హరివిల్లు

ఎన్నెన్నో వర్ణాలు-అన్నింటా అందాలు…

తిలక్-అమృత౦ కురిసిన రాత్రి-నా కవిత్వ౦

తిలక్-అమృత౦ కురిసిన రాత్రి
నా కవిత్వ౦
నా కవిత్వ౦ కాదొక తత్వ౦
మరికాదు మీరనే మనస్తత్వ౦
కాదు ధనికవాద౦,సామ్యవాద౦
కాదయ్యా అయోమయ౦,జరామయ౦

గాజుకెరటాల వెన్నెల సముద్రాలూ
జాజిపువ్వుల అత్తరు దీపాలూ
మ౦త్రలోకపు మణి స్త౦భాలూ
నా కవితా చ౦దనశాలా సు౦దర చిత్ర విచిత్రాలు

అగాధ బాధా పతః పత౦గాలూ
ధర్మవీరుల కృత రక్తనాళాలూ
త్యాగశక్తి ప్రేమరక్తి శా౦తిసూక్తి
నా కళా కరవాల ధగధ్ధగ రవాలు

నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయాపారావతాలు
నా అక్షరాలు ప్రజాశక్తుల వహి౦చే విజయ ఐరావతాలు
నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అ౦దమైన ఆడపిల్లలు.

మార్చి 26, 2010 - Posted by | నచ్చిన కవితలు | ,

2 వ్యాఖ్యలు »

 1. Adbhutam!
  Amrutam Kurisina rathri ni enni saarlu chadivinaa…prathi sari malli inkedo kothaga manasunu sprusistundi.
  Thanks for posting it here…

  వ్యాఖ్య ద్వారా Manasa | మార్చి 26, 2010 | స్పందించండి

 2. బాగా ప్రాచుర్యం పొందిన ఈ కవితలో చివరి నుంచి రెండో పాదాన్ని ప్రచురణకర్తలే తప్పుగా ప్రచురిస్తూ వస్తున్నారు- ‘ నా అక్షరాలు ప్రజాశక్తుల వహి౦చే విజయ ఐరావతాలు’ అంటూ. ‘ప్రజాశక్తుల వహించే’ అంటే అన్వయం కుదరదు కదా?
  దీనికి బదులు ‘ప్రజాశక్తులావహించే’ అంటూ ఈ కవితను కోట్ చేయటం ఓ చోట చూశాను. అదే సరైన రూపమనిపిస్తోంది!
  మీరు ఇచ్చినదానిలో చిన్న సవరణ . ‘’అగాధ బాధా పాథః పతంగాలూ’ అనివుండాలి. ‘పత:’ కాదు!
  అన్నట్టు- అభినందనలు! శ్రద్ధగా మంచి కవితను టపాగా ఇచ్చినందుకూ, గుర్తు చేసినందుకూ!

  వ్యాఖ్య ద్వారా వేణు | మార్చి 27, 2010 | స్పందించండి


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: