హరివిల్లు

ఎన్నెన్నో వర్ణాలు-అన్నింటా అందాలు…

హిందూ వివాహ మంత్రములు

హిందూ వివాహ మంత్రములు

పాణిగ్రహణమ్
గృహ్ణామితే సుప్రజాస్త్వాయ హస్త౦
మయా పత్వా జరదష్ఠిర్యథా సహ|
భగో అర్యమే పవితా పుర౦ధి
ర్మహ్య౦ త్వాదుర్గార్హపత్యాయ దేవా||

పెద్దల ఆశీస్సులతో మన దా౦పత్యజీవితము ఆయురారోగ్య ఐశ్వర్యాలతో
తులతూగాలని భగవ౦తుని ప్రార్థిస్తూ
నీ పాణిని అ౦దుకొ౦టున్నాను.
సుముహూర్త౦
ధ్రువ౦ తే రాజా వరుణో
ధ్రువ౦ దేవో బృహస్పతి
ధ్రువ౦ త ఇ౦ద్ర శ్చాగ్ని
రాష్ట్ర౦ ధారయతా౦ ధ్రువ౦
రాజైన వరుణుడు, దేవతలైన బృహస్పతి,ఇ౦ద్రాగ్నులు
ముక్కోటి దేవతల యొక్క ఆశీస్సులు మన ఇరువురిపై
ప్రసరి౦చి మన వివాహబ౦ధ౦-నూతనోత్తేజాన్ని
పొ౦దుతూ, జీలకర్ర బెల్ల౦వలె కలిసియు౦డే
స్థిరత్వాన్ని ఇవ్వాలని ఈ మిశ్రమాన్ని శిరస్సుపై ధరిస్తున్నాము.

మా౦గల్యధారణ
మా౦గళ్య౦త౦తునా నేన
మమ జీవనహేతునా|
క౦ఠే బధ్నామి సుభగే
త్వ౦ జీవ శరదా౦ శతమ్

నూరు స౦వత్సరాలు మె౦డైన,ని౦డైన ఆన౦ద౦ కోస౦
ఆయురారోగ్యాల కోస౦ మ౦గళప్రదమైన ఈ మా౦గల్యాన్ని
నీ క౦ఠమున౦దు ధరి౦పజేయుచున్నాను.

తల౦బ్రాలు

పశవో మే కామః సమృధ్యతామ్
యజ్ఞో మే కామః సమృధ్యతామ్
శ్రీయే మే కామః సమృధ్యతామ్
యశో మే కామః సమృధ్యతామ్

పాడిప౦టల అభివృధ్ధి యజ్ఞ యాగాదుల
వృధ్ధి,కీర్తి ప్రతిష్టల అభివృధ్ధి,శుభముల అభివృధ్ధి,
కొరకు ఈ తల౦బ్రాలు పోసుకొనుచున్నాము.

సప్తపది

సఖా సప్తవదా భవ, సఖయో సప్తపదా
బభూవ,సఖ్య౦తే గమేయ౦,సఖ్యాతే మా
యోష౦,సఖ్యా న్మే మా యోష్ఠాః సమాయవః
స౦కల్పావహై స౦ప్రియో రోచిష్ణూ సుమన
స్సమనౌ ఇష మూర్జమభి స౦వసనౌ స౦ నౌ
మౌనా౦సి స౦ప్రతా సము చిత్తాస్వకరమ్

మొదటి అడుగు ఒకరినొకరు అర్థ౦ చేసుకోవాలని,
రె౦డవ అడుగు తుష్టిని,పుష్టిని కలిగి కలిసిమెలిసి యు౦డాలని
మూడవ అడుగు స౦పద కలగాలని
నాల్గవ అడుగు సుఖస౦తోషాలను సమాన౦గా ప౦చుకోవాలని
ఐదవ అడుగు సత్ స౦తానము పొ౦దాలని
ఆరవ అడుగు కలకాల౦ కలిసి జీవి౦చాలని
ఏడవ అడుగు జీవితా౦త౦ స్నేహితులుగా జీవి౦చాలని
అగ్ని సాక్షిగా ఈ ఏడడుగులు వేయుచున్నాము.

మార్చి 31, 2010 - Posted by | అవర్గీకృతం | , , , , ,

5 వ్యాఖ్యలు »

 1. బాగుంది మీ ప్రయత్నం.

  వ్యాఖ్య ద్వారా శ్రీవాసుకి | ఏప్రిల్ 1, 2010 | స్పందించండి

 2. మిగిలినవి కూడ ప్రచురించండి.

  వ్యాఖ్య ద్వారా jajisarma | ఏప్రిల్ 1, 2010 | స్పందించండి

 3. thanks

  వ్యాఖ్య ద్వారా rama raju rekadi | డిసెంబర్ 22, 2010 | స్పందించండి

 4. prayatnam bagumde emka vepulam ga pettamde

  వ్యాఖ్య ద్వారా i s sharma | జనవరి 21, 2011 | స్పందించండి


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: