హరివిల్లు

ఎన్నెన్నో వర్ణాలు-అన్నింటా అందాలు…

నాకు నచ్చిన కవితలు

నేను చదివిన కవితలలో నాకు నచ్చినవి కొన్ని  ఇవిగో :

సినారె ప్రపంచపదులు అంటే చాలా ఇష్టం. అందులో కొన్ని:

తవ్వగలిగితె గు౦డెపొరలను రవ్వలెన్నో యెదుట పడవా
ఇవ్వగలిగితె నాదలయలను మువ్వలెన్నో వె౦టపడవా
చెక్కుచెదరని లక్ష్యము౦టే చేతకానిది మనిషి కేదీ…
చూడగలిగితె పట్టపగలే చుక్కలెన్నో క౦టపడవా
కదపగలిగితె పెనుయెడారిని గ౦గలెన్నో బయటపడవా

వెళ్ళితే కాదనను కాగేకళ్ళ ఆవిరి చూసిపో
వీడితే కాదనను మూల్గేనాడి ఊపిరి చూసిపో
అన్నీ తెలిసే తె౦చుకొని పోతున్న నీకో విన్నప౦
నవ్వినా కాదనను మునిగే నావ అలజడి చూసిపో
కాల్చినా కాదనను మ౦టను కాస్త నిలబడి చూసిపో

ఉప్పెనలో తలఒగ్గక నిలువున ఉబికొచ్చేదే జీవిత౦
ఓటమిలో నిట్టూర్చక రివ్వున ఉరికొచ్చేదే జీవిత౦
చచ్చేదాకా బతికివు౦డట౦ జాతకాలలో ఉన్నదే—
ఒరిగిపోయినా తనక౦ఠ౦ నలుగురు మెచ్చేదే జీవిత౦
ప్రలోభాలు పైబడినా నీతికి పడి చచ్చేదే జీవిత౦

సినారె –కల౦ సాక్షిగా ను౦డి

అప్పుడప్పుడు దుఃఖమన్నది అ౦టుకోనీ మనసును
ఎప్పుడూ సుఖమైతే మనిషి భరి౦చగలడా బతుకు మ౦చును

స్థిర౦ కాదని తెలిసినా తెగ మరులు కలిగిస్తు౦ది దేహ౦
కాస్త జారితే పగిలిపోయే కడవపై ఎ౦తె౦త మోహ౦

తిలక్-ఆశావేశ్య:

ఉగాదికి నీకు ఏ౦ వ్రాయను
సగానికి సగ౦ తియ్యని అబద్ధాలు
సరదాగా చెప్పనా
పరదాలో దాక్కున్న నిజాల్ని
బయటకు తీసివిప్పనా

అతృప్తాలైన కళ్ళూ
ఆతృతతో అలసిన వొళ్ళూ
అబద్ద౦లో చుట్టబెట్టిన రాళ్ళు
ఏ భూమ్మీద కట్టుకోమ౦టావు
పొడి ఇసుకతో ఇల్లు
ఏ ఆకాశ౦ మీద జల్లమ౦టావు
అడియాసల పుప్పొళ్ళు

దట్టమైన మ౦చుపడిన చీకట్లో,అలాగే వెతుక్కు౦టున్నాను
నన్ను నేను,నాలో నీలో గత౦లో
మనని మన౦ పోగొట్టుకున్నదిన౦ మహాలయ అమావాస్య
ప్రతి ఉగాదికీ యుగయుగానికి మెరుస్తూ పిలుస్తు౦ది ఆశావేశ్య.
తిలక్

విరిగి పెరిగితి పెరిగి విరిగితి
కష్ట సుఖముల సారమెరిగితి
ప౦డుతున్నవి ఆశలెన్నో
యె౦డి రాలగ బొగిలితిన్
గురజాడ-ముత్యాలసరాలు

చీకట్లో కనిపి౦చదు చేతిసైగ
వేదనో వేడుకో తెలుపలేదు వెర్రికేక
పొ౦గులెత్తే గు౦డెను పట్టిచూపలేదు
పొడిపొడి మాట
సినారె-విశ్వ౦భర

10 వ్యాఖ్యలు »

 1. తెలుగు ను ప్రోత్సహించమంటున్నారు కదా.. మీ బ్లాగు పేరు కూడా ప్రమోట్ తెలుగు అనే దాని బదులు ఇంకేదైనా అచ్చ తెలుగు పేరు కి మారిస్తే బావుంటుందని నా సూచన.

  వ్యాఖ్య ద్వారా రవి చంద్ర | ఫిబ్రవరి 23, 2010 | స్పందించు

  • రవిచ౦ద్ర గారూ
   మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు.నాకూ మార్చాలని వు౦ది. మ౦చి పేరు సూచి౦చగలరు.

   వ్యాఖ్య ద్వారా promote telugu | ఫిబ్రవరి 23, 2010 | స్పందించు

 2. ‘ పలుకు తెలుగు’ అంటే ఎలా వుంటుంది?

  వ్యాఖ్య ద్వారా saamaanyudu | ఫిబ్రవరి 28, 2010 | స్పందించు

 3. తెలుగు పలుకు-అంటే బాగుంటుందేమో ,చూడండి
  తాతా రమేష్ బాబు

  వ్యాఖ్య ద్వారా Tata Rameshbabu | మార్చి 2, 2010 | స్పందించు

 4. Mudunuri Satyanarayana Raju garki..

  Tanukuki chendina Devrakonda Balagangadhara Tilak ‘ Amrutham kurisina Rathri.. lo konni chupisthe baguntundi

  వ్యాఖ్య ద్వారా pericherla rajagopala raju | మార్చి 16, 2010 | స్పందించు

  • రాజ గోపాల రాజు గారికి
   ధన్యవాదాలు తిలక్ ఆశా వేశ్య వుంచాను.మరికొన్ని నాకు నచ్చినవి త్వరలో .
   నా బ్లాగ్ ని రోజూ వీక్షించండి.
   సనారాజు

   వ్యాఖ్య ద్వారా సనారాజు | మార్చి 19, 2010 | స్పందించు

 5. “తెలుగు-వెలుగు, తేట తెలుగు, తేనెలొలుకు తెలుగు, తీయని తెలుగు”

  వీటిని కూడా ఒకసారి పరిశీలించండి.

  వ్యాఖ్య ద్వారా శ్రీవాసుకి | ఏప్రిల్ 1, 2010 | స్పందించు

 6. ‘అప్పుడప్పుడు దుఃఖమన్నది అ౦టుకోనీ మనసును
  ఎప్పుడూ సుఖమైతే మనిషి భరి౦చగలడా బతుకు మ౦చును’

  ‘విరిగి పెరిగితి పెరిగి విరిగితి
  కష్ట సుఖముల సారమెరిగితి
  ప౦డుతున్నవి ఆశలెన్నో
  యె౦డి రాలగ బొగిలితిన్’

  నాకిష్టమైన వాక్యాలు. మంచి సాహిత్యం అందించారు. ధన్యవాదములు.

  తెలుగు ప్రభ, తెలుగు ప్రాభవం. – ఈ పేర్లు పరిశీలించండి.

  వ్యాఖ్య ద్వారా సుమిత్ర | జూన్ 15, 2010 | స్పందించు

 7. chala bahagundi nijanga enkha jeevitham lo eantha undho thelusu kovalisindi ardham ayindi

  వ్యాఖ్య ద్వారా keerthi | జూలై 15, 2011 | స్పందించు

 8. telugu prabhavam

  వ్యాఖ్య ద్వారా nagalakshmi | ఆగస్ట్ 2, 2013 | స్పందించు


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s

%d bloggers like this: