హరివిల్లు

ఎన్నెన్నో వర్ణాలు-అన్నింటా అందాలు…

సరైన జీవన శైలితో మూత్ర పిండాలు పదిలం

సరైన జీవన శైలితో మూత్ర పిండాలు పదిలం

liversజీవక్రియ మూలంగా మానవ దేహంలో ఎన్నో మలినాలు వ్యర్ధ పదార్ధాలు తయారవుతాయి. అయితే మూత్రపిండాలు రక్తంలో ఉన్న వ్యర్ధ పదార్ధాలను మూత్ర రూపంలో బయటకు పంపించడం వలన శరీరంలో లవణాలు, ఖనిజాల సమతుల్యతను, ఆమ్ల క్షార సమతుల్యతను, నీటి శాతాన్ని నియంత్రిస్తాయి. మూత్రపిండాలు శరీరంలోని నీటి శాతాన్ని రక్తపోటును నియంత్రిం చడంలో ముఖ్య పాత్రను పోషిస్తాయి. మారుతున్న వాతావరణ పరిస్థితులు, కాలుష్యం, క్రమం తప్పుతున్న ఆహార అలవాట్ల వలన నేడు కిడ్నీ బాధితులు పెరిగిపోతున్నారు. మూత్ర పిండాల పనితీరు సరిగా లేకపోవడం వలన శరీరంలో యూరియా క్రియోటినిన్‌ వంటి పదార్ధాలు పేరుకుపోతాయి.

రక్తంలో ఈ పదార్ధాల స్థాయి ఎక్కువవడం వలన అనేక శారీరక రుగ్మతలు తలెత్తుతాయి. కొన్నిసార్లు ప్రాణానికే అపాయకరంగా మారవచ్చు. దీనినే ‘రీనల్‌ ఫెయిల్యూర్‌’ లేదా కిడ్నీ ఫెయిల్యూర్‌ అంటారు. కిడ్నీ ఫెయిల్యూర్‌లో మొద టి దశలో ఎలాంటి లక్షణాలూ కనిపించకపోవచ్చు. మూత్రపిండాల పనితనం క్షీణించే కొద్దీ లక్షణాలు కనుపిస్తాయి. నీటి సమతుల్యత లోపం, ఎర్ర రక్త కణాల లోపం, శరీరంలో మలినాలు పేరుకుపోవడం వలన వచ్చే లక్షణాలు క్రమంగా మొదలవుతాయి. నీరసం, ఆయాసం, శరీరంలో వాపులు, ముఖ్యంగా కాళ్ళల్లో నీళ్ళు చేరడం లాంటి లక్షణాలు కనుపిస్తాయి. మూత్ర పిండాలకు కలిగే వ్యాధి లక్షణాలు మూత్రం ఆగకుండా జారడం మొదలైనవి. వీటితో పాటుగా నీరసం, బద్ధకం, వాంతులు, కడుపులో తిప్పడం, డయేరి యా, కడుపులో నొప్పి, నోటిలో చేదు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇవి తీవ్రంగా విఫలమైతే మూర్ఛలు, కోమా వంటివి కూడా సంభవించవచ్చు.ఈ వ్యాధి రాకుండా ముందస్తు నివారణ చర్యలు తీసుకోవడం అత్యవసరం. హైపర్‌టెన్షన్‌, మధుమేహం వంటి వ్యాధులు మూత్ర పిండాలనే కాక శరీరంలోని ఇతర అంగాలను కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. అందుకే రక్తపోటును, మధుమేహాన్ని అదుపులో ఉంచుకునేందుకు జీవిత కాలమం తా అప్రమత్తంగా ఉండాలి. మూత్ర పిండాల వైఫల్యానికి అంతర్గతంగా ఉ న్న కారణాలను గుర్తిస్తే తప్ప నిర్ధిష్టంగా చికిత్స చేయరు.

kamal-kiranమూత్ర పిండం విఫలమైతే దాని పరిస్థితి మరింత దిగజారకుండా నిరోధించడమే లక్ష్యంగా వైద్యులు చికిత్స చేస్తారు. దానిని నిర్లక్ష్యం చేస్తే మూత్ర పిండాలు పూర్తిగా విఫలమవుతాయి.కనుక ఆ పరిస్థితి వచ్చేం దుకు అంతర్గతమైన కారణాలను గుర్తించి వాటికి కూడా చికిత్స చేస్తే మూత్ర పిండాల పనితీరు పూర్తిగా విఫలం కాకుండా చూడడ మే కాదు కొన్నిసార్లు దాని పని తీరును మెరు గు పరచవచ్చు. మూత్ర పిం డ వ్యాధిగ్రస్థు లు ఆహార విషయంలో జాగ్రత్తలు పాటించా లి. నిపుణులను అడిగి తెలుసుకోవాలి. వ్యాధి బారిన పడిన కిడ్నీలు అధిక నీటిని, ఉప్పును లేదా పొటాషియంను తేలికగా తొలగించలే వు కనుక తక్కువగా తీసుకోవాలి. అంతర్గత కారణాలు కనుగొన్న తరువాత ఫాస్ఫరస్‌ను తగ్గిం చే మందులను, ఎర్ర రక్త కణాలను ఉత్తేజితం చేసి, పెంచేందుకు, రక్తపోటుకు మందులిస్తారు. ఒకవేళ మూత్రపిండాలు పూర్తిగా విఫలమైతే వైద్యులు డయాలసిస్‌ లేదా కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ మీద ఆధారపడవలసి ఉంటుంది.

Surya Telugu Daily

నవంబర్ 29, 2010 Posted by | ఆరోగ్యం | 3 వ్యాఖ్యలు