హరివిల్లు

ఎన్నెన్నో వర్ణాలు-అన్నింటా అందాలు…

జానపద గీతాలు-ఒద్దొద్దు నాకొద్దే ఈ పెండ్లి సూపుల భాగోతము

జానపద గీతాలు-ఒద్దొద్దు నాకొద్దే ఈ పెండ్లి సూపుల భాగోతము

జూన్ 15, 2010 - Posted by | సంస్కృతి | , , , ,

3 వ్యాఖ్యలు »

 1. ఒద్దొద్దు నాకొద్దే ఈ పెండ్లి సూపుల భాగోతము ఓయబ్బ
  అంగట్లో పశువల్లే నన్నిట్ల ఎన్నాళ్ళు జూపుతరూ
  ఈడొచ్చి నానుంచీ ఈరాము లేకుండా జూస్తుండరే
  పెళ్ళి చూపులు పాడుగానూ నారాతా ఎట్లుంటె గట్లయితదీ
  ఓ అక్కా ఎన్నని జెప్పనే నాబాధలు
  నన్నెంతమంది జూస్తారే మా అవ్వా

  బతుకమ్మ పండక్కిబాజార్ల జూసిండనొకడొచ్చి
  అటుకుల అమ్మేసీ అర్ధకిలో పౌడర్ పూసుకున్నడే
  పెట్టిన అటుకులనూ తీరంగ సట్టుగ మింగిండే
  కట్నం లచిత్తేనే గాని సుట్టం గలవదనే [[ఒద్దొద్దు నాకొద్దే]]

  దసరా పండుక్కూ మల్లెవడో దరిద్రుడొచ్చిండే
  మీసాలకూ రంగూ ఏసి బుసబూసుకుంటొచ్చెనే ఓ యక్కా
  అడ్డెడు శనగలనూ వాడాగమాగం బుక్కిండే
  దొడ్డుగ ఉన్నాననీ దొడ్డీ దారిన ఉరికిండే [[ఒద్దొద్దు నాకొద్దే]]
  ఇక దీపాళి పండక్కూ జీడిత్తు మొకపోడు వచ్చిండే ఓయక్కా
  జులపాలు విరబోసీ ననుజూదా కొంపలొజొచ్చిండే
  వాడు కుండడు వడియాలు వాడూ కూసుండి మెక్కిండే
  కురసగా ఉన్నాననీ బండీ ఇరుసాల ఉరికిండే [[ఒద్దొద్దు నాకొద్దే]]

  అక్కా నువ్వన్న జెప్పరాదే
  శివరాత్రికీ ఒకడూ చీకట్లో జూడంగ వచ్చిండే
  చింపాంజి మొకపోడే నాదిక్కు చిత్రంగ జూచిండే
  గంపెడు గారెలను మెల్లంగ గరగర నమిలిండే
  చెంపలు లొట్టలని వాడు చెప్పక పీకిండే ఓయక్క [[ఒద్దొద్దు నాకొద్దే]]

  వ్యాఖ్య ద్వారా రహంతుల్లా | జూన్ 15, 2010 | స్పందించండి

 2. ధన్యవాదాలు సార్.
  మీ లిరిక్ నా పోస్ట్ కే వన్నె తెచ్చింది .
  సనారాజు.

  వ్యాఖ్య ద్వారా సనారాజు | జూన్ 15, 2010 | స్పందించండి

 3. Very good

  వ్యాఖ్య ద్వారా rambabu | జూన్ 6, 2011 | స్పందించండి


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: