హరివిల్లు

ఎన్నెన్నో వర్ణాలు-అన్నింటా అందాలు…

ఇంటిలోపల ఆరోగ్యకరమైన అలంకరణ

 

ఇంటిలోపల ఆరోగ్యకరమైన అలంకరణ

Home-Interior-Decorమనం సృష్టించుకున్న ల్యామినేట్స్‌ కాక సహజమైన సామగ్రి వాడితే మరింతగా విశ్రాంతినిచ్చే, తక్కువ మానసిక ఒత్తిడిని కలిగించే పరిస రాలు ఇంట్లో రూపొందుతాయి. ఎండ,గాలి వంటి సహజ వనరులను అత్యధికస్థాయిలో వాడడం, రంగులు ఫర్నిషింగ్‌ ఉపకరణాలు, లైటింగ్‌ పద్ధతులు. యాంత్రిక , ఎలెక్ట్రానిక్‌ పరికరాలను నియమానుసారం ఉపయో గించ డం- ఆరోగ్యకరమైన ఇంటిని రూపొందిస్తాయి. సరిగా జాగ్రత్త తీసుకోని యంత్రాలు, వాడేసిన ఇంట్లో పలి,వెలుపలి సామగ్రి ఇంట్లో రసాయనిక కాలుష్యాన్ని పెంచు తాయి. ఇంట్లో గాలిపై చెడుప్రభావం వేస్తాయి. చివరికి మన ఆరోగ్యంపై చెడుప్రభావం ప్రసరిస్తాయి.

సహజమైన తాజా గాలి: రసాయనిక ఏర్‌ఫ్రెషనర్లను వాడకండి- వాటికి బదులు బేకింగ్‌ సోడా లేక ఏ ఇతర సహ జమైన ఫ్రెషెనర్లను వాడండి. లేక కిటికీలను కాసేపు తెరిచి వుంచడండి. బ్రోమినేటెడ్‌ ఫ్లేమ్‌ రిటార్డెంట్లు, స్టేయి న్‌రిపె ల్లెంట్లు, రింకిల్‌ రెసిస్టెంట్‌ ట్రీట్‌మెంట్లులేని ఫర్నిచర్‌, కార్పెట్లు, కర్టన్లు ఎంపిక చేసుకోండి. ఇంట్లో విరివిగా మొక్కలు పెంచుకుంటే విషకాలుష్యాన్ని అరికట్ట వచ్చు. ఇంట్లో పెరిగే మొక్కలు కెమికల్స్‌ను పీల్చుకుని వాటిని ఆహారంగా , శక్తిగా మారుస్తాయి. గాలిని శుభ్రపరు స్తాయి. ఇంట్లో ప్రతిగదిలో 100 చదరపుటడుగులకు 3 మొక్క లుండాలని సిఫార్సు చేస్తున్నారు. సహజసిద్ధమైన మొక్కల్నే పెంచండి. తలు పులు బార్ల తెరిచివుంచి ఇంట్లో వేడిని సహ జంగానే బయటికి పోయేలా జాగ్రత్త తీసుకోండి. ప్రెస్డ్‌ పార్టికల్‌ బోర్డుకంటే అసలైన చక్కే వాడండి.

రంగులు:Neat-Interior-Design రంగులన్నిటికీ వేవ్‌లెంగ్త్‌ ,శక్తి ఉంటాయి. ఇంట్లో అలంకరణ కోసం సమతూకంతో కూడుకున్న రంగు ల్ని ఎంపిక చేసుకోండి. తేలికైన తెల్లటి లేత పసుపు రంగులు గోడలకు వేస్తే గదిలో ప్రశాంతమై వాతావరణం నెలకొంటుంది.

వాయు ప్రసారం: ఒకవేళ తగినన్ని తలుపులు కిటికీలు లేనట్లయితే ఎక్సాస్ట్‌ ఫ్యాన్లు వినియోగించి ఇంటిని వెచ్చగా, పొడిగా ఉంచుకోండి. వెంటిలేషన్‌ లేక వాయు ప్రసారం లేక గాలిమార్పిడి పెంచినట్లయితే ఇంట్లో వేడి తగ్గి బూజుపట్టకుండా ఉండడానికి సహాయపడతుంది. మెత్తటి ఫర్నిషింగ్‌ సామగ్రి, ఫోముల వంటి సింథటిక్‌ సామగ్రి వివిధ అనారోగ్యకరమైన గ్యాసులను గాలిలోకి విడుదల చేస్తాయి. వంటగదిలో ప్లాసి్‌‌ట కవర్లు, నాన్‌-స్టిక్‌ కుక్‌వేర్‌ వంటి వస్తువులు వాడకండి. ఫార్మల్‌డిహైడ్‌ వుండే రింకిల్‌ రెసిస్టెంట్‌ షీట్లు లేక పెస్టిసైడ్‌ట్రీటెడ్‌ కాటన్‌ పడకగదుల్లో వాడినట్లయితే ఇంట్లో ఆరోగ్యకరమైన వాతావరణం నెలకొంటుంది.

Surya Telugu

ప్రకటనలు

నవంబర్ 30, 2010 Posted by | ఆరోగ్యం | 3 వ్యాఖ్యలు

సరైన జీవన శైలితో మూత్ర పిండాలు పదిలం

సరైన జీవన శైలితో మూత్ర పిండాలు పదిలం

liversజీవక్రియ మూలంగా మానవ దేహంలో ఎన్నో మలినాలు వ్యర్ధ పదార్ధాలు తయారవుతాయి. అయితే మూత్రపిండాలు రక్తంలో ఉన్న వ్యర్ధ పదార్ధాలను మూత్ర రూపంలో బయటకు పంపించడం వలన శరీరంలో లవణాలు, ఖనిజాల సమతుల్యతను, ఆమ్ల క్షార సమతుల్యతను, నీటి శాతాన్ని నియంత్రిస్తాయి. మూత్రపిండాలు శరీరంలోని నీటి శాతాన్ని రక్తపోటును నియంత్రిం చడంలో ముఖ్య పాత్రను పోషిస్తాయి. మారుతున్న వాతావరణ పరిస్థితులు, కాలుష్యం, క్రమం తప్పుతున్న ఆహార అలవాట్ల వలన నేడు కిడ్నీ బాధితులు పెరిగిపోతున్నారు. మూత్ర పిండాల పనితీరు సరిగా లేకపోవడం వలన శరీరంలో యూరియా క్రియోటినిన్‌ వంటి పదార్ధాలు పేరుకుపోతాయి.

రక్తంలో ఈ పదార్ధాల స్థాయి ఎక్కువవడం వలన అనేక శారీరక రుగ్మతలు తలెత్తుతాయి. కొన్నిసార్లు ప్రాణానికే అపాయకరంగా మారవచ్చు. దీనినే ‘రీనల్‌ ఫెయిల్యూర్‌’ లేదా కిడ్నీ ఫెయిల్యూర్‌ అంటారు. కిడ్నీ ఫెయిల్యూర్‌లో మొద టి దశలో ఎలాంటి లక్షణాలూ కనిపించకపోవచ్చు. మూత్రపిండాల పనితనం క్షీణించే కొద్దీ లక్షణాలు కనుపిస్తాయి. నీటి సమతుల్యత లోపం, ఎర్ర రక్త కణాల లోపం, శరీరంలో మలినాలు పేరుకుపోవడం వలన వచ్చే లక్షణాలు క్రమంగా మొదలవుతాయి. నీరసం, ఆయాసం, శరీరంలో వాపులు, ముఖ్యంగా కాళ్ళల్లో నీళ్ళు చేరడం లాంటి లక్షణాలు కనుపిస్తాయి. మూత్ర పిండాలకు కలిగే వ్యాధి లక్షణాలు మూత్రం ఆగకుండా జారడం మొదలైనవి. వీటితో పాటుగా నీరసం, బద్ధకం, వాంతులు, కడుపులో తిప్పడం, డయేరి యా, కడుపులో నొప్పి, నోటిలో చేదు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇవి తీవ్రంగా విఫలమైతే మూర్ఛలు, కోమా వంటివి కూడా సంభవించవచ్చు.ఈ వ్యాధి రాకుండా ముందస్తు నివారణ చర్యలు తీసుకోవడం అత్యవసరం. హైపర్‌టెన్షన్‌, మధుమేహం వంటి వ్యాధులు మూత్ర పిండాలనే కాక శరీరంలోని ఇతర అంగాలను కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. అందుకే రక్తపోటును, మధుమేహాన్ని అదుపులో ఉంచుకునేందుకు జీవిత కాలమం తా అప్రమత్తంగా ఉండాలి. మూత్ర పిండాల వైఫల్యానికి అంతర్గతంగా ఉ న్న కారణాలను గుర్తిస్తే తప్ప నిర్ధిష్టంగా చికిత్స చేయరు.

kamal-kiranమూత్ర పిండం విఫలమైతే దాని పరిస్థితి మరింత దిగజారకుండా నిరోధించడమే లక్ష్యంగా వైద్యులు చికిత్స చేస్తారు. దానిని నిర్లక్ష్యం చేస్తే మూత్ర పిండాలు పూర్తిగా విఫలమవుతాయి.కనుక ఆ పరిస్థితి వచ్చేం దుకు అంతర్గతమైన కారణాలను గుర్తించి వాటికి కూడా చికిత్స చేస్తే మూత్ర పిండాల పనితీరు పూర్తిగా విఫలం కాకుండా చూడడ మే కాదు కొన్నిసార్లు దాని పని తీరును మెరు గు పరచవచ్చు. మూత్ర పిం డ వ్యాధిగ్రస్థు లు ఆహార విషయంలో జాగ్రత్తలు పాటించా లి. నిపుణులను అడిగి తెలుసుకోవాలి. వ్యాధి బారిన పడిన కిడ్నీలు అధిక నీటిని, ఉప్పును లేదా పొటాషియంను తేలికగా తొలగించలే వు కనుక తక్కువగా తీసుకోవాలి. అంతర్గత కారణాలు కనుగొన్న తరువాత ఫాస్ఫరస్‌ను తగ్గిం చే మందులను, ఎర్ర రక్త కణాలను ఉత్తేజితం చేసి, పెంచేందుకు, రక్తపోటుకు మందులిస్తారు. ఒకవేళ మూత్రపిండాలు పూర్తిగా విఫలమైతే వైద్యులు డయాలసిస్‌ లేదా కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ మీద ఆధారపడవలసి ఉంటుంది.

Surya Telugu Daily

నవంబర్ 29, 2010 Posted by | ఆరోగ్యం | 3 వ్యాఖ్యలు

సాహితీ వనంలో నేల రాలిన పువ్వు

సాహితీ వనంలో నేల రాలిన పువ్వు

విజయనగరం మున్సిపల్‌/కల్చరల్‌,మేజర్‌న్యూస్‌: ప్రముఖ అభ్యుదయ కవి అయినంపూడి లక్ష్మీనరసింహరాజు (అల) మృతిపట్ల పలువురు సాహితీవేత్తలు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు, అభిమానులు, వివిధ పార్టీల రాజకీయ నాయకులు ఓ ప్రకటనలో సంతాపాన్ని తెలిపారు. సాహితీ వనంలో ఒక పువ్వు నేల రాలిందని, సాహితీ లోకానికి తీరనిలోటని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రొంగలి పొతన్న ఆవేదన వ్యక్తం చేశారు. ‘అల’ అకాల మరణం తనకు తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని, కొంతకాలంగా అలతో తనకు వున్న పరిచయం, ఆయన నిరాడంబరత తనను అతని పట్ల అభిమానం పెంచిందన్నారు.

Surya Telugu Daily

నవంబర్ 25, 2010 Posted by | వార్తలు | 1 వ్యాఖ్య

కొండ అద్దమందు కొంచమై యుండదా..?

కొండ అద్దమందు కొంచమై యుండదా..?  
Teacher

అనువుగాని చోట నధికులమనరాదు
కొంచెముండుటెల్ల కొదువగాదు
కొండ అద్దమందు కొంచమై యుండదా..?
విశ్వదాభిరామ.. వినుర వేమ..!!

కొండ అద్దమందు కొంచమై యుండదా..?.

నవంబర్ 23, 2010 Posted by | చిన్నారి లోకం | 1 వ్యాఖ్య

అతి ఎప్పుడూ మంచిది కాదు.. ముఖ్యంగా పిల్లల్లో..!!

* ఎదురు సమాధానాలు చెప్పడం, తాము అనుకున్నది జరగకపోతే బిగ్గరగా ఏడవడం, చేతికందిన వస్తువుల్ని విసిరి కొట్టడం, కాళ్ళను నేలతో తన్నడం, మూర్ఖంగా వాదించడం లాంటి లక్షణాలు కొంత మంది పిల్లల్లో ఉంటాయి. ఇలాంటి వారిపై తల్లిదండ్రులు వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

అతి ఎప్పుడూ మంచిది కాదు.. ముఖ్యంగా పిల్లల్లో..!!.

నవంబర్ 22, 2010 Posted by | చిన్నారి లోకం | 1 వ్యాఖ్య

ఒక్కప్పటి నిజాం ప్యాలెస్‌ నేడది స్టార్‌ హోటల్‌

ఒక్కప్పటి నిజాం ప్యాలెస్‌ నేడది స్టార్‌ హోటల్‌
హైదరాబాద్‌ నగరం వివిధ చారిత్రక ప్యాలెస్‌లకు ఎంతో ప్రసిద్ధి గాంచింది.నిజాం నవాబులు, వారి బంధువులు నివసించిన పలు రకాల ప్యాలెస్‌లు టూరిస్ట్‌లను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన పలు చారిత్రక కట్టడాలు, ప్యాలెస్‌లతో హైదరాబాద్‌ ప్రపంచ చారిత్రక కట్టడాలలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. వీటిలో దేశ,విదేశాల్లో పేరుగాంచిన ఫలక్‌నుమా ప్యాలెస్‌కు ఎంతో చారిత్రక నేపథ్యం ఉంది. ఈ కట్టడాన్ని అందంగా ఆధునీకరించి నేడు స్టార్‌ హోటల్‌గా తీర్చిదిద్ది కొద్ది రోజుల క్రితమే ప్రారంభించారు.

Hyderabad news, Andhra , Telugu Culture and Tradition, etc.

నవంబర్ 22, 2010 Posted by | వార్తలు | వ్యాఖ్యానించండి

ఉన్నది కాస్తా ఊడింది.. సర్వమంగళం పాడింది…

జూదం మనిషిని ఎంత వ్యసనపరుడ్ని చేస్తుందో… ఆ జూదంలో నెగ్గేందుకు ఓ వ్యక్తి ఎలాంటి పనులకు పూనుకుంటాడో… చివరికి అతని పరిస్థితి ఎలా తయారవుతుందో నాటి రచయిత కొసరాజు కళ్లకు కట్టినట్లు అందించారు. ఆ సాహిత్యానికి మాధవపెద్ది, పిఠాపురం, రాఘవులు జీవం పోశారు. నటనలో రమణారెడ్డి, రేలంగి ప్రాణంపోశారు. కులగోత్రాలు సినిమాలోని ఈ పాట…

ఉన్నది కాస్తా ఊడింది.. సర్వమంగళం పాడింది….

నవంబర్ 21, 2010 Posted by | సినిమా | 1 వ్యాఖ్య

వంద మంది బిడ్డలకు తండ్రి కావడమే లక్ష్యం: అబ్దుల్

నేటి ఆధునిక కాలంలో ఇద్దరు ముగ్గురు పిల్లలను పోషించడమే గగనమైపోతున్న తరుణంలో అబుదాబీకి చెందిన ఒక ఆసామీ ఏకంగా 100 మంది పిల్లలకు తండ్రి కావాలన్నదే లక్ష్యంగా పెట్టుకున్నాడు. అందుకే 64 సంవత్సరాల వయస్సులోనూ మరో వివాహం చేసుకున్నాడూ ఈ అబుదాబీకి చెందిన అబ్దుల్ రెహ్మాన్ అనే వృద్ధుడు…చదవండి …

వంద మంది బిడ్డలకు తండ్రి కావడమే లక్ష్యం: అబ్దుల్.

నవంబర్ 21, 2010 Posted by | వార్తలు | 1 వ్యాఖ్య

హంపీ నుంచి హరప్పా దాకా బహుముఖ ప్రజ్ఞాశాలి తిరుమల రామచంద్ర

హంపీ నుంచి హరప్పా దాకా బహుముఖ ప్రజ్ఞాశాలి తిరుమల రామచంద్ర

Dr-Thirmala-ramachandraతిరుమల రామచంద్ర తన 84 ఏళ్ళ జీవి తంలో అర్ధ శతాబ్ది- పత్రికా రచనకే అంకి తమైనారు. ప్రసిద్ధ కవిపండితులు, కళా కారులు, భాషావేత్తలు, తత్త్వ చింతకులు అయిన ప్రతిభాశాలురతో వందమందిని పైగానే ఆయన ఇంట ర్వ్యూ చేసి ఉంటారు. సుమారు 50 పుస్తకాల దాకా ఆయనవి అచె్చైనాయి.ఆయన చూసినంత దేశమూ, ఆయనకు లభించినన్ని జీవితానుభవాలు, దేశమం తటా ఆయనకు లభించిన విశిష్ట వ్యక్తుల పరిచయా లూ మరెవరి విషయంలోనూ ప్రస్తావించలేము. ఆయన స్వీయ చరిత్ర ఒక గొప్ప నవలకన్నా ఆసక్తికరంగా చదివిస్తుంది. ఉత్కంఠ భరితంగా సాగుతుంది. వారికి తెలిసినన్ని భాషలు కూడా సమకాలీనులైన సాహితీ వేత్తలకు తెలియవనే చెప్పాలి…చదవండి

 

 

 

 

నవంబర్ 18, 2010 Posted by | సంస్కృతి | వ్యాఖ్యానించండి

టామ్ అండ్ జెర్రీ.. మైండ్ రీఛార్జ్ చేస్తాయ్…!!

టామ్ అండ్ జెర్రీ.. మైండ్ రీఛార్జ్ చేస్తాయ్…!!.

బుడిబుడి నడకల చిన్న పాపాయి నుంచి… కాటికి కాలుచాచిన పండు ముదుసలి వరకూ అందరినీ నవ్వించే ప్రోగ్రామ్‌ టామ్‌ అండ్‌ జెర్రీ. ఎలుక… పిల్లి క్యారెక్టర్స్‌తో రూపొందించిన ఓ అద్భుత కార్యక్రమం… టీవీ చూస్తూన్నంతసేపూ ప్రేక్షకుల పొట్ట చెక్కలయ్యేలా నవ్వించడంతో పాటు ఒక మంచి సందేశాన్ని కూడా అందిస్తుంది. వీటి చిలిపి చేష్టలు, కొంటె పనులు, పిల్లి వేసే ఎత్తుగడలను ఎలుక చిత్తుచేయడం. ఎలుక చేతిలో పిల్లి పడే పాట్లను చూస్తే అయ్యో పాపం అనిపించినా… భలే సరదాగా ఉంటాయి.
మరింత …

నవంబర్ 18, 2010 Posted by | చిన్నారి లోకం | వ్యాఖ్యానించండి

మీ చెవి గుర్తింపునకు ఆధారం!

మీ చెవి గుర్తింపునకు ఆధారం!

ఆరు పాయింట్ ఏడు బిలియన్ల జనాభా ఉన్న ఈ ప్రపంచంలో ప్రతి మనిషికీ ప్రత్యేకంగా ఒక గుర్తింపు ఉండాలంటే వేలిముద్రల కన్నా, చెవి ఆకారం మంచి మార్గమని పరిశోధకులు అంటున్నారు. బయోమెట్రిక్స్ గురించి ఇటీవల జరిగిన నాలుగవ అంతర్జాతీయ సదస్సులో ఈ విషయం వెల్లడైంది.
more…


నవంబర్ 17, 2010 Posted by | (స్నే)హితులు | 2 వ్యాఖ్యలు

ఉడుత – ఊయల – ఐదు పైసలు

Teacher | School | Village | Forest | Birds | ఉడుత – ఊయల – ఐదు పైసలు.

నవంబర్ 16, 2010 Posted by | చిన్నారి లోకం | వ్యాఖ్యానించండి

దృక్కోణం: హరివిల్లు

దృక్కోణం: హరివిల్లు.

నవంబర్ 15, 2010 Posted by | (స్నే)హితులు | 1 వ్యాఖ్య

దీపావళి శుభాకాంక్షలు

దీపావళి శుభాకాంక్షలు
ఈ దీపావళి మీ జీవితంలో మరిన్ని వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తూ…
సనారాజు

నవంబర్ 5, 2010 Posted by | సంస్కృతి | , | 8 వ్యాఖ్యలు