హరివిల్లు

ఎన్నెన్నో వర్ణాలు-అన్నింటా అందాలు…

చెమ్మ చెక్క చారడేసి మొగ్గా

ఫిబ్రవరి 24, 2010 Posted by | యూట్యూబు లో తెలుగు | 1 వ్యాఖ్య

చందమామ రావే

ఫిబ్రవరి 24, 2010 Posted by | యూట్యూబు లో తెలుగు | వ్యాఖ్యానించండి

బుర్రుపిట్ట బుర్రుపిట్ట తుర్రుమన్నది

ఫిబ్రవరి 24, 2010 Posted by | యూట్యూబు లో తెలుగు | వ్యాఖ్యానించండి

వ౦టా-వార్పు

 1. అటుకుల దోశ:

కావాల్సినవి: బియ్యం-2 కప్పులు అటుకులు- అర కప్పు చిక్కని,పుల్లటి పెరుగు-31/2 కప్పులు మెంతులు-ఒక టీ స్పూన్ వంటసోడా -పావు టీ స్పూన్
ఉప్పు-అర టీ స్పూన్ నూనె -తగినంత
తయారు చేయు విధానం:
1) ముందుగా అటుకులను ,బియ్యాన్ని,మెంతులను,చిక్కటి పుల్లగా వున్న పెరుగులో ఓరాత్రంతా నానబెట్టుకోవాలి.మర్నాడు నానబెట్టుకున్న వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
2 )తరువాత ఈ పిండిలో ఉప్పు,వంటసోడా కలిపి ఒక  గంట పక్కన వుంచాలి.
3 )తరువాత అట్లు వేసే పెనం పొయ్యి మీద పెట్టి వేడి అయ్యాక నీళ్లు జల్లి ఆ పైన ముందుగా రడీ గా వుంచుకున్న పిండి ని కొంచెం మందంగా వుండేలా అట్లు వేయాలి.దోశ ఒక వైపు కాలాక రెండో వైపు కూడా తిప్పి కాల్చి తీసేయ్యాలి.అంతే వేడి వేడి అటుకుల దోశ తినడానికి రడీ… ఈ దోశ కొబ్బరి చట్నీ,వేరుసెనగ చట్నీ తో కూడా బావుంటాయి.

2.పులిహొర:-
కావలసినవి:-
బియ్యం – పావు కేజీ, నిమ్మకాయలు – రెండు,ఉప్పు – తగినంత,
పోపు కోసం:
నూనె – మూడు టీ స్పూన్లు  ఆవాలు – అర టీ స్పూన్,పచ్చిశనగపప్పు – రెండు టీ స్పూన్లు, మినప్పుప్పు – ఒక టీ స్పూన్, పచ్చిమిర్చి -౩,ఎండుమిర్చి -2
పసుపు – చిటికెడు, జీలకర్ర – అర టీ స్పూన్,వేరు సెనగ గుళ్ళు -రెండు  టీ స్పూన్లు ,కరివెపాకు – రెండు రెమ్మలు.
తయారి:-
ముందుగా అన్నం వండి చల్లార్చి, అందులో నిమ్మరసం కలిపి పక్కన ఉంచుకోవాలి. వెడల్పు పాత్రలో నూనె వేసి వేయించి అందులో పోపు దినుసులన్నీ వరుసలో వేసి దించాలి. పోపు చల్లరిన తర్వాత అన్నంలో వేసి తగినంత ఉప్పు కూడా వేసి కలపాలి.

3.వెజిటెబుల్ ఉప్మా

కావలసిన పదార్థాలు:- బొంబాయి రవ్వ – 2 కప్పులు ఉల్లిపాయ – 1 టొమాటో – 1  క్యారెట్ – 1 కాలీఫ్లవర్ ముక్కలు – పావు కప్పు  బంగాళాదుంప – 1 పచ్చిమిర్చి – 3
ఆవాలు – 1 చెంచా
శెనగపప్పు – 1 చెంచా
మినప్పుప్పు – అర చెంచా
మిరియాల పొడి – 1 చెంచా
అల్లం ముక్క – చిన్నది
కరివేపాకు – 1 రెమ్మ
నెయ్యి – 1 చెంచా
ఉప్పు, నీరు – తగినంత
తయారీ విధానం:-
ముందు కూరగాయలను ఉడికించుకోవాలి. నెయ్యి వేడిచేసి  మినప్పుప్పు, శెనగపప్పు,ఆవాలు , కరివేపాకు వేయాలి. వేగాక ఉల్లిపాయ, అల్లం,టొమాటో, పచ్చిమిర్చి ముక్కలను వేయాలి. రంగు మారాక కూరగాయ ముక్కలను వేయాలి. కాసేపు వేయించి నీరు, ఉప్పు,మిరియాల పొడి వేసి కలపాలి. నీళ్లు మరుగుతుండగా ఉప్మా రవ్వ వేసి ఉండలు కట్టకుండా కలపాలి. దగ్గరగా అయ్యాక దించేసుకోవాలి. అంతే వెజిటెబుల్ ఉప్మా రెడి.

ఫిబ్రవరి 24, 2010 Posted by | వ౦టా-వార్పు | | వ్యాఖ్యానించండి

సామెతలు

 1. అంత్య నిష్టూరంకన్నా – ఆది నిష్టూరం మేలు
 2. అందరూ ఎక్కేవాళ్ళయితే మోసేవాళ్ళెవరు
 3. అడిగేవాడికి చెప్పేవాడు లోకువ
 4. ఆటా పాటా మా ఇంట మాపటి భోజనం మీ ఇంట
 5. ఆరోగ్యమే మహాభాగ్యము
 6. ఆలస్యం అమృతం విషం
 7. ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత
 8. ఈ సంబరానికేనా ఇంత ఊరింపు
 9. ఈదగల వానికి లోతు లేదు
 10. ఉంటే ఉగాది లేకుంటే శివరాత్రి
 11. ఉన్న మాట అంటే ఉలుకు ఎక్కువ
 12. కారణము లేకనే కార్యము పుట్టదు
 13. కాళిదాసు కవిత్వం కొంత, నా పైత్యం కొంత
 14. కాచిన చెట్టుకే రాళ్ళ దెబ్బలు
 15. కాలు జారితే తీసుకోగలము కాని నోరు జారితే తీసుకోగలమా
 16. కృషితో నాస్తి దుర్భిక్షం

ఫిబ్రవరి 24, 2010 Posted by | సామెతలు | | 1 వ్యాఖ్య