ జానపదులు చెక్క భజన ప్రదర్శిస్తుంటారు. భారత రామాయణాది కథలను పాటలుగా మలచుకుని స్థానిక కళాకారులు నృత్యాలు చేస్తారు. గురువు మధ్యలో ఉంటాడు. అతను జట్టును నడిపిస్తుంటాడు. అతని ఆదేసానుసారంగా జట్టు అడుగులు వేస్తుంది. చెక్కభజనతో చేసే నృత్యంలో అడుగులు వేస్తారు. ఈ అడుగులు చాలా ఉన్నాయి. అది అడుగు, రెండు, మూడు, పర్ణశాల, కుప్ప కొట్టడం, కులుకు వంటివి అనేకం ఇందులో ఉంటాయి. మొత్తం గుంపు ఒకే రకంగా అడుగులు వెయడం, చెక్కలు కొట్టడం మధ్యలో గురువు అరుపులు, కేకలు, ఈ ప్రదర్శనను కనులపండువగా చేస్తాయి. గురువు ఒక పాటలోని చరణం పాడితే దానిని జట్టులోని వారందరూ తిరిగి పాడతారు. ఈ పునరుక్తి వలన పాటకు అందం వస్తుంది.

భక్త రామదాసు విరచితం: చెక్కభజనను ప్రాచుర్యంలోనికి తెచ్చిన వారు ఖమ్మం జిల్లా నేలకొండపల్లికి చెందిన కంచెర్ల గోపన్న. భక్త రామదాసుగా ఆయన జగద్విఖ్యాతులు. రామదాసుగా ప్రసిద్దుడైన గోపన్న కీర్తనలు భజన సంప్రదాయానికి చెందినవి. ఇప్పటికీ ఆంధ్రాప్రాంతంలో శ్రీరామనవమి ఉత్సవాలలో వేసిన పందిళ్లలో కొన్ని భజన బృందాలు శ్రీరామనామగానంతో, తమ చెక్కభజనలతో జనాన్ని ఉర్రూతలూగిస్తుంటారు. భజనల్లో పండరి భజన, చెక్కభజన, కులుకు భజన వంటివి అనేకం. వీటిలో చెక్కభజనలో నృత్యంకూడ ఉండడంచేత ఇది మరింత కళాత్మకతను కలిగి ఉంది.

భక్తి ఉద్యమంలో ప్రధానపాత్ర:మధ్యయుగాల్లో భారత దేశంలో వచ్చిన భక్తి ఉద్యమ ప్రభావం చెక్క భజనలో చూడవచ్చు. వేదాంతాన్ని సామాన్యులకు అందించాలన్న ఉద్దేశ్యం భక్తి ఉద్యమంలో కనిపిస్తుంది. చెక్కభజనలో కూడ వేదాంత పరమైన భారత, రామాయణ, భాగవతాది కథలను పాటల రూపంలో పామరులకు కూడ అర్థమయ్యే భాషలో చెప్పడం జరుగుతుంది. అందువల్లనే చెక్కభజన సర్వ జనాదరణీయమైంది. రాముడి గుడిలేని ఊరు లేనట్లే, అంధ్ర దేశంలో చెక్కభజన గుంపు లేని ఊరు లేదు. ప్రతి గ్రామంలోను చెక్కభజన గురువు ఉండేవాడు…అలానే చెక్కభజన గుంపు కూడా ఉండేది.

janapadalu1చెక్కభజనకు చిరునామా:చెక్కభజనకు కడప జిల్లా పెట్టింది పేరు. ఇక్కడ ప్రతి గ్రామంలోను చెక్కల శబ్ధాలు, గురువుల కేకలు, జట్టులోని కళాకారుల అడుగుల నాదాలు వినిపిస్తూనే ఉంటాయి. ఇక్కడి నుండి చాలమంది కళాకారులు భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో కళా ప్రదర్శనలు ఇచ్చారు. కడప జిల్లలోని గొరిగనూరు వాసి పుల్లయ్య, చెన్నూరు వాసి ఈశ్వరరెడ్డి చెక్కభజనలో ప్రయోగాలు చేస్తున్నారు.

చెక్కభజన కూడ జానపదత్వం కోల్పోయింది. ఆధునిక ప్రసార మాధ్యమాలు టీ.వి , సినిమాలు చెక్కభజనను దెబ్బ తీస్తున్నాయి. వీటిని తట్టుకొని నిలబడడానికి ఈ కళాకారులు కూడా చెక్కభజనలో ప్రయోగాలూ చేస్తున్నారు.

నిజానికి చెక్కభజనలో కేవలం తప్పెట మాత్రమే ఉపయోగిస్తారు. అప్పుడే చెక్కభజనకు అందం వస్తుంది.మన జానపద కళారూపాలు మన సంస్కృతికి నిలువెత్తు దర్పణాలు. వాటిని కాపాడుకోకపోతే మనం సంస్కతి విధ్వంసకులమవుతాము.

భాషాభివృద్ధికి తోడ్పాటు: ఒకప్పుడు ఉత్తరాదికి పరిమితమైన దేవనాగరిలిపి దక్షిణాదికి కూడా వ్యాప్తిచెందడానికి ఈ చెక్కభజనలే కారణమంటే ఆశ్చర్యం కలగక మానదు. తుకారం, కబీర్‌, పురందరదాస్‌, మీరాభాయ్‌ వంటి ఉత్తరాది కళాకారులు తమ గీతామృతాల ద్వారా వాటి భజనల ద్వారా దక్షిణాదికి కూడా తమ భాషను వ్యాప్తినొందించారు. వారి భక్తబృందాలు ఆ రకంగా దక్షిణాదిన కూడా కొద్దోగొప్పో హిందీ భాషాభివృద్ధికి ఈ చెక్కభజనలు తోడ్పడ్డాయి.
-నండూరి రవిశంకర్‌

Surya Telugu Daily

డిసెంబర్ 10, 2010 Posted by | సంస్కృతి | 2 వ్యాఖ్యలు

సముద్రంపెై అద్భుత నగరం

సముద్రంపెై అద్భుత నగరం
జపాన్‌లో భూభాగం పూర్తిగా ఖాళీ అయిపోయిందో.. లేక అక్కడి ప్రజలకు భూమిపెై నివసించడం బోర్‌ కొట్టేసిందో.. ఏమో వాళ్లు ఏకంగా సముద్రంపెై పడ్డారు. సముద్రంపెై అందమైన భవంతులను నెలకొల్పేందు వారు ప్రణాళికలు సిద్ధం చేసేస్తున్నారు. నీటిపెై తేలియాడే ఆకాశహర్మ్యాలకు చకా చకా ప్లాన్లు వేసేస్తున్నారు. జపాన్‌కు చెందిన ఓ సంస్థ ఈ సన్నాహాలు చేరం

americascupపెరుగుతున్న గ్లోబల్‌ వార్మింగ్‌ను దృష్టిలో ఉంచుకొని పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ’కార్బన్‌-న్యూట్రల్‌’ నగరాలను నిర్మించాలని జపాన్‌లోని షిముజ సంస్థ వారు నిశ్చయించారు. దీనికి ’గ్రీన్‌ ఫ్లోట్‌’ కాన్సెప్ట్‌ అని పేరు కూడా పెట్టేశారు.ఈ విధానంలో ఒక్కోటి చదరపు కిలోమీటరు వెశాల్యం ఉన్న విభాగాలను బోలెడన్నింటి నిర్మించి వాటిని ఒక కేంద్రక టవర్‌కు అనుసంధానిస్తారు. అలా అది ఒక పెద్ద నగరంగా తయారవుతుంది.

ఇక్కడ నిర్మించే ఇళ్లన్నీ నీటిపెై తేలుతూ ఉంటాయి.ఇలా నిర్మించిన విభాగాలలో.. ఒక్కొక్క విభాగానికి గానూ 10,000 నుంచి 50,000 మంది మనుషులు నివసించవచ్చు. అంతే కాదండోయ్‌.. భూమి మీద మాదిరిగానే ఈ విభాగాల్లో చెట్లు, చిన్న చిన్న పంటలు కూడా వేసుకోవచ్చు. కేంద్రక టవర్‌ చుట్టూ.. ఆ ప్రాంతంలో నివసిం చేవారికి అవసరమెన ఆహారం ఉత్పత్తి చేసేం దుకు పొలాలు, అడవు లు, పశువులు కూడా ఉంటాయి.

సాధ్యమేనా…
వినడానికి బాగానే ఉంది కానీ.. అసలు ఇది సాధ్య మేనా..? ఇలాంటి కట్టడాలను సముద్రంలో తేలియాడేలా నిర్మించాలని షిముజు సంస్థ ప్రణాళికలు రూపొందించింది. ఈ కట్టడాలను నిర్మించేటపుడు అలాగే వాటిని మనుషులు ఉపయోగించే సమయంలోనూ.. ఎక్కడా పర్యావరణానికి హాని కలగని రీతిలో నిపుణులు ప్రణాళికలు వేస్తున్నారు. ఈ కట్టడాలకు ఉపయోగించే లోహాలను కూడా సముద్రం నుంచే తయారు చేయడం ఇక్కడ చెప్పుకోదగిన విషయం.

సముద్ర జలాల్లో లభించే మెగ్నీషియంను తీసి దానితోనే నీళ్ల మీద తేలే ఓడల్లాంటి భవనాలను నిర్మిస్తారట. షిముజు సంస్థ నిపుణుల ప్రకారం.. ఇలాంటి ప్రదేశాల్లో నివసిస్తే పర్యావరణానికి హాని కలిగించే కార్బన్‌ వాయువుల విడుదలను 40 శాతం మేరకు తగ్గించొచ్చు. ఏమెనా వ్యర్థాలుంటే వాటితోనూ ద్వీపాలను తయారు చేసి సముద్రాల్లో భవనాలను నిర్మించేస్తామని చెబుతున్నారు.

తుఫాన్లు వస్తే…
future_architecture1అంతా బానే వుంది కానీ.. సముద్రుడు ఎప్పడు ప్రశాంతంగా ఉంటాడో..ఎప్పుడు కోపంగా ఉంటాడో తెలియదు. ప్రశాంతగా ఉన్నంత సేపు ప్రమాదం లేదు కానీ.. కోపం వచ్చి విజృంభించి ఏ సునామీనో సృష్టించాడనుకోండి అప్పుడు పరిస్థితి ఏంటి..? అలాంటి భయం ఏం అక్కర్లేదంటున్నారు నిపుణులు.అందుకు జలహర్మ్యాల్లో బయటి వెైపు ఎలాస్టిక్‌ పొరలను ఏర్పాటు చేస్తారట. అవి సముద్ర మట్టానికి 30 అడుగుల ఎత్తులో ఉంటాయి కాబట్టి లోపలి వారిని అలలే మీ చేయలేవని ఎంచక్కా భరోసా ఇచ్చేస్తున్నారు. తుఫాన్‌, వర్షాల సమయంలో పిడుగుపాటు నుంచి కాపాడుకోవడానికి లెట్నింగ్‌ కండక్టర్లు కూడా వీటిలో ఉంటాయట.

జపాన్‌లో జరిగిన యూనివర్సిటీల సమావేశంలో షిముజు సంస్థ తమ ఊహాచిత్రాలను ప్రదర్శించి పలువురి ప్రశంసలు పొందింది. మరి ఇది వాస్తవ రూపం దాల్చుతుందో.. లేక ఊహాగానాలుగానే మిగిలిపోతాయో వేచి చూడాల్సిందే.. మరి. ఏదేమైనా ఈ ఆలోచన మాత్రం అద్భుతం కదా… పెై పెచ్చు అక్కడ నివసించడానికి కొంచెం గుండె ధెైర్యం కూడా కావాలి సుమా..!!

Surya Telugu Daily

డిసెంబర్ 8, 2010 Posted by | చూసొద్దాం | 3 వ్యాఖ్యలు

కృష్ణమ్మ ఒళ్లో… సరదాల విహారం..

కృష్ణమ్మ ఒళ్లో… సరదాల విహారం..

krishanmmam1 పర్యాటక రంగంలో మరో ముందడుగు! కొన్నాళ్లుగా ఊరిస్తూ వస్తోన్న ‘రివర్‌ క్రూయిజ్‌’ ప్రాజెక్టు ఇటీవలే సాకారమైంది. పర్యాటకాభివృద్ధి సంస్థ… నాగార్జున సాగర్‌- శ్రీశైలం మధ్య బోటు ప్రయాణాన్ని చేపట్టింది. ఈ బోటు పేరు ‘ఎం ఎల్‌ అగస్త్య’. 90 సీట్ల సామర్థ్యం ఉన్న ఈ బోటు ఇటీవలే జలప్రవేశం చేసింది. రెండు రోజుల ప్యాకేజీ. ఈ బోటు ప్రయాణంతో కృష్ణమ్మ పరవళ్లు మరింత కనువిందు చేయడం ఖాయం. భారీ వర్షాల వల్ల తొణికిసలాడుతున్న కృష్ణానది ప్రవాహానికి ఎదురెళ్లడం పర్యాటకులకు ఓ అనుభూతిని మిగుల్చుతుంది. చాన్నాళ్ల నుంచీ మరుగున పడి ఉన్న ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలు పర్యాటకాభివృద్ధి సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సందీప్‌ కుమార్‌ సుల్తానియా చొరవతో కార్య రూపం దాల్చాయి.

krishanmmam హైదరాబాద్‌ నుంచి పర్యాటకులను నాగార్జున సాగర్‌కు తీసుకెళ్లడానికి పర్యాటకాభివృద్ధి సంస్థ ప్రత్యేకంగా రెండు బస్సులను నడపనుంది. శని, ఆదివారాల్లో సికింద్రాబాద్‌ లోని యాత్రీ నివాస్‌ నుంచి ఉదయం 7 గంటలకు, పాత కంట్రోల్‌ రూమ్‌ ఎదురుగా ఉన్న పర్యాటకాభివృద్ధి సంస్థ కేంద్రీయ రిజర్వేషన్‌ కార్యాలయం (సిఆర్‌ఓ) నుంచి 7:30 గంటలకు బస్సులు బయలుదేరుతాయి. నాగార్జున సాగర్‌ చేరిన అనంతరం అక్కడి నుంచి బోటు ప్రయాణం సాగుతుంది. 90 కిలోమీటర్ల మేర ప్రయాణం. సాయంత్రానికి బోటు లింగాలగట్టుకు చేరుకుంటుంది. అనంత రం సాక్షి గణపతి, భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి దర్శనం కల్పిస్తారు. శ్రీశైలంలోని పర్యాటకాభివృద్ధి సంస్థ హోటల్‌లో రాత్రి బస. మరుసటి రోజు తెల్లవారు జామున 6 గంటలకు ‘రోప్‌ వే’ ద్వారా పాతాళగంగకు తీసుకెళ్తారు. అనంతరం తిరుగు ప్రయాణం.

శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్‌ చేరుకున్న తరువాత ఎత్తిపోతలు, నాగార్జున కొండ, నాగార్జున సాగర్‌ రిజర్వాయర్‌, మ్యూజియం సందర్శన కల్పిస్తారు. అవి ముగిసిన వెంటనే ప్రత్యేక బస్సులో హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం, ఎసి గదుల్లో నివాస వసతి పర్యాటక శాఖ ఏర్పాటు చేస్తుంది.

టారిఫ్‌ వివరాలివీ…

హైదరాబాద్‌ నుంచి నాన్‌ ఏసీ బస్సులో…
పెద్దలకు – రూ.2000
పిల్లలకు – రూ.1500
ఏసీ బస్సులో…
పెద్దలకు – రూ.2500
పిల్లలకు – రూ.1800
నేరుగా నాగార్జున సాగర్‌లోనే బోటు ప్రయాణం చేయదల్చుకుంటే…
పెద్దలకు – రూ.1500
పిల్లలకు – రూ.1100

Surya Telugu Daily

డిసెంబర్ 7, 2010 Posted by | చూసొద్దాం | 2 వ్యాఖ్యలు